1 00:00:33,660 --> 00:00:37,247 ఇది ప్రశాంతమైన సమయం, ఇప్పుడే రాత్రి కాస్త పగలుగా మారింది 2 00:00:37,330 --> 00:00:39,624 అందరూ ఇంకా మంచాల మీద వెచ్చగా పడుకుని ఉన్నారు. 3 00:00:41,793 --> 00:00:43,003 ఒక్క స్క్వేర్ తప్ప. 4 00:00:45,881 --> 00:00:48,341 ఎందుకంటే ఈ రోజు అతను క్రమం తప్పకుండా 5 00:00:48,425 --> 00:00:52,971 ద్వైమాసిక ద్వై-వార్షిక అత్యుత్తమ బీచ్ పరిశుభ్రతా దినోత్సవం క్షుణ్ణంగా పాటించే రోజు… 6 00:00:56,099 --> 00:00:59,394 నా ఉద్దేశం అతను క్షుణ్ణంగా బీచ్ ని శుభ్రం చేస్తాడు. 7 00:01:01,438 --> 00:01:03,315 అక్కడ కొద్దిగా శుభ్రంగానే ఉంది. 8 00:01:03,398 --> 00:01:05,442 కిందటి రాత్రి ఒక పెద్ద తుఫాను వచ్చి 9 00:01:05,525 --> 00:01:08,028 తీరంలో పడి ఉన్న చెత్తనంతా తుడిచిపెట్టేసింది. 10 00:01:16,953 --> 00:01:18,163 ఆగండి, అదేంటి? 11 00:01:19,205 --> 00:01:20,582 చాటుగా దాక్కున్న దెయ్యం! 12 00:01:26,338 --> 00:01:29,299 "ఈ రోజు చాలా దూరం నడిచాను, కొత్తగా ముప్పై పామ్ చెట్లు లెక్క పెట్టాను. 13 00:01:29,382 --> 00:01:31,676 నాకు స్క్వేర్ పాన్ కేక్స్ అంటే ఇష్టం. 14 00:01:31,760 --> 00:01:34,721 అందులో రహస్యమైన పదార్థం ఖచ్చితంగా దాల్చిన చెక్క పొడే." 15 00:01:34,804 --> 00:01:37,057 ఆగు, ఏంటి? స్క్వేర్? 16 00:01:37,140 --> 00:01:39,517 తనకి తెలిసిన స్క్వేర్ తనే. 17 00:01:39,601 --> 00:01:43,772 ఇది ఎవరు రాశారు? నా పాన్ కేక్స్ లో దాల్చిన చెక్క పొడి వాడతానని నీకెలా తెలుసు? 18 00:01:43,855 --> 00:01:44,981 అది రహస్యం కదా! 19 00:01:45,065 --> 00:01:49,110 రిలాక్స్ అవ్వు, స్క్వేర్. ఇది ట్రయాంగిల్ పనే అయి ఉంటుంది. 20 00:01:49,194 --> 00:01:51,488 అతనే సూపర్ స్టార్ అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు. 21 00:01:52,656 --> 00:01:54,741 నేను వెళ్లి ఈ కాగితాన్ని అతనికే ఇచ్చేస్తాను. 22 00:01:59,412 --> 00:02:05,418 స్క్వేర్! సముద్రతీరంలో నీ లేఖ నాకు కనిపించింది, నిజం చెప్పాలంటే నేను ఇది చూసి ఆశ్చర్యపోలేదు. 23 00:02:05,502 --> 00:02:07,045 ఆ విషయం నా వ్యక్తిగతమైనది! 24 00:02:07,128 --> 00:02:08,379 నా లేఖా? ఏంటి? 25 00:02:11,091 --> 00:02:14,970 "ఆ చిన్న ఆకులు నాకు దురదలు పెట్టాయి, కానీ పువ్వులు మాత్రం ముచ్చటగా ఉన్నాయి. 26 00:02:15,053 --> 00:02:18,473 చూడబోతే వాన వచ్చేలా ఉంది. ట్రయాంగిల్ కి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంది." 27 00:02:18,557 --> 00:02:20,642 నేను పడుకోవడాన్ని నువ్వు చూసినంతగా ఇంకెవ్వరూ చూడరు! 28 00:02:20,725 --> 00:02:22,811 నువ్వు కథలు చెప్పే ప్రతీసారీ నాకు నిద్ర పట్టేస్తుంది. 29 00:02:22,894 --> 00:02:25,772 కానీ నిద్రలో నేను మాట్లాడను! 30 00:02:25,855 --> 00:02:27,732 నువ్వు నిద్రలో మాట్లాడతావని అందరికీ తెలుసు, ట్రయాంగిల్. 31 00:02:27,816 --> 00:02:29,192 కానీ ఇది నేను రాయలేదు. 32 00:02:29,276 --> 00:02:31,611 నాకు దొరికిన ఈ లేఖని నీకు చూపించాలని వచ్చాను 33 00:02:31,695 --> 00:02:35,031 ఎందుకంటే నా పాన్ కేక్స్ లో నేను వాడే రహస్య పదార్థం గురించి ఇందులో రాసేసి ఉంది. 34 00:02:37,576 --> 00:02:39,619 దాల్చిన చెక్క పొడి! అది నిజం. 