1 00:00:30,030 --> 00:00:34,243 నార్త్ ఈస్టర్న్ ఆస్ట్రేలియా 2 00:02:47,251 --> 00:02:49,378 "గాడ్జిల్లా" పాత్ర ఆధారంగా రూపొందించినది 3 00:03:23,996 --> 00:03:25,622 ఇన్ కమింగ్ కాల్ రక్షణ శాఖ కార్యదర్శి 4 00:03:28,917 --> 00:03:30,544 చెప్పండి, మిస్టర్ సెక్రటరీ. 5 00:03:30,627 --> 00:03:32,671 పరిస్థితి వేగంగా మారుతోంది. 6 00:03:32,754 --> 00:03:35,299 ఎప్పుడూ విషయాలను తగ్గించి చెప్పడంలో నువ్వు దిట్టవు కదా, రెడిక్? 7 00:03:35,382 --> 00:03:39,595 చూడు, 18 గంటల కిందట ఈ జంతువు తమ సముద్ర జలాల్లో కనిపించడంతో, 8 00:03:39,678 --> 00:03:42,139 ఆస్ట్రేలియన్ పార్లమెంటు 9 00:03:42,222 --> 00:03:44,808 టైటన్ రక్షణ ఒప్పందం కోసం అమెరికా మీద ఒత్తిడి పెడుతోంది. 10 00:03:44,892 --> 00:03:46,185 సర్, మిలటరీని ప్రయోగించడం వల్ల 11 00:03:46,268 --> 00:03:48,896 మనకి పెద్దగా ఫలితం రాలేదన్న విషయం నాకెంత తెలుసో మీకూ అంతే తెలుసు. 12 00:03:48,979 --> 00:03:50,814 వాటిని కట్టడి చేయడానికి అన్ని అవకాశాల్నీ ప్రయత్నిస్తున్నాం. 13 00:03:50,898 --> 00:03:53,525 అన్నీ చేయలేదు. 14 00:03:54,860 --> 00:03:57,029 సర్, మనం బికినీ అటోల్ దగ్గర ఒకసారి అది ప్రయోగించి చూశాం. 15 00:03:57,112 --> 00:04:00,532 కానీ, కాజిల్ బ్రావో ఆపరేషన్ తరువాత టెక్నాలజీ చాలా బాగా మెరుగయింది. 16 00:04:00,616 --> 00:04:02,910 ఇది ఇప్పుడు వ్యూహాత్మకం అయింది. పరిమితంగా. 17 00:04:02,993 --> 00:04:03,994 పరిమితంగానా? 18 00:04:04,077 --> 00:04:07,873 ఆ నిర్ణయం వల్ల తలెత్తిన దుష్ప్రభావాలు ప్రతి సందర్భంలోనూ ఇంకా అలాగే వెంటాడుతున్నాయి, సర్. 19 00:04:07,956 --> 00:04:10,250 జనాభా ఎక్కువగా ఉన్న కేంద్రం దగ్గరలో ఎక్కడ ఉంది? 20 00:04:14,004 --> 00:04:15,130 తీరానికి దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో. 21 00:04:15,214 --> 00:04:18,050 దాదాపు 500 కిలోమీటర్ల పరిధిలో ప్రతి ఒక్కరినీ అక్కడి నుండి తరలించే పనిలో ఉన్నాను. 22 00:04:18,132 --> 00:04:19,426 సరే, అయితే ఆ పనిని త్వరగా పూర్తి చేయి. 23 00:04:19,510 --> 00:04:20,802 మన దళాలు అక్కడికి బయలుదేరాయి. 24 00:04:20,886 --> 00:04:22,221 సర్, నేను ఏం చెప్పదల్చుకున్నానంటే… 25 00:04:22,304 --> 00:04:24,598 వద్దు. మనకి ఇక్కడ ఒక మంచి అవకాశం ఉంది, రెడ్. 26 00:04:24,681 --> 00:04:25,807 మనం ఈ అవకాశాన్ని వాడుకుంటున్నాం. 27 00:04:27,017 --> 00:04:28,769 మనకి ఇంక వేరే దారి లేదు. 28 00:04:31,396 --> 00:04:32,397 యస్, సర్. 29 00:04:40,489 --> 00:04:42,741 మేము గమ్యాన్ని చేరుకుంటున్నాం. డెక్ ని ఖాళీ చేయండి, ప్లీజ్. 30 00:04:42,824 --> 00:04:44,451 విన్నాము. డెక్ క్లియర్ అయింది. 31 00:05:09,101 --> 00:05:11,311 సరే. మనం కాస్త ప్రశాంతంగా ఉందాం. 32 00:05:11,395 --> 00:05:12,813 అతను మనల్ని నమ్ముతాడు అనుకుంటున్నావా? 33 00:05:12,896 --> 00:05:15,232 ఆ రాకాసి జంతువుతో నీకు ఎమోషనల్ కనెక్షన్ ఉందన్న విషయమా? 34 00:05:15,315 --> 00:05:16,358 ఆ విషయంతో సంభాషణ మొదలుపెట్టద్దు. 35 00:05:20,237 --> 00:05:21,446 చెప్పండి, అది ఏంటి? 36 00:05:24,199 --> 00:05:25,200 సర్, 37 00:05:26,285 --> 00:05:28,829 ఈ ఆపరేషన్ కోసం ఇంకొంతమంది వచ్చారు, వాళ్లతో మీరు మాట్లాడాలి అనుకుంటా. 38 00:05:31,456 --> 00:05:32,791 డైరెక్టర్ బ్యారిస్? 39 00:05:34,668 --> 00:05:36,253 సరే, షిప్ లోకి స్వాగతం. 40 00:05:37,963 --> 00:05:40,007 డాక్టర్ రాండా, మీ కోసం మా మనుషులు అన్ని చోట్లా వెతుకుతున్నారు, 41 00:05:40,090 --> 00:05:42,176 కానీ మీరేమో నేరుగా నా తలుపు తెరుచుకుని లోపలికి వచ్చేశారు. 42 00:05:42,259 --> 00:05:44,970 మీ ఇద్దరినీ నేను అసెట్ మేనేజ్మెంట్ కి పంపించి ఉండాలి. 43 00:05:45,053 --> 00:05:46,972 లేదు, మీరు వాళ్లు చెప్పేది ఒకసారి వినాలి అనుకుంటా, సర్. 44 00:05:47,055 --> 00:05:48,515 - అలా అనుకున్నావా? - అవును, అనుకున్నాను. 45 00:05:48,599 --> 00:05:49,975 మీరు కేవలం ఒక నిమిషం కేటాయిస్తే చాలు. 46 00:05:50,058 --> 00:05:53,228 సరే, నాకు నిమిషం టైమ్ కూడా లేదు. ఆస్ట్రేలియా తీరంలో టైటన్ జాడ కనిపించింది. 47 00:05:53,312 --> 00:05:55,063 మీకు అసలు సమస్య అది కాదు. 48 00:05:55,814 --> 00:05:56,857 అయితే ఇంకేంటి? 49 00:05:56,940 --> 00:05:57,941 లీ షా. 50 00:05:58,025 --> 00:05:59,318 దీనితో కల్నల్ షాకి ఏంటి సంబంధం? 51 00:05:59,401 --> 00:06:02,738 టైటన్ ని తనే నిలువరించాలని షా ఒక ప్లాన్ అమలు చేస్తున్నాడు. 52 00:06:02,821 --> 00:06:05,949 ఇది కాస్త విడ్డూరంగా ఉంది ఎందుకంటే అతను సాధారణంగా అందరితో కలిసి పని చేస్తాడుగా. 53 00:06:06,033 --> 00:06:09,786 డాక్టర్ సుజూకి చెప్పేదాని ప్రకారం, అతను కొన్ని కాన్సంట్రేడ్ గామా కిరణాల్ని ప్రసారం చేయడం ద్వారా 54 00:06:09,870 --> 00:06:11,538 టైటన్ ఎక్స్ ని ఇంకో టైటన్ ఆకర్షించేలా చేయబోతున్నాడు. 