1 00:00:11,595 --> 00:00:12,596 ఇది కల్పిత గాథ. 2 00:00:12,679 --> 00:00:14,556 ఏ వ్యక్తినైనా పోలి ఉంటే, అది బతికున్న వారినైనా, మరణించిన వారినైనా సరే, 3 00:00:14,640 --> 00:00:16,433 లేదా అసలైన సంఘటనలను లేదా ప్రాంతాలను పోలి ఉంటే, అది కాకతాళీయమే. 4 00:00:19,228 --> 00:00:20,521 కాల్ ఆడియో 5 00:00:26,193 --> 00:00:28,195 నొవోసిబిర్స్క్ కంట్రోల్ సెంటర్: 6 00:00:32,198 --> 00:00:33,867 నొవోసిబిర్స్క్ కంట్రోల్ సెంటర్, దేవిదోవ్ మాట్లాడుతున్నా. 7 00:00:33,951 --> 00:00:35,369 దీమా, మనకొక సమస్య వచ్చి పడింది. 8 00:00:35,452 --> 00:00:36,453 ఈ నంబర్ ఎవరిది? 9 00:00:36,537 --> 00:00:38,830 అది ముఖ్యం కాదు, ఒక ఖైదీ కనిపించట్లేదు. 10 00:00:38,914 --> 00:00:40,791 తను బస్సులో లేదు. 11 00:00:41,458 --> 00:00:43,502 టీపీకే-7 సెంటర్లో ఎక్కువసేపు పడుకోవడం వల్ల బస్సు మిస్సయిందేమో? 12 00:00:43,585 --> 00:00:44,753 ఒకసారి కులికోవ్ తో మాట్లాడు. 13 00:00:44,837 --> 00:00:47,256 అబ్బా, దీమా, చెప్తున్నా కదా, తను లేదు. 14 00:00:47,339 --> 00:00:49,591 కులికోవ్ జాడ కూడా తెలీట్లేదు, దేవుడా! 15 00:00:49,675 --> 00:00:50,717 నేనేం చెప్తున్నానో అర్థమవుతోందా? 16 00:00:50,801 --> 00:00:52,970 ఆగు, ఒక్క నిమిషం ఆగు! 17 00:00:53,303 --> 00:00:54,721 కులికోవ్ జాడ తెలీట్లేదా? 18 00:00:54,805 --> 00:00:56,890 ఛ, ఛ… 19 00:00:56,974 --> 00:00:59,268 సరే, వాస్యా, వాస్యా… 20 00:00:59,977 --> 00:01:03,313 నా మాటలు వినిపిస్తున్నాయా? ఏకాగ్రత తప్పకు. 21 00:01:03,772 --> 00:01:05,482 ఆ పని చేయగలవా? 22 00:01:05,566 --> 00:01:06,900 హా, హా… 23 00:01:07,359 --> 00:01:09,111 - అబ్బా. - నాకు పిన్ ఇవ్వు. 24 00:01:09,778 --> 00:01:14,533 అబ్బా, దీమా, ఖైదీ నంబర్, 4-0-3-6-7. 25 00:01:14,908 --> 00:01:18,287 ఆమె పేరు గాలీ లెవీ. 26 00:01:19,496 --> 00:01:20,664 సరే. 27 00:01:20,956 --> 00:01:23,709 వాస్యా, ఇక నువ్వు ఫోన్ పెట్టేయ్. 28 00:01:23,792 --> 00:01:25,627 దీని గురించి ఎవరితో మాట్లాడవద్దు. 29 00:02:32,486 --> 00:02:35,948 మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం 30 00:03:03,225 --> 00:03:08,188 ట్యాక్సీ 31 00:03:14,945 --> 00:03:17,614 రా, వాళ్లు అయితే ఇంకా బాగా చెప్పగలరు. 32 00:03:20,075 --> 00:03:21,827 తను ఎలా కనిపించకుండా పోయిందో 33 00:03:21,910 --> 00:03:23,662 ఎంబసీలో ఉండే మాకెవరికీ తెలీదు. 34 00:03:23,745 --> 00:03:25,497 అది రష్యన్లు కూడా చెప్పలేకపోతున్నారు. 35 00:03:25,914 --> 00:03:27,708 "చెప్పలేకపోతున్నారు" అంటే? 36 00:03:27,791 --> 00:03:29,751 తనని ఏమైనా చేశారా? తనెక్కడ ఉంది? 37 00:03:29,960 --> 00:03:33,213 నొవీసిబిర్స్క్ లోని ఒక గార్డ్ బస్సు నుండి ఒక ఖైదీ తప్పిపోయినట్టు గుర్తించి, 38 00:03:33,297 --> 00:03:35,215 ఆ విషయం మాస్కో వాళ్లకి చెప్పాడు. 39 00:03:35,299 --> 00:03:36,633 ఆ సంఘటన సిస్టమ్లో లాగ్ అయింది. 40 00:03:36,717 --> 00:03:38,802 "సంఘటన" అని ఎందుకు అంటున్నారు? ఏ సంఘటన? 41 00:03:38,886 --> 00:03:41,305 ఆ బస్సులు మార్గం మధ్యలో కొన్ని స్టేషన్ల వద్ద ఆగుతూ ఉంటాయి, 42 00:03:41,388 --> 00:03:44,474 అవి తాత్కాలిక ఆవాసాలు అన్నమాట, అక్కడ ఖైదీలు రాత్రికి పడుకోవచ్చు, 43 00:03:44,558 --> 00:03:46,935 కొన్నింట్లో తినే సదుపాయం ఉంటుంది, ఆ తర్వాత వాళ్లు మళ్లీ బస్సు ఎక్కేయడమే. 44 00:03:47,019 --> 00:03:51,565 చివరి స్టాప్ అయిన క్రాస్నోయార్స్క్ లో గాలీ బస్సు ఎక్కలేదని తెలిసింది. 45 00:03:51,648 --> 00:03:53,066 అక్కడే ఆమె తప్పిపోయింది. 46 00:03:55,319 --> 00:03:57,029 వీళ్లకి నువ్వు గార్డ్ గురించి చెప్పు. 47 00:03:59,573 --> 00:04:02,993 గాలీని విడిపించడానికి ఎవరో గార్డుకు లంచం ఇచ్చారని అనుమానిస్తున్నారు. 48 00:04:03,076 --> 00:04:07,414 మాస్కో నుండి ఒక విచారణాధికారిని కూడా రప్పించారు, 49 00:04:07,497 --> 00:04:10,125 కానీ అతను వచ్చేసరికి, ఆ గార్డ్ ఈ దేశం దాటివెళ్లిపోయాడు. 50 00:04:10,209 --> 00:04:12,294 హౌస్ అరెస్టులో ఉన్న అతను తన కుటుంబంతో సహా తప్పించుకున్నాడు, 51 00:04:12,377 --> 00:04:13,879 భార్యాపిల్లలని తీసుకొని ఉడాయించేశాడు. 52 00:04:14,379 --> 00:04:16,130 వాళ్లు కుక్కని కూడా తీసుకెళ్లిపోయారు. 53 00:04:16,632 --> 00:04:18,884 కాబట్టి ఆ లంచం ఎవరైతే ఇచ్చారో… 54 00:04:19,551 --> 00:04:21,011 వాళ్లు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. 55 00:04:21,094 --> 00:04:24,348 అమ్మాయిలూ, మీకు కావాల్సిన సమాధానాలు దక్కాయి కదా. 56 00:04:24,640 --> 00:04:25,849 అసలు విషయం ఏంటంటే, దురదృష్టవశాత్తూ, 57 00:04:25,933 --> 00:04:27,851 ఈ విషయంలో ఇక ఎంబసీ చేయగలిగిందేం లేదు. 58 00:04:27,935 --> 00:04:30,354 "చేయగలిగిందేం లేదు" అంటే? నా కూతురు ఎక్కడ ఉంది? 59 00:04:30,437 --> 00:04:32,856 మీరు కూడా విన్నారుగా. ఎవరో ఆమెని జైలు నుండి తప్పించినట్టున్నారు. 60 00:04:32,940 --> 00:04:35,275 - ఎవరు? - నన్ను అడుగుతున్నారా? 61 00:04:35,359 --> 00:04:36,818 లేదు, తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది కదా? 62 00:04:36,902 --> 00:04:38,654 మీరు ఒక్క నిమిషం ఆగుతారా? 63 00:04:41,323 --> 00:04:45,536 విషయమేంటంటే, ఇది ఇప్పుడు మసాలా వార్తల స్థాయికి వెళ్లిపోయింది. 64 00:04:46,286 --> 00:04:48,580 జైలు నుండి తప్పించుకోవడాలు, గార్డులకి లంచం ఇవ్వడాలు… 65 00:04:49,289 --> 00:04:52,501 ఒక అధికారిక సంస్థగా, ఇందులో జోక్యం చేసుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది, 66 00:04:52,584 --> 00:04:53,919 పరోక్షంగానైనా. 67 00:04:54,002 --> 00:04:55,796 అందుకే ఇప్పుడు 68 00:04:55,879 --> 00:04:58,423 మనం ఎంబసీలో కాకుండా యూదుల ప్రార్థనా మందిరంలో కలుసుకుంటున్నాం. 69 00:04:58,757 --> 00:05:00,759 ఇది మీకు మేము చేసే సాయంగా భావించండి. 70 00:05:01,885 --> 00:05:04,096 మీ కూతురు అరెస్ట్ అయింది, తన దగ్గర డ్రగ్స్ ఉన్నాయి, 71 00:05:04,346 --> 00:05:06,765 తన కేసు ఇంకా కోర్ట్ విచారణలో ఉండగా, తను జైలు నుండి తప్పించుకుంది, 72 00:05:06,849 --> 00:05:08,976 తన కోసం ఒకరు లంచం ఇచ్చారు. అరె, ఇదంతా మామూలు విషయంలా ఉందా? 