1 00:00:01,000 --> 00:00:03,720 ఈ ఎపిసోడ్ ఆత్మహత్యల విషయాలతో సహా సునిశితమైన సమస్యలను డీల్ చేస్తుంది. 2 00:00:03,800 --> 00:00:04,960 వీక్షకుల విచక్షణకు సలహా ఇవ్వబడుతోంది 3 00:00:10,520 --> 00:00:11,960 - లాజరస్! - లేదు. నువ్వు వెంటనే 4 00:00:12,040 --> 00:00:13,920 ఆర్లో జోన్స్ గదికి వెళ్లి 5 00:00:14,320 --> 00:00:15,800 అతను అక్కడ ఉన్నాడో లేదో చెబుతావా? 6 00:00:15,880 --> 00:00:17,120 తను బతికే ఉన్నాడా? 7 00:00:21,320 --> 00:00:24,120 ద జూనిపర్ బుష్: ద లాస్ ఆఫ్ ఇన్నొసెన్స్ రచయిత: సిసి ఆర్నాల్డ్ 8 00:00:26,960 --> 00:00:30,520 డా. ల్యాజ్, తను ఇక్కడ ఉన్నారు. తన సెల్‌లోనే ఉన్నాడు. 9 00:01:05,040 --> 00:01:11,040 హార్లాన్ కోబెన్స్ లాజరస్ 10 00:01:56,600 --> 00:01:59,240 మా చివరి సెషన్ రోజున నాన్న చనిపోయారు. 11 00:02:00,240 --> 00:02:04,560 నువ్వు దేవునితో మాట్లాడుతున్నానని చెప్పిన రోజున, నేను నకిలీనని దేవుడన్నాడు. 12 00:02:05,480 --> 00:02:06,840 నన్ను శిక్షించమని దేవుడిని అడిగావు. 13 00:02:07,560 --> 00:02:09,120 దేవుడు చేస్తానని చెప్పాడు. 14 00:02:10,120 --> 00:02:11,960 అతను అది నీ కోసమే చేస్తాడు. 15 00:02:15,840 --> 00:02:16,680 అయితే, ఆయన చేశాడా? 16 00:02:21,880 --> 00:02:23,680 లేక ఆ వ్యక్తి ఎక్కువగా భూమికి చెందినవాడా? 17 00:02:25,480 --> 00:02:29,520 మా నాన్న తన ఆఫీసులో తలపై తుపాకీ గాయంతో చనిపోయాడు, 18 00:02:29,600 --> 00:02:30,840 ఇప్పుడు నేను కనుగొన్నాను... 19 00:02:30,920 --> 00:02:32,240 నువ్వు అతని రోగివి అని. 20 00:02:32,320 --> 00:02:33,600 ఆయన ఎక్కడ పనిచేశాడో నీకు తెలుసు. 21 00:02:36,960 --> 00:02:39,640 నువ్వు మా నాన్నని హత్య చేశావా, నీచుడా? 22 00:02:50,680 --> 00:02:54,240 దేవుడు ఎవరికీ తెలియని మార్గాల్లో పనిచేస్తాడు. 23 00:02:57,120 --> 00:02:58,000 నీకెలా తెలుసు? 24 00:03:00,680 --> 00:03:02,720 అసలు నీకు ఎలా తెలుసు? 25 00:03:24,480 --> 00:03:27,120 నిన్ను అరెస్టు చేసే ముందు నువ్వు మా నాన్న దగ్గరకు వెళ్లావు. 26 00:03:28,920 --> 00:03:30,720 "నాది పగ," అని నువ్వు ఆయనకు చెప్పావు. 27 00:03:32,280 --> 00:03:34,360 అసలు ఆ విషయం నీకు ఎలా తెలుస్తుంది? 28 00:03:35,920 --> 00:03:38,120 బహుశా దేవునితో మాట్లాడేది నువ్వు ఒక్కడివే కాదేమో. 29 00:03:39,560 --> 00:03:41,640 మీ నాన్నగారి దగ్గరకు వెళ్లాను, అవును. 30 00:03:42,960 --> 00:03:46,760 పోలీసులు నన్ను పట్టుకునే ముందు కొంచెం రక్తం కూడా తీయగలిగాను. 31 00:03:48,720 --> 00:03:50,120 ఆయన బలహీనమైన వ్యక్తి, 32 00:03:51,000 --> 00:03:52,720 నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. 33 00:03:54,680 --> 00:03:57,640 నా కోరికల గురించి అతనికి చెబితే, తను పోలీసులకు చెప్పాడు. 34 00:03:57,720 --> 00:03:59,960 మరి, తను చనిపోయినందుకు నేను బాధపడుతున్నానా? 35 00:04:02,240 --> 00:04:03,200 లేదు. 36 00:04:04,360 --> 00:04:08,800 కానీ నేను ఇక్కడ నుండి హత్య చేయించగలనని నువ్వు అనుకుంటే... 37 00:04:10,160 --> 00:04:13,640 కోరికలంటే నలుగురు స్త్రీలను హింసాత్మకంగా అత్యాచారం చేసి హత్య చేసినవారేగా? 38 00:04:14,600 --> 00:04:16,560 మీ నాన్న కూడా నన్ను అర్థం చేసుకోలేదు. 39 00:04:18,000 --> 00:04:21,040 నాన్న అంతే, కొడుకు అంతే. 40 00:04:21,680 --> 00:04:23,360 నిన్ను అర్థం చేసుకోలేదని అనుకుంటున్నావా? 41 00:04:27,280 --> 00:04:28,720 నిన్ను అర్థం చేసుకున్నాను. 42 00:04:34,160 --> 00:04:35,440 ఇమోజెన్ కార్స్‌వుడ్. 43 00:04:36,000 --> 00:04:36,840 డాక్టర్. 44 00:04:40,240 --> 00:04:42,400 ఆమెకు మా నాన్నతో సంబంధం ఉంది. 45 00:04:42,480 --> 00:04:45,920 నేను ఆమెను చంపలేదు. 46 00:04:46,360 --> 00:04:52,200 నేను నీకు ముందే చెప్పాను. ఆమెను చంపలేదని అందరికీ చెప్పాను. 47 00:04:52,280 --> 00:04:54,720 కానీ కచ్చితంగా, నువ్వు వినలేదు. 48 00:04:54,800 --> 00:04:56,920 నేరం జరిగిన చోట నీ డీఎన్ఏ ఉంది. 49 00:04:57,000 --> 00:04:59,240 నన్ను ఇరికించారు. 50 00:04:59,320 --> 00:05:00,600 అరే, అవును. సరే, తప్పకుండా. 51 00:05:02,960 --> 00:05:05,200 నాలాగే నీకు కూడా తెలుసు, డాక్టర్, 52 00:05:05,280 --> 00:05:07,200 ఇమోజెన్ అత్యాచారానికి గురికాలేదు. 53 00:05:07,640 --> 00:05:09,960 నా గురించి బాగా తెలుసుకున్నావుగా, 54 00:05:10,040 --> 00:05:14,800 నా సాధారణ నమూనాలో అది కొంచెం తేడా అని నువ్వు ఒప్పుకోవాలి. 55 00:05:14,880 --> 00:05:20,560 వాళ్లు నా నేరాలను నిరూపించలేకపోయి, నన్ను జైలులో పెట్టేలా మార్గం వెతికారు. 56 00:05:23,200 --> 00:05:27,200 ఆ భర్త బోనులో అబద్ధం చెప్పాడు. 57 00:05:30,680 --> 00:05:32,200 ఆ విషయం ఆమెకు తెలుసు. 58 00:05:34,040 --> 00:05:35,040 ఎవరికి తెలుసు? 59 00:05:36,440 --> 00:05:38,320 దోషిగా తీర్పు వెల్లడి అయినప్పుడు, 60 00:05:39,120 --> 00:05:42,680 ప్రధాన డిటెక్టివ్ వైపు చూస్తే, నాకేం కనబడిందే నీకు తెలుసా? 61 00:05:45,320 --> 00:05:47,200 ఆమె నవ్వుతూ ఉంది. 62 00:05:49,040 --> 00:05:51,240 కానీ బాగా పని చేయగలిగారన్న చిరునవ్వు కాదు. 63 00:05:51,320 --> 00:05:54,360 దాని నుండి తప్పించుకున్న మనిషి చిరునవ్వు. 