55 00:06:12,164 --> 00:06:13,373 ఇంకో టైటన్? 56 00:06:17,169 --> 00:06:18,170 గాడ్జిల్లా. 57 00:07:12,391 --> 00:07:13,392 హేయ్, చార్లీ. 58 00:07:14,184 --> 00:07:16,186 గ్లోబల్ నెట్ వర్క్ లో మనకి ఏమైనా సంకేతాలు అందుతున్నాయా? 59 00:07:16,270 --> 00:07:17,646 జి-టాస్ లో ఏమైనా కనిపించాయా? 60 00:07:17,729 --> 00:07:20,691 మనం ఇక్కడ చూస్తున్నది కాకుండా ఏదైనా టైటన్ ఉనికిని తెలిపే సంకేతాలు కనిపించాయా? 61 00:07:20,774 --> 00:07:21,775 లేదు, సర్. 62 00:07:21,859 --> 00:07:25,153 టైటన్ ఎక్స్ తప్ప మిగతా అవకాశాలు ఏమీ కనిపించలేదు. బోర్డ్ అంతా క్లియర్ గా ఉంది. 63 00:07:25,237 --> 00:07:26,905 అతను నిజంగా అది చేయగలడా? 64 00:07:26,989 --> 00:07:28,490 గాడ్జిల్లాని షా రప్పించగలడా? 65 00:07:28,574 --> 00:07:30,450 అంటే, లేదు. నేను… ఇది… 66 00:07:30,534 --> 00:07:33,996 చూడండి, రాకాసి జంతువులన్నింటిలో గాడ్జిల్లా ఒక రాజు లాంటిదని డాక్టర్ సెరిజావ చెప్పారు. 67 00:07:34,079 --> 00:07:35,956 దానికి ఇష్టం లేని పని ఏదీ అది చేయదు. 68 00:07:36,039 --> 00:07:37,249 కానీ గతంలో ఒకసారి అలా జరిగింది. 69 00:07:37,332 --> 00:07:39,710 గాడ్జిల్లా గతంలో బికినీ అటోల్ ప్రాంతానికి రావడానికి కారణం 70 00:07:39,793 --> 00:07:42,421 కాజిల్ బ్రావో హెచ్-బాంబ్ నుండి ఏర్పడిన రేడియేషన్. 71 00:07:43,005 --> 00:07:46,425 సరిగ్గా అలాంటి ఎనర్జీని ఉత్పత్తి చేసే ఒక పరికరం లీ దగ్గర ఉంది. 72 00:07:47,009 --> 00:07:48,218 టైటన్ కి ఎర. 73 00:08:02,482 --> 00:08:04,776 టైటన్ ఆ ప్రాంతానికి వచ్చాక కొద్దిగా అయినా కదిలిందా? 74 00:08:04,860 --> 00:08:08,572 లేదు, కానీ టైటన్ ఎక్స్ నుంచి ఎక్కువ ఎనర్జీ ఉత్పత్తి అవుతున్న సంకేతాలు అందుతున్నాయి. 75 00:08:08,655 --> 00:08:11,575 అది తీరాన్ని చేరుకున్నప్పటి నుంచి ఈ రీడింగ్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. 76 00:08:11,658 --> 00:08:13,368 కానీ దాని అర్థం ఏమిటో మీకు తెలుసా? 77 00:08:13,452 --> 00:08:15,704 అంటే, దాడి చేయడానికి ముందు 78 00:08:15,787 --> 00:08:18,373 గాడ్జిల్లా శక్తిని కూడదీసుకునే సందర్భంలో సరిగ్గా అలాంటి ఎనర్జీ హెచ్చింపుల్నే చూశాం, కాబట్టి… 79 00:08:18,457 --> 00:08:19,458 అది మంచి పరిణామం కాదు. 80 00:08:19,541 --> 00:08:22,878 అది ఎక్కువ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఇంకేదయినా కారణం ఉండచ్చా? 81 00:08:22,961 --> 00:08:25,088 అది ఉద్రిక్తంగా ప్రవర్తించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? 82 00:08:25,172 --> 00:08:27,090 అంటే, ఆ జంతువు తీరం దగ్గర తిష్ట వేయడాన్ని బట్టి, 83 00:08:27,174 --> 00:08:29,593 అది ఇప్పటికే ఉద్రిక్తంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. 84 00:08:29,676 --> 00:08:32,054 మనం ఎదురుచూస్తూ కూర్చుంటే, పరిస్థితి చేయి దాటిపోవచ్చు. 85 00:08:32,136 --> 00:08:33,514 పరిస్థితి చేయి దాటిపోవచ్చా? 86 00:08:34,890 --> 00:08:36,683 డిఫెన్స్ సెక్రటరీ ఏం చెప్పారు? 87 00:08:43,232 --> 00:08:47,110 మనం ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలోనే, న్యూక్లియర్ హెడ్స్ అమర్చిన టోమహాక్ క్రూయిజ్ మిసైల్స్ తో 88 00:08:47,194 --> 00:08:49,154 ఇరవై షిప్స్ ఈ దిశగా బయలుదేరాయి. 89 00:08:49,238 --> 00:08:51,865 - అణు బాంబులా? - మనం ఏం మాట్లాడుకుంటున్నాం… 90 00:08:52,366 --> 00:08:56,578 మనం ఈ వ్యూహం అమలు చేసినప్పుడు ఆ జంతువు బీచ్ దగ్గరే ఉందన్న విషయం మీకు తెలుసా? 91 00:08:56,662 --> 00:08:58,747 అది ఎలా పని చేసింది? 92 00:08:58,830 --> 00:09:00,874 వాళ్లు ఇంకో మూడు గంటల లోపే ఇక్కడికి చేరుకోబోతున్నారు. 93 00:09:02,918 --> 00:09:04,837 అయితే మనకి ఇంకో మూడు గంటల సమయం ఉందన్నమాట. 94 00:09:05,420 --> 00:09:06,630 ఏం చేయడానికి? 95 00:09:07,339 --> 00:09:09,132 నా భర్త రీసెర్చ్ ప్రకారం, 96 00:09:09,216 --> 00:09:13,178 కొన్ని శతాబ్దాలుగా టైటన్ ఎక్స్ ఒకే వలస మార్గాన్ని అనుసరించింది 97 00:09:13,262 --> 00:09:15,222 కానీ అది దాడులు చేసినట్లుగా ఇంతవరకూ ఎలాంటి ఆధారాలూ లేవు. 98 00:09:15,305 --> 00:09:18,892 అయితే ఇదంతా శాంటా సోలెడాడ్ లో అపెక్స్ జోక్యం చేసుకుని దాన్ని పక్కదారి పట్టించింది. 99 00:09:18,976 --> 00:09:22,312 మరో టైటన్ దాడిని అడ్డుకోవడానికి అణు ఆయుధాన్ని ప్రయోగించడం కంటే, 100 00:09:22,396 --> 00:09:25,357 ఆ టైటన్ ఎందుకు తన దారి మళ్లిందో తెలుసుకోవడం, దాన్ని తిరిగి సరైన మార్గంలో పెట్టడమే సరైన పరిష్కారం. 101 00:09:25,440 --> 00:09:28,986 ఆగు. ఆగు, నువ్వు చెబుతున్నది నన్ను సరిగ్గా అర్థం చేసుకోనివ్వు. నువ్వు… 102 00:09:29,069 --> 00:09:30,320 నువ్వు టైటన్ ని కాపాడాలని చూస్తున్నావా? 103 00:09:30,404 --> 00:09:32,865 దానికి మన సాయం కావాలి. 104 00:09:34,366 --> 00:09:37,995 నేను దానిని తీరం నుండి పంపివేసి, తిరిగి దాని వలస మార్గంలోకి మళ్ళించగలనని అనుకుంటున్నాను. 