1 00:00:30,656 --> 00:00:35,118 నువ్వు వెళ్లిపోతున్నావు నా దేవదూత 2 00:00:35,202 --> 00:00:39,748 నువ్వు దూరంగా వెళ్లిపోతున్నావు 3 00:00:41,416 --> 00:00:45,462 నా ఆత్మని క్షోభ పెట్టి నన్ను వదిలి వెళ్లిపోతున్నావు 4 00:00:45,546 --> 00:00:50,467 నా గుండెని గాయం చేస్తూ వెళ్లిపోతున్నావు 5 00:00:51,677 --> 00:00:53,846 నువ్వు వెళ్లిపోతున్నావు… 6 00:00:53,929 --> 00:00:55,556 నువ్వు దానిని చీమిడితో నింపేసేలా ఉన్నావు. 7 00:00:57,391 --> 00:00:58,392 ఇంక ఏడవడం ఆపేయ్. 8 00:01:02,312 --> 00:01:09,319 నీ ప్రేమ మిగిల్చిందల్లా ఎప్పటికీ మర్చిపోలేని మధురస్మృతులు మాత్రమే 9 00:01:14,658 --> 00:01:16,743 నాన్నా. అమ్మా, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 10 00:01:16,827 --> 00:01:17,828 హలో… 11 00:01:20,747 --> 00:01:23,333 -సరే… -కోలుకోవడం చాలా కష్టమైంది… 12 00:01:23,417 --> 00:01:25,419 అదే ఆయనని విశ్రాంతి తీసుకునేలా చేస్తుందేమో. 13 00:01:31,717 --> 00:01:33,719 -నువ్వు బాగానే ఉన్నావా, నాన్నా? -బాగున్నా, స్వీటీ. 14 00:01:34,219 --> 00:01:35,846 థాంక్స్. నేను బాగానే ఉన్నాను. 15 00:01:37,014 --> 00:01:38,891 ఇప్పుడు మీరందరూ నా వైపు దృష్టి సారించారు. 16 00:01:39,558 --> 00:01:41,727 నా మిత్రుడి గురించి నేను అన్ని విషయాలు మీతో చెప్పాలని అనుకుంటున్నాను. 17 00:01:42,936 --> 00:01:46,064 జోస్ లూయిస్ ఒక బద్ధకపు మనిషి. 18 00:01:46,148 --> 00:01:47,065 నేను నిజంగానే అంటున్నాను… 19 00:01:47,149 --> 00:01:49,902 పూర్తి స్పృహతో చెప్తున్నాను, మిత్రమా, దయచేసి ఏమీ కోపగించుకోకు. 20 00:01:50,444 --> 00:01:55,199 అతను హడావుడి లేని జీవితాన్ని చాలా ఆస్వాదించేవాడు. 21 00:01:55,741 --> 00:01:58,202 అతను తన అంబులెన్స్ సైరన్ ని కూడా 22 00:02:00,162 --> 00:02:01,246 ఈ విధంగా ధ్వనించేలా చేసుకున్నాడు… 23 00:02:06,210 --> 00:02:07,586 అతని మాదిరిగానే, నీరసంగా ఉంటుంది. 24 00:02:07,669 --> 00:02:11,173 కానీ అతని 'నిదానమైన' జీవనశైలి వల్లనే తన పిల్లలని బాగా పెంచగలిగాడు. 25 00:02:12,174 --> 00:02:16,470 ఇంకా అకపుల్కో నగరాన్ని వందసార్లు పైగా సందర్శించగలిగాడు. 26 00:02:16,553 --> 00:02:18,347 సముద్రతీరాన్ని కొంతకాలంగా నేనే చూడలేకపోయాను… 27 00:02:18,430 --> 00:02:19,681 కానీ అతను మమ్మల్ని ఎప్పుడూ తీసుకెళ్లలేదు. 28 00:02:19,765 --> 00:02:24,061 దాదాపు మరణానుభూతి నుంచి బయటపడ్డ నేను, నా మిత్రుడి గురించి ఆలోచించాను ఇంకా… 29 00:02:24,811 --> 00:02:27,814 ఒక పారామెడిక్ గా ఆయన చేసిన విశేషమైన సేవల్ని గుర్తుచేసుకున్నాను. 30 00:02:27,898 --> 00:02:30,150 జనం ప్రాణాలు కాపాడుతూ నువ్వు ప్రాణాలు వదిలావు, మిత్రమా. 31 00:02:32,110 --> 00:02:33,654 మనం ఎప్పుడు రిటైర్ కావాలో మనకి తెలియాలి. 32 00:02:37,115 --> 00:02:40,452 పోరాటం నుండి ఎప్పుడు నిష్క్రమించాలో ఒక నిజమైన యోధుడికి తెలియాలి. 33 00:02:40,536 --> 00:02:42,496 దీని అర్థం ఆయన అంబులెన్స్ నుండి రిటైర్ అయిపోతాడా? 34 00:02:42,579 --> 00:02:44,790 ఆయన రిటైర్ కావాలి. ఆయన రిటైర్ కావాలి. 35 00:02:44,873 --> 00:02:49,169 ఆ కారణంగానే నాకు గుండె ఆపరేషన్ అయిన తరువాత, 36 00:02:49,920 --> 00:02:53,173 మరణాన్ని దగ్గరగా చూస్తూ, 37 00:02:54,800 --> 00:02:56,510 నేను మీ అందరికీ ఒక ప్రకటన చేయాలి అనుకుంటున్నాను. 38 00:02:57,135 --> 00:02:58,595 వద్దు, వద్దు, వద్దు, వద్దు… 39 00:03:04,059 --> 00:03:05,269 నేను తిరిగి పనిలో చేరుతున్నాను. 40 00:03:05,352 --> 00:03:07,020 ఓహ్, దేవుడా. భలే మనిషి. 41 00:03:07,104 --> 00:03:09,690 నా అంబులెన్స్ వృత్తిలోకి తిరిగి వెళ్తున్నాను. 42 00:03:10,941 --> 00:03:13,443 నా బద్ధకపు మిత్రుడి స్మృతికి ఇది నేను అర్పించే నివాళి. 43 00:03:13,527 --> 00:03:14,820 ఓహ్, చెత్త. 44 00:03:14,903 --> 00:03:16,196 అదీ మా నాన్నంటే! 45 00:03:16,780 --> 00:03:18,282 నోరు మూసుకో, పిల్లాడా. 46 00:03:58,322 --> 00:04:00,240 మిడ్ నైట్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ స్ఫూర్తితో 47 00:04:21,011 --> 00:04:22,596 నువ్వు మరింత బలంగా తయారవుతున్నావు, రమోన్. 48 00:04:23,889 --> 00:04:25,098 మరింత దృఢంగా ఇంకా మరిన్ని కండలతో. 49 00:04:26,308 --> 00:04:27,518 బలమైన కండలు! 50 00:05:05,931 --> 00:05:08,809 ప్రలోభాలకి లోను కావద్దు, రమోన్. 51 00:05:10,060 --> 00:05:11,061 ఏంటి సంగతి? 52 00:05:11,562 --> 00:05:13,897 నువ్వు ఇంకా లెటీ సాయంత్రం వేళల్లో రన్నింగ్ కోసం వెళ్తుంటారు కదా? 53 00:05:13,981 --> 00:05:15,399 అవును, ప్రతి రోజూ వెళతాం! 54 00:05:15,482 --> 00:05:17,609 కానీ నా పనుల మధ్యలో సమయం దొరికితే, 55 00:05:17,693 --> 00:05:19,987 నేను ఉదయం పూటలు కూడా వ్యాయామం చేస్తాను, రమోన్. 56 00:05:20,070 --> 00:05:22,823 నేను జిమ్ కి వెళ్తాను, కొద్దిగా బరువులు ఎత్తుతాను, కాస్త బాక్సింగ్ చేస్తాను. 57 00:05:23,824 --> 00:05:26,076 హేయ్, నిజానికి, నువ్వు కూడా నాతో పాటు రావచ్చు. 58 00:05:26,577 --> 00:05:29,288 బరువులు ఎత్తడం లాంటివి చేయచ్చు. 59 00:05:29,788 --> 00:05:32,040 నీ ఖాళీ సమయాలలో నువ్వు రన్నింగ్ చేయచ్చు కదా? 60 00:05:32,541 --> 00:05:34,585 నా ఒళ్లు ఇప్పటికే అలసిపోయింది. 61 00:05:36,670 --> 00:05:38,380 నీ గురించి నువ్వు అలా అనుకోనక్కరలేదు, బాబు! 62 00:05:40,132 --> 00:05:42,885 నీకు నిజంగా అర్థం కావడం లేదు, కదా? లేదా నువ్వు నాతో పరాచికాలు ఆడుతున్నావా? 63 00:05:43,594 --> 00:05:46,430 రమోన్, చూడు, మనందరం ఏదో ఒక దశలో పతనాన్ని చూస్తాం. 64 00:05:46,513 --> 00:05:47,723 దాని వల్ల నీకు జరిగే మంచి ఏమిటో తెలుసా? 65 00:05:47,806 --> 00:05:49,224 అందులోని ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? 66 00:05:49,308 --> 00:05:51,810 ఒకసారి పతనం అయితే, మనకి ఇక మిగిలిన ఒకే ఒక్క దారి ఎగువ వైపు వెళ్లడమే. 67 00:05:52,311 --> 00:05:54,563 దేవుడు నాకు సాయం చేశాడు, చాలా సాయం చేశాడు. 68 00:05:54,646 --> 00:05:55,898 దేవుడిని స్తుతించెదను! 69 00:05:55,981 --> 00:05:58,317 ఆయన నీకు కూడా సాయం చేస్తాడు, కానీ నువ్వు ఆయనని కోరుకోవాలి. 70 00:05:58,817 --> 00:06:00,986 నువ్వు ఇప్పటికే నన్ను బాప్టయిజ్ చేసేశావు, అవును కదా, ఫాదర్? 71 00:06:01,069 --> 00:06:02,988 నీకు ఇంకేం కావాలి? నన్ను ఇలా ఒంటరిగా వదిలేయ్. 72 00:06:04,573 --> 00:06:06,283 నేను అది లెటీ కోసం చేశాను, చాంపియన్. 73 00:06:16,126 --> 00:06:18,295 నువ్వు పెద్ద మూర్ఖుడివి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు! 74 00:06:18,795 --> 00:06:20,547 నువ్వు నాకు సాయం చేస్తావని ప్రిన్సిపాల్ చెప్పారు. 75 00:06:20,631 --> 00:06:22,466 కానీ, నేను స్కూలులో బాగా చదువుతాను. 76 00:06:22,549 --> 00:06:25,219 కానీ నన్ను మాత్రమే ఇలా శిక్షిస్తున్నారు. 77 00:06:25,761 --> 00:06:27,596 ఈ విషయం ఆయనకి చెప్పు. నన్ను ఏం చేయమంటావు? 78 00:06:29,932 --> 00:06:33,310 గుణింతాలని నువ్వు ఎలిమెంటరీ స్కూలులోనే నేర్చుకోవాలి, 79 00:06:33,393 --> 00:06:34,937 మిడిల్ స్కూలులో కాదు! 80 00:06:35,020 --> 00:06:38,065 కానీ నేను ఏడో తరగతి నుండే చదువు మొదలు పెట్టాను. ఇప్పుడు నేను వెళ్లాలి. 