1 00:00:13,597 --> 00:00:18,435 స్కల్ దీవి రెండు వారాల కిందట 2 00:01:38,056 --> 00:01:39,433 ప్రమాదం హై వోల్టేజ్ 3 00:01:51,862 --> 00:01:53,530 ఎక్కడికి వెళ్లావు? 4 00:01:55,949 --> 00:01:57,617 అలా నడకకి వెళ్లాను. 5 00:01:57,618 --> 00:01:58,993 ఒంటరిగానా? 6 00:01:58,994 --> 00:02:01,830 ఇంకెవరితో వెళతాను? 7 00:02:02,998 --> 00:02:04,498 అది ఏంటి? 8 00:02:04,499 --> 00:02:06,542 ఏదో ఒక స్కెచ్. 9 00:02:06,543 --> 00:02:07,753 నాకు చూపించు. 10 00:02:16,136 --> 00:02:17,554 నేను ఒకటి తీసుకోవచ్చా? 11 00:02:32,694 --> 00:02:33,987 బీర్? 12 00:02:35,739 --> 00:02:36,740 ఇది అరుదైనది. 13 00:02:40,327 --> 00:02:42,496 - చీర్స్. - చీర్స్. 14 00:02:51,839 --> 00:02:54,632 రేపటికి మనకి తెలుస్తుంది… 15 00:02:54,633 --> 00:02:58,053 ఇంత ప్రయాసపడి ఈ ప్రయత్నం చేయడం అవసరమా కాదా అనేది… 16 00:02:58,595 --> 00:03:00,722 కేట్ తిరిగి మనకి దక్కినప్పుడు. 17 00:03:01,557 --> 00:03:03,140 ఒక వారం, 18 00:03:03,141 --> 00:03:04,517 లేదా ఒక నెల, 19 00:03:04,518 --> 00:03:07,312 కేట్ బతకడానికి అవకాశం ఉంది. 20 00:03:07,980 --> 00:03:10,274 కానీ ఇప్పటికి రెండేళ్లు గడిచింది. 21 00:03:11,358 --> 00:03:13,068 రెండేళ్లు అయి ఉండకపోవచ్చు. 22 00:03:14,653 --> 00:03:16,488 దాని అర్థం ఏంటి? 23 00:03:17,948 --> 00:03:19,657 అక్కడ సమయం, 24 00:03:19,658 --> 00:03:22,660 వేరే విధంగా పని చేస్తే? 25 00:03:22,661 --> 00:03:25,372 అక్కడ సంవత్సరం కేవలం ఒక రోజులో గడిచిపోతే? 26 00:03:26,206 --> 00:03:28,250 అలాగ జరుగుతుందని నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? 27 00:03:29,626 --> 00:03:32,461 జి-డే తరువాత, 28 00:03:32,462 --> 00:03:34,631 నేను ఒక సంవత్సరం పాటు అదృశ్యం అయిపోయినప్పుడు, 29 00:03:35,382 --> 00:03:39,010 నీకు ఈ విషయం ముందే చెప్పాను, కానీ నేను అలాస్కా వెళ్లాను, 30 00:03:39,011 --> 00:03:42,598 నా తల్లిదండ్రులు రాసిన థియరీలు నిజమని రుజువు చేయడానికి ప్రయత్నించాను. 31 00:03:43,557 --> 00:03:45,433 అక్కడ, 32 00:03:45,434 --> 00:03:47,019 నాకు రిఫ్ట్ కనిపించింది. 33 00:03:49,438 --> 00:03:50,439 అందులోకి వెళితే… 34 00:03:52,191 --> 00:03:55,526 అది ఒక రోజు, 35 00:03:55,527 --> 00:03:58,404 ఇంకా అయితే రెండు రోజులు అయి ఉంటుంది… 36 00:03:58,405 --> 00:04:01,574 కానీ నేను బయటకి వచ్చేసరికి, ఆఫ్రికాలో ఉన్నాను. 37 00:04:01,575 --> 00:04:03,327 అది ఒక ఏడాది తరువాత. 38 00:04:04,995 --> 00:04:07,748 ఆ విషయాన్ని ఇప్పటివరకు ఎందుకు దాచావు? 39 00:04:09,541 --> 00:04:14,003 నిన్ను కాపాడాలి అనుకున్నాను ఇంకా… 40 00:04:14,004 --> 00:04:17,048 నువ్వు నన్ను అనుసరించాలని నేను కోరుకోలేదు. 41 00:04:17,798 --> 00:04:20,761 కానీ ఈసారి మనకి తప్పలేదు. 42 00:04:21,220 --> 00:04:24,640 ఈ వెర్రి ప్రదేశంలో మనం కలిసి పని చేయడం… 43 00:04:26,225 --> 00:04:29,436 నాకు సంతోషంగా ఉంది. 44 00:04:36,401 --> 00:04:42,491 నీ కారణంగా, నేను కోల్పోయిన ఆ సంవత్సరం నాకు తిరిగి దక్కింది. 45 00:06:29,723 --> 00:06:31,724 ఎక్స్ క్యూజ్ మీ. 46 00:06:31,725 --> 00:06:35,187 హిరోషి రాండా అంత్యక్రియలు జరిగే ప్రదేశం ఇదేనా? 47 00:06:35,854 --> 00:06:37,022 అవును, ఇదే… 48 00:06:47,574 --> 00:06:48,659 జూక్? 49 00:06:51,703 --> 00:06:53,163 ఇది సాధ్యమేనా? 50 00:07:01,380 --> 00:07:03,799 మనం ఇప్పుడైనా, తరువాతయినా మాట్లాడుకోవలసిందే. 51 00:07:11,014 --> 00:07:12,474 నేను ఆలోచిస్తున్నాను. 52 00:07:14,142 --> 00:07:17,521 ఆయనకి గుడ్ బై చెప్పే అవకాశం నీకు రాకపోవడం చాలా అన్యాయం. 53 00:07:18,647 --> 00:07:19,940 నేను అనుకుంటున్నాను… 54 00:07:20,607 --> 00:07:22,567 జరిగిన దాన్ని నేను మార్చగలిగితే బాగుండు. 55 00:07:22,568 --> 00:07:24,402 ఆయన వస్తున్నారని నాకు తెలిసి ఉంటే… 56 00:07:24,403 --> 00:07:25,570 నీకు తెలిసి ఉంటేనా? 57 00:07:25,571 --> 00:07:28,740 ఏం జరుగుతుందని అనుకుంటున్నావు? అది టైటన్, కేట్. 58 00:07:30,784 --> 00:07:32,785 అక్కడ ఏం చేస్తున్నావో నాకు చెప్పు. 59 00:07:32,786 --> 00:07:34,997 నాకు తెలియదు. నేను దాన్ని అదుపు చేయలేకపోయాను. 60 00:07:35,581 --> 00:07:37,457 నాకు ఏం జరుగుతోందో నాకే తెలియడం లేదు. 61 00:07:38,041 --> 00:07:40,043 నువ్వు నన్ను నమ్మాలి. 62 00:07:41,128 --> 00:07:43,421 దీనిని మనమిద్దరం కలిసే చేయాలని నాన్న అనుకుంటారు. 63 00:07:43,422 --> 00:07:45,132 నీకు మతిపోయింది. 64 00:07:46,258 --> 00:07:47,426 నాన్న చనిపోయాడు. 65 00:07:49,011 --> 00:07:50,429 అంతా బాగానే ఉందా? 66 00:07:50,929 --> 00:07:53,723 లేదు. లేదు, ఇక్కడ ఏదీ బాగా జరగడం లేదు. 67 00:07:53,724 --> 00:07:55,224 ప్రపంచం అంతా టైటన్ అలెర్టులో ఉంది, 68 00:07:55,225 --> 00:07:57,643 ఇంకా ఏం చేయాలో ఎవ్వరికీ కనీసం అవగాహన లేదు. 69 00:07:57,644 --> 00:07:59,479 నీకు ఉందా? మోనార్క్ కి ఉందా? 70 00:07:59,980 --> 00:08:04,150 కేట్ చేసిన గందరగోళాన్ని గాడ్జిల్లా వచ్చి సరిదిద్దడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది? 71 00:08:04,151 --> 00:08:05,610 కెంటారో, 72 00:08:05,611 --> 00:08:07,237 నువ్వు చాలా బాధలో ఉన్నావని నాకు తెలుసు. 73 00:08:07,696 --> 00:08:09,822 కానీ ఈ పరిస్థితికి ఎవరిని నిందించినా కూడా, 74 00:08:09,823 --> 00:08:13,452 గొడవ పడటం వల్ల మీ నాన్న తిరిగి రాడు. 75 00:08:18,040 --> 00:08:19,124 కెంటారో. 76 00:08:21,710 --> 00:08:22,794 మేము ముందుగా వెళతాం. 77 00:08:26,006 --> 00:08:27,090 కెంటారో. 78 00:08:42,022 --> 00:08:45,692 కెయ్, ఒక పాత ఫ్రెండ్ నిన్ను పలకరించాలి అనుకుంటున్నాడు. 79 00:08:57,287 --> 00:08:58,705 డాక్టర్ సుజూకి. 80 00:09:00,832 --> 00:09:02,668 డాక్టర్ రాండా. 81 00:09:03,252 --> 00:09:07,004 మేజర్ షా నాకు వివరించడానికి ప్రయత్నించాడు, కానీ అది చూశాక… 82 00:09:07,005 --> 00:09:11,635 నీకు కూడా నా అంత వయసు ఉంటుంది, కానీ, నువ్వు ఎలా ఉన్నావో చూడు. 83 00:09:12,553 --> 00:09:15,221 ఇది స్వీకరించడం చాలా కష్టమని తెలుసు. 84 00:09:15,222 --> 00:09:19,476 {\an8}ఇది వేరే సందర్భం అయితే బాగుండేది, 85 00:09:19,935 --> 00:09:22,271 {\an8}కానీ మీ ఇద్దరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. 86 00:09:25,524 --> 00:09:26,942 నువ్వు కేట్ కదా. 87 00:09:28,861 --> 00:09:31,196 నీ గురించి హిరో చాలా చెప్పాడు. 88 00:09:31,780 --> 00:09:34,199 ఆగు, మీరిద్దరూ టచ్ లో ఉన్నారని నాకు తెలియదు. 89 00:09:34,700 --> 00:09:37,870 అది అంతకు మించి. తను తరచూ హతెరుమా వస్తుంటాడు. 90 00:09:39,872 --> 00:09:43,040 చూడు, ఈ మనిషి హతెరుమాలో గనుక అది సృష్టించకపోయి ఉంటే, 91 00:09:43,041 --> 00:09:44,625 మనలో ఎవ్వరమూ ఇక్కడ ఉండేవాళ్లం కాదు. 