1 00:00:11,470 --> 00:00:12,513 ఇది కల్పిత గాథ. 2 00:00:12,596 --> 00:00:14,515 ఏ వ్యక్తినైనా పోలి ఉంటే, అది బతికున్న వారినైనా, మరణించిన వారినైనా సరే, 3 00:00:14,598 --> 00:00:16,433 లేదా అసలైన సంఘటనలను, లేదా ప్రాంతాలను పోలి ఉంటే, అది కాకతాళీయమే. 4 00:00:22,356 --> 00:00:23,857 ఇక గాలీ లెవీ విషయానికి వద్దాం, 5 00:00:23,941 --> 00:00:28,570 ఆ యువతిని రష్యాలో బంధించి ఉంచి రెండు నెలలకు పైనే అయింది. 6 00:00:28,654 --> 00:00:30,489 కాసేపటి క్రితం, మేము ఓర్నా లెవీతో మాట్లాడాం, 7 00:00:30,572 --> 00:00:34,284 తన కూతురిని విడిపించడానికి జరుగుతున్న దౌత్య ప్రయత్నాల్లో 8 00:00:34,368 --> 00:00:36,662 ఏమైనా పురోగతి ఉందా, అస్సలేం లేదా అని తెలుసుకోవడానికి. 9 00:00:36,745 --> 00:00:38,914 ఓర్నా లెవీ, గుడ్ ఈవినింగ్. 10 00:00:39,456 --> 00:00:42,543 - గుడ్ ఈవినింగ్, సివాన్. - "గుడ్ ఈవినింగ్, సివాన్..." 11 00:00:48,006 --> 00:00:50,133 గాలీ ఒంటరి కాదు 12 00:00:55,305 --> 00:00:57,140 వామ్మోయ్, చూసుకోవమ్మా! 13 00:00:57,224 --> 00:00:59,726 - సారీ, సారీ... - చూసుకుని నడపవమ్మా! 14 00:02:06,543 --> 00:02:11,632 హాయ్, నేను యాకిర్ అనే వ్యక్తి కోసం వచ్చాను. 15 00:02:11,965 --> 00:02:13,217 అతను ఇక్కడే పని చేస్తుంటాడా? 16 00:02:13,425 --> 00:02:15,594 - అక్కడ ఉన్నాడు. - థ్యాంక్స్. 17 00:02:15,677 --> 00:02:19,306 ఇక్కడ ఉండేది ఎఫీ, మోజీ, బొవాజ్... 18 00:02:19,973 --> 00:02:22,184 - ఇతని పేరు మర్చిపోయా... - దూదీ. 19 00:02:22,851 --> 00:02:24,019 అవును, దూదీ. 20 00:02:24,937 --> 00:02:27,231 గాలీ నిఘా శాఖలో పని చేసిందని తెలుసు, కానీ... 21 00:02:27,314 --> 00:02:30,817 కానీ ఎక్కడో నాకు తెలీదు... అంటే, అవన్నీ రహస్యమని నాకు తెలుసు... 22 00:02:31,360 --> 00:02:33,111 మీరు నాకు అవన్నీ చెప్పకూడదేమో... 23 00:02:33,403 --> 00:02:36,114 తొక్కలే. వాళ్లు నాశనమైపోయినా నాకేం పర్వాలేదు. 24 00:02:36,406 --> 00:02:40,452 అది స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్. సైబర్, టెక్నికల్, ఇంకా ఆపరేషనల్. 25 00:02:40,536 --> 00:02:45,457 వీళ్లందరూ ఒకే యూనిట్ కి చెందిన వాళ్లా? 26 00:02:45,541 --> 00:02:48,544 అవునని చెప్పవచ్చు, కాదని కూడా చెప్పవచ్చు. గాలీ, నేను 'పసలేని' పనులు చేసేవాళ్లం, 27 00:02:48,627 --> 00:02:50,671 అంటే తెరవెనుక, ఏసీ ఉన్న గదుల్లో కూర్చొని అన్నమాట. 28 00:02:50,754 --> 00:02:53,799 వీళ్లు 'అసలైన' పనులు, అంటే క్షేత్రస్థాయి పనులు చూసుకునేవాళ్లు. 29 00:02:54,132 --> 00:02:55,801 ఈ నలుగురూ రిజర్వ్ ఫోర్సులో పని చేస్తున్నారు. 30 00:02:55,884 --> 00:02:57,928 వీళ్లలో ఎవరితో అయినా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారా? 31 00:02:58,220 --> 00:03:04,184 గాలీ స్నేహితులతో కలిసి ఒక క్యాంపెయిన్ వీడియో చేస్తున్నాం, అందులో అందరూ కలిసి 32 00:03:04,268 --> 00:03:07,896 - "గాలీని స్వస్థలానికి తీసుకువద్దాం," అని అంటారు. - వీళ్లు అంత మంచివాళ్లు కాదు. 33 00:03:09,523 --> 00:03:13,610 - "మంచివాళ్లు" కాదు అంటే? - సెంటిమెంటల్ వీడియోలు చేయగల రకం కాదు. 34 00:03:15,320 --> 00:03:18,532 హదాస్ మీకు చెప్పారో లేదో తెలీదు, కానీ గాలీ అక్కడ ఒక ఏడాది పని చేసినప్పుడు, 35 00:03:18,615 --> 00:03:19,700 నేనే తన కమాండరుని. 36 00:03:19,783 --> 00:03:22,327 - మూడేళ్లు పని చేసింది. - లేదు. 37 00:03:22,411 --> 00:03:24,204 రెండేళ్లు యాక్టివ్ డ్యూటీ, ఒక సంవత్సరం కాంట్రాక్ట్. 38 00:03:24,496 --> 00:03:27,749 లేదు. తనని యాక్టివ్ డ్యూటీలో ఉన్నప్పుడే తొలగించేశారు. 39 00:03:27,833 --> 00:03:28,750 మీకు తను చెప్పలేదా? 40 00:03:29,376 --> 00:03:31,211 మీరు గాలీ గురించేనా మాట్లాడేది? 41 00:03:31,461 --> 00:03:35,632 ముందు తనకి మామూలు పనులు అప్పగించారు, ఆ తర్వాత తను బయటకు వచ్చేసింది. 42 00:03:36,800 --> 00:03:39,136 - ఎందుకు? ఏం చేసింది తను? - ఎక్స్ క్యూజ్ మీ... 43 00:03:39,219 --> 00:03:40,804 కూర్చోండి, చెప్తాను. 44 00:03:41,221 --> 00:03:45,184 ప్రతీ కొన్ని నెలలకు ఓసారి, యూనిట్ ఒక జాయింట్ ఆపరేషనులో పాల్గొంటుంది. 45 00:03:46,185 --> 00:03:48,854 చాలా ఏళ్ల నుండి ఒకే రొటీనుగా సాగేది అది. 46 00:03:48,937 --> 00:03:51,899 సైన్యం, కదా? అందరూ ఆటోపైలట్లో పెట్టేసేవాళ్లు. 47 00:03:52,149 --> 00:03:55,819 అప్పుడు గాలీ వచ్చి, అంతా చూసి, ఇలా అడిగేది: 48 00:03:55,903 --> 00:03:59,406 "హేయ్, ఎయిర్ సపోర్ట్, ఆ మార్గం ఎందుకు?" 49 00:04:00,407 --> 00:04:01,325 "ఆ సమయంలో ఎందుకు?" 50 00:04:01,408 --> 00:04:05,579 దానికి మేము "అది ఎప్పుడూ జరిగేదే, ఇంధనం ఆదా చేయడానికి, సరిగ్గా కనిపించడానికి," అని వివరించేవాళ్లం. 51 00:04:05,662 --> 00:04:08,790 దానికి తను "సరే," అని చెప్పి, యూనిట్ మీటియరాలజిస్టుకు కాల్ చేసి, 52 00:04:08,874 --> 00:04:10,584 మాట్లాడి వచ్చి, ఇలా అనేది: 53 00:04:10,918 --> 00:04:16,423 "ఆ సమయంలో గాలి కూడా మార్గం దిశలోనే వీస్తుంది, కాబట్టి ఇంధనం ఆదా అయి, సురక్షితంగా ప్రయాణించవచ్చు." 54 00:04:16,632 --> 00:04:19,551 "అది ప్రార్థనా సమయం కాబట్టి, మనల్ని గమనించేవాళ్లు తక్కువ మంది ఉంటారు." 55 00:04:21,094 --> 00:04:24,515 ఇరవై ఏళ్లుగా ఒకే విధంగా సాగుతూ ఉండింది, గాలీ వచ్చేసి, అంతా మార్చేసింది! 56 00:04:24,598 --> 00:04:27,142 ఇక మాయలా, అన్నీ ఓకే అయి, విజయవంతమవుతాయి. 57 00:04:27,226 --> 00:04:31,480 కానీ, ఆ ప్లానుపై మా కమాండర్ తన పేరును వేసేసుకొని, 58 00:04:31,563 --> 00:04:33,148 క్రెడిట్ అంతా దొబ్బేస్తాడు. 59 00:04:34,066 --> 00:04:36,985 ఇక గాలీకి... మండుతుంది. 60 00:04:37,069 --> 00:04:41,156 అదే విషయాన్ని యూనిట్ కమాండర్ ని అడుగుతుంది, ఇక ధిక్కారం కింద తనని తొలగించేస్తారు. 61 00:04:42,324 --> 00:04:44,910 చూడండి, తను అప్పుడు నాకు చాలా ముఖ్యమైనది. 62 00:04:44,993 --> 00:04:48,497 తను మోజ్ దగ్గర పని చేయడం మొదలుపెట్టిందని తెలిశాక, నేను తనకి కాల్ చేసి మాట్లాడా. అదే ఆఖరిసారి మాట్లాడటం తనతో. 63 00:04:48,580 --> 00:04:51,959 అలాంటి వాళ్లతో పని చేయడం మంచిది కాదని తనని హెచ్చరించా. 64 00:04:52,334 --> 00:04:56,129 - ఎవరి దగ్గర పని చేయడం మొదలుపెట్టిందని అన్నారు? - మోజ్ అటర్. 