1 00:00:33,660 --> 00:00:36,663 సర్కిల్ ఇంకా ట్రయాంగిల్ కలిసి స్క్వేర్ ఇంటికి వచ్చారు 2 00:00:36,746 --> 00:00:38,331 చాలా ప్రత్యేకమైన రాత్రి జరుపుకోవడం కోసం. 3 00:00:38,415 --> 00:00:42,711 తను టూత్ బ్రష్ తీసుకురావడం మర్చిపోయాడనే విషయం ఎవ్వరూ గమనించకూడదని ట్రయాంగిల్ కోరుకుంటున్నాడు. 4 00:00:43,420 --> 00:00:44,921 నీ టూత్ బ్రష్ తేవడం మర్చిపోయావు. 5 00:00:46,381 --> 00:00:48,425 అయ్యో. అతను గమనిస్తాడు అంటావా? 6 00:00:48,508 --> 00:00:52,679 అవును, మనం ఎవరి బ్రష్ వాళ్లు తెచ్చుకోవాలని ఇన్విటేషన్ లో స్పష్టంగా రాసి ఉంది. 7 00:00:54,139 --> 00:01:00,937 హలో, ఫ్రెండ్స్, మన జీవితంలోనే ఒక గొప్ప స్లీప్ ఓవర్ పార్టీకి స్వాగతం. 8 00:01:01,438 --> 00:01:03,899 "స్క్వేర్ రాత్రి వేడుక" 9 00:01:06,610 --> 00:01:08,028 నువ్వు టూత్ బ్రష్ తేవడం మర్చిపోయావు. 10 00:01:08,111 --> 00:01:10,405 నేను ఏం అనుకున్నానంటే… 11 00:01:10,488 --> 00:01:12,324 -నేను… -భయపడకు. 12 00:01:19,164 --> 00:01:20,248 అది చక్కగా ఉంది. 13 00:01:20,332 --> 00:01:24,711 మనం వీలైనంత ఎక్కువ ఆనందం పొందడం కోసం ఈ పార్టీలో ప్రతి క్షణం ఎలా గడపాలో 14 00:01:24,794 --> 00:01:27,839 నేను కొద్ది నెలలుగా క్షుణ్ణంగా ప్లాన్ చేస్తున్నాను. 15 00:01:27,923 --> 00:01:32,135 మీరిద్దరూ చేయవలసిందల్లా అలా హాయిగా కూర్చుని నేను ఇన్నాళ్లు పడిన కష్టానికి ఫలితాన్ని ఆస్వాదించడమే. 16 00:01:32,219 --> 00:01:34,512 ఇప్పుడు, మీరు హాయిగా రిలాక్స్ అయి మీకు తోచిన విధంగా ఆనందంగా గడపండి. 17 00:01:34,596 --> 00:01:36,765 నా ఇల్లు మీ ఇల్లు. 18 00:01:36,848 --> 00:01:39,017 వావ్, అద్భుతం! థాంక్స్, స్క్వేర్. 19 00:01:40,310 --> 00:01:42,979 లేదు. ఈ వైపు! నన్ను అనుసరించండి! 20 00:01:43,480 --> 00:01:47,734 రాత్రి వేడుక కోసం ఇంట్లో వస్తువుల అమరిక గురించి స్క్వేర్ చాలా ఆలోచించాడు. 21 00:01:49,444 --> 00:01:50,654 దయచేసి, కూర్చోండి. 22 00:01:52,656 --> 00:01:55,533 ఎంత బాగా ఆలోచించాడు. టూత్ బ్రష్ పెట్టుకునే కొయ్యలు. 23 00:01:55,617 --> 00:01:58,453 వావ్, స్క్వేర్. నిన్ను నువ్వే నిజంగా మించిపోయావు. 24 00:01:58,536 --> 00:01:59,955 ఇప్పుడు మీరు ఇంక స్థిరపడ్డారు కాబట్టి, 25 00:02:00,038 --> 00:02:03,166 మన వేడుకల్లోకి దిగిపోదాం ఇంకా మన మొట్టమొదటి కార్యక్రమం ప్రారంభిద్దాం. 26 00:02:06,920 --> 00:02:08,879 అదే 200 ముక్కల పజిల్! 27 00:02:12,092 --> 00:02:13,260 అలాగే, తప్పకుండా. 28 00:02:13,343 --> 00:02:15,804 హేయ్, మనం మొదలుపెట్టడానికి ముందు నాకు ఒక గ్లాస్ నీళ్లు ఇస్తావా? 29 00:02:15,887 --> 00:02:17,222 మీ దిండు కింద ఒక సీసా ఉంది 30 00:02:17,305 --> 00:02:19,432 ఇంకా మీకు గనుక ఏమైనా తినాలనిపిస్తే ఒక గ్రానోలా బార్ కూడా ఉంది. 31 00:02:19,516 --> 00:02:21,268 ఇక, మనం ఆట మొదలుపెడదాం! 32 00:02:24,187 --> 00:02:28,024 ఇంక… పూర్తయిపోయింది. 33 00:02:31,736 --> 00:02:34,864 చక్కగా ఉంది. సరైన టైమ్ కి పూర్తయింది. సరిగ్గా నేను ప్లాన్ చేసినట్లుగానే జరిగింది. 34 00:02:36,283 --> 00:02:38,702 ఇప్పుడు, రెండో కార్యాచరణలోకి వెళదాం. 35 00:02:38,785 --> 00:02:40,453 మరొక పజిల్! 36 00:02:44,332 --> 00:02:45,333 ఇంకో పజిలా? 37 00:02:45,417 --> 00:02:46,835 ఇంకో పజిల్! 38 00:02:46,918 --> 00:02:49,754 దీనిలో వెయ్యి ముక్కలు ఉన్నాయి. 39 00:02:49,838 --> 00:02:51,381 ఇవి చాలా ముక్కలు కదా. 40 00:02:51,882 --> 00:02:52,883 సరే, కానీ… 41 00:02:53,466 --> 00:02:56,511 హేయ్, బహుశా మనం కాసేపు పజిల్ బ్రేక్ తీసుకుని 42 00:02:56,595 --> 00:03:00,015 ఇంకేదయినా చేస్తే బాగుంటుందేమో. 43 00:03:00,765 --> 00:03:03,184 చాలా ఫన్నీగా ఉంది, ట్రయాంగిల్. ఎప్పుడూ జోకులు వేస్తుంటావు. 44 00:03:03,268 --> 00:03:04,144 నేను నిజంగా అలా అనలేదు… 45 00:03:04,227 --> 00:03:07,647 వ్యూహాత్మకంగా, మనం ఈ ఆటని జాగ్రత్తగా ఆడి కిందటి పజిల్ ని ఎలా ఆడామో అలాగే ఆడదాం. 