1 00:00:06,000 --> 00:00:06,840 ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది, మరియు కల్పిత రూపం. 2 00:00:06,920 --> 00:00:07,760 పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి రచయిత ఊహ లేదా కల్పించబడినవి. 3 00:00:07,840 --> 00:00:08,680 ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు. 4 00:00:08,760 --> 00:00:09,600 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజం చేసే పోరాటాన్ని, 5 00:00:09,680 --> 00:00:10,520 వారు ఎదుర్కునే సమస్యను, సదుద్దేశ్యంతో చూపుతుంది. 6 00:00:10,600 --> 00:00:11,440 ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే, అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు. 7 00:00:11,520 --> 00:00:12,360 కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు, మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని, 8 00:00:12,440 --> 00:00:13,280 లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు. 9 00:00:13,360 --> 00:00:14,520 ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు. 10 00:00:14,600 --> 00:00:15,880 చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది. 11 00:00:17,640 --> 00:00:19,920 సరే, పిల్లలూ. నిద్రపోయే సమయం. లైట్లు తీసేయండి. 12 00:00:29,040 --> 00:00:30,960 వాడు ఆ పని చేయడానికి కారణమేంటో? 13 00:00:31,680 --> 00:00:35,680 తను పెద్ద నటుడు. జీవితంలో మనకూ సమస్యలు ఉన్నాయి. 14 00:00:35,760 --> 00:00:38,320 ఈ స్కూల్‌లో ఏం జరుగుతోందో దేవుడికే తెలియాలి. 15 00:00:38,400 --> 00:00:42,600 ...సుయాశ్ వర్మ నీలగిరి వ్యాలీ స్కూల్ పునఃకలయికకు వెళ్లారు. 16 00:00:42,680 --> 00:00:45,400 ఈ పిల్లాడితోనే ఇదంతా మొదలైందని అనిపిస్తుంది. 17 00:00:46,000 --> 00:00:49,600 ఆ కుక్కపిల్లలను వేదాంత్ చంపాడంటావా? 18 00:00:50,640 --> 00:00:51,480 నాకు తెలియదు. 19 00:00:52,640 --> 00:00:56,280 నేను చేరుకునేసరికే ఆ కుక్కపిల్లలు చనిపోయాయి. 20 00:00:57,600 --> 00:00:59,680 అతను వాటిని చూస్తున్న విధానం, 21 00:01:00,640 --> 00:01:04,640 అవి చావడాన్ని చూడడం అతనికి ఆనందం ఇచ్చిందని అనిపించింది. 22 00:01:06,640 --> 00:01:09,000 కానీ కాసేపటికే అతను నన్ను చూసి భయపడ్డాడు. 23 00:01:11,160 --> 00:01:15,200 అందుకే ఒకరు కాదు, ఇద్దరు వేదాంత్‌లు ఉన్నారనిపించింది. 24 00:01:16,560 --> 00:01:18,040 ఒకడు భయపడుతూ ఉంటాడు. 25 00:01:18,880 --> 00:01:22,760 మరొకడు, కుక్కపిల్లలను చంపగలిగేవాడు. 26 00:01:27,520 --> 00:01:28,760 వేదాంత్. 27 00:01:30,720 --> 00:01:36,720 కుక్కపిల్లలను చంపిన రాత్రి 28 00:02:54,680 --> 00:02:56,280 నా నుంచి నీకు ఏం కావాలి? 29 00:03:00,240 --> 00:03:01,800 నిన్ను ఇక ఎవరూ వేధించరు. 30 00:03:01,880 --> 00:03:04,000 -నన్ను వదిలేస్తే, సాయం చేస్తాను. -వదిలెయ్. 31 00:03:04,080 --> 00:03:05,960 నిన్ను ఇక ఎవరూ వేధించరు. 32 00:03:08,320 --> 00:03:10,360 నన్ను వదిలేస్తే, సాయం చేస్తాను. 33 00:03:10,720 --> 00:03:12,720 నిన్ను ఇక ఎవరూ వేధించరు. 34 00:04:46,160 --> 00:04:48,200 కుక్కపిల్లలు చావాల్సిందే 35 00:04:48,240 --> 00:04:50,920 ఎందుకంటే వాటి తల్లికి గుణపాఠం నేర్పాలి. 36 00:04:51,760 --> 00:04:54,920 ఎవరినీ నిన్ను గాయపరచనివ్వను. 37 00:06:15,080 --> 00:06:18,960 అధూరా 38 00:06:32,560 --> 00:06:34,600 ఆదు, నేను తిరిగి పోరాడుతున్నాను. 39 00:07:02,320 --> 00:07:03,520 షాడో బాయ్. 40 00:07:42,840 --> 00:07:44,440 న్యూస్ టుడే 41 00:07:44,520 --> 00:07:47,880 సుయాశ్ వర్మ కుంగుబాటుకు లోనయ్యాడని మాకు తెలిసింది. 42 00:07:47,960 --> 00:07:52,760 అతని షో, "కసమ్ తేరీ కసమ్" టీఆర్‌పీల కారణంగా ఈ మధ్యనే రద్దయింది. 43 00:07:52,840 --> 00:07:55,080 పోస్ట్‌మార్టం నివేదిక రేపు రావచ్చు. 44 00:07:55,160 --> 00:07:58,480 నీలగిరి వ్యాలీ స్కూల్, అతను మరణించిన స్కూల్, 45 00:07:58,560 --> 00:08:01,560 ఇప్పటికీ ఈ ఘటనపై ఎలాంటి స్పందన వెల్లడించలేదు. 