1 00:00:11,720 --> 00:00:13,722 ఉంటర్ డెన్ లిండెన్ 2 00:00:15,224 --> 00:00:16,391 ఏం జరిగింది? 3 00:00:17,059 --> 00:00:18,227 నాకు తెలీదు. 4 00:00:18,560 --> 00:00:20,062 బహుశా కరెంట్ లోడ్ ఎక్కువైనట్టు ఉంది. 5 00:00:20,145 --> 00:00:21,146 పేలుడు సంభవించిందా? 6 00:00:21,230 --> 00:00:23,232 ఏమో. అయ్యుండొచ్చు. 7 00:00:23,690 --> 00:00:25,359 ఉంటర్ డెన్ లిండెన్ కి సహాయక బలగాలను పంపండి. 8 00:00:28,111 --> 00:00:29,112 అవునా? 9 00:00:31,281 --> 00:00:32,115 వాళ్ళు వెళ్తున్నారు. 10 00:00:32,198 --> 00:00:33,408 మంచిది. 11 00:00:33,492 --> 00:00:34,409 మిస్టర్ ఢీల్… 12 00:00:35,077 --> 00:00:36,161 వాళ్ళు చనిపోయి ఉండొచ్చా? 13 00:00:36,995 --> 00:00:37,996 స్టెఫాన్? 14 00:00:38,705 --> 00:00:39,581 ఏం జరుగుతోంది? 15 00:00:42,209 --> 00:00:44,211 సరే… త్వరపడండి. 16 00:00:44,461 --> 00:00:45,295 థాంక్స్. 17 00:00:45,796 --> 00:00:48,590 మేము ట్రాకింగ్ సిస్టమ్ ని తిరిగి ఆన్ లైన్ కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. 18 00:00:49,383 --> 00:00:51,718 త్వరలోనే బెయిలీ బ్రౌన్ ని సేఫ్ హౌస్ కి తరలిస్తే మంచిది. 19 00:00:52,052 --> 00:00:54,054 ఇంకా మనకు ఏం జరిగిందో తెలీదు. 20 00:00:54,388 --> 00:00:57,391 ఆ కాన్వాయ్ కదలకుండా ఉన్న ప్రతీ క్షణం వారికి ప్రమాదమే. 21 00:01:05,190 --> 00:01:06,900 నెల్సన్ కి ఫోన్ ట్రై చేయడం కొనసాగించండి. 22 00:01:08,777 --> 00:01:09,653 చేయండి. 23 00:01:13,031 --> 00:01:14,741 సరే, అలాగే. అలాగే చేస్తాం. 24 00:01:19,663 --> 00:01:21,123 తిరిగి సేఫ్ హౌస్ కి వెళ్ళాలి. 25 00:01:22,499 --> 00:01:23,709 ఏం జరుగుతోంది? 26 00:01:24,585 --> 00:01:27,045 మనల్ని ఆగిపొమ్మన్నారు. హ్యాండ్ ఓవర్ చేయడం లేదు అంట. 27 00:01:27,129 --> 00:01:29,173 వీడు మాట్లాడుతున్న ఈ "హ్యాండ్ ఓవర్" ఏంటి? 28 00:01:29,798 --> 00:01:33,093 బెయిలీ బ్రౌన్ ని వెంటనే సేఫ్ హౌస్ కి తరలించమని మనకు ఆర్డర్స్ వచ్చాయి. 29 00:01:33,177 --> 00:01:36,388 మనం అక్కడి నుండి వెళ్ళడం ఎవరైనా చూసి ఉండొచ్చు. మళ్ళీ అక్కడికి వెళ్లడం ప్రమాదకరం. 30 00:01:36,471 --> 00:01:37,890 ఏం చేయాలని నిర్ణయించేది నేను కాదు. 31 00:01:37,973 --> 00:01:39,141 కాసేపు ఇక్కడే ఉండండి. 32 00:01:43,437 --> 00:01:45,022 నాకు ట్రైన్ తో కనెక్షన్ పోయింది. 33 00:01:45,606 --> 00:01:50,235 - ఇంకా? - జర్మన్ పోలీసులు పేలుడు జరిగి ఉండొచ్చు అంటున్నారు. 34 00:01:50,861 --> 00:01:54,740 దేవుడా. అక్కడ వారి స్పందన ఎలా ఉంది? 35 00:01:55,282 --> 00:01:56,950 కొంచెం కంగారుపడుతున్నారు, 36 00:01:57,034 --> 00:02:00,037 కానీ ఎంఐ5 వారు బెయిలీ బ్రౌన్ ని తిరిగి కస్టడీకి తరలిస్తున్నారు అంటున్నారు. 37 00:02:00,120 --> 00:02:01,830 అంటే వాళ్ళు ఈ వ్యవహారం ముగిసింది అనుకుంటున్నారు. 38 00:02:03,457 --> 00:02:05,167 నువ్వు నీ ప్రయత్నం చేసావు, డానియెల్. 39 00:02:27,481 --> 00:02:29,149 హెచ్ఎం చెరసాల 40 00:02:30,108 --> 00:02:31,109 ఇక నువ్వు వెళ్లొచ్చు. 41 00:02:33,570 --> 00:02:35,030 ప్రమాదం తప్పిందా? 42 00:02:35,113 --> 00:02:38,325 లేదు, అలా కాదు. బెర్లిన్ లో పేలుడు సంభవించింది అని రిపోర్టులు వచ్చాయి. 43 00:02:39,910 --> 00:02:41,328 మేము నిన్ను తిరిగి బెల్మార్ష్ కి పంపుతాం. 44 00:02:42,663 --> 00:02:45,999 చూస్తుంటే కొన్ని వారాల్లో నీ మిత్రుడు జాన్ కూడా అక్కడికి వచ్చేలా ఉన్నాడు. 45 00:03:11,608 --> 00:03:16,196 నా తలని పైకి ఎత్తాను ఆకాశాన్ని చూడటానికి సరిపోయేంత 46 00:03:17,281 --> 00:03:20,033 ఇక మనం మొదలెట్టినప్పుడు అస్సలు నెమ్మదిగా ఉండము 47 00:03:20,117 --> 00:03:22,244 మనం ఎంతగా పోరాడుతాం అంటే 48 00:03:22,870 --> 00:03:27,583 ఒక రోజు వచ్చేసరికి నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు 49 00:03:28,458 --> 00:03:30,794 నీ తలని దించుకోకుండా ఉండు చాలు 50 00:03:30,878 --> 00:03:33,589 నీ పిడికిలిని ముద్దు పెట్టుకుని, ఆకాశాన్ని ముట్టుకో 51 00:03:34,173 --> 00:03:38,760 ప్రపంచం చావకుండా ఆపడానికి సమయం మించిపోయింది 52 00:03:40,012 --> 00:03:42,055 ఒకరోజు 53 00:03:42,139 --> 00:03:44,057 వూ 54 00:03:44,141 --> 00:03:46,351 మనం అందరం అక్కడ ఉంటాం 55 00:03:47,936 --> 00:03:50,439 అవును, అవును, అవును అవును, అవును అవును 56 00:05:10,644 --> 00:05:14,231 ప్యాసింజర్స్, దయచేసి ప్రశాంతంగా ఉండండి. 57 00:05:14,982 --> 00:05:16,316 మాకు తెలిసి వెనుక బోగీని… 58 00:05:16,400 --> 00:05:19,695 - ఏం కాదు. మనకు ఏం కాదు. - …వాళ్ళు హెచ్చరికగా పేల్చి ఉంటారు. 59 00:05:19,778 --> 00:05:24,741 ప్రతీ బోగీ క్రింద బాంబులు ఉన్నాయి, కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండి 60 00:05:25,826 --> 00:05:30,205 పిచ్చి పనులు ఏం చేయకుండా ఉంటే, మనం అందరం బయటపడతాం. 61 00:05:32,541 --> 00:05:34,459 ఆఖరిసారి అడుగుతున్నా, జెస్… 62 00:05:34,543 --> 00:05:36,712 ఈ ఆట ముగిసింది, సరేనా? 63 00:05:37,588 --> 00:05:38,672 ప్లానులు మారాయి. 64 00:05:39,548 --> 00:05:41,383 నీకు ఏం తెలుసో నువ్వు నాకు చెప్పాలి. 65 00:05:43,010 --> 00:05:44,178 ఏమైనా మాట్లాడు! 66 00:06:02,863 --> 00:06:03,864 మాట్లాడు, జెస్. 