1 00:00:12,638 --> 00:00:16,099 84వ రోజు 2 00:00:50,050 --> 00:00:51,134 హలో. 3 00:00:51,134 --> 00:00:54,304 జెర్మనీలో ప్రతీ ఏడాది ఇళ్ళు తగలబడి 400 మంది చనిపోతుంటారు అని తెలుసా? 4 00:00:54,304 --> 00:00:56,139 చింతించకండి, మేము మీకు ఏదీ అమ్మడానికి ప్రయత్నించడం లేదు. 5 00:00:56,139 --> 00:00:58,892 మేము మీ ఇంట్లో ఉన్న పొగ డిటెక్టర్లను చెక్ చేయడానికి వచ్చాము, ఉచితంగా. 6 00:00:58,892 --> 00:01:02,896 ఖాళీ బ్యాటిరి కారణంగా ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దు. 7 00:01:04,480 --> 00:01:06,400 ఆగండి, నాకు మీరు తెలుసు. 8 00:01:08,861 --> 00:01:10,195 ఓరి, దేవుడా. 9 00:01:10,195 --> 00:01:12,281 మీరు ఆ దంపతులు కదా... 10 00:01:13,824 --> 00:01:15,242 క్షమించాలి. 11 00:01:16,577 --> 00:01:17,828 లోనికి రండి, ప్లీజ్. 12 00:01:19,538 --> 00:01:22,124 క్లాట్ & సన్ ఎలెక్ట్రిక్స్ 13 00:01:25,002 --> 00:01:26,670 మీరు మీ భర్తతో కలిసి ఉంటున్నారా? 14 00:01:26,670 --> 00:01:28,172 నా బాయ్ ఫ్రెండ్ తో ఉంటున్నా. 15 00:01:28,881 --> 00:01:30,966 అతన్ని ఇప్పుడు అలా పిలవచ్చో లేదో కూడా తెలీడం లేదు. 16 00:01:30,966 --> 00:01:34,011 కొన్నాళ్ళు కలిసి ఉంటాం, అంతలోనే విడిపోతుంటాం. 17 00:01:38,348 --> 00:01:39,850 టీ ఇచ్చినందుకు థాంక్స్. 18 00:01:39,850 --> 00:01:40,934 ఏం పర్లేదు. 19 00:01:59,077 --> 00:02:00,537 బిడ్డ పుట్టబోయే తేదీ చెప్పారా? 20 00:02:00,537 --> 00:02:02,998 ఇంకొక రెండు వారాలలో కాన్పు జరుగుతుంది అన్నారు... 21 00:02:02,998 --> 00:02:05,626 కానీ నాకైతే ఏ క్షణమైనా ప్రసవం జరగొచ్చు అనిపిస్తోంది. 22 00:02:08,711 --> 00:02:10,756 - పప్పి? - వాండా కూడా అలాగే ప్రవర్తించేది! 23 00:02:10,756 --> 00:02:13,550 నా కూతురు. కనబడకుండా పోయిన పిల్ల. 24 00:02:13,550 --> 00:02:16,261 అస్సలు కుదురుగా ఉండేది కాదు, ఆఖరికి గర్భంలో కూడా. 25 00:02:17,137 --> 00:02:19,139 - వెళ్ళిపో. - ఏమైనా సమస్యా? 26 00:02:24,645 --> 00:02:26,313 అది నాకు ఇవ్వు, చెత్త... 27 00:02:28,023 --> 00:02:29,775 హలో, బేబీ. 28 00:02:31,443 --> 00:02:32,653 ఇలా రా! 29 00:02:35,072 --> 00:02:36,281 మీకు భలే సంతోషంగా ఉండి ఉంటుంది. 30 00:02:37,032 --> 00:02:39,076 నిజం చెప్పనా? నాకు చాలా భయంగా ఉంది. 31 00:02:39,076 --> 00:02:41,537 అవును, ఆ భయం అలాగే ఉంటుంది. పిల్లలు పుట్టిన నాట నుండి, 32 00:02:41,537 --> 00:02:43,247 వాళ్లకు జరగకూడనిది ఏమైనా జరుగుతుందేమో 33 00:02:44,915 --> 00:02:47,835 అని ఆలోచిస్తూ భయపడుతూనే ఉంటాం. 34 00:02:51,463 --> 00:02:52,714 కానీ తర్వాత... 35 00:02:53,674 --> 00:02:54,675 నిజంగానే... 36 00:02:56,093 --> 00:02:57,469 అలా జరిగినప్పుడు... 37 00:03:01,014 --> 00:03:04,017 మీకు ఇలాంటి కష్టం వచ్చినందుకు నాకు బాధగా ఉంది. 38 00:03:05,394 --> 00:03:06,562 నిజంగా అడుగుతున్నా, ఎలా ఉన్నారు? 39 00:03:18,115 --> 00:03:19,908 పర్లేదు. నేను బానే ఉన్నా. 40 00:03:20,701 --> 00:03:22,870 మనల్ని అందరూ గుర్తుపడుతుంటే నాకు నచ్చడం లేదు. 41 00:03:25,747 --> 00:03:28,208 ఆ చెత్త కుక్క నా కాలు కరిచేసింది, 42 00:03:28,208 --> 00:03:29,918 నేను టెటానస్ ఇంజెక్షన్ వేయించుకోవాలి ఏమో. 43 00:03:36,049 --> 00:03:37,509 ఇదే క్లాట్ కుటుంబం. 44 00:03:38,552 --> 00:03:41,346 వీళ్ళు ఒకప్పుడు మామూలుగానే ఉండేవారు. అదెలా ఉంటుందో నాకు తెలీదు అనుకోండి. 45 00:03:41,847 --> 00:03:44,975 వీళ్ళు మీలాగే ఉండేవారు, అందరిలాగే ట్యాక్సులు కట్టేవారు, 46 00:03:44,975 --> 00:03:49,188 ఒక మామూలు కారు ఉండేది, ఆదివారాలు బయటకు వెళ్లి కాఫీ తాగి కేకు తిని కాలక్షేపం చేసేవారు. 47 00:03:53,734 --> 00:03:55,194 కానీ కొన్నాళ్ళకు... 48 00:03:55,194 --> 00:03:56,153 నాన్న ఇల్లు 22 కనెక్ట్ అయింది 49 00:03:56,737 --> 00:03:57,946 ...కథ అడ్డం తిరిగింది. 50 00:04:00,324 --> 00:04:02,034 చాలా విషమించింది. 51 00:04:24,973 --> 00:04:29,937 ఒకరోజు ఉంటుంది, మరుసటిరోజు ఉండదు. 52 00:04:32,231 --> 00:04:35,776 కానీ మిమ్మల్ని మీరు ఒకటి ప్రశ్నించుకోండి, మీరు ప్రేమించే ఒకరి కోసం మీరు ఎంతకు తెగించగలరు? 53 00:05:23,490 --> 00:05:25,993 ఇదే సుండర్సేయిమ్, 54 00:05:25,993 --> 00:05:30,706 మన "సాధారణమైన" క్లాట్ కుటుంబం నివసించే ఒక "సాధారణ" టౌన్. 55 00:05:30,706 --> 00:05:33,667 మీకు కూడా ఇలాంటి ఒక ఊరు తెలిసే ఉంటుంది. 56 00:05:34,835 --> 00:05:36,545 ఇది ఎలాంటి టౌన్ అంటే 57 00:05:36,545 --> 00:05:41,258 ఇక్కడి జనం తమ స్థానిక టీమ్ కి సపోర్ట్ చేస్తూ 58 00:05:41,258 --> 00:05:43,343 స్థానిక పబ్ లో మందు తాగుతూ, 59 00:05:43,343 --> 00:05:45,846 ఒకవేళ వారి తోటలో ఏదైనా కాయగూర మరీ పెద్దగా పెరిగితే, 60 00:05:45,846 --> 00:05:49,725 దాని ఫోటో స్థానిక న్యూస్ పేపర్ లో వేయించుకునే తరహా ఊరు. 61 00:05:49,725 --> 00:05:53,187 సుండర్సేయిమ్ కి సంబంధించిన ఒక పురాణం కూడా ఉంది. 62 00:05:54,313 --> 00:05:56,106 వీడిని చూడండి, నుప్పుల్వాకన్. 63 00:05:56,106 --> 00:05:58,442 అడవిలో ఉండే ఒక కొమ్ములు తిరిగిన మృగం, 64 00:05:58,442 --> 00:06:02,362 ఏడాదికి ఒకరోజు, నుప్పుల్వాకన్ దినం రాత్రిన టౌన్ లోకి వచ్చి 65 00:06:02,362 --> 00:06:05,991 అందరికంటే అందంగా ఉండే అమ్మాయిని తినేయడానికి ఎత్తుకుపోతాడు. 66 00:06:08,911 --> 00:06:11,914 లేదా పెళ్లి చేసుకోవడానికి ఎత్తుకెళ్తాడా? నాకు సరిగా గుర్తులేదు. 67 00:06:11,914 --> 00:06:15,542 ఏదైతేనేం, నుప్పుల్వాకన్ రాత్రి అనేది సుండర్సేయిమ్ లో పెద్ద పండుగ. 68 00:06:16,502 --> 00:06:19,963 అందరూ వేషాలు వేసుకుని, ష్నాప్స్ తాగుతూ, పెద్ద పరేడ్ జరుపుకుంటారు, 69 00:06:19,963 --> 00:06:23,467 ఆ వేడుకలో బిగుతైన బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి 70 00:06:23,467 --> 00:06:25,969 ఒక పిల్లను కిడ్నాప్ చేసినట్టు నటిస్తాడు. 