64 00:06:08,280 --> 00:06:09,800 కెంప్‌బర్న్ సెక్యూర్ హాస్పిటల్ ఆర్లో జోన్స్ 65 00:06:18,080 --> 00:06:19,720 {\an8}దర్యాప్తు అధికారి: డీసీఐ ఆలిసన్ బ్రౌన్ 66 00:06:19,800 --> 00:06:20,720 {\an8}సంతకం ఏ. బ్రౌన్ 67 00:06:20,800 --> 00:06:22,440 నేను నిన్ను వెంబడించాను. 68 00:06:22,960 --> 00:06:25,800 నిన్ను నమ్మలేదు. ఇప్పటికీనమ్మను. 69 00:06:29,400 --> 00:06:30,640 మార్గొట్ మెక్ఇన్‌టైర్. 70 00:06:31,120 --> 00:06:33,360 గాయాలను పరిశీలించాను, నన్ను అడిగినందుకు సంతోషం. 71 00:06:33,840 --> 00:06:36,840 అవి చాలా ప్రత్యేకమైనవి, కచ్చితంగా సేకరణకరల వస్తువు. 72 00:06:36,920 --> 00:06:38,720 అరుదైనది, ఆ రకమైన ఆయుధం. 73 00:06:38,800 --> 00:06:40,240 దీన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? 74 00:06:40,320 --> 00:06:42,800 మొదట వద్దనే అనుకున్నా, తరువాత ఒక కేసు గుర్తుకొచ్చింది, 75 00:06:42,880 --> 00:06:45,440 ముఖ్యంగా దుష్ట లండన్ ముఠాతో సంబంధం కలిగినది. 76 00:06:45,520 --> 00:06:48,000 తను శత్రువును హాలోవీన్ గుమ్మడికాయలా చెక్కాడు. 77 00:06:48,800 --> 00:06:51,000 అయితే ఎప్పుడు జరిగిందో గుర్తు రావడానికి బాగా ఆలోచించా. 78 00:06:52,280 --> 00:06:54,920 అది ఊహ అంతే, మార్క్, బహుశా నువ్వు లండన్‌లో ఉన్నప్పటిదేమో. 79 00:06:56,480 --> 00:06:59,120 సరిగ్గా చెప్పావు. 2016. 80 00:07:01,800 --> 00:07:04,520 అదే నీ ఆయుధం. మరీ చెడ్డవాడు కదా? 81 00:07:05,360 --> 00:07:06,560 ఓరి దేవుడా. 82 00:07:06,640 --> 00:07:10,080 మార్గొట్‌ను చంపిన కత్తి ఇలా ఉంటుంది. 83 00:07:10,160 --> 00:07:11,800 బ్రెజిల్ నుండి చట్టవిరుద్ధంగా దిగుమతి. 84 00:07:11,880 --> 00:07:12,720 డీసీఐ ఆలిసన్ బ్రౌన్ 85 00:07:12,800 --> 00:07:15,320 డార్క్ వెబ్‌లో మంచి మార్కెట్. దీనిని డ్రాగన్ ఏపెక్స్ అంటారు. 86 00:07:15,400 --> 00:07:19,320 ఆరు నెలల క్రితం ఒక కోడి లారీ వెనుక 400 షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకుగా, 87 00:07:19,400 --> 00:07:21,960 ఇది ఆధారాల లాకర్ నుండి వచ్చినది. 88 00:07:22,040 --> 00:07:23,280 చాలా బాగా చేశావు, సెఠ్. 89 00:07:25,600 --> 00:07:26,880 ఇది వింతగా లేదా... 90 00:07:28,000 --> 00:07:29,560 ఒకతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాక 91 00:07:29,640 --> 00:07:32,160 ఆపై అతని సహాయకురాలు హత్య కావడం, అది కూడా ఇంత త్వరగా? 92 00:07:33,520 --> 00:07:34,360 అవును, అలాగే ఉంది. 93 00:07:35,520 --> 00:07:36,640 ఏదైనా సిద్ధాంతం ఉందా? 94 00:07:36,720 --> 00:07:37,560 నాకు తెలుసు... 95 00:07:39,240 --> 00:07:40,320 నాకు డా. ఎల్ విషయం తెలుసు... 96 00:07:41,480 --> 00:07:43,120 అది ఆత్మహత్య అని, కానీ నేను... 97 00:07:44,880 --> 00:07:48,000 ఆ తుపాకీ కాల్పుల నివేదికను మనం మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందంటాను. 98 00:08:01,320 --> 00:08:03,520 హే. వచ్చినందుకు ధన్యవాదాలు. 99 00:08:04,640 --> 00:08:07,360 మీ చనిపోయిన నాన్న ఆఫీసుకు పాత ఫైళ్లు చూడటానికా? 100 00:08:07,440 --> 00:08:10,640 ఒక అమ్మాయి ఇంత ఆకర్షణీయమైన రెండవ డేట్‌ను ఎలా కాదంటుంది? 101 00:08:11,320 --> 00:08:15,720 నేను మా చెల్లికి ఫోన్ చేయబోయాను, కానీ నాకు నీ నిష్పాక్షికత అవసరం. 102 00:08:15,800 --> 00:08:17,960 - అబ్బో, క్రమంగా మెరుగవుతోంది. - సరే, మన్నించు. 103 00:08:18,040 --> 00:08:20,160 మన్నించాలి, నేను కేకులు కొన్నాను. 104 00:08:21,040 --> 00:08:22,600 ఇప్పుడు మాట్లాడుతున్నావుగా. 105 00:08:23,640 --> 00:08:26,320 అయితే, ఇక్కడ, మనం ఈ ఫైళ్లలో ఏం వెతుకుతున్నాం? 106 00:08:26,400 --> 00:08:30,120 డిటెక్టివ్ బ్రౌన్ దర్యాప్తులలో అసాధారణమైనది ఏదైనా 107 00:08:30,200 --> 00:08:31,800 నాన్న క్లయింట్లకు చెందినది. 108 00:08:34,440 --> 00:08:35,280 ఇమోజెన్‌కు న్యాయం 109 00:08:35,360 --> 00:08:38,600 ఆర్లో జోన్స్ క్రూరమైన హంతకుడు. ఇమోజెన్ కార్స్‌వుడ్ అతని బాధితుల్లో ఒకరు. 110 00:08:38,680 --> 00:08:39,520 క్లయింట్ పేరు కసాండ్రా 111 00:08:39,600 --> 00:08:40,440 మానసిక నివేదిక 112 00:08:41,960 --> 00:08:44,000 నాకూ ఆ ఆలోచనలు వస్తున్నాయని చెప్పాను. 113 00:08:46,800 --> 00:08:48,400 కసాండ్రా రోడ్స్ హంతకుడు పరారీ అయ్యాడని భావిస్తున్నారు 114 00:08:48,480 --> 00:08:49,320 విలేకరులతో డిటెక్టివ్ ఆలిసన్ 115 00:08:49,400 --> 00:08:50,240 క్రాఫ్ట్ కోసం గాలింపు 116 00:08:50,320 --> 00:08:52,360 {\an8}ఆలిసన్ బ్రౌన్ 117 00:08:53,720 --> 00:08:54,560 క్లయింట్ పేరు హ్యారీ న్యాష్ 118 00:08:54,640 --> 00:08:55,960 మానసిక నివేదిక డా. జొనథన్ లాజరస్ నివేదిక 119 00:08:56,040 --> 00:08:57,640 అది సరైన పని అని మీరు నాకు చెప్పారు! 120 00:08:57,720 --> 00:09:00,040 నన్ను పోలీసుల దగ్గరకు వెళ్లమని ప్రోత్సహించినది మీరే. 121 00:09:01,280 --> 00:09:03,120 హత్యపై బాలల వేధింపుల ప్రీస్ట్ ఖైదు 122 00:09:03,200 --> 00:09:06,200 నేను అలా చేయలేదు. నేను హ్యారీని చంపలేదు. నేను చంపలేదు. 123 00:09:07,720 --> 00:09:09,400 మన్నించు, హ్యారీ? హ్యారీ ఎవరు? 