1 00:00:34,327 --> 00:00:36,788 కళాకృతులు చేయడానికి ఎంత చక్కని రోజు. 2 00:00:37,372 --> 00:00:43,086 మరి, నువ్వు సరిగ్గా ఇక్కడ కత్తిరించు. ఆ తరువాత సరిగ్గా అక్కడ కత్తిరించు. 3 00:00:43,670 --> 00:00:47,090 ఇప్పుడు దాన్ని సగానికి మడిచిపెట్టు. ఆ తరువాత కొద్దిగా ఇలా… 4 00:00:50,051 --> 00:00:51,344 ఎక్కడికి వెళ్తున్నావు? 5 00:00:51,928 --> 00:00:54,931 -మీరెందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నారు? -నువ్వు మాకు చెప్పనక్కరలేదు. 6 00:00:55,015 --> 00:00:57,309 సరే, మరొక వైపు కత్తిరించు. 7 00:00:57,392 --> 00:01:02,856 సరే, నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా, నేను బయలుదేరుతున్నాను. ఒంటరిగా. ఒక్కడినే. 8 00:01:03,523 --> 00:01:06,651 ప్రకృతి ఒడిలోకి. ఆ ప్రదేశానికి. 9 00:01:06,735 --> 00:01:11,823 ఎందుకంటే బయట ప్రకృతిలో, ఒంటరిగా ఉంటేనే, నేను నేనుగా ఉంటాను. 10 00:01:11,907 --> 00:01:15,952 జనాల అంచనాల సంకెళ్లు లేకుండా స్వేచ్ఛగా ఉండచ్చు. 11 00:01:16,036 --> 00:01:18,079 -జనమా? -మీ ఇద్దరూ. 12 00:01:18,163 --> 00:01:21,291 నేను ఆలోచిస్తున్నాను. నా శక్తినంతా ఎందుకు ఇలా వెచ్చిస్తున్నానా అని 13 00:01:21,374 --> 00:01:23,835 పొట్ట చెక్కలయ్యేలా ఉండే నా జోక్స్ తో మిమ్మల్ని నిరంతరం మెప్పిస్తూ, 14 00:01:23,919 --> 00:01:28,506 లేదా నా చర్యలతో మిమ్మల్ని ఎందుకు విస్మయపరుస్తున్నాను? నేను అప్పుడు ఏమైయ్యే వాడినో మీరు ఊహించగలరా? 15 00:01:28,590 --> 00:01:30,091 కానీ, అది మీరే ఊహించుకోవాలి, 16 00:01:30,175 --> 00:01:32,135 ఎందుకంటే నాతో పాటు మీరు రావడానికి వీలులేదు. 17 00:01:33,136 --> 00:01:35,805 -సరే. -మేము కాగితం బొమ్మలు చేస్తున్నాము. 18 00:01:37,224 --> 00:01:42,062 సరే, మీ కాగితం బొమ్మలతో మీరు సరదాగా గడుపుతారని ఆశిస్తాను. 19 00:01:42,145 --> 00:01:45,482 ఈ లోగా, నన్ను నేను తెలుసుకుంటూ 20 00:01:45,565 --> 00:01:49,903 నదులు దాటుతూ ఇంకా కొండలు ఎక్కుతూ క్రూరమృగాలతో కుస్తీ పోరాటాలు సాగిస్తాను. 21 00:01:49,986 --> 00:01:52,364 మీకు అద్భుతం అనిపించే సాహసాలు చేస్తాను, 22 00:01:52,447 --> 00:01:58,286 కానీ వాటిలో ఏ ఒక్క విషయం మీకు చెప్పను, ఎందుకంటే నేను ఇదంతా కేవలం నా కోసమే చేస్తున్నాను. 23 00:01:59,621 --> 00:02:01,289 నీ టోపీ మీద ఆ ఈక ఎందుకు ఉంది? 24 00:02:01,373 --> 00:02:03,124 అది చూడటానికి బాగుంటుంది! 25 00:02:03,208 --> 00:02:04,584 ఎవరు చూడటానికి బాగుంటుంది? 26 00:02:10,757 --> 00:02:12,968 "ట్రయాంగిల్ ఒంటరి ప్రయాణం." 27 00:02:18,181 --> 00:02:23,103 నా సాహసయాత్రకి ఇదే ప్రారంభంగా ఈ ప్రదేశాన్ని నేను గుర్తిస్తున్నాను. 28 00:02:23,770 --> 00:02:25,438 నాకు సాహసయాత్రల కథలంటే ఇష్టం. 29 00:02:27,941 --> 00:02:33,029 నా ముక్కుపుటల్లో పైన్ నీడిల్స్ సువాసనలు ఇంకా నా కాళ్ల కింద గులకరాళ్ల చప్పుళ్లు. 30 00:02:33,530 --> 00:02:35,532 నాకు నేనుగా ఇంతవరకూ ఐదు నిమిషాలు కూడా గడపలేదు, 31 00:02:35,615 --> 00:02:37,784 ఇక ఇప్పటికే నన్ను నేను తెలుసుకోవడం మొదలుపెట్టినట్లు అనిపిస్తోంది. 32 00:02:37,867 --> 00:02:40,120 నేను కేవలం ట్రయాంగిల్ ని కాను. 33 00:02:40,203 --> 00:02:45,250 నేను ట్రయాంగిల్, ఒక గొప్ప సాహసయాత్రికుడు! 34 00:02:46,376 --> 00:02:49,462 గొప్ప సాహసయాత్రికుడు. వినసొంపుగా ఉంది. 35 00:02:49,963 --> 00:02:54,718 ఈ కొండలు నా పేరుతో ప్రతిధ్వనించాలి. ట్రయాంగిల్! 36 00:02:57,971 --> 00:03:00,265 ఇది ప్రతిధ్వనులు వచ్చే చోటు కాదు అనుకుంటా. 37 00:03:05,770 --> 00:03:08,356 గొప్ప సాహసయాత్రికుడు బయలుదేరాడు. 