71 00:06:26,970 --> 00:06:30,724 అదంతా ఇలా వివరిస్తే కాస్త దారుణంగానే ఉంది అనుకోండి. 72 00:06:30,724 --> 00:06:33,810 కానీ మంచి కథలు అన్నీ ఒక రాక్షసుడితోనే కదా మొదలవుతాయి? 73 00:06:40,317 --> 00:06:42,861 కథల్లో మాత్రమే సాధారణంగా రాక్షసులు 74 00:06:42,861 --> 00:06:46,281 దారుణంగా చస్తారు, అందమైన అమ్మాయిలు కాదు. 75 00:06:48,283 --> 00:06:50,244 రోజు 0 76 00:06:52,579 --> 00:06:53,747 వాండా? 77 00:06:55,624 --> 00:06:57,125 - టిఫిన్ వండటానికి ఇంత శబ్దం చేయాలా? - హేయ్! 78 00:06:57,125 --> 00:06:59,002 పాన్ కేకులు చేస్తే బాగుంటుంది కదా? అవి అయితే శబ్దం ఉండదు. 79 00:07:02,381 --> 00:07:04,424 నీ షర్ట్ ఎక్కడ? 80 00:07:04,424 --> 00:07:07,261 నీ సైజ్ లో అక్కడ షర్ట్ లేదా? 81 00:07:07,261 --> 00:07:08,720 నువ్వు నీ వేషం ఇంకా ఎందుకు వేసుకోలేదే? 82 00:07:10,764 --> 00:07:12,140 మిగతా వేషం గేమ్ తర్వాత వేసుకుంటా. 83 00:07:12,140 --> 00:07:13,767 తల్లిదండ్రుల పిక్నిక్ మధ్యాహ్నం మొదలవుతుంది, డిడో. 84 00:07:13,767 --> 00:07:15,936 - అది రెండింటికి కదా? - కాదు. 85 00:07:15,936 --> 00:07:17,187 సరేలే, ఇలా చూడు, 86 00:07:17,187 --> 00:07:22,359 కిక్-ఆఫ్ 10:30కి, తర్వాత హాఫ్-టైమ్... నేను స్కూల్ కి సరిగ్గా 12:35కి వస్తా. 87 00:07:22,359 --> 00:07:23,485 లేదా వీలైతే 88 00:07:23,485 --> 00:07:25,988 ఆట నుండి త్వరగా వచ్చేయనా? ఒకటి చెప్పనా? ఆ ఐడియా బాగుంది. 89 00:07:25,988 --> 00:07:28,407 నేను గనుక ఒక పెద్ద పాత్ర నిండా బంగాళదుంప సలాడ్ చేయగలిగితే, 90 00:07:28,407 --> 00:07:30,534 నువ్వు కనీసం సమయానికి కార్యక్రమానికి రావడానికి ట్రై చేయాలి, సరేనా? 91 00:07:30,534 --> 00:07:33,620 కాటరిన విన్సన్ నిన్ను మళ్ళీ బంగాళదుంప సలాడ్ చేయమందా? 92 00:07:35,831 --> 00:07:37,040 వాండా! 93 00:07:37,040 --> 00:07:40,335 ఇంకొక్క అయిదు సెకన్లలో కిందకు రాలేదంటే... 94 00:07:40,335 --> 00:07:41,753 ఏం చేస్తావు? 95 00:07:41,753 --> 00:07:43,213 ఇదే నేను. 96 00:07:43,213 --> 00:07:45,549 మనం సీన్ ని కాస్త జరుపుదాం... ఇంకా, ముందుకు, ఇంకా కానివ్వండి. 97 00:07:45,549 --> 00:07:47,176 సరే, ఆపండి! కాస్త వెనక్కి. 98 00:07:47,176 --> 00:07:48,844 బాగుంది. సరే, ఇది నేను. 99 00:07:49,761 --> 00:07:51,471 మీరు ఈపాటికే కార్లొట్ట మరియు డిడోలని కలిశారు, 100 00:07:51,471 --> 00:07:53,348 అంటే, నేను "అమ్మా, నాన్నా" అని పిలిచేది వీళ్ళనే. 101 00:07:53,348 --> 00:07:56,018 ఇక్కడ వీళ్ళు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, కానీ దురదృష్టవశాత్తు వీళ్లకు 102 00:07:56,018 --> 00:07:59,104 త్వరలో రానున్న కష్టం గురించి తెలీదు. 103 00:07:59,897 --> 00:08:02,107 ఇక్కడ ఉన్న ఈ సన్నాసి నా తమ్ముడు ఓలే. 104 00:08:02,107 --> 00:08:05,319 వీడు చెవిటివాడు, కానీ చెవి మెషిన్ ఉంది, కాకపోతే అస్తమాను వాటిని ఆపేస్తూ ఉంటాడు. 105 00:08:05,319 --> 00:08:07,279 నిశ్శబ్దంగా ఉంటేనే వాడికి నచ్చుతుందేమో. నేను అర్థం చేసుకోగలను. 106 00:08:07,279 --> 00:08:08,488 బలమైన మహిళా నాయకురాలు 107 00:08:08,488 --> 00:08:09,990 నా వేషం ఎలా ఉంది అనుకుంటున్నారు? 108 00:08:09,990 --> 00:08:11,158 నేనే అందరికంటే అందమైన అమ్మాయిని. 109 00:08:11,158 --> 00:08:12,910 ఇది బాగుంది... 110 00:08:13,994 --> 00:08:17,414 ఈ మధ్య టీనేజ్ అమ్మాయిలు అందరూ ఫ్యాన్సీ డ్రెస్సులంటే ఎదుటోళ్లను రేకెత్తించేలా ఉండేవే వేసుకుంటున్నారే? 111 00:08:17,414 --> 00:08:19,541 అలా తక్కువ చేసి మాట్లాడకు, అమ్మా. ఎవరైనా చూస్తే బాగోదు. 112 00:08:22,085 --> 00:08:23,879 గుడ్ మార్నింగ్, సన్నాసి. 113 00:08:23,879 --> 00:08:25,255 నీకు ఇప్పుడు ఏం కావాలి? 114 00:08:25,255 --> 00:08:27,591 నీ వేషం భలే ఉంది. ఒక్క క్షణం ఆగు. నువ్వు గర్ల్ ఫ్రెండ్ లేని కుర్రాడివా? 115 00:08:29,343 --> 00:08:30,552 వాండా! 116 00:08:30,552 --> 00:08:33,222 - నువ్వు తర్వాత పిక్నిక్ కి వస్తావా? - ఇంకా తెలీదు. 117 00:08:33,222 --> 00:08:35,515 - సరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? - ఫ్రెండ్స్ ని కలుస్తున్నా. 118 00:08:35,515 --> 00:08:37,558 - సరే, ఏం ఫ్రెండ్స్? - అది నీకు అనవసరమైన విషయం. 119 00:08:37,558 --> 00:08:39,645 వాండా, నువ్వు పెద్దదానివి అయ్యానని నీకు అనిపించవచ్చు... 120 00:08:39,645 --> 00:08:41,605 - అవును, నేను పెద్దదాన్ని. - నీకు 17 ఏళ్ళు. 121 00:08:41,605 --> 00:08:43,690 నాది ఓటు వేయడానికి, మందు తాగడానికి, డ్రైవింగ్ చేయడానికి అర్హత ఉన్న వయసు. 122 00:08:43,690 --> 00:08:45,651 - సెక్స్ చేయడానికి కూడా అర్హత ఉంది. - వాండా. వద్దు... 123 00:08:45,651 --> 00:08:47,778 ఏంటి? నన్ను ఎందుకు నీకు సమానమైన మనిషిలా చూడలేకపోతున్నావు? 124 00:08:47,778 --> 00:08:49,988 - ఎందుకంటే నువ్వు నాతో సమానం కాదు! - సరే, కాస్త ఆగండి. 125 00:08:49,988 --> 00:08:51,865 - కాదు, ఇది ముఖ్యమైన విషయం! - ఈ మనిషితో... 126 00:08:51,865 --> 00:08:53,659 ప్రతీరోజూ ఇదే గొడవ! తట్టుకోలేక చస్తున్నాను! 127 00:08:53,659 --> 00:08:55,744 "ఈ మనిషి" నీకు తల్లి! 128 00:08:55,744 --> 00:08:58,080 - ఇక్కడ సమస్య సమానత్వంతో కాదు. - ఆగు. వాండా, వద్దు... 129 00:08:59,081 --> 00:09:00,916 సరే, మీకు విషయం అర్థమై ఉంటుంది. 130 00:09:10,259 --> 00:09:12,636 నా చిన్న టౌన్, ఊర్లో అందరికీ అందరూ పరిచయం ఉండే టౌన్. 131 00:09:13,345 --> 00:09:14,888 అంటే నాకు మాత్రం అలా అనిపించింది అనుకోండి. 132 00:09:23,730 --> 00:09:26,650 కానీ మీ పొరుగింటి వారి గురించి మీకు నిజంగా ఎంత వరకు తెలుసు? 133 00:09:26,650 --> 00:09:29,194 ఇంతమంది ఉంటారు, పక్క పక్కనే ఉంటారు... 134 00:09:31,697 --> 00:09:33,615 అది కూడా చిన్న ప్రదేశంలో. 135 00:09:38,120 --> 00:09:42,124 కొన్నిసార్లు వాళ్ళ ఇళ్ల లోపల, తలుపులు వేసుకుని ఏం చేస్తుంటారా అని సందేహం వస్తుంటుంది కదా? 