73 00:05:09,059 --> 00:05:12,020 అది ఏ విషయంలా ఉన్నా నాకనవసరం, మీరు మాకు సాయపడాలి. 74 00:05:12,104 --> 00:05:14,815 ఎఫ్.ఎస్.బీలో మీకు కొత్త స్నేహితులు తయారయ్యారు కదా, వాళ్ల సాయం అడగకూడదా? 75 00:05:14,898 --> 00:05:16,275 నీ సాయం నాకు అవసరం లేదు, ఆమీ. 76 00:05:19,027 --> 00:05:21,530 ఓర్నా, మీ పట్ల సానుభూతితో చెప్తున్నా, 77 00:05:21,905 --> 00:05:25,242 ఈ కేసు దౌత్యపరమైన పరిధిని దాటి నేరపూరితమైనదిగా ఎప్పుడో మారిపోయింది. 78 00:05:26,159 --> 00:05:28,120 స్వదేశంలో మీరు చేసిన పనుల వల్ల అమెరికన్లకి, మనకి గ్యాప్ వచ్చింది, 79 00:05:28,203 --> 00:05:30,873 కాబట్టి అసలు మీతో కలిసినందుకే మీరు మాకు థ్యాంక్స్ చెప్పాలి. 80 00:05:30,956 --> 00:05:34,251 రామీ, మీకు థ్యాంక్స్ చెప్పాలి అని ఇప్పుడు నువ్వు రెండోసారి అన్నావు, తెలుసా? 81 00:05:34,334 --> 00:05:38,797 నేనే నీ స్థానంలో ఉంటే, ఇలా థ్యాంక్స్ అడుక్కునే బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని చూస్తా, 82 00:05:38,881 --> 00:05:41,884 అది వృత్తిపరంగా వచ్చిందా, వ్యక్తిగతంగానే ఉందా, లేదా చిన్నప్పుడు అలవాటు అయిందా అని. 83 00:05:41,967 --> 00:05:43,260 థ్యాంక్యూ, రీటా. 84 00:05:44,553 --> 00:05:46,138 వెళ్దాం పద, ఆమీ. 85 00:05:50,142 --> 00:05:52,436 తనకి తన తండ్రి చనిపోయాడన్న విషయం కూడా తెలీదు. 86 00:05:59,443 --> 00:06:01,111 నన్ను క్షమించండి. 87 00:06:24,593 --> 00:06:27,095 కాస్త తీపి తిను, కొంచెం బాగుంటుంది. 88 00:06:29,973 --> 00:06:31,934 గాలీ బతికే ఉందంటావా? 89 00:06:35,604 --> 00:06:37,523 85% బతికే ఉందని అంటా. 90 00:06:37,940 --> 00:06:40,859 అంటే, ఒకరిని జైలు నుండి లంచం ఇచ్చి విడిపించి, 91 00:06:40,943 --> 00:06:43,487 ఆ వెంటనే ఎందుకు చంపేస్తారు? 92 00:06:44,696 --> 00:06:49,034 అంటే, ఎవరైతే గార్డుకు లంచం ఇచ్చారో, వాళ్ల దగ్గరే గాలీ ఉందని అర్థం కదా. 93 00:06:49,535 --> 00:06:50,744 అవును. 94 00:06:52,412 --> 00:06:54,039 - యూరి గ్లాస్కోవ్. - కాదు. 95 00:06:54,623 --> 00:06:55,707 ఎందుకు? గాలీ అతని వద్ద పని చేసింది. 96 00:06:55,791 --> 00:06:58,043 - నీ ఉద్దేశం ప్రకారం తను… - ఓకే, నాకు ఒకటి బలంగా అనిపిస్తోంది… 97 00:06:58,126 --> 00:07:01,630 తప్పుగా అనుకోవద్దు, తల్లిదండ్రులకి అన్నీ 98 00:07:01,964 --> 00:07:03,173 పిచ్చిపిచ్చివి అనిపిస్తుంటాయి… 99 00:07:03,257 --> 00:07:04,842 నాద్యా, యూరి గ్లాస్కోవ్ అనే 100 00:07:04,925 --> 00:07:08,303 ఆయుధాలను సరఫరా చేసే ఒక వ్యక్తి గురించి చెప్పింది. "యూరి గ్లాస్కోవ్" పేరు మీద ఓ పాట కూడా ఉంది. 101 00:07:08,720 --> 00:07:11,014 గాలీ దాన్ని బాగా వినేది, దాన్ని ఫేవరెట్ గా పెట్టుకుంది కూడా. 102 00:07:11,098 --> 00:07:14,560 ఆ విషయంపై ఎందుకు విచారణ చేయకూడదు? 103 00:07:17,229 --> 00:07:19,731 - ఏంటి? - చెప్పేది వినండి. 104 00:07:20,065 --> 00:07:22,526 - నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అందుకు కాదు. - మరి ఎందుకు? 105 00:07:23,235 --> 00:07:25,195 అవసరమైనప్పుడు ముఖం బాధగా పెట్టడానికి, 106 00:07:25,529 --> 00:07:26,905 పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం చేయడానికి, 107 00:07:26,989 --> 00:07:28,365 అధికారుల ముందు ఏడవడానికి. 108 00:07:28,448 --> 00:07:30,075 అమ్మలా ఉండటానికి అన్నమాట. 109 00:07:34,079 --> 00:07:35,455 మరి నువ్వెందుకు వచ్చావో? 110 00:07:36,290 --> 00:07:38,250 అమ్మలా ఉండటానికి కాదు. 111 00:07:41,461 --> 00:07:42,296 సరే మరి… 112 00:07:45,507 --> 00:07:48,635 ఇక్కడే ఉండు, అయిదు నిమిషాల్లో మనం ఒకరిని కలవడానికి వెళ్లాలి. 113 00:07:51,722 --> 00:07:53,098 ఫ్యాంతమ్ లింబ్ - యూరి గ్లాస్కోవ్ 114 00:08:00,272 --> 00:08:01,982 మ్యూజిక్ షోలు తర్వాత జరగబోయే తేదీలు 115 00:08:02,065 --> 00:08:06,361 మాస్కో ప్లాటెన్ బావ్ క్లబ్ - ఈరాత్రి! 116 00:08:06,445 --> 00:08:09,615 విదేశీ సాహిత్య గ్రంథాలయం 117 00:08:21,001 --> 00:08:25,422 రా, ఒక రొమాంటిక్ డేట్ కోసమని ఓ పబ్లిక్ లైబ్రరీకి ఎప్పుడైనా వచ్చావా? 118 00:08:36,433 --> 00:08:38,268 ఈరాత్రి ఇక్కడ వాళ్లది ఒక షో ఉంది. 119 00:08:38,852 --> 00:08:39,770 ఎవరిది? 120 00:08:40,354 --> 00:08:43,315 యూరి గ్లాస్కోవ్ గురించి పాట పాడే బ్యాండ్ వాళ్లది. 121 00:08:43,398 --> 00:08:46,235 మాస్కోలోని ఓ క్లబ్బులో షో చేస్తున్నారు. 122 00:08:46,318 --> 00:08:47,569 ఓకే. 123 00:08:48,570 --> 00:08:51,240 ఓకే, ఆ షోకి మనం వెళ్తే బాగుంటుంది అనుకుంటా. 124 00:08:55,619 --> 00:08:59,164 వాళ్లు యూరి గ్లాస్కోవ్ గురించి పాడుతున్నారు కాబట్టి, అతనెవరో వాళ్లకి తెలిసి ఉంటుంది. 125 00:08:59,456 --> 00:09:01,875 ఆ కోణం నుండి దర్యాప్తు చేస్తే మంచిదే కదా? ఎందుకు వద్దంటున్నావు? 126 00:09:01,959 --> 00:09:03,085 నేను దర్యాప్తు చేసేశా కాబట్టి. 127 00:09:03,168 --> 00:09:07,214 జనాభా రికార్డుల ప్రకారం ఇక్కడ యూరి గ్లాస్కోవ్ లు ముగ్గురున్నారు. 128 00:09:07,506 --> 00:09:09,883 ఒకడు పాతికేళ్ల క్రితమే చనిపోయాడు, 129 00:09:10,133 --> 00:09:11,677 ఒకడు 2008లో చనిపోయాడు. 130 00:09:12,094 --> 00:09:14,847 ఇంకొకడు బతికే ఉన్నా, మనం అతడిని పట్టించుకోనక్కర్లేదు. 131 00:09:14,930 --> 00:09:17,182 అతడిని పట్టించుకోనక్కర్లేదని నీ పాటికి నువ్వు ఎలా అనేసుకుంటావు? 132 00:09:17,266 --> 00:09:19,977 ఎందుకంటే ఆ యూరి గ్లాస్కోవ్ కి ఎనిమిదేళ్లే, 133 00:09:20,060 --> 00:09:21,812 యాకుత్స్క్ లోని ఓ ఎలిమెంటరీ స్కూలులో చదువుకుంటున్నాడు, 134 00:09:21,895 --> 00:09:24,189 అతను గార్డుకు లంచం ఇచ్చి, నీ కూతురిని విడిపించి ఉంటాడు అంటావా… 135 00:09:24,273 --> 00:09:27,484 - సరే, అర్థమైంది. - కాబట్టి రష్యాలో మనకి కావాల్సిన యూరి ఎవరూ లేరు. 136 00:09:27,568 --> 00:09:28,735 కానీ ఒకటి చెప్పనా? 137 00:09:28,819 --> 00:09:30,988 నీకు ఏదైనా షోకి వెళ్లాలని ఉంటే, వెళ్లు… 138 00:09:31,071 --> 00:09:32,698 సరే, చాలు ఇక. 139 00:09:32,990 --> 00:09:36,785 వచ్చేశాడు. బాధపడుతున్నట్టు కనిపించు. పనికిమాలినోడు. ఎప్పుడూ ఆలస్యంగానే వస్తాడు. 140 00:09:36,869 --> 00:09:40,497 - ఇంతకీ ఇతను ఎవరు? - రష్యాలో ఉన్న మన గూఢచారుల్లో ఒకడు. 