67 00:06:03,947 --> 00:06:06,909 సరే, నేను ఇది ఒక్కడినే చేయలేను. నువ్వు నాతో మాట్లాడాలి. 68 00:06:09,912 --> 00:06:11,371 మనం ఇంకా ప్రమాదంలో ఉన్నామా? 69 00:06:14,166 --> 00:06:16,418 - నాకు తెలీదు. - లేదు, నేను నిన్ను నమ్మను. 70 00:06:16,502 --> 00:06:18,337 అలా జరగడం ప్లాన్ లో భాగం కాదు. 71 00:06:19,129 --> 00:06:21,006 సరే, అయితే ఇది ఎవరు నడిపిస్తున్నారో వారికి ఫోన్ చెయ్. 72 00:06:23,217 --> 00:06:24,635 ఆ వ్యక్తి. 73 00:06:25,135 --> 00:06:27,137 నేను కలిసిన వాడు. వాడి పేరు ఏంటో నాకు తెలీదు. 74 00:06:28,096 --> 00:06:29,640 నిన్ను ఈ పనికి పెట్టింది వాడే కదా? 75 00:06:31,517 --> 00:06:32,935 నువ్వు వాడితో కలిసి పని చేస్తున్నావు కదా? 76 00:06:35,020 --> 00:06:36,813 నువ్వు ఖచ్చితంగా వాడికి ఫోన్ చేయగలవు. 77 00:06:36,897 --> 00:06:38,106 లేదు, సంప్రదింపు ఉండకూడదు. 78 00:06:38,190 --> 00:06:41,568 జెస్, ట్రైన్ మొత్తం ఈపాటికి పేలిపోయి ఉండాలి, కానీ అది పేలలేదు. 79 00:06:42,861 --> 00:06:43,862 ఇంకా లేదు. 80 00:06:47,741 --> 00:06:49,409 నువ్వు వాడితో మాట్లాడాలి. 81 00:06:51,203 --> 00:06:53,163 ఇంకా అంతా నీ కంట్రోల్ లో ఉందని వాడికి తెలిసేలా చెయ్. 82 00:07:09,429 --> 00:07:10,430 డ్రైవర్ 83 00:07:14,685 --> 00:07:16,311 ఏదైనా మంచి విషయం చెప్పు. 84 00:07:17,104 --> 00:07:18,564 అంటే, ప్రస్తుతానికి నేను ప్రాణాలతో ఉన్నాను. 85 00:07:19,481 --> 00:07:21,733 ఓహ్, నువ్వా. 86 00:07:21,817 --> 00:07:24,152 పరిస్థితి ఇప్పుడు నీ కంట్రోల్ లో లేదు. 87 00:07:24,695 --> 00:07:27,364 ఇక్కడ ఏదీ నా కంట్రోల్ తప్పిపోలేదు. 88 00:07:28,156 --> 00:07:30,993 ఒక సమస్య ఎదురైంది, మేము దాన్ని పరిష్కరించాం. 89 00:07:31,827 --> 00:07:36,540 ఏమో, నాకైతే అలా అనిపించడం లేదు. కాన్వాయ్ ని తిరిగి వెనక్కి పంపుతున్నారు. 90 00:07:36,623 --> 00:07:37,791 అయితే ఇప్పుడు ఏం చేస్తావు? 91 00:07:44,381 --> 00:07:45,382 మాస్టర్ ఓవర్ రైడ్ స్టాండ్ బై - ఆర్మ్ చేయబడింది 92 00:07:45,465 --> 00:07:46,842 వద్దు, వద్దు, వద్దు. అంత పని చేయకు. 93 00:07:46,925 --> 00:07:48,302 మేము పరిస్థితిని సరిచేయగలం. 94 00:07:48,385 --> 00:07:50,387 నా మాట విను, మేము పరిస్థితిని సరిచేయగలం! 95 00:07:50,470 --> 00:07:52,347 ఎలా సరిచేస్తావో చెప్పు. 96 00:07:55,142 --> 00:07:56,143 ఎలా? 97 00:07:56,226 --> 00:07:58,729 నాకు ఇంకొంచెం టైమ్ కావాలి అంతే. నాకు కొంచెం… 98 00:07:58,812 --> 00:08:02,232 మనల్ని ఈ పనికి పెట్టుకున్నోళ్ళు వైఫల్యాన్ని సహించరు. 99 00:08:03,025 --> 00:08:06,195 నీకు రిస్క్ లు ఏంటో తెలుసు. ఇది తిరిగి వాళ్ళ వరకు వెళ్ళకూడదు. 100 00:08:08,739 --> 00:08:10,741 హేయ్. అది నువ్వే, అవునా? 101 00:08:11,366 --> 00:08:12,367 నేను నిన్ను నిన్న కలిసాను. 102 00:08:21,335 --> 00:08:22,336 నీకు ఏం కావాలి? 103 00:08:23,921 --> 00:08:25,839 నీకు ఏం కావాలో నాకు కూడా అదే కావాలి, సరేనా? 104 00:08:25,923 --> 00:08:29,218 నేను నిన్న ద ఫాక్స్ హోల్ లో కలిసినప్పుడు, మనం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. 105 00:08:30,260 --> 00:08:32,513 నేను చేయాల్సిన పని నేను చేశా. 106 00:08:32,596 --> 00:08:35,640 ఆ కంట్రోల్ రూమ్ వాళ్ళు, నేను అడిగిన ప్రతీ విషయానికి ఒప్పుకున్నారు, 107 00:08:35,724 --> 00:08:36,808 నువ్వు అడిగినవాటికి. 108 00:08:36,892 --> 00:08:40,645 లేదు, ఇప్పుడు అలా జరగడం లేదు. వాళ్ళు బెయిలీ బ్రౌన్ ని తిరిగి సేఫ్ హౌస్ కి తరలిస్తున్నారు. 109 00:08:40,729 --> 00:08:42,648 వాళ్లకు తెలిసినంత వరకు, ఇక ఈ వ్యవహారం ముగిసినట్టే. 110 00:08:43,232 --> 00:08:44,775 చూడు, మేము ఏం చేస్తామో చెప్తా విను. 111 00:08:44,858 --> 00:08:46,902 నేను వాళ్లతో కాన్వాయ్ ని తిరిగి వెనక్కి తిప్పించగలను. 112 00:08:50,072 --> 00:08:52,407 సరేనా? మేము పరిస్థితిని సరిచేయగలం. 113 00:09:06,213 --> 00:09:10,133 మీకు అయిదు నిమిషాలు ఇస్తున్నా, పని జరగలేదు అంటే ఆ ట్రైన్ ని పేల్చేస్తా. 114 00:09:11,134 --> 00:09:13,637 అలాగే దాన్ని ఆపడానికి మీరు చేయగలది ఏమీ లేదు. 115 00:09:15,055 --> 00:09:16,974 మరి… మరి ఇంకొక డీల్ సంగతి ఏంటి? 116 00:09:17,558 --> 00:09:19,142 మార్షా సంగతి ఏంటి? 117 00:09:20,561 --> 00:09:22,229 నిన్న రాత్రి చెప్పాను కదా, 118 00:09:22,312 --> 00:09:23,856 మాకు కావాల్సింది జరిగింది అంటే 119 00:09:24,481 --> 00:09:26,275 మార్షాకి ఎలాంటి ప్రమాదం ఉండదు. 120 00:09:30,237 --> 00:09:31,238 బండి మొదలవుతుందా? 121 00:09:31,864 --> 00:09:33,407 ఒకసారి చూస్తా, ట్రై చేద్దాం. 122 00:10:00,058 --> 00:10:02,186 ఈ దరిద్రపుగొట్టుది పనిచేస్తోంది! 123 00:10:20,120 --> 00:10:22,623 సర్, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. 124 00:10:23,415 --> 00:10:26,126 ప్రశాంతంగా ఉండటానికి ట్రై చెయ్, డ్రైవర్ ఏమన్నాడో గుర్తుచేసుకో. 125 00:10:27,961 --> 00:10:29,463 మనం త్వరలోనే ఇక్కడి నుండి బయటపడతాం. 126 00:10:31,423 --> 00:10:32,466 అవును కదా? 127 00:10:36,136 --> 00:10:38,388 అవును. నిజంగా. 128 00:10:54,738 --> 00:10:55,739 వింటర్? 129 00:11:02,996 --> 00:11:04,706 సామ్, ఏం జరిగింది? 130 00:11:04,790 --> 00:11:06,333 బెయిలీ బ్రౌన్ ఎక్కడ ఉన్నాడు? 