136 00:09:42,624 --> 00:09:45,169 ఇప్పుడు ఇక మనం మన కథకు వద్దాం. 137 00:09:47,671 --> 00:09:51,884 ఎలాంటి చింత లేని నా మొహం చూసి మీరు ఈపాటికి గెస్ చేసి ఉంటారు, 138 00:09:52,593 --> 00:09:53,927 ఏదో జరగకూడనిది జరగబోతోంది అని. 139 00:09:58,599 --> 00:10:03,854 {\an8}53 నిమిషాల తర్వాత 140 00:10:13,071 --> 00:10:16,658 రోజు 0 141 00:10:17,784 --> 00:10:18,911 రోజు 5 142 00:10:18,911 --> 00:10:19,828 {\an8}కనబడుట లేదు - వాండా క్లాట్ 143 00:10:19,828 --> 00:10:22,372 - శ్రీమతి క్లాట్ కి ఒక ప్రశ్న. - సరే, అడగండి. 144 00:10:22,372 --> 00:10:26,668 శ్రీమతి క్లాట్, మీ ఒక్కగానొక్క కూతురిని బహుశా ఇంకెప్పటికీ చూడలేరు అనిపించినప్పుడు మీకెలా ఉంటుంది? 145 00:10:27,419 --> 00:10:30,297 అది... వర్ణనాతీతం. 146 00:10:31,215 --> 00:10:34,801 ప్రస్తుతం మేము... 147 00:10:36,261 --> 00:10:38,305 వాండాని కనిపెట్టడం మీదే దృష్టి పెట్టాం. 148 00:10:38,305 --> 00:10:41,308 మిస్టర్ క్లాట్, మీకు కూడా అలాగే అనిపిస్తుందా లేక మీరు వాస్తవాన్ని అంగీకరించారా? 149 00:10:41,308 --> 00:10:42,518 అసలు నా మనసులో ఉన్న భావోద్వేగాలను... 150 00:10:42,518 --> 00:10:45,145 మనం కథను ఇక్కడి నుండి మొదలెట్టొచ్చు అనుకోండి. 151 00:10:45,145 --> 00:10:48,065 కానీ నిజం చెప్పాలంటే కాస్త విచారంగా ఉంటుంది. 152 00:10:48,065 --> 00:10:50,275 కాబట్టి కాస్త ముందుకు తీసుకెళ్తాను. 153 00:10:51,652 --> 00:10:52,653 రోజు 30 154 00:10:52,653 --> 00:10:56,406 అవును, అవును, అర్థమైంది. అదృశ్యమైన అమ్మాయి, ఎక్కడబడితే అక్కడ పోస్టర్లు... 155 00:10:56,406 --> 00:10:58,825 నాకు ఆ ఫోటో అస్సలు నచ్చదు. 156 00:10:59,493 --> 00:11:01,703 కొవ్వొత్తులు, దిగులుపడే పొరుగింటి వారు... 157 00:11:01,703 --> 00:11:02,788 రోజు 50 158 00:11:04,957 --> 00:11:09,211 తమ సానుభూతిని తెలపడానికి ఎంతమంది లసాన్యా తెస్తారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 159 00:11:09,211 --> 00:11:10,712 అందుకే నిన్ను అడిగాను. మరి... 160 00:11:10,712 --> 00:11:12,923 ఎమోషనల్ గా అరవడం! 161 00:11:13,674 --> 00:11:14,550 రోజు 68 162 00:11:14,550 --> 00:11:17,594 వద్దు, అవసరం లేదు. కథ బాగా వింతగా తయారైన భాగానికి వెళదాం. 163 00:11:18,262 --> 00:11:21,181 వాళ్ళది ఒక చక్కని కుటుంబం. కానీ ఆకురాలు కాలంలో ఒక రోజు ఉదయం 164 00:11:21,181 --> 00:11:23,308 వాండా క్లాట్ అదృశ్యమైంది. 165 00:11:23,308 --> 00:11:25,227 అంటే, మాది మరీ అంత చక్కని కుటుంబం కాకపోవచ్చు. 166 00:11:25,227 --> 00:11:28,647 ...వారి కూతురు ఎక్కడ ఉందనే విషయాన్ని తెలిపే ఎలాంటి ఆధారాలైనా. 167 00:11:28,647 --> 00:11:30,357 ప్రశాంతంగా ఉండే సుండర్సేయిమ్ లో వాండా కనబడకుండా పోయింది. 168 00:11:30,357 --> 00:11:33,026 వాళ్ళు నాకు మరీ ఎక్కువ మేకప్ వేసారా? నాకు డోనాల్డ్ ట్రంప్ లా ఉన్నట్టు ఉంది. 169 00:11:33,026 --> 00:11:35,863 లేదు, నిన్ను చూస్తుంటే ఎండలో తిరిగి వచ్చిన వ్యక్తిలాగే ఉన్నావు. 170 00:11:38,115 --> 00:11:39,241 చాలా కాలం. 171 00:11:39,241 --> 00:11:42,077 కానీ ఈ ఆదర్శప్రాయమైన టౌన్ ఇటీవల ఎదురైన సంఘటనల వల్ల కుదేలైపోయింది. 172 00:11:42,077 --> 00:11:44,121 నువ్వు వాటిని మానేసాను అన్నావు కదా? 173 00:11:44,121 --> 00:11:47,499 నేను సిగరెట్లు మానడానికి గమ్ అలవాటు చేసుకున్నా, కానీ ఇప్పుడు ఇవి బాగా అలవాటైపోయాయి. 174 00:11:47,499 --> 00:11:49,251 క్లాట్ దంపతులు చాలా దిగులుపడుతున్నారు. 175 00:11:50,252 --> 00:11:52,171 హేయ్, ఊరుకో. ఇది మంచి విషయం. 176 00:11:52,171 --> 00:11:53,797 ఈ పని వల్ల ఖచ్చితంగా లాభం ఉంటుంది. నాకు తెలుస్తోంది. 177 00:11:53,797 --> 00:11:57,926 జరిగిన విషయం ఎలా జరిగిందనేది అందరం ఒకసారి గుర్తుచేసుకుందాం. 178 00:11:58,510 --> 00:12:02,806 క్లాట్ వారి ఇంట్లో అదొక సాధారణమైన రోజు. 179 00:12:02,806 --> 00:12:05,225 అది నుప్పుల్వాకన్ రాత్రి జరిగిన రోజు... 180 00:12:05,225 --> 00:12:07,603 - ఆమె అస్సలు నాలా లేదు. - ...సుండర్సేయిమ్ లోని స్థానిక 181 00:12:07,603 --> 00:12:10,772 ఆచారం ప్రకారం వేడుక చేసుకునే రోజు అది, తండ్రి డిడో క్లాట్ బాగా ఉత్సాహంగా ఉన్నారు. 182 00:12:10,772 --> 00:12:13,859 ఓలే. ఓలే. ఓలే. ఓలే. 183 00:12:13,859 --> 00:12:15,527 నేను పబ్ కి పోతున్నా. 184 00:12:15,527 --> 00:12:19,239 డిడో "ది కపిటన్" అనబడే ఒక స్థానిక పబ్ లో స్థానిక సాకర్ మ్యాచ్ 185 00:12:19,239 --> 00:12:22,409 చూడటానికి బయలుదేరాడు. 186 00:12:22,409 --> 00:12:23,911 హేయ్, అమ్మా. 187 00:12:23,911 --> 00:12:26,747 - నేను వెళ్తున్నాను. నాకోసం ఎదురుచుడొద్దు. - ఎక్కడికి వెళ్తున్నావు? 188 00:12:26,747 --> 00:12:29,082 మిస్టర్ మరియు మిసెస్ క్లాట్, ఇలా రండి, కొంచెం నన్ను ఫాలో అవ్వండి, 189 00:12:29,082 --> 00:12:30,167 మేము మిమ్మల్ని కూర్చోబెడతాం. 190 00:12:30,167 --> 00:12:32,586 - నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. - వెంటనే వెనక్కి రా, పిల్లా. 191 00:12:32,586 --> 00:12:33,629 నాకు నువ్వంటే అసహ్యం! 192 00:12:34,463 --> 00:12:36,048 కార్లొట్ట. కార్లొట్ట. 193 00:12:36,965 --> 00:12:37,966 చెప్పు. 194 00:12:37,966 --> 00:12:40,928 తన తల్లితో గొడవపడిన తర్వాత, వాండా ఇల్లు వదిలి 195 00:12:40,928 --> 00:12:44,264 - తన ఎర్రని వెస్పా స్కూటర్ మీద వెళ్ళింది. - అవును. ముందుకే. 196 00:12:46,934 --> 00:12:49,520 సరే, అందరం వచ్చేసాం. మీకు ఈ ఎత్తు సరిపోయిందా? 197 00:12:49,520 --> 00:12:52,773 - కానీ ఇది ఎందుకో... - యానిక్, కొంచెం ఇది చూస్తావా? త్వరగా. 198 00:12:52,773 --> 00:12:54,858 ఇది సరిగ్గా... 199 00:12:54,858 --> 00:12:56,235 - థాంక్స్. - అంతే. 200 00:12:56,235 --> 00:12:58,362 - మంచిది. థాంక్స్. అవును. - పర్లేదంటావా, సరేనా? 201 00:12:58,362 --> 00:12:59,530 సరే, ఫ్రీగా మాట్లాడండి. 