105 00:09:44,668 --> 00:09:48,088 మోనార్క్ ఎయిట్ నైనర్ గమ్యం చేరుకుంటోంది. కెంటారో రాండా వస్తున్నాడు. 106 00:09:53,927 --> 00:09:55,179 హేయ్! హేయ్. 107 00:09:55,762 --> 00:09:57,347 కేట్ ఇంకా కెయ్కో ఇక్కడే ఉన్నారు. 108 00:09:57,431 --> 00:09:59,183 వాళ్లు బ్యారిస్ తో మాట్లాడుతున్నారు. 109 00:09:59,266 --> 00:10:00,267 నాకు తెలుసు. 110 00:10:01,143 --> 00:10:02,811 నీ థాయ్ ల్యాండ్ విశేషాలు చెప్పాలి అనుకుంటున్నావా? 111 00:10:05,147 --> 00:10:06,315 దాని గురించి ఏం చెప్పాలి? 112 00:10:06,982 --> 00:10:10,360 నాకు తెలియదు. నువ్వు అకస్మాత్తుగా థాయ్ ల్యాండ్ వెళ్లావు, 113 00:10:11,153 --> 00:10:13,238 ఇంకా, ఏంటి, అక్కడ ఎవరితోనూ గడపలేదా? 114 00:10:16,283 --> 00:10:17,492 తన పేరు ఇసబెల్. 115 00:10:20,287 --> 00:10:21,872 సరే, ఇసబెల్ అంటే ఎవరు? నేను తెలుసుకోవచ్చా… 116 00:10:21,955 --> 00:10:23,290 ఇసబెల్ సిమ్మన్స్. 117 00:10:24,875 --> 00:10:25,876 ఏం అంటున్నావు… 118 00:10:26,460 --> 00:10:29,755 ఏంటి? నువ్వు ఇసబెల్ సిమ్మన్స్ తో పాటు థాయ్ ల్యాండ్ వెళ్లావని చెబుతున్నావా? 119 00:10:30,255 --> 00:10:31,673 ఆ విషయం నువ్వు నాతో చెప్పవా? 120 00:10:31,757 --> 00:10:33,634 తను వాల్టర్ సిమ్మన్స్ కూతురు కదా? 121 00:10:33,717 --> 00:10:35,969 అతను అపెక్స్ సైబర్నెటిక్స్ వ్యవస్థాపకుడు. 122 00:10:36,053 --> 00:10:37,095 అవును. 123 00:10:37,179 --> 00:10:40,224 ఎందుకు చెప్పలేదంటే నేను అపెక్స్ కి సంబంధించి ఏదో చేస్తున్నానని నువ్వు ఊహించుకుంటావని నాకు తెలుసు. 124 00:10:40,307 --> 00:10:41,433 అవును, అది నిజం కాదా? 125 00:10:41,517 --> 00:10:42,518 కాదు. 126 00:10:43,644 --> 00:10:44,686 తను అంత చెడ్డదేమీ కాదు. 127 00:10:44,770 --> 00:10:47,481 తనకి కూడా అపెక్స్ ని మన మాదిరిగానే ద్వేషిస్తుంది. 128 00:10:51,026 --> 00:10:52,277 ఆ విషయం వదిలేయ్, సరేనా? 129 00:10:52,361 --> 00:10:54,238 నేను ఊరికే వెళ్లాను. అంతకుమించి ఏమీ లేదు. 130 00:11:00,786 --> 00:11:02,079 ఆ రాకాసి జంతువుకి మన సాయం కావాలా? 131 00:11:02,162 --> 00:11:04,581 కానీ ఆ విషయం నీకెలా తెలుసు? ఏంటి? నువ్వు దానితో మాట్లాడావా? 132 00:11:04,665 --> 00:11:06,458 నేను దాన్ని వివరించలేను, కానీ అది… 133 00:11:06,542 --> 00:11:07,626 అది నేను గ్రహించాను. 134 00:11:07,709 --> 00:11:09,169 - గ్రహించావా? - అవును. 135 00:11:09,253 --> 00:11:12,005 టైటన్ తన వలస మార్గాన్ని తప్పిపోయిందన్న విషయం మనకి తెలియడానికి ముందే 136 00:11:12,089 --> 00:11:14,508 కేట్ కి తెలుసు, 137 00:11:14,591 --> 00:11:17,386 అది కనిపించకుండా పోయిందని మోనార్క్ తెలుసుకోవడానికి ముందే ఆమెకి తెలుసు. 138 00:11:17,469 --> 00:11:20,138 ఇంకా ఈ డేటాని నేను కొట్టివేయాలని అనుకోవడం లేదు. 139 00:11:20,222 --> 00:11:22,683 సరే, వినండి. మనకి ఒక ప్రమాదం పొంచి ఉందని తెలుసు. 140 00:11:22,766 --> 00:11:24,226 దాని లొకేషన్ మనకి తెలుసు. 141 00:11:24,726 --> 00:11:26,520 దానిని ఎదుర్కొనే అవకాశం ఎట్టకేలకి మనకి దొరికింది, 142 00:11:26,603 --> 00:11:30,649 కానీ దానికి సాయం కావాలని మీకు కలిగిన ఒక ఫీలింగ్ వల్ల మేము దాడి చేయకుండా ఆపాలని అంటున్నారు. 143 00:11:30,732 --> 00:11:33,068 మోనార్క్ ఎప్పుడూ 144 00:11:33,151 --> 00:11:36,405 అసాధ్యమైన సమస్యలకి అనూహ్యమైన పరిష్కారాల్ని కనుగొంటూనేే ఉంది. 145 00:11:37,155 --> 00:11:40,117 చూస్తుంటే, మన ముందున్నది ఒక ప్రత్యేకమైన పరిస్థితి అనిపిస్తోంది. 146 00:11:40,909 --> 00:11:42,953 మనకి మూడు గంటల సమయం ఉందని మీరు చెప్పారు. 147 00:11:43,036 --> 00:11:44,997 మీరు కేవలం ఇద్దరు రాండాల ప్రాణాల్ని రిస్కు చేస్తారేమో 148 00:11:45,080 --> 00:11:47,249 కానీ వాళ్లని ఎటూ మీరు అసెట్ మేనేజ్మెంట్ కి పంపించాలని నిర్ణయించుకున్నారు కదా. 149 00:11:47,332 --> 00:11:49,126 మీకు సమాధానాలు కావాలని అడిగారు కదా. 150 00:11:49,209 --> 00:11:53,589 ఇక్కడ అన్నీ 'తెలియదు' అన్న సమాధానాలే ఉన్నాయని మీరు అన్నారు. 151 00:11:53,672 --> 00:11:55,674 బహుశా వీళ్లు మనకి సాయం చేయవచ్చేమో. 152 00:11:55,757 --> 00:11:59,469 ఆ రాకాసి జంతువు తిరిగి తన వలస మార్గంలోకి వెళ్లేలా ఆమెని ఒక ప్రయత్నం చేయనిద్దాం. 153 00:11:59,553 --> 00:12:02,306 లేదా అవి పరిస్థితిని ఇంకా ఘోరంగా మార్చే ప్రమాదం కూడా ఉంది. 154 00:12:02,389 --> 00:12:03,974 మీరు దాని గురించి ఆలోచించారా? 155 00:12:06,935 --> 00:12:09,646 "రాండాలు ఇద్దరినీ రిస్కులో పెడుతున్నాం." మీరు దీనికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటా. 156 00:12:09,730 --> 00:12:11,773 మిమ్మల్ని తీరానికి చేర్చడం కోసం ఒక హెలికాప్టర్ ని సిద్ధం చేస్తున్నాం. 