1 00:00:33,534 --> 00:00:35,619 మా నాన్న బెస్ట్ పకోడీలు చేస్తారు. 2 00:00:37,538 --> 00:00:39,622 మా అమ్మ ఆయన చట్నీ తింటుంటే ఇంట్లో ఎవరూ చూడకూడదని 3 00:00:39,623 --> 00:00:42,459 ఒక గిన్నె నిండా చట్నీ తీసుకుని దాన్ని కప్ బోర్డులో దాచేది. 4 00:00:45,504 --> 00:00:47,381 మా అమ్మ చాలా అసూయపడేది. 5 00:00:52,678 --> 00:00:57,224 అలాగే మా చిన్నప్పుడు, ఆమె తేనెతో రోటీలు చేసేది. 6 00:00:57,850 --> 00:01:01,894 అవి చాలా తియ్యగా, మెత్తగా ఉండేవి, తేనె రోటీ మీద కరిగిపోయేది, 7 00:01:01,895 --> 00:01:03,521 మేము చదువుకునేటప్పుడు వాటిని తినేవాళ్ళం. 8 00:01:03,522 --> 00:01:04,565 దయచేసి ఆపు. 9 00:01:08,944 --> 00:01:10,737 నిన్ను నువ్వే బాధపెట్టుకుంటున్నావు. 10 00:01:14,658 --> 00:01:17,411 ఆ పిచ్చి కోడ్ ని వృథాగా అన్నిసార్లు నువ్వే పంపుతున్నావు. 11 00:01:19,204 --> 00:01:22,082 సమాచార సిస్టమ్స్ ని బాగు చేయడానికి నీ దగ్గర ఏదైనా మ్యాజికల్ విధానం ఉంటే తప్ప అది పనిచేయదు. 12 00:01:24,168 --> 00:01:26,003 నువ్వు ఎందుకు ట్రై చేస్తున్నావో తెలీడం లేదు, సాష. 13 00:01:27,212 --> 00:01:30,215 మనం తిరిగి భూమిపై ల్యాండ్ అయ్యేసరికి మనల్ని కలవడానికి ఎవరైనా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. 14 00:01:32,759 --> 00:01:35,345 తొమ్మిది నెలలు ఈ జైలులో గడిపి ఎటూ కాని చోట 15 00:01:36,305 --> 00:01:38,182 ఒంటరిగా చావడం చాలా దారుణంగా ఉంటుంది. 16 00:01:49,443 --> 00:01:50,944 మనల్ని చూసి వాళ్ళేం సంతోషించరు. 17 00:01:51,987 --> 00:01:53,989 - వాల్య ఏమన్నాడు అంటే… - వాడి పేరు ఎత్తకు. 18 00:01:59,536 --> 00:02:01,329 సాష, జరిగింది నీ తప్పు కాదు. 19 00:02:01,330 --> 00:02:03,332 చెప్పాను కదా, వాడి గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. 20 00:02:25,437 --> 00:02:26,563 మంటలు ఆరాయి. 21 00:02:27,814 --> 00:02:29,899 ఒత్తిడి తగ్గడం వల్ల మంటలు ఆరిపోయి ఉంటాయి. 22 00:02:29,900 --> 00:02:32,318 - సాష! నువ్వు బానే ఉన్నావా? - నేను బానే ఉన్నాను. బానే ఉన్నాను. 23 00:02:32,319 --> 00:02:34,737 ఒత్తిడి తగ్గడం ఆగింది, కానీ మరొక మాస్టర్ అలారం మోగుతోంది. 24 00:02:34,738 --> 00:02:36,073 ప్యానెల్ చెక్ చెయ్. 25 00:02:39,701 --> 00:02:41,285 క్యాబిన్ లో గాలి బాగా పాడైంది. 26 00:02:41,286 --> 00:02:43,996 ఒత్తిడి తగ్గడం నెమ్మదించింది, కానీ గాలిలో కలుషితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 27 00:02:43,997 --> 00:02:45,873 లక్ష్మీ, క్యాబిన్ ఒత్తిడి చెక్ చేయడం మర్చిపోకు. 28 00:02:45,874 --> 00:02:47,125 అది ఎంత ఉందో నాకు చెప్పు. 29 00:02:48,544 --> 00:02:51,587 మెర్క్యురీ 413 మిల్లీమీటర్లు ఉంది, ఇంకా పెరుగుతోంది. 30 00:02:51,588 --> 00:02:53,506 మంచిది, ఒత్తిడి తిరిగి పెరుగుతోంది, 31 00:02:53,507 --> 00:02:56,510 కానీ మన ఫ్లైట్ కంప్యూటర్లు పూర్తిగా పాడైపోయాయి. అది పనికిరాదు. 32 00:02:58,762 --> 00:03:00,681 దానర్థం మనం ఇక గ్రౌండ్ కంట్రోల్ తో మాట్లాడలేం. 33 00:03:01,265 --> 00:03:02,432 మన పని అయిపోయింది. 34 00:03:11,149 --> 00:03:12,150 నన్ను క్షమించు. 35 00:03:12,776 --> 00:03:14,027 నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు. 36 00:03:20,492 --> 00:03:22,159 - సాష! - ద్రోహి. 37 00:03:22,160 --> 00:03:25,580 సాష! సాష, ఆగు! ఆగు, సాష! 38 00:03:25,581 --> 00:03:27,124 సాష, ఆగు! సాష! 39 00:03:27,916 --> 00:03:29,876 నీకు అసలు ఏమైంది, సాష? ఆగు. 40 00:03:29,877 --> 00:03:31,002 నన్ను చూడకు! 41 00:03:31,003 --> 00:03:32,128 అసలు నీకేం పోయేకాలం? 42 00:03:32,129 --> 00:03:33,881 ఆగు! ఆగు! 43 00:03:34,715 --> 00:03:35,716 మీద నుండి లే! 44 00:05:26,493 --> 00:05:28,286 హేయ్! హేయ్, అది ఇంకా రెడీ అవ్వలేదు! 45 00:05:28,287 --> 00:05:29,412 రుచి చూస్తే రెడీ అయినట్టే ఉంది. 46 00:05:29,413 --> 00:05:31,998 మనం కూర్చోవడానికి ముందే తింటే తర్వాత తినడానికి ఏం ఉండదు. 47 00:05:31,999 --> 00:05:33,666 ఊరుకో, హేయ్, ఇది మనకు కొత్తేమీ కాదు కదా. 48 00:05:33,667 --> 00:05:35,877 మనం మిగిలింది తిన్న తర్వాత నేరుగా డెజర్ట్ తినొచ్చు. 49 00:05:35,878 --> 00:05:36,879 నీకేం అనిపిస్తోంది? 50 00:05:39,339 --> 00:05:43,010 భోజనం తర్వాత మనం మళ్ళీ కొలను చుట్టూ నడుద్దాం. 51 00:05:45,762 --> 00:05:47,639 చెర్రీ చెట్లకు మళ్ళీ పువ్వులు పూస్తున్నాయి. 52 00:05:48,807 --> 00:05:49,808 ఏంటి? 53 00:05:51,768 --> 00:05:52,769 ఇప్పుడేమైంది? 54 00:05:56,857 --> 00:05:58,316 మిమ్మల్ని కలవడానికి ఒకరు వచ్చారు. 55 00:05:58,317 --> 00:06:00,401 మేము ఇప్పుడే భోజనానికి కూర్చుంటున్నాం. నేను ఎవరినీ… 56 00:06:00,402 --> 00:06:02,945 హేయ్, క్షమించండి, చీఫ్, నేను ముందే కాల్ చేసి ఉండాల్సింది, కానీ… 57 00:06:02,946 --> 00:06:03,947 సెర్గీ. 58 00:06:05,282 --> 00:06:06,908 లోనికి రా, లోనికి రా. 59 00:06:06,909 --> 00:06:07,992 నీ తల చూసుకో. 60 00:06:07,993 --> 00:06:09,410 గలీన, గలీన. 61 00:06:09,411 --> 00:06:10,746 ఎవరొచ్చారో చూడు. 62 00:06:14,833 --> 00:06:16,751 నిన్ను చూడటం సంతోషంగా ఉంది, కామ్రేడ్ నికొలోవ్. 63 00:06:16,752 --> 00:06:18,587 మిమ్మల్ని చూడటం కూడా, గలీన. మిమ్మల్ని చూడటం కూడా. 64 00:06:19,963 --> 00:06:21,631 మాతో కలిసి భోజనం చేస్తావా? 65 00:06:21,632 --> 00:06:22,715 ఊరుకోండి. 66 00:06:22,716 --> 00:06:25,218 సూర్యాస్తమయం వరకు విచ్చేసినవాళ్లు ఉండొచ్చు. 67 00:06:25,219 --> 00:06:27,011 మీకు ఇబ్బంది ఉండదు అంటేనే ఉంటాను. 68 00:06:27,012 --> 00:06:28,514 - లేదు, ఇబ్బంది లేదు. - అలాంటిది ఏం లేదు. 69 00:06:29,181 --> 00:06:30,307 నేను మీకు ఒక విషయం… 70 00:06:33,393 --> 00:06:35,020 మీ ఆరోగ్యం బాగుండి ఉంటుందని ఆశిస్తున్నా. 71 00:06:35,521 --> 00:06:36,729 అవును, అవును, అవును. 72 00:06:36,730 --> 00:06:38,857 నాకు ఇప్పుడు చాలా బాగుంది. థాంక్స్. 