202 00:12:59,530 --> 00:13:03,158 ఇది టీవీ మాత్రమే, కంగారు పడకండి. మీకు సపోర్ట్ చేయడానికి మేమంతా ఉన్నాం. 203 00:13:03,742 --> 00:13:09,540 నా మాట వినండి, శ్రీమతి క్లాట్, భయపడకండి, మనసులో ఉన్నది వ్యక్తం చేయండి. సరేనా? 204 00:13:09,540 --> 00:13:14,044 సరే, లైవ్ కి వెళ్తున్నాం, అయిదు, నాలుగు... 205 00:13:16,922 --> 00:13:17,756 నేను... 206 00:13:25,931 --> 00:13:27,724 {\an8}ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న భయంకరమైన విషయం. 207 00:13:27,724 --> 00:13:28,684 {\an8}పీటర్ గెన్స్వీన్ 208 00:13:28,684 --> 00:13:31,520 {\an8}ఇవాళ వాండా వాళ్ళ తలిదండ్రులు మనతో మాట్లాడటానికి స్టూడియోకి వచ్చారు. 209 00:13:31,520 --> 00:13:34,523 {\an8}మిస్టర్ క్లాట్ మరియు శ్రీమతి క్లాట్. మాతో మాట్లాడటానికి వచ్చినందుకు థాంక్స్. 210 00:13:35,023 --> 00:13:38,986 {\an8}కార్లొట్ట, ఆ రోజు ఉదయం జరిగిన వాటిని మాకు వివరించవచ్చు కదా? 211 00:13:38,986 --> 00:13:40,904 {\an8}కార్లొట్ట మరియు డిడో క్లాట్ మిస్ అయిన వాండా తల్లిదండ్రుల 212 00:13:40,904 --> 00:13:46,743 {\an8}సరే. నేను, ఎప్పటిలాగే నిద్ర లేచాను. వాండా కోసం టిఫిన్ చేశాను, తర్వాత... 213 00:13:46,743 --> 00:13:51,957 మరి ఆ రోజు ఉదయం మీరు, వాండా గొడవపడటం నిజమేనా? 214 00:13:53,083 --> 00:13:57,004 అంటే, ఆమె టీనేజ్ అమ్మాయి. మేము ప్రతీ రోజూ గొడవపడుతుంటాం. 215 00:13:57,004 --> 00:13:58,922 సరే. 216 00:13:58,922 --> 00:14:03,177 అలాగే స్టూడియోలో ఇవాళ మనతో చీఫ్ ఇన్స్పెక్టర్ మిషెల్ రాచ్ కూడా ఉన్నారు. 217 00:14:03,177 --> 00:14:04,386 {\an8}స్వాగతం. 218 00:14:04,386 --> 00:14:05,888 {\an8}మిషెల్ రాచ్ టాస్క్ ఫోర్స్ వాండా క్లాట్ 219 00:14:05,888 --> 00:14:09,183 {\an8}డిటెక్టివ్ రాచ్, ఈ కేసు ఒక గొప్ప మిస్టరీ కదా? మీకు ఏం విషయం తెలిసింది? 220 00:14:09,183 --> 00:14:14,146 వాండా ఆ రోజు ఉదయం 9:45కి తన ఎర్రని వెస్పా మీద ఇల్లు వదిలి వెళ్లిందని తెలుసు. 221 00:14:14,771 --> 00:14:17,524 ఆమెను ఉదయం 10:20 సమయానికి 222 00:14:17,524 --> 00:14:18,984 హై స్ట్రీట్ లో ఒక కాఫీ షాప్ దగ్గర చూసారు... 223 00:14:18,984 --> 00:14:21,069 - సరే. - ...ఆమె సెల్ ఫోన్ అక్కడే దొరికింది. 224 00:14:21,612 --> 00:14:23,864 ఆమె అక్కడి నుండి బయలుదేరి, దక్షిణం దిశగా వెళ్ళింది. 225 00:14:23,864 --> 00:14:26,658 - సరే. - చివరిగా అక్కడి వారు ఆమెను చూసినట్టు తెలుసు. 226 00:14:26,658 --> 00:14:29,036 అయితే వాండాను బలవంతంగా ఎవరైనా తీసుకెళ్లి ఉండొచ్చు అనుకుంటున్నారా? 227 00:14:29,036 --> 00:14:31,580 అంటే మేము ఖచ్చితంగా ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నాం. 228 00:14:31,580 --> 00:14:34,208 కానీ ఆమె వయసును బట్టి ఆలోచిస్తే, తను సొంతంగానే వెళ్ళిపోయి 229 00:14:34,208 --> 00:14:36,126 ఉండొచ్చు అని కూడా అనుకోకుండా ఉండలేం. 230 00:14:36,126 --> 00:14:39,129 మాకు చెప్పకుండా వాండా అలా వెళ్లిపోయే రకం కాదు. 231 00:14:39,129 --> 00:14:41,757 - కానీ మాకు ఖచ్చితమైన ఆధారాలు దొరికేంత వరకు... - తనను కిడ్నాప్ చేశారు. 232 00:14:41,757 --> 00:14:44,426 - ఆమె తన సొంత నిర్ణయం మేరకు వెళ్లిపోలేదు... - తనను కిడ్నాప్ చేశారు! 233 00:14:44,426 --> 00:14:46,970 - ...అని అంచనా వేయకుండా ఉండలేం. - కిడ్నాప్ చేశారు! కిడ్నాప్ చేశారు! 234 00:14:49,598 --> 00:14:52,226 డిడో, గణాంకాల పరంగా, కనబడకుండా పోయిన ఒక వ్యక్తి 235 00:14:52,226 --> 00:14:54,520 మొదటి 100 రోజుల తర్వాత ప్రాణాలతో మనకు దొరికే అవకాశం 236 00:14:54,520 --> 00:14:56,688 10% కంటే తక్కువ అని మాకు తెలుసు. 237 00:14:56,688 --> 00:14:57,981 మీకు అది విన్నాకా ఎలా అనిపిస్తోంది? 238 00:14:58,899 --> 00:15:01,652 - అంటే... - ఎలా అనిపిస్తుందని మీరు అనుకుంటున్నారు? 239 00:15:01,652 --> 00:15:02,986 చాలా దారుణంగా అనిపిస్తుంది. 240 00:15:04,154 --> 00:15:06,532 కార్లొట్ట, ఒకవేళ వాండా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు అయితే, 241 00:15:06,532 --> 00:15:08,867 మీరు ఆమెకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? 242 00:15:09,952 --> 00:15:11,787 కెమెరా... వైపు చూసి చెప్పండి. 243 00:15:12,996 --> 00:15:15,457 నెమ్మదిగా తల్లిని జూమ్ చేయండి. 244 00:15:16,583 --> 00:15:17,960 అంటే, వాండా, 245 00:15:17,960 --> 00:15:23,799 నీకు గనుక నా మాటలు వినిపిస్తే, మేము నిన్ను... మేము నిన్ను ప్రేమిస్తున్నాం అని తెలుసుకో... 246 00:15:27,094 --> 00:15:29,137 చాలా ప్రేమిస్తున్నాం, అలాగే... 247 00:15:30,556 --> 00:15:34,768 నిన్ను తిరిగి ఇంటికి తీసుకురావడానికి మాకు సాధ్యమైంది అంతా చేస్తున్నాం. 248 00:15:34,768 --> 00:15:37,271 అలాగే ఏదైనా విషయం తెలిసిన వారు 249 00:15:38,146 --> 00:15:40,023 ఎవరైనా ఈమాటలు వింటే, ఏదైనా సరే, 250 00:15:40,941 --> 00:15:43,235 అది ముఖ్యమైంది కాదని మీకు అనిపించినా సరే, 251 00:15:45,529 --> 00:15:47,406 దయచేసి మమ్మల్ని సంప్రదించండి. 252 00:15:47,406 --> 00:15:51,743 ఒక బిడ్డను కోల్పోవడం ఎలా ఉంటుందో మీరు అర్థం ఊహించలేరు. 253 00:15:52,286 --> 00:15:55,873 మీరు కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఒకే ఒక్క వ్యక్తిని 254 00:15:55,873 --> 00:15:59,710 కాపాడుకోలేకపోవడం వల్ల తను ఇప్పుడు మీ ముందు లేదనే భయంకరమైన వాస్తవాన్ని 255 00:15:59,710 --> 00:16:03,630 జీర్ణించుకోవడం చాలా కష్టం. 256 00:16:08,302 --> 00:16:09,803 క్షమించండి, నేను... 257 00:16:10,762 --> 00:16:13,473 నాకు... నాకు ఇంకేం చెప్పాలో తెలీడం... 258 00:16:14,766 --> 00:16:16,476 అంటే ఏంటి మీ ఉద్దేశం? 259 00:16:16,476 --> 00:16:18,061 ఇంకా. 260 00:16:19,104 --> 00:16:20,147 ఇంకా? 261 00:16:22,566 --> 00:16:24,026 నన్ను ఇంకేం చేయమంటావు? 262 00:16:24,026 --> 00:16:26,445 అరుస్తూ, కేకలు పెడుతూ ఏడవాలా ఏంటి? 