1 00:00:16,850 --> 00:00:18,018 నాన్నా! 2 00:00:18,018 --> 00:00:20,270 - నా ఇంటి నుండి బయటకి పో. - రస్టీ, ఆపు! 3 00:00:20,270 --> 00:00:21,688 బయటకి పో! 4 00:00:21,688 --> 00:00:23,065 - మీరు లోపలికి పదండి! - సరే, సరే! 5 00:00:23,065 --> 00:00:24,900 బేబీ, బేబీ. నా వైపు చూడు. 6 00:00:24,900 --> 00:00:28,028 రస్టీ? అక్కడ ఏం జరుగుతోంది? 7 00:00:28,028 --> 00:00:30,364 - బేబీ, చూడు, అతను వెళ్లిపోయాడు. - రస్టీ, నాతో మాట్లాడు. 8 00:00:30,364 --> 00:00:32,323 - ఊపిరి తీసుకో, ఊపిరి తీసుకో. - రస్టీ? 9 00:00:40,666 --> 00:00:42,793 అయితే అతను ఏదో నిజం దాస్తున్నాడని నువ్వు అనుకున్నావు, 10 00:00:42,793 --> 00:00:45,170 అందుకోసం నువ్వు అతని ఇంటికి వెళ్లావు. 11 00:00:46,296 --> 00:00:49,132 తరువాత అతను ఇక్కడికి వచ్చాడు... దేని కోసం? 12 00:00:49,883 --> 00:00:51,301 నిన్ను బెదిరించడం కోసమా? 13 00:00:52,928 --> 00:00:54,596 రస్టీ, నువ్వు అతడిని దాదాపు చంపబోయావు. 14 00:00:59,685 --> 00:01:01,311 అతను పోలీసుల దగ్గరకి వెళితే ఏం అవుతుంది? 15 00:01:01,311 --> 00:01:02,396 అతను వెళ్లడు. 16 00:01:03,397 --> 00:01:04,397 నువ్వు ఎలా చెప్పగలవు? 17 00:01:06,441 --> 00:01:07,442 అతను పోలీసుల దగ్గరకి వెళ్లడు. 18 00:01:28,088 --> 00:01:29,214 పేరు బైక్ 19 00:01:54,239 --> 00:01:55,407 - టామీ? - ఏంటి? 20 00:01:55,407 --> 00:01:57,951 నేనే మొదటి సాక్షిని లేదా మొదటి సాక్షులలో ఒకదానిని అని చెప్పారు. 21 00:01:57,951 --> 00:01:59,161 అది ఎందుకో నేను తెలుసుకోవాలి. 22 00:01:59,161 --> 00:02:01,788 ప్రాసిక్యూషన్ వారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని డిఫెన్స్ వారు వాదిస్తారు, 23 00:02:01,788 --> 00:02:03,749 నువ్వు సాక్షి అయితే ఆ వాదనని మొదట్లోనే తోసిపుచ్చచ్చు. 24 00:02:03,749 --> 00:02:06,168 రస్టీ ఈ హత్య చేశాడని నేను చెప్పాలని నువ్వు ఆశిస్తే, నేను అలా చెప్పను. 25 00:02:06,168 --> 00:02:09,003 లేదు. నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలని నేను కోరుకోవడం లేదు. 26 00:02:10,631 --> 00:02:13,634 నువ్వు కేవలం నిజం చెప్పాలని మాత్రమే ఆశిస్తున్నాను. ఆ విషయంలో నీకేమీ ఇబ్బంది లేదు కదా? 27 00:02:15,844 --> 00:02:18,514 మీ ఇద్దరి మధ్యా ఏం ఉంది? 28 00:02:18,514 --> 00:02:21,517 అతని మీద నీకు ప్రత్యేకమైన ఇష్టం ఏదైనా ఉందా? 29 00:02:21,517 --> 00:02:23,519 - రస్టీతో? - అవును. 30 00:02:23,519 --> 00:02:26,021 మీ మధ్య ఏమైనా ఉందంటే, దాని గురించి నేను తెలుసుకోవాలి. 31 00:02:28,273 --> 00:02:29,274 అతడికి ఎప్పుడైనా ముద్దు పెట్టావా? 32 00:02:30,609 --> 00:02:32,110 ఇది అసభ్యకరమైన ప్రశ్న. 33 00:02:32,110 --> 00:02:33,529 సంబంధం లేని ప్రశ్న. 34 00:02:33,529 --> 00:02:35,197 వెళ్లి నీ పని నువ్వు చూస్కో. 35 00:02:35,197 --> 00:02:37,074 నిన్ను సాక్షిగా ప్రవేశపెట్టబోతున్నాం ఎందుకంటే 36 00:02:37,074 --> 00:02:39,159 కారొలిన్ ఇంకా రస్టీ మధ్య సంబంధం గురించి వివరించడం కోసం, 37 00:02:39,159 --> 00:02:40,994 ఇంకా వృత్తిపరంగా నిష్పాక్షికంగా ఉంటావని నాకు తెలియాలి. 38 00:02:40,994 --> 00:02:44,122 వృత్తిపరమైన నిష్పాక్షికతే నీ ఉద్దేశం అయితే, 39 00:02:44,122 --> 00:02:46,208 బహుశా నువ్వే ఈ కేసు నుండి తప్పుకోవాలి. 40 00:02:50,254 --> 00:02:52,923 చూడు, మన ఆఫీసులో చాలా మార్పులూ చేర్పులూ జరుగుతున్నాయి, 41 00:02:52,923 --> 00:02:57,928 ఇంకా అన్నింటికీ మించి నాకు, నీకోకి ముఖ్యమైనది ఏమిటంటే విధేయత అని నువ్వు గ్రహించాలి. 42 00:04:15,255 --> 00:04:17,257 అది అలా సంచలనం అయిపోయిందా? 43 00:04:17,257 --> 00:04:18,591 అవును. అందరికీ తెలిసిపోయింది. 44 00:04:20,093 --> 00:04:21,428 మొత్తం ఆఫీస్ అంతా. 45 00:04:23,805 --> 00:04:26,391 రేమండ్, ఈ పీడకలలన్నీ, 46 00:04:27,559 --> 00:04:29,228 అవన్నీ నీకు ఒకే విషయాన్ని చెబుతున్నాయి, 47 00:04:29,228 --> 00:04:31,522 ఆ సాక్ష్యం కూడా... 48 00:04:31,522 --> 00:04:32,898 - ఈ చర్చ ఆపేద్దామా? - ...అదే చెబుతోంది. 49 00:04:34,483 --> 00:04:38,904 ఈ కేసులో ఏదైనా ఆధారం, చిన్నదయినా, హంతకులు ఎవరో గుర్తించడానికి తగినది దొరికిందా? 50 00:04:39,488 --> 00:04:43,325 లో, హంతకుడు ఎవరో చూపించే సాక్ష్యం దొరికిందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. 51 00:04:43,325 --> 00:04:44,409 ఇక్కడ సాక్ష్యం లేదు... 52 00:04:44,409 --> 00:04:45,911 - అతడి వైపు చూపేది. - ...రస్టీయే దోషి అని చెప్పడానికి. 53 00:04:45,911 --> 00:04:47,746 నాకు తెలుసు. అది పెనుభారం. 54 00:04:49,331 --> 00:04:50,999 నువ్వు మోస్తున్న ఆ పెనుభారం గురించి మాట్లాడుకుందామా? 55 00:04:50,999 --> 00:04:52,251 మనం మాట్లాడకుండా ఉందామా? 56 00:04:53,877 --> 00:04:54,962 అతను ఆ నేరం చేయలేదు. 57 00:04:57,923 --> 00:04:58,924 అది ముఖ్యం కాదు. 58 00:05:00,509 --> 00:05:02,511 ఏది ఏమైనా, నువ్వు డిఫెన్స్ లాయర్ గా వాదిస్తున్నావు. 59 00:05:43,635 --> 00:05:45,387 వెళదాం పద, లౌరా. త్వరగా రా. 60 00:06:49,576 --> 00:06:50,577 చెత్త! 61 00:07:12,391 --> 00:07:15,769 - హేయ్! హేయ్, నువ్వు ఏం చేస్తున్నావు? - హేయ్. హేయ్. 62 00:07:16,603 --> 00:07:17,688 హేయ్, నేను మాట్లాడాలంతే. 63 00:07:18,397 --> 00:07:19,398 నేను పోలీసుల్ని పిలుస్తున్నా. 