65 00:04:56,213 --> 00:04:59,716 అతను లెఫ్టినెంట్ కల్నల్, అతను కూడా యూనిట్ నుండి తొలగించబడిన వ్యక్తే. 66 00:04:59,800 --> 00:05:01,301 ఎందుకు తొలగించారు అతడిని? 67 00:05:01,677 --> 00:05:06,890 యూనిట్ వనరులని ఉపయోగించి 68 00:05:06,974 --> 00:05:10,561 సరిహద్దు వెంబడి డ్రగ్స్ స్మగ్లింగ్ కి పాల్పడేవాడని పుకారు. మీకు అర్థమవుతోందా? 69 00:05:10,644 --> 00:05:14,356 ఆమె, అతని దగ్గర పని చేసింది. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 70 00:05:15,023 --> 00:05:16,984 - అది నిజం కాదు. - నిజమే అది. 71 00:05:17,067 --> 00:05:19,987 యాభై ఏళ్ల మగాడికి, 20 ఏళ్ల అమ్మాయితో పనేంటి? 72 00:05:20,195 --> 00:05:25,284 నేను అదే అన్నాను తనతో, కానీ తను... తను అది సరిగ్గా తీసుకోలేదు. 73 00:05:25,367 --> 00:05:28,704 నన్ను తనని వేధిస్తున్న వెధవలా చూసింది. 74 00:05:30,414 --> 00:05:34,793 ఇప్పుడు చూడండి తనకు ఏ గతి పట్టిందో. ఇదేమీ కాకతాళీయం కాదు, కదా? 75 00:05:34,877 --> 00:05:36,962 వీళ్లని కనిపెట్టడంలో సాయపడగలరా? 76 00:05:37,045 --> 00:05:40,883 వీళ్ల ఫోన్ నంబర్లు దొరికాయి, లెక్కలేనన్ని సార్లు కాల్ చేశా, వీళ్ల ఇళ్లకు వెళ్లా, 77 00:05:40,966 --> 00:05:44,094 వీళ్ల కుటుంబాలతో మాట్లాడా కూడా, కానీ వీళ్ల జాడ మాత్రం తెలీట్లేదు. 78 00:05:44,178 --> 00:05:46,180 ఎవరు, ఎక్కడ... అసలు ఎక్కడ మొదలుపెట్టాలో కూడా నాకు తెలీట్లేదు. 79 00:05:46,471 --> 00:05:50,309 ఈ మోజ్ గురించి తెలిసినవాళ్లు ఎవరోకరు ఉండుంటారు కదా. 80 00:05:50,392 --> 00:05:53,729 లేదు, ఎవరికీ తెలీదు. అసలు అతను బయటపడ్డాడో లేదో కూడా తెలీదు నాకు. 81 00:05:54,146 --> 00:05:58,275 - ఎక్కడి నుండి? సైన్యం నుండా? - కాదు, సైన్యం నుండి కాదు. 82 00:05:58,358 --> 00:05:59,985 జైలు నుండి. 83 00:06:03,572 --> 00:06:06,867 జెరూసలేం స్టూడియోస్ 84 00:06:06,950 --> 00:06:11,246 కాబట్టి, వెబ్ సైట్లో డొనేట్ చేసే వాళ్లకి నేను మళ్లీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా, 85 00:06:11,330 --> 00:06:15,709 ఎవరికి సాయం చేయాలని అనిపించినా, డొనేట్ చేస్తూ ఉండవచ్చు, 86 00:06:16,084 --> 00:06:18,086 ఇంకా, ప్రధాన మంత్రికి, 87 00:06:18,170 --> 00:06:21,131 విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చిత్తశుద్ధిగా పని చేసే వాళ్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, 88 00:06:21,215 --> 00:06:22,716 నేనేమీ దేన్నీ లైట్ గా తీసుకోవట్లేదు. 89 00:06:22,799 --> 00:06:26,345 - ఓర్నా, మీకు మా మద్దతు ఉంది. - అందులో సందేహమే లేదు. 90 00:06:26,553 --> 00:06:29,389 - మేము ఒక ప్రకటన తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తాం. - ఇక... కట్! 91 00:06:30,557 --> 00:06:32,392 - థ్యాంక్యూ, రెవితాల్. - థ్యాంక్యూ. 92 00:06:32,476 --> 00:06:33,977 - థ్యాంక్యూ, ఒదెద్. - ఏం పర్వాలేదు. 93 00:06:34,061 --> 00:06:36,063 గాలీ త్వరలోనే ఇంటికి తిరిగి వస్తుందని ఆశిస్తున్నాం. 94 00:06:36,146 --> 00:06:37,523 - నా కోరిక కూడా అదే. - థ్యాంక్యూ. 95 00:06:39,525 --> 00:06:41,401 - బై, మళ్లీ కలుద్దాం. - బై, మళ్లీ కలుద్దాం. 96 00:06:41,485 --> 00:06:43,070 - ఎంత గొప్ప మహిళో... - వావ్. 97 00:06:43,153 --> 00:06:44,821 - ఎలా అనిపించింది? - బాగుంది. 98 00:06:45,864 --> 00:06:49,785 నేను పిచ్చిదాన్ని అనిపిస్తోంది. ఎందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి థ్యాంక్స్ చెప్పడం? 99 00:06:49,868 --> 00:06:52,371 గాలీ పరదేశంలో ఉంది, వాళ్లేం చేయట్లేదు, అది నాకు అస్సలు నచ్చట్లేదు. 100 00:06:52,454 --> 00:06:54,998 - నాకు దోపిడీలా అనిపిస్తోంది. - అదే ఇది. 101 00:06:55,082 --> 00:06:58,210 - ఏమైనా పురోగతి ఉందా? - పోయిన వారానికి, ఇప్పటికీ ఏ తేడా లేదు. 102 00:06:58,293 --> 00:07:00,671 విదేశీ వ్యవహారాల శాఖ వారు, ఆశావాదంగా ఉన్నారని చెప్పి, మాయమైపోయారు. 103 00:07:00,754 --> 00:07:01,964 అవునా? 104 00:07:02,631 --> 00:07:03,632 ఏంటి? 105 00:07:03,715 --> 00:07:07,219 వాళ్లు త్వరపడాలి, ఈ క్యాంపెయిన్ కలకాలం సాగదు కదా. 106 00:07:07,719 --> 00:07:11,807 - మరి మనం ఇప్పుడేం చేయాలి? - మనకి మరిన్ని డబ్బులు కావాలి. 107 00:07:12,391 --> 00:07:14,643 డబ్బు అనేది సౌండ్ లాంటిది. అది ఎక్కువ ఉంటే, 108 00:07:14,726 --> 00:07:17,187 విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సహా ఎవరికీ నిద్రపట్టదు. 109 00:07:17,396 --> 00:07:18,313 సరే. 110 00:07:18,397 --> 00:07:20,440 - సరే. డబ్బులు ఏమైనా ఉన్నాయా? - లేవు. 111 00:07:21,358 --> 00:07:24,278 బాగా ఖరీదైన పబ్లిక్ రిలేషన్లకే ఖర్చైపోయాయి. 112 00:07:24,361 --> 00:07:26,738 - ఒకటి గుర్తు చేస్తున్నా... - గాలీ తిరిగి రావాలని కోరుకుంటున్నా. 113 00:07:26,947 --> 00:07:32,077 ...సున్నితంగానే అనుకో, నువ్వు నీ భర్త తరఫు కుటుంబంతో మాట్లాడతా అన్నావు కదా. 114 00:07:33,620 --> 00:07:35,956 ఆ విషయంలో పురోగతి ఏంటి? 115 00:07:37,332 --> 00:07:38,500 దాన్ని మర్చిపోలే. 116 00:07:39,459 --> 00:07:40,878 లిఫ్ట్ ఇవ్వనా? 117 00:07:40,961 --> 00:07:42,546 లేదు, నేను కార్లో వచ్చా. 118 00:07:42,629 --> 00:07:43,797 అది కొత్తదా? 119 00:07:44,131 --> 00:07:46,216 లేదు, నా దగ్గర ఎప్పట్నుంచో లైసెన్స్ ఉంది, కానీ ఎప్పుడూ నడపలేదు. 120 00:07:46,466 --> 00:07:47,509 ఎందుకని? 121 00:07:48,969 --> 00:07:50,804 - కారేసుకుని ఎక్కడికని వెళ్లను? - సరే. 122 00:07:51,471 --> 00:07:52,556 - బై. - బై. 123 00:08:11,867 --> 00:08:16,371 మోజ్ అటర్ 124 00:08:21,960 --> 00:08:23,795 కానీ తను నాతో అబద్ధమాడింది అని అర్థమవుతోందా? 125 00:08:23,879 --> 00:08:26,840 ఒక ఏడాది పాటు ఉదయాన్నే లేచి, అమాయకంగా సైనిక యూనిఫామ్ వేసుకుని, 126 00:08:26,924 --> 00:08:28,592 ఆ డ్రగ్స్ డీలర్ దగ్గరికి వెళ్లి, 127 00:08:28,675 --> 00:08:32,554 ఏయే చెత్త పనులు చేసిందే ఏమో. అదే నాకు అర్థం కావట్లేదు అసలు. 128 00:08:34,472 --> 00:08:37,142 తను ఇరవై ఏళ్ల పసి పిల్ల, నువ్వు నిరాశపడతావని భయపడిందేమో, అంతే. 129 00:08:38,393 --> 00:08:39,394 కావచ్చు. 130 00:08:39,477 --> 00:08:42,188 - తను ఇక్కడే పని చేస్తుందా? - ఇక్కడే అని చెప్పారు. 131 00:08:48,153 --> 00:08:51,406 దాన్ని లాక్ చేసి మంచి పని చేస్తున్నావు, లేదంటే దానిలో ఉన్న డబ్బుల బస్తాలని ఎవరైనా లేపేస్తారు. 