1 00:00:11,512 --> 00:00:12,554 ఇది కల్పిత గాథ. 2 00:00:12,638 --> 00:00:14,515 ఏ వ్యక్తినైనా పోలి ఉంటే, అది బతికున్న వారినైనా, మరణించిన వారినైనా సరే, 3 00:00:14,598 --> 00:00:16,433 లేదా అసలైన సంఘటనలను, లేదా ప్రాంతాలను పోలి ఉంటే, అది కాకతాళీయమే. 4 00:00:17,142 --> 00:00:19,728 త్వరగా కోలుకో 5 00:00:42,584 --> 00:00:44,169 ఓర్నా… 6 00:00:44,253 --> 00:00:46,922 తను చనిపోలేదు. అతను చెప్పేది అబద్ధం. 7 00:00:47,631 --> 00:00:51,134 గాలీ చావలేదు. అతను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. 8 00:00:51,218 --> 00:00:53,762 తనని ఎవరికీ చూపించడు. 9 00:00:56,014 --> 00:00:57,307 అంతే కదా, నాన్నా? 10 00:01:02,563 --> 00:01:04,063 లేయ్. 11 00:01:20,706 --> 00:01:22,416 విమాన షెడ్యూల్స్ చూశావా? 12 00:01:22,499 --> 00:01:24,501 హా, చూశా, మనం సమయానికే వచ్చాం. 13 00:02:05,167 --> 00:02:06,668 విమానాశ్రయానికి అలా వెళ్లాలి. 14 00:02:06,752 --> 00:02:09,253 ఇంకో గంటలో ఇజ్రాయెల్ కి వెళ్లే విమానం ఉంది. 15 00:02:09,755 --> 00:02:11,507 - మిమ్మల్ని విమానంలో ఎక్కనిస్తారు, ఏం పర్వాలేదు. - ఆగండి. 16 00:02:11,590 --> 00:02:13,634 రోమా, అతని నాన్న ఇంట్లోనే గాలీ ఉందని చెప్పాడు. 17 00:02:13,717 --> 00:02:15,093 గాలీ బతికే ఉందని అన్నాడు. 18 00:02:15,802 --> 00:02:17,012 ఓర్నా, రా. 19 00:02:17,095 --> 00:02:18,347 మీ విమానానికి సమయమైంది. 20 00:02:18,430 --> 00:02:21,308 ఆగండి. మీ బాస్ దగ్గర తను ఏం దొంగిలించిందో నాకు చెప్పండి, అది నేను తెచ్చిస్తాను. 21 00:02:21,391 --> 00:02:22,392 రా, తిక్కదానా! 22 00:02:22,476 --> 00:02:23,519 అది నేను తెచ్చిస్తా! 23 00:02:23,602 --> 00:02:25,145 దయచేసి ఆగండి. 24 00:02:26,146 --> 00:02:27,397 వెళ్లవద్దు! ఆగండి. 25 00:02:27,898 --> 00:02:29,066 ఆగండి, ఆగండి! 26 00:02:29,149 --> 00:02:30,484 ఆగండి, వెళ్లకండి. 27 00:02:30,567 --> 00:02:32,402 - నా కూతురిని వదులుకోలేను, మిమ్మల్ని వెళ్లనివ్వలేను. - జరుగు! 28 00:02:32,486 --> 00:02:34,363 - వెళ్లవద్దు! ప్లీజ్. - ఓర్నా! 29 00:02:34,446 --> 00:02:35,781 - పక్కకు జరుగు. - జరగను. 30 00:02:35,864 --> 00:02:36,990 మిమ్మల్ని వెళ్లనివ్వలేను. 31 00:02:37,074 --> 00:02:38,617 వద్దు, వద్దు! ఆగండి! 32 00:02:39,493 --> 00:02:40,536 ప్లీజ్, కొంచెం… 33 00:02:43,163 --> 00:02:44,581 వెళ్లకండి, వెళ్లకండి. ఆగండి. 34 00:02:44,665 --> 00:02:46,625 ఒక్క నిమిషం ఆగండి. ప్లీజ్. 35 00:02:47,251 --> 00:02:50,879 అతని దగ్గరి నుండి గాలీ ఏం దొంగిలించిందో కానీ, ఒట్టేసి చెప్తున్నా, దాన్ని నేను తెచ్చిస్తాను. 36 00:02:50,963 --> 00:02:52,339 నేను తన తల్లిని. తన గురించి నాకు తెలుసు. 37 00:02:52,422 --> 00:02:53,841 దాన్ని నేను తప్పక కనుగొంటా. 38 00:02:53,924 --> 00:02:54,925 ప్లీజ్. 39 00:02:58,679 --> 00:02:59,888 ఆంటన్. 40 00:03:00,347 --> 00:03:03,433 నాకు ఒక్క నిమిషం ఇవ్వు. అక్కడున్న ఆవిడని గమనిస్తూ ఉండు. 41 00:03:19,074 --> 00:03:20,659 నా వద్ద నాలుగు పాస్ పోర్టులున్నాయి. 42 00:03:21,785 --> 00:03:23,954 కానీ ఆయన ప్రత్యేకంగా దీని గురించి అడిగాడు. 43 00:03:24,037 --> 00:03:25,205 ఎందుకు? 44 00:03:25,789 --> 00:03:27,082 ఆయనకి కావాల్సింది ఇతని దగ్గర ఉందా? 45 00:03:28,959 --> 00:03:30,127 అవును. 46 00:03:30,919 --> 00:03:32,087 కానీ వాడు నీకు దొరకడు. 47 00:03:33,630 --> 00:03:35,048 అలా అంటారెందుకు? మీకెలా తెలుసు? 48 00:03:36,133 --> 00:03:37,301 ఎందుకంటే, వాడిని మేము కనుగొనలేకపోయాం. 49 00:03:38,385 --> 00:03:39,970 అక్కడికి మా మనుషులని పంపించి వెతికించాం, 50 00:03:40,637 --> 00:03:42,931 ప్రొఫెషనల్స్ ని పంపాం, వాళ్లకే అతను దొరకలేదు. 51 00:03:44,850 --> 00:03:48,437 ప్రస్తుతం ముంబై అస్సలు సురక్షితం కాదు. 52 00:03:54,985 --> 00:03:58,947 కానీ, నీకు ఇజ్రాయెల్ నిఘా శాఖ అండ ఉంది కదా. 53 00:04:00,115 --> 00:04:04,328 ఒకటి గుర్తుపెట్టుకో, వీళ్లకి విధేయత అనేదే ఉండదు. 54 00:04:09,041 --> 00:04:11,668 నువ్వేమైనా కనుగొంటే, నాకు కాల్ చేయ్. 55 00:04:12,503 --> 00:04:14,671 అప్పుడు నీ కూతురిని మీకు చూపిస్తాం. 56 00:04:17,673 --> 00:04:18,550 ఆంటన్! 57 00:04:36,777 --> 00:04:39,863 వోజిక్ ఇగ్నాసీ 58 00:05:49,308 --> 00:05:51,268 వాడి అసలు పేరు, ఎఫ్రైమ్ గోల్డ్ స్టీన్. 59 00:05:51,351 --> 00:05:52,519 ఎఫీ కదా, తెలుసు. 60 00:05:52,603 --> 00:05:55,063 ఇక్కడ భారతదేశంలో ఉన్న పోలీసులు కూడా అతని కోసం గాలిస్తున్నారు. 61 00:05:55,147 --> 00:05:56,940 ఫైలులో ఒక రిపోర్ట్ ఉంది, 62 00:05:57,024 --> 00:06:00,027 విమానాశ్రయానికి వెళ్లేటప్పుడు అతడిని ఒక ప్యాసింజర్ గుర్తించారు. 63 00:06:00,110 --> 00:06:01,820 అప్పుడు గాయపడి ఉన్నాడట, కానీ ప్రాణాలతోనే ఉన్నాడట. 64 00:06:02,154 --> 00:06:04,114 దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసినా, వాళ్లకి ఏమీ లభించలేదు. 65 00:06:04,198 --> 00:06:06,950 - అప్పట్నుండీ అతని గురించి ఏ రిపోర్టులూ లేవు. - అతను చనిపోయాడని అనుకున్నా, 66 00:06:07,034 --> 00:06:09,536 ఎందుకంటే, అతని ఇజ్రాయెల్ స్నేహితుడు అతని కోసమని ఇక్కడికి డబ్బులు పంపాడు, 67 00:06:09,620 --> 00:06:10,829 కానీ అతను వాటిని తీసుకోవడానికి రానే లేదు. 68 00:06:10,913 --> 00:06:14,583 ఇంకో మాటలో చెప్పాలంటే, అతను చనిపోయి ఉండకపోతే, వెతుకులాట ఇక్కడి నుండి మొదలుపెట్టవచ్చు మనం. 69 00:06:14,666 --> 00:06:16,084 మీరు పోలీసులు కాదు, కదా? 70 00:06:16,168 --> 00:06:18,921 - కాదు, కాదు. - మరి నా ఇంటి చిరునామా మీకెలా తెలుసు? 71 00:06:19,505 --> 00:06:20,881 మాకు మీరు సాయపడగలరేమో అనుకుని వచ్చాం. 72 00:06:21,798 --> 00:06:23,926 - మీరు రష్యన్లా? - కాదు. మాది ఇజ్రాయెల్. 73 00:06:24,009 --> 00:06:26,887 ఇంతకీ, ఇజ్రాయెల్ లో ఏ కరెన్సీ వాడతారు? 74 00:06:35,354 --> 00:06:38,148 ప్రతిఫలంగా ఏదైనా పొందడం తప్పేం కాదు. 75 00:06:39,107 --> 00:06:40,901 చెప్పండి. మీకేం కావాలి? 76 00:06:40,984 --> 00:06:45,197 మా స్నేహితుడొకడు, భారతదేశంలో ఒక్కడే తిరుగుతున్నాడు, 77 00:06:45,280 --> 00:06:48,075 అతను… అతను కాస్త అయోమయంగా తిరుగుతున్నాడు. 78 00:06:48,158 --> 00:06:50,702 అతని పరిస్థితి ఏమంత బాగాలేదు. 79 00:06:50,786 --> 00:06:53,789 అతను ఒకరిని అడిగి, ఇక్కడికి డబ్బు పంపించుకున్నాడని మాకు తెలిసింది, 80 00:06:53,872 --> 00:06:57,417 ఆ నగదు బదిలీలో మీ పేరే ఉంది. 