1
00:00:53,262 --> 00:00:55,514
ది టర్మినల్ లిస్ట్
2
00:01:07,735 --> 00:01:09,987
వద్దు, రీస్, ఆగు. దేవుడా, వద్దు. రీస్.
3
00:01:10,070 --> 00:01:12,281
- ఏం చేస్తున్నావు? అబ్బా!
- వద్దు.
4
00:01:12,406 --> 00:01:18,412
{\an8}కొరనాడోలో భీతావహ పరిస్థితి
5
00:01:28,964 --> 00:01:34,553
{\an8}కొరనాడోలో భీతావహ పరిస్థితి
6
00:02:43,038 --> 00:02:44,039
అవును.
7
00:02:45,875 --> 00:02:47,042
మంచిది.
8
00:02:47,877 --> 00:02:49,712
అలాగే. నీకు రుణపడ్డాను.
9
00:02:58,053 --> 00:02:59,471
చెత్తలా కనబడుతున్నావు.
10
00:03:01,557 --> 00:03:02,600
చెత్తలా ఉన్నానా?
11
00:03:04,476 --> 00:03:05,394
నీకు నచ్చలేదా?
12
00:03:07,229 --> 00:03:10,149
వాన్‌లో జీవించే
పాట్రిక్ స్వేజీలా ఉన్నావు.
13
00:03:15,070 --> 00:03:17,489
అన్నట్టు, హార్ట్‌లీ ఉత్తరాన దిగింది.
14
00:03:19,533 --> 00:03:21,076
ఓర్కస్ ఐలాండ్‌లో ఇంటికా?
15
00:03:21,869 --> 00:03:23,621
సీఐడీని పక్కన పెట్టింది.
16
00:03:24,914 --> 00:03:26,332
ఎవరి కోసం, సీక్రెట్ సర్వీస్?
17
00:03:26,874 --> 00:03:27,917
మరొక అంచనా.
18
00:03:28,459 --> 00:03:31,879
టాలోస్. డజను మందిని తెచ్చుకుంది.
బహుశా ఎక్కువే.
19
00:03:34,423 --> 00:03:35,674
నా రాక తనకు తెలుసు.
20
00:03:36,216 --> 00:03:37,259
ఆ, ఆమెకు తెలుసు.
21
00:03:38,510 --> 00:03:39,428
అది విషయమా?
22
00:03:41,764 --> 00:03:44,683
అస్సలు, కాదు, అదేం విషయం కాదు.
ఇంకా విషయం కాలేదు.
23
00:04:46,495 --> 00:04:47,830
రికార్డ్ చేసుకోనా?
24
00:04:49,748 --> 00:04:51,625
కచ్చితంగా. అందుకే ఇక్కడ ఉన్నావు.
25
00:04:51,709 --> 00:04:53,752
సరే. వరుస క్రమం పొందడానికి.
26
00:04:54,253 --> 00:04:55,546
సందేహాస్పదంగా ఉన్నావు.
27
00:04:56,672 --> 00:04:59,466
నా కథను అడ్డుకోవడానికి
ప్రభుత్వ వనరులు వాడారు.
28
00:04:59,550 --> 00:05:00,968
నాకు విపరీతమైన సందేహం.
29
00:05:01,051 --> 00:05:03,512
సరే, నీ కథ తప్పు, మిస్ బ్యురనెక్.
30
00:05:04,013 --> 00:05:05,389
నిజానికి, అపవాదు అనాలి.
31
00:05:05,973 --> 00:05:07,349
నువ్వు ముద్రించే ముందు,
32
00:05:07,433 --> 00:05:11,395
ఆయా సంఘటనలు సంభవించిన
నిజ వరుస క్రమాన్ని అర్థం చేసుకోవాలి.
33
00:05:11,478 --> 00:05:14,064
నా కథలో ప్రతి విషయానికి
నిర్ధారణ ఉంది.
34
00:05:14,148 --> 00:05:16,817
స్టీవ్ హోర్న్,
అడ్మిరల్ పిల్లర్ నుంచి పత్రాలు--
35
00:05:16,900 --> 00:05:19,278
నీ దగ్గర సరైన నిజాలను నేను ఖండించలేదు.
36
00:05:19,361 --> 00:05:21,405
తప్పుడు ముక్తాయింపులకు వస్తున్నావు.
37
00:05:22,531 --> 00:05:26,535
ఇక, నీ కథలో, ఓ షెల్ కంపెనీని సూచించావు,
ఒబెరాన్ ఎనలిటిక్స్,
38
00:05:27,202 --> 00:05:30,414
నేను ఆ పేరు తెలియని
లబ్ధిదారునని సూచిస్తున్నావు.
39
00:05:31,040 --> 00:05:31,874
నేను కాదు.
40
00:05:32,541 --> 00:05:35,335
స్టీవ్ హోర్న్ లేదా
ఎవరి చెల్లింపులూ పొందలేదు.
41
00:05:36,211 --> 00:05:38,839
అది నమ్మడం కష్టం,
ఈ కప్పిపుచ్చే ప్రక్రియలో
42
00:05:38,922 --> 00:05:41,425
ప్రతి కుట్రదారుకు
చెల్లింపు ఉందనే నిజం ప్రకారం.
43
00:05:41,925 --> 00:05:44,053
నేను కుట్ర చేయలేదు, మిస్ బ్యురనెక్.
44
00:05:44,136 --> 00:05:47,973
పెంటగాన్ నాకు ఇచ్చిన అధికారానికి
అనుగుణంగానే నేను పని చేశాను.
45
00:05:49,016 --> 00:05:53,479
నేవీ సీల్‌లలో ఓ పూర్తి దళంపై
లైసెన్స్ లేని ఔషధాన్ని పరీక్షించారు.
46
00:05:53,562 --> 00:05:54,897
ఆ పరీక్షను ఆరంభించాను.
47
00:05:55,606 --> 00:05:59,318
కానీ కప్పిపుచ్చడంలో నేను భాగం కాను,
ఆ పని లాభం కోసం చేయలేదు.
48
00:06:00,486 --> 00:06:01,487
మరి ఎందుకు?
49
00:06:02,780 --> 00:06:04,573
ఆర్‌డీ-4895 పరీక్షించడం ఎందుకు?
50
00:06:05,074 --> 00:06:09,078
నా విధానాలు ఇరాక్, ఆప్ఘనిస్తాన్‌లలో సైన్యం
ఉపసంహరణకు మార్గం సుగమం చేశాయి.
51
00:06:09,828 --> 00:06:13,832
కానీ మన స్పెషల్ ఆపరేటర్లకు,
అది సుదీర్ఘ మొహరింపు, మరింత ఒత్తిడి.
52
00:06:14,291 --> 00:06:15,459
మరింత బాధ.
53
00:06:15,542 --> 00:06:20,089
నేను పరిష్కరించాల్సిన నైతిక,
వృత్తి సంబంధిత బాధ్యత గల సమస్య ఇది.
54
00:06:20,172 --> 00:06:23,008
కానీ తీవ్ర సమస్యల పరిష్కారానికే
ఈయూఏలు వాడతారు.
55
00:06:24,343 --> 00:06:27,096
దగ్గరపడిన, విపత్తు సంబంధిత
ప్రాణనష్టం నివారణకు.
56
00:06:27,721 --> 00:06:32,643
సగటున, రోజుకు 17 నుంచి 22 మాజీలు
ప్రతిరోజూ ఆత్మహత్య చేసుకుంటున్నారు.
57
00:06:33,727 --> 00:06:36,063
ఆత్మహత్యలు యాక్టివ్ డ్యూటీ అయ్యాయి,
58
00:06:36,146 --> 00:06:40,025
అది ప్రతి ఏటా
రెండు 9/11 లకు సమానం.
59
00:06:40,109 --> 00:06:43,529
ఒకవేళ అది విపత్తు నష్టం కాకపోతే.
ఇంకేదో నాకు తెలియదు.
60
00:06:45,155 --> 00:06:48,283
నేవీ సీల్‌లలో మొత్తం దళానికి
మెదడు కణితులు...
61
00:06:49,326 --> 00:06:50,911
అది విపత్తేనా?
62
00:06:51,578 --> 00:06:53,956
అడ్మిరల్ పిల్లర్ వైద్య నివేదికలు పంపుతాడు.
63
00:06:54,039 --> 00:06:56,333
వాళ్ల కంటెంట్‌ను ప్రశ్నించే కారణం లేదు.
64
00:06:58,836 --> 00:07:00,963
అంటే, కణితుల గురించి మీకు తెలియదు.
65
00:07:01,046 --> 00:07:04,800
శాన్ ఫ్రాన్సిస్కోలో హోర్న్‌తో నీ గొడవను
వార్తలలో చూసేవరకూ.
66
00:07:05,551 --> 00:07:09,596
అంటే, నువ్వు అరుస్తున్నావు, మిగతా
ప్రపంచానికి అది అర్థం కాలేదు.