132 00:08:54,159 --> 00:08:57,412 ఇతగాడు తన చేత స్మగ్లింగ్ చేయించి ఉంటాడని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? 133 00:08:57,496 --> 00:09:00,249 "ఇతగాడు," "అతగాడు" అని అనకు. ఆయన పెద్ద వాడు, నీకన్నా పెద్ద వాడు. 134 00:09:00,332 --> 00:09:02,584 ఎక్స్ క్యూజ్ మీ, రెవితాల్ ఎక్కడ ఉంటారు? 135 00:09:02,668 --> 00:09:04,169 - అక్కడ. - థ్యాంక్స్. 136 00:09:04,253 --> 00:09:06,880 వెళ్లే ముందు ఈ క్రేట్ ని ఇక్కడి నుండి తీసుకెళ్లాలి... 137 00:09:07,464 --> 00:09:09,508 మర్చిపోకుండా మాషా చేత సంతకం చేయించు. 138 00:09:13,011 --> 00:09:14,972 మేము ప్రైవేట్ కస్టమర్లకు అమ్మం. 139 00:09:15,055 --> 00:09:19,184 - నిర్, అదయ్యాక వీటిని కూడా తీసుకెళ్లగలవా? - ఏం అమ్మరు మీరు మాకు? 140 00:09:20,811 --> 00:09:25,190 మీకు అమ్మనివి ఏంటంటే... ఆఫీసు కుర్చీలు, ఆఫీసు డెస్కులు, 141 00:09:25,440 --> 00:09:27,985 ఆఫీసు క్యాబినెట్లు... ఇంకా చెప్పమంటారా? 142 00:09:28,610 --> 00:09:31,989 మీ పేరు రెవితాల్, కదా? సారీ, నా పేరు ఓర్నా, 143 00:09:32,072 --> 00:09:36,285 మీకు చాలాసార్లు కాల్ చేశా, కొన్ని మెసేజీలను కూడా పంపా. 144 00:09:37,202 --> 00:09:39,538 మోజ్ కోసం వెతుకుతున్నారు కదా. అతను మీకు కూడా బాకీ ఉన్నాడా? 145 00:09:39,872 --> 00:09:45,544 లేదు, అతను జైలు నుండి విడుదలయ్యాడని తెలిసింది, 146 00:09:45,627 --> 00:09:50,257 కాబట్టి, నా కూతురి గురించి ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా, కాబట్టి... 147 00:09:51,133 --> 00:09:53,927 మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. మీ కూతురే కదా రష్యాలో జైల్లో ఉంది. 148 00:09:54,845 --> 00:09:55,804 తనకి, మోజ్ కి సంబంధం ఏంటి? 149 00:09:57,181 --> 00:10:00,017 ఏంటి? ఏమీ లేదు, సంబంధమేమీ లేదు. 150 00:10:00,100 --> 00:10:04,229 వాళ్లు... వాళ్లిద్దరూ ఒకప్పుడు సహచరులు అన్నమాట. ఒకే సైనిక యూనిట్లో పని చేశారు. 151 00:10:04,897 --> 00:10:08,442 కానీ అంతకుమించీ ఏ సంబంధమూ ఉండకపోవచ్చు. 152 00:10:08,901 --> 00:10:10,402 ఏమీ ఉన్నట్టు లేదులెండి. 153 00:10:11,820 --> 00:10:13,780 మీరు? మీరు ఆమెకి తండ్రా? 154 00:10:14,323 --> 00:10:17,409 లేదు, నేను మొగుడు నుండి విడిపోయిన మహిళల నంబర్లను ట్రాక్ చేస్తూ ఉంటా. 155 00:10:20,037 --> 00:10:22,706 క్షమించాలి, అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు, 156 00:10:22,789 --> 00:10:25,334 నిజం చెప్పాలంటే, అతనికి దూరంగా ఉండాలనుకుంటా నేను. 157 00:10:26,126 --> 00:10:28,212 నిర్, దాన్ని ఇప్పుడే కదా బయటకు తీసింది? మళ్లీ అప్పుడే ఎలా లోడ్ చేస్తున్నావు? 158 00:10:28,295 --> 00:10:30,380 - బయటకు తీయవయ్యా! - సరే, సరే... 159 00:10:30,881 --> 00:10:32,549 నాకేం అనిపిస్తోందో చెప్పనా? 160 00:10:33,717 --> 00:10:36,011 అతను ఎక్కడ ఉన్నాడో మీకు బాగా తెలుసు అనిపిస్తోంది. 161 00:10:36,970 --> 00:10:39,598 అతను అంత తొందరగా జైలు బయటకు ఎలా రాగలిగాడో తెలుసా? 162 00:10:39,681 --> 00:10:43,185 - అతనితో నేను మాట్లాడలేదని చెప్పా కదా. - తన పార్టనర్ల వివరాలు చెప్పేశాడు. 163 00:10:43,519 --> 00:10:46,063 ఇప్పుడు అతను దాక్కుని బతుకుతున్నాడు, దానికి కారణం కూడా ఉంది. 164 00:10:46,522 --> 00:10:49,316 అతని గురించి అడగడానికి మొదట వచ్చింది మేమే కావచ్చు, 165 00:10:49,650 --> 00:10:52,194 కానీ మేమే ఆఖరి వాళ్లం మాత్రం కాము. 166 00:10:52,694 --> 00:10:54,363 కాబట్టి, మీరు అతనితో మమ్మల్ని మాట్లాడనిస్తే, మీకే మంచిది, 167 00:10:54,821 --> 00:10:57,783 లేదంటే తర్వాత వచ్చే వాళ్లతో మీరు డీల్ చేయాల్సి ఉంటుంది, 168 00:10:57,866 --> 00:11:01,119 కానీ గుర్తుంచుకోండి, వాళ్లు మా అంత మర్యాదగా మాట్లాడరు. 169 00:11:05,415 --> 00:11:09,461 మీరెవరో నాకు తెలీదు, నన్ను బెదిరించే ధైర్యం మీకెలా వచ్చిందో కూడా తెలీదు, 170 00:11:09,837 --> 00:11:12,798 కానీ నాకు దూరంగా జరగండి, లేదంటే మావాళ్లని పిలవాల్సి ఉంటుంది. 171 00:11:28,021 --> 00:11:29,439 సరే మరి, ఇక పని కానివ్వండి. 172 00:11:29,523 --> 00:11:33,610 - అతను తన భాగస్వాముల గురించి నిజంగానే చెప్పేశాడా? - నాకు తెలీదు, 173 00:11:33,694 --> 00:11:36,780 కానీ అతనెక్కడ ఉన్నాడో ఈమెకి తెలిస్తే, అది కూడా మనకి త్వరలోనే తెలిసిపోతుందిలే. 174 00:11:36,864 --> 00:11:37,781 ఎందుకు? 175 00:11:38,407 --> 00:11:41,952 ఎందుకంటే, అతనెక్కడ ఉన్నాడో ఆమెకి తెలిస్తే, అతనికి చెప్పి హెచ్చరిస్తుంది, 176 00:11:42,035 --> 00:11:44,371 ఆమె అతనికి కాల్ చేయగానే, అతను ఎక్కడ ఉండేది మనకి తెలిసిపోతుంది. 177 00:11:44,872 --> 00:11:45,706 ఎలా? 178 00:11:46,206 --> 00:11:49,585 యూనిట్లో పని చేసే నా మిత్రుడికి, ఈమె ఫోన్ నంబరును ట్రాక్ చేయమని చెప్పా, అంతే. 179 00:11:52,671 --> 00:11:54,131 వావ్... 180 00:11:57,176 --> 00:11:58,177 హలో? 181 00:11:58,260 --> 00:12:01,013 నీ కూతురిని ప్రాణాలతో చూడాలనుకుంటున్నావా? 182 00:12:01,805 --> 00:12:05,142 - ఎవరు మీరు? - నోర్మూసుకుని, చెప్పింది చేయ్. 183 00:12:05,726 --> 00:12:11,440 రెండు లక్షల డాలర్లను 24 గంటల్లో ఇవ్వాలి. 184 00:12:11,523 --> 00:12:15,152 సరే, సరే, ఆగండి, నా... 185 00:12:15,235 --> 00:12:18,530 నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ ఎలాగోలా సర్దుబాటు చేస్తా, సరేనా? 186 00:12:18,614 --> 00:12:21,617 ఆగు! నీకు బరువు తగ్గిస్తాం. 187 00:12:21,700 --> 00:12:24,161 లక్ష అమెరికన్ డాలర్లు ఇవ్వు, 188 00:12:24,244 --> 00:12:27,497 లేదా కొందరిని తనున్న జైలుకు పంపి, తన సంగతి చూసుకోమని చెప్తాం. 189 00:12:27,581 --> 00:12:29,458 వద్దు, వద్దు, దయచేసి అలా చేయవద్దు, 190 00:12:29,541 --> 00:12:32,794 - నేను డబ్బులు సర్దుబాటు చేస్తా. - సరే. సరే. 191 00:12:32,878 --> 00:12:36,048 ఇదే మా ఆఖరి అఫర్. అర్థమవుతోందా? 192 00:12:37,466 --> 00:12:39,718 రెండు షెకెల్స్ ఇవ్వాలి, నీకు రసీదు ఇవ్వం, సరేనా? 193 00:12:39,801 --> 00:12:42,221 మాకు లంచంగా ఇవ్వాలి, ఎవరికీ తెలియాల్సిన పని లేదు. 194 00:12:43,180 --> 00:12:45,432 ఆగు. ఓహ్... ఒక నిమిషం. 195 00:12:46,600 --> 00:12:50,437 ఒకటి చెప్పనా? నువ్వు మంచి కస్టమరువి కాబట్టి, నేను నీకు ఏ ఆఫర్ ఇస్తానో చెప్తా, ఆగు. 