73 00:06:39,691 --> 00:06:43,361 గలీన, నువ్వు నీ అందమైన డంప్లింగ్స్ ఎలా చేస్తావో సెర్గీకి చూపించవచ్చు కదా. 74 00:06:43,362 --> 00:06:44,445 అవంటే నాకు చాలా ఇష్టం. 75 00:06:44,446 --> 00:06:50,577 సరే, సరే. ముందు మనం పిండికి ఉప్పు కలపాలి. 76 00:06:51,870 --> 00:06:52,954 ఆ తర్వాత… 77 00:06:52,955 --> 00:06:56,041 ఆ తర్వాత ఒక గుడ్డు కలపాలి. 78 00:07:01,505 --> 00:07:03,799 ఆ తర్వాత ఉప్పు వేయాలి. 79 00:07:07,135 --> 00:07:08,261 కలుపుతూనే ఉండు. 80 00:07:08,262 --> 00:07:10,096 బ్రతికి ఉన్నారు 81 00:07:10,097 --> 00:07:13,266 మనం పిండికి గుడ్లు కలపడానికి ముందు 82 00:07:13,267 --> 00:07:16,937 గుడ్లు బాగా కలపాలి. 83 00:07:18,522 --> 00:07:22,276 లేదంటే పిండి ఉండలు కడుతుంది. 84 00:07:24,570 --> 00:07:27,072 సరేనా, మనం అవసరమైతే మరింత పిండి… 85 00:07:28,198 --> 00:07:29,199 కలపాలి. 86 00:07:41,420 --> 00:07:43,838 మనం వీనస్ కి వెళ్లాం, గలీన, నువ్వు ఇది నమ్మగలవా? 87 00:07:43,839 --> 00:07:45,632 మనం వీనస్ కి వెళ్లాం. 88 00:07:46,925 --> 00:07:48,093 ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా? 89 00:07:49,094 --> 00:07:51,470 శాల్యూట్-1లో ఉన్న కాస్మోనాట్ బెలికోవాకి తెలుసు. 90 00:07:51,471 --> 00:07:53,681 సిగ్నల్ ఎక్కడి నుండి వచ్చిందో కంఫర్మ్ చేసింది ఆవిడే. 91 00:07:53,682 --> 00:07:55,683 నీకు ఇంకొన్ని మష్రూమ్స్ వడ్డించనా? 92 00:07:55,684 --> 00:07:56,810 సరే. థాంక్స్. 93 00:08:06,403 --> 00:08:10,157 వాళ్ళు ఇంకొక మూడు రోజులలో కజకిస్తాన్ లో ల్యాండ్ అవ్వబోతున్నారు. 94 00:08:10,657 --> 00:08:12,534 వాళ్ళు సోవియెట్ యూనియన్ లో ల్యాండ్ అవ్వకూడదు. 95 00:08:13,493 --> 00:08:15,786 వాళ్ళు చేసిన పనికి వాళ్ళని జైలుకు పంపడమో లేక ఇంకా దారుణమైన శిక్షో వేస్తారు. 96 00:08:15,787 --> 00:08:18,456 మనం వాళ్ళ దిశను మార్చడానికి ఒక మార్గం కనిపెట్టాలి. 97 00:08:18,457 --> 00:08:20,667 ఎలా? వాళ్ల దగ్గర ఇంధనం ఉండదు కదా. 98 00:08:21,251 --> 00:08:22,668 వాళ్ళ ఎంట్రీ యాంగిల్ ని మార్చాలి. 99 00:08:22,669 --> 00:08:26,589 వాళ్ళు గనుక వాళ్ళ రోల్ ఆటిట్యూడ్ ని మార్చితే, వాళ్ళు కావాల్సినంత ఏటవాలుగా ఎంటర్ అవుతారు, 100 00:08:26,590 --> 00:08:30,344 అప్పుడు గాలి రుద్దుడు కారణంగా వాళ్ళ దిశ మారి మరొక ప్రదేశంలో వాళ్ళ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. 101 00:08:35,265 --> 00:08:36,807 ఏమాత్రం లెక్క తప్పినా… 102 00:08:36,808 --> 00:08:39,602 ఆ లెక్కలు నేను వేసి ఇస్తాను, సెర్గీ. 103 00:08:40,729 --> 00:08:46,527 కానీ నువ్వు స్టార్ సిటీకి తెలియకుండా ఆ లెక్కలు వెనేరకి ఎలా చేరవేయాలో కనిపెట్టాలి. 104 00:09:21,770 --> 00:09:22,771 నేను ఇది నమ్మలేకపోతున్నాను. 105 00:09:23,897 --> 00:09:24,898 వాళ్ళు వీనస్ కి చేరుకున్నారా? 106 00:09:33,115 --> 00:09:38,160 అసలు తిరిగి వాతావరణంలోకి వచ్చేటప్పుడు వాళ్ళ నౌక పెరిగే ఉష్ణ భారాన్ని తట్టుకోగలదా? 107 00:09:38,161 --> 00:09:39,162 నాకు తెలీదు. 108 00:09:40,998 --> 00:09:42,623 కానీ వాళ్లకి మన సాయం అవసరం. 109 00:09:42,624 --> 00:09:45,334 నాకు కూడా చేయాలనే ఉంది, కానీ ఇప్పుడు నాకు కాన్సోల్… 110 00:09:45,335 --> 00:09:46,336 యాక్సెస్ లేదు. 111 00:09:47,963 --> 00:09:51,008 మనం తప్పించడానికి వాళ్లకి సాయం చేసినోళ్లం అవుతాం. 112 00:09:52,134 --> 00:09:53,217 మీరోనవ్… 113 00:09:53,218 --> 00:09:56,847 అవును, అలాగే వాళ్ళు ల్యాండ్ అయ్యాక వాడు చేసిన పనికి అనుభవిస్తాడు. 114 00:09:57,723 --> 00:09:59,182 కానీ మిగిలిన ఇద్దరు 115 00:09:59,183 --> 00:10:01,602 ఇన్నాళ్లు పడిన బాధ చాలు, ఇకపై అంతకంటే ఎక్కువ బాధపడకూడదు. 116 00:10:09,651 --> 00:10:11,195 చీఫ్ డిజైనర్ నిన్నే ఖచ్చితంగా అడగమన్నారు… 117 00:10:12,446 --> 00:10:13,697 ప్రత్యేకంగా. 118 00:10:17,409 --> 00:10:18,951 ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు, అలాంటిది… 119 00:10:18,952 --> 00:10:19,995 లేదు, ఆయన్ని నేను కలిశాను. 120 00:10:20,746 --> 00:10:24,875 ఇలా చూడు, కావాల్సిన లెక్కలు ఆయనే వేసి ఇస్తానన్నారు, కానీ… 121 00:10:25,459 --> 00:10:28,962 కానీ శాల్యూట్ లో ఉన్న బెలికోవాకి ఆ లెక్కలు చేరవేయడానికి మాకు నీ సాయం కావాలి. 122 00:10:30,047 --> 00:10:31,048 ఎందుకు? 123 00:10:32,382 --> 00:10:36,219 ఎందుకంటే మనం ఇక్కడి నుండి వెనేరకి ఏ సమాచారం అందించినా వీళ్లకు తెలిసిపోవచ్చు. 124 00:10:36,220 --> 00:10:38,846 కానీ శాల్యూట్ కక్ష్యలో స్టార్ సిటీతో పూర్తిగా 125 00:10:38,847 --> 00:10:41,308 కనెక్షన్ కోల్పోయే కొన్ని పాయింట్లు ఉన్నాయి. 126 00:10:42,059 --> 00:10:43,727 - సిగ్నల్ లాస్ సమయంలో. - అవును. 127 00:10:44,311 --> 00:10:47,438 కాబట్టి బెలికోవాకి వెనేరలో ఉన్న ఎన్క్రిప్ట్ చేయబడిన 128 00:10:47,439 --> 00:10:51,400 ట్రాన్స్మిటర్ యాక్సెస్ దొరికితే ఆమె వాళ్ళను సంప్రదించగలుగుతుంది. 129 00:10:51,401 --> 00:10:52,568 ఇది అద్భుతమైన ఐడియా. 130 00:10:52,569 --> 00:10:54,363 కానీ ఇది దేశ ద్రోహం కూడా. 131 00:10:57,783 --> 00:10:58,784 నాకు… 132 00:11:05,916 --> 00:11:07,668 ఆయన నా పేరు చెప్పారా? 133 00:11:09,837 --> 00:11:10,838 అవును. 134 00:11:13,006 --> 00:11:14,007 పేరు చెప్పారు. 135 00:11:24,351 --> 00:11:25,435 సరే. 136 00:11:27,020 --> 00:11:29,022 - చీఫ్ డిజైనర్ కోసం. - చీఫ్ డిజైనర్ కోసం. 137 00:12:09,563 --> 00:12:10,606 ఓహ్, లేదు. 138 00:12:14,401 --> 00:12:15,777 వాల్య, ఏం జరిగింది? 139 00:12:19,281 --> 00:12:20,991 లేదు, లేదు, లేదు, లేదు. 140 00:12:21,575 --> 00:12:22,659 అంతా బానే ఉందా? 141 00:12:23,535 --> 00:12:26,245 మనం వీనస్ కి ఇంత దగ్గరకు వచ్చే వరకు నేను చూడలేకపోయా, 142 00:12:26,246 --> 00:12:29,750 కానీ ఒత్తిడి తగ్గినప్పుడు బయటకు వెళ్లిన గాలి కారణంగా… 143 00:12:32,419 --> 00:12:34,421 మన దిశ మారింది అనుకుంటున్నాను. 