131 00:11:07,835 --> 00:11:09,711 ముందు నాకు సమాధానాలు చెప్పు. 132 00:11:09,795 --> 00:11:11,880 బెయిలీ బ్రౌన్ ఎక్కడ ఉన్నాడు? 133 00:11:14,091 --> 00:11:16,593 అతను హ్యాండ్ ఓవర్ కోసం బెర్గ్మన్ స్ట్రాసేకి వస్తున్నాడు. 134 00:11:18,262 --> 00:11:20,764 అది అబద్ధం. అతన్ని తిరిగి రప్పించండి. 135 00:11:22,808 --> 00:11:24,142 అతనికి ఎలా తెలిసింది? 136 00:11:25,561 --> 00:11:26,603 వింటర్. 137 00:11:27,813 --> 00:11:31,233 అతన్ని హ్యాండోవర్ ప్రదేశానికి రప్పించండి, లేదంటే ట్రైన్ మొత్తం పేలిపోతుంది. 138 00:11:37,030 --> 00:11:38,115 అతను అక్కడ ఉంటాడు. 139 00:11:40,659 --> 00:11:41,660 ఉంటేనే అందరికీ మంచిది. 140 00:11:46,415 --> 00:11:48,584 ఉంటర్ డెన్ లిండెన్ కి వెళ్లిన అత్యవసర సిబ్బందిని వెనక్కి తెప్పించండి, 141 00:11:48,667 --> 00:11:50,210 అలాగే తిరిగి కాన్వాయ్ ని పంపించండి. 142 00:11:56,508 --> 00:11:57,634 కదలండి. 143 00:11:57,718 --> 00:11:58,802 అలాగే. 144 00:12:02,014 --> 00:12:03,098 పదండి! 145 00:12:08,562 --> 00:12:09,563 ఏంటి? 146 00:12:10,147 --> 00:12:11,481 అతను సత్తా ఉన్నోడే. 147 00:12:11,565 --> 00:12:14,151 - అంటే మీరు బయలుదేరారా? - అవును. మంచి పని చేశారు. 148 00:12:15,611 --> 00:12:18,363 - ఇదంతా పూర్తికావడానికి దగ్గరలో ఉన్నాం. - అవును. 149 00:12:18,947 --> 00:12:22,367 ఇక తప్పులు చేయకు, అప్పుడు నీ డబ్బు నీకు అందుతుంది. 150 00:12:22,451 --> 00:12:23,452 సరే. 151 00:12:23,535 --> 00:12:25,287 ట్రైన్ ని ప్లాట్ ఫామ్ కి తీసుకురా, 152 00:12:25,370 --> 00:12:26,455 మేము అక్కడ ఉంటాం. 153 00:12:31,835 --> 00:12:32,961 ఇక మనం వెళ్లొచ్చు. 154 00:12:57,402 --> 00:12:59,112 అతను ఒక అబద్ధాల కోరు, అలాగే ఒక హంతకుడు. 155 00:12:59,530 --> 00:13:01,615 ఏడ, పరిస్థితి అదుపు తప్పుతోంది. 156 00:13:03,659 --> 00:13:05,369 కాన్వాయ్ ఏం చేస్తుందో వాడికి తెలుసు. 157 00:13:05,452 --> 00:13:07,287 కానీ ట్రైన్ ఎక్కడ ఉందో మనకి తెలీదు. 158 00:13:07,871 --> 00:13:10,874 వాడు అడిగింది వాడికి ఇస్తున్నాం అనిపించేలా చేయడం తప్పించి నాకు వేరే దారి లేదు. 159 00:13:12,292 --> 00:13:13,252 కానీ? 160 00:13:14,378 --> 00:13:15,379 మనం అడ్డుకుందాం. 161 00:13:19,424 --> 00:13:22,344 ఇది గనుక అనుకున్నట్టు జరిగి, వాడు ఆశపడింది వాడికి అందితే, 162 00:13:22,427 --> 00:13:23,595 ఎవరూ చావల్సిన పని ఉండదు. 163 00:13:27,850 --> 00:13:28,934 ఫ్రెడ్డీ తప్పించి. 164 00:13:37,860 --> 00:13:39,027 అయితే వాడిని నువ్వు ఎందుకు చంపావు? 165 00:13:44,992 --> 00:13:47,744 మీరు తప్పు చేశారు కాబట్టి ఫ్రెడ్డీ చావాల్సి వచ్చింది. 166 00:13:48,662 --> 00:13:50,747 వాడు కంట్రోల్ సెంటర్ కి కాల్ చేయడానికి ట్రై చేసాడు. 167 00:13:52,457 --> 00:13:54,501 నేను ఎవరికి పని చేస్తున్నానో వాడికి తెలిసి ఉంటే, 168 00:13:55,085 --> 00:13:57,421 వాడు మొత్తం ట్రైన్ ని పేల్చేసి ఉండేవాడు. 169 00:13:58,088 --> 00:13:59,715 అలాగే వాడు మార్షాని కూడా చంపేసి ఉండేవాడు. 170 00:14:03,886 --> 00:14:05,387 అయితే ఇక ఇలాగే జరుగుతుంది అంటావు, అంతేనా? 171 00:14:06,471 --> 00:14:07,931 మన చేతుల్లో ఏదీ లేదు. 172 00:14:09,975 --> 00:14:12,186 ఇది ఎవరి పని అని తెలియడానికి ఆధారాలు ఉండవు. 173 00:14:15,564 --> 00:14:16,565 నీ ఒక్కడి గురించి తప్ప. 174 00:14:18,275 --> 00:14:19,276 అవును. 175 00:14:20,110 --> 00:14:21,236 నా ఒక్కడి గురించి తప్ప. 176 00:14:45,385 --> 00:14:46,637 బాగా లోతుగా దిగింది. 177 00:14:48,138 --> 00:14:49,723 నిజంగా అంటున్నా, నీకు కుట్లు అవసరం కావొచ్చు. 178 00:14:50,724 --> 00:14:52,434 మీరు ఏ అండ్ ఈకి వెళితే మంచిది అనుకుంట. 179 00:14:52,518 --> 00:14:54,228 లేదు, అదేం పర్లేదు. 180 00:14:54,311 --> 00:14:56,396 ఒక్క క్షణం ఇది పట్టుకోండి. 181 00:15:07,824 --> 00:15:09,785 అవును, ఇక్కడికి ఒక గంట దూరంలో ఒక ఏ అండ్ ఈ ఉంది. 182 00:15:11,161 --> 00:15:12,621 మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలీడం లేదు. మీరు లోకల్. 183 00:15:14,373 --> 00:15:16,250 మీకు సెయింట్ ఫ్రాన్సిస్ తెలిసే ఉంటుంది. 184 00:15:16,333 --> 00:15:18,126 సెయింట్ ఫ్రాన్సిస్, అవును. 185 00:15:19,002 --> 00:15:21,088 అక్కడ ఉన్న ఏ అండ్ ఈలో చాలా రాత్రుళ్ళు గడిపాను. 186 00:15:26,051 --> 00:15:27,386 నేను నీకు కట్టు కడతాను. 187 00:15:28,011 --> 00:15:29,513 ఎక్కడికి వెళ్తున్నావు? 188 00:15:30,305 --> 00:15:31,807 ప్రథమ చికిత్స చేయడానికి వాడే కిట్ తేవడానికి. 189 00:15:49,408 --> 00:15:50,242 సెయింట్ ఫ్రాన్సిస్? 190 00:15:50,325 --> 00:15:51,285 సెయింట్ మైఖేల్స్ హాస్పిటల్ 191 00:15:54,496 --> 00:15:55,539 వెనుకవైపు! 192 00:16:01,753 --> 00:16:03,130 ఆమె ఎక్కడికి వెళ్ళింది? 193 00:16:22,816 --> 00:16:23,901 ఛ. 194 00:16:23,984 --> 00:16:25,861 ఆమె ఎక్కువ దూరం వెళ్లి ఉండదు. 195 00:16:45,589 --> 00:16:46,590 ఛ. 196 00:16:47,216 --> 00:16:49,051 - అన్నీ తీసుకో. - పదా. 197 00:16:51,803 --> 00:16:52,804 ఇటువైపు. 198 00:17:19,915 --> 00:17:24,002 ఆమె దగ్గర డిటొనేటర్ ఉంది. అతను ఆమెతో లోపల ఏం చేస్తున్నాడు? 199 00:17:28,048 --> 00:17:29,174 ఏం జరుగుతోంది? 