263 00:16:27,779 --> 00:16:29,740 మంచిది. ఇక మనం మరొక విషయం... 264 00:16:29,740 --> 00:16:33,452 ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసుకోవాలని ఉందా, పీటర్ గెన్స్వీన్? ఇదేమైనా వెటకారమా? 265 00:16:34,203 --> 00:16:38,373 అందరూ రాబందుల్లా మమ్మల్ని చూడటం, మా వెనుక మాట్లాడుకోవడం, 266 00:16:38,373 --> 00:16:40,542 మేమేదో సర్కస్ లో జోకర్లం అన్నట్టు వేలెత్తి చూపించడం. 267 00:16:42,127 --> 00:16:44,254 నీకు ఈ "ఎమోషన్" సరిపోతుందా? 268 00:16:44,254 --> 00:16:46,882 ఇప్పుడు బాగా "వ్యక్తీకరిస్తున్నానా"? 269 00:16:46,882 --> 00:16:48,467 హేయ్! నీతోనే మాట్లాడుతున్నా. 270 00:16:48,467 --> 00:16:52,387 అవును, నిన్నే! ఏదో ట్రాఫిక్ లో సూచనలు ఇస్తున్నట్టు చేతులు ఆడిస్తూ నిలబడ్డావు కదా. 271 00:16:54,139 --> 00:16:55,641 లేక ఇంకాస్త కన్నీళ్లు పెట్టాలా? 272 00:16:55,641 --> 00:16:57,726 ఇంకా చీదాలా? 273 00:16:58,352 --> 00:17:01,939 నా కళ్ళ కింద ఉన్న బ్యాగులను కూడా బాగా జూమ్ చేసి చూపించొచ్చు కదా? 274 00:17:03,148 --> 00:17:04,608 నా వేదనను బాగా చిత్రీకరించండి. 275 00:17:05,608 --> 00:17:07,569 రండి, ఇలా వచ్చి చూపండి. 276 00:17:07,569 --> 00:17:08,862 చూడండి, 277 00:17:09,780 --> 00:17:15,827 పాపం, దిక్కుతోచని కనబడకుండా పోయిన అమ్మాయి తల్లి. 278 00:17:17,162 --> 00:17:19,164 ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కదా? 279 00:17:20,082 --> 00:17:21,666 పరమ దరిద్రం, నేను వెళ్తున్నాను. 280 00:17:22,626 --> 00:17:23,836 నేను వెళ్తున్నాను! 281 00:17:23,836 --> 00:17:25,671 - శ్రీమతి క్లాట్, శాంతించండి. - ఇక నా వల్ల... 282 00:17:25,671 --> 00:17:27,923 - ఇక్కడ ఇంకా... - ఆపు! 283 00:17:27,923 --> 00:17:29,383 నన్ను వీడియో తీయడం ఆపండి! 284 00:17:29,383 --> 00:17:31,051 దొబ్బేయండి, అందరూ పొండి! 285 00:17:33,971 --> 00:17:35,889 ఆపు! 286 00:17:35,889 --> 00:17:37,391 నన్ను వీడియో తీయడం ఆపండి! 287 00:17:44,815 --> 00:17:46,275 ఏం మాట్లాడకు. 288 00:17:47,025 --> 00:17:48,443 నేను ఏమీ మాట్లాడలేదు! 289 00:17:51,154 --> 00:17:53,240 ఇది చెత్త ఐడియా అని నాకు తెలుసు. 290 00:17:55,075 --> 00:17:57,286 నేను ఒక సైకోలా కనిపించాను! 291 00:17:57,286 --> 00:17:59,746 - లేదు. - అది కూడా లైవ్ టీవీలో. 292 00:17:59,746 --> 00:18:01,582 కోపపడటంలో తప్పు లేదు. 293 00:18:01,582 --> 00:18:04,501 అది ఒకరు బాధపడుతున్నారని చూపుతుంది అంతే. 294 00:18:04,501 --> 00:18:06,420 మనకు పబ్లిక్ సింపతీ కావాలి. 295 00:18:06,420 --> 00:18:10,382 నాకు ఇక సింపతీ ఏమీ అక్కర్లేదు, డిడో. నాకు ఫలితాలు కావాలి. 296 00:18:10,382 --> 00:18:12,217 నాకు తెలుసు. 297 00:18:12,217 --> 00:18:14,011 మరి మనం ఇంకా ఏమీ చేయడం లేదు ఎందుకు? 298 00:18:14,011 --> 00:18:15,220 మనం చేస్తున్నాం! 299 00:18:15,220 --> 00:18:18,056 ఏంటి? పోస్టర్లు అంటించడమా? కొవ్వొత్తులు వెలిగించడమా? 300 00:18:18,056 --> 00:18:22,603 ఆ పొగరుబోతు వెధవ పీటర్ గెన్స్వీన్ పిచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పడమా? 301 00:18:22,603 --> 00:18:24,938 హేయ్, ఇందులోకి పీటర్ గెన్స్వీన్ ని లాగకు! 302 00:18:24,938 --> 00:18:27,441 అతను నిబద్ధత కలిగిన ప్రభుత్వ ఉద్యోగి. 303 00:18:45,834 --> 00:18:47,419 తను ఇంకా ప్రాణాలతోనే ఉంది, కదా? 304 00:18:54,051 --> 00:18:55,052 అవును. 305 00:18:56,762 --> 00:18:58,013 అవును, తను ఇంకా ప్రాణాలతోనే ఉంది. 306 00:19:11,026 --> 00:19:14,279 నాకు నిద్ర రావడం లేదు. నా తలలో ఎన్నో ఆలోచనలు పరిగెడుతున్నాయి. 307 00:19:59,783 --> 00:20:02,369 నేను ఇంకా తాతయ్య 308 00:20:11,336 --> 00:20:14,214 నేను నిన్ను మిస్ అవుతున్నాను, బంగారం. 309 00:20:18,385 --> 00:20:19,970 నాకోసం దీని మీద ఒక కన్నేసి ఉంచు, నాన్న, 310 00:20:21,096 --> 00:20:22,598 ఎందుకంటే తనను కోల్పోవడం నా వల్ల కాదు. 311 00:20:43,327 --> 00:20:44,328 డిడో! 312 00:20:45,370 --> 00:20:46,371 డిడో! 313 00:20:47,998 --> 00:20:50,125 ఏమైంది? 314 00:20:50,876 --> 00:20:52,127 వాళ్లకు ఒక విషయం తెలిసింది అంట. 315 00:20:54,046 --> 00:20:57,841 నిన్న రాత్రి మీరు చేసిన రాద్ధాంతం వల్ల కొంతమంది మాట్లాడుకోవడం మొదలెట్టారు. 316 00:20:59,218 --> 00:21:01,178 మనం ముందుగానే ఒక అంచనాకు రావడం మంచిది కాదు. 317 00:21:02,262 --> 00:21:04,932 టీవీలో అభ్యర్ధనలు చేసినప్పుడు లేనిది ఉన్నట్టు చెప్పేవాళ్ళు కొంతమంది ఫోన్ చేస్తుంటారు. 318 00:21:04,932 --> 00:21:06,016 అవును, అది నిజమే. 319 00:21:06,016 --> 00:21:08,519 అప్పుడే ఒక వ్యక్తి ఫోన్ చేసి వాండా కనిపించకుండా పోవడానికి కారణం 320 00:21:08,519 --> 00:21:11,188 ప్రపంచ వ్యాప్తంగా ఒక సైతానును పూజించే పీడోఫైల్స్ జరిపే కుట్ర అని అన్నాడు. 321 00:21:11,188 --> 00:21:15,067 అతను మా రిసెప్షన్ వారిని "చీకటి వ్యవస్థ చేతిలో ఆడుతున్న కీలుబొమ్మ" అన్నాడు. 322 00:21:15,067 --> 00:21:17,778 కాకపోతే కాస్త ప్రయోజనం ఉండొచ్చు అనిపించే మరొక ఆధారం దొరికింది. 323 00:21:17,778 --> 00:21:18,862 ష్లెన్బెర్గ్. 324 00:21:21,323 --> 00:21:25,118 సరే, ఇది 100% ఖచ్చితంగా వాండా టీ-షర్ట్ అని మేము చెప్పలేం... 325 00:21:32,292 --> 00:21:33,293 ఇదే! 326 00:21:33,836 --> 00:21:34,837 ఇది తనదే. 327 00:21:35,420 --> 00:21:37,798 ఈ మచ్చలు, ఎర్ర మచ్చలు. ఇది దానిమ్మపండు రసం. 328 00:21:37,798 --> 00:21:40,217 డిడో రక్త పోటు తగ్గడం కోసం అది తాగమని ఇచ్చాను. 329 00:21:40,217 --> 00:21:41,844 అది చాలా వగరుగా ఉంటుంది. 330 00:21:41,844 --> 00:21:44,429 ఆ గ్లాసు వలకడం వల్ల పెద్ద గొడవ అయింది 331 00:21:44,429 --> 00:21:46,974 ఎందుకంటే కొన్ని చుక్కలు వాండా షర్ట్ మీద పడ్డాయి. 332 00:21:46,974 --> 00:21:49,977 నిద్రలో కూడా నేను ఈ మచ్చలను గుర్తుపట్టగలను. 