196 00:12:50,521 --> 00:12:53,315 పాతిక వేల డాలర్లు ఇస్తే, నీకు... 197 00:12:57,486 --> 00:12:58,737 ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయా? 198 00:13:01,198 --> 00:13:03,575 ఇప్పుడు టీవీలో కూడా పడ్డా కదా, ఎక్కువయ్యాయి. 199 00:13:04,535 --> 00:13:05,661 మరి ఎత్తడం దేనికి? 200 00:13:11,416 --> 00:13:13,502 గాలీ కాల్ చేస్తుందేమో అని. 201 00:13:39,570 --> 00:13:43,615 మేయర్ కోసం యోసి లెవీకి ఓటేయండి! 202 00:13:44,032 --> 00:13:45,742 బాబోయ్. 203 00:13:45,826 --> 00:13:47,578 అబ్బా. 204 00:13:59,715 --> 00:14:02,176 బెన్నీ, అతని కోసం ఎంత మంచి టోపీలు చేయించామో చూడు. 205 00:14:02,259 --> 00:14:06,430 వచ్చావా? ఇంకా రాలేదేంటి అని కంగారు పడుతూ ఉన్నాం, కదా? 206 00:14:06,805 --> 00:14:10,142 మళ్లీ మీ వదిన వస్తే, నేను మానేస్తా. 207 00:14:11,143 --> 00:14:14,521 మేము ఇక్కడ బయట కూర్చున్నాం. ఈరోజు బయటకే రాలేదని బెన్నీ అన్నాడు. 208 00:14:14,605 --> 00:14:15,522 హా... 209 00:14:15,606 --> 00:14:20,402 చూడు... తనలో దాగున్న రాజకీయ నాయకురాలు ఎట్టకేలకు బయటకు వచ్చింది, కలుగులో నుండి. 210 00:14:20,485 --> 00:14:23,197 హా, ఇదే సరైన సమయం అనిపించింది. 211 00:14:23,447 --> 00:14:26,283 "ఎప్పుడు రాజకీయాల్లోకి వెళ్తారు?" అని అందరూ అడుగుతున్నారు. 212 00:14:26,366 --> 00:14:28,577 మీ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. 213 00:14:28,660 --> 00:14:32,164 చిన్నప్పడు నాకు ఇంకా గుర్తుంది, అతను మా అమ్మానాన్నలకి పిచ్చెక్కించేవాడు. 214 00:14:32,372 --> 00:14:34,291 మా అందరికీ డీల్స్ సెట్ చేస్తూ ఉండేవాడు. 215 00:14:34,374 --> 00:14:38,295 సారీ, ఆలస్యమైంది, ఇవాళ చాలా హడావిడిగా ఉంది. 216 00:14:38,587 --> 00:14:41,006 ఆ తర్వాత, లెబానన్లో అతని బండి మందుపాతరకి తగిలింది. 217 00:14:45,052 --> 00:14:46,762 అక్కడికక్కడే చనిపోయాడు. చాలా దారుణం. 218 00:14:50,599 --> 00:14:53,519 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒక ఫంక్షన్ నిర్వహిస్తున్నాం, 219 00:14:53,602 --> 00:14:55,938 నువ్వు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. 220 00:14:56,230 --> 00:14:59,274 మనందరం కలిసి చాలా కాలమైంది. 221 00:14:59,358 --> 00:15:03,904 మనందరం కలిసి గడిపిన క్షణాలను మిస్ అవుతున్నాం. బెన్నీ కూడా మిస్ అవుతున్నాడు, కదా? 222 00:15:04,488 --> 00:15:06,782 - కదా, బెన్నీ? - అవును. 223 00:15:07,366 --> 00:15:11,411 బెన్చుక్, పైనున్న కుళాయి సరిగ్గా పని చేయట్లేదు, దాని సంగతి కాస్త చూస్తావా? 224 00:15:12,913 --> 00:15:15,249 అది నాకు అర్థం కావట్లేదు. 225 00:15:15,499 --> 00:15:18,001 ఇతనికి కూడా కొంచెం నీళ్లు ఇవ్వు, సరేనా? 226 00:15:18,085 --> 00:15:21,380 ఆ కుళాయికే నువ్వు అర్థం అయి ఉండవు. 227 00:15:25,008 --> 00:15:28,262 టమారా... నిజం ఏంటంటే... 228 00:15:28,887 --> 00:15:30,514 నీ ఈవెంట్ విషయానికి వస్తే, 229 00:15:30,597 --> 00:15:33,141 బెన్నీకి నిన్న రాత్రి జ్వరం వచ్చింది, 230 00:15:33,225 --> 00:15:35,519 అందుకే ఇవాళ అతను బయటకు రాలేదు. 231 00:15:36,019 --> 00:15:38,063 అది ఓకేలే, అయితే నువ్వు రా. 232 00:15:39,022 --> 00:15:42,526 నువ్వు ఒక్కదానివే రా. అది యోసికి, నాకు, అందరికీ ముఖ్యమైనది. 233 00:15:43,026 --> 00:15:45,529 రావడం మేలే అవుతుంది, మరీ ముఖ్యంగా ఇప్పుడు. 234 00:15:45,612 --> 00:15:48,365 - కలిసి ఉంటే కలదు బలం, కదా? - అవును. 235 00:15:50,075 --> 00:15:52,119 నిజం ఏంటంటే... 236 00:15:53,871 --> 00:15:57,416 ఒక విషయంలో సాయం కోసం నీకు కాల్ చేశా. 237 00:15:57,499 --> 00:15:59,501 తప్పకుండా, అదేంటో చెప్పు. 238 00:16:00,377 --> 00:16:04,798 రష్యాలో ఇప్పుడు లీగల్ ఫీజు కట్టాల్సి వస్తోంది, 239 00:16:04,882 --> 00:16:07,384 ఇంకా ప్రచార ఖర్చులు, ఒరిత్ కద్మోన్ కి ఇవ్వాల్సినది... 240 00:16:07,593 --> 00:16:10,095 - ఓర్నా... - ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు సారీ. 241 00:16:10,179 --> 00:16:12,014 ఈవెంట్ అయ్యేదాకా ఆగుదాం, సరేనా? 242 00:16:12,097 --> 00:16:14,725 ఇప్పుడు అంతా గందరగోళంగా ఉంది. 243 00:16:14,808 --> 00:16:16,977 ఈవెంటుకి రా, బాగుంటుంది, 244 00:16:17,060 --> 00:16:19,229 గాలీ కోసం కొన్ని సిద్ధం చేస్తున్నాం, నువ్వే చూస్తావు. 245 00:16:19,313 --> 00:16:22,357 అదయ్యాక, మనందరం తీరిగ్గా కూర్చుని, 246 00:16:22,441 --> 00:16:25,152 - అన్నింటి గురించి మాట్లాడుకుందాం, సరేనా? - సరే. 247 00:16:25,485 --> 00:16:27,196 సరే. ఇక నేను వెళ్తా. 248 00:16:27,571 --> 00:16:29,990 మర్చేపోయా. 249 00:16:30,574 --> 00:16:32,201 నాకేం దొరికిందో చూడు. 250 00:16:32,701 --> 00:16:35,996 వీటిని నీ ఇంటర్వ్యూల్లో బ్యాక్ గ్రౌండులో పెట్టు. 251 00:16:36,413 --> 00:16:39,583 మన చిట్టి గాలీ, అతని మామయ్య కలిసి ఉన్న ఫోటోని మనం ఎప్పుడూ టీవీలో చూపలేదు కదా. 252 00:16:39,833 --> 00:16:41,710 ఫోటో బాగుంది, కదా? 253 00:16:42,044 --> 00:16:43,212 - బై, పని ఉంది, వెళ్తా. - బై. 254 00:16:49,343 --> 00:16:54,097 డోరీ 255 00:16:54,181 --> 00:16:58,101 హేయ్, లైన్లో ఉన్నావా? ఒక శుభవార్త, ఇంకో దుర్వార్త కూడా ఉంది. 256 00:16:58,352 --> 00:17:01,855 శుభవార్త ఏంటంటే, అతని మాజీ భార్య కాల్ చేసింది, నాకు అతను ఉన్న చోటు దొరికింది. 257 00:17:01,939 --> 00:17:05,901 అది నాలుగు కిలోమీటర్ల ప్రాంతం, కానీ అక్కడ ఒకే ఒక్క నిర్మాణం ఉంది. 258 00:17:05,983 --> 00:17:09,195 - అది శుభవార్తనా? - అవును. దుర్వార్త ఏంటంటే... 259 00:17:10,280 --> 00:17:12,115 నేను అతని ఫైల్ కోసం చూశా. 260 00:17:13,325 --> 00:17:15,577 రోనీ, అతడిని యూనిట్ నుండి తీసివేసింది, డ్రగ్స్ తో డీల్ చేసినందుకు కాదు. 261 00:17:15,911 --> 00:17:17,538 ఆయుధాలతో డీల్ చేసినందుకు తొలగించేశారు. 262 00:17:19,580 --> 00:17:22,209 అక్కడికి వెళ్లే ముందు ఓసారి మాట్లాడుకుందాం, సరేనా? 263 00:17:22,917 --> 00:17:25,420 అది మంచి ఐడియాలా అనిపించట్లేదు. 264 00:17:26,003 --> 00:17:29,383 వాళ్లు గాలీని ఇందులోకి లాగి ఉంటే, వాళ్లని నేను కనిపెట్టాలి. 265 00:17:29,466 --> 00:17:30,634 నాకు ఇంకో దారేమైనా ఉందా? 