64 00:07:19,398 --> 00:07:21,525 నిన్న రాత్రి జరిగిన గొడవ గురించి పోలీసులకి ఫోన్ చేస్తావా? 65 00:07:21,525 --> 00:07:23,318 మంచిది. నిన్ను అక్కడ కారులో దింపమంటావా? 66 00:07:23,318 --> 00:07:24,903 మన ఇద్దరం కలిసి పోలీస్ రిపోర్ట్ రాద్దాం. 67 00:07:24,903 --> 00:07:26,321 నీకు అసలు ఏమైంది? 68 00:07:26,321 --> 00:07:29,074 నేను కేవలం నీతో మాట్లాడాలి అనుకుంటున్నా. సరేనా? 69 00:07:29,658 --> 00:07:31,743 ఊరికే కాసేపు నాతో మాట్లాడు. 70 00:07:34,288 --> 00:07:36,331 నువ్వు దాడి చేశావు. అనుమతి లేకుండా ఇంట్లోకి వెళ్లావు. 71 00:07:36,331 --> 00:07:39,042 - నువ్వు అతడిని డబ్బు కోసం బెదిరిస్తున్నావని ఆరోపించచ్చు. - నేను కొట్టానా? చొరబడ్డానా? 72 00:07:39,042 --> 00:07:41,837 - అతను అలా వచ్చాడంటే నమ్మలేకపోయాను... - ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి అతనికి దొరికిన అవకాశం, 73 00:07:41,837 --> 00:07:44,423 నిజం, పోలీసుల్ని ఆశ్రయించడం. 74 00:07:44,423 --> 00:07:47,176 అతను నీకు వ్యతిరేకంగా పోలీసులకి ఏదైనా సమాచారం అందించి 75 00:07:47,176 --> 00:07:50,596 నువ్వు మతిస్థిమితం తప్పి ఉద్రేకంగా ప్రవర్తిస్తున్నావని చెబితే, 76 00:07:50,596 --> 00:07:53,348 అదీ, నా అభిప్రాయం ప్రకారం, రస్టీ, 77 00:07:54,224 --> 00:07:57,102 మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెట్టడం ఖాయం అనిపిస్తుంది, నేను... 78 00:07:59,188 --> 00:08:00,063 మైయా. 79 00:08:00,689 --> 00:08:01,982 తను ఈ కేసుకి కొత్త. 80 00:08:01,982 --> 00:08:03,066 తను నిష్పాక్షికంగా ఉండగలదు. 81 00:08:03,066 --> 00:08:05,194 రస్టీ చెప్పే ఈ థియరీని విను. 82 00:08:06,320 --> 00:08:08,030 లియామ్ రేనాల్డ్స్ మన ప్రధాన అనుమానితుడు. 83 00:08:08,030 --> 00:08:09,489 నేరం చేయడానికి అతనికి ఒక కారణం ఉంది. 84 00:08:09,489 --> 00:08:11,074 ఇది అన్యాయం! 85 00:08:11,074 --> 00:08:13,243 అతను జైలులో ఉన్నా కూడా, ఈ నేరం చేయగల అవకాశాలు ఉన్నాయి. 86 00:08:13,243 --> 00:08:14,912 బయట అతనికి తెలిసిన మనుషులు ఉన్నారు. 87 00:08:14,912 --> 00:08:19,917 రీగో జైలుకో కొంతమంది ఖైదీలతో మాట్లాడిన మీదట, తను చెప్పేదాని ప్రకారం, 88 00:08:19,917 --> 00:08:21,919 ఈ హత్య చేసింది తనే అని రేనాల్డ్స్ వాళ్లకి చెప్పాడట. 89 00:08:21,919 --> 00:08:23,879 ఆమె చాలామంది నేరగాళ్లకి శిక్షపడేలా చేసింది. 90 00:08:23,879 --> 00:08:26,965 రేనాల్డ్స్ గనుక ఒకవేళ ఈ నేరంలో భాగస్వామి అయి ఉంటే... 91 00:08:26,965 --> 00:08:29,092 ఆమె తలకి నేను చాలా సంతోషంగా చిల్లు పెట్టేవాడిని. 92 00:08:29,676 --> 00:08:32,471 నేను చెప్పేది ఏమిటంటే... కారొలిన్ సాక్ష్యాన్ని దాచి పెట్టింది. 93 00:08:33,096 --> 00:08:36,433 - ఆ సాక్ష్యాధారాలు స్పష్టంగా లేవు. - లేదు, కారొలిన్ సాక్ష్యాన్ని దాచి పెట్టింది, రే. 94 00:08:39,394 --> 00:08:41,395 - హేయ్. - ఆ ఫలితాలు నీకు అందాయా? 95 00:08:43,815 --> 00:08:45,317 ప్రాథమిక పరీక్షల్లో కొత్తగా మనం ఊహించనిది ఏదీ లేదు. 96 00:08:45,317 --> 00:08:49,112 కానీ నేరం జరిగిన ప్రదేశంలో, రాట్జర్ వీర్యం ఉంది. 97 00:08:49,112 --> 00:08:52,658 కాబట్టి మనం సరైన కారణాలు లేకుండా ఈ నిర్ణయాలకి రావడం లేదు. 98 00:08:58,163 --> 00:09:01,333 సరే. కానీ అది మన కేసు కాదు. 99 00:09:01,917 --> 00:09:02,918 తను నిజం చెప్పింది. 100 00:09:04,211 --> 00:09:08,131 హేయ్, ఈ వృత్తిలో నేను అనుభవపూర్వకంగా రెండు విషయాలు నేర్చుకున్నాను. 101 00:09:08,131 --> 00:09:11,051 మొదటిది, జైలులో ఉంటూ సమాచారాన్ని అందించే వాళ్లు, 102 00:09:11,051 --> 00:09:14,429 తమ ప్రయోజనాల కోసం ఏదైనా చెబుతారు లేదా ఎలాంటి కథలయినా అల్లుతారు. 103 00:09:15,013 --> 00:09:18,892 రెండోది, ఎవరైతే హత్య చేస్తారో, వాళ్లు జైలులో తమ తోటి ఖైదీలని బెదిరించడానికి, 104 00:09:18,892 --> 00:09:20,602 లేదా గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. 105 00:09:20,602 --> 00:09:24,773 కానీ వాళ్లు అది పైకి చెప్పుకుంటూ జైలంతా తిరగరు. 106 00:09:25,649 --> 00:09:26,817 సారీ. 107 00:09:26,817 --> 00:09:29,027 ఆమె హత్య కేసులో రేనాల్డ్స్ పాత్ర నిజంగా ఉన్నా కూడా, 108 00:09:29,820 --> 00:09:32,072 ఈ రాట్జర్ అనేవాడు మనకి ఎలా సాయపడతాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. 109 00:09:32,072 --> 00:09:34,700 నేను చెప్పేది ఏమిటంటే, వాళ్లిద్దరికీ ఈ కేసుతో సంబంధం ఉండచ్చు, రేమండ్. 110 00:09:35,284 --> 00:09:36,910 వాళ్లిద్దరికీ పరిచయం ఉండచ్చేమో. 111 00:09:38,620 --> 00:09:39,955 ఇది నా జీవితం. 112 00:09:39,955 --> 00:09:41,039 అవును. 113 00:09:42,583 --> 00:09:44,251 నాకు తెలుసు, నేను నీ జీవితాన్ని కాపాడాలి అనుకుంటున్నాను 114 00:09:44,251 --> 00:09:48,338 ఎందుకంటే నీ జీవితాన్ని, నీ స్వేచ్ఛనీ కాపాడమని నువ్వు నన్ను అడిగావు. 115 00:09:49,423 --> 00:09:51,675 కానీ రస్టీ, ఏది ఏమైనా సరే... 116 00:09:53,260 --> 00:09:54,761 అది మాత్రం, 117 00:09:54,761 --> 00:09:58,599 "హేయ్, ఈ నేరగాడికి జైలులో ఉన్న ఇంకో నేరగాడు పరిచయం, 118 00:09:58,599 --> 00:10:00,434 వాళ్లిద్దరి వీర్యం నమూనాలు 119 00:10:00,434 --> 00:10:04,021 ఒక అపార్టుమెంట్ లో వేశ్యని హత్య చేసిన ప్రదేశంలో దొరికాయి" అని చెప్పడం మన వ్యూహం కాదు. 