67
00:07:09,680 --> 00:07:11,640
నాకు, అది స్పష్టత ఇచ్చిన క్షణం.
68
00:07:12,182 --> 00:07:14,518
హోర్న్, తన మనుషులు
ఆపరేషన్ ఓడిన్ స్వోర్డ్‌ని
69
00:07:14,601 --> 00:07:17,521
కప్పిపుచ్చడం కోసం వాడారని
నేను గ్రహించాక,
70
00:07:17,604 --> 00:07:20,566
డీసీఐఎస్ దర్యాప్తు ఆరంభించాను.
71
00:07:22,067 --> 00:07:24,153
నీ అంతగా నేనూ బాధపడ్డాను.
72
00:07:27,406 --> 00:07:28,365
చెప్పాలంటే ఎక్కువే.
73
00:07:31,743 --> 00:07:32,953
మేడం సెక్రటరీ?
74
00:07:34,037 --> 00:07:37,833
నేను మీకు స్కిఫ్‌కు ఎస్కార్ట్ ఇస్తా.
జాయింట్ చీఫ్‌లతో సమావేశం ఉంది.
75
00:07:38,542 --> 00:07:39,585
ధన్యవాదాలు.
76
00:07:41,920 --> 00:07:43,422
కాసేపాగి కొనసాగిద్దాం.
77
00:07:44,214 --> 00:07:46,925
ఈ సమయంలో, తూర్పు వింగ్‌లో
విశ్రాంతి తీసుకో,
78
00:07:47,009 --> 00:07:48,886
బహుశా కిటికీకి దూరంగా.
79
00:07:50,095 --> 00:07:53,307
లేదా నీకు ఇచ్చినదాన్ని
ప్రచురించు. ఎందుకంటే...
80
00:07:55,392 --> 00:07:56,560
అదే నిజం.
81
00:08:54,534 --> 00:08:56,203
రోడ్‌బ్లాక్‌లు, చెక్‌పాయింట్లు?
82
00:08:57,496 --> 00:08:59,206
ఎల్‌ఏకు ఉత్తమం ఏంటో తెలుసు.
83
00:09:00,207 --> 00:09:02,459
బెన్ ఎడ్వర్డ్స్‌ను
హోవార్డ్స్ గుర్తించాడుగా?
84
00:09:02,960 --> 00:09:05,504
అవును, అతనిని గమనించాం.
వాళ్లు స్నేహితులు.
85
00:09:06,630 --> 00:09:08,882
అతను సీఐఏ. గ్రౌండ్ బ్రాంచ్.
86
00:09:09,549 --> 00:09:11,969
ఇప్పటివరకూ కనబడలేదు.
87
00:09:12,678 --> 00:09:14,137
సీఐడీని వదిలేసిన హార్ట్‌లీ.
88
00:09:14,721 --> 00:09:18,976
టాలోస్ కాంట్రాక్టర్‌తో వేరే చోటకెళ్లి
రీస్ గమనించకుండా అనుసరించేలా చేసింది.
89
00:09:20,602 --> 00:09:21,853
ఆమె అతనిని చంపుతుంది.
90
00:09:22,771 --> 00:09:24,606
తనకు తోచిన కథ చెబుతుంది.
91
00:09:24,690 --> 00:09:26,817
చివరకు అది ముగుస్తుంది. అంతేనా?
92
00:09:28,819 --> 00:09:30,570
అవును, కానీ మన పద్ధతిలో కాదు.
93
00:09:36,410 --> 00:09:39,454
క్వాంటికోను వదిలినప్పుడు,
సొంత దారి వేసుకోవచ్చు.
94
00:09:40,038 --> 00:09:43,166
పారిపోయే వాళ్లను ఎంచుకున్నా,
కారణం సరళత నాకు నచ్చింది.
95
00:09:43,250 --> 00:09:46,086
కారణం, ఉద్దేశం నిరూపించే పని లేదు,
పట్టుకోవాలంతే.
96
00:09:46,169 --> 00:09:47,879
నేరం చేసుండాలి,
లేదా తను పారిపోడు.
97
00:09:51,967 --> 00:09:54,594
కానీ మనం
వెంటాడుతున్న వ్యక్తి బాధితుడు.
98
00:09:55,595 --> 00:09:58,307
కానీ రీస్ చంపుతున్న వాళ్లు
పాపాత్ముల వంటి నేరస్తులు.
99
00:09:58,932 --> 00:09:59,933
ఏంటి?
100
00:10:00,851 --> 00:10:03,437
మనం రీస్‌కు మద్దతు ఇస్తున్నామా, లేక...
101
00:10:04,771 --> 00:10:05,605
లేదు.
102
00:10:07,107 --> 00:10:08,233
లేదు, అందరినీ పడదాం.
103
00:10:09,401 --> 00:10:12,487
మనమా? మనం బెంచ్ మీద ఉన్నాం, బాస్.
104
00:10:13,780 --> 00:10:14,990
కొన్ని కాల్స్ చేశా.
105
00:10:16,533 --> 00:10:18,827
మరొక అవకాశం కోరుకునే
వేరొకరు ఉన్నారు.
106
00:10:20,829 --> 00:10:23,373
ఇది చేయడం కోసం
మంచి కెరీర్ పాడు చేసుకుంటావా?
107
00:10:33,258 --> 00:10:38,055
నీ పరిశోధనలో సాయం కోసం.
నేను తెరచిన పుస్తకాన్ని. - లొరైన్
108
00:10:42,309 --> 00:10:45,979
బ్యాంక్ స్టేట్‌మెంట్
109
00:10:54,738 --> 00:10:57,657
హార్ట్‌లీతో ఉన్నాను: వస్తున్నావని తెలుసు.
కానీ దయచేసి ఆగు. నాకు సమయం కావాలి.
110
00:10:57,741 --> 00:11:00,952
{\an8}బహుశా పూర్తి కథ లేకపోవచ్చు.
111
00:11:31,400 --> 00:11:34,069
ప్రస్తుతం ఈ సంగీతం ఇప్పుడు భరించలేను.
112
00:11:34,152 --> 00:11:36,488
నువ్వు దీనిని "భరించలేవా?" సరే.
113
00:11:39,991 --> 00:11:40,992
అలాగే.
114
00:11:41,618 --> 00:11:42,577
మరి ఇది?
115
00:11:46,415 --> 00:11:47,666
ఇది బాగుంది.
116
00:11:49,960 --> 00:11:51,211
అది మంచి పాట.
117
00:11:56,883 --> 00:11:58,844
నా కళ్లు నన్ను మోసం చేస్తున్నాయా?
118
00:12:00,762 --> 00:12:01,972
అది చిరునవ్వేనా?
119
00:12:02,681 --> 00:12:05,392
అంటే, నవ్వుతావని
అస్పష్టంగా గుర్తుంది, కానీ...
120
00:12:06,768 --> 00:12:10,105
ఓ సెకను. మన ఇద్దరికీ
జ్ఞాపకశక్తి పోతోందని అనుకున్నాను.
121
00:12:17,863 --> 00:12:18,864
ఎవరది?
122
00:12:19,781 --> 00:12:21,116
ఆ విలేఖరి.
123
00:12:23,577 --> 00:12:24,786
ఆమె ద్వీపంలో ఉంది.
124
00:12:25,787 --> 00:12:27,372
సరే, కచ్చితంగా ఉంటుంది.
125
00:12:28,915 --> 00:12:31,585
సెక్‌డెఫ్‌కి ఇప్పుడు మానవ కవచం ఉంది.
126
00:12:32,919 --> 00:12:34,671
ఆరంభించడానికి ఎంతసేపుంది?
127
00:12:37,174 --> 00:12:38,467
రెండు, మూడు గంటలు.
128
00:12:40,343 --> 00:12:44,014
ప్రశ్న ఏంటంటే, మన కోసం
బోట్ ఎదురుచూస్తూ ఉంటుందా?
129
00:12:44,097 --> 00:12:46,224
తను ఉంటుందని చెప్పాడు. ఉంటుంది.
130
00:12:48,977 --> 00:12:49,978
నాకది అనుమానమే.
131
00:12:51,062 --> 00:12:52,314
రైఫ్ హేస్టింగ్స్.
132
00:12:53,440 --> 00:12:56,735
నేను వెయ్యేళ్లు బతికినా సరే
ఆ సన్నాసిని నువ్వెలా
133
00:12:56,818 --> 00:12:58,778
నమ్ముతావో అర్థం చేసుకోలేకపోయాను.
134
00:13:01,781 --> 00:13:03,783
సరే, నిన్నింకా నమ్ముతాను, అవునా?
135
00:13:13,293 --> 00:13:14,294
బెన్.
136
00:13:16,171 --> 00:13:17,506
అబ్బా.
137
00:13:19,382 --> 00:13:20,509
ఛ.
138
00:13:35,106 --> 00:13:36,983
మూడు, నాలుగు ఛార్జర్స్ ఉన్నాయి.