266 00:17:31,343 --> 00:17:33,804 చూడు, ఇలాంటి వాళ్లతో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. 267 00:17:34,429 --> 00:17:36,473 నేను లేకుండా ఒక్కదానివే అక్కడికి పోనని మాటివ్వు. 268 00:17:38,141 --> 00:17:39,351 ఓర్నా? 269 00:18:17,890 --> 00:18:19,808 ఛేజ్, అరవకు! 270 00:18:22,019 --> 00:18:23,520 హాయ్. 271 00:18:27,649 --> 00:18:28,984 మోజ్ అంటే మీరేనా? 272 00:18:31,862 --> 00:18:35,407 - మనిద్దరం ఒకరికొకరం తెలీదు... - మిమ్మల్ని టీవీలో చూశా. 273 00:18:35,741 --> 00:18:39,203 హా, నేను ఓర్నాని. నా కూతురు గాలీ లెవీ. 274 00:18:40,829 --> 00:18:44,124 మీరిద్దరూ సైన్యంలో కలిసి పని చేశారు, కదా? 275 00:18:46,251 --> 00:18:49,171 మీరు వెతుకుతున్నది నా కోసం కాదు, మీరు ఎవరో అనుకుని నా దగ్గరికి వచ్చారు. 276 00:18:50,547 --> 00:18:52,216 సరే... 277 00:18:54,134 --> 00:18:56,011 కానీ ఇక్కడ నివసిస్తున్నది మీరే కదా? 278 00:18:57,095 --> 00:18:58,889 నేనేం ఇక్కడ నివసించట్లేదు. 279 00:18:58,972 --> 00:19:00,641 పని కోసమే ఉంటా. 280 00:19:01,391 --> 00:19:03,268 రైతులను సురక్షితంగా ఉంచడం. 281 00:19:03,352 --> 00:19:04,811 ఒక్క నిమిషం. 282 00:19:06,230 --> 00:19:08,982 ఎవరైనా వారి పాడిపశువులను దొంగిలించాలని చూసినప్పుడు, ఆ సంగతి చూసుకోవడం. 283 00:19:09,358 --> 00:19:11,860 వాళ్ల పంటని అడవి పందులు తినడానికి వచ్చినప్పుడు, వాటి సంగతి చూసుకోవడం. 284 00:19:11,944 --> 00:19:13,737 ఎవరు వచ్చినా, వాళ్ల సంగతి చూసుకోవడం. 285 00:19:17,115 --> 00:19:19,034 ఇది అడవి పంది. మేము వీటి సంఖ్యను అదుపులో ఉంచుతున్నాం. 286 00:19:20,202 --> 00:19:22,329 ఇది ప్రైవేట్ ఆస్థి. మీరు ఇక్కడికి రాకూడదు. 287 00:19:22,871 --> 00:19:25,499 కానీ నా కూతురు మీకు తెలుసో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకుని చూస్తారా? 288 00:19:25,582 --> 00:19:28,126 - కావాలంటే మీకు తన ఫోటో చూపిస్తా. - ఫోటోలు అక్కర్లేదు, తనెవరో నాకు తెలీదు. 289 00:19:28,210 --> 00:19:29,837 భలేవారే, తను మీకు తెలుసనుకుంటా. 290 00:19:29,920 --> 00:19:31,922 - మీకు ఎఫీ, బొవాజ్, దూదీ... - చూడండి... 291 00:19:32,297 --> 00:19:35,217 - తను మీ దగ్గర పని చేసిందని కూడా తెలుసు నాకు. - చూడండి. మీరెవరో నాకు తెలీదు. 292 00:19:35,968 --> 00:19:39,930 మీ కూతురు కానీ, వీళ్లెవరో కానీ నాకు తెలీదు. 293 00:19:40,013 --> 00:19:43,267 వర్షం పడేలా ఉంది. నేను కారెక్కి వెళ్లిపోతా. 294 00:19:43,350 --> 00:19:46,019 లేదంటే, ఏదైనా లోయలోని బురదలో ఇరుక్కుపోతాం. 295 00:20:31,607 --> 00:20:35,903 హాయ్, సారీ, కారులో నా తాళాలు మర్చిపోయా. 296 00:20:35,986 --> 00:20:39,406 లోపలికి వచ్చి, తాళాలు రిపేర్ చేసే వ్యక్తికి కాల్ చేయవచ్చా? 297 00:20:44,828 --> 00:20:48,624 వామ్మోయ్! ఆగండి, ఆగండి... సరే, నేను వెళ్లిపోతా! 298 00:20:50,584 --> 00:20:52,127 నేను వెళ్లిపోతున్నా... 299 00:20:55,214 --> 00:20:56,131 వద్దు! 300 00:21:03,889 --> 00:21:06,725 ఛేజ్! ఛేజ్! 301 00:21:31,667 --> 00:21:32,876 హలో? 302 00:21:32,960 --> 00:21:34,294 ఓర్నా లెవీ? 303 00:21:34,378 --> 00:21:35,337 ఎవరు మీరు? 304 00:21:35,420 --> 00:21:38,507 మీ కూతురికి మళ్లీ జీవం ఇవ్వగల వ్యక్తిని నేను, 305 00:21:38,590 --> 00:21:41,260 మీకు కావాల్సిన శాంతిని దక్కించగల వ్యక్తిని నేను. 306 00:21:41,343 --> 00:21:43,971 కానీ అక్కడ ఎవరో హీబ్రూలో మాట్లాడుతున్నారుగా. 307 00:21:44,054 --> 00:21:45,681 మీరేం మాట్లాడుతున్నారో తెలీట్లేదు. 308 00:21:45,764 --> 00:21:47,391 పెట్టేయ్, పెట్టేయ్... 309 00:22:04,825 --> 00:22:08,036 {\an8}గాలీ వస్తువులు 310 00:22:17,796 --> 00:22:19,006 స్టార్ట్ అవుతోంది... 311 00:22:19,089 --> 00:22:20,841 గొంతు లేని వారి తరఫున కదం తొక్కుదాం 312 00:22:28,891 --> 00:22:32,895 ఇటీవల ప్లే చేసినవి 313 00:22:34,980 --> 00:22:38,192 {\an8}ఫ్యాంతమ్ లింబ్ వారి "యూరి గ్లాస్కోవ్" 314 00:24:04,695 --> 00:24:06,697 మీరు నన్ను వేధిస్తున్నారు, మీకు కావాల్సింది నేను కాదు. 315 00:24:06,780 --> 00:24:10,242 మీరందరూ ఏం చేశారో చెప్తే కానీ, నేను ఇక్కడి నుండి కదలను. 316 00:24:10,325 --> 00:24:12,703 నువ్వు, ఎఫీ, దూదీ, బొవాజ్... 317 00:24:13,996 --> 00:24:16,582 - ఎవరు పంపారు నిన్ను? - ఎవరూ పంపలేదు. 318 00:24:17,374 --> 00:24:19,960 వీళ్ల పేర్లు ఎలా తెలుసు నీకు? 319 00:24:21,545 --> 00:24:24,506 గాలీ వస్తువుల్లో వాళ్ల పాస్ పోర్టులు కనిపించాయి. 320 00:24:32,931 --> 00:24:35,475 నా కూతురిని ఏం చేశావో, నువ్వు చెప్పాల్సిందే. 321 00:24:37,477 --> 00:24:38,812 అందులో నవ్వొచ్చేది ఏముంది? 322 00:24:40,772 --> 00:24:42,858 ఇంటర్వ్యూల్లో తన గురించి నువ్వు ఇచ్చే బిల్డప్పులు చూసి. 323 00:24:42,941 --> 00:24:44,401 "నా పాప బంగారం, నా పాప వజ్రం," అట. 324 00:24:44,860 --> 00:24:46,111 తను చిన్నపాప అనుకుంటున్నారా? 325 00:24:53,493 --> 00:24:57,289 - మేమిద్దరం కలిసి ఈ టాటూ వేయించుకున్నాం. - సిగ్గులేదా నీకు? తను 20 ఏళ్ల పసిపిల్ల. 326 00:24:57,372 --> 00:25:02,586 కాస్త వయస్సు తేడా ఉంది, అయితే ఏంటి? బాగా లేని నీ భర్తను మోసం చేయడం కన్నా దారుణమైంది కాదు కదా? 327 00:25:04,671 --> 00:25:09,009 ఏంటి? గాలీ నాకు చెప్పింది. తను గమనించలేదని అనుకున్నావా? 328 00:25:09,343 --> 00:25:10,677 పిల్లలకి అన్నీ తెలిసిపోతాయి. 329 00:25:14,139 --> 00:25:16,308 మీ మిత్రులు ఎక్కడ దాక్కొని ఉన్నారో చెప్పు! 330 00:25:16,391 --> 00:25:19,436 చూడు, నువ్వు పప్పులో కాలేస్తున్నావు. 331 00:25:19,520 --> 00:25:21,939 డ్రగ్స్ కి బానిసలైన కొంతమంది వెధవలు, నీ 'బుజ్జి పాప'ని వాడుకున్నారని, 332 00:25:22,022 --> 00:25:25,234 ఇప్పుడు తను జైల్లో మగ్గుతోందని, కానీ వాళ్లేమో పండగ చేసుకుంటున్నారని 333 00:25:25,317 --> 00:25:26,944 అనుకుంటున్నావు. అంతే కదా? 334 00:25:32,366 --> 00:25:35,410 తనేం వాళ్ల చేత బాధింపబడిన వ్యక్తి కాదు, అది మాత్రం పక్కాగా చెప్పగలను. 335 00:25:35,744 --> 00:25:36,995 ఎందుకలా అంటున్నావు? 336 00:25:37,913 --> 00:25:40,123 ఎందుకంటే, వాళ్లే తన దగ్గర పని చేసేవాళ్లు! 337 00:25:42,668 --> 00:25:45,212 కానీ తను నీ దగ్గర పని చేసిందని విన్నానే. 