333 00:21:49,977 --> 00:21:51,770 నేను గంట సేపు ఆగకుండా వీటిని తోమాను. 334 00:21:51,770 --> 00:21:53,105 మీకు ఇది ఎక్కడ దొరికింది? 335 00:21:53,105 --> 00:21:54,815 "సెకండ్ ఛాన్స్" అనబడే ఒక సెకండ్ హ్యాండ్ స్టోర్ లో. 336 00:21:54,815 --> 00:21:58,944 ఆ షాప్ ఓనర్ గడిచిన 30 రోజులలో దీనిని బట్టల రీసైక్లింగ్ బిన్ లో 337 00:21:58,944 --> 00:22:01,738 - పాడేసి ఉండొచ్చు అనుకుంటున్నాడు. - ఆగండి, 338 00:22:01,738 --> 00:22:05,659 అంటే వాండా టీ-షర్ట్ ని సుండర్సేయిమ్ లో ఉన్న సెకండ్ హ్యాండ్ బట్టల బిన్ లో 339 00:22:05,659 --> 00:22:08,912 గడిచిన 30 రోజులలో వేసారు అంటున్నారా? 340 00:22:09,997 --> 00:22:12,332 డిడో. తను ఇంకా ఇక్కడే ఉంది. 341 00:22:12,332 --> 00:22:14,501 ముందుగానే అంచనాలు వేయకుండా ఆగడం ముఖ్యం. 342 00:22:14,501 --> 00:22:17,087 మనం ఈ ఏరియాలో ఉన్న అన్ని ఇళ్ళు వెతకాలి. 343 00:22:17,087 --> 00:22:19,214 మేము ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీలను చెక్ చేస్తున్నాం. 344 00:22:19,214 --> 00:22:21,258 ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి అక్కడ ఉన్న వారిని అడుగుతున్నారు... 345 00:22:21,258 --> 00:22:24,553 ఇంటింటికీ వెళ్ళా? అలా చేసి ఏం లాభం? 346 00:22:24,553 --> 00:22:27,723 "ఏమండీ, సర్, మీరు ఎవరైనా టీనేజ్ అమ్మాయిని కిడ్నాప్ చేసారా?" అది అడుగుతారా? 347 00:22:27,723 --> 00:22:31,351 "ఓహ్, అవును, ఆఫీసర్. ఆ పిల్ల నా బేస్మెంట్లోనే ఉంది, వెళ్లి తీసుకురమ్మంటారా?" 348 00:22:31,351 --> 00:22:33,395 తిను చెప్పింది నిజమే. మనం ఇళ్ల లోపలికి వెళ్లి 349 00:22:33,395 --> 00:22:34,897 వెతికితేనే కదా తెలుస్తుంది? 350 00:22:34,897 --> 00:22:38,025 ఎలాంటి సంభావ్య కారణం లేకుండా మేము జనం ఇళ్లలోకి వెళ్లి వెతకలేము. 351 00:22:38,025 --> 00:22:39,902 ఇదే ఆ సంభావ్య కారణం! 352 00:22:39,902 --> 00:22:41,987 శ్రీమతి క్లాట్, గడ్డిమోపులో గుండెసూదిని వెతికే పరిస్థితి ఎదురైతే, 353 00:22:41,987 --> 00:22:44,823 గడ్డి మొత్తం చెదిరిపోయేలా ఫ్యాన్ పెట్టకూడదు, ట్వీజర్స్ వాడి వెతకాలి. 354 00:22:44,823 --> 00:22:47,034 మీరు ఏం మాట్లాడుతున్నారు? 355 00:22:47,868 --> 00:22:48,827 శ్రీమతి క్లాట్... 356 00:22:48,827 --> 00:22:50,078 {\an8}పాత్ర: నేరస్థుడు అపరాధం: దొంగతనం 357 00:22:50,078 --> 00:22:53,123 {\an8}...వాండాని వెతకడానికి మేము మాకు వీలైంది అంతా చేస్తున్నాం అని 358 00:22:53,123 --> 00:22:54,374 మీకు హామీ ఇస్తున్నా. 359 00:22:54,374 --> 00:22:57,127 మేము మా దృష్టికి అనుమానం కలిగించేలా ఉన్న చాలా మంది మీద కన్నేసి ఉంచాం. 360 00:22:57,127 --> 00:22:58,837 {\an8}అయితే మేమేం చేయాలి? 361 00:22:58,837 --> 00:23:00,380 {\an8}శ్రీమతి క్లాట్, ఇది మంచి వార్త. 362 00:23:00,380 --> 00:23:01,673 {\an8}బార్టల్స్ - డొమినిక్ 37 క్లాడియస్ వీధి 363 00:23:01,673 --> 00:23:03,258 మాకు దొరికిన మొదటి మంచి ఆధారం ఇదే. 364 00:23:03,258 --> 00:23:05,302 కాబట్టి, ప్రస్తుతం మీరు నాకు చేయాల్సిన ఒకే ఒక్క సాయం 365 00:23:05,302 --> 00:23:07,804 సైలెంట్ గా ఉండి, మా పని మమ్మల్ని చేయనివ్వడమే. 366 00:23:09,640 --> 00:23:15,312 నేను "ఊరికే ఉంటాను" అని ఆవిడ అనుకుంటే చాలా తప్పుగా అంచనా వేసినట్టే. 367 00:23:16,855 --> 00:23:18,273 ఇప్పటికే చాలా కాలం ఊరికే ఉండిపోయాను. 368 00:23:18,273 --> 00:23:20,567 డొమినిక్ బార్టల్స్. 37 క్లాడియస్ వీధి. 369 00:23:20,567 --> 00:23:21,735 ఏంటి? 370 00:23:21,735 --> 00:23:23,946 పెన్. నాకు పెన్ కావాలి. 371 00:23:23,946 --> 00:23:26,740 - డొమినిక్ బార్టల్స్. 37 క్లాడియస్ వీధి. - ఏం మాట్లాడుతున్నావు? 372 00:23:26,740 --> 00:23:30,869 డొమినిక్ బార్టల్స్. 37 క్లాడియస్ వీధి. 373 00:23:31,662 --> 00:23:33,372 నేను ఇందాక ఫైల్ ని చూసా. 374 00:23:33,372 --> 00:23:35,207 వాళ్ళు విచారిస్తున్న వారిలో అతను ఒకడు. 375 00:23:35,707 --> 00:23:36,917 ఒక అనుమానితుడు. 376 00:23:37,584 --> 00:23:38,627 అర్థమైంది. 377 00:23:38,627 --> 00:23:39,711 సరే. 378 00:23:40,504 --> 00:23:41,839 అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? 379 00:23:43,632 --> 00:23:44,967 నాకు తెలీదు. 380 00:23:46,093 --> 00:23:47,135 మనం అక్కడికి వెళదామా? 381 00:23:47,803 --> 00:23:51,139 అక్కడికి వెళ్ళాక మనం ఏం చేయాలి? 382 00:23:51,849 --> 00:23:53,183 నాకు తెలీదు. 383 00:23:54,184 --> 00:23:56,311 ఇది నువ్వు మా ఆంటీ మార్గరెట్ దగ్గర వచ్చే వాసన 384 00:23:56,311 --> 00:23:57,688 ఇచ్చే కొవ్వొత్తుల షాప్ దగ్గర ఉండే ఇల్లు. 385 00:23:59,314 --> 00:24:00,482 క్లాడియస్ వీధి. 386 00:24:01,608 --> 00:24:04,653 మనం ఒకసారి వెళ్లి చూస్తే మంచిది అనుకుంటున్నావా? 387 00:24:04,653 --> 00:24:06,113 లేదు, లేదు, లేదు. 388 00:24:06,113 --> 00:24:08,448 మనం ఒకసారి వెళ్లి చూస్తే మంచిది అనుకుంటున్నావా? 389 00:24:08,448 --> 00:24:10,075 అంటే, నా ఉద్దేశం, 390 00:24:11,118 --> 00:24:13,370 మనం అటువైపు ఒకసారి... 391 00:24:13,370 --> 00:24:16,498 - డ్రైవ్ చేసుకుని వెళ్తే ఏమవుతుంది? - అవును. 392 00:24:16,498 --> 00:24:20,544 అంటే, విచారణకు భంగం కలిగించే పని ఏదీ మనం చేయకూడదు. 393 00:24:20,544 --> 00:24:22,337 - లేదు, నిజమే. - అవును. 394 00:24:22,337 --> 00:24:26,675 కానీ అటువైపు డ్రైవ్ చేసుకుని వెళ్తే ఏం కాదు. 395 00:24:26,675 --> 00:24:29,803 - అదేం పర్లేదు అనుకుంట. - దాని వల్ల మంచి కూడా జరగొచ్చు. 396 00:24:29,803 --> 00:24:31,263 - ఎందుకంటే... - ఎందుకంటే... 397 00:24:32,431 --> 00:24:34,266 మనం పోలీసుల కంటే ముందే అతని వ్యవహారాన్ని చెక్ చేయొచ్చు. 398 00:24:34,266 --> 00:24:39,396 ఎందుకంటే ఒకవేళ వాండా అతని దగ్గరే ఉంటే, పోలీసుల రాక అతన్ని భయపెట్టొచ్చు. 399 00:24:39,396 --> 00:24:41,148 అది చాలా మంచి పాయింట్. 