141 00:09:40,747 --> 00:09:43,083 కానీ నిజం చెప్పాలంటే, వీడొక చెత్త గూఢచారి. 142 00:09:43,542 --> 00:09:45,586 సెర్గే, ఇక్కడ చూడు. 143 00:09:45,669 --> 00:09:46,962 దద్దమ్మలకే దద్దమ్మ… 144 00:09:48,338 --> 00:09:49,673 ఈమె ఎవరు? 145 00:09:49,882 --> 00:09:52,926 - ఇక్కడికి ఎందుకు వచ్చింది? - తనే అమ్మ, సెర్గే. 146 00:09:53,177 --> 00:09:55,470 - రీటా… - సెర్గే… 147 00:09:55,679 --> 00:09:58,640 తనని నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, 148 00:09:58,724 --> 00:10:02,477 నువ్వు పైకి ఎంత గంభీరంగా కనిపించినా, 149 00:10:02,895 --> 00:10:04,688 లోపల ఓ కరుణామయుడు ఉన్నాడని నాకు తెలుసు. 150 00:10:04,938 --> 00:10:07,941 ఏడుపు ముఖంతో, పలచబడుతున్న జుట్టుతో ఉంటావు, 151 00:10:08,025 --> 00:10:11,236 కానీ నీ మనస్సు వెన్న. 152 00:10:11,778 --> 00:10:12,946 కూర్చో. 153 00:10:23,290 --> 00:10:25,417 నిజంగా నా జుట్టు పలచబడుతోందా? 154 00:10:27,794 --> 00:10:29,880 నీ కుటుంబం ఎలా ఉంది? పిల్లలెలా ఉన్నారు? 155 00:10:30,297 --> 00:10:33,133 వాళ్లకి నేనంటే ఇష్టం లేదనుకుంటా. 156 00:10:33,634 --> 00:10:37,846 - నిన్ను ఇష్టపడని వాళ్లు కూడా ఉంటారా? - మా అమ్మ కూడా ఇదే మాట అనేది. 157 00:10:38,222 --> 00:10:41,099 అమ్మ టాపిక్ వచ్చింది కాబట్టి, 158 00:10:41,183 --> 00:10:44,102 నాకు, ఇక్కడున్న నా స్నేహితురాలికి చెప్పగలవా, 159 00:10:44,186 --> 00:10:47,648 నీ సహచరులు తన కూతురిని ఏం చేశారో? 160 00:10:49,816 --> 00:10:52,736 మీరు తనకి మాట ఇచ్చారు, తను చెప్పింది చేసింది. 161 00:10:52,819 --> 00:10:55,697 ఆ హ్యాకర్ అమ్మాయితో అప్పీల్ పత్రంపై సంతకం చేయించింది. 162 00:10:55,781 --> 00:10:57,407 కాబట్టి, ఇక్కడేం జరుగుతోందో చెప్పు. 163 00:10:59,284 --> 00:11:00,786 ఒకప్పుడు నువ్వు మంచిగా, హూందాగా ఉండేవాడివి. 164 00:11:02,913 --> 00:11:07,084 తనకి ఆ మాట ఇవ్వడమే సరైన పని కాదు అసలు. 165 00:11:07,167 --> 00:11:08,168 ఎందుకు? 166 00:11:08,252 --> 00:11:10,879 ఎందుకంటే, తన కూతురిని అప్పగించడానికి తను మా అదుపులో ఏం లేదు. 167 00:11:10,963 --> 00:11:11,964 వివరంగా చెప్పు. 168 00:11:18,804 --> 00:11:23,517 గాలీని మా ఎఫ్.ఎస్.బీకి తాత్కాలికంగానే అప్పగించారు, 169 00:11:25,227 --> 00:11:29,022 మా ఆపరేటివ్, నాద్యాని దక్కించుకోవడం కోసం చర్చలు జరపడానికే అన్నమాట. 170 00:11:29,106 --> 00:11:35,195 కానీ మీ కూతురిని అరెస్ట్ చేసిన కారణం అది కానే కాదు. 171 00:11:35,279 --> 00:11:38,198 మరి డ్రగ్స్ లేనప్పుడు నా కూతురిని ఎందుకు అరెస్ట్ చేశారు? 172 00:11:40,492 --> 00:11:43,120 తనని ఎందుకు అరెస్ట్ చేశారంటే, 173 00:11:43,704 --> 00:11:49,126 బాగా పలుకుబడి గల వ్యక్తి ఎవరెవరికి ఏమేం ఇవ్వాలో, వాళ్లందరికీ అది ఇచ్చారు కాబట్టి. 174 00:11:49,209 --> 00:11:54,047 విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బందికి, కోర్టులోని అధికారులకి, గార్డులకి. 175 00:11:54,548 --> 00:11:56,758 ఇప్పుడు తను మా దగ్గర ఉండాల్సిన అవసరం తీరిపోయింది కాబట్టి, 176 00:11:56,842 --> 00:12:00,053 మీ కూతురిని అక్రమంగా జైలు నుండి తప్పించి, 177 00:12:00,554 --> 00:12:03,891 అసలైన వ్యక్తికే అప్పజెప్పేయడం జరిగింది. 178 00:12:04,474 --> 00:12:06,810 "అసలైన వ్యక్తి" అంటే? 179 00:12:06,894 --> 00:12:08,061 ఓర్నా… 180 00:12:08,145 --> 00:12:09,229 ఆ వ్యక్తి ఎవరు, సెర్గే? 181 00:12:10,314 --> 00:12:13,734 ఈ అమ్మాయి కోసం అంతమందికి డబ్బులిచ్చిన వ్యక్తి ఎవరు? 182 00:12:15,360 --> 00:12:17,487 - అది నేను చెప్పలేను, రీటా. - సెర్గే… 183 00:12:18,405 --> 00:12:19,656 రీటా… 184 00:12:20,240 --> 00:12:22,534 భయపడుతున్నావా? అందుకే చెప్పట్లేదా? 185 00:12:23,118 --> 00:12:24,286 చిన్నా చితకా భయం కాదు. 186 00:12:25,204 --> 00:12:26,705 ఉచ్చ కారిపోయేంత భయం. 187 00:12:28,832 --> 00:12:30,375 మీరు కూడా భయపడాలి. 188 00:12:33,253 --> 00:12:34,796 తన పేరు యూరి గ్లాస్కోవా? 189 00:12:36,423 --> 00:12:38,133 గాలీని తీసుకెళ్లిన వ్యక్తి పేరు అదేనా? 190 00:12:39,426 --> 00:12:42,095 లేదు, అతని పేరు అది కాదు. క్షమించండి. 191 00:12:43,514 --> 00:12:45,432 మార్గరీటా, దయచేసి చెప్పేది విను, 192 00:12:45,682 --> 00:12:50,354 మీరు కానీ, నేను కానీ, మిమ్మల్ని ఇక్కడికి పంపిన వారు కానీ, 193 00:12:50,562 --> 00:12:55,442 ఈ యవ్వారంలో వేలు పెట్టకూడదని నేను గట్టిగా చెప్తున్నాను, 194 00:12:55,817 --> 00:12:59,571 అది కూడా రష్యన్ నేలపై. 195 00:13:01,740 --> 00:13:03,075 ఏమన్నాడు అతను? 196 00:13:04,493 --> 00:13:06,995 దయచేసి విషయమేంటో నాకు కూడా చెప్తావా? 197 00:13:07,079 --> 00:13:08,163 నేను కూడా ఉన్నాను ఇక్కడ. 198 00:13:08,247 --> 00:13:11,041 కానీ, దురదృష్టవశాత్తూ, నువ్వు ముఖ్యమైన దానివి కాదు, అంతే. 199 00:13:11,500 --> 00:13:13,252 నేను ఒకరికి కాల్ చేసి వస్తా. 200 00:13:13,627 --> 00:13:15,504 కాస్త విరామం తీసుకో, ఏదైనా పుస్తకం చదువు, ప్రశాంతంగా ఉంటుంది. 201 00:13:32,938 --> 00:13:36,525 - హలో? - యేవ్గేనీ, నేను ఓర్నాని. 202 00:13:36,608 --> 00:13:37,651 నేను గుర్తున్నానా? 203 00:13:37,734 --> 00:13:40,362 హా, ఇజ్రాయెల్ ఓర్నా కదా. 204 00:13:40,445 --> 00:13:42,990 మీరు నాకొక సాయం చేసి పెడతారని మాట ఇచ్చారు కదా, అది ఇప్పుడు చేసి పెట్టాలి. 205 00:13:55,460 --> 00:13:57,629 నేను కోర్టు రికార్డులను చెక్ చేశా. 206 00:13:57,713 --> 00:14:04,636 ఇక్కడ మాస్కోలో రెండు నెలల క్రితం, పునీన్ అనే ఒక వ్యక్తి, యూరి గ్లాస్కోవ్ అనే వ్యక్తిపై 207 00:14:05,679 --> 00:14:07,806 ఓ ఫిర్యాదు సమర్పించాడు. 208 00:14:08,515 --> 00:14:12,019 కానీ జనాభా రికార్డుల్లో యూరి గ్లాస్కోవ్ అనే పేరుతో 209 00:14:12,102 --> 00:14:16,315 ఎవరూ లేనందున, ఆ ఫిర్యాదును తిరస్కరించారు. 210 00:14:16,815 --> 00:14:18,817 కాబట్టి, నేను ఒక మాజీ క్లయింటును అడిగా. 211 00:14:18,901 --> 00:14:22,863 అతను కూడా జనాభా రికార్డుల్లో ఉండని వాడే అనుకోండి. 212 00:14:28,785 --> 00:14:31,371 అయితే, ఈ పునీన్ ఎక్కడ ఉంటాడు? 213 00:14:32,122 --> 00:14:33,373 అతను బార్లో ఉన్నాడు. 214 00:14:34,124 --> 00:14:35,501 కుడి పక్కనున్న బార్లో. 