338 00:25:45,420 --> 00:25:48,090 చేసింది. అది గతంలో. 339 00:25:48,423 --> 00:25:50,592 నేను అరెస్టయ్యాక, ఒక్క వారం కూడా ఆగలేకపోయింది. 340 00:25:51,343 --> 00:25:54,680 నా రష్యన్ పార్టనరును కనుగొని, అతనితో పని చేయడం మొదలుపెట్టింది. 341 00:25:54,763 --> 00:25:57,057 - అతని పేరేంటి? - తెలీదు, నాకది అనవసరం కూడా. 342 00:25:57,140 --> 00:25:59,935 ఒక ఏడాది నేను కష్టపడి సంపాదించుకున్న డీల్ ని, నీ కూతురు దొంగిలించేసింది, 343 00:26:00,018 --> 00:26:03,939 నేను శిక్షణనిచ్చిన సిబ్బందిని వాడుకుంది, నా మాల్ ని తన మాల్ లా ఆ రష్యన్ కి పంపించింది. 344 00:26:04,022 --> 00:26:07,651 నేను జైల్లో ఉన్నప్పుడు మూడు నిమిషాలు ఫోన్లో మాట్లాడి నాతో తెగతెంపులు చేసుకుంది. 345 00:26:07,860 --> 00:26:09,361 నీ 'బుజ్జి పాప.' 346 00:26:09,695 --> 00:26:12,990 మరి వాళ్లు, 347 00:26:13,991 --> 00:26:16,910 వాళ్లు తననేం చేయకపోతే, ఎందుకు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు? 348 00:26:16,994 --> 00:26:18,954 వాళ్లేం అజ్ఞాతవాసంలోకి వెళ్లలేదు. 349 00:26:24,751 --> 00:26:29,006 మూడు నెలల క్రితం, ఒక అర్ధరాత్రి భారతదేశం నుండి నాకొక విచిత్రమైన కాల్ వచ్చింది. 350 00:26:29,214 --> 00:26:32,634 నువ్వు చెప్తోన్న ఆ మనుషుల్లోని ఒకడైన, ఎఫీ కాల్ చేసి, కంగారుగా మాట్లాడాడు, 351 00:26:32,718 --> 00:26:36,346 ఒక భారతదేశ మహిళ చిరునామాకి కొంత డబ్బును పంపించమని అడిగాడు, 352 00:26:36,430 --> 00:26:38,515 దాంతో అతను కొత్త పాస్ పోర్ట్ తీసుకుంటాడట. 353 00:26:38,724 --> 00:26:41,310 అతనికి పాస్ పోర్ట్ ఎందుకో అడిగావా? 354 00:26:41,393 --> 00:26:42,311 లేదు... 355 00:26:42,394 --> 00:26:45,230 మా రంగంలో మేము అలాంటి ప్రశ్నలు అడగం. 356 00:26:45,314 --> 00:26:48,150 కానీ ఒకటి మాత్రం చెప్పగలను, డీల్ అంతా సక్రమంగానే సాగుతున్నప్పుడు, 357 00:26:48,442 --> 00:26:50,736 అలాంటి కాల్స్ ఎవరూ చేయరు. 358 00:26:50,944 --> 00:26:54,531 అతను ఖాతా నుండి డబ్బు తీసుకోనే లేదు. దాని ద్వారానే తెలిసిపోతోంది కదా అసలు విషయం. 359 00:26:54,865 --> 00:26:56,074 ఏం తెలిసిపోతోంది? 360 00:26:56,158 --> 00:26:59,203 వాళ్లని మీరు కనుగొనలేకపోవడానికి కారణం వారు అజ్ఞాతవాసంలో ఉండటం కాదు. 361 00:26:59,661 --> 00:27:02,623 వాళ్లెవరూ ప్రాణాలతో లేరు, అందుకే వాళ్ల ఆచూకీ మీకు దొరకట్లేదు. 362 00:27:05,918 --> 00:27:08,962 చూడు, నువ్వు తనకి తల్లివని నాకు తెలుసు, 363 00:27:10,130 --> 00:27:11,840 నీ తప్పేం లేదు, 364 00:27:12,466 --> 00:27:15,010 కానీ గాలీకి ఇప్పుడు జరిగేదంతా, 365 00:27:15,093 --> 00:27:17,763 తను ఏరికోరి కొని తెచ్చుకున్నదే. 366 00:27:23,435 --> 00:27:25,312 గాలీని స్వదేశానికి తీసుకువద్దాం 367 00:27:45,415 --> 00:27:46,917 మ్యాజిక్. 368 00:27:47,000 --> 00:27:48,001 వావ్... 369 00:27:48,085 --> 00:27:49,670 - హా. - అంత వేగంగానా? 370 00:27:49,753 --> 00:27:51,004 వచ్చి చూడు. 371 00:28:09,690 --> 00:28:12,776 అలసట లేదని అన్నాడు, అందుకని ఒక పుస్తకం చదవమని చెప్పా, 372 00:28:12,860 --> 00:28:14,444 కొంత టీ చేసి ఇచ్చా, 373 00:28:14,528 --> 00:28:17,781 నేను తిరిగి వచ్చేసరికి, కుంభ కర్ణుడిలా నిద్రపోతున్నాడు. 374 00:28:19,366 --> 00:28:21,326 నమ్మలేకపోతున్నా అసలు. 375 00:28:21,535 --> 00:28:23,328 మనకి ఐస్ క్రీమ్ తెస్తా. 376 00:28:38,135 --> 00:28:40,304 {\an8}నోక్సోలైట్ 7.5 377 00:28:40,929 --> 00:28:42,931 అమ్మా, నేను ఆటకి ఏర్పాట్లు చేస్తున్నా. 378 00:28:43,807 --> 00:28:46,518 ఈసారి ఎలా ఆడదామంటావు? 379 00:28:46,602 --> 00:28:47,811 విస్తరణతోనా, విస్తరణ లేకుండానా? 380 00:28:47,895 --> 00:28:50,439 నిజం చెప్పాలంటే, నాకు కొత్తగా నేర్చుకోవాలనేం లేదు. 381 00:28:50,522 --> 00:28:53,984 ఈమధ్య మీ నాన్నకి ఏది చిరాకు తెప్పించినా, దాన్ని చెత్త బుట్టలో వేసేస్తున్నాడు. 382 00:28:54,651 --> 00:28:58,113 జోకుగా వేశానంటాడు, అది మళ్లీ కనిపించకపోతే కోపంతో ఊగిపోతాడు. 383 00:28:58,197 --> 00:29:00,115 కాబట్టి, చెత్త బుట్టలో వేసే వాటిని గమనిస్తూ ఉన్నా. 384 00:29:00,449 --> 00:29:01,950 ఇదేంటి? 385 00:29:03,911 --> 00:29:07,581 - నోక్సోలైట్. - అది నాకు తెలుసు. ఖాళీగా ఎందుకు ఉంది? 386 00:29:09,249 --> 00:29:11,210 నీకు తెలుసుగా ఎందుకు ఉందో. 387 00:29:15,047 --> 00:29:17,007 ఆయనకి ఎలా ఇచ్చావు? 388 00:29:17,382 --> 00:29:20,010 టీలో కలిపి ఇచ్చా. 389 00:29:20,677 --> 00:29:24,097 - నీకు పిచ్చి పట్టిందా? - అమ్మా, ఇప్పుడు గొడవ పెట్టకు, నాకు ఓపిక లేదు... 390 00:29:24,181 --> 00:29:27,017 ఇది ఇవ్వవద్దని ఆయన చెప్పాడు. అస్సలంటే అస్సలు ఇవ్వవద్దని చెప్పాడు. 391 00:29:27,100 --> 00:29:31,188 సరే, కానీ ఈ ఇంట్లో ఉండేది ఆయనొక్కడే కాదు కదా, 392 00:29:31,271 --> 00:29:33,565 ఇతరులు ఉంటున్నారు, నువ్వు కూడా ఉంటున్నావు. నీకు కాస్త బ్రేక్ కావాలి. 393 00:29:33,649 --> 00:29:35,817 నా సంగతి నువ్వు చూసుకోనక్కర్లేదు. 394 00:29:35,901 --> 00:29:40,197 - ఎవరి మీద కోపమో, నాపై చూపిస్తున్నట్టున్నావు. - అస్సలు కాదు. 395 00:29:40,280 --> 00:29:42,491 అమ్మా, చాలా మంది ఆహారంలో మందులు కలుపుతుంటారు, 396 00:29:42,574 --> 00:29:45,619 - తల్లిదండ్రులందరూ చేస్తుంటారు అలా. - అవును, పిల్లల కోసం చేస్తారు, పెద్దవారి కోసం కాదు. 397 00:29:45,702 --> 00:29:48,288 ఇదేమంత పెద్ద విషయం కాదు. 398 00:29:48,372 --> 00:29:50,707 అతడిని చిన్న పిల్లాడిలా చూడకు, అర్థమైందా? 399 00:29:51,583 --> 00:29:53,627 అతడిని చిన్నపిల్లాడిలా చూడకు. 400 00:29:54,711 --> 00:29:56,797 మీ నాన్న ఆహారంలో మందులు కలుపుతావా... 401 00:29:59,341 --> 00:30:01,134 ఎవరైనా ఆ పని చేస్తారా? 402 00:30:03,804 --> 00:30:05,389 నేను చేస్తా కదా. 403 00:30:10,561 --> 00:30:11,645 తెలుస్తోంది. 404 00:30:22,447 --> 00:30:26,326 ఓర్నా, ఏమైంది? అంతా ఓకేనా? 405 00:30:29,288 --> 00:30:30,914 ఏమైంది? 406 00:31:43,904 --> 00:31:45,739 లోపలికి పద, కూర్చుని మాట్లాడుకుందాం. 407 00:31:48,116 --> 00:31:49,409 రా... 408 00:31:55,916 --> 00:31:57,209 లోపలికి రా. 