92 00:09:44,626 --> 00:09:46,378 నువ్వు ఎప్పుడైనా అది చూడాలి, కేట్. 93 00:09:47,379 --> 00:09:49,714 సరే, ఇప్పుడే ఎందుకు రాకూడదు? 94 00:09:49,715 --> 00:09:52,300 మనం బలవంతం చేయకూడదు, వద్దులే. 95 00:09:52,301 --> 00:09:54,760 లేదు, ప్లీజ్. అది నాకెంతో గౌరవంగా ఉంటుంది. 96 00:09:54,761 --> 00:09:57,305 నాకు తెలియదు. మోనార్క్ ఆ టైటన్ అంతు చూస్తే తప్ప, 97 00:09:57,306 --> 00:10:01,350 మాకెవ్వరికీ మనశ్శాంతి ఉండదు. 98 00:10:01,351 --> 00:10:03,477 హిరో గురించి కథలు చెప్పుకోవాలి. 99 00:10:03,478 --> 00:10:07,316 అది కనిపిస్తుందని ఇక్కడ ఎదురుచూస్తూ ఉండటం వల్ల ఎవ్వరికీ ప్రయోజనం ఉండదనుకుంటా. 100 00:10:08,108 --> 00:10:09,401 ప్లీజ్. 101 00:10:22,623 --> 00:10:23,874 దీన్ని భద్రంగా దాచు, హిరో. 102 00:10:28,629 --> 00:10:32,591 పరిస్థితుల్ని చక్కదిద్దడానికి నేను ఏదైనా మార్గం వెెతుకుతాను. ప్రామిస్. 103 00:11:50,127 --> 00:11:52,254 "గాడ్జిల్లా" పాత్ర ఆధారంగా రూపొందించినది 104 00:12:11,273 --> 00:12:12,274 మొదటి రోజు. 105 00:12:12,858 --> 00:12:14,358 మోనార్క్ హెడ్ క్వార్టర్స్ ఆర్లింగ్టన్, వర్జీనియా - 1958 106 00:12:14,359 --> 00:12:15,526 - గుడ్ మార్నింగ్. - గుడ్ మార్నింగ్. 107 00:12:15,527 --> 00:12:16,528 గుడ్ మార్నింగ్. 108 00:12:19,990 --> 00:12:22,034 గుడ్ మార్నింగ్, డాక్టర్ మియురా, మిస్టర్ రాండా. 109 00:12:23,493 --> 00:12:24,577 గుడ్ మార్నింగ్. 110 00:12:24,578 --> 00:12:27,164 నా పేరు ఆలీస్. నేను మిస్టర్ రాండా కొత్త సెక్రటరీని. 111 00:12:28,582 --> 00:12:29,999 నిజంగానా? 112 00:12:30,000 --> 00:12:31,459 అవును. 113 00:12:31,460 --> 00:12:33,544 మీ సెక్రటరీ పేస్ట్రీస్ కోసం ఇందాకే బయటకి వెళ్లింది, డాక్టర్ మియురా. 114 00:12:33,545 --> 00:12:34,630 తను మరికాసేపట్లో తిరిగి వచ్చేస్తుంది. 115 00:12:35,672 --> 00:12:36,673 ఓహ్, సరే. 116 00:12:38,383 --> 00:12:40,301 చాలా ఆలోచనాత్మకంగా ఉంది. 117 00:12:40,302 --> 00:12:43,263 సరే. కొత్త మోనార్క్ ఆఫీసులకి ఈ వైపు రండి. 118 00:12:45,140 --> 00:12:47,434 మీ ఆఫీసు ఇదిగో, డాక్టర్. 119 00:12:48,143 --> 00:12:49,186 చూద్దాం రండి. 120 00:12:50,395 --> 00:12:51,479 అయ్య బాబోయ్. 121 00:12:51,480 --> 00:12:53,564 మీ ఆఫీసు ఈ పక్క గదిలోనే, మిస్టర్ రాండా. 122 00:12:53,565 --> 00:12:56,025 అది కూడా ఈ ఆఫీసు అంత బాగుంటుంది. 123 00:12:56,026 --> 00:12:57,401 సరే. 124 00:12:57,402 --> 00:12:59,404 "దీనిని పాడు చేయకు. జనరల్ పకెట్." 125 00:12:59,905 --> 00:13:02,366 - ఆయన వాడే భాష భలే విచిత్రంగా ఉంటుంది. - అవును. 126 00:13:04,451 --> 00:13:05,786 నువ్వు ఇది నమ్మగలవా? 127 00:13:06,370 --> 00:13:07,871 మోనార్క్ మూడు ఖండాలలో ఉంది. 128 00:13:08,455 --> 00:13:11,375 నువ్వు తీసిన టైటన్ ఫోటోల కారణంగానే మనకి ఇన్ని ఔట్ పోస్టులు ఏర్పాటయ్యాయి. 129 00:13:12,209 --> 00:13:14,294 నేను తిరిగి ఫీల్డ్ లోకి వెళ్లాలని చాలా ఆత్రుతతో ఉన్నాను. 130 00:13:15,712 --> 00:13:18,047 మనం తరువాత యాత్రకి ప్లాన్ చేయడానికి ముందు 131 00:13:18,048 --> 00:13:19,674 - కనీసం ఈ సామాన్లు బయటకి తీద్దాం. - సరే. 132 00:13:19,675 --> 00:13:22,844 పైగా, టైటన్ మళ్లీ ఎంత కాలానికి కనిపిస్తుందో మనకి తెలియదు. 133 00:13:22,845 --> 00:13:23,928 అది ఏంటి? 134 00:13:23,929 --> 00:13:25,680 కొత్త ఆఫీసుల కోసం హిరో బొమ్మలు గీశాడు. 135 00:13:25,681 --> 00:13:27,933 మేము దీన్ని హిరో-సారస్ అని పిలవాలని నిర్ణయించుకున్నాం. ఏం అంటావు? 136 00:13:29,226 --> 00:13:30,351 నాక్ నాక్. 137 00:13:30,352 --> 00:13:32,979 - హేయ్, ఎలా ఉన్నావో చూడు, పూర్తి దర్పంతో. - అవును. అవును. 138 00:13:32,980 --> 00:13:35,524 అంటే, ఇలాంటి ఫ్యాన్సీ ప్రదేశానికి రావాలంటే, నేను సరైన డ్రెస్ లో రావాలని అనుకున్నాను. 139 00:13:36,233 --> 00:13:37,234 హాయ్, లీ. 140 00:13:38,068 --> 00:13:39,236 కెయ్. 141 00:13:41,446 --> 00:13:43,323 ఈ ఆఫీసులో పనులు మొదలుపెడుతున్నాం, సాయం చేస్తావా? 142 00:13:44,074 --> 00:13:46,284 వాస్తవానికి, నన్ను కూడా మీతో చేర్చుకుంటే, 143 00:13:46,285 --> 00:13:48,744 నేను ఒక టోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. 144 00:13:48,745 --> 00:13:49,746 సరే. 145 00:13:55,502 --> 00:13:58,004 ఆరు సంవత్సరాల కిందట, మిమ్మల్ని మొదటిసారి కలిశాను. 146 00:13:58,005 --> 00:14:00,757 అప్పుడు నాకు మొదటగా వచ్చిన ఆలోచన ఏమిటంటే, 147 00:14:01,258 --> 00:14:03,843 వీళ్లిద్దరూ వీళ్లని వీళ్లే చంపుకొంటారు. 148 00:14:03,844 --> 00:14:05,136 కానీ చివరికి ఏం తెలుసుకున్నానంటే, 149 00:14:05,137 --> 00:14:08,432 మీరు, నిజానికి, నా ప్రాణాల మీదకి తెస్తారు. 150 00:14:09,683 --> 00:14:11,976 కానీ ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైనది ఏమిటంటే, 151 00:14:11,977 --> 00:14:15,771 మిమ్మల్ని మీరు కాపాడుకోగల సామర్థ్యంతో పాటు, 152 00:14:15,772 --> 00:14:20,026 ఏదో ఒక రోజు మీరే మా అందరినీ కూడా కాపాడగలరు. 153 00:14:20,027 --> 00:14:21,653 కాబట్టి, చీర్స్. 154 00:14:24,114 --> 00:14:28,368 ఇది చక్కని టోస్ట్, కానీ నీ మాటలతో ఏకీభవించలేనని నాకు ఎందుకు అనిపిస్తోంది? 155 00:14:29,536 --> 00:14:30,787 నీ ఆలోచనలు లోపల దాచుకోలేవు కదా, హా? 156 00:14:32,289 --> 00:14:33,332 అంటే… 157 00:14:34,499 --> 00:14:35,876 నా విధులు మార్చారు. 158 00:14:36,627 --> 00:14:38,669 - ఏంటి? - లేదు. 159 00:14:38,670 --> 00:14:41,964 అది పిచ్చితనం. నేను ఇప్పుడే పకెట్ కి ఫోన్ చేస్తాను. 160 00:14:41,965 --> 00:14:44,467 ఆగు, వద్దు, ఆ పని చేయకు. నేను ఇప్పటికే జనరల్ తో మాట్లాడాను. 161 00:14:44,468 --> 00:14:46,720 నా రిక్వెస్ట్ ని ఆమోదించింది ఆయనే. 162 00:14:47,554 --> 00:14:49,555 - నీ రిక్వెస్టా? - అవును. 163 00:14:49,556 --> 00:14:54,394 అవును, ఆయనకి థర్డ్ స్టార్ హోదా వస్తోంది దానితో తన స్టాఫ్ లో ఒక పదవి నాకు ఆఫర్ చేశాడు. 164 00:14:56,647 --> 00:15:00,149 కానీ, మనం కలిసే ఈ పని చేస్తామని ఎప్పుడూ అనుకునేవాడిని. 165 00:15:00,150 --> 00:15:02,360 నువ్వు లేకపోతే పరిస్థితి వేరేలా ఉంటుంది, లీ. 166 00:15:02,361 --> 00:15:05,364 చూడండి, నేను మేరీల్యాండ్ కి మారుతున్నాను అంతే, చంద్రుడి మీదకి కాదు. 167 00:15:06,114 --> 00:15:08,741 చూడు, మేము ప్రయాణాల గురించి పట్టించుకోవడం లేదు, లీ. 168 00:15:08,742 --> 00:15:10,243 నువ్వు ఇక్కడ ఆనందంగా ఉన్నావని అనుకున్నాను. 169 00:15:10,244 --> 00:15:12,912 నేను హ్యాపీగా ఉన్నానా లేదా అన్నది ఇక్కడ విషయం కాదు, బిల్లీ. 170 00:15:12,913 --> 00:15:15,082 ఇదంతా మన అందరికీ మంచి జరగడం గురించి. 171 00:15:16,667 --> 00:15:17,668 కాబట్టి, 172 00:15:19,336 --> 00:15:20,420 మోనార్క్ కోసం. 173 00:15:38,564 --> 00:15:39,565 మే? 174 00:15:40,232 --> 00:15:41,233 హేయ్. 175 00:15:42,234 --> 00:15:44,694 నేను అంత్యక్రియలకి రాలేకపోయాను, సారీ. 176 00:15:44,695 --> 00:15:47,780 నేను అక్కడికి రావడం మీకు ఇష్టం ఉండదని అనుకున్నాను. 177 00:15:47,781 --> 00:15:50,116 ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు, 178 00:15:50,117 --> 00:15:52,368 నన్ను ఇక్కడ వద్దన్నా నేను అర్థం చేసుకుంటాను. 179 00:15:52,369 --> 00:15:53,620 నేను… 180 00:15:55,998 --> 00:15:57,164 నువ్వు కేట్ తో మాట్లాడావా? 181 00:15:57,165 --> 00:15:59,625 లేదు. లేదు, నేను మొదటగా ఇక్కడికే వచ్చాను. 182 00:15:59,626 --> 00:16:01,587 నువ్వు ఈ బాధని ఎలా భరిస్తున్నావో చూడాలని వచ్చాను. 183 00:16:12,306 --> 00:16:14,725 నాకు దాని గురించి మాట్లాడాలని లేదు. ఒక డ్రింక్ తెచ్చుకుందాం పద. 184 00:16:39,541 --> 00:16:41,375 అది పక్కన పెట్టు. 185 00:16:41,376 --> 00:16:42,836 నువ్వు నాకు రిపోర్ట్ చేయడం లేదు. 186 00:16:43,504 --> 00:16:44,505 నాన్నా. 187 00:16:45,422 --> 00:16:47,798 ఎన్ని సంవత్సరాలయింది? మూడేళ్లా? నాలుగా? 188 00:16:47,799 --> 00:16:49,717 - ఐదు. - ఐదు సంవత్సరాలు. 189 00:16:49,718 --> 00:16:50,801 - అవును. - అయ్య బాబోయ్. 190 00:16:50,802 --> 00:16:52,553 - అవును. - సరే, నువ్వు లోపలికి రా. 191 00:16:52,554 --> 00:16:54,598 - మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. - సరే. 192 00:16:57,392 --> 00:16:59,393 కల్నల్ లెల్యాండ్ లాఫియెట్ షా 2 193 00:16:59,394 --> 00:17:03,397 నేను, నా కొడుకు ఒక ప్రదేశంలో పని చేస్తున్నామంటే నేను నమ్మలేకపోతున్నాను. 194 00:17:03,398 --> 00:17:05,066 ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఉంటారు. 195 00:17:05,067 --> 00:17:07,777 ఇక్కడ సగం మంది సీనియర్ ఆఫీసర్లు నాకు పరిచయమే. అది మామూలు విషయం. 196 00:17:07,778 --> 00:17:10,071 - నిన్ను అందరూ చాలా బాగా చూసుకుంటారు. - ఏం చేస్తున్నావు? 197 00:17:11,240 --> 00:17:14,241 అంటే, నీ కొత్త ఎసైన్మెంట్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. 198 00:17:14,242 --> 00:17:16,493 లేదు, లేదు. ఈ కొత్త విధులలో రేపు నా మొదటి రోజు. 199 00:17:16,494 --> 00:17:19,247 రాత్రి ఎనిమిది గంటలకు నువ్వు ఒక్క డ్రింక్ తాగలేవా? 200 00:17:19,248 --> 00:17:21,833 లేదు, నేను చురుకుగా ఉండాలి అనుకుంటున్నాను. నేను బెస్ట్ గా ఉండాలి. 201 00:17:21,834 --> 00:17:23,334 నువ్వు కరెక్టుగా చెప్పావు. 202 00:17:23,335 --> 00:17:27,339 పకెట్ అనుమతి నీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. 203 00:17:30,050 --> 00:17:33,053 సరే, మంచిది. ఒకటి. ఒక్క డ్రింక్. 204 00:17:33,846 --> 00:17:36,013 నాకు అది చాలు. ఇది చౌక సరుకు కాదు. 205 00:17:36,014 --> 00:17:37,015 అబద్ధం. 206 00:17:49,236 --> 00:17:52,406 అయితే, మనం దాని గురించి మాట్లాడుకుందామా? 207 00:17:52,990 --> 00:17:55,658 - దేని గురించి మాట్లాడాలి? - నువ్వు మోనార్క్ ని ఎందుకు వదిలేశావు? 208 00:17:55,659 --> 00:17:56,994 అవును, నాకు నిజంగా తెలియదు… 209 00:17:57,744 --> 00:17:59,871 మన భావాలకి అది సరిపోయేది కాదు, నా ఉద్దేశం నీకు తెలుసు అనుకుంటా? 210 00:17:59,872 --> 00:18:01,581 - ఏంటి? మాట్లాడటమా? - వ్యక్తిగతం కావడం. 211 00:18:01,582 --> 00:18:02,749 ఓహ్, అది వ్యక్తిగతం. 212 00:18:03,250 --> 00:18:05,501 అయితే, నువ్వు ఎవరితో అయినా గొడవ పడ్డావా లేదా అక్రమ సంబంధం పెట్టుకున్నావా? 213 00:18:05,502 --> 00:18:06,794 దేవుడా, నాన్నా. ఇంక ఆపు. 214 00:18:06,795 --> 00:18:08,629 ఎప్పుడూ ఆ రెండు ఆప్షన్లు మాత్రమే ఎందుకు ఉంటాయి, హా? 215 00:18:08,630 --> 00:18:10,715 అయితే హృదయానికి సంబంధించినది అయి ఉంటుంది. ఆఫీసర్ గారి భార్య? 216 00:18:10,716 --> 00:18:11,799 - సెక్రటరీ? - వావ్. సరే. 217 00:18:11,800 --> 00:18:14,010 - నువ్వు వదిలిపెట్టేలా లేవు కదా? - ఆర్మీ నర్స్? ఒక బిడ్డ తల్లి? 218 00:18:14,011 --> 00:18:15,304 ఆమె నా కొలీగ్, డాడ్. 219 00:18:16,180 --> 00:18:17,722 ఆమె ఒక కొలీగ్. 220 00:18:17,723 --> 00:18:19,016 ఒక సైంటిస్ట్. 221 00:18:20,350 --> 00:18:23,561 అంత మేధావిని నేను ఇంతవరకూ చూడలేదు. 222 00:18:23,562 --> 00:18:25,272 కానీ ఆమెకి అప్పటికే ఒక ప్రియుడు ఉన్నాడు, అది నాకు తెలుసు. 223 00:18:25,856 --> 00:18:28,066 నేను చూసిన రెండవ అత్యంత మేధావి అతను. 224 00:18:28,734 --> 00:18:32,571 అయితే ఆ విషయాన్ని నేరుగా అతని ముందు ఒప్పుకోలేను. 225 00:18:34,740 --> 00:18:35,741 సరే. 226 00:18:36,241 --> 00:18:37,742 ఈ దేశాన్ని నేను ప్రేమిస్తాను, 227 00:18:37,743 --> 00:18:40,870 కానీ మనం ఏదైనా చేయగలమనే ఆలోచన కలిగేలా ఈ దేశం మనల్ని మాయ చేస్తుంది. 228 00:18:40,871 --> 00:18:43,456 సక్సెస్, హ్యాపినెస్, ఫ్యామిలీ. 229 00:18:43,457 --> 00:18:44,875 కానీ గౌరవం. 230 00:18:46,293 --> 00:18:48,337 ఏ మూల్యమూ చెల్లించకుండా అది దక్కదు. 231 00:18:49,505 --> 00:18:51,632 నేను ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నానో లేదో కూడా నాకు ఖచ్చితంగా తెలియదు. 232 00:18:53,175 --> 00:18:54,760 నువ్వు పక్కకి తప్పుకున్నావు, అవునా? 233 00:18:59,431 --> 00:19:00,432 అవును. 234 00:19:03,060 --> 00:19:05,144 - నీకు ఇంకో డ్రింక్ కావాలా? - వద్దు, నువ్వు చాలా తక్కువ పోస్తున్నావు. 235 00:19:05,145 --> 00:19:07,064 నా ఒక్క డ్రింక్ లో మిగతాది అంతా కావాలి. 236 00:19:11,568 --> 00:19:13,152 - నీకు తెలుసు… - థాంక్యూ. 237 00:19:13,153 --> 00:19:15,322 - …నేను ఇదే టేబుల్ లో కూర్చున్నాను… - థాంక్స్. 238 00:19:16,073 --> 00:19:18,282 …చెప్పలేనన్ని సార్లు, 239 00:19:18,283 --> 00:19:22,913 ప్రాజెక్ట్ హవర్ గ్లాస్ ఎందుకు ఘోరంగా విఫలమైందని నన్ను నేను ప్రశ్నించుకుంటూ కూర్చునేవాడిని. 240 00:19:28,544 --> 00:19:29,628 పొరపాటు ఎక్కడ జరిగింది? 241 00:19:31,004 --> 00:19:33,215 టైమ్ డైలేషన్. 242 00:19:34,049 --> 00:19:37,802 అది తెలియకపోయి ఉంటే, ప్రతి ఈక్వేషన్ ఫెయిల్ అయ్యేది. 243 00:19:37,803 --> 00:19:40,764 రిఫ్ట్ మనందరినీ చంపకపోవడం ఒక అద్భుతం. 244 00:19:42,391 --> 00:19:45,435 దాని తరువాత, నేను బ్లాక్ లిస్ట్ అయ్యాను. 245 00:19:46,019 --> 00:19:51,233 నా వీసాని రద్దు చేశారు. నా ప్రతిష్ట నాశనం అయింది. నా ఆవిష్కరణలు విధ్వంసం అయ్యాయి. 246 00:19:52,067 --> 00:19:53,151 అన్నీ? 247 00:19:54,069 --> 00:19:58,197 నేను ఇంకో ఐసోటోప్ ని గనుక పరిశోధిస్తే, 248 00:19:58,198 --> 00:20:01,243 మోనార్క్ నన్ను అసెట్ మేనేజ్మెంట్ లో పడేస్తుందని చెప్పారు. 249 00:20:02,411 --> 00:20:05,539 ఇదంతా హిరోషి నా దగ్గరకి రావడానికి ముందు జరిగింది. 250 00:20:06,623 --> 00:20:09,458 అతను నా టైటన్ ఫోన్ గురించి తెలుసుకోవాలని చూశాడు. 251 00:20:09,459 --> 00:20:10,878 టైటన్ ఫోనా? 252 00:20:12,337 --> 00:20:13,838 సుజూకి పరికరం. 253 00:20:13,839 --> 00:20:17,676 దాన్ని మోనార్క్ చాలా సంవత్సరాల కిందట సీజ్ చేసిందని అతనికి చెప్పాను, 254 00:20:18,343 --> 00:20:23,015 కానీ హిరోషి ఇంకొక ఫోను తయారు చేయడానికి సిద్ధమయ్యాడు. 255 00:20:23,515 --> 00:20:25,851 - హిరో కోసం. చీర్స్. - అవును. 256 00:20:31,982 --> 00:20:34,735 నేను అందరికీ మళ్లీ పోద్దాం అనుకున్నాను కానీ సీసా ఖాళీ అయిపోయింది. 257 00:20:35,819 --> 00:20:38,113 అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. 258 00:20:40,282 --> 00:20:43,076 నా పరిశోధన అతనిలో సజీవంగా నిలిచింది. 259 00:20:43,827 --> 00:20:45,120 అది నన్ను తిరిగి కోలుకునేలా చేసింది. 260 00:20:52,794 --> 00:20:54,171 ఇది కూడా ఖాళీ అయిపోయింది, జూక్. 261 00:20:55,339 --> 00:20:58,091 మంచి మందు ఎక్కడ దాస్తావో అది నాకు చెప్పచ్చు కదా? 262 00:21:09,895 --> 00:21:11,396 ఓహ్, దేవుడా. 263 00:21:19,988 --> 00:21:22,699 ఓహ్, ఛ. ఓహ్, ఛ. 264 00:21:27,371 --> 00:21:29,623 {\an8}యు.ఎస్. ఆర్మీ ఐసి 1957 అధికారిక వాడుక కోసం మాత్రమే 265 00:21:38,841 --> 00:21:41,509 హేయ్. ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు హాడ్జ్ హాల్ లో ఉంటావు అనుకున్నాను. 266 00:21:41,510 --> 00:21:43,470 మీటింగ్ త్వరగా పూర్తయింది. బ్రేక్ ఫాస్ట్ తినలేదు. నీకు ఆకలిగా ఉందా? 267 00:21:44,137 --> 00:21:45,764 కొద్ది దూరంలో ఒక హోటల్ ఉంది. 268 00:21:46,348 --> 00:21:49,267 అందులో ఫ్లాప్ జాక్స్ ఎంత బాగుంటాయి అంటే, అవి తింటే నీకు ఏడుపు వస్తుంది. 269 00:21:49,268 --> 00:21:51,060 సరే, అది నిజంగా మంచి ఆఫర్, కానీ నా మొదటి రోజు 270 00:21:51,061 --> 00:21:52,687 - నేను ఆఫీసుకి ఆలస్యం కాలేను. - నాన్ సెన్స్. 271 00:21:52,688 --> 00:21:53,980 నేను ఇప్పటికే పకెట్ కి విషయం చెప్పేశాను. 272 00:21:53,981 --> 00:21:55,773 - నేను తినేశాను, కాబట్టి… - బాబు, 273 00:21:55,774 --> 00:21:58,527 నువ్వు గనుక ఆ ఫ్లాప్ జాక్స్ తినకపోతే, నిన్ను కోర్ట్ మార్షల్ కి పంపిస్తాను. 274 00:22:01,864 --> 00:22:04,491 సరే. ఒక కప్పు కాఫీ. అంతే. 275 00:22:05,492 --> 00:22:07,411 కిందటిసారి మనం సోట కి వచ్చాం గుర్తుందా? 276 00:22:08,829 --> 00:22:11,831 అవును, న్యూ ఇయర్ సందర్భంగా. 277 00:22:11,832 --> 00:22:12,915 అవును. 278 00:22:12,916 --> 00:22:16,669 అతను అనుకోకుండా మనకి తొమ్మిది వేల డాలర్ల ఖరీదైన యమజాకి సర్వ్ చేశాడు. 279 00:22:16,670 --> 00:22:19,506 "దాన్ని మింగద్దు! తిరిగి బాటిల్ లోకి ఉమ్మేయండి!" 280 00:22:22,551 --> 00:22:24,636 నా జీవితం అలా ఉండేదని ఊహించుకోవడమే కష్టంగా ఉంది. 281 00:22:25,262 --> 00:22:28,265 విస్కీ బార్స్ కి వెళ్లడం, మంచి అమెరికన్లతో గడపడం. 282 00:22:29,183 --> 00:22:30,392 ఎవరు? నేనా? 283 00:22:34,771 --> 00:22:37,983 ఇప్పుడు, మా నాన్న రక్తం కారుతూ మట్టిలో పడి ఉంటే చూస్తూ ఉండిపోయిన కుర్రవాడిగా మిగిలాను. 284 00:22:38,984 --> 00:22:41,319 ఇలా చూడు, కెంటారో. మనం ఈ పని చేయనక్కరలేదు. 285 00:22:41,320 --> 00:22:42,403 మనం ఇంటికి వెళ్లిపోవచ్చు. 286 00:22:42,404 --> 00:22:44,239 లేదు, లేదు, నేను బాగానే ఉన్నాను. 287 00:22:47,451 --> 00:22:48,534 సోట కి దారి 288 00:22:48,535 --> 00:22:51,496 - అతను ఇవన్నీ ఎప్పుడు పెట్టాడు? - సోటకి ఇదేనా దారి? 289 00:22:57,836 --> 00:22:58,837 స్వాగతం. 290 00:22:59,838 --> 00:23:01,255 ఇద్దరి కోసం టేబులా? 291 00:23:01,256 --> 00:23:02,799 - అవును. - ఈ వైపు రండి. 292 00:23:03,634 --> 00:23:05,009 ఇది సోట రెస్టారెంట్ కాదా? 293 00:23:05,010 --> 00:23:06,177 ఏం అయింది? 294 00:23:06,178 --> 00:23:08,013 మీరు ఇదివరకటి యజమాని గురించి అడుగుతున్నారా? 295 00:23:08,889 --> 00:23:12,099 - హాయ్. - ఆయన ఏడాది కిందట దీన్ని అమ్మేశాడు, కానీ… 296 00:23:12,100 --> 00:23:15,187 కానీ మీకు ఈ రెస్టారెంట్ కూడా నచ్చుతుంది. 297 00:23:21,443 --> 00:23:23,861 లేదు, మనం ఇంకెక్కడికైనా వెళదాం. ఇది… 298 00:23:23,862 --> 00:23:26,030 లేదు, నేను… నేను సోటాలో తాగడానికి వచ్చాను. 299 00:23:26,031 --> 00:23:27,865 నేను ఒక డ్రింక్ తాగాలి. 300 00:23:27,866 --> 00:23:29,701 - స్వాగతం. - విస్కీ. 301 00:23:30,536 --> 00:23:31,994 మీ దగ్గర విస్కీ ఉందా? 302 00:23:31,995 --> 00:23:35,498 మా దగ్గర… బ్లూ రాస్బెర్రీ విస్కీ సోర్స్ ఉన్నాయి, ఫర్వాలేదా? 303 00:23:35,499 --> 00:23:37,793 సరే, కానీ బ్లూ రాస్బెర్రీ లేకుండా కావాలి. 304 00:23:46,718 --> 00:23:47,886 థాంక్యూ. 305 00:23:52,349 --> 00:23:54,017 సరే, ఇది మా నాన్న కోసం. 306 00:23:55,185 --> 00:23:57,312 నువ్వు ఎంతకాలం నుండి మద్యం తాగకుండా ఉన్నావు? 307 00:23:58,647 --> 00:24:03,151 అతను చనిపోయినందుకు నువ్వు మళ్ళీ త్రాగడం హిరోషికి ఇష్టం ఉండదు. 308 00:24:04,653 --> 00:24:06,153 రిలాక్స్, జూక్. 309 00:24:06,154 --> 00:24:08,865 హిరోషిని చంపిన ఆ రాకాసిని అంతం చేయడం ఒక్కటే ఇప్పుడు నా లక్ష్యం. 310 00:24:08,866 --> 00:24:10,741 లేదు, నువ్వు టైటన్ ని నాశనం చేయలేవు. 311 00:24:10,742 --> 00:24:12,910 లేదు, నేను చేయలేను, కానీ గాడ్జిల్లా చేయగలదు, 312 00:24:12,911 --> 00:24:14,370 దాని దృష్టినీ ఎలా ఆకర్షించాలో తెలిసిన మనిషి ఇంటికి 313 00:24:14,371 --> 00:24:16,456 నేను అనుకోకుండా రావాల్సి వచ్చింది. 314 00:24:16,957 --> 00:24:19,960 అందుకే ఇక్కడికి వస్తానని నువ్వే అడిగావు. 315 00:24:21,837 --> 00:24:24,755 నిజం చెప్పాలంటే, జూక్, మనం మనుగడ సాగించడం కోసం నేను పోరాడుతున్నాను అంతే. 316 00:24:24,756 --> 00:24:27,467 మేము ఏం చేసినా అది సఫలం కావడం లేదు… 317 00:24:28,343 --> 00:24:29,511 కానీ నేను ప్రయత్నించడం ఆపడం లేదు. 318 00:24:31,638 --> 00:24:34,057 మనం ఇప్పటికీ కోట్లాది మంది ప్రాణాల్ని కాపాడచ్చు, జూక్. 319 00:24:34,850 --> 00:24:37,519 ఆ విషయం నీకు తెలుసు. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయాలంతే. 320 00:24:43,859 --> 00:24:45,777 నువ్వు నా టొమాటోలు చూడాలి. 321 00:24:50,449 --> 00:24:54,160 నా టైటన్ ఫోన్ కి హిరోషి జోడించిన మెరుగులు చూశాక, 322 00:24:54,161 --> 00:24:57,915 ఒక కొత్తది తయారు చేయాలని నాకు ప్రేరణ కలిగింది. 323 00:24:58,916 --> 00:25:00,209 ఓహ్, సరే. 324 00:25:00,959 --> 00:25:04,837 దీన్ని ఉపయోగించి టైటన్ ని ఒక పెద్ద నగరం నుంచి దూరంగా తరిమేయగలమా? 325 00:25:04,838 --> 00:25:06,340 థియరీ ప్రకారం అది సాధ్యమే. 326 00:25:07,466 --> 00:25:09,801 మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాని వైపు తరమగలమా? 