1 00:00:07,007 --> 00:00:07,841 ఎర్రొల్ కేసును మళ్లీ ఎప్పుడు తెరుస్తారు? 2 00:00:07,841 --> 00:00:08,759 ఎమర్జెన్సీ కాలర్ ఎవరు?? తను ఎక్కడ ఉంది? 3 00:00:08,759 --> 00:00:09,676 ఈ రికార్డింగ్ గురించి వాళ్లకి ఎప్పట్నుండి తెలుసు? 4 00:00:09,676 --> 00:00:10,594 పోలీసులు జవాబివ్వాల్సిన ప్రశ్నలు 5 00:00:10,594 --> 00:00:11,595 తన కోసం వెతికారా? తను క్షేమమేనా? 6 00:00:11,595 --> 00:00:13,180 నీపై నమ్మకం కోల్పోలేదు ఎర్రొల్ మ్యాథిస్ #ఎర్రొల్ కి న్యాయం దక్కాలి 7 00:00:13,180 --> 00:00:14,097 అతని పేరును మార్మోగనివ్వండి 8 00:00:14,097 --> 00:00:15,140 ఈ రికార్డింగ్ వింటుంటే ఒళ్లంతా జలదరించిపోతోంది 9 00:00:15,140 --> 00:00:16,225 దారుణం ఈ విషాదకర కేసుకు మరొకరు బలి 10 00:00:16,225 --> 00:00:17,351 పోలీసులు ఉత్త సన్నాసులు #ఎర్రొల్ కి న్యాయం దక్కాలి 11 00:00:23,440 --> 00:00:25,901 హాయ్, నేను సోనియాని. మెసేజ్ ఏంటో చెప్పండి, మీకు నేను తర్వాత ఫోన్ చేస్తాను. 12 00:00:26,485 --> 00:00:29,154 సోనియా, మళ్లీ నేనే. 13 00:00:30,364 --> 00:00:32,448 దయచేసి ఫోన్ ఎత్తు. 14 00:00:33,116 --> 00:00:34,368 ఫోన్ ఎత్తు, పుణ్యం ఉంటుంది. 15 00:00:41,166 --> 00:00:43,293 నేనే నీ స్థానంలో ఉంటే, ఆ పని చేయను. 16 00:00:43,293 --> 00:00:46,129 ఈ సమాచారం లీకేజీ తర్వాత, నీ మీద ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతుంది. 17 00:00:46,129 --> 00:00:48,507 ఏంటి? కాల్ రికార్డింగ్ ని లీక్ చేసింది నేను కాదు. 18 00:00:48,507 --> 00:00:52,135 బలహీనమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తికి హాని జరిగేలా చచ్చినా నేను వ్యవహరించను! 19 00:00:52,135 --> 00:00:54,054 - సరే. - ఆ కేసును దర్యాప్తు చేసింది మీరే. 20 00:00:54,054 --> 00:00:56,265 - వాళ్లు మీ మీదనే విచారణ చేస్తారు. - తప్పకుండా చేస్తారు. 21 00:00:56,265 --> 00:00:58,183 దీన్ని మనం అదుపులోకి తీసుకురాకపోతే, ఆ పని ఖచ్చితంగా చేస్తారు. 22 00:00:58,183 --> 00:01:00,143 - దేవుడా. - దీన్ని మనం ఎలాగూ అదుపులోకి తీసుకురాలేం. 23 00:01:00,143 --> 00:01:02,271 - అవును. - వాళ్ళు దాన్ని మూసివేస్తే తప్ప. 24 00:01:02,271 --> 00:01:05,190 ట్విట్టర్ ని మనకి ఇష్టం వచ్చినప్పుడు మూసివేయలేము, కాబట్టి... 25 00:01:09,695 --> 00:01:11,321 నేను వాళ్లతో మాట్లాడితే మంచిదేమో. 26 00:01:11,321 --> 00:01:13,615 నాకు... నాకు తెలిసినదంతా చెప్పేస్తే మేలేమో. 27 00:01:14,283 --> 00:01:16,451 - అది మంచి ఆలోచనే. - హా. 28 00:01:16,451 --> 00:01:19,204 అవును. ఎందుకంటే, ఆధారాలేవిటో తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకు ఉంది. 29 00:01:19,204 --> 00:01:20,831 మొత్తం ఆధారాలని. అవి ఏవైనా కానీ. 30 00:01:20,831 --> 00:01:23,584 అవునా? మరి నేరాంగీకారం సంగతేంటి? 31 00:01:24,960 --> 00:01:26,795 "గొంతు." "ఛాతీ." అవన్నీ? 32 00:01:26,795 --> 00:01:30,007 అనుమానితుని నయానో భయానో నేనే ఒప్పించానని నువ్వు అనవచ్చు, 33 00:01:30,549 --> 00:01:32,301 కానీ అతనికి వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయి. 34 00:01:33,093 --> 00:01:34,845 నేను అతడిని తన ఇంటికి తీసుకెళ్లా. అతను ఒప్పుకున్నాడు. 35 00:01:34,845 --> 00:01:36,263 హత్య జరిగినప్పుడు అతను వేరే చోట ఉన్నాడు. 36 00:01:37,389 --> 00:01:40,350 - బార్బర్ షాప్ అతనా? కామెడీ చేస్తున్నావా? - మొస్తాఫా డెమీర్. 37 00:01:40,350 --> 00:01:42,477 హా, కానీ అతను ఇస్తాన్బుల్ కి వెళ్లిపోయాడు. 38 00:01:42,477 --> 00:01:45,814 అతను లండన్ లోనే ఉన్నాడు. అతడిని నేను కలిశా కూడా. అతను చూసింది ఎర్రొల్ నే అని అనుకుంటున్నాడు. 39 00:01:45,814 --> 00:01:49,318 అయితే మాతో వచ్చి ఆ ముక్క చెప్పి ఉండవచ్చు కదా? ఎందుకు చెప్పలేదు? 40 00:01:49,318 --> 00:01:51,111 మీరు నిజంగా ఆ ప్రశ్న అడుగుతున్నారా? 41 00:01:51,820 --> 00:01:54,573 మీకు చాలా అధికారాలు ఉన్నాయి కదా? 42 00:01:55,073 --> 00:01:58,368 అతను భయపడ్డాడు. మీలాంటి వాళ్లు ఏం చేస్తారో అని బెదిరిపోయాడు. 43 00:01:58,869 --> 00:02:01,330 కాల్ చేసిన వ్యక్తి లవర్ కి, ఆమె తన గురించి చెప్పింది తెలుసుకోవడానికి 44 00:02:01,330 --> 00:02:04,541 పెద్ద సమయం పట్టదు. 45 00:02:04,541 --> 00:02:07,794 తెలుసుకున్నాక, అతను ఆమెని ఏం చేస్తాడో మనం ఊహించలేం కూడా. 46 00:02:07,794 --> 00:02:10,172 - నాకు తెలుసు. - ఈపాటికే ఆమెని చంపేసి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. 47 00:02:10,172 --> 00:02:14,468 మీరు చేయగల ఒకే ఒక్క పని ఏంటో తెలుసా... 48 00:02:16,303 --> 00:02:19,306 "ఒకవేళ నేను పొరబడ్డానేమో? హత్య చేసింది ఎర్రొల్ కాదేమో? 49 00:02:19,306 --> 00:02:23,977 అతను కాకపోతే ఇంకెవరు?" అని పునరాలోచించడమే. 50 00:02:34,696 --> 00:02:38,158 నా చర్యలను నేను ప్రశ్నించుకోను అనుకుంటున్నావా? 51 00:02:38,158 --> 00:02:39,910 ప్రశ్నించుకుంటా! 52 00:02:40,661 --> 00:02:41,912 ప్రతిరోజూ! 53 00:02:42,746 --> 00:02:44,581 నా ప్రధాన శత్రువు ఎవరో కాదు, నేనే. 54 00:02:44,581 --> 00:02:46,708 అవునా? నేను నమ్మను. 55 00:02:47,251 --> 00:02:48,293 ఆగు! 56 00:02:53,966 --> 00:02:55,175 సరే మరి, ఓ పని చేద్దాం! 57 00:02:55,676 --> 00:02:56,927 నీకు ఆధారాలన్నీ చూపుతాను. 58 00:02:57,803 --> 00:02:58,971 నేనేమీ దాచట్లేదు. 59 00:03:08,146 --> 00:03:09,356 అలా ఉండాలి. 60 00:04:13,712 --> 00:04:15,839 టాక్సికాలజీ. ప్యాథాలజీ రిపోర్ట్. 61 00:04:17,257 --> 00:04:18,759 పొరుగువారు. ఆ అపార్టుమెంటులో ఉన్నవారు. 62 00:04:19,343 --> 00:04:21,762 టవర్స్ లో ఉన్నవాళ్లలో ఎవరికైనా నేర చరిత్ర ఉందా అని దర్యాప్తు జరిపి, చేసిన రిపోర్ట్. 63 00:04:21,762 --> 00:04:23,680 ఎవరి గురించి అయినా సిస్టములో రికార్డ్ ఉందా అన్న రిపోర్ట్. ఇదుగో. 64 00:04:24,640 --> 00:04:26,975 మరి గృహ హింస కేసులేవైనా? హింసకు పాల్పడిన కేసులు? 65 00:04:26,975 --> 00:04:29,645 హా, ఆ టవరులో ఉన్న ఒకరిద్దరు పాల్పడ్డారు. అంతా రిపోర్టులో ఉంది. 66 00:04:29,645 --> 00:04:33,023 ట్రేస్ చేయడం, ఇంటర్వ్యూ చేయడం, ప్రమేయం లేని వారిని తీసివేయడం. సాక్షుల వాంగ్మూలాలు. 67 00:04:33,023 --> 00:04:36,944 ఆలిబైలన్నింటిన్నీ పరిశీలించాం. చూడు. జాగ్రత్త, నిదానంగా అన్నింటినీ చూడు. 68 00:04:39,530 --> 00:04:41,323 మరి క్లైవ్ సిల్కాక్స్ సంగతేంటి? 69 00:04:41,323 --> 00:04:43,325 సిల్కాక్స్ సంగతి అంటే? 70 00:04:43,325 --> 00:04:46,036 అతనికి నేర చరిత్ర ఉంది కదా. మరి అతని గురించి ఫైల్ లో ఎందుకు లేదు? 71 00:04:46,662 --> 00:04:47,829 అతను అప్పుడు టవర్స్ లో లేడు. 72 00:04:47,829 --> 00:04:49,498 కానీ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడుగా. 73 00:04:49,498 --> 00:04:50,666 లేక్ స్ట్రీట్. తెలుసు. 74 00:04:50,666 --> 00:04:53,919 - అతడిని ఇంటర్వ్యూ చేశారా? - లేదు, మేము ఏం చేశామో చెప్తా విను. 75 00:04:53,919 --> 00:04:56,380 ఆ ప్రాంతంలో నేరచరిత్ర ఉన్న వాళ్లందరినీ గుర్తించాం, 76 00:04:56,380 --> 00:04:58,674 వారి డీఎన్ఏ, వేలిముద్రలు తీసుకొని, హత్య జరిగిన చోటు దొరికిన వాటితో పోల్చి చూశాం. 77 00:04:58,674 --> 00:05:01,134 - మరి? - మరి ఏవీ మ్యాచ్ కాలేదు. 78 00:05:01,134 --> 00:05:04,221 - సిల్కాక్స్ ది కూడానా? - అవును, ఎవరితోనూ మ్యాచ్ కాలేదు. 79 00:05:04,221 --> 00:05:07,182 సరే. ఇప్పుడు వేరే దృష్టి కోణంతో విశ్లేషిద్దాం. 80 00:05:07,766 --> 00:05:09,726 - హత్య జరిగిన చోటు గురించి చెప్పండి. - ఏం చెప్పాలి? 81 00:05:11,061 --> 00:05:14,022 హా. హత్య జరిగిన చోటు గురించి ఏమైనా చెప్తారా? 82 00:05:14,940 --> 00:05:17,276 సీఎస్ఐ, మొదటిసారి వెళ్లినప్పుడు గమనించినవి, 83 00:05:18,402 --> 00:05:19,570 సారాంశ రిపోర్టులు? 84 00:05:21,280 --> 00:05:22,364 ఇంకోటి. 85 00:05:23,782 --> 00:05:24,783 ఫాలో అప్ రిపోర్టులు. 86 00:05:26,869 --> 00:05:29,162 - నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. - ఇంట్లో మీకు ఎక్కువ డీఎన్ఏ దొరికిందా? 87 00:05:29,162 --> 00:05:32,040 ఎర్రొల్, వంటగదిలో తలపని చేస్తాడు, నగదు రూపంలోనే ఫీజ్ తీసుకొనేవాడు. 88 00:05:32,040 --> 00:05:34,168 కాబట్టి, రోజంతా అతని దగ్గరికి మనుషులు వస్తూ పోతుండేవారు. 89 00:05:34,168 --> 00:05:36,336 కాబట్టి, వేలి ముద్రలు కూడా ఎక్కువే దొరికాయి. 90 00:05:36,336 --> 00:05:38,088 ఎర్రొల్, తన క్లయింట్ల ఊరూ, పేర్లను ఎక్కడైనా రాసుకొనేవాడా? 91 00:05:38,088 --> 00:05:39,590 హా. అతని బుర్రలో. 92 00:05:39,590 --> 00:05:45,220 క్రమం తప్పకుండా వచ్చే వాళ్ల పేర్లను, ముద్దుపేర్లని నోట్ చేసుకొని, వాళ్లందరినీ విచారించాం. 93 00:05:45,220 --> 00:05:46,388 హా, కానీ... ఒక్క నిమిషం. 94 00:05:46,388 --> 00:05:49,099 ఇంట్లోకి తెలీని వాళ్లు కూడా వచ్చి పోతుంటే, 95 00:05:49,099 --> 00:05:52,060 వాళ్లకే నేర చరిత్ర ఉండుంటే, వాళ్ల డీఎన్ఏ మన డేటా బేసులో ఉన్నవాటితో మ్యాచ్ అయ్యేదే కదా? 96 00:05:52,060 --> 00:05:54,438 అవును, డీఎన్ఏ. 97 00:05:54,438 --> 00:05:57,024 ఇంట్లో దొరికిన డీఎన్ఏతో మ్యాచ్ అయిన పాత నేరస్థులను మేము విచారించాం. 98 00:05:57,024 --> 00:05:59,401 అదెలా చేయాలో నీకు తెలుసు కదా, ట్రేస్ చేయడం, ఇంటర్వ్యూ చేయడం... 99 00:05:59,401 --> 00:06:02,237 ప్రమేయం లేని వారిని తీసివేయడం. హా. కానీ ఏదది? ఆ జాబితా ఎక్కడ? 100 00:06:02,237 --> 00:06:03,572 ఇక్కడే ఉంది. 101 00:06:05,157 --> 00:06:06,867 ఇక్కడే ఎక్కడో ఉండాలి. 102 00:06:12,748 --> 00:06:14,833 ఇదుగో. బాగా చూసుకో. 103 00:06:24,885 --> 00:06:26,386 క్లాడియా కాల్. నేను మాట్లాడి వస్తా. 104 00:06:38,524 --> 00:06:40,484 ఆ పనంతా నిన్నే పూర్తి అయిపోయింది. 105 00:06:40,484 --> 00:06:45,155 నేర చరిత్ర ఉన్నవాళ్లందరినీ తనిఖీ చేసి, ఏమీ లేదని తేల్చేశాం. 106 00:06:49,993 --> 00:06:52,162 పేరు, నేరచరిత్ర, చర్యలు 107 00:06:52,162 --> 00:06:54,665 క్లాడియా మేహ్యూ మొబైల్ 108 00:06:59,378 --> 00:07:00,462 దయచేసి తలుపు తట్టి, వేచి ఉండండి 109 00:07:04,258 --> 00:07:06,176 నీ ఫీజును రెండింతలు చేస్తే ఓకేనా? 110 00:07:06,176 --> 00:07:07,469 హా. 111 00:07:08,762 --> 00:07:10,681 - సరే, ఇంతకీ ఎక్కడ ఉన్నావు నువ్వు? - మా ఇంట్లోనే. 112 00:07:11,181 --> 00:07:13,976 వద్దు, అక్కడే ఉండు. నేనే వస్తా. 113 00:07:15,811 --> 00:07:17,020 ఇంట్లోనే ఉన్నాడు. 114 00:07:20,232 --> 00:07:21,233 సరే. 115 00:07:32,619 --> 00:07:34,246 తనని దొబ్బేయమని చెప్తే నీ కాళ్లు మొక్కుతా. 116 00:07:35,873 --> 00:07:37,833 హలో, పాపా. ఏం కావాలి? 117 00:07:37,833 --> 00:07:39,626 - ఎక్కడికి వెళ్తున్నారు? - ఏంటి? 118 00:07:39,626 --> 00:07:40,878 సారీ, ఎక్కువ సమయం లేదు. 119 00:07:40,878 --> 00:07:43,380 సరే. ఉన్నత స్థాయి అధికారుల విచారణలో నాకు తెలిసినవి నేను చెప్పేస్తా. 120 00:07:44,631 --> 00:07:46,550 కిమ్, తనకి ఆ చిరునామా పంపు. నువ్వు అక్కడికి వచ్చేయ్. 121 00:07:46,550 --> 00:07:47,843 సరే. 122 00:07:59,146 --> 00:08:02,983 చూడు, ఇదంతా కాకతాళీయం అయ్యుంటుంది. చూస్తుంటే తేడాగానే ఉంది, నేను కాదనట్లేదు. 123 00:08:02,983 --> 00:08:05,485 - ఆ సమయంలో టోనీ నీకేమీ చెప్పలేదా? - ఒక్క ముక్క కూడా చెప్పలేదు. 124 00:08:05,485 --> 00:08:08,405 లేదు, "ఇతని ఆలిబై సరిగ్గా లేదు," అని కానీ, "మరో కోణంలో ఆలోచిద్దాం. 125 00:08:08,405 --> 00:08:10,532 - సహాయపడవా?" అని కానీ అనలేదా? - లేదు, గురూ. ప్రమాణపూర్తిగా చెప్తున్నా. 126 00:08:10,532 --> 00:08:12,159 నేను నీకు అలా చేయను. 127 00:08:12,159 --> 00:08:15,120 - నిన్ను అసలు మోసం చేయను. - అతను హతురాలి ఇంట్లోనే ఉన్నాడు. 128 00:08:15,120 --> 00:08:17,706 హా, అతని వేలిముద్రలు ఉన్నాయి. దాని వల్ల ఏం నిరూపితం అవుతుంది చెప్పు! 129 00:08:17,706 --> 00:08:20,501 అతను ఉన్నాడు. కానీ ఎప్పుడు ఉన్నాడో చెప్పలేం కదా. 130 00:08:20,501 --> 00:08:23,170 సరే. ఇక్కడ ఉన్నది చదువుతున్నా. 131 00:08:23,170 --> 00:08:25,756 నేను అతడిని సెప్టెంబర్ 21, 2011 న కలిసి, 132 00:08:25,756 --> 00:08:28,300 - మధ్యాహ్నం రెండున్నరకి ఇంటర్వ్యూ చేశాను. - ఇంకా? 133 00:08:28,300 --> 00:08:30,511 చాలా రోజుల క్రితం, అతను హతురాలైన... 134 00:08:30,511 --> 00:08:32,054 అడిలైడ్ ఇంటికి వెళ్లినట్టు చెప్పాడు. 135 00:08:32,054 --> 00:08:34,472 ఇక్కడ రాసుంది కదా. ఆ ఏడాది జూన్ లో తల పని చేయించుకోవడానికి వెళ్లాడు. 136 00:08:34,472 --> 00:08:37,058 హత్య జరిగినప్పుడు ఆ చోట ఉన్నాడా, లేదా? 137 00:08:37,808 --> 00:08:38,809 సరే. 138 00:08:38,809 --> 00:08:41,355 హత్య జరిగిన సమయంలో, ఇంట్లోనే తన భార్యతో ఉన్నట్టుగా చెప్పాడు. 139 00:08:41,355 --> 00:08:44,191 - ఇంకా? - తను ఏదో గొడవలో ఉండింది. 140 00:08:44,191 --> 00:08:46,944 ఎవరో కారును గుద్దింది. బీమా సంస్థ వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 141 00:08:46,944 --> 00:08:48,362 సరే. అప్పుడు నువ్వు ఏం చేశావు? 142 00:08:48,362 --> 00:08:52,115 కాబట్టి, నేను ఆలిబై బలంగా లేదని నోట్ చేసుకొని, లోతుగా విచారించాను. 143 00:08:52,115 --> 00:08:56,453 తర్వాతి రోజు, టోనీ అతని ఇంటికి వెళ్లి, రెండవసారి ఇంటర్వ్యూ చేశాడు, ఆ తర్వాత... 144 00:08:59,623 --> 00:09:02,584 హా. అతనిపై విచారణ అక్కర్లేదని నోట్ చేశాడు. 145 00:09:03,502 --> 00:09:05,045 కానీ అప్పుడు అతని భార్య ఇంట్లో లేదని నోట్ చేశాడు కదా. 146 00:09:05,045 --> 00:09:06,129 అర్థమైంది. 147 00:09:10,717 --> 00:09:13,971 కానీ టోనీ గురించి నీకు తెలుసు కదా. అతను ఒక యోధుడు. 148 00:09:13,971 --> 00:09:15,722 చాలా నిజాయితీగల పోలీసు ఆఫీసర్. అతను... 149 00:09:17,266 --> 00:09:18,475 అతను మనల్ని నిరాశపరచడు. 150 00:09:27,442 --> 00:09:28,694 నేను వెళ్లి చూసొస్తా. 151 00:09:38,287 --> 00:09:39,288 ఎవరు? 152 00:09:40,914 --> 00:09:42,332 స్టెఫన్ ఉన్నాడా? 153 00:09:42,332 --> 00:09:43,709 మీరెవరు? 154 00:09:44,418 --> 00:09:46,837 - డ్యానియల్. - సరే. 155 00:09:46,837 --> 00:09:49,381 మిమ్మల్ని పెరట్లో వేచి ఉండమని చెప్పాడు. 156 00:09:50,257 --> 00:09:51,550 మీకు టీ తీసుకువస్తాను. 157 00:09:52,092 --> 00:09:53,719 - టీ? - అతను త్వరగానే వచ్చేస్తాడు. 158 00:09:55,304 --> 00:09:56,638 థ్యాంక్యూ. 159 00:10:50,484 --> 00:10:53,070 మిసెస్ యాష్. మిసెస్ యాష్. 160 00:10:55,364 --> 00:10:56,782 మీరు బాగానే ఉన్నారా? అతను మిమ్మల్ని గాయపరిచాడా? 161 00:10:57,324 --> 00:11:00,327 లేదు, నాకేం కాలేదు. కాసేపట్లో అంతా బాగా అయిపోతుంది. నాకు కేవలం... 162 00:11:08,252 --> 00:11:10,754 - చెప్పండి, డిటెక్టివ్ చీఫ్ ఇన్స్ పెక్టర్, హెగర్టీ. - కట్రీనా. ఒక పారామెడిక్ కావాలి. 163 00:11:10,754 --> 00:11:14,550 61 బెల్మోంట్ డ్రైవ్, కెమ్స్ ఫర్డ్ చిరునామాకి పంపు. గృహ హింస. 164 00:11:14,550 --> 00:11:16,468 - సరే. అలాగే. - సరే, థ్యాంక్యూ. 165 00:11:17,427 --> 00:11:20,055 మిసెస్ యాష్, అతను ఎక్కడ ఉన్నాడు? 166 00:11:21,431 --> 00:11:24,309 - మీ భర్త ఎక్కడ ఉన్నాడు, మిసెస్ యాష్? - నాకు తెలీదు. 167 00:11:24,309 --> 00:11:26,812 మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టమని చెప్పి... 168 00:11:28,021 --> 00:11:31,316 వీలైనంత ఎక్కువ సేపు ఇక్కడే ఉండేలా చేయమన్నాడు. కాబట్టి, ఇప్పుడు నేను ఆ పనే చేస్తున్నా. 169 00:11:35,529 --> 00:11:36,613 స్టెఫన్ యాష్? 170 00:11:36,613 --> 00:11:39,575 - అతను నాకు తెలుసు. ఒక ఇన్ఫార్మర్ అతను. - నీకా? 171 00:11:39,575 --> 00:11:41,618 అవును, గత నాలుగైదేళ్ల నుండి. 172 00:11:41,618 --> 00:11:44,788 ఆ సమయంలో కాదు. ఆ సమయంలో అతను టోనీతో పని చేసేవాడు. 173 00:11:44,788 --> 00:11:49,209 బార్లలో, స్నూకర్ హాల్స్ లో స్లాట్ మెషిన్స్ ని నడిపేవాడు. 174 00:11:49,209 --> 00:11:51,461 అక్కడ ఉన్నప్పుడు, జనాలకు అప్పులు ఇచ్చేవాడు. 175 00:11:51,461 --> 00:11:53,839 ఏమీ అడగకుండా నేరుగా చేతికి డబ్బులు ఇచ్చేవాడు. 176 00:11:53,839 --> 00:11:55,924 అలా వచ్చిన డబ్బునంతా, ఇళ్లు కొని అద్దెకి ఇచ్చేవాడు. 177 00:11:55,924 --> 00:11:58,886 ఇక్కడ విషయం ఏంటంటే, అతనికి చాలా పరిచయాలు అవుతాయి. 178 00:11:58,886 --> 00:12:01,972 కాబట్టి, టోనీ ఆరోగ్యం దెబ్బతిన్నాక, అతడిని నేను పనిలో పెట్టుకున్నాను. 179 00:12:02,681 --> 00:12:03,682 రక్షణ. 180 00:12:03,682 --> 00:12:05,017 "రక్షణ?" 181 00:12:05,017 --> 00:12:08,103 హా, హయీస్ లేన్ కాలర్, అతనికి రక్షణ ఉందని చెప్పింది. 182 00:12:08,103 --> 00:12:09,479 - నువ్వు తనతో మాట్లాడావా? - హా. 183 00:12:10,063 --> 00:12:11,899 తను అలా మొదటిసారి అన్నప్పుడు, నాకు ఒక ఆలోచన వస్తూ ఉండింది, 184 00:12:11,899 --> 00:12:14,985 "బహుశా, బహుశా వాళ్లు..." 185 00:12:15,903 --> 00:12:16,904 పోలీసులు కావచ్చు అని. 186 00:12:17,946 --> 00:12:20,365 కానీ అతను ఇన్ఫార్మర్ కాబట్టి, ఏమీ కాదని అనుకుంటున్నాడు. 187 00:12:20,365 --> 00:12:21,825 ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. 188 00:12:21,825 --> 00:12:23,410 సరే, ఈ ఇళ్లు, అంటే... 189 00:12:24,244 --> 00:12:26,121 - ఎన్ని ఉండవచ్చు? - చాలా. 190 00:12:26,121 --> 00:12:27,497 - టవర్స్ లో ఏమైనా ఉన్నాయా? - ఉన్నాయి. 191 00:12:27,497 --> 00:12:28,957 మరి అడిలైడ్ హత్యకు గురైనప్పుడు, 192 00:12:28,957 --> 00:12:30,667 ఇళ్లు ఎవరివని నోట్ చేసుకున్నారు? 193 00:12:30,667 --> 00:12:32,127 - అతనివనా, కిరాయిదారులవనా? - కిరాయిదారులవి. 194 00:12:32,127 --> 00:12:34,963 యాష్ తనకి నచ్చినప్పుడు వచ్చి వెళ్తుంటాడు. అతని రాకపోకలని మేము పట్టించుకొని ఉండకపోవచ్చు. 195 00:12:34,963 --> 00:12:37,049 దీని గురించి, యాష్ గురించి ఇంకెవరెవరికి తెలుసు? 196 00:12:37,049 --> 00:12:38,509 టోనీకి తెలుసు, అంతే. 197 00:12:38,509 --> 00:12:40,135 ఈయనికి తెలీదా? 198 00:12:40,928 --> 00:12:42,971 కిమ్? తెలీదు. నాకు అతని మీద చాలా నమ్మకం ఉంది. 199 00:12:42,971 --> 00:12:45,849 - టోనీని కూడా నమ్మారు కదా మీరు. - హేయ్, బాస్. మనం ఇప్పుడు ఏం చేద్దాం? 200 00:12:45,849 --> 00:12:48,143 యాష్ పేరు మీద కానీ, అతని భార్య పేరు మీద కానీ ఉన్న, 201 00:12:48,143 --> 00:12:51,355 అద్దెకు ఇచ్చిన ఇళ్లు, అలాగే ఇతర ఆస్థుల చిరునామాలు నాకు పంపించు, 202 00:12:51,355 --> 00:12:53,482 అలాగే అతను కో-డైరెక్టరుగా ఏయే లిమిటెడ్ కంపెనీల్లో ఉన్నాడో కూడా కావాలి. 203 00:12:53,482 --> 00:12:55,692 సరే, నేను ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తా. 204 00:12:55,692 --> 00:12:57,903 - నమ్మకస్థులనే పెట్టుకో. మన స్టేషనులో ఉండేవాళ్లనే. - అలాగే. 205 00:12:58,820 --> 00:12:59,821 అబ్బా. 206 00:12:59,821 --> 00:13:01,281 - ఏమైంది? - లీకైన రికార్డింగ్. 207 00:13:02,449 --> 00:13:04,910 అది వైరల్ అవుతోంది. అన్నిచోట్లకూ పాకిపోతోంది. 208 00:13:06,828 --> 00:13:09,998 కోపంతో ఊగిపోతున్న చాలామంది ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నారు. 209 00:13:09,998 --> 00:13:13,210 పోప్లర్ నుండి మార్విన్ లైనులో ఉన్నారు. చెప్పండి, మార్విన్. 210 00:13:13,210 --> 00:13:15,671 బాబోయ్. ఈ పోలీసులకు ఒక దండం. 211 00:13:15,671 --> 00:13:18,924 మెరుగవుతున్నాం, మెరుగవుతున్నాం అని సొల్లు చెప్తున్నారు, కానీ అదంతా అబద్ధం. వాళ్లు... 212 00:13:18,924 --> 00:13:21,760 ...ఏం జరిగిందో చెప్పమని 999ని కాల్ చేస్తూనే ఉన్నాను. చెప్పడానికి ఏమైంది... 213 00:13:21,760 --> 00:13:23,637 నేర్చుకుంటూ ఉన్నామని వాళ్లు చెప్పేదంతా అబద్ధం. 214 00:13:23,637 --> 00:13:26,807 వాళ్ల అమ్మ, తన బిడ్డ కోసం అనుదినం పోరాడుతూనే ఉంది. తనకి ఏం గతి పట్టిందో చూశాముగా. 215 00:13:26,807 --> 00:13:29,017 ...కారుతో గుద్దించి చంపారు. ఎవరు గుద్దారు? ఆమె కొడుకుని 216 00:13:29,017 --> 00:13:30,102 జైలుపాలు చేసిన వెధవలే. 217 00:13:30,102 --> 00:13:33,188 హా. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్యూ. సమయం వెచ్చించి వచ్చినందుకు ధన్యవాదాలు. 218 00:13:33,188 --> 00:13:35,190 నేను రెండు ముక్కలు చెప్పేసి వెళ్లిపోతాను. 219 00:13:35,774 --> 00:13:40,070 ఆన్ లైన్ లో అప్ లోడ్ అయిన టేపు విషయంలో ప్రజల ఆందోళనలను అర్థం చేసుకుంటున్నాను, నాకు కూడా ఆందోళనగానే ఉంది. 220 00:13:40,070 --> 00:13:44,408 మనం అనుకున్నట్టు, దురదృష్టవశాత్తూ ఈ కాల్ నిజమైనదే అయితే, 221 00:13:44,408 --> 00:13:48,370 ఆ కాల్ చేసిన వ్యక్తికి రక్షణ అందించడానికి నేను నా శాయశక్తులా కృషి చేస్తాను. 222 00:13:48,370 --> 00:13:50,539 ఈ సమయంలో, నేను మీకు దీని కన్నా ఇంకేమీ చెప్పలేను. 223 00:13:50,539 --> 00:13:53,792 కానీ దయచేసి అర్థం చేసుకోండి, దీనికే మా తొలి ప్రాధాన్యతని ఇస్తున్నాం, 224 00:13:53,792 --> 00:13:57,171 మాకు మరింత సమాచారం అందాక, మీతో కూడా పంచుకుంటాం. 225 00:13:57,171 --> 00:13:58,839 సరే మరి... థ్యాంక్యూ, మన్నించాలి... 226 00:13:58,839 --> 00:14:00,465 మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. 227 00:14:00,465 --> 00:14:01,550 అందరికీ చాలా చాలా థ్యాంక్స్. 228 00:14:01,550 --> 00:14:03,552 అందరూ శ్రద్ధగా వినండి. 229 00:14:04,261 --> 00:14:05,929 హలో. ఈస్ట్ లండన్ పోలీసులం. 230 00:14:05,929 --> 00:14:07,764 మన దగ్గర 17 ఇళ్ల చిరునామాలు ఉన్నాయి. 231 00:14:07,764 --> 00:14:10,017 టవర్సులో అయిదు ఉన్నాయి, మిగతావన్నీ ఆ పరిసరాల్లోనే ఉన్నాయి. 232 00:14:10,017 --> 00:14:12,060 హాయ్, మేం పోలీసులం. ఈ ప్రాంతంలో ఉన్న బాధితురాలి కోసం వెతుకుతున్నాం. 233 00:14:12,060 --> 00:14:13,395 లోపలికి వచ్చి చూడవచ్చా? పర్వాలేదు కదా? 234 00:14:14,730 --> 00:14:17,232 ప్రధాన వ్యక్తి పేరు, స్టెఫన్ యాష్. 235 00:14:17,232 --> 00:14:20,360 శ్వేతజాతీయుడు, 45-50 సంవత్సరాల లోపల ఉంటుంది వయస్సు. జాగ్రత్తగా వ్యవహరించాలి. 236 00:14:20,360 --> 00:14:23,405 మేము పోలీసులం. స్టెఫన్ యాష్ కోసం వెతుకుతున్నాం. ఇక్కడ ఉన్నాడా? 237 00:14:23,405 --> 00:14:26,825 రెండవ వ్యక్తి, బ్రెజిల్ దేశానికి చెందిన ఒక మహిళ. 238 00:14:28,535 --> 00:14:32,206 తన పేరు కార్లా అని అనుకుంటున్నాం, ఆమెకి ప్రాణ హాని ఉండే అవకాశం ఉంది. 239 00:14:32,206 --> 00:14:33,332 క్లోయి? 240 00:14:34,041 --> 00:14:35,042 ఇక్కడ ఏం లేదు. 241 00:14:35,834 --> 00:14:37,836 సహకరించినందుకు థ్యాంక్యూ. రోజంతా కులాసాగా గడపండి. 242 00:14:37,836 --> 00:14:41,256 ఒకటి గుర్తుంచుకోండి... మీడియా వాళ్లు దీన్ని ఓ రేంజిలో చూపుతున్నందున... కమ్యూనిటీ అంతా కోపంతో ఉంది. 243 00:14:41,256 --> 00:14:43,133 కాబట్టి అప్రమత్తంగా ఉండండి. 244 00:14:43,133 --> 00:14:45,135 అంతా ఓకే కదా? సరే మరి. ఇక వెళ్దాం పదండి. 245 00:14:45,135 --> 00:14:46,512 మొదటి బ్లాక్, మొదటి అంతస్థు, అంతా ఓకే. 246 00:14:46,512 --> 00:14:48,263 మొదటి బ్లాక్, రెండవ అంతస్థు, అంతా ఓకే. 247 00:14:48,263 --> 00:14:49,598 రెండో బ్లాక్, మూడో అంతస్థు, ఓకే. 248 00:14:49,598 --> 00:14:52,017 మొదటి బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, అంతా ఓకే. 249 00:14:52,017 --> 00:14:53,769 మొదటి బ్లాక్, మొదటి అంతస్థు, అంతా ఓకే. 250 00:14:53,769 --> 00:14:55,437 రెండో బ్లాక్, మొదటి అంతస్థు, అంతా ఓకే. 251 00:14:55,437 --> 00:14:57,523 మార్కీ బ్లాక్ అంతా ఓకే. ఓవర్. 252 00:15:00,192 --> 00:15:03,111 ఆల్ఫా బ్రావో వన్, నాకు కొంచెం... ఓవర్. 253 00:15:03,111 --> 00:15:05,030 ఆల్ఫా బ్రావో వన్... 254 00:15:19,419 --> 00:15:20,462 ఇబ్బంది పెడుతున్నందుకు సారీ, సర్... 255 00:15:20,462 --> 00:15:21,547 ఎవరు? 256 00:15:21,547 --> 00:15:23,799 - పోలీసులు. - సారీ, ఏంటి సంగతి? 257 00:15:23,799 --> 00:15:25,884 ఏమీ లేదు. మీరు ఇంట్లోనే ఉండండి. 258 00:15:25,884 --> 00:15:28,846 దర్యాప్తులో భాగంగా మేము కొన్ని ఇళ్లను తనిఖీ చేస్తున్నాం. 259 00:15:29,471 --> 00:15:30,514 థ్యాంక్యూ. 260 00:15:33,642 --> 00:15:35,561 ఎర్రొల్... ఎర్రొల్ కేసు గురించా? 261 00:15:36,979 --> 00:15:39,481 ఏం కాలేదులే. రా. లోపలికి రా. 262 00:15:53,036 --> 00:15:53,871 జూన్. 263 00:15:53,871 --> 00:15:57,416 మీరు వెళ్లమని చెప్పిన ఇంటికి వెళ్లాను. అక్కడ ఎవరున్నారో తెలుసా... 264 00:15:57,416 --> 00:15:58,667 పాట్రిక్ బరోస్. నాకు తెలుసు. 265 00:15:58,667 --> 00:16:00,210 అతనితో పాటు ఒక యువతి కూడా ఉందా? 266 00:16:00,210 --> 00:16:02,045 - ఉంది. - వాళ్లు బాగానే ఉన్నారు కదా? 267 00:16:02,045 --> 00:16:03,463 - బాగానే ఉన్నారు, సర్. - సరే. 268 00:16:06,675 --> 00:16:07,718 అయ్య బాబోయ్. 269 00:16:08,427 --> 00:16:09,428 అతనేనా? 270 00:16:09,428 --> 00:16:11,597 అతనే. ఆ పోలీసోడు అతనే. 271 00:16:13,557 --> 00:16:16,310 యూనిట్ 12, నేను డిఎస్ కార్డ్ వెల్ ని, మానింగమ్ ఫ్లాట్స్ లో అంతా ఓకే, ఓవర్. 272 00:16:16,310 --> 00:16:18,854 - పక్కానా? - హా, పక్కా. 273 00:16:34,494 --> 00:16:37,873 చూడండి. ఎవరినైనా దాచాలనుకుంటే వాళ్లని అందరికీ కనిపించేలా దాచం కదా. 274 00:16:37,873 --> 00:16:39,458 వాళ్లని ఎక్కడైనా కనిపించని చోట దాచుతాం, 275 00:16:39,458 --> 00:16:41,543 పొరుగువాళ్లకు కూడా కనిపించకుండా అన్నమాట. టవర్స్? 276 00:16:41,543 --> 00:16:43,670 మనకి తెలిసిన అన్ని ఇళ్లకూ వెళ్లి చూశాం. ఆమె అక్కడ లేదు. 277 00:16:43,670 --> 00:16:46,381 ఒక్క నిమిషం. మీరు అన్నది నిజమే. 278 00:16:46,381 --> 00:16:48,342 జూన్! జూన్! 279 00:16:50,928 --> 00:16:51,929 వార్విక్ ఫ్లాట్స్. 280 00:16:51,929 --> 00:16:54,765 పోయిన సంవత్సరం, ఏడవ అంతస్థులో సీలింగ్ పెచ్చులన్నీ ఊడిపోతూ ఉన్న ఉదంతం నీకు గుర్తుందా? 281 00:16:54,765 --> 00:16:57,684 ఆ అంతస్థు మొత్తాన్ని మూసివేశారు, బిల్డింగ్ కాంట్రాక్టర్లందరూ దివాళా తీసేశారు. 282 00:16:57,684 --> 00:17:00,062 సగం పని పెండింగులో ఉండగానే వదిలేసి వెళ్లిపోయారు. మొత్తం అంతస్థును క్లియర్ చేశారు. 283 00:17:00,062 --> 00:17:01,939 - తను అక్కడ ఉందేమో. - హా. 284 00:17:01,939 --> 00:17:04,191 - ఏమంటావు? - వెళ్దాం పద. 285 00:17:08,194 --> 00:17:11,031 డిటెక్టివ్ సార్జెంట్స్ బృందమైన మేము ఇప్పుడు ఏడవ అంతస్థుకు వెళ్తున్నాం. ఓవర్. 286 00:17:11,031 --> 00:17:12,824 - రా. - ఆల్ఫా బ్రావో ఫోర్, అలాగే. 287 00:17:13,325 --> 00:17:14,409 - కార్లా. - కార్లా. 288 00:17:14,409 --> 00:17:15,786 క్లోయి, అటు వైపు వెళ్లి చూడు. 289 00:17:17,412 --> 00:17:18,497 ఆ ఇళ్లలో తనిఖీ చేయండి. 290 00:17:20,165 --> 00:17:21,834 మేము పోలీసులం. లోపల ఎవరైనా ఉన్నారా? 291 00:17:21,834 --> 00:17:23,001 పోలీసులం. తెరవండి. 292 00:17:23,001 --> 00:17:24,086 హలో? 293 00:17:24,586 --> 00:17:25,878 యాష్! 294 00:17:25,878 --> 00:17:27,589 మేము పోలీసులం. లోపల ఎవరైనా ఉన్నారా? 295 00:17:28,841 --> 00:17:29,842 అగ్ని ప్రమాద సమయంలో బయటకు దారి 296 00:17:31,760 --> 00:17:32,761 యాష్! 297 00:17:32,761 --> 00:17:35,472 కార్లా. కార్లా? 298 00:17:56,910 --> 00:17:58,871 నీ యెంకమ్మ. 299 00:18:11,175 --> 00:18:13,552 - జూన్ కదా? - అయ్యో. 300 00:18:13,552 --> 00:18:17,723 కానివ్వు! కానివ్వు! ఇప్పుడు చేయ్ చూద్దాం! 301 00:18:17,723 --> 00:18:19,016 ఇప్పుడు చేయ్... 302 00:18:21,643 --> 00:18:23,770 ప్రయత్నించి చూస్తావా? ఏమంటావు? 303 00:18:23,770 --> 00:18:26,440 మొత్తం చెడదొబ్బాలనుకుంటున్నావా? 304 00:18:49,796 --> 00:18:51,256 నేల మీదే ఉండు. 305 00:18:54,510 --> 00:18:58,138 తను ఎక్కడ ఎక్కడ తను? 306 00:18:58,722 --> 00:19:00,057 కదలకు. 307 00:19:00,057 --> 00:19:03,310 కదలకురా, చచ్చినోడా. కదలకు. 308 00:19:04,853 --> 00:19:05,896 మూసుకో. 309 00:19:05,896 --> 00:19:07,564 - ఏంటి? నోర్మూసుకొని ఉండు. - కార్లా! 310 00:19:09,983 --> 00:19:10,984 కార్లా! 311 00:19:12,069 --> 00:19:13,529 కార్లా! 312 00:19:17,574 --> 00:19:18,659 కార్లా. 313 00:19:22,746 --> 00:19:24,081 కార్లా! 314 00:19:25,207 --> 00:19:26,291 కార్లా. 315 00:19:51,733 --> 00:19:52,776 సరే మరి. 316 00:19:54,236 --> 00:19:57,531 కార్లా. కార్లా, మీ పేరు అదేనా? 317 00:19:57,531 --> 00:19:59,658 మీ పేరు కార్లాయేనా? అవునా? 318 00:20:01,159 --> 00:20:04,204 మరేం పర్వాలేదు. నేను పోలీసునే. 319 00:20:05,163 --> 00:20:08,625 నా పేరు జూన్ లెంకర్, సరేనా? మీకు ఇప్పుడు ఏమీ కాదు. 320 00:20:08,625 --> 00:20:10,961 - వద్దు, వద్దు. - మరేం పర్వాలేదు. నేను వస్తున్నా. వస్తున్నా. 321 00:20:10,961 --> 00:20:13,297 - వద్దు, వద్దు. - పర్వాలేదు. మరేం పర్వాలేదు. 322 00:20:13,297 --> 00:20:15,757 మీకేమీ కాదని మాటిస్తున్నాను. నన్ను చూడండి. నన్ను చూడండి. 323 00:20:15,757 --> 00:20:17,509 - ఎక్కడ వాడు? - నన్ను చూడండి. 324 00:20:17,509 --> 00:20:19,428 - ఎక్కడ వాడు? - చెప్పు, కార్లా, నీకేమైనా గాయం అయిందా? 325 00:20:19,428 --> 00:20:20,762 నీకేమైనా అయిందా? సరే. 326 00:20:20,762 --> 00:20:22,181 ఇటు వెళ్దాం. 327 00:20:22,181 --> 00:20:24,474 వాడు ఇంకెవరినీ ఏమీ చేయలేడు, సరేనా? 328 00:20:24,474 --> 00:20:27,352 పద. ఇటు వెళ్దాం, ఏమీ కాదు. నువ్వు నడవగలవు. 329 00:20:27,352 --> 00:20:29,021 నువ్వు నడవగలవు. 330 00:20:30,272 --> 00:20:33,567 వాడొక పిచ్చాడు. నువ్వు ధైర్యవంతురాలివి. చాలా ధైర్యవంతురాలివి. 331 00:20:34,067 --> 00:20:37,696 ఏం కాదు. నీకేమీ కాదు. 332 00:20:40,616 --> 00:20:43,368 నీకేమీ కాదు. మేము ఉన్నాం కదా. 333 00:20:43,869 --> 00:20:44,870 ఏం పర్వాలేదు. 334 00:20:51,585 --> 00:20:53,003 బయట కాస్త జాగ్రత్త, అబ్బాయిలూ. 335 00:20:54,963 --> 00:20:56,798 హేయ్. సరే మరి. పక్కకు జరగండి. 336 00:20:57,466 --> 00:20:59,343 దారి ఇవ్వండి. బాబోయ్. 337 00:21:00,219 --> 00:21:01,094 వద్దు! 338 00:21:01,094 --> 00:21:03,305 - ఏంటీ? జరుగు! - పక్కకు తప్పుకోండి! 339 00:21:07,935 --> 00:21:08,936 నాన్నా! 340 00:21:10,437 --> 00:21:11,855 అబ్బా. 341 00:21:11,855 --> 00:21:13,232 దాన్ని ఎవర్రా విసిరారు? 342 00:21:13,899 --> 00:21:15,317 పందులు నయం మీ కన్నా! 343 00:21:16,735 --> 00:21:17,986 మీరు లోపలికి వెళ్లండి. 344 00:21:17,986 --> 00:21:19,238 పదండి. 345 00:21:19,238 --> 00:21:20,739 మా అమ్మని చంపింది అతనేనా? 346 00:21:21,573 --> 00:21:24,868 ఓయ్. ఇటు చూడండి. అతను మా అమ్మని చంపాడా? 347 00:21:24,868 --> 00:21:28,830 పదండి. పక్కకు తప్పుకోండి. బాస్, ఇక మనం బయలుదేరాలి. 348 00:21:28,830 --> 00:21:31,166 పక్కకు తప్పుకోండి. దీని సంగతి మేము చూసుకుంటాం. పదండి. దారి ఇవ్వండి... 349 00:21:31,166 --> 00:21:33,794 నన్ను చూడండి! నన్ను చూడండి! 350 00:21:35,838 --> 00:21:38,507 వెనక్కి జరగండి! జరగండి. ఇళ్లకి వెళ్లండి. 351 00:21:39,508 --> 00:21:40,717 సర్, మీరు కాస్త... 352 00:21:41,301 --> 00:21:42,636 తోలు! తోలు, తోలు! 353 00:21:52,771 --> 00:21:53,772 నేనే. 354 00:21:59,820 --> 00:22:01,238 తను ఈ దేశంలోకి అక్రమంగా వచ్చిందని తెలుసు కదా? 355 00:22:02,281 --> 00:22:05,242 తను ఇక్కడ ఉండకూడదు, తరిమివేయండి. 356 00:22:05,242 --> 00:22:08,036 తనని రువాండాకి కానీ, ఇంకెక్కడికైనా కానీ పంపించేయండి. 357 00:22:08,036 --> 00:22:11,415 వాళ్లు తనని రానిస్తే, అది... నా ఉద్దేశం, ఇటు చూడండి. 358 00:22:11,415 --> 00:22:14,251 ఈ చొక్కాని చూడండి. ఇది నా భార్య నాకు కానుకగా ఇచ్చింది. 359 00:22:14,251 --> 00:22:17,087 ఇది చేత్తో నేసిన చొక్కా. 360 00:22:18,922 --> 00:22:21,925 మరి... ఏంటిది? ఏం కట్టుకథ చెప్పబోతున్నారు? 361 00:22:21,925 --> 00:22:23,010 కట్టుకథేమీ లేదు. 362 00:22:25,470 --> 00:22:26,972 ఆసుపత్రి ఎక్కడ? 363 00:22:27,764 --> 00:22:29,725 - నాకు రక్తం కారిపోతోంది. - వచ్చేశాం, ఓపిక పట్టు. 364 00:22:29,725 --> 00:22:33,270 చూడండి. పార్కులో ఒక పిల్లాడిని చంపారు కదా. అదే, తలకి తూటా తగిలి... 365 00:22:33,270 --> 00:22:35,981 అప్ డేట్ అవ్వు, స్టెఫన్. ఆ కేసులో దోషిని పట్టేసుకున్నాం. నువ్వు శ్రద్ధ వహించట్లేదు. 366 00:22:35,981 --> 00:22:37,149 ఇంకే విషయంలో అయినా సమాచారం కావాలా? 367 00:22:37,691 --> 00:22:39,818 పార్క్ హిల్ ముఠా సంగతేంటి? ఏ సమాచారమైనా కావాలా? 368 00:22:39,818 --> 00:22:43,280 ఏ మార్గాల్లో సరఫరా జరుగుతుంది. ఎవరెవరికి అందుతుంది. ఆ విషయంలో నేను సాయపడగలను. 369 00:22:43,280 --> 00:22:45,824 నేను మంచి మంచి విషయాలు చెప్పగలను. 370 00:22:45,824 --> 00:22:47,451 నాకు చాలా రహస్యాలు తెలుసు, అవన్నీ చెప్పేయగలను. 371 00:22:47,451 --> 00:22:51,330 ఇన్ఫార్మరుగా నేను చేసిన అక్రమమైన పనులన్నీ చెప్పేస్తా, చూద్దాం నాతో పాటు మీకు ఏం గతి పడుతుందో. 372 00:22:51,330 --> 00:22:53,790 - నేను చెప్పేది మీకు అర్థమవుతోంది కదా? - అది నీ ఇష్టం. 373 00:22:53,790 --> 00:22:55,792 భలేవారే మీరు. 374 00:22:55,792 --> 00:22:58,420 మనం ఏదోక ప్లాన్ ఆలోచిద్దాం. ఐడియా ఏమైనా చెప్పండి. 375 00:22:58,420 --> 00:23:00,297 - ఏం కావాలి నీకు? - కేసు నుండి రక్షణ. 376 00:23:01,340 --> 00:23:03,300 రక్షణనా, దేనికి? 377 00:23:03,300 --> 00:23:05,552 నీ లవరుని చిత్రహింసలకు గురి చేసినందుకా? 378 00:23:05,552 --> 00:23:07,888 లేదా వేరే అమ్మాయి అయిన అడిలైడ్ ని చంపినందుకా? 379 00:23:10,265 --> 00:23:11,683 నేనేమీ మాట్లాడను. 380 00:23:11,683 --> 00:23:13,310 - హా. - ఒక్క ముక్క కూడా చెప్పను. 381 00:23:13,310 --> 00:23:15,103 మనం చేసిన పనులన్నీ నా బుర్రలో ఉన్నాయి. 382 00:23:15,103 --> 00:23:17,940 నా సహనాన్ని పరీక్షించవద్దు, గురూ, నేను చెప్పేది మీకు అర్థమవుతోంది కదా? 383 00:23:17,940 --> 00:23:21,193 నేను కూడా ప్రతిఘటిస్తాను. నన్ను ముంచాలని చూస్తే, మిమ్మల్ని కూడా ముంచేస్తా. 384 00:23:21,860 --> 00:23:23,278 నాకు కాస్త సాయం చేయండి, అది చాలు. 385 00:23:39,711 --> 00:23:40,754 నన్ను చూడండి! 386 00:26:29,965 --> 00:26:32,634 ఇతను, ఇప్పుడు చనిపోయాడు అనుకో. 387 00:26:33,177 --> 00:26:36,930 కానీ పోలీసులకు అతని ఇంట్లో బలమైన ఆధారాలు దొరికాయి, 388 00:26:36,930 --> 00:26:42,352 అతనే అడిలైడ్ ని హత్య చేశాడని సూచించే ఆధారాలు. 389 00:26:56,950 --> 00:26:57,951 మన్నించాలి, ఏమన్నారో మళ్లీ చెప్పరా? 390 00:26:59,453 --> 00:27:02,706 జడ్జుల ప్యానెల్ ముందుకు దీన్ని తీసుకువెళ్లడానికి కొన్ని వారాల సమయం పడుతుంది, 391 00:27:02,706 --> 00:27:06,502 కానీ పోలీసులు, చిన్నారుల సంరక్షణ సేవల శాఖ కూడా ఈ విషయంలో ఎదురు వాదించమని చెప్తున్నారు. 392 00:27:09,588 --> 00:27:10,589 కాబట్టి... 393 00:27:24,686 --> 00:27:25,687 ఎర్రొల్? 394 00:27:31,485 --> 00:27:33,570 మేమేం అంటున్నామో నీకు అర్థమవుతోందా? 395 00:27:39,409 --> 00:27:40,744 తను చెప్పిందంతా నిజమే. 396 00:27:41,662 --> 00:27:42,663 మీ అమ్మ. 397 00:27:45,123 --> 00:27:46,124 మీ అమ్మ చెప్పిందంతా నిజమే. 398 00:27:53,048 --> 00:27:56,593 హత్య చేసింది ఇతను. నువ్వు కాదు. 399 00:29:04,912 --> 00:29:05,913 టోనీ. 400 00:29:10,876 --> 00:29:12,836 నువ్వు ఆ కర్రని మరీ అతిగా వాడేస్తున్నావు. 401 00:29:13,337 --> 00:29:17,174 ఒకసారి నీ అంతరాత్మని ప్రశ్నించుకో. ఏంటిది? ఎవరైనా జాలి చూపించాలని అలా నడుస్తున్నావా? 402 00:29:17,174 --> 00:29:18,967 ఇక్కడ జాలి దొరకదని నాకు తెలుసులే. 403 00:29:20,052 --> 00:29:22,721 నేను ప్రతినిధితో మాట్లాడాను. ప్రభుత్వ డాక్టర్ నుండి అందే సమాచారాన్ని బట్టి 404 00:29:22,721 --> 00:29:25,224 సిపిఎస్ తో మాట్లాడి కేసును నిర్లక్ష డ్రైవింగ్ గా నమోదు చేసేలా ఒప్పించగలరట. 405 00:29:26,308 --> 00:29:27,768 హత్య కేసు వేయరు. 406 00:29:30,270 --> 00:29:31,313 అది చాలు... 407 00:29:32,022 --> 00:29:34,024 అది చాలు... దేవుడా. 408 00:29:34,900 --> 00:29:37,069 మరి ఇంకో కేసు సంగతి? దాని... దాని పేరేంటి? 409 00:29:37,069 --> 00:29:41,198 విద్వేషపూరిత సందేశాల కేసా? నీకు బెయిల్ వచ్చింది, కాబట్టి మంచిదే. 410 00:29:42,658 --> 00:29:43,825 ఎర్రొల్ విషయం విన్నావా? 411 00:29:44,451 --> 00:29:46,078 విన్నాను. తప్పించుకున్నాడు, చెత్తగాడు. 412 00:29:49,122 --> 00:29:50,082 కాబట్టి... 413 00:29:51,375 --> 00:29:54,086 ఆ విషయంలో మన పరిస్థితి ఎంటి? 414 00:29:55,838 --> 00:29:57,506 అంతర్గత దర్యాప్తు జరుగుతుంది. 415 00:29:57,506 --> 00:29:59,591 మన చేత కొన్ని కోర్సులు చేయించడం లాంటివి చేస్తారా? 416 00:29:59,591 --> 00:30:02,219 లేదు, దురదృష్టవశాత్తూ, కథ ముగిసినట్టే. 417 00:30:04,179 --> 00:30:05,931 నువ్వు నాకు చెప్పి ఉండాల్సింది, టోనీ. 418 00:30:07,140 --> 00:30:08,934 సారీ. నువ్వు జోక్ చేస్తున్నావు అనుకున్నా. 419 00:30:08,934 --> 00:30:10,811 తనని చంపింది స్టెఫనే అని నీకు తెలుసా? 420 00:30:10,811 --> 00:30:12,771 తెలీదు, ఎందుకంటే, చంపింది అతను కాదు కాబట్టి. 421 00:30:12,771 --> 00:30:14,565 ఆమె హత్యకు గురైన సమయంలో అతను వేరే ఎక్కడైనా ఉన్నాడా? 422 00:30:14,565 --> 00:30:16,066 నా నోట్స్ చూస్తే కానీ చెప్పలేను. 423 00:30:16,066 --> 00:30:17,359 నీ నోట్స్ ని నేను చెక్ చేశా. 424 00:30:18,068 --> 00:30:20,362 ఆలిబై ప్రస్తావనే అందులో లేదు, భార్య అని రాశావు అంతే. 425 00:30:20,362 --> 00:30:22,573 - ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదని మనకు తెలుసు. - మరి ఏం అడుగుతున్నావు? 426 00:30:22,573 --> 00:30:23,949 బదులుగా ఏం దక్కింది నీకు? 427 00:30:23,949 --> 00:30:25,117 నాకు దక్కడం ఏంటి? 428 00:30:25,117 --> 00:30:28,287 అతడిని విచారణ చేయకుండా ఉండటానికి బదులుగా నీకేం ఇస్తానన్నాడు? 429 00:30:31,790 --> 00:30:33,792 ఎడ్మంటన్ లో ఒక మసీదు ఉంది కదా, 430 00:30:33,792 --> 00:30:35,586 అక్కడ ఉండే పిచ్చి అరబ్లు గుర్తున్నారా? 431 00:30:35,586 --> 00:30:36,879 - గుర్తున్నారా? - స్టెఫన్ సాయం చేశాడా? 432 00:30:36,879 --> 00:30:38,088 అవును మరి. 433 00:30:38,088 --> 00:30:39,798 కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ అతని వల్లే సాధ్యమైంది. 434 00:30:39,798 --> 00:30:40,966 అర్థమవుతోందిలే. 435 00:30:40,966 --> 00:30:42,926 హా. అది అతని పని తనమే. అతని వల్లే పని అంతా జరిగింది. 436 00:30:44,052 --> 00:30:45,387 అది మంచి పని తనమే, టోనీ. 437 00:30:45,971 --> 00:30:47,264 అవును. మంచి పనే. 438 00:30:47,264 --> 00:30:49,808 హా, అతని వల్లే చాలా మంది ప్రాణాలు నిలిచాయి. 439 00:30:49,808 --> 00:30:52,561 అంటే, న్యాయంగా చెప్పాలంటే, అతనేమీ నీతిమంతుడు కాదు కదా? 440 00:30:52,561 --> 00:30:54,188 ఒక్కోసారి మనం వాటిని చూసిచూడనట్టుగా వ్యవహరించాలి. 441 00:30:55,189 --> 00:30:58,025 డబ్బులు ఎక్కడి నుండి వస్తాయో తెలీదు. గాయాలు, దెబ్బలు. 442 00:30:58,025 --> 00:31:00,527 - ఇంకా అరెస్టులు. - వాటన్నింటినీ మనం చూసినవాళ్లమే. బాబోయ్. 443 00:31:00,527 --> 00:31:02,613 అవన్నీ మన గైడ్ బుక్స్ లో ఉండవు కదా? 444 00:31:04,281 --> 00:31:05,908 కానీ మనం జరగబోయే మంచిని కూడా పరిగణించాలి. 445 00:31:07,576 --> 00:31:09,036 అప్పుడప్పుడూ పట్టించుకోకుండా ఉండాలి. 446 00:31:10,287 --> 00:31:11,288 ఎన్నో లెక్కలు వేసుకొని చేయాలి. 447 00:31:11,288 --> 00:31:12,372 అలాగే చేయాలి కదా. 448 00:31:12,372 --> 00:31:13,498 మనకి కావాల్సిన పని చేయించుకోవాలి. 449 00:31:13,498 --> 00:31:14,750 అదే కదా నేనూ చెప్పేది. 450 00:31:18,337 --> 00:31:21,715 కానీ హత్య విషయంలో అలా చేయకూడదు, టోనీ. 451 00:31:28,555 --> 00:31:30,516 హా. హత్య విషయంలో కాదా? 452 00:31:31,475 --> 00:31:33,560 అలా అనే స్టెఫన్ భార్యకు చెప్పగలవా? 453 00:31:33,560 --> 00:31:34,603 ఇది భలే గమ్మత్తుగా ఉంది కదా? 454 00:31:34,603 --> 00:31:38,065 ఇన్నేళ్లూ టాప్ ఇన్ఫార్మరుగా ఉన్న వ్యక్తి, 455 00:31:38,065 --> 00:31:40,734 పోలీసు స్టేషనుకు వస్తూ ఉండగా తుపాకీ తూటాకి బలైపోయాడు. 456 00:31:40,734 --> 00:31:45,113 అది అంతా బాగా సౌకర్యంగా, అనుకూలంగా ఉంది కదా. 457 00:31:45,113 --> 00:31:46,615 అదేనా బయట టాక్? 458 00:31:46,615 --> 00:31:48,742 నువ్వు విషయం చెప్పేశావు. హా, నేనేమైనా తిక్కలోడిని అనుకుంటున్నావా? 459 00:31:48,742 --> 00:31:51,995 నువ్వు పార్క్ హిల్ ముఠాకి, వాళ్ల గుట్టును అంతా ఇతను చెప్పేస్తున్నాడని చెప్పేశావు. 460 00:31:51,995 --> 00:31:55,374 "అతడిని వేసేయాలంటే, ఇదే మీకున్న అవకాశం" అని ఏదో చెప్పుంటావు. అంతే కదా, బాసూ? 461 00:31:55,958 --> 00:31:58,752 నువ్వు ఇన్ ఛార్జీగా ఉన్నప్పుడు, డబ్బులను, అమ్మాయిలను ఎర వేసి 462 00:31:58,752 --> 00:32:01,046 అతను అవినితీలో ఎక్కడికో వెళ్లిపోయాడు కదా. 463 00:32:01,046 --> 00:32:03,173 అతను నిన్ను టైటానిక్ నౌకలా ముంచేస్తాడనే కదా ఇలా చేశావు! 464 00:32:03,173 --> 00:32:04,550 నాకు కూడా కడుపులో ఒక తూటా దిగింది. 465 00:32:05,342 --> 00:32:06,552 అది అనుకోకుండా జరిగిందే కద. 466 00:32:07,135 --> 00:32:09,805 అవును. నీకు ఒక తూటా. అతనికి ఆరు తూటాలు. 467 00:32:09,805 --> 00:32:13,350 నువ్వు నడవగలుగుతున్నావు కదా... అతని పేరేంటి? గుర్తు రావట్లేదే. 468 00:32:13,350 --> 00:32:14,852 - అదీ... - టోనీ. 469 00:32:14,852 --> 00:32:17,020 లజారస్. పునర్జన్మ ఎత్తిన వ్యక్తిలా. 470 00:32:17,020 --> 00:32:19,147 నువ్వు కూడా చనిపోయి లేచొచ్చిన వాడిలానే ఉన్నావు. అందులో అనుమానమే లేదు. 471 00:32:19,147 --> 00:32:20,774 నువ్వు మహానటుడివి. 472 00:32:20,774 --> 00:32:22,067 ప్రమాణపూర్తిగా చెప్తున్నా. 473 00:32:22,067 --> 00:32:24,736 ప్రమాణపూర్తిగా చెప్తున్నా, కావాలంటే నా ఫోన్ రికార్డులని చెక్ చేసుకో. 474 00:32:24,736 --> 00:32:26,738 నేనెవరికీ సమాచారం ఇవ్వలేదు. 475 00:32:28,115 --> 00:32:29,157 కిమ్ కి. 476 00:32:29,157 --> 00:32:31,159 కిమ్ కా? నేను కిమ్ కి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. 477 00:32:31,159 --> 00:32:33,579 నువ్వు చెప్పవు. అదే కదా అసలు విషయం. నువ్వు చెప్పాల్సిన పని లేదు. 478 00:32:34,246 --> 00:32:36,540 నువ్వు ఎప్పుడూ చెప్పలేదు కూడా, ఎందుకంటే, నీ తరఫున చెడ్డ పనులన్నీ 479 00:32:36,540 --> 00:32:39,084 మేమే చేశాం కదా, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, గుంట నక్కా. 480 00:32:42,462 --> 00:32:43,589 ఇందాక చెప్పిందే మళ్లీ చెప్తున్నా, 481 00:32:44,381 --> 00:32:46,633 ఈ అంతర్గత విచారణ విషయంలో... నేను నా సర్వ శక్తులూ ఒడ్డుతాను. 482 00:32:47,718 --> 00:32:49,678 కానీ ఆలిబై లేకుండా, అతడిని విచారణ నుండి తప్పించింది నువ్వే. 483 00:32:50,512 --> 00:32:52,181 ఏమైనా జరిగితే, నీ మీదకే వస్తుంది. 484 00:32:52,764 --> 00:32:54,016 ఏమన్నావో మళ్లీ చెప్పు. 485 00:32:54,016 --> 00:32:55,559 వాళ్లు ఎవరోకరి మీద తోసేద్దామని చూస్తున్నారు, టోనీ. 486 00:32:57,060 --> 00:32:59,313 క్లాడియా జనాల దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనుకుంటోంది కాబట్టి, 487 00:32:59,313 --> 00:33:00,898 నువ్వు బలయ్యే అవకాశం ఎక్కువే ఉంది. 488 00:33:05,235 --> 00:33:09,239 నీ కోసం నేనెన్నో ప్రమాదకరమైన పనులు చేస్తూనే వచ్చాను. 489 00:33:09,239 --> 00:33:12,284 మన బృందం పేరు సిక్స్ టీ టూస్ కదా? అదిరిపోయే బృందం కదా మనది? 490 00:33:12,284 --> 00:33:14,536 - సిక్స్ టీ టూస్. - మీ అంకుల్ లాగా. 491 00:33:14,536 --> 00:33:17,998 ఆయన 62వ వైమానిక దళంలో పైలట్ కదా, తన మిత్రుల కోసం డ్రెస్డెన్ పై బాంబులేసి నాశనం చేసేశాడు, 492 00:33:17,998 --> 00:33:22,085 కానీ దానికి అతనికి సత్కారాలేవీ దక్కలేదు. కానీ పని మాత్రం కానిచ్చాడు. 493 00:33:22,085 --> 00:33:23,462 అది నేను అల్లిన కథ. 494 00:33:25,589 --> 00:33:29,384 అది కల్పిత కథ. నాకు ఒకే ఒక్క అంకుల్ ఉన్నాడు. ఆయన పేరు చార్లీ. ఆయనకి ఎత్తులంటే భయం. 495 00:33:47,528 --> 00:33:49,947 ఆధారాలను తుడిచివేసే వ్యక్తిని పంపనా? ఆ ఏర్పాటు చేయనా? 496 00:33:50,614 --> 00:33:52,449 నా బతుకును బస్టాండ్ పాలు చేస్తారు. 497 00:33:58,247 --> 00:33:59,831 దాని కన్నా నేను ఆత్మహత్య చేసుకోవడం మేలు. 498 00:34:01,041 --> 00:34:02,251 నా ఆరోగ్యం దిగజారిపోయిందని చెప్పు! 499 00:34:02,251 --> 00:34:05,295 నా ఆరోగ్యం పాడైపోయిందని, ఇక ఆ టెన్షన్లు భరించలేనని చెప్పు! 500 00:34:07,548 --> 00:34:09,716 మిస్టర్ మ్యాథిస్ శిక్ష విషయంలో 501 00:34:09,716 --> 00:34:12,886 ఏదో అటూఇటూ జరిగిందని నాకు తెలియగానే, సహజంగానే, 502 00:34:12,886 --> 00:34:15,556 జరిగిన నష్టాన్ని పూడ్చడానికి నా శాయశక్తులా నేను కృషి చేశాను. 503 00:34:16,264 --> 00:34:18,725 ఇక టోనీ... అదే డిటెక్టివ్ సార్జెంట్ గిల్ఫోయిల్ విషయానికి వస్తే, 504 00:34:19,726 --> 00:34:23,730 నాకు తెలిసి అతను చాలా సంవత్సరాలు అండర్ కవరుగా పని చేశాడు... 505 00:34:25,190 --> 00:34:26,900 కాబట్టి ఒంటరిగా పని చేయడానికి అలవాటు పడిపోయి ఉంటాడు. 506 00:34:26,900 --> 00:34:30,987 అతనెవరు అనేది ఎలా దాచాలో బాగా తెలుసుకున్నాడు. 507 00:34:32,072 --> 00:34:34,908 ఆ విషయంలో నేను ఊహాగానాలు చేయలేను. 508 00:34:38,120 --> 00:34:40,330 ఇవాళ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? 509 00:34:47,420 --> 00:34:49,922 హా. ఒక విషయం ఉంది. 510 00:35:01,310 --> 00:35:03,312 సరే మరి. దీన్ని త్వరగా ముగించేద్దాం. 511 00:35:38,597 --> 00:35:40,933 హేయ్. నువ్వు బాగానే ఉన్నావా? 512 00:35:44,686 --> 00:35:46,230 నేను ఒకటి రాశాను. 513 00:35:49,107 --> 00:35:50,108 దాన్ని మెసేజ్ గా పంపగలను. 514 00:35:52,945 --> 00:35:54,571 చెప్పేసేయ్. ఇక్కడే ఉన్నాగా. 515 00:36:00,494 --> 00:36:02,538 "నీ పేరు మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఎర్రొల్. 516 00:36:06,625 --> 00:36:08,669 వాళ్లలో ఒకరు నన్ను, మా అమ్మని బాగా చూసుకున్నారు. 517 00:36:10,587 --> 00:36:13,090 ఆ తర్వాత, అతను నిర్దోషి అయినా కూడా జైలు శిక్ష అనుభవించాడు. 518 00:36:14,174 --> 00:36:17,469 అన్నేళ్లూ ఒంటరిగా బతకడం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు." 519 00:36:19,847 --> 00:36:21,473 "ఇంకో ఎర్రొల్ మా అమ్మని చంపాడు. 520 00:36:22,933 --> 00:36:24,476 ఆ తర్వాత నేను అతడిని పట్టించుకోలేదు. 521 00:36:25,102 --> 00:36:26,895 ఒక్కసారి కూడా వెళ్లి, కలవలేదు. 522 00:36:29,731 --> 00:36:31,233 అతనిపై విపరీతమైన ద్వేషం పెంచుకున్నాను." 523 00:36:38,156 --> 00:36:39,533 నేను రెండవ ఎర్రొల్ ని ఎంచుకున్నాను. 524 00:36:42,744 --> 00:36:43,912 క్షమించు. 525 00:36:45,372 --> 00:36:46,373 క్షమించు. 526 00:36:49,168 --> 00:36:50,377 నన్ను క్షమించు. 527 00:36:53,088 --> 00:36:54,089 క్షమించు. 528 00:37:01,346 --> 00:37:02,472 నన్ను క్షమించు. 529 00:37:12,107 --> 00:37:13,108 హాయ్. 530 00:37:13,609 --> 00:37:14,610 హాయ్. 531 00:37:19,865 --> 00:37:21,575 మరి, అంతర్గత విచారణ ఎంత దాకా వచ్చింది? 532 00:37:21,575 --> 00:37:23,118 క్లాడియాతో మాట్లాడావా? 533 00:37:23,118 --> 00:37:25,370 "కూసే గాడిద మేసే గాడిద" సామెత చెప్పిందా? 534 00:37:25,996 --> 00:37:26,997 హా. 535 00:37:28,332 --> 00:37:30,751 మీరు ఇప్పుడు ప్రస్తావించారు కాబట్టి అనిపిస్తోంది, ఆమె దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి చెప్పారని. 536 00:37:32,669 --> 00:37:34,087 కానీ నేను మీకు ఎందుకు కాల్ చేశానంటే... 537 00:37:35,088 --> 00:37:38,509 క్లాడియాకి వీడియో ఎక్కడి నుండి వచ్చిందో ఏమో కానీ, తన దగ్గర ఆ వీడియో ఉంది. 538 00:37:38,509 --> 00:37:39,718 వీడియో. 539 00:37:39,718 --> 00:37:40,969 ఎర్రొల్ నేరాన్ని ఒప్పుకున్న వీడియో. 540 00:37:42,137 --> 00:37:46,600 దాన్ని నేను పంపలేదని, నేనే స్వయంగా మీకు చెప్పేస్తున్నా. 541 00:37:46,600 --> 00:37:47,809 - కాబట్టి... - సరే. 542 00:37:50,604 --> 00:37:52,189 ఒక్క నిమిషం. ఆ వీడియోని మీరే పంపారా? 543 00:37:53,565 --> 00:37:54,566 అవును. 544 00:37:55,984 --> 00:37:56,985 ఎందుకు? 545 00:37:58,195 --> 00:38:00,405 ఈ విషయంలో, పైస్థాయిలో ఉన్నా కదా, ఏమీ కాదు అని అతిగా ఊహించుకోకూడదు అనుకున్నా. 546 00:38:01,532 --> 00:38:03,992 కడుపులోకి తూటా దిగాక, బుర్ర పదును అయింది. 547 00:38:05,369 --> 00:38:07,454 కాబట్టి, తప్పు చేశాననే భారాన్ని వదిలించుకోవాలనుకున్నాను. 548 00:38:08,121 --> 00:38:10,040 అందుకు అన్నమాట. 549 00:38:11,375 --> 00:38:13,544 నన్ను ఉద్యోగంలోంచి తీసేయాలనుకుంటే, నాకేం పర్వాలేదు. 550 00:38:14,545 --> 00:38:15,587 నేనేమీ భయపడను. 551 00:38:15,587 --> 00:38:17,923 - మరి ఏం జరిగింది? - వాళ్లు తెలివైన పని చేశారు. 552 00:38:17,923 --> 00:38:21,677 వీడియోను పరిశీలించడానికి బయటి ఆఫీసరును తీసుకొచ్చారు. 553 00:38:22,219 --> 00:38:23,387 అతను ఒక రిపోర్ట్ ఇచ్చాడు. 554 00:38:24,096 --> 00:38:25,305 అందులో ఏముందో తెలుసా? 555 00:38:26,515 --> 00:38:28,851 "ఆధారంగా సరిపోతుందని చెప్పలేము." 556 00:38:28,851 --> 00:38:32,020 సాక్షిని నేనే ఏమార్చి ఒప్పించేలా చేశానని దాని ద్వారా అంత స్పష్టంగా తెలీట్లేదు. 557 00:38:33,772 --> 00:38:34,773 కానీ నిజం మీకు తెలుసు కదా. 558 00:38:37,150 --> 00:38:38,151 హా... 559 00:38:40,070 --> 00:38:43,282 మనం ఎప్పుడు ఎలాంటి పనులు చేయగలమో మనకే తెలీదు. 560 00:38:47,035 --> 00:38:48,036 మీ అబ్బాయి బాగున్నాడా? 561 00:38:49,538 --> 00:38:50,539 హా. 562 00:38:51,081 --> 00:38:52,082 మంచిది. 563 00:38:53,792 --> 00:38:55,169 అది వాడికి ఒక పాఠం. 564 00:38:56,336 --> 00:38:57,337 మీ కూతురు ఎలా ఉంది? 565 00:38:58,255 --> 00:39:00,591 తనని నేను కలిశాను. తనతో నేను మాట్లాడానని మీకు చెప్పిందా? 566 00:39:00,591 --> 00:39:04,428 మీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు తను చాలా ఏడ్చింది. 567 00:39:06,054 --> 00:39:07,472 ఆ విషయం నాకు తెలీదే. 568 00:39:08,807 --> 00:39:10,184 తను ఎప్పట్నుంచీ డ్రగ్స్ తీసుకుంటోంది? 569 00:39:10,976 --> 00:39:12,019 ఎప్పట్నుంచో. 570 00:39:13,437 --> 00:39:15,022 ఇప్పుడు తను ఎలాగూ వేరే చోట ఉంటోంది. 571 00:39:15,981 --> 00:39:19,193 తన కాళ్ల మీద తను నిలబడాలనుకుంటోంది. చూద్దాం అది ఎంత వరకు సఫలం అవుతోందో. 572 00:39:23,488 --> 00:39:24,907 నా గురించి నువ్వేం అనుకుంటున్నావో తెలుసు. 573 00:39:25,991 --> 00:39:27,409 నేను ఏం అనుకుంటున్నాన్నది ముఖ్యం కాదు. 574 00:39:27,409 --> 00:39:29,036 ముఖ్యమే. నాకు ముఖ్యమే. 575 00:39:32,497 --> 00:39:34,249 నేను పక్షపాతంగా వ్యవహరిస్తానని అనుకుంటున్నావు. 576 00:39:37,294 --> 00:39:38,337 అది నిజమే అంటారా? 577 00:39:43,634 --> 00:39:44,635 ఏమో. 578 00:39:45,552 --> 00:39:48,430 మన చర్యలను ప్రశ్నించుకోవడానికి మనం ఎవరం? 579 00:39:48,430 --> 00:39:51,517 నేను జాత్యాహంకారినే అయితే, నాకే కదా ముందు తెలిసేది, ఏమంటావు? 580 00:39:57,022 --> 00:39:58,982 కానీ ఎర్రొల్ ఉదంతం జరిగింది. 581 00:40:02,986 --> 00:40:04,238 చూడు, నేను ఎలాంటి వాడిని అంటే... 582 00:40:04,238 --> 00:40:05,447 మీరు వివరాలను గమనించే వ్యక్తి. 583 00:40:05,447 --> 00:40:08,116 అవును. నీలాగానే. 584 00:40:09,159 --> 00:40:10,160 హా. 585 00:40:11,578 --> 00:40:12,913 ఎక్కువసార్లు చూసుకుంటే, 586 00:40:13,747 --> 00:40:16,333 మీరు ల్యాబ్ రిపోర్టులని, ఆలిబై లని, 587 00:40:17,084 --> 00:40:18,460 ప్రతీ వివరాన్ని కూడా 588 00:40:19,753 --> 00:40:20,921 వదలకుండా పరిశీలిస్తారు. 589 00:40:23,590 --> 00:40:25,050 మరి అప్పుడు ఎందుకు వీటిని పట్టించుకోలేదు? 590 00:40:27,135 --> 00:40:28,345 అతని విషయంలో ఎందుకు పట్టించుకోలేదు? 591 00:40:57,040 --> 00:40:58,417 బిల్డప్ ఇస్తున్నాడు. 592 00:40:58,417 --> 00:41:01,086 తొక్కేం కాదు. ఇది కూడా బిల్డప్ ఇవ్వడమేనా? 593 00:41:02,963 --> 00:41:05,257 ఈ విషయంలో కామెడీ వద్దు. వేళ్లు తెగుతాయ్! 594 00:41:05,257 --> 00:41:07,426 - హా, నేనే వాడికి అదంతా నేర్పింది. - సోది. 595 00:41:09,928 --> 00:41:12,347 - నీకు వెచ్చగానే ఉందా? - చలితో చస్తున్నా ఇక్కడ. 596 00:41:12,347 --> 00:41:13,515 హా, తెలుస్తూనే ఉందిలే. 597 00:41:16,310 --> 00:41:17,311 బాబూ. 598 00:41:24,067 --> 00:41:27,154 మీ అమ్మ ఎక్కడ ఉంది? చర్చికి వెళ్లిందా? 599 00:41:28,488 --> 00:41:31,909 లేదు, నాన్నా. తను అక్కడ ఉంది. 600 00:41:34,161 --> 00:41:35,162 చూశావా? 601 00:41:36,288 --> 00:41:37,664 అక్కడ ఏం చేస్తోంది? 602 00:41:41,627 --> 00:41:43,003 ఇంకో బీరు కావాలా, నాన్నా? 603 00:42:00,896 --> 00:42:02,064 మీ మనస్సులో ఏముంది? 604 00:42:04,983 --> 00:42:06,276 పర్వాలేదు. చెప్పండి. 605 00:42:09,613 --> 00:42:11,573 - మనం కలిసిన మొదటి రోజు. - వైట్ క్రాస్ జైల్లో. 606 00:42:12,991 --> 00:42:15,410 మీ అరెస్ట్ గురించి మిమ్మల్ని అడిగాను కదా, గుర్తుందా? 607 00:42:16,453 --> 00:42:18,455 నేరాన్ని ఎందుకు ఒప్పుకున్నారో అడిగా నేను. 608 00:42:18,455 --> 00:42:20,916 - గుర్తు లేదని అన్నారు మీరు. - అవును. 609 00:42:20,916 --> 00:42:23,335 నాకు మీరేదో చెప్పాలని అనుకుంటున్నట్టుగా అనిపించింది. 610 00:42:23,335 --> 00:42:24,419 హా? 611 00:42:24,419 --> 00:42:26,338 అంటే, అతను మిమ్మల్ని ఎలా ఒప్పించాడో నాకు తెలుసు. 612 00:42:26,922 --> 00:42:29,550 మిమ్మల్ని ఎలా మీ ఇంటికి తీసుకెళ్లాడో, అది కూడా మీ ఇద్దరే వెళ్లారు. 613 00:42:29,550 --> 00:42:30,926 మీరూ, హెగర్టీ. 614 00:42:32,302 --> 00:42:36,056 నిజానికి, అలా చేసే అధికారం అతనికి లేదు. లాయర్ లేకుండా అతను అస్సలు చేయకూడదు అలా. 615 00:42:36,056 --> 00:42:37,516 అసలు మీరేం అడగాలనుకుంటున్నారు? 616 00:42:37,516 --> 00:42:38,767 మీరు ఇది ఎవరికీ ఎందుకు చెప్పలేదు? 617 00:42:38,767 --> 00:42:41,937 మీ అమ్మకి చెప్పలేదు, మీ లాయరుకు చెప్పలేదు, సోనియాకి కూడా చెప్పలేదు. 618 00:42:42,938 --> 00:42:44,106 ఒకసారి వాడిని చూడండి. 619 00:42:46,149 --> 00:42:47,943 ఒక కొత్త లోకంలో ఉన్నట్టున్నాడు. 620 00:42:47,943 --> 00:42:50,070 ఆ సమయంలో, వాడు చాలా అనుభవించాడు, 621 00:42:50,070 --> 00:42:52,990 అదీగాక వాడిని సాక్షిగా చేర్చారు, మరి... 622 00:42:55,200 --> 00:42:58,078 అప్పుడు ఏం జరిగింది అంటారా? వాడిని ఇంకా బాధ పెట్టాలని నాకు అనిపించలేదు. 623 00:42:59,288 --> 00:43:02,249 ఏదేమైనా, వాడిని నేను నమ్మాను. 624 00:43:03,709 --> 00:43:05,919 వాడు ఆరేళ్ల పిల్లాడు. 625 00:43:05,919 --> 00:43:08,297 - చాలా బాధలో ఉన్నాడు. - కానీ వాడు విన్నది నిజమే కదా. 626 00:43:10,674 --> 00:43:12,801 అసలు అతను ఏం విన్నాడు? 627 00:43:13,468 --> 00:43:14,678 అడిలైడ్ ని నేను కొట్టానని అన్నాడు. 628 00:43:15,179 --> 00:43:19,766 "నిన్ను చంపిపారేస్తా. నిన్ను చంపిపారేస్తా." 629 00:43:22,561 --> 00:43:23,562 అదన్నమాట. 630 00:43:24,605 --> 00:43:25,814 నేను వాడిని నమ్మాను. 631 00:43:55,969 --> 00:43:58,388 - ఎక్కడికి వెళ్లిపోయాడు? - రంధ్రం గుండా. 632 00:44:04,853 --> 00:44:07,856 ఒకరోజు రాత్రి... ఇద్దరూ గొడవపడ్డారు. 633 00:44:10,275 --> 00:44:11,485 గొడవపడటం అంటే? 634 00:44:12,361 --> 00:44:13,362 అరుచుకున్నారు. 635 00:44:14,363 --> 00:44:15,948 దేనికి అరుచుకున్నారు? 636 00:44:16,782 --> 00:44:17,783 డబ్బు విషయంలో. 637 00:44:18,450 --> 00:44:19,451 డబ్బా? 638 00:44:19,952 --> 00:44:20,953 హా. 639 00:44:23,288 --> 00:44:24,289 పాట్రిక్... 640 00:44:24,957 --> 00:44:28,252 అప్పుడు ఎర్రొల్ ఏమన్నాడు? మీ అమ్మని ఏమన్నాడు? 641 00:44:29,127 --> 00:44:32,339 "నిన్ను చంపిపారేస్తా. నిన్ను చంపిపారేస్తా." 642 00:44:33,048 --> 00:44:34,049 నిజంగానా? 643 00:44:36,760 --> 00:44:38,011 దాన్ని ఆఫ్ చేస్తారా? 644 00:44:44,309 --> 00:44:45,477 వాడు వెళ్లిపోయాడు. 645 00:44:45,477 --> 00:44:46,562 ఎక్కడికి వెళ్లిపోయాడు? 646 00:44:47,771 --> 00:44:48,772 రంధ్రం గుండా. 647 00:44:50,983 --> 00:44:52,568 నిన్ను చంపిపారేస్తా... 648 00:45:02,870 --> 00:45:03,954 వాడు వెళ్లిపోయాడు. 649 00:45:03,954 --> 00:45:05,330 ఎక్కడికి వెళ్లిపోయాడు? 650 00:45:06,373 --> 00:45:07,583 రంధ్రం గుండా. 651 00:45:09,501 --> 00:45:11,920 నిన్ను చంపిపారేస్తా. నిన్ను చంపిపారేస్తా. 652 00:45:11,920 --> 00:45:13,672 నిన్ను చంపిపారేస్తా, బిడ్డా. 653 00:45:14,548 --> 00:45:16,258 మీ గురించి పాట్రిక్ ఏమన్నాడో వినాలనుందా? 654 00:45:16,258 --> 00:45:17,718 - అవును. - వినండి మరి. 655 00:45:17,718 --> 00:45:20,053 నిన్ను చంపిపారేస్తా. నిన్ను చంపిపారేస్తా. 656 00:45:20,053 --> 00:45:21,305 అప్పుడు ఎర్రొల్ ఏమన్నాడు? 657 00:45:21,305 --> 00:45:24,308 "నిన్ను చంపిపారేస్తా. నిన్ను చంపిపారేస్తా." 658 00:45:24,308 --> 00:45:25,267 నిజంగానా? 659 00:45:30,981 --> 00:45:32,649 అతను మాట్లాడింది ఎర్రొల్ గురించి కాదు. 660 00:45:33,317 --> 00:45:35,944 టీవీలో ఒక కార్టూన్ బొమ్మ అన్న మాటలు అన్నాడంతే. 661 00:45:36,528 --> 00:45:37,613 అది మీకు కూడా తెలుసు. 662 00:45:39,823 --> 00:45:40,991 మీరు అతనికి లేనిపోనిది ఎక్కించారు. 663 00:45:43,202 --> 00:45:47,331 దాన్ని ఉపయోగించి మీరు అతని జీవితాన్నంతా నాశనం చేశారు. అవును కదా? 664 00:45:52,628 --> 00:45:54,546 వాస్తవాలను అనుసరించాలి అంటూ ఉంటారు కదా, ఆ నీతులు ఏమయ్యాయి? 665 00:45:56,340 --> 00:45:57,424 ఏమయ్యాయి ఆ నీతులు? 666 00:47:24,553 --> 00:47:26,555 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్