81 00:06:38,148 --> 00:06:39,566 నువ్వు వెళ్లడానికి వీల్లేదు. 82 00:06:40,108 --> 00:06:42,152 నువ్వు ఫెయిల్ అయితే నాకు అదనపు మార్కులు రావు! 83 00:06:42,236 --> 00:06:46,406 -నేను పనికి వెళ్లాలి. చదువుకి టైమ్ లేదు. -డూడ్, పనా? నిజంగానా? ఏం పని? 84 00:06:46,990 --> 00:06:50,786 అది రహస్యం, ఇంకా నా రహస్యాలని వాగుడుకాయలకి నేను చెప్పను. 85 00:06:50,869 --> 00:06:52,079 నేను వాగుడుకాయని కాను. 86 00:06:52,162 --> 00:06:54,122 అయితే అప్పుడు ఆ నర్సు ఇంకా జిమ్ కోచ్ కలిసి స్టో రేజ్ గదిలో 87 00:06:54,206 --> 00:06:55,707 సరసాలు ఆడుతున్నారని ప్రిన్సిపాల్ కి ఎవరు చెప్పారు? 88 00:06:56,959 --> 00:07:00,295 కానీ నేను అబద్ధాలు చెప్పను లేదా మా అమ్మకి నిరాశ కలిగించను. 89 00:07:00,921 --> 00:07:02,172 నేను అబద్ధాలు చెప్పేవాడిని కాను! 90 00:07:03,215 --> 00:07:04,466 నా ఉద్దేశం నేను కొన్నిసార్లు అబద్ధాలు ఆడతా… 91 00:07:05,425 --> 00:07:07,678 ఇంకా మా అమ్మ గురించి మాట్లాడకు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. 92 00:07:07,761 --> 00:07:09,930 అయితే, నువ్వు ఏం పని చేస్తున్నావో నాకు చెబితే 93 00:07:10,013 --> 00:07:11,265 నీకు ఈసారి నేను నిజంగానే సాయం చేస్తాను. 94 00:07:12,140 --> 00:07:13,475 నువ్వు ఎవ్వరికీ ఆ విషయం చెప్పవు కదా? 95 00:07:14,226 --> 00:07:15,227 చెప్పను ప్రామిస్. 96 00:07:18,814 --> 00:07:20,649 నేను పారామెడిక్ ని… 97 00:07:21,149 --> 00:07:22,776 పారామెడికా? 98 00:07:24,862 --> 00:07:27,072 భూకంపం వచ్చినప్పుడు నేను కొందరి ప్రాణాల్ని కూడా కాపాడాను. 99 00:07:29,616 --> 00:07:32,494 నాకు చూపించు 100 00:07:38,917 --> 00:07:43,297 తన షిఫ్ట్ ని నన్ను చూడమని నా మిత్రుడు నన్ను, నన్ను అడిగాడు. 101 00:07:44,256 --> 00:07:47,050 నా ఉద్దేశం, నేను డ్రైవింగ్ చేయకపోతే వాళ్లు మనల్ని ఎందుకు నమ్ముతారు? 102 00:07:47,676 --> 00:07:50,262 ఇలా చూడు, నాన్నా! ఇలా వెనుక కూర్చుంటే అంత బోరు ఏమీ కొట్టదు. 103 00:07:50,345 --> 00:07:51,930 పైగా నువ్వు మందులు వేసుకుంటూ ఉండాలి. 104 00:07:53,473 --> 00:07:55,225 వాటిని నేను అందుకుంటాను. 105 00:07:55,309 --> 00:07:56,727 చూడు, నీకు నీళ్లు ఇస్తున్నాను. 106 00:07:57,227 --> 00:08:01,273 నిన్ను చూసుకుంటాను అంటేనే అమ్మ నన్ను అంబులెన్సులోకి రానిస్తానని చెప్పింది, కాబట్టి నేను అదే చేస్తున్నాను. 107 00:08:01,356 --> 00:08:04,067 ఓపిక పట్టు, నాన్నా. నువ్వు ఈ మధ్యనే వీల్ చైర్ నుండి బయటకి వచ్చావు. 108 00:08:04,151 --> 00:08:05,986 నీకు మళ్లీ స్ట్రోక్ రాకూడదు అంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలి. 109 00:08:06,069 --> 00:08:07,487 డాక్టర్ ఏం చెప్పారో గుర్తుంచుకో. 110 00:08:07,571 --> 00:08:09,573 -డాక్టర్. -ఆ డాక్టర్? 111 00:08:10,324 --> 00:08:11,950 -ఆ కుర్రాడిని నువ్వు నిజంగా ఇష్టపడతావు, కదా? -రౌల్! 112 00:08:12,034 --> 00:08:13,493 -నువ్వు డ్రైవ్ చేయి చాలు! -అతను ఎక్కడి వాడు? 113 00:08:13,577 --> 00:08:14,828 అతను నీ టీచర్ అయి ఉంటాడు. 114 00:08:14,912 --> 00:08:16,914 -డాక్టర్ రౌల్! -నిన్ను చూడు, ఏహ్? 115 00:09:07,130 --> 00:09:09,466 ఆమె మాస్క్ తీసేయ్! 116 00:09:14,263 --> 00:09:16,390 ఆమె మీద ఎవరు గెలుస్తారో నీకు చెప్పాను కదా! 117 00:09:19,810 --> 00:09:21,979 మనది రక్తసంబంధం అని గుర్తు పెట్టుకో! 118 00:09:22,062 --> 00:09:23,939 నాకు ఇప్పుడు ఉన్న సమస్యలు మీకు భవిష్యత్తులో రాకూడదు… 119 00:09:25,023 --> 00:09:28,068 కాబట్టి ఇప్పటి నుండి, కొవ్వు పట్టే ఆహారాలు, టాకోలు తినద్దు. 120 00:09:42,708 --> 00:09:43,959 ఇలా చూడు, తెలివైనవాడా! అదరగొట్టు! 121 00:09:58,849 --> 00:09:59,850 నమ్మలేకుండా ఉంది. 122 00:10:09,568 --> 00:10:12,446 ఆమెని ఓడించు, ఆమెని ఓడించు! 123 00:10:19,119 --> 00:10:21,205 -దూసుకెళ్లు, సుందరి. -ఆమెని వదిలేయ్, చెత్తదానా! 124 00:10:21,288 --> 00:10:23,874 -ఆమెని ఒంటరిగా వదిలేయ్! -ఆమెని ఎందుకు పట్టుకుంటున్నావు? 125 00:10:24,541 --> 00:10:26,585 -అతడిని వదిలేయ్! -వాళ్లు ఇంక ఈ ప్రదర్శనని ఆపేయాలి! 126 00:10:26,668 --> 00:10:28,629 నువ్వు ఈ గొడవకి దూరంగా ఉండు! 127 00:10:31,256 --> 00:10:32,424 అది చూశావా? 128 00:10:32,508 --> 00:10:35,010 ఇది భలే గొప్పగా ఉంది. ఇదంతా ప్రదర్శనలో భాగం, బుజ్జీ. 129 00:10:35,552 --> 00:10:38,138 -నిజంగా అంటున్నావా? -అవును, డూడ్! 130 00:10:48,690 --> 00:10:50,317 ఇది ప్రదర్శనలో భాగంలా కనిపించడం లేదు. 131 00:10:50,400 --> 00:10:52,444 అంబులెన్స్ లోకి వెళ్లండి. త్వరగా, రండి. అంబులెన్స్ లోకి రండి. 132 00:10:52,528 --> 00:10:55,072 ఆ రింగ్ దగ్గర నాన్నకి ఎవరు సాయం చేస్తారు? 133 00:10:59,785 --> 00:11:01,078 ఆయన అక్కడ ఏం చేస్తున్నారు? 134 00:11:01,161 --> 00:11:03,330 సరే, వీడిని లోపలికి తీసుకువెళ్లు. నేను వెళ్లి రమోన్ ని తీసుకొస్తాను. వెంటనే! 135 00:11:03,413 --> 00:11:04,873 -ఆయనని ఎందుకు పంపాపు, బాబూ? -త్వరగా, వెళ్లండి. 136 00:11:04,957 --> 00:11:06,458 -మరి మా నాన్న! -నువ్వు ఈసారి తప్పనిసరిగా 137 00:11:06,542 --> 00:11:08,627 నా మాట వినాలి ఇంకా అక్కడే కూర్చోవాలి, అర్థమైందా? 138 00:11:12,464 --> 00:11:16,760 ఎక్స్ క్యూజ్ మీ. ఎక్స్ క్యూజ్ మీ. చెత్త. దారి వదలండి! 139 00:11:18,512 --> 00:11:21,181 -ఆ దెబ్బలతో జాగ్రత్త. -వాళ్లు నాతో గొడవ పడ్డారు, బాబు. 140 00:11:21,265 --> 00:11:22,933 ప్రశాంతంగా ఉండు. నిదానం. ఆ కుర్రాడికి సాయం చేయి. 141 00:11:23,016 --> 00:11:24,935 ఆ కుర్రాడికి సాయం చేయి. అదిగో అక్కడ! 142 00:11:33,193 --> 00:11:34,736 వస్తున్నా, వస్తున్నా! 143 00:11:34,820 --> 00:11:36,488 హేయ్, వెధవల్లారా! 144 00:11:36,572 --> 00:11:41,076 ఎక్స్ క్యూజ్ మీ. ఎక్స్ క్యూజ్ మీ. వస్తున్నాను. నేను పారామెడిక్ ని. వస్తున్నాను. 145 00:11:44,329 --> 00:11:46,331 హాయ్, నేను ఎమర్జెన్సీ వైద్య సహాయకురాలిని. నీకు సాయం చేయనా? 146 00:11:46,415 --> 00:11:48,792 భయపడకు, డియర్. రక్తం చూసి భయపడకు. 147 00:11:48,876 --> 00:11:50,544 ఇది రక్తం గడ్డకట్టకుండా ఆపుతుంది. 148 00:11:50,627 --> 00:11:52,921 దాని వల్ల నీకు గుండె సంబంధిత వ్యాధులు రావు, నీకు అలాంటివి ఉన్నాయా? 149 00:11:53,005 --> 00:11:55,090 -నా వృత్తి కోసం నేను జాగ్రత్తలు తీసుకుంటాను. -సరే. 150 00:11:55,174 --> 00:11:56,466 ఈ దెబ్బలు ప్రేక్షకుల కోసమే తగిలించుకుంటా. 151 00:11:56,550 --> 00:11:58,844 సరే, కానీ స్థిరంగా ఉండు. నీ తల కదల్చకు, సరేనా? 152 00:11:58,927 --> 00:12:00,137 నువ్వు కదలకుండా ఉండాలి. 153 00:12:02,347 --> 00:12:03,932 నీ మాస్క్ ని తీసేస్తాను, సరేనా? నేను అది తీయకపోతే… 154 00:12:04,016 --> 00:12:05,767 ఓహ్, అసలు వద్దు! వద్దు! వద్దు, వద్దు, వద్దు! 155 00:12:05,851 --> 00:12:07,644 నేను అది తీయాలి. నీకు రక్తం కారిపోతుంది! 156 00:12:07,728 --> 00:12:08,770 నేను ఇది తీయలేను. 157 00:12:08,854 --> 00:12:10,564 సరే, నీకు ఇష్టమైనట్లే చేద్దాం. 158 00:12:10,647 --> 00:12:12,024 నేను లోపల చూస్తాను. సరేనా… 159 00:12:12,107 --> 00:12:14,985 రక్తం గడ్డకట్టకుండా చేసే మందులా? చెత్తనా…? 