124 00:09:09,480 --> 00:09:10,760 హ్యారీ న్యాష్. 125 00:09:14,480 --> 00:09:16,240 న్యాయం చేస్తానంటున్న హ్యారీ న్యాష్ డిటెక్టివ్ 126 00:09:17,880 --> 00:09:18,760 ఆమె అబద్ధమాడింది. 127 00:09:19,840 --> 00:09:22,120 ఆమెకు హ్యారీ తెలుసు, తను ఆ కేసులో పనిచేసింది. 128 00:09:22,200 --> 00:09:23,720 హ్యారీ న్యాష్ హత్య. 129 00:09:23,800 --> 00:09:26,040 బాధితురాలి గురించి అసలు వినలేదని నాతో చెప్పింది. 130 00:09:26,120 --> 00:09:29,040 దోషిగా తేలినవాడు తను అలా చేయలేదని చెబుతూనే ఉన్నాడు... ఆగు. 131 00:09:34,240 --> 00:09:37,400 - ల్యాజ్? - ఆల్ఫీ, హాయ్. చిన్న ప్రశ్న. 132 00:09:38,040 --> 00:09:40,200 ఫాదర్ ఫ్రాంక్ ఆత్మహత్య వీడియో. 133 00:09:40,280 --> 00:09:43,000 దాన్ని ఎవరికి ఇచ్చారో గుర్తుందా? ఏ అధికారికి? 134 00:09:43,680 --> 00:09:46,760 అవును, ఆవిడ డీసీఐ బ్రౌన్. 135 00:09:49,200 --> 00:09:51,520 నాకు పిచ్చి పట్టిందా లేదా అది నిజంగా అనుమానాస్పదంగా ఉందా? 136 00:09:51,600 --> 00:09:55,080 - ఆమె దానిని ఎందుకు దాచాలనుకుంటోంది? - ఇంకా అలాంటివి ఎన్ని ఉన్నాయి? 137 00:10:00,880 --> 00:10:01,720 పోలీసులు. 138 00:10:03,120 --> 00:10:06,440 ఇక్కడ కొన్ని వింతైన మానసిక కార్యకలాపాలు జరుగుతున్నాయని నివేదికలు వచ్చాయి. 139 00:10:06,520 --> 00:10:09,800 నేను లోపలికి వస్తే మీకు అభ్యంతరమా ఇంకా... చుట్టూ ఒకసారి చూస్తే? 140 00:10:10,320 --> 00:10:11,480 లోపలికి రా. 141 00:10:17,200 --> 00:10:21,280 ఇక్కడేం చేస్తున్నావు? 15 నిమిషాల్లో క్లయింట్ వస్తారు. 142 00:10:21,360 --> 00:10:23,080 ఏమీ లేదు. నిన్ను చూడాలని అనిపించి. 143 00:10:25,320 --> 00:10:26,480 నాకు కూడా నిన్ను చూడాలని ఉంది. 144 00:10:30,280 --> 00:10:31,560 15 నిమిషాలు అన్నావు కదా? 145 00:10:41,400 --> 00:10:43,480 - మీ అన్నయ్య ఫోన్. - తనకు ఏం కావాలి? 146 00:10:43,560 --> 00:10:44,640 నేను అతన్ని పట్టించుకోను. 147 00:10:47,480 --> 00:10:48,360 అది ఎత్తి మాట్లాడు. 148 00:10:51,360 --> 00:10:52,560 హాయ్, మిత్రమా. 149 00:11:02,400 --> 00:11:03,240 అయితే ఇక? 150 00:11:11,240 --> 00:11:12,800 నేను ఒక విషయం చెబుతాను 151 00:11:12,880 --> 00:11:15,840 కానీ నువ్విది గుర్తుంచుకోవాలి, మన 30 ఏళ్ల స్నేహం ఆధారంగా, 152 00:11:15,920 --> 00:11:18,920 నేను నిజంగా దానిపై నమ్మకం లేకపోతే ఈ విషయం చెప్పను. 153 00:11:21,280 --> 00:11:22,120 వింటాను, చెప్పు. 154 00:11:25,960 --> 00:11:27,880 నాన్నను చంపినది డిటెక్టివ్ బ్రౌన్ అని నా అంచనా. 155 00:11:36,720 --> 00:11:38,720 ఓల్సన్ మీ నాన్నను చంపినట్లుగానే? 156 00:11:38,800 --> 00:11:42,120 - బిల్లీ మీ నాన్నను చంపినట్లేనా? - నా మాట విను, సరేనా? విను. 157 00:11:43,240 --> 00:11:46,120 ఆమె చాలా మందిని హత్య కేసులలో ఇరికించిందని నా అంచనా. 158 00:11:46,200 --> 00:11:49,000 ఆమె తన జాడలను కప్పిపుచ్చడానికి మార్గొట్‌ను కూడా చంపి ఉండవచ్చు. 159 00:11:49,080 --> 00:11:51,320 - దెయ్యమిలా చెబుతుందా, ల్యాజ్? - సెఠ్, ఇది తమాషా కాదు! 160 00:11:51,400 --> 00:11:55,240 భయానకమైన ఒక అంచనాతో నా బాస్ హంతకురాలని నీకు చెబుతోంది. 161 00:11:55,320 --> 00:11:56,760 హంతకురాలు, ల్యాజ్. 162 00:11:57,880 --> 00:11:59,840 నిజంగానా? ఆవిడ ప్రశంసలు పొందిన పోలీసు. 163 00:11:59,920 --> 00:12:01,760 అసలేం మాట్లాడుతున్నావురా నువ్వు? 164 00:12:01,840 --> 00:12:06,320 నాన్న క్లయింట్లలో చాలా మంది చనిపోవడం లేదా జైలులో ఉండటం కాకతాళీయం. 165 00:12:06,400 --> 00:12:08,840 మీ నాన్న కలత చెందిన అనేక మందితో వ్యవహరించారు, ల్యాజ్. 166 00:12:08,920 --> 00:12:11,000 ఆయన నడిపేది దూది బొమ్మల దుకాణం కాదు. 167 00:12:11,080 --> 00:12:12,080 వీటిని చదువు. 168 00:12:13,280 --> 00:12:14,800 నేను దీన్ని పరిగణించను. 169 00:12:14,880 --> 00:12:17,600 నీ బాస్ అవినీతిపరురాలు కావడంతో, చదివి, ఆమెను ఎదుర్కోవాలి. 170 00:12:17,680 --> 00:12:19,360 - ఇవి చదవు. - నేను వాటిని చదవను. 171 00:12:19,440 --> 00:12:22,400 - వీటిని చదవమన్నాను! - నేను వాటిని చదవను! 172 00:12:22,480 --> 00:12:25,160 - నా ఉద్యోగాన్ని కోల్పోతాను! - నీకు అదే ముఖ్యమా? 173 00:12:26,720 --> 00:12:28,800 - ఎక్కడకు వెళ్తున్నావు? - ఇది చాలా దూరం పోయింది. 174 00:12:31,520 --> 00:12:33,640 - సెఠ్. రా. - లేదు. 175 00:12:33,720 --> 00:12:36,240 నువ్వు తిరిగి వచ్చినప్పటి నుండి ఏదో ఒకటి చెబుతూనే ఉంటూ, 176 00:12:36,320 --> 00:12:39,080 మీ నాన్న మరణంపై కారణం కోసం ఏదేదో చేస్తున్నావు. 177 00:12:39,160 --> 00:12:41,480 దెయ్యాలను చూస్తున్నావు, ఇప్పుడు కప్పిపుచ్చడాలు కూడా! 178 00:12:41,560 --> 00:12:43,640 నీకు సహాయం కావాలి, ల్యాజ్! 179 00:12:44,120 --> 00:12:46,800 నేను ఆమెను కలిసి నిజమేంటో అడుగుతాను. 180 00:12:46,880 --> 00:12:48,600 లేదు. నువ్వు అలాంటివి చేయవు. 181 00:12:48,680 --> 00:12:50,800 జెన్నాతో మాట్లాడటానికి మీ ఇంటికి వెళ్తున్నాం. 182 00:12:50,880 --> 00:12:54,000 నీకు కొంత సహాయం అందిస్తాం, ఎందుకంటే ఇది చాలా దూరం పోయింది... 