1 00:00:43,252 --> 00:00:45,754 "బీగల్ స్కౌట్ సన్నాహాలు." 2 00:00:49,132 --> 00:00:51,385 నాకు మంచి సలహా కావాలి, పెద్ద అన్నయ్యా. 3 00:00:51,385 --> 00:00:55,097 నీకు తెలుసు కదా, మొదటిసారిగా నేను కూడా నీతో పాటు సమ్మర్ క్యాంప్ కి వస్తున్నా కాబట్టి, 4 00:00:55,097 --> 00:00:58,267 మొదటిసారి మంచి పేరు తెచ్చుకోవాలని అనుకున్నాను. 5 00:00:58,267 --> 00:01:02,896 నా బొమ్మలు సూజీ స్నూజీని తీసుకురానా లేదా మిస్టర్ బేర్ ని తీసుకురావాలంటావా? 6 00:01:03,689 --> 00:01:05,774 అయ్యో, శాలీ. నాకు తెలియదు. 7 00:01:05,774 --> 00:01:10,362 సూజీ స్నూజీని తీసుకువస్తే నేను అందరినీ బాగా చూసుకుంటాననీ, 8 00:01:10,362 --> 00:01:12,614 తోటివారికి సాయంగా ఉంటాననీ అందరికీ తెలుస్తుంది, 9 00:01:12,614 --> 00:01:17,119 కానీ మిస్టర్ బేర్ ని తీసుకువస్తే నాకు క్రూర జంతువులు అంటే భయం లేదని తెలుస్తుంది. 10 00:01:17,911 --> 00:01:19,580 ఈ రెండు బొమ్మల్నీ తీసుకురావచ్చు కదా? 11 00:01:20,581 --> 00:01:21,665 మంచి విషయం చెప్పావు. 12 00:01:21,665 --> 00:01:24,626 మొదటిసారే అంత మంచి అభిప్రాయాన్ని ఇంకెప్పుడూ కలిగించలేను. 13 00:01:28,088 --> 00:01:31,758 ప్రపంచ ప్రఖ్యాత బీగల్ స్కౌట్ లీడర్ వచ్చినట్లున్నాడు. 14 00:01:31,758 --> 00:01:34,136 ఈ రోజు ఏమైనా సాహసాలకు సిద్ధం అవుతున్నావా? 15 00:01:34,720 --> 00:01:36,555 సాహసాలు అంటే గుర్తొచ్చింది, 16 00:01:36,555 --> 00:01:38,807 నేను త్వరలో సమ్మర్ క్యాంప్ కి వెళ్తున్నాను. 17 00:01:38,807 --> 00:01:42,269 కాబట్టి, నాతో కాస్త మంచి సమయం గడపాలి అనుకుంటే, 18 00:01:42,269 --> 00:01:44,229 నీకు ఇదే సరైన అవకాశం. 19 00:01:51,778 --> 00:01:52,905 హలో? 20 00:01:52,905 --> 00:01:54,114 అవును. 21 00:01:54,114 --> 00:01:57,492 విచిత్రంగా ఉంది. బీగల్ స్కౌట్ ప్రధాన కార్యాలయం నుండి ఫోన్ చేశారు. 22 00:01:57,492 --> 00:02:00,037 మీరు ఏదో చెబుతున్నారు? అవును. 23 00:02:00,871 --> 00:02:05,083 నిజంగానా? ఓహ్, లేదు. అది ఘోరమైన న్యూస్. 24 00:02:05,876 --> 00:02:08,211 సరే, మీకు కూడా ఈ రోజు మంచిగా గడవాలి. 25 00:02:10,088 --> 00:02:12,883 నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు, స్నూపీ, 26 00:02:12,883 --> 00:02:16,053 కానీ నీ బృందం వాళ్లకి నచ్చలేదట. 27 00:02:16,053 --> 00:02:17,471 ఎందుకు నచ్చలేదు? 28 00:02:17,471 --> 00:02:20,891 వాళ్లు "పూర్తిగా అప్రతిష్ట" లాంటి పదాలు వాడారు. 