157 00:12:11,857 --> 00:12:14,401 అది రెడీ కావడానికి 20 నిమిషాలు ఇంకా, ప్రయాణానికి అరగంట సమయం పట్టచ్చు, 158 00:12:14,484 --> 00:12:16,486 అంటే మీరు ఆ నేల మీద దాదాపు రెండు గంటల పాటు గడపచ్చు. 159 00:12:20,741 --> 00:12:21,992 హేయ్. 160 00:12:25,370 --> 00:12:26,413 హాయ్. 161 00:12:32,294 --> 00:12:33,462 ఆ ప్రేమని ఆస్వాదించు. 162 00:12:33,545 --> 00:12:35,005 సరే, వెళ్లి రెడీ అవ్వండి. 163 00:12:35,088 --> 00:12:36,548 హెలికాప్టర్ ఇంకో 20 నిమిషాల్లో బయలుదేరుతుంది. 164 00:12:36,632 --> 00:12:37,925 నిన్ను కలవడం సంతోషం. 165 00:13:12,376 --> 00:13:13,460 కెంటారో? 166 00:13:15,838 --> 00:13:17,130 నువ్వు అక్కడే ఉన్నావా? 167 00:13:18,048 --> 00:13:19,132 ఇక్కడే ఉన్నాను. 168 00:13:39,945 --> 00:13:41,572 వచ్చి మమ్మల్ని ఎదుర్కో, బాబూ! 169 00:14:08,932 --> 00:14:10,684 కెంటారో, మనం మాట్లాడుకుందామా? 170 00:14:11,768 --> 00:14:12,769 తప్పకుండా. 171 00:14:14,897 --> 00:14:16,565 అంత్యక్రియల సమయంలో నువ్వు నాతో ఏం చెప్పావు… 172 00:14:18,275 --> 00:14:20,777 నాతో నీకు సరిపడకపోయినా ఫర్వాలేదు. 173 00:14:21,987 --> 00:14:24,489 - నేను బాగానే ఉన్నాను. - లేదా శాంటా సోలెడాడ్ లో జరిగిన దానికి కూడా. 174 00:14:24,573 --> 00:14:26,408 కేట్, నేను బాగానే ఉన్నాను. 175 00:14:32,873 --> 00:14:33,874 నేను కేవలం… 176 00:14:35,125 --> 00:14:37,419 నాకు నాన్న గురించి కొన్నిసార్లు కలలు వస్తున్నాయి. 177 00:14:38,795 --> 00:14:39,880 మంచి కలలు. 178 00:14:40,839 --> 00:14:41,840 లేదు. 179 00:14:46,303 --> 00:14:47,804 నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. 180 00:14:47,888 --> 00:14:49,806 మాతో వచ్చి టైటన్ ని చూడటం. 181 00:14:49,890 --> 00:14:51,225 ఆ మాట చెప్పకు. 182 00:14:51,934 --> 00:14:52,935 ఏంటి? 183 00:14:53,018 --> 00:14:55,145 ఇది నా బాధ్యత కాదని మాత్రం చెప్పకు. 184 00:14:56,980 --> 00:14:59,024 టైటన్ ఎక్స్ ఎవరినీ చంపకుండా మనం ఆపాలి, 185 00:14:59,107 --> 00:15:00,859 అంటే దాని అర్థం ఆ జంతువుని దూరంగా పంపించాలి. 186 00:15:02,110 --> 00:15:03,362 అలా చేయడం అంటే దాన్ని కాపాడటమే. 187 00:15:04,112 --> 00:15:05,113 ఏదైనా సరే. 188 00:15:19,795 --> 00:15:20,838 రండి, రండి. 189 00:15:29,429 --> 00:15:30,430 వెళదాం పదండి. 190 00:15:34,142 --> 00:15:35,519 మీరు ఇంక టేకాఫ్ కావచ్చు. 191 00:15:35,602 --> 00:15:37,020 విన్నాము. 192 00:15:59,168 --> 00:16:00,878 నేను హాలండ్ తో మాట్లాడాలి. 193 00:16:04,381 --> 00:16:05,632 అపెక్స్ ఏదో చేస్తోంది. 194 00:16:08,552 --> 00:16:11,221 టోక్యోలో కెంటారోని ఇసబెల్ సిమ్మన్స్ కలుసుకుంది. 195 00:16:12,681 --> 00:16:14,641 కానీ ఊరికే కలిశామని కెంటారో చెబుతున్నాడు. 196 00:16:15,559 --> 00:16:18,437 అతను థాయ్ ల్యాండ్ లో ఇసబెల్ ని కలిసి కొద్ది సేపటి కిందటే తిరిగి వచ్చాడు. 197 00:16:19,897 --> 00:16:20,898 నీకు కెంటారో మీద నమ్మకం లేదా? 198 00:16:20,981 --> 00:16:21,982 లేదు, నేను… 199 00:16:23,483 --> 00:16:24,818 నాకు సిమ్మన్స్ మీద నమ్మకం లేదు. 200 00:16:31,033 --> 00:16:33,243 ఆమెకి జరిగిన దాని గురించి నేను ఆలోచిస్తాను. ఆమె… 201 00:16:34,786 --> 00:16:36,121 ప్రతి రోజూ ప్రతి క్షణం. 202 00:16:39,374 --> 00:16:43,962 టిమ్, నేను ఊరికే అలా కూర్చుని పరిస్థితి చేయి దాటిపోయే వరకూ ఎదురుచూడలేను. 203 00:16:46,215 --> 00:16:49,510 నీకు తెలుసా, హిరోషి తరచుగా చెబుతుండేవాడు, 204 00:16:50,219 --> 00:16:54,973 "మనం రాకాసి జంతువుతో వ్యవహరిస్తున్నాం, కాబట్టి ఏ పొరపాటు జరిగినా దాని పరిణామం భారీగా ఉంటుంది." 205 00:16:58,560 --> 00:16:59,686 కానీ నువ్వు నీ ప్రయత్నం విరమించుకోకు. 206 00:17:00,562 --> 00:17:04,398 చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకుంటే మనం ఇంకా మెరుగ్గా పని చేయగలం. 207 00:17:07,986 --> 00:17:08,987 అది నిజం. 208 00:17:09,988 --> 00:17:10,989 హేయ్. 209 00:17:11,740 --> 00:17:12,741 అది నిజం. 210 00:17:14,701 --> 00:17:17,412 ఈ పనిలో ఏదైనా రిస్కు ఉందంటే, 211 00:17:18,955 --> 00:17:20,290 అప్పుడు నువ్వు తప్పనిసరిగా దాని అంతు చూడాలి. 212 00:17:24,627 --> 00:17:25,628 నీకు నేను అండగా ఉంటాను. 213 00:17:32,594 --> 00:17:34,763 నువ్వు ఇంక బయలుదేరు. నేను అవసరమైన ఏర్పాట్లు చేస్తాను. 214 00:17:40,269 --> 00:17:42,062 ఔట్ పోస్ట్ 18 కి మోనార్క్ ఫైవ్-ఫైవ్ సందేశం. 215 00:17:43,021 --> 00:17:44,690 టైటన్ ఎక్స్ కి దగ్గరగా వెళ్తున్నాం. 216 00:17:44,773 --> 00:17:46,650 ల్యాండ్ అయ్యే ప్రదేశం మాకు కనిపిస్తోంది. 217 00:17:47,401 --> 00:17:48,402 విన్నాము. 218 00:17:48,944 --> 00:17:50,571 దాని సైజు చూడు. 219 00:18:29,902 --> 00:18:30,903 ఏం జరుగుతోంది? 220 00:18:35,657 --> 00:18:36,658 అదేంటి? 221 00:18:38,577 --> 00:18:39,995 - అక్కడ చూడు. - ఎడమ వైపు పక్షులు! 