409 00:32:04,049 --> 00:32:07,427 బెన్నీని నా వలలో వేసుకోవడానికే నేను గర్భవతిని అయ్యానని, అలా వాళ్లకు అతడిని 410 00:32:07,511 --> 00:32:12,683 దూరం చేశాననే బెన్నీ వాళ్ల కుటుంబం నన్ను చూస్తుంది. 411 00:32:13,475 --> 00:32:14,643 థ్యాంక్స్. 412 00:32:15,853 --> 00:32:19,231 నేను ఏం చేసినా వాళ్లు అలానే అర్థం చేసుకుంటారు. 413 00:32:19,565 --> 00:32:24,820 బ్రేక్లను దిగుమతి చేసుకునే రాచరిక కుటుంబంలో చోటు సంపాదించడానికి చచ్చిపోతున్నా నేను మరి. 414 00:32:26,947 --> 00:32:29,908 మరి... మోజ్ ని కలిశావు కదా, ఏమైంది? 415 00:32:32,911 --> 00:32:35,372 - ఇప్పుడేం అనుకుంటున్నావు? - తెలీదు, 416 00:32:35,581 --> 00:32:39,877 నేను నిన్ను నమ్ముండాల్సింది. నువ్వు మొదట్నుంచీ చెప్తూనే ఉన్నావు, 417 00:32:39,960 --> 00:32:41,211 ఈ పనులని వదిలేయ్, 418 00:32:41,295 --> 00:32:44,965 ఒరిత్ పై దృష్టి పెట్టు, క్యాంపెయిన్ కి నిధులు సంపాదించు... ఏమో అబ్బా. 419 00:32:45,048 --> 00:32:47,968 ఇవాళ కొన్ని సందేహాలు అయినా నివృత్తి అవుతాయని అనుకున్నా. 420 00:32:48,218 --> 00:32:52,598 కానీ నేను దర్యాప్తు చేసే కొద్దీ, మరింత భయంకరమైన విషయాలు తెలుస్తున్నాయి... 421 00:32:55,225 --> 00:32:58,520 - కానీ ఒకటి మాత్రం పక్కా. - ఏంటది? 422 00:33:00,189 --> 00:33:04,151 గాలీని ఇక్కడికి తీసుకురావాలంటే, ఇక్కడ ఉండాల్సింది నేను కాదు. 423 00:33:06,069 --> 00:33:07,196 గాలీయే. 424 00:33:13,160 --> 00:33:15,621 అదంతా తనకి ఎక్కడి నుండి వచ్చిందని అంటావు? 425 00:33:16,788 --> 00:33:20,167 - బెన్నీ నుండి అయితే కాదు. - ఆ అవకాశమే లేదు. 426 00:33:21,210 --> 00:33:22,711 మరి ఇంకెవరు ఉన్నారు? 427 00:33:25,631 --> 00:33:29,551 నాకు తెలిసి, తను నన్ను చూసి, ఏం చేయకూడదో నేర్చుకుని ఉంటుంది. 428 00:33:31,011 --> 00:33:32,429 చూడు... 429 00:33:36,141 --> 00:33:38,435 ఇప్పుడు నువ్వు ఇన్ని అంటున్నావు కదా, 430 00:33:39,561 --> 00:33:45,192 కానీ ఏదోక రోజు నువ్వు వీటన్నింటినీ చూసి, 431 00:33:45,859 --> 00:33:49,947 నువ్వు ఎలా పని చేశావో చూసి, 432 00:33:50,572 --> 00:33:53,575 నిన్ను నువ్వు ఎంతలా విమర్శించుకున్నావో నువ్వే గ్రహిస్తావని పక్కాగా చెప్పగలను. 433 00:33:54,701 --> 00:33:59,122 ఇక అప్పటికైనా... నేను నిన్ను ఎలా అయితే చూస్తున్నానో, నిన్ను కూడా నువ్వు అలా చూస్తావేమో, 434 00:34:00,999 --> 00:34:03,168 అంటే... 435 00:34:06,547 --> 00:34:10,592 పెద్ద దద్దమ్మలా? పెద్ద దద్దమ్మలా... 436 00:34:10,801 --> 00:34:12,135 ఎంతలా అంటే... 437 00:34:14,221 --> 00:34:15,806 పిచ్చాసుపత్రిలో చేర్చవచ్చు. 438 00:34:16,431 --> 00:34:20,185 కానీ ఇప్పటిదాకా ఎలాగో ఎవరికీ తెలీకుండా కానిచ్చేశావు. 439 00:34:28,110 --> 00:34:30,445 ఇంకొక్కసారి నన్ను దద్దమ్మ అని అంటే... 440 00:34:38,829 --> 00:34:41,998 మేయరుగా యోసి లెవీని ఎంచుకోండి 441 00:35:27,211 --> 00:35:31,924 వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్, ఇంకా నూరిత్ కి, 442 00:35:32,007 --> 00:35:34,301 ఆతిథ్యమిస్తున్నందుకు కమ్యూనిటీ సెంటరుకు కూడా థ్యాంక్స్. 443 00:35:34,801 --> 00:35:38,222 ఇది నాకు, నా కుటుంబానికి కష్ట కాలమని 444 00:35:38,680 --> 00:35:42,184 మీలో కొందరికి తెలిసే ఉంటుంది, 445 00:35:42,976 --> 00:35:45,270 ఎందుకంటే, ఒక ముఖ్యమైన, ప్రీతిపాత్రమైన అతిథి 446 00:35:45,354 --> 00:35:48,023 ఇక్కడ లేరు. 447 00:35:48,565 --> 00:35:50,859 ఆమె ఎవరో కాదు, మా గాలీ. 448 00:35:52,361 --> 00:35:56,573 కాబట్టి, ఈ తర్వాతి పాటని గాలీకి, అద్భుతమైన తన అమ్మ, ఓర్నాకి 449 00:35:57,241 --> 00:35:59,618 మేము అంకితం చేయాలనుకుంటున్నాం, 450 00:36:00,577 --> 00:36:05,624 ఆమె ఇంత బాధలో కూడా, ఇక్కడికి వచ్చి మనల్ని సంతుష్టపరిచింది. 451 00:36:06,834 --> 00:36:11,421 ఏదోక అద్భుతం జరిగి, దూరాన ఉన్న గాలీకి ఈ పాట వినిపిస్తే బాగుండు. 452 00:36:14,550 --> 00:36:16,426 ఎల్డార్, ఇక కానివ్వండి... 453 00:36:30,482 --> 00:36:33,861 దూరాన ఒక చోటు ఉంది 454 00:36:34,611 --> 00:36:37,573 అక్కడ ఎవరోకరు ఎప్పుడూ నీకు అండగా ఉంటారు 455 00:36:38,115 --> 00:36:39,992 ఎప్పుడూ తోడై ఉంటారు 456 00:36:40,367 --> 00:36:44,121 నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు చేయి అందిస్తారు... 457 00:36:44,204 --> 00:36:47,332 ఓర్నూష్, ఎలా ఉన్నావు? 458 00:36:47,666 --> 00:36:49,877 - డ్యానియెలాని ఎప్పుడైనా కలిశావా? - లేదు. 459 00:36:49,960 --> 00:36:51,795 - తను మా కౌన్సిల్ మెంబర్. - మిమ్మల్ని కలవడం బాగుంది. 460 00:36:51,879 --> 00:36:54,131 - మీ ఇద్దరికీ పరిచయం ఉందా? - లేదు. 461 00:36:54,214 --> 00:36:56,133 హా, టీవీలో చూశా. 462 00:36:56,842 --> 00:36:59,511 - నా సానుభూతి తెలియజేస్తున్నా. - థ్యాంక్యూ. 463 00:36:59,761 --> 00:37:04,349 గుర్తు కోసం ఒక ఫోటో తీసుకుందాం. 464 00:37:08,395 --> 00:37:09,313 థ్యాంక్స్. 465 00:37:09,396 --> 00:37:11,231 సరే, మేము ఇక ఈవెంట్ పని చూసుకుంటాం... 466 00:37:11,648 --> 00:37:12,649 సరేనా? 467 00:37:13,525 --> 00:37:14,902 టమారా? 468 00:37:15,944 --> 00:37:17,404 - నేను రావచ్చా...? - తప్పకుండా. 469 00:37:20,157 --> 00:37:25,204 ఇది సరైన సమయం కాదని నాకు తెలుసు... అందులో సందేహమే లేదు... 470 00:37:27,414 --> 00:37:31,168 కానీ నాకు... నాకు తెలియాల్సిన అవసరముంది, 471 00:37:31,251 --> 00:37:35,047 ఆర్థికపరంగా నువ్వు నాకు సాయపడగలవో లేదో. 472 00:37:35,130 --> 00:37:37,549 నాకు అది తెలియాలి. 473 00:37:37,633 --> 00:37:42,137 ఓర్నా, ప్లీజ్. ఇవాళ నా భర్త తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాడు. 474 00:37:44,389 --> 00:37:46,308 మరి ఇవాళ నా కూతురు ఏం చేస్తోంది? 475 00:37:48,602 --> 00:37:51,605 టమారా, నేను సాయం కోసం అడుగుతున్నా, 476 00:37:51,813 --> 00:37:56,026 నాకు ప్రసంగాలు కానీ, పాటలు కానీ వద్దు. నాకు... నాకు డబ్బులు కావాలి. 477 00:37:56,109 --> 00:38:00,405 సరే, నీకు తగినంత నిధులు ఇస్తాము, కాకపోతే సరైన సందర్భం వచ్చినప్పుడు, 478 00:38:00,489 --> 00:38:03,784 దాని గురించి ఏ ఒత్తిడీ లేకుండా, ప్రశాంతంగా చర్చించుకుందాం. 479 00:38:03,867 --> 00:38:06,078 - నిజంగానే చెప్తున్నా, ఓర్నా. - నువ్వన్నది నిజమే, సారీ. 