139
00:13:38,193 --> 00:13:40,237
కొన్ని టాహోలు. కొన్ని బైక్‌లు.
140
00:13:40,737 --> 00:13:43,031
ఎనిమిది మంది పోలీసులు.
141
00:13:45,700 --> 00:13:47,410
వాళ్లపై ఇక్కడ దాడి చేయము.
142
00:13:48,995 --> 00:13:51,915
హేయ్, మనం వాళ్లను కాల్చం కూడా.
143
00:13:51,998 --> 00:13:53,083
మనకు బయటకు దారి లేదు.
144
00:13:54,501 --> 00:13:55,710
దాక్కోవడం లేదు.
145
00:13:57,754 --> 00:13:58,797
నేను నీతో ఉన్నాను.
146
00:14:00,674 --> 00:14:03,426
మనం దాటి వెళతాం. మనం వెళ్లాలి.
147
00:14:13,311 --> 00:14:15,480
శుభోదయం, ఆఫీసర్. అంతా బాగుందా?
148
00:14:16,398 --> 00:14:17,941
డ్రైవింగ్ లైసెన్స్, చూపించు.
149
00:14:18,483 --> 00:14:19,901
సరే, తప్పకుండా.
150
00:14:22,821 --> 00:14:25,949
ఇది ఎక్కడుంది? ఒక సెకన్ ఆగండి.
151
00:14:33,832 --> 00:14:35,709
మి. ఆడమ్స్, ఎటు వెళుతున్నారు?
152
00:14:35,792 --> 00:14:37,794
పసిఫిక్ సిటీకి, సర్.
153
00:14:38,378 --> 00:14:42,507
అక్కడ అలలు విపరీతంగా వస్తాయట,
నాకు సరిగ్గా సరిపోతుందని ఎవరో చెప్పారు.
154
00:14:51,224 --> 00:14:53,685
వెనుక ఓసారి చూడవచ్చా?
సాధారణ తనిఖీ.
155
00:15:03,778 --> 00:15:04,863
మీ ఇష్టం.
156
00:15:13,663 --> 00:15:14,664
శుభోదయం.
157
00:15:17,792 --> 00:15:19,628
వాహనంలో జీవిస్తారా, సర్?
158
00:15:20,211 --> 00:15:23,423
కాలం ప్రకారం, మేడం.
అలలతో పాటు వెళ్లడమే.
159
00:15:23,965 --> 00:15:26,718
గుర్తింపు తనిఖీ. కాలిఫోర్నియా.
160
00:15:26,801 --> 00:15:30,805
ఇండియా, ఎనిమిది, ఎనిమిది, ఎనిమిది,
నాలుగు, రెండు, ఒకటి, సున్నా.
161
00:16:10,428 --> 00:16:13,723
సర్, ఇదేంటో నాకు తెలుసు.
162
00:16:16,142 --> 00:16:19,813
నేను ఇక్కడకు వస్తుంటే నా ఫోన్‌కు
సిల్వర్ అలర్ట్ వచ్చింది.
163
00:16:20,689 --> 00:16:24,109
అంటే, అలాంటి ముసలిదాన్ని
ఎవరు కిడ్నాప్ చేస్తారు?
164
00:16:24,192 --> 00:16:28,571
అంటే, ఆమె ఏమైనా, ఏంటి, పరిగెడుతుందా,
అందరికీ స్వెటర్లు కుడుతుందా ఇంకా--
165
00:16:28,655 --> 00:16:32,367
మి. ఆడమ్స్, మనం నిశ్శబ్దంగా ఉందామా?
166
00:16:35,036 --> 00:16:36,204
తప్పకుండా.
167
00:16:37,372 --> 00:16:39,582
ఏడు, లింకన్, నాలుగు, రెండు.
168
00:16:40,083 --> 00:16:42,419
దానిపై ఏమీ లేదు. గుర్తింపు నిర్ధారణ?
169
00:16:42,919 --> 00:16:46,756
అసలు పేరు ఆడమ్స్,
ఇంటి పేరు షేన్, పురుషుడు, తెలుపు.
170
00:16:47,632 --> 00:16:51,136
పుట్టిన తేదీ, సున్నా, ఏడు,
రెండు, రెండు, 1984.
171
00:16:56,474 --> 00:16:59,227
ఏడు, లింకన్, నాలుగు, రెండు,
గుర్తింపు తనిఖీ అయింది.
172
00:16:59,310 --> 00:17:02,439
అసలు పేరు ఆడమ్స్, ఇంటి పేరు షేన్‌తో
ఏ వారంట్లు లేవు.
173
00:17:03,273 --> 00:17:05,483
ఏడు, ఎల్, నలభై, రెండు, వినండి.
174
00:17:06,735 --> 00:17:09,320
గుర్తింపు బాగుంది.
వాహనంలో ఏం లేదుగా?
175
00:17:17,036 --> 00:17:18,163
అంతా బాగుంది.
176
00:17:32,844 --> 00:17:33,970
మీ రోజు బాగుండాలి.
177
00:17:35,138 --> 00:17:36,181
జాగ్రత్తగా నడుపు.
178
00:17:39,726 --> 00:17:42,562
బేకర్ 23 మీ ఎక్స్‌రే
ఏడు, తొమ్మి, ఏడు క్లియర్,
179
00:17:42,645 --> 00:17:45,315
ఏమీ లేదు, వారంట్లు లేవు,
తనను పంపేయవచ్చు.
180
00:17:46,149 --> 00:17:48,151
ముందుకు వెళ్ళు, బాగుంది.
దాటి వెళ్లవచ్చు.
181
00:17:49,110 --> 00:17:50,528
ముందుకు వెళ్లు. క్లియర్.
182
00:18:03,750 --> 00:18:05,919
నా ఆర్థిక వివరాలు
సహాయపడ్డాయని అనుకుంటా.
183
00:18:06,669 --> 00:18:09,088
సెక్‌డెఫ్‌గా, అవి ప్రజలకు
అందుబాటులో ఉంచాలి.
184
00:18:09,172 --> 00:18:11,633
ఇరవై మిలియన్ డాలర్లను
దాచడం చాలా కష్టం.
185
00:18:12,467 --> 00:18:14,093
కష్టం, కానీ అసాధ్యం కాదు.
186
00:18:14,177 --> 00:18:16,971
ఓడిన్ స్వోర్డ్ మిషన్ లాగ్‌కు కూడా
యాక్సెస్ కావాలి.
187
00:18:17,764 --> 00:18:20,433
అది నీ గదికి పంపుతాను.
ఇంకేమైనా ఉందా?
188
00:18:21,226 --> 00:18:23,102
మన ఇంటర్వ్యూ పూర్తి కాలేదు.
189
00:18:28,525 --> 00:18:31,861
మా నాన్న చరిత్ర గురించి
నీకెంత వరకు తెలుసు?
190
00:18:31,945 --> 00:18:33,613
మీ జీవిత చరిత్ర చదివాను.
191
00:18:34,364 --> 00:18:38,868
ఆయన కలప వ్యాపారం నుంచి వచ్చారని తెలుసు.
కొరియా, వియెత్నాంలలో ఆ పని చేశారు.
192
00:18:39,911 --> 00:18:41,579
ఆయన కష్టాల గురించి తెలుసు.
193
00:18:42,539 --> 00:18:44,791
మద్యపానం, మానసిక సమస్యలు.
194
00:18:47,377 --> 00:18:48,920
ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
195
00:18:50,713 --> 00:18:54,968
నా చిన్నప్పుడు, ఈ గదిలోనే తన ఊకలేలేలో
నాకు పాటలు వినిపించేవాడు.
196
00:18:56,344 --> 00:19:00,181
రాగం ఉండేది కాదు,
కానీ ఆయనకు సంతోషమే.
197
00:19:02,016 --> 00:19:04,143
యుద్ధం తరువాత, ఆ మనిషి కనబడలేదు.
198
00:19:05,019 --> 00:19:07,814
మేడం సెక్రటరీ, అది ఓ వంక కావచ్చు.
199
00:19:08,273 --> 00:19:12,694
పీటీఎస్‌డీని నయం చేయడం మంచిదని
భావించడానికి, వ్యక్తిగత అనుభవంతో పని లేదు.
200
00:19:13,444 --> 00:19:15,071
సరే, అలానే ఆశిస్తాను.
201
00:19:15,446 --> 00:19:18,491
కానీ 12 ఏళ్ల వయసులో మీ నాన్న నుంచి
అమ్మను కాపాడడం
202
00:19:18,575 --> 00:19:21,077
లేదా చనిపోయిన తండ్రిని
అటక మీద కనుగొనడం...
203
00:19:21,703 --> 00:19:23,288
అది అగ్నికి ఆజ్యం పోస్తుంది.
204
00:19:25,957 --> 00:19:28,918
మన్నించాలి, కానీ నాకు ఆసక్తి గల
ప్రశ్న ఏంటంటే
205
00:19:29,002 --> 00:19:31,838
మన దళాలకు తెలియకుండా లేదా
సమ్మతి లేకుండా,
206
00:19:31,921 --> 00:19:34,841
అనిరూపిత ఔషధాన్ని, వారిపై
పరీక్ష చేయవచ్చా, లేదా అని.
207
00:19:34,924 --> 00:19:39,345
ట్రామా పరిశోధన తెలియకుండా చేసే అధ్యయనంతో
మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
208
00:19:40,680 --> 00:19:43,766
నేను చేసినది ఎంపిక కాదు,
అది విజ్ఞానం.
209
00:19:44,350 --> 00:19:46,853
ఓడిన్ స్వోర్డ్ తరువాత ప్రజలకు చెప్పలేదే?
210
00:19:46,936 --> 00:19:49,230
నేను ప్రజలకు చెబుతున్నాను. ఇప్పుడే.
211
00:19:49,314 --> 00:19:52,066
మీది కథనాన్ని నియంత్రించే
ప్రయత్నం అంటాను.
212
00:19:52,150 --> 00:19:56,070
ఖండించడానికి చుట్టూ లేరని,
మీరు చనిపోయిన వారిని నిందిస్తున్నారు.
213
00:19:56,154 --> 00:20:00,283
ఆర్‌డీ-4895 ను అనుమతించినందుకు
నన్ను కఠినంగా నిర్ణయిస్తారా?
214
00:20:00,700 --> 00:20:01,993
కొంతవరకు, బహుశా.
215
00:20:02,493 --> 00:20:05,371
కానీ ఇతరులు నా నిర్ణయం
అర్థం చేసుకుంటారని ఆశిస్తాను.
216
00:20:07,582 --> 00:20:09,292
జేమ్స్ రీస్ అర్థం చేసుకుంటాడా?
217
00:20:13,671 --> 00:20:16,132
ఆ ప్రశ్నకు మన ఇద్దరికీ జవాబు తెలుసు.
218
00:20:17,342 --> 00:20:19,677
అతను చేసిన పనికి అతనిని నిందిస్తారా?
219
00:20:21,262 --> 00:20:23,765
ఓడిన్ స్వోర్డ్ సమయంలో వార్ రూంలో ఉన్నాను.
220
00:20:24,891 --> 00:20:29,562
అతని మనుషులు ఆ సొరంగాలలో హత్య కాబడడం
విన్నాను, వాళ్లను రక్షించే శక్తి లేదు.
221
00:20:29,646 --> 00:20:32,607
తర్వాత అతని భార్య, కూతురును కోల్పోవడం...
222
00:20:36,527 --> 00:20:38,404
అతని మద్దతుదారుని అంటారు,
223
00:20:38,488 --> 00:20:42,659
కానీ మీ ఇంటిని పటిష్టపరచడానికి
ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్లు ఉన్నారు.
224
00:20:42,742 --> 00:20:47,121
రీస్ వస్తున్నాడు, మిస్ బ్యురనెక్.
నన్ను కాపాడుకోవడానికి వేరే దారి లేదు.
225
00:20:48,456 --> 00:20:50,124
నన్ను నేరస్తురాలిని చేయకు.
226
00:20:51,209 --> 00:20:52,460
అది మనిషిలా చేస్తుంది.
227
00:21:15,316 --> 00:21:17,193
ఆ సన్నాసి వచ్చాడు.
228
00:21:27,036 --> 00:21:27,996
ఛత్.
229
00:21:32,959 --> 00:21:38,047
దీనితో మనకు చెల్లింది. నువ్వు బతికుంటే,
ఎక్కడకు వెళ్లాలో నీకు తెలుసు. - ఆర్
230
00:21:38,339 --> 00:21:39,340
అబ్బా.
231
00:21:41,759 --> 00:21:43,344
రైఫ్ నిజంగానే వచ్చాడు.
232
00:21:46,139 --> 00:21:47,473
ఆ గమనికలో ఏముంది?
233
00:21:48,474 --> 00:21:49,976
మనకు అదృష్టం కలగాలట.
234
00:22:28,056 --> 00:22:30,516
ఎవరికీ తెలియకుండా వెళ్లాలని భావించాం.
235
00:22:30,600 --> 00:22:33,811
మనం చీకటిలో బాగా చేయగలం.
చక్కగా తయారయ్యావు, మాక్.
236
00:22:33,895 --> 00:22:34,896
లయూన్.
237
00:22:34,979 --> 00:22:36,230
మీకు దీనికి రుణపడతాం.
238
00:22:36,814 --> 00:22:38,983
పదేళ్లకు పైగా ఈ పని చేస్తున్నాం.
239
00:22:39,067 --> 00:22:42,904
మనం వెతికేవాడు మా అడ్మిరల్‌ని
పేల్చేస్తాడా? నువ్వు మాకు రుణపడలేదు.
240
00:22:43,446 --> 00:22:44,989
హేయ్, మీ బ్యాగ్‌లు ఇవ్వండి.
241
00:22:45,698 --> 00:22:46,908
నీకు అంతా తెలుసా?
242
00:22:47,700 --> 00:22:49,827
ఆ, టీ భార్య ఫెడరల్ అటార్నీ.
243
00:22:49,911 --> 00:22:53,498
- ఓయ్, టీ. ఆమె దాన్నేమనింది? ఎగ్జి--
- అత్యవసర పరిస్థితులు.
244
00:22:54,165 --> 00:22:57,126
డ్రిల్స్‌కు దగ్గరగా ఉంటాం,
ఏదైనా జరిగితే,
245
00:22:57,210 --> 00:22:59,295
మాకు మధ్యలో వచ్చే బాధ్యత ఉంటుంది.
246
00:22:59,378 --> 00:23:01,172
మీకు సముద్రరోగం రాదని ఆశిస్తాను.
247
00:23:43,589 --> 00:23:47,093
{\an8}రహస్య పరీక్షలు మరియు వాటా చెల్లింపులు:
జేమ్స్ రీస్‌పై లొరైన్ హార్ట్‌లీ యుద్ధం
248
00:24:21,169 --> 00:24:22,962
రీస్, నా మాట విను.
249
00:24:23,045 --> 00:24:26,299
బయట 15 మంది టాలోస్‌ను లెక్కించాను.
250
00:24:26,382 --> 00:24:28,551
- నేనూ నీతో పాటు చొరబడతాను.
- బెన్.
251
00:24:29,969 --> 00:24:31,596
నువ్వు రైఫిల్‌తో ఉండాలి.
252
00:24:31,679 --> 00:24:33,472
నువ్వు పడవ దగ్గరే ఉండు.
253
00:24:33,556 --> 00:24:37,185
లైట్‌హౌస్ నుంచి కవర్ చెయ్.
పథకానికి కట్టుబడి ఉండు. పని అవుతుంది.
254
00:24:38,436 --> 00:24:40,396
ఇదొక్కటే అవకాశం కాదు, బాబూ.
255
00:24:41,397 --> 00:24:44,066
మనం వెనక్కు తిరుగుతాం, ఇప్పుడే.
256
00:24:45,109 --> 00:24:46,569
వచ్చిన చోటుకు వెళ్లిపోదాం.
257
00:24:47,904 --> 00:24:51,407
విలేఖరి దగ్గర కథనం ఉంది.
హార్ట్‌లీ పారిపోలేదు.
258
00:24:54,827 --> 00:24:56,996
పెరూలో బీచ్ వెతుకుదాం, సోదరా.
259
00:24:57,622 --> 00:24:59,832
కొన్ని బీర్లు తాగుతూ గడపగలం...
260
00:25:00,875 --> 00:25:02,710
ప్రవాహం ఎటు తీసుకెళతుందో చూద్దాం.
261
00:25:04,503 --> 00:25:07,256
మరి నా మెదడులో ఈ బాంబు
పేలేవరకూ ఎదురుచూడాలా?
262
00:25:10,384 --> 00:25:11,886
ఇది అలా ముగియదు.
263
00:25:19,810 --> 00:25:20,811
హేయ్.
264
00:25:25,274 --> 00:25:26,859
నీవు ఒంటరిగా చనిపోనక్కరలేదు.
265
00:25:29,946 --> 00:25:31,155
నేను ఒంటరిని కాను.
266
00:26:27,128 --> 00:26:28,045
మేడం.
267
00:26:29,088 --> 00:26:30,089
వెళుతున్నావా?
268
00:26:30,673 --> 00:26:33,050
చివరి పడవ అందాలంటే
నేను బయలుదేరాలి.
269
00:26:33,134 --> 00:26:35,094
నువ్వు ఉదయమైనా వెళ్ళిపోవచ్చు.
270
00:26:35,177 --> 00:26:36,971
నాకు ఇక ఇక్కడ ఉండాలని లేదు.
271
00:26:42,935 --> 00:26:47,148
{\an8}లొరైన్ హార్ట్‌లీ వారసత్వం, స్పెషల్
ఆపరేటర్ల కోసం ఆమె ప్రైవేటు యుద్ధం
272
00:26:49,066 --> 00:26:50,985
నువ్వు కథనం మార్చడం సంతోషం.
273
00:26:52,236 --> 00:26:56,449
కొన్ని కాల్స్ చేశాను. ముప్ఫై రెండేళ్ల
ప్రజా పరిశీలనకు ప్రోత్సాహకం ఉంటుంది.
274
00:26:57,199 --> 00:26:59,076
అది సహాయపడుతుంది. ధన్యవాదాలు.
275
00:26:59,577 --> 00:27:00,953
ఓ కారు తెప్పించాను.
276
00:27:01,037 --> 00:27:02,705
ఇంకా ఒక విషయం మిగిలింది.
277
00:27:02,788 --> 00:27:06,375
వాస్తవ తనిఖీ చేయాలి,
కాలక్రమాలు వరుసగా ఉన్నాయనే నిర్ధారణ కోసం.
278
00:27:08,377 --> 00:27:10,171
- నీకేం కావాలన్నా సరే.
- ధన్యవాదాలు.
279
00:27:19,013 --> 00:27:20,056
సరే.
280
00:27:20,514 --> 00:27:24,060
సరే, ఇక, ఓడిన్ స్వోర్డ్
మిషన్ లాగ్ ప్రకారం,
281
00:27:24,143 --> 00:27:27,396
మిషన్ జరుగుతున్న సమయంలోనే
వార్ రూంలోకి వచ్చారు?
282
00:27:28,022 --> 00:27:29,440
అది నిజం.
283
00:27:29,523 --> 00:27:34,612
మేము దాదాపు 22 నిమిషాలు లోపల ఉన్నామని
మిషన్ గడియారం సూచించినట్లు గుర్తు.
284
00:27:38,824 --> 00:27:40,284
వాస్తవానికి, 21:12.
285
00:27:40,368 --> 00:27:43,996
దాదాపుగా ఎంత సమయం పాటు
సమాచారం ఆగిపోయింది?
286
00:27:44,080 --> 00:27:46,123
సరే, అది లాగ్‌లో ఉంది, అవునా?
287
00:27:47,208 --> 00:27:49,543
తొమ్మిది నిమిషాల 21 సెకండ్లు.
288
00:27:53,255 --> 00:27:58,177
ఆ సమయంలో అడ్మిరల్ పిల్లర్‌పై
మీకు ఏమీ అనిపించలేదా?
289
00:27:59,220 --> 00:28:02,473
మీ ముందున్న ఇంటెలిజెన్స్ నివేదికలలో
ఏమీ లేవా?
290
00:28:03,474 --> 00:28:05,601
లేదు. అసాధారణంగా ఏమీ లేదు.
291
00:28:06,435 --> 00:28:10,523
గడియారంలో 30:33 కు ఐఈడీలను
ఆల్ఫా ప్లాటూన్ ఎదిరించే వరకూ.
292
00:28:10,606 --> 00:28:11,899
అది నిజం.
293
00:28:11,982 --> 00:28:16,237
మంచిది. బడ్జెట్ సంస్కరణలు,
డీసీఐఎస్ దర్యాపు ప్రారంభించిన తేదీలను
294
00:28:16,320 --> 00:28:18,114
సరిగ్గా గుర్తు చేసుకుంటారా?
295
00:28:18,948 --> 00:28:22,743
వాటి కోసం నా ఆఫీస్‌ను,
ఏజెంట్ అజాద్‌ను సంప్రదిస్తాను.
296
00:28:22,827 --> 00:28:25,788
అది స్టీవ్ హోర్న్ మరణానికి
ముందా, తరువాతా?
297
00:28:25,871 --> 00:28:27,790
మన్నించు, దీనితో ఏంటి సంబంధం?
298
00:28:27,873 --> 00:28:32,169
"సంఘటనలు సంభవించిన నిజ వరుస క్రమాన్ని
అర్థం చేసుకోవాలని" నా ప్రయత్నం.
299
00:28:58,154 --> 00:29:02,450
చూడండి, విషయం ఏంటంటే, మీరు నాకు రెండు
విభిన్న కథలు చెప్పారు, మేడం సెక్రటరీ.
300
00:29:03,451 --> 00:29:08,747
మొదటి కథలో, మీరు నిర్ణయం తీసుకున్నారు,
ప్రశ్నించదగినది, కానీ సమర్థించదగినది,
301
00:29:09,290 --> 00:29:12,751
మన సైన్యంలో కొనసాగుతున్న
మానసిక ఆరోగ్య సంక్షోభ పరిష్కారం కోసం,
302
00:29:12,835 --> 00:29:15,421
మీరు తప్పుడు మనుషులపై
విశ్వాసం ఉంచారంతే.
303
00:29:16,046 --> 00:29:17,715
హోర్న్ ఇంకా పిల్లర్,
304
00:29:17,798 --> 00:29:19,967
ప్రయోగం గురించి మీకు అబద్ధం చెప్పారు,
305
00:29:20,050 --> 00:29:24,096
తమ లాభాల మార్జిన్లను కాపాడుకోవడానికి
నేరాలకు పాల్పడ్డారు,
306
00:29:24,180 --> 00:29:25,473
ఇప్పటివరకూ నిజమేగా?
307
00:29:26,390 --> 00:29:29,560
మరొక వెర్షన్‌లో,
వాళ్లేం చేశారో మీరు గ్రహించారు,
308
00:29:29,643 --> 00:29:33,189
మీ విభాగానికి వారి యాక్సెస్‌ని
అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు.
309
00:29:34,273 --> 00:29:38,068
వాళ్లు అందరినీ బాధ్యులను చేయాలని
మీరు కోరుకోవడంతో,
310
00:29:38,152 --> 00:29:40,488
నేర విచారణలను ప్రారంభించారు.
311
00:29:40,905 --> 00:29:44,074
ఇవి రెండు కథలు అంటున్నావు.
అవి రెండూ ఒకటే.
312
00:29:44,158 --> 00:29:46,410
కాదు. అవి ఒకే కథగా ఉండవు.
313
00:29:46,494 --> 00:29:50,664
కారణం మొదటి కథలో, ఆర్‌డీ-4895 గురించి,
శాన్ ఫ్రాన్సిస్కోలో హోర్న్ మీద
314
00:29:50,748 --> 00:29:55,336
నేను అరిచేవరకూ మీకు ఏమీ తెలియదు.
కానీ రెండవ కథలో, హోర్న్, పిల్లర్‌లను
315
00:29:55,419 --> 00:29:58,005
శిక్షించేందుకు చర్యలు తీసుకున్నారు.
316
00:29:58,088 --> 00:30:01,675
అది శాన్ ఫ్రాన్సిస్కోకు ముందే జరిగిందని
మీ రికార్డులు చూపుతున్నాయి.
317
00:30:01,759 --> 00:30:03,469
మీకు వైరుధ్యం కనబడుతోందా?
318
00:30:04,929 --> 00:30:09,016
నేరానికి పాల్పడ్డారని తెలియకముందే
వాళ్లను ఎలా బాధ్యులు చేయగలరు?
319
00:30:09,099 --> 00:30:11,519
మీకు తెలియకపోయుంటే, ఆ రూంలో,
320
00:30:11,602 --> 00:30:14,522
ఓడిన్ స్వోర్డ్‌లో రీస్,
అతని మనుషులు చనిపోతారని.
321
00:30:20,903 --> 00:30:22,947
పిల్లర్ నాకు చెప్పాడు--
322
00:30:23,030 --> 00:30:27,243
సరే, ఆల్ఫా ప్లాటూన్‌లో
సమస్యలు ఉన్నాయని అతను వివరించాడు.
323
00:30:27,326 --> 00:30:29,245
వారికి అనారోగ్యమని ముందే తెలుసుగా?
324
00:30:29,995 --> 00:30:33,457
అనుకూలం కాని పరిణామాలు
చోటు చేసుకున్నాయని నాకు తెలుసు.
325
00:30:34,250 --> 00:30:37,586
తలనొప్పులు. జ్ఞాపకశక్తి కోల్పోవడం,
అంగీకారమే, అనుకూలం కాదు.
326
00:30:37,670 --> 00:30:41,507
లేదు, ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తానని
అడ్మిరల్ పిల్లర్ హామీ ఇచ్చాడు.
327
00:30:41,590 --> 00:30:43,717
"పరిష్కారం" అంటే అతని ఉద్దేశమేంటి?
328
00:30:44,260 --> 00:30:46,595
అది వైద్య సంరక్షణ అనుకున్నాను.
329
00:30:47,680 --> 00:30:53,060
క్షమించాలి. అనిరూపిత ఔషధం నేవీ సీల్‌లపై
ప్రయోగించడానికి ఎఫ్‌డీఏ నిబంధనలు వదిలేసి,
330
00:30:53,143 --> 00:30:56,772
వాళ్లకు అనారోగ్యం వచ్చాక,
వారి పథకం ఏంటో కూడా అడగలేదా?
331
00:30:56,855 --> 00:31:00,025
హోర్న్, పిల్లర్‌లు చేసిన పనిని
అసలు చేయగలరని అనుకోలేదు.
332
00:31:00,109 --> 00:31:01,819
మీరు చెబితే, నేను ప్రస్తావించా,
333
00:31:01,902 --> 00:31:06,782
"రీస్ మనుషులు ఆ సొరంగాలలో హత్య కాబడడం
విన్నాను,
334
00:31:06,865 --> 00:31:09,368
వాళ్లను రక్షించే శక్తి లేదు."
ఎందుకు సాయపడలేదు?
335
00:31:09,451 --> 00:31:10,327
సమాచారం ఆగింది.
336
00:31:10,411 --> 00:31:12,871
కాసేపటికి, అవి ఆగిపోయాయి.
కానీ మీరే చెప్పారు,
337
00:31:12,955 --> 00:31:16,083
ఆల్ఫా ప్లాటూన్ ఆగక ముందు
తొమ్మిది నిమిషాల 21 సెకండ్ల పాటు
338
00:31:16,166 --> 00:31:18,210
మీకు సమాచారం తెరిచే ఉంది.
339
00:31:18,294 --> 00:31:19,378
అక్కడ అంత సమయం లేదు--
340
00:31:19,461 --> 00:31:21,964
"ఆపండి," అని చెప్పడానికి ఎంతసేపు పడుతుంది?
341
00:31:25,259 --> 00:31:27,761
నిజం ఏమిటంటే, మేడం సెక్రటరీ,
342
00:31:28,387 --> 00:31:31,348
తొమ్మిది నిమిషాల 21 సెకండ్ల పాటు,
343
00:31:31,432 --> 00:31:35,769
14 మంది మనుషులకు మెదడు కణితులు అందించిన
ప్రయోగాన్ని ఆమోదించినట్లు అంగీకరిస్తే
344
00:31:35,853 --> 00:31:38,647
దాని పరిణామాలను మీరు పరిగణించారు.
345
00:31:39,607 --> 00:31:42,359
తొమ్మిది నిమిషాల 21 సెకండ్ల పాటు,
346
00:31:42,443 --> 00:31:44,820
మీ స్వార్ధపూరిత అవసరాలు, మీ వారసత్వాన్ని
347
00:31:44,903 --> 00:31:48,532
ఆ మనుషుల ప్రాణాలతో బేరీజు వేశారు.
348
00:31:48,616 --> 00:31:52,036
నిశ్శబ్దంగా ఉండాలని ఎంచుకున్నారు,
వాళ్లను చావుకు వదిలేశారు!
349
00:31:52,119 --> 00:31:54,371
వాళ్లు కేవలం చనిపోలేదు!
350
00:31:55,414 --> 00:31:56,957
వాళ్లు ప్రాణాలను కాపాడారు!
351
00:32:09,261 --> 00:32:13,349
నీ రిపోర్టింగ్‌తో సమస్య ఏంటంటే
నువ్వు మా ఆపరేటర్లలా ప్రవర్తిస్తావు,
352
00:32:13,432 --> 00:32:17,311
వ్యక్తిగత త్యాగంపై స్వభావాన్ని
అర్థం చేసుకున్న మనుషులు,
353
00:32:17,895 --> 00:32:19,605
వాళ్లు బాధితులు అనేలా ఉన్నావు.
354
00:32:20,272 --> 00:32:22,691
వాళ్లు అలా కాదు, వాళ్లు హీరోలు.
355
00:32:23,859 --> 00:32:24,985
పద్నాలుగు ప్రాణాలు?
356
00:32:25,611 --> 00:32:28,697
నా విధానాలు రోజుకు
40 మంది స్త్రీ, పురుషులను కాపాడతాయి.
357
00:32:28,781 --> 00:32:31,700
ఆర్‌డీ-4895 బయటకు వచ్చాక,
ఏదో ఒక రోజున ఆ సంఖ్య,
358
00:32:31,784 --> 00:32:34,870
ఇంకా పెరుగుతుంది. అందుకే, అవును!
నిశ్శబ్దంగా ఉన్నాను,
359
00:32:34,953 --> 00:32:37,915
కారణం నేను చేయాలని
నిర్ణయించుకున్న త్యాగం అది.
360
00:32:37,998 --> 00:32:41,251
ఒకవేళ నువ్వు జేమ్స్ రీస్‌ను
యుద్ధంతో వచ్చే బాధ కోసం
361
00:32:41,335 --> 00:32:43,671
తన ప్రాణాన్ని ఇవ్వమని అడిగితే,
362
00:32:44,129 --> 00:32:47,216
అతను ఆ త్యాగం తక్షణమే చేసేస్తాడు.
363
00:32:47,591 --> 00:32:50,636
మీరు అడగలేదుగా, అడిగారా?
364
00:32:53,681 --> 00:32:56,517
ఆల్ఫా ప్లాటూన్‌ను
చావుకు వదలేశానని అంగీకరించారు.
365
00:33:02,773 --> 00:33:05,901
హత్య అంటే హత్యే,
మీకు డబ్బు అందినా, అందకపోయినా.
366
00:33:40,561 --> 00:33:41,854
నువ్వు చెప్పగానే, సోదరా.
367
00:33:44,732 --> 00:33:46,775
స్థానంలో ఉన్నాను. దానిని పంపు.
368
00:33:48,610 --> 00:33:51,238
నువ్వు ఆ కథను బయట పెట్టడంలేదు,
మిస్ బ్యురనెక్.
369
00:33:51,321 --> 00:33:56,452
నువ్వు అలా చేస్తే, ఆ మనుషుల
త్యాగాలకు అర్థం లేకుండా పోతుంది.
370
00:33:57,661 --> 00:33:58,787
కాల్చుతున్నాను.
371
00:33:58,871 --> 00:34:02,207
వాళ్ల మరణాలతో నీ కెరీర్
ముందుకు వెళ్లేందుకు అనుమతించను.
372
00:34:03,333 --> 00:34:04,334
మూడు...
373
00:34:07,671 --> 00:34:08,547
రెండు...
374
00:34:12,050 --> 00:34:13,010
ఒకటి.
375
00:34:20,517 --> 00:34:21,518
అబ్బా ఛ!
376
00:34:23,520 --> 00:34:24,855
వెళ్లు, వెళ్లు!
377
00:34:31,236 --> 00:34:33,238
మేడం, మిమ్మల్ని తీసుకెళ్లాలి, వెంటనే.
378
00:34:33,322 --> 00:34:34,990
సరే. పథకానికి కట్టుబడి ఉండు.
379
00:34:35,699 --> 00:34:36,700
నాతో రా.
380
00:34:38,035 --> 00:34:40,412
ఇక్కడ. పైకి చూడండి.
జాగ్రత్త.
381
00:34:40,496 --> 00:34:41,371
వినండి.
382
00:34:41,455 --> 00:34:42,289
వెళుతున్నాను.
383
00:34:57,513 --> 00:34:59,431
తుపాకీ మెరుపు, స్టార్‌బోర్డ్ క్వాటర్!
384
00:35:00,015 --> 00:35:04,269
హేయ్, తీరానికి వెళ్లాక, లోవ్‌తో కలిసి
ఆ లైట్‌హౌస్ దగ్గరకు వెళ్లు!
385
00:35:04,353 --> 00:35:06,730
- నాకు ఆ షూటర్ కావాలి.
- సరే, సర్! చూసుకుంటా.
386
00:35:26,083 --> 00:35:27,459
బెన్. బాల్కనీ.
387
00:35:27,543 --> 00:35:28,502
అలాగే.
388
00:35:32,214 --> 00:35:33,298
నీకు దారి ఉంది.
389
00:35:58,532 --> 00:36:00,534
అలాగే, బీచ్‌లో దిగి, విస్తరించండి.
390
00:36:02,202 --> 00:36:03,036
ఛత్.
391
00:36:03,453 --> 00:36:06,790
ఎఫ్‌బీఐ ఇప్పుడే దిగింది. వెంటనే ఆగిపో.
392
00:36:06,874 --> 00:36:07,958
విన్నావా?
393
00:36:10,210 --> 00:36:11,295
ఏమిటది?
394
00:36:11,378 --> 00:36:14,923
డజను మంది సాయుధ తెలియని వ్యక్తులు
పశ్చిమ తీరానికి చేరుకున్నారు.
395
00:36:23,891 --> 00:36:25,267
అందరూ వెనక్కు వెళ్లండి.
396
00:36:27,811 --> 00:36:30,564
ఎఫ్‌బీఐ! ఆగండి!
397
00:36:34,776 --> 00:36:36,111
రీస్. మాట్లాడు, బాబూ.
398
00:36:39,239 --> 00:36:41,074
నిన్ను మరొక వైపు కలుస్తాను, బెన్.
399
00:36:43,785 --> 00:36:44,786
ఛత్.
400
00:36:49,499 --> 00:36:50,500
సరే.
401
00:36:52,961 --> 00:36:56,173
ఫెడరల్ ఏజెంట్లం! కాల్పులు ఆపండి!
402
00:36:57,257 --> 00:36:58,258
కాల్పులు ఆపండి!
403
00:37:01,720 --> 00:37:02,930
మేము శత్రువులం కాము.
404
00:37:08,977 --> 00:37:12,439
ఇక అంతా హెచ్ఆర్‌టీ చూసుకుంటుంది.
ఎస్టేట్ స్వాధీనం చేసుకుంటున్నాం.
405
00:37:12,522 --> 00:37:14,483
మీ భద్రతా అంశం ఆపండి.
406
00:37:14,566 --> 00:37:15,734
సెక్‌డెఫ్ ఎక్కడ?
407
00:37:15,817 --> 00:37:17,611
రెండవ అంతస్తు, ఈశాన్య మూలలో.
408
00:37:17,694 --> 00:37:20,113
వ్యక్తిగత భద్రతతో
సురక్షిత గదిలో ఉన్నారు.
409
00:37:20,197 --> 00:37:21,448
జేమ్స్ రీస్ ఎక్కడ?
410
00:37:29,206 --> 00:37:30,332
నాతో పాటు. పదండి.
411
00:37:44,930 --> 00:37:47,849
ఛత్. ఓ గార్డ్ చనిపోయాడు.
మన గార్డ్ చనిపోయాడు!
412
00:37:55,107 --> 00:37:56,191
లోపలకు వస్తున్నాము.
413
00:38:23,885 --> 00:38:26,221
- మూలన పొగ వస్తోంది.
- అదేంటో చూడు.
414
00:38:26,304 --> 00:38:27,514
మీ స్థానాలలో ఉండండి.
415
00:38:36,982 --> 00:38:38,525
మీరు అక్కడకు వెళ్లాలి.
416
00:38:39,568 --> 00:38:41,445
కింద ఎఫ్‌బీఐ ఉంది.
సురక్షితంగా ఉందాం.
417
00:38:41,528 --> 00:38:43,739
మనం వేచి చూడడం లేదు. వెళ్ళండి!
418
00:38:46,742 --> 00:38:48,577
సరే, మేడం. ఇది చూసుకుంటాం.
419
00:40:30,137 --> 00:40:31,179
అది తెరువు!
420
00:40:32,305 --> 00:40:33,306
దానిని తెరువు!
421
00:40:52,367 --> 00:40:53,618
రీస్, ఆగు! ఆగు!
422
00:40:54,578 --> 00:40:55,579
తప్పుకో.
423
00:40:55,662 --> 00:40:57,122
ఆమె డబ్బు తీసుకోలేదు.
424
00:40:57,205 --> 00:41:02,085
ఆఖరి ఖాతా. ఒబెరాన్ ఎనలిటిక్స్.
ఏజెన్సీలో వేరే ఎవరిదో.
425
00:41:02,627 --> 00:41:04,880
ఓడిన్ స్వోర్డ్ ఏర్పాటు వేరెవరిదో.
426
00:41:04,963 --> 00:41:08,466
నిన్ను బాధించడం నా ఉద్దేశం కాదు, కమాండర్.
ప్రమాణం చేస్తున్నాను.
427
00:41:09,009 --> 00:41:10,343
నీకు సాయం చేయాలని చూశాను.
428
00:41:11,303 --> 00:41:13,763
అదేమీ విషయం కాదు. ఈ పరిస్థితి కారణం తనే.
429
00:41:14,890 --> 00:41:16,349
ఈ పరిస్థితికి కారణం ఆమె.
430
00:41:23,815 --> 00:41:24,816
రీస్.
431
00:41:37,037 --> 00:41:38,121
రీస్.
432
00:41:42,459 --> 00:41:45,128
చూడు. నీ కోసం ఇది
నీ కూతురు గీసింది, అవునా?
433
00:41:45,921 --> 00:41:47,380
దీనిని చూడు, చూడు.
434
00:41:48,089 --> 00:41:50,675
ఆమె నిన్ను చూసింది,
ఆమె చూసినది ఇది.
435
00:41:59,809 --> 00:42:01,186
నువ్వింకా ఇలా ఉండగలవు.
436
00:42:06,316 --> 00:42:07,776
నాకు వదిలెయ్, ఆమె దొరికింది.
437
00:42:07,859 --> 00:42:09,819
నాకు దొరికింది. టేప్‌లో పట్టుకున్నా.
438
00:42:09,903 --> 00:42:13,281
ఆమె అవమానకరమని
మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది.
439
00:42:13,365 --> 00:42:17,619
తన వారసత్వమే సిగ్గు పడుతుంది,
కానీ నువ్వు చంపితే, అది హత్య అవుతుంది.
440
00:42:21,081 --> 00:42:23,625
లైట్‌హౌస్ దగ్గర ఉన్నాం.
షూటర్ జాడ లేదు.
441
00:42:23,708 --> 00:42:26,378
టీ, గాయపడిన వారికి చికిత్స.
మాక్, స్మిటీ, నాతో.
442
00:42:26,461 --> 00:42:28,255
- లోపలకు వెళదాం.
- అలాగే.
443
00:42:28,838 --> 00:42:30,632
తూర్పు తీరం తీసుకో,
పడమర చూసుకుంటా.
444
00:42:39,975 --> 00:42:41,393
రీస్. ఇలా చేయకు.
445
00:42:46,648 --> 00:42:48,900
వద్దు. ఆమె నీ ప్రపంచంలో లేదు.
446
00:42:53,947 --> 00:42:55,532
తను యుద్ధరంగంలో ఉంది.
447
00:43:05,333 --> 00:43:06,251
వద్దు!
448
00:43:21,683 --> 00:43:23,476
హార్ట్‌లీ సురక్షిత గదికి వెళతాం.
449
00:44:05,685 --> 00:44:06,686
రీస్!
450
00:44:11,524 --> 00:44:12,901
నీ ఆయుధం కింద పెట్టు.
451
00:44:35,715 --> 00:44:36,716
రీస్...
452
00:44:42,263 --> 00:44:43,264
రీస్!
453
00:44:45,392 --> 00:44:46,851
నిన్ను కాల్చేలా చేయకు.
454
00:44:56,611 --> 00:44:58,113
నేను ఇప్పటికే చనిపోయాను.
455
00:45:00,698 --> 00:45:03,618
టోనీ, సురక్షిత గదిలో
మాకో పరిస్థితి ఉంది.
456
00:45:03,701 --> 00:45:06,788
విలేఖరి బతికే ఉంది.
కానీ హార్ట్‌లీ ఆత్మహత్య చేసుకుంది.
457
00:45:08,540 --> 00:45:09,707
నీకు వినబడిందా?
458
00:45:13,795 --> 00:45:15,755
టోనీ, రీస్ కనిపించాడా?
459
00:45:23,054 --> 00:45:24,055
కనిపించలేదు.
460
00:45:52,876 --> 00:45:56,796
{\an8}మూడు వారాల తరువాత
461
00:45:56,880 --> 00:46:00,842
{\an8}జరుగుతున్న కథ
పెంటగాన్‌లో సమూల సంస్కరణలు
462
00:46:06,014 --> 00:46:07,891
అప్‌డేట్: వాస్తవం మరియు పరిణామం
463
00:46:07,974 --> 00:46:09,434
కమాండర్ జేమ్స్ రీస్‌కు
ద్రోహం చేసిన పెంటగాన్.
464
00:46:09,517 --> 00:46:12,687
ఆ తర్వాతి పరిణామాలు దేశాన్ని కుదిపేశాయి.
465
00:46:15,148 --> 00:46:19,194
{\an8}ఒబెరాన్ ఎనలిటిక్స్
466
00:46:24,449 --> 00:46:28,411
రీస్
సందేశం
467
00:46:28,495 --> 00:46:34,501
నీ మాట నిజం.
నీ కథ కొంత మంచి చేసింది.
468
00:46:36,961 --> 00:46:40,507
ఆఖరి ప్రశ్న సంగతేంటి?
469
00:46:45,803 --> 00:46:51,809
పెరూలోని ఓ బ్యాంక్ ద్వారా
ఒబెరాన్ ఎనలిటిక్స్ రూటింగ్ చేస్తోంది.
470
00:47:01,653 --> 00:47:05,698
ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు
నా కోసం వెతకడం ఆపాలి.
471
00:47:08,076 --> 00:47:11,788
అది జరగదు.
472
00:47:18,920 --> 00:47:21,881
{\an8}జేమ్స్ రీస్ కోసం కొనసాగుతున్న వేట
ఎల్‌సీడీఆర్ రీస్ మరణించి ఉండవచ్చు
473
00:47:37,522 --> 00:47:43,528
మాంకోరా
పెరూ
474
00:49:00,021 --> 00:49:01,939
నిన్ను మళ్లీ చూస్తానని ఆశించాను.
475
00:49:03,608 --> 00:49:04,942
ఒబెరాన్ ఎనలిటిక్స్.
476
00:49:07,695 --> 00:49:10,198
నీ జాబితాలో ఓ డొల్ల కంపెనీని వదిలేశావు.
477
00:49:14,202 --> 00:49:15,620
పిల్లర్ చెప్పాలని చూశాడు.
478
00:49:17,538 --> 00:49:21,042
తను ఓ పేరు చెబుతానని అన్నాడు.
అది హార్ట్‌లీ అనుకున్నాను.
479
00:49:24,879 --> 00:49:27,632
అది నువ్వే, బెన్.
480
00:49:29,217 --> 00:49:31,177
అది కచ్చితంగా నువ్వే.
481
00:49:33,513 --> 00:49:34,931
నా సోర్స్ నీకు తెలుసు.
482
00:49:37,725 --> 00:49:40,353
ఎస్‌డీఎఫ్ ద్వారా తప్పు సమాచారం పంపావు.
483
00:49:40,436 --> 00:49:43,690
ఓడిన్ స్వోర్డ్ ఏర్పాటుకు
సరైన స్థానంలో ఉన్నావు.
484
00:49:48,152 --> 00:49:49,779
నేను నీ నుంచే వినాలి.
485
00:49:53,533 --> 00:49:54,701
అడ్మిరల్ మాటిచ్చాడు...
486
00:49:56,786 --> 00:49:58,162
నువ్వు చనిపోయావని అన్నాడు.
487
00:49:59,706 --> 00:50:01,666
నీకు, నీ వాళ్లకు
కణితులు ఉన్నాయన్నాడు.
488
00:50:03,126 --> 00:50:07,088
వాళ్లు ఉద్యోగంలోనే
చనిపోవడం నయమని అనుకున్నాను...
489
00:50:09,382 --> 00:50:12,176
ఏదో ఆస్పత్రి మంచానికి బదులుగా.
490
00:50:19,142 --> 00:50:21,602
మా కోసం చేశావా, 20 మిలియన్ డాలర్ల కోసమా?
491
00:50:25,148 --> 00:50:26,232
బహుశా రెండూ...
492
00:50:30,403 --> 00:50:31,612
మొదటగా.
493
00:50:33,239 --> 00:50:36,367
నేను పైసా కూడా ఖర్చు చేయలేదు.
నా వల్ల కాదు.
494
00:50:39,203 --> 00:50:40,580
కానీ నీకు తెలియాలి...
495
00:50:43,541 --> 00:50:45,334
నీకు తెలియడం నాకు కావాలి...
496
00:50:47,545 --> 00:50:49,839
అది రాయంతటి దృఢంగా ఏర్పాటైంది.
497
00:50:58,097 --> 00:50:59,724
లారెన్ ఇంకా లూస్...
498
00:51:04,979 --> 00:51:06,689
దానితో నాకేమీ సంబంధం లేదు.
499
00:51:10,526 --> 00:51:11,819
నాకు ఆ సంగతి తెలిశాక,
500
00:51:12,528 --> 00:51:15,490
ప్రపంచాన్ని తగలబెడదామని
అనుకున్నాను, సోదరా.
501
00:51:20,161 --> 00:51:24,040
నీతోనే ఉన్నాను, ప్రతి అడుగులో,
502
00:51:27,001 --> 00:51:30,713
వాళ్లను చంపిన ఆ దరిద్రులను
అంతం చేయడంలో.
503
00:51:31,631 --> 00:51:33,090
అది నిజం.
504
00:51:36,093 --> 00:51:37,428
అదే నిజం.
505
00:51:41,516 --> 00:51:42,517
నాకు తెలుసు.
506
00:51:44,477 --> 00:51:45,686
నన్ను క్షమించు.
507
00:51:48,981 --> 00:51:49,982
నాకు తెలుసు, బెన్.
508
00:51:53,861 --> 00:51:54,695
నేను...
509
00:51:57,114 --> 00:51:58,491
కొత్త పచ్చబొట్టు వేయించా.
510
00:52:02,537 --> 00:52:06,582
అది నీ కోసమో,
నా కోసమో నాకు తెలియదు.
511
00:52:12,463 --> 00:52:13,548
ఇప్పుడు నాకు తెలుసు.
512
00:52:16,467 --> 00:52:17,510
ఇప్పుడు నాకు తెలుసు.
513
00:52:26,227 --> 00:52:27,186
పర్వాలేదు.
514
00:52:33,192 --> 00:52:34,610
నీ జాబితాను పూర్తి చెయ్.
515
00:53:22,867 --> 00:53:24,577
ఆమె బాగానే ఉంటుందా, నాన్నా?
516
00:53:34,795 --> 00:53:36,547
ఆమెకు అబద్ధం చెప్పే పని లేదు.
517
00:53:41,093 --> 00:53:43,763
నీకొకటి చెబుతా, బంగారం,
బతుకుతుందని అనుకోను.
518
00:53:44,305 --> 00:53:45,348
అది చనిపోయింది.
519
00:53:45,806 --> 00:53:47,475
అవును, అది నిజం, బంగారం.
520
00:53:49,352 --> 00:53:50,353
నాన్నా,
521
00:53:52,188 --> 00:53:54,357
నువ్వు ఇంటికి తిరిగి రాకపోతే ఏమవుతుంది?
522
00:53:57,109 --> 00:53:59,236
బంగారం, ఎప్పుడూ ఇంటికి వచ్చేస్తాను.
523
00:54:03,866 --> 00:54:05,201
కానీ నువ్వు రాకపోతే?
524
00:54:13,584 --> 00:54:14,627
ఇలా రా.
525
00:54:31,644 --> 00:54:34,021
ఒకవేళ నేను విధుల నుంచి
ఇంటికి తిరిగి రాకపోతే,
526
00:54:34,438 --> 00:54:36,774
నీకు ఇది తెలియాలి...
527
00:54:38,901 --> 00:54:41,696
ఏదో ముఖ్యమైన పని చేస్తూ
మీ నాన్న చనిపోయాడు,
528
00:54:42,947 --> 00:54:46,534
అప్పుడు నా చుట్టూ
నేను ప్రేమించిన వాళ్లతో ఉంటాను,
529
00:54:47,660 --> 00:54:48,536
మంచి మనుషులతో.
530
00:54:50,162 --> 00:54:51,789
నన్ను, అమ్మను ప్రేమించినట్లా?
531
00:54:55,876 --> 00:54:57,336
కాదు, బంగారం.
532
00:54:57,420 --> 00:55:00,339
నిన్ను ప్రేమించినట్లుగా,
మీ అమ్మను ప్రేమించినట్లుగా
533
00:55:00,423 --> 00:55:02,258
నేను వేరే ఎవరినీ ప్రేమించలేను.
534
00:55:07,596 --> 00:55:09,432
అయినా మీ అమ్మ ఇక్కడే ఉంటుంది.
535
00:55:09,515 --> 00:55:12,810
నేను యుద్ధానికి వెళ్లిన మాదిరిగా
నిన్ను చూసుకుంటుంది.
536
00:55:12,893 --> 00:55:15,688
నీకు ఆదివారాలు సాకర్ ఉంటుంది,
537
00:55:16,188 --> 00:55:18,232
ఇంకా గుర్రం మీద స్వారీ...
538
00:55:18,315 --> 00:55:20,317
ఇంకా పెరటిలో డాన్స్
539
00:55:20,401 --> 00:55:21,944
పెరటిలో డాన్స్ చేయడం.
540
00:55:29,660 --> 00:55:33,581
ఆ తర్వాత, ఒక రోజున,
నువ్వు పెద్దదానివి అవుతావు.
541
00:55:35,583 --> 00:55:37,543
మీ అమ్మను జాగ్రత్తగా చూసుకుంటావు.
542
00:55:38,294 --> 00:55:41,964
నేను అదంతా చూసేందుకు
ఇక్కడ ఉండనంత మాత్రాన,
543
00:55:43,340 --> 00:55:48,262
నేను మిమ్మల్ని చూడడం లేదని
అర్థం కాదు, ఎప్పుడూ.
544
00:55:49,388 --> 00:55:52,475
కేవలం... వేరే చోటు నుంచి అంతే.
545
00:55:54,602 --> 00:55:55,728
ఎక్కడి నుంచి?
546
00:56:00,775 --> 00:56:04,070
ఇక్కడి నుంచి, బంగారం.
సరిగ్గా ఇక్కడి నుంచి,
547
00:56:07,782 --> 00:56:08,783
ఇలా రా.
548
00:56:26,383 --> 00:56:32,389
నా కుటుంబం
549
00:57:15,766 --> 00:57:20,813
నియాసా
మొజాంబిక్
550
00:59:20,557 --> 00:59:22,559
ఉపశీర్షికలు అనువదించినది
కృష్ణమోహన్ తంగిరాల