222 00:18:44,875 --> 00:18:46,084 - ప్రమాదం! - మేము నేల కూలుతున్నాం! 223 00:18:54,843 --> 00:18:55,844 దేవుడా. 224 00:19:03,393 --> 00:19:05,062 వాళ్లందరూ క్షేమంగా ఉన్నారా? కిందిగి దిగారా? 225 00:19:05,145 --> 00:19:06,730 మోనార్క్ ఫైవ్-ఫైవ్, వింటున్నారా? 226 00:19:10,776 --> 00:19:13,153 మోనార్క్ ఫైవ్-ఫైవ్, సమాధానం ఇవ్వండి. 227 00:19:13,946 --> 00:19:16,031 మోనార్క్ ఫైవ్-ఫైవ్, సమాధానం ఇవ్వండి. 228 00:19:16,114 --> 00:19:18,200 సిగ్నల్ లేదు 229 00:19:18,283 --> 00:19:20,369 ఇది మోనార్క్ ఫైవ్-ఫైవ్ నుండి. 230 00:19:20,452 --> 00:19:22,162 మేము కష్టం మీద ల్యాండ్ కాగలిగాం. 231 00:19:22,246 --> 00:19:25,457 ఇది లొకేషన్… తక్షణం తరలించాలి… 232 00:19:26,583 --> 00:19:29,044 విన్నాము, ఫైవ్-ఫైవ్. తరలింపు బృందం బయలుదేరింది. 233 00:19:29,628 --> 00:19:32,589 సరే, హేయ్, విను. వాళ్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంటాక్ట్ కోల్పోవద్దు. 234 00:19:32,673 --> 00:19:34,299 - అర్థమైందా? - అలాగే. 235 00:19:34,383 --> 00:19:35,384 బాగా చేశావు. 236 00:19:37,845 --> 00:19:39,638 మోనార్క్ ఫైవ్-ఫైవ్ ని తరలించడానికి సహాయక బృందం కావాలి. 237 00:19:41,849 --> 00:19:46,478 దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడో ఒక చోట 238 00:20:35,360 --> 00:20:36,361 కెయ్! 239 00:20:37,863 --> 00:20:38,864 లీ! 240 00:20:41,575 --> 00:20:44,453 దేవుడా! ఏంటి ఇదంతా? 241 00:20:46,538 --> 00:20:47,706 నువ్వు బాగానే ఉన్నావా? 242 00:20:48,749 --> 00:20:51,001 నేను బాగానే ఉన్నాను. బాగానే ఉన్నాను. 243 00:20:51,585 --> 00:20:53,253 మిగతా అందరూ ఎలా ఉన్నారు? హేయ్. 244 00:20:57,257 --> 00:20:58,425 వాళ్లు బాగానే ఉన్నారు. 245 00:20:58,926 --> 00:21:01,094 నువ్వు వస్తున్నావని తెలియదు. నేను కేవలం… 246 00:21:01,929 --> 00:21:02,930 అయ్యో. 247 00:21:03,472 --> 00:21:04,473 నేను… 248 00:21:05,849 --> 00:21:06,850 ఎందుకు? 249 00:21:10,479 --> 00:21:13,607 ఎందుకు… ఇక్కడ ఏం చేస్తున్నావు, కెయ్? 250 00:21:16,276 --> 00:21:17,945 ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, లీ? 251 00:21:23,033 --> 00:21:24,660 బ్రెండా హాలండ్ కోసం చూస్తున్నాను. 252 00:21:24,743 --> 00:21:26,745 కింద హాలులో. కుడి వైపు మొదటి గది. 253 00:21:33,627 --> 00:21:38,882 మోనార్క్ అసెట్ మేనేజ్మెంట్ గుర్తు తెలియని ప్రదేశం 254 00:21:56,441 --> 00:21:57,609 డేజా వూ. 255 00:21:58,735 --> 00:21:59,903 నువ్వు వేగంగా పని చేస్తావు. 256 00:22:01,321 --> 00:22:05,826 మోనార్క్ అధికారుల్ని మెప్పించడానికి నీకు, ఏంటి, రెండు రోజులు పట్టిందా? 257 00:22:06,535 --> 00:22:09,246 లేదు. ఇక్కడ నీతో మాట్లాడటానికి వాళ్లు అనుమతి ఇచ్చారు. 258 00:22:13,458 --> 00:22:14,501 నువ్వు బాగానే ఉన్నావా? 259 00:22:16,420 --> 00:22:17,421 హా, బాగానే ఉన్నాను. 260 00:22:19,631 --> 00:22:20,632 నువ్వు బాగున్నావా? 261 00:22:24,136 --> 00:22:25,137 నీకెలా సాయం చేయగలను? 262 00:22:27,931 --> 00:22:31,059 నువ్వు రాసిన ప్రతుల్ని చదివాను. 263 00:22:31,935 --> 00:22:35,606 నువ్వు అపెక్స్ ప్రోటోకాల్స్ కి వ్యతిరేకంగా వెళ్లినట్లు నువ్వు అందులో రాసుకున్నది నేను చదివాను. 264 00:22:39,318 --> 00:22:40,777 బ్రెండా, ఎందుకు అబద్ధం చెబుతున్నావు? 265 00:22:41,945 --> 00:22:45,866 శాంటా సోలెడాడ్ లో జరిగిన ఘటనల్ని సమీక్షించడానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని 266 00:22:46,575 --> 00:22:50,537 మోనార్క్ కి అందేలా చేయడానికే నేను ఇక్కడ ఉన్నాను. 267 00:22:51,830 --> 00:22:54,082 - నేను వాళ్లకి సహకరిస్తున్నాను. - ఇలా చూడు. 268 00:22:54,750 --> 00:22:58,003 నేను గతంలో ఇలాంటి ఒక గదిలో ఉన్నాను. అబద్ధం చెప్పినందుకు. 269 00:22:59,129 --> 00:23:01,715 ఎందుకంటే నిజం చెబితే ఏం జరుగుతుందోనని భయపడ్డాను. 270 00:23:02,758 --> 00:23:03,967 నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? 271 00:23:04,593 --> 00:23:08,138 ఈ పరిస్థితి కారణంగానే నీకు కంపెనీ వాళ్లు భారీ నగదు ప్యాకేజీని ప్రకటించారా? 272 00:23:08,222 --> 00:23:09,806 నువ్వు చెప్పింది కరెక్టే, కోర. 273 00:23:11,350 --> 00:23:12,351 నేను మరీ ఎక్కువ దూరం వెళ్లాను. 274 00:23:13,185 --> 00:23:15,771 నా ఆశయం నన్ను మించిపోయింది, 275 00:23:15,854 --> 00:23:19,441 ఇంకా శాంటా సోలెడాడ్ లో జరిగిన దానికి నేనే బాధ్యురాలిని. 276 00:23:19,525 --> 00:23:21,276 నువ్వు ఒక్క దానివే అందుకు బాధ్యురాలివి కాదు. 277 00:23:21,360 --> 00:23:24,112 నేను చేసిన పనులకి నేనే జవాబుదారీ, కోర. 278 00:23:28,450 --> 00:23:29,993 నాకు కాస్త మంచినీళ్లు ఇస్తారా, ప్లీజ్? 279 00:23:32,246 --> 00:23:33,705 కుళాయి నీళ్లు కాదు. థాంక్యూ. 