120 00:10:04,021 --> 00:10:07,399 ఆమెని కూడా సరిగ్గా కారొలిన్ మాదిరిగానే తాళ్లతో కట్టి చంపారు. 121 00:10:07,399 --> 00:10:08,483 పూర్తిగా అలా కాదు. 122 00:10:09,943 --> 00:10:11,028 దాదాపు ఒకేలా. 123 00:10:12,613 --> 00:10:14,364 దేవుడా. సరే. కానీ, నీకు ఒక విషయం తెలుసా? 124 00:10:14,364 --> 00:10:16,450 రాట్జర్ ని మీరే స్వయంగా అడగండి. అతను రేపు ఇక్కడికి వస్తున్నాడు. 125 00:10:16,450 --> 00:10:17,618 ఏంటి? 126 00:10:22,789 --> 00:10:23,790 అలాగే. 127 00:10:32,216 --> 00:10:33,383 ఆయన ట్రెడ్ మిల్ మీద ఉన్నాడు. 128 00:10:34,760 --> 00:10:36,470 సరే. నేనే సలహా ఇచ్చాను. 129 00:10:37,346 --> 00:10:39,056 నిన్న రాత్రి తను ఒక మనిషి మీద దాడి చేశాడు. 130 00:10:40,098 --> 00:10:41,475 దాని కన్నా ట్రెడ్ మిల్ చేయడమే నయం. 131 00:10:42,726 --> 00:10:46,563 అమ్మా, ఆ హత్య నాన్నే చేశాడా? 132 00:10:51,235 --> 00:10:53,445 లేదు. లేదు, బంగారం. 133 00:10:54,029 --> 00:10:56,281 మీ నాన్నకి లోపల చాలా ఆవేశం ఉంది... 134 00:10:58,534 --> 00:10:59,993 కానీ ఈ హత్య తను చేయలేదు. 135 00:11:03,330 --> 00:11:05,749 రాట్జర్, అతనే చేసి ఉండచ్చు. 136 00:11:07,209 --> 00:11:09,878 అతని మీద కోపం కొద్దీ చెప్పడం లేదు కదా? 137 00:11:16,218 --> 00:11:17,219 అది కూడా అయి ఉండచ్చు. 138 00:11:17,219 --> 00:11:19,304 మిస్టర్ హోర్గన్ ఏం అనుకుంటున్నాడు? 139 00:11:19,888 --> 00:11:21,348 ఈ కేసు ఇక ముందుకు సాగదని రే అనుకుంటున్నాడు, 140 00:11:21,348 --> 00:11:23,976 ఇంకా అదుపు కోల్పోయి ప్రవర్తిస్తున్నానని అతను అనుకుంటున్నాడు. 141 00:11:23,976 --> 00:11:25,435 అతను అనుకుంటున్నది సరైనదేనా? 142 00:11:25,435 --> 00:11:26,520 బహుశా నిజం కావచ్చు. 143 00:11:27,229 --> 00:11:30,399 నా ఉద్దేశం, నువ్వు వేగంగా నీ ప్లాన్లు మార్చుకుంటున్నావు అనిపిస్తోంది. 144 00:11:30,399 --> 00:11:31,817 నీ ఉద్దేశం ఏంటి? 145 00:11:32,401 --> 00:11:33,819 అంటే, నువ్వు ఒక మనిషిని కొట్టావు. 146 00:11:34,862 --> 00:11:36,864 జే, వాడు మన ఇంటి మీద దాడి చేశాడు. 147 00:11:38,490 --> 00:11:40,659 నిన్ను బెదిరించాడు. అమ్మని బెదిరించాడు. 148 00:11:41,743 --> 00:11:43,078 నేను అప్పుడు ఇంకేం చేయాలి? 149 00:11:45,581 --> 00:11:46,665 నాకు తెలియదు. 150 00:11:48,000 --> 00:11:49,418 నాకు నిన్ను చూస్తే భయం వేస్తోంది. 151 00:11:49,418 --> 00:11:50,669 ఓహ్, బంగారం. 152 00:11:57,634 --> 00:11:58,635 మరేం ఫర్వాలేదు. 153 00:12:14,276 --> 00:12:15,652 - హేయ్, టామీ. - హేయ్, కారొలిన్. 154 00:12:15,652 --> 00:12:18,238 - నన్ను వెంబడిస్తున్నావా? - నేను వెంబడిస్తున్నా... 155 00:12:20,199 --> 00:12:24,286 సరే, విను. నాతో కలిసి పని చేయడం నీకు ఇష్టం లేదని నాకు తెలిసింది, ఇంకా... 156 00:12:26,246 --> 00:12:27,247 అది నీకు ఎవరు చెప్పారు? 157 00:12:27,748 --> 00:12:29,833 ఓహ్, దేవుడా. ఎవరు చెప్పారన్నది పట్టించుకోకు. 158 00:12:29,833 --> 00:12:31,710 నాతో పని చేయడం నీకు ఇష్టం లేదన్నది నిజమేనా? 159 00:12:33,003 --> 00:12:34,796 - నేను... - అది నాకు చెప్పు చాలు. 160 00:12:34,796 --> 00:12:36,006 నేను... 161 00:12:36,006 --> 00:12:39,968 నా సొంత కేసుల్ని వాదించడానికే మొదట ప్రాధాన్యం ఇస్తానని చెప్పాను. 162 00:12:39,968 --> 00:12:43,722 నేను గనుక సహాయకురాలిగా పని చేయాలంటే, రస్టీతో కలిసి పని చేయడానికి ఇష్టపడతాను, 163 00:12:43,722 --> 00:12:46,892 ఎందుకంటే అతను చీఫ్ డిప్యూటీ ప్రాసిక్యూటర్ కాబట్టి, కెరీర్ పరంగా కూడా, చూడు... 164 00:12:46,892 --> 00:12:49,353 - అవును, నాకు తెలుసు. అందులో అర్థం ఉంది. - అవును. 165 00:12:49,353 --> 00:12:52,439 నువ్వు ప్రత్యేకంగా నాతో పని చేయడానికి ఇష్టపడటం లేదన్నట్లు నాకు మార్చి చెప్పారు. 166 00:12:53,815 --> 00:12:54,900 నేను అలా అనలేదు. 167 00:12:55,526 --> 00:12:57,361 నన్ను... బహుశా తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. 168 00:13:02,366 --> 00:13:03,450 పొద్దుపోయే వరకూ పని చేస్తున్నావు. 169 00:13:04,993 --> 00:13:05,994 అవును. 170 00:13:07,412 --> 00:13:12,167 విను, ఆ లియామ్ రేనాల్డ్స్ గాడే బన్నీ డేవిస్ ని హత్య చేశాడు కదా? 171 00:13:13,418 --> 00:13:14,628 ఇప్పుడు వాడి గురించి దేనికి? 172 00:13:14,628 --> 00:13:17,339 ఖచ్చితంగా అదే. చూడు, నేను చాలా వింటున్నాను. 173 00:13:17,339 --> 00:13:18,966 కారొలిన్ ని అతను బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయి. 174 00:13:18,966 --> 00:13:20,425 - అతను జైలులో ఉన్నాడు. - ఇంకా... 175 00:13:22,469 --> 00:13:23,303 అవును. 176 00:13:24,555 --> 00:13:25,889 కానీ నువ్వు అతడితో మాట్లాడావా? 177 00:13:26,932 --> 00:13:30,018 మేము మాట్లాడాము, ఇంకా మన పరిశోధనలో ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే, వాటిని ఖచ్చితంగా విచారిస్తాము. 178 00:13:30,018 --> 00:13:33,188 అతని దగ్గర ఏదైనా సమాచారం దొరుకుతుందని నువ్వు అనుకోలేదు, అవునా? 179 00:13:37,150 --> 00:13:38,777 - అతను జైలులో ఉన్నాడు. - అవును. 180 00:13:38,777 --> 00:13:40,654 లియామ్ రేనాల్డ్స్ దగ్గర ఈ విచారణ ఆగుతుంది. 181 00:13:41,238 --> 00:13:43,574 ప్రస్తుతం, మన దృష్టి అంతా రస్టీ సాబిచ్ మీదనే ఉంది, కదా? 182 00:13:44,741 --> 00:13:45,742 అవును. 183 00:14:04,052 --> 00:14:05,220 బార్బరా. 