144 00:12:35,839 --> 00:12:37,090 మరీ ఎక్కువ కాదు, కానీ తగినంత. 145 00:12:39,426 --> 00:12:40,969 వాల్య, నీ ఉద్దేశం ఏంటి? 146 00:12:45,224 --> 00:12:46,225 వాల్య. 147 00:12:49,144 --> 00:12:50,937 వాల్య, కాస్త మాకు సమాధానం చెప్తావా? 148 00:12:50,938 --> 00:12:52,022 మనం వీనస్ ని మిస్ అవుతాం. 149 00:12:55,359 --> 00:12:56,360 ఏంటి? 150 00:13:00,864 --> 00:13:03,282 కానీ మనం వీనస్ ని మిస్ అయితే, తిరిగి భూమి వైపు వెళ్లలేం. 151 00:13:03,283 --> 00:13:07,412 అవును, మనం అలా ముందుకు వెళ్తూనే ఉంటాం… 152 00:13:08,163 --> 00:13:09,373 సూర్యుడి వైపు. 153 00:13:10,832 --> 00:13:12,834 సరే, మరొక బర్న్ చేద్దాం. 154 00:13:12,835 --> 00:13:13,918 మన మార్గాన్ని సరిచేసుకుందాం. 155 00:13:13,919 --> 00:13:16,129 అలా చేయడానికి మన దగ్గర ఇంధనం లేదు. 156 00:13:18,382 --> 00:13:20,384 వాల్య, మనం చేయగలది ఏదోకటి ఉండి ఉంటుంది. 157 00:13:52,708 --> 00:13:53,958 పది కోపెక్స్. 158 00:13:53,959 --> 00:13:55,251 ఇవి మెత్తబడిపోయాయి. 159 00:13:55,252 --> 00:13:56,335 కరువు కారణంగా. 160 00:13:56,336 --> 00:13:57,796 కరువు లేని ఏడాదే లేదు. 161 00:14:05,470 --> 00:14:07,556 - ఇవి ఎంత? - పది కోపెక్స్. 162 00:14:11,435 --> 00:14:13,394 మీ దగ్గర… తాజావి ఏమైనా ఉన్నాయా? 163 00:14:13,395 --> 00:14:14,813 నేను వెనక్కి వెళ్లి చెక్ చేస్తాను. 164 00:14:29,369 --> 00:14:31,370 - ఆయన్ని వదిలేయ్. - గలీన, లేదు. 165 00:14:31,371 --> 00:14:32,581 ప్లీజ్. 166 00:14:33,165 --> 00:14:37,336 ఆయన్ని మళ్ళీ ఆ ప్రపంచంలోకి లాగితే, ఆయన ప్రాణాలకే ప్రమాదం. 167 00:15:02,486 --> 00:15:03,694 శాల్యూట్-1. 168 00:15:03,695 --> 00:15:04,947 స్టార్ సిటీ, స్పందించండి. 169 00:15:06,907 --> 00:15:08,033 చెప్పండి, స్టార్ సిటీ. 170 00:15:09,076 --> 00:15:12,328 మా ఫ్రెండ్ యుహెచ్ఎఫ్ ట్రాన్స్మిటర్ సిస్టమ్ లో 171 00:15:12,329 --> 00:15:14,081 మిమ్మల్ని రొటీన్ పవర్ సైకిల్ చేయమని అడుగుతున్నారు. 172 00:15:14,581 --> 00:15:18,335 త్వరలో జరగబోయే సిగ్నల్ లాస్ సమయంలో దాన్ని రన్ చేయొచ్చు. 173 00:15:18,919 --> 00:15:20,796 కాసేపట్లో మీకు సీక్వెన్స్ ని పంపుతున్నాము. 174 00:15:23,966 --> 00:15:25,259 స్టార్ సిటీ, శాల్యూట్-1. 175 00:15:25,926 --> 00:15:30,764 మిస్సైల్ సైట్ 20-7-1-9-2గా అనుమానిస్తున్న ఉపరితల ఫోటోగ్రఫి మొదలెడుతున్నాం. 176 00:15:31,849 --> 00:15:33,141 కామ్రేడ్ బెలికోవా, 177 00:15:34,434 --> 00:15:36,979 సీక్వెన్స్ ని పంపుతున్నాను. 178 00:15:41,191 --> 00:15:46,780 శాల్యూట్-1, సిగ్నల్ పోతోంది, మూడు, రెండు, ఒకటి. 179 00:15:50,158 --> 00:15:52,160 సరే, కాసేపు బ్రేక్ తీసుకుందాం. 180 00:15:52,744 --> 00:15:53,745 తిందాం. 181 00:16:55,098 --> 00:16:57,893 ట్రాన్స్మిట్ అవుతోంది 182 00:17:23,669 --> 00:17:24,751 కదులు, సాష. 183 00:17:24,752 --> 00:17:26,672 - ఏంటి? - అదేంటి? 184 00:17:29,424 --> 00:17:30,551 ఎవరైనా స్పందిస్తున్నారా? 185 00:17:38,016 --> 00:17:39,100 ఇది కరప్ట్ అయిన డేటాలా ఉంది. 186 00:17:39,101 --> 00:17:42,311 బహుశా ఇది వేరే దేనికైనా చెందిన సమాచారం కావొ… 187 00:17:42,312 --> 00:17:43,355 ఆగు. 188 00:17:46,275 --> 00:17:47,276 ఏంటి? 189 00:17:54,908 --> 00:17:57,244 డేటాలో ఒక సందేశం ఉంది. 190 00:17:59,037 --> 00:18:00,038 ఎవరి నుండి? 191 00:18:02,666 --> 00:18:04,126 చీఫ్ డిజైనర్ నుండి. 192 00:18:08,130 --> 00:18:10,090 వాళ్ళకి మనం ప్రాణాలతో ఉన్నట్టు తెలుసు. మనం వెనక్కి వస్తున్నట్టు తెలుసు. 193 00:18:14,052 --> 00:18:15,053 కానీ ఆగు. 194 00:18:15,971 --> 00:18:19,433 ఆయన సోవియెట్ యూనియన్ లో ల్యాండ్ అవ్వడం సురక్షితం కాదు అన్నారు. 195 00:18:21,018 --> 00:18:22,436 ఇదొక ఫ్లైట్ సీక్వెన్స్. 196 00:18:23,812 --> 00:18:26,273 మన మార్గాన్ని మళ్లించడానికి ఒక దారి. 197 00:18:31,028 --> 00:18:32,446 ఫిన్లాండ్ లో ల్యాండ్ కావడానికి. 198 00:18:40,913 --> 00:18:41,914 ఫిన్లాండ్? 199 00:18:53,884 --> 00:18:56,053 బ్యాకప్ రేడియో సిస్టమ్ నుండి ట్రాన్స్మిషన్ వస్తోంది. 200 00:19:06,855 --> 00:19:07,856 వెనేర, స్పం… 201 00:19:09,274 --> 00:19:10,317 స్పందించండి. 202 00:19:11,443 --> 00:19:12,735 స్పందించండి. 203 00:19:12,736 --> 00:19:14,154 స్పందించండి, వెనేర. 204 00:19:15,656 --> 00:19:17,157 - స్పందించండి. - స్టాసియా? 205 00:19:17,699 --> 00:19:18,700 సాష? 206 00:19:20,160 --> 00:19:21,161 అది నువ్వేనా? 207 00:19:27,835 --> 00:19:28,836 అవును. 208 00:19:29,837 --> 00:19:31,004 అవును, నేనే. 209 00:19:35,384 --> 00:19:37,094 ఇది నువ్వే అంటే నమ్మలేకపోతున్నాను. 210 00:19:38,303 --> 00:19:41,014 నీకు సూచనలు అందాయో లేదో ధృవీకరించుకుందామని స్పందించా. 211 00:19:41,765 --> 00:19:43,183 అవును, మాకు అందాయి. 212 00:19:49,898 --> 00:19:51,608 మనం త్వరపడాలి. 213 00:19:52,317 --> 00:19:54,486 వాళ్ళు త్వరలోనే ఈ ఫ్రీక్వెన్సీని ట్రాక్ చేయొచ్చు. 214 00:19:59,867 --> 00:20:00,993 నేను… 215 00:20:02,661 --> 00:20:04,663 నేను నిన్ను ఎప్పటికైనా చూస్తానా, స్టాసియా? 216 00:20:08,125 --> 00:20:10,042 ఇప్పుడు అదంతా ఆలోచించకు. 217 00:20:10,043 --> 00:20:11,712 నువ్వు ప్లాన్ ని ఫాలో అవ్వాలి. 218 00:20:20,596 --> 00:20:21,597 సరే. 219 00:20:24,683 --> 00:20:26,935 కానీ అంతా ప్లాన్ ప్రకారమే జరిగితే… 220 00:20:30,898 --> 00:20:32,357 నేను అవతలి వైపు ఎదురుచూస్తుంటా. 221 00:20:38,197 --> 00:20:39,281 నాకు తెలుసు. 222 00:20:49,082 --> 00:20:50,083 ఇక నేను వెళ్ళాలి. 223 00:20:51,835 --> 00:20:53,003 గుడ్ బై, సాష. 224 00:21:28,413 --> 00:21:29,915 క్షమించు, సాష. 225 00:21:42,594 --> 00:21:43,804 మనం ఈ పని ఎలాగైనా చేయాలి. 