160 00:12:15,068 --> 00:12:18,864 ఒక మంచి ప్రదర్శన ఇవ్వడానికి వాళ్లు ఇలాంటివి చేస్తుంటారు… 161 00:12:18,947 --> 00:12:21,450 కానీ అంటే, మనం కూడా ఇలాంటి పనులే చేస్తాం అనుకుంటా. 162 00:12:21,533 --> 00:12:25,495 వృత్తిలోనూ, జీవితంలోనూ, అప్పటికి మనకి ఏది సరైనది అనిపిస్తే అదే చేస్తాం. 163 00:12:25,579 --> 00:12:28,457 ఆ తరువాత మనకి దెబ్బలు తగిలినప్పుడు మనం వాటిని ఓర్చుకుని, పైకి మాత్రం నవ్వుతూ ఉంటాం. కదా? 164 00:12:29,458 --> 00:12:30,626 రమోన్! 165 00:12:31,126 --> 00:12:32,294 ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. 166 00:12:32,377 --> 00:12:33,962 మనం వెళ్లిపోదాం, బాబు! 167 00:12:38,050 --> 00:12:39,635 -నీకు ఎలా ఉంది? కళ్లు తిరుగుతున్నాయా? -బాగా. 168 00:12:39,718 --> 00:12:42,304 నువ్వు బాగానే ఉన్నావా? చూడు, నీకు సాయం చేస్తాను, సరేనా? 169 00:12:42,387 --> 00:12:43,805 జాగ్రత్త. 170 00:12:43,889 --> 00:12:45,057 ఆ స్ట్రెచర్ అందుకో, బాబు! 171 00:12:46,642 --> 00:12:49,394 కిందికి, కిందికి, పూర్తిగా కిందికి దించు! ఇప్పుడు ఆమెని ఎక్కించు! వెంటనే. 172 00:12:49,478 --> 00:12:50,771 -ఒక్క క్షణం! -నా మిత్రుడికి సాయం చేయండి. 173 00:12:50,854 --> 00:12:52,481 అతడిని చూడండి. 174 00:12:52,564 --> 00:12:54,107 అలాగే. థాంక్స్, డియర్. 175 00:12:54,191 --> 00:12:56,151 -దయచేసి, అతనికి సాయం చేయండి. -మళ్లీ కలుస్తాము. 176 00:12:56,235 --> 00:12:58,487 -మూడు లెక్కపెట్టు… ఒకటి, రెండు, మూడు! -ప్లీజ్. 177 00:12:58,570 --> 00:13:00,197 తోయండి! తోయండి! 178 00:13:00,280 --> 00:13:02,741 పెట్టేశాం. పెట్టేశాం. ఆమెని పట్టుకున్నావా? ఆమెని పట్టుకున్నావా? 179 00:13:02,824 --> 00:13:05,410 -దయచేసి ఆగు! నేను వెంటనే వచ్చేస్తాను. -అతనికి రక్తం కారుతోంది. తనకి సాయం చేయండి. 180 00:13:05,494 --> 00:13:07,913 నా కోసం వేచి ఉండు, బాబు! 181 00:13:08,580 --> 00:13:10,749 -కాసేపు ప్రశాంతంగా ఉండు. -మీరు చెత్తవెధవలు. 182 00:13:10,832 --> 00:13:12,918 మీకు కూడా సాయం చేస్తాం, బ్రో. ఒక్క క్షణంలో మళ్లీ వస్తాం, బాబు. 183 00:13:13,001 --> 00:13:15,504 రిలాక్స్, బాబు. ఇక్కడ ఒక మనిషి గాయపడి ఉంది. 184 00:13:15,587 --> 00:13:18,549 వెళదాం పద, బాబు. వెళదాం పద. ఆ జూలియో గాడు ఎక్కడ, బాబు? 185 00:13:18,632 --> 00:13:21,009 -జూలిటో! -జూలియో ఎక్కడికి వెళ్లాడు, ఆహ్? 186 00:13:21,093 --> 00:13:23,011 డాక్టర్, మనం వెంటనే వెళ్లిపోవాలి! 187 00:13:23,095 --> 00:13:24,429 ఆగండి! 188 00:13:24,513 --> 00:13:25,931 -నిదానం, నిదానం! -లోపలికి దూకు, బాబు! 189 00:13:26,515 --> 00:13:28,058 పీకాని పోగొట్టుకున్నాను! 190 00:13:28,141 --> 00:13:29,601 ఏం పోగొట్టుకున్నావు? 191 00:13:31,144 --> 00:13:32,479 ఆమె నాకు కనిపించింది! 192 00:13:33,105 --> 00:13:33,939 ఏంటి మాట్లాడుతున్నావు… 193 00:13:53,417 --> 00:13:54,543 త్వరగా లోపలికి దూకు, బాబు! 194 00:14:21,195 --> 00:14:23,071 సాధారణ ప్రథమ చికిత్స 195 00:14:29,036 --> 00:14:30,871 గ్జిమెనా మాంటెమాయో… 196 00:14:32,039 --> 00:14:33,081 అక్కడి నుండి కిందికి దిగు! 197 00:14:43,050 --> 00:14:44,218 నీకు ఏం అయింది? 198 00:14:45,344 --> 00:14:46,470 ఇదంతా ఏంటి? 199 00:14:47,304 --> 00:14:48,889 -సారీ. -ఇది నీదేనా? 200 00:14:50,474 --> 00:14:51,475 సారీ. 201 00:14:53,560 --> 00:14:56,772 చాలా సారీ, మేడమ్. మీ అమ్మాయి అంబులెన్స్ లోపల ఉందని మాకు తెలియదు. 202 00:14:56,855 --> 00:14:59,525 మీ అబ్బాయికి స్కూలులో మా అమ్మాయి సాయం చేస్తోంది. 203 00:14:59,608 --> 00:15:01,193 కానీ చూడండి మీరు తనని ఎలా పాడుచేస్తున్నారో. 204 00:15:01,276 --> 00:15:03,654 కానీ, మేడమ్, మీరు నిజం ఏమిటో తెలుసుకోవాలి… 205 00:15:03,737 --> 00:15:07,407 తల్లులు పిల్లల్ని వదిలేస్తే ఇలాంటి ఘోరాలే జరుగుతాయని మీరు తెలుసుకోవాలి. 206 00:15:10,327 --> 00:15:11,703 పద. 207 00:15:13,372 --> 00:15:15,165 వెనక్కి చూడటం ఆపు. 208 00:15:15,249 --> 00:15:16,875 మళ్లీ ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకు. 209 00:15:24,508 --> 00:15:27,511 మీరు కనీసం గమనించకుండా ఒక పిల్లని ఎలా కిడ్నాప్ చేయగలరు? 210 00:15:27,594 --> 00:15:30,222 నేను ఆమెని కిడ్నాప్ చేయలేదు. నీ కొడుకు ఆ పిల్లని లోపలికి రానిచ్చాడు. 211 00:15:30,305 --> 00:15:31,682 -అబద్ధం ఆడుతున్నావు. -నేను కిడ్నాప్ చేయలేదు. 212 00:15:31,765 --> 00:15:34,142 అంబులెన్స్ లోకి రావడానికి పీకా నాకు 450 రూపాయలు ఇచ్చింది. 213 00:15:34,726 --> 00:15:36,103 -ఏంటి? -నువ్వు ఒక బుద్ధిలేని వాడివి, వెధవ. 214 00:15:36,186 --> 00:15:38,313 -మరి, పీకా "బ్యాంక్ దొంగతనం చేయి" అంటే… -ఆమెకు చేయాలని ఉంది. 215 00:15:38,397 --> 00:15:39,398 …వెళ్లి చేసేస్తావా ఏంటి? 216 00:15:39,481 --> 00:15:43,235 నిన్ను స్కూలు నుండి పంపించేయవద్దని ప్రిన్సిపాల్ ని బతిమిలాడాను కానీ చూడు. 217 00:15:43,318 --> 00:15:45,195 నువ్వు బుద్ధిగా ప్రవర్తిస్తావని ప్రామిస్ చేశావు! 218 00:15:45,279 --> 00:15:46,989 నువ్వు ఇప్పుడు తల్లిలా మాట్లాడుతున్నావు, కదా లెటీ? 219 00:15:47,072 --> 00:15:49,825 నేను బుద్ధిగానే ఉన్నాను. నాన్నని చూసుకోవడానికి నువ్వే నన్ను పంపించావు. 220 00:15:49,908 --> 00:15:53,036 నన్ను చూసుకోవడానికి! నీ చిన్న ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి కాదు. 221 00:15:53,120 --> 00:15:55,831 నోరు మూయి, నీకు తెలుసు కానీ చూడనట్లు వదిలేశావు. 222 00:15:56,915 --> 00:15:58,709 -నీకు తెలుసా? -ఏంటి ఇది, రమోన్? 223 00:15:58,792 --> 00:16:00,169 జూలియోని తిట్టావు కానీ ముందే తెలుసా? 224 00:16:00,252 --> 00:16:01,837 ఒక చిన్న పాపని చూసి ఏమీ అనకుండా ఎలా ఉన్నావు? 225 00:16:01,920 --> 00:16:05,591 -నువ్వు ఎదిగిన మనిషివి, రమోన్! దేవుడా! -నువ్వు వాడిని అని కూడా ఉపయోగం లేదు. 226 00:16:05,674 --> 00:16:07,009 నువ్వు ఎదిగావు. 227 00:16:07,092 --> 00:16:10,053 మీరు ఇద్దరు మళ్లీ కలిసి ఉండకూడదు. మీరు విడిపోవడమే మేలు. 228 00:16:16,643 --> 00:16:17,728 వాడు సరిగ్గా చెప్పాడు. 229 00:16:18,312 --> 00:16:20,814 నేను బయటకి వెళ్లిపోతున్నాను. తరువాత కలుస్తాను. 230 00:16:53,138 --> 00:16:54,264 మూసి ఉంది 231 00:17:19,122 --> 00:17:21,083 నువ్వు ఏం తింటావు? నాకు చెబితే ఆర్డర్ చేస్తాను. 232 00:17:22,251 --> 00:17:25,753 నీకు ఆ రోజు చెప్పిన టాకోస్ తినాలని ఉంది. 233 00:17:25,838 --> 00:17:27,256 మనం వెళ్లి తినచ్చేమో. 234 00:17:28,674 --> 00:17:32,761 కానీ నీకు షిఫ్ట్ ఉంది, అలాగే నేను కూడా హాస్పిటల్ కి మళ్లీ వెళ్లాలి. 235 00:17:33,595 --> 00:17:36,223 మనకి రెండు గంటల సమయమే ఉంది అందుకే మనం దానినే సద్వినియోగం చేసుకోవాలి, కదా? 236 00:17:37,099 --> 00:17:39,351 నాకు తెలిసి నీ ఫెలోషిప్ పూర్తయ్యేవరకూ 237 00:17:39,434 --> 00:17:41,395 మన పరిస్థితి ఇలాగే ఉంటుంది అనుకుంటా. 238 00:17:41,478 --> 00:17:43,146 నేను కాలేజీ నుంచి బహిష్కరించారు, కదా? 239 00:17:44,314 --> 00:17:45,816 ఏంటి? 240 00:17:46,733 --> 00:17:49,152 నా ఉద్దేశం, మనం హాస్పిటల్ లో కలుసుకుంటాం ఇంకా శృంగారం చేసుకుంటాం. 