183 00:12:55,280 --> 00:12:57,800 నాకు సహాయం కావాలి. సరేనా? నువ్వే చేయాలి. 184 00:12:57,880 --> 00:12:59,640 నీ నుండి! నా చిరకాల స్నేహితుడి నుండి! 185 00:12:59,720 --> 00:13:03,440 నువ్వు నన్ను నమ్మాలి, విశ్వసించాలి, ఆమెను ఎదుర్కోవడానికి నాతో రావాలి! 186 00:13:04,040 --> 00:13:05,760 నేను అలా చేయలేను, మిత్రమా. నేను... 187 00:13:07,440 --> 00:13:09,240 నీ పనిపై హెచ్చరించడానికి బ్రౌన్‌కు కాల్ చేస్తా... 188 00:13:17,320 --> 00:13:19,600 - ఎందుకు పోలీసు అయ్యావు? - నా మీద నుండి లేవరా. 189 00:13:19,680 --> 00:13:21,280 ఎందుకు పోలీసు అయ్యావు? 190 00:13:21,360 --> 00:13:22,920 ల్యాజ్, దేవుడి మీద ఒట్టు, ల్యాజ్... 191 00:13:23,000 --> 00:13:26,160 ఎందుకో నేను చెబుతా, తప్పును సరిదిద్దడానికి. 192 00:13:26,240 --> 00:13:27,840 హంతకులను దూరంగా ఉంచడానికి. అవునా? 193 00:13:27,920 --> 00:13:30,200 ఫైళ్లను చదివి నా మాట తప్పు అని చెప్పు. 194 00:13:32,080 --> 00:13:34,400 సరే. సరే. 195 00:14:06,760 --> 00:14:07,720 ఆకట్టుకునే చోటు. 196 00:14:09,040 --> 00:14:10,600 స్టేషన్ బయటకు రావడానికి ఏదో సాకు. 197 00:14:11,520 --> 00:14:12,720 మీకు కాఫీ కొనవచ్చా? 198 00:14:13,520 --> 00:14:14,360 నాకేమీ వద్దు. 199 00:14:15,680 --> 00:14:16,800 ఇది దేని గురించి? 200 00:14:18,360 --> 00:14:21,320 మీ నాన్న మరణం గురించి నీ దగ్గర సమాచారం ఉందని సెఠ్ చెప్పాడు. 201 00:14:22,840 --> 00:14:23,680 నిజం. 202 00:14:30,640 --> 00:14:34,600 కసాండ్రా రోడ్స్ కేసులో మీరే సీనియర్ దర్యాప్తు అధికారి. 203 00:14:36,200 --> 00:14:37,960 దానికి మీ నాన్న మరణానికి సంబంధం ఏంటి? 204 00:14:38,040 --> 00:14:42,080 భాగస్వామి నీల్ ఆమెను హత్య చేశాడని మీరు బలంగా నమ్ముతున్నారు, 205 00:14:42,160 --> 00:14:43,880 అతను దేశం విడిచి పారిపోయాడని. 206 00:14:43,960 --> 00:14:44,800 నిజం. 207 00:14:45,400 --> 00:14:50,080 ఇటీవల ఇమోజెన్ కా‌ర్స్‌వుడ్ హత్య దర్యాప్తుపై మీదే నాయకత్వం, 208 00:14:50,160 --> 00:14:52,320 దీని ఫలితంగా ఆర్లో జోన్స్ దోషిగా నిర్ధారించబడ్డాడు. 209 00:14:52,760 --> 00:14:54,680 ఇదంతా ఎటు దారితీస్తుందో నాకు అర్థం కావడం లేదు. 210 00:14:54,760 --> 00:14:57,600 అది ఆర్లో జోన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేరారోపణ. 211 00:14:58,360 --> 00:15:00,200 ఆర్లో జోన్స్ అంటే సీరియల్ కిల్లరే కదా? 212 00:15:00,880 --> 00:15:04,160 ఇద్దరికీ నాన్నతో అనుబంధం ఉంది. 213 00:15:05,520 --> 00:15:08,080 ఆర్లో ఒక రోగి కాగా, ఇమోజెన్ ఒక ప్రేమికుడు. 214 00:15:09,160 --> 00:15:10,560 అలాగే వాళ్లు మాత్రమే కాదు. 215 00:15:12,440 --> 00:15:16,440 హ్యారీ న్యాష్ హత్యకు పాల్పడిన ప్రీస్ట్ ఫ్రాంక్, 216 00:15:16,520 --> 00:15:19,360 అతను చనిపోయే ముందు వీడియో తీసుకున్నాడు. తాను నిర్దోషినని, 217 00:15:19,440 --> 00:15:21,760 హ్యారీ హంతకుడు ఇప్పటికీ పరారీలో ఉన్నాడని చెప్పాడు. 218 00:15:22,480 --> 00:15:26,560 అతని మానసిక వైద్యుడు ఆ వీడియోను మీకు ఇచ్చాడని చెప్పాడు, 219 00:15:26,640 --> 00:15:28,840 అయినా మీరు దానితో ఏమీ చేయలేదని. 220 00:15:30,080 --> 00:15:30,920 అందులో, 221 00:15:32,160 --> 00:15:33,320 నాకు వైరుధ్యాలు కనిపించాయి. 222 00:15:34,000 --> 00:15:35,640 చాలా అసంభవమైన సంబంధాలు, 223 00:15:35,720 --> 00:15:40,160 హత్య కేసులలో సందేహాస్పద ఆధారాలతో మీరు దర్యాప్తు చేస్తున్నారు. 224 00:15:40,240 --> 00:15:45,080 వీళ్లందరూ మా నాన్న రోగులు లేదా ఆయనకు తెలిసిన వ్యక్తులకు సంబంధించినవి. 225 00:15:48,240 --> 00:15:49,720 నాకు ఏ ప్రశ్న వినిపించలేదు. 226 00:15:51,520 --> 00:15:54,800 మీరు మా నాన్న మానసిక వైద్య విధానాన్ని వాడుకుంటున్నారని నా అంచనా. 227 00:15:54,880 --> 00:15:57,640 సమస్యాత్మక నేపథ్యాలను కలిగిన వ్యక్తులను వెతికి 228 00:15:57,720 --> 00:16:00,920 వాళ్లను మీ నేరాలకు బలిపశువులుగా ఉపయోగించారు. 229 00:16:02,160 --> 00:16:03,600 అది నాన్నకు తెలిసిందని నా అంచనా, 230 00:16:04,840 --> 00:16:06,240 దానిపై మిమ్మల్ని అడిగితే, 231 00:16:08,240 --> 00:16:10,000 అప్పుడు మీరు అతన్ని చంపారు. 232 00:16:13,600 --> 00:16:14,440 నాకు అర్థమైంది. 233 00:16:18,680 --> 00:16:22,640 సరే, అది... నువ్వు కల్పించుకున్న ఊహ. 234 00:16:24,480 --> 00:16:25,600 దీనికి అంగీకరిస్తున్నావా? 235 00:16:27,400 --> 00:16:29,440 మీ వైపు కథ వినడానికి కచ్చితంగా ఇష్టపడతాను. 236 00:16:29,520 --> 00:16:31,760 తర్వాత ఏంటి? నన్ను అరెస్ట్ చేయాలా? 237 00:16:33,400 --> 00:16:35,600 నేను మీ సీనియర్ అధికారినని నీకు గుర్తు చేయనవసరం లేదు. 238 00:16:35,680 --> 00:16:36,760 అవును. నాకు తెలుసు. 239 00:16:37,320 --> 00:16:42,520 ఇక ఈ... ఆకస్మిక ఘర్షణ అస్సలు సరికాదు. 240 00:16:50,440 --> 00:16:52,240 దయచేసి నాకు గ్లాసు నీళ్లు తెస్తావా? 241 00:17:08,080 --> 00:17:10,200 జోయెల్, మీ నాన్నను చాలా ప్రేమించాను. 242 00:17:10,280 --> 00:17:11,520 ...ఒక గ్లాసు నీరు ఇవ్వండి. 243 00:17:13,560 --> 00:17:16,000 నిమ్మ రుచి కేక్. ఇది మా అమ్మమ్మను గుర్తు చేస్తుంది. 