29 00:02:21,517 --> 00:02:24,603 ఆ సంస్థ నుండి నిన్ను బహిష్కరించాలనే ఆలోచనలో ఉన్నారు 30 00:02:24,603 --> 00:02:28,065 ఎందుకంటే మీ బృందం తగినన్ని పెర్ఫార్మెన్స్ బ్యాడ్జీలు సంపాదించలేకపోయిందట. 31 00:02:31,443 --> 00:02:33,487 మీ బృందం ఎన్ని బ్యాడ్జీలు సంపాదించింది? 32 00:02:40,494 --> 00:02:43,539 ఏమీ లేవా? అది అసలు ఎలా సాధ్యం? 33 00:03:48,687 --> 00:03:53,233 ఆ బ్యాడ్జీలు సంపాదించడానికి నీకు ఈ వేసవి కాలం మాత్రమే గడువు ఉందని హెడ్ ఆఫీస్ వాళ్లు చెప్పారు. 34 00:03:53,233 --> 00:03:55,527 ఏం చేయబోతున్నావు, స్నూపీ? 35 00:04:03,243 --> 00:04:07,039 పద్ధతి ప్రకారం చూస్తే, చుట్టూ పరిగెత్తడం ఇంకా అరవడం కూడా ఏదో చేయడమే కదా. 36 00:04:08,373 --> 00:04:12,586 సమ్మర్ క్యాంప్ కి ఆ పిచ్చి దుప్పటిని నువ్వు తీసుకురావని అనుకుంటున్నాను. 37 00:04:12,586 --> 00:04:15,297 అది నాకు చాలా అవమానంగా ఉంటుంది. 38 00:04:15,297 --> 00:04:17,298 దీనిని దుప్పటిగా చూడకు. 39 00:04:17,298 --> 00:04:20,886 దట్టమైన అడవిలో మనుగడ సాగించడానికి అత్యంత అవసరమైన సాధనంగా చూడు. 40 00:04:20,886 --> 00:04:23,305 ఇది దుస్తుల పైన అదనపు పొరలా ఉపయోగపడుతుంది, 41 00:04:23,305 --> 00:04:27,267 చెట్లు ఎక్కడానికి తాడులా లేదా గూడులా కూడా ఉపయోగపడుతుంది. 42 00:04:27,267 --> 00:04:29,770 బహుశా మనం దీన్ని మంట అంటించడానికి కూడా వాడుకోవచ్చేమో. 43 00:04:32,856 --> 00:04:35,651 సమ్మర్ క్యాంప్ ఆలోచనని నేను కాదనను, 44 00:04:35,651 --> 00:04:39,404 కానీ నాకు ఏం అనిపిస్తుందంటే, ఒక పుస్తకం నుంచి కూడా ప్రకృతి గురించి చాలా నేర్చుకోవచ్చు. 45 00:04:39,404 --> 00:04:42,241 ఇంకా పుస్తకం వల్ల దోమల సమస్య ఉండదు. 46 00:04:42,241 --> 00:04:44,910 నువ్వు హాస్యం ఆడుతున్నావా? క్యాంప్ కి వెళ్లడమే బెస్ట్. 47 00:04:44,910 --> 00:04:47,538 అక్కడ కొండలు ఎక్కచ్చు, మంటల్లో హాట్ డాగ్స్ ని వేయించుకోవచ్చు. 48 00:04:47,538 --> 00:04:50,624 పడవలు నడపచ్చు, మంటల్లో హాట్ డాగ్స్ ని వేయించుకోవచ్చు. 49 00:04:50,624 --> 00:04:54,127 ఈత కొట్టచ్చు, మంటల్లో హాట్ డాగ్స్ ని వేయించుకోవచ్చు. 50 00:04:55,754 --> 00:04:57,840 ఏంటి? నాకు హాట్ డాగ్స్ అంటే ఇష్టం. 51 00:04:58,757 --> 00:05:01,426 సమ్మర్ క్యాంపులు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని మా తాతయ్య అంటాడు. 52 00:05:01,969 --> 00:05:03,345 దాని అర్థం ఏంటి? 53 00:05:03,345 --> 00:05:06,139 పెద్దవాళ్లు వివేకవంతులుగా కనిపించాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ఏవో చెబుతుంటారు 54 00:05:06,139 --> 00:05:08,225 కానీ అంతకంటే నాకు ఏమీ తట్టడం లేదు. 