184 00:14:19,193 --> 00:14:24,281 క్లిఫ్ 185 00:14:25,574 --> 00:14:29,369 క్లిఫ్టన్, నేను బార్బరా సాబిచ్ ని. 186 00:14:30,078 --> 00:14:32,998 అవును. నువ్వు కాల్ చేస్తావని ఎదురుచూస్తున్నాను. 187 00:14:41,632 --> 00:14:43,884 సారీ. ఏదో పొరపాటుగా కాల్ చేశాను. 188 00:14:43,884 --> 00:14:45,302 అది మంచి ఆలోచన కాదు. 189 00:14:48,722 --> 00:14:52,392 ఎవరు అన్నారు, "మంచి అనుబంధాన్ని వదులుకుంటే పశ్చాత్తాపపడతాం" అని? 190 00:16:27,529 --> 00:16:28,864 ఇక్కడ నేను భద్రంగా ఉన్నట్లు అనిపిస్తోంది. 191 00:16:33,577 --> 00:16:35,996 కళా ప్రపంచంలో ఇలా చేయడం తప్పు కదా? 192 00:16:39,583 --> 00:16:40,584 నా దృష్టిలో కాదు. 193 00:16:42,294 --> 00:16:45,714 నిజం చెప్పాలంటే, ఈ మధ్య కాలంలో భద్రత అనేది నాకు కొద్దిగా దూరమయింది. 194 00:16:53,972 --> 00:16:55,307 లూయిస్ కారొల్. 195 00:16:56,600 --> 00:16:57,434 ఏంటి? 196 00:16:57,434 --> 00:17:02,606 "చివరిలో, మనం వదులుకున్న అనుబంధాల గురించి మనం పశ్చాత్తాపపడతాము." 197 00:17:03,732 --> 00:17:05,150 అది ఆస్కార్ వైల్డ్ అన్నాడు అనుకున్నా. 198 00:17:09,905 --> 00:17:11,949 ఇప్పుడు నాకు భద్రతాభావం కాస్త తగ్గినట్లు అనిపిస్తోంది. 199 00:17:14,701 --> 00:17:17,287 మొదటగా నిన్ను తాకాలని నేను నిజంగా అనుకోవడం లేదు. 200 00:17:19,039 --> 00:17:21,124 నీకు ఇష్టం లేని పనిని నువ్వు చేయడం కూడా నాకు ఇష్టం లేదు. 201 00:17:21,875 --> 00:17:22,876 నాకు కావాలి. 202 00:17:27,964 --> 00:17:28,966 నేను చూడకూడదు అంతే. 203 00:17:32,970 --> 00:17:34,054 కానీ నేను కోరుకుంటున్నాను. 204 00:17:54,366 --> 00:17:55,868 ఆ కేసులో నా ప్రమేయం ఏమీ లేదు. 205 00:17:57,744 --> 00:17:59,955 కానీ ఆమెతో నీకు పరిచయం ఉంది, మిస్టర్ రాట్జర్. 206 00:18:02,875 --> 00:18:05,210 నీ వీర్యకణాలు ఆమె అపార్టుమెంట్ లో దొరికాయి. 207 00:18:05,210 --> 00:18:06,670 కానీ ఆ రాత్రి నేను అక్కడికి వెళ్లలేదు. 208 00:18:07,171 --> 00:18:10,090 అయితే నీకు ఆమె తెలుసు అంటావు కదా? 209 00:18:11,508 --> 00:18:13,010 ఆ మహిళతో నువ్వు సెక్స్ చేశావా? 210 00:18:15,137 --> 00:18:16,138 అవును, చేసి ఉండచ్చు. 211 00:18:16,138 --> 00:18:17,347 చేసి ఉండచ్చా? 212 00:18:22,311 --> 00:18:26,023 చూడండి, నాకు వేశ్యలతో సంబంధాలు ఉన్నాయి, సరేనా? 213 00:18:26,023 --> 00:18:29,318 అలాగే, అంటే, తనతో పరిచయం ఉన్నట్లే అనిపిస్తోంది, సరేనా? 214 00:18:30,485 --> 00:18:31,486 కానీ చూడండి, హేయ్... 215 00:18:33,071 --> 00:18:34,448 నాకు నా భార్య అంటే ఇష్టం, సరేనా? 216 00:18:35,824 --> 00:18:41,079 కానీ నలుగురు పిల్లలు పుట్టాక, తనకి సెక్స్ మీద ఆసక్తి తగ్గిపోయింది. 217 00:18:41,079 --> 00:18:44,416 కాబట్టి, కొన్నిసార్లు వెళ్తాను, అవును. మరీ తరచుగా కాదు. 218 00:18:44,416 --> 00:18:45,876 మరి ఈ వ్యక్తి? 219 00:18:47,419 --> 00:18:49,129 లియామ్ రేనాల్డ్స్ 220 00:18:50,756 --> 00:18:52,758 లేదు, అతను ఎవరో నాకు తెలియదు. అతడిని నేను ఎప్పుడూ చూడలేదు. 221 00:18:53,383 --> 00:18:54,468 నిజంగా చెబుతున్నావా? 222 00:18:56,053 --> 00:18:58,180 అవును, ఖచ్చితంగా చెప్పగలను. 223 00:18:59,598 --> 00:19:00,599 నేను ఎందుకు అబద్ధం చెబుతాను? 224 00:19:00,599 --> 00:19:02,684 ఆమె హత్య కేసులో నిన్ను ఇరికిస్తారని భయపడుతున్నావా, 225 00:19:04,144 --> 00:19:08,482 {\an8}ఎందుకంటే ఇప్పటికీ ఘటనాస్థలంలో నీ డిఎన్ఎ కనిపించింది కాబట్టి నీ పాత్ర ఉండచ్చు కదా? 226 00:19:19,868 --> 00:19:21,954 లియామ్ రేనాల్డ్స్ ఈ హత్య చేశాడని మాకు తెలుసు. 227 00:19:22,538 --> 00:19:26,875 {\an8}ఈ మనిషితో నీకు పరిచయం ఉంటే గనుక, ఆ వివరాలు మాకు చెప్పడానికి ఇదే సరైన సమయం. 228 00:19:28,919 --> 00:19:30,254 లేకపోతే మేము ఈ విషయంలో మరింత పరిశోధన చేస్తాము. 229 00:19:30,838 --> 00:19:32,714 చూడండి, నాకు ఈ మనిషి ఎవరో తెలియదు, సరేనా? 230 00:19:32,714 --> 00:19:33,966 నువ్వు అక్కడ ఉన్నావని మాకు తెలుసు. 231 00:19:33,966 --> 00:19:38,053 నేను అంతకుముందు ఎప్పుడూ అతడిని చూడలేదు... ఇంకా నాకు... నాకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదు. 232 00:20:02,202 --> 00:20:03,287 ఆయుధాలు తీయండి. 233 00:20:05,789 --> 00:20:07,249 - తరువాత. - వెనక్కి. 234 00:20:07,249 --> 00:20:09,042 - అదీ. వరుస. - మార్నింగ్. 235 00:20:09,042 --> 00:20:10,127 మీరందరూ వెళ్లచ్చు. 236 00:20:13,630 --> 00:20:15,716 మిస్టర్ మోల్టో, అధికారికంగా మీ అభిప్రాయం మాకు చెబుతారా? 237 00:20:15,716 --> 00:20:18,302 ఈ కేసులో ఒక కొత్త దావా వేస్తున్నారని మాకు తెలిసింది. 238 00:20:19,094 --> 00:20:20,971 ఎలాంటి దావాలనీ మా ప్రాసిక్యూషన్ ఆఫీస్ అనుమతించడం లేదు. 239 00:20:20,971 --> 00:20:22,306 ఈ కేసులో ప్రతివాది మీద హత్యా అభియోగం ఉంది 240 00:20:22,306 --> 00:20:24,266 అంతకన్నా తక్కువ అభియోగాల్ని మేము పరిగణనలోకి తీసుకోము. 241 00:20:24,266 --> 00:20:25,976 దానికి మించి, మేము న్యాయ విచారణ జరగాలని 242 00:20:25,976 --> 00:20:27,936 ఇంకా హంతకులకి శిక్ష పడి సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. 243 00:20:27,936 --> 00:20:29,021 సారీ, నేను చెప్పదల్చుకున్నది ఇదే. 244 00:20:29,021 --> 00:20:31,773 ఇంక అంతకన్నా న్యాయం ఇంకేం ఉంటుంది? 