81 00:06:57,501 --> 00:06:58,502 లాలి భాటియా 82 00:06:58,585 --> 00:07:01,421 కాబట్టి, మీరు అతనికి సాయం చేసుంటారని, లేదా అతనికి ఏమైనా అమ్మి ఉంటారని అనుకుంటున్నాం, 83 00:07:01,505 --> 00:07:04,341 లేదంటే, మీకు… మీకు అతను ఎక్కడున్నాడో తెలుసేమో అని అనుకుంటున్నాం. 84 00:07:04,424 --> 00:07:05,676 ఒక్క నిమిషం, ఆగండి. 85 00:07:05,759 --> 00:07:06,927 ఒక్క నిమిషం, మీకు చూపిస్తా. 86 00:07:07,010 --> 00:07:08,220 ఇతనే. 87 00:07:10,389 --> 00:07:11,932 ఇతను మీ స్నేహితుడు కాదులే. 88 00:07:13,141 --> 00:07:15,519 - ఏదేమైనా, ఇతడిని నేను కలవనే లేదు. - ఏమంటున్నారు మీరు? 89 00:07:15,602 --> 00:07:16,603 ఏమంటున్నారు మీరు? 90 00:07:16,687 --> 00:07:18,647 ఆ డబ్బును పంపినవాళ్లు ఒక పొరపాటు చేశారు. 91 00:07:19,648 --> 00:07:22,734 వాళ్లు "లాలి భాటియా" అని రాసేటప్పుడు రెండు 'టీ'లు రాశారు. అది నా పేరు. 92 00:07:22,818 --> 00:07:25,612 కానీ వాళ్లు నిజంగా పంపాల్సింది ఒక 'టీ' అక్షరమున్న 'లాలి భాటియా'కి ఏమో. 93 00:07:25,696 --> 00:07:27,948 ఆ పేరు గల వాళ్లు ఇక్కడ చాలా మంది ఉంటారు. 94 00:07:28,031 --> 00:07:29,533 చెత్తకుప్ప మీద ఉండే ఈగల లాగా. 95 00:07:30,033 --> 00:07:31,577 ఏదేమైనా, అతనెవరో నాకు తెలీదు. 96 00:07:32,077 --> 00:07:35,455 అతని కోసం మీరు, ఇంకా వాళ్లెవరో వచ్చేదాకా అసలు డబ్బు గురించి కూడా నాకు తెలీదు. 97 00:07:35,539 --> 00:07:38,125 ఒక్క నిమిషం. అతని గురించి వేరే వాళ్లు కూడా వచ్చారా? 98 00:07:38,208 --> 00:07:39,209 అవును. 99 00:07:40,419 --> 00:07:44,840 ఇద్దరు రష్యన్లు, ఒక అమెరికన్, ఇప్పుడు ఇజ్రాయెలీలైన మీరు. 100 00:07:45,966 --> 00:07:47,801 అతనికి దోస్తులు చాలా మందే ఉన్నట్టున్నారే? 101 00:07:48,802 --> 00:07:51,555 ఏదేమైనా, మీకు చెప్పిందే వాళ్లకి కూడా చెప్పా. 102 00:07:52,723 --> 00:07:54,141 మీరు రావాల్సింది ఇక్కడికి కాదు. 103 00:07:54,224 --> 00:07:56,393 నా దగ్గర 3,000 యూరోలు ఉండుంటే, 104 00:07:56,476 --> 00:07:58,478 ఎగురుకుంటూ ఎగురుకుంటూ బ్యాంక్ కి వెళ్లుండే దాన్ని కదా. 105 00:07:58,562 --> 00:08:00,063 బహుశా అతను మీ భర్తకి స్నేహితుడేమో. ఎవరు… 106 00:08:00,147 --> 00:08:02,065 నా మొగుడికి ఇవన్నీ పట్టించుకునేంత సమయం ఉండదు. 107 00:08:02,149 --> 00:08:03,817 ఆయనకి అసలు మమ్మల్ని పట్టించుకునేంత సమయమే లేదు. 108 00:08:03,901 --> 00:08:04,902 క్షమించండి. 109 00:08:05,944 --> 00:08:07,946 ఇంకాసేపట్లో స్కూల్ నుండి నా పెద్ద కొడుకు వస్తాడు. 110 00:08:08,030 --> 00:08:09,448 వాడు ఏమైనా తిని పనికి వెళ్లాలి. 111 00:08:09,531 --> 00:08:10,616 ప్లీజ్. 112 00:08:10,699 --> 00:08:11,700 ఇక బయలుదేరండి. 113 00:08:11,783 --> 00:08:13,952 కానీ ఎవరైనా రెండు 'టీ'లు పెట్టి మీ పేరు ఎందుకు వాడినట్టు? 114 00:08:14,036 --> 00:08:15,829 ఆ పొరపాటు నాకు చాలా వింతగా అనిపిస్తోంది. 115 00:08:15,913 --> 00:08:16,997 మేడమ్. 116 00:08:18,040 --> 00:08:21,376 అది అర్థవంతమైనదే అయితే, పొరపాటు ఎందుకు అవుతుంది? ఏమంటారు? 117 00:08:23,545 --> 00:08:24,630 వెళ్దాం పద. 118 00:08:30,761 --> 00:08:32,429 నా మనస్సు ఎందుకో కీడు శంకిస్తోంది. 119 00:08:33,889 --> 00:08:35,265 అందరికీ అది అనిపిస్తుందిలే. 120 00:08:37,518 --> 00:08:39,436 ఇంతకీ అసలు మన ప్లాన్ ఏంటి? 121 00:08:41,063 --> 00:08:42,606 ఎఫీ జాడని కనుగొనడం, 122 00:08:42,688 --> 00:08:44,566 అతను దొంగిలించింది తీసేసుకోవడం, గాలీని విడిపించడం, 123 00:08:44,942 --> 00:08:46,693 మన బతుకులు మనం బతకడం, 124 00:08:46,944 --> 00:08:50,948 ఇక గ్లోబల్ వార్మింగ్, ఆకలి చావులు, యుగాంతం, ముగింపు. 125 00:08:54,284 --> 00:08:56,703 సరే, కానీ నేనేం చెప్తున్నానంటే… 126 00:08:58,830 --> 00:09:00,791 నువ్వు ఇక్కడికి ఏదో దయతోనో, జాలితోనో రాలేదు కదా. 127 00:09:01,124 --> 00:09:04,169 - దయ, జాలి కూడా ఉండే వచ్చా. - సరే, కానీ… 128 00:09:04,920 --> 00:09:06,630 అసలు విషయమేంటో చెప్తావా? 129 00:09:07,464 --> 00:09:09,591 వాళ్లు అంటున్న దాని ప్రకారం, గాలీ ఏం దొంగిలించింది? 130 00:09:13,512 --> 00:09:15,305 దాని గురించే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది? 131 00:09:15,389 --> 00:09:17,850 దాన్ని కనుగొని, స్వదేశానికి అప్పగించడం నీ పని కదా. 132 00:09:17,933 --> 00:09:21,812 లేదు. ఒక రకంగా చెప్పాలంటే, నీకు ట్రిప్ కావాలి, నాకు జీతం కావాలి. 133 00:09:22,938 --> 00:09:23,814 ఏంటి? 134 00:09:23,897 --> 00:09:26,942 ఇద్దరికీ లాభమే కదా. ఆ కనుక్కోవాల్సిన దాన్ని, ఇద్దరం కలిసి కనుగొన్నాక, 135 00:09:27,025 --> 00:09:30,654 నువ్వు దాన్ని రష్యాకి తీసుకెళ్లి, నీ మొండి కూతురిని విడిపించుకో, 136 00:09:30,737 --> 00:09:32,781 నేనేమో అదెక్కడ ఉందనే దాని గురించి ఇజ్రాయెల్ లోని వాళ్లకి చెప్తా. 137 00:09:32,865 --> 00:09:36,118 వాళ్లకి అదెక్కడ ఉందో తెలిశాక, ప్రొఫెషనల్స్ ని పంపించి, వాళ్ల పనేదో వాళ్లు చేసుకుంటారు. 138 00:09:36,201 --> 00:09:37,202 కంగారుపడకు. 139 00:09:42,291 --> 00:09:43,834 - మీరు రీటానా? - అవును. 140 00:09:43,917 --> 00:09:46,170 - హాయ్. - హాయ్. 141 00:09:46,253 --> 00:09:48,338 - హాయ్. నా పేరు శామ్. - హేయ్. మిమ్మల్ని కలవడం బాగుంది. 142 00:09:48,922 --> 00:09:50,340 స్టెఫాన్ ఒక చిరుకానుక పంపాడు. 143 00:09:50,424 --> 00:09:51,425 థ్యాంక్యూ. 144 00:09:51,508 --> 00:09:53,594 - మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నాడు. - స్టెఫాన్ ఎవరు? 145 00:09:53,677 --> 00:09:54,803 నోర్మూసుకుంటావా కాస్త! 146 00:09:55,304 --> 00:09:56,889 - ఆ టేబుల్ దగ్గర కూర్చుందామా? - అలాగే. 147 00:09:56,972 --> 00:09:57,973 రండి. 148 00:09:58,056 --> 00:09:59,600 - పద. - రండి. 149 00:10:02,394 --> 00:10:04,146 గాయమై, అందరూ వెతుకుతున్నప్పుడు, 150 00:10:04,229 --> 00:10:05,522 రెండు అవసరమవుతాయి. 151 00:10:05,606 --> 00:10:07,608 ఇక్కడి నుండి వెళ్లిపోవడానికి ఒక పాస్ పోర్ట్, 152 00:10:07,691 --> 00:10:10,319 ఇంకా చావకుండా ఉండటానికి ఓ డాక్టర్. 153 00:10:10,819 --> 00:10:14,781 ఈ రెంటి కోసం, ఒక మనిషి సాయం అవసరమవుతుంది. 154 00:10:14,865 --> 00:10:17,451 ఎవరో అతనికి డబ్బు పంపారు, కానీ ఆ ఆధారం మనకి పనికిరానిది అయిపోయింది. 155 00:10:17,534 --> 00:10:18,702 ఆ డబ్బును ఎవరూ తీసుకోలేదు. 156 00:10:18,785 --> 00:10:20,829 అతను గాయపడ్డాడు కూడా కదా. 157 00:10:20,913 --> 00:10:23,165 హా, గాయం గురించి తెలుసుకోవడం సులభమే. 158 00:10:23,665 --> 00:10:29,254 కానీ దాన్ని నయం చేయడానికి డాక్టరును కనుగొనడమే కాస్త కష్టం. 