226 00:21:47,766 --> 00:21:49,059 లేదంటే ఇంత వరకు పడిన కష్టం 227 00:21:50,018 --> 00:21:51,520 అంతా వృధా అవుతుంది. 228 00:21:54,898 --> 00:21:56,316 మనం ఇక పని మొదలెడితే మంచిది. 229 00:21:57,943 --> 00:21:59,570 మనం రీ-ఎంట్రీ అవ్వడానికి ఒక రోజు కూడా లేదు. 230 00:22:02,823 --> 00:22:04,825 నేను షిప్ బరువు బ్యాలెన్స్ చేయడం మొదలెడతా. 231 00:22:05,450 --> 00:22:07,244 మురుగునీటి ట్యాంకు ఎలాగూ దాదాపుగా నిండిపోయింది. 232 00:22:23,468 --> 00:22:24,636 ఓహ్, ఛ. 233 00:22:29,808 --> 00:22:32,144 కామ్రేడ్ కల్నల్, మాకు ఇప్పుడే రేడియో కాంటాక్ట్ అందింది… 234 00:22:45,532 --> 00:22:46,533 లోనికి రా. 235 00:23:07,471 --> 00:23:10,389 క్షమించండి, డెప్యూటీ చైర్మన్, కానీ నాకు 236 00:23:10,390 --> 00:23:13,809 వాళ్ళు ప్రపంచంలోనే అతిగొప్ప దేశమైన సోవియెట్ యూనియన్ 237 00:23:13,810 --> 00:23:15,811 విజయవంతంగా మనుషులను ఇంకొక 238 00:23:15,812 --> 00:23:19,441 గ్రహానికి పంపించింది అన్నట్టు వినిపించింది. 239 00:23:20,567 --> 00:23:22,235 సోవియెట్ యూనియన్ వర్కర్లకు… 240 00:23:22,236 --> 00:23:24,987 లేదు, లేదు! ఇది వేడుక జరుపుకోదగ్గ విషయం కాదు. 241 00:23:24,988 --> 00:23:27,574 ఇది మన దేశానికి ఒక గొప్ప అవమానం, అర్థమవుతుందా? 242 00:23:28,158 --> 00:23:30,243 ఒక అమెరికన్ మనిషి ఆ షిప్ లో ఉన్నాడు. 243 00:23:30,244 --> 00:23:31,745 ఈ పని వల్ల మనకొచ్చే కీర్తి ఏం లేదు. 244 00:23:33,455 --> 00:23:34,498 అవమానం మాత్రమే. 245 00:23:37,960 --> 00:23:40,586 ఇంతకు ముందు బెలికోవా విషయంలో మనం ఈ పని చేద్దాం అనుకున్నాం. 246 00:23:40,587 --> 00:23:44,091 వాళ్ళు కజకిస్తాన్ లో ల్యాండ్ అయినప్పుడు, మనం వాళ్ళను మార్చేద్దాం. 247 00:23:44,925 --> 00:23:46,801 అప్పుడు మిషన్ కి మనం క్రెడిట్ తీసుకుని… 248 00:23:46,802 --> 00:23:49,345 అసలు మిషన్ జరిగినట్టే ఎవరికీ తెలీకూడదు. ఇది జరగలేదు అన్నట్టే ఉండాలి. 249 00:23:49,346 --> 00:23:50,347 అర్థమైందా? 250 00:23:51,765 --> 00:23:54,893 ఇది జనరల్ సెక్రటరీ బ్రెజ్నవ్ గారి ఆదేశం. 251 00:23:57,271 --> 00:23:59,021 క్షమించండి, డెప్యూటీ చైర్మన్. 252 00:23:59,022 --> 00:24:03,651 సరే, వాళ్లందరినీ అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళని చంపేయండి. 253 00:24:03,652 --> 00:24:07,989 ఈ పని దగ్గరుండి జరిపించడానికి నేనే కజకిస్తాన్ కి వెళ్తాను, డెప్యూటీ చైర్మన్. 254 00:24:07,990 --> 00:24:10,367 చాలా మంచిది, చీఫ్ డిజైనర్ పెట్రోవ్స్కీ. 255 00:24:29,761 --> 00:24:30,888 నువ్వు అతన్ని చాలా మిస్ అవుతున్నావేమో. 256 00:24:35,976 --> 00:24:36,977 అవును. 257 00:24:42,232 --> 00:24:43,567 మరి అనస్టాసియా సంగతి? 258 00:24:45,903 --> 00:24:46,904 రోజూ మిస్ అవుతున్నాను. 259 00:24:51,909 --> 00:24:54,203 ఆమె అద్భుతమైన మహిళ, ఎంతో సాధించింది. 260 00:24:55,704 --> 00:24:57,956 మీరు ప్రోగ్రామ్ కారణంగా ఒకరినొకరు కలుసుకోవడం చాలా గొప్ప విషయం. 261 00:25:00,417 --> 00:25:01,919 అది అంత సింపుల్ విషయం కాదు. 262 00:25:03,462 --> 00:25:08,342 మమ్మల్ని కలపడానికి కొంచెం ఒత్తిడి కారణం అని చెప్పొచ్చు. 263 00:25:08,926 --> 00:25:10,135 ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 264 00:25:12,387 --> 00:25:13,472 మీది కూడా కుదిర్చిన పెళ్లేనా? 265 00:25:14,890 --> 00:25:16,641 అంటే, మీ అమ్మానాన్నలు లేదా… 266 00:25:16,642 --> 00:25:17,975 నిజానికి కాదు. 267 00:25:17,976 --> 00:25:20,437 మా కుటుంబం నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు, 268 00:25:21,522 --> 00:25:22,940 కానీ నా భర్తను కాదు. 269 00:25:24,733 --> 00:25:26,652 కానీ నేను యూనివర్సిటీకి వెళ్లాలని ఆశపడ్డా. 270 00:25:27,903 --> 00:25:29,321 నేను మా నాన్నని చాలా బ్రతిమిలాడాను. 271 00:25:30,030 --> 00:25:31,448 ఆయన ఎందుకు ఒప్పుకున్నారో నాకే తెలీదు. 272 00:25:34,076 --> 00:25:35,744 నువ్వు మీ భర్తని అక్కడే కలిసావా? 273 00:25:38,997 --> 00:25:40,666 నువ్వు యూనివర్సిటీలో ఉన్నప్పుడు? 274 00:25:41,708 --> 00:25:42,709 అవును. 275 00:25:43,460 --> 00:25:45,212 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో. 276 00:25:47,172 --> 00:25:48,215 మరి… 277 00:25:49,967 --> 00:25:51,134 మీరు కలిసిన వెంటనే ప్రేమలో పడ్డారా? 278 00:25:54,596 --> 00:25:55,597 అస్సలు కాదు. 279 00:25:56,807 --> 00:25:58,182 ఆయనకు పెళ్లయింది. 280 00:25:58,183 --> 00:25:59,851 - ఏంటి? - అవును. 281 00:25:59,852 --> 00:26:03,062 ఆయన భార్య ఢిల్లీలో వాళ్ళ ఇంట్లో ఉండేది, కాబట్టి… 282 00:26:03,063 --> 00:26:04,106 అంటే మీరు… 283 00:26:04,648 --> 00:26:08,484 ఆయన… నీకోసం తన భార్యని వదిలేశాడా? 284 00:26:08,485 --> 00:26:09,570 ఓహ్, కాదు. 285 00:26:11,738 --> 00:26:14,575 లేదు, అప్పటికి ఆమె చనిపోయింది. 286 00:26:19,079 --> 00:26:20,414 మేము కేవలం సహోద్యోగులం మాత్రమే. 287 00:26:23,041 --> 00:26:24,168 ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాము. 288 00:26:25,586 --> 00:26:28,839 మేము మాట్లాడుకునేవారిమి, భోజనానికి కలిసేవాళ్ళం. 289 00:26:30,924 --> 00:26:31,925 ఇంకేం లేదు. 290 00:26:33,719 --> 00:26:34,803 కానీ నువ్వు ఆయన్ని ప్రేమించావా? 291 00:26:39,349 --> 00:26:41,268 అవును, నెమ్మది నెమ్మదిగా ఇష్టం పెరిగింది. 292 00:26:42,186 --> 00:26:44,146 నాకు నేను అది నిజం కాదని చెప్పుకోవడానికి ట్రై చేశా. 293 00:26:45,189 --> 00:26:49,692 నేను చిన్నతనంగా, స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్నాను అని నాతో నేను చెప్పుకునేదాన్ని. 294 00:26:49,693 --> 00:26:51,612 అది కేవలం ఊహ మాత్రమే అని. 295 00:26:54,323 --> 00:26:56,450 నేనే ఆమె మరణానికి… 296 00:26:58,619 --> 00:27:01,205 కారణం అయ్యానేమో అనిపించడం మొదలైంది. 297 00:27:02,623 --> 00:27:05,125 ఆయనపై నాకున్న ఫీలింగ్స్ వల్ల అలా అయిందని. 