1 00:00:12,596 --> 00:00:14,473 అది మిస్టర్ సాబిచ్ తీరు అనుకుంటా... 2 00:00:14,473 --> 00:00:16,308 రెండో రోజు విచారణ ప్రారంభం కావడంతో, 3 00:00:16,308 --> 00:00:18,268 ఎన్నో ఊహాగానాలతో కోర్ట్ రూమ్ సందడిగా మారింది. 4 00:00:18,268 --> 00:00:20,938 ప్రాసిక్యూషన్ వారి బలమైన వాదనతో ఈ కేసు విచారణ ప్రారంభం కావడంతో 5 00:00:20,938 --> 00:00:22,147 ఈ న్యాయపోరాటం హోరాహోరీగా సాగేలా ఉంది. 6 00:00:22,147 --> 00:00:25,067 మోల్టో మొదట్లో ఇచ్చిన స్టేట్మెంట్ చాలా బలమైన సందేశాన్ని ఇచ్చింది. 7 00:00:25,067 --> 00:00:28,570 ఆత్మవిశ్వాసంతో పాటు ఏమాత్రం సడలని పట్టుదలతో, అతను వాడిగా తన వాదన ప్రారంభించాడు... 8 00:00:28,570 --> 00:00:30,030 ...ఎలాంటి సందేహానికీ తావులేకుండా. 9 00:00:30,030 --> 00:00:33,033 టామీ మోల్టో ఎంతో ఉద్వేగంతో చేసిన ప్రారంభ ప్రసంగం 10 00:00:33,033 --> 00:00:35,494 అటు జ్యూరీ సభ్యుల్ని ఇటు ప్రేక్షకులనీ భావోద్వేగానికి గురి చేసింది. 11 00:00:35,494 --> 00:00:38,956 ...సుప్రసిద్ధ డిఫెన్స్ న్యాయవాది రేమండ్ హోర్గన్ తో అతను పోటాపోటీగా వాదిస్తున్నాడు. 12 00:00:38,956 --> 00:00:41,291 ...లేదా టామీ మోల్టో చేసిన ఉద్వేగభరితమైన ప్రారంభ ప్రసంగం 13 00:00:41,291 --> 00:00:43,502 ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో 14 00:00:43,502 --> 00:00:45,921 ప్రాసిక్యూషన్ వాదనలకు అది బలమైన పునాదిని అందిస్తుందా? 15 00:00:47,422 --> 00:00:48,966 నువ్వు ఒక చెత్తవెధవవి! 16 00:00:50,717 --> 00:00:52,886 డాక్టర్, మనం ఇక్కడ చూస్తున్న దాని గురించి మీరు వివరించగలరా? 17 00:00:53,554 --> 00:00:56,098 బలంగా తగిలిన గాయాలు 18 00:00:56,098 --> 00:00:57,307 కారొలిన్ పొలీమస్ మరణానికి దారి తీశాయి. 19 00:00:57,307 --> 00:01:00,477 ఒక సన్నని, బలమైన వస్తువుతో మూడుసార్లు కొట్టడంతో పుర్రె భాగంలో చీలిక ఏర్పడి... 20 00:01:01,645 --> 00:01:04,105 ...తీవ్రమైన మూర్ఛ రావడంతో పాటు, పుర్రెలో పగుళ్లు, మెదడులో హెర్నియేషన్ ఏర్పడ్డాయి. 21 00:01:04,105 --> 00:01:05,065 హెర్నియేషన్ అంటే? 22 00:01:05,065 --> 00:01:07,484 పుర్రె మీద బలమైన ఒత్తిడి కలగడం వల్ల మెదడులోని కొన్ని భాగాలు కదిలి, 23 00:01:07,484 --> 00:01:08,485 బయటకు తన్నుకొస్తాయి. 24 00:01:08,485 --> 00:01:10,696 అయితే ఆ చీలికల గుండా మెదడు భాగాలు బయటకు వచ్చాయంటారా? 25 00:01:10,696 --> 00:01:12,823 కరెక్ట్. మనకి ఫోటోలలో కనిపించనిది ఏమిటంటే 26 00:01:12,823 --> 00:01:15,033 వెన్నెముకకి కలిపే ఫోరమెన్ మాగ్నమ్ రంధ్రం నుంచి కూడా మెదడు భాగాలు బయటకొచ్చాయి. 27 00:01:15,033 --> 00:01:17,077 సరిగ్గా ఆ ప్రదేశంలోనే పుర్రె కింది భాగంలోకి వెన్నెముక ప్రవేశిస్తుంది. 28 00:01:17,077 --> 00:01:19,246 - అయితే చనిపోవడానికి అదే కారణమా? - అదే కావచ్చు, 29 00:01:19,246 --> 00:01:21,540 కానీ హెర్నియేషన్ జరగడానికి ముందే ఆమె అధిక రక్తస్రావంతో చనిపోయి ఉండచ్చు. 30 00:01:21,540 --> 00:01:22,916 ఆమె ఏ సమయంలో మరణించి ఉండవచ్చని మీ అంచనా? 31 00:01:22,916 --> 00:01:25,043 శరీర ఉష్ణోగ్రత ఇంకా శరీరం, కాలేయం బిగుసుకుపోవడం బట్టి చూస్తే 32 00:01:25,043 --> 00:01:26,920 ఆమె రాత్రి పది గంటల నుండి అర్ధరాత్రి మధ్యలో మరణించి ఉంటుంది. 33 00:01:26,920 --> 00:01:29,298 మరి ఆమె ముఖం మీద మచ్చల సంగతి ఏంటి? 34 00:01:29,298 --> 00:01:30,591 అవి ఆమె కిందపడినట్లు సూచిస్తాయి. 35 00:01:30,591 --> 00:01:32,217 ఆమె తల వెనుక భాగం మీద ఒకసారి బలంగా కొట్టడం వల్ల, 36 00:01:32,217 --> 00:01:33,802 ఆమె ముందుకి పడిపోయి, ముక్కు విరిగింది, 37 00:01:33,802 --> 00:01:36,430 దాని వల్ల ఆమె కళ్ల కింద ఇంకా బుగ్గల మీద మచ్చలు ఏర్పడ్డాయి. 38 00:01:36,430 --> 00:01:39,141 ఆ తరువాత ఆమె పుర్రె మీద మరో రెండుసార్లు బలంగా కొట్టడం జరిగింది. 39 00:01:39,141 --> 00:01:41,894 ఆమె ప్రాణంతో ఉండగానే ముఖం కమిలిపోయింది. 40 00:01:41,894 --> 00:01:43,604 ఆ తరువాత మరింత తీవ్రమైన దెబ్బలు తగిలాయి. 41 00:01:43,604 --> 00:01:45,647 ఆమె తనని తాను కాపాడుకోవడానికి ప్రయత్నించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? 42 00:01:45,647 --> 00:01:47,733 ఆత్మరక్షణ కోసం ఆమె పెనుగులాడి గాయపడిన ఆధారాలు ఏమీ లేవు. 43 00:01:47,733 --> 00:01:50,444 హతురాలి చేతి గోళ్లు ఒకదాని అంచుల్లో 44 00:01:50,444 --> 00:01:52,196 ప్రతివాది చర్మపు ఆనవాళ్లు కనిపించాయి. 45 00:01:52,196 --> 00:01:55,490 ఆమె ఆత్మరక్షణ కోసం ప్రయత్నిస్తూ అతడిని గీరి ఉండే అవకాశం ఏమైనా ఉందా? 46 00:01:55,490 --> 00:01:58,660 ఆ అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే, ఆమె ఈ దాడిని ఊహించలేదని చెప్పచ్చు. 47 00:01:58,660 --> 00:02:00,579 మీరు చెప్పిన ప్రకారం ఆమె దెబ్బల వల్ల చనిపోలేదు, 48 00:02:00,579 --> 00:02:03,457 - కానీ నేల మీద పడి, రక్తస్రావంతో చనిపోయింది, అంతేనా? - అవును, సర్. 49 00:02:03,457 --> 00:02:05,000 - ఆమె బాధని అనుభవించింది. - ఇది సూచన. 50 00:02:05,000 --> 00:02:07,419 - ఆమె వేదన అనుభవించిందా? - అది నేను చెప్పలేను. 51 00:02:07,419 --> 00:02:10,297 పుర్రె మీద బలంగా కొట్టడం వల్ల ఆమె స్పృహ కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 52 00:02:10,297 --> 00:02:13,800 ఆమె స్పృహలో లేదని, తీవ్రమైన బాధని అనుభవించలేదని మీరు చెప్పగలరా? 53 00:02:14,301 --> 00:02:15,844 నేను అది చెప్పలేను, లేదు. 54 00:02:15,844 --> 00:02:18,722 డాక్టర్, మీ దగ్గర మిస్ పొలీమస్ కి సంబంధించి ఇంకా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? 55 00:02:18,722 --> 00:02:22,726 ఉన్నాయి. ఆమె హత్యకు గురయ్యే సమయానికి ఆమె ఆరువారాల గర్భవతి. 56 00:02:23,727 --> 00:02:25,395 యువర్ హానర్, ఈ సందర్భంగా, 57 00:02:25,395 --> 00:02:28,524 వాది, ప్రతివాదుల ఇద్దరూ అంగీకరించిన డిఎన్ఎ విశ్లేషణ నివేదికని మీకు సమర్పిస్తున్నాను, 58 00:02:28,524 --> 00:02:31,860 ఆ బిడ్డకి తండ్రి ప్రతివాది అని అది రుజువు చేస్తోంది. 59 00:02:31,860 --> 00:02:33,070 పరిగణించబడింది. 60 00:02:33,070 --> 00:02:35,072 అయితే అతను ఆమెని గర్భవతిని చేశాడా? 61 00:02:35,072 --> 00:02:36,448 అవును, అతనే చేశాడు. 62 00:02:38,575 --> 00:02:39,576 నా దగ్గర సాక్ష్యాలు ఇవే. 63 00:02:40,577 --> 00:02:41,411 మిస్టర్ హోర్గన్. 64 00:02:41,411 --> 00:02:44,456 ఈ సాక్షిని డిఫెన్స్ తరపున మేము ప్రశ్నించబోవడం లేదు, యువర్ హానర్. 65 00:02:44,456 --> 00:02:47,167 - డాక్టర్ కుమగై... - వాస్తవానికి, నేను ముసలివాడిని ఇంకా నేను... 66 00:02:47,918 --> 00:02:50,254 వివరాలు ఏవీ మిస్ కాలేదని ఒకసారి సరి చూసుకుంటాను. 67 00:02:50,254 --> 00:02:52,756 "ఒక సన్నని, బరువైన వస్తువు"ని వాడారని మీరు చెప్పారు. 