244 00:17:16,080 --> 00:17:21,840 ఆమె ఈ భూమిపై అందరికంటే మెరుగ్గా నిమ్మ రుచి కేక్ చేస్తుంది, సందేహమే లేదు. 245 00:17:21,920 --> 00:17:23,480 ఇంకా నాది ప్రయత్నించలేదు, మిత్రమా. 246 00:17:26,000 --> 00:17:27,000 సెఠ్! 247 00:17:28,120 --> 00:17:29,680 పోలీస్! బ్యాకప్ కాల్ చేస్తున్నాను. 248 00:17:31,360 --> 00:17:32,560 సెఠ్! బాగానే ఉన్నావా? 249 00:17:33,400 --> 00:17:34,240 పోలీసులను పిలవండి! 250 00:17:34,320 --> 00:17:35,400 ఆవిడే పోలీసు. 251 00:17:35,480 --> 00:17:38,480 పోలీసులకు ఫోన్ చేయి! నేను ఏమి చేయాలి? ఎలా సహాయం చేయాలి? 252 00:17:38,560 --> 00:17:39,680 ఆమెను పట్టుకో. 253 00:17:39,760 --> 00:17:40,600 అతను జాగ్రత్త. 254 00:18:03,040 --> 00:18:04,040 పద. 255 00:18:17,320 --> 00:18:18,320 ఛత్. 256 00:18:59,600 --> 00:19:00,600 హే. 257 00:20:03,880 --> 00:20:04,720 బాగానే ఉన్నావా? 258 00:20:10,840 --> 00:20:13,080 ఎవరో ఒకరు వచ్చి వాంగ్మూలం తీసుకుంటారు. ఇక, అదీ... 259 00:20:13,680 --> 00:20:14,920 వాస్తవాలకు కట్టుబడి ఉండు. 260 00:20:15,800 --> 00:20:18,320 ఆమెను అనుమానించావు, నీ అనుమానాలను నాకు చెప్పావు. 261 00:20:20,200 --> 00:20:21,800 తర్వాత ఆమె నాకు టేజర్‌తో షాక్ ఇచ్చింది. 262 00:20:24,640 --> 00:20:25,480 ధన్యవాదాలు, మిత్రమా. 263 00:20:27,680 --> 00:20:29,520 నాకు ఇప్పటికీ ఏమీ అర్థం కాలేదు. 264 00:20:30,640 --> 00:20:32,920 అస్సలు అర్థం కాలేదు. 265 00:20:34,720 --> 00:20:35,560 కానీ... 266 00:20:37,560 --> 00:20:39,000 మన్నించు, నిన్ను అనుమానించాను. 267 00:20:46,040 --> 00:20:49,320 అయినా నువ్వు ఎవరితోనైనా మాట్లాడాలనే నేను అనుకుంటున్నాను, ల్యాజ్. ఇదంతా... 268 00:20:51,600 --> 00:20:52,640 ఇది చాలా ఎక్కువ, మిత్రమా. 269 00:20:55,520 --> 00:20:59,840 నేను తిరిగి వచ్చిన నుండి నీ జీవితంలోకి చాలా చెత్తను మోసుకొచ్చాను. 270 00:20:59,920 --> 00:21:00,760 లేదు, నువ్వేం చేయలేదు. 271 00:21:02,200 --> 00:21:03,040 సరే, చేశావులే. 272 00:21:07,040 --> 00:21:08,640 కానీ నువ్వు రావడం ఆనందంగా ఉంది. 273 00:21:09,800 --> 00:21:13,000 ఇక నేను నీ అందమైన చెల్లితో కనెక్ట్ అయ్యాను, ప్రతి కష్టం వెనుక... 274 00:21:14,640 --> 00:21:16,120 - సుఖం ఉంటుంది, అవునా? - అనుకోవాలి. 275 00:21:18,240 --> 00:21:20,640 ఆమెను జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఒకవేళ మీ ఇద్దరికీ... 276 00:21:22,120 --> 00:21:23,160 బంధం ఏర్పడితే. 277 00:21:23,720 --> 00:21:24,560 సరే. 278 00:21:24,640 --> 00:21:27,040 తిరిగి వచ్చి నీకు భారంగా మారాలని అనుకోవట్లేదు. 279 00:21:28,880 --> 00:21:30,240 నిన్ను తీసుకెళ్లగలననే అనుకుంటున్నా. 280 00:21:31,760 --> 00:21:34,240 నీ ఊహా స్నేహితులను వెనుక తీసుకురానంత వరకు. 281 00:21:34,720 --> 00:21:35,560 లేదా టేజర్ అయినా. 282 00:21:39,040 --> 00:21:42,160 తమాషా చేస్తున్నావు. ఎట్టకేలకు తమాషా మాటలు చెబుతున్నావు. 283 00:21:42,240 --> 00:21:43,080 అవును. 284 00:21:44,160 --> 00:21:46,640 అందుకే మీ చెల్లికి నేనంటే చాలా ఇష్టం. తరువాత కలుస్తాను, మిత్రమా. 285 00:21:51,440 --> 00:21:53,480 జోయెల్, బలవంతం చేయకు. 286 00:21:57,160 --> 00:21:59,480 నేను దీన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. 287 00:22:00,040 --> 00:22:02,720 నన్ను నమ్ము, అది నిన్ను నాశనం చేస్తుంది. 288 00:22:03,680 --> 00:22:04,880 అదంతా వదిలేసెయ్. 289 00:22:06,280 --> 00:22:09,600 ఇప్పుడే ఆపితే నిన్ను చాలా బాధ నుండి కాపాడగలను. 290 00:22:11,560 --> 00:22:12,760 నేను అలా ఆపలేను. 291 00:22:12,840 --> 00:22:15,560 దయచేసి, దయచేసి, ఇంటికి వెళ్లిపో. 292 00:22:15,640 --> 00:22:16,800 ఇదంతా వదిలేసెయ్. 293 00:22:17,560 --> 00:22:18,520 నేను వదలలేను. 294 00:22:55,560 --> 00:22:56,400 హలో. 295 00:22:57,400 --> 00:22:58,360 హాయ్. 296 00:22:58,440 --> 00:23:01,960 ఇది కొంచెం వింతగా ఉందని నాకు తెలుసు, కానీ... నేను నీతో మాట్లాడాలి. 297 00:23:03,200 --> 00:23:05,760 మా నాన్న జోయెల్ లాజరస్ గురించి. 298 00:23:06,680 --> 00:23:08,960 నువ్వు... సన్నిహితమని నాకు తెలుసు. 299 00:23:10,280 --> 00:23:11,880 నువ్వు ఎయిడాన్, అంతేగా? 300 00:23:11,960 --> 00:23:14,440 అతను నీ గురించి చెప్పాడు. 301 00:23:14,520 --> 00:23:15,840 ఇది సరైన సమయం కాదా? 302 00:23:18,720 --> 00:23:21,200 లేదు. లేదు, లోపలికి రా. 303 00:23:32,200 --> 00:23:34,160 నా గురించి మాట్లాడుకోవడం నాకు నచ్చదు. 304 00:23:34,240 --> 00:23:35,200 నువ్వు, నేను ఇద్దరం అంతే. 305 00:23:36,160 --> 00:23:37,800 చాలా మందికి ఇది అసౌకర్యంగా ఉంటుంది. 306 00:23:38,680 --> 00:23:39,960 అలా కాదు. ఏంటంటే... 307 00:23:40,920 --> 00:23:42,520 నేను మనుషులను నమ్మను. 308 00:23:43,280 --> 00:23:47,920 గతంలో కొందరికి కొన్ని విషయాలు చెబితే, వాళ్లు వాటిని రహస్యంగా ఉంచలేదు. 309 00:23:48,000 --> 00:23:50,480 సరే, నీకు హామీ ఇస్తున్నాను, ఇక్కడేం చెప్పినా... 310 00:23:51,640 --> 00:23:52,640 మన మధ్యే ఉంటుంది. 311 00:23:54,400 --> 00:23:55,840 చెప్పిన మాట నా నోరు దాటదు. 