46 00:08:03,160 --> 00:08:06,840 ఈ టీవీ రిపోర్టర్లు టీవీ ఛానల్‌లో కాకుండా వంటల షోలో ఉండాల్సింది. 47 00:08:07,760 --> 00:08:09,440 వీళ్లు మసాలాలు బాగా జోడిస్తారు. 48 00:08:10,240 --> 00:08:11,720 ట్రస్టీల నుంచి ఫోనా? 49 00:08:12,680 --> 00:08:15,960 నాకర్థం కాలేదు. సుయాశ్ ఇది మాట్లాడాలి... 50 00:08:16,600 --> 00:08:17,480 ఈ పునఃకలయిక... 51 00:08:17,920 --> 00:08:19,560 త్వరలో అన్నీ సర్దుకుంటాయి. 52 00:08:20,480 --> 00:08:22,400 ఈ స్కూల్ చాలా ఎదుర్కుంది. 53 00:08:23,240 --> 00:08:25,680 ఈ భవనాలు చాలా పాతవి. 54 00:08:27,000 --> 00:08:30,440 పాత విద్యార్థులకు సహకరించుమని చెప్పండి. 55 00:08:31,040 --> 00:08:32,360 మిగతాది చూసుకుంటాం. 56 00:08:33,160 --> 00:08:34,520 కృతజ్ఞతలు, ఎస్‌ఎస్‌పీ. 57 00:08:34,920 --> 00:08:37,640 మాకు డీన్ వ్యాస్‌తో ప్రత్యేక బంధం ఉంది. 58 00:08:38,600 --> 00:08:40,960 ఆయన ఎప్పుడూ ఉదారంగా ఉంటారు. 59 00:08:41,040 --> 00:08:42,480 మీరు అలాగే ఉంటారని తెలుసు. 60 00:08:49,520 --> 00:08:52,000 అందరి ఆలోచనలను తెలుసుకోవడం కష్టం. 61 00:09:11,160 --> 00:09:12,280 బాగానే ఉన్నావా? 62 00:09:13,200 --> 00:09:14,280 హా, ఏమీ అనుకోకు. 63 00:09:16,520 --> 00:09:17,440 మాల్విక. 64 00:09:17,520 --> 00:09:18,520 సుప్రియ. 65 00:09:18,600 --> 00:09:20,600 నీతో మాట్లాడాలని అనుకున్నాను. 66 00:09:22,320 --> 00:09:24,400 అధిరాజ్‌ గురించి నిజంగా కంగారుగా ఉంది. 67 00:09:26,080 --> 00:09:28,040 -తను ఏమైనా చెప్పాడా... -నినాద్ గురించా? 68 00:09:31,000 --> 00:09:34,200 ఇన్నేళ్ల తరువాత కూడా అతను గొడవ గురించి మరిచిపోలేదు. 69 00:09:34,280 --> 00:09:36,040 నినాద్ ఫైల్‌ను వెతుకుతున్నాడు. 70 00:09:36,120 --> 00:09:38,760 -కోటగిరికి వెళ్లాడు... -నేనే యాక్సెస్ ఇచ్చాను. 71 00:09:38,880 --> 00:09:40,280 అవును, కానీ ఎందుకు? 72 00:09:43,080 --> 00:09:46,080 తన జీవితంలో ఓ చెడు అధ్యాయానికి ముగింపు కోరుకున్నాడు. 73 00:09:46,160 --> 00:09:48,760 కానీ తను ఇంకా ఎక్కువగా కూరుకుపోతున్నాడు. 74 00:09:49,440 --> 00:09:51,640 నాకది కనబడుతోంది, సుప్రియ. తను బాగాలేడు. 75 00:09:53,720 --> 00:09:54,880 అతనికి కుంగుబాటు ఉంది. 76 00:09:57,360 --> 00:09:59,880 చిన్నప్పటి నుంచి తను చాలా ఎదుర్కున్నాడు. 77 00:10:00,480 --> 00:10:03,720 తను చాలా విషయాలు వదిలేయాలి, వాటిని అలా పట్టుకు వేలాడకూడదు. 78 00:10:03,760 --> 00:10:06,840 లేదంటే, నా భయం నిన్నటిలా ఏదైనా జరుగుతుందని... 79 00:10:09,000 --> 00:10:12,760 నేను అధిరాజ్‌ను కాపాడాల్సిందనే ఆలోచనతో మిగిలిపోలేను. 80 00:10:12,880 --> 00:10:16,120 నేను సంకేతాలను చూశాను, కానీ ఏమీ చేయలేకపోయాను. 81 00:10:16,760 --> 00:10:19,200 అందుకే, దయచేసి అతనిని ప్రోత్సహించకు. 82 00:10:21,600 --> 00:10:22,440 దయచేసి. 83 00:10:45,160 --> 00:10:46,520 నా కడుపు నొప్పిగా ఉంది. 84 00:10:50,520 --> 00:10:51,880 జలుబు చేసినట్లుంది. 85 00:10:52,280 --> 00:10:54,960 గత రాత్రి, రెండు నిమిషాల పాటు మరో విద్యార్థిని 86 00:10:55,040 --> 00:10:57,080 చూసేందుకు పక్కకు వెళ్లాను. 87 00:10:57,160 --> 00:11:00,840 అతను నిద్రలో నడుస్తున్నట్లుగా లోపలకు వచ్చి, అలా పడుకున్నాడు. 88 00:11:01,520 --> 00:11:03,360 -తను ఎక్కడికి వెళ్లాడు? -తెలియదు. 89 00:11:06,640 --> 00:11:07,600 వేదాంత్. 90 00:11:08,520 --> 00:11:11,960 నువ్వు నాతో మాట్లాడకపోతే నీకు సాయం చేయలేను. 91 00:11:12,480 --> 00:11:14,280 ఒకవేళ నీకు ఏదైనా జరిగితే? 92 00:11:15,520 --> 00:11:16,920 నాకు అతీతశక్తులు ఉన్నాయి? 93 00:11:18,600 --> 00:11:19,600 అతీతశక్తులా? 94 00:11:20,800 --> 00:11:22,360 ఎవరూ నన్ను భయపెట్టలేరు. 95 00:11:23,600 --> 00:11:24,960 నిన్ను ఎవరు భయపెడుతున్నారు? 96 00:11:25,920 --> 00:11:29,400 ఆకలిగా ఉన్న రాక్షసులకు కొన్నిసార్లు గుణపాఠం నేర్పించాలి. 