68 00:02:52,756 --> 00:02:53,841 నాకు అర్థమైనంత వరకూ, 69 00:02:53,841 --> 00:02:58,929 ఆ సన్నని, బరువైన వస్తువుని ఎవరు ఉపయోగించారో మీరు కనిపెట్టలేకపోయారు. 70 00:02:58,929 --> 00:03:01,557 - నిజానికి, అవి కనీసం సూచించడం లేదు. - అవును నిజం. 71 00:03:01,557 --> 00:03:03,392 మీరు వైద్యపరంగా 72 00:03:03,392 --> 00:03:05,686 కారొలిన్ పొలీమస్ ని ఎవరు చంపారో నిర్ధారించలేరు. 73 00:03:05,686 --> 00:03:07,688 ఆమె హత్యకి గురైందని మాత్రమే 74 00:03:07,688 --> 00:03:09,231 నేను ఖచ్చితంగా చెప్పగలను. 75 00:03:09,231 --> 00:03:10,566 ఆహ్... హా. 76 00:03:11,108 --> 00:03:17,197 ఇంకా ఎలాంటి సన్నని, బరువైన వస్తువుని లేదా హత్యా ఆయుధాన్ని మీరు స్వాధీనం చేసుకోలేదు కదా? 77 00:03:17,197 --> 00:03:18,282 కరెక్ట్. 78 00:03:18,782 --> 00:03:19,783 థాంక్యూ. 79 00:03:23,537 --> 00:03:24,872 మిస్టర్ మోల్టో. మీరు విచారిస్తారా? 80 00:03:25,372 --> 00:03:26,248 వద్దు. 81 00:03:27,416 --> 00:03:31,128 - మనకి కావాల్సింది దొరికింది. ఇక చాలు... - డాక్టర్, మీరు శవపరీక్షని పూర్తి చేశాక, 82 00:03:31,128 --> 00:03:33,005 మీరు ప్రతివాదికి ఎదురుపడిన సందర్భం ఏమైనా ఉందా? 83 00:03:33,005 --> 00:03:36,592 అవును, అతను మా ఆఫీస్ కి వచ్చి ఆ మృతదేహాన్ని చూడాలంటూ చాలా కోపంగా డిమాండ్ చేశాడు. 84 00:03:36,592 --> 00:03:40,012 ఒక డిస్ట్రిక్ట్ అటార్నీ అలా ప్రవర్తించడం సహజంగా జరుగుతుందా? 85 00:03:40,012 --> 00:03:42,306 అలా జరగడానికి ఆస్కారం ఉంది, కానీ సాధారణంగా అలా జరిగే అవకాశం ఉండదు. 86 00:03:42,306 --> 00:03:46,643 మిస్టర్ సాబిచ్ గతంలో హత్యకు గురైన వారిని చూపించమని ఇలాగే బలవంతపెట్టేవారా? 87 00:03:46,643 --> 00:03:49,271 - లేదు. - మిస్టర్ సాబిచ్ ఎప్పుడయినా 88 00:03:49,271 --> 00:03:52,482 - హత్యకు గురైన వారిని వ్యక్తిగతంగా చూడటానికి వచ్చేవారా? - ఎప్పుడూ రాలేదు. 89 00:03:52,482 --> 00:03:54,735 కానీ ఆ రోజు అతను వచ్చినప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంది? 90 00:03:54,735 --> 00:03:58,780 - ఆయన కోపంగా, స్థిమితం లేకుండా, భయంతో కనిపించాడు. - భయంగానా? 91 00:03:58,780 --> 00:04:00,115 అప్పటికి నాకు అర్థం కాలేదు. 92 00:04:00,115 --> 00:04:01,408 కానీ ఇప్పుడు మీకు అర్థమైందా? 93 00:04:01,408 --> 00:04:04,786 నాకు ఏం అనిపించిందంటే, నాకు తెలిసిన వివరాల్ని తెలుసుకోవాలని అతను అనుకోలేదు, 94 00:04:04,786 --> 00:04:06,705 కానీ వాటి గురించి భయపడినట్లుగా నాకు అనిపించింది. 95 00:04:07,581 --> 00:04:09,166 ఆయన ఎందుకో విచిత్రంగా ప్రవర్తించాడు. 96 00:04:11,502 --> 00:04:12,503 నేను చెప్పదల్చుకున్న విషయాలు ఇవే. 97 00:04:13,420 --> 00:04:18,841 డాక్టర్, కోపం ప్రదర్శించడం గురించి, భయపడటం లేదా అలాంటి మానసిక స్థితిని డయాగ్నైజ్ చేయడానికి 98 00:04:18,841 --> 00:04:21,887 మీరు మానసిక రోగ నిర్ధారణకి సంబంధించి ఏమైనా చదువుకున్నారా? 99 00:04:22,971 --> 00:04:24,056 "విచిత్రంగా"? 100 00:04:24,056 --> 00:04:25,849 ప్రతివాదితో నాకు కొంతకాలంగా పరిచయం ఉంది, 101 00:04:25,849 --> 00:04:29,144 ఆ కారణంగా అతని ప్రవర్తించే తీరు గురించి నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి, 102 00:04:29,144 --> 00:04:31,146 అతని ప్రవర్తన భిన్నంగా ఉందని మాత్రం చెప్పగలను. 103 00:04:31,146 --> 00:04:33,106 మీకు అతనితో పరిచయం ఉంది. మీరు ఇద్దరూ స్నేహితులా? 104 00:04:33,106 --> 00:04:34,316 మేము కొలీగ్స్, ఫ్రెండ్స్ కాదు. 105 00:04:34,316 --> 00:04:37,611 ఫ్రెండ్స్ కాదు. వాస్తవంగా, మీరు నా క్లయింట్ ని మతిస్థిమితం లేనివాడిగా చెబుతున్నారు. 106 00:04:37,611 --> 00:04:40,405 - అబ్జెక్షన్. - పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారు. 107 00:04:41,573 --> 00:04:42,574 నేను దాన్ని అనుమతిస్తున్నాను. 108 00:04:45,202 --> 00:04:48,622 కొన్ని సందర్భాలలో కోపావేశాలు పెరుగుతాయి, అతడిని అలా పిలిచినందుకు పశ్చాత్తాపపడుతున్నాను. 109 00:04:48,622 --> 00:04:51,333 డిస్ట్రిక్ట్ అటార్నీల మీద మీకు సానుకూలమైన అభిప్రాయాలు ఉన్నాయా? 110 00:04:51,917 --> 00:04:53,669 నిజానికి లేవు. అది అర్థరహితమైన వాదన. 111 00:04:53,669 --> 00:04:55,462 - నువ్వు నన్ను ఎప్పుడైనా మూర్ఖుడని తిట్టావా? - అబ్జెక్షన్. 112 00:04:55,462 --> 00:04:57,589 యువర్ హానర్, ఇక్కడ పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నప్పుడు... 113 00:04:57,589 --> 00:04:58,966 మర్యాదని అతిక్రమించవద్దు. 114 00:04:59,675 --> 00:05:00,509 డాక్టర్. 115 00:05:01,426 --> 00:05:04,096 మీరు, నేను కూడా కొన్నిసార్లు గొడవ పడ్డాము. 116 00:05:04,096 --> 00:05:05,764 వృత్తిలో ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. 117 00:05:05,764 --> 00:05:08,600 మా వృత్తి చాలా కీలకమైనది, ఇంకా చాలా ఒత్తిడితో కూడుకున్నది 118 00:05:08,600 --> 00:05:10,978 అందుకే కొన్నిసార్లు కొంత కోపాన్ని బయటకి వెళ్లగక్కి ఆ ఒత్తిళ్లని తగ్గించుకుంటాము. 119 00:05:10,978 --> 00:05:14,606 కానీ ప్రాసిక్యూటర్ల పట్ల నాకు ఎలాంటి వ్యతిరేక భావమూ లేదు, 120 00:05:14,606 --> 00:05:16,733 దాన్ని చాలా నేరంగా కూడా నేను పరిగణిస్తాను. 121 00:05:16,733 --> 00:05:18,777 మీరు ఎప్పుడయినా టామీ మోల్టోని మూర్ఖుడు అని తిట్టారా? 122 00:05:18,777 --> 00:05:20,362 - అబ్జెక్షన్. - అతను మీకంటే పెద్ద మూర్ఖుడు కాదు. 123 00:05:20,362 --> 00:05:21,446 డాక్టర్ కుమగై. 124 00:05:21,446 --> 00:05:23,031 బహుశా అందుకే మీరు మళ్లీ ఎన్నిక కాలేదు. 125 00:05:23,031 --> 00:05:24,533 - డాక్టర్. - మీరు ఊరికే ప్రయాసపడకండి. 126 00:05:24,533 --> 00:05:25,868 అయ్యో లేదు, ఒకటి నిజం. మిమ్మల్ని తీసేశారు, 127 00:05:25,868 --> 00:05:27,327 - అవునా? అదీ. - డాక్టర్ కుమగై. 128 00:05:27,327 --> 00:05:29,454 మేము వెళ్లాలి. తప్పుకోండి. 129 00:05:34,960 --> 00:05:36,461 విన్నాం. అతను కారులో ఉన్నాడు. 130 00:05:48,891 --> 00:05:52,436 మనకి కావాల్సింది మనకి దొరికింది. మన చేతికి వచ్చింది, కానీ దాన్ని నువ్వు పట్టి ఉంచలేకపోయావు. 131 00:05:53,020 --> 00:05:55,772 నేను అదే చెప్పాను... నీకు హెచ్చరించాను. కుమగైని అక్కడ నిలబెట్టు, 132 00:05:55,772 --> 00:05:58,650 ఇంకా హత్య జరిగిన సమయం, హత్యకు కారణం 133 00:05:58,650 --> 00:06:00,569 ఇంకా ఆ బిడ్డకు తండ్రి ఎవరనేది చెప్పించమని చెప్పాను. 134 00:06:00,569 --> 00:06:02,905 కానీ నువ్వు అక్కడితో ఆగలేదు. 135 00:06:02,905 --> 00:06:07,409 ఇప్పుడు మన మెడికల్ ఎగ్జిమినర్ ఒక ఉద్రేకపడే మనిషిగా, 136 00:06:07,409 --> 00:06:10,412 - పగతో రగిలిపోయే "అసంతృప్తివాది"గా కనిపిస్తున్నాడు. - అది చాలా ముఖ్యమైన వాంగ్మూలం. 