327 00:25:10,552 --> 00:25:12,678 మనం థియరీ గురించే మాట్లాడుకుంటున్నాం, కదా? 328 00:25:12,679 --> 00:25:15,223 సరే, నాకు చెప్పు. ఇది ఎలా పని చేస్తుంది? 329 00:25:15,224 --> 00:25:20,811 ఇది పని చేయలేదు. చూడు, ఇన్ని సంవత్సరాలుగా నేను ఒక తప్పు ప్రశ్న గురించి ఆలోచిస్తూ గడిపాను. 330 00:25:20,812 --> 00:25:23,523 ఇప్పుడు నాకు టైమ్ డైలేషన్ గురించి తెలిసింది గనుక, 331 00:25:23,524 --> 00:25:26,984 నేను చేయాల్సిందల్లా 332 00:25:26,985 --> 00:25:29,613 మన ప్రపంచానికి ఇంకా యాక్సిస్ ముండికి మధ్య టైమ్ వ్యత్యాసాన్ని లెక్కించాలి. 333 00:25:31,907 --> 00:25:38,080 గాడ్జిల్లాని చివరిగా ఎక్కడ చూశావు అన్నది కాదు, కానీ ఎప్పుడు చూశావు అన్నదే సరైన ప్రశ్న. 334 00:25:38,789 --> 00:25:39,790 హా. 335 00:25:46,797 --> 00:25:50,259 కొన్ని సంవత్సరాల కిందట నాకు ఫ్లూ వచ్చింది గుర్తుందా? 336 00:25:51,009 --> 00:25:53,470 నేను ఇక్కడికి మకాం మార్చేశాను. నేను ఈ కొత్త దేశానికి వచ్చి 337 00:25:54,012 --> 00:25:57,933 నా మీద నేనే జాలి పడేదానిని. 338 00:25:58,517 --> 00:26:03,730 నేను చాలా విషాదంగా, ఒంటరిగా ఉండేదాన్ని, అప్పుడు నువ్వు నా ఇంటి తలుపు తట్టి 339 00:26:04,439 --> 00:26:05,566 రామెన్ నూడుల్స్ తీసుకొచ్చి 340 00:26:06,733 --> 00:26:10,027 'బ్యాక్ టు ద ఫ్యూచర్' ట్రయాలజీలో ప్రతి సినిమాని 341 00:26:10,028 --> 00:26:11,446 వరుసగా మూడు రాత్రులూ చూపించావు. 342 00:26:13,073 --> 00:26:15,993 నా కోసం ఇంతవరకూ అందరూ చేసిన చాలా మంచి సాయాలలో అదే చాలా చక్కని సాయం. 343 00:26:18,871 --> 00:26:20,205 నిజంగా? 344 00:26:21,707 --> 00:26:24,500 నువ్వు ఇప్పటికీ ఆ మంచి వ్యక్తిగానే ఉంటూ, 345 00:26:24,501 --> 00:26:29,256 డాక్ బ్రౌన్ లా చాలా చెత్తగా నటించగలవు. 346 00:26:35,137 --> 00:26:36,138 సారీ. 347 00:26:39,224 --> 00:26:40,725 - లేదు, మరేం ఫర్వాలేదు. - చూడు, అది నా తప్పే. 348 00:26:40,726 --> 00:26:43,270 - లేదు, మరేం ఫర్వాలేదు. - నేను తప్పు రాండాని. 349 00:26:44,146 --> 00:26:45,563 విచిత్రంగా ఉంది. 350 00:26:45,564 --> 00:26:47,024 నీకు నా చెల్లి అంటే ఇష్టం, కదా? 351 00:26:48,317 --> 00:26:50,151 - కెంటారో… - సరే, నాకు తెలియదు. బహుశా… 352 00:26:50,152 --> 00:26:51,737 ఆమె నిన్ను కోరుకోదు, నిజానికి. 353 00:26:59,828 --> 00:27:01,496 నీకు కాస్త ఏకాంతాన్ని ఇవ్వదల్చుకున్నాను. 354 00:27:02,664 --> 00:27:04,082 రేపు ఉదయం కాల్ చేస్తాను. 355 00:27:14,843 --> 00:27:16,011 అవి రెండు చేయండి. 356 00:27:18,722 --> 00:27:20,432 నీ డేట్ తో నువ్వు గొడవ పడటం చూశాను. 357 00:27:21,016 --> 00:27:22,059 అందుకు సారీ. 358 00:27:23,393 --> 00:27:24,394 అది డేట్ కాదు. 359 00:27:25,854 --> 00:27:27,606 నీ అదృష్టాన్ని పరీక్షించుకున్నావు, కదా? 360 00:27:36,532 --> 00:27:37,533 చీర్స్. 361 00:27:41,328 --> 00:27:43,079 {\an8}లైవ్ - బ్రేకింగ్ న్యూస్ 362 00:27:43,080 --> 00:27:45,541 {\an8}రేపటికల్లా ఇదంతా ముగిసిపోవచ్చు, ఎవరికి తెలుసు. 363 00:27:50,754 --> 00:27:52,297 నేను కూడా చేరితే ఏమీ అనుకోరు కదా? 364 00:28:00,806 --> 00:28:01,932 ఇది విచిత్రంగా ఉంది కదా? 365 00:28:02,683 --> 00:28:03,975 ఆ నక్షత్రాలు. 366 00:28:03,976 --> 00:28:05,936 అవి వేరే కాలానికి చెందినవి. 367 00:28:06,520 --> 00:28:09,147 మనకి ఇక్కడ కనిపిస్తున్న వెలుగు, వాటి గతం. 368 00:28:09,731 --> 00:28:11,191 అది అప్పటికే జరిగిపోయింది, 369 00:28:12,276 --> 00:28:17,197 కానీ ఆ వెలుగు ఎలాగో ప్రసరిస్తూ ఉంది 370 00:28:17,781 --> 00:28:20,200 అంతరించిపోవడానికి నిరాకరించే ఒక జ్ఞాపకం మాదిరిగా. 371 00:28:21,368 --> 00:28:23,120 అది నీకు ఓదార్పుని ఇస్తుందా? 372 00:28:23,871 --> 00:28:25,622 నాకు నేను ఇదే చెప్పుకుంటాను. 373 00:28:27,749 --> 00:28:31,962 ఈ విశ్వంలో ఎక్కడో ఒక చోట… 374 00:28:34,214 --> 00:28:36,216 హిరోషి వెలుగు ఇంకా మెరుస్తూనే ఉంటుంది. 375 00:28:54,902 --> 00:28:57,571 కేట్, కదలద్దు. 376 00:28:58,322 --> 00:29:00,407 నీటిలో ఇలాంటి అలని, 377 00:29:01,491 --> 00:29:02,910 నేను గతంలో చూశాను. 378 00:29:04,411 --> 00:29:06,370 టైటన్ ఎక్స్ దగ్గరలో ఉన్నప్పుడు. 379 00:29:06,371 --> 00:29:07,456 లేదు… 380 00:29:09,374 --> 00:29:11,627 కానీ అది వేల కిలోమీటర్ల దూరంలో ఉండి ఉండాలి. 381 00:29:13,337 --> 00:29:14,338 అవును. 382 00:29:16,006 --> 00:29:17,966 ఇలా ఎప్పటి నుంచి జరుగుతోంది? 383 00:29:18,509 --> 00:29:20,344 నేను టైటన్ ఎక్స్ ని బయటకి విడిచిపెట్టిన రోజు నుంచి. 384 00:29:20,928 --> 00:29:22,971 అయితే, విమానంలో నువ్వు చెప్పింది అదే కదా. 385 00:29:23,639 --> 00:29:25,182 అదేమిటో నాకు తెలియదు. 386 00:29:26,475 --> 00:29:28,142 నాకు పిచ్చిపట్టిందని అనుకున్నాను. 387 00:29:28,143 --> 00:29:29,353 లేదు, నువ్వు అలా చేయలేదు. 388 00:29:31,772 --> 00:29:32,940 నాకు అన్నీ వివరంగా చెప్పు. 389 00:29:35,567 --> 00:29:38,278 నువ్వు అందుకుంటున్న సిగ్నల్ కొలతల్ని మనం సేకరించాలి. 390 00:29:39,154 --> 00:29:41,990 మనం సుజూకి ఎక్విప్మెంట్ లో కొంత భాగాన్ని తిరిగి ఫిట్ చేయగలుగుతాం. 391 00:29:43,158 --> 00:29:45,118 - వాళ్లు ఏం చేస్తున్నారు? - నాకు తెలియదు. 392 00:29:45,744 --> 00:29:47,037 ఎక్కడికి వెళ్తున్నావు? 393 00:29:49,206 --> 00:29:51,375 అది ఏంటి? అది ఏం చేస్తుంది? 394 00:29:51,959 --> 00:29:53,794 అంటే, మేము అదే తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. 395 00:29:55,587 --> 00:29:59,090 దాని సమర్థతని పరీక్షించాలని చూస్తున్నాం. 396 00:29:59,091 --> 00:30:00,800 మేము మౌంట్ ఒసోరీ వైపు బయలుదేరాం. 397 00:30:00,801 --> 00:30:05,388 అక్కడ ఒక రిఫ్ట్ ఉంది, 1982లో నేను ఏ రిఫ్ట్ ముందు మేలుకొన్నానో, సరిగ్గా అలాంటిదే అక్కడ ఉంది. 398 00:30:05,389 --> 00:30:07,682 యాక్సిస్ ముండికి రిఫ్ట్ ని ఓపెన్ చేయాలని చూస్తున్నావా? 399 00:30:07,683 --> 00:30:09,433 ఇప్పుడు కాదు, లేదు. 400 00:30:09,434 --> 00:30:11,270 అది సాధ్యమా కాదా అని తెలుసుకోవాలి అనుకున్నాం. 401 00:30:12,104 --> 00:30:13,689 దేని కోసం? 402 00:30:14,189 --> 00:30:16,942 ఈ ప్రపంచంలోకి ఇంకో టైటన్ ని తీసుకొచ్చే రిస్కుని ఎందుకు చేస్తున్నావు? 403 00:30:17,985 --> 00:30:19,986 గాడ్జిల్లా ఇంకో టైటన్ కాదు. 404 00:30:19,987 --> 00:30:21,822 మనం అసలు దేని గురించి మాట్లాడుతున్నాం? 405 00:30:22,489 --> 00:30:25,491 ఓహ్, దేవుడా. గాడ్జిల్లా ఇంకా టైటన్ ఎక్స్, 406 00:30:25,492 --> 00:30:27,326 వాటి మధ్య పోరాటం జరగాలని కోరుకుంటున్నావు. 407 00:30:27,327 --> 00:30:29,579 అవును, అవి ఫైట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. 408 00:30:29,580 --> 00:30:33,249 కానీ, ఈ పరికరంతో మనం నిర్ణయించే ప్రదేశంలో, సమయంలో ఆ పోరాటం జరగాలని ఆశిస్తున్నాం. 409 00:30:33,250 --> 00:30:34,918 నీకు మతి పోయిందా? 410 00:30:35,627 --> 00:30:38,547 ఒక దాని మీద మరొక దాన్ని ఉసిగొల్పడానికి అవి ఎటాక్ డాగ్స్ కావు. 411 00:30:39,715 --> 00:30:42,843 ఒకవేళ ఆ పోరాటంలో అతి పెద్ద, చాలా చెడ్డ కుక్క ఉంటే ఎలా ఉంటుంది? 412 00:30:44,178 --> 00:30:46,262 చూడండి, మనం ఇంకో రిఫ్ట్ ని ఓపెన్ చేయడం లేదు. 413 00:30:46,263 --> 00:30:49,266 - మేము కేవలం దాని సామర్ధ్యాన్ని పరీక్షిస్తున్నాం అంతే. - దాని సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాం. 414 00:30:50,017 --> 00:30:51,435 నువ్వు జనరల్స్ మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, లీ. 415 00:30:52,019 --> 00:30:55,271 మనం గాడ్జిల్లాని కంట్రోల్ చేయలేము, అది నీకు తెలుసు. 416 00:30:55,272 --> 00:30:57,024 నువ్వు నాకు తెలిసిన మనిషివి కావు. 417 00:30:59,484 --> 00:31:01,820 నాకు తెలియదు, కెయ్, బహుశా అదే మంచిదేమో. 418 00:31:03,572 --> 00:31:08,075 డాక్టర్ సుజూకి… ప్లీజ్… 419 00:31:08,076 --> 00:31:11,078 సారీ, డాక్టర్ రాండా, కానీ… 420 00:31:11,079 --> 00:31:15,166 ఏమీ చేయకుండా ఉంటే దానికి ఎక్కువ మూల్యం చెల్లించవలసి వస్తుంది. 421 00:31:15,167 --> 00:31:17,668 కానీ అవి ప్రాణమున్న జంతువులు, లీ. 422 00:31:17,669 --> 00:31:21,547 అవి మనం ఊహించే దానికన్నా చాలా తెలివైనవి ఇంకా ప్రాచీనమైనవి. 423 00:31:21,548 --> 00:31:23,883 కానీ మనం మనుషులం. 424 00:31:23,884 --> 00:31:25,218 ఆ రాకాసి జంతువుల మాదిరిగానే, 425 00:31:25,219 --> 00:31:27,930 మనం కూడా ఆహారం కోసం, మనుగడ కోసం పోరాడతాం. 426 00:31:29,056 --> 00:31:30,474 ఇది మనకీ ఇంకా ఆ జంతువులకీ మధ్య పోరాటం, కెయ్. 427 00:31:31,058 --> 00:31:33,101 కానీ చివరిలో, ఒకే ఒక్కటి ముఖ్యం అవుతుంది. 428 00:31:34,186 --> 00:31:35,187 ఎవరు గెలుస్తారు అనేది. 429 00:31:47,074 --> 00:31:48,825 జి-డే ఫుటేజ్. తాగు. 430 00:31:56,959 --> 00:31:58,043 ఏం చేస్తున్నావు? 431 00:31:58,544 --> 00:32:01,296 ఇందులో నా నెంబర్ పెడుతున్నాను. 432 00:32:02,464 --> 00:32:06,885 ఈ రోజు ఇప్పటికే నీ డేట్ తో గొడవ పడి ఉన్నావు కాబట్టి, నువ్వు డేట్ కోసం నన్ను అడగవని అర్థమైంది. 433 00:32:07,386 --> 00:32:08,595 అందుకే, నేనే చొరవ తీసుకున్నాను. 434 00:32:11,098 --> 00:32:12,140 జి-డే. తాగు. 435 00:32:18,897 --> 00:32:22,567 ఆ విధ్వంసం, ఇంకా చావుల గురించి పదేపదే చూపించడం వల్ల, ప్రజలకు అది మామూలు అయిపోయే ప్రమాదం ఉంది. 436 00:32:22,568 --> 00:32:24,069 నేను దానికి అంగీకరించను. 437 00:32:25,112 --> 00:32:26,738 మేము దాన్ని డ్రింకింగ్ గేమ్ కింద మార్చేశాము. 438 00:32:27,656 --> 00:32:28,739 నా ఉద్దేశం, అది నిజం. 439 00:32:28,740 --> 00:32:32,660 బహుశా దాని పట్ల నువ్వు సున్నితంగా ఉండకూడదు, తెలుసా? 440 00:32:32,661 --> 00:32:34,580 అందువల్ల ఆ సమయం నిజంగా వచ్చినప్పుడు, నువ్వు కంగారుపడవు. 441 00:32:35,080 --> 00:32:37,373 లేదు, టైటన్ వచ్చిందంటే, మీరంతా భయపడతారు. 442 00:32:37,374 --> 00:32:38,542 నీకు తెలుసు అనుకుంటా. 443 00:32:42,087 --> 00:32:43,088 ఏంటి? 444 00:32:43,672 --> 00:32:45,591 నేను ఇంతకుముందు టైటన్ ని చూశానని నీకెలా తెలుసు? 445 00:32:46,508 --> 00:32:49,178 నేను కేవలం… నేను ఊహించా. 446 00:32:50,762 --> 00:32:52,973 నేను… నేను… 447 00:32:54,975 --> 00:32:56,476 నేను చాలా ఎక్కువ తాగేశానని నాకు తెలుసు. 448 00:32:58,061 --> 00:32:59,645 నువ్వు ఎవరు? 449 00:32:59,646 --> 00:33:02,023 నా పేరు ఇసబెల్, నేను వాల్టర్ సిమ్మన్స్ కూతురుని. ఇంకా… 450 00:33:02,024 --> 00:33:04,901 ఆగు. ఏంటి? నా మీద నిఘా కోసం నిన్ను పంపించారా? 451 00:33:04,902 --> 00:33:06,861 లేదు, వాళ్లు పంపలేదు. 452 00:33:06,862 --> 00:33:08,404 నిన్ను కొద్దిగా వెంబడించాల్సి వచ్చింది. 453 00:33:08,405 --> 00:33:10,031 కానీ, లేదు, లేదు, లేదు. వాళ్లు నన్ను పంపలేదు. 454 00:33:10,032 --> 00:33:12,033 వాస్తవానికి వాళ్లు అసలు నిన్ను కలవద్దని చెప్పారు 455 00:33:12,034 --> 00:33:13,868 ఎందుకంటే నువ్వు చాలా కోపంగా ఉంటావని ఊహించారు. 456 00:33:13,869 --> 00:33:15,287 అది మంచి సూచనలా ఉంది. 457 00:33:15,787 --> 00:33:19,123 నాకు తెలియదు. నువ్వు నీ పోరాటాన్ని వదిలేస్తావని 458 00:33:19,124 --> 00:33:21,418 ఇంకా మోనార్క్, లేదా కేట్ కి అది విడిచిపెడతావంటే నేను నమ్మను. 459 00:33:22,252 --> 00:33:24,545 నాకు తెలిసినంత వరకూ, మీరంతా ఒక్కటే. 460 00:33:24,546 --> 00:33:26,047 వద్దు, ప్లీజ్. 461 00:33:26,048 --> 00:33:27,758 నీ అభిప్రాయం తప్పని రుజువు చేయడానికి నాకు అవకాశం ఇవ్వు. 462 00:33:33,514 --> 00:33:34,972 నువ్వు దాన్ని చూసి ఉండాల్సింది, డాడ్. 463 00:33:34,973 --> 00:33:37,183 దాని సైజు ఎంపైర్ ఎస్టేట్ అంత పెద్దగా ఉంటుంది. 464 00:33:37,184 --> 00:33:38,768 నీకు చెబుతున్నాను, అది నిప్పులు కక్కుతుంది. 465 00:33:38,769 --> 00:33:39,936 థాంక్యూ, బంగారం. 466 00:33:39,937 --> 00:33:41,103 వద్దు, వద్దు. మనకి చాలు. 467 00:33:41,104 --> 00:33:42,730 - ఆ బిల్లు తీసుకోనివ్వు. నేను వెళ్లాలి. - లేదు. 468 00:33:42,731 --> 00:33:44,941 - లీ, విను, నువ్వు ఆలస్యం కావు. - లేదు, నాన్నా. నాకు ఆలస్యం అయింది. 469 00:33:44,942 --> 00:33:46,609 - నేను రెండు గంటల ముందే అక్కడ ఉండాలి… - థాంక్యూ. 470 00:33:46,610 --> 00:33:48,444 నువ్వు ఆలస్యంగా వెళ్లడం లేదు ఎందుకంటే 471 00:33:48,445 --> 00:33:49,654 నువ్వు పకెట్ కి రిపోర్ట్ చేయడం లేదు. 472 00:33:49,655 --> 00:33:50,821 ఏంటి? 473 00:33:50,822 --> 00:33:52,156 ఆగు, ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? 474 00:33:52,157 --> 00:33:55,410 నిన్ను వియత్నాంలోని మిలటరీ సహాయక సలహా బృందానికి బదిలీ చేయించాను. 475 00:33:56,870 --> 00:33:59,164 ఇది ఫన్నీగా ఉంది. 476 00:33:59,748 --> 00:34:02,292 అవును. ఎమ్.ఎ.ఎ.జి. 477 00:34:03,293 --> 00:34:05,002 అవును, నేను ఈ ఉదయం ఆ పని మీదే ఉన్నాను. 478 00:34:05,003 --> 00:34:06,337 ఏంటి? 479 00:34:06,338 --> 00:34:08,256 ఎమ్.ఎ… నువ్వు ఏం చేశావు? 480 00:34:08,257 --> 00:34:09,799 మిలటరీ సలహాదారులా? 481 00:34:09,800 --> 00:34:10,967 అది నిజం. 482 00:34:11,802 --> 00:34:14,053 నువ్వు అలాగ ఎందుకు చేశావు? 483 00:34:14,054 --> 00:34:16,139 ఎందుకంటే నీకు ఏది మంచిదో నాకు తెలుసు గనుక. 484 00:34:16,974 --> 00:34:21,519 ఇక, నువ్వు షాక్ నుంచి తేరుకుంటే, నేను వివరిస్తాను. 485 00:34:21,520 --> 00:34:25,356 చూడు, పకెట్ ఆఫీసులో ఈ సౌకర్యవంతమైన ఉద్యోగం నీకు ముచ్చటగా అనిపించవచ్చు, 486 00:34:25,357 --> 00:34:27,524 కానీ అందరూ తలెత్తి చూసేలా నీకంటూ ఒక రికార్డు లేకపోతే 487 00:34:27,525 --> 00:34:29,610 ఆర్మీలో నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. 488 00:34:30,862 --> 00:34:33,698 డియన్ బియన్ ఫూ నగరంలో ఫ్రెంచ్ సైన్యం ఎప్పుడైతే తోక ముడిచిందో, 489 00:34:33,699 --> 00:34:35,950 మనం ఆ ప్రాంతంలో ఎక్కువ జోక్యం చేసుకోవలసి వచ్చింది, 490 00:34:35,951 --> 00:34:39,036 దాని వల్ల కొంత యుద్ధ అనుభవం వచ్చే అవకాశం ఉంది. 491 00:34:40,956 --> 00:34:44,333 నేను చేసిన తప్పులే నువ్వు చేయడం నాకు ఇష్టం లేదు. 492 00:34:44,960 --> 00:34:48,629 నేను తప్పుడు మనుషుల్ని నమ్మాను, చాలా అమాయకంగా వ్యవహరించాను. 493 00:34:48,630 --> 00:34:51,425 నేను రాజకీయాల గురించి పట్టించుకోలేదు ఇంకా… 494 00:34:52,634 --> 00:34:54,719 నా కెరీర్ లో ఎన్నో అవకాశాల్ని జారవిడుచుకున్నాను. 495 00:34:56,013 --> 00:34:57,139 ఇది ఒక మంచి కథ. 496 00:34:58,473 --> 00:35:00,641 నీ అమాయకత్వం కారణంగా నీ కెరీర్ లో నువ్వు చాలా అవకాశాలు జారవిడుచుకున్నావంటే 497 00:35:00,642 --> 00:35:01,768 నేను నమ్మాలి అంటావా? 498 00:35:03,020 --> 00:35:05,647 నువ్వు ఏదో చెప్పాలి అనుకుంటున్నావు, అది ఏంటో చెప్పేయ్. 499 00:35:06,148 --> 00:35:10,443 నేను భూగోళం అంతా పదిసార్లు చుట్టి వచ్చాను 500 00:35:10,444 --> 00:35:13,529 ఇంకా ఒక నేవల్ డిస్ట్రాయర్ అంత పెద్ద సైజు రాకాసుల్ని ప్రత్యక్షంగా చూశాను. 501 00:35:13,530 --> 00:35:15,156 నువ్వు ఊహించలేని ప్రమాదాల్ని నేను ఎదుర్కొన్నాను. 502 00:35:15,157 --> 00:35:18,660 అవును, ఐదేళ్ల తరువాత, నువ్వు చెప్పుకోవడానికి ఏం మిగిలింది? 503 00:35:22,122 --> 00:35:26,125 నాన్నా. ఈ రాకాసి జంతువులు ఎలా వ్యవహరిస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా… 504 00:35:26,126 --> 00:35:30,004 మేము ప్రజల్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాము. 505 00:35:30,005 --> 00:35:32,549 లీ, అవి మనతో పాటు ఎలా జీవించాలో నేర్చుకుంటాయి అనుకుంటున్నావా? 506 00:35:33,967 --> 00:35:35,885 అవి మనల్ని అర్థం చేసుకోవాలని నువ్వు ఆశిస్తున్నావా? 507 00:35:35,886 --> 00:35:38,013 లేదు. అవి మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాయి. 508 00:35:38,722 --> 00:35:42,975 వాటికి మనుగడే ముఖ్యం, ఇంకా ఒక ఘోరమైన రహస్యం చెబుతాను విను. 509 00:35:42,976 --> 00:35:44,936 మన మనుషులకి కూడా మనుగడే ముఖ్యం. 510 00:35:44,937 --> 00:35:47,773 ఎందుకంటే చివరికి, ఒకే ఒక్కటి ముఖ్యం అవుతుంది. 511 00:35:48,273 --> 00:35:49,650 ఎవరు గెలుస్తారు అనేది. 512 00:35:52,736 --> 00:35:54,947 ఎవరు గెలుస్తారు అనేది, హా, అదే ముఖ్యం అవుతుంది. 513 00:36:03,497 --> 00:36:07,167 లీ, ఇది నన్ను ఇబ్బంది పెడుతోంది. 514 00:36:08,877 --> 00:36:09,878 ఏంటి? 515 00:36:10,462 --> 00:36:13,131 గాడ్జిల్లా బయటకి వస్తే ఏం అవుతుంది? 516 00:36:40,450 --> 00:36:43,161 ఎమర్జెన్సీ హెచ్చరిక 517 00:36:58,260 --> 00:36:59,428 కెంటారో! 518 00:37:00,679 --> 00:37:03,473 హమ్మయ్య, నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను చాలా కంగారు పడ్డాను. 519 00:37:25,495 --> 00:37:26,704 ఓహ్, ఛ. 520 00:37:26,705 --> 00:37:28,290 మే! వెళదాం పద. 521 00:37:58,153 --> 00:37:59,695 - కేట్? - మరేం ఫర్వాలేదు. 522 00:37:59,696 --> 00:38:01,365 అది మనకి హాని చేయదని చెప్పాను కదా. 523 00:38:26,515 --> 00:38:28,725 నువ్వు బాగానే ఉన్నావా? 524 00:38:33,647 --> 00:38:34,898 బతికించావు. 525 00:38:39,152 --> 00:38:40,988 నీకేం కాలేదు కదా? 526 00:38:48,829 --> 00:38:50,747 {\an8}మీ కొత్త ఇంటికి స్వాగతం, కెప్టెన్. 527 00:38:53,375 --> 00:38:54,376 సర్. 528 00:38:55,294 --> 00:38:57,796 {\an8}- థాంక్యూ, ప్రైవేట్, నువ్వు ఇంక వెళ్లచ్చు. - హావ్ ఎ గుడ్ డే, సర్. 529 00:39:59,358 --> 00:40:01,276 నేను ఇసబెల్ ని. మీ సందేశం చెప్పండి. 530 00:40:01,985 --> 00:40:03,028 నేను కెంటారోని. 531 00:40:05,447 --> 00:40:06,615 నా అభిప్రాయం తప్పని రుజువు చేయి. 532 00:40:20,212 --> 00:40:23,757 మనం పరిష్కారాలు వెతకాలి ఇంకా గాడ్జిల్లాని లీ మేల్కొలిపే ముందే టైటన్ ఎక్స్ ని వెతికి పట్టుకోవాలి. 533 00:40:24,633 --> 00:40:27,301 నీకు కలుగుతున్న అనుభూతి గనుక టైటన్ ఎక్స్ నుంచి వస్తున్నట్లయితే, 534 00:40:27,302 --> 00:40:29,930 అప్పుడు బహుశా నీకు అందుతున్న సిగ్నల్ ద్వారా దాన్ని చేరుకునే మార్గం తెలుసుకోవచ్చు. 535 00:40:34,726 --> 00:40:36,228 మనం మళ్లీ ప్రయత్నిద్దాం. 536 00:40:43,026 --> 00:40:45,444 - రెడీ? - నీరు ఇంకా ఎలక్ట్రిసిటీ. 537 00:40:45,445 --> 00:40:46,863 పొరపాటు అయ్యే అవకాశం ఏదీ? 538 00:40:46,864 --> 00:40:49,866 ఈ ట్రాన్స్ డ్యూసర్ నీ శరీరంలోకి ప్రసరించే అలల్ని 539 00:40:49,867 --> 00:40:51,577 ఎలక్ట్రిక్ సిగ్నల్స్ గా మార్చడం ద్వారా మనం విశ్లేషించవచ్చు. 540 00:41:09,553 --> 00:41:10,888 నీకు ఏమైనా రీడింగ్ వస్తోందా? 541 00:41:14,266 --> 00:41:15,809 ఆంపరేజ్ తక్కువగా ఉంది. 542 00:41:17,477 --> 00:41:18,937 సిగ్నల్ చాలా బలహీనంగా ఉంది. 543 00:41:19,771 --> 00:41:22,774 నువ్వు ఇంకాస్త నీటిలో మునిగితే, మనకి సిగ్నల్ బలంగా అందవచ్చు. 544 00:41:25,944 --> 00:41:27,029 నాకు భయంగా ఉంది. 545 00:41:29,489 --> 00:41:31,200 కిందటిసారి నేను దానికి దగ్గరగా వెళ్లినప్పుడు… 546 00:41:33,285 --> 00:41:34,369 నాకు తెలుసు. 547 00:41:34,953 --> 00:41:37,663 కేట్, మనం నిదానంగా వెళదాం. 548 00:41:37,664 --> 00:41:39,917 నువ్వు ఎంత వీలైతే అంత లోతుకి వెళ్లు చాలు. 549 00:41:40,751 --> 00:41:42,044 ఎక్కడ ఆపాలో నీకు తెలుస్తుంది. 550 00:41:43,629 --> 00:41:44,796 నాకు తెలియకపోతే? 551 00:41:46,757 --> 00:41:47,758 నేను చెబుతాను. 552 00:41:49,927 --> 00:41:50,928 నేను ఉన్నాను కదా. 553 00:42:14,826 --> 00:42:15,911 ఓహ్, దేవుడా. 554 00:42:16,995 --> 00:42:17,996 ఇది పని చేస్తోంది. 555 00:43:09,715 --> 00:43:10,966 కేట్. 556 00:43:11,466 --> 00:43:13,009 నువ్వు సాధించావు. 557 00:43:13,010 --> 00:43:14,343 విను. 558 00:43:14,344 --> 00:43:15,554 రివైండ్ 559 00:43:17,306 --> 00:43:18,432 స్టాప్ - ప్లే 560 00:43:32,070 --> 00:43:33,071 ఇది ఏంటి? 561 00:43:34,656 --> 00:43:35,908 ఇది విన్నావా? 562 00:43:39,786 --> 00:43:40,871 అది భయంతో అరుస్తోంది. 563 00:43:43,081 --> 00:43:44,082 అది భయం. 564 00:43:51,298 --> 00:43:53,300 అది… అది పోయింది అనుకుంటా. 565 00:44:12,402 --> 00:44:13,403 అవును, అది ఇదే, జూక్. 566 00:44:14,279 --> 00:44:15,739 నేను బయటపడిన ప్రదేశం ఇదే. 567 00:44:17,032 --> 00:44:21,244 అయితే టైమ్ డైలేషన్ ని లెక్కించడం ద్వారా 568 00:44:21,245 --> 00:44:23,747 మనం గాడ్జిల్లా ఆచూకీని తెలుసుకోగలమో లేదో చూద్దాం. 569 00:44:27,209 --> 00:44:28,501 ఏం అయింది? 570 00:44:28,502 --> 00:44:33,005 ఈ రిఫ్ట్ లో నిక్షిప్తమై ఉన్న ఎనర్జీ, ఇంకా మనం జోడిస్తున్న పవర్ జత కలిసి 571 00:44:33,006 --> 00:44:36,218 క్వాంటమ్ ఆటంకాల్ని సృష్టించగలుగుతున్నాయి. 572 00:44:38,136 --> 00:44:40,931 ఈ ఇంటర్ఫియరెన్స్ ని పక్కకి తప్పించడానికి ఒక మార్గం ఉంది. 573 00:44:41,515 --> 00:44:43,558 ఈ రీడింగ్స్ ని సేకరించడానికి ఒక పరికరం కావాలి. 574 00:44:43,559 --> 00:44:45,143 ఒక పరికరం. అది వినడానికి బాగుంది. 575 00:44:49,940 --> 00:44:50,941 నేనే ఆ పరికరాన్నా? 576 00:44:51,567 --> 00:44:53,735 అయితే, బెంజమిన్ ఫ్రాంక్లిన్ గాలిపటం మాదిరిగానా? 577 00:44:54,319 --> 00:44:56,988 సరే, అలాగే. ఒక రకంగా. 578 00:44:56,989 --> 00:44:59,740 ఏ మనిషీ వెళ్లలేనంత దగ్గరగా 579 00:44:59,741 --> 00:45:02,452 నువ్వు రిఫ్ట్ కి దగ్గరగా వెళ్లవలసి ఉంటుంది. 580 00:45:03,120 --> 00:45:05,038 ఇక్కడ అత్యంత ప్రమాదకరమైనది ఏం జరగచ్చు? 581 00:45:05,706 --> 00:45:07,416 ప్రమాదం ఏం జరగచ్చు… 582 00:45:08,750 --> 00:45:09,751 నాకు తెలియదు. 583 00:45:23,015 --> 00:45:24,349 ఓహ్, దేవుడా. లీ. 584 00:45:24,850 --> 00:45:26,393 సారీ, నేనే లోపలికి వచ్చేశాను. నేను… 585 00:45:27,186 --> 00:45:29,229 వీకెండ్ లో నువ్వు ఇక్కడ పని చేస్తుంటావని ఊహించాను. 586 00:45:50,542 --> 00:45:54,670 లీ, నేను… నిన్ను ఉండమని గట్టిగా ఒప్పించలేకపోయినందుకు నేను నీకు సారీ చెప్పాలి. 587 00:45:54,671 --> 00:45:55,838 లేదు, లేదు. 588 00:45:55,839 --> 00:45:58,257 నేను ఉండాలనే అనుకున్నాను, కానీ అప్పటికే నీ మనసులో ఒక నిర్ణయం తీసుకున్నావు 589 00:45:58,258 --> 00:46:00,384 ఇంకా మన మధ్య ఏర్పడిన పరిస్థితులు కూడా… 590 00:46:00,385 --> 00:46:02,763 నేను… అవును. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే… 591 00:46:04,389 --> 00:46:06,141 నేను ఏం చెప్పదల్చుకున్నానంటే 592 00:46:06,975 --> 00:46:11,813 మీరు ఇద్దరూ దానికి సమ్మతించినా… 593 00:46:13,899 --> 00:46:15,567 నేను అందుకు సిద్ధమని ఖచ్చితంగా చెప్పలేను. 594 00:46:20,072 --> 00:46:24,492 కెయ్, నువ్వు ఇక్కడ చేస్తున్న పని, అది చాలా ముఖ్యమైనది 595 00:46:24,493 --> 00:46:27,621 ఇంకా నేను ప్రామిస్ చేస్తున్నాను 596 00:46:28,330 --> 00:46:31,333 మోనార్క్ విషయంలో నాకు ఉన్న ఫీలింగ్స్ ని నేను పక్కన పెట్టేస్తాను. 597 00:46:32,209 --> 00:46:36,672 ఆ ఉద్యోగంలో చేరే అవకాశం ఇంకా ఉండి ఉంటే. 598 00:46:43,220 --> 00:46:44,304 ఖచ్చితంగా. 599 00:46:45,722 --> 00:46:47,933 నీ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు, లీ. 600 00:46:50,435 --> 00:46:51,770 కెయ్. 601 00:46:52,354 --> 00:46:53,605 నీ మనసు మారడానికి కారణం ఏంటి? 602 00:46:55,148 --> 00:46:57,525 నా భవిష్యత్తు గురించి నాకు భయమేసింది 603 00:46:57,526 --> 00:46:59,736 ఎందుకంటే నా పక్కన తెలివైన వాళ్లు ఎవరూ ఉండరని అనిపించింది. 604 00:47:05,701 --> 00:47:07,451 నువ్వు అలా అనవు… 605 00:47:07,452 --> 00:47:10,372 ఈ యూరల్స్ పర్వతాల గుండా బిల్లీ రూపొందించిన రూట్ చూశావంటే అలా అనవు. 606 00:47:11,415 --> 00:47:15,668 సోవియెట్ పవర్ ప్లాంట్ లో ఒక సంఘటన జరిగింది. 607 00:47:15,669 --> 00:47:18,379 ఒక వంద మైళ్ల దూరం వరకూ ఆ ప్రాంతంలో రాకపోకల్ని నిషేధించారు. 608 00:47:18,380 --> 00:47:20,089 అక్కడ ఇంకేదో జరుగుతోందని నా అనుమానం. 609 00:47:20,090 --> 00:47:21,466 సరే. అది ఎక్కడ ఉంది? 610 00:47:21,967 --> 00:47:22,968 కజకస్తాన్. 611 00:47:27,097 --> 00:47:30,224 ఓహ్, సరే. వీటిని కలిపి అనుసంధానం చేయాలి ఎందుకంటే… 612 00:47:30,225 --> 00:47:33,853 ఒక తుఫాను మధ్యలో మాట్లాడాలని ఎప్పుడయినా ప్రయత్నించావా? 613 00:47:33,854 --> 00:47:34,937 - అర్థమైంది. - సరే. 614 00:47:34,938 --> 00:47:36,272 సరే, నన్ను ఎక్కడకి వెళ్లమంటావు? 615 00:47:36,273 --> 00:47:38,191 కొద్దిగా దూరంగా వెళ్లు. 616 00:47:38,192 --> 00:47:40,610 - ఎంత దూరం? ఇది సరిపోతుందా? - హా, దాదాపు. సరే, చాలు. అంతే. 617 00:47:40,611 --> 00:47:41,694 సరే. సరే. 618 00:47:41,695 --> 00:47:43,196 శాంపిల్ 619 00:47:43,197 --> 00:47:45,406 అంతే. హా, సరిగ్గా అక్కడే ఉండు, అక్కడే ఉండు. 620 00:47:45,407 --> 00:47:46,408 సరే. 621 00:47:53,707 --> 00:47:54,708 సరే. 622 00:47:58,253 --> 00:48:00,130 సరే. వెనక్కి జరుగు. 623 00:48:14,144 --> 00:48:15,479 కంగారుపడకు, జూక్. కంగారుపడకు. 624 00:48:18,106 --> 00:48:19,440 అది పని చేస్తోందా? 625 00:48:19,441 --> 00:48:21,317 అది ఏదో గుర్తిస్తోంది. 626 00:48:21,318 --> 00:48:23,278 అది టైటన్ అవునో కాదో తెలియదు. 627 00:48:27,282 --> 00:48:29,534 ఇక్కడ నాకు బలమైన సిగ్నల్ అందుతోంది, జూక్. 628 00:48:29,535 --> 00:48:31,286 నువ్వు గాడ్జిల్లాని అందుకొంటున్నావా? 629 00:48:32,120 --> 00:48:33,705 ఇది ఏదో జంతువుని గుర్తించింది. 630 00:48:34,623 --> 00:48:36,166 కానీ అది గాడ్జిల్లా కాదనుకుంటా. 631 00:48:42,589 --> 00:48:45,300 దాని తీవ్రత తగ్గించు! ఇది నన్ను లాగేస్తోంది. 632 00:48:45,926 --> 00:48:47,051 కానివ్వు, జూక్! 633 00:48:47,052 --> 00:48:48,345 జూక్! 634 00:48:48,929 --> 00:48:50,346 సరే. 635 00:48:50,347 --> 00:48:53,683 జూక్, నాకు ఇక్కడ చోటు దొరకడం లేదు. నిజంగా చెబుతున్నాను, దాన్ని ఆపు! వెంటనే పవర్ ఆఫ్ చేయి! 636 00:48:53,684 --> 00:48:54,685 నేను ఆఫ్ చేసేశాను. 637 00:49:18,333 --> 00:49:19,334 వోహ్. 638 00:49:21,170 --> 00:49:22,254 అది చూశావా? 639 00:49:22,754 --> 00:49:23,755 అది చూశావా? 640 00:49:24,256 --> 00:49:25,548 ఏంటి… అది ఏంటి? 641 00:49:25,549 --> 00:49:26,842 ఏంటి చూడటం? 642 00:49:27,926 --> 00:49:31,096 నా పరికరాలు ఏవో గుర్తిస్తున్నాయి, కానీ అవి ఏంటో అర్థం కావడం లేదు. 643 00:49:31,680 --> 00:49:33,347 ఎవరు పట్టించుకుంటారు? ఇది గొప్పగా జరిగింది. 644 00:49:33,348 --> 00:49:35,516 మనం ఇప్పుడు ఏం చేశామో నాకు కనీసం తెలియదు, నీకు తెలుసా? 645 00:49:35,517 --> 00:49:36,810 తెలియదు. 646 00:49:46,403 --> 00:49:47,571 కంట్రోల్? 647 00:49:48,739 --> 00:49:51,325 కంట్రోల్, నా మాట వినిపిస్తోందా? ఓవర్. 648 00:49:52,159 --> 00:49:53,243 ఎవరది? 649 00:49:54,578 --> 00:49:55,996 నేను ఎవరితో మాట్లాడుతున్నాను? 650 00:49:58,624 --> 00:50:01,084 నేను మేజర్ లెల్యాండ్ లాఫాయేట్ షా 3. 651 00:50:01,793 --> 00:50:03,629 నా సిబ్బంది చనిపోయారు. 652 00:50:04,588 --> 00:50:06,131 నా వాహనం పాడైపోయింది. 653 00:50:06,840 --> 00:50:08,133 నాకు ఆహారం లేదు. 654 00:50:10,093 --> 00:50:13,096 కంట్రోల్, నన్ను తరలించాలి. 655 00:51:22,040 --> 00:51:24,042 తెలుగు అనువాదకర్త: హరీష్