400 00:24:41,148 --> 00:24:42,774 ఆ తర్వాత అతను ఏం చేస్తాడో ఎవరూ చెప్పలేరు. 401 00:24:42,774 --> 00:24:45,068 అవును. అతను కంగారు పడకూడదు. 402 00:24:45,068 --> 00:24:47,321 అలా జరిగితే మంచిది కాదు. 403 00:24:49,823 --> 00:24:51,575 అంటే, ఒకసారి చూసి వద్దాం. 404 00:24:52,701 --> 00:24:54,870 అవును. వెళ్లి వచ్చేద్దాం. 405 00:24:54,870 --> 00:24:56,747 వెళ్లినంత మాత్రానా ఏమవుతుంది? 406 00:24:56,747 --> 00:24:58,624 - వెళ్లి చూస్తే పోయేది ఏం లేదు. - అవును. 407 00:24:59,708 --> 00:25:00,709 డిడో. 408 00:25:01,460 --> 00:25:02,669 తను ఇంకా ఇక్కడే ఉంది. 409 00:25:03,378 --> 00:25:05,464 ఇన్నాళ్లూ తను ఇక్కడే ఉంది. 410 00:25:05,464 --> 00:25:07,049 మన ప్రాంతంలోనే ఉంది. 411 00:25:20,145 --> 00:25:22,481 తను ఎక్కడైనా ఉండి ఉండొచ్చు, డిడో. 412 00:25:32,533 --> 00:25:34,618 తనను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండోచ్చు. 413 00:25:38,830 --> 00:25:40,916 - అది అక్కడ ఉంది, కదా? - ఇక్కడే. 414 00:25:41,792 --> 00:25:45,170 వావ్, చూస్తుంటే బాగా పాతబడినట్టు ఉంది. 415 00:25:53,345 --> 00:25:54,596 హేయ్. ఏం చేస్తున్నావు? 416 00:25:54,596 --> 00:25:56,640 నేను వెళ్లి చూస్తున్నా అంతే. 417 00:25:56,640 --> 00:25:59,476 నువ్వు అలా వెళ్ళకూడదు... ముందెప్పుడూ పోలీసుల సినిమా ఏదీ చూడలేదా? 418 00:25:59,476 --> 00:26:01,520 నేరుగా వెళ్లి అలా డోర్ బెల్ కొట్టకూడదు. 419 00:26:01,520 --> 00:26:05,524 నువ్వే అన్నావు కదా. వాండా అతని దగ్గర ఉన్నట్టు అయితే అతను బెదిరిపోకుండా జాగ్రత్తపడాలి. 420 00:26:05,524 --> 00:26:09,361 - అవును. - మనం ఆధారాలను పోగేసి, అప్పుడు అడుగు వేయాలి. 421 00:26:09,361 --> 00:26:12,072 వెళ్లి కొన్ని డోనట్స్ ఏమైనా తెచ్చుకుందామా? 422 00:26:23,125 --> 00:26:24,418 ఏంటది? 423 00:26:25,627 --> 00:26:27,045 నాకు ఇది వాండా గదిలో దొరికింది. 424 00:26:28,005 --> 00:26:31,341 తను దీనిని పాత కుటుంబ ఆల్బమ్స్ లో ఒక దాని నుండి తీసుకుని ఉండొచ్చు. 425 00:26:31,341 --> 00:26:32,593 నేను చూడొచ్చా? 426 00:26:39,433 --> 00:26:40,893 ఓరి దేవుడా. 427 00:26:44,438 --> 00:26:46,190 చూస్తుంటే ఒకేసారి ఇది చాలా కాలం క్రితంలా. 428 00:26:47,566 --> 00:26:49,193 అలాగే నిన్నే అన్నట్టు కూడా అనిపిస్తోంది. 429 00:26:52,905 --> 00:26:54,448 {\an8}ఆ పిచ్చి నవ్వు చూడు. 430 00:26:58,327 --> 00:27:00,078 ఓహ్, అబ్బా. ఆ టైమ్ అంతా ఏమైపోయిందో? 431 00:27:05,584 --> 00:27:06,877 డిడో. 432 00:27:08,045 --> 00:27:09,046 కిందకు వంగు. 433 00:27:10,214 --> 00:27:12,341 కిందకు. నేను ఇంకా కిందకు వంగాలి. 434 00:27:21,934 --> 00:27:23,018 అది అతనే. 435 00:27:24,228 --> 00:27:27,231 అతన్ని చూస్తుంటే బేస్మెంట్ లో టీనేజ్ అమ్మాయిలను దాచే వాడిలాగే ఉన్నాడు. 436 00:27:27,231 --> 00:27:28,232 అవును. 437 00:27:49,211 --> 00:27:51,338 నా వల్ల కాదు, నేను వెళ్లి చూస్తాను. 438 00:27:51,338 --> 00:27:53,799 నిఘా పెట్టడం సంగతి ఏమైంది? 439 00:27:53,799 --> 00:27:57,678 నీకు కావాలంటే నువ్వు నిఘా పెట్టు. అతను వస్తే రెండు సార్లు హార్న్ కొట్టు. 440 00:27:57,678 --> 00:28:00,889 మనం జట్టుగా పనిచేయాలి, సరేనా? "టర్నర్ అండ్ హూచ్" లాగ. 441 00:28:01,598 --> 00:28:03,308 ఆగు, అందులో ఒకటి కుక్క పేరు కదా? 442 00:28:04,101 --> 00:28:05,310 ఓహ్, దేవుడా. 443 00:28:27,666 --> 00:28:28,667 వద్దు. 444 00:28:53,233 --> 00:28:54,818 నేను వెనుకవైపు చెక్ చేస్తా. 445 00:28:54,818 --> 00:28:58,155 వద్దు. వెనక్కి వచ్చెయ్. వెనక్కి వచ్చెయ్. 446 00:28:58,655 --> 00:28:59,656 దేవుడా. 447 00:29:00,240 --> 00:29:01,408 ఓహ్, దేవుడా. 448 00:29:44,660 --> 00:29:45,661 వాండా! 449 00:29:55,754 --> 00:29:58,131 వాండా, లోపల ఉన్నావా? 450 00:30:02,928 --> 00:30:07,182 ఈ లోపల ఏం దాచావు, వెధవా? 451 00:30:58,525 --> 00:30:59,735 వాండా? 452 00:31:00,569 --> 00:31:02,237 లోపల ఉన్నావా? 453 00:32:08,178 --> 00:32:10,389 ఓహ్, ఛ! ఓహ్, లేదు! 454 00:32:21,817 --> 00:32:23,610 {\an8}వద్దు, వద్దు, వద్దు, వద్దు. 455 00:32:27,948 --> 00:32:29,867 ఓహ్, లేదు. ఓహ్, ఛ. అయ్యో. 456 00:32:34,371 --> 00:32:35,414 కార్లొట్ట? 457 00:32:36,123 --> 00:32:36,957 డిడో! 458 00:32:36,957 --> 00:32:39,751 కార్లొట్ట, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? 459 00:32:39,751 --> 00:32:42,296 - నేను ఈ కింద ఉన్నానని నీకెలా తెలుసు? - నీ కేక వినిపించింది. 460 00:32:42,296 --> 00:32:44,089 నువ్వు ఇక్కడ ఉన్నట్టు టౌన్ లో ఉన్న అందరికీ తెలిసి ఉండొచ్చు. 461 00:32:44,089 --> 00:32:45,966 - నేను ఒక పొరపాటు చేశాను. - నీ చేతిని నాకు ఇవ్వు. 462 00:32:46,592 --> 00:32:47,759 పైకి లాగు. 463 00:32:49,720 --> 00:32:53,265 - లాగు! లాగు! లాగు! - లాగుతున్నాను! 464 00:32:53,265 --> 00:32:56,143 ఏం చేసావు... ఏంటి ఆ శబ్దం? 465 00:32:56,143 --> 00:32:58,437 నన్ను ఏదో కరిచింది. 466 00:32:58,437 --> 00:33:00,480 కరిచింది అంటే ఏంటి నీ ఉద్దేశం? 467 00:33:01,231 --> 00:33:02,649 ఎందుకు అరుస్తున్నావు? 468 00:33:03,942 --> 00:33:04,943 దీన్ని నా మీద నుండి తియ్యి! 469 00:33:04,943 --> 00:33:06,403 - ఎలా? - దాన్ని పట్టుకో! 470 00:33:06,403 --> 00:33:07,571 నేను ఈ పామును పట్టుకోను! 471 00:33:07,571 --> 00:33:10,073 ఈ చెత్త పామును పట్టుకో! 472 00:33:10,073 --> 00:33:11,783 ఓహ్, దేవుడా! 473 00:33:12,951 --> 00:33:14,369 కదలకుండా ఉండు! 474 00:33:15,495 --> 00:33:16,914 ఇప్పుడు ఏం చేయాలి? 475 00:33:16,914 --> 00:33:18,415 - ఇప్పుడు ఏం చేయాలి? - దాన్ని వదిలించుకో! 476 00:33:18,415 --> 00:33:20,417 - ఎక్కడ? - విసిరేయ్! ఆగు! వద్దు, వద్దు! 