280 00:23:38,502 --> 00:23:41,171 దయచేసి ఇంతటితో వదిలేయ్. 281 00:23:41,255 --> 00:23:44,800 వాల్టర్ సిమ్మన్స్ కూతురు కెంటారో రాండా నుండి ఏం కోరుకుంటోంది? 282 00:23:54,601 --> 00:23:55,727 ఇది కదలకుండా ఉంది. 283 00:23:58,272 --> 00:24:01,733 మనం ఇక్కడికి రాకూడదని మాత్రమే చెబుతున్నాను. 284 00:24:03,068 --> 00:24:04,319 ఎందుకు? 285 00:24:04,403 --> 00:24:06,864 ఎందుకంటే దానికి ఇప్పటికే ఎర వేసేశాను. 286 00:24:06,947 --> 00:24:08,115 తరలింపు బృందం బయలుదేరారా? 287 00:24:08,198 --> 00:24:10,200 ఇంకో విమానాన్ని పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 288 00:24:10,284 --> 00:24:12,744 ఇక్కడికి గాడ్జిల్లా రాకముందే ఆ బృందం రావాలని గట్టిగా కోరుకో. 289 00:24:12,828 --> 00:24:15,455 టైటన్ తో వ్యవహరించడానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉండి ఉండచ్చు, లీ. 290 00:24:15,539 --> 00:24:18,000 ఖచ్చితంగా ఉండి ఉండచ్చు, కెయ్. కానీ ఇప్పుడు నేను గాడ్జిల్లా మార్గాన్నే ఎంచుకుంటాను. 291 00:24:18,584 --> 00:24:20,961 నౌకా దళాలు ఇక్కడికి చేరుకోవడానికి ముందు మనకి కాస్త సమయం ఉంటుంది, కదా? 292 00:24:21,044 --> 00:24:22,462 - అవును. - నౌకాదళాలా? 293 00:24:23,046 --> 00:24:24,339 అవును, లీ. 294 00:24:24,423 --> 00:24:27,509 టైటన్ ని అంతం చేయడానికి అమెరికన్ మిలటరీ కూడా ప్లాన్ చేసింది, 295 00:24:27,593 --> 00:24:30,762 అందుకే వాళ్లు రాకముందే కేట్, నేను కలిసి మేము చేయాలి అనుకున్నది చేయడానికి వచ్చాము. 296 00:24:30,846 --> 00:24:32,973 సరే, నువ్వు ఏదైనా మైకు తీసుకుని మోనార్క్ కి ఏం చెబుతావంటే 297 00:24:33,056 --> 00:24:35,642 ఆ నౌకాదళాల్ని అక్కడే ఆపమను, ఎందుకంటే గాడ్జిల్లా గనుక ఇక్కడికి వచ్చిందంటే, 298 00:24:35,726 --> 00:24:39,938 వాళ్లు టైటన్ ని అంతం చేయడానికి ఎన్ని ప్లాన్లు వేసినా అవి పని చేయవు, రెండు జంతువుల సంగతి దేవుడెరుగు. 299 00:24:40,022 --> 00:24:41,023 థాంక్యూ. 300 00:24:42,524 --> 00:24:46,862 ఇంకా నువ్వు, కేట్ అసలు ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు? 301 00:24:47,946 --> 00:24:50,282 టైటన్ ఎక్స్ ని తిరిగి వలస మార్గంలోకి పంపించడానికి ప్రయత్నిస్తాము. 302 00:24:50,365 --> 00:24:52,034 అదిగో మళ్లీ మొదలు. టైటన్ ని కాపాడటం. 303 00:24:52,117 --> 00:24:53,952 నువ్వు చేస్తున్నది అంతకన్నా మంచి పని అంటావా? 304 00:24:54,036 --> 00:24:58,081 చూడు, కెయ్, ఇది 1950ల కాలం కాదు. ప్రపంచం మారిపోయింది. 305 00:24:58,165 --> 00:25:02,336 టైటన్లతో మనుషుల అనుబంధం ఆ జి-డే నాడే చెదిరిపోయింది. 306 00:25:02,920 --> 00:25:03,962 నువ్వు దాన్ని మిస్ అయ్యావు. 307 00:25:04,046 --> 00:25:05,214 నేను ఏదీ మిస్ కాలేదు. 308 00:25:06,507 --> 00:25:09,676 జి-డే రోజు నేను అక్కడే ఉన్నాను. నేను ప్రేమించే మనుషుల్ని పోగొట్టుకున్నాను. 309 00:25:11,553 --> 00:25:13,055 ఆ టైటన్ నీ తండ్రిని చంపింది… 310 00:25:13,764 --> 00:25:14,765 అతను నీ కొడుకు కూడా. 311 00:25:15,349 --> 00:25:18,810 కాబట్టి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, దయచేసి ఈ బీచ్ నుండి వీలైనంత దూరంగా వెళ్లిపోండి 312 00:25:18,894 --> 00:25:22,314 ఆ టైటన్ లేదా గాడ్జిల్లా మిమ్మల్ని చంపడానికి ముందే బయలుదేరండి. 313 00:25:26,944 --> 00:25:29,029 నేను ట్రక్కులో మీ అందరి కోసం ఎదురుచూస్తుంటాను. 314 00:25:37,955 --> 00:25:39,831 కేట్ వెళ్లాలి అనుకుంటే, తనని వెళ్లనివ్వాలి. 315 00:25:40,999 --> 00:25:42,459 తను కనీసం ఒక ప్రయత్నం చేయాలి. 316 00:25:43,210 --> 00:25:45,337 ఆ నౌకదళాలు లేదా గాడ్జిల్లా ఇక్కడికి రాక ముందే తను ప్రయత్నించాలి. 317 00:25:51,510 --> 00:25:52,511 నువ్వు ఆ పని చేయగలవు. 318 00:25:53,220 --> 00:25:54,221 వెళ్లు. 319 00:25:55,931 --> 00:25:57,683 నేను తనని గమనిస్తూ ఉంటాను. 320 00:26:00,143 --> 00:26:02,312 వెళ్లి నువ్వు ఆ పని చేయి. నేను లీ దృష్టిని మళ్లిస్తాను. 321 00:26:22,124 --> 00:26:23,375 అది ఎప్పుడు జరిగింది? 322 00:26:24,293 --> 00:26:26,044 హిరోషి అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజు. 323 00:26:26,128 --> 00:26:27,421 థాంక్యూ. 324 00:26:27,504 --> 00:26:32,593 అయితే, అతడిని పలకరించి తన సానుభూతిని తెలియజేసి ఇసబెల్ మంచి పని చేసింది. 325 00:26:33,093 --> 00:26:34,094 ఆపు. 326 00:26:34,928 --> 00:26:36,346 అతడి నుండి ఆమె ఏం కోరుకుంటోంది? 327 00:26:36,430 --> 00:26:38,515 ఆమెకి అపెక్స్ తో ఎలాంటి సంబంధం లేదు. 328 00:26:38,599 --> 00:26:40,517 నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. వాళ్లు ఏం చేస్తున్నారు? 329 00:26:40,601 --> 00:26:42,269 వాల్టర్ సిమ్మన్స్ తన ప్రయత్నాన్ని ఆపలేదు. 330 00:26:42,352 --> 00:26:45,939 మనం మొదటిసారి కలిసినప్పుడు, నిన్ను తక్కువ అంచనా వేశాను. 