241 00:17:49,236 --> 00:17:51,822 నీ ఇంట్లో కలుసుకుంటాం ఇంకా శృంగారం చేసుకుంటాం. మనం కలుసుకుంటాం… 242 00:17:51,905 --> 00:17:54,241 నా ఇంట్లో కలుసుకుంటాం ఇంకా మీ నాన్నకి నేను సర్జరీ ఏర్పాట్లు చేస్తాను. 243 00:17:58,537 --> 00:18:00,122 సారీ నేను అలా ఎందుకు మాట్లాడానో తెలియదు. 244 00:18:00,205 --> 00:18:01,290 అది ఫర్వాలేదు. 245 00:18:03,333 --> 00:18:05,669 మా నాన్నకి నువ్వు ఎంత సహాయం చేశావో అందుకు చాలా కృతజ్ఞతలు. 246 00:18:05,752 --> 00:18:07,254 సారీ. నేను తప్పుగా మాట్లాడాను. 247 00:18:07,337 --> 00:18:09,131 అవును, అది తప్పే. 248 00:18:10,507 --> 00:18:12,217 హేయ్, వెళ్లకు. సారీ. 249 00:18:17,264 --> 00:18:19,099 ఇక్కడ చాలా చలిగా ఉంది. 250 00:18:19,183 --> 00:18:20,767 చూడు, నీ ఏడుపు ఆపు. 251 00:18:20,851 --> 00:18:23,395 నువ్వు చూడటానికి బాగున్నావు! ఇంక ఆపు. 252 00:18:23,478 --> 00:18:25,189 -నాకు తెలుసు… -మనం మారేని చూడటానికి వచ్చాం, కదా? 253 00:18:25,272 --> 00:18:28,442 నాకు తెలుసు, కానీ ఆమె నన్ను చూసి ఆశ్చర్యపోవాలని అనుకున్నా. 254 00:18:28,525 --> 00:18:29,985 నువ్వు కూడా ఆమె మాదిరిగా అందగత్తెవి. 255 00:18:30,068 --> 00:18:32,696 నా ఉద్దేశం ఈ అమ్మాయి చాలా తెలివైనది! 256 00:18:32,779 --> 00:18:35,908 నా ఉద్దేశం ఆమె పాటల సాహిత్యం ఎంత బాగుంటుంది. ఆమె పాటలు నా కోసమే రాసినట్లు ఉంటాయి. 257 00:18:35,991 --> 00:18:37,659 నిజంగానా? 258 00:18:37,743 --> 00:18:40,537 ఆమెనే ఇంత విజయం సాధిస్తే, మనం కూడా గొప్ప పేరు తెచ్చుకోవచ్చు. 259 00:18:40,621 --> 00:18:42,247 ఇప్పుడు నువ్వు ఆమె అభిమానివా, క్రిసీస్? 260 00:18:42,331 --> 00:18:43,957 మారేని నీకు ఎవరు చూపించారు? 261 00:18:44,041 --> 00:18:45,375 అయితే చూద్దాం, మన కోసం ఒక పాట పాడు. 262 00:18:45,459 --> 00:18:46,710 మొదట నువ్వు పాడు. 263 00:18:48,337 --> 00:18:50,339 నేను ఈ పాట ఇలా పాడాలని ఆలోచిస్తున్నాను: 264 00:18:50,422 --> 00:18:53,509 "నువ్వు వేసే అడుగుల్ని నేను మెచ్చుకుంటాను, కానీ నువ్వు వదిలి వెళ్లిన బాటని నేను అనుసరించను." 265 00:18:53,592 --> 00:18:54,593 నాకు నచ్చింది. 266 00:18:54,676 --> 00:18:57,387 ఇంకా ఇది రమోన్ కి అంకితం. 267 00:18:58,514 --> 00:18:59,932 ఆయన ఇంకా ఇంటికి రాలేదా? 268 00:19:01,558 --> 00:19:04,353 లేదు, లెటీ ఏం చేసిందా ఆయన కూడా సరిగ్గా అదే చేశాడు. అదే విధంగా. 269 00:19:04,436 --> 00:19:05,604 ఆయనకి కోపం వచ్చింది, బయటకి వెళ్లిపోయాడు. 270 00:19:05,687 --> 00:19:07,189 మరి వాళ్ల పిల్లలు? వాళ్లకి ఏమీ ఇబ్బంది లేదు, కదా? 271 00:19:07,272 --> 00:19:08,273 గొప్పగా ఉన్నారు. 272 00:19:08,357 --> 00:19:10,526 -బేబీ. -ఆయన గురించి వదిలేయ్. 273 00:19:11,610 --> 00:19:13,612 -కానీ నేను అలాంటివాడిని కాను. -నాకు తెలుసు! 274 00:19:13,695 --> 00:19:15,739 లేదు, నేను నిజంగానే చెబుతున్నాను, క్రిసీస్. నిన్ను వదిలి వెళ్లను! 275 00:19:15,822 --> 00:19:18,450 -నాకు తెలుసు, నువ్వు అలా చేయవని తెలుసు! -నీ కోసం, నీ కోసం… 276 00:19:19,493 --> 00:19:21,662 అంటే, ఏం చెప్పాలి అనుకున్నానంటే నేను నిన్ను వదిలి వెళ్లను అని. 277 00:19:21,745 --> 00:19:25,499 నా ఉద్దేశం, మనం బిడ్డ కావాలని కోరుకుంటే, అంటే, నీకు ఇష్టమైతే, చూడు… 278 00:19:26,208 --> 00:19:29,461 అంటే, తక్షణం, ఇది ఒక మనిషి కాదు, అంటే, ఇది ఒక పిండం 279 00:19:29,545 --> 00:19:32,005 కానీ నీకు ఎలా నచ్చితే అలా నిర్ణయించు, క్రిస్. 280 00:19:32,089 --> 00:19:34,800 -నువ్వు తెలుసుకోవలసింది ఏమిటంటే… -హేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? 281 00:19:34,883 --> 00:19:38,178 హేయ్, బండోడా, నువ్వు లైన్ మధ్యలోకి దూరుతున్నావు! ఈ మనిషి లైన్ లోకి దూరుతున్నాడు. 282 00:19:39,930 --> 00:19:41,473 చెత్తవెధవ! 283 00:19:41,557 --> 00:19:44,685 -బాబూ, నువ్వు చాలా మంచి తల్లివి అవుతావు. -హేయ్, బేబీ, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 284 00:19:44,768 --> 00:19:45,936 అలాగే! 285 00:19:46,019 --> 00:19:47,771 వాళ్లు మనల్ని చూస్తారు, ఏమరుపాటుగా ఉంటే దూరిపోతారు. 286 00:19:47,855 --> 00:19:50,399 -తరువాత గ్రూప్! -మారే, మనం ఇంక వెళ్లాలి. 287 00:19:50,482 --> 00:19:51,692 వస్తున్నాను! 288 00:19:52,651 --> 00:19:53,902 మేము ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? 289 00:19:55,529 --> 00:19:56,905 థాంక్స్! 290 00:20:00,659 --> 00:20:02,077 ఇంక అయిపోయింది, మిత్రులారా. 291 00:20:02,160 --> 00:20:05,163 లేదు, మేము ఒప్పుకోం, బాబు. ఇలా చూడు, నిదానించు. మేము చాలాసేపటి నుండి వేచి ఉన్నాం, డూడ్. 292 00:20:05,247 --> 00:20:07,457 -సారీ. నేను ఏమీ చేయలేను. -అయితే ఏంటి? మేము లోపలికి వెళ్లలేమా? 293 00:20:07,541 --> 00:20:09,001 నువ్వు ఏమీ చేయలేవు అంటే నీ ఉద్దేశం ఏంటి? 294 00:20:09,084 --> 00:20:10,794 నువ్వు చేయలేకపోతే, మరి ఎవరు చేయగలరు? 295 00:20:10,878 --> 00:20:12,421 నన్ను ఏం చేయమంటారు? 296 00:20:12,504 --> 00:20:14,423 నాకు తెలియదు. "నన్నేం చేయమంటారు" అంటే ఏంటి? 297 00:20:14,506 --> 00:20:16,383 ఆమెనే స్వయంగా రమ్మని మాతో నేరుగా ఆ మాటే చెప్పమను. 298 00:20:16,466 --> 00:20:18,343 నువ్వు ఇందుకోసమే ఇక్కడ పని చేస్తున్నావా? 299 00:20:18,427 --> 00:20:20,971 చూడండి, మారేని మనల్ని వాళ్లు చూడనివ్వడం లేదు. 300 00:20:21,054 --> 00:20:24,057 చూడండి సర్, నేను ఇక్కడికి మారేని చూడటానికి వచ్చాను ఇంకా ఆమెని చూడకుండా ఇక్కడి నుండి వెళ్లను. 301 00:20:24,141 --> 00:20:26,143 -కావాలంటే చూడండి. -ఆమె వెళ్లిపోయింది. 302 00:20:46,455 --> 00:20:47,789 ఓహ్, లేదు! 303 00:20:47,873 --> 00:20:49,958 నేను ఇది ఇంక తొడుక్కుని ఉండలేను. 304 00:20:51,668 --> 00:20:53,462 ఇందుకోసమేనా నువ్వు నా ప్రాణాలు కాపాడావు? 305 00:20:54,046 --> 00:20:57,299 ఈ జిరాఫీ మాస్కు లోపల ఉక్కిరిబిక్కిరి కావడానికా? 306 00:20:57,382 --> 00:20:59,092 లేదు! సారీ. నా ఉద్దేశం… 307 00:20:59,176 --> 00:21:02,137 నటి అనగానే నాకు ఇంకెవరూ గుర్తు రాలేదు. సారీ. 308 00:21:02,221 --> 00:21:05,807 చూడు, నువ్వు ఇది చేస్తే ఖచ్చితంగా ఉక్కిరిబిక్కిరి కావు. 309 00:21:07,434 --> 00:21:09,603 "సత్వరం కోలుకోవడానికి యోగా." 310 00:21:12,981 --> 00:21:14,983 నువ్వు నా గురించి పెద్దగా ఆలోచించలేదు, కదా? 311 00:21:15,901 --> 00:21:17,945 లేదు, అయ్యో, ఇది మీరు కోలుకున్నాక చేయాల్సింది. 312 00:21:19,112 --> 00:21:20,697 నేను అలా అనుకోలేదు. 313 00:21:20,781 --> 00:21:22,824 మంచిది. నా ట్రామటాలజిస్టుకి ఈ విషయాన్ని ఖచ్చితంగా చెబుతాను. 314 00:21:25,994 --> 00:21:28,622 -పట్టించుకోకు, లేదు. నా ఉద్దేశం… -మరేం ఫర్వాలేదు. 315 00:21:29,248 --> 00:21:32,125 ఈ రోజుల్లో వెటకారం పెద్ద విషయం కాదు. 316 00:21:33,377 --> 00:21:35,170 -దాని గురించి ఆందోళన పడద్దు. -ఫర్వాలేదు, నలీ. 317 00:21:35,254 --> 00:21:36,380 నీ గురించి నువ్వు అంతలా అనుకోకు. 318 00:21:37,256 --> 00:21:39,049 కొన్నిసార్లు పరిస్థితులు మంచిగా మారవు, 319 00:21:39,758 --> 00:21:42,344 ఇంకా మంచి రోజులు వస్తాయని ఎదురుచూసి మనం అలసిపోతుంటాం కూడా. 