1 00:00:54,805 --> 00:00:59,810 వెలుతురు. నీడ. వెలుతురు. 2 00:01:03,188 --> 00:01:05,482 పక్షపాత పోలీసు వ్యవస్థ నాశనం అయిపోవాలి 3 00:01:07,734 --> 00:01:10,362 వెలుతురు. నీడ. వెలుతురు. 4 00:01:13,699 --> 00:01:15,825 ఒక నిజం చెప్పనా? మీకు ఇంత వయస్సు ఉంటుందని అనుకోలేదు. 5 00:01:15,826 --> 00:01:18,203 నా పేరు డిటెక్టివ్ చీఫ్ ఇన్స్ పెక్టర్, హెగర్టీ, తను డీఐ లెంకర్. 6 00:01:18,704 --> 00:01:20,496 మీరు దిగువ స్థాయి పోలీసు అనుకుంటా, కాఫీ తీసుకొస్తారా? 7 00:01:20,497 --> 00:01:21,832 కాస్త స్ట్రాంగ్ గా ఉండాలి. 8 00:01:22,791 --> 00:01:25,376 ఇవాళ ఓ ఉగ్రవాద చర్య జరపాలని మీరు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం అందింది, 9 00:01:25,377 --> 00:01:28,129 ఆ విషయంలో ఈ నలుగురి కోసం మేము వెతుకుతున్నాం, 10 00:01:28,130 --> 00:01:30,381 అంతేగాక ఆ చర్యకు కర్త, కర్మ, క్రియ నువ్వేనని నిరూపించే ఆధారాలు 11 00:01:30,382 --> 00:01:32,675 - మా దగ్గర ఉన్నాయి. - ఏంటి? నాకు లాయర్ సదుపాయం లేదా? 12 00:01:32,676 --> 00:01:35,052 సమయం పెద్దగా లేదు కాబట్టి, ప్రాణనష్టం జరిగే అవకాశముంది కాబట్టి… 13 00:01:35,053 --> 00:01:37,054 - అలా అంటారా? - మేము భద్రతా ప్రోటోకాల్ ని అమలు చేసి, 14 00:01:37,055 --> 00:01:39,182 - ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. - అయితే నాకు లాయర్ ఇవ్వరా? 15 00:01:39,183 --> 00:01:40,309 ఇవ్వం. 16 00:01:41,518 --> 00:01:42,727 ఇది సురక్షితమైనదిగా అనిపించట్లేదే. 17 00:01:42,728 --> 00:01:44,270 నీ ప్లాన్ ఏంటి, మిస్టర్ వోజ్నియాక్? 18 00:01:44,271 --> 00:01:46,022 బాంబులను ఎక్కడ, ఎప్పుడు పేలుస్తున్నారో చెప్పు. 19 00:01:46,023 --> 00:01:47,106 అబ్బో. 20 00:01:47,107 --> 00:01:50,067 - నీకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు చాలానే ఉన్నాయి. - నీకు ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు. 21 00:01:50,068 --> 00:01:51,320 వావ్, ఇద్దరు వాయించేస్తారన్నమాట. 22 00:01:53,071 --> 00:01:54,239 మరి నేను ఎవరిని చూసి మాట్లాడాలి? 23 00:01:55,032 --> 00:01:56,241 హా? 24 00:01:57,201 --> 00:01:58,202 థ్యాంక్యూ. 25 00:02:00,746 --> 00:02:04,248 ఓకే, నేను ఇప్పుడు ప్రతివాదికి 'ఎగ్జిబిట్ కేసీ007'ని చూపిస్తున్నాను. 26 00:02:04,249 --> 00:02:07,710 ఇవి నీ డెస్క్ మీద కనిపించిన ఓ నోట్ బుక్కులోని పేజీలు. 27 00:02:07,711 --> 00:02:09,922 ఇది నీదే కదా, మిస్టర్ థాంప్సన్. కాదంటావా? 28 00:02:12,549 --> 00:02:14,884 కాదని ప్రతివాది తిరస్కరించడం లేదు. ఇదేంటి? 29 00:02:14,885 --> 00:02:15,928 ఇది లండన్ పబ్స్ డ్రాయింగా? 30 00:02:20,849 --> 00:02:25,019 {\an8}లండన్ వీధులు, మసీదు, మసీదు, మసీదు. 31 00:02:25,020 --> 00:02:26,647 ఏంటివన్నీ? పేల్చడానికి టార్గెట్స్ కోసం చూస్తున్నావా? 32 00:02:27,731 --> 00:02:28,898 లేదా ఎక్కడెక్కడ షాపింగ్ చేయాలో చూస్తున్నావా? 33 00:02:28,899 --> 00:02:31,276 అన్నీ నీ వైపే పాయింట్ చేస్తున్నాయి. ఇదంతా నీ ప్లానింగే. 34 00:02:31,777 --> 00:02:32,778 ఏంటిది? 35 00:02:34,530 --> 00:02:36,322 2-3-7-8-5. 36 00:02:36,323 --> 00:02:38,825 చిరునామానా? ట్రిగ్గర్ కోడా? 37 00:02:39,451 --> 00:02:41,078 మిస్టర్ థాంప్సన్? 38 00:02:42,204 --> 00:02:44,747 ఏంటది? అది నా చేతివ్రాతేనా? నాకు తెలీట్లేదు. నా చేతివ్రాతేనా? 39 00:02:44,748 --> 00:02:46,083 బాగుంది. 40 00:02:48,544 --> 00:02:50,086 ఇక్కడన్నీ బలమైన ఆధారాలున్నాయి. 41 00:02:50,087 --> 00:02:53,172 ఏంటి? కొంపదీసి, అవన్నీ నిజం అనుకుంటున్నారా? 42 00:02:53,173 --> 00:02:55,050 ఎందుకంటే, చూడండి. 43 00:02:56,844 --> 00:02:58,554 చూశారా? చదవండి అది. 44 00:02:59,137 --> 00:03:00,264 "కాస్మో స్పెషల్." 45 00:03:03,267 --> 00:03:06,018 చూడండి, నేను ఆన్ లైన్లో కొన్ని షోలు చేస్తుంటా. 46 00:03:06,019 --> 00:03:07,103 కాస్మోనాట్ అనే పేరుతో. 47 00:03:07,104 --> 00:03:09,188 అది మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఎలా తెలుస్తుందిలే? 48 00:03:09,189 --> 00:03:11,023 కానీ మేము ఒక ఆన్ లైన్ స్పెషల్ షో చేస్తుంటాం, అందులో… 49 00:03:11,024 --> 00:03:12,609 కల్పితమైనవన్నీ చెప్తుంటా. 50 00:03:13,318 --> 00:03:15,903 - అది మేము నమ్మాలంటావా? - అవి కేవలం కాన్సెప్ట్స్ మాత్రమే. 51 00:03:15,904 --> 00:03:18,615 అదే… సోషల్ మీడియా కంటెంట్ కోసం. 52 00:03:19,324 --> 00:03:21,451 చూడండి, లోగోలు, దుస్తుల ఐడియాలు. 53 00:03:22,995 --> 00:03:24,663 మరి మీరేమనుకున్నారు? మీరు… 54 00:03:25,163 --> 00:03:27,498 మీరు "ఉగ్రవాది ప్లాన్ బుక్" అనుకున్నారు, కదా? 55 00:03:27,499 --> 00:03:28,583 అదే మూలమని అనుకున్నారు. 56 00:03:28,584 --> 00:03:30,085 ఓరి నాయనోయ్, మీరు సూపర్. 57 00:03:30,669 --> 00:03:32,044 ఇదంతా అయిపోయాక నాకు అదొక కాపీ ఇస్తారా? 58 00:03:32,045 --> 00:03:35,132 హా, విచారణ దగ్గర పడుతున్నప్పుడు ఇస్తాంలే. 59 00:03:36,717 --> 00:03:37,718 చాలా అంశాలున్నాయే. 60 00:03:38,385 --> 00:03:40,595 ఇప్పుడు "వాంటెడ్" వాడిని అయిపోయాను కదా నేను? 61 00:03:40,596 --> 00:03:41,597 తప్పుగా అనుకోవద్దు. 62 00:03:42,181 --> 00:03:43,599 మమ్మల్ని భయపెట్టగలమని అనుకుంటున్నారా? 63 00:03:44,099 --> 00:03:46,727 మీరు మా వాళ్ల నినాదాలు విన్నారు కదా. మా సైన్యం కదిలింది. 64 00:03:47,311 --> 00:03:49,229 - నాకేమీ వినిపించట్లేదే. - మేము ఉద్యమబాట పట్టాం. 65 00:03:49,813 --> 00:03:51,856 - బాంబుల ఫ్యాక్టరీకి… - ఈ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం. 66 00:03:51,857 --> 00:03:54,192 - …వెళ్తుండగా నిన్ను అరెస్ట్ చేశాం. - మీ పని, ఇంకా… 67 00:03:54,193 --> 00:03:56,360 - మిడిల్టన్ టవర్స్ లోని ఫ్లాట్ 709. - …మీ పని పడతాం. 68 00:03:56,361 --> 00:03:57,737 మహా అయితే ఇంకో సంవత్సరం ఉంటారు మీరు. 69 00:03:57,738 --> 00:04:00,072 - నైట్రో-గ్లిసరిన్ ఆధారిత బాంబులను… - సామ్రాజ్యాలు వస్తుంటాయి, పోతుంటాయి… 70 00:04:00,073 --> 00:04:02,366 - …కానీ మీ పోలీసులకు మాత్రం… - …తయారు చేస్తున్నారని సూచించే 71 00:04:02,367 --> 00:04:05,077 - ఆధారాలు మాకు అక్కడ లభించాయి. - …త్వరలోనే ఈ భూమ్మీద నూకలు చెల్లిపోతాయి. 72 00:04:05,078 --> 00:04:07,246 మీరు అయిపోయారు. మీ పని అయిపోయింది. మీ స్థానంలో వేరే వాళ్లు వచ్చేస్తారు. 73 00:04:07,247 --> 00:04:09,124 అవునా? ఎవరు వస్తారేంటి? నువ్వు కానీ, నీ తొట్టి గ్యాంగ్ కానా? 74 00:04:09,958 --> 00:04:12,126 - అంత సీన్ లేదులే. - అబ్బే, ఇది నా గురించి కాదు. 75 00:04:12,127 --> 00:04:15,214 ఇది మీ గురించి, సింగం గారు. 76 00:04:16,548 --> 00:04:19,842 మీరు బొమ్మలు, ఫోటోలు చాలానే చూపించారు కానీ, ఫ్లాట్ 7/11ని నేనెప్పుడూ వినలేదు అసలు. 77 00:04:19,843 --> 00:04:21,177 అక్కడికి నేనెప్పుడూ వెళ్లలేదు కూడా. 78 00:04:21,178 --> 00:04:23,971 నువ్వు ఫ్లాట్ 709కి వెళ్తూ ఉండగా నిన్ను అరెస్ట్ చేశారు. 79 00:04:23,972 --> 00:04:25,432 ఆ ఫ్లాట్లోకి నేనెలా వెళ్లాలి? 80 00:04:26,517 --> 00:04:28,142 నా దగ్గర తాళం చెవులు ఉన్నాయా? హలో? 81 00:04:28,143 --> 00:04:30,312 ఆ ఫ్లాట్లోకి వెళ్లడానికి తాళం చెవులేవి? 82 00:04:31,355 --> 00:04:34,815 కానివ్వండి. నన్ను అరెస్ట్ చేసినప్పుడు నా జేబుల్లో ఉన్నవన్నీ తీసుకున్న మీ తిక్కలోళ్లనే అడగండి. 83 00:04:34,816 --> 00:04:37,068 మిడిల్టన్ టవర్స్ కి ఎందుకు వెళ్లావు నువ్వు? 84 00:04:37,069 --> 00:04:38,778 ఏమన్నారు? ఏమన్నారు, సింగం గారు? 85 00:04:38,779 --> 00:04:41,030 మిడిల్టన్ టవర్స్ కి ఎందుకు వెళ్లావు? 86 00:04:41,031 --> 00:04:43,449 నా స్నేహితుడు ఒకడు అద్దె కోసం ఫ్లాట్లని చూస్తున్నాడు, 87 00:04:43,450 --> 00:04:45,368 కాబట్టి వెతికి పెడదామని అనుకున్నా. 88 00:04:45,369 --> 00:04:48,038 సరేనా? విషయమేంటంటే, ఇప్పుడు నేను ఒక చోటకి వెళ్లాలి. 89 00:04:48,830 --> 00:04:49,915 కూర్చో. 90 00:04:54,044 --> 00:04:55,127 ఎందుకు? అది ఎవరి ఫ్లాట్? 91 00:04:55,128 --> 00:04:58,757 నీ కుట్రలో భాగస్వామి అయిన మార్కో రివెల్లీది, అది నీకు చాలా బాగా తెలుసు. 92 00:04:59,508 --> 00:05:02,677 ఇక థెట్ఫర్డ్ ఫారెస్టులో నువ్వు పేల్చేసిన ఆర్మీ బిల్డింగ్ సంగతేంటి? 93 00:05:02,678 --> 00:05:05,013 హా, బాబోయ్. ఆ ఘటన అందరిలా నన్ను కూడా షాక్ కి గురి చేసింది. 94 00:05:06,223 --> 00:05:08,140 అవును. ఎందుకంటే, నేను… నేను వాటిని టపాకాయలని అనుకున్నా. 95 00:05:08,141 --> 00:05:09,225 - టపాకాయలా? - అవును. 96 00:05:09,226 --> 00:05:10,977 హా, అదే, వ్యానులో ఉన్నవాటిని. వాటిని… 97 00:05:10,978 --> 00:05:13,145 - స్పెషల్ కోసం తెప్పించుకున్నా. - స్పెషల్. అంతేలే. 98 00:05:13,146 --> 00:05:17,692 అవి టపాకాయలు కాదు. బాంబులు. డెటొనేటర్ల ద్వారా వాటిని పేలుస్తారు. నీ డెటొనేటర్లే అవి. 99 00:05:17,693 --> 00:05:20,904 ఏడు డెటొనేటర్లను, అదే, "ఫైర్ స్టార్టర్ల"ను నువ్వు దొంగతనం చేసి సంపాదించావు. 100 00:05:21,530 --> 00:05:22,531 అయ్య బాబోయ్. 101 00:05:23,365 --> 00:05:25,491 మనోడు కుట్ర సిద్ధాంతాల స్పెషలిస్టులా ఉన్నాడే? 102 00:05:25,492 --> 00:05:27,578 - ఇది కుట్ర సిద్ధాంతం కానే కాదు. - పిచ్చి సిద్ధాంతాల టీమ్ లీడర్ ఇతను. 103 00:05:28,203 --> 00:05:33,709 ఓరి దేవుడా. బలవంతపెట్టడం, మాటలతో మాయ చేయడం… మీరు ఇలా చాలాసార్లు చేశారు, కదా? 104 00:05:36,128 --> 00:05:38,172 ఇక మీరు అతను ఆడించినట్టు ఆడే తోలుబొమ్మ కదా. 105 00:05:39,173 --> 00:05:40,381 ఆ అడవిలో నువ్వు కూడా ఉన్నావు. 106 00:05:40,382 --> 00:05:42,258 నీ కళ్ల ముందే అతను చనిపోయాడు. 107 00:05:42,259 --> 00:05:43,510 నా కళ్ల ముందే చనిపోయాడా? 108 00:05:47,347 --> 00:05:48,348 ఒకసారి జరిగింది ఆలోచిస్తే… 109 00:05:50,392 --> 00:05:51,476 అసలు మార్కోని చంపింది ఎవరు? 110 00:05:52,394 --> 00:05:53,437 నిజంగానే అడుగుతున్నా? 111 00:05:54,021 --> 00:05:55,272 మీ ముఖం మాడిపోయింది. 112 00:05:56,940 --> 00:05:58,024 బిల్లీ. 113 00:05:58,025 --> 00:06:00,652 అతను ఆ మంటల్లోంచి చెక్కుచెదరకుండా నడుచుకుంటూ వచ్చాడు. 114 00:06:01,737 --> 00:06:05,031 ఒక్క నిమిషం. ఈమెకి తెలుసా అది? సింగం, అది ఈమెకి తెలీదు, కదా? 115 00:06:05,032 --> 00:06:07,533 అరె, జాగ్రత్తగా ఆలోచించండి. అతనే కదా ట్రిగ్గర్ నొక్కింది? 116 00:06:07,534 --> 00:06:10,704 - బాంబులని ఎక్కడ పేలుస్తున్నారో చెప్పు. - ఎవరు నొక్కమంటే నొక్కాడు అతను? 117 00:06:14,166 --> 00:06:15,459 మీరు నొక్కమన్నారా? 118 00:06:16,793 --> 00:06:19,045 వెలుతురు. నీడ. వెలుతురు. 119 00:06:19,046 --> 00:06:21,215 కానీ ఇక్కడ అంత వెలుతురు లేదు కదా? 120 00:06:22,758 --> 00:06:23,925 ఏ పాయింటుతో దాడి చేయాలో ఆలోచిస్తున్నావే. 121 00:06:23,926 --> 00:06:25,177 బాగా ఆలోచిస్తున్నావే. 122 00:06:26,470 --> 00:06:27,471 హా? 123 00:06:28,138 --> 00:06:30,765 - నిఘా విభాగానికి మీరు రావాలి. - ఏమైంది? 124 00:06:30,766 --> 00:06:32,392 ఇంకా ఏమీ తెలీలేదు, కానీ జెన్ ఏదో చెప్పాలనుకుంటోంది. 125 00:06:34,770 --> 00:06:36,647 అడవిలో బిల్లీ ఏదో చేశాడని అతను అంటున్నాడేంటి? 126 00:06:37,814 --> 00:06:39,857 అది అతని పనేనా? ఆ బాంబుని పేల్చింది మన అస్సెటేనా? 127 00:06:39,858 --> 00:06:42,485 - నాకెలా తెలుస్తుంది? నేనక్కడ లేను కదా. - మన గూఢచారులు ఒక మెసేజ్ పంపారు. 128 00:06:42,486 --> 00:06:44,612 వాళ్ల సెల్ ఫోన్లలో ఒక దాన్ని ట్రాక్ చేసి ఓ లొకేషన్ ని పంపారు. 129 00:06:44,613 --> 00:06:47,114 - ఎక్కడ? - ఎల్స్ ఫీల్డ్ స్టేషన్ కార్ పార్కింగ్. 130 00:06:47,115 --> 00:06:48,324 ముప్పై నిమిషాల క్రితం. 131 00:06:48,325 --> 00:06:49,451 ముప్పై నిమిషాలా? 132 00:06:59,211 --> 00:07:00,545 ఫిన్, లైన్లోకి రా. 133 00:07:00,546 --> 00:07:02,630 బాస్, నేను పావెల్ తో ఫీల్డులో ఉన్నా. 134 00:07:02,631 --> 00:07:04,298 అక్కడి కెమెరా ఫుటేజీని ఇక్కడ డిస్ ప్లే చేస్తా. 135 00:07:04,299 --> 00:07:05,300 సిగ్నల్ పోయింది 136 00:07:07,219 --> 00:07:09,721 లాక్ తెరిచి ఉంది. పావెల్, నువ్వు వెళ్లు. 137 00:07:12,432 --> 00:07:14,726 పోలీస్ 138 00:07:19,314 --> 00:07:21,149 - బాస్? - ఉన్నా, చెప్పు. 139 00:07:39,042 --> 00:07:40,043 పావెల్! 140 00:07:41,545 --> 00:07:43,547 వెనక్కి వెళ్లండి. అందరూ దూరంగా పోండి. 141 00:07:44,256 --> 00:07:46,507 - ఏమైంది? - దూరంగా వెళ్లండి! 142 00:07:46,508 --> 00:07:47,801 సరే, వెనక్కి పద, వెనక్కి పద. 143 00:07:53,223 --> 00:07:54,390 పావెల్? 144 00:07:54,391 --> 00:07:55,809 సరే మరి… 145 00:07:56,643 --> 00:07:57,644 హా, ఇది లైవ్లోనే ఉంది. 146 00:07:58,228 --> 00:07:59,437 ఇక్కడ లైవ్ బాంబు ఉంది. 147 00:07:59,438 --> 00:08:01,355 వైర్ లెస్ స్విచ్ రకం బాంబులా ఉంది. 148 00:08:01,356 --> 00:08:03,317 హా, మన డెటొనేటరే ఇది. 149 00:08:05,110 --> 00:08:06,694 చాలా పేలుడు పదార్థాలు ఉన్నాయి. 150 00:08:06,695 --> 00:08:08,405 అడవిలో పేలిన బాంబు కంటే పెద్దదా అది? 151 00:08:09,573 --> 00:08:10,782 అవును. 152 00:08:12,367 --> 00:08:13,535 ఎంత పెద్దది? 153 00:08:14,036 --> 00:08:16,705 కనీసం మూడు రెట్లయినా పెద్దది అనుకుంటా. 154 00:08:52,699 --> 00:08:56,327 ఇది చూడు. మా బృందం ఇప్పుడే దీన్ని కనుగొంది. ఇది 23 నిమిషాల క్రితం జరిగినది. 155 00:08:56,328 --> 00:08:58,746 మీ వాళ్లే. వాళ్ల బ్యాగులని చూడు. 156 00:08:58,747 --> 00:09:02,166 నైజెల్, ఫిల్, చివరిసారిగా ప్లాట్ ఫామ్ వైపు వెళ్తుండగా కనిపించారు. 157 00:09:02,167 --> 00:09:05,003 వాళ్లు రైళ్లలో బాంబులు పెట్టబోతున్నారా? అంతేనా? అదేనా ప్లాన్? 158 00:09:05,879 --> 00:09:07,172 దాని గురించి నాకేం తెలీదు. 159 00:09:08,006 --> 00:09:10,175 మరి వ్యానులో వదిలి వెళ్లిన రెండు బాంబుల సంగతేంటి? 160 00:09:10,926 --> 00:09:12,886 మీ ప్లాన్ ప్రకారం వాటిని ఎవరు తీసుకెళ్లాలి? నువ్వు, బిల్లీనా? 161 00:09:14,847 --> 00:09:16,264 ఆ బ్యాగులకి, అడవిలో పేలిన బాంబుకి 162 00:09:16,265 --> 00:09:19,517 లింక్ చేయడానికి మాకు పెద్దగా సమయం పట్టదు. 163 00:09:19,518 --> 00:09:21,144 ఆ పని మీదే ఉన్నారు మావాళ్లు. 164 00:09:24,398 --> 00:09:25,607 నీకేం కాదని అనుకుంటున్నావా? 165 00:09:26,775 --> 00:09:28,401 మీ వాళ్లు సగం లండన్ ని పేల్చే పనిలో ఉంటారు, 166 00:09:28,402 --> 00:09:30,570 అందాకా నువ్వు ఇక్కడ హాయిగా టైమ్ పాస్ చేయవచ్చని అనుకుంటున్నావా? 167 00:09:30,571 --> 00:09:31,655 అది సరైన సమయాన్నే చూపుతోందా? 168 00:09:32,447 --> 00:09:33,824 నువ్వు సురక్షితం కాదు. 169 00:09:35,075 --> 00:09:37,119 నువ్వు గెలిచినా ఓడినట్టే అని అర్థమవుతోందా నీకు? 170 00:09:37,744 --> 00:09:39,829 ఇప్పుడు దీనికి సూత్రధారివి నువ్వే అని తెలుసుకో. 171 00:09:39,830 --> 00:09:43,125 ఇవాళ ప్రాణనష్టం జరిగితే, బలయ్యేది నువ్వే. 172 00:09:43,709 --> 00:09:45,501 కాదు. నేను కాదు, మీరే. 173 00:09:45,502 --> 00:09:47,086 లేదు, లేదు, తను అన్నది నిజమే. 174 00:09:47,087 --> 00:09:48,838 మహా అయితే, నాకు పెన్షన్ పోతుంది, 175 00:09:48,839 --> 00:09:51,216 కానీ నిన్ను ఎలా హింసిస్తారంటే, తర్వాత ఇలాంటి పనులు ఎవరైనా చేయాలంటే జంకుతారు. 176 00:09:52,718 --> 00:09:53,843 అంత లేదులే. 177 00:09:53,844 --> 00:09:55,846 బాసూ, ఇది లండన్. 178 00:09:56,471 --> 00:09:57,555 అనేక సంస్కృతుల వాళ్లుంటారు. 179 00:09:57,556 --> 00:09:59,015 నీది కూడా బయటి సంస్కృతే కదా. 180 00:09:59,016 --> 00:10:01,268 ఘోరకృత్యాలు, భారీ ప్రాణనష్టం, వీటికి బలయ్యేది బ్రిటిష్ వాళ్లే కాదు. 181 00:10:02,477 --> 00:10:03,520 2005 జూలై 7 ఉదంతం గుర్తుందా? 182 00:10:04,062 --> 00:10:07,982 సంతాపసూచకంగా 18 దేశాల జెండాలను సగం ఎత్తులో ఉంచారు. ఒకసారి ఆలోచించు. 183 00:10:07,983 --> 00:10:09,942 అందులో అమెరికన్లు ఉంటే, ఇక అంతే సంగతులు. 184 00:10:09,943 --> 00:10:15,324 లేదా ఇండియన్లు, లేదా ఎమిరేట్ వాసులు, మిత్రపక్షాలు, నేరస్థుల అప్పగింత ఒప్పందాలు, 185 00:10:16,491 --> 00:10:19,035 నిన్ను టెక్సస్ కో, రియాద్ కో పంపించేస్తారు. 186 00:10:19,036 --> 00:10:20,537 - గ్వాంటానమో. - జైలు బట్టలు వేసుకొని పోతావు. 187 00:10:21,121 --> 00:10:22,496 - తొక్కేం కాదు. - మరణశిక్ష. 188 00:10:22,497 --> 00:10:24,707 - ప్రాణానికి ప్రాణం తీస్తారు. - సర్లే. అలాంటివేం జరగవు. 189 00:10:24,708 --> 00:10:26,542 అది నిన్ను ఎక్కడికి పంపిస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. 190 00:10:26,543 --> 00:10:29,045 నేర నిరూపణకు "ఎన్ని ఆధారాలు కావాలి, ఏంటి" అనేది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. 191 00:10:29,046 --> 00:10:33,133 కొన్ని చోట్ల, ఆధారాలకు అంత పెద్దపీట వేయరు. 192 00:10:34,343 --> 00:10:36,887 ఆ తొక్కలో ప్రదేశాన్ని తగలబెట్టేయాల్సిన సమయం ఆసన్నమైంది, బిల్లీ. 193 00:10:37,804 --> 00:10:41,098 - నిజంగా? - అవును. ఎందుకు? సాయపడతావా? 194 00:10:41,099 --> 00:10:44,144 - నీ ఆలోచన ఏంటి అనేదానిపై ఆధారపడుంటుంది అది. - అది చాలా భారీది. 195 00:10:44,811 --> 00:10:45,896 ఎంత భారీది? 196 00:10:46,730 --> 00:10:48,315 అది నీ ఊహకే వదిలేస్తున్నా, బుడ్డోడా. 197 00:10:50,150 --> 00:10:52,986 టిక్, టిక్, టిక్. 198 00:10:53,612 --> 00:10:54,613 బూమ్! 199 00:10:57,658 --> 00:10:58,659 అదేనా నీకు కావాల్సింది? 200 00:10:59,326 --> 00:11:00,619 పెద్దాయన లెన్ లా చనిపోదామనుకుంటున్నావా? 201 00:11:01,203 --> 00:11:02,287 అంకుల్ లెన్ లా? 202 00:11:02,829 --> 00:11:04,039 రాతియుగపు లెన్ లా? 203 00:11:04,623 --> 00:11:05,624 కానివ్వు. 204 00:11:06,166 --> 00:11:07,584 నువ్వు అతని కన్నా గొప్పోడివే. 205 00:11:08,418 --> 00:11:09,670 జనాలు నీ మాట వింటారు. 206 00:11:14,842 --> 00:11:15,968 నేనేం హింసాత్మకమైన మనిషిని కాదు. 207 00:11:16,635 --> 00:11:17,636 నేను… 208 00:11:18,178 --> 00:11:19,470 నేను వినోదం పంచుతూ ఉంటాను, అంతే. 209 00:11:19,471 --> 00:11:21,889 హా, అంతే. 210 00:11:21,890 --> 00:11:23,140 అవును. 211 00:11:23,141 --> 00:11:25,142 అలాగే నువ్వు అదృష్టవంతుడివి కూడా. 212 00:11:25,143 --> 00:11:28,188 నీకు ఎంచుకునే అవకాశం ఇస్తున్నాం, ఈ అవకాశం అందరికీ దక్కేది కాదు. 213 00:11:29,106 --> 00:11:30,773 ఏం ఎంచుకునే అవకాశం? 214 00:11:30,774 --> 00:11:32,984 నీ మిగిలిన జీవితాన్ని ఎలా గడపాలని అనుకుంటున్నావో ఎంచుకునే అవకాశం. 215 00:11:32,985 --> 00:11:34,528 నీకు ఆసక్తి ఉంటే, 216 00:11:35,153 --> 00:11:36,154 ఆ విషయంలో మేము సహాయపడగలం. 217 00:11:41,618 --> 00:11:43,829 అయితే, ఆ గదిలో లాయర్లు ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే… 218 00:11:45,038 --> 00:11:48,625 నాకు ఏవో కొన్ని వినిపించాయి. జోక్స్ లా అనిపించాయి. 219 00:11:49,877 --> 00:11:51,003 సరదా సంభాషణ. 220 00:11:52,629 --> 00:11:56,132 కానీ మీరు కాస్త త్వరపడాలి. 221 00:11:56,133 --> 00:11:57,301 లీజియన్ టెర్రెస్ 222 00:12:02,681 --> 00:12:06,602 రబ్బిష్ స్టోర్ 223 00:12:23,493 --> 00:12:24,745 సారీ, భయ్యా. 224 00:12:41,220 --> 00:12:42,221 క్లిఫ్. 225 00:12:42,804 --> 00:12:45,014 మా సాక్షితో నువ్వు చర్చలు జరిపి ఒక డీల్ సెట్ చేయాలి. 226 00:12:45,015 --> 00:12:46,016 తప్పకుండా. 227 00:12:47,184 --> 00:12:48,643 నేను మాట్లాడకూడని విషయాలు ఏమైనా ఉన్నాయా? 228 00:12:48,644 --> 00:12:49,853 మాట్లాడకూడని విషయాలా? 229 00:12:50,437 --> 00:12:52,064 చెప్పా కదా, నీ ఊహాశక్తిని వాడేయ్. 230 00:12:58,987 --> 00:13:00,071 నిశ్శబ్దం పాటించండి 231 00:13:00,072 --> 00:13:01,615 ఇంటర్వ్యూల రికార్డింగ్ కొనసాగుతోంది 232 00:13:24,972 --> 00:13:26,223 నన్ను క్లిఫర్డ్ అని పిలవవచ్చు. 233 00:13:27,516 --> 00:13:29,559 ఇంకా సమయం ఉంది, లేదంటే చర్చలకి అతను ఒప్పుకునేవాడు కాదు. 234 00:13:29,560 --> 00:13:31,644 "నీ ఊహాశక్తిని వాడేయ్," అంటే ఏంటి? 235 00:13:31,645 --> 00:13:32,729 ఊహించి చెప్పు, చూద్దాం. 236 00:13:33,438 --> 00:13:34,814 శిక్ష నుండి మినహాయింపా? 237 00:13:34,815 --> 00:13:36,774 మరి నీ స్నేహితుడు, డెన్సిక్ దానికి ఒప్పుకుంటాడా? 238 00:13:36,775 --> 00:13:38,860 డెన్సిక్ మేనేజ్మెంట్ వాళ్లతో కలిసి అష్టా చెమ్మా, తొక్కుడు బిళ్ల ఆటలు 239 00:13:38,861 --> 00:13:40,528 ఆడుతూ ఉంటాడు. 240 00:13:40,529 --> 00:13:42,864 ఇప్పుడు మనిద్దరమే దీన్ని డీల్ చేయాలి. ఇంకెవరూ లేరు. 241 00:13:42,865 --> 00:13:43,866 బాస్? 242 00:13:44,366 --> 00:13:45,449 కిమ్? 243 00:13:45,450 --> 00:13:47,201 బాస్, మేము అయిదో వాడి ఆచూకీ కనిపెట్టాం. 244 00:13:47,202 --> 00:13:48,411 - ఎప్పుడు? - ఇప్పుడే. 245 00:13:48,412 --> 00:13:50,621 బతికే ఉన్నాడు. ఫేస్ మ్యాచ్ ద్వారా టెక్నికల్ సర్వేలెన్స్ యూనిట్ కనిపెట్టింది. 246 00:13:50,622 --> 00:13:52,582 - ఎక్కడ ఉన్నాడు? - ఈస్ట్ హ్యామ్ హై రోడ్. 247 00:13:52,583 --> 00:13:55,209 - ఎక్కడికి వెళ్తున్నాడు? - అది ఇంకా పక్కాగా తెలీదు. 248 00:13:55,210 --> 00:13:56,502 టార్గెట్ ఏంటి? 249 00:13:56,503 --> 00:13:57,796 టార్గెట్ కాగలది ఏదైనా కనిపిస్తోందా? 250 00:13:58,672 --> 00:14:00,882 తెలీట్లేదు. ఏమో మరి. కానీ ఇప్పుడు మేము అతడిని గమనిస్తూ ఉన్నాం. 251 00:14:00,883 --> 00:14:03,843 - సాయుధ బృందం ఉందా? - వస్తున్నారనుకుంటా… 252 00:14:03,844 --> 00:14:05,219 …మధ్య స్థాయి… 253 00:14:05,220 --> 00:14:06,346 అతను మార్కెట్ వైపు వెళ్తున్నాడు. 254 00:14:07,556 --> 00:14:10,893 - షాన్, ఈస్ట్ హ్యామ్ ఫోటోలు చూపగలవా? - ఇంకా రాలేదు. 255 00:14:13,353 --> 00:14:14,437 శాంఫైర్ 256 00:14:14,438 --> 00:14:16,480 కిమ్, అనుమానితుడిని గుర్తుపట్టగలవా? 257 00:14:16,481 --> 00:14:17,565 హా, గుర్తుపట్టగలను. 258 00:14:17,566 --> 00:14:19,150 హా, గుర్తుపట్టేశా. 259 00:14:19,151 --> 00:14:21,235 పక్కానా? నూటికి నూరు శాతం పక్కానా? 260 00:14:21,236 --> 00:14:23,863 - హా, పక్కా. - అతను జనాలకి దూరంగా ఉన్నాడా? 261 00:14:23,864 --> 00:14:25,615 లేదు. చుట్టూ జనాలే ఉన్నారు. 262 00:14:25,616 --> 00:14:27,366 పరిస్థితి మన చేతిలో ఉందా? అతను మనకి కనిపిస్తున్నాడా? 263 00:14:27,367 --> 00:14:29,243 ఏంటి? ఏమన్నావు? సరిగ్గా… 264 00:14:29,244 --> 00:14:30,328 ఏమన్నాడు అతను? 265 00:14:30,329 --> 00:14:32,164 సాయుధ బృందం మీ ఆదేశం కోసం ఎదురుచూస్తోంది, సర్. 266 00:14:33,207 --> 00:14:34,999 యూనిట్ డెల్టా-7, 267 00:14:35,000 --> 00:14:38,128 నేను నిఘా శాఖ సపోర్ట్ విభాగానికి చెందిన డీసీఐ డ్యానియల్ హెగర్టీని. 268 00:14:38,754 --> 00:14:40,463 మేము లైవ్లో ఉన్నాం. నా ఆదేశం కోసం వేచి ఉండండి. 269 00:14:40,464 --> 00:14:43,299 సర్, కాల్చడానికి మీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. 270 00:14:43,300 --> 00:14:46,552 - షాన్. కెమెరాలు లైన్లోకి వచ్చాయా? - లేదు. సారీ. 271 00:14:46,553 --> 00:14:49,431 వాళ్లు రోడ్డు దాటుతున్నారు. కార్ల వెనుక నడుస్తున్నారు. 272 00:14:50,390 --> 00:14:51,892 కిమ్. ఇంకా మాకు విజువల్స్ లభించలేదు. 273 00:14:52,559 --> 00:14:54,810 మనం కాల్పులు జరపడం సురక్షితమేనా? అవునో కాదో చెప్పు. 274 00:14:54,811 --> 00:14:56,605 యూనిట్ డెల్టా-7. సమాధానమివ్వండి. 275 00:14:57,231 --> 00:14:59,106 అతను కనిపించట్లేదు… మార్కెట్ వైపు వెళ్తున్నాడు… 276 00:14:59,107 --> 00:15:01,109 పరిస్థితి మన చేతిలో ఉందా? అతను మనకి కనిపిస్తున్నాడా? 277 00:15:03,153 --> 00:15:04,530 అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. 278 00:15:06,782 --> 00:15:07,866 అతను నడక వేగం పెంచాడు. 279 00:15:08,534 --> 00:15:09,535 డాన్? 280 00:15:11,161 --> 00:15:13,413 మీకు అధికారం ఇస్తున్నా. కాల్చి చంపేయండి. 281 00:15:15,499 --> 00:15:17,083 మీకు సందేశం అందిందా? 282 00:15:17,084 --> 00:15:19,335 అతను మమ్మల్ని చూశాడు. డెల్టా-3 అతని వైపు వెళ్తున్నాడు. 283 00:15:19,336 --> 00:15:20,545 అతను పరుగెడుతున్నాడు. 284 00:15:20,546 --> 00:15:22,421 సాయుధ పోలీసులం! సాయుధ పోలీసులం! 285 00:15:22,422 --> 00:15:23,631 కదలకు! 286 00:15:23,632 --> 00:15:26,552 - అందరూ వెనక్కి వెళ్లండి. - కదలవద్దు! 287 00:15:28,887 --> 00:15:29,888 దేవుడా. 288 00:15:33,058 --> 00:15:35,394 కిమ్. సబ్జెక్ట్ స్టేటస్ ఏంటో చెప్పు. 289 00:15:36,436 --> 00:15:39,605 అతను చనిపోయాడు. మళ్లీ చెప్తున్నా, అతను చనిపోయాడు. 290 00:15:39,606 --> 00:15:42,651 కిమ్, చనిపోయిన వాడు ఎవరో నిర్ధారించి చెప్పగలవా? 291 00:15:45,946 --> 00:15:48,239 హా, అతనే, అయిదో వాడే. పక్కాగా చెప్తున్నా. 292 00:15:48,240 --> 00:15:49,574 మరి బాంబులు, కిమ్? 293 00:15:49,575 --> 00:15:51,326 బాంబ్ స్క్వాడ్ వాటిని డీయాక్టివేట్ చేస్తోంది. 294 00:15:57,165 --> 00:15:58,500 సరే, ఈ ప్రాంతాన్ని సీల్ చేసేయండి. 295 00:16:02,713 --> 00:16:04,631 అయిదో వాడు ఆండీ హేయ్ 296 00:16:05,340 --> 00:16:06,924 - డీఐ లెంకర్. - ఏంటి? 297 00:16:06,925 --> 00:16:09,344 ట్యాక్టికల్ కంట్రోల్ యూనిట్ నుండి ఒక సమాచారం అందింది. 298 00:16:09,970 --> 00:16:12,764 - ఏంటది? - ఇక్కడ ప్రదర్శిస్తున్నా అది. 299 00:16:13,640 --> 00:16:15,309 మూర్ గేట్ స్టేషన్ నుండి బయటకు వస్తున్నారు. 300 00:16:16,894 --> 00:16:18,562 రెండో వాడు, మూడో వాడు. ఇది ఎప్పటి ఫుటేజ్? 301 00:16:19,688 --> 00:16:20,771 తొమ్మిది నిమిషాల క్రితంది. 302 00:16:20,772 --> 00:16:22,316 ఆ తర్వాత? ఇప్పుడెక్కడ ఉన్నారు వాళ్లు? 303 00:16:23,150 --> 00:16:25,068 మేము దగ్గర్లోని కెమెరాలని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 304 00:16:31,158 --> 00:16:32,826 మూడో వాడు ఎక్కడ? ఎక్కడున్నాడు అతను? 305 00:16:33,535 --> 00:16:36,746 అతను రైలు ఎక్కలేదు. చివరిసారి తూర్పు వైపు వెళ్తుండగా కనిపించాడు. 306 00:16:36,747 --> 00:16:37,956 ట్యాక్టికల్ కంట్రోల్ యూనిట్ ట్రాక్ చేస్తోంది. 307 00:16:39,082 --> 00:16:41,000 - మేడమ్? - ఇది చూశావా? 308 00:16:41,001 --> 00:16:42,752 హా, ఇప్పుడు ఫుటేజ్ చూస్తున్నాం. 309 00:16:42,753 --> 00:16:44,795 మీరు… మీరు ఒక్క నిమిషం లైనులో ఉంటారా? 310 00:16:44,796 --> 00:16:48,217 హా, ఇప్పుడే పంపుతున్నా. ఆ చోటు నుండి నిర్ధారించి, ట్రాక్ చేస్తూ ఉండండి. 311 00:16:49,760 --> 00:16:50,885 - హేయ్. - జూన్. 312 00:16:50,886 --> 00:16:53,430 మూర్ గేట్ నుండి రెండో వాడు, నాలుగో వాడు బయటకు వస్తుండగా గమనించాం. 313 00:16:54,056 --> 00:16:55,891 నేను మీకు మళ్లీ కాల్ చేయవచ్చా? సరే. 314 00:16:57,434 --> 00:16:59,352 క్లిఫ్, సహకరించడానికి ఓకే అన్నాడా? 315 00:16:59,353 --> 00:17:02,438 హా. ఒకేసారి 12:45కి పలుచోట్ల దాడులు చేస్తున్నారు. 316 00:17:02,439 --> 00:17:04,398 - 12:45. - ఇంకా 24 నిమిషాలే ఉంది. 317 00:17:05,526 --> 00:17:07,026 - దేవుడా. - వాళ్ల టార్గెట్స్? 318 00:17:07,027 --> 00:17:08,736 - ఒకటి ప్రతిపాదించాడు. - ఓకే. 319 00:17:08,737 --> 00:17:11,739 - శిక్ష నుండి మినహాయించాలని అడుగుతున్నాడు. - సరే. 320 00:17:11,740 --> 00:17:16,118 అంటే, డెటొనేటర్లు, దాడి, ఈ రెంటికి సంబంధించిన ఇతర ఛార్జీల నుండి అతను బయటపడినట్లేనా? 321 00:17:17,246 --> 00:17:19,539 - ఏంటి? - అది మాన్యువల్ లో లేదు. 322 00:17:19,540 --> 00:17:21,624 - మ్యాక్స్ తో ఏమైనా మాట్లాడావా? - హా. మీరేదంటే అదే అన్నాడు. 323 00:17:21,625 --> 00:17:23,669 మ్యాక్స్? హలో, మ్యాక్స్ అంటే ఎవరు? 324 00:17:25,253 --> 00:17:26,420 - మ్యాక్స్… - అతనొక లాయర్. 325 00:17:26,421 --> 00:17:28,339 - నాలా. - మన గూఢచారులకి. 326 00:17:29,675 --> 00:17:31,133 సరే, మరి ఏంటి ఆఫర్? 327 00:17:31,134 --> 00:17:32,760 ఏ ఛార్జీల నుండి మినహాయింపు కోరుతున్నాడు? 328 00:17:32,761 --> 00:17:35,389 చూడండి, ఇలాంటి డీలింగ్స్ సాధారణంగా అత్యంత కీలకమైన అస్సెట్లతో మాత్రమే జరుపుతుంటాం. 329 00:17:35,889 --> 00:17:39,184 ఇది ఓకే అయితే, ఇక నుండి అతనిపై కేసులు పెట్టడానికి ఉండదు. 330 00:17:40,519 --> 00:17:42,103 ఏంటి? అంటే, అతడిని మనం ముట్టుకోలేమా? 331 00:17:42,104 --> 00:17:43,604 - ఎప్పటికీ? - అది ఇతర అంశాలపై ఆధారపడుంటుంది. 332 00:17:43,605 --> 00:17:44,690 ఏంటవి? 333 00:17:45,482 --> 00:17:47,525 కొన్ని పరిమితులుంటాయి. ఈ డీలింగ్స్ కి కొన్ని పరిమితులుంటాయి, కదా? 334 00:17:47,526 --> 00:17:50,069 అవును. జీవితఖైదు శిక్ష పడే నేరాలకు 335 00:17:50,070 --> 00:17:52,989 ఈ డీల్ కవర్ కాదు. 336 00:17:52,990 --> 00:17:56,826 ఆగండి. మన ఏరియా నుండి మనం బయటకి వెళ్లకుండా ఇలా దిగ్బంధానికి గురై ఉండటానికి కారణం 337 00:17:56,827 --> 00:17:58,119 - అతనే. - హా, అది నాకు తెలుసు. 338 00:17:58,120 --> 00:18:01,080 అంతేగాక, లీడ్స్ ఇన్ఫర్మరీలో మన తోటి ఆఫీసర్ ఒకరు చనిపోయి ఉన్నాడు. 339 00:18:01,081 --> 00:18:02,541 చూడండి, ఇది న్యాయబద్ధమైన డీల్ కాదని తెలుసు. 340 00:18:03,041 --> 00:18:05,376 కానీ, ఇప్పుడు అతను డిమాండ్ చేసే పొజిషన్లో ఉన్నాడు, మనకి సమయం లేదు. 341 00:18:05,377 --> 00:18:06,378 చూడు. 342 00:18:07,880 --> 00:18:09,881 జూన్. నాకు ఒక నిమిషం ఇవ్వు. 343 00:18:09,882 --> 00:18:11,132 - మనకి… - జూన్. 344 00:18:11,133 --> 00:18:14,594 మనకి ఇదొక్కటే దారి ఉందని అనుకోవద్దు. ఇప్పుడు అందరినీ మనం ట్రాక్ చేస్తున్నాం. 345 00:18:14,595 --> 00:18:16,637 - హా. మూర్ గేట్ అని అన్నావు కదా. - మేడమ్. 346 00:18:16,638 --> 00:18:20,057 మేడమ్, ఆరు నిమిషాల క్రితం వాళ్లు లెడ్ బెటర్ స్ట్రీట్లోకి ప్రవేశిస్తుండగా మన వాళ్ల కంటపడ్డారు. 347 00:18:20,058 --> 00:18:23,769 - హా. మూర్ గేట్. లంచ్ టైంలో. - అక్కడ ఒకటిన్నర కిలోమీటర్ రేడియస్ లో 348 00:18:23,770 --> 00:18:25,813 - వాళ్లు దాడి జరపగల స్థలాల లిస్ట్ కావాలి. - అలాంటివి చాలా ఉంటాయి. 349 00:18:25,814 --> 00:18:27,815 రైలీ ఆ పని మీదే ఉన్నాడు. సాయుధ బృందంతో అక్కడికి వెళ్తున్నాడు. 350 00:18:27,816 --> 00:18:30,318 - మరి నాల్గవ వాడి సంగతేంటి? - అతను ఎల్స్ ఫీల్డ్ నుండి తూర్పు వైపు వెళ్తున్నాడు. 351 00:18:30,319 --> 00:18:32,028 - హా. ఆ తర్వాత ఏమైనా తెలిసిందా? - లేదు. 352 00:18:32,029 --> 00:18:34,280 మధ్యాహ్నం 12 తర్వాత అతను ఒక ఈ-బైక్ ని అన్ డాక్ చేస్తుండగా శాడీ చూసింది. 353 00:18:34,281 --> 00:18:35,364 నిజంగానా? ఎక్కడ? 354 00:18:35,365 --> 00:18:37,366 - ఫారెస్ట్ గేట్ వైపు వెళ్తున్నాడట. - అరె… 355 00:18:37,367 --> 00:18:39,202 అంటే ఎక్కడికైనా వెళ్లవచ్చు. అంత రిస్క్ తీసుకోలేం మనం. 356 00:18:39,203 --> 00:18:41,162 చూడు. డీల్ సెట్ చేసుకుందాం. ఇది మనకి దక్కిన అవకాశం. 357 00:18:41,163 --> 00:18:42,955 దేనికి అవకాశం? 358 00:18:42,956 --> 00:18:46,250 బాబోయ్. అదేదో మాటవరసకు అన్నానంతే. డీల్ సెట్ చేస్తే, ఎవరి ప్రాణాలూ పోవు. 359 00:18:46,251 --> 00:18:48,419 కాస్మోకి టార్గెట్స్ అన్నీ పక్కాగా తెలుసని మీరెందుకు అనుకుంటున్నారు? 360 00:18:48,420 --> 00:18:51,006 నాకు పక్కాగా తెలీదు. కానీ పాచికలు వేసి చూద్దాం. 361 00:18:51,673 --> 00:18:53,050 పాచికలు వేసి చూద్దాం. 362 00:18:53,800 --> 00:18:55,551 నిచ్చెన తగిలితే, మనకి మంచిదే. 363 00:18:55,552 --> 00:18:57,596 - కానీ ఇక్కడ మనకి తగిలేది పామే. - నిచ్చెన కూడా, పాము కూడా. 364 00:19:00,057 --> 00:19:02,517 మన మాటలని గమనిస్తున్నారా? వీటి వల్లే మనమంటే వాళ్లకి అసహ్యం. 365 00:19:02,518 --> 00:19:04,811 - మరేం పర్వాలేదు. - మీకు ఆనందంగానే ఉన్నట్టుందిగా. 366 00:19:06,188 --> 00:19:08,232 బహుశా నువ్వు ఎదురవ్వకూడదని అనుకునే విషయాలు నాకు కనిపిస్తున్నాయేమో. 367 00:19:09,525 --> 00:19:11,067 నేనెవరో నాకు చెప్పకండి. 368 00:19:11,068 --> 00:19:12,568 - నేను మీలాంటి మనిషిని కాదు. - మేడమ్. 369 00:19:12,569 --> 00:19:14,320 - నేను మీలాంటి మనిషిని కానే కాదు. - మేడమ్. 370 00:19:14,321 --> 00:19:15,947 రెండు నిమిషాల క్రితం వాళ్లని మనవాళ్లు చూసినట్టున్నారు. 371 00:19:15,948 --> 00:19:18,032 - ఓ స్మారక చిహ్నాన్ని దాటుతుండగా. - ఓకే. షాన్, చూసినట్టున్నారా, చూశారా? 372 00:19:18,033 --> 00:19:20,117 - ఇంకా పక్కాగా తెలీదు. - అబ్బా. 373 00:19:20,118 --> 00:19:22,496 - ఛ. ఛ. - జూన్. జూన్. 374 00:19:25,415 --> 00:19:26,792 ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుందాం. 375 00:19:29,086 --> 00:19:31,505 - సరే. అలాగే కానిద్దాం. - పక్కానా? 376 00:19:33,507 --> 00:19:34,508 దొబ్బేయండి. 377 00:19:35,175 --> 00:19:36,593 క్లిఫర్డ్. 378 00:19:37,177 --> 00:19:38,178 డీల్ సెట్ చేసుకుందాం. 379 00:19:39,346 --> 00:19:40,389 టార్గెట్స్ కనుక్కోండి. 380 00:19:49,231 --> 00:19:50,274 మొత్తం టార్గెట్స్ ఎన్ని? 381 00:19:51,567 --> 00:19:52,817 మూడు. 382 00:19:52,818 --> 00:19:54,570 ఈస్ట్ హ్యామ్ హలాల్ స్ట్రీట్ మార్కెట్. 383 00:19:56,446 --> 00:19:57,530 ఇంకా ఎక్కడ? 384 00:19:57,531 --> 00:19:58,614 క్లేయిర్మాంట్ హోటల్ 385 00:19:58,615 --> 00:20:00,534 బార్డేన్ స్ట్రీట్లోని క్లేయిర్మాంట్ హోటల్. 386 00:20:01,368 --> 00:20:04,245 శరణార్థుల సెలవు వినోద శిబిరం. హాట్ టబ్, జాకుజీలు. 387 00:20:04,246 --> 00:20:06,455 ఇంకా? మూర్ గేట్ లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? 388 00:20:06,456 --> 00:20:09,750 ఇమ్మిగ్రేషన్ సెంటర్. అక్కడే కదా వలసదారులకి నివాస అనుమతులు ఇచ్చేది. అక్కడ రెండు పేలతాయి. 389 00:20:09,751 --> 00:20:11,295 హోమ్ ఆఫీస్ యూకే వీసా & ఇమ్మిగ్రేషన్ 390 00:20:27,853 --> 00:20:29,980 క్లెయిర్మాంట్ హోటల్ బార్డేన్ స్ట్రీట్ 391 00:21:19,488 --> 00:21:23,242 ఫైర్ ఎగ్జిట్ అడ్డుగా ఏమీ ఉంచవద్దు 392 00:22:11,498 --> 00:22:13,082 సాయుధ పోలీసులం! 393 00:22:13,083 --> 00:22:14,917 పడుకో! కదలవద్దు! 394 00:22:14,918 --> 00:22:16,502 చేతులు చూపించు! 395 00:22:16,503 --> 00:22:18,589 నేల మీద పడుకో! నేల మీద బోర్లా పడుకో! 396 00:22:20,048 --> 00:22:22,176 పడుకో! కదలకు! 397 00:22:35,981 --> 00:22:38,150 కంట్రోల్, ఆల్ఫా-1ని మాట్లాడుతున్నా. కాల్పులు జరిపాం. 398 00:22:40,068 --> 00:22:41,945 సెవెన్, అక్కడికి వెళ్లి, అతడిని చెక్ చేయ్. 399 00:22:47,451 --> 00:22:49,327 - హా, చనిపోయాడు. - అతను చనిపోయాడు. 400 00:22:49,328 --> 00:22:51,245 నాల్గవ వాడు చనిపోయాడని నిర్ధారిస్తున్నా. 401 00:22:51,246 --> 00:22:53,748 లాబీలో ఎవరూ లేరు. రెండో వాడి ఆచూకీ ఇంకా తెలీట్లేదు. 402 00:22:53,749 --> 00:22:54,875 బిల్డింగ్ మొత్తాన్ని గాలిస్తాం. 403 00:22:55,834 --> 00:22:58,669 ఆల్ఫా-10, వాళ్లు అందరినీ తరలించేయలేకపోయారు. 404 00:22:58,670 --> 00:23:00,463 లోపల ఇంకా కొంతమంది జనం ఉన్నారు. 405 00:23:00,464 --> 00:23:01,590 సరే. 406 00:23:21,235 --> 00:23:22,693 మొదటి అంతస్థులో ఎవరూ లేరు! 407 00:23:22,694 --> 00:23:24,821 ఇతర టార్గెట్స్ విషయంలో స్టేటస్ ఏంటి? 408 00:23:25,489 --> 00:23:27,406 జెన్, దయచేసి చెప్పు. 409 00:23:27,407 --> 00:23:29,992 హా. హోటల్ ని ఖాళీ చేయించాం. ఇప్పుడే బాంబ్ స్క్వాడ్ వాళ్లు లోపలికి వెళ్లారు. 410 00:23:29,993 --> 00:23:32,119 మూడో వాడి ఆచూకీ ఏమైనా తెలిసిందా, జెన్? 411 00:23:32,120 --> 00:23:35,165 లేదు. భయపడిపోయాడేమో? తెలీట్లేదు. 412 00:23:39,628 --> 00:23:41,296 రెండో అంతస్థు లాబీలో ఎవరూ లేరు. 413 00:24:01,567 --> 00:24:03,067 ఒక ఆఫీసరుపై దాడి జరుగుతోంది! 414 00:24:03,068 --> 00:24:04,486 రెండో అంతస్థులో, తూర్పు వైపున్న మెట్ల దగ్గర… 415 00:24:05,696 --> 00:24:07,364 మెట్ల దగ్గర అట! పదండి! పదండి! 416 00:24:12,911 --> 00:24:15,163 ఒక ఆఫీసరుకు గాయాలయ్యాయి. మళ్లీ చెప్తున్నా, ఒక ఆఫీసరుకు గాయాలయ్యాయి. 417 00:24:25,883 --> 00:24:27,092 సెయింట్ బియాట్రిస్ ప్రైమరీ స్కూల్ 418 00:24:27,885 --> 00:24:30,888 కీరన్? ఓరి దేవుడా. నువ్వు ఈపాటికి పియానో వాయిస్తూ ఉండాలి కదా. 419 00:24:31,555 --> 00:24:33,015 ఇప్పుడు వచ్చాగా. 420 00:24:34,558 --> 00:24:36,350 మ్యాడీ రెక్కలను సరిగ్గా పెట్టడంలో మాకు సహాయపడవా? 421 00:24:36,351 --> 00:24:38,061 - గ్లూ అస్సలంటే అస్సలు పని చేయట్లేదు. - సరే. 422 00:24:55,078 --> 00:24:56,246 అబ్బా… 423 00:25:06,381 --> 00:25:08,133 బయటకు రావద్దు. అక్కడే ఉండండి. 424 00:25:10,594 --> 00:25:12,386 - అబ్బా. - సాయుధ పోలీసులం! 425 00:25:12,387 --> 00:25:13,847 కాల్చవద్దు! బ్యాగ్ ఉంది! 426 00:25:15,599 --> 00:25:17,184 అక్కడే ఉండండి. కదలకండి! 427 00:25:19,394 --> 00:25:20,812 ఎవరూ దీన్ని తాకకండి! 428 00:25:22,189 --> 00:25:23,690 అస్సలు తాకవద్దు! 429 00:25:28,195 --> 00:25:30,113 అక్కడ ఉన్నాడు! ఆ తలుపు దగ్గర ఉన్నాడు! 430 00:25:44,711 --> 00:25:46,629 మొబైల్ 07700907258 431 00:25:46,630 --> 00:25:49,966 - పదండి, పదండి, త్వరగా! చలో! - ఒంగో! 432 00:25:49,967 --> 00:25:52,594 టార్గెట్ పైనే దృష్టి పెట్టండి! టార్గెట్ పైనే దృష్టి పెట్టండి! 433 00:26:01,270 --> 00:26:02,855 హేయ్! సాయుధ పోలీస్ ఆఫీసరుని! 434 00:26:04,815 --> 00:26:06,108 రెండో వాడు నాకు కనిపిస్తున్నాడు. 435 00:26:35,470 --> 00:26:38,139 - కీరన్ ఎక్కడ దాడి చేస్తున్నాడో మళ్లీ చెప్పు. - హోటల్. 436 00:26:38,140 --> 00:26:39,975 - శరణార్థులు ఉండే చోటు. - అతను అక్కడ లేడు. 437 00:26:43,520 --> 00:26:45,814 - ఇదే ఆఖరి అవకాశం. అన్నీ కరెక్టుగా చెప్తేనే, డీల్. - నేనెందుకు అబద్ధం చెప్తా? 438 00:26:46,356 --> 00:26:47,566 అబద్ధం చెప్పాల్సిన పని నాకేంటి? 439 00:26:54,156 --> 00:26:55,157 బాస్. 440 00:26:56,617 --> 00:26:57,618 అతనే. 441 00:27:00,037 --> 00:27:01,038 దేవుడా. 442 00:27:10,422 --> 00:27:12,548 సాయుధ పోలీసులం! కదలవద్దు! 443 00:27:12,549 --> 00:27:14,968 వెంటనే ఫోనుని నేల మీద పెట్టేయ్. 444 00:27:17,596 --> 00:27:20,724 ఇప్పుడు బ్యాగ్ తీసి, మెల్లగా నేల మీద పెట్టు. 445 00:27:22,726 --> 00:27:24,853 మంచిది. ఇప్పుడు మెల్లగా నిలబడు. 446 00:27:25,979 --> 00:27:29,107 చేతులు పైకెత్తు. నేను చెప్పినట్టు చేస్తే, నిన్నేం చేయం. 447 00:27:29,775 --> 00:27:31,276 బ్యాగుకి దూరంగా జరుగు. 448 00:27:32,110 --> 00:27:34,487 - ఇంకా జరుగు. - నేను మనస్సు మార్చుకున్నా. మనస్సు మార్చుకున్నా. 449 00:27:34,488 --> 00:27:36,073 - దూరంగా జరుగు. - నేను మనస్సు మార్చుకున్నా. 450 00:27:37,074 --> 00:27:38,367 దేవుడా. 451 00:27:41,370 --> 00:27:42,745 సబ్జెక్ట్ అదుపులో ఉన్నాడు. 452 00:27:42,746 --> 00:27:43,789 శభాష్. 453 00:27:46,625 --> 00:27:47,793 నువ్వు సాధించగలవని నాకు తెలుసు. 454 00:28:16,822 --> 00:28:18,239 పని అయింది. 455 00:28:18,240 --> 00:28:19,408 వాళ్లని పట్టుకున్నారా మీరు? 456 00:28:20,492 --> 00:28:21,493 హా. 457 00:28:23,120 --> 00:28:25,455 ఏడు పేలుడు పరికరాలు కూడా దొరికాయి. 458 00:28:26,039 --> 00:28:27,082 ఒక ఆఫీసరుకి గాయమైంది. 459 00:28:27,833 --> 00:28:29,710 ప్రజలకి కూడా ఎవరికీ ఏమీ కాలేదు, కాబట్టి… 460 00:28:31,461 --> 00:28:32,462 మనకి ఏ సమస్యా లేదు. 461 00:28:34,715 --> 00:28:37,217 నైజెల్ సంగతేంటి? మిగతా వాళ్ల సంగతేంటి? 462 00:28:43,682 --> 00:28:44,933 కాస్మో, అతను… 463 00:28:46,101 --> 00:28:48,103 అతడిని జైల్లో వేస్తారా లేదా… లేదా ఇంకేమైనా చేస్తారా? 464 00:28:49,021 --> 00:28:53,609 చూడు, ఇక్కడున్న నా కొలీగ్, జెన్, నిన్ను ఒక సురక్షిత ఆవాసానికి తీసుకెళ్తుంది. 465 00:28:54,443 --> 00:28:55,569 రెండు మూడు రోజులకేలే. 466 00:28:56,195 --> 00:28:58,280 దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనేంత వరకే. 467 00:29:03,911 --> 00:29:04,912 బిల్లీ. 468 00:29:08,498 --> 00:29:09,833 ఇప్పుడు నువ్వు స్వేచ్ఛాజీవివి. 469 00:29:15,005 --> 00:29:16,298 పద, వెళ్దాం. 470 00:30:16,900 --> 00:30:18,485 - హేయ్. - హాయ్. 471 00:30:19,778 --> 00:30:21,154 నేను బాగానే ఉన్నానని, నాకేం కాలేదని 472 00:30:22,781 --> 00:30:24,282 చెప్పడానికి ఫోన్ చేశా. 473 00:30:24,283 --> 00:30:25,450 ఓకే. మంచిది. 474 00:30:26,326 --> 00:30:28,287 హా, ఇవాళ మాకొక చిన్న విజయం దక్కింది, కాబట్టి… 475 00:30:28,996 --> 00:30:30,705 హా, వార్తల్లో చూశాలే. 476 00:30:30,706 --> 00:30:32,833 సరే, కాబట్టి, 477 00:30:34,084 --> 00:30:35,085 ప్రస్తుతానికి అయితే 478 00:30:36,420 --> 00:30:38,755 గండం గడిచింది మరి. 479 00:30:39,339 --> 00:30:40,340 హా, మంచిది. 480 00:30:40,924 --> 00:30:42,843 నేను నీ కారును రేపు డ్రాప్ చేస్తాను. 481 00:30:45,637 --> 00:30:48,682 హేయ్… చూడు, నేను… 482 00:30:49,766 --> 00:30:51,351 నేనేమంటున్నానంటే, నేను… 483 00:30:51,977 --> 00:30:53,895 నీ సామాను కొన్నింటిని సర్ది పెట్టా. 484 00:30:53,896 --> 00:30:55,147 రోజూ వాడే మామూలివి, అంతే. 485 00:30:56,690 --> 00:30:57,941 నేను… 486 00:31:01,320 --> 00:31:02,905 నువ్వు ఉండటానికి వేరే చోటును చూసుకుంటే మంచిది. 487 00:31:03,697 --> 00:31:05,449 - హా. - అవును, అది… 488 00:31:06,366 --> 00:31:07,492 అంటే… 489 00:31:08,952 --> 00:31:12,038 హా, అలాగే. పర్వాలేదులే. మరేం పర్వాలేదు. 490 00:31:12,039 --> 00:31:13,665 నువ్వు… నువ్వేం అంటే అది. 491 00:31:14,499 --> 00:31:15,501 సరే, మంచిది. 492 00:31:24,635 --> 00:31:25,636 నీ… 493 00:31:27,012 --> 00:31:28,804 నీ యెంకమ్మ. ఛ! 494 00:31:28,805 --> 00:31:31,224 - లియో? - అది నా ఇల్లు! 495 00:31:31,225 --> 00:31:33,184 నిన్ను వెళ్లిపొమ్మంటానని నీకు తెలీదా? అది నా… 496 00:31:33,185 --> 00:31:36,313 - లియో. నేను… లియో, నేను ఇంకా… - అది నా ఇల్లే, పనికిమాలినదానా! 497 00:31:37,981 --> 00:31:41,735 లియో. లియో. వావ్. అంటే… 498 00:31:42,778 --> 00:31:44,820 - బాబోయ్. - లోలోపల దాచుకున్నావు అన్నమాట. 499 00:31:44,821 --> 00:31:46,281 నీలో అంత క్రోధం ఉందని నేను అస్సలు అనుకోలేదు. 500 00:31:48,867 --> 00:31:50,034 "పనికిమాలినదానా" అన్నావా? 501 00:31:50,035 --> 00:31:51,161 నిజంగానా? 502 00:31:53,413 --> 00:31:57,125 ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకని నవ్వుతున్నావు? 503 00:31:58,836 --> 00:32:01,379 ఇప్పుడు నీ దగ్గరికి నేను పరుగెత్తుకు రావాలనుకుంటా. 504 00:32:01,380 --> 00:32:03,757 నేను పరుగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చి… 505 00:32:05,259 --> 00:32:06,760 క్షమించమని బతిమాలాలి. 506 00:32:09,012 --> 00:32:10,264 అదేం అక్కర్లేదులే. 507 00:32:11,348 --> 00:32:12,349 ఇద్దరమూ బాధలోనే ఉన్నాం. 508 00:32:13,684 --> 00:32:15,434 దాన్ని దాచకుండా, ఒప్పుకుంటే పోతుంది, కదా? 509 00:32:15,435 --> 00:32:16,812 ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? 510 00:32:18,730 --> 00:32:19,731 హా. 511 00:32:23,819 --> 00:32:27,155 ఏమో అబ్బా, అందరినీ చూసుకోవడమే నా పని అయిపోయిందేమో అనిపిస్తోంది. 512 00:32:28,407 --> 00:32:29,782 బహుశా నీకు కావాల్సింది అదేనేమో? 513 00:32:29,783 --> 00:32:31,118 కొంచెం? 514 00:32:32,411 --> 00:32:33,703 అన్ని విధాలా. 515 00:32:33,704 --> 00:32:36,123 అంతే కాకుండా, నువ్వు మమ్మల్ని కాపాడటం వంటివి చేయాలి కదా. 516 00:32:37,457 --> 00:32:38,542 హా, అంతే అనుకుంటా. 517 00:32:40,502 --> 00:32:42,587 అంతే ఏమో. కానీ నాకు అది చాలా విలువైనది. 518 00:32:42,588 --> 00:32:43,714 నాకు అన్నమాట. 519 00:32:51,805 --> 00:32:53,932 నాకంటూ సొంత పిల్లలు ఉండాలని నేను ఎంతో ఆశపడ్డా. 520 00:33:00,439 --> 00:33:03,274 అంటే, జేకబ్ చాలడు అని కాదు, జేకబ్ సరిపోతాడు, 521 00:33:03,275 --> 00:33:04,610 కానీ నేను… 522 00:33:06,695 --> 00:33:07,988 నీతో పిల్లల్ని కనాలని అనుకున్నా. 523 00:33:11,074 --> 00:33:12,284 మరి అది ఎందుకు చెప్పలేదు నువ్వు? 524 00:33:16,455 --> 00:33:18,164 నీకు పిల్లలు కావాలో వద్దో నాకు తెలీలేదు. 525 00:33:18,165 --> 00:33:20,875 అంటే, నువ్వు ఎప్పుడు చూసినా 526 00:33:20,876 --> 00:33:23,419 పని, పని, పని అనే తిరుగుతుంటావు, ఇక నాకేమనిపించిందంటే… 527 00:33:23,420 --> 00:33:24,504 ఏమోలే. 528 00:33:24,505 --> 00:33:25,713 అది సాకులా అనిపించింది. 529 00:33:25,714 --> 00:33:29,050 కాబట్టి, నేను చెడగొట్టుకోవాలనుకోలేదు… 530 00:33:29,051 --> 00:33:30,677 రిస్కులో పడేయాలనుకోలేదు… 531 00:33:33,722 --> 00:33:34,932 మన మధ్య ఉన్న బంధాన్ని. 532 00:33:38,769 --> 00:33:40,145 నువ్వు అడిగి ఉండాల్సింది. 533 00:33:44,900 --> 00:33:45,901 హా. 534 00:33:48,904 --> 00:33:50,030 ఎందుకు మనమిలా మాట్లాడుకుంటున్నాం? 535 00:33:52,950 --> 00:33:55,536 ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నాం? ఒక్కసారిగా ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? 536 00:33:59,414 --> 00:34:00,415 ఏమో. 537 00:34:02,876 --> 00:34:04,336 ఇప్పటికే ఆలస్యమైపోయింది, కదా? 538 00:34:07,464 --> 00:34:08,507 కదా? 539 00:34:11,844 --> 00:34:12,844 ఇప్పటికే అంతా మించిపోయింది. 540 00:34:16,264 --> 00:34:17,516 అలా అనకు… నేను… 541 00:34:20,185 --> 00:34:21,270 అడగమని అన్నావు కదా. 542 00:34:22,813 --> 00:34:23,981 కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా… 543 00:34:53,135 --> 00:34:54,844 అంబులెన్స్ 544 00:35:51,527 --> 00:35:54,028 నువ్వంటే మాకు ప్రాణం, కాస్మో! 545 00:35:54,029 --> 00:35:58,283 ఆరు వారాల అనంతరం 546 00:36:45,247 --> 00:36:46,539 ఇక్కడికి వచ్చావేంటి? 547 00:36:46,540 --> 00:36:47,958 చూద్దామని వచ్చా. 548 00:36:49,376 --> 00:36:52,087 నువ్వు కాల్ చేయలేదు. నేను కంగారు పడ్డాను. 549 00:36:53,714 --> 00:36:54,715 సరే. 550 00:36:59,887 --> 00:37:01,180 షో చూశావా? 551 00:37:01,805 --> 00:37:03,222 ఈసారి చూస్తాలే. 552 00:37:03,223 --> 00:37:06,476 ఒకటి చెప్పనా? వాళ్లందరూ తిక్కలోళ్లు. 553 00:37:17,821 --> 00:37:19,781 నీ అసిస్టెంటుకు జరిగిన దాన్ని విని బాధపడ్డా. 554 00:37:23,660 --> 00:37:24,995 అతని పేరు లియో, కదా? 555 00:37:26,955 --> 00:37:28,248 హా, అలా జరిగి ఉండాల్సింది కాదు. 556 00:37:30,834 --> 00:37:33,420 తను బాగానే షాక్ అయి ఉంటుంది అనుకుంటా. 557 00:37:34,254 --> 00:37:36,548 ఆ… ఆ పని చేసింది ఎవరో… ఎవరో కనిపెట్టారా? లేదా… 558 00:37:37,674 --> 00:37:39,176 నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? 559 00:37:40,302 --> 00:37:44,264 హా, అది ఒక అభిమాని చేసి ఉండవచ్చనే మాట విన్నా. 560 00:37:44,973 --> 00:37:45,974 ఎవరి దగ్గర విన్నావు? 561 00:37:47,142 --> 00:37:49,102 అంటే, వాళ్లూ వీళ్లూ మాట్లాడుకుంటుంటే విన్నా. 562 00:37:49,686 --> 00:37:50,938 పుకార్లు అనుకో. 563 00:37:52,356 --> 00:37:54,273 కానీ నేను వాళ్లకి చెప్పా… దానికి నేనేం చేయలేను అని. అంతే కదా? 564 00:37:54,274 --> 00:37:56,485 ఎందుకంటే, ఏం చేయాలో జనాలకు నేను చెప్పను కదా. 565 00:37:59,571 --> 00:38:00,948 లేదా అది అస్సలు జరగనే లేదేమో. 566 00:38:01,448 --> 00:38:02,866 జరిగిందని మీరే నాటకం ఆడుతున్నారేమో. 567 00:38:04,368 --> 00:38:05,702 ఆ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? 568 00:38:08,247 --> 00:38:09,331 జోక్ చేస్తున్నాలే. 569 00:38:09,831 --> 00:38:10,874 అది జోక్. 570 00:38:12,793 --> 00:38:14,460 మనకి అవన్నీ కొత్త కాదు, కదా? అవి మనం చేసినవే. 571 00:38:14,461 --> 00:38:16,337 అది పాత కాన్సెప్ట్. కానీ… 572 00:38:16,338 --> 00:38:18,006 నీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటున్నావని విన్నానే. 573 00:38:19,174 --> 00:38:21,551 న్యూయార్క్, కొలరాడో. 574 00:38:21,552 --> 00:38:23,427 అవును. కొన్ని మీటింగ్స్ పని ఉంది, అంతే. హా. 575 00:38:23,428 --> 00:38:25,138 నాకు పూర్తి నివేదిక అందించాలి మరి. 576 00:38:25,806 --> 00:38:27,098 లేదు, అంత లేదు. 577 00:38:27,099 --> 00:38:28,517 మనం అనుకున్నది అది కాదు, కదా? 578 00:38:29,518 --> 00:38:33,855 నేను ఇక్కడి వివరాలను, జర్మనీ వివరాలను అందిస్తూ ఉంటా, 579 00:38:33,856 --> 00:38:35,983 కానీ వాళ్లవి ఇవ్వను. ఎందుకంటే, వాళ్లు నాతో మంచిగా ఉంటున్నారు. 580 00:38:37,276 --> 00:38:39,444 కానీ, నీకు నీ పాస్ పోర్ట్ కావాలి, కదా? 581 00:38:40,737 --> 00:38:41,738 గావిన్. 582 00:38:42,698 --> 00:38:44,366 నన్ను గుప్పెట్లో ఉంచుకున్నానని అనుకుంటున్నావు, కదా? 583 00:38:45,617 --> 00:38:47,452 నేను నీ రేంజీని ఎప్పుడో దాటేశా, మిస్టర్ సింగం. 584 00:38:49,997 --> 00:38:51,456 బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టున్నావే. 585 00:38:54,168 --> 00:38:55,210 ఆగు. 586 00:38:56,962 --> 00:38:58,297 అతను… అతను బాగానే ఉన్నాడా? 587 00:38:59,548 --> 00:39:00,549 ఎవరు? 588 00:39:03,260 --> 00:39:04,261 బిల్లీ. 589 00:39:06,763 --> 00:39:11,810 హా, ఒకవేళ నువ్వు అతడిని కలిస్తే, నేను మనస్సులో ఏం పెట్టుకోలేదని చెప్పు. 590 00:39:12,769 --> 00:39:14,021 హా, ఆ పని చేయగలవా? 591 00:39:15,522 --> 00:39:16,523 హా. 592 00:39:19,568 --> 00:39:20,569 ఎప్పుడైనా… 593 00:39:21,612 --> 00:39:23,447 ఎప్పుడైనా అతను నా గురించి అడిగాడా? 594 00:40:30,347 --> 00:40:31,473 ఎలా ఉన్నాడు? 595 00:40:32,224 --> 00:40:33,225 నీకు తెలిసిందేగా. 596 00:40:36,562 --> 00:40:38,230 చెప్పు మరి. ఏమన్నా పనికొచ్చేది చెప్పాడా? 597 00:40:39,523 --> 00:40:40,607 ఎవరి పేర్లయినా చెప్పాడా? 598 00:40:42,651 --> 00:40:44,027 లేదు. ఇప్పుడేం చెప్పలేదు. 599 00:40:46,029 --> 00:40:47,114 సారీ. 600 00:40:51,493 --> 00:40:53,328 ఒకటి చెప్పనా? మనం ఇలా చేయాల్సిన పని లేదు. 601 00:40:55,205 --> 00:40:57,457 మనం అతడిని తరలించేసి, మన గూఢచారులకు అప్పగించేయవచ్చు. 602 00:40:58,250 --> 00:40:59,709 మనం మరీ తొందరపడుతున్నామని అనిపిస్తోంది. 603 00:40:59,710 --> 00:41:00,711 లేదులే. 604 00:41:02,880 --> 00:41:04,006 మన దగ్గరే ఉంచుకుందాం అతడిని. 605 00:41:05,132 --> 00:41:06,466 విచారణ కొనసాగిద్దాం. 606 00:41:11,555 --> 00:41:12,764 నువ్వు ఇక ఇంటికిళ్తే మంచిది. 607 00:41:14,224 --> 00:41:15,308 నీకొక ట్యాక్సీ బుక్ చేస్తా. 608 00:41:15,309 --> 00:41:16,560 కూర్చోండి ముందు. 609 00:41:18,979 --> 00:41:20,396 - పక్కానా? - హా, కూర్చోండి. 610 00:41:20,397 --> 00:41:22,232 ఒక్క నిమిషం కూర్చోండి. 611 00:41:23,775 --> 00:41:25,027 ప్లీజ్. 612 00:41:39,750 --> 00:41:42,753 నీకు ఏం కావాలన్నా పర్వాలేదు, అది ఏదైనా సరే. 613 00:41:44,171 --> 00:41:45,506 నేను ఉన్నానని మర్చిపోకు. 614 00:41:46,256 --> 00:41:47,340 థ్యాంక్యూ. 615 00:41:47,341 --> 00:41:48,342 మరేం పర్వాలేదు. 616 00:41:58,685 --> 00:42:01,104 ఇది, ఇంకొకటి ఇస్తారా? 617 00:42:03,815 --> 00:42:05,359 నాకు ఒక కాఫీ ఇస్తారా? 618 00:42:06,860 --> 00:42:07,945 కాఫీయా? 619 00:42:09,571 --> 00:42:11,823 వాటి… వాటి నుండా? 620 00:42:12,366 --> 00:42:13,742 అయితే ఏమైంది? 621 00:42:16,912 --> 00:42:18,288 నేనైతే ఆ సాహసం చేయను, బాసూ. 622 00:42:22,459 --> 00:42:23,585 ఏం చెప్పమంటావు? 623 00:42:26,380 --> 00:42:27,422 నేను ఆశావాదిని. 624 00:42:33,512 --> 00:42:34,721 అయ్య బాబోయ్. 625 00:44:20,827 --> 00:44:22,829 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్