312 00:24:14,920 --> 00:24:18,440 డాక్టర్ జొనథన్ లాజరస్ - మనస్తత్వవేత్త 313 00:25:01,440 --> 00:25:02,440 ఆలిసన్. 314 00:25:09,160 --> 00:25:10,440 మనం మాట్లాడుకోవాలి. 315 00:25:13,160 --> 00:25:14,000 నాకు తెలుసు... 316 00:25:15,680 --> 00:25:16,920 నువ్వేం చేశావో నాకు తెలుసు... 317 00:25:18,160 --> 00:25:19,200 మనం ఏం చేశామో. 318 00:25:24,280 --> 00:25:26,040 నేను పెద్ద మొద్దులా ఉన్నాను. 319 00:25:32,720 --> 00:25:36,640 మనస్తత్వశాస్త్రంలో మేము అపరాధ భావనను "పనికిరాని భావోద్వేగం," అని పిలుస్తాము. 320 00:25:36,720 --> 00:25:40,280 పశ్చాత్తాపం మన మానవత్వాన్ని చూపించగా, అపరాధం విషపూరితంగా మారుతుంది. 321 00:25:40,360 --> 00:25:42,480 - అది మనను తినేస్తుంది. - నీకు అపరాధ భావన లేదా? 322 00:25:43,760 --> 00:25:44,960 అలాంటిదేమీ లేదు. 323 00:25:45,680 --> 00:25:48,440 నాకు కేసులు మూసివేయడంలో సాయం చేస్తున్నావని చాలా ఏళ్లుగా అనుకున్నా, 324 00:25:49,000 --> 00:25:52,160 వాళ్లు జైలులోనే ఉండాలని, అందుకే మనం వ్యవస్థతో ఆడుకుంటున్నామని నాకు చెప్పడంతో. 325 00:25:52,240 --> 00:25:54,240 - వాళ్లకు అదే తగినది. - ఎవరు చెప్పారు? 326 00:25:55,200 --> 00:25:56,600 గొప్ప మానసిక వైద్యుడా? 327 00:25:57,200 --> 00:26:02,480 నాటకీయంగా మారకు. ఆలిసన్, నువ్వు మంచి ఫలితాలను పొందావు. 328 00:26:02,560 --> 00:26:04,880 ప్రశంసలు, పొగడ్తలు. 329 00:26:05,600 --> 00:26:08,000 ఆ విషయంలో కలకాలం గొప్ప ఆశయంతో ఉండేదానివి. 330 00:26:08,080 --> 00:26:11,200 పోలీసు విధులకు అవార్డులు ఇవ్వడం నాకు ఎప్పుడూ వింతగా అనిపించేది. 331 00:26:11,280 --> 00:26:13,240 ఇది దాదాపు అసహ్యంగా ఉంది. 332 00:26:14,840 --> 00:26:16,320 నిన్ను నా స్నేహితుడిగా భావించా. 333 00:26:19,040 --> 00:26:22,720 కానీ నన్ను మోసం చేశావు, నేను నా అహాన్ని అడ్డుపెట్టుకున్నాను. 334 00:26:26,960 --> 00:26:28,360 నువ్వు ఇమోజెన్‌ను చంపావు. 335 00:26:29,080 --> 00:26:31,040 ఆ మాట కాదనకు, నాకు తెలుసు నువ్వే చంపావని. 336 00:26:31,120 --> 00:26:33,440 తర్వాత నాకు అది ఆర్లో జోన్స్ చేశాడని నమ్మించావు. 337 00:26:36,920 --> 00:26:38,360 నాకు ఇమోజెన్ అంటే చాలా ఇష్టం... 338 00:26:39,240 --> 00:26:40,640 ఆమె అనారోగ్యంతో ఉంది. 339 00:26:40,720 --> 00:26:44,000 తను చనిపోతోంది, ఆమె దాని గురించి భయపడింది. 340 00:26:44,480 --> 00:26:46,440 అందుకే ఆమెను గొంతు నులిమి చంపావా? 341 00:26:46,520 --> 00:26:48,800 నేను ఆమె బాధను అంతం చేశాను. 342 00:26:51,040 --> 00:26:52,360 అదేనా నీకు నువ్వు చెప్పుకునేది? 343 00:26:55,360 --> 00:26:57,080 కొందరికి కొన్ని సమయాలు ఉంటాయి, ఆలిసన్, 344 00:26:57,160 --> 00:27:01,520 ప్రపంచంలో ఉండడం, అక్కడే ఉండిపోవడం, దాన్ని వదిలేయడం కంటే అనంతమైన బాధ. 345 00:27:04,160 --> 00:27:05,000 మరి మిగతా వాళ్లు. 346 00:27:06,080 --> 00:27:07,000 మరి మిగతా వాళ్ల సంగతేంటి? 347 00:27:08,480 --> 00:27:11,800 ఫాదర్ ఫ్రాంక్ బార్న్‌వే ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డింగ్‌ను అందించాడు, 348 00:27:11,880 --> 00:27:15,400 హ్యారీ న్యాష్ హత్యలో తాను నిర్దోషినని చెప్పుకున్నాడు. 349 00:27:15,480 --> 00:27:18,760 కొన్ని సంకేతాలు, నేను వాటిని చూసి ఉండాలి, కానీ నాకు తీరిక లేకపోయింది. 350 00:27:19,880 --> 00:27:24,160 ఏవీ నీవైపు రాకుండా ఉండేలా చాలా ఏళ్ల తరబడి నాకు సమాచారం ఇస్తున్నావు. 351 00:27:27,720 --> 00:27:29,880 ఆలిసన్, నీకు ఏమీ తెలియదు. 352 00:27:29,960 --> 00:27:32,160 నా ఆఫీసుకు వచ్చే కొందరు క్లయింట్లు 353 00:27:32,240 --> 00:27:36,120 తీవ్ర మానసిక క్షోభకు గురైనవాళ్లుగా చాలా కష్టాలతో కూడిన జీవితాలు గడుపుతుంటారు. 354 00:27:36,960 --> 00:27:38,600 అవి విరిగిన కుండీల వంటివి. 355 00:27:38,680 --> 00:27:42,240 అది తిరిగి అతికించవచ్చు, దూరం నుండి చూస్తే అది సాధారణంగా కనబడవచ్చు, 356 00:27:42,320 --> 00:27:45,360 కానీ దగ్గరగా చూస్తే ఎప్పుడూ పగుళ్లు కనబడతాయి. 357 00:27:45,440 --> 00:27:47,360 నీకు నచ్చిన విధంగా అది హేతుబద్ధీకరణ చేసుకో. 358 00:27:47,440 --> 00:27:49,560 జొనథన్, నువ్వు వాళ్లని హత్య చేశావు. 359 00:27:49,640 --> 00:27:53,280 తర్వాత నీ నేరాలకు అమాయకులను దోషులుగా నిర్ధారించేలా నన్ను ప్రేరేపించావు. 360 00:27:56,480 --> 00:27:57,920 అయితే నువ్వు అనుకునేది... 361 00:27:59,040 --> 00:28:00,200 ఏంటి? 362 00:28:00,280 --> 00:28:02,680 మనం ఒప్పుకుందామా? 363 00:28:04,240 --> 00:28:07,360 ఆలిసన్, మనం ఇద్దరం ఆ జైళ్లను చూశాము. 364 00:28:07,440 --> 00:28:10,720 రోజుకు ఇరవై రెండు గంటలు సెల్‌లో, పాతరేయడం, పొడుచుకోవడం జరుగుతుంది. 365 00:28:10,800 --> 00:28:15,960 మనం రెండు నిమిషాలు కూడా ఉండలేము. నువ్వు అవినీతి పోలీసువు, నాశనం అయిపోతావు. 366 00:28:21,480 --> 00:28:23,320 నేను అదంతా అలా వదిలేయలేను. 367 00:28:25,840 --> 00:28:27,360 నీకు అర్థమైందిగా? 368 00:28:35,640 --> 00:28:36,480 నాకు అర్థమైంది. 369 00:28:38,960 --> 00:28:40,480 నువ్వు ఆ రకంగా ఉండవు. 370 00:28:42,840 --> 00:28:44,960 అయితే, నీ ప్రతిపాదన ఏంటి, ఆలిసన్? 