331 00:26:46,565 --> 00:26:50,068 నువ్వు ఏఈటి లో చేరినప్పుడు నీ ఉద్దేశాల్ని నేను అర్థం చేసుకున్నానని భ్రమపడ్డాను. 332 00:26:51,320 --> 00:26:54,781 నేను పొరబడ్డాను, అందుకు మూల్యం చెల్లించుకున్నాను. 333 00:26:55,449 --> 00:26:57,117 అవును, నేను కూడా మూల్యం చెల్లించుకున్నాను. 334 00:26:57,201 --> 00:26:58,202 అవును. 335 00:26:58,952 --> 00:27:01,955 ఎందుకంటే ఏఈటి ని నువ్వు అర్థం చేసుకున్నావని భ్రమపడ్డావు. 336 00:27:02,039 --> 00:27:03,457 కానీ నువ్వు పొరబడ్డావు. 337 00:27:03,540 --> 00:27:08,003 సరే. నేను చేసిన తప్పులన్నీ ఈ రోజు మనం గుర్తు చేసుకుందాం, ఫర్వాలేదు. 338 00:27:08,670 --> 00:27:12,799 మోనార్క్ ఇంటెలిజెన్స్ విభాగంతో నాకు ఇంకో మీటింగ్ ఉంది, 339 00:27:12,883 --> 00:27:14,301 కాబట్టి బహుశా… 340 00:27:15,719 --> 00:27:17,638 మనం చివరిసారిగా మాట్లాడుకోవడం ఇదే కావచ్చు. 341 00:27:19,723 --> 00:27:22,601 నీకు బెస్ట్ ఆఫ్ లక్, కోర. 342 00:27:25,562 --> 00:27:26,772 మన చర్చ ఇంక ముగిసింది. 343 00:28:36,717 --> 00:28:37,718 కేట్! 344 00:28:38,510 --> 00:28:39,511 నేను బాగానే ఉన్నాను. 345 00:28:51,148 --> 00:28:52,566 హేయ్, నువ్వు ఈ పని చేయనక్కర్లేదు. 346 00:28:55,652 --> 00:28:56,653 నేను చేయాలి. 347 00:29:10,459 --> 00:29:11,543 లీ! 348 00:29:13,754 --> 00:29:14,755 వాళ్లు వస్తున్నారా? 349 00:29:18,800 --> 00:29:20,511 మనం కలిసి పని చేయాలి. 350 00:29:21,762 --> 00:29:23,180 మన ఇద్దరి లక్ష్యం ఒక్కటే. 351 00:29:24,473 --> 00:29:26,141 కానీ మనం అలా పని చేయడం లేదు. 352 00:29:26,225 --> 00:29:28,977 కనీసం నేను ప్రకృతి సహజమైన పనులు చేస్తున్నాను. 353 00:29:29,061 --> 00:29:30,187 టైటన్స్ ఇలాగే పని చేస్తాయి. 354 00:29:30,270 --> 00:29:31,897 టైటన్స్ ఎలా పని చేస్తాయో నీకు తెలుసా? 355 00:29:32,814 --> 00:29:34,358 ఎవరికీ తెలియదు, లీ. 356 00:29:34,441 --> 00:29:38,570 బిల్లీ మ్యాప్ తయారు చేసి 60 ఏళ్లయింది, కానీ ఇప్పటివరకూ మనకి ఉన్నవన్నీ ఆయుధాలే. 357 00:29:40,364 --> 00:29:43,242 మానవాళిని కాపాడాలంటే మనం వాటిని అర్థం చేసుకోవాలి. 358 00:29:43,909 --> 00:29:46,328 నాకు ఒక్క వాస్తవ సంఘటన చెప్పు, 359 00:29:46,411 --> 00:29:48,872 నమ్మకంగా ఆ మాట అనడానికి దోహదం చేసిన నువ్వు తెలుసుకున్న ఏదైనా ఒక వాస్తవ సంఘటన 360 00:29:48,956 --> 00:29:50,832 చెప్పు, కెయ్. కేవలం ఒక్కటి చెప్పు చాలు. 361 00:29:52,793 --> 00:29:53,794 నేను చెప్పలేను. 362 00:29:57,923 --> 00:30:01,885 నాకు తెలిసిందల్లా టైటన్ ఎక్స్ ని తిరిగి దాని వలస మార్గంలోకి పంపించాలన్నదే 363 00:30:01,969 --> 00:30:03,470 లేదంటే జనం చనిపోతూనే ఉంటారు. 364 00:30:06,473 --> 00:30:07,599 అది సరిపోదా? 365 00:30:07,683 --> 00:30:09,017 చాలదు. 366 00:30:09,101 --> 00:30:12,396 లేదు, నీ, కేట్ ఇంకా కెంటారో ప్రాణాల్ని ప్రమాదంలో పెట్టినప్పుడు అది చాలదు. 367 00:30:13,146 --> 00:30:14,898 ఏ టైటన్ ప్రాణం కోసం అంత రిస్కు తీసుకోనక్కర్లేదు. 368 00:30:17,067 --> 00:30:20,320 ఇంత రిస్కు తీసుకోవడానికి నీ నమ్మకాలు అంత బలమైనవా? 369 00:30:20,404 --> 00:30:23,282 అది నా రిస్కు, కెయ్. ఏదైనా ప్రమాదం జరిగితే నేను ఒక్కడినే నష్టపోతాను. 370 00:30:23,365 --> 00:30:25,367 మమ్మల్ని అందరినీ గాడ్జిల్లా ముందు పెట్టే వరకే అది. 371 00:30:25,450 --> 00:30:26,743 లేదు, లేదు. అది నువ్వు చేశావు. 372 00:30:26,827 --> 00:30:28,662 నేను ఇక్కడికి నా అంతట నేనే వచ్చాను. 373 00:30:28,745 --> 00:30:32,624 కేవలం గాడ్జిల్లా, టైటన్ ఇంకా నేను. ఈ చుట్టుపక్కల ఇంకెవ్వరూ లేరు. ఏమీ లేదు! 374 00:30:34,001 --> 00:30:35,836 నువ్వు ఇక్కడికి రాకూడదు, కెయ్. 375 00:30:39,089 --> 00:30:40,757 నేను ఎక్కడ ఉండాల్సిన దానిని, లీ? 376 00:30:40,841 --> 00:30:42,426 ఇక్కడ తప్ప ఇంకెక్కడయినా. 377 00:31:21,882 --> 00:31:22,883 ఓహ్, దేవుడా. 378 00:31:25,636 --> 00:31:26,762 అది ఏంటి? 379 00:31:34,061 --> 00:31:35,187 అది ఒక గూడు. 380 00:31:40,776 --> 00:31:41,902 ఓహ్, దేవుడా. 381 00:31:42,986 --> 00:31:44,154 అందుకే అది ఇక్కడ ఉంది! 382 00:31:45,697 --> 00:31:46,698 అది ఒక గుడ్డు. 383 00:31:47,908 --> 00:31:49,785 ఈ టైటన్ ఒక గూడుని కట్టింది. 384 00:32:06,885 --> 00:32:08,095 హలో? 385 00:32:08,178 --> 00:32:09,721 మనకి సమయం మించిపోతోంది, కెంటారో. 386 00:32:10,264 --> 00:32:11,974 నీ లొకేషన్ ని మేము గుర్తించాము. 387 00:32:12,558 --> 00:32:14,142 మొత్తం టీమ్ అంతా సిద్ధంగా ఉంది. 388 00:32:14,685 --> 00:32:16,353 నువ్వు స్కారబ్స్ ఆచూకీని తెలుసుకున్నావా? 389 00:32:17,312 --> 00:32:18,438 కెంటారో? 390 00:32:18,522 --> 00:32:21,608 అవును, మా నాన్న ఇది జరగాలని కోరుకునేవాడో లేదో నాకు తెలియదు. 391 00:32:21,692 --> 00:32:23,360 మీ నాన్న కేట్ కారణంగా చనిపోయాడు. 