477 00:33:21,502 --> 00:33:23,295 మనం దాన్ని తీసుకెళ్లాలి. ఒకవేళ అది విషపూరితం అయితే 478 00:33:23,295 --> 00:33:25,756 విషానికి విరుగుడు తయారు చేయడానికి వాళ్ళకి కాటు వేసిన పాము కావాలి. 479 00:33:25,756 --> 00:33:30,219 నేను హాస్పిటల్ కి వెళ్లే వరకు విషపూరితమైన పామును పట్టుకుని ఉండలేను. 480 00:33:30,219 --> 00:33:31,845 అస్సలు అవకాశమే లేదు! 481 00:34:19,518 --> 00:34:20,518 నేను... 482 00:34:24,565 --> 00:34:25,983 మేము ఏం అనుకున్నాం... 483 00:34:31,947 --> 00:34:34,867 మిస్టర్ బార్టల్స్ బేస్మెంట్ లో మీరు చేసిన ధ్వంసానికి తక్కువలో తక్కువ 484 00:34:34,867 --> 00:34:40,664 అంచనాల ప్రకారం 15 నుండి 20 వేల యూరోల నష్టం వాటిల్లింది. 485 00:34:41,748 --> 00:34:43,917 అదొక్కటే కాకుండా పాములకు ఎదురైన మానసిక ఒత్తిడి ఇంకొకటి. 486 00:34:44,668 --> 00:34:48,380 అలాగే పొరుగింటి వ్యక్తి బాత్ రూమ్ లోకి ఒక తాచుపాము కూడా వెళ్ళింది. 487 00:34:50,465 --> 00:34:51,717 మిస్ రాచ్, నేను... 488 00:34:51,717 --> 00:34:53,760 చొరబడిన వారికి కలిసొచ్చే విషయం ఏంటంటే 489 00:34:55,094 --> 00:34:57,973 మేము సీజ్ చేసిన పాముల్లో సగానికి పైగా ఇల్లీగల్ పాములే, 490 00:34:59,266 --> 00:35:03,812 కాబట్టి మిస్టర్ బార్టల్స్ మీపై కేసు వేసే పరిస్థితి లేదు. 491 00:35:05,189 --> 00:35:09,401 మీరిద్దరూ గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని నాకు తెలుసు. 492 00:35:10,986 --> 00:35:14,531 కాబట్టి ఆ ఒక్క కారణంగా నేను మీరు ఈ పనిని తాత్కాలికంగా 493 00:35:14,531 --> 00:35:17,868 ఒత్తిడి తట్టుకోలేక చేసారని అనుకుని వదిలేస్తున్నా. 494 00:35:17,868 --> 00:35:19,828 - మీకు చాలా థాంక్స్... - కానీ ఇంకోక్కసారి 495 00:35:19,828 --> 00:35:21,580 మీరు నా విచారణలో తలదూర్చినట్టు తెలిస్తే... 496 00:35:22,581 --> 00:35:27,002 నేను మిమ్మల్ని ఎంత గట్టిగ తన్నుతానంటే, కడుపు మీద తన్నితే బూటు నోట్లో నుండి బయటకు వస్తది. 497 00:35:28,587 --> 00:35:30,005 అర్థమైందా? 498 00:35:33,008 --> 00:35:39,348 మంచిది. ఇక మీరు ఇంటికి వెళ్లి మీకున్న ఇంకొక బిడ్డ మీద దృష్టి పెట్టండి. 499 00:35:52,528 --> 00:35:54,988 హాయ్. 500 00:35:57,282 --> 00:36:00,202 మీ అమ్మను ఒక పాము కాటేసింది, కానీ తనకు ఏమీ కాలేదు. 501 00:36:03,372 --> 00:36:04,373 మంచిది. 502 00:37:23,410 --> 00:37:24,870 - కొంచెం మాట్లాడొచ్చా? - ఇప్పుడు కాదు... 503 00:37:24,870 --> 00:37:27,706 నా వల్ల కాదు. ఇప్పుడు నేను... 504 00:37:29,082 --> 00:37:30,751 "చెప్పాను కదా", 505 00:37:31,793 --> 00:37:33,337 లేదా "నీకు పిచ్చి", 506 00:37:35,047 --> 00:37:39,218 లేదా "కాస్త కంట్రోల్ చేసుకోవాలి" అంటే తట్టుకోలేను, అవన్నీ నాకు తెలుసు, డిడో. నాకు తెలుసు. 507 00:37:41,929 --> 00:37:43,514 నేను నీకు ఒకటి చూపించాలి. 508 00:37:43,514 --> 00:37:48,977 {\an8}డొనేషన్ బిన్ 509 00:37:56,026 --> 00:37:57,194 ఇది ఏంటి? 510 00:37:57,778 --> 00:37:59,112 ఇది ఒక ప్లాన్. 511 00:38:00,280 --> 00:38:03,617 మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు, పక్షులను గమనించడానికి ఓపిక అలాగే 512 00:38:04,201 --> 00:38:05,410 పట్టుదల కావాలి అని. 513 00:38:05,410 --> 00:38:08,288 మనం పక్షుల పర్యావరణాన్ని అలాగే వాటి అలవాట్లను తెలుసుకోవాలి. సరేనా? 514 00:38:08,288 --> 00:38:09,456 - సరే... - మంచిది. 515 00:38:09,456 --> 00:38:11,208 రేపు 70వ రోజు. 516 00:38:11,208 --> 00:38:13,669 పీటర్ గెన్స్వీన్ చెప్పినదాని ప్రకారం వాండాను కనుగొనే అవకాశం 517 00:38:13,669 --> 00:38:16,630 మొదటి 100 రోజుల తర్వాత తగ్గుతుంది కదా? 518 00:38:16,630 --> 00:38:19,174 అంటే మనకు ఇంకా నాలుగు వారాల టైమ్ ఉంది. 519 00:38:20,551 --> 00:38:23,220 ఇదే ఆ బట్టల బిన్. 520 00:38:24,221 --> 00:38:25,347 దీన్ని కొంచెం పట్టుకుంటావా, ప్లీజ్? 521 00:38:25,347 --> 00:38:27,558 ఇదే. ఇదుగో. అంతే. 522 00:38:27,558 --> 00:38:31,937 సరే. ఈ ఏరియాలో మొత్తం 62 సింగిల్ కుటుంబం ఉండే ఇళ్ళు ఉన్నాయి. 523 00:38:31,937 --> 00:38:35,315 42 అపార్ట్మెంట్ బిల్డింగులు అలాగే 12 కాంప్లెక్స్ లు. 524 00:38:35,315 --> 00:38:36,900 మిగతా సర్కిల్ గీస్తావా? 525 00:38:37,818 --> 00:38:42,406 కాబట్టి నా అంచనా ప్రకారం మనం మన కూతురిలా గట్టిగా అరిచే ఒకరిని కిడ్నాప్ చేయాలి అనుకుంటే, 526 00:38:42,406 --> 00:38:44,867 అప్పుడు ఇక్కడికి తీసుకెళ్లలేరు, ఎందుకంటే ఆ గోడలు కార్డుబోర్డులాగ ఉంటాయి. 527 00:38:44,867 --> 00:38:49,079 అంతేగాక సెక్యూరిటీ కెమెరాలు, పొరిగింటి వారు, వాచ్ మ్యాన్ కూడా ఉంటారు. 528 00:38:49,079 --> 00:38:52,249 కాబట్టి, మనం సింగిల్ కుటుంబాలు ఉండే ఇళ్ల మీద దృష్టి పెట్టాలి. 529 00:38:58,755 --> 00:39:00,674 నేనింకా నువ్వు నాకు పిచ్చి అనుకున్నావు అనుకున్నా. 530 00:39:01,884 --> 00:39:04,720 అది నిజమే, కానీ నువ్వు ఎంత మొండిదానివో నాకు తెలుసు, 531 00:39:06,180 --> 00:39:08,765 అలాగే మనం తనను కనిపెట్టడానికి మనకు చేతనైంది అంతా 532 00:39:08,765 --> 00:39:10,726 చేయకపోతే నువ్వు తట్టుకోలేవు అని కూడా తెలుసు. 533 00:39:12,269 --> 00:39:14,229 కానీ, ఈసారి ప్లాన్ నేను వేస్తా, 534 00:39:14,229 --> 00:39:18,400 ఎందుకంటే జనం ఇళ్లలోకి చొరబడటం నీకు అస్సలు రాదు. 535 00:39:22,613 --> 00:39:24,740 ముప్పై రోజులు. 536 00:39:25,574 --> 00:39:29,453 మనం తనను కనిపెట్టేవరకు ఈ ఏరియాలో ఉన్న ప్రతీ ఇంటిని వెతకాలి. 537 00:39:29,453 --> 00:39:31,997 ఏది అవసరమైతే అది చేయాలి. 538 00:39:40,255 --> 00:39:44,343 కానీ అందుకు వాళ్ళు చేయాల్సి వచ్చే పని క్లాట్ కుటుంబీకుల జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. 539 00:39:58,899 --> 00:40:01,568 కానీ అందరూ ప్రాణాలతో బయట పడలేరు. 540 00:40:24,967 --> 00:40:27,386 జొల్టాన్ స్పిరండెల్లి రాసిన కథ ఆధారంగా రూపొందించబడింది 541 00:41:02,796 --> 00:41:04,798 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్