215 00:14:35,584 --> 00:14:38,795 ఆ బారును "తప్పిపోయిన వ్యక్తుల విడిది" అని పిలవవచ్చు. 216 00:15:25,467 --> 00:15:26,468 హలో. 217 00:15:27,344 --> 00:15:31,598 నేను ఒకరి కోసం వచ్చాను అన్నమాట, అతను అప్పుడప్పుడూ ఇక్కడికి వస్తూ ఉంటాడనుకుంటా. 218 00:15:32,099 --> 00:15:33,725 నాకర్థమవ్వట్లేదు. 219 00:15:35,310 --> 00:15:38,397 నేను పునీన్ కోసం వచ్చాను. 220 00:15:38,730 --> 00:15:39,982 పునీన్? 221 00:15:40,065 --> 00:15:41,149 అవును. 222 00:15:41,233 --> 00:15:43,777 అక్కడ ఫ్రిడ్జిని బాగు చేస్తూ ఉన్న వ్యక్తే పునీన్. 223 00:15:44,528 --> 00:15:45,821 థ్యాంక్స్. 224 00:16:06,884 --> 00:16:09,261 హాయ్, హలో. పునీన్ అంటే మీరేనా? 225 00:16:13,223 --> 00:16:14,349 పని మధ్యలో వచ్చినందుకు క్షమించాలి. 226 00:16:14,433 --> 00:16:19,980 నేను ఒకరి కోసం వెతుకుతున్నాను, ఆ విషయంలో మీరు సాయపడగలరని అనుకుంటున్నా. 227 00:16:20,814 --> 00:16:22,399 ఎందుకలా అనుకుంటున్నారు మీరు? 228 00:16:26,028 --> 00:16:28,071 అతని పేరు, యూరి గ్లాస్కోవ్. 229 00:16:35,329 --> 00:16:36,955 స్టాస్. 230 00:16:40,709 --> 00:16:42,377 మనం ఎవరూ లేని చోటుకెళ్లి మాట్లాడుకుందాం, సరేనా? 231 00:16:46,131 --> 00:16:47,132 హా, సరే. 232 00:17:12,199 --> 00:17:14,034 మీలాంటి వ్యక్తికి 233 00:17:15,077 --> 00:17:17,538 యూరి లాంటి వ్యక్తితో పనేంటి? 234 00:17:18,664 --> 00:17:23,126 - నేను అతనితో వ్యాపారం చేయాలనుకుంటున్నా. - అది నిజం కాదు. 235 00:17:24,002 --> 00:17:25,796 అతని వల్ల మీ డబ్బులు కూడా పోయాయా? 236 00:17:26,380 --> 00:17:28,590 - లేదు, లేదు, నేను… నేను కేవలం… - మీరు పోలీసా? 237 00:17:29,633 --> 00:17:31,218 నేనా? లేదు, లేదు. 238 00:17:32,010 --> 00:17:35,472 లేదు, నన్ను పట్టుకుని పోలీస్ అంటారేంటి? నాకు… నాకు రష్యన్ భాష కూడా రాదు. 239 00:17:36,014 --> 00:17:39,476 - వేరే దేశం నుండి వచ్చిన పోలీస్ అయ్యుండవచ్చు కదా. - లేదు, లేదు, నేను… నేను పోలీస్ కాదు. 240 00:17:40,185 --> 00:17:41,186 నేను పోలీస్ కానే కాదు. 241 00:17:44,022 --> 00:17:45,524 మీరు పోలీస్ కాదా? 242 00:17:47,985 --> 00:17:49,111 నిజంగానే చెప్తున్నా. 243 00:17:51,613 --> 00:17:53,699 నేను ఒకసారి యూరితో మాట్లాడాలనుకుంటున్నా, అంతే. 244 00:17:55,367 --> 00:17:57,911 చాలా మందికి యూరి కావాలి, వెయిటింగ్ లిస్టులో ఉండండి కాస్త. 245 00:17:57,995 --> 00:17:59,746 సరే, ఇలా చూడండి. 246 00:17:59,830 --> 00:18:01,748 మీరు నిజంగా వ్యాపారం చేస్తున్నవారు అయితే, 247 00:18:02,249 --> 00:18:05,002 నేను మీకు సాయపడగలను. మీకు కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేయగలను. 248 00:18:05,544 --> 00:18:09,006 నాకు చాలా మంది తెలుసు, మంచి అనుభవజ్ఞులు తెలుసు… 249 00:18:09,089 --> 00:18:14,052 థ్యాంక్యూ, నేను… నేను అతనితో మాట్లాడాలి, అంతే. యూరితో మాట్లాడాలి. 250 00:18:14,136 --> 00:18:17,639 కాబట్టి, మీ దగ్గర అతని ఫోన్ నంబర్ ఏమైనా ఉందా, లేదా… 251 00:18:17,723 --> 00:18:19,266 ఫోన్ నంబర్ వల్ల ఏ లాభమూ ఉండదు. 252 00:18:19,850 --> 00:18:20,851 ఎందుకని? 253 00:18:21,643 --> 00:18:24,021 ఎందుకంటే, చచ్చిన వాడు ఫోన్ ఎత్తలేడు కదా. 254 00:18:24,104 --> 00:18:26,440 మూడు నెలల నుండి అతను అత్తాపత్తా లేకుండా ఎటో వెళ్లిపోయాడు. 255 00:18:26,523 --> 00:18:29,067 అతని ఆఫీస్ లాక్ అయిపోయింది, ఫోన్ డిస్ కనెక్ట్ అయిపోయింది. 256 00:18:29,151 --> 00:18:30,777 నీకు కావాల్సింది యూరి కాదు, మేము. 257 00:18:30,861 --> 00:18:32,446 ఒక్క నిమిషం, అతనికి ఆఫీస్ ఉందా? 258 00:18:33,322 --> 00:18:34,573 ఇక్కడ మాస్కోలో ఉందా? 259 00:18:39,995 --> 00:18:43,582 - వాళ్లందరూ మాజీ సైనికులు. - సరే, "సైనికులే." 260 00:18:43,665 --> 00:18:46,585 మళ్లీ అలా చెప్పాపెట్టకుండా నీ పాటికి నువ్వు పనులు చేసేయకు. 261 00:18:46,668 --> 00:18:53,509 చూడు, యూరి గ్లాస్కోవ్ మూడు నెలల క్రితం వాళ్లని కొరియర్ బాయ్స్ గా పెట్టుకున్నాడు. 262 00:18:53,592 --> 00:18:55,886 వాళ్లు ఈ ఆఫీసుకు వచ్చి, 263 00:18:55,969 --> 00:18:59,014 అతని ఉద్యోగిని కలిసి సంతకం పెట్టి, అడ్వాన్స్ తీసుకెళ్లారు. 264 00:18:59,097 --> 00:19:02,518 వాళ్లకి అప్పగించిన పనేంటంటే, నేపాల్ కి వెళ్లి, 265 00:19:02,601 --> 00:19:07,814 భారతదేశం నుండి వచ్చే మాల్ కోసం వేచి చూడాలి, అది వచ్చాక, దాన్ని అక్రమంగా రష్యాకు తరలించాలి. 266 00:19:07,898 --> 00:19:11,276 కానీ వాళ్లు నేపాల్ కి వెళ్లి ఒక వారం పాటు అక్కడే ఉన్నారు, 267 00:19:11,485 --> 00:19:13,278 కానీ మాల్ రాలేదు. 268 00:19:14,571 --> 00:19:17,324 ఇక వాళ్లు అక్కడే ఇరుక్కుపోయారు, 269 00:19:17,407 --> 00:19:19,993 తిరుగు ప్రయాణానికి టికెట్లు కానీ, డబ్బులు కానీ లేవు, 270 00:19:20,452 --> 00:19:23,872 వాళ్లు తిరిగి వచ్చేశాకే తెలిసింది, యూరి గ్లాస్కోవ్ కనిపించకుండా పోయాడు అని. 271 00:19:25,040 --> 00:19:27,709 వాళ్లలో ఒకరు నాకేం చెప్పారంటే, యూరి గ్లాస్కోవ్ ఒక బిగ్ బాస్ దగ్గర పని చేశాడట, 272 00:19:27,793 --> 00:19:30,546 ఆ బిగ్ బాస్ దగ్గర అతనేదో కొట్టేశాడట, అందుకే కనిపించకుండా పారిపోయాడట. 273 00:19:30,629 --> 00:19:33,215 అంటే, అతను ఆ బిగ్ బాస్ నుండి తప్పించుకుని అయినా వెళ్లిపోయి ఉంటాడు… 274 00:19:33,423 --> 00:19:34,925 లేదా హత్యకు గురై ఉంటాడు. 275 00:19:35,342 --> 00:19:37,010 ఇక్కడ లైట్ వేయ్. 276 00:19:37,511 --> 00:19:39,346 దానికి, గాలీకి సంబంధం ఉందో లేదో మనకి తెలీదు కదా. 277 00:19:39,429 --> 00:19:40,264 నాకు తెలుసు. 278 00:19:40,597 --> 00:19:42,975 వాళ్లు ఇక్కడ ఏ ఉద్యోగిని అయితే కలిశారో, ఆమెని వాళ్లు వివరించారు. 279 00:19:43,267 --> 00:19:47,479 ఆమె వయస్సు 20లలో ఉంటుందట, ఒక రకమైన యాసలో ఇంగ్లీష్ మాట్లాడిందట. 280 00:19:47,563 --> 00:19:49,565 ఇంకా ఇక్కడ కంటి పక్కన ఓ పుట్టుమచ్చ ఉందట తనకి. 281 00:19:53,068 --> 00:19:54,528 ఈ తాళాలు తీయడం నీకెలా తెలుసు? 282 00:19:54,611 --> 00:19:56,989 పుట్టుకతోనే తెలుసా, లేదా నీకు శిక్షణ ఏమైనా ఇచ్చారా? 283 00:19:57,072 --> 00:19:58,365 శిక్షణ ఇచ్చారు. 