392 00:32:25,821 --> 00:32:27,447 తను చెడ్డ మనిషి కాదు. 393 00:32:27,531 --> 00:32:29,199 కేట్ ఉద్దేశం ఏదైనా కానీ, 394 00:32:29,283 --> 00:32:32,870 ఆమె వ్యవహరిస్తున్న తీరు మరిన్ని మరణాలకీ, మరింత విధ్వంసానికీ దారి తీస్తుంది. 395 00:32:37,040 --> 00:32:40,085 విను, ఈ ప్లాన్ గనుక పని చేయకపోతే, ఆ విషయం నాకు ఇప్పుడే చెప్పు. 396 00:32:44,923 --> 00:32:48,010 అది పని చేస్తుంది. ఆ ప్లాన్ పని చేస్తుంది. 397 00:32:48,594 --> 00:32:49,845 స్కారబ్స్ గురించి మర్చిపో. 398 00:32:53,390 --> 00:32:55,142 ఇక్కడ ఒక ఎగ్ ఉందని ట్రిసొప్ కి చెప్పు. 399 00:32:56,894 --> 00:32:57,895 వాళ్లు ఎక్కడ ఉన్నారు? 400 00:32:59,313 --> 00:33:00,314 వాళ్లు ఎక్కడ ఉన్నారు? 401 00:33:03,317 --> 00:33:05,277 తన ఇక్కడికి ఏం చేయడానికి వచ్చిందో ఆ పని చేస్తోంది. 402 00:33:06,945 --> 00:33:07,946 డామిట్. 403 00:33:24,379 --> 00:33:27,007 టైటన్ బిడ్డ కోసం స్కారబ్స్ ఒక గూడుని నిర్మించాయి. 404 00:33:27,090 --> 00:33:29,009 ఇలాంటివి ఇంకా ఉన్నాయని అంటున్నావా? 405 00:33:29,092 --> 00:33:31,094 మనకి హాని చేయడం దాని ఉద్దేశం కాదని నీకు చెప్పాను. 406 00:33:31,178 --> 00:33:32,554 ఇది మన ఆలోచనలన్నింటినీ మార్చేస్తుంది. 407 00:33:33,347 --> 00:33:36,642 ఈ టైటన్ ఒక తల్లి. అందుకే అది ఇప్పుడు వదిలి వెళ్లలేదు. 408 00:33:57,496 --> 00:34:00,040 టిమ్! ఆ జంతువు వచ్చేసింది, అది కొన్ని నిమిషాలలో తీరాన్ని చేరుకుంటుంది. 409 00:34:00,123 --> 00:34:01,667 దారుణం… ఇది చాలా దారుణం! 410 00:34:01,750 --> 00:34:03,126 రిపోర్ట్. 411 00:34:03,210 --> 00:34:06,505 పసిఫిక్ మహాసముద్రంలో గాడ్జిల్లా కనిపించింది ఇంకా అది వేగంగా ఈ దిశగా దూసుకొస్తోంది. 412 00:34:06,588 --> 00:34:07,589 ఇది షా చేసిన పని వల్ల అంటావా? 413 00:34:07,673 --> 00:34:10,467 కావచ్చు, కానీ టైటన్ ఎక్స్ వలస మార్గం నుంచి దారి మళ్లిందని ఆ గాడ్జిల్లా గమనించి ఉంటుంది 414 00:34:10,551 --> 00:34:11,760 అందుకే అది స్వయంగా బయలుదేరి ఉంటుంది. 415 00:34:12,553 --> 00:34:14,221 నా రెస్క్యూ టీమ్ పరిస్థితి ఏంటి? 416 00:34:14,304 --> 00:34:15,389 ఐదు నిమిషాల్లో బయలుదేరతారు. 417 00:34:15,472 --> 00:34:17,099 వాళ్లకి అంత టైమ్ కూడా లేదు. వెళ్లమను! 418 00:34:17,181 --> 00:34:18,183 - సర్? - చెప్పు? 419 00:34:18,266 --> 00:34:20,811 మోనార్క్ పరిధిలోకి గుర్తు తెలియని వాహనాలు చాలా వచ్చాయి. 420 00:34:20,893 --> 00:34:23,272 - అది ఏంటి? నీ దగ్గర ఆ దృశ్యాలు ఉన్నాయా? - లేదు. వాళ్లు స్పందించడం లేదు. 421 00:34:23,355 --> 00:34:24,648 ఫ్లీట్ కమాండర్ ని నాతో మాట్లాడించు. 422 00:34:24,731 --> 00:34:27,025 తీరానికి 160 కిలోమీటర్ల పరిధిలోకి ఎవ్వరూ ప్రవేశించడానికి వీల్లేదు. 423 00:34:27,109 --> 00:34:28,652 మనం ఆ మిసైల్స్ ని ఆపాలి. 424 00:34:42,541 --> 00:34:44,710 హేయ్, హేయ్, కేట్. కేట్, మనం వెళ్లాలి. 425 00:34:45,668 --> 00:34:46,670 కదులు, కేట్! 426 00:35:00,851 --> 00:35:01,852 కేట్! 427 00:35:19,578 --> 00:35:21,288 మనం వాళ్లని ఇక్కడి నుండి తప్పించాలి. 428 00:35:27,377 --> 00:35:29,379 డామిట్. మనం బయటపడే దారి కనిపించడం లేదు. 429 00:35:30,130 --> 00:35:31,215 మనం వెళ్లాలి! 430 00:35:39,306 --> 00:35:40,307 గ్రౌండ్ జీరో. 431 00:35:41,225 --> 00:35:43,644 అదిగో అది అక్కడ ఉంది! వెళదాం రండి! 432 00:36:00,285 --> 00:36:01,286 అది దాని గుడ్డు కదా? 433 00:36:04,957 --> 00:36:06,333 వాళ్లు ఏం చేస్తున్నారు? 434 00:36:07,000 --> 00:36:09,002 కెంటారో, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? 435 00:36:12,464 --> 00:36:13,465 కేట్, మనం వెళ్లాలి. 436 00:36:17,469 --> 00:36:18,470 నువ్వు నాకు అబద్ధం చెప్పావు! 437 00:36:19,137 --> 00:36:20,764 - నువ్వు వాళ్లతో కలిసి పని చేస్తున్నావు! - లేదు. 438 00:36:20,848 --> 00:36:22,474 కానీ జరగాల్సింది ఇదే. 439 00:36:25,853 --> 00:36:26,937 పదండి, పదండి! 440 00:36:27,020 --> 00:36:28,939 మనకి పే లోడ్ కళ్ల ముందే ఉంది. 441 00:37:05,142 --> 00:37:08,020 మన లక్ష్యం సాధించేవరకూ నా టీమ్ ఇక్కడే ఉంటుంది. 442 00:37:08,103 --> 00:37:09,104 కాపీ. 443 00:37:09,771 --> 00:37:14,735 రెండు ఇంకా మూడు, బయటకి కదలండి! టీమ్ వన్, ఉండండి! ఇంక కానివ్వండి! 444 00:37:34,421 --> 00:37:35,756 దానికి ఎదురుగా వెళ్లకండి! 445 00:37:57,027 --> 00:37:58,570 దేవుడా, అది వాళ్లని ఏమైనా చేసిందంటావా? 446 00:38:00,072 --> 00:38:01,073 వాళ్లు క్షేమంగా ఉన్నారు. 447 00:38:02,199 --> 00:38:04,826 - మనం ఇక్కడి నుండి బయటపడదాం. పద, పద, పద. - రా. 448 00:38:09,081 --> 00:38:10,999 వాళ్లు క్షేమంగానే బయటపడతారు. మనం ఇక్కడి నుండి వెళదాం. 449 00:39:24,448 --> 00:39:26,450 తెలుగు అనువాదకర్త: హరీష్