55 00:05:13,605 --> 00:05:14,982 స్నూపీ సమస్య ఏంటి? 56 00:05:29,997 --> 00:05:31,582 బీగల్ స్కౌట్ చిట్కాల పుస్తకం 57 00:05:40,841 --> 00:05:41,842 ఔచ్. 58 00:05:43,635 --> 00:05:46,180 "అధికారిక బీగల్ స్కౌట్ పుస్తకం." 59 00:05:46,972 --> 00:05:50,392 అయితే, ఇది నీకు గైడ్ పుస్తకం లాంటిదన్న మాట. 60 00:05:50,392 --> 00:05:53,854 బ్యాడ్జీల గురించి నీ సందేహాల విషయంలో ఇందులోని సూచనలు నీకు సాయపడచ్చు. 61 00:05:54,605 --> 00:06:01,320 "ఒక నిజమైన బీగల్ స్కౌట్ కుక్క ప్రతి కొత్త ఛాలెంజ్ నీ తను రాణించడానికి ఒక అవకాశంగా భావిస్తుంది. 62 00:06:01,320 --> 00:06:06,325 తను అధిగమించలేనంత పెద్ద సమస్య ఎదురైనప్పుడు, 63 00:06:06,325 --> 00:06:08,493 బీగల్ స్కౌట్ కుక్క ఎప్పటికీ తన ఆశ వదులుకోదు 64 00:06:08,493 --> 00:06:12,623 కానీ తన మరింత పట్టుదలతో మరింత గట్టిగా పోరాడుతుంది." 65 00:06:14,374 --> 00:06:18,462 "తనకి నమ్మకమైన బృందంతో కలిసికట్టుగా పని చేయడం ద్వారా, 66 00:06:18,462 --> 00:06:21,715 ఒక బీగల్ స్కౌట్ కుక్క ఏదైనా సాధించగలుగుతుంది." 67 00:06:31,099 --> 00:06:34,269 "ఏదైనా సాహసకృత్యం చేయడానికి ముందు, 68 00:06:34,269 --> 00:06:37,606 బీగల్ స్కౌట్ కుక్కలు వాటి లక్ష్యాలని ముందుగా నిర్దేశించుకోవాలి, 69 00:06:37,606 --> 00:06:41,318 ఎందుకంటే ప్రతి ప్రయాణం మొదటి అడుగుతోనే మొదలవుతుందని వాటికి తెలుసు." 70 00:06:50,786 --> 00:06:54,331 "బీగల్ స్కౌట్ కుక్క తను చేయాల్సిన పని మీదనే ధ్యాస పెడుతుంది." 71 00:06:59,753 --> 00:07:03,131 "ఒక బీగల్ స్కౌట్ కుక్క ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంటుంది." 72 00:07:22,860 --> 00:07:25,904 {\an8}- సమ్మర్ క్యాంప్, ఇదిగో వచ్చేస్తున్నాం. - బస్సులో నా పక్కన కూర్చోవాలని ఉందా, సర్? 73 00:07:25,904 --> 00:07:27,781 నీళ్లలో ఈత కొట్టడానికి నేను తహతహలాడుతున్నాను. 74 00:07:29,741 --> 00:07:31,451 నాకు వీడ్కోలు పలకడానికి వచ్చావా? 75 00:07:36,665 --> 00:07:38,083 అయ్యో, స్నూపీ. 76 00:07:38,083 --> 00:07:39,710 నువ్వు నాతో పాటు రాలేవు. 77 00:07:39,710 --> 00:07:43,463 ఈ క్యాంప్ కేవలం పిల్లల కోసం. అక్కడ పెంపుడు జంతువుల్ని అనుమతించరు. 78 00:07:44,631 --> 00:07:45,966 నేను వెళ్లాలి. 79 00:07:45,966 --> 00:07:50,345 కానీ, నీ పెర్ఫార్మెన్స్ బ్యాడ్జీల విషయంలో నీకు గుడ్ లక్. 