159 00:10:29,796 --> 00:10:32,591 అంటే, ఇలాంటి పని చేసే డాక్టర్లు బొంబాయిలో పెద్దగా లేరనే చెప్పాలి. 160 00:10:32,674 --> 00:10:36,303 అతను నిజంగానే గాయపడి ఉంటే, అతను ఈ డాక్టరు దగ్గరికి వెళ్లుండే అవకాశం ఉంది. 161 00:10:38,847 --> 00:10:40,390 మళ్లీ ఆ బస్సు గురించి చెప్పండి. 162 00:10:41,183 --> 00:10:44,186 పోలీసులు అతని ఆనవాలు ప్రకటించారు, దాన్ని బట్టి ఒకరు కాల్ చేసి, రిపోర్ట్ చేశారు. 163 00:10:44,269 --> 00:10:46,647 ముంబైలో సుమారుగా 15,000 బస్సులు ఉన్నాయి, 164 00:10:47,147 --> 00:10:50,192 కానీ అతను కనిపించిన బస్సు విమానాశ్రయానికి వెళ్తూ ఉండింది. 165 00:10:50,275 --> 00:10:54,238 మూడు నెలలు గడిచిపోయాయి, కానీ అతను ఏమైపోయాడు అనేది ఎవరికీ తెలీదు. 166 00:10:54,321 --> 00:10:55,739 ఒక్క నిమిషం. 167 00:10:55,822 --> 00:10:58,742 ఇదంతా మూడు నెలల క్రితం జరిగిందా? 168 00:10:59,952 --> 00:11:01,495 అయితే, ఇది రేవన్ కి సంబంధించినదా? 169 00:11:02,079 --> 00:11:03,080 రేవన్ అంటే ఏంటి? 170 00:11:03,163 --> 00:11:05,123 - ఇప్పుడది అనవసరం. - మిస్సైల్ గైడెన్స్ సిస్టమ్. 171 00:11:06,458 --> 00:11:08,877 - ఏంటి? - దానికి సంబంధించినదే కదా మనం మాట్లాడుకునేది? 172 00:11:09,461 --> 00:11:10,879 అపహరణ. 173 00:11:10,963 --> 00:11:13,006 "అపహరణ"నా? అపహరణ ఏంటి? 174 00:11:16,093 --> 00:11:20,764 మూడు నెలల క్రితం, నలుగురు సాయుధులు ఈ ముంబైలో ఉండే హోటల్ నుండి 175 00:11:20,848 --> 00:11:22,933 ఓ ఇంజినీరును కిడ్నాప్ చేసి, 176 00:11:23,517 --> 00:11:24,852 అతడిని చంపేశారు. 177 00:11:24,935 --> 00:11:28,105 ఆ తర్వాత వేరే వ్యక్తులు వాళ్లని చంపాలని చూశారు. 178 00:11:29,022 --> 00:11:30,649 దాని గురించి మీరు వినలేదా? 179 00:11:31,441 --> 00:11:32,693 ఇక్కడ అది సంచలన సృష్టించింది. 180 00:11:32,776 --> 00:11:34,653 థ్యాంక్యూ, శామ్. ఇక అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. 181 00:11:34,736 --> 00:11:37,906 అంటే, ఆ ఇంజినీర్ కూడా ఇజ్రాయెల్ పౌరుడే. 182 00:11:37,990 --> 00:11:42,703 కానీ, అతను రూపొందించిన ఈ పరికరం… అది ఆయుధమో, మిస్సైల్ గైడెన్స్ సిస్టమో, ఏదోకటిలే… 183 00:11:42,786 --> 00:11:45,998 మొత్తానికి ఆ పరికరం ఓ ప్రోటోటైప్, దాన్ని అతను మీ వాళ్ల నుండి దొంగిలించాడు. 184 00:11:46,081 --> 00:11:47,499 ఈ మనుషులందరికీ కావాల్సింది అదే. 185 00:11:47,583 --> 00:11:52,254 ఇప్పుడు ఆ ఇంజినీర్ చనిపోయాడు, ఆ పరికరం ఏమైందో ఎవరికీ తెలీదు. 186 00:11:52,337 --> 00:11:55,174 మూడు నెలల నుండి, జనాలు ఎక్కడెక్కడి నుండో భారతదేశానికి వస్తున్నారు, 187 00:11:55,257 --> 00:11:57,968 ఆ పరికరాన్ని పొందాలని, ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. 188 00:11:58,051 --> 00:11:59,553 చాలా మంది కనిపించకుండా పోతున్నారు, 189 00:11:59,636 --> 00:12:02,222 వాళ్ల కోసం చాలా మందే వెతుకుతున్నారు మళ్లీ. 190 00:12:05,976 --> 00:12:07,060 మీరు బాగానే ఉన్నారా? 191 00:12:08,395 --> 00:12:09,855 హా, నేను… నేను బాగానే ఉన్నా. 192 00:12:11,481 --> 00:12:14,902 అయితే, మీరు వెతుకుతున్న ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటో ఏమైనా ఉందా? 193 00:12:16,153 --> 00:12:17,237 అతనికి చూపించు. 194 00:12:25,287 --> 00:12:26,455 ఓకే. 195 00:12:26,538 --> 00:12:28,207 వోజిక్ ఇగ్నాసీ 196 00:12:29,625 --> 00:12:30,626 మంచిది. 197 00:12:33,212 --> 00:12:34,880 నేను ఇప్పుడే సుసు పోసుకొని వస్తా. 198 00:12:34,963 --> 00:12:38,050 వెయిట్రెస్ కనుక ఇలా వస్తే, ఇంకో బీర్ ఆర్డర్ ఇవ్వండి. 199 00:12:43,722 --> 00:12:45,349 అది ఇజ్రాయెల్ కి చెందినది అన్నమాట. 200 00:12:47,518 --> 00:12:49,228 అందుకే కదా నువ్వు వచ్చింది? 201 00:12:52,940 --> 00:12:54,608 అసలు స్టెఫాన్ ఎవరో చెప్తావా? 202 00:12:54,691 --> 00:12:55,734 చెప్పను. 203 00:12:57,736 --> 00:13:00,405 - అసలు ఆ ప్యాకేజీలో ఏముందో అయినా చెప్తావా? - చెప్పను. 204 00:13:03,492 --> 00:13:04,952 మంచిది. 205 00:13:20,968 --> 00:13:23,387 ముంబై హోటల్ పై దాడి, అపహరణ 206 00:13:23,470 --> 00:13:24,847 హోటల్ షూటింగ్ లో ఏడుగురి మృతి, ఎనిమిది మందికి గాయాలు 207 00:13:30,644 --> 00:13:31,979 మెరుపు దాడి జరిగింది. 208 00:13:32,062 --> 00:13:36,024 ఉదయం పది గంటలకి పతాక స్థాయికి చేరుకున్న కాల్పులు, సుమారు అరగంట సేపు సాగాయి… 209 00:13:37,317 --> 00:13:38,318 లేదు! 210 00:13:49,413 --> 00:13:50,539 హా. 211 00:13:53,125 --> 00:13:55,836 లేదు. 212 00:13:57,546 --> 00:13:58,672 ముంబైలోనే, అవును. 213 00:14:03,177 --> 00:14:04,386 సరేనా? 214 00:14:08,849 --> 00:14:10,893 మన దోస్త్ వెళ్లింది బాత్రూమ్ కాదు. 215 00:14:10,976 --> 00:14:11,935 ఏంటి? 216 00:14:12,895 --> 00:14:16,356 ఒక సెకను క్రితం, బాత్రూమ్ నుండి, అతను ఫోన్లో మాట్లాడుతూ ఉండగా చూశా. 217 00:14:17,900 --> 00:14:20,402 బాత్రూమ్ లో ఓ కిటికీ ఉంది, అక్కడి నుండి వెనుక భాగం కనిపిస్తుంది. 218 00:14:23,238 --> 00:14:26,158 సరే మరి, బాత్రూమ్ లో ఉన్నప్పుడు, ఒకసారి మీ సమస్య గురించి ఆలోచించా. 219 00:14:27,743 --> 00:14:29,661 మీ వాడిని కనుగొనడంలో నేను సాయపడగలను. 220 00:14:30,579 --> 00:14:32,831 ఇప్పుడు వివరాలన్నింటినీ ఒకసారి మళ్లీ చర్చించుకుందాం. 221 00:14:32,915 --> 00:14:34,082 - పద. - సరేనా? 222 00:14:34,166 --> 00:14:35,501 - ఎక్కడికి? - వెంటనే పద. 223 00:14:35,584 --> 00:14:36,627 రీటా, అంతా ఒకేనా? 224 00:14:36,710 --> 00:14:38,086 - నాకు తెలీదు ఏం… - ఓర్నా. 225 00:14:38,170 --> 00:14:39,880 - కానీ ఈయన సాయపడగలనని అంటున్నాడుగా. - ఏమైందేంటి? 226 00:14:39,963 --> 00:14:41,548 వీడు ఏమీ సాయపడడు. 227 00:14:41,632 --> 00:14:43,217 - పిచ్చి పట్టిందా! - ఇక పద. 228 00:14:43,300 --> 00:14:44,885 ఏం చేస్తున్నారు? 229 00:14:51,099 --> 00:14:54,603 కంగారు వద్దు. ప్రశాంతంగా నడుద్దాం. తినడానికి హోటల్ కోసం వెతికే ఇద్దరు యాత్రికుల్లా ప్రవర్తిద్దాం. 230 00:14:54,686 --> 00:14:55,604 ఆటో ఎక్కు. 231 00:15:00,651 --> 00:15:02,528 ఎక్కవద్దు. నేను అన్నం తింటున్నా. 232 00:15:02,611 --> 00:15:04,446 - పర్వాలేదు. మీరు హాయిగా తినండి. - లేదు, లేదు. 233 00:15:08,367 --> 00:15:10,035 క్షమించాలి. ఇప్పుడు నేను బ్రేక్ తీసుకుంటున్నా. 234 00:15:10,118 --> 00:15:11,119 దయచేసి దిగండి. 235 00:15:11,662 --> 00:15:14,414 ఇది చాలా ప్రమాదకరమైన స్థలం, ఇక్కడ చాలా ప్రమాదకరమైన వాళ్లుంటారు. 