38 00:03:11,234 --> 00:03:13,862 గొప్ప సాహసయాత్రికుడు ఒక క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాడు. 39 00:03:13,945 --> 00:03:16,156 ప్రకృతి ఒడిలో నా తొలి రాత్రి. 40 00:03:19,242 --> 00:03:21,786 సర్కిల్ ఇంకా స్క్వేర్ ఈ అనుభూతిని పొందలేకపోవడం వాళ్ల దురదృష్టం. 41 00:03:21,870 --> 00:03:24,915 ఆగు, లేదు. సర్కిల్ ఇంకా స్క్వేర్ ఈ అనుభూతిని పొందలేకపోవడం చాలా మంచి విషయం, 42 00:03:24,998 --> 00:03:27,083 ఎందుకంటే అది ముఖ్యమైన విషయం కాదు. 43 00:03:27,167 --> 00:03:30,837 ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఈ అనుభూతిని పొందుతున్నాను. 44 00:03:30,921 --> 00:03:34,549 ప్రకృతి ఒడిలో స్వయంగా క్యాంప్ ని ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే విశేషమైన ఆత్మసంతృప్తి 45 00:03:34,633 --> 00:03:39,512 అది చాలా ముఖ్యమైన విషయం. 46 00:03:41,765 --> 00:03:43,141 క్యాంప్ ట్రయాంగిల్. 47 00:03:44,226 --> 00:03:47,145 క్యాంప్ ట్రయాంగిల్! 48 00:03:48,521 --> 00:03:49,648 ప్రతిధ్వని! 49 00:03:53,068 --> 00:03:54,819 సరే, ఇక పడుకునే సమయం. 50 00:03:58,907 --> 00:04:01,117 నాకు, గుడ్ నైట్. 51 00:04:05,997 --> 00:04:10,168 ఈ గొప్ప సాహసయాత్రికుడు నిద్ర పోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. 52 00:04:10,252 --> 00:04:12,045 నిజం చెప్పాలంటే, వాళ్లు ఇక్కడ లేకపోవడమే మంచిది అయింది. 53 00:04:12,128 --> 00:04:14,923 ఎందుకంటే వాళ్లు ఇక్కడికి వచ్చి ఉంటే, వాళ్లకి అద్భుతమైన దెయ్యం కథలు చెప్పడం ఇంకా 54 00:04:15,006 --> 00:04:18,843 అందమైన పాటలు పాడటం ద్వారా నా ఎనర్జీని వృథా చేయవలసి వచ్చేది. 55 00:04:18,927 --> 00:04:22,889 మొదటిసారి నాతో నేను గడిపే ఈ క్షణాల్ని నిజంగా ఆస్వాదించే ఒక అవకాశాన్ని ఇది ఇచ్చింది. 56 00:04:22,973 --> 00:04:26,810 నేను సొంతంగా నా పని చేసుకుంటున్నాను, ఫర్వాలేదు. అది మంచిది. అది మంచిది ఇంకా ఫర్వాలేదు. 57 00:04:28,895 --> 00:04:32,482 అది సరే కానీ, మరోలా ఆలోచిస్తే, నా విజయాలను మెచ్చుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ లేకపోతే 58 00:04:32,566 --> 00:04:37,195 అవి అవి నిజమైన విజయాలు అవుతాయా? 59 00:04:37,279 --> 00:04:41,783 అవి విజయాలు కానప్పుడు, మరేం అవుతాయి? నేను ఏంటి? 60 00:04:42,284 --> 00:04:47,330 కనికరం లేని ప్రకృతి దృష్టిలో చెమటోడ్చే ఒక చిన్న ఆకారాన్ని మాత్రమేనా? 61 00:04:51,418 --> 00:04:52,794 హలో. 62 00:05:00,886 --> 00:05:04,389 ఇక్కడ మనతో ఉన్నది ఎవరు? ఈ చిట్టి కుర్రాడికి ఒక పేరు పెట్టాలి. 63 00:05:04,472 --> 00:05:06,224 నిన్ను ఏమని పిలుస్తానంటే… 64 00:05:06,308 --> 00:05:08,393 నేను ఎప్పుడూ ఇష్టపడే పేరు టైబేరియస్. 65 00:05:08,476 --> 00:05:09,477 …రాకో! 66 00:05:10,812 --> 00:05:13,523 ఇది మన క్యాంప్, రాకో. చాలా బాగుంది, కదా? 67 00:05:14,190 --> 00:05:19,487 మరీ ఎక్కువ ఉత్సాహపడకు. ఇప్పుడు పడుకునే సమయం, కానీ రేపు మనకి చాలా పనులు ఉన్నాయి. 68 00:05:30,832 --> 00:05:33,960 సరే, అలాగే. పడుకునే ముందు ఒక దెయ్యం కథ చెప్పుకోవాలి. 69 00:05:35,045 --> 00:05:41,676 అప్పుడు వాళ్లు తలుపు తెరవగానే, ఒక భయంకరమైన అస్తిపంజరం కనిపించింది! 70 00:05:46,139 --> 00:05:48,183 అది విన్న ప్రతి ఒక్కరూ స్క్వేర్ అవుతారు. ఓహ్, సరే. 71 00:05:49,434 --> 00:05:50,977 గుడ్ నైట్, రాకో. 72 00:06:01,947 --> 00:06:05,158 గొప్ప సాహసయాత్రికుడు తన కోసం ఒక కోటని నిర్మించుకున్నాడు. 73 00:06:06,534 --> 00:06:08,745 దీన్ని చూసి ఆనందించు, రాకో. 