480 00:38:06,411 --> 00:38:08,789 కాస్తంత కృతజ్ఞతలు చూపితే బాగుంటుందేమో. 481 00:38:10,290 --> 00:38:13,126 - దేనికి? - ఎక్స్ క్యూజ్ మీ? 482 00:38:13,710 --> 00:38:16,380 దేనికి కృతజ్ఞతలు చెప్పాలి? 483 00:38:16,630 --> 00:38:19,424 "కృతజ్ఞతలు" అని అన్నావు కదా, అది దేనికో అడుగుతున్నా. 484 00:38:20,342 --> 00:38:24,221 గాలీ అరెస్ట్ అయిన రెండు నెలల తర్వాత నాకు కాల్ చేసినందుకా? 485 00:38:24,471 --> 00:38:27,099 సగౌరవంగా చెప్తున్నా, మాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. 486 00:38:27,182 --> 00:38:29,226 మరి దేనికి కృతజ్ఞతలు? 487 00:38:29,476 --> 00:38:31,728 లేదు, నిజంగానే అడుగుతున్నా. మీకు, డ్రగ్స్ కి సంబంధం ఉందని 488 00:38:32,521 --> 00:38:35,065 జనాలు అనుకుంటారేమో అని పరువు పోతుందని ఫీల్ అయినందుకా? 489 00:38:35,399 --> 00:38:38,694 బెన్నీకి ఆరోగ్యం పాడైనప్పుడు మీరందరూ మాయమైపోయినందుకు కృతజ్ఞత చూపాలా? 490 00:38:38,777 --> 00:38:41,780 - నన్ను ఒంటరిగా వదిలేసినందుకా? - నేనేం మాట్లాడను. 491 00:38:42,364 --> 00:38:45,033 నీ ప్రవర్తనని చూడటానికి బెన్నీ ఇక్కడ లేడు, అది మంచిదైంది. 492 00:38:45,117 --> 00:38:49,079 - నువ్వు అతడిని బంధించి ఉంచి మంచిదే అయిందేమో. - "బంధించి ఉంచానా"? 493 00:38:49,162 --> 00:38:52,791 నిన్ను కంటికి రెప్పలా చూసుకున్న వ్యక్తిని చూసుకునే పద్ధతి ఇదేనా? 494 00:38:53,041 --> 00:38:58,046 నువ్వు బయటకు వెళ్లి జల్సా చేసుకుంటుంటావు, ఆయన్ని మాత్రం ఒక కుక్కలా వేరే వాళ్లకి అప్పజెప్పి వెళ్తావు, కదా? 495 00:38:58,130 --> 00:39:01,049 నేను అతడిని వదిలి వెళ్తానా? యోసి చివరిసారి ఆయన్ని ఎప్పుడు వచ్చి చూశాడు? 496 00:39:01,133 --> 00:39:03,969 సారీ, కానీ దీన్ని నువ్వు చెడగొడుతుంటే నేను చూస్తూ ఊరుకోను, 497 00:39:04,386 --> 00:39:07,306 మరీ ముఖ్యంగా ఇవాళ, గాలీ కోసం మేమింత చేశాక. 498 00:39:09,224 --> 00:39:11,310 నీకు గాలీ అంటే పట్టింపు లేదని నాకు తెలుసు. 499 00:39:11,393 --> 00:39:13,353 మెల్లగా... ఓర్నా, ప్లీజ్... 500 00:39:13,437 --> 00:39:16,440 మీ స్వార్థం కోసం మీరు మంచివారని చూపించుకోవడానికి 501 00:39:16,523 --> 00:39:18,609 - నన్ను వాడుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు... - అరవకు... 502 00:39:18,692 --> 00:39:22,112 కానీ మీకు నేను కానీ, తను కానీ అక్కర్లేదు. అస్సలు అవసరం లేదు మీకు మేము. 503 00:39:22,321 --> 00:39:25,490 "మా గాలీ" అని ఎందుకు అంటారు? తనని చివరిసారిగా ఎప్పుడు చూశారు మీరు? 504 00:39:25,574 --> 00:39:28,243 - ఓర్నా, ఇక చాలు. - నిజంగానే అడుగుతున్నా, నాకు తెలిసినంత వరకు, 505 00:39:28,327 --> 00:39:31,038 తనకి 17 ఏళ్లున్నప్పుడు పాస్ ఓవర్ సమయంలో 506 00:39:31,121 --> 00:39:33,707 - రాత్రంతా తనని "గాలియా" అని మీరు అన్నారు. - తొక్కేం కాదు... 507 00:39:33,790 --> 00:39:36,877 తనక్కడ మూడు నెలలుగా ఉంది, అది నీకు తెలుసా? కానీ ఇప్పటిదాకా మీరేం చేయలేదు. 508 00:39:37,503 --> 00:39:38,795 ఏం చేయలేదు. ఒక్క మాట కూడా అనలేదు. 509 00:39:38,879 --> 00:39:42,508 కానీ ఇప్పుడు నేను టీవీలో వస్తున్నా, కదా? కాబట్టి "మా గాలీ" అయిపోయింది. 510 00:39:42,716 --> 00:39:44,676 ఒకటి అడుగుతా, 511 00:39:45,177 --> 00:39:48,472 యోసి, నేను కలిసి ఉన్న ఫోటో పేపర్లలో పడాలా వద్దా? 512 00:39:48,555 --> 00:39:53,018 - ఏంటి? - నేను, యోసి ఉన్న ఫోటో 513 00:39:53,101 --> 00:39:55,103 పేపర్లలో పడాలా వద్దా? 514 00:39:55,312 --> 00:39:58,732 మేయర్ బరిలో నిలబడిన వ్యక్తి 515 00:39:58,815 --> 00:40:02,194 గాలీకి మామయ్య అవుతాడు, తండ్రి తర్వాత తండ్రి లాంటోడని చెప్పాలా వద్దా? 516 00:40:02,986 --> 00:40:05,948 మీ దగ్గరికి జర్నలిస్టులని పంపాలా వద్దా? అప్పుడు మీరు చెప్పుకోవచ్చు, 517 00:40:06,031 --> 00:40:07,741 మీరు చాలా బాధపడిపోతున్నారని... 518 00:40:07,824 --> 00:40:10,327 మీకు మీ కూతురే పోయినంత బాధగా ఉందని. 519 00:40:13,163 --> 00:40:15,082 దానికి అయినా కొంత డబ్బు ఇవ్వవచ్చు కదా? 520 00:40:15,791 --> 00:40:18,210 సమాధానం అక్కర్లేదు, తల ఊపు, చాలు. 521 00:40:23,674 --> 00:40:25,133 మంచిది. 522 00:40:25,217 --> 00:40:27,344 థ్యాంక్యూ, ఈ సాయంత్రం చాలా బాగా గడిచింది. 523 00:40:28,846 --> 00:40:30,347 బై. 524 00:40:37,354 --> 00:40:42,818 కిర్యాట్ ఆటా కమ్యూనిటీ సెంటర్ 525 00:41:21,398 --> 00:41:25,235 ప్రైవేట్ నంబర్ 526 00:41:29,656 --> 00:41:31,116 హలో? 527 00:41:32,284 --> 00:41:34,411 మిసెస్ లెవీ? ఓర్నా లెవీ? 528 00:41:35,412 --> 00:41:37,456 మళ్లీ ఈ ఆటలు అవసరమా? 529 00:41:37,539 --> 00:41:39,416 మీ కూతురి గురించి మాట్లాడాలి. 530 00:41:39,750 --> 00:41:42,711 హా, షాకింగ్ గా ఉంది. సరే, నేను పెట్టేస్తున్నా. 531 00:41:43,212 --> 00:41:44,421 మీకు నేను సాయపడగలను. 532 00:41:45,589 --> 00:41:48,550 నిజానికి, ఈసారి నేనే మీకు సాయపడగలను. 533 00:41:48,842 --> 00:41:52,095 ఒక విషయం చెప్పండి, మీ జీవితాన్ని మీరిలాగే గడుపుతుంటారా? 534 00:41:52,179 --> 00:41:54,765 జైల్లో కూతురు ఉండి, ఏడుస్తున్న తల్లులని వేధింపులకి గురి చేస్తుంటారా? 535 00:41:54,848 --> 00:41:59,061 మీరేమైనా చిన్న పిల్లలా? ఇలాంటి చిల్లర పనులు చేస్తుంటే, 536 00:41:59,311 --> 00:42:02,856 రాత్రి పూట మీకు నిద్ర ఎలా పడుతుంది? 537 00:42:02,940 --> 00:42:06,401 మీరు ఎందుకు ఇంత చెడుగా ప్రవర్తిస్తున్నారో ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? 538 00:42:06,485 --> 00:42:11,198 మీ జీవితం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారా? ఇతరులు బాధపడుతుంటే, మీకు ఆనందం... 539 00:42:12,824 --> 00:42:15,285 నేను... నేనేం చేయాలి? 540 00:42:15,786 --> 00:42:17,829 ఏంటి? లేదు, నాకు... నాకు అర్థం కావట్లేదు. 541 00:42:19,581 --> 00:42:21,291 ఇదుగో, మీ అమ్మతో మాట్లాడు. 542 00:42:22,751 --> 00:42:25,170 అమ్మా? నువ్వేనా? 543 00:42:25,254 --> 00:42:27,214 - గాలీ? - అమ్మా...? 544 00:42:27,297 --> 00:42:30,175 మిసెస్ లెవీ, మీ ప్రభుత్వం మీతో అబద్ధాలాడుతోంది. 545 00:42:30,676 --> 00:42:34,179 నేను సాయపడగలను. ఒక చిరునామా చెప్తా, రాసుకోండి. 546 00:43:24,396 --> 00:43:26,398 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్