97 00:11:29,480 --> 00:11:31,520 నేను కుక్కపిల్లలను చంపాలనుకోలేదు, మిస్. 98 00:11:31,600 --> 00:11:36,360 కానీ కుక్క నన్ను మళ్లీ గాయపరచకుండా దానికి నేర్పేందుకు అదొక్కటే మార్గమని అతనన్నాడు. 99 00:11:37,120 --> 00:11:38,840 మనం దానికి ఓ పాఠం నేర్పాలి. 100 00:11:39,320 --> 00:11:41,520 మనం వాళ్లందరికీ పాఠం నేర్పాలి. 101 00:11:42,920 --> 00:11:44,080 నీకిది ఎవరు చెప్పారు? 102 00:11:48,400 --> 00:11:49,960 నీకిది ఎవరు చెప్పారు, వేదాంత్? 103 00:11:51,000 --> 00:11:52,520 నేను నిన్నే అడుగుతున్నా. 104 00:11:54,880 --> 00:11:58,160 నీకిది ఎవరు చెప్పారు? చెప్పు. వేదాంత్! 105 00:11:58,240 --> 00:12:01,040 మిస్ ఘోష్, అతనికి విశ్రాంతి కావాలనుకుంటాను. 106 00:12:20,360 --> 00:12:25,920 మేడం, ఇది మీ తప్పు కాదు. నిన్నటి నుంచి మనం అందరం కంగారులో ఉన్నాం. 107 00:12:26,000 --> 00:12:28,680 అందరం విస్మయం చెందాం, మేడం, ఈ పిల్లలు కూడా. 108 00:12:29,280 --> 00:12:31,440 నిన్నటి ఆత్మహత్య... 109 00:12:32,120 --> 00:12:34,040 అది మరిచిపోవడం కష్టం, మేడం. 110 00:12:37,400 --> 00:12:38,480 మరిచిపోవాల్సిందే. 111 00:12:43,760 --> 00:12:44,600 మరిచిపోవాలి. 112 00:12:48,760 --> 00:12:52,560 రాత్రికి పిల్లలు సినిమా చూస్తారు. ప్రొజెక్టర్ సిద్ధం చెయ్. 113 00:12:53,280 --> 00:12:54,320 సరే, మేడం. 114 00:13:06,800 --> 00:13:09,320 -ఇది ఏమి వ్యవహరించే తీరు? -ఒక్క సెకండ్. వినండి. 115 00:13:09,400 --> 00:13:12,920 -మీకు అర్థం కాలేదు. -ప్రతిఒక్కరి సమస్య అర్థం చేసుకోలేను. 116 00:13:13,600 --> 00:13:17,800 కానీ ఈ దురదృష్టకర, అనూహ్య పరిస్థితిలో మనం అందరం చిక్కుకున్నాం. 117 00:13:17,880 --> 00:13:22,280 ప్రాథమిక దర్యాప్తులో మీ సహకారాన్ని ఎస్ఎస్‌పీ అభ్యర్థించారు. 118 00:13:22,360 --> 00:13:25,080 అది చట్టపరమైన చర్య. మీరు రేపు ఇంటికి వెళ్లవచ్చు. 119 00:13:25,160 --> 00:13:28,400 -ఏం దర్యాప్తు? -అది మన అందరి కళ్ల ముందే జరిగింది. 120 00:13:28,480 --> 00:13:31,480 -అందరూ చూశారు. అది ఆత్యహత్య. -కచ్చితంగా. 121 00:13:31,560 --> 00:13:36,000 వినండి, అంతా నియంత్రణలోనే ఉందని ఎస్ఎస్‌పీ నాకు భరోసా ఇచ్చారు. 122 00:13:36,080 --> 00:13:39,280 ఆయన ఒక్క రోజే అడిగారు. దయచేసి సహకరించండి. 123 00:13:40,560 --> 00:13:42,720 ఈ నిబంధనలు ట్రస్టీలకు వర్తించవా? 124 00:13:46,640 --> 00:13:48,000 ఛ. 125 00:13:51,280 --> 00:13:52,120 ఆగండి. 126 00:13:55,840 --> 00:13:59,920 స్కూల్ బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు, సర్. ఇది ఎస్ఎస్‌పీ గారి ఆదేశం. 127 00:14:02,480 --> 00:14:07,680 ఎస్ఎస్‌పీ గారు, ఇక్కడ ఓ కానిస్టేబుల్ నన్ను బయటకు వెళ్లనీయడం లేదు. 128 00:14:08,240 --> 00:14:09,600 కొంచెం అతనితో మాట్లాడండి. 129 00:14:14,600 --> 00:14:16,000 సరే, సర్. అలాగే, సర్. 130 00:14:19,440 --> 00:14:20,520 మన్నించాలి, సర్. 131 00:14:22,360 --> 00:14:23,360 వెళ్లనివ్వు. 132 00:14:47,040 --> 00:14:48,400 వాడు పోవడం నమ్మలేను. 133 00:14:49,520 --> 00:14:52,880 మన స్నేహితుడు. తను చనిపోవడం నమ్మలేను, బాబూ. 134 00:15:01,000 --> 00:15:02,040 ఛత్. 135 00:15:03,080 --> 00:15:03,960 ఏమిటది? 136 00:15:08,080 --> 00:15:09,040 బాగానే ఉన్నావా? 137 00:15:11,080 --> 00:15:12,400 ఇక్కడే ఉండు. 138 00:15:49,440 --> 00:15:50,280 వెళదాం పద. 139 00:15:57,560 --> 00:15:59,240 రజత్, రా. 140 00:16:12,440 --> 00:16:13,760 మనం ఓ జింకను గుద్దాం. 141 00:16:13,840 --> 00:16:14,880 ఓరి దేవుడా. 142 00:16:15,160 --> 00:16:16,240 ఇప్పుడా? 143 00:16:16,960 --> 00:16:19,920 ఇది స్టార్ట్ కాదనుకుంటా. మనం వెనుకకు నడిచి వెళ్లాలి. 144 00:16:30,680 --> 00:16:34,520 -హఠాత్తుగా, ఇలా... -రజత్, పర్వాలేదు. రా. 145 00:16:44,200 --> 00:16:46,400 ఏమండీ. సుప్రియ ఘోష్ గారి ఆఫీస్? 146 00:16:46,480 --> 00:16:48,080 -అటు వైపు, సర్. -సరే. 147 00:17:26,040 --> 00:17:26,880 ఎవరది? 