74 00:06:11,873 --> 00:06:14,960 నీకు ఇది బాగుంది అనిపిస్తోందా? నువ్వు చూస్తున్నది అసలు ఏమీ కాదు, రాకో. 75 00:06:20,257 --> 00:06:23,009 అది నిజం, రాకో. నేను ఇది కావాలని చేయలేదు. 76 00:06:25,053 --> 00:06:29,349 గొప్ప సాహసయాత్రికుడు తన ప్రయాణాన్ని కొనసాగించి ఎండిన ఎడారికి చేరుకున్నాడు. 77 00:06:30,684 --> 00:06:32,602 భారీ వర్షాలను ఎదుర్కొన్నాడు. 78 00:06:38,066 --> 00:06:40,485 గాఢమైన, కారడవిలోకి వెళ్లాడు. 79 00:06:58,461 --> 00:07:02,716 గొప్ప సాహసయాత్రికుడు నేలనీ ఇంకా సముద్రాన్ని కూడా జయించాడు. 80 00:07:02,799 --> 00:07:06,428 రాకో, నీకు వందోసారి చెబుతున్నాను, నిన్ను ఆ పాము తినేయకుండా ఉండాలంటే, 81 00:07:06,511 --> 00:07:08,013 నువ్వు ఏదైనా మాట్లాడాల్సి ఉండాలి. 82 00:07:08,972 --> 00:07:12,475 ఆ పాము గురించి స్క్వేర్ అయితే ఏదో ఒకటి చెప్పేవాడు, నాకు అది తెలుసు. 83 00:07:12,559 --> 00:07:13,602 సర్కిల్ కూడా చెప్పేది. 84 00:07:13,685 --> 00:07:16,605 ఈ మొత్తం సాహసయాత్ర గురించి వాళ్లు చాలా విశేషాలు చెప్పేవారని ఖచ్చితంగా చెప్పగలను. 85 00:07:18,398 --> 00:07:19,941 హేయ్, రాకో. మునగద్దు. 86 00:07:21,109 --> 00:07:22,903 ఆగు, రాకో! నేను వస్తున్నాను! 87 00:07:29,826 --> 00:07:33,955 గొప్ప సాహసయాత్రికుడు సముద్ర గర్భంలో రహస్యాలను ఆస్వాదిస్తున్నాడు. 88 00:07:34,706 --> 00:07:38,001 అతను ఆశ్చర్యంతో అవాక్కు అయిపోతున్నాడు. 89 00:07:39,211 --> 00:07:40,837 కానీ ఊపిరి అందడం లేదు. 90 00:07:49,763 --> 00:07:52,432 ఒక గొప్ప సాహసయాత్రికుడు చేసే ప్రతి గొప్ప సాహసంలో, 91 00:07:52,515 --> 00:07:54,476 క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. 92 00:08:00,232 --> 00:08:03,276 రాకో తోడు ఉండటాన్ని ట్రయాంగిల్ ఇష్టపడ్డాడు కానీ, 93 00:08:03,360 --> 00:08:05,779 దానిని వదిలి ముందుకు వెళ్లే సమయం వచ్చిందని అతను గ్రహించాడు. 94 00:08:06,404 --> 00:08:10,700 ఈ కష్టాన్ని తను సొంతంగా ధైర్యంగా అధిగమించాలని ఎట్టకేలకు, ట్రయాంగిల్ నిర్ణయించుకున్నాడు. 95 00:08:10,784 --> 00:08:16,039 దీనికి తోడు, ఈ సముద్రగర్భంలో రాకో సంతోషంగా ఉన్నట్లు కనిపించాడు… వావ్. 96 00:08:18,124 --> 00:08:19,376 రాకో! 97 00:08:29,928 --> 00:08:32,639 నేను ఇంక కొనసాగలేను. నా పని అయిపోయింది. 98 00:08:32,722 --> 00:08:35,600 నా నిత్యావసరాలన్నీ పోయాయి, ఇంక వెనక్కి తిరిగి వెళ్లలేను. 99 00:08:35,683 --> 00:08:39,020 ఇదంతా అసలు ఎందుకోసం? నా ఉద్దేశం, ఖచ్చితంగా, ఈ యాత్రలో 100 00:08:39,104 --> 00:08:42,148 ఏ ఒక్కరి సహాయం లేకుండా నేను మంటలు రగిలించాను ఇంకా కోటలు కట్టాను. 101 00:08:42,231 --> 00:08:46,152 ఖచ్చితంగా, నేను పంచభూతాలను జయించి కొత్త ప్రదేశాలను చూసి వచ్చాను, 102 00:08:46,236 --> 00:08:49,781 అందుకోసం నేను కేవలం నా తెలివితేటలు ఇంకా మొక్కవోని సాహస స్ఫూర్తిని మాత్రమే ప్రదర్శించాను. 103 00:08:49,864 --> 00:08:53,743 ఇంకా నిజంగా, నేను పాములతో ఏ ఆయుధం లేకుండా కేవలం వొట్టి చేతులతో పోరాడాను. 104 00:08:54,244 --> 00:08:58,665 కానీ చివరికి, ఇదేదీ నాకు అర్థవంతంగా అనిపించడం లేదు. 105 00:08:59,207 --> 00:09:04,754 ఈ చిట్టి సాహసి ట్రయాంగిల్ గొప్ప సాహసాలను ఎవరు చెప్పుకుంటారు? 106 00:09:05,505 --> 00:09:08,633 -ట్రయాంగిల్! -ట్రయాంగిల్! 107 00:09:09,217 --> 00:09:11,177 ఓహ్, గొప్పగా ఉంది. ఇప్పుడు ప్రతిధ్వనిస్తోంది. 108 00:09:13,096 --> 00:09:14,472 హలో, ట్రయాంగిల్. 109 00:09:15,348 --> 00:09:17,100 సరే, సరే, సరే. 110 00:09:17,601 --> 00:09:19,853 మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? 