80 00:08:07,112 --> 00:08:10,240 {\an8}"ఒక నిజమైన బీగల్ స్కౌట్ కుక్క ప్రతి కొత్త ఛాలెంజ్ నీ 81 00:08:10,240 --> 00:08:13,118 {\an8}తను రాణించడానికి ఒక అవకాశంగా స్వీకరిస్తుంది." 82 00:08:29,259 --> 00:08:32,888 స్ప్రింగ్ సరస్సు 83 00:08:34,932 --> 00:08:36,015 నా దారికి అడ్డు లే! 84 00:08:36,015 --> 00:08:37,683 - వచ్చేశాం! - మంచి బంక్ కావాలి. 85 00:08:51,448 --> 00:08:52,866 పాపం స్నూపీ. 86 00:08:52,866 --> 00:08:57,162 నిరాశపడటంలో నాకున్నంత అనుభవం స్నూపీకి లేదు. 87 00:08:57,162 --> 00:09:01,041 ఎక్కడ ఉన్నా, వాడు బాగుండాలని కోరుకుంటా. 88 00:09:33,198 --> 00:09:35,117 "నువ్వు బీగల్ స్కౌట్ కుక్కవి కాగలవా? 89 00:09:36,827 --> 00:09:38,245 మధ్యాహ్న భోజనం సర్దుకోవాలి. 90 00:09:40,247 --> 00:09:45,711 గొప్ప ప్రకృతి దృశ్యాలను అనుభూతి చెందడానికి కొండలు ఎక్కడం సరదాగా, ఇంకా రిలాక్సింగ్ గా ఉంటుంది. 91 00:09:45,711 --> 00:09:47,921 కానీ నీకు గనుక బీగల్ స్కౌట్ కుక్క కావాలని ఉంటే, 92 00:09:47,921 --> 00:09:51,508 ఆ ప్రయత్నం చేయడానికి ముందు నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి." 93 00:09:58,807 --> 00:10:03,020 "శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఎప్పుడూ చాలా నీళ్లని మీతో తీసుకువెళ్లేలా చూసుకోవాలి." 94 00:10:14,615 --> 00:10:16,783 "కొండలు ఎక్కేటప్పుడు నీళ్లు తీసుకువెళ్లాల్సి వస్తే, 95 00:10:16,783 --> 00:10:19,328 చిన్న వాటర్ బాటిల్ చక్కని ఎంపిక. 96 00:10:28,128 --> 00:10:30,255 దాని మూత తీయడం మర్చిపోవద్దు." 97 00:10:34,218 --> 00:10:38,180 "కొండలు ఎక్కేటప్పుడు, అల్పాహారం తీసుకువెళ్లడం చాలా ముఖ్యం. 98 00:10:39,806 --> 00:10:42,059 ఏదైనా తేలికగా తినేలా ఆహారాన్ని ఎంచుకోవాలి." 99 00:10:44,353 --> 00:10:47,564 "నీకు ఏమైనా సందేహం ఉంటే, శాండ్విచ్ లు మంచి ఆలోచన. 100 00:10:47,564 --> 00:10:50,984 మీ బృందం అందరి సాయంతో వాటిని తయారు చేసుకోవచ్చు." 101 00:11:22,057 --> 00:11:26,937 "కొండలు ఎక్కడానికి ఏర్పాటు చేసుకోవడంలో ఆహారం ఇంకా మంచినీరు చాలా అవసరం. 102 00:11:26,937 --> 00:11:30,148 అయితే, అలా చేయడం కుదరకపోతే, 103 00:11:30,691 --> 00:11:33,986 మంచి పిజ్జాలు సరిపడా తీసుకువెళ్లడంలో తప్పు లేదు." 104 00:12:28,457 --> 00:12:30,250 "పక్షికి చేపలు పట్టడం నేర్పించు." 105 00:13:04,451 --> 00:13:05,994 స్నూపీ? 106 00:13:15,754 --> 00:13:18,799 స్నూపీ! వచ్చింది నువ్వే అనుకున్నాను. 107 00:13:18,799 --> 00:13:20,342 ఇక్కడ ఏం చేస్తున్నావు? 