236 00:15:14,665 --> 00:15:16,750 వాళ్లకి తెలియంది, నీకు తెలుసని వాళ్లకి అనిపించినా సరే, 237 00:15:16,834 --> 00:15:19,127 ఏ మాత్రం సంకోచించకుండా చంపేస్తారు. అర్థమైందా? 238 00:15:19,211 --> 00:15:21,547 సారీ, మీ వాడు మనల్ని ఇలా మోసం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. 239 00:15:21,630 --> 00:15:23,173 పద. మన డాక్టర్ దగ్గరికి వెళ్దాం. 240 00:15:44,695 --> 00:15:46,113 - మీరు రీటానా? - హా. 241 00:15:46,738 --> 00:15:47,739 ఆలస్యంగా వచ్చారే. 242 00:15:48,240 --> 00:15:50,409 ఇవాళ నా కొడుకు పుట్టినరోజు, నేను త్వరగా వెళ్లిపోవాలి. 243 00:15:50,492 --> 00:15:52,995 సారీ, ఎక్కువ సేపేం పట్టదు. మీ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 244 00:16:00,335 --> 00:16:01,587 మీ ఇద్దరిలో గాయం అయింది ఎవరికి? 245 00:16:02,671 --> 00:16:03,672 చూడటానికి, ఇద్దరూ బానే ఉన్నారే. 246 00:16:03,755 --> 00:16:05,215 అది నిజమే. 247 00:16:05,966 --> 00:16:08,510 - ఏంటి సంగతి? - మేము కన్సల్టేషన్ కోసమే వచ్చాం. 248 00:16:08,594 --> 00:16:11,555 కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మీరెంత అడిగితే అంత ఇస్తాం. 249 00:16:11,638 --> 00:16:14,641 మీకు నా నంబర్ ఎవరు ఇచ్చారో కానీ, అతను పొరపాటు చేశాడు. 250 00:16:15,142 --> 00:16:16,894 మీకు బాగా లేకపోతే, ఆసుపత్రికి వెళ్లండి. 251 00:16:16,977 --> 00:16:21,481 లేదు, దయచేసి ఆగండి. మేము ఒక స్నేహితుని కోసం వెతుకుతున్నాం. ఒక చిన్న ప్రశ్న అడుగుతామంతే. 252 00:16:22,357 --> 00:16:23,483 సారీ, మీరు ఇక బయలుదేరండి. 253 00:16:23,567 --> 00:16:25,694 - అతని వయస్సెంత? - ఎవరి వయస్సు? 254 00:16:26,987 --> 00:16:29,865 మీ అబ్బాయి వయస్సు. అతని పుట్టినరోజు అన్నారు కదా. 255 00:16:29,948 --> 00:16:32,242 - తొమ్మిదేళ్లు. - వావ్. 256 00:16:32,951 --> 00:16:34,578 మా అబ్బాయి వయస్సు కూడా అంతే. 257 00:16:34,661 --> 00:16:36,163 ఇంకా నిద్రపోకుండా నాకోసం ఎదురుచూస్తుంటాడు. 258 00:16:37,372 --> 00:16:42,586 ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, అంతే దాని తర్వాత మీరు మీ కుటుంబం దగ్గరికి వెళ్లిపోవచ్చు. 259 00:16:42,669 --> 00:16:43,754 ప్లీజ్. 260 00:16:46,006 --> 00:16:48,091 సరే. ఇంతకీ ఏంటి ఆ ప్రశ్న? 261 00:16:48,675 --> 00:16:50,761 మేము మా స్నేహితుని కోసం వెతుకుతున్నాం. 262 00:16:52,179 --> 00:16:54,598 ఇతనికి గాయమైందని నాకు తెలుసు, కాబట్టి మీరు… 263 00:16:55,182 --> 00:16:57,351 నేను అతడిని ఇప్పటిదాకా చూడనే లేదు. 264 00:16:58,519 --> 00:16:59,520 ఇతను ఇక్కడికి ఎందుకొచ్చాడు? 265 00:17:02,731 --> 00:17:03,941 చెప్పా కదా, నాకు అతను ఎవరో తెలీదు. 266 00:17:04,733 --> 00:17:07,069 ఇదేనా మీరు అడగాలనుకున్నది? ఇక వెళ్దాం పదండి. 267 00:17:07,152 --> 00:17:09,445 దయచేసి వినండి, ఇది మీకు చాలా ముఖ్యం. 268 00:17:09,530 --> 00:17:11,865 - చాలా ముఖ్యం. ప్లీజ్. - లేదు, లేదు. 269 00:17:11,949 --> 00:17:13,867 ఇక బయలుదేరండి. డబ్బేం వద్దు. 270 00:17:15,536 --> 00:17:16,954 ఏం చేస్తున్నావు? తుపాకీ ఎక్కడిది? 271 00:17:17,037 --> 00:17:18,622 శబ్దం చేయకు. అక్కడ కూర్చో. 272 00:17:20,374 --> 00:17:21,458 ఏమీ చేయకండి. నాకు పిల్లలున్నారు. 273 00:17:21,541 --> 00:17:24,044 రీటా… ఇలా అవసరం లేదు. 274 00:17:24,127 --> 00:17:26,128 మధ్యలో దూరకు, దూరితే ఇది ఇంకా ఆలస్యమవుతుంది. 275 00:17:26,213 --> 00:17:28,423 అతని గురించి చెప్పు. ఎప్పుడు వచ్చాడు అతను? 276 00:17:29,049 --> 00:17:30,676 అతనికి నువ్వు చికిత్స చేశావా? 277 00:17:31,593 --> 00:17:32,761 ఏం జరిగిందో చెప్పు. 278 00:17:34,012 --> 00:17:35,389 అతను చావుబతుకుల్లో ఉన్నాడు. 279 00:17:35,472 --> 00:17:38,100 అతని ఎడమ తుంటి భాగంలో తూటా ముక్క కారణంగా, రెండు మూడు రోజుల క్రితం ఏర్పడిన గాయం ఉంది. 280 00:17:38,600 --> 00:17:42,104 నేను మామూలు మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేయాలనుకున్నాను, కానీ అతను అలా వద్దన్నాడు. 281 00:17:42,187 --> 00:17:45,190 అతని దగ్గర ఓ సూట్ కేసు ఉండింది, దాన్ని ఎవరైనా దొంగిలిస్తారేమో అని కంగారుపడుతూ ఉన్నాడు. 282 00:17:45,899 --> 00:17:47,025 కాబట్టి నాకు మరో దారి లేదు. 283 00:17:47,109 --> 00:17:49,778 ఆపరేషన్ పూర్తయ్యే దాకా నాపై తుపాకీ ఎక్కు పెట్టే ఉంచాడు. 284 00:17:49,862 --> 00:17:52,406 - అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? - ఎవరూ లేరు. 285 00:17:52,489 --> 00:17:54,908 అతను చావుబతుకుల్లో ఉన్నాడని అన్నావు కదా. ఎవరోకరు అతనికి సాయపడుండాలి కదా. 286 00:17:54,992 --> 00:17:57,452 అతడిని ఇక్కడికి తీసుకురావడానికి, ఆపరేషన్ అయ్యాక తీసుకెళ్లిపోవడానికి. 287 00:17:58,161 --> 00:18:00,414 చూడండి, అతను ఎక్కడికి వెళ్లాడో నాకు తెలీదు. 288 00:18:01,206 --> 00:18:02,416 అతనెక్కడ ఉన్నాడో నాకు తెలీదు. 289 00:18:03,333 --> 00:18:04,334 మీకు కావాల్సింది డబ్బే అయితే… 290 00:18:04,418 --> 00:18:06,587 అతనికి సాయపడింది ఎవరో నువ్వు నాకు చెప్పాలి. 291 00:18:08,380 --> 00:18:13,385 నేను నోరు తెరిస్తే, నా కుటుంబాన్ని చంపేస్తాడని చెప్పాడు, అతను అన్న దాన్ని నమ్మా. 292 00:18:13,468 --> 00:18:15,137 నేను కూడా మీ కుటుంబాన్ని చంపేయగలను. 293 00:18:15,220 --> 00:18:17,014 - రీటా, చాలు, అలా బెదిరించాల్సిన పని లేదు. - మూసుకో. 294 00:18:17,097 --> 00:18:19,224 - దయచేసి, ఆ పని చేయవద్దు. వద్దు. - ఇతని గురించి చెప్పు. 295 00:18:19,308 --> 00:18:20,934 వదిలేయ్, వదిలేయ్, ఇలా చేయకు… 296 00:18:21,643 --> 00:18:23,520 ఏం చేస్తున్నావు? పిచ్చేమైనా పట్టిందా? 297 00:18:23,604 --> 00:18:25,772 వదలవే, తిక్కదానా! బుర్ర పని చేస్తోందా నీకు? 298 00:18:35,115 --> 00:18:35,949 అబ్బా! 299 00:18:51,715 --> 00:18:54,384 కావాలంటే నీ ప్రాణాలను నువ్వు పణంగా పెట్టుకో, 300 00:18:54,718 --> 00:18:56,428 కానీ నా దారికి అడ్డు రాకు. 301 00:18:56,762 --> 00:18:59,556 - నువ్వు నాకు సాయపడటానికే కదా వచ్చావు. - అవును. 302 00:18:59,765 --> 00:19:02,976 అందుకు, మనిద్దరం ఇక్కడి నుండి క్షేమంగా తిరిగివెళ్లేలా చూసుకోవాలి నేను. 303 00:19:03,185 --> 00:19:06,730 ఈ చెత్త పంచాయితీలో మనం ఎంత ఎక్కువ సేపు గడిపితే, 304 00:19:07,064 --> 00:19:09,107 - అంత రిస్క్… - ఇది చెత్త పంచాయితీ ఏం కాదు. 305 00:19:09,983 --> 00:19:11,610 అలా చూడకు. 306 00:19:11,693 --> 00:19:12,986 ఏదేమైనా నేను కొన్ని చేయను, 307 00:19:13,070 --> 00:19:15,155 గాలీ కూడా తన కోసం నేనలా చేయకూడదనే అనుకుంటుంది. 