298 00:27:06,919 --> 00:27:07,920 అది నీ తప్పు కాదు. 299 00:27:10,589 --> 00:27:11,923 అసలు నీ పొరపాటు అయ్యే అవకాశం ఏముంది? 300 00:27:11,924 --> 00:27:16,637 చూడు, చేసిన పనుల కారణంగానే మన భవిష్యత్ ఉంటుందని మేము నమ్ముతాం. 301 00:27:18,138 --> 00:27:20,140 కాబట్టి, నాకు అది మనసులో ఉండిపోయింది… 302 00:27:25,562 --> 00:27:26,647 ఆమె జ్ఞాపకం… 303 00:27:32,319 --> 00:27:33,403 అలాగే నా బాధ. 304 00:27:46,959 --> 00:27:48,377 లేదా బహుశా మనకు ఇలా జరగటం కరెక్టే ఏమో. 305 00:27:53,382 --> 00:27:57,344 ఇక్కడ… ఇలా చావడం. 306 00:28:02,099 --> 00:28:03,517 నువ్వు చావవు. 307 00:28:10,858 --> 00:28:14,778 మనం వీనస్ ని వాడుకుని తిరిగి భూమికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది అనిపిస్తోంది. 308 00:28:17,447 --> 00:28:20,449 కానీ మనకు దారి మళ్లించడానికి అవసరమైనంత ఇంధనం లేదు అన్నావు కదా. 309 00:28:20,450 --> 00:28:21,451 వెనేరలో లేదు. 310 00:28:25,289 --> 00:28:26,707 బాతిస్పియర్. 311 00:28:28,876 --> 00:28:29,877 అవును. 312 00:28:31,628 --> 00:28:34,714 వీనస్ పై ల్యాండ్ కావడానికి మనం వాడాల్సిన 313 00:28:34,715 --> 00:28:36,841 ఆ ప్రోబ్ లోని ఇంజిన్ ని ఆన్ చేస్తే, 314 00:28:36,842 --> 00:28:39,678 మన డైరెక్షన్ మార్చడానికి కావలసినంత ఫోర్స్ వస్తుంది. 315 00:28:44,057 --> 00:28:45,141 ఇది అద్భుతమైన ఐడియా. 316 00:28:45,142 --> 00:28:46,602 అవును. కానీ ఆ ఐడియా పనిచేయదు. 317 00:28:47,311 --> 00:28:50,188 - ఎందుకు? - ఎందుకంటే బాతిస్పియర్ కి ఉన్న ఇంజన్లు 318 00:28:50,189 --> 00:28:52,523 ఒకసారి అన్ డాక్ చేయబడ్డాక ఆటోమేటిక్ గా ఆన్ అయ్యేలా డిజైన్ చేయబడ్డాయి. 319 00:28:52,524 --> 00:28:55,193 వాటిని ముందుగానే మాన్యువల్ గా ఆన్ చేయాలి అంటే, ఎవరో ఒకరు… 320 00:28:55,194 --> 00:28:56,819 బాతిస్పియర్ లో ఒకరు ఉండాలి. 321 00:28:56,820 --> 00:29:01,532 అవును, కానీ ఒకసారి డాకింగ్ హుక్స్ తెరుచుకుంటే, వాటిని తిరిగి డాక్ చేయలేము. 322 00:29:01,533 --> 00:29:02,618 దాన్ని అలా డిజైన్ చేయలేదు… 323 00:29:05,037 --> 00:29:08,957 అది వీనస్ కి వన్-వే ట్రిప్, తిరిగి రాలేం. 324 00:29:17,674 --> 00:29:19,301 - నేను వెళ్తున్నాను. - వాల్య. 325 00:29:19,843 --> 00:29:21,427 - వాల్య! - ఆగు, వాల్య. 326 00:29:21,428 --> 00:29:23,763 - సాష! - నేను నిన్ను ఈ పని చేయనివ్వను. 327 00:29:23,764 --> 00:29:24,932 వాల్య! 328 00:29:28,018 --> 00:29:29,311 తలుపు తెరువు. 329 00:29:30,020 --> 00:29:31,188 ఈ పని చేయకు! 330 00:29:32,648 --> 00:29:36,527 వాల్య! వాల్య! వద్దు. 331 00:29:37,903 --> 00:29:39,111 తలుపు తెరువు! 332 00:29:39,112 --> 00:29:42,324 నాకోసం దయచేసి టాన్యాని కనిపెట్టి ఆమె క్షేమంగా ఉండేలా చూసుకో. 333 00:29:43,200 --> 00:29:44,201 లేదు! 334 00:29:53,961 --> 00:29:55,170 నాకు ప్రమాణం చెయ్. 335 00:30:04,096 --> 00:30:05,430 నేను ప్రమాణం చేస్తున్నాను. 336 00:30:48,056 --> 00:30:49,057 ఒక క్షణం మాట్లాడొచ్చా? 337 00:30:50,642 --> 00:30:53,186 నేను వెనేర గురించి విని మీకు సాయం చేయాలి అనుకున్నాను. 338 00:30:53,187 --> 00:30:55,855 నేను అనుమానాస్పదంగా అనిపించిన ఇంజనీర్ల 339 00:30:55,856 --> 00:30:59,443 రికార్డింగుల గురించి అందరినీ అడిగినప్పుడు ఒకటి నా దృష్టిని ఆకర్షించింది. 340 00:31:09,661 --> 00:31:10,704 ఏంటి? 341 00:31:11,705 --> 00:31:12,789 నాతో చెప్పిన విషయం ఈవిడకి చెప్పు. 342 00:31:13,540 --> 00:31:20,087 నేను నేను కామ్రేడ్ స్టెపానోవ్ మాటలు వింటున్నాను, అతను ప్రస్తుతం… 343 00:31:20,088 --> 00:31:21,881 శాల్యూట్ ప్రోగ్రామ్ హెడ్, అవును. 344 00:31:21,882 --> 00:31:22,965 విషయానికి రా. 345 00:31:22,966 --> 00:31:25,551 అంటే, అతను తన రొటీన్ ని మార్చాడని ఈమె చెప్పడం విన్నాను. 346 00:31:25,552 --> 00:31:27,470 ఆఫీసుకు వేరే మార్గంలో వస్తున్నాడు అంట. 347 00:31:27,471 --> 00:31:29,515 వివిధ సమయాల్లో గ్రౌండ్ కంట్రోల్ వదిలి బయటకు వెళ్తున్నాడు అంట. 348 00:31:30,015 --> 00:31:31,725 అందులో వింతేమీ లేదు. అతని ఉద్యోగ రీత్యా అది అవసరం. 349 00:31:32,309 --> 00:31:33,809 అంటే, నేను కూడా ముందు అదే అనుకున్నాను, 350 00:31:33,810 --> 00:31:36,563 కానీ అతను మరొక ఇంజనీర్ తో మాట్లాడటం గమనించాం. 351 00:31:37,147 --> 00:31:39,650 అతను గత ఏడాది డిసిప్లినరీ యాక్షన్ కోసం గుర్తించిన వ్యక్తి. 352 00:31:41,527 --> 00:31:42,945 అతను ఎవరితో మాట్లాడుతున్నాడు? 353 00:31:44,238 --> 00:31:46,280 అతను లెక్కల డిపార్ట్మెంట్ లో ఉంటాడు, 354 00:31:46,281 --> 00:31:48,575 అతను గ్రౌండ్ కంట్రోల్ లో కాన్సోల్ దగ్గర పనిచేసేవాడు. 355 00:31:50,160 --> 00:31:51,285 అతని పేరు సెర్… 356 00:31:51,286 --> 00:31:52,454 సెర్గీ నికొలోవ్. 357 00:31:54,581 --> 00:31:55,582 మీకు అతను తెలుసా? 358 00:32:04,883 --> 00:32:07,468 నువ్విలా అస్తమాను ఇక్కడికి రాకూడదు. 359 00:32:07,469 --> 00:32:08,554 కొత్తగా ఏమైనా తెలిసిందా? 360 00:32:09,638 --> 00:32:10,681 వాళ్ళు వెనక్కి వస్తున్నారా? 361 00:32:11,431 --> 00:32:13,267 ఆమె వెనేరకి కోఆర్డినెట్స్ ఇచ్చింది. 362 00:32:14,685 --> 00:32:15,727 థాంక్స్. 363 00:32:17,020 --> 00:32:18,021 థాంక్స్. 364 00:32:20,732 --> 00:32:24,069 ప్లీజ్, ఇక నన్ను ఇబ్బంది పెట్టకు. 365 00:33:03,358 --> 00:33:04,484 కామ్రేడ్ నికొలోవ్. 366 00:33:05,027 --> 00:33:06,028 మాతో రా. 367 00:34:02,626 --> 00:34:03,710 మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము? 368 00:34:22,603 --> 00:34:23,981 నన్ను ఫాలో అవ్వు. 369 00:34:43,000 --> 00:34:45,042 చీఫ్! చీఫ్! చీఫ్! 370 00:34:45,043 --> 00:34:46,545 మీరు ఏం చేస్తున్నారు… 371 00:34:48,213 --> 00:34:49,921 ప్లీజ్, దయచేసి ఆపండి! ప్లీజ్! 372 00:34:49,922 --> 00:34:51,841 సరే, మీకు ఏం కావాలి? మీకు ఏం కావాలి? 