137 00:06:10,412 --> 00:06:13,665 అందరికీ పరిచయమైన ఇంకా అందరూ ఇష్టపడే రస్టీ సాబిచ్ ఈ పని చేసి ఉండడు అనుకుంటారు, 138 00:06:13,665 --> 00:06:16,335 కాబట్టి ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా 139 00:06:16,335 --> 00:06:19,129 అతను ఏదో ఒక దశలో మనకి కనిపించే రస్టీ సాబిచ్ కాదనే నిజాన్ని మనం బలంగా నిరూపించాలి. 140 00:06:19,129 --> 00:06:20,172 అది మన నికరమైన గెలుపు. 141 00:06:20,172 --> 00:06:23,217 ఇది నికరమైన నష్టం అని నేను అంటాను. 142 00:06:23,217 --> 00:06:25,886 ఇది కొన్ని పరిస్థితుల ఆధారంగా విచారించాల్సిన కేసు కాబట్టి చిన్న చిన్న అంశాల్ని ఆధారం చేసుకోవాలి, 143 00:06:25,886 --> 00:06:28,430 చాలా సూక్ష్మమైన చిన్న చిన్న అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. 144 00:06:28,430 --> 00:06:30,516 కుమగై కేవలం ఒక చిన్న మొదటి అంశం మాత్రమే. 145 00:06:31,099 --> 00:06:33,477 రస్టీ సాబిచ్ ఒక ఆవేశపరుడు, అదొక అంశం. 146 00:06:35,896 --> 00:06:39,608 కారొలిన్ గోళ్ల అంచులో అతని చర్మం ఉందన్న విషయం ప్రాథమిక రిపోర్టులో లేదు. 147 00:06:40,734 --> 00:06:42,110 ఫోరెన్సిక్ వాళ్లు దాన్ని పట్టించుకోలేదు. 148 00:06:43,570 --> 00:06:46,448 కుమగై ఆ అంశాన్ని మరింత సమయం తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించాడు. 149 00:06:49,493 --> 00:06:53,038 ఆ ఫోరెన్సిక్ పాథాలజిస్ట్, అతను చాలా గట్టివాడిలా ఉన్నాడు. 150 00:06:53,038 --> 00:06:54,456 జెరెమీ బక్. 151 00:06:54,456 --> 00:06:58,168 అతను అందరికన్నా సమర్థుడు. నేను ఎప్పుడూ ఆధారపడే నిపుణుడు. నీకు కూడా, రస్టీ. 152 00:06:58,168 --> 00:07:00,045 అతని పరిశీలన చాలా సూక్ష్మంగా, చాలా ఖచ్చితంగా ఉంటుంది, 153 00:07:00,045 --> 00:07:04,299 కాబట్టి ఆ ఫోటోలని మీ ఇద్దరూ చూడకుండా ఉంటేనే మంచిది అని మేము అనుకుంటున్నాము. 154 00:07:04,299 --> 00:07:09,179 కేవలం నిర్మొహమాటంగా, నిష్పాక్షికంగా, వేరే ఉద్దేశాలు లేకుండా. సరేనా? 155 00:07:11,056 --> 00:07:13,308 మనం ఒక క్షణం బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుందామా? 156 00:07:13,308 --> 00:07:14,476 దాని గురించి ఎందుకు? 157 00:07:14,476 --> 00:07:17,187 అంటే, ఈ రోజు మనం చూసినది మాకు అంత నచ్చలేదు. 158 00:07:17,187 --> 00:07:18,939 మీరిద్దరూ కలిసి ఉన్నట్లుగా కనిపించాలి. 159 00:07:18,939 --> 00:07:21,400 జ్యూరీ సభ్యులు మీ ప్రవర్తన ఆధారంగా అభిప్రాయాలు ఏర్పరుకుంటారు, 160 00:07:21,400 --> 00:07:25,279 ఇంకా వాళ్లకి మీ ప్రవర్తనలో "అతడిని నేను ప్రేమిస్తాను, అతడి పట్ల నాకు నమ్మకం ఉంది" అనేది ప్రతి దశలో కనిపించాలి. 161 00:07:25,779 --> 00:07:28,782 ఇంకా ఆ మీడియా వాళ్ల విషయానికొస్తే, ఈ రోజు వాళ్లు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు మళ్లీ మీద పడితే, 162 00:07:28,782 --> 00:07:32,870 బహుశా, రస్టీ, నువ్వు బార్బరా భుజం మీద చేతులు వేసి ఆమెని కాపాడుతున్నట్లుగా కనిపించాలి. 163 00:07:35,622 --> 00:07:36,623 ఏమంటావు బార్బరా? 164 00:07:39,126 --> 00:07:40,252 అయితే... 165 00:07:42,254 --> 00:07:44,464 అతను నన్ను కాపాడే మనిషి అని జ్యూరీ సభ్యులు చూడాలి అంటావు. 166 00:07:46,008 --> 00:07:48,969 అవును, ఒక రకంగా అంతే. ఆ పరిస్థితిలో తప్పదు. 167 00:07:51,138 --> 00:07:52,139 రేమండ్, నేను... 168 00:07:54,808 --> 00:07:56,435 మీకు ఉన్నంత అనుభవం నాకు లేదు, 169 00:07:57,144 --> 00:07:59,313 కానీ జ్యూరీ సభ్యుల తెలివితేటల్ని అవమానించడం 170 00:07:59,313 --> 00:08:00,898 మంచి మార్గం కాదని నా అభిప్రాయం. 171 00:08:02,482 --> 00:08:05,903 వాళ్లు నా ముఖంలో షాక్ ని మాత్రమే చూడగలరు. 172 00:08:06,653 --> 00:08:08,697 ఒక దారుణమైన హత్య కేసులో నా భర్త విచారణ ఎదుర్కొంటున్నాడు. 173 00:08:08,697 --> 00:08:11,074 నేను షాక్ అవ్వడం తప్ప ఇంకెలా ఉండగలను? 174 00:08:19,124 --> 00:08:21,126 కొన్ని విచారణలు కథలు చెప్పినట్లుగా ఉంటాయి. 175 00:08:22,544 --> 00:08:23,962 మంచి కథ గెలుస్తుంది. 176 00:08:24,546 --> 00:08:26,757 ఇక్కడ మీ కథలో మీరు ఒక భాగం, 177 00:08:26,757 --> 00:08:29,301 అందుకే మీలో రగిలే కోపం మనకి మేలు చేయదు. 178 00:08:38,769 --> 00:08:41,230 ఆ కోర్టు గదిలో ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది, 179 00:08:41,855 --> 00:08:44,900 అక్కడ వాళ్లు చెబుతున్న విషయాలకీ, వాళ్లు చూపిస్తున్న దృశ్యాలకీ సాక్షిగా ఉండటం 180 00:08:44,900 --> 00:08:46,527 అది భరించడం చాలా కష్టం. 181 00:08:50,280 --> 00:08:51,990 నేను అసలు అక్కడ ఉండటం అనేదే... 182 00:08:54,868 --> 00:08:58,789 నా భర్త అమాయకుడని నేను నమ్ముతున్నాను అని జ్యూరీ సభ్యులకు చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. 183 00:09:00,290 --> 00:09:01,959 నేను విశ్వసనీయంగా ఉండాలి. 184 00:09:02,459 --> 00:09:05,212 కానీ వారి విశ్వాసాన్ని పొందాలంటే, నేను నిజాయితీగా ఉండాలి. 185 00:09:07,005 --> 00:09:09,049 నేను ఆ కోర్టు రూమ్ లో ఉండేది అందుకే. 186 00:09:10,759 --> 00:09:14,888 నా నిజాయితీని జ్యూరీ సభ్యులు చూసేలా చేస్తాను. 187 00:09:16,723 --> 00:09:18,892 నేను భయపడిపోతున్ననాననీ, నేను... 188 00:09:20,310 --> 00:09:21,520 కుంగిపోతున్నాననీ, 189 00:09:22,604 --> 00:09:25,065 ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నేను రగిలిపోతున్నాననీ వారికి తెలుస్తుంది, 190 00:09:26,984 --> 00:09:30,529 ఇంకా నాకు కలిగిన ఈ కష్టానికి కారణం నా బిడ్డలకి తండ్రి అనే ఆలోచనే... 191 00:09:32,072 --> 00:09:34,157 నన్ను వేధిస్తున్నదని వారికి తెలియాలి. 192 00:09:38,120 --> 00:09:40,914 నా ఈ చెత్త జీవితంలో ఇదే అత్యంత చీకటి సమయం. 193 00:09:43,542 --> 00:09:45,586 నేను మరొక విధంగా నటించలేను. 194 00:09:50,299 --> 00:09:52,217 మీ ఇద్దరి కోసం నటించలేను. జ్యూరీ కోసం నటించలేను. 195 00:10:17,701 --> 00:10:22,414 ఆమె కుడి చేతి గోళ్ల కింద చర్మపు కణాల్ని కనుగొన్నాం, 196 00:10:22,414 --> 00:10:24,708 అది ప్రతివాది డిఎన్ఎతో మ్యాచ్ అయింది. 197 00:10:24,708 --> 00:10:28,378 హతురాలి ముఖం మీద ఇంకా ఆమె వేసుకున్న షర్ట్ కాలర్ మీద 198 00:10:28,378 --> 00:10:31,798 ఉమ్ము ఆనవాళ్లని మేము కనుగొన్నాం, 199 00:10:31,798 --> 00:10:33,800 అది కూడా ప్రతివాది డిఎన్ఎతో మ్యాచ్ అయింది. 200 00:10:33,800 --> 00:10:39,306 ఆసక్తికరంగా, ఆమె మృతదేహాన్ని కట్టడానికి ఉపయోగించిన తాడుపై ఎలాంటి డిఎన్ఎ దొరకలేదు. 201 00:10:39,306 --> 00:10:40,933 "ఆసక్తికరంగా" అని ఎందుకు అన్నారు? 202 00:10:40,933 --> 00:10:42,017 అది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. 203 00:10:42,017 --> 00:10:43,519 షికాగో ప్రజలు వర్సెస్ రోజట్ సాబిచ్ 204 00:10:43,519 --> 00:10:46,563 హంతకుడు ఎటువంటి ఆధారాన్ని ఇవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. 