308 00:19:15,239 --> 00:19:16,406 నిజంగానా? 309 00:19:17,491 --> 00:19:19,451 అవును. ఎందుకలా చూస్తున్నావు? 310 00:19:20,035 --> 00:19:22,454 బంగారం, నీ కూతురు అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, అలా చేసేసుండేది. 311 00:19:22,538 --> 00:19:23,747 అది నిజం కాదు. 312 00:19:30,879 --> 00:19:32,089 మీరు వస్తున్నారా? 313 00:19:32,172 --> 00:19:34,675 థ్యాంక్యూ, మేము, లిఫ్ట్ మళ్లీ వచ్చాక వస్తాం. 314 00:19:35,259 --> 00:19:36,260 అలాగే. 315 00:19:37,344 --> 00:19:38,428 మీరు వెళ్లండి. 316 00:19:45,853 --> 00:19:48,689 ఇదంతా తను కోరుకున్నదంటే నేను నమ్మలేను. 317 00:19:49,648 --> 00:19:51,608 ఎక్కడో ఏదో తేడా జరిగింది. తనకి ఏదో సమస్య ఎదురై ఉంటుంది. 318 00:19:52,025 --> 00:19:52,985 సమస్యనా? 319 00:19:53,318 --> 00:19:58,156 నీ కూతురు సైన్యంలో, తనకి చాలా అధికారం కట్టబెట్టిన హోదాలో ఉండింది. 320 00:19:58,240 --> 00:20:01,577 తను సైన్యం నుండి బయటకు వచ్చాక, ఒకరు తనకి మంచి ఆఫర్ ఇచ్చారు. 321 00:20:01,660 --> 00:20:04,496 ఇంకా ఎక్కువ అధికారం, ఇంకా ఎక్కువ డబ్బులు తనకి దక్కాయి. 322 00:20:04,580 --> 00:20:08,500 తన ముందు రెండు దార్లు ఉన్నాయి: అనామకురాలిగా ఉండటం, లేదా ఆ అఫర్ తీసుకోవడం. 323 00:20:09,293 --> 00:20:10,377 అందులో సమస్య ఏముంది! 324 00:20:10,460 --> 00:20:12,004 చాలా తేలిగ్గా ఉంది కదా అది. 325 00:20:12,379 --> 00:20:15,549 తను మిఖెల్ కి ఏం ఇస్తానందో నీకు తెలుసా? 326 00:20:16,175 --> 00:20:18,635 ఏదో మిస్సైళ్లకి సంబంధించిందని అన్నాడు. 327 00:20:18,719 --> 00:20:19,845 ఒక ఆయుధం. 328 00:20:20,429 --> 00:20:24,600 తను దొంగిలించింది, ఒక దాడికే ఊరు ఊరినే లేపేయగల బాంబుని కాదు. 329 00:20:24,892 --> 00:20:27,144 అది సర్జన్లు వాడే కత్తెర లాంటిది. 330 00:20:27,227 --> 00:20:31,106 ఒక బ్యాంక్, ఒక ఆసుపత్రి, ఒక పవర్ స్టేషన్. 331 00:20:31,857 --> 00:20:35,694 ఇలా ఒక్కొక్కటి నేలమట్టమవుతూ ఉంటాయి, ఇక అన్నీ లోపలి నుండే అంతమైపోతాయి. 332 00:20:37,446 --> 00:20:40,616 తను అమ్మింది ఆయుధాన్ని కాదు, అల్లకల్లోలాన్ని. 333 00:20:41,241 --> 00:20:42,576 అది నీ కూతురు చేసిన పని. 334 00:20:43,452 --> 00:20:44,703 తనే కనుక ఈరాత్రి ఇక్కడ ఉండుంటే, 335 00:20:44,786 --> 00:20:48,207 ఆ డాక్టరును ఏం చేయాలనే విషయంలో తను ఆలోచించడం కానీ, మాట్లాడటం కానీ చేయదు. 336 00:20:48,999 --> 00:20:52,211 నేను ఒక కాల్ చేయాలి. రేపు ఉదయం ఏడింటికి ఇక్కడ కలువు. 337 00:20:52,294 --> 00:20:55,380 నీ గదిలోనే ఉండు. బయట తిరగకు. 338 00:21:55,691 --> 00:21:59,361 నమస్తే, మీ గదిలో ఏసీ పని చేస్తోందా? 339 00:22:00,529 --> 00:22:01,780 లేదు. 340 00:22:01,864 --> 00:22:04,449 లేదు, వాళ్లు రెండింటికి జెనరేటరుని ఆఫ్ చేసేస్తారు. 341 00:22:04,533 --> 00:22:05,534 నిజంగానా? 342 00:22:05,617 --> 00:22:06,952 అలా ఎందుకు చేస్తారో అర్థమే కావట్లేదు. 343 00:22:07,703 --> 00:22:08,704 అర్ధరాత్రి రెండింటికి ఎందుకు? 344 00:22:09,329 --> 00:22:10,330 అసలు ఆఫ్ చేయడం ఎందుకు? 345 00:22:12,666 --> 00:22:14,042 సరే మరి. 346 00:22:14,126 --> 00:22:15,627 ఓకే, గుడ్ నైట్. 347 00:22:15,711 --> 00:22:16,712 గుడ్ నైట్. 348 00:22:21,425 --> 00:22:23,177 మీరు బాగానే ఉన్నారా? 349 00:22:23,260 --> 00:22:25,387 - ఏమైనా సాయం కావాలా? - వద్దు. 350 00:22:26,597 --> 00:22:28,140 - పక్కానా? - హా. 351 00:22:28,223 --> 00:22:32,311 హా, నాకు సాయం కావాలి. థ్యాంక్యూ. 352 00:22:33,270 --> 00:22:35,314 మీ గదికి లాక్ పడిపోయిందా? 353 00:22:35,397 --> 00:22:38,859 ఈ… ఈ కార్డ్ ఇప్పుడు పని చేయట్లేదు. 354 00:22:38,942 --> 00:22:43,363 ఇంతకుముందు పని చేసేది, భవిష్యత్తులో మళ్లీ పని చేస్తుంది కూడా. 355 00:22:44,031 --> 00:22:46,867 కాబట్టి, సమస్య ప్రస్తుత క్షణానికి సంబంధించినది అని గుర్తించేశా. 356 00:22:47,492 --> 00:22:48,493 సమస్యని బాగానే గుర్తించారు. 357 00:22:48,577 --> 00:22:49,578 కదా? 358 00:22:49,661 --> 00:22:51,371 నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్లా కూడా. 359 00:22:51,872 --> 00:22:52,873 కానీ అక్కడ ఎవరూ లేరు. 360 00:22:53,749 --> 00:22:57,503 మీరు హోటల్ నంబరుకి కాల్ చేసి చూశారా? 361 00:23:00,339 --> 00:23:01,673 ఏంటి? 362 00:23:03,050 --> 00:23:04,343 సూపర్ ఐడియా అది. 363 00:23:05,844 --> 00:23:07,179 సమస్య పరిష్కారమైపోయింది. 364 00:23:09,556 --> 00:23:10,849 మీ ఫోన్? 365 00:23:10,933 --> 00:23:13,769 - అది గది లోపల ఉంది. - లాక్ అయిన గదిలోనా? 366 00:23:13,852 --> 00:23:15,103 అవును. 367 00:23:19,816 --> 00:23:22,986 దానికి ఒక పరిష్కారం ఉంది, కాబట్టి… 368 00:23:32,996 --> 00:23:34,748 మీరు… మీరు యూదులు కదా? 369 00:23:35,916 --> 00:23:40,796 సారీ, లిఫ్ట్ దగ్గర మీరు మీ స్నేహితురాలు హీబ్రూలో మాట్లాడుకుంటుండగా విన్నాను. 370 00:23:40,879 --> 00:23:41,964 అవును. 371 00:23:42,047 --> 00:23:44,299 కాబట్టి, తోటి యూదునిగా అడుగుతున్నా, 372 00:23:45,425 --> 00:23:48,762 మీ తలపై అంత పెద్ద స్వస్తిక గుర్తు ఉండటం ఎలా అనిపిస్తోంది? 373 00:23:52,349 --> 00:23:54,643 అది, అది భారతదేశానికి సంబంధించినదే కదా? 374 00:23:55,185 --> 00:23:59,439 ఎందుకంటే, నేను, నా కూతురు దక్షిణ భాగంలో ట్రిప్పుకు వెళ్లినప్పుడు, 375 00:23:59,523 --> 00:24:01,149 - ఇది అక్కడక్కడా కనిపించింది… - అవును. 376 00:24:01,233 --> 00:24:02,734 చూడండి, వాళ్లు ఫోన్ ఎత్తడం లేదు. 377 00:24:02,818 --> 00:24:05,445 - అయిదు నిమిషాలాగి కాల్ చేద్దాం, సరేనా? - అలాగే. 378 00:24:06,572 --> 00:24:09,408 సారీ, దాని గురించి ఏదో చెప్తున్నారే? 379 00:24:10,409 --> 00:24:12,703 ఇది హిందువుల పురాతన చిహ్నం అన్నమాట. 380 00:24:13,495 --> 00:24:16,540 దీన్ని స్వస్తిక అంటారు… 381 00:24:17,040 --> 00:24:20,460 సంస్కృతంలో దీని అర్థం, శుభప్రదం, మంగళకరం అన్నమాట. 382 00:24:21,879 --> 00:24:26,133 దీన్ని హిట్లర్ తీసుకొని, 45 డిగ్రీలు తిప్పి, నాజీ జెండా మీద పెట్టుకున్నాడు, 383 00:24:26,216 --> 00:24:31,138 ఇది శాంతి, ప్రేమలకి చిహ్నం. ఇది యూదుల హత్యాకాండకి చిహ్నం. 384 00:24:31,722 --> 00:24:33,015 శాంతి, ప్రేమ. 385 00:24:33,098 --> 00:24:34,641 యూదుల హత్యాకాండ. 386 00:24:36,643 --> 00:24:37,895 చాలా వింతగా ఉంది, కదా? 387 00:24:37,978 --> 00:24:42,232 ఒకటే గుర్తుకు పూర్తిగా భిన్నమైన రెండు అర్థాలు ఉన్నాయి, 180 డిగ్రీల తేడా అని చెప్పవచ్చు. 388 00:24:43,817 --> 00:24:44,985 నలభై అయిదు. 389 00:24:46,987 --> 00:24:49,114 అదే, డిగ్రీలు. నలభై అయిదు డిగ్రీలు. 390 00:24:52,326 --> 00:24:54,244 చూడండి, నేను… నేను ఇక్కడ మీకు ఇబ్బంది కలిగిస్తున్నానేమో, 391 00:24:54,328 --> 00:24:56,997 - మీరు నిద్రపోవాలి కదా? - లేదు, లేదు. నాకు నిద్ర పట్టడం లేదు. 392 00:24:57,080 --> 00:24:58,540 - పక్కానా? - మరేం పర్వాలేదు. హా, పర్వాలేదు. 393 00:24:58,624 --> 00:25:01,376 పడుకోవడానికి ప్రయత్నించా. కానీ పట్టడం లేదు. 394 00:25:05,047 --> 00:25:06,173 మీరు ఏమైనా… 395 00:25:11,011 --> 00:25:13,180 అయితే, మీ కూతురు, తను… 396 00:25:13,847 --> 00:25:15,390 తను కూడా ఇదే హోటల్ లో ఉందా? 397 00:25:16,350 --> 00:25:18,519 లేదు, లేదు… 398 00:25:19,811 --> 00:25:21,563 లేదు, అంటే… 399 00:25:22,606 --> 00:25:25,984 మేమిద్దరం… తిరిగింది వేరే ట్రిప్పులో అన్నమాట. 400 00:25:26,068 --> 00:25:28,403 నేను ఇప్పుడు ఇక్కడికి రెండోసారి వచ్చా. 401 00:25:28,487 --> 00:25:30,948 సరే. అయితే, ఈసారి ఏం చేస్తున్నారు మీరు? 402 00:25:33,367 --> 00:25:36,036 నేను తప్పిపోయిన… 403 00:25:36,537 --> 00:25:40,749 నా కూతురి స్నేహితురాలిని కనుగొనడంలో సాయపడుతున్నా. 404 00:25:43,126 --> 00:25:44,962 హా. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? 405 00:25:49,132 --> 00:25:50,133 ఏమో. 406 00:25:51,593 --> 00:25:56,723 మా… మా ఊర్లో ఉండటం కష్టంగా అనిపించింది. అది ఇంగ్లండ్లోని షెఫీల్డ్ అన్నమాట… 407 00:25:58,183 --> 00:26:02,187 పోయిన… పోయిన సంవత్సరం నా భార్య చనిపోయింది, 408 00:26:02,271 --> 00:26:06,275 అంటే, తనకి… తనకి చాలా కాలంగా ఆరోగ్యం బాగా లేకుండా ఉండింది, కాబట్టి… 409 00:26:07,568 --> 00:26:08,861 తను… 410 00:26:08,944 --> 00:26:11,989 తను చనిపోయినప్పుడు నాకు కాస్త బాగానే అనిపించింది. 411 00:26:13,407 --> 00:26:16,076 అలా అనడం దారుణంగానే అనిపిస్తుందని నాకు తెలుసు. 412 00:26:16,159 --> 00:26:17,578 లేదులే. 413 00:26:19,872 --> 00:26:22,040 ఆ ఫీలింగే నాకు నచ్చట్లేదు, 414 00:26:22,875 --> 00:26:26,712 ఆ అపరాధ భావన నన్ను కుంగదీయడం, మానసికంగా దెబ్బతీయడం వంటివి చేసింది. 415 00:26:27,504 --> 00:26:28,672 హా. 416 00:26:29,339 --> 00:26:32,134 కాబట్టి… కాబట్టి కాస్త మనశ్శాంతి అవసరమైంది. 417 00:26:33,177 --> 00:26:34,970 నాకే అన్నమాట. 418 00:26:49,568 --> 00:26:53,155 - సారీ, నేను… నేను అనుకోలేదు, నేను… - నేను… 419 00:26:53,238 --> 00:26:55,949 నా విషాదకరమైన గాథ చెప్పి మిమ్మల్ని ముగ్గులోకి దించాలనే 420 00:26:56,033 --> 00:26:59,703 ఉద్దేశం నాకు అస్సలు లేదు. 421 00:27:00,746 --> 00:27:02,831 నా విషాద గాథలు చెప్తే, ఇక అంతే. 422 00:27:04,583 --> 00:27:07,169 మీ… మీ కూతురిని మీరు తప్పకుండా చేరుకోగలరని ఆశిస్తున్నా. 423 00:27:12,841 --> 00:27:14,051 హేయ్… 424 00:27:16,303 --> 00:27:18,639 - హేయ్… - ఏం పర్వాలేదులే. 425 00:27:19,598 --> 00:27:21,600 - లేదు, నేను… - ఏమీ కాలేదులే. 426 00:27:21,683 --> 00:27:23,268 - క్షమించండి. లేదు, నేను… - అంతా… అంతా ఓకేనే. 427 00:27:23,352 --> 00:27:25,729 - నేను కేవలం… - నేనేమైనా అనకూడనిది అన్నానా? 428 00:27:25,812 --> 00:27:27,856 ఒక నిమిషం నేను బాత్రూమ్ వెళ్లొస్తా, 429 00:27:27,940 --> 00:27:28,941 - నాకు… నాకు కాస్త… - హేయ్… 430 00:27:29,024 --> 00:27:30,776 మీ అమ్మాయి స్నేహితురాలు కదా. 431 00:27:31,276 --> 00:27:33,654 మీరు వెతికేది మీ కూతురి స్నేహితురాలి కోసం, కదా? 432 00:27:34,279 --> 00:27:36,114 మిమ్మల్ని కొంచెం భయపెట్టినట్టున్నా, సారీ. 433 00:27:36,865 --> 00:27:38,033 కొంచెం భయపెట్టా, కదా? 434 00:27:38,825 --> 00:27:39,826 పర్వాలేదులే. 435 00:27:41,078 --> 00:27:42,079 పర్వాలేదు. 436 00:27:43,247 --> 00:27:44,289 మరేం పర్వాలేదు. 437 00:27:46,208 --> 00:27:47,334 శాంతించండి. 438 00:27:49,169 --> 00:27:50,170 సరేనా? 439 00:28:07,062 --> 00:28:08,230 రీటా! 440 00:28:08,689 --> 00:28:09,857 రీటా! 441 00:28:39,386 --> 00:28:40,596 నాకెవరైనా సాయపడగలరా? 442 00:28:42,139 --> 00:28:43,891 సర్, కాపాడండి! 443 00:28:45,726 --> 00:28:47,644 సారీ, మీరు నాకు సాయపడగలరా? 444 00:29:53,710 --> 00:29:54,711 ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 445 00:29:55,420 --> 00:29:56,463 ఎవరూ లేరు. 446 00:29:58,507 --> 00:29:59,508 పక్కానా? 447 00:29:59,591 --> 00:30:00,634 హా. 448 00:30:21,780 --> 00:30:22,781 లేవండి. 449 00:30:24,116 --> 00:30:25,117 మెల్లగా. 450 00:30:27,578 --> 00:30:28,579 థ్యాంక్యూ. 451 00:30:34,626 --> 00:30:36,086 - థ్యాంక్యూ. - మరేం పర్వాలేదు. 452 00:30:36,170 --> 00:30:37,337 థ్యాంక్యూ. 453 00:31:20,756 --> 00:31:22,424 గాలీకి… 454 00:31:23,634 --> 00:31:25,344 నాలుగైదు ఏళ్లు ఉన్నప్పుడు, 455 00:31:27,804 --> 00:31:30,224 తన ప్రీస్కూలులో ఒక సైకో పిల్లగాడు ఉండేవాడు. 456 00:31:32,226 --> 00:31:33,810 పిచ్చోడు వాడు. 457 00:31:37,189 --> 00:31:39,608 వాడు తనని బెదిరించేవాడు, తన బొమ్మని చించేశాడు. 458 00:31:42,110 --> 00:31:45,197 ఒకరోజు అయితే, వాడు తనని ఉయ్యాల నుండి చాలా గట్టిగా తోసేశాడు, 459 00:31:45,280 --> 00:31:46,281 దాంతో తన చేయి విరిగింది. 460 00:31:46,782 --> 00:31:48,951 పాపం. పైగా, అది వేసవి కాలం. 461 00:31:52,955 --> 00:31:56,416 అప్పుడు నేను… నేను కూడా చిన్నదాన్నే. 462 00:31:58,502 --> 00:32:00,754 "చిన్నదాన్ని." ఇప్పుడు గాలీ వయస్సు ఉంటుంది అప్పుడు నాకు. 463 00:32:02,756 --> 00:32:04,341 ఇక టీచరుని కలిశా. 464 00:32:04,925 --> 00:32:06,802 తనని ఎలా బెదిరించాలో ముందే అనేసుకుని వెళ్లా, 465 00:32:06,885 --> 00:32:09,888 అంటే, అతడిని స్కూల్ లో నుండి పంపించేయకపోతే, తన గురించి ఫిర్యాదు చేయాలనుకున్నా. 466 00:32:14,309 --> 00:32:15,936 కానీ తను నాకేం చెప్పిందంటే… 467 00:32:18,814 --> 00:32:21,275 పాపం ఆ అబ్బాయి అమ్మ ఆసుపత్రిలో ఉందని చెప్పింది. 468 00:32:21,358 --> 00:32:24,194 చెప్పాలంటే, నేను అతని గురించి ఏం మాట్లాడినా, 469 00:32:24,278 --> 00:32:26,154 నేను చెడ్డదాన్ని అన్నట్టే అని అనిపించింది. 470 00:32:27,364 --> 00:32:28,532 ఎందుకో తెలీదు, 471 00:32:28,615 --> 00:32:31,285 నాకు ఎప్పుడూ ఎవరూ అండగా నిలవలేదు కాబట్టి, 472 00:32:31,368 --> 00:32:32,369 నేను లొంగిపోయానని చెప్పవచ్చు. 