373 00:34:51,842 --> 00:34:53,010 వెనేర విషయంలో ఏం తెలిసింది? 374 00:34:53,552 --> 00:34:55,845 మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీడం లేదు. 375 00:34:55,846 --> 00:34:57,138 ఆ నౌక గత ఏడాది నాశనం అయింది. 376 00:34:57,139 --> 00:34:58,639 మీరు దాన్ని నాశనం చేయడం నేను చూశాను. 377 00:34:58,640 --> 00:35:00,391 - కానివ్వు. - వద్దు, వద్దు, వద్దు, వద్దు! 378 00:35:00,392 --> 00:35:02,602 ప్లీజ్, మీకు ఏం కావాలంటే అది నేను చెప్తాను! దయచేసి ఆపండి, ప్లీజ్! 379 00:35:02,603 --> 00:35:04,437 ప్లీజ్, ప్లీజ్! సరే, సరే! 380 00:35:04,438 --> 00:35:06,439 సరే, సరే! మీకు ఏది కావాలంటే అది చెప్తాను, మీకు ఏది కావాలంటే అది చెప్తాను! 381 00:35:06,440 --> 00:35:08,107 - నేను చెప్తాను, నేను చెప్తాను! - ఆపండి! 382 00:35:08,108 --> 00:35:09,526 నేను… నేను చెప్తాను. సరే. 383 00:35:13,071 --> 00:35:14,405 - ఆపండి. - సరే. 384 00:35:14,406 --> 00:35:16,241 నాకు పనికొచ్చే విషయం ఏమైనా చెప్పు. 385 00:35:19,786 --> 00:35:24,124 వాళ్ళు ల్యాండింగ్ సైట్ ని మార్చేశారు, అది నా ఐడియా. 386 00:35:24,750 --> 00:35:27,210 అది వేరెవ్వరి ఐడియా కాదు, నా ఐడియా. అది నా ఐడియా! 387 00:35:27,211 --> 00:35:29,128 వేరెవ్వరి ప్రమేయం లేదు! ప్లీజ్! 388 00:35:29,129 --> 00:35:31,089 మంచిది. వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అవుతున్నారు? 389 00:35:31,965 --> 00:35:33,299 నాకు తెలీదు. 390 00:35:33,300 --> 00:35:34,467 వాళ్ళు నాకు చెప్పలేదు. 391 00:35:34,468 --> 00:35:37,637 - నేను గ్రౌండ్ కంట్రోల్ లోకి వెళ్లలేకపోయా. - వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అవుతున్నారు? 392 00:35:37,638 --> 00:35:39,680 నేను లోనికి వెళ్లలేకపోయా! సరేనా? 393 00:35:39,681 --> 00:35:40,765 ఆయన్ని షూట్ చేయొద్దు, ప్లీజ్! 394 00:35:40,766 --> 00:35:42,141 సరే, ఫిన్లాండ్ లో! 395 00:35:42,142 --> 00:35:43,977 సరేనా? ఫిన్లాండ్ లో! 396 00:35:48,106 --> 00:35:50,567 ఫిన్లాండ్ లో దిగుతారు. ఆ ప్రదేశం వైబోర్గ్ నుండి బోర్డర్ దాటితే ఉంటుంది. 397 00:35:52,945 --> 00:35:53,946 మంచి పని, కామ్రేడ్! 398 00:35:56,323 --> 00:35:58,866 నువ్వు చేసిన సాయాన్ని రికార్డు చేస్తాం. వీడిని తీసుకెళ్లండి. 399 00:35:58,867 --> 00:36:01,161 చీఫ్, నన్ను క్షమించండి. నేను… చీఫ్! 400 00:36:01,995 --> 00:36:03,704 చీఫ్, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. 401 00:36:03,705 --> 00:36:05,499 ప్లీజ్, నన్ను క్షమించండి! 402 00:36:12,840 --> 00:36:16,093 వాతావరణంలోకి చేరడానికి 63 నిమిషాలు ఉంది. 403 00:36:17,261 --> 00:36:19,847 రీఎంట్రీ మార్గాన్ని ఎంచే ప్రోగ్రామ్ ని ఫిన్లాండ్ వైపు లోడ్ చేస్తున్నాను. 404 00:36:22,683 --> 00:36:25,102 డిసెంట్ మాడ్యూల్ విడిపోవడానికి, అలాగే ప్రవేశించడానికి కాన్ఫిగర్ చేయబడింది. 405 00:36:34,778 --> 00:36:37,030 రీఎంట్రీ ప్రక్రియలు మొదలెట్టడానికి టైమ్ అయింది. 406 00:36:56,091 --> 00:36:58,135 బాతిస్పియర్ ని వేరు చేయడం మొదలెడుతున్నా. 407 00:37:14,943 --> 00:37:16,820 బాతిస్పియర్ దాదాపుగా పొజిషన్ లో ఉంది. 408 00:37:36,757 --> 00:37:38,883 కేబుల్ పూర్తి పొడవు సాగింది. 409 00:37:38,884 --> 00:37:40,594 ప్రోబ్ ఇంజిన్ ఆన్ చేయడం మొదలెడుతున్నాను. 410 00:37:45,265 --> 00:37:48,100 బాతిస్పియర్ ఇంజన్లు మన మార్గాన్ని మార్చుతున్నాయి. 411 00:37:48,101 --> 00:37:49,102 మంచిది. 412 00:37:49,645 --> 00:37:51,103 మంచిది, మంచిది. 413 00:37:51,104 --> 00:37:53,065 తిరిగి భూమికి చేరుకునే మార్గం అందడానికి మూడు, 414 00:37:53,649 --> 00:37:55,274 రెండు, ఒకటి… 415 00:37:55,275 --> 00:37:56,902 ప్రోబ్ ఇంజన్ ఆపుతున్నాను. 416 00:38:10,415 --> 00:38:11,499 ప్లాన్ పని చేసింది, వాల్య. 417 00:38:11,500 --> 00:38:13,210 మనం తిరిగి భూమికి వెళ్లే మార్గంలో ఉన్నాం. 418 00:38:13,836 --> 00:38:14,837 మంచిది. 419 00:38:16,421 --> 00:38:18,048 సరే, ఇక నేను కేబుల్ ని వదులుతున్నాను. 420 00:38:25,138 --> 00:38:26,639 వాల్య, మనం నిన్ను వెనక్కి రప్పించడానికి ఒక… 421 00:38:26,640 --> 00:38:28,183 లేదు, నేను మిషన్ ని పూర్తిచేసి తీరతాను. 422 00:38:28,767 --> 00:38:29,851 ఏం మిషన్, వాల్య? 423 00:38:29,852 --> 00:38:31,936 - నేను దీన్ని ఉపరితలం మీదకు తీసుకెళ్తాను. - లేదు. నువ్వు… నువ్వు… 424 00:38:31,937 --> 00:38:34,648 సాష, నేను దీన్ని ఉపరితలం మీదకు తీసుకెళ్తున్నాను, ఇక వాదన వద్దు. సరేనా? 425 00:38:37,025 --> 00:38:38,110 నాకు ఒక సాయం చెయ్. 426 00:38:39,111 --> 00:38:40,654 నువ్వు టాన్యాని కలిసినప్పుడు, ఆమెతో… 427 00:38:44,783 --> 00:38:45,784 నేను ఆమెను ప్రేమించానని చెప్పు. 428 00:39:37,711 --> 00:39:38,795 గుడ్ బై, వాల్య. 429 00:40:03,737 --> 00:40:04,738 వద్దు. 430 00:40:07,491 --> 00:40:10,827 ఆమె ఆయన లాంటి మనిషిని అలా చేయడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు? 431 00:40:12,329 --> 00:40:15,165 ఈ దేశానికి ఆయన ఎంతో చేశాడు కదా? 432 00:40:41,692 --> 00:40:42,776 సెర్గీ. 433 00:40:54,079 --> 00:40:55,080 నేను… 434 00:40:56,039 --> 00:41:00,001 నాకు అర్థం కావడం లే… లేదు, అసాధ్యం. నాకు… నాకు అర్థం కావడం లేదు. 435 00:41:00,002 --> 00:41:02,504 నేను… నేను మిమ్మల్ని అక్కడ చూశా… 436 00:41:04,173 --> 00:41:08,009 లేదు, ఇది అసాధ్యం… నేను… 437 00:41:08,010 --> 00:41:09,428 ఇప్పుడు, ఇప్పుడు. 438 00:41:10,512 --> 00:41:12,680 - వాళ్ళ పనులు ఇలాగే ఉంటాయి. - లేదు! నేను వాళ్ళకి… 439 00:41:12,681 --> 00:41:15,684 - నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. - నేను వాళ్ళకి ల్యాండింగ్ సైట్ చెప్పేశా… 440 00:41:16,560 --> 00:41:17,644 లేదు, లేదు. 441 00:41:20,480 --> 00:41:21,899 నన్ను క్షమించండి. 442 00:41:23,609 --> 00:41:24,610 ఊరుకో. 443 00:41:26,945 --> 00:41:27,946 ఊరుకో. 