320 00:21:43,512 --> 00:21:44,930 ఆశ వదిలేయడం కూడా మంచిదే, 321 00:21:45,931 --> 00:21:47,224 కానీ కేవలం కొద్ది కాలమే. 322 00:21:48,517 --> 00:21:51,103 నేను దాని మీద ఇంకా పూర్తిగా పట్టు సాధించలేదు. దాన్ని భరించడం కూడా చాలా కష్టం! 323 00:21:57,609 --> 00:21:59,695 నేను రన్నింగ్ ని ఎంత మిస్ అవుతున్నానో మీకు తెలియదు, 324 00:22:00,320 --> 00:22:02,072 అది నాకు ఊరట ఇచ్చేది. 325 00:22:02,823 --> 00:22:05,117 ప్రతి రోజూ అలాగే మొదలయ్యేది. 326 00:22:12,207 --> 00:22:13,333 గట్టిగా పట్టుకో! 327 00:22:13,417 --> 00:22:14,835 -దేనికి? -పట్టుకో! 328 00:22:14,918 --> 00:22:17,671 పట్టుకో, ఎందుకంటే మనం ఇప్పుడు పరిగెత్తబోతున్నాం, ఏహ్? పద, పద! 329 00:22:18,172 --> 00:22:21,341 అవును, అవును! నువ్వు చేయగలవని నాకు తెలుసు 330 00:22:21,925 --> 00:22:25,929 ఒకళ్ల మీద ఇద్దరు పోటీ అది మీ అందరికీ న్యాయం కాదు 331 00:22:27,431 --> 00:22:28,974 మనం చేద్దాం పద. 332 00:22:29,057 --> 00:22:30,434 గొప్ప విషయం. 333 00:22:41,528 --> 00:22:43,322 ఇలా రా, బ్లాండీ, పోటీ మొదలుపెట్టు. 334 00:22:46,158 --> 00:22:48,535 నీ కళ్లలోకి చూస్తే ఏదో జరుగుతుందని తెలుస్తోంది 335 00:22:48,619 --> 00:22:51,205 ఆ చూపు నన్ను మోసం చేయలేదు ఇంకా అది నా కలల్లో పెద్దదవుతోంది 336 00:22:51,288 --> 00:22:53,498 అది నిశ్శబ్దంగా నాతో మాట్లాడుతుంది నేను అబద్ధం ఆడటం లేదు 337 00:22:53,582 --> 00:22:56,668 నిన్ను నేను పిచ్చిగా కోరుకుంటున్నాను జరగబోయేదాని కోసం నేను సిద్ధంగా ఉన్నాను 338 00:22:56,752 --> 00:22:59,046 నీకు అసలు ఆ ఆలోచన ఎలా వస్తుంది విధి రాతని నువ్వు మార్చగలవని? 339 00:22:59,129 --> 00:23:01,590 రేపు అనేది అనిశ్చితం భవిష్యత్తుని నేను ఊహించను 340 00:23:01,673 --> 00:23:03,926 హఠాత్తుగా మార్పు రావడంతో ప్రతీదీ గందరగోళం అయిపోయింది 341 00:23:04,009 --> 00:23:07,221 నేను సంకేతాలను నమ్మను నా దారి నేను నిర్మించుకుంటాను 342 00:23:07,304 --> 00:23:09,973 మనం ఎక్కడ ఉన్నామో చూడు మనం ఎక్కడ ఉన్నాం 343 00:23:10,057 --> 00:23:12,726 మనం ఓడిపోతే ఆ తరువాత ఏం చేయగలం? 344 00:23:12,809 --> 00:23:15,062 మనం ఎక్కడ ఉన్నామో చూడు నేను ముందుకు వెళ్లాలి 345 00:23:15,145 --> 00:23:18,440 అగ్ని మనల్ని క్షమించదు నేను బయటకు వెళ్లిపోవాలని రగిలిపోతున్నాను 346 00:23:18,524 --> 00:23:21,360 నేను నీ పక్కనే ఉంటాను నేను భయపడనని నీకు తెలుసు 347 00:23:21,443 --> 00:23:23,403 నన్ను ఆపే పిచ్చితనం నాలో లేదు 348 00:23:23,487 --> 00:23:26,323 ఇంకా పుట్టని బిడ్డకి ఏం చెప్పాలో నాకు తెలుసు 349 00:23:26,406 --> 00:23:28,700 మంచి బార్లలో నువ్వు సృష్టించబడ్డావు 350 00:23:28,784 --> 00:23:31,203 మనం ఎక్కడ ఉన్నామో చూడు మనం ఎక్కడ ఉన్నామో 351 00:23:31,286 --> 00:23:33,580 మనం విఫలమయితే ఏం చేయగలం? 352 00:23:33,664 --> 00:23:36,416 మనం ఎక్కడ ఉన్నామో చూడు నేను వెళ్లాలి 353 00:23:36,500 --> 00:23:39,378 అగ్ని మనల్ని క్షమించదు నేను బయటకు వెళ్లాలని రగిలిపోతున్నాను 354 00:23:43,340 --> 00:23:46,009 ఐ లవ్ యూ! నిన్ను బాగా ప్రేమిస్తున్నాను! 355 00:23:53,058 --> 00:23:55,185 ఒక చిన్న స్టాప్, సరేనా? 356 00:24:09,241 --> 00:24:11,493 ఆక్సోలోటెల్ పర్యావరణ సంరక్షణ కేంద్రం ఆక్సోలోటెల్స్ శిబిరం 357 00:24:11,577 --> 00:24:12,828 మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 358 00:24:12,911 --> 00:24:14,246 ఇక్కడ చిన్న సాయం చేద్దామా? 359 00:24:23,714 --> 00:24:25,966 -నువ్వు నిజంగా నాకు చెబుతావా? -ఓపిక పట్టు, టమాయో. 360 00:24:26,550 --> 00:24:27,718 నువ్వు కూడా ఒక చేయి వేయి. 361 00:24:27,801 --> 00:24:30,387 -బెర్నార్డో! -ఏంటి సంగతి? ఏం జరుగుతోంది? 362 00:24:30,470 --> 00:24:31,638 అంతా బాగానే ఉంది! 363 00:24:31,722 --> 00:24:33,223 చూడు, పోంచో, మరిగాబీ. మరిగాబీ, పోంచో. 364 00:24:33,307 --> 00:24:35,392 -ఏంటి సంగతి? నిన్ను కలవడం సంతోషం. -సంతోషం. 365 00:24:35,475 --> 00:24:37,019 ఇది చూద్దాం… జాగ్రత్త. 366 00:24:37,102 --> 00:24:38,645 పట్టుకో. నీకు ఇంకొకటి ఇస్తాను. 367 00:24:47,279 --> 00:24:48,405 హాయ్! 368 00:24:48,488 --> 00:24:50,908 చూడు! ఇలా రా. 369 00:24:52,993 --> 00:24:54,620 దీని పేరు పిక్సీ. ఇది నాకు ఇష్టమైనది. 370 00:24:55,746 --> 00:24:57,956 చూడు, నేను దగ్గరగా కనిపిస్తే నవ్వుతున్నాడు. 371 00:24:58,040 --> 00:25:01,251 చాలా సారీ. ఎక్కువగా ఆశపడకు. వీడు ఎవరిని చూసినా అలాగే నవ్వుతాడు. 372 00:25:01,335 --> 00:25:02,711 అయితే వీడు నిన్ను ఇష్టపడుతున్నాడా? 373 00:25:02,794 --> 00:25:03,795 ఏంటి, నన్ను ఇష్టపడుతున్నాడా? 374 00:25:03,879 --> 00:25:05,714 అందుకే, కాలేజీలో అందరూ నిన్ను "సరసాల కళ్లవాడు" అంటారు. 375 00:25:05,797 --> 00:25:06,882 -నన్నా? -నిజం. 376 00:25:06,965 --> 00:25:07,966 కానీ నువ్వు అలా అనకూడదు. 377 00:25:08,050 --> 00:25:09,301 -నా ప్రవర్తనలో తప్పుండదు. -ప్లీజ్. నిజం. 378 00:25:09,384 --> 00:25:11,011 లేదు, లేదు, లేదు. ఆపు, ఆపు. 379 00:25:11,094 --> 00:25:12,554 ఇది చాలా సున్నితమైనది. 380 00:25:12,638 --> 00:25:14,348 -నీ మాదిరిగానా? -అది కూడానా? 381 00:25:14,431 --> 00:25:18,185 -అవి నీ మాదిరిగా కూడా ఉంటాయి! చక్కగా. -ఒకటే. అవును, నా మాదిరిగా. 382 00:25:24,691 --> 00:25:26,276 -హేయ్, హేయ్! -నీకు ఏం కావాలి? 383 00:25:26,360 --> 00:25:27,736 మాకు అన్ని విషయాలు తెలుసు! 384 00:25:27,819 --> 00:25:29,279 నాకు ఫోటోలు, వీడియోలు, రక్తం… 385 00:25:29,363 --> 00:25:31,615 ఎముకలు కావాలి. నాకు ఏం చూపించాలో నీకు తెలుసు. అమాయకుడిలా నాటకాలు ఆడకు. 386 00:25:32,199 --> 00:25:34,993 సరే, ఇంక చాలు. చూడు, జరుగు! 387 00:25:35,077 --> 00:25:36,245 కానీ నువ్వు చెప్పావు కదా… 388 00:25:36,328 --> 00:25:37,746 -ఒక విషయం చెప్పనా… -వాళ్లకి నువ్వు ఏం చెప్పావు? 389 00:25:37,829 --> 00:25:39,831 ఆగు. నిదానించు, సరేనా? 390 00:25:40,916 --> 00:25:42,459 హేయ్, హేయ్, హేయ్. ఏంటి ఇదంతా? 391 00:25:42,543 --> 00:25:44,294 హేయ్, పీకాకి కోపం వచ్చింది! 392 00:25:44,378 --> 00:25:46,338 ఇది చిన్నగానే ఉన్నా, ఘాటుగా ఉంది. 393 00:25:50,968 --> 00:25:52,261 నీ బుర్రలోకి ఎక్కించుకో! 394 00:25:52,344 --> 00:25:53,595 ఏంటి ఎక్కించుకోవాలి? 395 00:25:53,679 --> 00:25:57,558 మనం ఇప్పుడు మంచి పిల్లలం, మొద్దు. 396 00:25:57,641 --> 00:26:00,060 మీ అమ్మ నిన్ను నాతో కలిసి తిరగనివ్వదు. 397 00:26:00,978 --> 00:26:02,938 మనం చాలా డబ్బు సంపాదించవచ్చు! 398 00:26:03,021 --> 00:26:05,148 నీ అంబులెన్స్ ఒక బంగారు గని. 399 00:26:05,649 --> 00:26:07,067 అది నాది కాదు. 400 00:26:07,860 --> 00:26:09,236 నువ్వు అన్నది నిజమే… 401 00:26:09,319 --> 00:26:10,988 అది నీ అంబులెన్స్. 402 00:26:12,155 --> 00:26:15,701 నువ్వు నా మాట వింటే, ప్రతి సబ్జెక్టులో నిన్ను పాస్ చేయిస్తాను. 403 00:26:16,201 --> 00:26:18,161 నువ్వు ఇంక ఎప్పుడూ ఎలాంటి సమస్యని ఎదుర్కోవు. 404 00:26:21,331 --> 00:26:23,625 నువ్వు ఒప్పుకుంటావా లేదా? 405 00:26:24,626 --> 00:26:26,003 నేను ఒప్పుకుంటాను. 406 00:26:29,298 --> 00:26:32,009 నేను ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చాను ఆ కొండలు ఇంకా పై నుండి 407 00:26:32,092 --> 00:26:34,678 భూమి మీద నుండి వచ్చాయి గంజాయి ఇంకా కొకైన్ 408 00:26:34,761 --> 00:26:37,431 నన్ను చూస్తే నువ్వు అదే ఆలోచిస్తావు. ఓహ్ సిస్టర్, అది నిజమా కాదా? 409 00:26:37,514 --> 00:26:39,641 నా భాష విన్నావంటే ఇంకా "హమ్" అంటావా? 410 00:26:39,725 --> 00:26:42,519 కొలంబియన్, నేను కొలంబియన్ ని, నేను కాదు 411 00:26:42,603 --> 00:26:46,190 ఒక గాడిద ఇంకా కొందరు మనుషులు కనీసం నటించకుండా వలస పోతారు 412 00:26:46,273 --> 00:26:49,234 "నిన్ను తనిఖీ చేయాలి, సారీ, బంగారం" అని వాళ్లు అంటారు 413 00:26:51,153 --> 00:26:53,822 నేను పాటల పాడే ప్రదేశం నుండి వచ్చాను నేను సంపదల ప్రదేశం నుండి వచ్చాను 414 00:26:53,906 --> 00:26:56,491 నేను ఎవరి మీదా ఆధారపడనక్కరలేదు మిస్టర్ కమాండర్ 415 00:26:56,575 --> 00:26:58,285 కానీ నా మనుషులు ఏడిస్తే నేను గెలిచినట్లు కాదు 416 00:26:58,368 --> 00:27:00,037 నన్ను చంపేయ్ నేను బతికానంటే నా దగ్గర పాటలు ఉన్నాయి 417 00:27:00,120 --> 00:27:02,122 నువ్వు నన్ను బాధపెట్టలేవు. మెక్సికన్ చెత్త 418 00:27:02,664 --> 00:27:03,874 అదిగో మారే. 419 00:27:04,374 --> 00:27:05,667 తనే మారే, బ్రో! 420 00:27:06,251 --> 00:27:07,336 ఏంటి? 421 00:27:09,087 --> 00:27:11,298 మారేని మించిన పాటల పదాలు! 422 00:27:14,051 --> 00:27:16,303 హేయ్, నువ్వు పాడిన తీరు నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది! 423 00:27:16,386 --> 00:27:18,597 చీర్స్, అది అద్భుతంగా ఉంది! 424 00:27:18,680 --> 00:27:19,848 నిన్ను కౌగిలించుకోవచ్చా? 425 00:27:19,932 --> 00:27:21,391 తప్పకుండా! 426 00:27:24,186 --> 00:27:25,521 నీ ఫోన్ నెంబరు ఎంత? 427 00:27:26,021 --> 00:27:27,731 సారీ! 428 00:27:27,814 --> 00:27:29,525 నేను ఇంక వెళ్లాలి, కానీ, 429 00:27:29,608 --> 00:27:31,735 ఇది నాకు నచ్చింది. నేను ఇంకా వినాలి అనుకుంటున్నాను. 430 00:27:31,818 --> 00:27:33,111 మీ దగ్గర నిజంగా మంచి ప్రతిభ ఉంది. 431 00:27:33,195 --> 00:27:35,697 నేను రేపు లాస్ ఏంజెలెస్ వెళ్తున్నాను, నేను కొద్ది రోజులు అక్కడ రికార్డింగ్ లో ఉంటాను. 432 00:27:35,781 --> 00:27:37,616 మీరు అక్కడికి వస్తే నన్ను కలవండి, సరేనా? 433 00:27:38,450 --> 00:27:39,493 మేము ఖచ్చితంగా కలుస్తాము! 434 00:27:40,994 --> 00:27:42,287 ఒక బహుమతి. 435 00:27:42,371 --> 00:27:44,164 సరే, మారే, మేము ఇంక వెళ్లాలి, డియర్. పద. 436 00:27:44,248 --> 00:27:45,332 నన్ను కలవండి! 437 00:27:45,415 --> 00:27:47,209 చాలా ధన్యవాదాలు, మారే. 438 00:27:50,671 --> 00:27:53,090 హేయ్, నీతో ఒక ఫోటో తీసుకోవచ్చా? మారే! 439 00:27:53,173 --> 00:27:54,007 చూద్దాం… 440 00:27:54,091 --> 00:27:56,760 లాస్ ఏంజెలెస్ బేబీ! 441 00:27:58,762 --> 00:27:59,847 ఓహ్, దేవుడా! 442 00:28:02,140 --> 00:28:04,852 మా పని ఇంకా పూర్తి కాలేదు. మేము మరికొన్ని స్విమ్మింగ్ పూల్స్ కట్టాలి అనుకున్నాం, 443 00:28:04,935 --> 00:28:06,687 అక్కడ కాస్త కూరగాయలు, కంపోస్ట్ కోసం కాస్త చోటు వదిలాం. 444 00:28:06,770 --> 00:28:07,771 అది అద్భుతం. 445 00:28:08,272 --> 00:28:09,773 ఇదంతా నువ్వు స్వయంగా చేస్తున్నావా? 446 00:28:09,857 --> 00:28:12,067 మేము చాలామందిమి ఉన్నాం. ఎక్కువగా పోంచో ఇంకా మరో ఇద్దరు. 447 00:28:12,860 --> 00:28:14,862 నేను పొదుపు చేసిన కొంత డబ్బుని పెట్టుబడిగా పెట్టా. 448 00:28:14,945 --> 00:28:16,405 అలా ఎందుకు? 449 00:28:18,323 --> 00:28:21,326 అంటే, నేను వెటర్నరీ డాక్టర్ కావాలి అనుకున్నాను, కానీ మా కుటుంబ సభ్యులకి గుండెపోటు వచ్చి ఉండేది. 450 00:28:23,328 --> 00:28:24,621 అవునా, వెటర్నరీ డాక్టర్. 451 00:28:24,705 --> 00:28:25,998 అవును! 452 00:28:28,333 --> 00:28:29,543 -జోక్ చేస్తున్నావా? -కాదు. 453 00:28:30,335 --> 00:28:32,546 అయితే మరి మెడిసిన్ ఎందుకు చదువుతున్నావు… 454 00:28:33,213 --> 00:28:35,549 ఏదో సమయంలో, మనం తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించగలం, కదా? 455 00:28:35,632 --> 00:28:36,925 కానీ అది నీ నిర్ణయం, కాదంటావా? 456 00:28:37,467 --> 00:28:38,969 నిజమే… కానీ… 457 00:28:41,054 --> 00:28:42,389 నువ్వు ఎలా చేశావు? 458 00:28:43,640 --> 00:28:45,767 నా ఉద్దేశం, ఇందాక మనం నలేలీ దగ్గర ఉన్నప్పుడు… 459 00:28:47,352 --> 00:28:49,855 ఆమె బతకదు అని ఘోరంగా ఆలోచించాను. 460 00:28:52,065 --> 00:28:54,902 నేను పొరపాటు చేశాను. నా ఉద్దేశం, అలా చేయగల ధైర్యం నాకు లేదు. 461 00:28:57,487 --> 00:28:58,780 నాకు తెలియదు. 462 00:28:58,864 --> 00:28:59,865 నిజం… 463 00:29:01,366 --> 00:29:05,245 అక్కడ నేను పని చేసినంత కాలం… 464 00:29:07,706 --> 00:29:09,791 ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలు కాపాడలేకపోయాను. 465 00:29:10,375 --> 00:29:11,710 అది జరిగి ఎక్కువ కాలం కాలేదు. 466 00:29:13,462 --> 00:29:15,297 అది అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 467 00:29:15,380 --> 00:29:19,259 కానీ ఇప్పుడు అతని భార్య ఇంకా బిడ్డ ఒంటరి వాళ్లు అయ్యారు. 468 00:29:20,219 --> 00:29:21,553 అది అంతా గందరగోళం అయిపోయింది. 469 00:29:22,346 --> 00:29:24,848 సరే… చూడు, ఇక్కడ ఈ చిన్న పురుగుల్ని చూడు… 470 00:29:25,349 --> 00:29:26,808 ఇవి అంతరించిపోతున్న జాతికి చెందినవి, 471 00:29:27,309 --> 00:29:31,063 మేము ఇక్కడ ఏం చేశామంటే ముఖ్యంగా అవి పునరుత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేశాం. 472 00:29:31,146 --> 00:29:33,315 ఆ తరువాత వాటిల్ని మేము స్వేచ్ఛగా విడిచిపెట్టేస్తాం. 473 00:29:34,149 --> 00:29:36,401 మా ప్రయత్నంలో సగం సార్లు, అవి పునరుత్పత్తి చేయవు. 474 00:29:37,319 --> 00:29:39,238 ఎందుకంటే వాటి వాతావరణం అంతా మారిపోతుంది. 475 00:29:41,240 --> 00:29:42,950 అయినా కూడా, ఆ ప్రయత్నం తప్పకుండా చేయాలి. 476 00:29:44,701 --> 00:29:46,078 టమాయో… 477 00:29:47,579 --> 00:29:49,289 నువ్వు మంచి అనే పదానికి మించిన దానివి. 478 00:29:49,373 --> 00:29:51,542 నేను నా కుటుంబంలో అది చూశాను. 479 00:29:51,625 --> 00:29:52,960 నీకు ప్రమాణం చేసి చెబుతున్నాను, 480 00:29:53,043 --> 00:29:55,754 మనకి నీలాంటి డాక్టర్లు ఎక్కువమంది కావాలి ఇంకా అలాంటి వాళ్లు తక్కువ ఉండాలి. 481 00:29:57,589 --> 00:30:00,342 వాళ్లు ఎక్కువ ప్రమాణాలని పెంచరు, కదా? 482 00:30:00,425 --> 00:30:02,344 నా ఉద్దేశం, వాళ్లంతా ప్లాస్టిక్ సర్జరీ మేధావులు. 483 00:30:02,427 --> 00:30:04,054 అవును, అది కూడా నిజమే. 484 00:30:05,138 --> 00:30:07,266 హేయ్, నేను ఐదు నిమిషాలలో తిరిగి వస్తాను, ఆ తరువాత మనం వెళ్లిపోదాం, సరేనా? 485 00:30:07,349 --> 00:30:08,433 అలాగే! 486 00:30:12,855 --> 00:30:15,607 ఇది లంబ కోణం. 487 00:30:15,691 --> 00:30:18,360 ఇది తొంభై డిగ్రీలు ఉంటుంది… 488 00:30:18,443 --> 00:30:19,820 కేవలం ఈ కోణం దగ్గర. 489 00:30:19,903 --> 00:30:22,531 తరువాత ఇది లఘు కోణం. 490 00:30:22,614 --> 00:30:24,908 ఇది చూడు. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే… 491 00:30:25,534 --> 00:30:27,369 జూలిటో, నువ్వు దృష్టి పెడుతున్నావా? 492 00:30:27,452 --> 00:30:29,204 అవును, అవును, అవును, అవును! 493 00:30:30,080 --> 00:30:31,665 అయితే, ఇక్కడ ఇది ఏం సూచిస్తోంది? 494 00:30:33,834 --> 00:30:35,460 ఆబ్ట్యూస్ యాంగిల్? 495 00:30:36,670 --> 00:30:37,713 సరే. 496 00:30:45,762 --> 00:30:46,680 జూలిటో - మొద్దు అబ్బాయి 497 00:30:46,763 --> 00:30:48,140 మరి ఇది ఏంటి? 498 00:30:50,184 --> 00:30:52,186 లంబ కోణం? 499 00:30:59,484 --> 00:31:01,528 బాబు, నువ్వు మూర్ఖుడివి కావు. 500 00:31:02,237 --> 00:31:03,864 నువ్వు గుడ్డివాడివి! 501 00:31:15,167 --> 00:31:18,378 పిక్సీని నేను దాదాపుగా తీసుకెళ్లిపోయే దాన్ని. 502 00:31:18,879 --> 00:31:20,255 నిజంగా కుదరదు! 503 00:31:22,549 --> 00:31:24,176 లేదు, కానీ నిజంగా… 504 00:31:25,219 --> 00:31:26,470 థాంక్స్! 505 00:31:28,096 --> 00:31:29,223 దేనికి? 506 00:31:31,225 --> 00:31:32,643 అక్కడికి వచ్చినందుకు… 507 00:31:33,352 --> 00:31:34,811 నువ్వు అన్నీ అడిగి తెలుసుకున్నందుకు. 508 00:31:47,199 --> 00:31:48,534 ఓహ్, బాబు. 509 00:31:49,117 --> 00:31:53,288 నేను రౌల్ గురించి ఆలోచించకపోతే, మీరు కూడా ఆలోచించకండి. వింటున్నారా? 510 00:31:54,998 --> 00:31:58,168 నాకు వెళ్లాలని లేదు, కానీ నేను వెళ్లాలి. 511 00:32:01,630 --> 00:32:02,631 థాంక్స్. 512 00:32:05,425 --> 00:32:06,468 హేయ్! 513 00:32:11,765 --> 00:32:16,687 హేయ్, నీకు జంతువుల మీద ఉన్న ప్రేమ చాలా గొప్పగా అనిపిస్తోంది. 514 00:32:20,274 --> 00:32:21,149 ఉంటాను! 515 00:32:27,072 --> 00:32:29,283 మనం కొత్తది కొనవచ్చు కదా? 516 00:32:29,366 --> 00:32:31,660 కొన్ని వెబ్ సైట్లలో మంచి వస్తువులు ఉన్నాయి. 517 00:32:31,743 --> 00:32:33,620 నా దగ్గర ఉన్నది మళ్లీ నేను కొనను. 518 00:32:33,704 --> 00:32:35,122 ఇది మార్కుస్ బైక్, కదా? 519 00:32:35,706 --> 00:32:37,040 వాడు దీన్ని కనీసం తొక్కడు. 520 00:32:39,835 --> 00:32:42,754 మార్కుస్ ఎక్కడ ఉన్నాడు? నాకు అవసరమైనప్పుడు ఎప్పుడూ దగ్గరలో ఉండడు. 521 00:32:45,299 --> 00:32:47,759 వాడి జీవితం వాడు గడుపుతుండచ్చు, బహుశా. 522 00:32:48,260 --> 00:32:49,511 సరే… 523 00:32:52,264 --> 00:32:53,515 ఉండిపో. 524 00:32:56,143 --> 00:32:57,603 రమోన్… 525 00:32:58,103 --> 00:32:59,563 నేను కొన్ని పరిష్కరించాలని వచ్చాను. 526 00:33:00,272 --> 00:33:03,275 నేను నీతో గానీ ఆ మతాధికారితో గానీ బతకాలని అనుకోవడం లేదు. 527 00:33:03,775 --> 00:33:05,611 నువ్వు ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు. 528 00:33:06,111 --> 00:33:09,740 దాని గురించి ఆందోళన పడకు, నేను ఇదివరకటి మనిషిని కాను. 529 00:33:12,284 --> 00:33:13,785 చూడు… 530 00:33:13,869 --> 00:33:15,245 నాకు చనిపోవాలని లేదు, లెటీ. 531 00:33:15,329 --> 00:33:16,371 నాకు బతకాలని ఉంది. 532 00:33:16,872 --> 00:33:18,457 నా పిల్లల్ని నేను ప్రేమిస్తాను… 533 00:33:20,209 --> 00:33:21,210 ఇంకా నిన్ను ప్రేమిస్తాను. 534 00:33:24,546 --> 00:33:25,881 ప్రతి విషయంలో కూడా. 535 00:33:27,466 --> 00:33:29,301 నాకు ఇప్పుడు చర్చ్ కి వెళ్లాలని ఉందని చెప్పినా ప్రేమిస్తావా? 536 00:33:30,093 --> 00:33:33,722 నీకు చర్చ్ కి వెళ్లాలని ఉన్నా కూడా. 537 00:33:35,974 --> 00:33:37,476 సరే చూద్దాం… 538 00:33:37,559 --> 00:33:41,146 మనం దీనిని సరి చేద్దాం. ఇది ఒకటే సమస్య కాదు కదా. 539 00:33:45,234 --> 00:33:47,069 అవసరమైన వస్తువులు సేకరణ కేంద్రం 540 00:33:48,445 --> 00:33:50,948 డోనా మండీ, నీకు దుప్పట్లు తరువాత తెచ్చి ఇస్తాను, సరేనా? 541 00:33:56,870 --> 00:33:57,996 బాబూ! 542 00:33:58,747 --> 00:33:59,915 ఏంటి సంగతి, డాక్టర్? 543 00:33:59,998 --> 00:34:01,333 ఎలా గడిచింది? 544 00:34:04,002 --> 00:34:06,672 సరే, నీకు సాయం కావాలా? 545 00:34:08,257 --> 00:34:10,132 నన్ను చూడనివ్వు. అదంతా నాకు ఇవ్వు. 546 00:34:21,436 --> 00:34:22,603 ఇది ఏంటి…? 547 00:34:23,897 --> 00:34:25,607 ఇది క్రిస్ ది. 548 00:34:25,690 --> 00:34:27,693 ఛ. ఇది మారేది! బాబూ… 549 00:34:28,193 --> 00:34:29,235 అది నిజమే. 550 00:34:29,735 --> 00:34:32,739 ఆమె ఆల్బమ్స్ అన్నీ ఉన్నాయా? దీని ఖరీదు ఎంత? 551 00:34:32,822 --> 00:34:34,533 దాన్ని క్రిస్ కి బహుమతిగా ఇచ్చారు, బాబు. 552 00:34:34,616 --> 00:34:37,034 -ఎవరు ఇచ్చారు? -ఇంకెవరు అనుకుంటున్నావు? మారే ఇచ్చింది, డూడ్. 553 00:34:37,119 --> 00:34:39,079 -నువ్వు అబద్ధం చెబుతున్నావు. -నిజం! 554 00:34:39,161 --> 00:34:41,373 ఆమె ఇప్పుడు మీ ఫ్రెండ్ అయిపోయిందా? ఆమెని ఎక్కడ కలిశారు? 555 00:34:41,456 --> 00:34:43,958 అంటే, క్రిస్, నేను ఒక ఈవెంట్ కి వెళ్లాం. 556 00:34:44,042 --> 00:34:45,960 మేము పాడుతుంటే ఆమె విన్నది. 557 00:34:47,170 --> 00:34:48,672 ఆమె మరో నిర్ణయం తీసుకోలేకపోయింది. 558 00:34:48,755 --> 00:34:49,755 బాగుంది! 559 00:34:49,840 --> 00:34:52,217 మమ్మల్ని ఆమె లాస్ ఏంజెలెస్ కి ఆహ్వానించింది. 560 00:34:52,301 --> 00:34:53,467 దేని కోసం? 561 00:34:54,887 --> 00:34:56,013 పాట రికార్డు చేయడానికి. 562 00:34:56,889 --> 00:34:59,516 అయితే మరి ఈ విషయాన్ని ఇంత నిదానంగా ఎందుకు చెబుతున్నావు? నువ్వు ఏం చేయబోతున్నావు? 563 00:35:07,608 --> 00:35:09,943 నేను ఈ వాహనాన్ని నడపడానికే పుట్టాను అనుకుంటా, డాక్టర్. 564 00:35:11,236 --> 00:35:13,614 నాకు ఒక్కోసారి నిజంగా అనిపిస్తుంది, దీని నుంచి కిందకి కూడా దిగాలని అనిపించదు. 565 00:35:14,698 --> 00:35:16,742 అంటే, నాకు ఇంకో విషయంలో ప్రతిభ ఉంటే ఏంటి? 566 00:35:19,661 --> 00:35:21,997 వేరే ఎక్కడో నేను బతకాలి అనుకుంటున్నాను. 567 00:35:22,080 --> 00:35:23,081 క్రిస్ తో పాటు. 568 00:35:24,875 --> 00:35:26,084 మేము ముగ్గురం. 569 00:35:28,754 --> 00:35:29,880 ఆమె గర్భం ఎలా ఉంది? 570 00:35:32,424 --> 00:35:33,425 చూద్దాం. 571 00:35:34,384 --> 00:35:36,053 ఆమెకి వెళ్లిపోవాలని ఉంది, కదా? 572 00:35:36,136 --> 00:35:37,721 నిజంగా తనకి వెళ్లిపోవాలని ఉంది. 573 00:35:39,515 --> 00:35:41,016 ఆమె చాలాకాలంగా వెళ్లిపోవాలని కోరుకుంటోంది. 574 00:35:42,226 --> 00:35:43,310 మరి నీ సంగతి ఏంటి? 575 00:35:44,353 --> 00:35:45,687 రమోన్ పని అయిపోయింది, బుజ్జీ. 576 00:35:46,563 --> 00:35:48,857 ఈ అంబులెన్సులో ఉండిపోవాలి అన్నదే జూలిటో ఏకైక కోరిక. 577 00:35:49,358 --> 00:35:52,152 వాడు ఏం కావాలి అనుకున్నా చేయగలిగే వాడు కానీ వాడు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. 578 00:35:52,653 --> 00:35:54,238 వాడు నాలాగ తయారవ్వాలని నేను కోరుకోవడం లేదు. 579 00:35:56,114 --> 00:35:59,409 ఇంకా నువ్వు ఇంకా కాలేజీలో చదువుతున్నావు. నువ్వు రాణిస్తావు, డాక్టర్, నువ్వు సాధిస్తావు. 580 00:36:02,913 --> 00:36:04,915 ఇక్కడ ఏమీ చేతకానివాడిని నేనే. 581 00:36:06,041 --> 00:36:07,167 ఆగు, ఒక నిమిషం ఆగు. 582 00:36:07,709 --> 00:36:11,255 మనకి ఈ జీవితం కావాలా అని ఎవరూ మనల్ని అడగలేదు. 583 00:36:11,880 --> 00:36:15,217 కానీ నేను నీతో ఉన్నాను, ఈ ప్రయాణంలో మనం ఇద్దరం కలిసి ఉంటాం. 584 00:36:17,886 --> 00:36:19,304 ఏ ప్రయాణం? 585 00:36:20,681 --> 00:36:22,599 చాంగో. నాకు ఒక హగ్ ఇవ్వు, పిచ్చోడా. 586 00:36:22,683 --> 00:36:23,851 నువ్వు రెడీయేనా? 587 00:36:24,518 --> 00:36:25,936 ఇప్పటికే ఆలస్యం అయింది. 588 00:36:26,645 --> 00:36:28,647 ఇది నీ కొడుకు చేసిన పొరపాటు. 589 00:36:38,365 --> 00:36:40,284 కార్మెన్సిటా, పోలీసుల నుంచి నీకు ఏమైనా ఫోన్ వచ్చిందా? 590 00:36:40,367 --> 00:36:43,120 వచ్చింది, అది 10-31, చాలా ప్రమాదకరంగా ఉండచ్చు. 591 00:36:43,203 --> 00:36:46,248 దగ్గరలో మా అంబులెన్స్ మాత్రమే ఉందా, నువ్వు కనుక్కుని చెప్పగలవా? 592 00:36:46,331 --> 00:36:47,833 నాకు కొద్ది సెకన్లు టైమ్ ఇవ్వు… 593 00:36:50,627 --> 00:36:52,963 నువ్వు నిజంగానే అంటున్నావా, రమోన్? 594 00:36:53,046 --> 00:36:55,591 అవును, రమోన్, దగ్గరలో మీ అంబులెన్స్ మాత్రమే ఉంది. 595 00:36:56,925 --> 00:36:58,218 -సైరన్ ఆన్ చేయి. -రమోన్… 596 00:36:58,302 --> 00:36:59,469 దాన్ని ఆన్ చేయి! 597 00:37:26,413 --> 00:37:27,831 థాంక్స్! 598 00:37:38,842 --> 00:37:40,552 ఆఫీసర్, ఇక్కడ పరిస్థితులు ఏంటి? 599 00:37:40,636 --> 00:37:44,681 ఆ స్టోర్ ని ఇంక మూసేయబోతున్నారు, ఈలోగా ఇద్దరు టీనేజ్ పిల్లలు వచ్చి దొంగతనం చేయబోయారు. 600 00:37:44,765 --> 00:37:47,226 ఒక ఉద్యోగి ఎమర్జెన్సీ బటన్ నొక్కగలిగాడు. 601 00:37:47,809 --> 00:37:50,604 ప్రైవేట్ సెక్యూరిటీ చేరుకున్నారు. వాళ్లు షూట్ చేయడం మొదలుపెట్టారు. 602 00:37:50,687 --> 00:37:52,648 అక్కడ ఒక మహిళ గాయపడి ఉంది. 603 00:37:52,731 --> 00:37:55,192 -ఎంత సేపటి నుండి ఉంది? -అరగంట నుండి, బహుశా ఇంకా ఎక్కువ సేపు కావచ్చు. 604 00:37:55,275 --> 00:37:56,944 కానీ మేము ఆ దొంగలతో మాట్లాడగలిగాము 605 00:37:57,027 --> 00:37:58,862 ఇద్దరు పారామెడిక్ లు వచ్చి ఆమెని బయటకు తీసుకువస్తారని చెప్పాం. 606 00:37:58,946 --> 00:38:01,281 మరిగాబీ, మనం స్ట్రెచర్ ఇంకా హార్ట్ మాన్స్ పరికరాలతో లోపలికి వెళ్తన్నాం. 607 00:38:01,365 --> 00:38:04,618 లేదు, నీతో పాటు ఒక పోలీస్ అధికారి పారామెడిక్ వేషంలో వెళతాడు. 608 00:38:04,701 --> 00:38:06,578 మరి గాయపడిన వాళ్లకి ఎలా చికిత్స చేయాలో అతనికి తెలుసా? 609 00:38:07,663 --> 00:38:10,457 ఎందుకంటే, ఒకరు గాయపడ్డారని ఇప్పుడే చెప్పారు, ఇంకొంతమంది గాయపడి ఉండచ్చు కదా. 610 00:38:10,541 --> 00:38:12,084 పైగా, మాలో ఒకరు పారామెడిక్ కాదు అని వాళ్లకి తెలిస్తే 611 00:38:12,167 --> 00:38:14,586 పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 612 00:38:16,964 --> 00:38:18,841 సరే, లోపలికి వెళ్లండి, ఆమెని బయటకి తీసుకురండి. 613 00:38:19,466 --> 00:38:21,176 మార్కుస్ ఇంకా నేను వెళతాం, నువ్వు ఆ పని చేయలేవు. 614 00:38:21,260 --> 00:38:24,054 వద్దు. మార్కుస్ ఇంతకుముందు ఎప్పుడూ తుపాకీతో కాల్చిన గాయానికి చికిత్స చేయలేదు. నేను వస్తున్నాను. 615 00:38:24,137 --> 00:38:25,556 నాకు ఎవరూ హీరోలు వద్దు. 616 00:38:25,639 --> 00:38:27,724 కంగారు పడద్దు, వాళ్లు ఈ రోజు సెలవు తీసుకున్నారు. 617 00:38:27,808 --> 00:38:29,393 ఈయన లోపలికి వెళ్తాడు. ఎవ్వరూ కదలద్దు. 618 00:38:31,353 --> 00:38:33,564 నువ్వు ప్రశాంతంగా ఉంటానని నాకు ప్రామిస్ చేయి. 619 00:38:33,647 --> 00:38:35,440 కష్టం అంతా నేను పడతాను. 620 00:38:35,524 --> 00:38:36,733 సిద్ధమా? 621 00:38:36,817 --> 00:38:38,068 రెడీ! 622 00:38:54,418 --> 00:38:55,419 తెరవండి. 623 00:39:03,260 --> 00:39:04,595 మూసేయండి. త్వరగా! 624 00:39:05,512 --> 00:39:06,889 ఇప్పుడు, వెళ్లండి. 625 00:39:06,972 --> 00:39:08,265 త్వరగా! 626 00:39:08,932 --> 00:39:10,684 ఎలాంటి పొరపాటు చేయద్దు. 627 00:39:10,767 --> 00:39:13,395 మేము నగల దుకాణాన్ని దొంగిలించడానికి రాలేదు. 628 00:39:14,313 --> 00:39:17,441 మేము ఇక్కడికి సాయం చేయడానికి వచ్చాం, మీరు అడిగిన విధంగానే, సరేనా? 629 00:39:26,742 --> 00:39:28,160 హేయ్, అమ్మాయి. నువ్వు బాగానే ఉన్నావా? 630 00:39:34,958 --> 00:39:37,252 ఈమె బతకాలి అంటే తనని వెంటనే మేము హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి. 631 00:39:41,089 --> 00:39:43,008 లేదు, లేదు, లేదు, ఆపు. 632 00:39:43,091 --> 00:39:45,969 మీరు వెళ్లారంటే, స్వాట్ టీమ్ వస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుందో నాకు తెలుసు. 633 00:39:46,053 --> 00:39:48,931 ఇది సినిమా కాదు, తెలుసా? ఆమె చనిపోబోతోందని చెప్పాను వినలేదా? 634 00:39:49,014 --> 00:39:50,807 ఒకసారి ఆలోచించు, డూడ్. ఆమె నీ కారణంగా చనిపోయిందని 635 00:39:50,891 --> 00:39:53,352 -నీ జీవితాంతం బాధపడతావా లేదా? -నోరు మూయి! 636 00:39:54,144 --> 00:39:55,729 ఇదంతా చాలా గందరగోళంగా ఉంది. 637 00:39:56,480 --> 00:39:58,982 ఆమె చనిపోతే, అంతా అయిపోతుంది. పరిస్థితి చేయి దాటిపోతుంది. 638 00:39:59,066 --> 00:40:01,068 అందరి పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. 639 00:40:03,028 --> 00:40:06,323 ఆమెని బతికించాలన్నదే మా ప్రయత్నం, సరేనా? 640 00:40:07,950 --> 00:40:10,244 ఈ చెత్త వెధవలు. 641 00:40:10,327 --> 00:40:13,372 ఒక మనిషి జీవితం కన్నా ఈ నగలు అంత ముఖ్యం ఏమీ కావు. అది నిజం. 642 00:40:13,914 --> 00:40:17,626 మా వృత్తిని మేము చేయడానికి మా ప్రాణాలు పణంగా పెట్టడం అంత తేలికైన విషయం కాదు. 643 00:40:18,126 --> 00:40:20,671 నాతో పాటు ఉండు, డియర్. హేయ్. హేయ్, హేయ్, హేయ్. హేయ్! 644 00:40:24,132 --> 00:40:25,467 ఎలా నడుస్తోంది, ఏం జరుగుతోంది? 645 00:40:25,551 --> 00:40:26,885 నా మనిషి, మార్కుస్. 646 00:40:27,636 --> 00:40:29,763 మేము రేడియోలో దీని గురించి విన్నాం, ఇక్కడ ఏం జరుగుతోంది? 647 00:40:29,847 --> 00:40:33,016 మేము ఇంకా ఎదురు చూస్తున్నాం. బాబూ, ఇదంతా గందరగోళంగా ఉంది, వాళ్లు ఒక్క మాట కూడా చెప్పడం లేదు. 648 00:40:33,100 --> 00:40:35,811 -స్వాట్ టీమ్ మరో ఐదు నిమిషాల్లో వస్తుంది. -విన్నాము, సర్. 649 00:40:35,894 --> 00:40:37,104 ఆగండి, నాతో పాటు రండి. 650 00:40:37,187 --> 00:40:39,273 -కెప్టెన్, కెప్టెన్. -నువ్వు రావడానికి వీల్లేదు! 651 00:40:39,356 --> 00:40:41,441 కెప్టెన్, మా నాన్న ఇంకా మా చెల్లెలు లోపల ఉన్నారు. 652 00:40:41,525 --> 00:40:43,735 నన్ను లోపలికి వెళ్లనివ్వండి, ప్లీజ్. నేను కేవలం వాళ్లతో మాట్లాడాలి. 653 00:40:46,446 --> 00:40:47,948 మేము ఈమెని బయటకు తీసుకువెళ్లాలి, సరేనా? 654 00:40:48,031 --> 00:40:49,825 లేదు, లేదు, లేదు! అసలు తీసుకువెళ్లద్దు! 655 00:40:49,908 --> 00:40:51,285 తనకి ఇక్కడే నయం చేయండి. 656 00:40:51,368 --> 00:40:52,452 ఎవ్వరూ బయటకి వెళ్లడానికి వీల్లేదు. 657 00:40:52,536 --> 00:40:54,413 నువ్వు కోపంగా ఉన్నావు, బాబు. ఏం అంటున్నావో తెలియడం లేదు. 658 00:40:54,496 --> 00:40:55,747 నోరు మూయి. నోరు మూయమన్నాను! 659 00:42:22,626 --> 00:42:24,628 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్