148 00:17:28,800 --> 00:17:29,800 లోపల ఎవరు? 149 00:17:39,040 --> 00:17:40,240 తలుపు తెరవండి. 150 00:17:41,560 --> 00:17:42,760 బాగానే ఉన్నావా? 151 00:17:44,160 --> 00:17:45,080 లోపల ఎవరు? 152 00:18:02,920 --> 00:18:03,920 నీకు ఏం కనబడింది? 153 00:18:06,240 --> 00:18:07,320 నేను... 154 00:18:17,160 --> 00:18:20,520 నేను సుప్రియ గారి కోసం చూస్తున్నాను. తను కనిపించారా? 155 00:18:21,800 --> 00:18:23,880 ఆమె వైద్యశాలకు వెళ్లడం చూశాను. 156 00:18:23,960 --> 00:18:25,280 సరే. 157 00:18:40,280 --> 00:18:41,800 మనం దానిని కాపాడాల్సింది. 158 00:18:43,400 --> 00:18:45,640 రజత్, లేదు, బాబూ. 159 00:18:46,480 --> 00:18:48,560 జింకనయినా, సుయాశ్‌నయినా. 160 00:18:51,520 --> 00:18:53,080 వెళ్లి పోలీసులతో మాట్లాడతాను. 161 00:18:55,240 --> 00:18:56,760 -హలో, సర్. -హలో. 162 00:18:56,800 --> 00:18:57,920 అంతా బాగుందా? 163 00:18:59,560 --> 00:19:02,560 చెప్పాలంటే, అప్పట్లో స్కూల్ రోజుల్లో, 164 00:19:03,640 --> 00:19:07,200 సుయాశ్, నేను ఎప్పుడూ దేవ్‌ను మెప్పించాలని చూసేవాళ్లం. 165 00:19:09,000 --> 00:19:11,000 తను మా స్నేహితుడు కావాలనుకున్నాం. 166 00:19:12,160 --> 00:19:14,320 స్వార్థం అని తెలుసు, కానీ అతనిని చూడు. 167 00:19:15,240 --> 00:19:19,800 గత ఏడాది, నాకేవో ఆస్తి గొడవలు, ఒక్క ఫోన్ కాల్‌తో పరిష్కరించేశాడు. 168 00:19:21,480 --> 00:19:23,640 అయితే దేవ్‌ను స్నేహితుడిగా చేసుకున్నావు. 169 00:19:24,760 --> 00:19:27,240 అవును. అయినా నువ్వేమీ భిన్నం కావు. 170 00:19:27,320 --> 00:19:29,320 ఎవరూ నీకు కాదని చెప్పలేరు. 171 00:19:30,080 --> 00:19:32,520 లాన్‌లో ఉన్న గులాబీ పూలు అన్నీ 172 00:19:32,920 --> 00:19:34,800 నీ గుమ్మం ముందే ఉండేవనుకుంటా. 173 00:19:39,320 --> 00:19:44,320 కోచ్‌లో చోరీ చేసిన రమ్ తాగేసిన మత్తులో సుయాశ్ కూడా ఓసారి పెట్టినట్లు గుర్తు. 174 00:19:52,800 --> 00:19:55,920 కానీ నువ్వు అధిరాజ్‌నే చూసేదానివి. కదా? 175 00:19:57,040 --> 00:19:58,800 నీకు ఎప్పుడైనా అనిపించిందా, 176 00:19:59,680 --> 00:20:03,000 నువ్వు, ఆది కనుక విడపోకుండా ఉంటే ఏం జరిగేదోనని? 177 00:20:05,920 --> 00:20:08,440 -కాల్ చేయండి. ధన్యవాదాలు. -ధన్యవాదాలు, సర్. 178 00:20:09,680 --> 00:20:11,960 నువ్వూ ఏం చేయలేకపోయావు, అవునా? 179 00:20:12,040 --> 00:20:17,800 బహుశా సుయాశ్ అందరం రాత్రికి ఇక్కడే ఉండి, అతని కోసం మందు తాగాలని కోరుకున్నాడేమో. 180 00:20:21,560 --> 00:20:23,640 నేను ఏనాడూ మద్యాన్ని కాదనని తెలుసుగా. 181 00:20:26,920 --> 00:20:29,280 సుప్రియ, దయచేసి వేదాంత్‌తో మాట్లాడనివ్వు. 182 00:20:29,760 --> 00:20:32,800 నినాద్ కనబడకుండా పోవడంలో అతనికి సంబంధం ఏంటి? 183 00:20:33,320 --> 00:20:36,320 గత రాత్రి, సుయాశ్ జేబుల్లో నుంచి కొన్ని చీటీలు పడ్డాయి. 184 00:20:36,800 --> 00:20:39,240 నినాద్‌పై 15 ఏళ్ల క్రితం వేసిన అవే చీటీలు. 185 00:20:40,080 --> 00:20:41,400 అదెలా సాధ్యమైంది? 186 00:20:43,520 --> 00:20:45,960 నోట్ పుస్తకాలు ఇప్పుడూ అంతే, పరాచికాలు కూడా. 187 00:20:47,040 --> 00:20:50,440 బహుశా ఎవరైనా పాత విద్యార్థి తనపై పరాచికం ఆడుండాలి. 188 00:20:52,400 --> 00:20:55,560 లేదా తను ఎవరితోనైనా పరాచికానికిి, అవి జేబులో ఉంచాడేమో. 189 00:20:55,680 --> 00:20:59,080 కానీ వేదాంత్ నా దగ్గరకు వచ్చి తిరిగి పోరాడతానని చెప్పాడు. 190 00:21:00,520 --> 00:21:03,480 నేను 15 ఏళ్ల క్రితం నినాద్‌కు చెప్పిన అవే మాటలు, 191 00:21:03,560 --> 00:21:05,520 సుయాశ్ తనపై చీటీలు విసిరినప్పుడు. 192 00:21:06,160 --> 00:21:10,000 నినాద్‌తోనే కాదు. వేదాంత్‌తో కూడా ఇదే విషయం మెస్‌లో చెప్పావు. 193 00:21:10,080 --> 00:21:12,000 గుర్తుందా, షాడో బాయ్, తిరిగి పోరాటం? 194 00:21:14,920 --> 00:21:18,160 నీ దగ్గర ప్రతిదానికి తార్కిక వివరణ ఉంటుందేమో. 195 00:21:18,720 --> 00:21:19,800 కానీ... 196 00:21:21,000 --> 00:21:23,320 ఇక్కడ వేరే ఏదైనా జరుగుతుంటే? 197 00:21:24,520 --> 00:21:26,080 అధిరాజ్, నీకు కుంగుబాటు ఉంది. 198 00:21:26,160 --> 00:21:28,480 మాల్విక నీ గురించి కంగారు పడుతోంది. 199 00:21:30,000 --> 00:21:33,080 నినాద్‌ కాకుండా నీ గురించి పట్టించుకునే ఇతరులూ ఉన్నారు. 200 00:21:34,200 --> 00:21:35,560 నేనేం చూశానో నాకు తెలుసు. 201 00:21:35,640 --> 00:21:37,800 ఆ చీటీలను వేరే ఎవరైనా చూశారా? 202 00:21:40,800 --> 00:21:44,440 సుప్రియ, ఆగు. నినాద్ 15 ఏళ్లుగా కనబడడం లేదు. 203 00:21:44,520 --> 00:21:48,440 అతని బ్యాచ్ వాళ్లకు సమాచారం ఇచ్చేందుకు స్కూల్ అధికారులు ప్రయత్నించలేదు. 204 00:21:48,520 --> 00:21:51,280 మనం దర్యాప్తులో సహకరించేవాళ్లం. 205 00:21:51,360 --> 00:21:55,440 మనలో ఒకరికి ఆఖరి రోజు గురించి తెలియవచ్చు. పైగా రికార్డులు కూడా లేవు. 206 00:21:56,000 --> 00:22:00,840 నినాద్ తల్లిదండ్రులతో మాట్లాడానని కోచ్ వ్యాస్ వాంగ్మూలం ఇచ్చాడు. 207 00:22:01,360 --> 00:22:03,680 వ్యాస్ రాత్రికి రాత్రే డీన్ అయ్యాడు. 208 00:22:04,440 --> 00:22:06,760 ఆ వెంటనే పోలీసులు కేసు మూసేశారు. 209 00:22:07,800 --> 00:22:10,160 ఇదంతా నీకు విచిత్రంగా అనిపించడం లేదా? 210 00:22:12,280 --> 00:22:13,360 ఆలోచించు, సుప్రియ. 211 00:22:14,040 --> 00:22:18,440 తప్పిపోయిన కొడుకు తల్లిదండ్రుల దగ్గరకు తిరిగొచ్చే అవకాశం ఏమైనా ఉంటే, 212 00:22:18,520 --> 00:22:20,760 అది పోరాటానికి తగినదే కదా? 213 00:22:23,600 --> 00:22:24,440 నేను... 214 00:22:25,920 --> 00:22:27,880 నినాద్ తల్లిదంద్రుల పట్ల బాధపడతాను... 215 00:22:28,600 --> 00:22:29,800 నీ పట్ల కూడా. 216 00:22:31,000 --> 00:22:32,800 కానీ వేదాంత్ చాలా భయంలో ఉన్నాడు. 217 00:22:34,480 --> 00:22:36,640 అతనిని ఇందులో భాగం కానివ్వలేను. 218 00:22:36,720 --> 00:22:39,280 మన్నించు, నువ్వే జవాబులు వెతుక్కోవాలి. 219 00:22:51,680 --> 00:22:53,680 -కనీసం వాళ్లు నవ్వుతున్నారు. -అవును. 220 00:22:54,440 --> 00:22:56,640 సినిమా మంచి ఆలోచన, సుప్రియ. 221 00:23:07,720 --> 00:23:09,800 -వేదాంత్‌ను చూస్తూ ఉంటావా? -సరే. 222 00:23:21,840 --> 00:23:25,120 మనం ఇక్కడే ఇరుక్కుంటే, వాళ్లు బయటకు వెళ్లడం న్యాయమా? 223 00:23:28,480 --> 00:23:30,080 మీ విహారం బాగా జరిగిందా? 224 00:23:31,080 --> 00:23:33,720 మాకు గేటు దాటి వెళ్లే అనుమతి దొరకలేదు. 225 00:23:33,800 --> 00:23:36,520 ఏయ్, పార్థ్, సుయాశ్ మన స్నేహితుడు. 226 00:23:37,360 --> 00:23:40,520 మాల్విక చాలా భయపడింది. తన మనసు కుదురుకోవాలని అంతే. 227 00:23:40,600 --> 00:23:44,160 -అలా డ్రైవ్‌కు వెళ్లి వచ్చేశాం. -సరే. మన్నించు. 228 00:23:45,160 --> 00:23:46,000 తను బాగానే ఉందా? 229 00:23:46,520 --> 00:23:48,360 కాసేపు ఒంటరిగా ఉంటానంది. 230 00:23:48,880 --> 00:23:49,800 అర్థమైంది. 231 00:23:50,640 --> 00:23:52,560 సరే కానీ, అధిరాజ్ కనిపించాడా? 232 00:23:52,640 --> 00:23:55,400 హా. ఐదు నిమిషాల క్రితం తన గదికి వెళ్లడం చూశాను. 233 00:23:56,280 --> 00:23:58,400 గదిలో ఒంటరిగా ఏం చేస్తున్నాడో? 234 00:24:00,440 --> 00:24:02,280 పిల్లలకు నేను అవసరం, అపు. 235 00:24:02,360 --> 00:24:03,840 వేదాంత్‌కు నేను అవసరం. 236 00:24:03,920 --> 00:24:07,000 నీకే సాయం అవసరం అయినప్పుడు, ఇతరులకు ఎలా సాయం చేస్తావు? 237 00:24:07,080 --> 00:24:08,400 ఇంటికి రమ్మంటున్నాను. 238 00:24:08,480 --> 00:24:10,040 నువ్వు వెంటనే ఇంటికి రావాలి. 239 00:24:35,800 --> 00:24:36,920 మిస్. 240 00:24:37,000 --> 00:24:39,480 మిస్ సుప్రియ ఘోష్ స్కూల్ కౌన్సిలర్ 241 00:25:09,560 --> 00:25:13,280 జామ్వాల్ 242 00:25:20,840 --> 00:25:25,600 అధిరాజ్ జైసింగ్ 243 00:25:29,680 --> 00:25:30,680 మాల్విక! 244 00:25:31,600 --> 00:25:32,520 మాల్విక! 245 00:25:34,760 --> 00:25:36,040 నినాద్‌ను చూశావా? 246 00:25:36,120 --> 00:25:38,560 స్కూల్‌లో ఆఖరి రోజు 247 00:25:41,120 --> 00:25:42,760 మాల్విక, నీతోనే మాట్లాడేది. 248 00:25:43,280 --> 00:25:44,280 నినాద్ ఎక్కడ? 249 00:25:45,160 --> 00:25:47,720 నినాద్, నినాద్. అతని పేరు విని విసుగొచ్చేసింది. 250 00:25:49,000 --> 00:25:51,120 నన్ను పిచ్చిదాన్ని చేశావు, ఆది. 251 00:25:51,200 --> 00:25:54,760 నీకోసం ఎదురుచూస్తూ ఒంటరిగా కూర్చున్నాను. నువ్వు వెళ్లడం చూస్తూ. 252 00:25:55,840 --> 00:25:59,160 ఆఖరి రోజున నాతో కాసేపు గడుపుతావని ఆశించాను. 253 00:25:59,840 --> 00:26:01,120 కానీ నా ఆలోచన తప్పు. 254 00:26:01,600 --> 00:26:04,480 -మాల్విక, నా మాట విను. -నన్ను ఏనాడూ పట్టించుకోవు, ఆది. 255 00:26:04,560 --> 00:26:06,120 -తప్పక పట్టించకుంటాను. -లేదు. 256 00:26:06,200 --> 00:26:09,040 మాల్విక, విను. ఇప్పుడిది భరించలేను, సరేనా? 257 00:26:09,640 --> 00:26:11,040 నేను నినాద్‌ను వెతకాలి. 258 00:26:11,120 --> 00:26:13,440 వాడికి క్షమాపణ చెప్పాలి. నన్ను వెతకనీ. 259 00:26:13,520 --> 00:26:16,200 -ఇది తర్వాత మాట్లాడదాం. -నాకు క్షమాపణ ఏది? 260 00:26:16,840 --> 00:26:20,560 నాకు క్షమాపణ చెప్పే బదులుగా, నినాద్ ఎక్కడ అని నన్నే అడుగుతావా? 261 00:26:21,600 --> 00:26:22,680 నా క్షమాపణ ఏది? 262 00:26:22,760 --> 00:26:25,440 మాల్విక, ఇది కేవలం ఒక్క డేట్! 263 00:26:26,080 --> 00:26:27,760 మనం మరో రోజున వెళ్లగలం! 264 00:26:28,200 --> 00:26:32,280 దయచేసి, కేవలం ఒక్కసారి, ప్రతిదీ నీ గురించే చేయకుండా ఉండగలవా? 265 00:26:32,360 --> 00:26:34,160 -ఏంటి? -మాల్విక! 266 00:26:34,240 --> 00:26:35,280 దేవ్! 267 00:26:36,040 --> 00:26:38,840 ఇప్పుడు కాదు. నా గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను. 268 00:26:43,160 --> 00:26:44,600 నేను నీ గర్ల్‌ఫ్రెండ్ కాను. 269 00:26:45,880 --> 00:26:47,240 నువ్వు, నీ నినాద్ పొండి! 270 00:27:12,680 --> 00:27:15,360 స్కూల్ ఆఖరి రోజు నుండి నినాద్ కనబడడం లేదు. 271 00:27:15,440 --> 00:27:16,800 తను ఇంటికే వెళ్లలేదు. 272 00:27:27,400 --> 00:27:28,560 సుయాశ్ కోసం. 273 00:27:28,640 --> 00:27:30,760 -చీర్స్. -చీర్స్. 274 00:27:31,880 --> 00:27:34,360 ఆది, పోలీసులు తనను కనిపెట్టలేకపోతే, నువ్వెలా? 275 00:27:34,440 --> 00:27:36,800 పోలీసులు ఏమీ చేయలేదు, మాల్విక. 276 00:27:37,520 --> 00:27:39,320 కేసును తిరిగి తెరిపించాలి. 277 00:27:40,640 --> 00:27:42,080 నాకు ఒక్క ఆధారమైనా కావాలి. 278 00:27:43,880 --> 00:27:46,880 ఆఖరి రోజున ఏం జరిగిందో మనలో ఎవరికైనా గుర్తుంటుందా? 279 00:27:47,760 --> 00:27:50,240 15 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఎవరికి గుర్తుంటుంది? 280 00:27:51,280 --> 00:27:53,160 నాకు పిచ్చి అనుకుంటున్నావు, కదా? 281 00:27:54,760 --> 00:27:56,520 సుప్రియ కూడా అదే అనుకుంటోంది. 282 00:28:01,560 --> 00:28:04,360 క్షమించు, ఆది, నేను అక్కడ అలా ప్రవర్తించకూడదు. 283 00:28:09,040 --> 00:28:10,800 నేను నీ గురించి భయపడ్డానంతే. 284 00:28:13,800 --> 00:28:16,400 నువ్వు ఇక్కడకు నన్ను కలిసేందుకు రాలేదని తెలుసు. 285 00:28:17,800 --> 00:28:20,440 కానీ నీ కోసమే ఈ పునఃకలయికకు వచ్చాను. 286 00:28:22,040 --> 00:28:24,840 గత 15 ఏళ్లు ఇదే ఆలోచిస్తూ గడిపాను... 287 00:28:27,520 --> 00:28:28,560 ఒకవేళ నేను... 288 00:29:34,720 --> 00:29:37,160 ఏంటి విషయం? బాత్రూంలో ఉన్నాను. 289 00:29:38,240 --> 00:29:39,400 బయటకే వస్తున్నాను. 290 00:29:44,240 --> 00:29:45,240 ధన్యవాదాలు. 291 00:29:53,680 --> 00:29:56,200 ఆఖరి రోజున నినాద్‌ను ఎవరైనా చూశారా? 292 00:29:57,880 --> 00:29:59,040 చూశాను. 293 00:29:59,440 --> 00:30:04,000 నీ ప్రసంగం తర్వాత మా ప్రదర్శన ఉంది. నేను డ్రమ్ కిట్, గిటార్ తేవడానికి వెళ్లా. 294 00:30:04,080 --> 00:30:05,840 ప్రధాన ద్వారం వద్ద వాడిని చూశా. 295 00:30:05,960 --> 00:30:08,480 నా సామాను తీసుకోవడంలో సాయం చేయమన్నాను, 296 00:30:08,560 --> 00:30:11,760 కానీ సమావేశ గదికి త్వరగా వెళ్లే హడావిడిలో ఉన్నానన్నాడు. 297 00:30:13,000 --> 00:30:16,200 కచ్చితంగా అలా చెప్పాడా? ఎందుకంటే వాడు అక్కడకు రాలేదు. 298 00:30:16,720 --> 00:30:18,280 బహుశా మనసు మార్చుకున్నాడేమో. 299 00:30:18,360 --> 00:30:20,760 -తను చెప్పాడా... -హేయ్, ఇది చూడు. 300 00:30:21,920 --> 00:30:24,240 నా చర్మం కింద ఏదో పాకుతోంది, కదా? 301 00:30:25,520 --> 00:30:26,360 ఏంటి? 302 00:30:27,040 --> 00:30:27,920 ఒకే చేతికా? 303 00:30:28,000 --> 00:30:29,040 అవును. 304 00:30:30,080 --> 00:30:32,440 ఇది రెండో దశ అరచేతి ఎరిథీమాలా ఉంది. 305 00:30:32,520 --> 00:30:33,360 ఏంటి? 306 00:30:33,440 --> 00:30:36,480 -మరీ ఎక్కువ తాగకు. -అధిరాజ్ పుస్తకంతో ఇలా అయింది. 307 00:30:36,880 --> 00:30:38,280 నేను రోజూ తాగుతాను. 308 00:30:39,320 --> 00:30:41,480 -వెళదాం పద. -నేను నీతో రాను. 309 00:30:43,440 --> 00:30:44,480 హేయ్, ఆది. 310 00:30:49,320 --> 00:30:51,760 నినాద్ గురించి మాల్విక చెప్పింది. 311 00:30:52,760 --> 00:30:54,040 నేను నమ్మలేకపోతున్నాను. 312 00:30:55,360 --> 00:30:57,560 ఆ రోజున అసెంబ్లీకి నువ్వు కూడా రాలేదుగా? 313 00:30:57,640 --> 00:30:59,640 వాడు స్కూల్‌లో ఎక్కడైనా కనిపించాడా? 314 00:30:59,720 --> 00:31:00,720 నాకు గుర్తు లేదు. 315 00:31:01,600 --> 00:31:02,840 వాళ్లను అడిగావా? 316 00:31:02,920 --> 00:31:05,720 హా, అందరితో మాట్లాడాను, ఎవరికీ ఏమీ తెలియదు. 317 00:31:06,680 --> 00:31:08,680 మన స్నేహితులకు ఏం జరుగుతోంది? 318 00:31:08,760 --> 00:31:10,320 మనకు తెలియడమే లేదు. 319 00:31:11,280 --> 00:31:12,440 సుయాశ్ ఆత్మహత్య. 320 00:31:13,320 --> 00:31:17,000 -నినాద్ ఇంటి నుంచి పారిపోవడం. -నినాద్ పారిపోయాడని నమ్మలేను. 321 00:31:17,080 --> 00:31:18,840 నిజమే, ఎవరు నమ్ముతారు? 322 00:31:18,920 --> 00:31:21,560 సుయాశ్ గురించి ఆ విషయం నేనూ నమ్మలేను, తెలుసుగా... 323 00:31:23,200 --> 00:31:24,440 కానీ అదే నిజం. 324 00:31:25,440 --> 00:31:27,760 ఓ క్షణం పాటు నినాద్ స్థానంలో ఉండి ఆలోచించు. 325 00:31:27,840 --> 00:31:30,800 ఓ 16 ఏళ్ల అబ్బాయి బాలల స్కూల్‌లో చదువుతాడు. 326 00:31:30,880 --> 00:31:33,480 ఒక రోజున తను గే అని గ్రహిస్తాడు. 327 00:31:33,560 --> 00:31:36,320 అంతకు మించి, తన ప్రాణ మిత్రుడినే ప్రేమిస్తాడు. 328 00:31:36,400 --> 00:31:41,560 పాపం తన ప్రాణ మిత్రుడు తన భావనలను అర్థం చేసుకుంటాడని భావిస్తాడు. 329 00:31:41,640 --> 00:31:46,600 కానీ అర్థం చేసుకోవడం వదిలెయ్, తనను ప్రాణ మిత్రుడే తిరస్కరించడమే కాకుండా, 330 00:31:46,680 --> 00:31:49,400 స్కూల్ అందరి ముందు తనను వెటకారం చేస్తాడు. 331 00:31:50,240 --> 00:31:53,120 పారిపోవడం గురించి ఎవరు ఆలోచించరు, ఆది? 332 00:31:53,200 --> 00:31:55,000 దీని అంతటికీ దూరంగా. 333 00:31:55,520 --> 00:31:57,600 చూడు, తను బాగానే ఉండి ఉంటాడు. 334 00:31:58,960 --> 00:31:59,800 ఇక వదిలెయ్. 335 00:32:00,800 --> 00:32:03,280 ఈ విషయాల గురించి ఆలోచించి ఉపయోగమేమీ లేదు. 336 00:32:03,360 --> 00:32:05,240 నేను కొంచి విశ్రాంతి తీసుకోవాలి. 337 00:32:05,320 --> 00:32:06,760 ఆది... 338 00:32:15,640 --> 00:32:18,440 -పిల్లలు ఆనందంగా ఉన్నారు. -ఇది పిల్లలకు మంచి సినిమా. 339 00:32:19,280 --> 00:32:21,360 మిస్ స్నేహ, వేదాంత్ ఎక్కడ? 340 00:32:24,320 --> 00:32:25,560 తను ఇక్కడే ఉండాలి. 341 00:32:26,880 --> 00:32:28,280 నేను చూసొస్తాను. 342 00:32:35,640 --> 00:32:36,480 వేదాంత్! 343 00:32:37,080 --> 00:32:38,240 వేదాంత్! 344 00:32:40,520 --> 00:32:42,440 ఎక్కడకు వెళుతున్నావు? వెనుకకు రా. 345 00:32:46,760 --> 00:32:48,040 నా మాట వినబడడం లేదా? 346 00:32:55,000 --> 00:32:57,200 పిల్లలను బయటకు పంపండి. 347 00:32:58,440 --> 00:33:00,680 దయచేసి! 348 00:33:06,400 --> 00:33:07,280 బయటకు పదండి. 349 00:33:10,880 --> 00:33:12,240 పదండి. 350 00:33:15,360 --> 00:33:16,960 మనోహర్‌, బయటకు తీసుకెళ్లండి. 351 00:33:18,080 --> 00:33:19,280 జాగ్రత్త. 352 00:33:20,880 --> 00:33:22,680 వసతి గదుల వైపు వెళ్లండి, త్వరగా. 353 00:33:22,760 --> 00:33:24,320 వెళుతూ ఉండండి. 354 00:33:27,280 --> 00:33:28,280 త్వరగా. 355 00:33:34,280 --> 00:33:36,120 గూగుల్ శోధన: బాలుడి అదృశ్యం ఊటీ 2007 356 00:33:39,960 --> 00:33:43,400 16 ఏళ్ల మాజీ విద్యార్థి నీలగిరి వ్యాలీ స్కూల్ నుంచి తప్పిపోయాడు 357 00:33:43,480 --> 00:33:45,920 నినాద్ ఆఖరిగా కోటగిరికి వెళ్లే బస్సులో కనిపించాడు. 358 00:33:50,320 --> 00:33:51,600 నీలగిరి వ్యాలీ స్కూల్ 359 00:33:51,680 --> 00:33:52,800 ఫలితాలు లేవు 360 00:34:41,840 --> 00:34:42,640 సార్థక్? 361 00:34:45,120 --> 00:34:46,880 -ఏం జరిగింది? -మిస్... 362 00:34:48,160 --> 00:34:49,040 చెప్పు. 363 00:34:51,000 --> 00:34:52,520 అతను మన అందరినీ చంపేస్తాడు. 364 00:34:54,000 --> 00:34:54,840 ఎవరు? 365 00:34:56,640 --> 00:34:58,600 వేదాంత్ లోపల ఉంటున్న అబ్బాయి. 366 00:35:05,000 --> 00:35:06,000 మిస్ సుప్రియ! 367 00:35:06,080 --> 00:35:08,000 ప్రొజెక్టర్ గదిలో మంటలు అంటుకున్నాయి. 368 00:35:08,080 --> 00:35:11,280 పిల్లలను వసతి గదులలోకి పంపించాను. కానీ వేదాంత్ కనబడడం లేదు. 369 00:35:11,360 --> 00:35:12,160 ఏంటి? 370 00:35:12,920 --> 00:35:16,320 అతనిపై కన్నేసి ఉంచమని చెప్పాను. అతనిని కూడా కోల్పోలేను! 371 00:35:40,760 --> 00:35:42,040 ఏమిటీ దారుణం! 372 00:36:11,440 --> 00:36:12,560 వేదాంత్, శాంతించు! 373 00:36:12,640 --> 00:36:14,040 వేదాంత్, శాంతించు! 374 00:36:14,120 --> 00:36:15,880 శాంతించు! 375 00:36:15,960 --> 00:36:17,560 -శాంతించు! -కాళ్లు పట్టుకోండి. 376 00:36:17,640 --> 00:36:19,000 మనం తనకు మత్తు ఇవ్వాలి. 377 00:36:19,800 --> 00:36:20,800 సాయం చేయండి. 378 00:36:26,840 --> 00:36:27,760 శాంతించు. 379 00:36:27,840 --> 00:36:28,880 ఏం పర్వాలేదు. 380 00:36:29,600 --> 00:36:30,920 పర్వాలేదు, వేదాంత్. 381 00:36:31,000 --> 00:36:33,040 ఏం పర్వాలేదు! 382 00:36:37,280 --> 00:36:38,600 వేదాంత్, శాంతించు. 383 00:36:39,160 --> 00:36:40,360 తన కాళ్లు పట్టుకోండి. 384 00:36:42,840 --> 00:36:43,880 ఆపు. 385 00:36:47,960 --> 00:36:49,440 ఆగు, వేదాంత్. శాంతించు. 386 00:37:13,880 --> 00:37:14,680 తనకు పర్వాలేదా? 387 00:37:14,800 --> 00:37:16,160 హా. అతనికి మత్తు ఇచ్చాము. 388 00:37:17,640 --> 00:37:18,880 ఆ దుప్పటి తీసుకురా. 389 00:37:18,960 --> 00:37:19,800 సరే. 390 00:37:33,680 --> 00:37:35,760 ఇక్కడ ఏదో జరుగుతోంది. 391 00:37:35,840 --> 00:37:37,320 మాల్విక నిద్రపోతోంది. 392 00:37:37,400 --> 00:37:40,200 నీకు అర్థం కావట్లేదు. ఎవరో నా పీక పిసికారు. 393 00:37:40,320 --> 00:37:41,880 అంటే, నాకు నేనే... 394 00:37:41,960 --> 00:37:44,480 సోదరా, ఎవరో... నాకు ఊపిరి ఆడలేదు, బాబూ. 395 00:37:44,560 --> 00:37:45,840 శాంతించు. 396 00:37:46,360 --> 00:37:48,600 నువ్వు మరీ ఎక్కువ తాగేశావు. 397 00:37:49,280 --> 00:37:51,280 లోపలకు రా. కానీ నిశ్శబ్దంగా. 398 00:37:52,400 --> 00:37:53,440 రా. 399 00:38:03,920 --> 00:38:05,160 వాడు ఎవరికీ చెప్పకూడదు. 400 00:38:06,560 --> 00:38:08,920 భయపడకు. వాడు చెప్పడు. 401 00:38:30,200 --> 00:38:31,080 సాయం చేయండి! 402 00:38:31,160 --> 00:38:32,640 ఎవరైనా సాయం చేయండి! 403 00:38:35,840 --> 00:38:37,080 వేదాంత్. 404 00:38:39,440 --> 00:38:40,400 సాయం చేయండి! 405 00:38:54,960 --> 00:38:56,280 వేదాంత్‌కు దూరంగా ఉండు. 406 00:38:56,840 --> 00:39:00,520 లేదా నువ్వు కూడా మిగతా వాళ్లలా చస్తావు. 407 00:41:19,880 --> 00:41:21,880 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 408 00:41:21,960 --> 00:41:23,960 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