444 00:41:28,989 --> 00:41:30,281 నన్ను క్షమించండి. 445 00:41:30,282 --> 00:41:31,824 అంతా దానంతట అదే సర్దుకుంటుంది. 446 00:41:31,825 --> 00:41:32,826 బాధపడకు. 447 00:41:34,161 --> 00:41:35,704 అంతా దానంతట అదే సర్దుకుంటుంది. 448 00:41:38,790 --> 00:41:40,918 నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు. 449 00:41:44,588 --> 00:41:47,966 మనం మనుషులను వీనస్ కి పంపాము. 450 00:41:49,134 --> 00:41:50,594 వీనస్ కి పంపి వెనక్కి రప్పించాం! 451 00:41:52,679 --> 00:41:54,722 ఆ విషయాన్ని వాళ్ళు మన నుండి దూరం చేయలేరు. 452 00:41:54,723 --> 00:41:55,724 ఎన్నటికీ. 453 00:41:57,184 --> 00:41:58,185 ఎన్నటికీ. 454 00:42:00,479 --> 00:42:01,522 ఎన్నటికీ. 455 00:42:36,181 --> 00:42:39,392 వాళ్ళు వాతావరణంలోకి ఎంటర్ అయ్యాక కరెక్ట్ గా ఇటు నుంచే వస్తారు, 456 00:42:39,393 --> 00:42:44,565 స్కాండినేవియా, పశ్చిమ యు.యస్.యస్.ఆర్ మీదుగా కజకిస్తాన్ వైపు దూసుకొస్తారు. 457 00:42:45,858 --> 00:42:48,693 వాళ్ళు ల్యాండ్ అయిన వెంటనే వెళ్లి పట్టుకోవడానికి వీలుగా 458 00:42:48,694 --> 00:42:50,153 ల్యాండింగ్ జోన్ దగ్గరలో దళాలను పెట్టండి. 459 00:42:50,779 --> 00:42:51,864 వాళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తే? 460 00:42:52,906 --> 00:42:54,490 మనం అదంతా చింతించాల్సిన పనిలేదు. 461 00:42:54,491 --> 00:42:57,202 వాళ్ళు గత తొమ్మిది నెలలుగా సున్నా గ్రావిటీలో గడిపారు. 462 00:42:57,911 --> 00:43:00,247 భూమి గ్రావిటీని తట్టుకుని వాళ్ళు నిలబడటమే గొప్ప. 463 00:43:02,207 --> 00:43:03,208 సులువుగా చిక్కుతారు. 464 00:43:05,335 --> 00:43:06,336 అవును. 465 00:43:11,258 --> 00:43:14,970 మనం 122 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాం. 466 00:43:15,637 --> 00:43:17,139 వాతావరణంలోకి ప్రవేశించే బోర్డర్ కు దగ్గరవుతున్నాం. 467 00:43:19,349 --> 00:43:20,350 రూస్ ఆన్ చేస్తున్నా. 468 00:43:22,186 --> 00:43:23,604 మాన్యువల్ డిసెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. 469 00:43:28,358 --> 00:43:30,110 దిగుతుండగా మన ఎత్తు చెప్తూ ఉండు. 470 00:43:31,111 --> 00:43:32,654 కర్వింగ్ లైన్ కంటే తక్కువ వేగంలో వెళ్ళాలి. 471 00:43:34,406 --> 00:43:36,867 ఎత్తు 121 కిలోమీటర్లు. 472 00:43:38,702 --> 00:43:40,495 వాతావరణ డ్రాగ్ తెలుస్తోంది. 473 00:43:45,792 --> 00:43:46,919 ఓవర్ లోడ్ కనుగొనబడింది. 474 00:43:48,253 --> 00:43:50,172 వేగం తగ్గడం మొదలైంది. 475 00:43:50,714 --> 00:43:52,049 మాన్యువల్ బలిస్టిక్ డిసెంట్ మొదలెడుతున్నాను. 476 00:43:52,591 --> 00:43:53,759 నువ్వు ఏదైనా పట్టుకుంటే మంచిది. 477 00:44:22,454 --> 00:44:25,165 వేగం తగ్గడం మొదలైంది, ప్రస్తుతం జి-ఫోర్స్ 2.5 ఉంది, చాలా వేగంగా పెరుగుతోంది. 478 00:44:26,583 --> 00:44:28,085 మన మార్గం మారడం మొదలైంది. 479 00:44:28,669 --> 00:44:29,920 గ్రావిటీ పెరగబోతోంది రెడీగా ఉండు. 480 00:44:31,296 --> 00:44:33,340 ఇప్పుడు 4.6 జి-ఫోర్స్ తో వేగం తగ్గుతున్నాం. 481 00:44:34,633 --> 00:44:36,385 నువ్వు కొంచెం ఎక్కువ తగ్గిస్తున్నావు. 482 00:45:07,541 --> 00:45:08,917 6.8 జి-ఫోర్స్. 483 00:45:10,294 --> 00:45:13,379 7.1 జి-ఫోర్స్. ఎనిమిది జి-ఫోర్స్. 484 00:45:13,380 --> 00:45:14,630 ఇంకా ఎక్కువ కావాలి. 485 00:45:14,631 --> 00:45:16,466 - మనం దొర్లాడుతున్నాం. - పది జి-ఫోర్స్. 486 00:45:18,260 --> 00:45:19,677 పదమూడు. 487 00:45:19,678 --> 00:45:23,849 ఇంకా… కొంచెం… మాత్రమే. 488 00:45:26,310 --> 00:45:27,311 మనం అందుకున్నాము. 489 00:45:28,312 --> 00:45:29,313 మనం సరైన దారిలో ఉన్నాం. 490 00:45:38,113 --> 00:45:39,656 సర్, నౌక, అది… 491 00:45:42,701 --> 00:45:44,161 అది మార్గం మారడం మొదలైంది. 492 00:45:46,622 --> 00:45:47,830 ఏం మాట్లాడుతున్నావు? 493 00:45:47,831 --> 00:45:50,209 ల్యాండింగ్ జోన్ మారింది. 494 00:45:54,505 --> 00:45:56,131 వాళ్ళు ఎక్కడ ల్యాండ్ కాబోతున్నారు? 495 00:45:57,591 --> 00:46:00,177 - నాకు తెలీ… - వాళ్ళు ఎక్కడ ల్యాండ్ కాబోతున్నారు? 496 00:46:04,264 --> 00:46:05,390 జి-ఫోర్స్ తగ్గుతోంది. 497 00:46:05,891 --> 00:46:07,725 అంతా బానే ఉన్నట్టు ఉంది. 498 00:46:07,726 --> 00:46:08,894 11.5. 499 00:46:10,020 --> 00:46:11,021 ఎనిమిది. 500 00:46:11,730 --> 00:46:13,232 ఎంట్రీ రేట్ మామూలుగానే ఉంది. 501 00:46:14,775 --> 00:46:16,568 మనం ఫిన్లాండ్ లో ల్యాండ్ కాబోతున్నాం. 502 00:46:34,795 --> 00:46:35,879 మిస్సైల్ వెళ్ళింది. 503 00:46:36,797 --> 00:46:37,840 అయిదు వందల మీటర్లు. 504 00:46:39,633 --> 00:46:40,801 మూడు వందల మీటర్లు. 505 00:46:42,469 --> 00:46:43,470 వంద మీటర్లు. 506 00:46:49,059 --> 00:46:50,351 ఏం జరిగింది? 507 00:46:50,352 --> 00:46:52,396 - నాకు తెలీదు. - పారాచూట్ వదులు! 508 00:46:53,313 --> 00:46:54,690 పారాచూట్ వదులు! 509 00:46:55,190 --> 00:46:56,483 నాకు అందడం లేదు… 510 00:46:57,860 --> 00:46:58,861 అందడం లే… 511 00:46:59,778 --> 00:47:00,779 నాకు అందడం లే… 512 00:47:09,955 --> 00:47:12,164 - మనం మరీ వేగంగా వెళ్తున్నాం. - పట్టుకో! 513 00:47:12,165 --> 00:47:13,917 పట్టుకో! రెడీగా ఉండు. 514 00:49:31,305 --> 00:49:32,306 మనం సాధించాం. 515 00:49:35,350 --> 00:49:36,435 మనం ప్రాణాలతో ఉన్నాం. 516 00:49:47,070 --> 00:49:48,197 ఎక్కువ సేపు ఉండం. 517 00:49:48,697 --> 00:49:51,032 - ఓహ్, ఛ. - నీ ఉద్దేశం ఏంటి? 518 00:49:51,033 --> 00:49:54,076 మనల్ని ఏది గుద్దిందో తెలీదు కానీ దాని వల్ల మన మార్గం మారింది. 519 00:49:54,077 --> 00:49:55,912 మనం సోవియెట్ యూనియన్ లో ల్యాండ్ అయ్యాము. 520 00:49:55,913 --> 00:49:57,664 మనం బోర్డర్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. 521 00:49:58,916 --> 00:49:59,958 మనం వెళ్ళాలి. 