473 00:32:34,496 --> 00:32:38,250 దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలీదు కూడా. నన్ను అది అయోమయానికి గురి చేసింది, కాబట్టి… 474 00:32:38,876 --> 00:32:40,586 దాన్ని నేను పట్టించుకోకుండా వదిలేశా. 475 00:32:42,296 --> 00:32:44,756 గాలీ "మంచి పరిపక్వత గల అమ్మాయి" అని 476 00:32:46,258 --> 00:32:49,761 తనకి ఓ భారీ ప్రసంగమిచ్చి, ఓ కొత్త బొమ్మ కొనిచ్చా తనకి. 477 00:32:53,140 --> 00:32:56,977 ఆ సమస్య దానంతట అదే పరిష్కారమై పోయే దాకా ఆగాను. 478 00:33:00,856 --> 00:33:04,026 నా జీవితంలో అలాంటి సందర్భాలు కోకొల్లలు. 479 00:33:04,109 --> 00:33:05,819 లెక్కే లేదు అలాంటివి. 480 00:33:09,573 --> 00:33:11,491 మరి ఇప్పుడేం చేయాలి నేను? 481 00:33:15,370 --> 00:33:19,082 గాలీకి, బాధితురాలిగా ఉండటం తప్ప వేరే దారి లేకుండా నేను చేసి ఉంటే, 482 00:33:20,125 --> 00:33:23,045 తను ఇలా రౌడీలా తయారవ్వడానికి నేనే కారణం ఏమో. 483 00:33:27,466 --> 00:33:29,843 కథ బాగుంది, నా గుండెని ఎక్కడో తాకింది. 484 00:33:31,345 --> 00:33:33,680 ఇవాళ రాత్రి జరిగినదానికి నా మీద కోపంగా ఉన్నావా? 485 00:33:34,097 --> 00:33:36,308 ఈ చర్చకు, దానికి సంబంధమే లేదు. 486 00:33:38,393 --> 00:33:41,605 - మరి ఇప్పుడు దేని గురించి చర్చిస్తున్నాం? - దేని గురించి అంటే, 487 00:33:41,688 --> 00:33:45,150 నిన్ను నొప్పించకూడదని సుతిమెత్తగా అడుగుతున్నా, 488 00:33:45,734 --> 00:33:48,737 నీకు లోకం అంతగా తెలీదా, లేకపోతే తెలివి తక్కువ దానివా నువ్వు? 489 00:33:49,112 --> 00:33:51,823 - ఏదేమైనా, నువ్వు ఓ ఊహాలోకంలో బతుకుతున్నావు. - ఓకే. 490 00:33:53,742 --> 00:33:55,160 కాస్త వివరంగా చెప్తావా? 491 00:33:55,994 --> 00:34:00,582 ఆ టీచర్ ఆ రౌడీ పిల్లోడికి ఎలా వత్తాసు పలికిందో అంటూ నాకొక దీనగాథ చెప్పావు. 492 00:34:00,791 --> 00:34:03,794 వాడికి బాగాలేదని, వాడి కుటుంబానికి బాగాలేదని, అయ్యో అని. 493 00:34:04,503 --> 00:34:08,465 కానీ అసలు విషయం ఏంటంటే, వాడు ఎలాంటి వాడో నీకు బాగా తెలుసు. 494 00:34:08,549 --> 00:34:12,761 నీ కూతురి చేతిని విరగ్గొట్టిన తిక్కలోడు వాడు. 495 00:34:13,094 --> 00:34:13,929 ఓకే. 496 00:34:14,012 --> 00:34:16,223 సరే, అది తప్పు అంటూనే, నువ్వేం చేస్తున్నావు? 497 00:34:17,181 --> 00:34:18,851 నువ్వు కూడా ఆ టీచరులానే ప్రవర్తిస్తున్నావు. 498 00:34:18,934 --> 00:34:20,978 గాలీకి వత్తాసు పలుకుతూ లక్ష సాకులు చెప్తున్నావు. 499 00:34:21,061 --> 00:34:25,274 "కారణం నేనే. తన తప్పేం లేదు. పాపం తను," అంటూ. 500 00:34:26,567 --> 00:34:28,819 తను నరక కూపంలోకి అడుగుపెడుతోందని తనకి తెలీకపోవడం విషయం కాదు, 501 00:34:28,902 --> 00:34:31,196 తన ఉద్దేశం అది అయినా కాకపోయినా సంబంధం లేదు… 502 00:34:31,280 --> 00:34:34,366 ఎందుకంటే, ఏదేమైనా తను ఎలాంటిదో 503 00:34:34,449 --> 00:34:35,909 మనిద్దరికీ బాగా తెలుసు. 504 00:34:36,952 --> 00:34:39,121 అదీ, ఇదీ ఒకటే కాదు. ఆ రెండూ వేర్వేరు. 505 00:34:39,538 --> 00:34:40,998 ఎలా వేరు? 506 00:34:45,252 --> 00:34:46,920 ఎందుకంటే, తను నా కూతురు. 507 00:34:58,223 --> 00:35:00,893 క్లీన్ వీల్స్ క్లీనింగ్ కంపెనీ 508 00:35:08,400 --> 00:35:09,693 దేవుడా… 509 00:35:10,319 --> 00:35:12,112 నీకు ఇబ్బందిగా ఉంటే, బయటే ఉండు. 510 00:35:16,700 --> 00:35:20,078 నా కొడుకు క్లీన్ చేసేటప్పుడు, విమానాశ్రయానికి వెళ్లే బస్సులో అతడిని చూశాడు. 511 00:35:20,704 --> 00:35:22,456 అతను గాయపడి ఉన్నాడు. 512 00:35:22,539 --> 00:35:23,999 ఎవరో అతడిని షూట్ చేశారు. 513 00:35:24,082 --> 00:35:26,043 ఆసుపత్రికి వెళ్లడానికి అతను ఇష్టం చూపలేదు. 514 00:35:26,126 --> 00:35:27,628 కాబట్టి, ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. 515 00:35:28,462 --> 00:35:30,339 నేను అతనికి వెంటనే చెప్పేశా. 516 00:35:30,422 --> 00:35:31,882 "పోలీసులకి కాల్ చేసి చెప్పేయ్," అని చెప్పా. 517 00:35:33,342 --> 00:35:36,094 కానీ ఆ ఇజ్రాయెల్ వాడు అతనికి డబ్బులిస్తానని అన్నాడు, 518 00:35:36,178 --> 00:35:37,846 వెయ్యి డాలర్లు ఇస్తానని అన్నాడు. 519 00:35:39,348 --> 00:35:41,225 మేము సాయపడితే ఇంకా ఇస్తానని కూడా చెప్పాడు, 520 00:35:41,308 --> 00:35:42,476 అందుకని అతడిని ఇక్కడికి తీసుకొచ్చాం. 521 00:35:43,936 --> 00:35:45,103 ఆ తర్వాత ఏమైంది? 522 00:35:46,271 --> 00:35:47,523 మేము అతనికి సాయపడ్డాం. 523 00:35:49,191 --> 00:35:51,944 మా అన్నయ్యకి ఒకడు తెలుసు. 524 00:35:52,027 --> 00:35:54,363 అతను ఇలాంటి వాటిని డీల్ చేస్తుంటాడు. 525 00:35:55,614 --> 00:35:58,992 ఇక అతను ఈ ముంబైలోని ఓ డాక్టరును పరిచయం చేశాడు, 526 00:35:59,576 --> 00:36:01,828 ఇంకా అతనికి ఓ పాస్ పోర్టును ఏర్పాటు చేశాడు. 527 00:36:03,038 --> 00:36:05,207 కానీ, ఈ పనులన్నింటికీ అతనికి ఇంకా డబ్బులు అవసరమయ్యాయి. 528 00:36:05,290 --> 00:36:07,209 వాళ్లు అతనికి పంపిన డబ్బును అతను ఎందుకు తీసుకోలేదు? 529 00:36:07,292 --> 00:36:09,753 దయచేసి, అతను మాకు ఇచ్చిన డబ్బును మాత్రం తీసుకోకండి. ప్లీజ్… 530 00:36:09,837 --> 00:36:10,838 ఆ డబ్బును వదిలేయ్. 531 00:36:10,921 --> 00:36:13,757 - తీసుకుని వెళ్లిపోనివ్వు! - మనకి ఆ డబ్బులు కావాలి… 532 00:36:13,841 --> 00:36:15,467 డబ్బు గురించి నాకనవసరం. 533 00:36:15,551 --> 00:36:17,469 అతను ఎక్కడ ఉన్నాడో తెలియాలి నాకు. 534 00:36:17,553 --> 00:36:19,555 మేము అతడిని ఏమీ చేయలేదు. 535 00:36:20,514 --> 00:36:22,391 అతని పరిస్థితి బాగా దిగజారిపోయింది. 536 00:36:23,141 --> 00:36:24,142 చాలా దారుణంగా మారింది. 537 00:36:24,226 --> 00:36:26,603 అతని గాయానికి ఇన్ఫెక్షన్ సోకింది అనుకుంటా. 538 00:36:26,687 --> 00:36:28,897 ఆసుపత్రికి వెళ్లడానికి ఇష్టపడలేదు. 539 00:36:28,981 --> 00:36:31,525 పోలీసుల దగ్గరికి వెళ్లాలని నాకు లేదు. 540 00:36:32,234 --> 00:36:34,361 ఎందుకంటే, సమస్యల్లో చిక్కుకోవాలని మాకు లేదు. 541 00:36:34,444 --> 00:36:35,654 ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? 542 00:36:55,132 --> 00:36:56,216 ఇక్కడేనా? 543 00:36:57,176 --> 00:36:58,385 ఇక్కడే. 544 00:39:01,967 --> 00:39:03,886 మేము రాత్రికి మీ ఇంట్లో పడుకుంటాం. 545 00:39:04,469 --> 00:39:06,054 రేపే వెళ్లిపోతాం. 546 00:39:06,138 --> 00:39:08,265 ఎవరికీ ఏమీ చెప్పం. 547 00:39:18,734 --> 00:39:20,569 - ఎవరు? - నేను, రీటాని. 548 00:39:20,861 --> 00:39:22,779 హాయ్. ఒక నిమిషం, లైన్ కలుపుతా. 549 00:39:24,740 --> 00:39:27,284 ఇక్కడేం చేస్తున్నావు, ఓల్గా? 