245 00:20:42,826 --> 00:20:43,702 నిజానికి... 246 00:20:46,663 --> 00:20:48,081 నేను ఒక మాట చెప్పాలి. 247 00:20:48,081 --> 00:20:52,586 ఈ నగరంలో చాలా కాలంగా 248 00:20:52,586 --> 00:20:55,506 భయంకరమైన ఇంకా జవాబుదారీతనం లేని వ్యవస్థ కొనసాగుతోంది. 249 00:20:55,506 --> 00:20:57,090 నిజానికి, ఈ దేశంలోనే పరిస్థితి అలా ఉంది. 250 00:20:57,090 --> 00:21:01,595 వాల్ స్ట్రీట్ చాలా క్రూరంగా అమాయకులైన ప్రజల్ని దారిద్య్రంలోకి నెట్టేసింది 251 00:21:01,595 --> 00:21:04,640 ఇంకా అది తప్పుడు తనాఖా పథకాల్ని ప్రవేశపెట్టినా ఒక్క బ్యాంకర్ కి కూడా జైలు శిక్ష పడలేదు. 252 00:21:04,640 --> 00:21:07,601 ఫార్మాస్యూటికల్ కంపెనీలు నల్లమందుతో ఔషధాలు తయారు చేసి 253 00:21:07,601 --> 00:21:09,561 తమకి ప్రజల ప్రాణాల కన్నా సొంత లాభాలు చూసుకోవడంలోనే నిమగ్నమయ్యాయి. 254 00:21:09,561 --> 00:21:11,313 ఆ రంగం నుండి ఒక్కరు కూడా జైలుకి వెళ్లలేదు. 255 00:21:11,313 --> 00:21:15,567 కాబట్టి అమెరికాలో అందరికీ పంపిన ఒక సందేశం అందింది, 256 00:21:15,567 --> 00:21:16,860 మీరు గనుక సంపన్నులు అయితే, 257 00:21:16,860 --> 00:21:19,112 మీరు ఎలాంటి తప్పు చేసినా శిక్ష నుండి తప్పించుకోవచ్చు. 258 00:21:20,030 --> 00:21:21,615 అయితే, ఇంక అలా జరగదు. లేదు, సర్. 259 00:21:28,372 --> 00:21:32,626 టామీ, అది మనకి ఎలా ఉపయోగపడుతుందో నాకు చెప్పగలవా? 260 00:21:34,878 --> 00:21:35,879 టామీ. 261 00:21:37,256 --> 00:21:39,842 - టామీ, నిన్నే ఒక ప్రశ్న అడిగాను. - నాకు ఒక సెకను టైమ్ ఇవ్వు. 262 00:21:46,765 --> 00:21:47,766 సరే. 263 00:21:53,939 --> 00:21:57,109 నన్ను నియమించినందుకు చాలా సంతోషిస్తున్నాను. 264 00:22:01,822 --> 00:22:02,823 నేను నిజంగా... 265 00:22:04,992 --> 00:22:06,827 ఈ నియామకం ఇచ్చినందుకు నిజంగా చాలా కృతజ్ఞతలు. 266 00:22:06,827 --> 00:22:11,707 కానీ నాకు నచ్చనిది, నేను సహించలేనిదీ ఏమిటంటే, నీకు నా మీద నమ్మకం లేకపోవడం. 267 00:22:11,707 --> 00:22:13,292 నేను నా వృత్తిలో సమర్థుడిని. 268 00:22:13,292 --> 00:22:17,212 నేను అలా అనుకుని ఉండకపోతే నీకు ఈ కేసు అప్పగించేవాడిని అనుకుంటున్నావా? 269 00:22:19,047 --> 00:22:21,758 అంటే, ఇక్కడ చాలామంది మనుషులకి, 270 00:22:21,758 --> 00:22:24,094 అంటే, నాతో ఏదో రకమైన ఇబ్బంది ఉంటోంది. 271 00:22:25,304 --> 00:22:26,722 దానికి కారణం ఏమిటంటే... 272 00:22:29,016 --> 00:22:30,100 వాళ్లు ఊహాగానాల మీద ఆధారపడుతున్నారు, 273 00:22:30,100 --> 00:22:32,644 ఇంకా అది రేమండ్ ద్వారా ఇంకా రస్టీ ద్వారా కాదు, కానీ నువ్వు చెప్పే మాటల ద్వారా. 274 00:22:39,318 --> 00:22:40,319 టామీ. 275 00:22:42,404 --> 00:22:43,864 నీకు ఏం అయింది... 276 00:22:43,864 --> 00:22:45,365 - నీకు నిజం చెప్పాలి... - ...కిందటి నెలలో? 277 00:22:45,365 --> 00:22:46,450 నీకు స్పష్టం చేయాలి... 278 00:22:49,411 --> 00:22:51,413 ఈ కేసులో మన వాదనలు నెగ్గాలంటే, 279 00:22:51,914 --> 00:22:57,920 జ్యూరీ న్యాయమూర్తులకు నా మీద గౌరవం, నమ్మకం ఉండాలి, అవునా? 280 00:22:57,920 --> 00:23:00,547 అందుకే నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. 281 00:23:01,882 --> 00:23:03,300 ఇలాంటి వ్యవహారాలలో నేను సమర్థుడిని. 282 00:23:03,300 --> 00:23:06,386 ఈ కేసుని విచారించే జ్యూరీ సభ్యులకి నా గురించి తెలియాలి, అంతకన్నా మించి, వాళ్లు నా గురించి ఫీల్ కావాలి. 283 00:23:07,262 --> 00:23:09,681 ఏ విషయంలో తప్పు ఉంది అంటే వాళ్లు ఒప్పుకోవాలి 284 00:23:09,681 --> 00:23:12,851 ఎందుకంటే టామీ మోల్టో అది తప్పు అన్నాడు కాబట్టి. 285 00:23:32,871 --> 00:23:35,582 - జేడెన్, టైమ్ ఏడున్నర అయింది, బంగారం. - బంగారం, నీ బ్యాగ్ సర్దుకున్నావా? 286 00:23:35,582 --> 00:23:37,084 అంటే, అది అక్కడే ఉంది. 287 00:23:38,585 --> 00:23:39,419 హేయ్. 288 00:23:40,671 --> 00:23:43,173 బ్రేక్ ఫాస్ట్ తినే సమయంలో హత్య కేసు విచారణ వార్తలు వినద్దు. ముఖ్యంగా నా కేసు. 289 00:23:43,173 --> 00:23:44,258 దాన్ని ఆపేయ్. 290 00:23:44,258 --> 00:23:47,261 నా ముఖం మీద పెద్ద మొటిమ ఏర్పడింది. అది క్యాన్సర్ కారకం అవుతుందేమో చెప్పగలవా ప్లీజ్? 291 00:23:47,261 --> 00:23:48,512 - అది క్యాన్సర్ కాదు. - కానీ పెద్దగా ఉంది. 292 00:23:48,512 --> 00:23:50,055 - ఒత్తిడి వల్ల వచ్చి ఉండచ్చు. - నిజమా? 293 00:23:50,055 --> 00:23:51,640 ఏదీ నన్ను చూడనివ్వు. నన్ను చూడనివ్వు. 294 00:23:51,640 --> 00:23:53,934 - నువ్వు చక్కగా ఉన్నావు. నీకు ఇంటర్వ్యూ ఉందా? - థాంక్యూ. 295 00:23:53,934 --> 00:23:56,603 - నిజానికి, చికిత్స కోసం వెళ్లాలి. - అది బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు. 296 00:23:56,603 --> 00:23:58,188 థెరపిస్టు దగ్గరకి వెళ్లడానికి అంతలా ముస్తాబు అయ్యావా? 297 00:23:58,188 --> 00:23:59,273 అయ్యాను. 298 00:23:59,273 --> 00:24:01,608 - నేను చక్కగా ఉంటే ఆమె ఇష్టపడుతుంది. - నా ఫోన్ ఎక్కడ? 299 00:24:01,608 --> 00:24:04,152 కావచ్చు... ఎవరైనా నా ఫోనుకి కాల్ చేస్తారా? 300 00:24:04,152 --> 00:24:06,446 - మీ నాన్న ఫోనుకి రింగ్ ఇస్తారా? - నేను కాల్ చేస్తాను. 301 00:24:06,446 --> 00:24:08,949 అది ఇక్కడే ఉండాలి. 302 00:24:08,949 --> 00:24:10,284 - రింగ్ అవుతోంది. - అక్కడ ఉంది. 303 00:24:12,578 --> 00:24:13,662 ఎక్కడో దగ్గరలోనే ఉంది. 304 00:24:16,206 --> 00:24:17,457 ఎవరు మాట్లాడుతున్నారు? 305 00:24:17,457 --> 00:24:18,542 నేను జేడెన్ ని. 306 00:24:19,459 --> 00:24:20,586 నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? 307 00:24:21,211 --> 00:24:22,212 ఏమీ లేదు. 308 00:24:22,212 --> 00:24:23,380 నేను నిన్ను నమ్మను. 309 00:24:27,551 --> 00:24:28,552 ఇది చక్కగా ఉంది. 310 00:24:28,552 --> 00:24:29,636 ఇంక అంతే. 311 00:24:31,889 --> 00:24:32,890 ఇది చక్కగా ఉంది. 312 00:24:33,473 --> 00:24:35,350 మీ అమ్మ చాలా అందంగా ఉందని నా తరపున తనకి చెబుతావా? 313 00:24:36,518 --> 00:24:37,519 నేను చెప్పగలను. 314 00:24:38,312 --> 00:24:40,355 - సరే. బై, అందరికీ. - బై. 315 00:24:40,355 --> 00:24:41,648 బై. 316 00:25:02,336 --> 00:25:04,671 - దాన్ని ముట్టుకోకు. ఇంకా పెద్దది చేస్తున్నావు. - నేను ముట్టుకోలేదు. 317 00:25:04,671 --> 00:25:07,508 ఏంటి... ఖైల్ సైకిలు చెత్త డబ్బాలో ఎందుకు ఉంది? 318 00:25:09,468 --> 00:25:11,970 నాకు తెలియదు. నేను దాన్ని అక్కడ పెట్టలేదు, బంగారం. 319 00:25:17,100 --> 00:25:18,101 అది చెత్త సైకిలు. 320 00:25:21,605 --> 00:25:25,067 అంటే, ఆ గేర్లు పాడైపోయాయి ఇంకా, చూడు... చైన్ కూడా వదులు అయిపోయింది. 321 00:25:25,067 --> 00:25:26,151 అందుకే నేను దాన్ని అలా... 322 00:25:34,034 --> 00:25:35,035 సరే. 323 00:26:05,148 --> 00:26:06,483 అయితే అది ఎప్పుడు జరిగింది? 324 00:26:07,109 --> 00:26:08,277 వారం లేదా కొద్ది రోజుల కిందట. 325 00:26:08,277 --> 00:26:10,153 కిందటి సోమవారం మనం సెషన్ జరుపుకొన్నాం. 326 00:26:11,238 --> 00:26:13,615 డాక్టర్ రష్, దయచేసి మనం అబద్ధాలు నిజాలు గురించి కాకుండా సెషన్ నిర్వహిద్దామా? 327 00:26:13,615 --> 00:26:15,909 - అది నా వల్ల కావడం లేదు... - లేదు. నేను... లేదు, నేను... 328 00:26:18,453 --> 00:26:20,455 ఇంకా స్పష్టంగా, నువ్వు... 329 00:26:20,455 --> 00:26:25,127 నువ్వు అంతకుముందు నుంచి అతనితో సంబంధం పెట్టుకోవాలని చూస్తున్నట్లు ఉన్నావు. 330 00:26:27,546 --> 00:26:30,382 సంబంధం... అది కేవలం ముద్దు మాత్రమే. 331 00:26:33,552 --> 00:26:34,553 అది కేవలం... 332 00:26:35,846 --> 00:26:37,431 ముద్దు మాత్రమే కాదు. 333 00:26:39,683 --> 00:26:43,687 అది ఎలా అనిపించిందంటే... ఏదో రొమాన్స్ లాగా ఉంది. 334 00:26:49,735 --> 00:26:50,736 అవును. 335 00:26:52,571 --> 00:26:53,572 అంటే, అది రొమాంటిక్ గానే సాగింది. 336 00:26:55,073 --> 00:26:56,408 బాగా రొమాంటిక్ గా. 337 00:27:00,871 --> 00:27:02,206 బహుశా అందుకే కావచ్చు... 338 00:27:04,333 --> 00:27:05,334 నువ్వు నాకు ఆ విషయం చెప్పలేదు. 339 00:27:05,334 --> 00:27:08,086 మీకు ఆ విషయం ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. నేను... 340 00:27:13,884 --> 00:27:15,511 నేను సిగ్గుపడలేదు. 341 00:27:17,179 --> 00:27:18,180 నాకు సిగ్గుగా లేదు. 342 00:27:23,977 --> 00:27:25,562 నేను ఆ పని చేయగలనని తెలుసు. 343 00:27:28,148 --> 00:27:29,566 నేను దాన్ని కోరుకున్నానని... 344 00:27:33,779 --> 00:27:34,863 నాకు తెలుసు. 345 00:27:42,329 --> 00:27:43,413 నిజం. 346 00:27:46,583 --> 00:27:49,586 అది నా కోరిక. స్వాంతన పొందాను. 347 00:27:56,635 --> 00:27:57,636 మీకు తెలుసా... 348 00:28:00,389 --> 00:28:03,725 నేను క్లిఫ్టన్ ఇంట్లో ఉన్నప్పుడు, 349 00:28:03,725 --> 00:28:08,230 మెట్లు ఎక్కుతుండగా, నేను ఆలోచించినది నాకు గుర్తుంది... 350 00:28:11,400 --> 00:28:13,402 జేడెన్ నన్ను చూసి చాలా గర్వపడుతుంది. 351 00:28:15,571 --> 00:28:16,572 జేడెన్? 352 00:28:19,324 --> 00:28:20,576 తనకి నా మీద ఉన్న విశ్వాసాన్ని... 353 00:28:23,787 --> 00:28:25,622 తనకి నా మీద ఉన్న విశ్వాసాన్ని నేను ఫీల్ అయ్యాను. 354 00:28:31,253 --> 00:28:32,254 ఇంకా నేను... 355 00:28:33,547 --> 00:28:37,551 నా ఉద్దేశం, నన్ను నేను నిందించుకుంటాను ఎందుకంటే నన్ను నేను జడ్జ్ చేసుకుంటాను... 356 00:28:39,261 --> 00:28:41,013 ఎందుకంటే నేను అతనితో జీవిస్తున్నాను. 357 00:28:43,849 --> 00:28:45,601 అతడిని క్షమించడం కోసం. 358 00:28:49,396 --> 00:28:50,856 అతడిని ప్రేమించడం కోసం. 359 00:28:55,986 --> 00:28:59,323 అవును, నేను క్లిఫ్టన్ తో శృంగారం చేసి ఉండేదాన్ని, కానీ నేను చేయలేదు. 360 00:29:06,872 --> 00:29:08,081 కాబట్టి మీరు చెప్పండి... 361 00:29:14,171 --> 00:29:16,173 అందుకు నేను గర్వపడాలి అంటారా? 362 00:29:49,164 --> 00:29:50,165 హేయ్. 363 00:29:52,501 --> 00:29:53,502 హేయ్. 364 00:29:59,132 --> 00:30:02,803 విను, ఈ కేసుని మనం గెలవలేము అని నేను చెప్పను. 365 00:30:04,096 --> 00:30:06,098 నేను ఈ కేసుని గెలవగలను, రస్టీ. 366 00:30:07,307 --> 00:30:08,809 కానీ నువ్వు నన్ను నా పని చేసుకోనివ్వాలి. 367 00:30:10,978 --> 00:30:14,857 మనం ఆమె కొడుకు చేశాడని చెబుతామా లేదా లియామ్ రేనాల్డ్స్ చేశాడని చెబుతామా? చెప్పచ్చు. 368 00:30:14,857 --> 00:30:17,526 కానీ మన కేసు వేరే ఎవరో చేసిన హత్య గురించి కాదు, 369 00:30:17,526 --> 00:30:19,778 లేదా ఇంకా చెప్పాలంటే, వేరెవరో చేసినది ఖచ్చితంగా కాదు. 370 00:30:19,778 --> 00:30:22,739 నువ్వు ఈ కేసులో నిర్దోషివి అన్నదే మన వాదన. 371 00:30:22,739 --> 00:30:26,326 ఈ హత్య చేసింది నేను కాదని, అసలు హంతకుడు వేరని మనం ఖచ్చితమైన ఆధారాలతో కేసు వాదించాలి. 372 00:30:26,326 --> 00:30:28,662 లేని పక్షంలో అది... అది... 373 00:30:30,080 --> 00:30:31,081 నేను దాన్ని ఒప్పుకోను. 374 00:30:39,256 --> 00:30:40,841 నువ్వు నేరగాడివి అని బార్బరా అనుకుంటోందా? 375 00:30:42,342 --> 00:30:44,678 ఖచ్చితంగా లేదు. నువ్వు చెప్పదల్చుకున్నది ఏంటి? 376 00:30:44,678 --> 00:30:46,096 ఖచ్చితంగా చెప్పగలవా? 377 00:30:46,096 --> 00:30:47,181 అవును, ఖచ్చితంగా చెప్పగలను. 378 00:30:53,270 --> 00:30:56,273 ఆ హత్య నువ్వే చేశావని లొరైన్ వంద శాతం నమ్ముతోంది. 379 00:30:57,232 --> 00:30:59,234 అంటే, అది నేను చెప్పడం వల్ల తను అలా నమ్మడం లేదు, 380 00:30:59,985 --> 00:31:05,199 కానీ తను వార్తల్లో వస్తున్న విషయాలు తెలుసుకుని ఆ అభిప్రాయానికి వచ్చింది. 381 00:31:05,199 --> 00:31:07,284 తను ఇంకా బార్బరా మంచి స్నేహితులు. 382 00:31:11,914 --> 00:31:14,208 నేను నిర్దోషిని అని బార్బరాకి తెలుసు. 383 00:31:14,208 --> 00:31:17,753 నేను అదే ఆశిస్తాను, ఎందుకంటే ఈ కేసు, ఇది ఆమె మీదనే ఆధారపడి ఉండే అవకాశం ఉంది. 384 00:31:17,753 --> 00:31:19,963 అది ఎలా? తను ఎలైబైని నిర్ధారించలేదు. 385 00:31:19,963 --> 00:31:21,924 తను, నీ భార్యగా, 386 00:31:21,924 --> 00:31:23,717 - నీ ప్రవర్తనని వివరించగలుగుతుంది... - లేదు, లేదు... 387 00:31:23,717 --> 00:31:25,844 - ...ఆ రాత్రి నువ్వు చేసిన గొడవ గురించి. నీ స్పందన... - ...లేదు, లేదు. 388 00:31:25,844 --> 00:31:28,263 - నీ ప్రవర్తన, నువ్వు ఆవేశపడటం గురించి... - మనం ఆమెని బోను ఎక్కించకూడదు. 389 00:31:28,263 --> 00:31:29,431 ...అదుపు కోల్పోవడం గురించి. 390 00:31:29,431 --> 00:31:30,766 - తను సాక్ష్యం చెప్పచ్చు... - లేదు, రే. 391 00:31:30,766 --> 00:31:34,978 ...ఆ హత్యని నువ్వు ఎందుకు చేసి ఉండకపోవచ్చో తన ప్రత్యేకమైన అభిప్రాయాన్ని 392 00:31:34,978 --> 00:31:38,065 ఆమె వ్యక్తం చేయచ్చు. 393 00:31:38,065 --> 00:31:43,487 తనకి నీ మీద నమ్మకం ఉందన్న సందేశం అందరికీ ఆమె ద్వారా చేరుతుంది. 394 00:31:43,487 --> 00:31:45,405 నువ్వు నిర్దోషివి అని ఆమె నమ్ముతుంది. 395 00:31:47,574 --> 00:31:49,117 అది మనకి ఏదో రకంగా ఉపయోగపడచ్చు. 396 00:31:49,952 --> 00:31:51,036 నేను అంతవరకే ఆలోచించాను. 397 00:31:57,751 --> 00:32:02,339 అలాగే, నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు, కానీ నేను ఎప్పుడూ చెప్పే విషయమే. 398 00:32:02,339 --> 00:32:03,841 ఇప్పటి నుండి విచారణ ముగిసే వరకూ, 399 00:32:04,967 --> 00:32:06,969 మనం ఇంకెవరినీ కొట్టకుండా ఉండాలి. 400 00:32:12,599 --> 00:32:13,934 మనం ఎట్టకేలకి దగ్గరగా వచ్చాం. 401 00:32:13,934 --> 00:32:17,062 రేపు, షికాగో దృష్టిని ఆకర్షించడమే కాకుండా, 402 00:32:17,062 --> 00:32:19,106 యావత్ దేశం దృష్టినీ ఆకర్షించిన ఈ కేసు విచారణ రేపు ప్రారంభం కాబోతోంది. 403 00:32:19,648 --> 00:32:22,067 రస్టీ సాబిచ్ ని తన సహచరులైన జ్యూరీ సభ్యుల ముందు ప్రవేశపెట్టబోతున్నారు 404 00:32:22,067 --> 00:32:25,779 {\an8}ఇంకా అతని తోటి ఉద్యోగి, కారొలిన్ పొలీమస్ హత్య కేసులో అతనిపై మోపిన అభియోగాలని విచారించబోతున్నారు. 405 00:35:02,978 --> 00:35:03,979 సరే. 406 00:35:05,772 --> 00:35:06,815 మిస్టర్ మోల్టో. 407 00:35:10,861 --> 00:35:14,656 జ్యూరీ సభ్యులైన లేడీస్ ఇంకా జెంటిల్మెన్, మనం ఇంతకుముందు ప్రాథమిక చర్చ సమయంలో కలిశాం, 408 00:35:14,656 --> 00:35:16,575 కానీ నన్ను నేను మరొకసారి పరిచయం చేసుకునేందుకు అనుమతించండి. 409 00:35:16,575 --> 00:35:17,826 నా పేరు టామసీనో మోల్టో, 410 00:35:17,826 --> 00:35:20,746 కానీ మీ అందరిలాగే నేను కూడా షికాగో వాసినే కాబట్టి, నన్ను టామీ అంటారు. 411 00:35:21,663 --> 00:35:25,834 నేను ఈ కేసుని మిస్టర్ నీకో డెల్లా గార్డియాతో కలిసి వాదించబోతున్నాను, ఆయనని మీరు ఇప్పటికే కలిశారు. 412 00:35:25,834 --> 00:35:27,461 మేము ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. 413 00:35:27,461 --> 00:35:30,047 ఈ నేరానికి సంబంధించి మేము సాక్ష్యాలని మీకు అందిస్తాము. 414 00:35:30,047 --> 00:35:32,049 మీరు ఆ సాక్ష్యాలని పరిగణించి, వాటి ఆధారంగా మీరు చర్చించుకుని 415 00:35:32,049 --> 00:35:34,927 ఇంకా, చివరికి, ప్రతివాది ఈ కేసులో నేరం చేశాడా లేదా అన్నది మీరు నిర్ణయించాలి. 416 00:35:34,927 --> 00:35:37,763 కారొలిన్ పొలీమస్ హత్య కేసులో ఈ వ్యక్తి నిందితుడు. 417 00:35:37,763 --> 00:35:41,016 మీరు ఒక నిర్ణయానికి రావడం కోసం అవసరమైన నిర్ధారణ పత్రాలనీ, 418 00:35:41,016 --> 00:35:44,102 వాస్తవాలనీ, సైంటిఫిక్ ఇంకా ఫోరెన్సిక్ ఆధారాలని మీ ముందు ఉంచుతాము. 419 00:35:45,687 --> 00:35:47,606 హతురాలి గురించి ఒక్క మాట చెప్పాలి. 420 00:35:49,149 --> 00:35:50,567 {\an8}కుక్ కౌంటీ సీలు ఇలినాయిస్ 421 00:35:50,567 --> 00:35:52,653 {\an8}షికాగో ప్రజలు వర్సెస్ రోజట్ సాబిచ్ 422 00:35:52,653 --> 00:35:53,737 {\an8}ఈమె నాకు తెలుసు. 423 00:35:54,738 --> 00:35:55,906 {\an8}మన అందరికీ ఆమె తెలుసు. 424 00:35:57,407 --> 00:35:59,660 డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీసులో ఆమె మా తోటి ఉద్యోగి. 425 00:36:00,661 --> 00:36:01,745 మేము అందరం ఇష్టపడే వ్యక్తి. 426 00:36:03,413 --> 00:36:06,917 సాక్ష్యాధారాల ప్రకారం చూస్తే, ఆమె నాకు తెలియడం పెద్ద ముఖ్యం కాదు. 427 00:36:06,917 --> 00:36:08,544 నేను ఆమెని గౌరవించేవాడిని. ఆమెని మిస్ అవుతున్నాను. 428 00:36:08,544 --> 00:36:10,462 దానికి సాక్ష్యాలతో పని లేదు ఇంకా దానికి విలువ కూడా లేదు, 429 00:36:10,462 --> 00:36:12,548 కానీ అది నాకు ముఖ్యం కాదని నేను నటించలేను. 430 00:36:14,967 --> 00:36:18,720 కాబట్టి ఆమె పట్ల నాకు ఉన్న అభిమానాన్ని నేను ప్రదర్శిస్తే, ఎందుకు నన్ను వెంటనే క్షమించమని కోరుతున్నాను. 431 00:36:19,513 --> 00:36:24,101 ప్రాసిక్యూటర్లు కఠినంగా ఉంటారని అనుకుంటారు, కదా? 432 00:36:24,101 --> 00:36:25,185 ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా. 433 00:36:25,978 --> 00:36:27,062 యాంత్రికంగా ఉంటారు. 434 00:36:28,105 --> 00:36:31,358 కానీ, మేము కేవలం ప్రపంచమంతటా ఆమోదించిన వ్యవస్థలో మంచి చెడులను వేరే చేసే ప్రక్రియలో 435 00:36:31,358 --> 00:36:32,901 మేము కేవలం విధులు నిర్వహించే వాళ్లం మాత్రమే. 436 00:36:32,901 --> 00:36:34,236 మేము ప్రభుత్వ అధికారులం. 437 00:36:35,529 --> 00:36:38,866 కొన్ని సంవత్సరాల పాటు అభియోగాలు మోపుతూ కేసుల్ని విచారణ చేస్తూ ప్రతివాదులు రావడం పోవడం చూస్తూ 438 00:36:38,866 --> 00:36:42,452 ఈ వృత్తిలో విధులు నిర్వర్తించే మేము ఎలా కఠినంగా మారిపోతామో మీరు ఊహించగలరు అనుకుంటా. 439 00:36:43,203 --> 00:36:44,705 అంతా ఏదో మసకబారినట్లు అనిపిస్తుంది. 440 00:36:45,247 --> 00:36:48,667 కానీ, ఈ రోజు మాత్రం అలా లేదు, ఎందుకంటే ఆమె నాకు తెలుసు. 441 00:36:50,794 --> 00:36:53,630 ఈ రోజు, మీరు... మీరందరూ... 442 00:36:53,630 --> 00:36:57,551 మన పౌరసత్వానికి సంబంధించిన పవిత్రమైన బాధ్యతని కలిగి ఉన్నారు, 443 00:36:57,551 --> 00:37:01,221 ఇంకా మీ అందరి బాధ్యతా ఏమిటంటే నిజాన్ని తెలుసుకోవడం. వాస్తవాల్ని తెలుసుకోవడం. 444 00:37:01,221 --> 00:37:03,348 కానీ అది అంత తేలికమైన విషయం కాదు, అది మనందరికీ తెలుసు. 445 00:37:03,348 --> 00:37:08,103 జ్ఞాపకాలు చెదిరిపోయి, వాటిని నెమరవేసుకోవడం కష్టంగా మారి 446 00:37:08,103 --> 00:37:10,647 సాక్ష్యాధారాలు వేరువేరు దిశల్ని మనకి చూపిస్తున్నప్పుడు, 447 00:37:10,647 --> 00:37:12,649 మనం తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది 448 00:37:12,649 --> 00:37:16,737 అది ఎవరికీ తెలియనిది అయి ఉంటుంది లేదా ఎవరూ బయటకి చెప్పలేనిది అయి ఉంటుంది. 449 00:37:17,237 --> 00:37:23,577 ఇంకా ఈ కేసులో సాక్ష్యం, ఇంకా వాటి తాలూకు వివరాలు చెప్పలేనంత దారుణమైనవి. 450 00:37:26,705 --> 00:37:28,874 నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను. అది చాలా హింసాత్మకంగా ఉంటుంది. 451 00:37:31,251 --> 00:37:35,547 సరే. మనం ఇంట్లో కూర్చుని ఇది చూడాల్సి వస్తే, మనం టీవీని కట్టేస్తాము, 452 00:37:35,547 --> 00:37:38,258 లేదా దాన్ని చూడము, వినము, చూడాలి అనుకోము. 453 00:37:38,258 --> 00:37:40,802 ఎవరూ ఇలాంటి చూడకూడదు లేదా వినకూడదు. 454 00:37:40,802 --> 00:37:42,471 కానీ ఇక్కడ, మనం తప్పనిసరిగా చూడాలి, వినాలి. 455 00:37:43,138 --> 00:37:45,974 మనకి అది తప్పదు, కదా? 456 00:37:45,974 --> 00:37:48,519 ఇది నిజమైన నేరం. ఆమె నిజమైన హతురాలు. 457 00:37:49,353 --> 00:37:50,687 కారొలిన్ పొలీమస్. 458 00:37:53,232 --> 00:37:54,483 ఆమెకి ఒక కొడుకు ఉన్నాడు. 459 00:37:55,901 --> 00:37:56,985 మైఖెల్. 460 00:37:58,904 --> 00:37:59,988 కాబట్టి ఇక్కడ బాధ కూడా నిజం. 461 00:38:03,075 --> 00:38:06,537 చివరిగా, అది ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని మనం ప్రయత్నించనక్కరలేదు. 462 00:38:06,537 --> 00:38:09,331 ఒక వ్యక్తికి ఈ నేరం చేయాలనే ఉద్దేశం, ఎలాగైనా, ఎప్పటికీ అతని మనసులోపలే ఉండిపోవచ్చు. 463 00:38:09,331 --> 00:38:13,669 కానీ ఏం జరిగిందో మనం నిర్ధారించాల్సి ఉంది. 464 00:38:13,669 --> 00:38:18,423 లేనిపక్షంలో, ఈ మనిషిని మనం స్వేచ్ఛగా విడుదల చేయాలా లేదా శిక్షించాలా అనే విషయం మనకి తెలిసే అవకాశం ఉండదు. 465 00:38:18,423 --> 00:38:23,011 మనం గనుక నిజాన్ని తెలుసుకోలేకపోతే, ఇక న్యాయం మీద ఏం నమ్మకం ఉంటుంది? 466 00:38:24,555 --> 00:38:26,557 ఆ కారణంగానే కారొలిన్ ఈ వృత్తిలోకి ప్రవేశించింది. 467 00:38:26,557 --> 00:38:29,726 ఆ కారణంగానే మనమంతా ఈ వృత్తిలోకి వచ్చాము. 468 00:38:29,726 --> 00:38:31,436 న్యాయం పొందుతామన్న ఆశ. 469 00:38:33,564 --> 00:38:37,818 కాబట్టి, చివరిగా, కారొలిన్ కోసం కన్నీరు కార్చమని నేను మిమ్మల్ని అడగను, మీరు కన్నీరు పెట్టచ్చు. 470 00:38:37,818 --> 00:38:42,072 ఆమె కుటుంబం కోసం ఇంకా ఆమె కొడుకు కోసం మీరు బాధపడాలని నేను అడగు. 471 00:38:42,072 --> 00:38:43,240 కానీ మీరు బాధపడతారు. 472 00:38:44,241 --> 00:38:50,998 మీరు నిజాయితీగా వ్యవహరించాలని మాత్రమే ప్రార్థిస్తాను. నిజానికి విధేయులుగా ఉంటారని ఆశిస్తాను. 473 00:38:50,998 --> 00:38:55,335 కారొలిన్ కూడా, బహుశా అదే కోరుకుంటుందేమో. 474 00:38:56,086 --> 00:38:58,505 నిజం పట్ల విధేయత కలిగి ఉండటం. 475 00:39:01,091 --> 00:39:02,092 థాంక్యూ. 476 00:39:15,230 --> 00:39:16,315 చెత్త. 477 00:39:24,281 --> 00:39:26,200 స్కాట్ ట్యురొవ్ రాసిన నవల ఆధారంగా 478 00:40:47,281 --> 00:40:49,283 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్