284 00:20:02,411 --> 00:20:06,081 "అన్నట్టు, ఓర్నా, నువ్వు పట్టుబట్టి పని కానిచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది… 285 00:20:06,164 --> 00:20:08,876 నీ గురించి నేను అనుకున్నదంతా తప్పే, నన్ను క్షమించు." 286 00:20:10,002 --> 00:20:12,254 నీ కూతురు కూడా నీలానే చిరాకు తెప్పించేదే అయితే, 287 00:20:12,963 --> 00:20:15,340 కనిపించకుండా పోకుండా ఇంకేమవుతుందిలే. 288 00:20:57,382 --> 00:20:59,843 ఆయుధాలను సరఫరా చేసే వారి ఆఫీసు ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ, 289 00:20:59,927 --> 00:21:00,844 ఇలా అయితే ఉండదు. 290 00:21:00,928 --> 00:21:04,848 అసలు ఇది అతని ఆఫీస్ అయితే కదా, ఇది గంటల లెక్కన అద్దెకి దొరికే చోటు, అంతే. 291 00:21:05,098 --> 00:21:07,601 చూస్తుంటే, చాలా నెలలుగా ఈ చోటు ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తోంది. 292 00:21:16,485 --> 00:21:18,111 మనం తక్షణమే ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 293 00:21:18,195 --> 00:21:20,489 - ఎందుకు? - మనం ఇక్కడికి వచ్చామని వాళ్లకి తెలిసిపోయింది. పద. 294 00:21:27,913 --> 00:21:31,917 - ఇక్కడ? - హా, రెండో అంతస్థులో. త్వరగా పదండి! 295 00:21:44,304 --> 00:21:45,514 ఇలా రా. 296 00:21:52,437 --> 00:21:54,439 - వాళ్లు లిఫ్టులో లేరు! - ఇక్కడున్నారు! 297 00:21:54,815 --> 00:21:56,650 మెట్ల మీద నుండి వెళ్తున్నారు! అక్కడున్నారు! 298 00:22:10,497 --> 00:22:12,541 ఆగండి! ఆగండి, దద్దమ్మలారా! 299 00:22:14,459 --> 00:22:16,587 త్వరగా పద! 300 00:22:28,390 --> 00:22:29,975 నాకంతా అయోమయంగా ఉంది. ఎవరు వాళ్లు? 301 00:22:30,058 --> 00:22:32,102 గ్లాస్కోవ్ కోసం గాలిస్తున్న మనుషులు. 302 00:22:32,186 --> 00:22:33,896 వాళ్లు ఆ ఆఫీసుపై నిఘా పెట్టున్నారు. 303 00:22:35,189 --> 00:22:37,065 - మరి మనం ఇప్పుడేం చేయాలి? - ఏమీ లేదు. 304 00:22:38,734 --> 00:22:40,652 ఏమీ లేదా? కానీ మనకి సమాధానాలు దొరకలేదు కదా. 305 00:22:40,736 --> 00:22:43,280 ఏ సమాధానం దొరకలేదు నీకు? అన్నీ దొరికాయి కదా. 306 00:22:43,363 --> 00:22:45,282 యూరి గ్లాస్కోవ్ ఆయుధాలను సరఫరా చేస్తుంటాడు. 307 00:22:45,365 --> 00:22:48,118 తను పని చేసే బిగ్ బాస్ దగ్గరే దొంగతనం చేసి, చిక్కుల్లో పడ్డాడు. 308 00:22:48,202 --> 00:22:51,872 నీ కూతురు కూడా గ్లాస్కోవ్ దగ్గర పని చేసి, తనూ చిక్కుల్లో పడింది. అక్కడితో కథ ముగిసింది. 309 00:22:51,955 --> 00:22:53,332 అది కథకు ముగింపు ఎలా అవుతుంది? 310 00:22:53,415 --> 00:22:56,919 ఒక్క నిమిషం, అయితే గాలీని అరెస్ట్ చేయించింది ఆ బిగ్ బాసేనా? 311 00:22:57,002 --> 00:22:59,087 - ఇప్పుడు గాలీ అతని దగ్గరే ఉందా? - అతని దగ్గరే ఉందనుకుంటా. 312 00:22:59,171 --> 00:23:03,717 అయితే, మనం ఆ బిగ్ బాసుని కలిసి, గాలీకి ఏ పాపం తెలీదని చెప్దాం, తను కేవలం… 313 00:23:03,800 --> 00:23:06,720 ఓర్నా, విమానాశ్రయంలోని వ్యక్తులను 314 00:23:06,803 --> 00:23:08,931 అదుపులోకి తీసుకోమని పోలీసులకి చెప్పగలిగిన స్థాయి, 315 00:23:09,014 --> 00:23:11,975 వాళ్లని జైలు నుండి మాయం చేయగల స్థాయి గల వ్యక్తిని 316 00:23:12,059 --> 00:23:14,770 మనం చేరుకోగలిగినా, ఏమని చెప్తాం? 317 00:23:14,853 --> 00:23:17,523 "నా కూతురు మీ దగ్గర పని చేసిన వ్యక్తి దగ్గర పని చేసిందంతే" అని చెప్తావా? 318 00:23:17,606 --> 00:23:19,191 అదే చెప్తానేమో. 319 00:23:19,733 --> 00:23:22,152 అయితే ఆ యూరి గ్లాస్కోవ్ ఆచూకీని కనిపెడదాం. 320 00:23:22,402 --> 00:23:23,612 దాని వల్ల ఇప్పుడు నీకు ఒరిగేదేంటి? 321 00:23:23,695 --> 00:23:26,281 ఎందుకంటే, ఇది అతని తప్పే. అతనే దీనికి మూల కారణం. 322 00:23:26,365 --> 00:23:29,952 దొంగిలించింది అతను, దానికి మూల్యం గాలీ ఎందుకు చెల్లించాలి? 323 00:23:30,744 --> 00:23:33,956 సరే, నువ్వు అతన్ని కనుగొన్నావే అనుకో, అతను కనిపిస్తున్నట్టు పనికిమాలిన వెధవ కాకుండా 324 00:23:34,039 --> 00:23:37,209 మంచివాడే అయ్యుండి, చేసిన తప్పుకు కుమిలిపోతున్నాడే అనుకో. 325 00:23:37,292 --> 00:23:41,046 అప్పుడు అతను "మీ కూతురిని ఈ నరకంలోకి లాగినందుకు సారీ, మిసెస్ ఓర్నా" అన్నాడే అనుకో. 326 00:23:41,255 --> 00:23:43,882 అప్పుడేంటి? దాన్ని పట్టుకుని మనమేం చేయగలం? 327 00:23:43,966 --> 00:23:47,761 నాకు తెలీదు. ఇంకేం చేయగలను నేను? అతని దగ్గర నా కూతురు ఉంది. 328 00:23:47,845 --> 00:23:49,596 తనెక్కడ ఉందో, అసలు ఎలా ఉందో కూడా నాకు తెలీదు. 329 00:23:49,680 --> 00:23:51,765 నువ్వే చెప్పు, నేనేం చేయాలో? 330 00:23:51,849 --> 00:23:54,101 ముందు, మనం ఇక్కడి నుండి వెళ్లిపోదాం. 331 00:23:54,184 --> 00:23:57,813 రేపు మనిద్దరికీ ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేస్తా. 332 00:23:58,021 --> 00:24:00,440 మరో వ్యూహంతో మళ్లీ వద్దాం. క్షమించు నన్ను. 333 00:24:01,692 --> 00:24:03,861 నువ్వు సాయం చేస్తావని అన్నావు కదా. 334 00:24:03,944 --> 00:24:06,029 అవును, కానీ దానితో పాటు మనం కలిసినప్పుడు, 335 00:24:06,113 --> 00:24:08,866 నాకు ఏమేం చేయడానికి అధికారం ఉంటుందో, ఏమేం చేయడానికి అధికారం ఉండదో కూడా చెప్పా కదా. 336 00:24:09,575 --> 00:24:12,661 స్థానిక బిగ్ బాసుతో ఒక మెగా యుద్ధాన్ని మొదలుపెట్టడమంటే… 337 00:24:13,620 --> 00:24:15,455 అది నా పరిధిలోని విషయం కాదు. 338 00:24:22,754 --> 00:24:24,131 బండిని కాస్త పక్కకు ఆపుతావా? 339 00:24:28,886 --> 00:24:30,971 దయచేసి బండిని కాస్త పక్కకు ఆపుతావా? 340 00:24:33,015 --> 00:24:34,808 సరే, ఇక్కడ ఆపుతున్నా. 341 00:24:35,642 --> 00:24:37,603 చెప్పేది విను, ఓర్నా, ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? 342 00:24:37,895 --> 00:24:39,354 ఏం చేస్తున్నావు అసలు? 343 00:24:39,438 --> 00:24:42,149 సరే అయితే. గుడ్ లక్. 344 00:25:06,423 --> 00:25:10,093 మాస్కో ప్లాటెన్ బావ్ క్లబ్ - ఈరాత్రి! 345 00:25:37,871 --> 00:25:38,997 హాయ్. 346 00:25:40,332 --> 00:25:43,460 నేను… నేను కేవలం చూడటానికి లోపలికి వెళ్లవచ్చా… 347 00:25:45,003 --> 00:25:46,380 థ్యాంక్స్. 348 00:27:35,948 --> 00:27:36,949 హేయ్. 349 00:27:44,540 --> 00:27:45,457 హేయ్. 350 00:27:51,672 --> 00:27:53,173 మీ సంగీతం నాకు నచ్చింది. 351 00:27:57,803 --> 00:28:01,223 నా పేరు ఓర్నా. మీ పేరేంటి? 352 00:28:03,600 --> 00:28:04,601 ఎందుకని అడుగుతున్నారు? 353 00:28:06,436 --> 00:28:07,896 అంటే… ఏమో. 354 00:28:09,815 --> 00:28:10,816 అదేమైనా రహస్యమా? 355 00:28:12,359 --> 00:28:15,404 నేను బయటకు వెళ్తున్నా, ఇక్కడ నీ పనయ్యాక కాల్ చేయ్. 356 00:28:15,487 --> 00:28:16,321 సరే. 357 00:28:18,615 --> 00:28:21,285 మా మిస్టర్ విరక్తి బాబు మీకు దొరికాడు అన్నమాట. 358 00:28:21,702 --> 00:28:25,581 మనోడు అంత తేలిగ్గా మాట్లాడే రకం కాదు, కానీ మనోడి మనస్సు విశాలమైనది, 359 00:28:25,664 --> 00:28:27,833 మగతనం కూడా మెండుగానే ఉందనుకోండి. 360 00:28:27,916 --> 00:28:30,002 నాకు రష్యన్ భాష రాదు, సారీ. 361 00:28:30,085 --> 00:28:32,629 మగతనం విషయంలో ఇతడిని కొట్టేవాడు లేడని అన్నా. 362 00:28:35,048 --> 00:28:39,469 ఇంకా ఇతని పేరేంటో నాకు తెలీలేదు. 363 00:28:39,553 --> 00:28:41,722 పర్వాలేదు. నాకేం పర్వాలేదు. 364 00:28:42,764 --> 00:28:45,809 మీకు అదృష్టముండాలి. అంటే, ఒక్కోసారి నోరు తెరవడు, 365 00:28:45,893 --> 00:28:49,688 ఒక్కోసారి అయితే మీతో చక్కగా మాట్లాడేసి, మనోడి డీజే పనిని చూడమని ఒప్పించగలడు కూడా. 366 00:28:49,771 --> 00:28:52,065 అంతే కదా, రోమా? 367 00:28:58,238 --> 00:29:01,867 ఇప్పుడు మీరు డిజేగా చేస్తున్నారా, రోమా? 368 00:29:01,950 --> 00:29:04,119 నేను ఇజ్రాయెల్ నుండి వచ్చా. 369 00:29:04,203 --> 00:29:08,957 నేను అక్కడి నుండి ఇంత దూరం వస్తే, మీరు కనీసం నాకు ఇష్టమైన పాటని ప్లే చేయట్లేదు కూడా. 370 00:29:11,585 --> 00:29:14,129 ఆ పాట పేరు "యూరి గ్లాస్కోవ్" అనుకుంటా. 371 00:29:15,005 --> 00:29:16,965 - లేదు, మేము ఈ పాటని ప్లే చేయం. - ఏంటి? 372 00:29:17,549 --> 00:29:20,552 - మేము ఇప్పుడు ఈ పాటని ప్లే చేయట్లేదని అన్నా. - ఎందుకు? 373 00:29:23,931 --> 00:29:25,807 కొత్త పాటలు చాలా వచ్చేశాయి. 374 00:29:26,934 --> 00:29:28,894 క్షమించాలి, నాకు పనుంది, వెళ్లాలి. 375 00:29:28,977 --> 00:29:31,688 నేనేం అనుకున్నానంటే… ఒక్క నిమిషం, సారీ… 376 00:29:31,772 --> 00:29:36,276 మీరు… షో జరిగేటప్పుడు, 377 00:29:36,360 --> 00:29:38,195 నా వంక చూశారా? 378 00:29:39,446 --> 00:29:41,448 లేదు, లేదు, అది… 379 00:29:41,532 --> 00:29:45,452 స్టేజ్, సెటప్, లైట్స్ అన్నీ… 380 00:29:45,536 --> 00:29:48,330 కళ్లకి గ్లేర్ కొడతాడు. కాబట్టి, సారీ. 381 00:29:48,413 --> 00:29:50,332 అయితే… అంటే… ఒక్క నిమిషం ఆగండి. 382 00:29:50,415 --> 00:29:51,834 దయచేసి… ఏమనుకోవద్దు. 383 00:29:52,876 --> 00:29:56,463 ఇంతకీ ఆ పాటలోని యూరి గ్లాస్కోవ్ ఎవరు? 384 00:29:58,090 --> 00:30:01,385 ఎవరూ కాదులెండి. ఆయన… 385 00:30:01,468 --> 00:30:04,179 నా చిన్నప్పుడు ఓ టీచర్ అన్నమాట. 386 00:30:06,265 --> 00:30:09,017 సారీ. నేను వెళ్లాలి… సరేనా? 387 00:30:35,169 --> 00:30:36,461 మీరు మీ డ్రింకుని మర్చిపోయారు. 388 00:30:37,838 --> 00:30:40,340 - చూడండి, మీరు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. - మీ డ్రింక్ మీకు అక్కర్లేదా? 389 00:30:40,424 --> 00:30:42,843 లేదు, నేను నా పనిపై దృష్టి పెట్టాలి, కానీ మీరు నాకు అంతరాయం కలిగిస్తున్నారు. 390 00:30:42,926 --> 00:30:45,679 - అయితే యూరి గ్లాస్కోవ్ ఎవరో చెప్పేయండి. - చెప్పా కదా, 391 00:30:45,762 --> 00:30:48,724 - మా స్కూలులో ఆయన పీటీ మాస్టర్. - కానీ అది అబద్ధమని నాకు తెలుసు. 392 00:30:48,807 --> 00:30:52,436 కాబట్టి, యూరి గ్లాస్కోవ్ ఎవరో చెప్పేయండి, ఇక మీ వైపు కూడా నేను రాను. 393 00:33:07,237 --> 00:33:09,281 ఏమనుకోకండి, మిస్… 394 00:33:17,581 --> 00:33:19,124 ఇక్కడ ఉండండి. 395 00:33:21,460 --> 00:33:22,461 అయితే… 396 00:33:24,296 --> 00:33:27,841 ఇప్పుడు నేను వెళ్లిపోతాను. సరేనా? 397 00:33:28,383 --> 00:33:29,468 సరే. 398 00:33:29,968 --> 00:33:30,928 సరే. 399 00:33:31,428 --> 00:33:33,514 నాకు అంత బాగా లేదు. 400 00:33:42,648 --> 00:33:44,316 ఏం చేశారు మీరు? ఏమైనా తీసుకున్నారా? 401 00:33:51,990 --> 00:33:56,411 కానీ మీ దగ్గర ఫోన్ ఉంది, కదా? ట్యాక్సీని పిలిపించుకోగలరా? 402 00:33:57,120 --> 00:33:58,997 - హా. సరే. - సరే. 403 00:34:06,463 --> 00:34:07,548 అయితే… 404 00:34:09,466 --> 00:34:12,135 అయితే మీకేం పర్వాలేదు, కదా? 405 00:34:12,803 --> 00:34:14,679 పర్లేదు కదా? మీరు బాగానే ఉన్నారు కదా? 406 00:34:18,058 --> 00:34:20,978 వావ్… ఈ పోరి కత్తిలా ఉంది! 407 00:34:33,739 --> 00:34:35,449 ఓకే, అయితే… 408 00:34:35,951 --> 00:34:38,536 మీరు… మీరు ఎక్కడ ఉంటున్నారు? 409 00:34:40,080 --> 00:34:42,206 చిరునామా చెప్పగలరా? మీరు ఎక్కడ ఉంటున్నారో చిరునామా చెప్పగలరా? 410 00:34:44,501 --> 00:34:47,129 18 బాలే హానిస్సిమ్ స్ట్రీట్. 411 00:36:20,305 --> 00:36:23,684 హేయ్… ఎలా ఉన్నావు, గుడ్ బాయ్? 412 00:36:26,603 --> 00:36:27,938 మీరు కూర్చోవచ్చు. 413 00:36:29,648 --> 00:36:32,526 రండి, రండి. వచ్చి సోఫాలో కూర్చోండి. 414 00:36:32,609 --> 00:36:33,610 జాకో. 415 00:36:49,293 --> 00:36:51,879 బహుశా మీరు తాగిన డ్రింకులో ఏమైనా కలిపారేమో. 416 00:37:10,480 --> 00:37:13,358 మీ ముఖం బాగా పాలిపోయింది. మీరు నిద్రపోతే కాస్త బాగుంటుంది అనుకుంటా. 417 00:37:19,990 --> 00:37:21,700 యూరి గ్లాస్కోవ్ అంటే ఎవరో చెప్పండి. 418 00:37:24,328 --> 00:37:25,537 చెప్పా కదా. 419 00:37:27,122 --> 00:37:28,624 అది నిజం కాదని నాకు తెలుసు. 420 00:37:43,931 --> 00:37:46,850 ఇది చూశారా? ఇక్కడ ఉన్నది నేనే. 421 00:37:46,934 --> 00:37:52,231 నాకు ఎనిమిదేళ్లున్నప్పుడు మా నాన్న నన్ను బోర్డింగ్ స్కూలులో వేశాడు. 422 00:37:52,940 --> 00:37:56,276 ఇతను మా పీటీ మాస్టర్. 423 00:37:56,360 --> 00:37:57,861 చాలా గట్టోడు. 424 00:37:58,946 --> 00:38:03,158 మా నాన్నలానే బాగా పటిష్టంగా ఉంటాడు. 425 00:38:03,242 --> 00:38:09,957 బుధవారాలు ఆయన మమ్మల్ని రన్నింగ్ ట్రాక్లకు తీసుకెళ్లేవాడు, అక్కడ మేము పరుగెత్తే వాళ్లం. 426 00:38:10,040 --> 00:38:13,710 ఈ టీచర్ మాకు చాలా కఠినమైన పోటీలు పెట్టేవాడు. 427 00:38:14,503 --> 00:38:19,716 పోటీలో చివర వస్తే, ఇతర పిల్లల ముందు చాలా అవమానించేవాడు. 