108 00:13:23,095 --> 00:13:26,014 "అధికారిక బీగల్ స్కౌట్ నియమావళి." 109 00:13:26,014 --> 00:13:29,685 బ్యాడ్జీలు సంపాదించడం కోసం నువ్వు నన్ను ఇంత దూరం అనుసరిస్తూ వచ్చావా? 110 00:13:30,978 --> 00:13:33,438 నన్ను మిస్ కాలేదని ఖచ్చితంగా చెప్పగలవా? 111 00:13:37,359 --> 00:13:39,778 సరే, నిన్ను చూడటం సంతోషంగా ఉంది. 112 00:13:39,778 --> 00:13:42,990 అయితే, నువ్వు ఏ బ్యాడ్జీని మొదటగా సంపాదించాలి అనుకుంటున్నావు? 113 00:13:52,332 --> 00:13:53,667 ఫిషింగ్ బ్యాడ్జ్, హా? 114 00:13:53,667 --> 00:13:55,377 వినడానికి గొప్పగా ఉంది. 115 00:13:55,377 --> 00:13:58,922 మంచి చేపని పట్టడం కన్నా గొప్ప ఫీలింగ్ ఇంకేదీ ఉండదు. 116 00:14:00,674 --> 00:14:01,884 అలాగని మా పెద్దలు చెప్పారు. 117 00:14:02,467 --> 00:14:05,387 నిజానికి నేను ఎప్పుడూ చేపలు పట్టలేదు. 118 00:14:05,387 --> 00:14:09,224 కొందరు ఏమంటారు అంటే, అసలైన సంతోషం చేపలు పట్టడంలో ఉండదట, 119 00:14:09,224 --> 00:14:11,894 ఓర్పుగా ఉండటం అనేది ఎంత విలువైనదో నేర్చుకోగలుగుతామట ఇంకా... 120 00:14:11,894 --> 00:14:13,770 ఎవరితో మాట్లాడుతున్నావు, చక్? 121 00:14:16,773 --> 00:14:17,858 ఎవరూ లేరు. 122 00:14:18,525 --> 00:14:20,736 మనం పడవ నడపడం ప్రయత్నించాలని బంక్ కౌన్సెలర్ చెప్పారు. 123 00:14:20,736 --> 00:14:22,654 కాబట్టి మనం పడవలో ప్రయాణానికి బయలుదేరుతున్నాం. 124 00:14:22,654 --> 00:14:24,072 అవును కదా, మార్సీ? 125 00:14:24,072 --> 00:14:25,490 అదే మన ప్లాన్. 126 00:14:25,490 --> 00:14:28,118 మనం నేల మీద స్థిరంగా ఉంటున్నప్పుడు 127 00:14:28,118 --> 00:14:30,871 అటూ ఇటూ ఊగిపోయే పడవ ప్రయాణం ఎందుకు చేయాలో నాకు అర్థం కావడం లేదు. 128 00:14:30,871 --> 00:14:33,081 సాహసయాత్ర చేయాలన్న ఆలోచన ఏమైంది? 129 00:14:34,166 --> 00:14:36,084 నేను దాన్ని బస్సులోనే వదిలిపెట్టి ఉంటాను, సర్. 130 00:15:02,194 --> 00:15:05,155 నీటిలో ప్రయాణానికి ఈ పడవ సరైనదే అంటారా? 131 00:15:06,615 --> 00:15:09,868 చాలా సురక్షితం. మీరు అదే చెబుతారని నేను అనుకున్నా. 132 00:15:09,868 --> 00:15:13,330 లైఫ్ గార్డ్ ఏం చెప్పాడో విన్నావు కదా, మార్సీ. ఇంక పడవలో వెళదాం పద. 133 00:15:14,456 --> 00:15:15,874 నన్ను ఆపడానికి ప్రయత్నించండి, సర్. 134 00:16:41,585 --> 00:16:42,753 చూశావా, మార్సీ? 135 00:16:42,753 --> 00:16:44,463 అచ్చు కౌన్సెలర్ చెప్పినట్లే ఉంది. 136 00:16:44,463 --> 00:16:49,009 "చుట్టూ చెట్లు ఇంకా ఆకాశం ఉండే అద్దంలాంటి సరస్సులో పడవ నడపడం కన్నా గొప్ప అనుభూతి ఇంకేదీ ఉండదు." 