205 00:10:46,563 --> 00:10:51,068 అటువంటి రక్తసిక్తమైన బీభత్సమైన నేర ఘటనాస్థలాన్ని మనం అరుదుగా చూస్తుంటాం, 206 00:10:51,652 --> 00:10:56,156 అయితే సాక్ష్యాధారాల్ని మాత్రం పూర్తిగా తుడిచిపెట్టేశారు. 207 00:10:56,156 --> 00:10:57,574 దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది? 208 00:10:57,574 --> 00:11:02,204 ఆ ఆధారాల్ని శుభ్రం చేయడానికి, నేరస్తుడు దొరకకుండా తప్పించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 209 00:11:02,204 --> 00:11:05,874 ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ గా మీకు ఉన్న ఇరవై ఏళ్ల అనుభవం ఆధారంగా 210 00:11:05,874 --> 00:11:07,751 జరిగిన ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? 211 00:11:07,751 --> 00:11:13,215 నా అభిప్రాయం ఏమిటంటే ఇది హఠాత్తుగా సంభవించిన హత్యోదంతం... 212 00:11:13,215 --> 00:11:14,216 ముందుగా పథకం లేకుండా... 213 00:11:14,216 --> 00:11:17,094 కానీ ఘటన తరువాత చాలా తెలివిగా, 214 00:11:17,094 --> 00:11:20,681 పద్ధతిగా, ఆమె చనిపోయాక తాళ్లతో కట్టేశారు. 215 00:11:20,681 --> 00:11:22,516 ఇప్పటికి నేను సమర్పించగలిగేది ఇదే. థాంక్యూ. 216 00:11:22,516 --> 00:11:25,269 ఇంతకుముందు ఒక మృతదేహాన్ని ఇలా కట్టేయడం మీరు ఎప్పుడయినా చూశారా? 217 00:11:25,269 --> 00:11:30,399 కొన్ని సంవత్సరాల కిందట నేను ఒక హత్య కేసుని చూశాను 218 00:11:30,399 --> 00:11:33,026 ఆ ఘటనలో కూడా ఇదే విధంగా మృతదేహాన్ని ఇలా తాడుతో కట్టేశారు, అవును. 219 00:11:33,026 --> 00:11:37,698 ఆ హత్య కేసు ప్రాసిక్యూషన్ కి సారథ్యం వహించిన డిస్ట్రిక్ట్ అటార్నీ ఎవరు? 220 00:11:37,698 --> 00:11:41,201 {\an8}ఇద్దరు ఉండేవారు, కారొలిన్ పొలీమస్ ఇంకా రస్టీ సాబిచ్. 221 00:11:41,201 --> 00:11:44,496 {\an8}ఇంకా ఆ హత్య కేసులో హంతకుడి పేరు లియామ్ రేనాల్డ్స్. 222 00:11:46,540 --> 00:11:48,333 - అతనికి జైలు శిక్ష పడింది. - కరెక్ట్. 223 00:11:48,333 --> 00:11:50,085 ఆ కేసుని వాదించిన ప్రాసిక్యూటర్లు 224 00:11:50,085 --> 00:11:52,671 {\an8}- కారొలిన్ పొలీమస్ ఇంకా రస్టీ సాబిచ్. - అది నిజం. 225 00:11:52,671 --> 00:11:56,884 {\an8}అలాగే కారొలిన్ పొలీమస్ ఇంకా రస్టీ సాబిచ్ ఆ కేసులో అతనికి శిక్షపడేలా చేయడంతో 226 00:11:56,884 --> 00:11:58,677 {\an8}వాళ్లిద్దరి మీద ప్రతీకారం తీర్చుకుంటానని అతను బెదిరించాడు. 227 00:11:58,677 --> 00:12:00,512 {\an8}- ఆ విషయం మీకు తెలుసా? - నాకు తెలుసు. 228 00:12:00,512 --> 00:12:05,058 {\an8}చూడండి, ఈ ప్రతీకార శాస్త్రంలో నేను అంత నిపుణుడిని కాను, కానీ నా అనుమానం ప్రకారం 229 00:12:05,058 --> 00:12:07,352 - ఒకరిని చంపి మరొకరిని కేసులో ఇరికించడానికి... - అబ్జెక్షన్. 230 00:12:07,352 --> 00:12:09,897 - ...చాలా అవకాశాలు ఉన్నాయి... - ఆపండి. వెంటనే నా ముందుకు రండి. 231 00:12:20,574 --> 00:12:21,491 మనం ముందే మాట్లాడుకున్నాం. 232 00:12:21,491 --> 00:12:23,702 ప్రాసిక్యూషన్ వారు నిజానికి మిస్టర్ రేనాల్డ్స్ ని ఇంతవరకూ విచారించలేదు... 233 00:12:23,702 --> 00:12:25,370 నాకు తెలిసినంత వరకూ, నన్ను కూడా ఇన్వెస్టిగేట్ చేయలేదు. 234 00:12:25,370 --> 00:12:27,331 ప్రతి ఒక్కరినీ విచారించడం వారి పని కాదు. 235 00:12:27,331 --> 00:12:30,000 - నేరం చేయలేదని రుజువు చేయడం వాళ్ల డ్యూటీ కాదు. - అతను బహిరంగంగా బెదిరించాడు 236 00:12:30,000 --> 00:12:32,169 - కారొలిన్, రస్టీ ల మీద పగ తీర్చుకుంటా అన్నాడు. - సరే, బెదిరించాడు... 237 00:12:32,169 --> 00:12:34,213 - జ్యూరీకి ఇది తెలియాలి అనుకున్నా. - ...అది ఉత్తుత్తి బెదిరింపు. 238 00:12:34,213 --> 00:12:36,173 - నేను ఎందుకు ఆ విషయాన్ని... - దీన్ని నువ్వు వాడుకోలేవు. 239 00:12:36,173 --> 00:12:37,424 ...రికార్డులలో నమోదు చేయించలేను. 240 00:12:37,424 --> 00:12:40,093 నాకు ఏదైనా నమ్మదగిన ఆధారాలు చూపించు అప్పుడు దాని గురించి వాదించడానికి అనుమతి ఇస్తాను. 241 00:12:41,512 --> 00:12:44,515 లేని పక్షంలో, ఈ చెత్త అంతా మాట్లాడకు. ఇక వెనక్కి వెళ్లండి. 242 00:12:54,650 --> 00:12:59,571 మిస్టర్ బక్, నా క్లయింట్ ఇంకా హతురాలు మధ్య ప్రేమ బంధం ఉందనే విషయం 243 00:12:59,571 --> 00:13:01,782 - మీకు తెలుసు అనుకుంటా. - అవును. 244 00:13:01,782 --> 00:13:05,077 "ఆమె గోరు అంచులో చర్మం ముక్కలు దొరికాయి" అని మీరు అన్నప్పుడు, 245 00:13:05,077 --> 00:13:09,039 మీరు అన్నది నిజమైన చర్మం గురించేనా, అంటే చర్మం ముక్కలు, 246 00:13:09,039 --> 00:13:10,791 ఇతడిని ఆమె గీరింది అంటారా? 247 00:13:10,791 --> 00:13:14,962 లేదు, అవి కనిపించే లాంటి చర్మం ముక్కలు కాదు. కణాలు. 248 00:13:14,962 --> 00:13:18,090 నా ముఖాన్ని ఇలా రుద్దుకుంటే, 249 00:13:18,090 --> 00:13:20,592 నా గోళ్ల కింద నా చర్మం కణాలు దొరకచ్చు అంటారా? 250 00:13:21,260 --> 00:13:22,427 ఆ అవకాశం ఉంది. 251 00:13:22,427 --> 00:13:26,431 కాబట్టి, రస్టీ సాబిచ్ గనుక కారొలిన్ పొలీమస్ ని ముద్దాడితే, ఇంకా ముద్దు పెట్టుకునే సమయంలో, 252 00:13:26,431 --> 00:13:32,354 కారొలిన్ తన గోళ్లని అతని మెడ మీదకి లేదా అతని వీపు మీదకి పోనిచ్చి ఉంటే, 253 00:13:32,354 --> 00:13:36,859 అప్పుడు ఆమె ముఖం మీద అతని ఉమ్ము ఆనవాళ్లు 254 00:13:36,859 --> 00:13:40,904 ఇంకా ఆమె గోళ్ల కింద అతని డిఎన్ఎ దొరకచ్చు అంటారా? దానికి అవకాశం ఉందా? 255 00:13:42,614 --> 00:13:43,699 ఉండచ్చు అనుకుంటా. 256 00:13:43,699 --> 00:13:46,577 అయితే మీరు చెబుతున్న డిఎన్ఎ ఆమె హత్యకు కారణం కావచ్చు అంటున్నారు, 257 00:13:47,160 --> 00:13:52,249 అదే విధంగా అతడు ఆమెని ముద్దు పెట్టుకున్నప్పుడు డిఎన్ఎ దొరకచ్చు అంటున్నారు. 258 00:14:00,299 --> 00:14:02,134 మీకు ఆ వ్యత్యాసం అర్థమైంది అనుకుంట కదా? 259 00:14:56,855 --> 00:14:57,981 నువ్వు ఇంక వెళ్లచ్చు. 260 00:15:32,558 --> 00:15:35,811 ప్రతివాది ఇంకా మిస్ పొలీమస్ మధ్య సంబంధం ఉందనే విషయం మీకు తెలుసా? 261 00:15:35,811 --> 00:15:38,105 - నాకు తెలిసింది, అవును. - మీకు ఎలా తెలిసింది? 262 00:15:38,689 --> 00:15:42,317 అంటే, అది నేను పసిగట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. 263 00:15:42,317 --> 00:15:44,528 నాకు ఆ సంగతి నిజంగా ఎప్పుడు తెలిసిందంటే... 264 00:15:46,363 --> 00:15:48,532 నేను రస్టీ ఆఫీసులో ఒక ఫైలు ఇవ్వడానికి వెళ్లాను. 265 00:15:48,532 --> 00:15:51,034 అప్పటికి రాత్రి పొద్దుపోయింది. అతను ఇంటికి వెళిపోయాడేమో అనుకున్నాను. అతను వెళ్లలేదు. 266 00:15:51,034 --> 00:15:53,579 నేను లోపలికి నడిచి వెళ్లాను. అతను కారొలిన్ ని ముద్దు పెట్టుకుంటున్నాడు. 267 00:15:56,123 --> 00:15:57,082 ఏంటి? 268 00:15:57,624 --> 00:16:01,044 - ఆ రాబర్ట్ కేసు ఫైల్ తెచ్చాను. - సరే. 