200 00:17:29,258 --> 00:17:31,343 - హేయ్. నా ఉద్దేశం, ఏం జరుగుతోంది? - వినండి. 201 00:17:31,426 --> 00:17:33,846 అందరూ ఒక నిమిషం శబ్దం చేయకుండా ఉంటారా, ప్లీజ్? 202 00:17:33,929 --> 00:17:36,557 రిలాక్స్. ఒక్క క్షణం శాంతించండి. ఒక్కొక్కరిగా మాట్లాడండి, సరేనా? 203 00:17:37,099 --> 00:17:38,642 ఆ బోగీలో ఉన్నోళ్లు చనిపోయి ఉండొచ్చు. 204 00:17:38,725 --> 00:17:39,852 కానీ, లేదు… ఎవరూ చావలేదు. 205 00:17:39,935 --> 00:17:41,728 - గాడిదగుడ్డు, ఇదంతా దీని వల్లే! - ఓయ్, నాకు గొడవపడాలని లేదు. 206 00:17:41,812 --> 00:17:43,105 హేయ్. ఆగు, ఆగు, ఆగు. 207 00:17:43,188 --> 00:17:45,107 హేయ్, శాంతించు, శాంతించు, శాంతించు. 208 00:17:45,190 --> 00:17:47,943 మన శత్రువు ఈమె కాదు, సరేనా? దీని వెనుక ఇంకా చాలా నడుస్తోంది. 209 00:17:48,026 --> 00:17:50,571 ఎవరికీ హాని కలగలేదు, ఇకపై కూడా అలాగే ఉందాం. 210 00:17:50,654 --> 00:17:54,116 సరేనా? మనందరికీ కావాల్సింది ఒక్కటే, మనందరికీ ప్రాణాలతో బయటపడాలని ఉంది అంతే. 211 00:17:54,199 --> 00:17:55,826 నువ్వు మమ్మల్ని ట్రైన్ నుండి వెళ్లనివ్వాలి. 212 00:17:55,909 --> 00:17:57,160 అది అంత సింపుల్ విషయం కాదు. 213 00:17:59,663 --> 00:18:01,415 కానీ నేను మీకు ఒక విషయం చెప్పగలను. 214 00:18:01,498 --> 00:18:04,168 హ్యాండోవర్ జరగబోతోంది. 215 00:18:04,793 --> 00:18:10,174 కాబట్టి మనం ప్రశాంతంగా ఉండి, అధికారులతో కలిసి పనిచేస్తే, 216 00:18:10,257 --> 00:18:12,217 మనం ప్రాణాలతో బయటపడగలం. 217 00:18:12,301 --> 00:18:13,844 సరేనా? ఆ మాత్రం మాట ఇవ్వగలను. 218 00:18:15,053 --> 00:18:16,054 సరేనా? 219 00:18:22,769 --> 00:18:26,106 జి.ఎస్.జి 9 వాళ్ళు సొరంగంలో ఒక టీమ్ ని పెడతారు. 220 00:18:26,190 --> 00:18:28,150 ఒకసారి ట్రైన్ ఈ పాయింట్స్ దాటిన తర్వాత వాళ్ళు మనల్ని హెచ్చరిస్తారు. 221 00:18:28,942 --> 00:18:30,277 అక్కడ షూటర్స్ ఉంటారు… 222 00:18:30,360 --> 00:18:32,779 ఇక్కడ, ఇక్కడ ఇంకా ఇక్కడ. 223 00:18:33,989 --> 00:18:35,741 ట్రైన్ నుండి చూస్తే వాళ్ళు ఎవరూ కనిపించరా? 224 00:18:35,991 --> 00:18:38,660 మనం స్టేషన్ లో అలాగే సొరంగంలో ఉన్న లైట్లు ఆపేద్దాం. 225 00:18:39,119 --> 00:18:41,705 అంతా అనుకున్నట్టు జరిగితే, మనకు నెల్సన్ ని షూట్ చేయడానికి వీలవుతుంది. 226 00:18:42,206 --> 00:18:43,540 అంతటితో అంతా ముగుస్తుంది. 227 00:18:46,502 --> 00:18:48,128 కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చెప్పాలంటే? 228 00:18:49,213 --> 00:18:51,924 వుల్ఫ్ ఇంకా అతని టీమ్ ట్రైన్ లోకి చొరబడాలి. 229 00:18:59,139 --> 00:19:00,474 నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. 230 00:19:04,228 --> 00:19:06,313 వుల్ఫ్ ఇంకా అతని మనుషులకు పొజిషన్ లో ఉండమని చెప్పు. 231 00:19:34,883 --> 00:19:37,970 వీటన్నిటినీ ఆధారాలతో చేర్చండి. 232 00:19:38,846 --> 00:19:39,805 సరే. 233 00:19:39,888 --> 00:19:41,265 అలాగే నాకు ఇవ్వాల్సింది ఒకటి నీ దగ్గర ఉందట… 234 00:19:41,348 --> 00:19:42,766 బాంబ్ చేసిన వాడి ఫ్లాట్ లో దొరికింది. 235 00:19:43,141 --> 00:19:44,184 మెర్రీ క్రిస్మస్. 236 00:19:51,775 --> 00:19:53,652 నాకోసం ఒక పేరుని చెక్ చేస్తావా? 237 00:19:54,278 --> 00:19:55,821 అగాథ రోబక్. 238 00:19:57,155 --> 00:19:58,824 అవును, అది పోలిష్ పేరు అనుకుంట. 239 00:19:59,867 --> 00:20:01,118 ఎదురు చూస్తాలే. 240 00:20:05,289 --> 00:20:07,374 బ్రిటిష్ ఎంబసీ సిస్ సెక్షన్ 241 00:20:17,593 --> 00:20:18,886 గ్రాహమ్? 242 00:20:18,969 --> 00:20:20,846 టాచర్. ఈ వెనక్కి నువ్వెలా వచ్చావు? 243 00:20:21,430 --> 00:20:22,598 నీకు క్లియరెన్స్ లేదు కదా. 244 00:20:22,681 --> 00:20:25,100 అవును. కానీ అది ఉన్నవారు ఒకరు నాకు తెలుసు. 245 00:20:27,603 --> 00:20:29,688 పీటర్ ఫేబర్, ఎంఐ5. 246 00:20:30,939 --> 00:20:32,232 మాకు నీ సాయం కొంచెం కావాలి. 247 00:20:32,816 --> 00:20:35,694 బెర్లిన్ లోని టెర్రర్ సంఘటన 248 00:20:35,777 --> 00:20:36,612 ఏమండీ. 249 00:20:36,695 --> 00:20:38,989 - ఏమండీ. - ఈమెకు బాలేదు. 250 00:20:41,033 --> 00:20:43,911 ఏమండీ, నా భార్య పడిపోయింది. 251 00:20:45,704 --> 00:20:47,539 - థాంక్స్. - థాంక్స్. 252 00:20:53,045 --> 00:20:54,671 నువ్వు పాలిపోయావు. 253 00:20:54,755 --> 00:20:56,673 నీకు నిజంగా పర్లేదా? 254 00:20:57,257 --> 00:21:00,636 కంగారు పడకు, ఎముకలు ఏం విరగలేదు. 255 00:21:08,644 --> 00:21:10,562 వద్దు, దయచేసి గోల చేయకు. 256 00:21:10,646 --> 00:21:12,814 స్టెఫాన్, ప్లీజ్. నాతో కూర్చో. 257 00:21:19,446 --> 00:21:24,243 యు-బాహ్న్ లో మన ప్రయాణం ఇంత ఆసక్తిగా ఉంటుందని ఊహించామా? 258 00:21:34,920 --> 00:21:37,798 క్లారా? నేను వింటర్ తో మాట్లాడాలి. 259 00:21:39,424 --> 00:21:40,676 సరే… 260 00:21:40,759 --> 00:21:42,761 వీలయితే మీరు ఒక సిగ్నల్ దాటాక నాకు చెబుతావా… 261 00:21:44,263 --> 00:21:45,931 సిగ్నల్ 168. 262 00:21:46,890 --> 00:21:49,893 సరే. అలాగే చేస్తాం. వింటర్ కి ఇవ్వు. 263 00:21:51,186 --> 00:21:52,312 నేను వచ్చా, సామ్. 264 00:21:52,396 --> 00:21:54,731 వింటర్, నేను కొన్ని విషయాలు స్పష్టం చేయాలి అనుకుంటున్నా, మేము బెర్గ్మన్ స్ట్రాసేకి 265 00:21:54,815 --> 00:21:56,859 వచ్చాక ఏం చేయాలని, సరేనా? 266 00:21:56,942 --> 00:21:58,193 చెప్పు. 267 00:21:58,277 --> 00:22:00,362 ముందుగా, అక్కడ నేను పోలీసులను చూశానంటే, 268 00:22:00,445 --> 00:22:01,613 ఎక్కడైనా సరే, 269 00:22:02,281 --> 00:22:03,782 మేము స్టేషన్ లో ఆగము. 270 00:22:04,324 --> 00:22:05,325 సరే. 271 00:22:07,411 --> 00:22:09,705 అలాగే రెండవది. 272 00:22:09,788 --> 00:22:12,708 జాన్ బెయిలీ బ్రౌన్ ఒక్కడు మాత్రమే ప్లాట్ ఫామ్ మీదకి రావాలి. 273 00:22:13,917 --> 00:22:17,212 ఈ రెండు షరతులను మీరు ఫాలో అవ్వగలిగితే, నేను ప్యాసింజర్లను వెళ్లనిస్తా, 274 00:22:17,713 --> 00:22:19,673 అలాగే బెయిలీ బ్రౌన్ ట్రైన్ ఎక్కొచ్చు. 275 00:22:20,174 --> 00:22:23,051 మంచిది. మేము ఈ కండిషన్లకు ఒప్పుకుంటున్నాం. 276 00:22:29,516 --> 00:22:30,767 ఇంకెంత సేపు? 277 00:22:33,729 --> 00:22:34,771 ఇంకొక రెండు స్టాప్ లు. 278 00:22:35,731 --> 00:22:37,232 ఆ తర్వాత బెర్గ్మన్ స్ట్రాసేనా? 279 00:22:37,316 --> 00:22:39,401 అవును, అవును, అవును, అవును. బెర్గ్మన్ స్ట్రాసే. 280 00:22:39,484 --> 00:22:40,819 ఒకప్పుడు అదే ఆఖరి స్టేషన్. 281 00:22:41,445 --> 00:22:42,946 సాధారణంగా, మేము దాన్ని చుట్టుకుని వెళ్తాము, 282 00:22:43,488 --> 00:22:47,075 కానీ వాళ్ళు ఇప్పుడు మనం నేరుగా స్టేషన్ కి వెళ్లడం కోసం పాయింట్స్ ని కలిపారు. 283 00:22:48,452 --> 00:22:51,163 క్లారా చెప్పిన ఆ సిగ్నల్ ని దాటడానికి మనకు ఎంత టైమ్ పడుతుంది? అదేంటి? 284 00:22:52,039 --> 00:22:53,123 168. 285 00:22:54,291 --> 00:22:55,459 కానీ అది… 286 00:22:56,585 --> 00:22:57,961 వింత విషయం. 287 00:22:59,922 --> 00:23:00,964 ఏంటి? 288 00:23:03,091 --> 00:23:04,343 మనం దాన్ని ఇంతకు ముందే దాటేశాం. 289 00:23:05,677 --> 00:23:07,930 అంటే, ఆమె అడగడానికి ముందే మనం దాన్ని దాటేశాం. 290 00:23:09,389 --> 00:23:11,225 మనం ఎక్కడ ఉన్నామో వాళ్ళకి తెలీదు అనుకుంట. 291 00:23:26,323 --> 00:23:30,160 సిటీలో కీల్బాస తినడానికి ఇదే బెస్ట్ చోటు అని విన్నాను. 292 00:23:31,578 --> 00:23:32,663 అలా అని నీకు ఎవరు చెప్పారు? 293 00:23:33,455 --> 00:23:34,665 నాకు పేర్లు అంత బాగా గుర్తుండవు. 294 00:23:35,666 --> 00:23:36,708 నువ్వు… 295 00:23:37,417 --> 00:23:39,002 ఈ మొహాన్ని గుర్తుపట్టగలవా? 296 00:23:43,423 --> 00:23:48,554 నీ అకౌంట్ లో 12,697 ఓపెన్ చేయని ఈమెయిల్స్ ఉన్నాయని తెలుసా? 297 00:23:50,055 --> 00:23:51,390 నాకు ఒక సిస్టమ్ ఉంది. 298 00:23:52,224 --> 00:23:54,893 సరే. ఈ ఈమెయిల్ లో 299 00:23:54,977 --> 00:23:58,522 టాచర్ కి నెల్సన్ తన దగ్గర ఉన్న ఆధారాలను పంపించాడు. 300 00:24:02,734 --> 00:24:05,320 ఆగండి. అది క్లాసిఫై చేయబడిన సమాచారం. 301 00:24:05,404 --> 00:24:06,405 పరిమితం చేయబడిన సంఘటన రిపోర్ట్ 302 00:24:06,488 --> 00:24:08,740 ఇది అంతా ఒక్కటే సోర్స్ నుండి వచ్చిందా? 303 00:24:09,992 --> 00:24:11,034 చూస్తుంటే అలాగే ఉంది. 304 00:24:11,743 --> 00:24:14,413 మెటాడేటా ప్రకారం ఒక్క ప్రదేశం నుండి వచ్చినట్టు తెలుస్తోంది. 305 00:24:14,496 --> 00:24:17,249 అయితే అది ఎవరు పంపించారో మీరు నాకు నిజంగా చెప్పలేరా? 306 00:24:17,332 --> 00:24:20,335 అంటే, వాళ్ళు తమ ఆధారాలు తెలీకుండా చాకచక్యంగా జాగ్రత్తపడ్డారు. 307 00:24:21,587 --> 00:24:24,464 నెల్సన్ కంప్యూటర్ లేకుండా అది చెప్పడం మాకు సాధ్యం కాదు. 308 00:24:26,425 --> 00:24:28,760 ఆగు. సామ్ ఫోన్ హోటల్ రూమ్ లో ఉంది, 309 00:24:29,261 --> 00:24:31,597 అలాగే అతని లాప్టాప్ అతని బ్రీఫ్ కేసులో ఉంది. 310 00:24:32,181 --> 00:24:34,016 అయితే అది జర్మన్ పోలీసుల దగ్గర ఉండి ఉంటుంది. 311 00:24:38,812 --> 00:24:40,022 నేను కొన్ని కాల్స్ చేస్తా. 312 00:24:44,693 --> 00:24:46,695 తిరస్కరించి ఎలాంటి లాభం లేదు, అగాథ. 313 00:24:49,489 --> 00:24:50,490 మేము… 314 00:24:52,451 --> 00:24:54,870 అతని అపార్ట్మెంట్ లో నీ జిమ్ సభ్యత్వ కార్డు మాకు దొరికింది. 315 00:24:55,746 --> 00:24:57,831 నన్ను చూస్తుంటే నేను జిమ్ కి వెళ్లే మనిషిలా కనిపిస్తున్నానా? 316 00:24:58,582 --> 00:25:00,751 అయినా సరే, అతను చేసే పనేంటో నీకు అర్థమై ఉంటుంది కదా? 317 00:25:01,668 --> 00:25:04,671 అతను నాకు తెలియకపోవడమే మంచిది అనేవాడు. 318 00:25:06,548 --> 00:25:07,758 నా భద్రత కోసం. 319 00:25:09,635 --> 00:25:12,221 మేము గత శుక్రవారం నుండి మాట్లాడుకోనేలేదు. 320 00:25:13,138 --> 00:25:14,181 అతను 321 00:25:15,182 --> 00:25:18,018 నేను తనని మరొక కొన్ని వారాలు కలవడం కుదరదు అని చెప్పాడు. 322 00:25:21,355 --> 00:25:22,606 అతను ఎక్కడికి వెళ్ళాడు? 323 00:25:23,398 --> 00:25:24,483 వద్దు. నేను చెప్తా. 324 00:25:24,566 --> 00:25:25,901 అతను నీకు చెప్పలేదు కదా? 325 00:25:32,241 --> 00:25:34,493 ఇవాళ ఉదయం తొమ్మిది తర్వాత బెర్లిన్ నుండి వెళ్ళిన 326 00:25:34,576 --> 00:25:36,745 ఫ్లైట్ల ప్యాసింజర్ల లిస్టు తియ్యండి. 327 00:25:36,828 --> 00:25:39,081 తూర్పు యూరప్ కి వెళ్లే వాటి నుండి మొదలెట్టండి. 328 00:25:39,540 --> 00:25:41,041 సరే, లైన్ లో ఉంటా. 329 00:25:43,418 --> 00:25:44,628 నాకు మార్కో పేరు కావాలి. 330 00:25:45,504 --> 00:25:46,505 అతని అసలు పేరు. 331 00:25:47,381 --> 00:25:50,133 లేదంటే నువ్వు వాడిని మళ్ళీ కలవడానికి కొన్ని వారాలకు బదులు ఎంతో కాలం పడుతుంది. 332 00:25:56,849 --> 00:25:58,725 మేము ఇప్పుడు బెర్గ్మన్ స్ట్రాసేకి వచ్చాము. 333 00:26:09,570 --> 00:26:11,321 పదా, నడువు. 334 00:26:36,930 --> 00:26:38,599 ట్రాన్స్పోర్ట్ వారు 20 నిమిషాలు అంటున్నారు. 335 00:26:39,683 --> 00:26:41,185 ఒకరికి మాత్రం ఎప్పుడు జరుగుతుందా అని ఉంది. 336 00:26:41,268 --> 00:26:42,269 దరిద్రం వదిలింది. 337 00:26:43,020 --> 00:26:46,190 జరిగిన దాదాపు 100 గంటల ఇంటర్వ్యూలలో, నేను అతన్ని అలా ఎప్పుడూ చూడలేదు. 338 00:26:51,195 --> 00:26:53,572 బాంబు చేసిన వాడి పేరు జోజెఫ్ కమిన్స్కి. 339 00:26:54,072 --> 00:26:56,116 జోజెఫ్ లో జె ఉంటుంది. 340 00:26:57,868 --> 00:26:59,077 ఎవరైనా మ్యాచ్ అయ్యారా? 341 00:26:59,828 --> 00:27:00,829 అద్భుతం. 342 00:27:01,163 --> 00:27:03,665 ఆ ఫ్లైట్ వార్సాకి ఎప్పుడు వెళ్ళింది? 343 00:27:07,085 --> 00:27:08,504 ఆహ్, అయితే ఎప్పుడు వెళ్తుంది? 344 00:27:12,758 --> 00:27:14,176 బ్రాండెన్బర్గ్ నుండా? 345 00:27:15,552 --> 00:27:16,470 ఛ. 346 00:27:22,893 --> 00:27:25,395 ఈ చోటు ఏంటి? హేయ్! 347 00:27:27,648 --> 00:27:29,399 ఒక బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్… 348 00:27:30,484 --> 00:27:32,528 ఇది కొంచెం అతిగా అనిపించడం లేదు? 349 00:27:33,028 --> 00:27:36,448 అయినా ఇది నాకెందుకు? హేయ్? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? 350 00:27:36,532 --> 00:27:38,325 నోరు మూసుకో! ఇది నీ మంచికే. 351 00:27:39,076 --> 00:27:40,118 నీ చేతులు నాకు ఇవ్వు. 352 00:27:51,421 --> 00:27:54,591 బెర్గ్మన్ స్ట్రాసే 353 00:28:05,978 --> 00:28:08,021 ఇక సెక్యూర్ కామ్స్ కి మారుదాం. 354 00:28:10,190 --> 00:28:11,191 డ్రైవర్ 355 00:28:21,243 --> 00:28:24,246 చూస్తుంటే బెర్గ్మన్ స్ట్రాసే మొత్తం జి.ఎస్.జి9 వాళ్ళు ఉన్నారంట. 356 00:28:37,259 --> 00:28:38,468 వింటర్? 357 00:28:39,386 --> 00:28:40,888 సరే, నేను నా మనసు మార్చుకున్నాను. 358 00:28:44,057 --> 00:28:45,058 ఏంటి? 359 00:28:48,020 --> 00:28:51,940 బెయిలీ బ్రౌన్ నా చేతికి అందేవరకు నేను ప్యాసింజర్లను దించను. 360 00:28:52,024 --> 00:28:54,526 - నువ్వు ఏం చేస్తున్నావు? - ఆగు. ఆగు. 361 00:28:57,487 --> 00:28:58,822 నేను ఇది నమ్మలేకపోతున్నాను! 362 00:29:03,118 --> 00:29:04,244 సరే. 363 00:29:05,996 --> 00:29:06,997 నేను కూడా అదే అనుకున్నా. 364 00:29:07,748 --> 00:29:08,957 ఏంటి? 365 00:29:12,252 --> 00:29:13,420 ట్రైన్ ని ఆపు. 366 00:29:13,504 --> 00:29:15,130 - సామ్. - వద్దు. వద్దు, వద్దు. 367 00:29:15,214 --> 00:29:16,882 - కాసేపు ట్రైన్ ని ఆపు. - ఆపనా? 368 00:29:16,965 --> 00:29:17,966 ఆపు. 369 00:29:18,926 --> 00:29:19,927 ఆపుతున్నాను. 370 00:29:35,484 --> 00:29:37,069 ఎందుకు ఇంత టైమ్ పడుతోంది? 371 00:29:39,196 --> 00:29:40,864 అంతా బాగానే ముగుస్తుంది. 372 00:29:42,908 --> 00:29:46,537 త్వరలోనే నువ్వు నీ కుటుంబం దగ్గరకి వెళ్తావు. 373 00:30:02,135 --> 00:30:04,721 ఆమె ట్రైన్ మీదకి దాడి చేయాలని ప్లాన్ చేస్తోంది అనుకుంటున్నావా? 374 00:30:04,805 --> 00:30:07,599 ఆమె సాధారణంగా ఎవడూ ఒప్పుకోలేని అసాధ్యమైన కండిషన్ కి ఒప్పుకుంది అంటే 375 00:30:07,683 --> 00:30:09,768 మనల్ని రప్పించడానికి ప్లాన్ చేస్తోందని అర్థం. 376 00:30:10,811 --> 00:30:13,021 ఆమె మనకోసం పోలీసులను రెడీగా ఉంచింది. 377 00:30:13,105 --> 00:30:14,356 మరి మన ప్రత్యామ్నాయం ఏంటి? 378 00:30:16,316 --> 00:30:18,819 మనం స్టేషన్ కి వెళ్లకపోతే, వాడు ఈ ట్రైన్ ని పేల్చేస్తాడు. 379 00:30:19,486 --> 00:30:22,030 వాళ్ళు మన మీద హఠాత్తుగా దాడి చేయడం వల్ల మన చేతికి 380 00:30:22,114 --> 00:30:24,074 జాన్ బెయిలీ బ్రౌన్ అందకపోయినా ఖచ్చితంగా ట్రైన్ ని పేల్చేస్తాడు. 381 00:30:25,450 --> 00:30:27,494 కానీ బెర్గ్మన్ స్ట్రాసే దాటి ముందుకు వెళ్లలేం. 382 00:30:27,578 --> 00:30:29,371 ఆకస్మిక దాడి జరిగే అవకాశం ఉండి కూడా మనం అక్కడికి వెళితే… 383 00:30:30,247 --> 00:30:31,415 మనం బయటపడలేం. 384 00:30:32,040 --> 00:30:33,584 తప్పించుకోవడానికి దారి లేదు. 385 00:30:40,507 --> 00:30:43,468 ఆగు, కంట్రోల్ రూమ్ వాళ్ళు మనం ఎక్కడ ఉన్నామో చూడలేరు అన్నావు కదా? 386 00:30:43,969 --> 00:30:45,179 అంతే అనిపిస్తోంది. 387 00:30:46,263 --> 00:30:47,764 నాకు తెలిసి… 388 00:30:47,848 --> 00:30:49,933 పేలుడు వల్ల ఎలెక్ట్రానిక్స్ పాడైనట్టు ఉన్నాయి. 389 00:30:50,017 --> 00:30:51,185 వాళ్లకు ఏమీ తెలీడం లేదా? 390 00:30:52,311 --> 00:30:53,312 అవును. 391 00:30:53,395 --> 00:30:57,566 అయితే మనం వాళ్ళ ఉచ్చు నుండి పక్కకి అడుగు వేస్తే తప్పించుకోగలం. 392 00:32:33,745 --> 00:32:35,080 ఛ. 393 00:32:39,168 --> 00:32:40,919 పరిస్థితి మన చెయ్ దాటుతోంది. 394 00:32:41,003 --> 00:32:42,921 బహుశా ఇప్పుడు పరిస్థితిని కాస్త తీవ్రం చేస్తే మంచిదేమో. 395 00:32:48,594 --> 00:32:51,138 అయితే, ఇక పరిస్థితి ఎలా తయారైనా, మేము… 396 00:32:51,763 --> 00:32:54,516 మేము తిరిగి నీ దగ్గరకు రాలేము. కాబట్టి నేను చెప్పిన వెంటనే, 397 00:32:54,600 --> 00:32:58,520 నువ్వు మమ్మల్ని పాయింట్స్ కి వచ్చి ఎక్కించుకో, అప్పుడు మనం బెర్గ్మన్ స్ట్రాసే దాటి వెళ్ళిపోదాం. 398 00:32:58,604 --> 00:33:00,189 సరే. వస్తాను. 399 00:33:12,492 --> 00:33:14,328 దాడి చేసే టీమ్ మొదటి పొజిషన్ కి వెళ్తోంది. 400 00:33:19,917 --> 00:33:21,543 మరి ప్యాసింజర్ల సంగతి ఏంటి? 401 00:33:22,211 --> 00:33:24,755 అలా అయితే వాళ్ళు… ఏమో… పిచ్చి ప్రశ్నలు ఏమీ అడగకపోతే… 402 00:33:24,838 --> 00:33:27,841 మేము వెళ్లినట్టు కూడా వాళ్ళకి తెలీదు. సరేనా? వాళ్ళను ప్రశాంతంగా ఉంచు. 403 00:33:47,319 --> 00:33:48,779 ఆ ట్రైన్ ఈ పాటికి వచ్చి ఉండాలి. 404 00:33:50,906 --> 00:33:52,074 క్లారా. 405 00:33:52,908 --> 00:33:54,117 సామ్ కి కాల్ చెయ్. 406 00:33:57,538 --> 00:33:58,872 సామ్? 407 00:33:59,831 --> 00:34:01,083 అక్కడ ఉన్నావా? 408 00:34:02,459 --> 00:34:03,502 సామ్? 409 00:34:04,670 --> 00:34:06,046 ఓహ్, అబ్బా. 410 00:34:07,548 --> 00:34:08,465 ప్లీజ్, వద్దు. 411 00:34:10,467 --> 00:34:11,760 సామ్? 412 00:34:13,719 --> 00:34:15,013 ఏంటి? 413 00:34:15,848 --> 00:34:17,808 జాన్ బెయిలీ బ్రౌన్ ప్లాట్ ఫామ్ మీదకి వచ్చాడు. 414 00:34:18,516 --> 00:34:20,018 మేము హ్యాండోవర్ చేయడానికి రెడీగా ఉన్నాం. 415 00:34:21,186 --> 00:34:22,646 క్లారా, సిద్ధంగా ఉండండి. 416 00:34:23,856 --> 00:34:26,525 ఆ స్టేషన్ అటువైపు 300 మీటర్ల దూరంలో ఉంది కదా? 417 00:34:26,608 --> 00:34:27,650 అయితే పాయింట్స్ దగ్గరలో ఉండి ఉంటాయి. 418 00:34:29,570 --> 00:34:31,822 సామ్, ఎక్కడ ఉన్నావు? 419 00:34:32,489 --> 00:34:34,949 ఇప్పుడే సిగ్నల్ 168 దాటుతున్నాం. 420 00:34:40,746 --> 00:34:43,041 వుల్ఫ్, ట్రైన్ ఇప్పుడు స్టేషన్ దగ్గరకు వస్తోంది. 421 00:34:43,125 --> 00:34:44,376 మీకు కనిపిస్తుందా? 422 00:34:46,628 --> 00:34:47,963 లేదు. 423 00:34:56,929 --> 00:34:58,348 చీకటి పడుతోంది. 424 00:35:03,520 --> 00:35:06,106 వాళ్ళు ఏ క్షణమైనా ట్రైన్ స్టేషన్ కి రావొచ్చు అని చూస్తూ ఉంటారు. 425 00:35:14,281 --> 00:35:15,365 క్రాంక్ హ్యాండిల్. 426 00:35:16,617 --> 00:35:17,618 సరే. 427 00:35:17,701 --> 00:35:18,702 అక్కడే. 428 00:35:39,723 --> 00:35:40,724 సామ్? 429 00:35:42,768 --> 00:35:44,061 అబ్బా, ఛ. 430 00:35:44,853 --> 00:35:46,063 సామ్? 431 00:35:47,564 --> 00:35:48,732 ఏమైంది? 432 00:35:49,274 --> 00:35:52,152 ఆ ముసలావిడ. ఆమెకు ఏమైందో నాకు తెలీదు, 433 00:35:52,236 --> 00:35:53,904 కానీ ఆమెకు వైద్య సాయం కావాలి. 434 00:35:59,660 --> 00:36:00,827 నాకు ప్రథమ చికిత్స చేయడం తెలుసు. 435 00:36:02,704 --> 00:36:03,747 తప్పుకోండి. 436 00:36:06,625 --> 00:36:07,709 చూసుకోండి. 437 00:36:10,128 --> 00:36:11,338 మనం ఎందుకు ఆగాము? 438 00:36:13,215 --> 00:36:14,216 ఏం జరుగుతోంది? 439 00:36:19,054 --> 00:36:21,682 ఏమండీ. నేను ఇక్కడ ఇంచార్జ్ తో మాట్లాడాలి, ప్లీజ్. 440 00:36:30,566 --> 00:36:31,692 ఇంకెంతో సేపు పట్టదు. 441 00:36:32,359 --> 00:36:34,361 వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు ఇంకా తెలీదు. 442 00:36:40,742 --> 00:36:43,787 వుల్ఫ్, మీకు ట్రైన్ కనిపిస్తుందా? 443 00:36:46,331 --> 00:36:47,332 లేదు. 444 00:36:48,041 --> 00:36:49,877 ముందుకు వెళ్ళండి… 445 00:36:49,960 --> 00:36:51,420 కానీ జాగ్రత్తగా ఉండండి. 446 00:36:53,338 --> 00:36:54,965 అర్థమైంది. 447 00:36:55,924 --> 00:36:57,718 బ్రావో టీమ్. మీ పొజిషన్ లో ఉండండి. 448 00:37:08,562 --> 00:37:10,606 మేము ముందుకు వెళ్ళొచ్చా? దయచేసి అడ్డు తొలగండి! 449 00:37:10,689 --> 00:37:12,274 - అక్కడే. - అడ్డు లేవండి. 450 00:37:13,650 --> 00:37:15,152 నేను అక్కడికి వెళ్ళాలి. 451 00:37:16,153 --> 00:37:17,237 సరే. 452 00:37:20,157 --> 00:37:21,366 ఏమైంది? 453 00:37:21,450 --> 00:37:22,409 ఈమె పడిపోయింది… 454 00:37:26,413 --> 00:37:28,707 నా భర్త ఇంకా ఆ ట్రైన్ లో ఉన్నాడు… 455 00:37:29,791 --> 00:37:32,669 మీరు నేను చెప్పేది సీరియస్ గా పరిగణించాలి! 456 00:37:32,753 --> 00:37:34,588 అవును, నా బిడ్డ అందులో లేడని నాకు తెలుసు. 457 00:37:34,671 --> 00:37:36,381 నేను మీకు అదే వివరించడానికి ట్రై చేస్తున్నా. 458 00:37:36,465 --> 00:37:39,885 నేను అక్కడికి వెళ్లాను, ఆ హైజాకర్ నాకు ఇది ఇచ్చాడు. 459 00:37:44,014 --> 00:37:45,224 ఏం ఇచ్చాడు? 460 00:37:53,482 --> 00:37:54,608 క్షమించండి. 461 00:37:57,027 --> 00:37:58,487 ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. 462 00:37:58,820 --> 00:38:01,198 ఏంటి? ఏంటి! 463 00:38:07,287 --> 00:38:08,830 నన్ను క్షమించండి. 464 00:38:25,889 --> 00:38:27,474 సరే, ఒట్టో. పని పూర్తయింది. 465 00:38:29,852 --> 00:38:30,978 ఒట్టో, స్పందించు. 466 00:38:34,690 --> 00:38:36,483 ఒట్టో, బయలుదేరు. మేము నీకోసం రెడీగా ఉన్నాం. 467 00:38:39,194 --> 00:38:40,612 నాకు ఏదో కనిపిస్తోంది… 468 00:38:41,780 --> 00:38:43,156 ఒట్టో, అక్కడ ఉన్నావా? 469 00:38:43,240 --> 00:38:45,576 ఏదో కదులుతోంది. కానీ ట్రైన్ ఆనవాళ్లు ఏమీ లేవు. 470 00:38:46,326 --> 00:38:47,911 అక్కడికి వెళ్లి అదేంటో చూడండి. 471 00:38:48,161 --> 00:38:50,122 మనల్ని సురక్షితంగా ఉంచుతాం అన్నారు. 472 00:38:50,956 --> 00:38:52,416 కానీ ఇప్పుడు ఇంకొకరు చనిపోయారు. 473 00:38:54,585 --> 00:38:56,587 నేను వాళ్ళకి చెప్తాను. నేను అది మాత్రమే చేయగలను. 474 00:38:59,047 --> 00:39:01,425 చూడటానికి నువ్వు వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నట్టు ఉన్నావు. 475 00:39:01,508 --> 00:39:03,051 నా నుండి మీకేం కావాలి? 476 00:39:05,888 --> 00:39:07,681 నేను ప్రాణాలతో ఉండటానికి ట్రై చేస్తున్నా! 477 00:39:11,310 --> 00:39:12,561 మీ అందరిలాగే. 478 00:39:19,318 --> 00:39:20,402 అది ట్రైన్ లోదా? 479 00:39:21,486 --> 00:39:22,946 నెల్సన్ దీన్ని ఆ తల్లికి ఇచ్చాడు. 480 00:39:24,031 --> 00:39:26,450 ఇది డ్రైవర్ క్యాబ్ లోని కెమెరాలో రికార్డు అయింది. 481 00:39:28,911 --> 00:39:30,579 వాళ్ళు మనకి ఏదో చూపించాలి అనుకుంటున్నారు… 482 00:39:31,079 --> 00:39:32,331 కానీ ఏంటి? 483 00:39:35,083 --> 00:39:36,084 మనం కొంచెం ముందుకు వెళ్ళొచ్చా? 484 00:39:49,056 --> 00:39:50,432 సొరంగంలో మనుషులు ఉన్నారు. 485 00:39:51,725 --> 00:39:54,436 ట్రైన్ బయటా? వాళ్ళు ఎవరో చూడగలవా? 486 00:39:55,103 --> 00:39:57,231 లేదు. గమనిస్తున్నాం. 487 00:39:59,858 --> 00:40:01,485 వారిలో ఒకరు టాంగో 1. 488 00:40:02,236 --> 00:40:04,905 అతను గుర్తుతెలియని మహిళతో ఉన్నాడు. 489 00:40:05,155 --> 00:40:06,990 వుల్ఫ్ సొరంగంలో నెల్సన్ ని చూసాను అంటున్నాడు. 490 00:40:07,282 --> 00:40:10,285 ఏంటి? సొరంగంలో నెల్సన్ ఉన్నాడా? 491 00:40:13,038 --> 00:40:14,456 వాడు దేనికోసం ఆగుతున్నాడు? 492 00:40:18,126 --> 00:40:20,128 వుల్ఫ్, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడగలవా? 493 00:40:22,297 --> 00:40:24,132 ఉండండి. దగ్గరకి వెళ్తున్నా. 494 00:40:30,430 --> 00:40:31,557 సరే. 495 00:40:31,640 --> 00:40:33,267 - వెళ్తూనే ఉండండి! - అవును, అవును! 496 00:40:34,351 --> 00:40:35,227 అదేంటి? 497 00:40:36,103 --> 00:40:38,021 అది చనిపోయిన ప్యాసింజరా? 498 00:40:43,068 --> 00:40:44,236 అది ఎవరు? 499 00:40:48,490 --> 00:40:49,992 మీరు ఇది చూడాలి! 500 00:40:53,078 --> 00:40:54,872 నెల్సన్ తో కలిసి ఇంకొకరు పని చేస్తున్నారు. 501 00:40:55,747 --> 00:40:56,957 అక్కడ పాజ్ చెయ్. 502 00:40:57,958 --> 00:40:59,501 అది సొరంగంలో ఉన్న మహిళా? 503 00:41:02,838 --> 00:41:05,883 ఆ మహిళ మనకు శత్రువు అయి ఉండొచ్చు. మాకు ఆమెను పూర్తిగా వివరించండి. 504 00:41:06,592 --> 00:41:08,844 యావరేజ్ ఎత్తు, 30ల మధ్యలో ఉంది, చూడటానికి కష్టంగా ఉంది… 505 00:41:10,387 --> 00:41:11,722 అలాగే ఉండండి… 506 00:41:13,223 --> 00:41:14,725 ఎవరక్కడ? 507 00:41:14,808 --> 00:41:15,809 ఛ. 508 00:41:16,393 --> 00:41:18,854 చేతులు పైకి ఎత్తండి! వెంటనే! 509 00:41:19,229 --> 00:41:20,898 వుల్ఫ్, ఏం జరుగుతోంది? 510 00:41:22,399 --> 00:41:25,110 వద్దు! లేదంటే నేను ఈమెను చంపేస్తా. వద్దు! 511 00:41:25,194 --> 00:41:27,112 ప్లీజ్. కాల్చకండి! 512 00:41:27,196 --> 00:41:28,697 ఆమెను మానవ కవచంగా వాడుతున్నాడు. 513 00:41:29,281 --> 00:41:30,699 ఆమెను బందీగా తీసుకున్నాడు. 514 00:41:31,617 --> 00:41:32,868 ఛ. 515 00:41:34,953 --> 00:41:38,081 ఒట్టో. ఒట్టో, ఆ చెత్త ట్రైన్ ని తీసుకురా. వెంటనే ట్రైన్ ని తీసుకురా. 516 00:41:39,082 --> 00:41:41,168 వుల్ఫ్, మాకు ఎవరో చెప్పు! 517 00:41:44,379 --> 00:41:46,673 పోనీటైల్… పర్కా జాకెట్… 518 00:41:47,508 --> 00:41:48,842 అది ఆమెనే! 519 00:41:49,259 --> 00:41:50,844 నెల్సన్ బందీగా తీసుకున్న మహిళ… 520 00:41:50,928 --> 00:41:52,262 …అది ఆమెనే! 521 00:41:54,014 --> 00:41:55,557 ఏం చేయాలో చెప్పండి, వెంటనే! 522 00:41:57,017 --> 00:41:58,685 అవకాశం ఉంటే షూట్ చేయమనండి. 523 00:41:58,769 --> 00:42:00,604 - కానీ సామ్ ఇంకా… - షూట్ చేయండి! 524 00:42:02,397 --> 00:42:03,607 అనుమతి ఇస్తున్నాం. 525 00:42:11,406 --> 00:42:14,701 నేను నీతిమంతుడిగా ఉండటానికి ట్రై చేస్తా 526 00:42:15,536 --> 00:42:18,247 రోజూ ప్రభువుతో మాట్లాడతా 527 00:42:19,748 --> 00:42:22,876 కొన్నిసార్లు ప్రపంచం నాకు అన్యాయం చేయొచ్చు 528 00:42:23,502 --> 00:42:26,630 నేను మంచి మార్గంలోనే ఉంటా దారి తప్పిపోను 529 00:42:27,673 --> 00:42:31,844 నేను ఉక్రోషానికి గురైనప్పుడు నా ఫీలింగ్స్ మండవచ్చు 530 00:42:31,927 --> 00:42:35,848 నేను మనిషిని అవుతా, మనిషిగా ఉంటా కానీ ఇంతకు ముందులా ఉండవు 531 00:42:35,931 --> 00:42:38,892 నువ్వు నాతో న్యాయంగా వ్యవహరించకపోతే 532 00:42:40,227 --> 00:42:42,855 నేను నిన్ను దెబ్బ తీయొచ్చు 533 00:42:43,856 --> 00:42:45,315 అది పాపం కాదా 534 00:42:47,943 --> 00:42:50,320 అది పాపం కాదా 535 00:42:53,115 --> 00:42:55,993 లోలోపల బలాన్ని కనిపెట్టడానికి ట్రై చేస్తా 536 00:42:57,286 --> 00:43:00,247 నా ఆత్మని అదుపుతప్పకుండా ఉంచడానికి 537 00:43:01,081 --> 00:43:04,877 నేను ఉక్రోషానికి గురైనప్పుడు నా ఫీలింగ్స్ మండవచ్చు 538 00:43:04,960 --> 00:43:07,171 నేను మనిషిని అవుతా, మనిషిగా ఉంటా… 539 00:43:07,504 --> 00:43:09,506 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్