371 00:28:49,280 --> 00:28:50,760 మనం వేరే దారి వెతకవచ్చు. 372 00:29:06,640 --> 00:29:07,640 నువ్వు ఒక నోట్ రాయవచ్చు. 373 00:29:10,200 --> 00:29:11,240 వీడ్కోలు చెబుతూ. 374 00:29:17,320 --> 00:29:18,960 నీది ముగించు... దానిని ఎలా చెబుతావు? 375 00:29:20,600 --> 00:29:22,360 బాధా? వేదనా? 376 00:29:25,360 --> 00:29:26,760 ఆ తర్వాత నీ రహస్యం... 377 00:29:28,840 --> 00:29:29,760 నీతో పాటు చనిపోతుంది. 378 00:29:35,680 --> 00:29:40,160 అది... నాకంటే నీకే ఎక్కువ అనుకూలంగా ఉండే మార్గం. 379 00:29:42,160 --> 00:29:43,600 కుండీలోని ఆ పగుళ్లు... 380 00:29:45,680 --> 00:29:47,440 సట్టన్ చనిపోయినప్పుడు నువ్వు పొందినవి. 381 00:29:49,840 --> 00:29:51,680 వాటిని ఎప్పటికీ బాగు చేయలేము, అంతేనా? 382 00:30:10,000 --> 00:30:12,440 దీన్ని నీపై ఉపయోగించనని ఎలా ఖచ్చితంగా చెప్పగలవు? 383 00:30:42,280 --> 00:30:44,320 నాకు మంచి స్నేహితురాలివి, ఆలిసన్. 384 00:30:47,840 --> 00:30:49,200 చెడు సమయాలలో కూడా... 385 00:30:51,080 --> 00:30:52,520 నువ్వు ఎప్పుడూ నాతో ఉన్నావు. 386 00:31:01,600 --> 00:31:03,240 సట్టన్‌ను మళ్లీ చూడగలనని అనుకుంటావా? 387 00:31:05,640 --> 00:31:06,760 నేను అదే ఆశిస్తున్నాను. 388 00:31:10,040 --> 00:31:10,880 నువ్వు ఆశిస్తావా? 389 00:31:12,520 --> 00:31:13,360 నాకు తెలియదు. 390 00:31:14,440 --> 00:31:15,400 నాకు తెలియదు. 391 00:31:17,000 --> 00:31:20,160 కానీ కనీసం ఆమె లోటు ఇకపై భావించను. 392 00:31:23,280 --> 00:31:24,440 అదొకటి ఉంది. 393 00:31:27,600 --> 00:31:29,160 నాకు ఇంకో మార్గం ఉంటే బాగుండేది. 394 00:31:30,800 --> 00:31:31,800 కానీ అలాగేమీ లేదు. 395 00:31:33,040 --> 00:31:33,880 ఉందంటావా? 396 00:31:42,760 --> 00:31:44,400 ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నాను. 397 00:31:45,640 --> 00:31:46,840 నేను బయట ఎదురుచూస్తాను. 398 00:31:51,080 --> 00:31:51,920 వీడ్కోలు. 399 00:31:54,640 --> 00:31:56,640 అలాగే... ధన్యవాదాలు. 400 00:31:58,640 --> 00:31:59,760 నీ గురించి తెలిసి ఉండడం... 401 00:32:01,360 --> 00:32:02,920 ఆనందంగా ఉంది. 402 00:32:35,720 --> 00:32:36,600 రింగ్ అవుతోంది... జోయెల్ 403 00:32:46,880 --> 00:32:50,240 ఇన్‌కమింగ్ కాల్ - నాన్న ఫోన్ నంబర్ - 07700 900824 404 00:32:52,200 --> 00:32:53,720 డాక్టర్ జోయెల్ లాజరస్‌ను మీరు చేరుకున్నారు. 405 00:32:53,800 --> 00:32:55,400 దయచేసి టోన్ తర్వాత సందేశం పంపండి. 406 00:33:48,640 --> 00:33:53,480 ఇది ఇంకా అయిపోలేదు 407 00:34:21,200 --> 00:34:23,800 నువ్వు ఇదంతా వినాల్సి వచ్చినందుకు బాధగా ఉంది, 408 00:34:24,480 --> 00:34:27,880 కానీ ఈ గదిలో జరిగే ప్రతిదాన్ని నేను రికార్డ్ చేస్తానని నీకు తెలుసు. 409 00:34:29,480 --> 00:34:30,480 ఆమె నన్ను హత్య చేసింది. 410 00:34:33,160 --> 00:34:34,560 ఆమె నాకు వేరే మార్గం ఇవ్వలేదు. 411 00:34:39,000 --> 00:34:40,080 నువ్వు హత్యలు చేశావు. 412 00:34:41,200 --> 00:34:44,000 నేను వాళ్లను బాధల నుండి విడిపించాను. 413 00:34:44,480 --> 00:34:46,920 అలాగే నేను మిగతా అందరినీ తమ ప్రమాదం నుండి విడిపించాను. 414 00:34:47,000 --> 00:34:51,080 నువ్వు కసాండ్రాని కలిశావు. ఆమె అతన్ని నా ఆఫీసులో చంపేసింది. 415 00:34:51,720 --> 00:34:54,120 నా ఆఫీసులో ఒక శవాన్ని వదిలేసి ఉంచలేను, అందుకే ఆమెకు 416 00:34:54,200 --> 00:34:55,280 తనను కదిలించడానికి సాయం చేశా. 417 00:34:55,360 --> 00:34:59,560 కానీ అలాంటిది రహస్యంగా ఉంచే అవకాశం ఏమిటి? 418 00:34:59,640 --> 00:35:01,760 లేక మళ్లీ చంపకపోవడం? 419 00:35:01,840 --> 00:35:03,480 అందుకే, ఆమె హత్య నాకు మొదటిది. 420 00:35:05,560 --> 00:35:06,400 మరి హ్యారీ? 421 00:35:06,880 --> 00:35:09,280 మనం మాట్లాడుకోవడం తనకు తెలిస్తే అతనేం చేస్తాడో తెలుసా? 422 00:35:09,360 --> 00:35:11,840 నష్టం జరిగిపోయింది, మునుముందు పరిస్థితి మరింత దిగజారింది. 423 00:35:11,920 --> 00:35:14,560 బాబూ, నిజం నీకు ఏనాడూ స్వేచ్ఛ ఇవ్వదు. 424 00:35:15,240 --> 00:35:19,920 నా జీవితమంతా ఇదంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. 425 00:35:21,160 --> 00:35:25,400 చాలా మందికి సానుభూతి, నైతికత, తప్పొప్పుల గురించి 426 00:35:25,480 --> 00:35:27,960 కొంత అవగాహన ఉంటుంది, అయితే అది మార్చేస్తారు. 427 00:35:28,040 --> 00:35:32,080 తర్వాత... ఇతరుల కూడా ఉన్నారు. 428 00:35:33,160 --> 00:35:35,760 వాళ్లను ఎవరూ బాగుచేయలేరు. 429 00:35:35,840 --> 00:35:38,320 పరిస్థితి చాలా దూరం వెళ్లింది. 430 00:35:38,400 --> 00:35:42,360 "వాళ్లను వదిలేశామని అనిపించకూడదు. ఒక్క క్షణమైనా సరే," అనేదంతా ఏమైంది? 431 00:35:42,440 --> 00:35:45,920 నేను వాళ్లను వదిలేయలేదు, నేనే వాళ్లను రక్షించాను. 432 00:35:46,000 --> 00:35:48,160 అంతా సొంతగా సమర్థించుకునే సోది. మీరు... 433 00:35:48,600 --> 00:35:51,560 నువ్వు చంపాలనుకున్నావు, అందుకే చంపావు. 434 00:35:51,640 --> 00:35:53,240 నీకు దాని రుచి తెలిసింది. 435 00:35:56,200 --> 00:35:57,040 కావచ్చు. 