269 00:16:01,044 --> 00:16:02,129 - సరే. - అలాగే. 270 00:16:03,213 --> 00:16:05,424 - థాంక్స్. సరే. - ఇదిగో తీసుకో. రేపు కలుస్తాను. 271 00:16:05,424 --> 00:16:08,051 నేను త్వరగా వెళ్లిపోయాను, ఆమె నాతో పాటే వచ్చేసింది. 272 00:16:08,051 --> 00:16:13,724 అది చాలా ఇబ్బందికరంగా అనిపించడంతో నేను వెళ్లిపోయాను. 273 00:16:13,724 --> 00:16:15,684 - ఇది ఎప్పుడు జరిగింది? - కిందటి ఫిబ్రవరిలో. 274 00:16:15,684 --> 00:16:17,769 మీరు గమనించిన వేరే సంఘటనలు ఏమైనా ఉన్నాయా? 275 00:16:17,769 --> 00:16:20,230 మతిమీరిన శృంగారం కాదు కానీ, కేవలం ఆఫీసులో గుసగుసలు విన్నాను. 276 00:16:20,230 --> 00:16:24,651 కానీ, నా ఉద్దేశం, ఖచ్చితంగా, వాళ్ల ఇద్దరి మధ్య బలమైన సంబంధం ఉంది. 277 00:16:25,986 --> 00:16:27,029 అంటే ఎలాంటిది? 278 00:16:27,529 --> 00:16:31,575 ఒకసారి అండర్ గ్రౌండ్ పార్కింగ్ ప్రదేశంలో, నేను వాళ్లని చూశాను. 279 00:16:31,575 --> 00:16:34,661 వాళ్లు అప్పుడు... నేను అనుకోవడం, నాకు తెలియదు... వాళ్లు వాదించుకుంటున్నారు. 280 00:16:34,661 --> 00:16:37,998 - ...ఇద్దరం కలిసి చేద్దాం. నాకు తెలియదు. ఏంటి? - దూరంగా ఉండు. 281 00:16:37,998 --> 00:16:40,542 నేను అడుగుతున్నదల్లా ఒక ప్రశ్న. కాబట్టి నువ్వు దానికి సమాధానం చెబితే... 282 00:16:40,542 --> 00:16:42,044 అంతే కదా. ఒకసారి విను. 283 00:16:42,044 --> 00:16:44,755 ఆమె కారులో కూర్చుంది, అతను ఆమె కారు విండోని కొడుతున్నాడు, 284 00:16:44,755 --> 00:16:45,714 దానితో ఆమె వేగంగా వెళ్లిపోయింది. 285 00:16:45,714 --> 00:16:47,090 చెత్త. 286 00:16:47,090 --> 00:16:49,927 ఈ విషయాలలో దేని గురించి అయినా మీకు సాబిచ్ తో మాట్లాడే అవకాశం కలిగిందా? 287 00:16:49,927 --> 00:16:51,220 నేను మాట్లాడాను. 288 00:16:52,638 --> 00:16:53,722 నువ్వు ఏం అంటావు? 289 00:16:54,973 --> 00:16:56,600 అతనికి ఏం చెప్పానంటే... 290 00:16:56,600 --> 00:17:01,355 అతను అలా, నాకు తెలియదు, తనని తాను కోల్పోతున్నాడని నాకు ఆందోళనగా ఉందని చెప్పాను. 291 00:17:01,355 --> 00:17:03,941 - తనని తను కోల్పోతున్నాడా? - ఆమె ధ్యాసలో పడిపోయాడు. 292 00:17:04,525 --> 00:17:08,945 అతను, కొద్దిగా మారిపోయాడు, 293 00:17:09,695 --> 00:17:10,696 ఆమె పిచ్చిలో పడిపోయాడు. 294 00:17:14,201 --> 00:17:18,664 మిస్టర్ సాబిచ్ ఇంకా మిసెస్ పొలీమస్ మధ్య సంబంధాన్ని మీరు అంగీకరించలేకపోయారా? 295 00:17:18,664 --> 00:17:20,165 - మీకు అది సమ్మతం కాదా? - లేదు, సమ్మతించలేదు. 296 00:17:20,165 --> 00:17:23,042 కారొలిన్ పొలీమస్ ని మీరు నిజంగా అంగీకరించలేకపోయారా? 297 00:17:23,042 --> 00:17:26,380 దాని గురించి కాదు. అది వృత్తిపరంగా ద్రోహం అనిపించింది. 298 00:17:27,089 --> 00:17:29,258 కారొలిన్ అంటే మీకు ఇష్టం లేదు, కదా? 299 00:17:29,258 --> 00:17:30,801 లేదు, నాకు ఇష్టం లేదు. 300 00:17:30,801 --> 00:17:35,556 ఇది వృత్తి ద్రోహం అనే మీ ఆవేదనని మీ కంపెనీ హెచ్.ఆర్.కి మీరు ఎప్పుడయినా ఫిర్యాదు చేశారా? 301 00:17:35,556 --> 00:17:37,432 నేను చేయలేదు, లేదు. 302 00:17:40,227 --> 00:17:43,939 ఇంకా మీకు తెలిసి, మిస్ పొలీమస్ ఎప్పుడూ హెచ్.ఆర్. కి 303 00:17:43,939 --> 00:17:45,190 మిస్టర్ సాబిచ్ మీద ఫిర్యాదు చేయలేదు కదా? 304 00:17:45,190 --> 00:17:46,233 అది నిజం. 305 00:17:46,733 --> 00:17:51,488 మీకు తెలిసి, ఆమె ఎప్పుడయినా ఎవరి మీద అయినా హెచ్.ఆర్. కి ఫిర్యాదు చేసిందా? 306 00:17:52,823 --> 00:17:53,824 చేసింది. 307 00:17:55,325 --> 00:17:56,201 ఎవరి మీద? 308 00:17:58,370 --> 00:17:59,538 టామీ మోల్టో. 309 00:18:16,930 --> 00:18:17,931 అవును. 310 00:18:21,101 --> 00:18:25,147 మీకు తెలిసినంత వరకూ నేను వృత్తిలో కానీ వ్యక్తిగతంగా కానీ 311 00:18:25,147 --> 00:18:26,899 మిస్ పొలీమస్ తో అసభ్యంగా ప్రవర్తించానా? 312 00:18:26,899 --> 00:18:28,984 మీ గురించి నిజంగా అలాంటివి ఎప్పుడూ వినలేదు, లేదు. 313 00:18:28,984 --> 00:18:31,111 హెచ్.ఆర్. కి ఆమె చేసిన ఫిర్యాదు గురించి 314 00:18:31,111 --> 00:18:32,487 మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? 315 00:18:32,487 --> 00:18:35,824 నాకు తెలిసినదల్లా ఆమె మీతో కలిసి ఎలాంటి కేసులలో పని చేయడానికి ఇష్టపడలేదు అన్నదే. 316 00:18:35,824 --> 00:18:38,827 మీరు ఆమెని చిరాకుపెట్టేవారని ఆమె చెప్పింది. 317 00:18:43,624 --> 00:18:49,046 సరే. హతురాలి పట్ల నేను అనుచితంగా ప్రవర్తించినట్లు మీరు ఎప్పుడైనా చూశారా? 318 00:18:49,046 --> 00:18:50,214 నిజానికి చూడలేదు. 319 00:18:50,214 --> 00:18:52,549 రస్టీ సాబిచ్ సంగతి ఏంటి? 320 00:19:00,390 --> 00:19:01,391 చూశాను. 321 00:19:01,391 --> 00:19:05,687 అవును. ప్రతివాది ఆమె పట్ల పిచ్చి ప్రేమని పెంచుకుని, ఆమె ధ్యాసలో పడిపోయాడు. 322 00:19:05,687 --> 00:19:07,272 అదే మీ వాంగ్మూలం కదా? 323 00:19:07,272 --> 00:19:08,649 అదే నా వాంగ్మూలం. 324 00:19:11,235 --> 00:19:12,653 చాలా థాంక్స్. 325 00:19:34,633 --> 00:19:35,968 హేయ్. 326 00:19:37,636 --> 00:19:38,720 మరేం ఫర్వాలేదు. 327 00:19:42,391 --> 00:19:44,977 ఆ టామీ విషయంలో నాకు నిజంగా జాలిగా ఉంది. 328 00:19:48,647 --> 00:19:49,898 నాకు కూడా జాలి వేసింది. 329 00:19:50,482 --> 00:19:54,361 కానీ ఆ వెంటనే అతను ఒక బొద్దింక లాంటివాడని గుర్తుకొచ్చింది. 330 00:19:54,361 --> 00:19:57,614 అతడిని మనం చిదిమి చంపలేము. అతను మళ్లీ పైకి లేస్తుంటాడు. 331 00:19:59,366 --> 00:20:03,203 కానీ ఈ రోజు తను కొన్ని మంచి పాయింట్లు తీశాడు. 332 00:20:03,787 --> 00:20:05,038 నీకు కంగారుపుట్టింది కదా. 333 00:20:05,038 --> 00:20:09,501 కానీ, ఆ జ్యూరీ సభ్యులు... వాళ్లు... సాక్ష్యాధారాల పెనుభారం మీదనే ఆధారపడితే గనుక, 334 00:20:09,501 --> 00:20:11,253 మనం గెలిచే స్థితిలోనే ఉన్నాం, కానీ... 335 00:20:12,880 --> 00:20:17,467 వాళ్లు ఈ హత్యకి ఎవరో ఒకర్ని బాధ్యులు చేయాలి అనుకుంటే మాత్రం, అది రస్టీనే అవుతాడు. 336 00:20:36,320 --> 00:20:37,196 నువ్వు బాగానే ఉన్నావా? 337 00:20:39,239 --> 00:20:40,240 నువ్వు బాగానే ఉన్నావా? 338 00:20:53,712 --> 00:20:54,713 నా సైకాలజీ క్లాసులో, 339 00:20:54,713 --> 00:20:58,175 వేదన ఇంకా అన్నింటినీ త్యజించి ఉండటం గురించి కొన్ని పాఠాలు చదువుతున్నాం. 340 00:20:58,759 --> 00:21:02,054 మనుషుల్ని వాళ్ల నుంచి వాళ్లనే మెదడు ఎలా కాపాడుతుందో నేర్చుకుంటున్నాం. 341 00:21:02,054 --> 00:21:03,639 వాస్తవికత నుంచి అసంకల్పితంగా... 342 00:21:05,933 --> 00:21:08,310 నిర్లిప్తంగా ఉండటం గురించి. 343 00:21:10,187 --> 00:21:11,230 నీకు ఎప్పుడయినా అలా అనిపించిందా? 344 00:21:13,857 --> 00:21:14,858 అలా ఎందుకు అడుగుతున్నావు? 345 00:21:18,111 --> 00:21:19,112 ఊరికే... 346 00:21:25,077 --> 00:21:27,496 జనం తమ జ్ఞాపకాలతో సంబంధాలు కోల్పోతారు. 347 00:21:29,831 --> 00:21:30,832 అది గనుక... 348 00:21:33,001 --> 00:21:35,879 వాళ్లు మర్చిపోలేని పని ఏదైనా చేసినా లేదా... 349 00:21:37,923 --> 00:21:40,050 వాళ్లు తమని తాము క్షమించుకోలేమని భావించినా... 350 00:21:42,970 --> 00:21:44,888 వాళ్లలో నిర్లిప్తత ఏర్పడే అవకాశం ఉంది. 351 00:21:44,888 --> 00:21:46,265 నా జ్ఞాపకశక్తి బాగానే ఉంది. 352 00:22:42,196 --> 00:22:43,906 రస్టీ, నేను నీతో మాట్లాడాలి. 353 00:22:51,788 --> 00:22:52,915 సరే. 354 00:22:54,458 --> 00:22:57,169 అంటే కొన్ని నెలల కిందట... 355 00:23:00,130 --> 00:23:03,884 గ్యాలరీ లో నా ఉద్యోగం పోయిన సమయంలో, 356 00:23:04,635 --> 00:23:09,264 ఉదయం వేళల్లో నేను ఒక బార్ కి వెళ్లడం మొదలుపెట్టాను. 357 00:23:12,142 --> 00:23:13,477 ఇంకా... 358 00:23:14,853 --> 00:23:18,106 ఆ బారులో ఒక బార్టెండర్ ఉన్నాడు ఇంకా అతను... 359 00:23:19,525 --> 00:23:21,360 ఆర్ట్ లో పి.హెచ్.డి. చేశాడు. 360 00:23:21,360 --> 00:23:23,862 దానితో మేము మాట్లాడుకునే వాళ్లం... 361 00:23:27,115 --> 00:23:29,701 మేము నిజానికి చాలా దగ్గరయ్యాము, ఇంకా... 362 00:23:32,996 --> 00:23:36,458 మేము ముద్దు పెట్టుకున్నాం. నేను అతడిని ముద్దు పెట్టుకున్నాను. 363 00:23:41,505 --> 00:23:43,090 కానీ మా మధ్య అంతే జరిగింది. 364 00:24:21,962 --> 00:24:25,632 అది కేవలం ధ్యాసని మళ్లించడం. అది... 365 00:24:27,509 --> 00:24:29,136 అది కేవలం ఒక ముద్దు. 366 00:24:30,971 --> 00:24:32,139 అది ఎక్కడ జరిగింది? 367 00:24:34,933 --> 00:24:36,518 అతని అపార్ట్మెంట్ లో. 368 00:24:38,478 --> 00:24:41,023 - అతని ఆర్ట్ చూడాలని వెళ్లాను. - అతని అపార్ట్మెంట్ కా? 369 00:24:42,608 --> 00:24:44,568 - అంతే. - అతని ఆర్ట్ ని చూడాలని... 370 00:24:45,194 --> 00:24:47,571 - నువ్వు అక్కడికి వెళ్లావా? - వద్దు, రస్టీ. 371 00:25:00,792 --> 00:25:02,419 - అతనితో శృంగారం చేశావా? - లేదు. 372 00:25:04,505 --> 00:25:05,589 చేయలేదు. 373 00:25:10,302 --> 00:25:12,012 అది నాకు ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు? 374 00:25:14,348 --> 00:25:16,934 నీతో నిజాయితీగా ఉండాలి అనుకున్నాను. 375 00:25:20,395 --> 00:25:23,607 మనం ఒకరి పట్ల ఒకరం నిజాయితీగా ఉన్నాం అనుకున్నాను. 376 00:25:23,607 --> 00:25:27,486 నేను విచారణ ఎదుర్కొంటున్నాను... జీవితకాల శిక్ష కోసం. 377 00:25:29,613 --> 00:25:30,614 నిజాయితీ అంటావా? 378 00:25:33,450 --> 00:25:34,535 నాకు తెలుసు. 379 00:25:35,452 --> 00:25:38,121 ప్రతి రోజూ నన్ను చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతావు. 380 00:25:38,705 --> 00:25:40,040 నన్ను కఠినమైన ప్రశ్నలు అడుగుతావు. 381 00:25:40,040 --> 00:25:42,668 "ఇక్కడ ఏం జరిగింది?" "అక్కడ ఏం జరిగింది?" అని. 382 00:25:42,668 --> 00:25:44,545 "నీ గురించి, ఆమె గురించి నాకు ఎందుకు చెప్పలేదు?" 383 00:25:45,128 --> 00:25:46,839 ప్రశ్న తరువాత ప్రశ్న. 384 00:25:47,422 --> 00:25:50,467 ఆ తరువాత నేను నీకు చెబుతాను, "నేను నీతో నిజాయితీగా ఉండాలని ప్రయత్నిస్తున్నా, 385 00:25:50,467 --> 00:25:54,388 నాకు గుర్తున్నంత వరకూ ఏం జరిగిందో చెప్పాలని చూస్తున్నా. 386 00:25:54,388 --> 00:25:57,724 నేను అన్నిసార్లూ కారణాలు చెప్పలేను" అంటాను, 387 00:25:58,350 --> 00:26:01,687 అప్పుడు నువ్వు... నన్ను పదే పదే ప్రశ్నలతో విసిగిస్తావు. 388 00:26:01,687 --> 00:26:03,188 - అది అన్యాయం. - ఇంక చాలు. 389 00:26:03,188 --> 00:26:07,276 అది న్యాయం కాదా? అది న్యాయం కాదా, బార్బరా? ఏది న్యాయం? 390 00:26:07,276 --> 00:26:08,652 ఇప్పుడు ఏది న్యాయం? 391 00:26:08,652 --> 00:26:09,987 నీకు ఇది ఎలా అనిపిస్తోంది? 392 00:26:10,487 --> 00:26:11,488 ఏంటి? 393 00:26:11,488 --> 00:26:14,575 నీకు ఎలా అనిపిస్తోంది? ఒక తప్పు చేయడం ఎలా అనిపిస్తోంది? 394 00:26:15,450 --> 00:26:16,535 దయచేసి ఆపు. 395 00:26:17,661 --> 00:26:21,081 - నాతో మాట్లాడకు, రస్టీ. - మాట్లాడద్దా? మాట్లాడద్దా? 396 00:27:58,136 --> 00:28:00,639 - నేను బయటకి వెళ్తున్నాను. - నా తాళాలు కిచెన్ లో ఉన్నాయా? 397 00:28:04,852 --> 00:28:06,103 మీరు తిన్న పాత్రలు కడిగేస్తారా, ప్లీజ్? 398 00:28:06,103 --> 00:28:07,312 - కడుగుతా. - ఇదిగో ఇక్కడ ఉన్నాయి. 399 00:28:07,312 --> 00:28:10,023 - జామెట్రీ హోమ్ వర్క్ చేయడం మర్చిపోవద్దు. - అది నా బ్యాగ్ లో ఉంది. 400 00:28:10,023 --> 00:28:12,985 - నువ్వు వస్తున్నావా? - లేదు, నేను లొరైన్ ని కలుస్తున్నాను. 401 00:28:12,985 --> 00:28:14,319 - ఇప్పటికే ఆలస్యం చేశాను. - బార్బరా? 402 00:28:16,405 --> 00:28:17,990 ఖైల్, లంచ్ చేశావా? 403 00:28:17,990 --> 00:28:19,074 చేశాను. 404 00:28:34,506 --> 00:28:37,342 నేను నీతో వస్తాను. కారులో నేను మంచి తోడు. 405 00:28:39,636 --> 00:28:44,308 బంగారం. లేదు, మరేం ఫర్వాలేదు. నేను బాగానే ఉన్నాను. నిజంగా, బాగున్నాను. 406 00:28:55,235 --> 00:28:57,362 నిన్న రాత్రి నిన్ను కలత పెడితే క్షమించు. 407 00:29:25,057 --> 00:29:27,309 అయితే, అతనికి ఇప్పుడు ఎందుకు చెప్పావు? 408 00:29:27,309 --> 00:29:30,062 - నాకు తెలియదు, లొరైన్. - అది ఘోరమైన ఆలోచన. 409 00:29:30,062 --> 00:29:31,146 నాకు తెలుసు. 410 00:29:32,397 --> 00:29:34,399 ఈ మధ్యనే మేము కొద్దిగా... 411 00:29:36,109 --> 00:29:37,236 నేను అనుకున్నాను... 412 00:29:38,612 --> 00:29:41,198 మేము మళ్లీ దగ్గరవుతున్నాం అనుకున్నాను. 413 00:29:41,198 --> 00:29:42,449 - నాకు అనిపించింది... - ఆహ్... హా. 414 00:29:44,076 --> 00:29:45,619 ...దగ్గరయ్యాము ఇంకా క్షేమంగా ఉన్నాము అనుకున్నాను. 415 00:29:45,619 --> 00:29:47,329 - ఇంకా... - సరే. 416 00:29:49,039 --> 00:29:52,084 ...ఆ క్లిఫ్టన్ వ్యవహారం హఠాత్తుగా చాలా బలంగా నన్ను క్షోభ పెట్టింది 417 00:29:52,084 --> 00:29:55,754 దానితో నాకు తప్పలేదు... నేను... 418 00:29:56,338 --> 00:29:57,673 దాని గురించి ఆలోచించడం ఆపేయ్. 419 00:29:59,383 --> 00:30:00,384 అవును. 420 00:30:00,384 --> 00:30:02,219 అయితే అది అతను జీర్ణించుకోలేకపోయాడా? 421 00:30:06,181 --> 00:30:07,182 లేదు. 422 00:30:08,559 --> 00:30:11,603 అందుకే ఇక నుండి నువ్వు కోర్టుకి ఒంటరిగా వెళ్లద్దు. 423 00:30:11,603 --> 00:30:13,230 నేను కూడా నీతో పాటే ఉంటాను. 424 00:30:13,230 --> 00:30:15,607 నేను కోర్టుకి తిరిగి వెళతాను, కానీ ఈ రోజు కాదు. 425 00:30:17,025 --> 00:30:22,531 ఈ రోజు, వాళ్లు అతని కంప్యూటర్ ఇంకా ఆమె కంప్యూటర్ లో సాక్ష్యాలన్నీ ప్రదర్శించబోతున్నారు. 426 00:30:22,531 --> 00:30:23,574 అవును. 427 00:30:23,574 --> 00:30:28,328 నేను అవన్నీ చూస్తూ, అతను ప్రేమని వ్యక్తం చేసే ఆ మాటలన్నీ వింటూ కూర్చోగలను అనుకోవడం లేదు... 428 00:30:28,328 --> 00:30:30,581 - ఓహ్, దేవుడా. - ...అలాంటివి, అలాంటివి. 429 00:30:31,707 --> 00:30:34,918 ఆమె చనిపోయిన రాత్రి, తను ఆమెకి ముప్పై మెసేజులు పంపించాడు, తెలుసా? 430 00:30:35,711 --> 00:30:36,712 ఓహ్, దేవుడా. 431 00:30:37,337 --> 00:30:40,132 నిజాయితీగా చెప్పాలంటే, ఈ మొత్తం కేసులో అదే చాలా కీలకమైన విషయం అయింది. 432 00:30:40,132 --> 00:30:41,383 ముప్పై మెసేజులా? 433 00:30:44,261 --> 00:30:46,638 ఇంకా తన కొడుకుని విచారించకుండా ఆపడం కోసం, 434 00:30:46,638 --> 00:30:48,682 అతని తండ్రి ప్రొటెక్టివ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేశాడు. 435 00:30:48,682 --> 00:30:50,934 - అలా జరగడానికి వీల్లేదు. - నేను ఆ ప్రతిపాదనని తిరస్కరిస్తున్నాను. 436 00:30:50,934 --> 00:30:52,728 కానీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థమవుతోంది. 437 00:30:52,728 --> 00:30:55,147 ఇప్పటికే తీవ్రమైన విషాదంలో ఉన్న ఆ కుర్రవాడికి ఈ రోజు 438 00:30:55,147 --> 00:30:56,857 మానసికంగా చాలా ఉద్వేగానికి గురయ్యే ప్రమాదం ఉంది. 439 00:30:56,857 --> 00:30:59,359 - అతను ప్రత్యక్ష సాక్షి. కాబట్టి... - నన్ను ముగించనివ్వండి. 440 00:30:59,359 --> 00:31:02,529 ఆ కుటుంబాన్ని అవసరంగా ఇంక ఎక్కువగా బాధపెట్టకుండా చూడాలి అనుకుంటున్నాను, 441 00:31:02,529 --> 00:31:04,948 అది అవసరమైనా లేదా అనవసరమైనా సరే. 442 00:31:05,532 --> 00:31:10,579 ఇక, ఈ కేసు రెండో డిగ్రీ హత్యానేరం ఇంకా ఆ విషయం మీకు తెలుసు. 443 00:31:11,079 --> 00:31:14,458 మీ సొంత సాక్షులే ఇది పథకం ప్రకారం చేసిన హత్య కాదని వాంగ్మూలాలు ఇచ్చారు. 444 00:31:14,458 --> 00:31:15,709 ఎప్పటికీ ఇది ఫస్ట్ డిగ్రీ మర్డర్ కాబోదు. 445 00:31:15,709 --> 00:31:18,504 మీరు ఎంత ప్రయత్నించినా ఈ హత్యని ఫస్ట్ డిగ్రీగా పరిగణించకుండా నేను ఆదేశిస్తున్నాను. 446 00:31:19,796 --> 00:31:23,258 నువ్వు ఈ నేరం నుంచి స్వేచ్ఛగా విముక్తుడివి కావడం నాకు కష్టంగా ఉంటుంది. 447 00:31:23,258 --> 00:31:25,844 {\an8}నేరాన్ని స్వచ్ఛందంగా అంగీకరిస్తే ఈ కేసు విషయంలో త్వరగా పరిష్కారం దొరుకుతుంది. 448 00:31:25,844 --> 00:31:26,970 - ఆ అవకాశం లేదు. - లేదు. 449 00:31:29,515 --> 00:31:31,058 నీకు జైలు శిక్ష పడుతుంది. 450 00:31:31,058 --> 00:31:33,060 ఇంకో ఎనిమిది ఏళ్లలో నువ్వు మళ్లీ నీ సాధారణ జీవితాన్ని పొందచ్చు. 451 00:31:33,060 --> 00:31:35,437 - ఇది ఏదో బేరంలా అనిపిస్తోంది. - నేను ఎలాంటి శిక్షని ఒప్పుకోవడం లేదు. 452 00:31:35,437 --> 00:31:37,856 కేసుని డిస్మిస్ చేయడం ఇంకా నాకు క్షమాపణ చెప్పడం, వీటినే నేను అంగీకరిస్తాను. 453 00:31:39,316 --> 00:31:40,901 మీకు మళ్లీ ఇలాంటి అవకాశం రాదు, కుర్రాళ్లూ. 454 00:31:42,903 --> 00:31:44,905 ఎవరైనా ముందుకొస్తారా? 455 00:31:48,325 --> 00:31:49,326 మంచిది. 456 00:31:50,744 --> 00:31:53,997 ఆ కుర్రవాడి విషయంలో మీ రెండు వర్గాలు జాగ్రత్తగా వ్యవహరించండి. 457 00:32:12,349 --> 00:32:13,350 జే? 458 00:32:21,650 --> 00:32:22,818 హేయ్, స్వీటీ. 459 00:32:24,069 --> 00:32:26,738 హేయ్. హేయ్, స్వీటీ. 460 00:32:27,698 --> 00:32:29,116 నువ్వు మేడ మీదకి వెళ్లి పడుకుంటావా? 461 00:32:30,492 --> 00:32:32,244 మేడ మీదకి వెళ్లి పడుకో. 462 00:33:25,005 --> 00:33:26,340 నీకు గుర్తుందా వీళ్లు... 463 00:33:27,758 --> 00:33:31,136 ఈ ఇద్దరూ చిన్నప్పుడు నిద్రపోతుంటే మనం గంటల కొద్దీ వీళ్లనే చూస్తూ గడిపేవాళ్లం. 464 00:33:33,305 --> 00:33:34,765 దేవదూత అవతారం. 465 00:34:10,132 --> 00:34:11,385 నువ్వు ఎందుకు ఇంకా ఉన్నావు? 466 00:34:30,696 --> 00:34:35,117 నువ్వు ఎందుకు ఉన్నావో... ఆదే కారణం. 467 00:34:53,969 --> 00:34:57,890 మైఖెల్, నువ్వు, నేను ఇంతకుముందు కలిశాం, అప్పుడు నా ప్రగాఢ సంతాకం వ్యక్తం చేశాను. 468 00:34:57,890 --> 00:34:59,516 ఇప్పుడు మళ్లీ అదే చేయాలి అనుకుంటున్నాను. 469 00:34:59,516 --> 00:35:02,477 మీ అమ్మగారిని కోల్పోయినందుకు ఇంకా ఆ వేదనని భరిస్తూ కూడా 470 00:35:02,477 --> 00:35:04,771 ఈ రోజు కోర్టుకు వచ్చినందుకు. 471 00:35:04,771 --> 00:35:06,648 నిన్ను ఇలా అడగడం చాలా దారుణమైన విషయం, 472 00:35:06,648 --> 00:35:10,777 కానీ ఇది దారుణమైనది కాబట్టి, మీ అమ్మగారి విషయంలో దారుణం జరిగింది కాబట్టి అడగాల్సి వస్తోంది. 473 00:35:10,777 --> 00:35:11,945 మిస్టర్ మోల్టో. 474 00:35:11,945 --> 00:35:15,407 మీ అమ్మగారు చనిపోయిన రోజు రాత్రి గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. 475 00:35:15,407 --> 00:35:17,075 అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో చెబుతారా? 476 00:35:17,075 --> 00:35:18,327 నేను ఇంట్లో డిన్నర్ చేస్తున్నాను. 477 00:35:18,327 --> 00:35:21,455 నేను టీవీలో ఏదో ప్రోగ్రామ్ చూశాను. ఏవో కొన్ని వీడియో గేమ్స్ ఆడాను. 478 00:35:21,455 --> 00:35:23,457 ఆ తరువాత ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్లాను. 479 00:35:23,457 --> 00:35:26,043 అయితే స్పష్టత కోసం అడుగుతున్నాను, మీరు 480 00:35:26,043 --> 00:35:28,378 మీరు ఉండే మీ నాన్నగారు, డాల్టన్ కాల్డ్వెల్ ఇంటి నుండి బయలుదేరి వెళ్లారు, 481 00:35:28,378 --> 00:35:31,340 ఆ తరువాత అక్కడికి వెళ్లానని చెప్పారు. ఎక్కడికి... అక్కడికి అంటే ఎక్కడికి? 482 00:35:31,340 --> 00:35:32,508 మా అమ్మగారి ఇంటికి. 483 00:35:32,508 --> 00:35:34,259 ఏం చేయడం కోసం వెళ్లారు? 484 00:35:34,259 --> 00:35:36,345 మా అమ్మగారికీ నాకూ మధ్య సరిగా సఖ్యత లేదు. 485 00:35:36,345 --> 00:35:37,596 ఆమె నన్ను దగ్గరకి రానిచ్చేది కాదు. 486 00:35:38,180 --> 00:35:41,767 నన్ను ఇంటికి రమ్మనేది కాదు. అది నాలో కొంత అయోమయాన్ని కలిగించేది. 487 00:35:41,767 --> 00:35:45,187 కొన్నిసార్లు నేను ఊరికే ఆ ఇంటికి వెళ్లి బయట నుంచి చూస్తూ గడిపేవాడిని. 488 00:35:46,146 --> 00:35:46,980 గమనిస్తుండేవారా? 489 00:35:46,980 --> 00:35:50,234 నేను లేకుండా ఆమె కోరుకునే జీవితం ఎలా ఉంటుందో చూడాలి అనుకునేవాడిని. 490 00:35:50,234 --> 00:35:53,237 ఆ విషయాలు మీకు ఇంతకుముందు నేను పూర్తిగా వివరించాను అనుకుంటా. 491 00:35:54,238 --> 00:35:55,906 మీ అమ్మగారి ఇంటికి ఎందుకు తరచూ వెళ్లేవారు? 492 00:35:55,906 --> 00:35:59,660 అప్పుడప్పుడు వెళ్లేవాడిని. ఎందుకో నాకు తెలియదు. అంటే నెలలో ఒకటి లేదా రెండుసార్లు. 493 00:35:59,660 --> 00:36:01,703 అక్కడికి వెళ్లాక మీరు ఏం చేసేవారు? 494 00:36:01,703 --> 00:36:04,331 ప్రధానంగా, చీకటిలో నిలబడి దూరం నుంచి ఆ ఇంటి వైపే చూస్తుండే వాడిని 495 00:36:04,331 --> 00:36:05,791 ఆమె నన్ను చూడకుండా జాగ్రత్త పడేవాడిని. 496 00:36:06,291 --> 00:36:09,586 కొన్నిసార్లు ఎవరో ఆ ఇంటికి వచ్చిపోవడం చూస్తుండేవాడిని. ఎక్కువగా అతడిని చూశాను. 497 00:36:09,586 --> 00:36:13,674 ప్రతివాది అయిన రస్టీ సాబిచ్ ని సాక్షి గుర్తించిన విషయాన్ని నోట్ చేసుకోవాలి. 498 00:36:13,674 --> 00:36:14,716 వాళ్లేం చేస్తున్నారో నాకు తెలుసు. 499 00:36:14,716 --> 00:36:16,552 - అబ్జెక్షన్. - కొనసాగించండి. 500 00:36:16,552 --> 00:36:18,720 నిన్ను అడిగిన ప్రశ్నలకి మాత్రమే సమాధానాలు చెప్పు, మైఖెల్. 501 00:36:18,720 --> 00:36:21,473 నీకు కాస్త విరామం తీసుకోవాలని ఎప్పుడు అనిపించినా, 502 00:36:21,473 --> 00:36:22,891 నాకు కాస్త చెప్పు, సరేనా? 503 00:36:23,851 --> 00:36:25,769 - అలాగే. - మనం కొనసాగిద్దాం. 504 00:36:25,769 --> 00:36:26,854 సరే. 505 00:36:28,480 --> 00:36:29,731 అయితే ఈ వీడియోల్ని మీరే తీశారా? 506 00:36:30,315 --> 00:36:31,316 అవును. 507 00:36:32,568 --> 00:36:33,902 జూన్ 16వ తేదీ. 508 00:36:33,902 --> 00:36:37,155 ఆ వీడియో పైన ఉన్న టైమ్ స్టాంప్ ని మీరు చదవగలరా? 509 00:36:37,155 --> 00:36:39,074 అవును. "రాత్రి 9:49 గంటలు." 510 00:36:49,543 --> 00:36:53,881 మళ్లీ చూడండి, ఈ వీడియోని మీరు రాత్రి 9:49 గంటలకి తీశారు, 511 00:36:53,881 --> 00:36:56,258 - అది మీ అమ్మగారు చనిపోయిన రాత్రి కదా? - అవును. 512 00:36:59,469 --> 00:37:02,222 మీ అమ్మగారు చనిపోయిన తరువాత కూడా, మీరు ప్రతివాదికి మెసేజ్ పంపించారా? 513 00:37:02,806 --> 00:37:03,682 అవును. 514 00:37:03,682 --> 00:37:04,892 ఆయనకి మీరు ఏం మెసేజ్ పంపించారు? 515 00:37:04,892 --> 00:37:07,853 "నువ్వు అక్కడ ఉన్నావు. నిన్ను నేను చూశాను" అని మెసేజ్ చేశాను. 516 00:37:07,853 --> 00:37:09,730 నేను నిన్ను చూశాను అంటే ఏంటి? 517 00:37:09,730 --> 00:37:11,440 నేను ఆ వీడియో తీసినప్పుడు ఆ ఇంటి దగ్గర తనని చూశాను. 518 00:37:12,524 --> 00:37:14,193 మీరు ప్రతివాదిని కలుకోమని అడిగారా? 519 00:37:14,735 --> 00:37:16,737 - అడిగాను. - అతడిని ఎందుకు కలుసుకోవాలని అడిగారు? 520 00:37:17,446 --> 00:37:22,117 అంటే, మా అమ్మని చంపిన వ్యక్తి కళ్లలోకి చూడాలి అనుకున్నాను. 521 00:37:22,117 --> 00:37:23,827 - అబ్జెక్షన్. - కొనసాగించండి. 522 00:37:25,662 --> 00:37:29,249 మీరు కలవాలి అని అడిగినప్పుడు, మీరు ఇంకా ప్రతివాది కలుసుకున్నారా? 523 00:37:29,249 --> 00:37:31,543 - కలుసుకున్నాం. - మీరు ఏం మాట్లాడుకున్నారు? 524 00:37:31,543 --> 00:37:34,588 అతను మనం ఎందుక కలుస్తున్నాం అని అడిగాడు, అప్పుడు నేను ఏం చెప్పానంటే 525 00:37:34,588 --> 00:37:37,341 నా తల్లిని చంపిన వ్యక్తి కళ్లలోకి నేరుగా చూడాలి అనుకున్నాను అని. 526 00:37:37,341 --> 00:37:38,425 అబ్జెక్షన్. యువర్ హానర్. 527 00:37:38,425 --> 00:37:42,554 కొనసాగించండి. సాక్షి కేవలం తన అభిప్రాయాల్ని మాత్రమే చెబుతున్నారు. 528 00:37:43,430 --> 00:37:45,849 మీ అమ్మగారిని హత్య చేశావంటూ ప్రతివాదిని మీరు నిందించారా? 529 00:37:45,849 --> 00:37:47,935 - నేను నిందించాను. - ఆయన ఎలా స్పందించాడు? 530 00:37:49,269 --> 00:37:50,312 ఆయన దానిని ఖండించాడు. 531 00:37:51,188 --> 00:37:52,523 కానీ అతను అబద్ధం చెబుతున్నాడని గ్రహించాను. 532 00:37:52,523 --> 00:37:54,066 - అబ్జెక్షన్. - కొనసాగించండి. 533 00:37:54,066 --> 00:37:56,401 మైఖెల్, మీ అభిప్రాయాల్ని మీరు చెప్పచ్చు 534 00:37:56,401 --> 00:37:58,904 కానీ అవే వాస్తవాలుగా మాకు చెప్పకండి, సరేనా? 535 00:37:59,988 --> 00:38:00,989 అలాగే. 536 00:38:00,989 --> 00:38:04,660 ప్రతివాది గురించి మీ అమ్మగారితో ఎప్పుడైనా చర్చించారా? 537 00:38:04,660 --> 00:38:06,745 నేను ముందే చెప్పాను, మేము అంత సన్నిహితంగా లేము. 538 00:38:06,745 --> 00:38:08,622 ఆమె తన విషయాలు నాతో పంచుకునేది కాదు. 539 00:38:08,622 --> 00:38:10,707 కానీ ఆమె చనిపోవడానికి సుమారు రెండు వారాల ముందు, 540 00:38:10,707 --> 00:38:13,794 తన ఆఫీసులో పని చేసే ఒక వ్యక్తితో తను ఇబ్బంది పడుతున్నట్లు చెప్పింది. 541 00:38:13,794 --> 00:38:15,754 నా అభిప్రాయం ప్రకారం 542 00:38:15,754 --> 00:38:18,423 ఆమె సంబంధం పెట్టుకున్న ఈ వ్యక్తే అతను అయి ఉంటాడు. 543 00:38:18,423 --> 00:38:20,133 ఆమె ఇంకా ఏమైనా చెప్పారా? 544 00:38:21,218 --> 00:38:22,928 అతడంటే తనకి భయం వేస్తోందని చెప్పింది. 545 00:38:22,928 --> 00:38:24,847 అది ఎవరై ఉంటారని మీ ఆలోచన? 546 00:38:24,847 --> 00:38:27,349 - అబ్జెక్షన్. ఊహాగానం. - నేను అనుమతిస్తున్నాను. 547 00:38:29,893 --> 00:38:32,312 నా అభిప్రాయం ప్రకారం ఈ వ్యక్తే అతను అయి ఉంటాడు. 548 00:38:32,312 --> 00:38:34,523 - అతనే ఆమెని చంపాడని నా అభిప్రాయం. - అబ్జెక్షన్. 549 00:38:34,523 --> 00:38:37,150 ఆమె చనిపోయిన రోజు రాత్రి నేను వీడియోలు తీసింది ఈ వ్యక్తినే. 550 00:38:37,150 --> 00:38:38,360 - అబ్జెక్షన్. - కొనసాగించండి. 551 00:38:38,360 --> 00:38:41,154 అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి, మైఖెల్. దయచేసి, సొంతంగా ఏమీ చెప్పకండి. 552 00:38:43,490 --> 00:38:45,242 థాంక్యూ, మైఖెల్. నేను అడగాల్సిన ప్రశ్నలు అవే. 553 00:38:46,743 --> 00:38:47,744 మైఖెల్. 554 00:38:51,957 --> 00:38:53,834 నీకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి, కదా? 555 00:38:54,501 --> 00:38:57,087 మీ అమ్మ భయపడుతోందని నీకు ఒక అభిప్రాయం ఉంది. 556 00:38:57,087 --> 00:39:03,093 మీ అమ్మగారితో సంబంధం ఉన్న వ్యక్తిని చూసి 557 00:39:03,093 --> 00:39:04,511 ఆమె భయపడుతోందని కూడా నీ అభిప్రాయమే. 558 00:39:04,511 --> 00:39:07,014 అభిప్రాయం. చాలా హాస్యాస్పదమైన పదం, అభిప్రాయం. 559 00:39:07,014 --> 00:39:08,974 మనం ఆ మాట గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం. 560 00:39:10,767 --> 00:39:12,311 ఆ పదానికి అర్థం ఏంటి? దాని అర్థం... 561 00:39:14,354 --> 00:39:19,234 మనకి తెలియని ఒక విషయం గురించి నమ్మకం లేదా విశ్వాసం, 562 00:39:20,444 --> 00:39:21,695 అవునా? 563 00:39:27,034 --> 00:39:28,035 కౌన్సెల్? 564 00:39:29,995 --> 00:39:32,331 మిస్టర్ హోర్గన్, మీరు అడగాల్సిన ప్రశ్న ఏమైనా ఉందా? 565 00:39:37,878 --> 00:39:38,962 రే? 566 00:39:41,924 --> 00:39:44,843 - రే? రే? రే? - నేను ఆయన భార్యని. 567 00:40:23,173 --> 00:40:24,883 - ఇంకా నాడి ఆడటం లేదు. - మళ్లీ. 568 00:40:24,883 --> 00:40:26,301 రెడీ? 569 00:40:26,301 --> 00:40:28,720 - మూడు, రెండు, ఒకటి, క్లియర్. - మరేం ఫర్వాలేదు. 570 00:40:35,853 --> 00:40:37,813 స్కాట్ ట్యురొవ్ రాసిన నవల ఆధారంగా 571 00:41:58,852 --> 00:42:00,854 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్