550 00:39:27,534 --> 00:39:28,785 వేరా? 551 00:39:29,411 --> 00:39:30,621 మిలా? 552 00:39:30,913 --> 00:39:32,581 పొలీనా? 553 00:39:32,664 --> 00:39:34,833 హాయ్, పొలీనా. గుడ్ ఈవినింగ్. 554 00:39:34,917 --> 00:39:36,960 - పొలీనా ఎవరు? - ఎవరూ లేరులే. 555 00:39:37,044 --> 00:39:41,131 చూడు, వెకేషనుకి నాకేం గిఫ్ట్ ఇవ్వాలో ఇక ఆలోచించడం మొదలుపెట్టండి. 556 00:39:41,215 --> 00:39:43,717 నాకు మంచి వెకేషన్ కావాలి. అదొక మంచి, వెచ్చని చోటు అయి ఉండాలి. 557 00:39:43,800 --> 00:39:45,260 మలోక్రా అయితే బాగుంటుంది. 558 00:39:45,719 --> 00:39:47,930 నిజంగానా? మంచి వార్త చెప్పావు. 559 00:39:48,138 --> 00:39:49,890 టెల్ అవీవ్ కి ఏ విమానం ఉంటే, ఆ విమానానికి నాకు టికెట్ బుక్ చేయ్. 560 00:39:50,432 --> 00:39:52,684 ఈరాత్రికి ఒక టికెట్ ఉంది. నువ్వు సురక్షితమైన చోటే ఉన్నావా? 561 00:39:52,768 --> 00:39:55,354 హా. నేను సరైన చోటే ఉన్నా. 562 00:39:55,938 --> 00:39:57,648 సూపర్. ఇప్పుడే టికెట్ ఈమెయిల్ చేస్తున్నా. 563 00:39:59,650 --> 00:40:01,860 పొలీనా, ఈరాత్రికి ఏంటి ప్లాన్? 564 00:40:03,695 --> 00:40:05,322 పొలీనా… 565 00:40:11,286 --> 00:40:12,412 అంతా ఓకే, ఆరాంగా ఉండొచ్చు. 566 00:40:14,081 --> 00:40:16,750 రేపు మధ్యాహ్నం మాస్కోకి మనకు టికెట్లు బుక్ చేస్తున్నారు. 567 00:40:19,586 --> 00:40:22,089 - ఏ విమానాశ్రయం నుండి? - ఛత్రపతి విమానాశ్రయం నుండి. 568 00:40:22,714 --> 00:40:25,884 దానికి ముందు ఏ విమానమూ లేదు. కాసేపు పడుకో. 569 00:40:48,657 --> 00:40:49,533 ఓర్నా? 570 00:40:52,828 --> 00:40:54,121 హలో? 571 00:40:55,038 --> 00:40:56,623 హా, నేను… 572 00:40:58,625 --> 00:41:01,545 ఇలా హఠాత్తుగా కాల్ చేసినందుకు క్షమించు, నేను… 573 00:41:02,546 --> 00:41:03,964 ఏమైనా అయిందా? 574 00:41:05,007 --> 00:41:07,092 అక్కడ ఇప్పుడు అర్ధరాత్రి అయ్యుండవచ్చు. 575 00:41:07,176 --> 00:41:09,219 మరేం పర్వాలేదులే, ఎక్కడున్నావు నువ్వు? 576 00:41:09,761 --> 00:41:10,929 అంతా ఓకేనా? 577 00:41:12,097 --> 00:41:13,765 ఓకే కాదు. 578 00:41:14,266 --> 00:41:16,018 నువ్వు నాకు భలే నచ్చేశావు, తెలుసా? 579 00:41:17,686 --> 00:41:20,480 సినిమా క్యారెక్టరులా ఉంటావు, బాంబీలా అనుకో. 580 00:41:21,773 --> 00:41:24,276 ఒక మాయా అడవి లాంటి చోట నివసిస్తున్నట్టు ఉంటావు, 581 00:41:24,359 --> 00:41:26,987 మేమేమో ఇక్కడ పీకల్లోతు కష్టాలతో చస్తూ బతుకుతూ ఉన్నాం. 582 00:41:28,655 --> 00:41:30,949 అయినా కానీ… నువ్వు బాగానే నెట్టుకొచ్చావు. 583 00:41:32,284 --> 00:41:35,454 ఒక విషయం చెప్పు, చిన్నప్పుడు, 584 00:41:36,747 --> 00:41:38,832 పెద్దయ్యాక నేనేం అవుతానని అనుకున్నావు? 585 00:41:41,210 --> 00:41:44,505 ఏమో. నేను… నేను దాని గురించి అంతగా ఆలోచించలేదు. 586 00:41:45,839 --> 00:41:49,009 కానీ కొందరిని చూస్తే, ఇట్టే తెలిసిపోతుంది, కదా? 587 00:41:51,428 --> 00:41:52,638 అంటే… 588 00:41:54,223 --> 00:41:55,641 కొందరిని చూస్తేనే తెలిసిపోతుంది, 589 00:41:55,724 --> 00:41:58,769 వాళ్లు ఇతరులపై ఆధారపడే రకమని. 590 00:41:58,852 --> 00:42:01,480 జీవితంలో తమకు తాముగా నిర్ణయాలు తీసుకునే రకం కాదని. 591 00:42:03,357 --> 00:42:05,275 లేదు, ఓర్నా, నువ్వు అలాంటి దానివి కాదు. 592 00:42:05,567 --> 00:42:07,110 మొదట్నుంచీ కూడా కాదు. 593 00:42:07,319 --> 00:42:09,238 నాకు దాహంగా ఉంది. నీక్కూడా నీళ్లు తెచ్చేనా? 594 00:42:10,280 --> 00:42:11,990 హా, తీసుకురా. 595 00:42:19,498 --> 00:42:23,794 నాకు తెలిసి, మొదట్నుంచీ నేను అలాంటి దాన్నే అనుకుంటా. 596 00:42:25,546 --> 00:42:27,589 బెన్నీ విషయంలో, గర్భం విషయంలో. 597 00:42:29,633 --> 00:42:31,009 గాలీ విషయంలో… 598 00:42:32,386 --> 00:42:33,971 అంతెందుకు నీ విషయంలో కూడా. 599 00:42:35,138 --> 00:42:37,057 నేను నిన్ను అలా ఎప్పుడూ చూడలేదు. 600 00:42:38,517 --> 00:42:40,185 ఇప్పుడైతే అస్సలు అలా లేనే లేవు నువ్వు. 601 00:42:40,435 --> 00:42:44,690 ఇప్పుడిప్పుడే నాకు అనిపిస్తోంది, ఒక తల్లి బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించగలనని. 602 00:42:48,193 --> 00:42:50,696 నాకు 23 ఏళ్ల కూతురుందని. 603 00:42:55,534 --> 00:42:57,369 చాలా దారుణమైన విషయం కదా అది? 604 00:42:59,955 --> 00:43:01,248 చూడు… 605 00:43:02,791 --> 00:43:04,293 అది దారుణమైన విషయమేం కాదు. 606 00:43:06,837 --> 00:43:09,882 కానీ ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, కదా? 607 00:43:18,140 --> 00:43:19,224 ఇదుగో. 608 00:43:26,815 --> 00:43:27,941 థ్యాంక్స్. 609 00:43:30,027 --> 00:43:33,780 రోనీ, అంతా… అంతా ఓకేనా? నాకు కాస్త కంగారుగా ఉంది. 610 00:43:34,114 --> 00:43:35,532 ఏంటి? అదేం లేదులే, నేను… 611 00:43:36,116 --> 00:43:37,409 నేను బాగానే ఉన్నా. 612 00:43:37,659 --> 00:43:40,370 థ్యాంక్స్, డోరీ. నాకు ధైర్యాన్నిచ్చావు. 613 00:44:05,479 --> 00:44:06,813 ఓర్నా? 614 00:44:10,067 --> 00:44:11,443 ఓర్నా? 615 00:44:27,709 --> 00:44:28,794 ఓర్నా! 616 00:44:41,473 --> 00:44:42,474 తను ఎక్కడ? 617 00:44:43,141 --> 00:44:44,434 నా స్నేహితురాలు ఎక్కడ? 618 00:44:44,518 --> 00:44:47,187 నిన్ను లేపవద్దని అంది. నీకు బాగాలేదని చెప్పింది. 619 00:44:47,271 --> 00:44:48,564 వెళ్లిపోయిందా? 620 00:44:48,647 --> 00:44:49,982 హా. కొన్ని గంటల క్రితమే వెళ్లిపోయింది. 621 00:45:23,724 --> 00:45:25,559 - ఎవరు? - నేను, రీటాని. 622 00:45:25,642 --> 00:45:27,394 ఒక్క నిమిషం, లైన్ కలుపుతున్నా. 623 00:45:28,187 --> 00:45:30,272 - హలో. నువ్వు విమానం ఎక్కలేదా? - ఆగు. 624 00:45:30,355 --> 00:45:32,232 నాకు మాస్కోకి ఒక ఫ్లయిట్ టికెట్ బుక్ చేయ్. ఇప్పటికిప్పుడే. 625 00:45:32,316 --> 00:45:34,484 మాస్కోకా? ప్యాకెజీ సంపాదించావా? 626 00:45:34,985 --> 00:45:36,403 నాకు ఫ్లయిట్ టికెట్ బుక్ చేయ్. 627 00:45:36,486 --> 00:45:38,488 ఆ… సరే. 628 00:45:38,780 --> 00:45:40,824 ఇజ్రాయెల్ పాస్ పోర్టుతోనేనా? 629 00:45:43,785 --> 00:45:44,745 రీటా? 630 00:45:49,208 --> 00:45:52,461 ఇజ్రాయెల్ ప్రభుత్వం 631 00:46:18,820 --> 00:46:20,197 బయలుదేరే విమానాల వింగ్ 632 00:46:20,280 --> 00:46:22,407 ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం 633 00:46:24,785 --> 00:46:26,745 టెర్మినల్ ఏ - టెర్మినల్ బీ 634 00:47:18,463 --> 00:47:20,465 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్