428 00:38:20,467 --> 00:38:22,469 నేను ఆటల్లో అంత ప్రతిభావంతుడిని కాదు. 429 00:38:23,262 --> 00:38:28,600 కానీ మా క్లాసులో ఆంటన్ అని ఒక పిల్లవాడు ఉండేవాడు. అతను ఆటల్లో నాకన్నా వెనుక ఉండేవాడు, 430 00:38:28,684 --> 00:38:30,018 కాబట్టి ప్రతిసారి నేను బతికిపోయేవాడిని. 431 00:38:30,686 --> 00:38:36,149 కానీ ఒకరోజు ఆంటన్ కి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల నేను బుక్ అయిపోయా. 432 00:38:37,401 --> 00:38:43,824 పరుగెత్తేటప్పుడు ఎంతలా ఏడ్చానో ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. 433 00:38:44,366 --> 00:38:48,996 ట్రాక్స్ చివరన పిల్లలందరూ నా కోసం చూస్తూ ఉన్నారు అన్నమాట, 434 00:38:50,455 --> 00:38:51,915 నాకు పడే తిట్లు విని ఆనందించాలని, 435 00:38:53,417 --> 00:38:54,793 కానీ నేను అక్కడికి చేరుకునేసరికి… 436 00:38:57,337 --> 00:38:59,256 వాళ్ల చూపు నావైపు లేదు. 437 00:39:00,757 --> 00:39:02,676 వాళ్లకి నా కన్నీళ్లు కనిపించలేదు. 438 00:39:04,761 --> 00:39:06,680 అసలు నేను అక్కడ ఉన్నాననే విషయమే గమనించలేదు, 439 00:39:06,763 --> 00:39:10,225 ఎందుకంటే ఈ మనిషి 440 00:39:11,268 --> 00:39:13,604 ట్రాక్స్ మీద కుప్పకూలిపోయి చనిపోయాడు. 441 00:39:17,107 --> 00:39:21,528 అతనికి 45 ఏళ్లకు గుండెపోటు వచ్చి, 442 00:39:22,070 --> 00:39:23,697 పిల్లలందరి ముందు చనిపోయాడు. 443 00:39:24,823 --> 00:39:27,075 అతని పేరు యూరి గ్లాస్కోవ్. 444 00:39:29,578 --> 00:39:31,830 మీరు అడిగిన పాట అతని గురించే రాశాం అన్నమాట. 445 00:39:39,379 --> 00:39:40,839 అయయ్యో, చాలా బాధాకరం కదా. 446 00:39:41,798 --> 00:39:44,510 అంతేం లేదు. అతను వేధించేవాడు. 447 00:39:45,636 --> 00:39:46,970 అతనికి తగిన శాస్తే జరిగింది. 448 00:40:02,110 --> 00:40:03,987 నువ్వు చాలా మంచి కుర్రాడివి. 449 00:40:09,993 --> 00:40:12,538 అంత చిన్నప్పుడే మీ నాన్న నిన్ను ఎందుకు పంపేశాడు? 450 00:40:20,838 --> 00:40:23,924 యూరి గ్లాస్కోవ్ 451 00:40:30,764 --> 00:40:33,851 యూరి గ్లాస్కోవ్ 452 00:40:42,568 --> 00:40:44,903 ఇక నేను పడుకుంటాను, సరేనా? 453 00:41:39,791 --> 00:41:45,130 గూగుల్ యూరి గ్లాస్కోవ్ 454 00:41:46,048 --> 00:41:48,217 యూరి గ్లాజ్కువ్ సంగీత వీడియో 455 00:42:19,164 --> 00:42:21,792 హాయ్, నేను రీటాను. నీకు కొన్ని ఫోటోలను పంపాను, 456 00:42:21,875 --> 00:42:23,919 అవి సిస్టమ్లో రన్ చేసి, వాళ్లెవరో చెప్పగలవా? 457 00:42:25,420 --> 00:42:27,172 హా, ఉన్నాను. 458 00:42:35,556 --> 00:42:36,431 సరే. 459 00:42:40,477 --> 00:42:42,771 సరే. అది ఆ వ్యక్తేనని పక్కానా? 460 00:42:44,940 --> 00:42:46,316 థ్యాంక్స్, గుడ్ నైట్. 461 00:42:49,278 --> 00:42:50,946 ఓర్నా లెవీ 462 00:43:14,261 --> 00:43:17,222 ఓర్నా, ఎక్కడ ఉన్నావు? ఆ షోకి అస్సలు వెళ్లకు. 463 00:43:17,306 --> 00:43:19,850 ఈ వాయిస్ మెసేజ్ వినగానే నాకు కాల్ చేయ్. 464 00:43:21,310 --> 00:43:22,477 కోస్త్యా. 465 00:43:51,757 --> 00:43:54,092 రీటా: వీలైనంత త్వరగా నాకు కాల్ చేయ్! 466 00:44:30,212 --> 00:44:33,048 యూది షరబానీ మనం మళ్లీ మళ్లీ చేస్తుండాలి 467 00:44:33,131 --> 00:44:35,884 గాలీ, బంగారం, ఇదుగో ఓ చిరు కానుక 468 00:44:35,968 --> 00:44:38,554 పాస్ ఓవర్ శుభాకాంక్షలు! ప్రేమతో అమ్మ 469 00:44:39,221 --> 00:44:41,306 దయచేసి నా వస్తువులని తాకవద్దు. 470 00:44:42,015 --> 00:44:43,517 తన పుస్తకం నీ దగ్గర ఎందుకు ఉంది? 471 00:44:45,644 --> 00:44:48,230 - అది నా దగ్గర ఉందని కూడా నాకు తెలీదు. - అసలు నీ దగ్గర ఎందుకు ఉంది? 472 00:44:51,900 --> 00:44:53,902 మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సిందని చెప్పా కదా… 473 00:44:53,986 --> 00:44:57,030 నా కూతురి పుస్తకం నీ ఇంట్లో ఎందుకు ఉంది? 474 00:44:59,366 --> 00:45:00,617 ఎందుకంటే, తనే దాన్ని ఇక్కడ పెట్టింది. 475 00:45:06,373 --> 00:45:09,042 గాలీ… తను దీన్ని తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏంటి? 476 00:45:09,126 --> 00:45:10,878 నువ్వు తనని ఏమైనా చేశావా? 477 00:45:10,961 --> 00:45:13,922 - నేను తనని ఏం చేయలేదు. - మరి ఎందుకు అబద్ధమాడావు? తనిక్కడికి ఎందుకు వచ్చింది? 478 00:45:14,006 --> 00:45:17,009 నేను తనని ఏమీ చేయలేదు, తనే నన్ను వాడుకుంది. 479 00:45:21,430 --> 00:45:22,890 ఒకప్పుడు మేము ప్రేమించుకున్నాం. 480 00:45:29,730 --> 00:45:34,067 "ప్రేమించుకున్నాం" అంటే? ఎంత కాలం ప్రేమించుకున్నారు? 481 00:45:34,151 --> 00:45:37,196 ఏమో, రెండు-మూడు వారాలో, ఒక నెలో, అంతే. 482 00:45:38,822 --> 00:45:39,990 నాకు… 483 00:45:40,490 --> 00:45:43,535 నాకు తను ఎక్కడుందో తెలీదు, నాకు… నాకు చాలా భయంగా ఉంది. 484 00:45:43,619 --> 00:45:46,205 తను కొంత సమయం ఈ మాస్కోలో గడిపిందని తెలుసు. 485 00:45:46,788 --> 00:45:50,250 ఇంకా తను యూరి గ్లాస్కోవ్ అనే వ్యక్తి దగ్గర పని చేసిందని తెలుసు, 486 00:45:50,334 --> 00:45:53,378 - అతని వల్ల తను సమస్యల్లో చిక్కుకుంది, ఇక నాకు… - తను యూరి గ్లాస్కోవ్ దగ్గర పని చేయలేదు. 487 00:45:53,462 --> 00:45:55,464 - లేదు, తను పని చేసింది. - అది నిజం కాదు. 488 00:45:55,547 --> 00:45:57,049 అంత పక్కాగా ఎలా చెప్పగలుగుతున్నావు? 489 00:45:58,175 --> 00:46:00,344 ఎందుకంటే, యూరి గ్లాస్కోవ్ అంటే ఎవరో కాదు, తనే. 490 00:46:05,182 --> 00:46:06,892 తన అసలైన పేరును తను వాడలేదు కదా, 491 00:46:07,559 --> 00:46:11,396 అందుకని ఓ నకిలీ పేరు పెట్టుకుంది. నా పాట పేరును వాడుకుంది. 492 00:46:14,316 --> 00:46:16,818 మరి దాని గురించి అడిగినప్పుడు అబద్ధం ఎందుకు చెప్పావు? 493 00:46:16,902 --> 00:46:18,779 మిమ్మల్ని సురక్షితంగా ఉంచుదామని. 494 00:46:18,862 --> 00:46:20,155 ఎవరి నుండి? 495 00:46:21,198 --> 00:46:22,616 బిగ్ బాస్ నుండా? 496 00:46:24,701 --> 00:46:27,454 అతనెవరో నీకు తెలుసు. చెప్పు నాకు. 497 00:46:29,790 --> 00:46:31,083 చెప్పు. 498 00:46:31,166 --> 00:46:35,295 తన కారణంగా మీరు సమస్యల్లో చిక్కుకోవడం గాలీకి అస్సలు ఇష్టముండదు. సరేనా? 499 00:46:35,379 --> 00:46:37,214 మీరు తిరిగి ఇజ్రాయెల్ కి వెళ్లిపోతేనే మంచిది. 