46 00:03:07,731 --> 00:03:09,149 ట్రయాంగిల్, నువ్వు కార్నర్ ముక్కలు చూసుకో. 47 00:03:09,232 --> 00:03:11,359 సర్కిల్, నువ్వు కలర్స్ ప్రకారం ముక్కల్ని ఏరు. 48 00:03:11,443 --> 00:03:14,112 నేను అంచులు చూసుకుంటాను. అంచులు కనిపెట్టడంలో నాకు గొప్ప దృష్టి ఉంది. 49 00:03:24,039 --> 00:03:26,207 మీరిద్దరూ, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అని ఎక్కువ ఆలోచించకండి. 50 00:03:26,291 --> 00:03:28,960 ముందు ఏదో ఒక చోట మొదలుపెట్టి మీ ఆలోచనలకు పదును పెట్టండి. 51 00:03:33,006 --> 00:03:35,342 పూర్తయిపోయింది. 52 00:03:35,425 --> 00:03:36,509 మొత్తానికి. 53 00:03:36,593 --> 00:03:39,679 మంచిది! నా షెడ్యూల్ కంటే ముప్పై సెకన్లు ముందే ముగించాం. 54 00:03:39,763 --> 00:03:42,557 చూడబోతే ఇద్దరు పజిల్ నిపుణులు నాకు అందుబాటులో ఉన్నారు అనుకుంటా. 55 00:03:45,602 --> 00:03:46,853 సరే, రాబోయే దాని కోసం సిద్ధంగా ఉండండి, 56 00:03:46,937 --> 00:03:50,023 ఎందుకంటే ఈ ముప్పై సెకన్ల అదనపు సమయం మన తరువాత కార్యాచరణకు అవసరం అవుతుంది. 57 00:03:50,106 --> 00:03:51,191 మీరు సిద్ధంగా ఉన్నారా? 58 00:03:51,274 --> 00:03:52,984 -ఖచ్చితంగా. -దయచేసి మొదలుపెట్టు. 59 00:03:53,068 --> 00:03:55,654 ఇప్పుడు, ఇంతకుముందు రెండు పజిల్స్ కూడా కాస్త మామూలు ఆటలని నాకు తెలుసు, 60 00:03:55,737 --> 00:03:59,115 కానీ నేను ఈ రాత్రి వేడుకని ముందు నిదానంగా మొదలుపెట్టి క్రమంగా వేడెక్కించాలని ప్లాన్ చేశాను. 61 00:03:59,199 --> 00:04:02,911 కాబట్టి, మూడో కార్యాచరణకి సిద్ధమైపోండి. 62 00:04:02,994 --> 00:04:05,789 ఇది రెండు వేల ముక్కల పజిల్! 63 00:04:06,831 --> 00:04:07,958 రెండు వేల ముక్కలా? 64 00:04:08,041 --> 00:04:09,334 ఇది చాలా చిత్రంగా ఉండబోతోంది 65 00:04:09,417 --> 00:04:11,545 ఎందుకంటే ఇది పూర్తిగా ఒకే తీరులో ఉండే దృశ్యం, 66 00:04:11,628 --> 00:04:13,922 కానీ నాకు బాగా సంతృప్తిని ఇచ్చే పజిల్స్ ఏమిటంటే 67 00:04:14,005 --> 00:04:17,716 మనం పజిల్ ముక్కల మీద దృష్టి పెట్టే అవకాశం కల్పించేవే. 68 00:04:31,481 --> 00:04:32,607 మనం మొదలుపెడదామా? 69 00:04:32,691 --> 00:04:36,361 హేయ్, స్లీప్ ఓవర్ పార్టీలలో సరదాగా ఉండే పనులు ఇంక ఏవేం ఉన్నాయో నీకు తెలుసా? 70 00:04:36,444 --> 00:04:38,905 దెయ్యం కథలు చెప్పుకోవడం. 71 00:04:39,406 --> 00:04:42,158 నీ దెయ్యం కథ ముప్పై సెకన్లలో ముగుస్తుందా? 72 00:04:42,742 --> 00:04:45,412 నాకు తెలియదు. నేను ఎప్పుడూ అవి ఎంతసేపు పడతాయో చూసుకోలేదు. 73 00:04:45,495 --> 00:04:47,163 నా ఉద్దేశం, అది ఎక్కువసేపు పట్టదు. 74 00:04:47,247 --> 00:04:49,165 నేను ఖచ్చితంగా త్వరగా చెప్పేయగలను. 75 00:04:49,249 --> 00:04:51,209 నా ఉద్దేశం, నన్ను నమ్ము, అది నీకు నచ్చుతుంది. 76 00:04:51,293 --> 00:04:52,961 ముఖ్యంగా ఎప్పుడంటే… 77 00:04:53,795 --> 00:04:55,964 నిన్ను ఇక్కడే ఆపాలి అనుకుంటున్నా, ఫ్రెండ్. 78 00:04:56,047 --> 00:04:59,259 నీ ముప్పై సెకన్ల టైమ్ అయిపోయింది. ఇంక దాని సంగతి వదిలేయ్. 79 00:05:01,219 --> 00:05:04,806 వాస్తవంగా, ఇప్పుడు మనం కొద్దిగా వెనుకపడ్డాం. మన తరువాత పజిల్ లోకి వెళదాం. 80 00:05:04,890 --> 00:05:06,933 ఇలా చూడు, నువ్వు నాకు కనీసం ఒక ఛాన్సు కూడా ఇవ్వలేదు. 81 00:05:07,017 --> 00:05:09,811 సరే, మీ ఇంట్లో స్లీప్ ఓవర్ పార్టీ చేసుకున్నప్పుడు, 82 00:05:09,895 --> 00:05:13,064 నీ దెయ్యం కథల్ని సంతోషంగా వింటాను, సరేనా, సర్కిల్? 83 00:05:13,148 --> 00:05:18,862 అంటే, నిజం చెప్పాలంటే నాకు దెయ్యం కథ వినాలని ఉంది. 84 00:05:22,449 --> 00:05:24,659 సరే. తప్పకుండా. 85 00:05:24,743 --> 00:05:27,078 సరే, నేను కొద్దిగా సృజనాత్మకంగా ఆలోచించానంటే, 86 00:05:27,162 --> 00:05:30,749 నేను కొన్ని అధికారిక కార్యక్రమాల్ని కాస్త వెనక్కి జరపగలను 87 00:05:30,832 --> 00:05:32,667 ఇంకా నీ కథని ఇరికించగలను. 88 00:05:32,751 --> 00:05:35,921 "షెడ్యూలులో లేని దెయ్యం కథ." 89 00:05:36,004 --> 00:05:38,215 ఇదిగో చూడండి. ఇప్పుడు అది షెడ్యూల్ అయింది. 90 00:05:38,298 --> 00:05:42,052 సరే, ట్రయాంగిల్, నువ్వు ఇప్పుడు నీ దెయ్యం కథని చెప్పడం మొదలుపెట్టచ్చు. 91 00:05:42,969 --> 00:05:46,348 ఆ రాత్రి వాళ్లందరికీ ఒకే ఒక్కటి కనిపించింది ఏంటంటే 92 00:05:46,932 --> 00:05:52,771 సరిగ్గా ఇలాగే కనిపించే ఒక పళ్లెం! 93 00:05:53,647 --> 00:05:55,649 ఇప్పుడు, ఇదీ చక్కగా కథ చెప్పడం అంటే. 94 00:05:57,651 --> 00:05:59,069 భయం పుట్టించింది. 95 00:05:59,152 --> 00:06:00,612 మంచి కథ, ట్రయాంగిల్. 96 00:06:00,695 --> 00:06:04,616 సరే, బాగుంది. దానికి కొద్దిగా ఎక్కువ టైమ్ పట్టింది, కానీ మనం ఈ పజిల్ మీద రెండింతలు వేగంగా పనిచేస్తే 97 00:06:04,699 --> 00:06:06,534 మనం మళ్లీ షెడ్యూల్ మించకుండా ఉండచ్చు. 98 00:06:06,618 --> 00:06:08,119 కష్టం, కానీ సాధ్యమే. 99 00:06:08,203 --> 00:06:11,289 -ఆగు. నేను ఒక విషయం చెప్పాలి. -అది ఏంటి? 100 00:06:11,373 --> 00:06:13,416 ఒక దెయ్యం కథ. 101 00:06:14,709 --> 00:06:16,628 సరే, ఇప్పుడు ఏం జరుగుతోంది? 102 00:06:16,711 --> 00:06:20,340 సరే, ఏంటి, మీరిద్దరూ ఈ చివరి పజిల్ ని దాటవేయాలి అనుకుంటున్నారా? 103 00:06:22,259 --> 00:06:23,677 సరే. అలాగే, మరేం ఫర్వాలేదు. 104 00:06:30,225 --> 00:06:33,186 సరే. ఇది ఒక గ్రూప్ గురించిన కథ… 105 00:06:40,443 --> 00:06:42,279 సరే, ఈ అడ్డం తీసేయనివ్వు. 106 00:06:42,362 --> 00:06:45,532 చాలా గొప్ప సవాలు చేస్తూ ఇంకా అద్భుతమైన రివార్డులు అందించే ఈ పజిల్ 107 00:06:45,615 --> 00:06:48,159 నువ్వు కథ చెబుతున్నప్పుడు నీ దృష్టిని మళ్లించడం నాకు ఇష్టం లేదు. 108 00:06:52,038 --> 00:06:53,832 అంతా సర్దేశాను. నువ్వు కొనసాగించు. 109 00:06:53,915 --> 00:06:54,916 సరే. 110 00:06:55,417 --> 00:07:00,714 ఈ కథ అర్ధరాత్రి వేళ స్లీప్ ఓవర్ పార్టీ చేసుకునే ఒక స్నేహితుల బృందానికి సంబంధించినది. 111 00:07:02,591 --> 00:07:05,343 మీరు గనుక అర్ధరాత్రి వేళ మెలకువగా ఉంటే, 112 00:07:05,427 --> 00:07:10,098 కిటికీ మీద ఆ దెయ్యం టప్, టప్, టప్ అని కొడుతుండటం వినవచ్చు అని పెద్దలు చెబుతారు. 113 00:07:10,181 --> 00:07:11,725 ఆగు! అది ఏంటి? 114 00:07:12,601 --> 00:07:13,768 మీకు ఏదైనా శబ్దం వినిపించిందా? 115 00:07:13,852 --> 00:07:15,395 నాతో ఆటలాడకు, సర్కిల్. 116 00:07:15,896 --> 00:07:17,397 సరే, ఇది మంచి కథ. 117 00:07:17,480 --> 00:07:19,441 ఇప్పుడు, మనం కోల్పోయిన సమయాన్ని తిరిగి అందుకోవాలి. 118 00:07:19,524 --> 00:07:22,277 నేను వెళ్లి ఆ లెమన్ బార్స్ తెస్తాను ఇంకా నాలుగో కార్యాచరణకు ఏర్పాటు చేస్తాను. 119 00:07:22,360 --> 00:07:24,154 -లైట్లు ఆన్ చేయి. -ఆగు! 120 00:07:24,237 --> 00:07:27,657 మొదట నువ్వు ఆ కిటికీ దగ్గర చూడాలి, స్క్వేర్. నేను ఆ దెయ్యం గాడి శబ్దం నిజంగా విన్నాను. 121 00:07:28,158 --> 00:07:29,826 ఆపు. అది కేవలం ఒక కథ. 122 00:07:30,660 --> 00:07:31,912 అవునా? 123 00:07:37,167 --> 00:07:38,168 లేదు. ఏమీ లేదు. 124 00:07:38,251 --> 00:07:39,628 సరే, లెమన్ బార్ మీద… 125 00:07:41,463 --> 00:07:42,464 ట్రయాంగిల్! 126 00:07:44,925 --> 00:07:46,885 -హేయ్, సర్కిల్, నువ్వు… -ఇలా చూడు, స్క్వేర్. 127 00:07:46,968 --> 00:07:49,554 ట్రయాంగిల్ నిన్ను భయపెట్టాడని ఒప్పుకోవాలి. 128 00:07:51,598 --> 00:07:54,517 అవును. సరే నన్ను భయపెట్టావు. 129 00:07:55,727 --> 00:07:57,479 నేను ఊరికే నవ్వులాటకి చేశాను. సారీ. 130 00:07:57,562 --> 00:07:58,980 మనం సరదాగా గడుపుతున్నాం. 131 00:07:59,064 --> 00:08:02,734 నువ్వు షెడ్యూలు చేసుకున్న పనులని మనం మళ్లీ మొదలుపెడదాం. 132 00:08:03,401 --> 00:08:05,695 అవును, తప్పకుండా. మంచి ప్రయత్నం, ట్రయాంగిల్. 133 00:08:06,238 --> 00:08:09,115 ఏది ఏమైనా, మన షెడ్యూలులోకి తిరిగి వెళితే… 134 00:08:09,199 --> 00:08:10,575 దెయ్యం కథల కారణంగా, 135 00:08:10,659 --> 00:08:14,788 అన్ని ఆటలు ఆడాలంటే మనం కొన్నింటిని రెండింతలు వేగంతో పూర్తి చేయాలి, 136 00:08:14,871 --> 00:08:18,625 కానీ మీరిద్దరూ ఇంకా గొప్పగా గడపబోతున్నారు! 137 00:09:02,836 --> 00:09:03,962 సరే, పక్కాగా ఉంది. 138 00:09:05,547 --> 00:09:07,132 అది తీసుకెళ్లాలి… ఇంకా అది ఎలా ఉందంటే… 139 00:09:08,341 --> 00:09:09,926 గొప్పగా ఉంది. నాకు స్పష్టంగా కనిపిస్తోంది. 140 00:09:12,095 --> 00:09:14,180 సరే. 141 00:09:20,020 --> 00:09:23,148 సరే, ఇప్పుడు ఆ పని చేయడానికి మనకి టైమ్ లేదు. లేదా దాని కోసం. లేదా… 142 00:09:23,648 --> 00:09:25,692 ఒక విషయం తెలుసా? బుట్టల అల్లికని పక్కన పెడదాం. 143 00:09:25,775 --> 00:09:30,739 హేయ్, మనం దిండ్ల కోట కడితే ఎలా ఉంటుంది? దాంట్లోనే మనం రాత్రంతా నిద్రపోవచ్చు. 144 00:09:30,822 --> 00:09:32,908 అలాగే, అది వినడానికి బాగుంది. 145 00:09:32,991 --> 00:09:35,660 లేదు, సర్కిల్, దిండ్ల కోట కట్టడానికి మనకి సమయం లేదు. 146 00:09:35,744 --> 00:09:38,163 మనం ఇప్పటికే ప్లాన్ చేసుకున్న పనుల్ని కొన్ని వదులుకోవాల్సి వచ్చింది, 147 00:09:38,246 --> 00:09:40,123 కాబట్టి మనం నిద్రపోవడానికి ముందు 148 00:09:40,206 --> 00:09:42,500 చిన్న అలంకరణ బుట్టలు అల్లకుండా ఉండే ప్రసక్తే లేదు. 149 00:09:43,084 --> 00:09:44,836 ఇలా చూడు. దాని గురించి ఆందోళన పడకు. 150 00:09:44,920 --> 00:09:47,589 మనం ఇప్పుడు మిస్ అయ్యే పనుల్ని మళ్లీ వచ్చేసారి చేయచ్చు. 151 00:09:48,298 --> 00:09:52,219 మళ్లీసారా? మీరు ఇందాక వినలేదేమో, నేను ఈ పార్టీ కోసం కొద్ది నెలలుగా ప్లాన్ చేస్తూ వచ్చాను. 152 00:09:52,302 --> 00:09:55,931 నేను ఒక బుట్టెడు నార పీచు తీసుకొస్తాను. మీరు ఇద్దరూ ఇక్కడే ఉండండి! 153 00:09:58,642 --> 00:09:59,643 సరే. 154 00:10:22,916 --> 00:10:27,629 స్క్వేర్, నువ్వు దేని గురించి చిరాకు పడుతున్నావు? 155 00:10:27,712 --> 00:10:29,923 ఇది నా స్లీప్ ఓవర్ పార్టీ. 156 00:10:30,006 --> 00:10:31,550 ఇది నా ఇల్లు. 157 00:10:31,633 --> 00:10:35,554 నేను ఎంతో కాలంగా, ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను. 158 00:10:36,513 --> 00:10:38,139 ఆ తరువాత మీరు ఇద్దరూ వచ్చారు, 159 00:10:38,223 --> 00:10:40,517 కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీకు నచ్చిందే చేస్తున్నారు. 160 00:10:40,600 --> 00:10:42,269 మేము నీ అతిథులం. 161 00:10:42,352 --> 00:10:44,354 మీరు నా అతిథులని నాకు తెలుసు! 162 00:10:44,437 --> 00:10:49,276 అందుకే నేను మీ కోసం ఈ సరదా ఆటలు షెడ్యూల్ చేశాను! 163 00:10:49,359 --> 00:10:53,363 కానీ మాకు వేరే ఆటలు కావాలి. ఇదంతా నీ గురించి కాదు, స్క్వేర్. 164 00:10:57,701 --> 00:10:58,743 స్క్వేర్. 165 00:11:07,127 --> 00:11:10,297 మేం అందరం కలిసి ఒక చిరస్మరణీయమైన స్లీప్ ఓవర్ పార్టీ చేసుకోవాలని కోరుకున్నాను, 166 00:11:12,007 --> 00:11:15,218 కానీ నా సరదా ఆటలు వాళ్ల ఆటలకి తేడాగా ఉన్నాయి. 167 00:11:17,637 --> 00:11:19,055 నాకు కొద్దిగా బాధగా అనిపిస్తోంది. 168 00:11:19,723 --> 00:11:20,932 అవును. 169 00:11:21,016 --> 00:11:23,184 కానీ నాకు నిజంగా ఆ పజిల్ చేయాలని లేదు. 170 00:11:24,102 --> 00:11:25,103 అవును. 171 00:11:25,770 --> 00:11:27,939 ఓహ్, స్క్వేర్. 172 00:11:28,023 --> 00:11:30,358 నేను… మేము కేవలం… 173 00:11:36,364 --> 00:11:38,533 షెడ్యూలులో లేని దిండ్ల కొట్లాట! 174 00:11:39,284 --> 00:11:40,285 ఇంక మరి, 175 00:11:40,368 --> 00:11:44,205 స్క్వేర్ స్లీప్ ఓవర్ పార్టీ అతను ప్లాన్ చేసిన దానికన్నా బాగా జరిగింది. 176 00:11:48,293 --> 00:11:51,046 మంచి దిండ్లు, బుజ్జీ. 177 00:11:51,129 --> 00:11:52,756 గుడ్ నైట్, షేప్స్. 178 00:12:08,396 --> 00:12:12,525 రాత్రంతా సుదీర్ఘంగా పువ్వులు ఇంకా కాయగూరల గురించి కలలు కన్నాక 179 00:12:12,609 --> 00:12:15,237 సర్కిల్ తన ఉదయం సమయం అంతా వాటి సంరక్షణకు కేటాయిస్తుంది. 180 00:12:16,655 --> 00:12:17,989 నీకు ఖచ్చితంగా దాహం వేస్తోంది. 181 00:12:22,118 --> 00:12:24,454 కంగారు పడకు. నిన్ను నేను మర్చిపోలేదు. 182 00:12:26,331 --> 00:12:29,376 నాకు దీని గురించి ఖచ్చితంగా తెలియదు, కానీ… 183 00:12:29,459 --> 00:12:31,002 నీకు కూడా కొద్దిగా కావాలా? 184 00:12:31,086 --> 00:12:34,089 టమాటోలు ఎక్కువ నీరుని కోరుకుంటున్నాయి. 185 00:12:38,218 --> 00:12:39,803 నీకు కొద్దిగా నీరు అందుతుందిలే. 186 00:12:40,595 --> 00:12:43,557 ట్రయాంగిల్ గనుక ఎవరైనా మాట్లాడుతుండగా విన్నాడంటే, 187 00:12:43,640 --> 00:12:46,810 అతను కూడా మాటలు కలపడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాడు. 188 00:12:47,561 --> 00:12:49,229 టమాటోలకి నీళ్లు పోస్తున్నావా? 189 00:12:49,312 --> 00:12:50,355 నీళ్లు పోస్తున్నాను. 190 00:12:51,481 --> 00:12:52,983 చాలా బాగుంది. 191 00:12:55,777 --> 00:12:57,112 నేను గారడీ చేస్తాను చూస్తావా? 192 00:12:57,195 --> 00:12:58,280 నువ్వు గారడీ చేయగలవా? 193 00:12:58,363 --> 00:13:00,615 అవును, తప్పకుండా చేస్తాను. కొన్ని టమాటోలు ఇస్తావా? 194 00:13:02,117 --> 00:13:03,118 అలాగే. 195 00:13:10,458 --> 00:13:11,710 ఇది భలే బాగుంది. 196 00:13:13,128 --> 00:13:14,129 అవును. 197 00:13:21,094 --> 00:13:22,220 హాయ్, సర్కిల్. 198 00:13:22,304 --> 00:13:23,305 తిరిగి హాయ్. 199 00:13:29,019 --> 00:13:30,103 నువ్వు బాగానే ఉన్నావా? 200 00:13:30,604 --> 00:13:32,397 ఓహ్, అవును. సారీ. నేను బాగానే ఉన్నాను. 201 00:13:34,316 --> 00:13:35,317 సరే. 202 00:13:35,817 --> 00:13:37,694 కూరగాయల తోటని ఎలా పెంచాలో నాకు నేర్పుతావా? 203 00:13:38,945 --> 00:13:40,697 నువ్వు తోట పెంచాలని అనుకుంటున్నావా? 204 00:13:40,780 --> 00:13:43,742 నీ తోట నిండా జీవం ఉంది. ఆ టమాటోలు, లెట్యూస్, కీరాలు. 205 00:13:43,825 --> 00:13:46,328 నీ తోట అంత అందంగా నాది ఉండదని తెలుసు ఇంకా నేను గందరగోళం కూడా చేసేస్తాను, 206 00:13:46,411 --> 00:13:48,663 కానీ నేను దీని గురించి ఆలోచిస్తున్నాను, ఇంకా నాకు నిజంగా… 207 00:13:48,747 --> 00:13:50,415 నీకు టీచర్ గా ఉండటం నాకు ఇష్టమే. 208 00:13:50,498 --> 00:13:52,375 -నిజంగానా? -అవును. 209 00:13:52,459 --> 00:13:55,503 ఇప్పుడు, గుర్తుంచుకో. నేను కొన్ని సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాను. 210 00:13:55,587 --> 00:13:57,923 నువ్వు సరిగ్గా చేయాలంటే కొంత కాలం పడుతుంది. 211 00:13:58,006 --> 00:14:00,425 అవును. నాకు పూర్తిగా అర్థం అయింది. అవును. 212 00:14:00,508 --> 00:14:03,511 నేను సరుకులు తీసుకోవాలి. నాకు ఏం పెంచాలో కూడా తెలియదు. 213 00:14:05,055 --> 00:14:08,350 ఇది మన ఇద్దరికీ మంచి అనుభవం అవుతుంది అనుకుంటా. 214 00:14:08,850 --> 00:14:10,727 "నొప్పుల పెంపకం." 215 00:14:12,520 --> 00:14:15,565 స్క్వేర్ ఏం నమ్మాడంటే తోట అనేది మట్టిలో పెరుగుతుంది కాబట్టి 216 00:14:15,649 --> 00:14:17,776 అది పద్ధతిగా ఉండదని అనుకోవలసిన అవసరం లేదు. 217 00:14:19,110 --> 00:14:20,779 ఈ రోజు ఉదయం బిజీగా ఉన్నావు అనుకుంటా. 218 00:14:20,862 --> 00:14:24,699 ఓహ్, దేవుడా, నేను చాలా ఎక్కువ వస్తువులు తెచ్చేశానా? నేను ముందుగానే చెక్ చేసుకోవలసింది. 219 00:14:24,783 --> 00:14:27,202 అది మంచిదే. మనకి ఇవన్నీ అవసరం అవుతాయి. 220 00:14:27,285 --> 00:14:28,745 సరే. మంచిది. 221 00:14:29,788 --> 00:14:30,997 నాకు నేర్పించు. 222 00:14:31,081 --> 00:14:35,252 సరే, మనం తోటని పెంచాలంటే, మొక్కలు పెంచడానికి అవసరమైనది మనం తేవాలి. 223 00:14:35,335 --> 00:14:36,878 ముందుగా కొద్దిగా మట్టి ఇందులోకి వేయి. 224 00:14:36,962 --> 00:14:39,965 "కొద్దిగా మట్టి వేయాలి." 225 00:14:40,549 --> 00:14:41,508 ఎంత? 226 00:14:42,384 --> 00:14:45,387 నాకు తెలియదు. బహుశా అర బస్తా? 227 00:14:45,470 --> 00:14:49,391 "అర బస్తా." 228 00:15:08,910 --> 00:15:11,663 ఇంక… అయిపోయింది. 229 00:15:11,746 --> 00:15:14,416 నాకు అనిపిస్తోంది. బహుశా నేను మళ్లీ కొలవాలేమో. 230 00:15:14,499 --> 00:15:16,376 లేదు. నువ్వు బాగానే కొలిచావు. 231 00:15:18,879 --> 00:15:21,506 తోటల పెంపకం అనేది సైన్సు కన్నా ఎక్కువగా ఒక కళ లాంటిది. 232 00:15:21,590 --> 00:15:23,633 సరే. తరువాత ఏంటి, టీచర్? 233 00:15:46,948 --> 00:15:49,117 తోటల పెంపకం ప్రారంభించడం అనేది చాలా ఎక్కువ పని. 234 00:15:49,200 --> 00:15:52,704 అది అంత తేలిక కాదు అని నీకు చెప్పాను. కానీ నువ్వు బాగానే చేశావు. 235 00:15:52,787 --> 00:15:55,916 ఇది ఎలా తయారవుతుందా అనిపిస్తోంది. నా తోటలో ఎక్కువ కీరాలు పండుతాయా? 236 00:15:55,999 --> 00:15:58,627 గుర్తుంచుకో, ఇది నీ మొదటి ప్రయత్నం. 237 00:15:58,710 --> 00:16:00,879 మరీ ఎక్కువగా ఆశలు పెంచుకోకు. 238 00:16:00,962 --> 00:16:02,005 అందులో అర్థం ఉంది. 239 00:16:02,505 --> 00:16:03,506 అది ఏదైనా మొలకా? 240 00:16:05,258 --> 00:16:09,054 మనం ఏదైనా చూడాలంటే కనీసం కొన్ని గంటలు పడుతుంది. 241 00:16:09,137 --> 00:16:12,349 నీరు ఇంకా సూర్యరశ్మి, మర్చిపోవద్దు, సరేనా? 242 00:16:12,432 --> 00:16:15,477 నీ నోట్స్ చూసుకుంటూ ఉండు, ఇంకా నేను కొద్ది రోజుల తరువాత వచ్చి చూస్తాను. 243 00:16:20,065 --> 00:16:24,653 సర్కిల్ కొద్ది రోజులు వేచి చూశాక తన ఔత్సాహిక విద్యార్థి ఏం చేస్తున్నాడో చూడటానికి వెళ్లింది. 244 00:16:27,322 --> 00:16:29,783 హాయ్, ఎలా ఉన్నావ్. ఇదే నీ మొదటి తనిఖీ కదా. 245 00:16:29,866 --> 00:16:32,661 ఓహ్, లేదు. ఇది ఏమైనా పరీక్షా? నాకు ఏమైనా గ్రేడ్లు ఇస్తావా? 246 00:16:32,744 --> 00:16:35,497 లేదు. నువ్వు తోట ఎలా పెంచావో ఊరికే చూడటానికి వచ్చాను. 247 00:16:36,039 --> 00:16:38,667 వావ్. నేను ఊహించిన దాని కన్నా నువ్వు ముందంజలో ఉన్నావు. 248 00:16:38,750 --> 00:16:41,211 సరే, అది అద్భుతంగా ఉంది. నేను కొద్దిగా ఆందోళన పడ్డాను. 249 00:16:41,294 --> 00:16:44,464 నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అనుకుని, అందుకే కొన్ని మెళకువల్ని చదివి నేర్చుకున్నా. 250 00:16:45,632 --> 00:16:48,969 సరే, ఆ మెళకువలు నాకు కూడా తెలిసే ఉంటాయి. 251 00:16:49,678 --> 00:16:50,887 నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. 252 00:16:52,305 --> 00:16:55,308 నీ పుచ్చకాయలకి కొద్దిగా ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం ఉందనుకుంటా. 253 00:16:55,392 --> 00:16:57,644 నీకు తెలుసా, వాటికి ఏ కారణం లేకుండా వాటర్ మెలన్స్ అనే పేరు రాలేదు. 254 00:16:57,727 --> 00:17:00,647 నిజంగానా? వాటిని అందుకే అలా పిలుస్తారా? 255 00:17:00,730 --> 00:17:03,650 లేదు, నేను కేవలం జోక్ చేశానంతే. 256 00:17:04,693 --> 00:17:10,407 అయితే వీటిని 'కారెట్స్' అని అంటారు ఎందుకంటే మనం వాటి గురించి 'కేర్' తీసుకోవాలి కాబట్టి. 257 00:17:24,212 --> 00:17:25,671 హలో, స్క్వేర్. 258 00:17:25,755 --> 00:17:29,175 హాయ్, సర్కిల్. నా తోట బాగా పెరుగుతోంది అనుకుంటా. 259 00:17:29,259 --> 00:17:31,344 నా మెలన్ పాదులు ఎంత పచ్చగా ఉన్నాయో చూడు. 260 00:17:32,470 --> 00:17:34,389 అవి నిజంగా చాలా పచ్చగా ఉన్నాయి. 261 00:17:34,472 --> 00:17:37,684 సర్కిల్ తోటలో కన్నా పచ్చగా ఉన్నాయా? అది ఎవరు చెప్పాలి? 262 00:17:38,226 --> 00:17:40,812 నేను చెబుతాను. అవి ఖచ్చితంగా చాలా పచ్చగా ఉన్నాయి. 263 00:17:40,896 --> 00:17:42,689 సర్కిల్ కూడా దీనిని గమనించింది. 264 00:17:42,772 --> 00:17:45,775 అవును, అవి నిజంగా పచ్చగా ఉన్నాయి. 265 00:17:46,359 --> 00:17:47,944 నువ్వు గొడుగులు ఏర్పాటు చేస్తున్నావా? 266 00:17:48,028 --> 00:17:49,988 కొద్ది రోజులుగా వాతావరణం వేడిగా ఉంటోంది. 267 00:17:50,071 --> 00:17:52,574 ఎక్కువ సూర్యరశ్మి మొక్కల్ని పాడు చేయచ్చు, కానీ నీకు ఎందుకు చెప్తున్నాను? 268 00:17:52,657 --> 00:17:54,242 నువ్వు ఇప్పటికే ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఉంటావు. 269 00:17:55,702 --> 00:17:56,703 అవును. 270 00:17:56,786 --> 00:18:01,166 నేను నిజానికి, నీకు తెలుసా, నువ్వు ఈ పని చేశావా లేదా అని చూడటానికి వచ్చాను. 271 00:18:01,249 --> 00:18:02,459 నువ్వు పాస్ అయ్యావు. 272 00:18:02,542 --> 00:18:07,047 కానీ, నేను కొంత మ్యాజిక్ వస్తువులు తీసుకోవడానికి వెళ్లాలి. 273 00:18:07,130 --> 00:18:08,465 ఇలాగే బాగా పని చేస్తూ ఉండు. 274 00:18:08,548 --> 00:18:09,549 సరే, బై. 275 00:18:15,680 --> 00:18:17,557 స్క్వేర్ తోట బాగుంది, 276 00:18:17,641 --> 00:18:20,310 కానీ బహుశా నేను అతనికి చాలా ఎక్కువ సాయపడుతున్నానేమో. 277 00:18:20,393 --> 00:18:22,562 కానీ ఒకసారి నా తోట మీద నేను కాస్త శ్రద్ధ పెట్టానంటే, 278 00:18:22,646 --> 00:18:24,814 ఈ ద్వీపంలోనే చక్కని కూరగాయల్ని నేనే పండించిన దాన్ని అవుతాను. 279 00:18:24,898 --> 00:18:26,775 ఖచ్చితంగా స్క్వేర్ కూరగాయల కన్నా బాగుంటాయి. 280 00:18:27,943 --> 00:18:30,070 కానీ నిజానికి, అది ముఖ్యం కాదు. 281 00:18:31,363 --> 00:18:35,492 సర్కిల్ తన తోట కోసం ఎప్పుడూ లేనంతగా కష్టపడింది. 282 00:18:40,830 --> 00:18:42,040 ఇది ఏంటి? 283 00:18:42,707 --> 00:18:45,544 బహుశా నేను ఇంతవరకూ పండించిన క్యారెట్లలో ఇదే బెస్ట్ ది కావచ్చు. 284 00:18:45,627 --> 00:18:47,003 దీన్ని స్క్వేర్ కి చూపించాలి. 285 00:18:47,712 --> 00:18:49,714 అతడికి స్ఫూర్తి ఇవ్వాలి. 286 00:18:49,798 --> 00:18:53,093 అవును, అందుకే. స్ఫూర్తి కోసం. 287 00:18:56,638 --> 00:19:01,685 హాయ్, స్క్వేర్. నేను ఈ దారిన వెళుతూ నీకు ఇది చూపించాలని ఆగాను… 288 00:19:07,566 --> 00:19:10,569 సర్కిల్, హాయ్! మొత్తానికి నేను కూరగాయల్ని పండించగలుగుతున్నాను. 289 00:19:10,652 --> 00:19:12,070 నా తోట ఎలా ఉందని అనుకుంటున్నావు? 290 00:19:12,153 --> 00:19:15,574 ఇది… ఇది బాగుంది. 291 00:19:16,074 --> 00:19:17,617 ఇది నీ తోట కన్నా బాగుంది. 292 00:19:19,494 --> 00:19:20,704 దాని గురించి నాకు తెలియదు. 293 00:19:24,165 --> 00:19:25,667 ఇవి ఖచ్చితంగా ఎక్కువ జ్యూసీగా ఉన్నాయి. 294 00:19:28,837 --> 00:19:30,672 బాగా జ్యూసీగా ఉన్నాయి! 295 00:19:32,382 --> 00:19:35,927 చూడబోతే మన ద్వీపంలో ఒక మాస్టర్ తోటమాలి ఉన్నాడనిపిస్తోంది, హా? 296 00:19:36,011 --> 00:19:37,804 అది కొద్దిగా ఎక్కువ ప్రశంస. నాకు తెలియదు. 297 00:19:37,888 --> 00:19:39,764 ఇది బాగుంది. నేను… 298 00:19:41,266 --> 00:19:42,684 ఇది బాగుంది. 299 00:19:42,767 --> 00:19:44,561 నువ్వు మంచి తోటని పెంచావు. 300 00:19:44,644 --> 00:19:48,690 కానీ నేను బహుశా నా తోటకి తిరిగి వెళ్లాలి. 301 00:19:56,031 --> 00:19:59,659 మొదటి ప్రయత్నంలోనే అతను తన తోటని బాగా పెంచాడు. 302 00:20:02,454 --> 00:20:04,539 నువ్వు కూడా అతని తోటనే ఎంచుకున్నావా? 303 00:20:06,499 --> 00:20:08,627 నా ఉద్దేశం, అది మంచి తోట. అవును కదా? 304 00:20:08,710 --> 00:20:11,213 అవును, నేను ఒప్పుకుంటాను. అతను బాగా చేశాడు, సరేనా? 305 00:20:11,296 --> 00:20:14,758 కానీ కొన్నిసార్లు ఎవరికైనా మొదటి ప్రయత్నంలోనే అదృష్టం కలిసి వస్తుంది, 306 00:20:14,841 --> 00:20:17,260 కానీ దాని ఉద్దేశం అతను నాకన్నా బాగా చేయగలడని కాదు. 307 00:20:18,303 --> 00:20:22,182 అతను నా స్నేహితుడు. అతని తోట బాగున్నందుకు నాకు సంతోషంగా ఉంది. 308 00:20:22,265 --> 00:20:23,850 అది చాలా చక్కగా ఉంది. 309 00:20:24,351 --> 00:20:27,562 అతను విజయం సాధించాలని కోరుకోకపోతే నేను మంచి ఫ్రెండ్ ని ఎందుకు అవుతాను? 310 00:20:41,284 --> 00:20:42,285 ఇంకా బాగా పండాలి! 311 00:20:44,037 --> 00:20:45,538 నీకు ఒక విషయం తెలుసా? బహుశా… 312 00:20:45,622 --> 00:20:49,125 మన ద్వీపంలో ఒక కొత్త మాస్టర్ తోటమాలి ఉన్నాడనుకుంటా. 313 00:20:49,209 --> 00:20:51,044 అసలు నేను ఎందుకు ప్రయత్నించాలి? 314 00:20:57,467 --> 00:20:59,594 హేయ్, ఏం చేస్తున్నావు? 315 00:20:59,678 --> 00:21:01,638 బహుశా, ఆశ వదులుకుంటున్నానేమో? 316 00:21:02,264 --> 00:21:03,557 నాకు తెలియదు. 317 00:21:04,266 --> 00:21:08,270 సరే, నాకు కొన్ని టమాటోలు ఇస్తావా? నా గారడీ ప్రాక్టీసు కోసం? 318 00:21:09,187 --> 00:21:10,188 అవి తీసుకో. 319 00:21:15,986 --> 00:21:16,987 సరే. 320 00:21:17,070 --> 00:21:20,407 -గారడీ చేస్తూ నువ్వు ఎప్పుడైనా ఏదైనా పట్టుకున్నావా? -లేదు. లేదు. 321 00:21:20,490 --> 00:21:22,158 నువ్వు ఎంతకాలంగా ఇది చేస్తున్నావు? 322 00:21:22,659 --> 00:21:23,785 కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నా. 323 00:21:23,868 --> 00:21:27,122 కొన్ని సంవత్సరాలుగానా? కానీ నువ్వు ఏదీ పట్టుకోలేకపోతున్నావు. 324 00:21:27,205 --> 00:21:28,999 కనీసం ఒక్కటి కూడా. చూడు. 325 00:21:32,294 --> 00:21:33,712 హేయ్, నువ్వు చాలా బాగా చేశావు. 326 00:21:33,795 --> 00:21:36,256 కానీ ఎంత బాగా చేస్తాను అనే దాని గురించి పెద్దగా పట్టించుకోను. 327 00:21:40,302 --> 00:21:42,178 మరి, ఎందుకు చేస్తున్నావు? 328 00:21:42,679 --> 00:21:44,848 ఎందుకు చేస్తానంటే అది నాకు ఇష్టం కాబట్టి. నాకు సరదా. 329 00:21:46,433 --> 00:21:47,601 సరే, ఇది చూడండి. 330 00:21:47,684 --> 00:21:51,688 అప్పుడప్పుడు ట్రయాంగిల్ కూడా తనకు తెలియకుండానే కొన్ని మంచి మాటలు చెబుతుంటాడు. 331 00:21:51,771 --> 00:21:56,985 ఇప్పుడు, దీని గురించి ఆలోచిస్తుంటే, ఇందులో ఒక పాఠం ఉంది అనిపిస్తోంది, సర్కిల్. 332 00:21:57,569 --> 00:21:58,653 ఏంటి? 333 00:21:58,737 --> 00:22:02,240 నువ్వు తోటలు పెంచడం మానేసి గారడీ చేయడం మొదలుపెట్టాలి! 334 00:22:02,324 --> 00:22:05,660 ఒక రకంగా ఇది ఎక్కువ సరదాగా ఉంటుంది ఎందుకంటే టమాటోలు గనుక నేల మీద పడినప్పుడు 335 00:22:05,744 --> 00:22:07,078 విచిత్రమైన చిమ్మిన శబ్దం చేస్తాయి. 336 00:22:07,162 --> 00:22:10,582 అవును, నేను మాట్లాడుతున్నది ఈ తెలివి గురించి కాదు. 337 00:22:10,665 --> 00:22:11,958 సరే, తరువాత కలుస్తాను. 338 00:22:22,969 --> 00:22:24,387 హేయ్, స్క్వేర్. 339 00:22:24,971 --> 00:22:27,057 హాయ్, సర్కిల్. అంతా బాగానే ఉందా? 340 00:22:27,557 --> 00:22:30,227 అవును, ఇప్పటికి అంతా బాగానే ఉంది. 341 00:22:31,061 --> 00:22:34,606 కానీ, నా కీరాలు ఈ ఏడాది బాగా పండలేదు. 342 00:22:35,106 --> 00:22:36,358 ఇది వినడానికి బాధగా ఉంది. 343 00:22:36,441 --> 00:22:39,277 కానీ నా లెట్యూస్ నిజానికి చాలా బాగా పండింది. 344 00:22:41,863 --> 00:22:43,323 అవి నిజంగానే బాగా పండాయి. 345 00:22:43,406 --> 00:22:45,909 హేయ్, నీకు తెలుసా, నీ దగ్గర ఏమైనా అదనంగా కూరగాయలు ఉంటే, 346 00:22:45,992 --> 00:22:50,163 మన కూరగాయల్ని కలిపి, ఈ రాత్రికి బహుశా తాజాగా సలాడ్ చేసుకుందాం. 347 00:22:51,414 --> 00:22:54,292 అలాగే, తప్పకుండా. అది వినసొంపుగా ఉంది. 348 00:22:55,544 --> 00:22:57,963 నిజానికి నా గేట్లు గట్టిగా ఉన్నాయా లేవా అని ఆలోచిస్తున్నాను. 349 00:22:58,046 --> 00:23:00,048 ఎవరో నా కూరగాయల్ని కొరుక్కు తినేస్తున్నట్లు ఉంది. 350 00:23:01,132 --> 00:23:03,176 సరే, దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. 351 00:23:18,275 --> 00:23:19,276 "'ట్రయాంగిల్," "స్క్వేర్," ఇంకా "సర్కిల్" ఆధారంగా 352 00:23:19,359 --> 00:23:20,360 మాక్ బార్నెట్ ఇంకా జాన్ క్లాసెన్ సృజన 353 00:24:15,749 --> 00:24:17,751 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్