35 00:02:39,703 --> 00:02:42,455 ఆగు. దీని అర్థం ఏమిటో నీకు తెలుసు, కదా? 36 00:02:43,707 --> 00:02:46,960 ఇది స్పష్టం చేస్తోంది, స్క్వేర్! మన ద్వీపంలో ఒక గూఢచారి ఉన్నారు! 37 00:02:47,043 --> 00:02:51,089 వాళ్లు మన రహస్యాలు అన్నీ సేకరించి ఈ గాజు సీసాల్లో లేఖలుగా కూరి పెడుతున్నారు. 38 00:02:51,172 --> 00:02:53,216 కానీ అది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? 39 00:02:53,800 --> 00:02:56,094 ఆగు. సర్కిల్ సంగతి ఏంటి? 40 00:02:56,595 --> 00:02:59,973 సర్కిల్! అవును, తనే అయి ఉంటుంది. 41 00:03:00,056 --> 00:03:04,060 ఈ గూఢచారులను ఎలా పట్టుకోవాలో బహుశా ఆమె వీళ్లకి సలహా ఇవ్వగలదు. 42 00:03:05,103 --> 00:03:08,064 లేదు! గూఢచారులు మన ఇద్దరి గురించే రాశారు, సర్కిల్ గురించి కాదు. 43 00:03:08,148 --> 00:03:09,566 మనం ఇందులోకి ఆమెని లాగకూడదు. 44 00:03:10,817 --> 00:03:13,904 మనల్ని ఇప్పుడు ఎవరైనా గమనిస్తున్నారు అంటావా? 45 00:03:17,282 --> 00:03:19,743 చూడు, మనం ప్రశాంతంగా ఉండాలి ఇంకా… 46 00:03:21,953 --> 00:03:23,288 "సీసాలో సందేశం" 47 00:03:24,289 --> 00:03:25,749 ఇది చదువు! 48 00:03:25,832 --> 00:03:28,627 "ఈ రాత్రి చందమామ చాలా బాగా ప్రకాశిస్తోంది. నేను ఎక్కువ నీళ్లు తాగాలి. 49 00:03:28,710 --> 00:03:30,879 స్క్వేర్ యో-యో బొంగరాన్ని అతనిని అడక్కుండానే ట్రయాంగిల్ తీసుకున్నాడు…" 50 00:03:30,962 --> 00:03:33,965 -అయితే అది నీకు అలా చేరిందన్న మాట! -దాన్ని బాగు చేశాక తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నా. 51 00:03:34,049 --> 00:03:35,884 ఆగు, నువ్వు దాన్ని విరగ్గొట్టావా? 52 00:03:35,967 --> 00:03:36,968 దీని మీద దృష్టి పెట్టు, స్క్వేర్! 53 00:03:37,052 --> 00:03:40,555 నేను చేసిన లేదా చేయని మరొక పెద్ద, చీకటి రహస్యం ఉండచ్చేమో? 54 00:03:40,639 --> 00:03:44,476 ఇది రుజువు చేస్తోంది! మనల్ని గూఢచారులు గమనిస్తున్నారు! 55 00:03:44,559 --> 00:03:48,813 బాగా ఆలోచించే స్క్వేర్ కూడా కొన్ని క్లిష్ట సమయాలలో ఊరికే నమ్మేస్తాడు. 56 00:03:48,897 --> 00:03:50,398 ఇది మన మంచికే జరిగింది. 57 00:03:50,482 --> 00:03:51,483 సరే. 58 00:03:52,400 --> 00:03:54,986 మనం లోపలికి వెళ్లే వరకూ ఇంకేం మాట్లాడద్దు. 59 00:03:55,070 --> 00:03:58,073 వాళ్లు ఇప్పుడు మన మాటల్ని వింటూ ఉండచ్చు. 60 00:04:07,749 --> 00:04:10,794 సరే. ఆ గూఢచారి చూడకుండా ఇది అడ్డుకుంటుంది. 61 00:04:10,877 --> 00:04:12,128 మనం వాళ్ల దృష్టిలో పడకూడదు… 62 00:04:13,129 --> 00:04:14,965 -అది ఏంటి? -మనకి ఇక్కడ రక్షణ లేదు. 63 00:04:15,048 --> 00:04:17,007 నా ఇంట్లో ఎవరో మైక్రోఫోన్లు పెట్టారు. 64 00:04:19,094 --> 00:04:21,513 ఇది మామూలు పురుగే అని ఖచ్చితంగా చెప్పచ్చు. 65 00:04:25,642 --> 00:04:28,979 తరువాత ఏంటి? నా చక్కెర కుకీలలో నిమ్మరసం ఉందని వాళ్లు కనిపెట్టేస్తారా… 66 00:04:29,854 --> 00:04:31,064 నేను ఇప్పటికే చాలా చెప్పేశాను. 67 00:04:31,147 --> 00:04:34,067 మనం దీనిని కనిపెట్టాలి. దీని గురించి ఆలోచించాలి. 68 00:04:34,150 --> 00:04:36,528 ఈ గూఢచారులకు మన నుండి ఏం కావాలి? 69 00:04:36,611 --> 00:04:38,280 మన గురించి వివరాలా? 70 00:04:38,363 --> 00:04:41,324 ముఖ్యంగా మన నిద్ర గురించి ఇంకా పాన్ కేక్ అలవాట్ల గురించి? 71 00:04:41,408 --> 00:04:45,620 ఖచ్చితంగా! కాబట్టి మన రహస్యాల్ని మనం వెండి పళ్లెం పెట్టి మరీ ఇచ్చేద్దాం. 72 00:04:45,704 --> 00:04:51,543 వాళ్లు అది ఊహించరు కాబట్టి, బూమ్! వాళ్లు సరిగ్గా మన ఉచ్చులో పడతారు! 73 00:04:51,626 --> 00:04:54,504 -ఏం ఉచ్చు? -నన్ను నమ్ము. త్వరగా, ఇది పెట్టుకో! 74 00:04:58,425 --> 00:04:59,593 అదీ. 75 00:04:59,676 --> 00:05:03,930 సరే, ఇది తగినంత లోతుగా ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్లి ఆ ఏర్పాటు చేస్తే నేను దీన్ని కప్పేస్తాను. 76 00:05:10,812 --> 00:05:12,522 -మనం ఇంక మొదలుపెట్టచ్చు. -పక్కాగా ఉంది! 77 00:05:12,606 --> 00:05:15,817 ఇప్పుడు మనం ఎప్పటిలాగే గట్టిగా మాట్లాడుకుందాం, 78 00:05:15,901 --> 00:05:19,738 అప్పుడు మన రహస్యాలు వినడానికి ఎవరైనా గూఢచారులు వస్తే, బూమ్! 79 00:05:20,238 --> 00:05:24,034 ఈ గుంటలో పడి ఇరుక్కుంటారు! ఈ ముసుగులు తీసేద్దాం. ఇక ఇప్పుడు షో టైమ్. 80 00:05:25,577 --> 00:05:27,996 నేను వీటిని తినడానికి తహతహలాడుతున్నాను… 81 00:05:29,164 --> 00:05:35,086 నా ప్రాణ స్నేహితుడు ట్రయాంగిల్ నిద్ర లేచేసరికి రుచికరమైన పాన్ కేక్స్ సిద్ధంగా ఉంటాయి. 82 00:05:35,170 --> 00:05:40,967 ఇప్పుడు, నా రహస్య పదార్థం దాల్చిన చెక్క పొడి ఏది? 83 00:05:42,719 --> 00:05:47,933 నేను ఇక్కడ నా అన్ని రహస్యాల గురించి కలలు కంటున్నాను. 84 00:05:51,895 --> 00:05:52,896 ఆహ్? 85 00:05:57,359 --> 00:05:58,902 అయితే మీరు ఇక్కడ ఉన్నారన్న మాట! 86 00:05:58,985 --> 00:06:00,403 -సర్కిల్! -సర్కిల్! 87 00:06:00,487 --> 00:06:03,031 మీ ఇద్దరి కోసం నేను మొత్తం అంతా గాలిస్తున్నాను. 88 00:06:03,114 --> 00:06:06,159 ఆగండి. సరిగ్గా దారి మధ్యలో ఈ గుంట ఎందుకు తవ్వారు? ఎవరైనా పడతారు కదా. 89 00:06:06,243 --> 00:06:09,704 అవును, మా ప్లాన్ అదే! మేము గూఢచారుల్ని పట్టుకుంటున్నాం. 90 00:06:12,999 --> 00:06:14,292 మాకు ఈ సీసాలు దొరికాయి 91 00:06:14,376 --> 00:06:18,088 వాటిల్లో మా రహస్యాల గురించి చెప్పే సందేశాలు దాచి పెట్టి ఉన్నాయి. 92 00:06:19,172 --> 00:06:21,716 వాటితో మీరు ఏం చేస్తున్నారు? వాటిని మీరు చదవలేదు, అవునా? 93 00:06:21,800 --> 00:06:25,262 అవును, మేము చదివాము! కానీ నువ్వు వాటిని చదవలేదు, కదా? 94 00:06:25,345 --> 00:06:28,807 వాటిల్లో మా గురించి చాలా కీలకమైన సమాచారం ఉంది. 95 00:06:28,890 --> 00:06:31,851 నాకు అందులో ఏం రాసి ఉందో తెలుసు. వాటిని నేనే రాశాను! 96 00:06:33,603 --> 00:06:35,355 వాళ్లు ముందుగానే తెలుసుకుని ఉండాల్సింది. 97 00:06:35,438 --> 00:06:37,190 ఆ వివరాలు చాలా వ్యక్తిగతమైనవి. 98 00:06:37,274 --> 00:06:39,484 నీ ఉద్దేశం నువ్వేనా ఆ గూఢచారివి? 99 00:06:39,568 --> 00:06:42,404 గూఢచారా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? 100 00:06:44,614 --> 00:06:48,159 సరే. మీకు చెబుతాను కానీ మీరు నవ్వకూడదు. 101 00:06:49,035 --> 00:06:53,498 కొన్నిసార్లు నాకు తల దిమ్ముగా ఉన్నప్పుడు నా భావోద్వేగాల్ని శాంతంగా ఉంచుకోవాల్సి వచ్చినప్పుడు 102 00:06:53,582 --> 00:06:56,835 నా ఆలోచనల్ని కాగితం మీద రాసి వాటి సీసాలో పెట్టి సముద్రంలో విసిరేస్తుంటాను. 103 00:06:56,918 --> 00:07:00,171 అవి అలా కొట్టుకుపోతుంటే నాకు మానసికమైన ఉపశమనం లభిస్తుంది. 104 00:07:00,672 --> 00:07:04,259 ఆ తుఫాను వల్ల వాటిల్లో కొన్ని సీసాలు మళ్లీ మన ద్వీపం వైపు కొట్టుకొచ్చినట్లున్నాయి. 105 00:07:04,342 --> 00:07:08,221 మీరిద్దరూ వాటిని చదివారంటే నేను నమ్మలేకపోతున్నాను! నాకు చాలా సిగ్గుగా ఉంది! 106 00:07:08,805 --> 00:07:11,975 సారీ. మా రహస్యాలు బయటకు వస్తున్నాయని మేము చాలా కంగారు పడ్డాము… 107 00:07:12,058 --> 00:07:16,313 అయితే మీరు నా అన్ని రహస్యాలు చదివేశారా? అది నిజమేనా? 108 00:07:16,396 --> 00:07:20,066 మేము సరిగ్గా ఆలోచించలేకపోయాం. అలా మళ్లీ ఎప్పుడూ జరగదు. ప్రామిస్! 109 00:07:20,150 --> 00:07:21,568 పింకీ ప్రామిస్. 110 00:07:21,651 --> 00:07:22,736 పింకీ ప్రామిస్. 111 00:07:25,155 --> 00:07:27,866 సరే, ఫర్వాలేదు. మీకు తెలియదు. 112 00:07:27,949 --> 00:07:32,329 ఇది చిన్న అపార్థం. దీన్ని ఇంక వదిలేద్దాం. 113 00:07:32,412 --> 00:07:37,459 ఓహ్, స్క్వేర్, నా క్యాలెండర్ ప్రకారం ఈ రోజు నువ్వు ఎప్పుడూ పాటించే 114 00:07:37,542 --> 00:07:41,087 ద్వైమాసిక ద్వై-వార్షిక అత్యుత్తమ బీచ్ పరిశుభ్రతా దినోత్సవం, కదా? 115 00:07:41,171 --> 00:07:44,466 అవును. ఇసుక రేణువు కూడా చెక్కు చెదరకుండా ఉంది. 116 00:07:44,549 --> 00:07:47,844 సరే, అయితే ఈ రోజు చక్కని బీచ్ దినోత్సవం జరుపుకోవచ్చు అన్నమాట. 117 00:07:47,928 --> 00:07:50,805 చూడు, మనం తినడానికి కొన్ని పాన్ కేక్స్ కూడా ఉన్నాయి. 118 00:07:56,770 --> 00:07:59,606 మా మీద గూఢచర్యం జరిగిందని అని ఆలోచించామంటేనే చాలా సిల్లీగా ఉంది. 119 00:08:00,357 --> 00:08:01,483 అవును. 120 00:08:01,566 --> 00:08:04,152 అది సర్కిల్ చేసిన పనే అని తెలిసినా, 121 00:08:04,236 --> 00:08:06,404 తను మన గురించి ఇంకేం రహస్యాలు రాసి 122 00:08:06,488 --> 00:08:10,700 ఆ సీసాల్లో ఉంచిందో అని నాకు భయంగా ఉంది. 123 00:08:13,620 --> 00:08:14,621 హేయ్, ఫ్రెండ్స్! 124 00:08:18,124 --> 00:08:19,125 అవును. 125 00:08:19,709 --> 00:08:21,920 ఈ రోజు తరువాత తను చాలా ఆలోచించుకుంటుంది. 126 00:08:22,546 --> 00:08:25,257 ఓహ్, సరే. ఆ విషయాలు సముద్రానికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయి. 127 00:08:26,550 --> 00:08:30,637 మీ ఇద్దరినీ రేపు కలుస్తాను, సరేనా? దారిలో తినడం కోసం వీటిలో కొన్ని తీసుకుంటాను. 128 00:08:33,597 --> 00:08:35,225 బాగుంది, తను గొప్ప సంతోషంగా ఉంది. 129 00:08:35,933 --> 00:08:38,645 అవును. నన్నడిగితే, కొద్దిగా ఎక్కువ సంతోషంగా ఉంది. 130 00:08:39,145 --> 00:08:41,648 స్క్వేర్, మనం ఆ సీసాని సంపాదించాలి. 131 00:08:41,731 --> 00:08:44,693 ఆగు, ఏంటి? నీకు మతి పోయిందా? 132 00:08:44,776 --> 00:08:47,529 చూడు, అది సరిగ్గా అక్కడే ఉంది! సర్కిల్ ఏం రాసిందో నీకు తెలుసుకోవాలని లేదా? 133 00:08:48,029 --> 00:08:50,323 ఆమె ఖచ్చితంగా మనల్ని తిడుతూ ఏదైనా రాసి 134 00:08:50,407 --> 00:08:52,617 తన కోపాన్ని త్వరగా చల్లార్చుకోవాలని ప్రయత్నించి ఉంటుంది. 135 00:08:52,701 --> 00:08:53,702 నీకు అలా అనిపించలేదా? 136 00:08:53,785 --> 00:08:56,538 నువ్వు ఇలాంటి సూచన చేస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. 137 00:08:56,621 --> 00:08:58,790 నిజం, ఆమె ఇంతకుముందు కలత చెందింది, ఇంకా అవును, 138 00:08:58,873 --> 00:09:00,875 మధ్యాహ్నం అంతా తను ఏకాంతంగా కూర్చుని గడిపింది. 139 00:09:00,959 --> 00:09:05,213 ఇంకా వాస్తవంగా, నేను నీళ్ల బకెట్ నింపుతోంటే తను నా వైపు తదేకంగా చూసింది. 140 00:09:05,297 --> 00:09:09,384 ఆమె ఖచ్చితంగా మన గురించి రాసి ఉంటుంది. బహుశా మనం… 141 00:09:09,467 --> 00:09:12,053 అయ్యో, స్క్వేర్, అలా చేయకు! 142 00:09:12,137 --> 00:09:15,599 కానీ ఆగు, వద్దు. వద్దు, మనం చేయకూడదు. లేదు, అసలు చేయద్దు! 143 00:09:16,933 --> 00:09:22,063 స్క్వేర్, మనం దాన్ని పట్టుకుందాం, చదువుదాం, తరువాత ఆమెకు తెలిసేలోగా దాన్ని మళ్లీ విసిరేద్దాం. 144 00:09:22,147 --> 00:09:24,441 ఆ లేఖలో బాగా తిట్టి ఉంటుంది. 145 00:09:24,524 --> 00:09:29,154 ఏదైనా సూదూర తీరాలకు అది కొట్టుకుపోయి అక్కడ ఎవరైనా దాన్ని చదివి, 146 00:09:29,237 --> 00:09:34,910 "వావ్, ఈ స్క్వేర్ ఒక చెత్త క్యారెక్టర్ లాగా ఉన్నాడు" అనుకుంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? 147 00:09:34,993 --> 00:09:36,328 -చెత్తగానా? -లేదా ఘోరంగా! 148 00:09:36,411 --> 00:09:40,123 నీ పాన్ కేక్ లో వాడే రహస్య పదార్థాల గురించి ఆమె బయటపెట్టేస్తే అప్పుడు ఏంటి? 149 00:09:51,009 --> 00:09:53,803 చదువు! చదువు, స్క్వేర్! చదువు! 150 00:09:53,887 --> 00:09:55,055 సరే! 151 00:09:56,181 --> 00:09:57,515 నన్ను క్షమించు, సర్కిల్. 152 00:09:58,767 --> 00:10:02,687 "మీరు ఇద్దరూ ఇంకెప్పుడూ నా లేఖలు చదవము అని పింకీ ప్రామిస్ చేశారు." 153 00:10:03,897 --> 00:10:04,898 ఏదైనా దొరికిందా? 154 00:10:07,192 --> 00:10:09,110 నీకెలా తెలిసింది? 155 00:10:09,194 --> 00:10:10,779 -మా జీవితంలో ఇంకెప్పుడూ… -సర్కిల్! అయ్యో! 156 00:10:10,862 --> 00:10:13,114 …నీ లేఖలు చదవము అని ఇంకా గట్టి పింకీ ప్రామిస్ చేస్తాము! 157 00:10:13,198 --> 00:10:15,367 -మమ్మల్ని నమ్ము! -నిజంగా చెబుతున్నాం. మేమ నిజంగా… 158 00:10:15,450 --> 00:10:16,618 ఇంక చాలు! 159 00:10:17,911 --> 00:10:20,413 మీ ఇద్దరినీ ఇంకెప్పుడూ నేను నమ్మలేను. 160 00:10:26,002 --> 00:10:30,840 తను నిజమే చెప్పింది. మనల్ని నేను కూడా నమ్మను. మనం ఘోరమైన ఫ్రెండ్స్. 161 00:10:30,924 --> 00:10:34,261 నిజమే. చాలా ఘోరమైన ఫ్రెండ్స్. 162 00:10:34,344 --> 00:10:37,722 నా వల్ల కాదు… నేను ఇంక వెళ్లాలి. 163 00:10:57,951 --> 00:10:58,827 ఆహ్? 164 00:11:10,839 --> 00:11:13,008 నాకు సీసా దొరకలేదు. 165 00:11:40,452 --> 00:11:44,122 సర్కిల్ ఇంకా ట్రయాంగిల్ ని కలవాలని స్క్వేర్ కంగారు పడుతున్నాడు. 166 00:11:44,205 --> 00:11:48,710 ఎందుకంటే తను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని ట్రయాంగిల్ తనకి చెప్పాడు. 167 00:11:48,793 --> 00:11:51,129 దాదాపు వచ్చేశాను. నేను ఆలస్యం కాకూడదు. 168 00:11:51,213 --> 00:11:54,132 "తరువాత ఇదే చాలా పెద్ద విషయం" అని ట్రయాంగిల్ చెప్పాడు. 169 00:11:55,258 --> 00:11:57,010 ఈ చర్చ ఎక్కువ సేపు జరగదు అని ఆశిస్తాను. 170 00:11:57,093 --> 00:11:59,596 నేను మొక్కలకి నీళ్లు పోయాలి ఇంకా వంట పాత్రలు కడగాలి ఇంకా… 171 00:11:59,679 --> 00:12:02,390 అయ్యో, నాకు చెమటలు పడుతున్నాయి. వాళ్లు ఇది గమనించకూడదు. 172 00:12:05,393 --> 00:12:07,562 హలో, స్క్వేర్. నువ్వు అనాసక్తిగా కనిపిస్తున్నావు. 173 00:12:09,940 --> 00:12:12,692 ఈ అడవి ప్రదేశంలో నా కోసం వచ్చినందుకు థాంక్యూ. 174 00:12:13,235 --> 00:12:16,321 నేను ఇందాకే తయారు చేసిన ఒక గేమ్ ఆడటానికి మనం ఇక్కడ సమావేశం అయ్యాం. 175 00:12:16,404 --> 00:12:17,489 కొత్త గేమా? 176 00:12:17,572 --> 00:12:18,740 ఆసక్తికరంగా ఉంది. 177 00:12:18,823 --> 00:12:20,283 ఇది ఆసక్తికరంగానే ఉంటుంది. 178 00:12:20,367 --> 00:12:26,581 ఈ కొత్త గేమ్ లో, మనలో ఇద్దరు దాక్కుంటారు, మిగతా ఒక్కరూ మనల్ని వెతికి పట్టుకుంటారు. 179 00:12:26,665 --> 00:12:30,126 దీనికి నేను పెట్టిన పేరు, దాక్కో ఇంకా వెతుక్కో. 180 00:12:30,210 --> 00:12:33,129 వావ్! ఇది చాలా సొంత ఆలోచన. 181 00:12:33,213 --> 00:12:37,926 థాంక్స్. ఈ ఆట నా సొంతం, ఇంకా నేను కూడా ఒరిజినల్ అని నేను ఒప్పుకుంటాను. 182 00:12:38,009 --> 00:12:39,094 అందుకు థాంక్స్. 183 00:12:39,177 --> 00:12:44,808 మొదటగా, నేను కళ్లు మూసుకుని 20 లెక్కపెడతాను ఈలోగా మీరు ఎక్కడైనా దాక్కోవాలి, ఏహ్? 184 00:12:45,308 --> 00:12:46,309 దాక్కోండి! 185 00:12:47,894 --> 00:12:50,522 ఒకటి. రెండు. మూడు. నాలుగు. 186 00:12:51,064 --> 00:12:52,065 ఇందులో దాక్కుంటాను. 187 00:12:53,108 --> 00:12:54,109 ఐదు. 188 00:12:55,402 --> 00:12:57,946 -ఆరు. -ఈ గుంత సరిగ్గా లేదు. 189 00:12:58,029 --> 00:13:02,075 -ఏడు. ఎనిమిది. -ఇంకో చోటు వెతకాలి. 190 00:13:04,327 --> 00:13:05,495 ఓహ్, సారీ, సర్కిల్. 191 00:13:05,579 --> 00:13:07,122 -నిన్ను చూడలేదు. -తొమ్మిది. 192 00:13:08,915 --> 00:13:10,083 పది. 193 00:13:10,667 --> 00:13:13,753 పదకొండు. పన్నెండు. 194 00:13:17,215 --> 00:13:19,551 -నేను దాక్కోవాలి. -పదమూడు. 195 00:13:24,764 --> 00:13:27,475 -పద్నాలుగు. పదిహేను. -పద. ఇది చెడగొట్టుకోకు. 196 00:13:29,561 --> 00:13:31,438 అయ్యో! నాకు టైమ్ అయిపోతోంది. 197 00:13:31,521 --> 00:13:34,024 -పదహారు. పదిహేడు. -నేను ఇప్పటికే ఆలస్యం చేశానా? 198 00:13:35,317 --> 00:13:36,651 పద్దెనిమిది. 199 00:13:37,903 --> 00:13:38,945 పందొమ్మిది. 200 00:13:41,323 --> 00:13:42,449 ఇరవై! 201 00:13:45,201 --> 00:13:46,369 ఇది ఏంటి? 202 00:13:55,670 --> 00:13:56,671 నిన్ను కనిపెట్టేశాను! 203 00:13:58,590 --> 00:14:02,886 సరే. ఈసారి నువ్వు సరైన దాక్కునే చోటుని వెతకడానికి నేను అవకాశం ఇస్తాను, స్క్వేర్. 204 00:14:02,969 --> 00:14:07,807 ఇంకా, సర్కిల్, నువ్వు మామూలుగా కన్నా కాస్త ఎక్కువ ఎత్తుకి ఎగిరావు. అయినా పని చేయలేదు. 205 00:14:07,891 --> 00:14:10,602 బాబోయ్. నువ్వు అంత ఎత్తుకి చూస్తావని ఊహించలేదు. 206 00:14:10,685 --> 00:14:14,731 సర్కిల్, ఇప్పుడు కనుక్కోవడం నీ వంతు. స్క్వేర్ ఇంకా నేను దాక్కుంటాము. 207 00:14:14,814 --> 00:14:16,024 పద. 208 00:14:16,107 --> 00:14:20,153 ఒకటి. రెండు. మూడు. నాలుగు. 209 00:14:25,825 --> 00:14:26,826 ఐదు. 210 00:14:29,329 --> 00:14:31,248 సరే, నేను సరైన యాంగిల్ కనిపెట్టాలి. 211 00:14:31,331 --> 00:14:34,042 ఈ రంధ్రం గుండా ఎవ్వరూ చూడకుండా ఉండాలంటే బహుశా కొద్దిగా కిందికి దాక్కోవాలి. 212 00:14:34,876 --> 00:14:37,671 ఓహ్, బాబు. ఈ చోటు బాగుంది అనుకుంటా… కానీ మరీ గొప్పగా లేదు. 213 00:14:37,754 --> 00:14:39,839 నేను సరిగ్గా ఆడుతున్నానని వాళ్లు అనుకుంటే చాలు. 214 00:15:14,833 --> 00:15:15,959 ఇది నాకు నచ్చిందా? 215 00:15:17,043 --> 00:15:19,796 "స్క్వేర్ ప్రత్యేక ప్రదేశం." 216 00:15:23,258 --> 00:15:24,259 దొరికిపోయావ్! 217 00:15:25,552 --> 00:15:26,386 సరే. 218 00:15:27,304 --> 00:15:28,847 సరే, ఇప్పుడు మనమంతా 219 00:15:28,930 --> 00:15:31,725 నా కొత్త సొంత గేమ్ పెద్దగా హిట్ అయిందని ఒప్పుకోవాలి. 220 00:15:31,808 --> 00:15:33,476 ఇంక మనం ఈ రోజుకి ఆట ముగిద్దాం. 221 00:15:33,977 --> 00:15:36,313 సరే. హేయ్, బాగా ఆడావు, ట్రయాంగిల్. 222 00:15:36,813 --> 00:15:38,481 థాంక్స్. ఇంక ఉంటాను. 223 00:15:40,525 --> 00:15:43,737 అలాగే దాక్కో ఇంకా పట్టుకో ఆట గురించి అందరికీ చెప్పడం మర్చిపోకండి, 224 00:15:43,820 --> 00:15:46,990 ఈ పేరుతో ఈ గేమ్ శాశ్వతంగా చిరస్మరణీయంగా ఉండిపోవాలి. 225 00:16:15,143 --> 00:16:16,061 బాగుంది. 226 00:16:38,917 --> 00:16:41,336 సరే. నేను ఇంకా చేయవలసిన పనులు ఏం ఉన్నాయి? 227 00:16:41,878 --> 00:16:43,505 నేను బుక్ షెల్ఫ్ ని మళ్లీ సర్దుకుంటాను. 228 00:16:43,588 --> 00:16:46,466 కానీ, ఈ ఉదయమే నేను ఆ పని చేశాను, కానీ మళ్లీ చేసినా తప్పు లేదు. 229 00:16:47,801 --> 00:16:50,512 ఇంకా నేను ఒకటి చేయాలి… 230 00:16:56,768 --> 00:16:57,602 నేను చేయగలనా? 231 00:17:31,761 --> 00:17:36,474 ఇది దాక్కునే ప్రదేశం కన్నా ముఖ్యమైనది అని స్క్వేర్ అనుకుంటున్నాడు. 232 00:17:50,405 --> 00:17:51,781 హాయ్, చిట్టి ఫ్రెండ్స్. 233 00:18:01,541 --> 00:18:02,626 వావ్. 234 00:18:03,793 --> 00:18:05,670 మీకు తెలుసా, ఈ ప్రపంచంలో మన సొంతం అనుకునే 235 00:18:05,754 --> 00:18:09,716 ఒక ప్రత్యేకమైన చిన్న ప్రదేశం ఉంటే ఎంతో బాగుంటుంది. 236 00:18:31,321 --> 00:18:35,200 సరే, చూడబోతే స్క్వేర్ ఈ ప్రదేశాన్ని చాలా ఆస్వాదిస్తున్నట్లు ఉన్నాడు. 237 00:18:35,283 --> 00:18:39,287 కాబట్టి ప్రస్తుతానికి అతడిని ఇక్కడ అలా ఉండనిద్దాం. మనం బయట వేచి ఉందాం. 238 00:18:46,378 --> 00:18:48,338 స్క్వేర్ కి టైమ్ తెలియలేదు. 239 00:18:53,552 --> 00:18:55,345 కొన్నిసార్లు ఇలా ఉండటం మంచిదే. 240 00:19:02,936 --> 00:19:06,773 స్క్వేర్ ఈ ప్రదేశానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు. 241 00:19:08,650 --> 00:19:11,486 ఇందులో ఏదో అతనికి మంచిగా అనిపిస్తోంది. 242 00:19:49,316 --> 00:19:51,359 -స్క్వేర్, లోపల ఉన్నది నువ్వేనా? -ఆహ్? 243 00:19:51,443 --> 00:19:57,240 నువ్వు ఇంకా దాక్కుంటున్నావా? అయ్యో, సారీ, బుజ్జీ. అది పాత ఆట. 244 00:19:57,324 --> 00:19:59,701 మేము కొత్తగా ఇంకో పెద్ద ఆట మొదలుపెట్టాం. 245 00:19:59,784 --> 00:20:02,787 ఆ గేమ్ లో మనం పరిగెడుతూ ఒకరినొకరు ముట్టుకుంటాం. 246 00:20:02,871 --> 00:20:05,165 దాన్ని నేను "తట్టడం" అంటాను. 247 00:20:05,832 --> 00:20:09,377 వావ్, మరొక సొంత ఆలోచన. మీరిద్దరూ లోపలికి వస్తారా? 248 00:20:11,213 --> 00:20:12,464 తప్పకుండా. 249 00:20:13,632 --> 00:20:15,800 హేయ్, ఇక్కడ చాలా బాగుంది. 250 00:20:15,884 --> 00:20:19,512 అవును. నాకు ఈ చక్కని అలంకరణ నచ్చింది. 251 00:20:22,015 --> 00:20:24,142 దీన్ని నువ్వే అల్లావా? 252 00:20:26,061 --> 00:20:27,687 ఇది చక్కని ఏర్పాటు. 253 00:20:28,647 --> 00:20:31,441 కానీ ఈ చీమలు తప్ప. ఇదిగో, నీకు సాయం చేయనివ్వు. 254 00:20:47,499 --> 00:20:49,626 నీకు మరింత సహజమైన వెలుతురు అవసరం అనుకున్నాను. 255 00:20:51,211 --> 00:20:52,212 థాంక్స్. 256 00:20:53,463 --> 00:20:55,590 నువ్వు ఇక్కడ కాలక్షేపం చేస్తున్నావని నాకు తెలుస్తోంది. 257 00:20:55,674 --> 00:21:01,221 దాక్కో-పట్టుకో లేదా తట్టడం లాంటి ఆటలు కాదు, తరువాత మనకి చక్కని మంచి ఆట ఇదే. 258 00:21:01,304 --> 00:21:05,141 ఆగు, లేదు. ఇది మామూలు, చిన్న సైజు ప్రదేశం. 259 00:21:05,642 --> 00:21:08,770 హేయ్, ఈ చెట్టు బెరడు చక్కగా నున్నగా ఉంది. 260 00:21:11,982 --> 00:21:12,983 అయ్యో. 261 00:21:14,067 --> 00:21:16,361 ఏది ఏమైనా, కాసేపు మమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చినందుకు థాంక్స్. 262 00:21:16,444 --> 00:21:18,071 మళ్లీ ఇక్కడికి రావడం కోసం ఎదురుచూస్తుంటాను. 263 00:21:18,154 --> 00:21:23,410 అవును! ఇది మన సొంత ప్రదేశం అనిపిస్తోందని, తెలుసా? 264 00:21:25,328 --> 00:21:28,039 ఖచ్చితంగా. మీ ఇద్దరినీ కలుసుకోవడం సంతోషం. 265 00:21:28,123 --> 00:21:30,292 బై, స్క్వేర్. మళ్లీ కలుద్దాం. 266 00:21:30,792 --> 00:21:31,835 గుడ్ బై! 267 00:22:06,036 --> 00:22:08,914 స్క్వేర్ ప్రదేశం ఇప్పుడు భిన్నంగా కనిపిస్తోంది. 268 00:22:13,877 --> 00:22:16,379 స్క్వేర్ చాలాకాలం ఇక్కడికి రాలేదు. 269 00:22:18,423 --> 00:22:21,343 అతను ఆ తరువాత కూడా ఎప్పుడూ ఇక్కడికి తిరిగి రాలేదు. 270 00:22:30,852 --> 00:22:34,022 అతను ఇక్కడికి రాకుండా ఏం చేస్తున్నాడో మనం వెళ్లి చూద్దామా మరి? 271 00:22:34,773 --> 00:22:36,858 సరే. అక్షరమాల ప్రకారం సర్దడం తేలిక, 272 00:22:36,942 --> 00:22:39,945 కానీ సైజు లేదా కలర్ ప్రకారం సర్దుకుంటే ఇంకా శుభ్రంగా ఉంటుంది. 273 00:22:40,028 --> 00:22:42,989 నా పెద్ద సైజు గ్రాఫిక్ నవలలతో నేను ఏం చేయాలి? 274 00:22:46,284 --> 00:22:47,744 ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? 275 00:22:47,827 --> 00:22:51,790 నేను ముందుగా భోజనం పళ్లాల మీద పెట్టుబడి పెట్టాలి… నాకు తెలియదు. బహుశా ఇది జిడ్డుగా ఉండచ్చు. 276 00:22:55,877 --> 00:22:57,921 నాకు టీని ఎక్కువ వేడి చేయడం… లేదా ఎక్కువ మరిగించడం ఇష్టం లేదు… 277 00:22:58,004 --> 00:22:59,506 లేదా రేపటికి ఉంచడం కూడా. 278 00:23:26,241 --> 00:23:28,827 ఎప్పుడయినా మన ప్రత్యేకమైన ప్రదేశానికి తిరిగి వెళ్లచ్చు. 279 00:23:30,704 --> 00:23:32,497 మనం అక్కడ లేకపోయినా సరే. 280 00:23:49,014 --> 00:23:50,015 "ట్రయాంగిల్," "స్క్వేర్," అండ్ "సర్కిల్" ఆధారంగా 281 00:23:50,098 --> 00:23:51,099 మాక్ బార్నెట్ ఇంకా జాన్ క్లాసెన్ రచన 282 00:24:46,488 --> 00:24:48,490 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్