500 00:46:37,297 --> 00:46:40,175 నాకు… నాకు అతనెవరో తెలియాలి, ఇప్పుడు అదే నాకు ముఖ్యం. 501 00:46:40,259 --> 00:46:42,678 - ఆ బిగ్ బాస్ పేరేంటి? - వద్దు, అది మీకు తెలీకపోవడమే మంచిది, 502 00:46:42,761 --> 00:46:44,847 ఎందుకంటే, దాని వల్ల జనాల కాళ్లూ, చేతులూ ఇలా విరిగిపోతుంటాయి. 503 00:46:44,930 --> 00:46:47,140 గాలీ నిన్ను వాడుకుందని అన్నావు కదా. ఎలా వాడుకుంది? 504 00:46:47,224 --> 00:46:50,394 గాలీకి కావాల్సింది నీ వద్ద ఏముంది? 505 00:46:50,477 --> 00:46:51,645 ఏముంది? 506 00:46:52,271 --> 00:46:54,106 - చెప్పు. - రోమా, తలుపు తెరువు! 507 00:46:54,189 --> 00:46:58,193 చూడు, ఈ వ్యక్తి దగ్గర గాలీ ఉంది. అది నీకు అర్థమవుతోందా? 508 00:46:58,277 --> 00:47:00,153 మాట్లాడవద్దు. 509 00:47:00,237 --> 00:47:01,488 అక్కడ తను ఒంటరిగా ఉంది. 510 00:47:02,364 --> 00:47:04,700 తనకి నేను సాయపడాలి. 511 00:47:04,783 --> 00:47:09,162 కాబట్టి దయచేసి అతనెవరో చెప్పు. 512 00:47:17,629 --> 00:47:20,591 త్వరగా కానివ్వు! తనని నువ్వు తీసుకెళ్లు. 513 00:47:20,674 --> 00:47:23,385 బట్టలేసుకోండి. త్వరగా కానివ్వాలి. తన సామాన్లు కూడా తీసుకురా. 514 00:47:23,468 --> 00:47:26,096 - చలో. పదండి, ఏం మాట్లాడవద్దు. - లేదు. ఆగండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు… 515 00:49:18,625 --> 00:49:20,335 వీళ్లలో అమ్మ ఎవరు? 516 00:49:21,086 --> 00:49:22,462 ఆమె. 517 00:49:36,226 --> 00:49:37,853 నేనెవరో తెలుసా? 518 00:49:40,480 --> 00:49:44,193 నీ కూతురు నా దగ్గర దొంగతనం చేసింది. 519 00:49:44,818 --> 00:49:46,236 తనేం దొంగిలించలేదు. 520 00:49:46,320 --> 00:49:47,946 నోర్మూసుకో. 521 00:49:48,947 --> 00:49:53,076 నీ వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగింది. 522 00:49:53,744 --> 00:49:56,038 "తనేం దొంగిలించలేదు…" 523 00:49:56,538 --> 00:50:01,710 ఇక్కడున్న తన స్నేహితురాలు, ఇజ్రాయెల్ రక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పని చేస్తోంది, 524 00:50:02,920 --> 00:50:04,963 తను ఇక్కడికి అందుకే వచ్చింది. 525 00:50:06,465 --> 00:50:11,178 ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈమె కూతురు దొంగిలించిందేంటో వాళ్లు కనిపెట్టారా, లేదా అని. 526 00:50:11,261 --> 00:50:12,930 ఒక్క నిమిషం, నా మాట వినండి. 527 00:50:13,305 --> 00:50:18,310 ఆ దొంగిలించబడిన వస్తువు కోసం నేను వెతుకుతున్నాను అన్నది నిజమే, 528 00:50:18,393 --> 00:50:22,147 కానీ అది మీదని తెలిశాక, వెతకడం ఆపేశా. 529 00:50:22,231 --> 00:50:23,982 అలాగే నా స్నేహితురాలికి కూడా 530 00:50:24,066 --> 00:50:28,695 అపమని సలహా ఇచ్చా, తను తన కూతురు కోసం వెతుకుతూ ఉంది అంతే. ఇక ఇంతటితో ముగించేస్తాం. 531 00:50:28,779 --> 00:50:31,990 రేపే ఇజ్రాయెల్ కి వెళ్లిపోతున్నాం, 532 00:50:32,074 --> 00:50:35,202 కాబట్టి మమ్మల్ని మా హోటల్ కి వెళ్లనిస్తే, 533 00:50:35,285 --> 00:50:39,039 రేపు వెళ్లిపోతాం, ఇంకెప్పటికీ రాం. 534 00:50:40,165 --> 00:50:41,166 ప్లీజ్. 535 00:50:42,125 --> 00:50:45,003 తనేం చేసినా కానీ, దాన్ని నేను సరి చేయగలను, లేదంటే… 536 00:50:45,087 --> 00:50:48,090 కాబట్టి, దయచేసి… దయచేసి తనెక్కడ ఉందో చెప్పండి. 537 00:50:56,139 --> 00:50:58,517 - అంతా బాగా వెతికారా? - వెతికాం. 538 00:50:59,226 --> 00:51:01,019 వాళ్ల వ్యక్తిగత వస్తువుల్లో వెతికాం, ఒళ్లంతా సోదా చేశాం. 539 00:51:01,103 --> 00:51:03,522 - హోటల్ గదిలో కూడా వెతికారా? - వెతికాం. 540 00:51:04,815 --> 00:51:07,651 ఏమీ దొరకలేదు, కానీ… 541 00:51:09,570 --> 00:51:11,613 గాలీ అమ్మ దగ్గర ఇది దొరికింది. 542 00:51:24,459 --> 00:51:25,460 వోజిక్ ఇగ్నాసీ 543 00:51:25,544 --> 00:51:26,962 ఇతనెవరో తెలుసా నీకు? 544 00:51:29,131 --> 00:51:30,132 తెలీదు. 545 00:51:35,888 --> 00:51:37,514 ఆమెని ఏం చేయవద్దు! 546 00:51:37,848 --> 00:51:40,142 తనకి ఏ పాపమూ తెలీదు! 547 00:51:40,225 --> 00:51:42,728 అసలు గాలీ మాస్కోకి వచ్చినట్టు కూడా తనకి తెలీదు. 548 00:51:42,811 --> 00:51:46,523 అబద్ధం చెప్పకు. ఇతని పాస్ పార్ట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది మరి? 549 00:51:46,607 --> 00:51:48,400 నేను అతడిని కలవనే లేదు. అస్సలు కలవలేదు. 550 00:51:48,483 --> 00:51:51,987 అది… అది నా కూతురి వస్తువుల్లో దొరికింది, అంతే. 551 00:51:52,070 --> 00:51:54,990 అతను చనిపోయాడనుకుంటా. మీకేం కావాలంటే, అది చేస్తా నేను. 552 00:51:55,073 --> 00:51:57,201 నాకు నా కూతురు కావాలి, అంతే. 553 00:51:59,328 --> 00:52:00,662 నీ కూతురు చనిపోయింది. 554 00:52:03,832 --> 00:52:05,167 తిరిగి ఇజ్రాయెల్ కి వెళ్లిపో. 555 00:52:15,177 --> 00:52:16,595 ఓర్నా చనిపోలేదు. 556 00:52:19,681 --> 00:52:20,807 అతను అబద్ధం చెప్తున్నాడు. 557 00:52:34,363 --> 00:52:38,200 నోరు మూసుకో. లేదంటే నీ ఇంకో చేయి కూడా విరగ్గొడతా. 558 00:52:42,871 --> 00:52:45,832 వీళ్లని విమానాశ్రయానికి తీసుకెళ్లు. వీడి చావు వీడు చస్తాడులే. 559 00:52:45,916 --> 00:52:49,002 తను చనిపోలేదు. అతను చెప్పేది అబద్ధం. 560 00:52:56,802 --> 00:52:58,136 నీ కూతురు చనిపోయింది. 561 00:52:58,804 --> 00:53:01,139 మేము తనని జైలు నుండి విడిపించాం. 562 00:53:01,932 --> 00:53:04,393 అడవిలోకి తీసుకెళ్లి తనని నేను తుపాకీతో కాల్చేశా. సరేనా? 563 00:53:05,143 --> 00:53:06,520 తను బాధ, నొప్పి వంటివేవీ లేకుండా చనిపోయింది. 564 00:53:06,603 --> 00:53:08,063 ఓర్నా, అది నిజం కాదు. 565 00:53:08,146 --> 00:53:11,275 ఇక చాలు, రోమన్! పిచ్చోడిలా ప్రవర్తించకు! 566 00:53:15,487 --> 00:53:16,572 ఇంకొక్క… 567 00:53:17,739 --> 00:53:19,324 మాట మాట్లాడినా చస్తావు. 568 00:53:19,408 --> 00:53:20,450 తను చావలేదు. 569 00:53:22,578 --> 00:53:25,998 గాలీ చావలేదు. అతను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. 570 00:53:26,790 --> 00:53:29,418 తనని ఎవరికీ చూపించడు. 571 00:53:31,003 --> 00:53:32,629 అంతే కదా, నాన్నా? 572 00:54:58,966 --> 00:55:00,968 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్