111 00:09:20,437 --> 00:09:24,274 అంటే, అదీ, చూడు, మేము… సర్కిల్? 112 00:09:24,357 --> 00:09:27,986 ట్రయాంగిల్, ఈ విషయంలో నిజం ఏమిటంటే, మేము నిన్ను అనుసరించాము. 113 00:09:28,069 --> 00:09:29,821 ఏంటి? ఎందుకు? 114 00:09:29,905 --> 00:09:34,743 అంటే, నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలుగుతావా అని మేము ఆందోళన పడ్డాం. 115 00:09:34,826 --> 00:09:37,287 ఆగండి. 116 00:09:37,370 --> 00:09:41,833 అయితే ఈ యాత్ర జరిగినంత కాలం మీరు నన్ను అనుసరించారు అని చెబుతున్నారా? 117 00:09:41,917 --> 00:09:43,919 అవును, నిజం. 118 00:09:47,464 --> 00:09:49,382 ఇది… 119 00:09:49,466 --> 00:09:51,259 అద్భుతం! 120 00:09:52,302 --> 00:09:54,679 అయితే నేను చేసినవన్నీ మీరు చూశారు! 121 00:09:54,763 --> 00:09:58,141 అయితే మీరు ఆ పాము అలా చేస్తుంటే… అప్పుడు నేను ఇలా చేశాను, హైయ్యా! 122 00:09:58,225 --> 00:09:59,809 ఆ పాము ఇలా చేసింది… 123 00:09:59,893 --> 00:10:02,354 -అంటే, నా ఉద్దేశం, ఖచ్చితంగా అది కాదు… -స్క్వేర్. 124 00:10:02,437 --> 00:10:07,817 ఓహ్, అవును! అవును, లేదు. అవును, మేం చూశాం. మేం పూర్తిగా చూశాం. 125 00:10:07,901 --> 00:10:11,863 అప్పుడు నేను, హైయ్యా అన్నాను! గుర్తుందా? 126 00:10:15,575 --> 00:10:17,077 అవును, మేము స్పష్టంగా చూశాం. 127 00:10:17,577 --> 00:10:20,121 నేను రాయితో మాట్లాడటం మీరు చూడలేదు, కదా? 128 00:10:20,205 --> 00:10:21,122 లేదు. 129 00:10:21,206 --> 00:10:25,126 ఓహ్, మంచిది. ఆ కాక్టస్ మొక్క తన ముళ్లతో నన్ను ఒళ్లంతా పొడిచింది గుర్తుందా? 130 00:10:25,210 --> 00:10:28,880 నేను గట్టిగా అరిచాను, "అవకాశమే లేదు, బాబు! ఈ రోజు నీది కాదు" అని. 131 00:10:38,390 --> 00:10:42,310 ఈ ఉదయం తన స్నేహితుల్ని కలుసుకోవడానికి సర్కిల్ ప్రత్యేకంగా చాలా ఉత్సాహపడింది. 132 00:10:42,394 --> 00:10:45,981 హేయ్, మీరు ఒక అద్భుతమైన దానిని చూడాలి అనుకుంటున్నారా? 133 00:10:46,064 --> 00:10:47,274 అది ఏంటి? 134 00:10:47,357 --> 00:10:49,985 సరే. నేను దానిని సర్ ప్రైజ్ గానే ఉంచాను, 135 00:10:50,068 --> 00:10:53,405 కానీ నిన్న నేను సొంతంగా ఒక చిన్న సాహసయాత్రకు వెళ్లాను. 136 00:10:53,488 --> 00:10:54,823 నువ్వు చేశావు. 137 00:10:54,906 --> 00:10:58,159 నేను ఇంతవరకూ ఎప్పుడూ చూడని ఒక ప్రదేశంలోకి వెళ్లిపోయాను. 138 00:10:58,243 --> 00:11:01,580 అక్కడ నేను ఏం కనుక్కున్నానో మీరు కనీసం ఊహించలేరు. ప్రాచీన శిథిలాలు. 139 00:11:01,663 --> 00:11:05,000 -శిథిలాలా? వినడానికి భయంకరంగా ఉంది. -నేను వస్తాను. 140 00:11:05,083 --> 00:11:06,084 సరే, నా వెంట రండి. 141 00:11:16,636 --> 00:11:19,347 నేను ఇంతవరకూ ఇది ఎందుకు చూడలేదు? 142 00:11:20,265 --> 00:11:21,683 అడుగులు జాగ్రత్తగా గమనించుకోండి. 143 00:11:23,393 --> 00:11:25,896 హాయిగా కూర్చుని నా పుస్తకం చదువుకోవడానికి ఈ చోటు బాగుంటుంది అనుకుంటా. 144 00:11:26,396 --> 00:11:31,276 మనం ఒక కొత్త రకమైన జంతువుని కనుగొనాలని ఆశిస్తున్నాను. ఒక క్రూరమైన బలమైన వేట జంతువు లాంటిది. 145 00:11:31,985 --> 00:11:34,613 నిన్న నాకు అలాంటి క్రూరమైన వేటజంతువు కనిపించలేదు. 146 00:11:34,696 --> 00:11:37,699 అయితే అప్పుడు నేనే ఆ క్రూరమైన వేట జంతువుని అవుతాను. అది ఇంకా మేలు. 147 00:11:41,786 --> 00:11:44,873 మనం ఇంటికి చాలా దూరంగా వచ్చాం, కదా? 148 00:11:45,665 --> 00:11:49,252 కంగారుపడకు, స్క్వేర్. నేను ఇలాంటి సాహసాలు తరచు చేస్తుంటాను. 149 00:11:49,336 --> 00:11:50,378 నన్ను నమ్ము. 150 00:11:50,462 --> 00:11:52,756 అవును, స్క్వేర్. సర్కిల్ ఎప్పుడూ గందరగోళం చేయదు. 151 00:11:54,799 --> 00:11:57,552 "సర్కిల్ ఒక తప్పు చేసింది." 152 00:12:00,013 --> 00:12:01,389 సరిగ్గా ఈ దారిలో వెళ్లాలి. 153 00:12:07,979 --> 00:12:11,316 జాగ్రత్తగా చూసుకో. ఇంటికి దురదలతో వెళ్లడం మనకి అవసరం లేదు. 154 00:12:12,692 --> 00:12:14,194 ఈ ప్రదేశం శుభ్రంగా ఉంది కదా, స్క్వేర్? 155 00:12:15,278 --> 00:12:18,698 ఇలా చూడండి! ఇంకా చాలా మంచి ప్రదేశానికి మనం వెళ్లనే లేదు. 156 00:12:22,786 --> 00:12:23,870 టా… డా! 157 00:12:29,751 --> 00:12:31,127 ఇది చాలా చక్కగా ఉంది. 158 00:12:31,628 --> 00:12:32,629 వావ్. 159 00:12:33,630 --> 00:12:36,174 ఈ ప్రదేశం ఏం అయి ఉంటుంది అంటావు, సర్కిల్? 160 00:12:36,258 --> 00:12:39,469 ఇది పురాతనమైనది. నాకంటే పాతది. 161 00:12:39,970 --> 00:12:45,642 వావీ. దీన్ని ఎవరు నిర్మించి ఉంటారు? వాళ్లంతా ఇప్పుడు ఏమయ్యారు? 162 00:12:45,725 --> 00:12:47,727 బహుశా వాళ్లు సరుకులు తెచ్చుకోవడానికి వెళ్లి ఉండచ్చు. 163 00:12:56,069 --> 00:12:57,279 అవును! 164 00:13:16,965 --> 00:13:19,175 భలే, నువ్వు సరిగ్గా చెప్పావు, సర్కిల్. 165 00:13:19,259 --> 00:13:22,721 నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, కానీ ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది. 166 00:13:23,847 --> 00:13:25,015 దేవుడా. 167 00:13:25,932 --> 00:13:30,979 హేయ్, ఆగండి. మీ ఇద్దరూ కూడా మీ బ్రెడ్ పైభాగాన్ని కట్ చేశారా? నేను ఒక్కడినే ఇలా చేశా అనుకున్నా. 168 00:13:33,189 --> 00:13:35,275 ఇదిగో. నీ తాబేలు కోసం మనం కొన్ని ఉంచుదాం. 169 00:13:35,859 --> 00:13:38,486 థాంక్స్. వాడు చాలా మంచివి ఎంచుకుని తింటుంటాడు. 170 00:13:41,531 --> 00:13:44,367 ఒక రోజంతా సరదాగా గడిపి ఎన్నో విషయాలు తెలుసుకున్న తరువాత, 171 00:13:44,451 --> 00:13:48,705 సర్కిల్, స్క్వేర్ ఇంకా ట్రయాంగిల్ ఇక ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 172 00:13:50,165 --> 00:13:52,250 మమ్మల్ని ఆహ్వానించినందుకు మళ్లీ ధన్యవాదాలు, సర్కిల్. 173 00:13:52,334 --> 00:13:54,878 నేను ఇక్కడికి ఇలా సొంతంగా వచ్చి ఉండేవాడిని కాదు. 174 00:13:54,961 --> 00:13:57,172 ఇది ఏమీ పెద్ద విషయం కాదు. నిజంగా, నేను… 175 00:13:57,255 --> 00:14:00,634 నిజానికి, ఇలాంటి ట్రిప్స్ కి తరచు మిమ్మల్ని తీసుకువెళ్లడం నాకు సంతోషంగా ఉంటుంది. 176 00:14:00,717 --> 00:14:04,971 మొదట్లో ఇది కొద్దిగా కష్టం అనిపించినా, ఖచ్చితంగా, నిజానికి, మనం ఇలా కొన్నిసార్లు ప్రయత్నించి 177 00:14:05,055 --> 00:14:08,600 కొన్ని మెళకువలు నేర్చుకుంటే గనుక మనకి ఇక భయం అనేది ఉండదు. నన్ను నమ్మండి. 178 00:14:09,684 --> 00:14:10,769 సర్కిల్? 179 00:14:13,480 --> 00:14:16,149 సర్కిల్? మనం వచ్చిన దారి ఇప్పుడు నీటితో నిండిపోయింది. 180 00:14:16,233 --> 00:14:17,317 ఇంకా ఇది చాలా లోతుగా ఉంది. 181 00:14:17,817 --> 00:14:19,069 కెరటం లోపలికి వచ్చేసింది. 182 00:14:20,820 --> 00:14:23,073 అయితే, మనం దీన్ని దాటి ఎలా వెళ్లగలం? 183 00:14:23,156 --> 00:14:26,910 అవును. మేము నీలాగ గాలిలో ఎగరలేమని నువ్వు మర్చిపోలేదు, కదా, సర్కిల్? 184 00:14:27,410 --> 00:14:30,372 లేదు. నిజంగానే నేను మర్చిపోలేదు. 185 00:14:32,165 --> 00:14:33,375 ఆమె మర్చిపోయింది. 186 00:14:33,458 --> 00:14:36,962 సరే, అయితే… సారీ, నేను ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నానేమో. 187 00:14:38,004 --> 00:14:40,632 కానీ మనం ఇంటికి చేరుకోవాలి? 188 00:14:41,216 --> 00:14:43,176 సరే. స్పష్టంగా చెప్పాలంటే, 189 00:14:43,260 --> 00:14:45,971 కెరటం లోపలికి వచ్చేస్తుందని నేను ఖచ్చితంగా గుర్తు పెట్టుకున్నాను, 190 00:14:46,054 --> 00:14:49,391 ఇంకా మీరు ఇద్దరూ నాలాగ ఎగరలేరని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకున్నాను. 191 00:14:49,474 --> 00:14:51,184 ఆమె ఖచ్చితంగా గుర్తుంచుకుంది. 192 00:14:51,268 --> 00:14:56,690 ఈ ప్రయాణం మొత్తంలో నా ప్లాన్ ఏమిటంటే, తప్పనిసరిగా, నేను సొంతంగా ఆ కొండ పైకి ఎగురుతూ వెళ్లి, 193 00:14:56,773 --> 00:15:01,152 ఒక డింగీని తీసుకుని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్లాలని అనుకున్నాను. 194 00:15:01,236 --> 00:15:03,989 నువ్వు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్లిపోతావా? 195 00:15:04,489 --> 00:15:05,782 నేను… 196 00:15:09,327 --> 00:15:12,998 ఏదైనా జరిగితే, దీనిని గట్టిగా ఊదండి, అప్పుడు నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను. 197 00:15:15,375 --> 00:15:17,669 ఇది. సరే. 198 00:15:25,343 --> 00:15:26,803 క్రూర వేటజంతువు శబ్దం విన్నాం అనుకుంటా. 199 00:15:26,887 --> 00:15:29,139 అది క్రూరమైన వేట జంతువు శబ్దం అని నువ్వు అనుకున్నావు. 200 00:15:29,222 --> 00:15:31,349 ఎవరు విన్నారనే దాని గురించి మనం వాదించుకోవద్దు. 201 00:15:31,433 --> 00:15:35,020 విషయం ఏమిటంటే, ఆ బోటు ఆలోచన మనకి పని చేయదు. కానీ మరేం ఫర్వాలేదు. 202 00:15:35,103 --> 00:15:37,814 సరైన ప్రత్యామ్నాయం ఆలోచించకుండా సర్కిల్ మనల్ని ఇక్కడికి తీసుకువచ్చేది కాదు. 203 00:15:37,898 --> 00:15:43,445 నాకు తెలుసు. నువ్వు పెద్దగా అయిపోయి మమ్మల్ని ఎత్తుకు తీసుకువెళతావు. కదా? 204 00:15:44,321 --> 00:15:46,781 అవును. అదే. అది పని చేస్తుంది. 205 00:15:47,699 --> 00:15:48,783 బహుశా. 206 00:15:56,625 --> 00:16:01,338 సర్కిల్? మమ్మల్ని మోయడానికి నువ్వు ఇంకా పెద్దగా అవుతావు అనుకున్నాను. 207 00:16:01,421 --> 00:16:03,256 మనం ఇంటికి చాలా దూరంలో ఉన్నాం. నేను… 208 00:16:03,840 --> 00:16:06,593 ఆ కొండ నుంచి ఇంత దూరంలో ఉండటం వల్ల నా శక్తులు బలహీనం అయ్యాయి. 209 00:16:06,676 --> 00:16:09,638 అయితే, మనం ఇప్పుడు ఇక్కడే ఉండిపోవాలా? 210 00:16:10,138 --> 00:16:13,433 ఆ అవకాశమే లేదు. సర్కిల్ దగ్గర ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయం ఉండే ఉంటుంది. 211 00:16:13,516 --> 00:16:16,895 -అవును కదా? -మనం ఈ కెరటం వెళ్లిపోయే వరకూ వేచి ఉందాం. 212 00:16:17,479 --> 00:16:18,980 దానికి ఎంత సమయం పడుతుంది? 213 00:16:19,064 --> 00:16:20,482 పన్నెండు గంటలు. 214 00:16:22,943 --> 00:16:27,155 పన్నెండు గంటలా? కానీ చామంతి టీ తాగకపోతే నాకు నిద్రే పట్టదు. 215 00:16:27,239 --> 00:16:31,534 అలాగే నేను రాత్రికి నా తాబేలుని పక్క మీద పడుకోపెట్టకపోతే అది కుమిలిపోతుంది. 216 00:16:35,372 --> 00:16:37,040 సరే. మనం ఒక వంతెన కట్టాలి. 217 00:16:37,123 --> 00:16:38,583 సరే, మనం కాంక్రీట్ ఎలా తయారు చేస్తాం? 218 00:16:38,667 --> 00:16:41,461 మనం ఇక్కడికి రావడానికి ముందే నువ్వు అది తెలుసుకుని ఉండాలి. 219 00:16:41,545 --> 00:16:45,966 క్లాసిక్ స్క్వేర్. ఎప్పటిలాగే తయారుగా రాలేదు. ఈ మొత్తం గందరగోళం నీ తప్పే! 220 00:16:46,049 --> 00:16:47,342 లేదు, ఇది నా తప్పు కాదు! 221 00:16:49,594 --> 00:16:52,180 నువ్వు నిజం చెప్పావు. ఇది నీ తప్పు కాదు. 222 00:16:52,264 --> 00:16:57,686 కానీ మరి, ఇది నా తప్పు అయి ఉంటుంది. అయినా, ఇది నా తప్పు కాదనిపిస్తోందని కూడా. 223 00:16:57,769 --> 00:17:01,982 -నేను… -ఇది ఎవ్వరి తప్పు కాదు, కానవసరం లేదు. 224 00:17:02,482 --> 00:17:06,361 మనం చేయవలసిందల్లా ఈ ఒక్క రాత్రికి ఎలాగో అలా గడపడమే, రేపు ఉదయం మనం మేలుకొనేసరికి ఇంట్లో ఉంటాం. 225 00:17:06,444 --> 00:17:08,612 కానీ ఎలా గడపాలో నాకు తెలియదు. 226 00:17:08,697 --> 00:17:11,283 నాకు తెలుసు, నిజం, కానీ నాకు అలా గడపాలని లేదు. 227 00:17:11,366 --> 00:17:15,536 -అవన్నీ నాకు వదిలేయండి. -సరే. నిన్ను నమ్ముతాము, సర్కిల్. 228 00:17:26,089 --> 00:17:31,011 సరే, మొదట చేయవలసిన పని, షెల్టర్ ఏర్పాటు చేయడానికి కొన్ని వస్తువులు కావాలి. 229 00:17:33,555 --> 00:17:35,140 మీకు తెలుసు, ఒక రకంగా, 230 00:17:35,223 --> 00:17:39,019 మిమ్మల్ని ఇందుకోసమే ఇక్కడికి తీసుకువచ్చాను. 231 00:17:39,102 --> 00:17:43,356 బయట ఇలా గడపడం కన్నా గొప్ప సాహసం ఇంకేం ఉంటుంది? 232 00:17:43,440 --> 00:17:44,983 నిజంగానా, సర్కిల్? 233 00:17:46,943 --> 00:17:48,737 అది పని చేయవచ్చు, మిత్రులారా. 234 00:17:55,327 --> 00:17:57,537 నేను మీ ఇద్దరితో నిజాయితీగా ఒక విషయం చెప్పాలి. 235 00:17:58,371 --> 00:18:02,250 ఇక్కడ ఉండే వస్తువులు షెల్టర్లు ఏర్పాటు చేయడానికి పనికిరావు. 236 00:18:02,792 --> 00:18:04,794 ప్రకృతి మాతని తప్ప ఇంకెవ్వరినీ ఇందుకు నిందించలేము. 237 00:18:06,504 --> 00:18:07,631 కానీ ఇది చూడండి. 238 00:18:14,221 --> 00:18:15,931 ఎవరికైనా దాహంగా ఉందా? 239 00:18:27,734 --> 00:18:30,695 తినడానికి ఏమీ లేనందుకు థాంక్స్, స్క్వేర్. నేను ఈ పాటికి రాజాలా తిని ఉండేవాడిని, 240 00:18:30,779 --> 00:18:33,782 మనకి దొరికిన ఆ విచిత్రమైన బెర్రీ పండ్లను కూడా నువ్వు తిననివ్వకుండా ఆపావు. 241 00:18:33,865 --> 00:18:37,452 -ఆ పొదని ఏమని పిలుస్తారని చెప్పావు? -విషపు బెర్రీ పొద. 242 00:18:37,535 --> 00:18:39,663 చూడు? నేను… ఓహ్, నాకు అర్థమైంది. 243 00:18:40,455 --> 00:18:41,790 ఆగు, నా దగ్గర ఏదో ఉంది. 244 00:18:42,290 --> 00:18:45,210 మన శాండ్విచ్ ముక్కలు, వాటిని దాచి ఉంచాను. 245 00:18:45,293 --> 00:18:47,337 కానీ అవి నా తాబేలు కోసం కదా. 246 00:18:47,420 --> 00:18:49,381 ఆపద సమయంలో ఆదుకున్న సర్కిల్! 247 00:18:51,675 --> 00:18:54,803 హేయ్, మీరు నా తాబేలు ఆహారం తినేస్తున్నారు. వాడు ఆకలితో అలమటిస్తాడు. 248 00:19:00,308 --> 00:19:01,893 ఓహ్, సరే, మంచిది! 249 00:19:01,977 --> 00:19:05,355 కానీ నువ్వు అంత సేపు ఆ శిథిలాలలో ఆడకపోయి ఉంటే, ఆ కెరటం వచ్చే లోపు 250 00:19:05,438 --> 00:19:07,524 మనం తిరిగి వెళ్లిపోయే వాళ్లం. 251 00:19:07,607 --> 00:19:10,277 సరే, ఆ ఆకుతో తాగడానికి నువ్వు ప్రయత్నించి ఉంటే 252 00:19:10,360 --> 00:19:12,779 నా బదులు నువ్వు ఈ పాటికి తడిసి ముద్దయిపోయి ఉండేవాడివి. 253 00:19:14,281 --> 00:19:18,076 నాకు చలిగా ఉంది, నేను తడిసిపోయాను, ఇదంతా నీ పొరపాటే! 254 00:19:18,159 --> 00:19:19,995 ఇది నా పొరపాటు! 255 00:19:20,579 --> 00:19:21,580 ఏంటి? 256 00:19:27,669 --> 00:19:28,962 నిజం ఏమిటంటే, 257 00:19:29,045 --> 00:19:34,676 నేను గాలిలో ఎగరడానికి బాగా అలవాటు పడి మీరు ఎగరలేరనే విషయాన్ని మర్చిపోయాను. 258 00:19:36,052 --> 00:19:39,306 కెరటం వస్తే ఏం చేయాలనే విషయం గురించి నేను కనీసం ఆలోచించలేదు. 259 00:19:39,806 --> 00:19:41,600 నేను నా గురించే ఆలోచించుకున్నాను. 260 00:19:41,683 --> 00:19:43,643 మీ ఇద్దరికీ నేను క్షమాపణలు చెప్పాలి. 261 00:19:45,228 --> 00:19:46,229 సారీ. 262 00:19:46,730 --> 00:19:49,983 ఆగు. మేము ఎగరలేమని నువ్వు నిజంగా మర్చిపోయావా? 263 00:19:50,066 --> 00:19:52,736 నేను అంతకుముందు చెప్పినప్పుడు, నేను నవ్వులాటకి అన్నాను. 264 00:19:52,819 --> 00:19:56,740 నాకు తెలుసు. దీనికి ప్రాయశ్చిత్తం లేదు. మీరు ఇక్కడ ఇరుక్కుపోవడానికి నేనే కారణం. 265 00:19:57,282 --> 00:19:58,491 ఇది నా పొరపాటే. 266 00:20:00,327 --> 00:20:05,081 -వావ్. ఇది ఎప్పటికీ నీ తప్పు కాదు! -అవును, ఎప్పుడూ మేమే గందరగోళం చేస్తాము. 267 00:20:05,165 --> 00:20:06,875 ఇక మీదట మీరు నన్ను నమ్మకపోయినా, 268 00:20:06,958 --> 00:20:11,630 నాతో పాటు సాహసయాత్రలకి రావడానికి ఇష్టపడకపోయినా, నేను అర్థం చేసుకోగలను. 269 00:20:12,422 --> 00:20:14,549 ఏంటి? నిజంగా మేము నిన్ను నమ్ముతాము. 270 00:20:14,633 --> 00:20:19,054 అవును, మా ప్రాణాలు ఉన్నంత వరకూ నిన్ను నమ్ముతాము. కానీ వావ్! 271 00:20:19,137 --> 00:20:21,306 నువ్వు నిజంగా పొరపాటు చేశావు. 272 00:20:21,389 --> 00:20:24,643 హేయ్, ఆ రోజు నీకు గుర్తుందా, నీ పెరడులో పులి కోసం నేను ఇంకా స్క్వేర్ 273 00:20:24,726 --> 00:20:27,854 ఒక గుంత తవ్వాము ఎందుకంటే మేము పులిని చూశాం అనుకున్నాం, కానీ అది తీరా ఉడుత అని తెలిసింది? 274 00:20:27,938 --> 00:20:32,275 ఇది కూడా అలాంటిదే, అయితే ఈసారి మేము కాకుండా నువ్వు గందరగోళం చేశావు. 275 00:20:32,359 --> 00:20:34,027 అవును. 276 00:20:34,110 --> 00:20:36,321 లేదా నీకు సర్ ప్రైజ్ ఇవ్వాలని నీ గుహకి పెయింట్ వేశాము, 277 00:20:36,404 --> 00:20:38,406 కానీ సగం వేయగానే ఆ పెయింట్ అయిపోయింది? 278 00:20:38,490 --> 00:20:41,785 ఇది అలాంటిదే, కానీ ఈసారి మేము కాకుండా నువ్వు పొరపాటు చేశావు. 279 00:20:41,868 --> 00:20:45,038 -సరే, నాకు అర్థమైంది. -అవును, ఇంక చాలు, స్క్వేర్. 280 00:20:45,121 --> 00:20:47,707 ఈ రాత్రి ఘోరంగా నిద్రపోవడానికి ఇంక సమయం వచ్చింది, 281 00:20:47,791 --> 00:20:50,252 సర్కిల్ దయవల్ల. 282 00:21:00,595 --> 00:21:01,888 -వంతెన! -ఆ వంతెన! 283 00:21:08,520 --> 00:21:12,315 హేయ్, సర్కిల్, నేను ఈ ట్రిప్ ని ఎలా గడిపాను అంటావు? నేనయితే నాకు తొమ్మిది పాయింట్లు ఇస్తాను, 284 00:21:12,399 --> 00:21:15,068 కానీ నువ్వు మరోలా భావిస్తే పది మార్కులు కూడా ఇచ్చుకోవడానికి నేను సిద్ధం. 285 00:21:15,151 --> 00:21:17,362 ట్రయాంగిల్, నువ్వు దాదాపుగా ఆ విషపు బెర్రీ పండ్లు తినబోయావు. 286 00:21:17,445 --> 00:21:19,698 ఇంకా ఆ గుచ్చుకునే ఆకుల కొమ్మల్ని దుప్పటిగా వాడావు. 287 00:21:20,198 --> 00:21:24,119 నిజానికి, అది గుచ్చుకునే ఆకుల కొమ్మే, తెలివైన అబ్బాయి. కానీ నువ్వు గనుక 288 00:21:24,202 --> 00:21:27,038 నా బ్రెడ్ ముక్కల వాటాని కూడా తినేయకుండా ఉండి ఉంటే, నా కడుపు గరగరలాడేది కాదు. 289 00:21:27,122 --> 00:21:28,123 హేయ్, చూడండి. 290 00:21:35,714 --> 00:21:38,383 సొంత ఇల్లు ఇంత అందంగా ఎప్పుడూ కనిపించలేదు. 291 00:21:39,217 --> 00:21:44,556 అవును. ఒక విధంగా, మనం ఇలా ఈ ఘోరమైన రాత్రిని 292 00:21:44,639 --> 00:21:47,392 ఇక్కడి దెయ్యాల దిబ్బలలో గడపడం నిజంగా మంచిదయింది 293 00:21:47,475 --> 00:21:50,186 ఎందుకంటే దీని వల్ల మనకి కొత్తగా ఆలోచించే 294 00:21:50,270 --> 00:21:51,479 -అవకాశం… -లేదు. 295 00:21:51,563 --> 00:21:52,731 లేదు. 296 00:21:57,569 --> 00:21:58,820 నాన్న ఇంటికి వచ్చేశాడు. 297 00:22:11,207 --> 00:22:12,208 "'ట్రయాంగిల్," "స్క్వేర్" అండ్ "సర్కిల్" ఆధారంగా 298 00:22:12,292 --> 00:22:13,293 మాక్ బార్నెట్ ఇంకా జాన్ క్లాసెన్ సృజన 299 00:23:08,682 --> 00:23:10,684 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్