522 00:50:09,218 --> 00:50:10,511 వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అయ్యారు? 523 00:50:11,261 --> 00:50:13,597 వాళ్ళు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్నారు, కామ్రేడ్ కల్నల్. 524 00:50:15,349 --> 00:50:16,934 నన్ను ఆ క్యాప్సూల్ దగ్గరకు తీసుకెళ్లండి. వెంటనే. 525 00:50:40,123 --> 00:50:42,793 లేదు. లేదు. 526 00:50:46,380 --> 00:50:47,422 లేదు. 527 00:50:49,091 --> 00:50:50,467 ఏమైంది? 528 00:50:58,517 --> 00:50:59,518 అది సాష. 529 00:51:00,269 --> 00:51:01,477 తను బ్రతికే ఉన్నాడు. 530 00:51:01,478 --> 00:51:02,895 వాళ్ళ క్యాప్సూల్ ల్యాండ్ అయింది. 531 00:51:02,896 --> 00:51:04,814 వాళ్ళు అతన్ని చంపేయబోతున్నారు. వాళ్ళు వాళ్లందరినీ చంపేయబోతున్నారు. 532 00:51:04,815 --> 00:51:06,233 మనం వాళ్ళకి సాయం చేయాలి. 533 00:51:12,698 --> 00:51:15,324 క్షమించు. ఇందులో మనం చేయగలది ఏదీ లేదు, కామ్రేడ్ బెలికోవా. 534 00:51:15,325 --> 00:51:18,202 కానీ… మన కక్ష్య ఆ ల్యాండింగ్ సైట్ కి చాలా దగ్గరగా ఉంది. 535 00:51:18,203 --> 00:51:21,790 మన డిసెంట్ మాడ్యూల్ ని వాడితే మనం సమయానికి అక్కడికి చేరుకొని వాళ్లకి సాయం చేయొచ్చు. 536 00:51:27,421 --> 00:51:28,422 నీకు తెలుసు, 537 00:51:29,673 --> 00:51:33,927 మనం అత్యవసర పరిస్థితుల్లో తప్ప డిసెంట్ మాడ్యూల్ ని వాడకూడదు. 538 00:51:49,860 --> 00:51:51,028 థాంక్స్. 539 00:51:58,785 --> 00:51:59,994 శాల్యూట్-1, స్టార్ సిటీ, 540 00:51:59,995 --> 00:52:02,997 ఎవాక్యూయేషన్ క్యాప్సూల్ యాక్టివేట్ అవుతున్నట్టు మాకు రీడింగ్స్ అందుతున్నాయి. 541 00:52:02,998 --> 00:52:03,999 ఏమైనా సమస్య ఎదురైందా? 542 00:52:04,708 --> 00:52:06,459 లేదు, స్టార్ సిటీ. 543 00:52:06,460 --> 00:52:08,504 బహుశా సెన్సార్ లో సమస్య ఏమో. 544 00:52:09,630 --> 00:52:11,464 కచ్చితంగా అంటున్నారా, శాల్యూట్-1? 545 00:52:11,465 --> 00:52:13,467 మా వైపు ఎలాంటి సమస్య లేదు, స్టార్ సిటీ. 546 00:52:31,777 --> 00:52:34,655 - అవును. మనం… - మనం ఇంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో వెతకలేం. 547 00:52:37,115 --> 00:52:39,200 - చీఫ్ డిజైనర్ పెట్రోవ్స్కీ. - ఏంటి? 548 00:52:39,201 --> 00:52:40,494 మాస్కో నుండి ఫోన్. 549 00:52:53,423 --> 00:52:54,841 - పెట్రోవ్స్కీ. - డెప్యూటీ చైర్మన్. 550 00:52:54,842 --> 00:52:56,551 నువ్వు అంతా హ్యాండిల్ చేస్తా అన్నావు. 551 00:52:56,552 --> 00:52:58,136 అవును, డెప్యూటీ చైర్మన్. నేను… 552 00:52:58,887 --> 00:53:00,138 నేను… 553 00:53:04,017 --> 00:53:07,270 వాళ్ళ దిశ మారిందని తెలుస్తోంది. 554 00:53:07,271 --> 00:53:08,437 - నాకు తెలుసు. - కానీ చింతించకండి. 555 00:53:08,438 --> 00:53:10,941 - నేను త్వరలోనే అక్కడికి… - అది కల్నల్ రస్కోవ హ్యాండిల్ చేస్తోంది. 556 00:53:15,195 --> 00:53:16,405 కల్నల్ రస్కోవ? 557 00:53:20,158 --> 00:53:22,159 - ఏం మాట్లాడుతున్నారు? - ఆమె ఇప్పటికే బోర్డర్ కి చేరుకుంది. 558 00:53:22,160 --> 00:53:25,705 వాళ్ళని పట్టుకోబోతోంది. కాబట్టి నువ్విక ఈ విషయం గురించి చింతించాల్సిన అవసరం లేదు. 559 00:53:25,706 --> 00:53:26,707 థాంక్స్. 560 00:53:27,791 --> 00:53:28,792 సర్, నేను… 561 00:54:03,160 --> 00:54:05,454 విడిపోండి! చెట్ల లైన్ చూసుకోండి! 562 00:54:27,643 --> 00:54:30,771 వాళ్ళు ఎక్కువ దూరం వెళ్లి ఉండరు. వాళ్ళని కనిపెట్టండి. 563 00:54:38,487 --> 00:54:39,613 సరే, నన్ను పట్టుకో. 564 00:54:42,658 --> 00:54:45,661 - సరే. సరే. సరే. - అంతే. 565 00:54:56,713 --> 00:55:00,425 నా మీద వేయి కిలోల బరువు వేసినట్టు ఉంది. 566 00:55:05,597 --> 00:55:07,056 వినిపిస్తుందా? 567 00:55:07,057 --> 00:55:08,683 వాళ్ళు దగ్గరకు వస్తున్నారు. 568 00:55:08,684 --> 00:55:09,893 మనం వెళ్ళాలి. 569 00:55:29,288 --> 00:55:30,914 ఆ చెట్ల లైన్ దాటితే బోర్డర్ వస్తుంది. 570 00:55:39,339 --> 00:55:40,424 యూలియా! 571 00:56:24,551 --> 00:56:25,844 బోర్డర్ కి ఎటు వెళ్ళాలి? 572 00:56:29,306 --> 00:56:31,266 అటువైపు పదిహేను కిలోమీటర్లు. 573 00:56:32,100 --> 00:56:33,267 పదిహేను? 574 00:56:33,268 --> 00:56:35,562 బహుశా 20 ఉండొచ్చు. 575 00:56:42,819 --> 00:56:44,112 ఆ ట్రక్ పని చేస్తుందా? 576 00:57:00,587 --> 00:57:02,506 నేను ఇంతకంటే ముందుకు వెళ్ళగలను అనిపించడం లేదు. 577 00:57:08,470 --> 00:57:10,263 బోర్డర్ అక్కడే ఉంది. 578 00:57:10,264 --> 00:57:12,391 అది అక్కడే ఉంది. 579 00:57:19,857 --> 00:57:21,107 మనం వెళ్ళాలి, లక్ష్మీ. 580 00:57:21,108 --> 00:57:22,109 మనం వెంటనే వెళ్ళాలి. 581 00:57:22,985 --> 00:57:24,903 పదా. పదా. 582 00:57:34,454 --> 00:57:35,455 ముందుకు వెళ్ళండి! 583 00:57:36,665 --> 00:57:37,666 సాష! 584 00:57:48,594 --> 00:57:50,137 పదా. పదా! 585 00:57:53,390 --> 00:57:54,391 లక్ష్మీ! 586 00:57:56,977 --> 00:57:59,103 పదా. పదా, నువ్వు నడవగలవు. 587 00:57:59,104 --> 00:58:00,730 నువ్వు నడవగలవు. నాకు తెలుసు. 588 00:58:00,731 --> 00:58:02,316 నువ్వు నడవగలవు. నడువు. 589 00:58:17,706 --> 00:58:18,832 పదా. 590 00:58:21,001 --> 00:58:22,711 మనం దాదాపుగా వచ్చేసాం. మనం దాదాపుగా వచ్చేసాం. 591 00:58:31,386 --> 00:58:33,680 హేయ్! హేయ్! 592 00:58:56,119 --> 00:58:58,037 వెళ్ళు, సాష! వెళ్ళు! 593 00:58:58,038 --> 00:58:59,539 - ఇలా రండి! - పదా, సాష. 594 00:58:59,540 --> 00:59:00,541 వెళ్ళు! 595 00:59:02,292 --> 00:59:03,377 వెళ్ళు! 596 00:59:05,629 --> 00:59:06,672 వెళ్ళు! 597 00:59:08,048 --> 00:59:09,466 ఈమెను అరెస్ట్ చేయండి. 598 00:59:11,301 --> 00:59:12,553 ఈమెను తీసుకోండి, ప్లీజ్. 599 00:59:18,183 --> 00:59:19,768 వెళ్ళు! 600 01:02:03,849 --> 01:02:04,850 థాంక్స్. 601 01:04:20,944 --> 01:04:22,946 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్