137 00:16:49,009 --> 00:16:50,969 ఇది చాలా రిలాక్సింగ్ గా ఉంది కదా? 138 00:16:52,095 --> 00:16:55,057 నేను ఖచ్చితంగా అదే పదాన్ని వాడలేను, సర్. 139 00:17:13,492 --> 00:17:16,328 తెడ్డు వేయడం నీకు మెల్లగా అలవాటు అవుతోంది అనుకుంటా. 140 00:17:17,454 --> 00:17:20,207 ఇప్పుడు, పడవని ఏ దిశగా నడపాలి అనేదాని మీద మనం దృష్టి పెట్టాలి. 141 00:18:01,623 --> 00:18:03,125 ప్రకృతి చేసే అద్భుతాలు. 142 00:18:15,220 --> 00:18:17,973 మీకు తెలుసా, సర్, ఒకసారి మనం అలవాటుపడితే, 143 00:18:17,973 --> 00:18:19,892 ఇక్కడ నిజంగా చాలా చక్కగా ఉంటుంది. 144 00:18:26,190 --> 00:18:28,942 నేను మిమ్మల్ని చౌ టైమ్ కి తీసుకువెళ్లడానికి వచ్చాను. 145 00:18:28,942 --> 00:18:30,819 ఈ క్యాంప్ లో "భోజనాలు"ని అలా అంటారు. 146 00:18:46,335 --> 00:18:47,711 చేపలు కొరుకుతున్నాయా, బుజ్జీ? 147 00:18:53,884 --> 00:18:55,886 సరే, నేను చెప్పింది గుర్తుంచుకో. 148 00:18:55,886 --> 00:18:57,554 చేపలు పట్టడం మంచిగా ఉంటుంది, 149 00:18:57,554 --> 00:19:02,059 కానీ ఓర్పు ఇంకా శ్రద్ధ ఉండటం వల్ల చాలా లాభాలు దక్కుతాయి. 150 00:19:03,101 --> 00:19:05,062 అందుకోసం ప్రత్యేకంగా ఒక బ్యాడ్జీ ఇవ్వాలి. 151 00:19:05,854 --> 00:19:08,232 మనం బహుశా తిరిగి వెళ్లాలి అనుకుంటా, 152 00:19:08,232 --> 00:19:10,067 కానీ మనం కంగారు పడద్దు. 153 00:19:10,067 --> 00:19:13,111 నాకు ఇంకాసేపు ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించాలని ఉంది. 154 00:19:13,111 --> 00:19:14,988 నువ్వు ప్రయత్నం విరమించకపోవడం నాకు సంతోషంగా ఉంది. 155 00:19:14,988 --> 00:19:17,699 నువ్వు మంచిగా ప్రయత్నించావు ఇంకా ఇప్పుడు ఎంత బాగా అలవాటుపడ్డావో చూడు. 156 00:19:17,699 --> 00:19:19,576 నిన్ను చూసి గర్వపడుతున్నాను, మార్సీ. 157 00:19:19,576 --> 00:19:21,203 నన్ను చూసి నేను కూడా గర్వపడుతున్నాను, సర్. 158 00:20:32,191 --> 00:20:36,195 ఓర్పు ఇంకా శ్రద్ధ ఎన్నో లాభాలని అందిస్తాయి. 159 00:20:42,409 --> 00:20:45,078 వాటి కోసం ప్రత్యేకంగా ఒక బ్యాడ్జీ ఉండాలి. 160 00:20:55,047 --> 00:20:56,089 చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన పీనట్స్ కామిక్ కథల ఆధారంగా 161 00:21:19,988 --> 00:21:21,990 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్ 162 00:21:25,077 --> 00:21:27,037 థాంక్యూ, స్పార్కీ. ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు.