1 00:00:33,368 --> 00:00:36,162 ఈ రోజు వాతావరణంలో క్రీడాస్ఫూర్తిని దాదాపుగా కనిపెట్టేయవచ్చు ఎందుకంటే ఈ రోజు 2 00:00:36,246 --> 00:00:38,331 మన ద్వీపంలో అప్పుడప్పుడు జరిగే బీచ్ షేప్ ఆఫ్ పోటీలు జరగబోతున్నాయి! 3 00:00:38,415 --> 00:00:40,834 ఈ పోటీలను మీరు వీక్షిస్తుంటే, ప్రేక్షకుల ఫేవరెట్ ఆటగాడు ట్రయాంగిల్, 4 00:00:40,917 --> 00:00:43,545 ఇప్పుడే తన గొప్ప గెంతు ప్రదర్శనకు సిద్ధమవుతున్నాడు! 5 00:00:47,132 --> 00:00:48,758 అతని ఏకాగ్రతని చూడండి. 6 00:00:50,719 --> 00:00:52,095 ఇంక ట్రయాంగిల్ మొదలుపెట్టాడు! 7 00:00:59,144 --> 00:01:00,312 అతని వేగం చూడండి! 8 00:01:04,940 --> 00:01:07,235 ఇక్కడ జరిగేది చూస్తుంటే రాజసంగా ఉందనడం కూడా 9 00:01:07,319 --> 00:01:08,862 చిన్న మాటే అవుతుంది, మిత్రులారా. 10 00:01:12,449 --> 00:01:16,536 ఈ గొప్ప విషయం చూడండి. అతని వ్యక్తిగత అత్యుత్తమ వేగం. 11 00:01:24,211 --> 00:01:27,214 ఇప్పుడు స్క్వేర్ ఈ పోటీ కోసం కసరత్తులు చేస్తున్నాడు. 12 00:01:32,260 --> 00:01:36,014 కిందటి సారి పోటీలో చాంపియన్ అయిన స్క్వేర్, ట్రయాంగిల్ జంప్ ని చూసి చలించడం లేదు. 13 00:01:39,184 --> 00:01:40,352 గొప్ప ప్రారంభం! 14 00:01:41,061 --> 00:01:43,355 గొప్ప గెంతు ప్రదర్శన పోటీలలో ఇన్ని ఏళ్లుగా వ్యాఖ్యానం చెబుతున్నా 15 00:01:43,438 --> 00:01:45,232 ఇటువంటి గొప్ప పోటీతత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. 16 00:02:00,080 --> 00:02:02,040 ఇది పోటాపోటీగా ముగిసేలా ఉంది. 17 00:02:04,626 --> 00:02:06,127 స్క్వేర్ గెలిచాడు! 18 00:02:07,587 --> 00:02:11,841 అయ్యో! 19 00:02:13,510 --> 00:02:15,971 లేదు! ఈ పోటీ మళ్లీ పెట్టాలి. 20 00:02:16,054 --> 00:02:18,682 నువ్వు ఇదే అంటావని నాకు తెలుసు, ట్రయాంగిల్. ఇదే అంటావని తెలుసు. 21 00:02:31,069 --> 00:02:32,153 నేనే గెలిచాను. 22 00:02:39,661 --> 00:02:41,329 -హేయ్, సర్కిల్. -హా హా! 23 00:02:41,413 --> 00:02:43,415 సర్కిల్! వచ్చి మాతో చేరు! 24 00:02:43,498 --> 00:02:45,667 అవును, నాకు కాస్త గట్టి పోటీ కావాలి. 25 00:02:46,751 --> 00:02:49,671 వద్దులే బాబు. అది నా వల్ల కాదు. 26 00:02:50,463 --> 00:02:51,965 నీ వల్ల కాదా? 27 00:02:54,009 --> 00:02:55,635 ఆమె వల్ల కాదా? 28 00:02:57,345 --> 00:03:00,265 "ట్రయాంగిల్ ఇంకా స్క్వేర్ పెద్ద గేమ్." 29 00:03:02,267 --> 00:03:07,314 ఆమె అలా అనడంలో అర్థం లేదు, స్క్వేర్. ఆమె వల్ల కాదా? మన ఆట గొప్పగా ఉంటుంది కదా. 30 00:03:07,814 --> 00:03:10,275 నాకు చాలా అయోమయంగా ఉంది. కడుపు నొప్పి వస్తోంది. 31 00:03:10,358 --> 00:03:14,029 మన ఇంత గొప్ప ఆటని సర్కిల్ ఎందుకు ఆడాలని అనుకోవడం లేదు? మనది మరీ గొప్ప ఆట అంటావా? 32 00:03:14,112 --> 00:03:17,157 అది మాత్రమే సహేతుకమైన వివరణగా నాకు అనిపిస్తోంది. 33 00:03:17,240 --> 00:03:19,242 అయితే, మరో వైపు… 34 00:03:20,535 --> 00:03:21,661 ఓహ్, లేదు. 35 00:03:22,162 --> 00:03:24,289 ఏంటి, ఏంటి, ఏంటి? 36 00:03:24,372 --> 00:03:25,790 ఇది నీకు నచ్చదు. 37 00:03:25,874 --> 00:03:27,042 ఏంటి? 38 00:03:27,125 --> 00:03:30,253 మన గేమ్ గనుక అద్భుతంగా లేకపోతే? 39 00:03:30,337 --> 00:03:36,218 మన ఆట గనుక గొప్పగా లేకపోతే? 40 00:03:36,968 --> 00:03:38,678 స్క్వేర్! మూర్ఖంగా మాట్లాడకు. 41 00:03:38,762 --> 00:03:41,932 మన గేమ్ గొప్పగా లేదని కాదు. అందులో అన్నీ ఉన్నాయి. 42 00:03:42,015 --> 00:03:46,645 గెంతడం, దూకడం, కళ్లద్దాలు. ఇందులో నచ్చనిది ఏంటి? 43 00:03:46,728 --> 00:03:48,021 ఏం జరిగిందో నాకు తెలుసు. 44 00:03:48,104 --> 00:03:49,898 సర్కిల్ వెళ్లిపోయే ముందు ఈ గేమ్ గొప్పదనాన్ని 45 00:03:49,981 --> 00:03:52,692 అర్థం చేసుకోవడానికి సరిపడ సమయం దొరకలేదు. 46 00:03:53,235 --> 00:03:55,111 ఇప్పుడు, ఇది నిజమో కాదో నాకు తెలియదు. 47 00:03:56,529 --> 00:03:58,448 అవును. నువ్వు చెప్పిందే నిజం కావచ్చు. 48 00:03:59,074 --> 00:04:00,450 అయితే, మరి ఏం చేద్దాం? 49 00:04:11,795 --> 00:04:13,922 భలే, హలో మిత్రమా, స్క్వేర్. 50 00:04:14,881 --> 00:04:16,591 హలో, ట్రయాంగిల్. 51 00:04:16,675 --> 00:04:17,759 అన్నట్లు, 52 00:04:17,841 --> 00:04:22,556 మా నిజమైన గొప్ప గేమ్ లో మరో రౌండ్ ఆడటానికి నువ్వు సిద్ధమేనా? 53 00:04:24,516 --> 00:04:29,020 అంటే నీ ఉద్దేశం, మనం చేసిన అత్యంత అద్భుతమైన, ఏ మాత్రం బోరు కొట్టని 54 00:04:29,104 --> 00:04:31,439 సరదా ఆట అంటావా? 55 00:04:31,523 --> 00:04:34,776 ఖచ్చితంగా. నేను మొదలుపెట్టేస్తున్నాను! 56 00:04:39,948 --> 00:04:42,617 ఇది వాళ్ల చక్కని ఆటతీరు కాదు, అయినా కానీ కొద్దిగా బాగుంది. 57 00:04:43,159 --> 00:04:44,911 అభినందనలు. 58 00:04:44,995 --> 00:04:46,913 వావ్, ఎందుకా కంగారు. 59 00:04:46,997 --> 00:04:51,042 సర్కిల్. నిన్ను ఈ గేమ్ లో నేను చూడలేదు. పద. ఒక ప్రయత్నం చేయి. 60 00:04:51,126 --> 00:04:52,627 ఈ గేమ్ నియమాలని త్వరగా చెప్పేస్తాను. 61 00:04:52,711 --> 00:04:55,380 కొన్నిసార్లు ఏదైనా మరీ గొప్ప అద్భుతంగా ఉంటే, 62 00:04:55,463 --> 00:04:57,257 అది అయోమయానికి గురి చేస్తుందని నాకు తెలుసు. 63 00:04:58,300 --> 00:04:59,509 నేను మంచిగానే ఉన్నాను. 64 00:05:00,093 --> 00:05:04,639 సర్కిల్, మా ఆట అద్భుతంగా లేదని అనుకుంటున్నావా? 65 00:05:06,516 --> 00:05:08,268 లేదు. 66 00:05:08,351 --> 00:05:11,980 కానీ అది కొద్దిగా… సిల్లీగా ఉంది. 67 00:05:12,981 --> 00:05:14,149 సిల్లీగానా? 68 00:05:14,232 --> 00:05:15,483 మీరిద్దరూ, ఆటని ఆస్వాదించండి. 69 00:05:21,990 --> 00:05:23,158 ఆమె అన్నది నమ్మశక్యంగా ఉందా? 70 00:05:23,241 --> 00:05:26,369 తను "సిల్లీ" అంటోంది. ఇందులో సిల్లీగా ఉన్నది ఏంటి? 71 00:05:28,413 --> 00:05:30,790 తను ఏం మాట్లాడుతోందో సర్కిల్ కి తెలియదు. 72 00:05:30,874 --> 00:05:33,209 తను ఏం మాట్లాడుతోందో తనకి స్పష్టంగా తెలుసు అనుకుంటా. 73 00:05:33,293 --> 00:05:35,545 ఆమెకి మన ఆట ఇష్టం లేదు. 74 00:05:35,629 --> 00:05:37,505 అవును, అయితే మనం ఏం చేయాలి? 75 00:05:37,589 --> 00:05:39,591 మన ఆటని మనమే ప్రశాంతంగా ఆస్వాదించి 76 00:05:39,674 --> 00:05:42,135 ఇంకా మిగతా వాళ్లు ఏం అనుకుంటున్నారో దాని గురించి ఆందోళన పడకుండా ఉందామా? 77 00:05:44,846 --> 00:05:49,059 లేదు! లేదు. మన ఆటని ఇంకా మెరుగుపర్చుకోవాలి. 78 00:05:49,142 --> 00:05:51,519 ఖచ్చితంగా. మనం గనుక నిజంగా ఈ ఆటలో ప్రావీణ్యం సంపాదిస్తే, 79 00:05:51,603 --> 00:05:54,522 మనతో ఆడకుండా ఆమె ఉండలేదు. 80 00:05:54,606 --> 00:05:56,691 అవును. ప్రతి జంప్ తరువాత ఎక్కువ పోజులు పెడదాం. 81 00:05:56,775 --> 00:05:58,109 డాన్సులు చేద్దాం. 82 00:05:58,193 --> 00:06:01,279 ట్రోఫీ మీద మరింత నాచు ఉంచుదాం! 83 00:06:01,363 --> 00:06:03,323 ఇప్పుడు నువ్వు అందుకున్నావు. ఇంకేం చేయచ్చు? 84 00:06:03,406 --> 00:06:05,367 ఇంకా ఏం చేయచ్చు? ఇంకా, ఇంకా. 85 00:06:23,593 --> 00:06:24,844 ఇది చూడు. 86 00:06:33,812 --> 00:06:34,896 ఎలా ఉంది? 87 00:06:35,313 --> 00:06:36,606 ఇది బాగుంది. 88 00:06:38,567 --> 00:06:39,568 సరే. 89 00:06:40,235 --> 00:06:41,236 ఉంటాను. 90 00:06:50,537 --> 00:06:54,958 సరే, కొన్ని సమస్యల్ని మనం పరిష్కరించాలి, కానీ మన కొత్త పోజులు పెద్ద హిట్ అయ్యాయి అనుకుంటా. 91 00:06:55,041 --> 00:06:57,294 -మన తరువాతి ప్రయత్నంలో, మనం ఏం చేయాలంటే… -లేదు. 92 00:06:57,794 --> 00:07:00,547 -ఏంటి? "లేదు" అనడంలో నీ ఉద్దేశం ఏంటి? -కేవలం "లేదు" అని. 93 00:07:00,630 --> 00:07:03,758 సర్కిల్ ఈ ద్వీపంలో అందరి కన్నా పెద్దది ఇంకా తెలివైనది, 94 00:07:03,842 --> 00:07:07,053 మన గేమ్ గనుక సిల్లీగా ఉందని తను అనుకుంటే, బహుశా ఆమె నిజమే చెప్పి ఉండచ్చు. 95 00:07:07,596 --> 00:07:12,017 మనమే ఈ గేమ్ ని సృష్టించాం కాబట్టి, మనం సిల్లీగా అనిపించవచ్చు. 96 00:07:12,767 --> 00:07:14,603 అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి… 97 00:07:15,103 --> 00:07:16,938 మనం ఎలాంటి గేమ్ ఆడాలి? 98 00:07:17,439 --> 00:07:21,568 గేమ్స్ అనేవి సిల్లీ, ట్రయాంగిల్. మనం ఇంక గేమ్స్ ఆడద్దు. 99 00:07:21,651 --> 00:07:23,528 ఇప్పుడు, మనం వాతావరణాన్ని అలా చూద్దాం. 100 00:07:24,529 --> 00:07:27,782 ఇది ఇలాగే జరగాలి అంటే, అది అలాగే జరుగుతుంది. 101 00:07:30,076 --> 00:07:31,161 అయ్యో పాపం. 102 00:07:33,872 --> 00:07:38,376 వావ్. మనం ఆడిన పిచ్చి ఆట కన్నా ఇది చాలా మంచిగా ఉంది. 103 00:07:38,793 --> 00:07:41,254 అవును, అవును. దాని కన్నా సీరియస్ గా ఉంది. 104 00:07:41,338 --> 00:07:44,507 పూర్తిగా సీరియస్. అస్సలు సిల్లీగా లేదు. 105 00:07:44,591 --> 00:07:47,761 కొద్దిగా కూడా లేదు. అందుకే ఇది బాగుంది, కదా? 106 00:07:48,303 --> 00:07:49,346 చాలా బాగుంది. 107 00:08:00,899 --> 00:08:02,359 నేను ఇలా కూర్చోలేను 108 00:08:02,442 --> 00:08:05,904 అక్కడ సర్కిల్ మనం ఆ సిల్లీ గేమ్ ఆడుతున్నాం అనుకుంటోందని తెలిసి ఊరుకోలేను! 109 00:08:05,987 --> 00:08:08,031 మనం ఆ ఆటని వదిలేశామని ఆమెకి చెప్పాలి. 110 00:08:08,114 --> 00:08:11,743 అవును. మనం ఇప్పుడు అదే ఆట ఆడుతున్నాం అని తను అనుకోవచ్చు. 111 00:08:12,619 --> 00:08:15,288 లేదు, లేదు. నువ్వు ఊహించగలవా? 112 00:08:15,830 --> 00:08:18,166 మనం అక్కడి వరకూ నడిచి వెళ్లి, ఇంకా… 113 00:08:18,250 --> 00:08:22,254 మనం ఆ ఆటని ఇంకెప్పుడూ ఆడమని సర్కిల్ కి చెబుదాం. 114 00:08:22,337 --> 00:08:24,881 అప్పుడు మనం మళ్లీ మంచిగా ఉన్నామని తను అనుకుంటుందా? 115 00:08:24,965 --> 00:08:26,424 అది తెలుసుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. 116 00:08:29,928 --> 00:08:30,929 విను. 117 00:08:31,471 --> 00:08:32,556 నేను ఏం అనుకుంటానంటే అదీ… 118 00:08:39,813 --> 00:08:40,855 సర్కిల్? 119 00:08:42,023 --> 00:08:45,944 ట్రయాంగిల్! స్క్వేర్! హేయ్! 120 00:08:47,404 --> 00:08:49,072 ఏంటి మీరు… మీరు ఏం… 121 00:08:49,155 --> 00:08:50,865 మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? 122 00:08:50,949 --> 00:08:54,786 మేము ఆ సిల్లీ గేమ్ ని వదిలేశామని చెప్పడానికి వస్తున్నాం. 123 00:08:54,869 --> 00:08:58,999 అవును. ఏంటి… సారీ… మీరు ఏం చేస్తున్నారు? 124 00:08:59,958 --> 00:09:02,878 ఇది… ఏమీ లేదు. 125 00:09:02,961 --> 00:09:06,506 నా ఉద్దేశం, అంటే, ఇది నేను అప్పుడప్పుడు ఆడే చిన్న ఆట. 126 00:09:06,590 --> 00:09:10,093 కళ్లు తిరిగే వరకూ గిరగిరా తిరగాలి ఇంక అప్పుడు అంతా చాలా విచిత్రంగా… 127 00:09:11,887 --> 00:09:12,888 …కనిపిస్తుంది. 128 00:09:15,640 --> 00:09:19,269 అవును. మీరు ఇద్దరూ… మీరు కూడా ఆడతారా? 129 00:09:20,312 --> 00:09:23,690 లేదు. లేదు. అది… లేదు, ఫర్వాలేదు. 130 00:09:23,773 --> 00:09:27,944 దీనికి మేం అంతరాయం కలిగించాలని అనుకోవడం లేదు. 131 00:09:28,653 --> 00:09:31,239 మంచిది. అలాగే. మరి… 132 00:09:33,408 --> 00:09:35,118 మేము ఇంక వెళతాం. 133 00:09:35,201 --> 00:09:36,369 అవును. 134 00:09:36,453 --> 00:09:42,042 మీరు నిజంగానే అంటున్నారా? నా ఉద్దేశం, ఇక్కడ తిరగడానికి చాలా ప్రదేశం ఉంది… 135 00:09:42,125 --> 00:09:43,919 లేదు, లేదు. మేం ఫర్వాలేదు. 136 00:09:44,002 --> 00:09:45,503 అవును, అవును. ఇది కేవలం… 137 00:09:45,587 --> 00:09:47,005 ఇది మా ఆట కాదు. 138 00:09:47,088 --> 00:09:48,590 ఖచ్చితంగా. ఆగు. 139 00:09:48,673 --> 00:09:52,219 -ఏంటి? -ఇది మన ఆట కాదు. 140 00:09:52,302 --> 00:09:55,430 అవును. ఇది మన ఆట కాదు. 141 00:09:55,513 --> 00:09:58,892 ఇది మా ఆట కాదు. ఇది మా ఆట కాదు. 142 00:09:58,975 --> 00:10:00,393 సరే, అలాగే. 143 00:10:00,477 --> 00:10:03,980 -అంటే, మీరు గనుక మనసు మార్చుకుంటే… -ఇది మా ఆట కాదు. ఇది మా ఆట కాదు. 144 00:10:04,064 --> 00:10:06,149 ఇది మా ఆట కాదు. ఇది మా ఆట కాదు. ఇది మా… 145 00:10:06,233 --> 00:10:08,109 సరే, ఇది నాకు సరదాగా అనిపించింది. 146 00:10:15,575 --> 00:10:17,994 -హేయ్! -పద! 147 00:10:26,545 --> 00:10:29,839 ఈ రాత్రి, సర్కిల్, స్క్వేర్ ఇంకా ట్రయాంగిల్ 148 00:10:29,923 --> 00:10:33,468 చాలా ప్రత్యేకమైన ఖగోళ పరిణామాన్ని చూడబోతున్నారు. 149 00:10:35,345 --> 00:10:39,224 ఒక తోకచుక్కని నేను ఎప్పుడూ చూడలేదు అనుకుంటా. 150 00:10:39,307 --> 00:10:41,893 నేను కూడా చూడలేదు. ఇలాంటివి చూడటం నాకు చాలా ఇష్టం. 151 00:10:41,977 --> 00:10:43,645 నేను ఇలాంటివి ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. 152 00:10:46,523 --> 00:10:48,817 దీనిని నిజానికి ఉల్కాపాతం అంటారు. 153 00:10:48,900 --> 00:10:54,489 మన ద్వీపంలో 237 ఏళ్లుగా ఇలాంటిది కనిపించలేదు. 154 00:10:54,573 --> 00:10:56,866 ఈ రోజు చాలా ప్రత్యేకమైన రాత్రి. 155 00:10:56,950 --> 00:11:00,203 సర్కిల్? ఆకాశం నుంచి తోకచుక్కలు ఎందుకు కింద పడతాయి? 156 00:11:00,287 --> 00:11:05,208 -వాస్తవంగా అవి నక్షత్రాలు కాదు, కానీ… -తోకచుక్కలు వేగంగా వెళతాయని చెప్పగలను! 157 00:11:05,292 --> 00:11:07,127 -అవును, కానీ… -అంటే… 158 00:11:09,296 --> 00:11:10,297 అవును! 159 00:11:12,841 --> 00:11:16,011 అవును, అది ఇలా ఉంటుందని చెప్పగలను. "నా దారికి అడ్డు రాకండి! నేను…" 160 00:11:16,094 --> 00:11:18,096 "తోకచుక్క." 161 00:11:18,680 --> 00:11:20,849 -నేను, వేగంగా పడగలను, కానీ… -సరే. అద్భుతం. 162 00:11:20,932 --> 00:11:22,225 తోకచుక్క! 163 00:11:24,686 --> 00:11:25,812 ఓహ్, దేవుడా! 164 00:11:26,897 --> 00:11:29,649 హా, తోకచుక్కలు గుడ్లు మాదిరిగా ఉన్నాయి. 165 00:11:29,733 --> 00:11:31,151 ఇది గుడ్డే. 166 00:11:31,234 --> 00:11:32,360 నాకు తెలుసు. 167 00:11:33,570 --> 00:11:35,488 ఇప్పుడు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 168 00:11:37,240 --> 00:11:38,950 నిన్ను మీ ఇంట్లో దిగపెడతాం, చిన్నారి. 169 00:11:44,039 --> 00:11:46,124 అవును, నువ్వు మ్యాచింగ్ గుడ్డువి. 170 00:11:47,167 --> 00:11:48,335 మీరంతా కలిసి ఉండాలి. 171 00:11:50,921 --> 00:11:55,050 హఠాత్తుగా, సర్కిల్ చాలా ఒంటరితనం ఫీల్ అయింది. 172 00:11:55,133 --> 00:11:58,094 నువ్వు ఇక్కడి నుండే వచ్చావు. ఇది నీ ఇల్లు. 173 00:11:59,429 --> 00:12:02,224 సర్కిల్! ట్రయాంగిల్ మళ్లీ పడిపోయాడు. 174 00:12:02,307 --> 00:12:04,309 ఆ చెట్టు వేరు నాకు అడ్డు తగిలింది! 175 00:12:05,977 --> 00:12:07,437 నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో, బాబు. 176 00:12:08,230 --> 00:12:12,192 ట్రయాంగిల్, నీకు ఎన్నిసార్లు చెప్పాను? 177 00:12:12,275 --> 00:12:15,111 చెట్లని తన్నడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. 178 00:12:17,864 --> 00:12:19,658 హా. అది దేని గుడ్డో అని ఆలోచిస్తున్నాను. 179 00:12:21,868 --> 00:12:23,495 బహుశా ఏదో విశేషమైన కోడిది కావచ్చా? 180 00:12:26,248 --> 00:12:28,208 ఒక ఎగిరే తాబేలు గుడ్డు అయి ఉంటుంది అనుకుంటా. 181 00:12:30,043 --> 00:12:31,503 అవి సీగల్ పక్షి గుడ్లు. 182 00:12:31,586 --> 00:12:33,296 కానీ నాకు నీ ఐడియాలు కూడా నచ్చాయి. 183 00:12:35,632 --> 00:12:36,925 చూడండి. 184 00:12:43,306 --> 00:12:44,307 వావ్! 185 00:12:44,849 --> 00:12:47,352 ఓరి బాబోయ్! 186 00:12:47,435 --> 00:12:51,690 స్క్వేర్ ఇంకా ట్రయాంగిల్ ఎప్పుడూ ఇలాంటిది చూడనే లేదు. 187 00:12:55,443 --> 00:12:57,571 ఇది ఏదో మ్యాజికల్ గా ఉంది. 188 00:12:57,654 --> 00:13:00,407 అంత గొప్పగా ఏం లేదు, అనుకుంటా. అవి ఇంకా దగ్గరకు రావచ్చు. 189 00:13:02,784 --> 00:13:03,994 బాగుంది! 190 00:13:06,371 --> 00:13:08,206 -వావ్! -అది చాలా అద్భుతంగా ఉంది! 191 00:13:10,458 --> 00:13:13,253 దీని గురించి సర్కిల్ కి మంచి అభిప్రాయం కలగలేదు. 192 00:13:14,004 --> 00:13:15,005 గమనించండి! 193 00:13:23,889 --> 00:13:26,558 సరే, అది మరీ దగ్గరగా వచ్చేసింది! 194 00:13:26,641 --> 00:13:28,393 మనం ఇంకా బతికే ఉన్నామా? 195 00:13:28,476 --> 00:13:31,396 ఓరి నా పాన్ కేక్స్! మనం దెయ్యాలమా? 196 00:13:32,063 --> 00:13:33,732 నిన్ను భయపెట్టాలని తహతహలాడుతున్నాను! 197 00:13:33,815 --> 00:13:36,860 ట్రయాంగిల్! ఒక దెయ్యం ఇంకో దెయ్యాన్ని భయపెట్టలేదు. 198 00:13:36,943 --> 00:13:39,571 దెయ్యం తల్చుకుంటే దేనినైనా భయపెట్టగలదు. 199 00:13:39,654 --> 00:13:42,282 అది ఒక రాయిని భయపెట్టగలదు. ఒక కూరగాయని భయపెట్టగలదు… 200 00:13:42,365 --> 00:13:43,950 మనం దెయ్యాలం కాదు. 201 00:13:44,451 --> 00:13:46,036 -ఆహ్, చెత్త. -నా మాట వినండి. 202 00:13:46,119 --> 00:13:50,123 చాలా ఉల్కలు భూమిని తాకేంత దగ్గరకి ఎప్పుడూ రావు. 203 00:13:50,206 --> 00:13:53,293 అవి వేడికి బూడిదైపోతాయి లేదా అంతరిక్షంలోకే వేగంగా వెళ్లిపోతాయి. 204 00:13:53,376 --> 00:13:55,503 అయితే, మరి ఈసారి ఏమయింది? 205 00:14:02,302 --> 00:14:08,183 చాలా, చాలా, చాలా కాలం తరువాత అలాంటిది ఏదో జరగలేదు. 206 00:14:10,227 --> 00:14:15,148 అది నేలని ఢీకొనగానే ఆవిరిగా మారిపోయిందా? లేదా ఇంకా ఆ గోతిలో, అలాగే ఉందా? అని ఆలోచిస్తున్నాను. 207 00:14:18,026 --> 00:14:19,402 ఇది ఒక గూడులా ఉంది. 208 00:14:19,486 --> 00:14:23,198 అది ఇక్కడికి వచ్చింది, నా ద్వీపం పైన. ఆ క్షితిజ రేఖ మీదుగా. 209 00:14:24,783 --> 00:14:27,577 సర్కిల్, ఇదంతా వింటుంటే నీకు అక్కడికి వెళ్లి చూడాలని కోరికగా ఉన్నట్లు అనిపిస్తోంది. 210 00:14:28,161 --> 00:14:29,204 అంటే, నేను… 211 00:14:29,287 --> 00:14:32,457 మీరు కూడా చూడాలి అనుకుంటున్నారా? మీరు అలసిపోలేదా? 212 00:14:32,540 --> 00:14:34,918 నాకు ఎప్పటికీ అలసట రాదు. 213 00:14:35,418 --> 00:14:38,088 ఇంకా పర్వతారోహణ వల్ల నా నరాలు వదులు అవుతాయని అనుకుంటున్నా. 214 00:14:38,171 --> 00:14:41,508 తోకచుక్క అన్వేషణ యాత్రకి వెళదాం పదండి అని అంటాను. 215 00:14:42,551 --> 00:14:43,969 ఆ పని చేద్దాం పదండి! 216 00:14:44,052 --> 00:14:45,929 యాత్ర చేయడం అంటే నాకు ఇష్టం. 217 00:14:46,972 --> 00:14:49,558 ద్వీపంలో అవతలి వైపు చేరుకోవడం కోసం, 218 00:14:49,641 --> 00:14:52,644 మన హీరోలు మూడు భూభాగాలను దాటవలసి ఉంది. 219 00:14:52,727 --> 00:14:54,729 మొదటగా, వాళ్లు రాళ్ల బీచ్ ని దాటాలి. 220 00:14:55,188 --> 00:14:58,191 ఆ తరువాత వాళ్లు మెరిసే వాగుని అనుసరిస్తూ వెళ్లాలి. 221 00:15:00,068 --> 00:15:02,445 ఆ తరువాత ఎత్తయిన కొండని ఎక్కాలి. 222 00:15:03,989 --> 00:15:06,491 ద్వీపానికి అవతలి వైపున వాళ్లకి ఏం కనిపించింది? 223 00:15:13,915 --> 00:15:15,625 ఏం ఆలోచిస్తున్నావు, సర్కిల్? 224 00:15:16,126 --> 00:15:18,587 తోకచుక్క ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. 225 00:15:19,129 --> 00:15:20,422 నాకు కొన్ని ఐడియాలు ఉన్నాయి. 226 00:15:21,006 --> 00:15:23,341 నేను నీ ఐడియాలు వినడానికి ఆత్రుతగా ఉన్నాను. 227 00:15:24,050 --> 00:15:25,760 సరే, నాకు ఖచ్చితంగా తెలియదు. 228 00:15:25,844 --> 00:15:28,597 కానీ అది చాలా అందంగా ఉంటుంది అనుకుంటా. 229 00:15:32,434 --> 00:15:33,643 మనం అక్కడికి వెళ్లాక, 230 00:15:33,727 --> 00:15:35,979 మొదట్లో మనం దాన్ని చూడటం కష్టం కావచ్చు. 231 00:15:37,063 --> 00:15:39,524 ఇంకా అది చాలా లోతుగా ఉన్నా కూడా నాకు ఫర్వాలేదు. 232 00:15:40,108 --> 00:15:41,568 నీకు మెట్లు అంటే ఇష్టమే కదా. 233 00:15:42,277 --> 00:15:43,278 ట్రయాంగిల్! 234 00:15:46,323 --> 00:15:49,784 వావ్! దీన్ని చూడండి. 235 00:15:50,660 --> 00:15:52,787 ఇది ఎలా ధ్వనిస్తుందో వినాలని ఉందా? 236 00:15:52,871 --> 00:15:53,872 అవును. 237 00:16:06,051 --> 00:16:08,386 అది చాలా అందంగా ఉంది, స్క్వేర్. 238 00:16:10,972 --> 00:16:12,265 నిజంగానా? 239 00:16:12,349 --> 00:16:13,516 నేను అదే అనుకున్నాను. 240 00:16:13,600 --> 00:16:16,645 అది ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నావు, స్క్వేర్? ఆ పెద్ద క్రిస్టల్? 241 00:16:17,979 --> 00:16:20,482 నీకు తెలుసా? నేను అంత దూరం ఆలోచించలేదు. 242 00:16:20,565 --> 00:16:22,108 అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి కావాలి? 243 00:16:22,192 --> 00:16:26,947 అది ఒక తీవ్రమైన దావానలం ఎందుకు కాలేదో నాకు తెలుసుకోవాలని ఉంది. 244 00:16:31,451 --> 00:16:33,745 ఇది భగభగ మండుతోంది! 245 00:16:36,998 --> 00:16:39,000 ఆర్గన్ వాయిద్యంతో! 246 00:16:43,129 --> 00:16:44,130 ఇంకా! 247 00:16:45,173 --> 00:16:47,884 నాకు ఇంకా ఇవ్వు! 248 00:16:57,936 --> 00:17:02,482 సరే, నీ కథ ముచ్చటగా ఉంది. 249 00:17:02,566 --> 00:17:04,776 ఇంకా సినిమా మాదిరిగా ఉంది. 250 00:17:04,859 --> 00:17:05,986 ఇంకా భయంకరంగా ఉంది. 251 00:17:06,069 --> 00:17:07,070 నాకు తెలుసు. 252 00:17:08,905 --> 00:17:11,074 ఆ అగ్నిగోళం ఇక్కడికి ఎందుకు వచ్చింది, ట్రయాంగిల్? 253 00:17:11,741 --> 00:17:14,995 -ఏంటి? -నా ఉద్దేశం, ఈ ద్వీపానికే ఎందుకు వచ్చింది? 254 00:17:15,078 --> 00:17:17,330 బహుశా అది దేని కోసమో వెతుక్కుంటూ వచ్చి ఉంటుందా? 255 00:17:18,331 --> 00:17:21,083 అగ్నిగోళాలు వేటినీ ఎంపిక చేసుకోలేవు, సర్కిల్. 256 00:17:21,167 --> 00:17:24,004 అవి అలా రగులుతుంటాయి. 257 00:17:30,510 --> 00:17:31,595 హేయ్, చూడు. 258 00:17:34,347 --> 00:17:36,892 సర్కిల్, తోకచుక్క ఎలా ఉంటుందని నువ్వు ఊహిస్తున్నావు? 259 00:17:38,018 --> 00:17:40,020 సరే, మీకు చెబుతాను. 260 00:17:41,396 --> 00:17:44,065 ఒక ఒంటరి అంతరిక్షపు రాయిని ఊహించుకోండి. 261 00:17:45,066 --> 00:17:50,196 అది అంతరిక్షంలోని చల్లని శూన్యం గుండా వేగంగా, ఒంటరిగా, అన్వేషణగా ప్రయాణిస్తోంది. 262 00:17:52,032 --> 00:17:53,491 అది అన్ని చోట్లకూ వెళుతుంది. 263 00:17:56,494 --> 00:17:58,496 అది అన్నీ చూస్తుంది. 264 00:18:02,709 --> 00:18:07,214 కానీ ఆ రాయి ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది. ఏది ఏమైనా, అంతరిక్షం ఎప్పుడూ శూన్యంగానే ఉంటుంది. 265 00:18:07,297 --> 00:18:09,132 కేవలం ఒక పెద్ద, విశాలమైన శూన్యం. 266 00:18:11,009 --> 00:18:13,136 కానీ అది ఒక ప్రత్యేకమైనది ఏదో చూస్తుంది. 267 00:18:15,472 --> 00:18:18,058 ఒక చిన్న గ్రహం మీద చిన్న పచ్చని ద్వీపం, 268 00:18:18,141 --> 00:18:22,354 గుబురుగా చెట్లు, పక్షులు ఇంకా చేపలతో ఉన్నది. 269 00:18:23,813 --> 00:18:29,027 ఆ అంతరిక్షపు రాయి కొన్ని వేల సంవత్సరాల తరువాత కొద్దిగా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. 270 00:18:29,110 --> 00:18:30,862 అది ఆ గ్రహం వైపు మళ్లుతుంది. 271 00:18:30,946 --> 00:18:32,656 -ఎందుకు? -గురుత్వాకర్షణ శక్తి. 272 00:18:33,156 --> 00:18:35,283 నిజం. కానీ, అంటే, గురుత్వాకర్షణ ఎలా పని చేస్తుంది? 273 00:18:35,659 --> 00:18:38,328 హా! వాడికి చెప్పు, సర్కిల్. 274 00:18:38,411 --> 00:18:41,873 అది బలంగా లాగుతుంది. ఒక బలమైన కోరిక. 275 00:18:41,957 --> 00:18:45,669 ఆ తోకచుక్క ఆ గ్రహాన్ని చూసి ఒక బలమైన ఆకర్షణకు లోనవుతుంది. 276 00:18:49,172 --> 00:18:51,716 ఆ అంతరిక్షపు రాయి నిర్ణయించుకుంటుంది. 277 00:19:00,934 --> 00:19:03,853 ఆ తరువాత ఏంటి? నువ్వు ఇప్పుడు ఆపకూడదు! 278 00:19:04,354 --> 00:19:05,647 దాదాపుగా వచ్చేశాం! 279 00:19:06,147 --> 00:19:08,692 వాళ్లు ఎత్తయిన కొండని దాదాపుగా ఎక్కేశారు. 280 00:19:08,775 --> 00:19:10,777 అది ఆ అంచుకి అవతల ఉండచ్చు. 281 00:19:10,860 --> 00:19:12,988 ఓహ్, దేవుడా! 282 00:19:13,071 --> 00:19:15,323 ఆగు, నీ కథ ఎలా ముగుస్తుందో నువ్వు మాకు చెప్పవా? 283 00:19:15,907 --> 00:19:17,784 లేదు! మనం సిద్ధమేనా? 284 00:19:17,867 --> 00:19:19,077 -మేము రెడీ. -రెడీ. 285 00:19:24,082 --> 00:19:26,751 అయ్యో, డియర్. 286 00:19:30,630 --> 00:19:32,132 అయ్యో, సర్కిల్. 287 00:19:32,215 --> 00:19:35,677 ఆ లోయలో, అది ఒక ఖాళీ బిలం అని ఆమెకు తెలిసే ఉంటుంది. 288 00:19:35,760 --> 00:19:38,388 కానీ తను ఇంకా ఏదో ఎక్కువగా ఆశించి ఉంటుంది. 289 00:19:41,558 --> 00:19:43,476 సర్కిల్, నువ్వు బాగానే ఉన్నావా? 290 00:19:46,730 --> 00:19:48,440 హుషారుగా ఉండండి, మిత్రులారా. 291 00:19:50,275 --> 00:19:51,276 శ్రద్ధగా వినండి. 292 00:19:51,359 --> 00:19:56,489 మన తోకచుక్క అన్వేషణ యాత్ర సక్సెస్ అయిందని నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను. 293 00:19:58,199 --> 00:20:01,286 అది కేవలం పెద్ద బిలం, కదా? లేదా ఆమె ఇంకేమయినా చూస్తోందా? 294 00:20:01,870 --> 00:20:04,664 లేదు, ట్రయాంగిల్. నేను ఏమీ చూడటం లేదు. 295 00:20:04,748 --> 00:20:09,169 మన ద్వీపం అవతలి వైపున ఒక తోకచుక్క ఢీ కొని ఆవిరి అయిపోవడంతో ఏర్పడిన ఒక బిలాన్ని 296 00:20:09,252 --> 00:20:12,255 మనం కొండలు ఎక్కి వచ్చి కనుగొన్నాం. 297 00:20:12,756 --> 00:20:15,217 అదే చాలా ప్రత్యేకమైన విషయం అనుకుంటాను. 298 00:20:15,842 --> 00:20:16,968 నాకు గిటారు వాయించినంత బాగుంది. 299 00:20:22,098 --> 00:20:25,268 హేయ్, ట్రయాంగిల్. నిన్ను ఆ పైన్ చెట్టు వరకూ జరిగే పరుగు పోటీలో ఓడిస్తాను. 300 00:20:25,352 --> 00:20:27,437 లేదు, నువ్వు ఓడించలేవు! 301 00:20:30,607 --> 00:20:32,734 అవును, నేను గెలుస్తాను! అవును, గెలుస్తాను! 302 00:21:18,738 --> 00:21:19,739 "'ట్రయాంగిల్," "స్క్వేర్" అండ్ "సర్కిల్" ఆధారంగా 303 00:21:19,823 --> 00:21:20,824 మాక్ బార్నెట్ ఇంకా జాన్ క్లాసెన్ రచన 304 00:22:16,213 --> 00:22:18,215 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్