436 00:35:59,560 --> 00:36:00,640 కానీ ఎందుకు? 437 00:36:02,360 --> 00:36:04,960 అయ్యో, ఎందుకు, నాన్నా? ఎందుకు? 438 00:36:06,200 --> 00:36:09,280 సట్టన్ చనిపోయాక, నాలో ఏదో మూసుకుపోయింది. 439 00:36:10,000 --> 00:36:11,640 నేను పరిస్థితులను వేరేగా చూశాను. 440 00:36:13,520 --> 00:36:15,400 నువ్వు మనుషులను చంపావు. 441 00:36:16,720 --> 00:36:17,720 ఊరుకోండి. 442 00:36:18,840 --> 00:36:23,560 దేవుడా, అది ఎలా ఉంటుందో మనకు తెలుసు, కదా? మనకు తెలుసు! 443 00:36:23,640 --> 00:36:27,640 నాకూ నా బాధ ఉంది! నేను కూడా ఒక బిడ్డను కోల్పోయాను! 444 00:36:28,120 --> 00:36:31,600 అత్యంత దారుణమైన విధంగా! 445 00:36:32,200 --> 00:36:35,800 కానీ నిన్ను ప్రేమించడం ఎప్పుడూ ఆపలేదు. మీ ఇద్దరినీ. 446 00:36:37,360 --> 00:36:42,320 ఇక ఆ చివరి రోజున, మాట్లాడాలని నేను కోరుకున్న ఒకే ఒకడివి నువ్వే. 447 00:36:50,840 --> 00:36:52,120 నువ్వు ఏం చెప్పేవాడివి? 448 00:36:53,000 --> 00:36:55,920 సరే, నేను... నేను ప్రయత్నించి ఉండేవాడిని... 449 00:36:56,720 --> 00:37:00,400 నీకు అర్థమయ్యేలా ప్రయత్నించేవాడిని, నేను ఎలా మారినా, 450 00:37:01,200 --> 00:37:04,720 నువ్వు నా కొడుకువి అని, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తానని. 451 00:37:10,400 --> 00:37:13,880 నేను మా నాన్న తిరిగి రావాలని కోరుకున్నానంతే. 452 00:37:16,480 --> 00:37:18,280 నేను ఎప్పుడూ కోరుకునేది అదే. 453 00:37:26,200 --> 00:37:27,520 ఆ డ్రాయింగ్... 454 00:37:28,280 --> 00:37:33,600 నా ఆత్మహత్య లేఖలో, ఆ గుర్తుకు నా ఉద్దేశ్యంలో అర్థం ఏంటో తెలుసా? 455 00:37:36,040 --> 00:37:37,160 తెలియదు. 456 00:37:39,160 --> 00:37:43,160 కాలం వరుస క్రమంలో ఉండదు, అది చట్రంలా ఉంటుంది. 457 00:37:44,640 --> 00:37:47,880 కొన్నిసార్లు కొడుకులు వాళ్లకే తండ్రులు అవుతారు, జోయెల్. 458 00:37:47,960 --> 00:37:49,200 అది వాళ్ల రక్తంలోనే ఉంటుంది. 459 00:37:55,480 --> 00:37:58,200 - లేదు. - చరిత్ర అనేది పునరావృతం కావాల్సిందే 460 00:37:58,280 --> 00:38:00,240 మనం ఆ క్రమాన్ని నాశనం చేయకపోతే. 461 00:38:02,360 --> 00:38:05,520 లేదు, నాన్నా. మీరు అనారోగ్యంతో ఉన్నారు. 462 00:38:10,960 --> 00:38:15,200 నా జీవితమంతా మీలా ఉండటానికి ప్రయత్నిస్తూనే గడిపాను. 463 00:38:16,320 --> 00:38:17,440 కానీ ఇకపై అలా చేను. 464 00:38:26,600 --> 00:38:27,720 ఇకపై అలా చేయను. 465 00:38:34,640 --> 00:38:35,920 అప్పుడు నన్ను వెళ్లనివ్వు. 466 00:38:38,840 --> 00:38:39,680 క్రమాన్ని విచ్ఛిన్నం చేయనీ. 467 00:38:45,840 --> 00:38:46,680 వీడ్కోలు, బాబూ. 468 00:38:51,760 --> 00:38:52,680 ఉంటాను, నాన్నా. 469 00:40:47,160 --> 00:40:48,600 బాలిక హత్య కేసులో నిందితుని విడుదల 470 00:40:51,600 --> 00:40:53,680 ఇది ఇంకా అయిపోలేదు. 471 00:40:54,760 --> 00:40:55,760 ఇది అయిపోయింది. 472 00:41:25,000 --> 00:41:26,040 హాయ్, నేను లారా. 473 00:41:26,120 --> 00:41:28,160 దయచేసి ఒక సందేశం ఇవ్వండి, నేను తిరిగి సంప్రదిస్తాను. 474 00:41:29,280 --> 00:41:31,480 హాయ్, లారా, నేనే. 475 00:41:34,240 --> 00:41:35,480 నాకు నిన్ను నిజంగా చూడాలని ఉంది. 476 00:42:05,160 --> 00:42:06,680 కసాండ్రా రోడ్స్, 27 మే 1999 477 00:42:06,760 --> 00:42:09,040 నేను అతని చనిపోయిన ముఖంలోకి చూస్తున్నాను. 478 00:42:09,120 --> 00:42:11,600 నేను అతన్ని కొట్టిన చోట అతని తల నుండి రక్తం కారుతోంది, 479 00:42:11,680 --> 00:42:15,640 నేను అతని వైపు నేలపై చూస్తుంటే, నా ఆలోచనలో... 480 00:42:16,440 --> 00:42:18,600 ఆనందం కాదు, ఉపశమనం కాదు, అంతా శూన్యం. 481 00:42:24,960 --> 00:42:26,680 అది సరైన పని అని మీరు నాకు చెప్పారు. 482 00:42:26,760 --> 00:42:29,040 నన్ను పోలీసుల దగ్గరకు వెళ్లమని ప్రోత్సహించినది మీరే. 483 00:42:29,800 --> 00:42:31,680 కానీ నేను సిద్ధంగా లేనని చెప్పాను! 484 00:42:31,760 --> 00:42:32,800 ఆర్లో జోన్స్, 27 మే 2023 485 00:42:33,760 --> 00:42:36,120 దేవుడు నా దగ్గరకొచ్చి, ఇలా అడిగాడు, 486 00:42:36,200 --> 00:42:38,840 "అతని శిక్ష అమలు" చేయడానికి నాకు అభ్యంతరమా అని. 487 00:42:38,920 --> 00:42:42,240 ఇక నేను, "చాలా సంతోషం" అన్నాను. 488 00:42:44,520 --> 00:42:47,440 ఈ గదిలో జరిగే ప్రతిదాన్ని నేను రికార్డ్ చేస్తానని నీకు తెలుసు. 489 00:42:50,360 --> 00:42:51,200 జోయెల్, 1 సెప్టెంబర్ 1998 490 00:42:51,280 --> 00:42:52,720 మన్నించు, నాన్నా. 491 00:42:53,840 --> 00:42:55,720 మన్నించు, కొంత సమయం ఇవ్వగలరా? 492 00:42:57,720 --> 00:43:00,920 కొన్నిసార్లు కొడుకులు వాళ్లకే తండ్రులు అవుతారు, జోయెల్. 493 00:43:01,000 --> 00:43:02,560 అది వాళ్ల రక్తంలోనే ఉంటుంది. 494 00:43:47,480 --> 00:43:48,320 లారా? 495 00:43:52,480 --> 00:43:53,480 లారా? 496 00:44:01,240 --> 00:44:02,080 లారా? 497 00:44:46,680 --> 00:44:47,840 నన్ను క్షమించు. 498 00:45:45,120 --> 00:45:47,120 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 499 00:45:47,200 --> 00:45:49,200 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత