1 00:00:15,891 --> 00:00:17,893 వీ7 యూనిట్ కి డిటెక్టివ్ సార్జెంట్ లెంకర్ ని చెప్తున్నాను. 2 00:00:18,393 --> 00:00:21,522 నేను హాతర్వే ఫ్లాట్స్ లో తొమ్మిదవ అంతస్థులోకి వెళ్తున్నాను. 3 00:00:21,522 --> 00:00:24,274 నేను ఫ్లాట్ నంబరు 942లోకి వెళ్తున్నాను, అనుమానితుడు ఇంకా కనిపించలేదు. 4 00:00:24,274 --> 00:00:26,485 - యూనిట్ 7 కి మీ సందేశం అందింది, డిఎస్ లెంకర్. - లోనికి వెళ్లండి. 5 00:00:26,485 --> 00:00:28,654 మేము దార్లో ఉన్నాం, మూడు నిమిషాల్లో అక్కడ ఉంటాం. 6 00:00:29,863 --> 00:00:31,490 దయచేసి జాగ్రత్తగా మెలగండి. 7 00:00:36,245 --> 00:00:37,079 పోలీస్! 8 00:00:43,418 --> 00:00:45,921 - ఫ్లాటులోకి వెళ్తున్నాను. - సరే. రెండు నిమిషాల్లో అక్కడ ఉంటాం. 9 00:01:46,773 --> 00:01:47,858 పోలీసులకి కాల్ చేయండి. 10 00:01:56,116 --> 00:01:57,409 ఓయ్, ఆగు! 11 00:01:59,620 --> 00:02:00,621 పోలీస్! 12 00:02:03,081 --> 00:02:03,957 ఆగు! 13 00:03:59,072 --> 00:04:00,282 {\an8}క్రైమ్ కేసు ఫైల్ 14 00:04:06,538 --> 00:04:07,539 కాదు. 15 00:04:17,966 --> 00:04:19,134 ఇతనే. 16 00:04:24,014 --> 00:04:25,140 "క్లైవ్ సిల్కాక్స్." 17 00:04:25,140 --> 00:04:26,975 ఖచ్చితంగా చెప్తున్నా, అతనే. 18 00:04:31,313 --> 00:04:33,440 అతను మన డేటాబేస్ లో ఉన్నాడు కదా, నేరచరిత్ర ఏమైనా ఉందా? 19 00:04:33,440 --> 00:04:36,610 దాడి చేశాడని కొన్ని ఫిర్యాదులు, గృహ హింస, 20 00:04:37,528 --> 00:04:39,655 నిషేధిత సంస్థ తరఫున నేరాలకు పాల్పడుతుంటాడు. 21 00:04:40,739 --> 00:04:43,325 ఏదైనా స్వాభిమానవాద రాజకీయ పార్టీ తరఫున అనుకుంటా. 22 00:04:44,201 --> 00:04:45,994 హా, కానీ ఏ కేసులోనూ అతను దోషిగా నిరూపించబడలేదు. 23 00:04:46,578 --> 00:04:49,206 దాడుల కేసులు ఎప్పటి నుండి నమోదయ్యాయి? 24 00:04:49,790 --> 00:04:51,041 ఆగస్ట్ 2009. 25 00:04:51,542 --> 00:04:54,086 మైఖెల్స్ స్ట్రీట్ లో ఏదో గొడవ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. 26 00:04:54,086 --> 00:04:56,380 మైఖెల్స్ స్ట్రీట్. అంటే, అతను స్థానికుడే. 27 00:04:57,381 --> 00:05:00,133 ఎందుకంత ఆసక్తి చూపుతున్నావు? 28 00:05:01,134 --> 00:05:04,513 మరియా డి సౌజా అనే మహిళ చనిపోయింది కదా. 29 00:05:07,015 --> 00:05:11,019 మంగళవారం రాత్రి హయీస్ లేన్ నుండి కాల్ చేసిన వ్యక్తి తనే అని నా నమ్మకం. 30 00:05:12,354 --> 00:05:13,647 999కి కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తా? 31 00:05:13,647 --> 00:05:14,731 అవును, సర్. 32 00:05:16,108 --> 00:05:19,736 లవర్ బాగా హింసిస్తూ, అడిలైడ్ బరోస్ ని చంపింది తనే అని అనేవాడట. 33 00:05:21,071 --> 00:05:23,574 ఈ కేసు విషయంలో ఒకరిద్దరి సహాయం అవసరమవుతుందని కూడా నేను అడిగాను, గుర్తుందా? 34 00:05:23,574 --> 00:05:24,783 - జూన్... - ఇప్పుడు... 35 00:05:28,245 --> 00:05:33,917 అతనికి పక్కింటోళ్లనో, ఆఫీసులోని సహోద్యోగులనో, మాజీ భాగస్వాములనో మనం పట్టుకొని ఉండవచ్చు. 36 00:05:35,169 --> 00:05:37,588 - అతను ఎవరినైనా బెదిరించి... - చూడు... 37 00:05:37,588 --> 00:05:39,006 లేదు, ఇంకాస్త ఉంటే అతడిని పట్టుకొనేదాన్నే. 38 00:05:41,383 --> 00:05:42,593 నీ వంతు ప్రయత్నం నువ్వు చేశావు. 39 00:05:46,763 --> 00:05:48,932 ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు సురక్షితంగా బయటపడ్డావు. 40 00:05:51,185 --> 00:05:52,561 అదీ ముఖ్యం. 41 00:05:53,312 --> 00:05:56,190 ఒక విషయం చెప్పనా, అడిలైడ్ బరోస్ హత్య విషయంలో 42 00:05:56,190 --> 00:05:57,691 ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే... 43 00:05:59,359 --> 00:06:00,611 మనం విచారణ చేద్దాం. 44 00:06:01,987 --> 00:06:03,238 మాటిస్తున్నాను. 45 00:06:07,868 --> 00:06:09,161 ఎన్ని అడ్డంకులనైనా అధిగమిద్దాం. 46 00:06:12,956 --> 00:06:15,459 కిమ్ మొబైల్ 47 00:06:17,002 --> 00:06:18,420 ఎంత పెద్దవారైతే... 48 00:06:18,420 --> 00:06:20,422 కిమ్. ఏంటి సంగతి? 49 00:06:20,422 --> 00:06:21,673 ...వారి పతనం అంత భారీగా ఉంటుంది. 50 00:06:29,264 --> 00:06:31,725 బ్రై. మీ ప్రాంతంలో హత్య జరిగినట్టుంది. 51 00:06:37,648 --> 00:06:40,192 ఏవండి. హలో, ఏవండి. 52 00:06:40,192 --> 00:06:41,944 జూన్ లెంకర్ అనే పేరున్న వ్వక్తి కోసం వచ్చాను. 53 00:06:41,944 --> 00:06:44,154 - ఆమెని ఇక్కడ చేర్చి చాలా సేపైంది. - అబ్బా. 54 00:06:46,198 --> 00:06:47,199 అక్కడ ఉంది. 55 00:06:48,450 --> 00:06:49,576 సరే. బై-బై. 56 00:06:53,830 --> 00:06:54,998 - హాయ్. - హలో. 57 00:06:56,750 --> 00:06:58,001 - బాగానే ఉన్నావా? - హా. 58 00:06:59,920 --> 00:07:01,380 - అంతే అంటావా? - హా. 59 00:07:09,263 --> 00:07:10,264 ఇలా రా. 60 00:07:12,224 --> 00:07:14,518 నీ బట్టలు ఎక్కడ? 61 00:07:14,518 --> 00:07:17,729 వాళ్లు తీసుకెళ్లారు. ఏదో... సాక్ష్యం, ఫైబర్స్, డీఎన్ఏ కోసం... 62 00:07:17,729 --> 00:07:18,981 - అది మామూలేలే. - సరే. 63 00:07:18,981 --> 00:07:21,775 మామూలేనా? మామూలే అట. ఇక్కడ మామూలుగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు... 64 00:07:21,775 --> 00:07:25,404 లియో, మరేం పర్వాలేదు. కేవలం... తెగిన గాయాలు, దెబ్బలేగా. 65 00:07:28,824 --> 00:07:30,200 సారీ, నాకేమైందో అర్థం కావట్లేదు. 66 00:07:30,200 --> 00:07:33,036 పర్వాలేదులే. కాస్త ఆగు... ఒక్క క్షణం ఆగు, సరేనా? 67 00:07:33,036 --> 00:07:35,539 ఏవండి. సారీ. ఏవండి. 68 00:07:35,539 --> 00:07:36,665 బాగానే ఉన్నా. 69 00:07:36,665 --> 00:07:38,292 ఇవాళ అసలు డాక్టర్లు ఎవరైనా పని చేస్తున్నారా? 70 00:07:38,292 --> 00:07:41,920 ఎందుకంటే... నా భార్య పోలీస్ ఆఫీసర్, తనపై దాడి జరిగింది. 71 00:07:41,920 --> 00:07:43,088 లియో. 72 00:07:43,088 --> 00:07:44,756 లియో, నాకేమీ ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పేశారు. 73 00:07:44,756 --> 00:07:47,050 కన్సల్టంట్ వచ్చి ఓకే అంటే, నన్ను డిశ్చార్జ్ చేసేస్తారు. 74 00:07:47,050 --> 00:07:48,594 హా. సరే. తనకి డాక్టర్ అవసరం ఉంది. 75 00:07:48,594 --> 00:07:49,511 - సరేనా? - సరే. 76 00:07:49,511 --> 00:07:51,930 - మరి డాక్టర్ ఇప్పుడు వచ్చి చూస్తారా? - హా, ఒక్క క్షణం ఆగండి. 77 00:07:51,930 --> 00:07:52,848 థ్యాంక్యూ. 78 00:07:56,560 --> 00:07:57,644 మరేం పర్వాలేదులే. 79 00:07:58,520 --> 00:07:59,521 మరేం పర్వాలేదు. 80 00:08:01,940 --> 00:08:03,233 బంగారం, ఏం చూస్తున్నావు? 81 00:08:03,817 --> 00:08:04,735 ఏమీ లేదు. 82 00:08:05,819 --> 00:08:07,112 నువ్వు ఏం చేస్తున్నావో చెప్పనా? 83 00:08:07,112 --> 00:08:09,198 - సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నావా? - లేదు. 84 00:08:10,407 --> 00:08:11,909 బాబోయ్, నువ్వు పోస్ట్ చేస్తున్నావు. ఇలా చూపించు. 85 00:08:13,160 --> 00:08:15,704 - ఆగు, అమ్మా. - వావ్. 86 00:08:15,704 --> 00:08:17,623 జేకబ్. ఏం... ఏం చేస్తున్నావు నువ్వు? 87 00:08:17,623 --> 00:08:19,875 నువ్వు... మీ అమ్మ గాయాలపై శునకానందం చూపిస్తున్నట్టుంది. 88 00:08:19,875 --> 00:08:21,543 కొంపదీసి మీ నాన్న నిన్ను ఫాలో అవ్వడం లేదు కదా. 89 00:08:22,461 --> 00:08:23,837 లేదు, నేను బ్లాక్ చేసేశా. 90 00:08:24,421 --> 00:08:28,425 అయినా, నాకు 13 లైక్స్ వచ్చాయి, ఇంకా పెరుగుతున్నాయి. అది మంచిదే అంటావా? 91 00:08:29,134 --> 00:08:30,511 సోషల్ మీడియా గురించి అర్థం చేసుకొనే వయస్సు కాదులే నీది. 92 00:08:30,511 --> 00:08:32,596 ఒకరు నన్ను రౌడీ రాణీ అని అన్నారే. 93 00:08:33,222 --> 00:08:34,932 "రౌడీ రాణి" పేరు బాగానే ఉందిలే. 94 00:08:36,140 --> 00:08:37,142 సారీ. 95 00:08:37,808 --> 00:08:40,062 ఇలా జరిగితే కానీ నువ్వు నన్ను చూసి గర్వపడవా? 96 00:08:54,618 --> 00:08:56,286 కోడీన్ 30 మిల్లీగ్రాములు జూన్ లెంకర్ 97 00:09:41,498 --> 00:09:44,376 నిద్ర పట్టడం లేదు ఆఫీసుకు వెళ్లాను 98 00:10:04,646 --> 00:10:05,898 ప్రేమ వల్ల బాధ తప్పదు 99 00:10:06,481 --> 00:10:07,816 సంప్రదించండి 100 00:10:11,278 --> 00:10:12,362 ఇతనే. 101 00:10:13,071 --> 00:10:14,406 క్లైవ్ సిల్కాక్స్. 102 00:10:15,490 --> 00:10:18,327 ఇతను, క్లైవ్ సిల్కాక్స్. 103 00:10:18,327 --> 00:10:20,704 అతడిని ఎవరు సంప్రదించినా, అది మీకు తెలిస్తే చెప్పండి. 104 00:10:21,205 --> 00:10:23,332 మాజీ లవర్ అయినా, చెల్లి అయినా, కుటుంబ సభ్యులైనా పర్లేదు. 105 00:10:26,418 --> 00:10:27,503 ఎవరైనా పర్లేదు. 106 00:10:29,171 --> 00:10:30,714 గృహ హింసను ఆపండి 107 00:10:30,714 --> 00:10:33,091 ఇది నా ఫోన్ నంబర్. 108 00:10:33,091 --> 00:10:34,468 ఇది నా కొత్త నంబర్. 109 00:10:35,969 --> 00:10:37,930 థ్యాంక్స్. బతికించావు. 110 00:10:37,930 --> 00:10:39,515 పాలలో కలుపుకు వచ్చాను, చక్కెర ఒక స్పూనేనా? 111 00:10:39,515 --> 00:10:40,933 మళ్లీ రెండు స్పూన్స్ వేసేసుకుంటున్నాలే. 112 00:10:40,933 --> 00:10:43,936 పర్వాలేదులే. నువ్వు ఇంకా నైట్ షిఫ్ట్స్ లో పని చేస్తున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. 113 00:10:44,520 --> 00:10:45,604 అలవాటు అయిపోయింది. 114 00:10:47,940 --> 00:10:50,692 నేను నా పని కోసం రాలేదు. ఆఫీసు పని మీద వచ్చా. 115 00:10:50,692 --> 00:10:52,152 ఇక్కడ అవకాశం తక్కువే ఉందనుకో, 116 00:10:53,403 --> 00:10:57,074 ఈ క్లైవ్ సిల్కాక్స్ అనే వ్యక్తి జాడని కనిపెట్టే పనిలో ఉన్నాను నేను. 117 00:11:00,953 --> 00:11:01,995 నేను వాకబు చేస్తాలే. 118 00:11:51,128 --> 00:11:54,047 4 కొత్త మెసేజ్లు - డిటెక్టివ్ చీఫ్ ఇన్స్ పెక్టర్ చాంబర్స్ మిస్డ్ కాల్ - లియో 119 00:11:56,925 --> 00:11:58,760 జూన్, హాతర్వే టవర్స్ కేసు విషయంలో 120 00:11:58,760 --> 00:12:02,181 ఒక కొత్త విషయం తెలిసింది. సారీ. కాల్ చేయ్. 121 00:12:15,152 --> 00:12:16,695 సారీ, పక్కకు జరగండి. దారి ఇవ్వండి. 122 00:12:35,255 --> 00:12:38,675 సర్, ఈ సంఘటనా స్థలికి మొదటగా వచ్చింది నేనే. 123 00:12:39,510 --> 00:12:41,053 కాస్త ఆగమ్మా. 124 00:12:41,053 --> 00:12:43,263 ఈ సిల్కాక్స్ అనే వ్యక్తిపై 125 00:12:43,263 --> 00:12:45,516 ఇప్పటికే ఒక దర్యాప్తు జరుగుతోంది. 126 00:12:45,516 --> 00:12:46,600 నిజంగానా? 127 00:12:46,600 --> 00:12:49,728 అవును. పోయిన అక్టోబరులో ఒక మహిళ ఇంటికి వస్తున్నప్పుడు ఇతను దాడి చేశాడట. 128 00:12:49,728 --> 00:12:54,316 కార్యచరణల సమన్వయ కమిటీ, ఈ హత్యను కూడా ఇప్పుడు విచారణ చేస్తున్న బృందానికి అప్పగిస్తే మంచిదని భావించింది. 129 00:12:54,316 --> 00:12:55,609 అతడు దొరికాడా? 130 00:12:56,276 --> 00:12:59,071 నువ్వేమైనా అడగాలనుకుంటే, డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ గేరింగ్ ని అడుగు. 131 00:13:00,906 --> 00:13:03,909 తనే ఈ దర్యాప్తుకు ఇన్ ఛార్జీ, నేను కేవలం బిల్డప్ కే ఇక్కడ తిరుగుతున్నా. 132 00:13:04,826 --> 00:13:05,911 ఒక్క నిమిషం, ఆమె... 133 00:13:06,620 --> 00:13:08,163 అతను ఇంకా ఇక్కడే ఉన్నాడని ఆమె అనుకుంటోందా? 134 00:13:08,163 --> 00:13:09,623 నీకు గాయం పెద్దదే తగిలినట్టుందే. 135 00:13:10,541 --> 00:13:13,377 సర్, హతురాలు మరియా చనిపోయే ముందు, 136 00:13:13,377 --> 00:13:17,256 అత్యవసర కాల్స్ ఆపరేటరుకు, హయీస్ లేన్ నుండి కాల్ చేసింది తనే అని చెప్పింది. 137 00:13:17,256 --> 00:13:19,550 - హయీస్ లేన్ నుండి కాల్ చేసిన వ్యక్తా? - అదే ఒక అజ్ఞాత కాలర్ గురించి... 138 00:13:19,550 --> 00:13:21,927 - బుధవారం మిమ్మల్ని కలిశా కదా, ఆమె. - సరే. 139 00:13:21,927 --> 00:13:24,137 కాబట్టి, అనుమానితుడిని మీరు పట్టుకుంటే, 140 00:13:24,137 --> 00:13:26,890 తను చేసిన ఆరోపణల విషయమై, అతడిని నేను విచారించడానికి మీ అనుమతిని కోరుతున్నాను. 141 00:13:26,890 --> 00:13:29,977 - ఆరోపణలా? - అడిలైడ్ బరోస్ హత్య గురించి. 142 00:13:29,977 --> 00:13:32,354 రెండు కాల్స్ నూ ఆమె చేసిందని అనుకుంటున్నావా? 143 00:13:32,354 --> 00:13:34,189 - అవును. - అది అనుకుంటే అంతా సులువు అయిపోతుంది కదా. 144 00:13:35,065 --> 00:13:38,652 అలా అని కాదు, మరియా డి సౌజా, తను ఆపరేటరుతో చెప్పింది, "మనం గతంలో మాట్లాడుకున్నాం..." 145 00:13:38,652 --> 00:13:42,030 హా, గతంలో మాట్లాడుకున్నామని చెప్పిందంతే. ఎప్పుడు, ఎక్కడ అని చెప్పలేదు కదా. 146 00:13:42,030 --> 00:13:43,740 అలా అని ఆ అవకాశాన్ని తీసిపారేయలేము కదా. 147 00:13:44,283 --> 00:13:46,869 అంటే, ఈ మహిళలు భౌతికంగా ఒకేలా ఉన్నారు. 148 00:13:47,578 --> 00:13:50,998 ఇద్దరి ఆకారం ఒకేలా ఉంది. ఇద్దరూ హిస్పానికే. 149 00:13:50,998 --> 00:13:52,666 వాళ్ల గొంతు కూడా ఒకేలా ఉంది మరి. 150 00:13:53,876 --> 00:13:55,335 తను నీ కళ్ల ముందే చనిపోయిందని విన్నాను. 151 00:13:57,796 --> 00:13:58,797 అవును. 152 00:13:58,797 --> 00:14:00,716 నేనేదో పైఅధికారినని నీకు ఇది చెప్పట్లేదు, 153 00:14:02,050 --> 00:14:05,512 నేను మీ కాల్ సంభాషణ విన్నాను, నువ్వు ఆమెకి కొన్ని చెప్పావు కదా? 154 00:14:06,597 --> 00:14:09,975 తన ఆఖరి క్షణాల్లో నువ్వు ఇచ్చిన సలహా ఉందే, 155 00:14:10,976 --> 00:14:12,186 అది చాలా బాగుంది. 156 00:14:13,437 --> 00:14:14,563 నువ్వు తనకి ధైర్యాన్ని ఇచ్చావు. 157 00:14:15,147 --> 00:14:16,190 తనకి అండగా నిలిచావు. 158 00:14:22,696 --> 00:14:24,031 ఆ కాల్ చేసింది తనే. 159 00:14:25,365 --> 00:14:27,284 - సరే. - హయీస్ లేన్ నుండి కాల్ చేసింది తనే. 160 00:14:27,284 --> 00:14:29,870 - ఇంకో విషయం ఏంటంటే... - మనకేం కావాలో అదే మన కళ్లకి కనిపిస్తుంది. 161 00:14:29,870 --> 00:14:30,954 అందరికీ అంతే. 162 00:14:30,954 --> 00:14:32,581 నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నా, అంతే. 163 00:14:32,581 --> 00:14:36,043 నాకు కూడా అదే కావాలి, డిటెక్టివ్ సార్జెంట్. కానీ అతని ఆచూకీ తెలీట్లేదు. 164 00:14:36,043 --> 00:14:37,878 సంఘటన జరిగి పది గంటలైంది. 165 00:14:37,878 --> 00:14:39,379 మీరు సమయం వృథా చేస్తున్నారు. 166 00:14:40,923 --> 00:14:43,342 నీ తలకు తగిన గాయం వల్ల నువ్వు అలా మాట్లాడుతున్నావు అనుకుంటా. 167 00:14:43,342 --> 00:14:44,426 నాకేం కాలేదు. 168 00:14:44,426 --> 00:14:46,845 లేదు. నీపై దాడి జరిగింది. 169 00:14:46,845 --> 00:14:49,264 - అతను ఇంకా ఇక్కడే ఉన్నాడని మీకెందుకు అనిపిస్తోంది? - దాన్ని తేలిగ్గా తీసిపారేయకు. 170 00:14:49,264 --> 00:14:50,807 మీరు సమయాన్ని, వనరులని వృథా చేస్తున్నారు. 171 00:14:50,807 --> 00:14:53,227 - మీరు వెతకాల్సింది ఇక్కడ కాదు. - ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో. 172 00:14:56,855 --> 00:14:58,273 మనిద్దరికీ కావాల్సింది ఒక్కటే ఇక్కడ. 173 00:15:16,291 --> 00:15:17,417 {\an8}ద్రోహి 174 00:15:25,884 --> 00:15:31,056 చూడండి అతనికి చాలా కాలం క్రితం ఒక లవర్ ఉండేది. 175 00:15:31,056 --> 00:15:32,349 నాలాంటి అమ్మాయే. 176 00:15:32,891 --> 00:15:35,769 "తను పిచ్చిది. నా మాటలని పట్టించుకునేది కాదు." అని అనేవాడు. 177 00:15:36,311 --> 00:15:38,522 అతడిని ఎప్పుడూ సంతోషంగా ఉంచలేదు. 178 00:15:39,481 --> 00:15:43,193 - నీ పేరు చెప్పగలవా? - మరియా. 179 00:15:43,193 --> 00:15:45,612 మరియా. సరే, మరియా. 180 00:15:47,739 --> 00:15:51,368 మీకు గతంలో ఓసారి కాల్ చేసి, మాట్లాడాను నేను. 181 00:15:51,368 --> 00:15:53,745 హా, నాకు గుర్తుంది. 182 00:15:54,663 --> 00:15:56,164 హయీస్ లేన్ 999 కాల్ 183 00:15:56,164 --> 00:16:00,752 నన్ను పొడిచిన కత్తితోనే, ఆమెని కూడా చాలాసార్లు పొడిచాడు. 184 00:16:01,545 --> 00:16:07,134 ఆమెని చంపిన నేరం కింద ఒకరికి 24 ఏళ్ల శిక్ష పడింది, ఇప్పుడు అతను జైల్లోనే ఉన్నాడు. 185 00:16:07,885 --> 00:16:12,973 ఇంకా వైట్ క్రాస్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఈ వ్యక్తి... 186 00:16:14,933 --> 00:16:17,311 పనికిమాలినవాడట, ఇంకా... 187 00:16:18,937 --> 00:16:21,315 ఒసేయ్ పనికిమాలినదానా! 188 00:16:21,315 --> 00:16:23,650 - అర్థమైందని చెప్పండి. - అర్థమైంది. 189 00:16:23,650 --> 00:16:27,446 - ఆమెని... -"తను పిచ్చిది. నా మాటలని పట్టించుకునేది కాదు." 190 00:16:28,030 --> 00:16:30,157 అతడిని ఎప్పుడూ సంతోషంగా ఉంచలేదు. 191 00:16:40,167 --> 00:16:43,420 నేషనల్ డేటాబేస్ లో మీరు వెతికిన వాహనాల నంబర్ల జాబితా ఇదిగోండి. 192 00:16:43,420 --> 00:16:47,716 వీటికి కేసు నంబరేమీ లేదు. ఇవేమీ నేరాలతో సంబంధం ఉన్నట్టుగా అనిపించడం లేదు. 193 00:16:49,218 --> 00:16:53,138 కాబట్టి, మీరు ఈ ఒక్కొక్క బండి నంబరును పరిశీలించి 194 00:16:53,138 --> 00:16:56,266 వాటికి సంబంధించిన కేసు నంబరును పక్కన రాసి ఇవ్వండి. 195 00:16:56,266 --> 00:16:59,186 మీకు తెలిసే ఉంటుంది, ఇది ఉల్లంఘనకు పాల్పడటమే అవుతుంది... 196 00:17:05,733 --> 00:17:07,152 నీ డ్యూటీ లాగ్ ని విశ్లేషిస్తూ, 197 00:17:07,152 --> 00:17:10,196 కేసు నంబర్లను తీసి, దీనికి ముగింపు పలికేయ్, సరేనా? 198 00:17:10,196 --> 00:17:14,785 సర్, ఈ రెండు అత్యవసర కాల్స్ లో మాట్లాడింది ఒకరేనా కాదా అని తెలుసుకోవడానికి ఫొరెన్సిక్ పరీక్షకి అనుమతి ఇవ్వండి. 199 00:17:14,785 --> 00:17:16,244 హయీస్ లేన్ నుండి కాల్ చేసిన వ్యక్తి, 200 00:17:16,244 --> 00:17:19,039 నిన్న రాత్రి చనిపోయింది ఒకరేనా, కాదా అని నిర్ధారించుకోవడానికి. 201 00:17:19,039 --> 00:17:21,208 అది మన కేసు కాదు, జూన్. అది మనకి స్పష్టంగానే చెప్పేశారుగా. 202 00:17:21,208 --> 00:17:24,837 సర్. సర్. హయీస్ లేన్ కాలర్ గురించి మనకు కమాండ్ అండ్ కంట్రోల్ ఫ్లాగ్ చేశారు కాబట్టి వచ్చింది. 203 00:17:24,837 --> 00:17:27,130 నన్ను దాని సంగతేంటో చూడమని మీరే అన్నారు. 204 00:17:27,714 --> 00:17:30,300 ఒకవేళ ఆ కాల్ చేసింది మరియా డి సౌజానే అయితే, 205 00:17:30,300 --> 00:17:31,927 అప్పుడు మనం ఫైలు మూసేయవచ్చు. నాకు కావాల్సింది అదే. 206 00:17:31,927 --> 00:17:33,053 సరే, ఇలా చూడు. 207 00:17:34,471 --> 00:17:35,681 నువ్వు నిరాశగా ఉన్నావని తెలుసు. 208 00:17:36,932 --> 00:17:37,933 సరేనా? 209 00:17:39,059 --> 00:17:42,604 నిజంగా చెప్తున్నా, జిమ్ గురించి ఓసారి ఆలోచించు. 210 00:17:42,604 --> 00:17:44,606 ఓక్ మూర్ దొంగతనాల కేసు విషయంలో చచ్చిపోతున్నాడు. అవును కదా? 211 00:17:44,606 --> 00:17:48,694 - కాబట్టి అతనికి సాయపడు. సరేనా? - అవును, సర్. 212 00:17:54,950 --> 00:17:56,243 {\an8}కేసు ఫైల్ 213 00:18:07,087 --> 00:18:09,256 లవరును చంపిన కేసులో దోషిగా తేలిన ఎర్రొల్ మ్యాథిస్ కోసం అప్పీల్ 214 00:18:09,965 --> 00:18:11,133 డోరిస్ మ్యాథిస్ అప్పీల్ ని ప్రారంభిస్తుంది 215 00:18:39,536 --> 00:18:40,746 మోక్షాన్ని ప్రసాదించే చర్చ్ 216 00:18:42,080 --> 00:18:43,373 సిద్ధంగా ఉన్నామా? 217 00:18:49,505 --> 00:18:52,466 ఇంకోసారి! కానివ్వండి! హేయ్, హేయ్, హేయ్! 218 00:18:55,594 --> 00:18:56,845 ఇక మొదలుపెట్టండి. 219 00:19:08,398 --> 00:19:09,733 పక్కకు. కానివ్వండి. 220 00:19:14,905 --> 00:19:18,534 - నీకు ఏమీ కాదు. - జనాలు నన్నే చూస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. 221 00:19:18,534 --> 00:19:22,371 అబ్బా. నువ్వు పెళ్లి కూతురివి. ఇది నీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు కదా. 222 00:19:22,955 --> 00:19:24,039 నువ్వు గర్వంగా చూపాలి మరి. 223 00:19:26,041 --> 00:19:27,668 మీరేనా డోరిస్ మ్యాథిస్? 224 00:19:27,668 --> 00:19:31,463 అవును. ఇక్కడ పని అయిపోవచ్చింది. వెళ్లి మీకేం కావాలో చూడండి. 225 00:19:31,463 --> 00:19:33,632 తెలీదు. నాకు తెలీదు. 226 00:19:33,632 --> 00:19:35,592 వచ్చి అద్దంలో ఒకసారి చూసుకో. 227 00:19:38,095 --> 00:19:40,389 - వావ్. - చూశావా ఎంత బాగుందో? 228 00:19:53,277 --> 00:19:55,988 - వచ్చేవారం కలుద్దాం మరి. - సరే. వచ్చేవారం కలుద్దాం అయితే. 229 00:19:55,988 --> 00:19:57,155 బై. 230 00:20:03,871 --> 00:20:06,373 - ఏం కావాలో చెప్పండి. - తనకి ఆ డ్రెస్ చాలా బాగుంది. 231 00:20:06,373 --> 00:20:07,708 థ్యాంక్యూ. 232 00:20:07,708 --> 00:20:11,295 నా పేరు డిటెక్టివ్ సార్జెంట్ జూన్ లెంకర్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మన్నించాలి. 233 00:20:11,295 --> 00:20:12,379 సరే. 234 00:20:13,672 --> 00:20:16,091 లటీషా, ఒక్క నిమిషం మాకు ఏకాంతం ఇవ్వవా, బంగారం? 235 00:20:16,091 --> 00:20:17,176 తప్పకుండా. 236 00:20:17,968 --> 00:20:20,929 మేము ఈ వ్యక్తి జాడని కనుగొనే పనిలో ఉన్నాం. 237 00:20:21,889 --> 00:20:23,390 తన పేరు క్లైవ్ సిల్కాక్స్. 238 00:20:23,390 --> 00:20:24,725 పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 239 00:20:25,225 --> 00:20:28,687 అతను ఎక్కడ ఆశ్రయం పొందుతున్నాడో తెలుసుకోవాలని చూస్తున్నాం. తను ఇక్కడి వాడే. 240 00:20:29,354 --> 00:20:31,982 కాబట్టి, అతడిని కలిసినవారిని కానీ, అతను తెలిసినవారిని కానీ 241 00:20:31,982 --> 00:20:33,859 సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. 242 00:20:33,859 --> 00:20:35,777 - కాబట్టి, మీరు ఎప్పుడైనా... - ఒక్క విషయం చెప్పండి, 243 00:20:36,528 --> 00:20:40,449 మీలాంటి మంచి వ్యక్తి పోలీసు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? 244 00:20:43,744 --> 00:20:44,995 మీ కొడుకు సంగతేంటి? 245 00:20:44,995 --> 00:20:47,623 అంటే, గతంలో వారిద్దరికీ పరిచయం ఉందేమో అని అడుగుతున్నా. 246 00:20:48,540 --> 00:20:49,958 మీరు నా ఎర్రొల్ తో మాట్లాడారా? 247 00:20:49,958 --> 00:20:51,793 లేదు. ఎందుకలా అడిగారు? మీకేమైనా... 248 00:20:52,669 --> 00:20:54,505 వాళ్లిద్దరికీ పరిచయం ఉందంటారా? 249 00:20:54,505 --> 00:20:57,424 అతను ఎర్రొల్ ఇంటికి వెళ్లుంటాడా? అతనికి అడిలైడ్ ఏమైనా తెలుసా? 250 00:20:57,424 --> 00:21:01,178 అడిలైడ్? ఇప్పుడు తన ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? 251 00:21:02,763 --> 00:21:04,431 చూడు, బంగారం. 252 00:21:05,265 --> 00:21:09,019 నాకు ఇదంతా కొత్త కాదు. ఎదుటివాళ్లు అబద్ధం ఆడుతుంటే నేను సులువుగా కనిపెట్టేయగలను. 253 00:21:09,019 --> 00:21:11,146 నేను కేవలం సహకారం ఆశిస్తున్నాను అంతే. 254 00:21:12,397 --> 00:21:14,858 ఐడీ కార్డ్ ఉందా, మిస్ డిటెక్టివ్ సార్జంట్... మీ పేరేంటి? 255 00:21:14,858 --> 00:21:16,777 లెంకర్. జూన్ లెంకర్. 256 00:21:19,112 --> 00:21:21,573 చెప్పేది జాగ్రత్తగా వినండి, డిటెక్టివ్ సార్జెంట్ లెంకర్. 257 00:21:22,282 --> 00:21:24,368 మీరు ఇక్కడికి వచ్చేసి, 258 00:21:24,368 --> 00:21:27,079 నా ఎర్రొల్ మీద ఇంకా ఏవైనా బనాయించాలని చూస్తున్నారేమో... 259 00:21:27,079 --> 00:21:29,540 - అసలు నా ఉద్దేశం అది కానే కాదు. - ఇక బయలుదేరండి దయచేసి. 260 00:21:39,132 --> 00:21:40,133 నిన్ను ఎవరు పంపారు? 261 00:21:41,301 --> 00:21:42,386 మిమ్మల్ని అతనే పంపాడా? 262 00:21:43,387 --> 00:21:44,721 - ఎవరు? - హెగర్టీ. 263 00:21:45,305 --> 00:21:47,057 ఇంకా అతని తొట్టి గ్యాంగ్. 264 00:21:47,057 --> 00:21:51,144 అతని మనుషులు అబద్ధాల మీద అబద్ధాలు ఆడతారు. 265 00:21:51,645 --> 00:21:52,646 ఇంకా వాళ్లు... 266 00:21:54,523 --> 00:21:56,859 వాళ్లు నా కొడుకును నాకు దూరం చేశారు. 267 00:21:57,401 --> 00:22:00,904 నేను మర్యాదగా నా కొడుకును కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నప్పుడు, 268 00:22:01,530 --> 00:22:03,490 "సారీ, మీరు పొరబడుతున్నారు," అట. 269 00:22:03,490 --> 00:22:05,576 పొరపాటు! అంతే. 270 00:22:07,703 --> 00:22:10,664 కానీ మీరు అతనికి నా మాటగా చెప్పండి, 271 00:22:12,165 --> 00:22:13,584 "నేను పట్టు వదలను," అని. 272 00:22:15,919 --> 00:22:18,922 హా. క్లైవ్ సిల్కాక్స్. 273 00:22:18,922 --> 00:22:21,884 మార్చి 2011లో అతను 24బీ లేక్ స్ట్రీట్ లో ఉండేవాడు. 274 00:22:21,884 --> 00:22:23,468 లేక్ స్ట్రీట్. అది దగ్గర్లోనే ఉంది. 275 00:22:24,052 --> 00:22:25,762 రూడిన్స్ లో పని చేసేవాడు. డెలివరీ చేసేవాడు. 276 00:22:25,762 --> 00:22:28,056 ఆ పాత యూదుల ఆఫీసా? అది నాకు నా చిన్నతనాన్ని గుర్తు తెప్పిస్తుంది. 277 00:22:29,183 --> 00:22:30,350 ఏదైనా ఆలిబై ఉందా? 278 00:22:30,350 --> 00:22:31,643 నాకు తెలిసి లేదు. 279 00:22:31,643 --> 00:22:35,105 అబ్బా. మనం అప్పుడు అతడిని విచారించలేదా? 280 00:22:35,105 --> 00:22:36,481 లేదుగా. 281 00:22:36,481 --> 00:22:39,902 ఏంటి? లండన్ లో ఉండే ప్రతీ అడ్డగాడిదని విచారిస్తామా ఏంటి? 282 00:22:39,902 --> 00:22:41,195 హా, అప్పటికే అతను ఒప్పుకున్నాడు కదా. 283 00:22:43,572 --> 00:22:48,869 చూడు, అడిలైడ్ తో, ఎర్రొల్ మ్యాథిస్ తో, లేదా ఆ ఫ్లాటుతో సిల్కాక్స్ కి లింక్ ఉండేది ఏదైనా కానీ... 284 00:22:49,870 --> 00:22:53,624 నా మీదకి కానీ, నా విచారణ మీదకి కానీ జూన్ వచ్చేలా చేసేది ఏదైనా కానీ, 285 00:22:54,833 --> 00:22:55,834 అది ముందుగా నాకే తెలియాలి. 286 00:22:57,294 --> 00:22:58,295 సరేనా? 287 00:22:58,295 --> 00:22:59,713 నేనేమీ తనని ఇబ్బంది పెట్టలేదు. 288 00:22:59,713 --> 00:23:01,548 తనకి అలానే అనిపించింది మరి. 289 00:23:01,548 --> 00:23:04,593 కాబట్టి క్లైవ్ సిల్కాక్స్ కి, నా క్లయింట్ కి సంబంధం ఏంటో నాకు మీరు చెప్పాలి. 290 00:23:04,593 --> 00:23:08,138 లేదా, నేను వెంటనే పోలీసు ఫిర్యాదుల విభాగానికి కాల్ చేసి మీపై ఫిర్యాదు చేసేస్తాను. 291 00:23:08,138 --> 00:23:11,350 అడిలైడ్ హత్యకు సంబంధించిన సమాచారం 292 00:23:11,350 --> 00:23:13,310 సిల్కాక్స్ దగ్గర ఉండే అవకాశం ఉంది. 293 00:23:13,310 --> 00:23:17,731 కాబట్టి, అడిలైడ్ తో లేదా ఎర్రొల్ తో సిల్కాక్స్ కి లింక్ ఉండేది ఏం దొరికినా కానీ... 294 00:23:17,731 --> 00:23:19,316 "సంబంధిత సమాచారమా?" 295 00:23:19,942 --> 00:23:22,152 మీరేమంటున్నారు? అతను సాక్షా? 296 00:23:22,945 --> 00:23:24,279 లేదా అనుమానితుడా? 297 00:23:26,240 --> 00:23:28,325 అది నేను చెప్పలేను. అది చాలా గోప్యమైన సమాచారం. 298 00:23:28,325 --> 00:23:29,493 మీకో దండం. 299 00:23:39,127 --> 00:23:40,546 - క్లోయి? - ఏంటి? 300 00:23:40,546 --> 00:23:42,881 హ్యాక్నీ డౌన్స్ స్టేషన్లో నీకు మిత్రులు ఉన్నారు, కదా? 301 00:23:43,757 --> 00:23:45,008 అవును. 302 00:23:45,551 --> 00:23:46,552 నువ్వు నాకొక సాయం చేసి పెట్టాలి. 303 00:23:47,636 --> 00:23:50,180 చూడు, అది నీ హత్య కేసుకు సంబంధించినదే అయితే... 304 00:23:50,180 --> 00:23:52,391 - మధ్యలో నన్ను దూర్చకు. - అబ్బా, క్లోయి. 305 00:23:52,391 --> 00:23:55,102 నేను దానిలో ఎలా దూరగలను? అది గోప్యమైనది. 306 00:23:55,102 --> 00:23:59,064 బతిమాలుతున్నా. ముఖ్యమైనది అయ్యుండకపోతే నేను అడిగి ఉండేదాన్నే కాదు. 307 00:24:03,110 --> 00:24:04,611 ఎంత పెద్ద సాయమేంటి? 308 00:25:22,189 --> 00:25:23,273 - ఇదుగోండి. - థ్యాంక్స్. 309 00:25:23,273 --> 00:25:26,151 డాల్స్టన్ లోని మంచి స్ట్రాంగ్ కాఫీ ఇది. తాగాకే థ్యాంక్స్ చెప్పండి. 310 00:25:27,236 --> 00:25:32,699 నేను డోరిస్ తో మాట్లాడాను, ఎర్రొల్, అతను ఒకే బడిలో చదువుకున్నారు. 311 00:25:34,034 --> 00:25:35,953 - ఎవరితో? - క్లైవ్ సిల్కాక్స్. 312 00:25:35,953 --> 00:25:37,704 సెయింట్ జోసెఫ్స్ అకాడమీ. 313 00:25:39,790 --> 00:25:43,418 కానీ క్లైవ్ అతని కన్నా రెండేళ్లు పెద్ద, కాబట్టి ఇద్దరూ మిత్రులు కాదన్నమాట. 314 00:25:43,418 --> 00:25:45,671 కానీ డోరిస్ కి వాళ్ల కుటుంబం గురించి ఒక రకంగా తెలుసు. 315 00:25:45,671 --> 00:25:48,090 ఒకరకంగానా? అంటే? 316 00:25:48,090 --> 00:25:51,510 ఎర్రొల్ కి జమీల్ అనే ఒక కజిన్ ఉండేవాడు, అతను సిల్కాక్స్ చెల్లి మీద మనస్సు పారేసుకున్నాడు. 317 00:25:52,261 --> 00:25:54,137 కానీ డోరిస్ అలాంటి వాటి విషయంలో కఠినంగా ఉండేది, కాబట్టి... 318 00:25:56,223 --> 00:25:57,683 కాబట్టి ఎర్రొల్ కి అతను తెలుసా? 319 00:25:58,475 --> 00:25:59,476 తెలుసు. 320 00:26:02,855 --> 00:26:03,856 థ్యాంక్యూ. 321 00:26:04,898 --> 00:26:05,899 పర్వాలేదు. 322 00:26:14,199 --> 00:26:18,078 నన్ను చూస్తే నీకు బాగా ఆవేశంగా ఉన్నట్టు అనిపిస్తోందా? 323 00:26:20,205 --> 00:26:22,374 ఆవేశంగానా? అంటే... 324 00:26:22,374 --> 00:26:23,834 చికాకుపడిపోతున్నట్టుగా. 325 00:26:24,751 --> 00:26:29,464 కోపం. అరవడం. పిచ్చిగా ప్రవర్తించడం. మధ్యలో ఊరికే దూరేయడం. 326 00:26:30,924 --> 00:26:32,467 నేను నిరాశగా ఉన్నానని రాయ్ అన్నాడు. 327 00:26:33,260 --> 00:26:36,054 కానీ అది కోడ్ కదా? మహిళని కాబట్టి పిచ్చి అని కాకుండా నిరాశ అన్నాడు. 328 00:26:36,555 --> 00:26:38,223 - జూన్. - ఏంటి? 329 00:26:38,223 --> 00:26:42,269 నువ్వు భయంకరమైన దాడి నుండి బయటపడ్డావు కదా. అందుకని ఆయన అడిగాడు. 330 00:26:45,814 --> 00:26:47,024 అంటే నేను అతిగా ఆలోచిస్తున్నానంటావా! 331 00:26:58,869 --> 00:27:00,370 నువ్వు బండిని కత్తిలా పార్క్ చేస్తావు, తెలుసా? 332 00:27:01,079 --> 00:27:03,248 అబ్బో, పొగడ్త భలే వింతగా ఉంది. 333 00:27:09,505 --> 00:27:11,215 - ఇలానా? - కాదు. 334 00:27:11,924 --> 00:27:13,467 - ఇలానా? - అబ్బా. 335 00:27:15,469 --> 00:27:17,054 - ఇంకా కొన్ని ఝలక్లు ఇవ్వనా? - వద్దమ్మా. 336 00:27:17,054 --> 00:27:18,805 కావాలంటే ఐస్ క్రీమ్ తెచ్చిస్తా. 337 00:27:23,644 --> 00:27:24,645 నువ్వు బాగానే ఉన్నావా? 338 00:27:30,359 --> 00:27:32,027 నిజానికి, కాస్త సమస్యలో ఉన్నాను నేను. 339 00:27:37,908 --> 00:27:38,909 కానివ్వు. 340 00:27:39,868 --> 00:27:40,869 నాకు పాజ్ చేయ్! నాకు! 341 00:27:45,123 --> 00:27:47,501 నాకు అర్థం కావట్లేదు. నువ్వు డేటాబేస్ లో వెతికావు. అయితే? 342 00:27:47,501 --> 00:27:51,421 పనికి సంబంధించినది అయితేనే వెతకాలి. దానికి కేసు నంబరును జత చేయాల్సి ఉంటుంది. 343 00:27:52,464 --> 00:27:53,465 అయితే? 344 00:27:54,007 --> 00:27:56,677 నేను వెతికింది నా కోసం కాదు. అమ్మ కోసం. 345 00:27:56,677 --> 00:27:58,345 సరే, ఇంతకీ ఎన్నిసార్లు వెతికావు? 346 00:27:59,263 --> 00:28:00,806 సరిగ్గా తెలీదు. ఎనిమిది సార్లేమో. 347 00:28:01,890 --> 00:28:05,352 ఎనిమిదా? జూన్. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? 348 00:28:05,352 --> 00:28:06,979 నువ్వేం చెప్తావో నాకు తెలుసు కాబట్టి. 349 00:28:06,979 --> 00:28:09,064 మళ్లీ తనని పిచ్చాసుపత్రిలో వేయడం నాకు ఇష్టం లేదు, సరేనా? 350 00:28:09,064 --> 00:28:10,566 నేను తనకి ఆ గతి పట్టనివ్వను. అలా జరగనివ్వను. 351 00:28:10,566 --> 00:28:13,360 సరే, దానికి ఇదేనా మంచి పరిష్కారం? నువ్వు అక్రమంగా డేటాబేసులో వెతకడం? 352 00:28:13,360 --> 00:28:17,239 ఆ సన్నాసి వల్లే ఇదంతా జరుగుతోంది. 353 00:28:17,239 --> 00:28:19,908 - హెగర్టీ. అబ్బా. - అది ర్యాండమ్ ఆడిట్ అని ఇప్పుడేగా అన్నావు! 354 00:28:19,908 --> 00:28:23,328 అతను ఏదైనా చేయగలడు. అతనికి జనాలు తెలుసు. అందరూ తెలుసు అతనికి. 355 00:28:23,328 --> 00:28:25,455 అయితే, అది పెరగక ముందే పరిష్కరించేసుకో. నీ మేనేజరుతో మాట్లాడు. 356 00:28:25,455 --> 00:28:27,332 - రాయ్ తోనా? - హా. నువ్వేం చేశావో అతనికి చెప్పు, అందులో ఏముంది! 357 00:28:27,332 --> 00:28:29,626 అది చేస్తే నా బతుకు బస్టాండ్ అయినట్టే. 358 00:28:29,626 --> 00:28:30,878 - ఎందుకు? - వాడు రూల్స్ పిచ్చోడు. 359 00:28:30,878 --> 00:28:33,088 దాని గురించి ఫిర్యాదు చేసేదాకా నిద్రపోడు. 360 00:28:33,088 --> 00:28:36,008 సరే. అయితే ఇంకాస్త పైకి వెళ్లి, ఆ అసిస్టెంట్ కమిషనరుతో మాట్లాడు. 361 00:28:36,008 --> 00:28:38,677 నువ్వు ఎప్పుడూ చెప్తూ ఉండేదానివి కదా, అదే సిఐడిలో చేరమని నిన్ను ప్రోత్సహించిన వ్యక్తి. 362 00:28:38,677 --> 00:28:40,053 వెంటనే ఫోన్ చేసి మాట్లాడమంటావా? 363 00:28:40,053 --> 00:28:41,513 "హాయ్, నేను గుర్తున్నానా? 364 00:28:41,513 --> 00:28:45,184 హౌన్ స్లోలో ఒక నియామక వారాంతం నాడు మీరు ఒక మహిళని ప్రోత్సహించారు కదా, అది నేనే," అని చెప్పనా? 365 00:28:45,184 --> 00:28:48,061 - చెప్తే ఏమవుతుంది? - నేను నువ్వు కాదు కదా, అర్థమైందా? 366 00:28:49,688 --> 00:28:52,191 నాకు జీవితంలో అన్నీ ఇట్టే దొరికేయవు. 367 00:28:52,191 --> 00:28:54,193 నొక్కి చెప్పడం తప్పేమీ కాదే. 368 00:28:54,193 --> 00:28:55,652 నొక్కి చెప్పడమా? 369 00:28:56,612 --> 00:28:58,822 చూడు, దాని అర్థం ఏంటో కూడా నాకు తెలీదు. 370 00:28:59,781 --> 00:29:02,159 అంటే, ఇది తెల్లవారికి మాత్రమే ఉండే ప్రత్యేక హక్కు అని అంటున్నావా? 371 00:29:02,159 --> 00:29:03,702 తెలీదు. నాకు తెలీదు, లియో. 372 00:29:03,702 --> 00:29:07,998 ఆసుపత్రిలో పాపం నర్సుగా పనిచేసే మహిళ మీద నేను అలా అరవను అని మాత్రం నాకు తెలుసు, 373 00:29:07,998 --> 00:29:10,876 అదికూడా నేను ప్రశాంతంగా ఉందామనే తనని పంపించేశాను. 374 00:29:10,876 --> 00:29:12,836 - అదేనా నొక్కి చెప్పడం అంటే? నాకు తెలీదు మరి. - ఏమన్నావు? 375 00:29:12,836 --> 00:29:14,880 ఏమో. కావచ్చు. నాకు సరిగ్గా తెలీదు. 376 00:29:18,592 --> 00:29:20,886 - రెఫరీ! - మళ్లీ. పక్కకు వచ్చేయ్. అది ఫౌల్. 377 00:29:20,886 --> 00:29:22,095 ఏం జరుగుతోంది? 378 00:29:22,930 --> 00:29:24,389 - ఫౌల్ చేశాడు. - అవునా? 379 00:29:24,389 --> 00:29:26,600 హా. అతడిని పడేశాడు. 380 00:29:28,519 --> 00:29:29,895 జేక్, ఆయన చెప్పింది వినమ్మా. 381 00:29:34,191 --> 00:29:37,194 ఇప్పుడు నిన్ను హెచ్చరికతో వదిలేస్తున్నా, సరేనా? ఇలా ఇంకోసారి జరిగితే, ఆట నుండి పంపించేస్తా. సరేనా? 382 00:29:37,194 --> 00:29:38,362 సరే. ఇక ఆట ఆడండి. 383 00:29:39,738 --> 00:29:41,865 మరేం పర్వాలేదు, జేకీ. నిరాశ పడకు. 384 00:29:42,950 --> 00:29:44,576 సరే, ఒక మాట. 385 00:29:45,536 --> 00:29:47,746 నేను క్షమాపణ కోరుతున్నా, సరేనా? 386 00:29:47,746 --> 00:29:50,999 నేను ఒక నర్సుతో కటువుగా మాట్లాడినందుకు. కానీ అప్పుడు నా మనస్సు మనస్సులా లేదు. 387 00:29:50,999 --> 00:29:54,586 బాగా కలత చెందున్నా అప్పటికి. అప్పుడే నాకు ఫోన్ వచ్చింది. 388 00:29:54,586 --> 00:29:56,338 ఒక నిమిషం పాటు... అసలు వింటున్నావా నువ్వు? 389 00:29:59,967 --> 00:30:01,093 నువ్వు చనిపోయావేమో అనుకున్నా. 390 00:30:08,225 --> 00:30:12,437 కానివ్వు. కానివ్వు. 391 00:30:13,856 --> 00:30:15,023 ఓ విషయం చెప్పనా... 392 00:30:17,442 --> 00:30:20,153 ఒక్కోసారి మనిద్దరి లోకాలూ వేరేమో అనిపిస్తూ ఉంటుంది. 393 00:30:21,822 --> 00:30:23,240 - హలో? - హాయ్, జూన్. 394 00:30:23,240 --> 00:30:26,201 నేను బెక్కాని, మూర్ స్ట్రీట్ ఆవాసం నుండి కాల్ చేస్తున్నా. 395 00:30:26,201 --> 00:30:29,621 - హా. హాయ్. - మీరు క్లైవ్ సిల్కాక్స్ గురించి అడిగారు కదా? 396 00:30:29,621 --> 00:30:31,123 - జే? - విషయం ఏంటంటే, మాకు తెలిసింది... 397 00:30:31,123 --> 00:30:32,249 ఆఫీసు పనికి సంబంధించినది. 398 00:30:32,249 --> 00:30:34,501 సరే. అయితే మేము బస్సులో వెళ్లమా? 399 00:30:34,501 --> 00:30:36,295 చూడండి, ఒకరు ముందుకు వచ్చారు, వాళ్లు... 400 00:30:36,295 --> 00:30:37,504 సర్లే. మాకేం పర్వాలేదు. 401 00:30:55,272 --> 00:30:57,983 హాయ్, మీరు డానా? డాన్ టేలర్? 402 00:30:57,983 --> 00:30:59,651 - అవును. - మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు సారీ. 403 00:30:59,651 --> 00:31:02,112 నా పేరు డిటెక్టివ్ సార్జెంట్ జూన్ లెంకర్. 404 00:31:02,112 --> 00:31:05,199 మీకు పరిచయమున్న క్లైవ్ సిల్కాక్స్ అనే వ్యక్తి ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నా నేను. 405 00:31:05,782 --> 00:31:07,993 మీ ఇద్దరికీ 2018 నుండి పరిచయం ఉందని తెలిసింది. 406 00:31:08,785 --> 00:31:10,746 అతను ఎక్కడ ఉండే అవకాశముందో మీకేమైనా తెలుసా? 407 00:31:11,413 --> 00:31:13,790 పోనీ అతని స్నేహితులెవరైనా తెలుసా? అతను ఎక్కడ ఉండే అవకాశముందో... 408 00:31:15,876 --> 00:31:18,879 - తెలీదు. - తెలీదా? సరే. 409 00:31:19,671 --> 00:31:20,923 నాతో రండి. 410 00:31:23,091 --> 00:31:24,635 సరే. ఇంత సేపూ నాతో మాట్లాడినందుకు థ్యాంక్యూ. 411 00:31:25,302 --> 00:31:26,303 ఎందుకు రాలేరు? 412 00:31:26,303 --> 00:31:27,513 మా అమ్మ. 413 00:31:51,328 --> 00:31:53,789 జీరో యాంకీ డెల్టా. నేను డిటెక్టివ్ సార్జెంట్ జూన్ లెంకర్ ని. 414 00:31:53,789 --> 00:31:56,083 నేను 70 వర్లేన్ రోడ్డులో ఉన్నాను. 415 00:31:56,583 --> 00:31:59,002 ఇక్కడ క్లైవ్ సిల్కాక్స్ ఉన్నట్టున్నాడు. 416 00:31:59,002 --> 00:32:00,879 సందేశం అందింది, ఓవర్. 417 00:32:00,879 --> 00:32:02,589 పోలీసుల బృందం బయలుదేరింది. 418 00:32:02,589 --> 00:32:03,966 ఎంత సేపు పడుతుంది? 419 00:32:04,633 --> 00:32:06,593 జీరో, డెల్టా, బ్రావో. ఆరు నిమిషాల్లో. 420 00:32:07,094 --> 00:32:09,805 ఆరు నిమిషాల్లో వస్తున్నారు. ఎక్కడ ఉన్నారో, అక్కడే ఉండండి. 421 00:32:09,805 --> 00:32:11,557 బృందం వచ్చేదాకా ఆగండి, ఓవర్. 422 00:32:12,391 --> 00:32:13,433 సరే. 423 00:32:37,040 --> 00:32:39,251 ఐ లవ్ యూ 424 00:32:45,007 --> 00:32:46,008 లియో 425 00:32:55,184 --> 00:32:59,104 జీరో డెల్టా యాంకీ. ఇంట్లో ఏదో అలజడి మొదలైంది, ఓవర్. 426 00:32:59,688 --> 00:33:01,940 వేచి ఉండండి. బృందం వస్తోంది. 427 00:33:03,650 --> 00:33:04,651 అబ్బా. 428 00:33:13,410 --> 00:33:15,078 నేను పొలీసుని! తలుపు తెరవండి. 429 00:33:16,205 --> 00:33:17,206 పొలీస్! 430 00:33:17,915 --> 00:33:20,667 జీరో డెల్టా యాంకీ. ఇంట్లో దాడి జరుగుతోంది. 431 00:33:20,667 --> 00:33:22,711 - ఏం జరుగుతోంది? - మీ గార్డెన్ లోకి నేను వెళ్లవచ్చా? 432 00:33:22,711 --> 00:33:24,671 - తప్పకుండా. - బృందం వచ్చేదాకా ఆగండి. 433 00:33:25,672 --> 00:33:27,007 బృందాలన్నీ వినండి. 434 00:33:34,515 --> 00:33:37,809 జీరో డెల్టా యాంకీ. అత్యవసరంగా అగ్నిమాపక సిబ్బంది కావాలి. 435 00:33:39,353 --> 00:33:41,230 జీరో డెల్టా యాంకీ, దయచేసి మళ్లీ చెప్పండి. 436 00:33:44,942 --> 00:33:46,985 జీరో డెల్టా యాంకీ, దయచేసి మళ్లీ చెప్పండి. 437 00:33:50,531 --> 00:33:52,783 జీరో డెల్టా యాంకీ, దయచేసి మళ్లీ చెప్పండి. 438 00:33:52,783 --> 00:33:54,493 ఇంటికి మంట అంటుకుంది అని చెప్తున్నా! 439 00:33:55,118 --> 00:33:57,371 అత్యవసరంగా అగ్నిమాపక సిబ్బంది కావాలి. 440 00:34:02,918 --> 00:34:04,044 హలో? 441 00:34:04,586 --> 00:34:05,587 డాన్? 442 00:34:12,719 --> 00:34:13,719 హలో? 443 00:34:19,726 --> 00:34:24,106 - లోపల ఎవరైనా ఉన్నారా? - కాపాడండి! కాపాడండి! మేము ఉన్నాం. 444 00:34:25,065 --> 00:34:26,440 తలుపుకు దూరంగా జరగండి! 445 00:34:31,321 --> 00:34:33,447 బయటకు రండి! కిందికి వెళ్లండి! 446 00:34:33,949 --> 00:34:34,949 పదండి! 447 00:35:51,068 --> 00:35:52,069 జూన్. 448 00:35:53,195 --> 00:35:54,029 జూన్. 449 00:35:54,029 --> 00:35:55,113 హా? 450 00:35:57,074 --> 00:35:58,367 ఇది నేను నీకు ఇవ్వలేదు. 451 00:36:00,410 --> 00:36:01,453 ప్రమాణం చేయ్. 452 00:36:02,412 --> 00:36:03,830 ప్యాథాలజీ రిపోర్ట్ సంపాదించేశావా? 453 00:36:04,331 --> 00:36:05,457 ప్రమాణం చేసి చెప్పు. 454 00:36:05,457 --> 00:36:06,542 ప్రమాణం చేసి చెప్తున్నా. 455 00:36:06,542 --> 00:36:08,210 పని అయిన మరుక్షణం తొలగించేయ్. 456 00:36:08,836 --> 00:36:09,837 అలాగే. 457 00:36:14,925 --> 00:36:16,844 ప్యాథాలజీ రిపోర్ట్ మరియా డి సౌజా 458 00:36:16,844 --> 00:36:19,221 ఇది గోప్యమైన రిపోర్ట్ 459 00:36:35,654 --> 00:36:36,488 సిద్ధమా? 460 00:36:37,489 --> 00:36:38,490 హా. 461 00:36:41,326 --> 00:36:43,620 నేను కూడా సమావేశంలో ఉంటానని అతనికి తెలుసు కదా? 462 00:36:43,620 --> 00:36:46,039 తెలుసు. నిజం చెప్పాలంటే, నువ్వు కూడా ఉండాలని సూచించింది అతనే. 463 00:36:51,044 --> 00:36:54,089 మీ ఇద్దరూ సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్యూ... 464 00:36:54,089 --> 00:36:56,800 - ఆ మాత్రం చేయలేమా. - మీకు తాజా వార్త చెప్పాలి. 465 00:36:57,843 --> 00:36:59,595 హత్య చేసినట్టు క్లైవ్ సిల్కాక్స్ ఒప్పుకున్నాడు. 466 00:36:59,595 --> 00:37:01,013 సూపర్. 467 00:37:01,013 --> 00:37:02,806 పెద్ద కష్టపడకుండానే ఒప్పేసుకున్నాడు. 468 00:37:03,432 --> 00:37:06,643 మరియా డి సౌజా హత్యకి. పోలీసుల కన్నుగప్పి తిరిగినందుకు. 469 00:37:06,643 --> 00:37:09,146 అతను పెట్టుకుంది మామూలు పోలీసుతోనా మరి! 470 00:37:09,146 --> 00:37:10,314 అవును. 471 00:37:12,024 --> 00:37:13,859 "తనని ఎందుకు చంపావు?" అని అడిగాం. తను ఏం చెప్పాడో తెలుసా? 472 00:37:14,818 --> 00:37:16,236 రగ్గు మీద పెయింట్ పడేసిందట. 473 00:37:16,236 --> 00:37:17,613 - బాబోయ్. - రగ్గుపై పెయింట్ పడేసిందని. 474 00:37:18,113 --> 00:37:20,115 అయ్యబాబోయ్, మరీ దారుణం. 475 00:37:20,115 --> 00:37:23,118 సిపిఎస్ సరేనంది, కాబట్టి మేము మూడు గంటల క్రితమే అతనిపై ఛార్జి దాఖలు చేశాం. 476 00:37:23,118 --> 00:37:24,453 కాబట్టి, మనం హాయిగా ముందుకు సాగిపోవచ్చు. 477 00:37:25,037 --> 00:37:26,997 సిల్కాక్స్ తో మాట్లాడటానికి మీ అనుమతి కావాలి. 478 00:37:27,581 --> 00:37:29,666 - ఎందుకు? - అడిలైడ్ బరోస్ హత్య గురించి. 479 00:37:31,877 --> 00:37:34,922 అది పాత కేసు. అది రెండు... రెండు వేల... 480 00:37:35,506 --> 00:37:36,340 2011. 481 00:37:36,340 --> 00:37:40,010 హా, 2011. పదకొండు అంటే అది బేసి సంఖ్య. 482 00:37:40,594 --> 00:37:43,263 లవర్, ఎర్రొల్ మ్యాథిస్ శిక్ష... 483 00:37:43,263 --> 00:37:45,557 - ఇరవై నాలుగేళ్లు. - హా, నేను అతనితో ఓసారి మాట్లాడాలనుకుంటున్నానంతే. 484 00:37:46,558 --> 00:37:49,186 సరే. ఇప్పుడు మనం అన్ని విషయాలను స్పష్టపరుచుకోవాలనుకుంటా. 485 00:37:49,186 --> 00:37:50,437 దీని గురించి ఏదోకటి తేలుద్దాం. 486 00:37:50,979 --> 00:37:52,898 సరే, డిటెక్టివ్ లెం... జూన్ అని పిలిస్తే నీకేం అభ్యంతరం లేదు కదా? 487 00:37:53,941 --> 00:37:55,817 - పర్వాలేదు. - సరే, జూన్. 488 00:37:55,817 --> 00:38:00,781 ఆ ఫ్లాట్ లో ఉన్న క్లైవ్ సిల్కాక్స్ కి, అడిలైడ్ బరోస్ కి సంబంధం ఉందని చెప్పడానికి 489 00:38:00,781 --> 00:38:01,865 నీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? 490 00:38:01,865 --> 00:38:04,201 ఆ సమయంలో అతను అక్కడే ఉండేవాడు. 491 00:38:04,201 --> 00:38:05,619 24బీ లేక్ స్ట్రీట్. 492 00:38:06,912 --> 00:38:07,913 అవును. 493 00:38:08,455 --> 00:38:11,500 - అది టవర్స్ కి 500 మీటర్ల దూరంలోనే ఉంది. - ఆ ప్రాంతం చాలా పెద్దది. 494 00:38:12,209 --> 00:38:15,212 మహిళలపై హింసకు పాల్పడినట్టుగా సిల్కాక్స్ పై ఆరోపణలు ఉన్నాయి. 495 00:38:15,712 --> 00:38:17,548 ఒకసారి 2009లో, ఆ తర్వాత... 496 00:38:17,548 --> 00:38:19,258 మే 2011 లో. హా. ఇంకా? 497 00:38:19,258 --> 00:38:22,302 సిల్కాక్స్, మ్యాథిస్ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. 498 00:38:22,845 --> 00:38:24,680 సెయింట్ జోసెఫ్స్ స్కూల్ కి. అందులో 2,000 మంది విద్యార్థులున్నారు. 499 00:38:25,389 --> 00:38:26,723 అదీగాక, రెండేళ్ల తేడా ఉంది ఇద్దరికీ. 500 00:38:26,723 --> 00:38:30,352 సిల్కాక్స్ కి లియన్ అనే చెల్లి ఉంది, ఆమె ఎర్రొల్ కజిన్ కి సన్నిహితంగా ఉండేది. 501 00:38:30,352 --> 00:38:33,397 కజిన్? కజిన్స్ లేనిది ఎవరికి. కొందరికి ఎక్కువ మంది ఉంటారు, కొందరికి తక్కువ మంది ఉంటారు. 502 00:38:33,397 --> 00:38:34,648 మీరు అసలు అతడిని విచారణ చేశారా? 503 00:38:36,066 --> 00:38:38,652 - జూన్... - మీ విచారణలో అతడిని భాగం చేయకుండా ఉండటానికా? 504 00:38:38,652 --> 00:38:43,782 ఒక విషయం చెప్పు, "అసంకల్పిత పక్షపాతం" అనే మాటని ఎప్పుడైనా విన్నావా? 505 00:38:46,034 --> 00:38:48,871 మేము ఒక వ్యూహం ప్రకారం నడుచుకున్నాం, నేను దాన్ని విజయవంతంగా పూర్తి చేశా. 506 00:38:49,788 --> 00:38:51,415 అంతా చాలా చాలా వివరంగా ఉంది. 507 00:38:52,416 --> 00:38:54,835 అసంకల్పిత పక్షపాతం విషయానికి వస్తే... 508 00:38:54,835 --> 00:38:56,837 అసంకల్పిత పక్షపాతం అంటే ఏంటో నాకు తెలుసు. 509 00:38:56,837 --> 00:38:59,131 ఈ విషయాన్ని కాస్త తెలివి తక్కువవారికి చెప్తున్నాను అనుకో. తప్పుగా అనుకోకు, రాయ్. 510 00:39:00,382 --> 00:39:03,969 ఒక్కోసారి పోలీసు ఆఫీసరు, కేసు గురించి తనదైన దృక్పథాన్ని ముందే ఏర్పరిచేసుకుంటారు. 511 00:39:04,678 --> 00:39:09,224 తప్పుగా అనుకోవద్దు, వాళ్లకున్న మూసధోరణుల వల్ల అనుకో. 512 00:39:09,224 --> 00:39:11,852 మూసధోరణి అట. మూసధోరణా? 513 00:39:12,477 --> 00:39:15,606 సరే మరి. ఏకాభిప్రాయానికి వచ్చే ప్రయత్నం చేద్దాం. మత విశ్వాసం? 514 00:39:17,274 --> 00:39:19,276 అభిప్రాయం? ఏమంటావు? 515 00:39:20,694 --> 00:39:25,824 ఈ జూన్ కి, ఎర్రొల్ మ్యాథిస్ పై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడిపోయింది, 516 00:39:25,824 --> 00:39:30,162 అతను పశ్చిమ ఆఫ్రికాకి చెందినవాడు కదా? 517 00:39:31,413 --> 00:39:36,084 ఏవో తెలియని కారణాల వల్ల అతనిపై అందరూ అమానుషంగా ప్రవర్తించారని. 518 00:39:36,084 --> 00:39:37,669 కానీ ఒకరు అత్యవసర కాల్ చేసి విషయం చెప్పారు కదా. 519 00:39:37,669 --> 00:39:40,255 మళ్లీ అదే అభిప్రాయంతో పని చేశావు. రెండు ఫోన్ కాల్స్. ఇద్దరు మహిళలు. 520 00:39:41,673 --> 00:39:43,759 రెండు ఫోన్ కాల్స్. ఒకే మహిళ. 521 00:39:44,676 --> 00:39:47,221 మనం... మనం దాన్ని తోసిపుచ్చలేం. 522 00:39:47,221 --> 00:39:50,474 కేవలం పోయిన ఏడాదే, ఈ నగరంలో ఎంత మంది మహిళలపై గృహ హింస జరిగిందో 523 00:39:50,474 --> 00:39:53,352 నీకు తెలుసా? నీకు తెలీకుండా ఎలా ఉంటుందిలే. 524 00:39:53,352 --> 00:39:55,896 - సుమారుగా రెండున్నర లక్షల మంది. - హా. వావ్. రెండున్నర లక్షల మంది. 525 00:39:55,896 --> 00:39:57,564 కానీ ఇక్కడ ఇద్దరూ పోర్చుగీసు వాళ్లే. 526 00:39:57,564 --> 00:39:59,274 పోర్చుగీసు వాళ్లంటే చాలా మంది ఉంటారు. 527 00:39:59,274 --> 00:40:01,318 ప్రస్తుతం, ఆ ప్రాంతంలో వాళ్లు ఎనభై, తొంభై వేల మంది ఉంటారు. 528 00:40:01,318 --> 00:40:03,737 అందుకే మనం ఫోరెన్సిక్ పరీక్ష జరపాలి... 529 00:40:03,737 --> 00:40:05,113 అబ్బా. 530 00:40:05,113 --> 00:40:08,283 ...రెండు కాల్స్ లోనూ మాట్లాడింది ఒకే మహిళనా, కాదా అని అప్పుడే మనకి తెలుస్తుంది. 531 00:40:08,283 --> 00:40:09,201 సరే. 532 00:40:11,870 --> 00:40:13,997 మరి ఈ మరియా సంగతేంటి? 533 00:40:15,123 --> 00:40:18,377 ఎవరు? ఈమె హతురాలు. ల్యాబ్ కి అయ్యే ఖర్చులు కూడా ఎక్కువే కదా. 534 00:40:18,377 --> 00:40:20,337 ఇప్పటికే మనం మన బడ్జెట్ ని మించిపోయాం, ఆ మించిపోవడం కూడా వేలల్లో. 535 00:40:20,337 --> 00:40:24,091 తనని హత్య చేశానని అదుపులో ఉన్న ఒకడు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 536 00:40:26,009 --> 00:40:30,806 ఇలా మనం ఆమె తల్లికి, అన్నకి, ఇంకా తన ఇద్దరు అనాథ పిల్లలకు విచారణ ద్వారా ఎదురయ్యే బాధను దూరం చేయవచ్చు. 537 00:40:30,806 --> 00:40:34,601 తన దేహం శావో పాలోలోని తన ఇంటికి ప్రయాణమైపోయింది కూడా. ఇది మంచి విషయమే. 538 00:40:35,727 --> 00:40:38,438 నీ మొండితనం వీటన్నింటికీ అడ్డుపడుతుంది. 539 00:40:38,438 --> 00:40:43,110 మరియాకి రెండు కత్తిపోట్లు పడ్డాయి. 540 00:40:43,986 --> 00:40:45,946 భుజంపై. పొత్తికడుపులో. 541 00:40:47,906 --> 00:40:51,743 హయీస్ లేన్ నుండి కాల్ చేసిన వ్యక్తి కూడా, తన లవర్ తనని కత్తితో పొడిచాడని చెప్పింది. 542 00:40:51,743 --> 00:40:54,997 ఇంకా అడిలైడ్ ప్రస్తావన తెస్తూ, "నన్ను పొడిచిన కత్తితోనే 543 00:40:54,997 --> 00:40:57,624 ఆమెని కూడా చాలాసార్లు పొడిచాడు," అని తను చెప్పింది. 544 00:40:57,624 --> 00:40:59,418 మన్నించాలి, నీకు ఈ సమాచారం ఎలా తెలిసింది? 545 00:41:00,502 --> 00:41:02,921 - ఇవి కాల్ లో తను అన్న మాటలే. - నేను కాల్ గురించి మాట్లాడటం లేదు. 546 00:41:03,797 --> 00:41:06,508 నేను మిస్ డి సౌజా గాయాల గురించి మాట్లాడుతున్నాను. 547 00:41:10,470 --> 00:41:12,347 ఒక విషయం చెప్పు, జూన్, నువ్వు ప్యాథాలజీ రిపోర్ట్ చూశావా? 548 00:41:13,473 --> 00:41:15,726 ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే... 549 00:41:15,726 --> 00:41:17,269 కాదు, మళ్లీ దాని గురించే మాట్లాడుతున్నందుకు సారీ, 550 00:41:17,269 --> 00:41:20,439 ఆ ప్యాథాలజీ రిపోర్ట్ చాలా గోప్యమైనది, దాన్ని వివ్ కి, తన బృందానికి మాత్రమే పంపడం జరిగింది, కదా? 551 00:41:21,023 --> 00:41:24,109 హా? అలాంటప్పుడు... వివ్, నువ్వేమైనా డిటెక్టివ్ సార్జెంట్ లెంకర్ కి పంపావా? 552 00:41:24,109 --> 00:41:25,277 - లేదు, సర్. - లేదట. 553 00:41:25,277 --> 00:41:28,697 మరి, అది మీ దగ్గరికి ఎలా వచ్చింది? 554 00:41:28,697 --> 00:41:29,865 మా దగ్గరికి అది రాలేదు. 555 00:41:31,074 --> 00:41:32,492 నీకు ఎవరైనా పంపారా? 556 00:41:32,492 --> 00:41:33,744 లేదు. 557 00:41:33,744 --> 00:41:36,622 మరెలా? అయితే నువ్వు దాన్ని హ్యాక్ చేసి సంపాదించావా? అంత గొప్ప హ్యాకర్ వా నువ్వు? 558 00:41:40,083 --> 00:41:42,836 ప్యాథాలజీ రిపోర్టును నువ్వు చదవలేదు అంటున్నావా? 559 00:41:43,754 --> 00:41:44,796 అవును, సర్. 560 00:41:45,380 --> 00:41:46,840 మరి నీకు ఈ సమాచారం ఎక్కడిది? 561 00:41:48,383 --> 00:41:49,468 నేనే స్వయంగా చూశా. 562 00:41:52,513 --> 00:41:53,639 నువ్వు చూశావా? 563 00:41:57,559 --> 00:41:58,894 నేనే కదా అక్కడికి మొదట వెళ్లింది. 564 00:42:01,605 --> 00:42:05,400 మరియా దగ్గరికి వెళ్లాక, సహజంగానే తన వైటల్స్ కోసం చెక్ చేశాను. 565 00:42:06,235 --> 00:42:07,277 అప్పుడు వాటిని చూశాను. 566 00:42:08,820 --> 00:42:10,155 తన గాయాలని చూశాను. 567 00:42:12,449 --> 00:42:15,327 అప్పటికే తగ్గిన గాయాలను, అది కూడా రెప్పపాటులోనే. 568 00:42:19,081 --> 00:42:21,625 ఇద్దరు కాలర్లు. ఇద్దరూ కత్తి పోట్లకు కూడా గురయ్యారు. 569 00:42:23,502 --> 00:42:24,962 ఇప్పుడైనా మీకు లింక్ ఏమైనా కనిపిస్తోందా? 570 00:42:31,593 --> 00:42:32,594 ఇదుగో. 571 00:42:33,136 --> 00:42:34,930 తోపులాట లేకుండా ఆడాలి. అంతా టైమింగ్ లోనే ఉంది. 572 00:42:34,930 --> 00:42:36,807 కాస్త... చూశావా? 573 00:42:36,807 --> 00:42:37,891 సరే. 574 00:42:38,517 --> 00:42:40,102 మళ్లీ ఆడదాం. సూపర్. 575 00:42:43,105 --> 00:42:44,898 అంతే! సూపర్. 576 00:42:45,899 --> 00:42:47,192 - మళ్లీ ప్రయత్నించు. - సరే. 577 00:42:47,192 --> 00:42:49,611 కానివ్వు, నన్ను అడ్డుకో, అడ్డుకో. హా, అంతే. 578 00:42:49,611 --> 00:42:51,530 ఏంటిది? ఏంటిది? అదనపు శిక్షణా? 579 00:42:51,530 --> 00:42:53,156 సరే. కానిద్దాం. ఆగాగు. అంతే. 580 00:42:53,156 --> 00:42:55,075 ఆగండి. సరే మరి, ఆగండి. 581 00:42:56,785 --> 00:42:58,078 గోల్ సూపర్ గా వేశా! 582 00:42:59,496 --> 00:43:00,914 నన్ను చూసి ఎలా ఆడాలో నేర్చుకోండి. 583 00:43:00,914 --> 00:43:03,876 - నన్ను చూసి ఎలా ఆడాలో నేర్చుకోండి. - అమ్మ, అమ, అమ్మ. బాల్ ని చేతితో పట్టుకోకూడదు. 584 00:43:03,876 --> 00:43:05,127 అనవసరంగా పరువు పోగొట్టించుకుంటున్నావు. 585 00:43:07,171 --> 00:43:08,172 మళ్లీ ఆడదాం. 586 00:43:09,882 --> 00:43:11,008 హలో? 587 00:43:11,008 --> 00:43:12,509 నీ కోరిక నెరవేరింది. 588 00:43:15,721 --> 00:43:19,725 "పరిస్థితులు అసాధారణమైనవి కాబట్టి," అని రాశారు. 589 00:43:21,810 --> 00:43:22,811 ఖైదీ బయటకు వస్తున్నాడు. 590 00:43:22,811 --> 00:43:24,771 అనుమానితుడిని నువ్వు ఇంటర్వ్యూ చేయవచ్చు. 591 00:43:26,148 --> 00:43:27,149 థ్యాంక్యూ. 592 00:43:27,649 --> 00:43:30,986 హా, కానీ ఇంటర్వ్యూ ప్లాన్ ని ముందుగానే వాళ్లు జాగ్రత్తగా పరిశీలిస్తారు. 593 00:43:30,986 --> 00:43:32,237 సరే. 594 00:43:33,780 --> 00:43:35,991 అడిలైడ్ బరోస్ హత్య ప్రస్తావన 595 00:43:35,991 --> 00:43:37,826 అస్సలు తీసుకురాకూడదు. అర్థమైందా? 596 00:43:38,410 --> 00:43:39,411 సరే. 597 00:43:40,579 --> 00:43:42,372 అదొక్కటి గుర్తు పెట్టుకొని ఇంటర్వ్యూ చేయ్. 598 00:43:42,873 --> 00:43:43,957 థ్యాంక్యూ, సర్. 599 00:44:05,562 --> 00:44:08,941 క్లైవ్ సిల్కాక్స్. మరియా డి సౌజాని హత్య చేసినట్టు మీరు ఒప్పుకున్నారు. 600 00:44:10,067 --> 00:44:13,237 కానీ, ఇప్పుడు వేరే విషయంలో కూడా సహకరించమని కోరుతున్నాను. 601 00:44:14,738 --> 00:44:19,493 మార్చి 2011లో, మీరు 24బీ లేక్ స్ట్రీట్ లో ఉండేవారు. అది నిజమేనా? 602 00:44:20,744 --> 00:44:21,745 అవును. 603 00:44:23,330 --> 00:44:24,790 ఇతడిని గుర్తుపట్టారా? 604 00:44:30,128 --> 00:44:31,255 ఇతనెవరో మీకు తెలుసా? 605 00:44:36,468 --> 00:44:37,469 ఎర్రొల్. 606 00:44:37,469 --> 00:44:42,182 ఎర్రొల్ మ్యాథిస్. మీరిద్దరూ ఒకే పాఠశాలలో చదివారా? 607 00:44:43,141 --> 00:44:44,142 అవును. 608 00:44:44,977 --> 00:44:46,436 అతని కుటుంబం మీకు తెలుసా? 609 00:44:46,436 --> 00:44:47,521 రా. 610 00:44:48,647 --> 00:44:50,065 ఎర్రొల్ మ్యాథిస్ చాలా ఏళ్ల 611 00:44:50,065 --> 00:44:52,651 - జైలు శిక్ష అనుభవిస్తున్నాడని మీకు తెలుసా? - థ్యాంక్స్. 612 00:44:53,569 --> 00:44:55,237 ఇరవై నాలుగేళ్ళు, కదా? 613 00:44:55,237 --> 00:44:57,406 అవును. ఎక్కడో తెలుసా? 614 00:44:58,448 --> 00:45:01,618 - వైట్ క్రాస్? - వైట్ క్రాస్ జైలు, మీరు సరిగ్గానే చెప్పారు. 615 00:45:01,618 --> 00:45:03,287 - అయితే? - డిటెక్టివ్ సార్జెంట్ లెంకర్. 616 00:45:04,955 --> 00:45:06,039 ఎందుకో తెలుసా? 617 00:45:07,124 --> 00:45:08,125 తెలుసు. 618 00:45:08,125 --> 00:45:10,002 - సారీ... - అది అందరికీ తెలిసిందే. 619 00:45:10,002 --> 00:45:11,837 మీరు కావాలని నా క్లయింట్ ని ఉచ్చులో పడేయాలని... 620 00:45:11,837 --> 00:45:15,799 లేదు. లేదు. అతని చేతే చెప్పిద్దామని చూస్తున్నా. 621 00:45:20,470 --> 00:45:21,722 ఆమె పేరేంటి? 622 00:45:21,722 --> 00:45:23,724 - అబ్బా. - చెప్పండి. తన పేరు చెప్పండి. 623 00:45:23,724 --> 00:45:25,976 ఈ ఇంటర్వ్యూను నేను ఇంతటితో ముగించేస్తున్నాను. 624 00:45:25,976 --> 00:45:28,228 ఇప్పుడు సమయం, 14:36. 625 00:45:31,523 --> 00:45:33,275 అసలు తన ఉద్దేశం ఏంటి? 626 00:45:38,030 --> 00:45:40,199 - అతనికి వాళ్లు తెలుసు. వాళ్లిద్దరూ తెలుసు. - జూన్. 627 00:45:42,034 --> 00:45:44,119 - డాన్, నువ్వేమైనా... - లేదు, లేదు. నువ్వే కానివ్వు. 628 00:45:47,706 --> 00:45:51,793 నువ్వు కోరావు కాబట్టి, డిటెక్టివ్ చీఫ్ ఇన్స్ పెక్టర్, హెగర్టీ స్వయంగా చొరవ తీసుకొని, 629 00:45:52,586 --> 00:45:55,589 ఆ రెండు అత్యవసర కాల్స్ పై సంపూర్ణ ఫొరెన్సిక్ పరీక్షలు జరిపించారు. 630 00:45:57,758 --> 00:45:58,800 అందులో తేలింది. 631 00:46:01,220 --> 00:46:03,889 ఉచ్చారణల విషయంలో నిపుణుడు, అలాగే ఇంజినీర్ కూడా ఒకే విషయం చెప్పారు. 632 00:46:03,889 --> 00:46:07,059 మాట్లాడే శైలులు వేరు. ఉచ్చారణలు కూడా వేరు. 633 00:46:08,143 --> 00:46:09,144 ఇద్దరూ వేర్వేరు మహిళలు. 634 00:46:09,728 --> 00:46:11,563 - ఏంటి? - అందులో సందేహమే లేదు. 635 00:46:12,147 --> 00:46:14,316 హయీస్ లేన్ నుండి కాల్ చేసింది, మరియా డి సౌజా కాదు. 636 00:46:16,610 --> 00:46:22,074 ఎప్పుడో జరిగిన ఈ హత్యకి, క్లైవ్ సిల్కాక్స్ కి సంబంధం ఉందని సూచించే ఆధారం ఏదీ లేదు. 637 00:46:22,074 --> 00:46:23,158 సరేనా? 638 00:46:24,618 --> 00:46:25,619 ఒప్పుకుంటున్నావా? 639 00:46:26,662 --> 00:46:28,664 ఈ విషయాన్ని ఇంతటితో శాశ్వతంగా ముగింపు పలుకుదాం. 640 00:46:34,086 --> 00:46:35,087 సరేనా? 641 00:46:46,849 --> 00:46:49,434 అసలు నీ సమస్య ఏంటి? ఒకసారి క్లోయిని చూడు. 642 00:46:50,018 --> 00:46:51,687 తను సమస్యల జోలికి వెళ్లకుండా హాయిగా ఉంటుంది. 643 00:46:51,687 --> 00:46:52,896 పని చేసుకుంటూ లాగించేస్తుంది. 644 00:46:54,648 --> 00:46:57,734 ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ విషయం ఎందాకా వచ్చింది? వాళ్లకి రిప్లయి ఇచ్చావా? లేదా? 645 00:46:58,944 --> 00:46:59,945 ముందు ఆ పని చూడు. 646 00:47:00,529 --> 00:47:01,989 ప్రవర్తన సరిగ్గా లేదంటూ నిన్ను ఇబ్బంది పెట్టేస్తారు. 647 00:47:38,317 --> 00:47:39,318 జూన్. 648 00:47:53,582 --> 00:47:55,417 అతనే గెలిచాడు. నేను ఓడిపోయాను. 649 00:47:57,544 --> 00:47:59,755 అబ్బా. నాకు అది అస్సలు నచ్చట్లేదు. 650 00:48:02,549 --> 00:48:03,550 చూడు... 651 00:48:05,135 --> 00:48:07,346 ఒక పుకారు షికారు చేస్తోంది. 652 00:48:08,805 --> 00:48:12,017 సిల్కాక్స్, మరియా డి సౌజాని హత్య చేసిన తర్వాతి రోజు... 653 00:48:14,561 --> 00:48:17,940 హెగర్టీ, ఆ రెండు కాల్స్ లోని గొంతులను చెక్ చేయాల్సిందిగా రాత్రికి రాత్రే ఫొరెన్సిక్ పరీక్ష చేయించాడు. 654 00:48:19,691 --> 00:48:20,776 ఏంటి? 655 00:48:22,819 --> 00:48:24,655 కాల్ చేసింది ఒకటే మహిళ కాదని అతనికి ముందే తెలుసు, కానీ అతను... 656 00:48:24,655 --> 00:48:25,781 రిపోర్ట్ లో ఏముందో ఎవరికీ చెప్పలేదు. 657 00:48:27,741 --> 00:48:28,742 ఒక్క నిమిషం. 658 00:48:29,868 --> 00:48:31,161 మరి ఆ సమావేశం. 659 00:48:32,329 --> 00:48:33,914 ఇంటర్వ్యూకి ఒప్పుకోవడం. 660 00:48:34,998 --> 00:48:37,292 అతను ఎందుకలా చేశాడు? 661 00:48:46,134 --> 00:48:47,845 తొక్కే అవకాశం వచ్చింది కదా, తొక్కేశాడు. 662 00:48:51,431 --> 00:48:52,516 అతను నన్ను ఆడుకున్నాడు. 663 00:48:57,938 --> 00:49:00,065 ఉచ్చు పన్నాడు, నేను చక్కగా ఇరుకున్నాను. 664 00:49:07,239 --> 00:49:11,493 నన్ను గట్టిగా కాలితో తొక్కేస్తే, నేను మళ్లీ పైకి లేవలేనని అతను అనుకున్నాడు. 665 00:49:16,665 --> 00:49:17,499 లేదు. 666 00:49:21,962 --> 00:49:22,963 లేదు. 667 00:49:26,925 --> 00:49:27,926 అలా జరగనివ్వను. 668 00:49:30,220 --> 00:49:34,975 అతనికి చాలా కాలం క్రితం ఒక లవర్ ఉండేది. 669 00:49:36,185 --> 00:49:39,062 "తను పిచ్చిది. నా మాటలని పట్టించుకునేది కాదు" అని అనేవాడు. 670 00:49:39,605 --> 00:49:41,857 అతడిని ఎప్పుడూ సంతోషంగా ఉంచలేదు. 671 00:49:44,693 --> 00:49:49,239 నన్ను పొడిచిన కత్తితోనే, ఆమెని కూడా చాలాసార్లు పొడిచాడు. 672 00:49:50,157 --> 00:49:56,038 ఆమెని చంపిన నేరం కింద ఒకరికి 24 ఏళ్ల శిక్ష పడింది, ఇప్పుడు అతను జైల్లోనే ఉన్నాడు. 673 00:49:58,832 --> 00:50:04,213 ఇంకా వైట్ క్రాస్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఈ వ్యక్తి... 674 00:50:04,796 --> 00:50:06,882 పనికిమాలినవాడట, ఇంకా... 675 00:50:07,841 --> 00:50:08,926 ఇది ఎప్పటి కాల్? 676 00:50:09,551 --> 00:50:10,594 పోయిన మంగళవారం వచ్చిన కాల్. 677 00:50:12,846 --> 00:50:14,932 చూడు, ఈ కాల్స్ చాలా గోప్యమైనవి. 678 00:50:17,351 --> 00:50:21,813 దీని గురించి నువ్వు ఎవరికైనా చెప్తే, నన్ను పాతాళంలోకి తొక్కేస్తారు. 679 00:50:30,906 --> 00:50:31,740 ఇదుగో. 680 00:50:33,867 --> 00:50:35,285 నువ్వు ముస్లిమ్ అనుకున్నా. 681 00:50:35,285 --> 00:50:38,664 నేను సిక్కును తల్లి. సింగ్? సోనియా సింగ్? 682 00:50:39,414 --> 00:50:40,958 దీన్ని నీళ్లు తాగినట్టు తాగుతాం మేము. 683 00:50:48,590 --> 00:50:50,676 సరే. నువ్వు పప్పులో కాలేశావు. 684 00:50:51,760 --> 00:50:53,720 నువ్వు యుద్ధంలో ఓడిపోయావు, అయితే ఏంటి! 685 00:50:53,720 --> 00:50:55,180 ఓ విషయం చెప్పనా? 686 00:50:56,223 --> 00:50:57,516 తను బతికే ఉంది. 687 00:51:08,986 --> 00:51:13,490 ఎర్రొల్ ని తను మాత్రమే కాపాడగలదు, తను బతికే ఉంది కూడా. 688 00:51:16,034 --> 00:51:17,035 అవును. 689 00:51:19,621 --> 00:51:20,831 మనం తన ఆచూకీ తప్పక కనిపెడతాం. 690 00:52:31,860 --> 00:52:33,862 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్