1 00:00:17,561 --> 00:00:19,521 సీసీ బెల్ రచించిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 2 00:00:36,246 --> 00:00:38,415 నా పేరు సీసీ బెల్. 3 00:00:39,040 --> 00:00:40,250 నా చిన్నతనంలో, 4 00:00:40,333 --> 00:00:45,422 వర్జీనియాలోని ఒక చిన్న ఊరిలో ఈ విశాలమైన పాత ఇంట్లో ఉండేదాన్ని. 5 00:00:46,423 --> 00:00:50,385 ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ 6 00:00:50,468 --> 00:00:53,013 నేను బాగా అల్లరి చేసేదాన్ని. 7 00:00:53,096 --> 00:00:55,891 అమ్మ వస్తువులతో నా ఇష్టం వచ్చినట్టు ఆడుకొనేదాన్ని... 8 00:00:56,975 --> 00:00:58,852 లిప్ స్టిక్ తో నీకేం పని, పాపా? 9 00:01:00,437 --> 00:01:01,479 ...నాన్నని ఆటపట్టించేదాన్ని... 10 00:01:03,940 --> 00:01:06,610 నా బంగారు అల్లరి పిల్ల, సీసీ. 11 00:01:06,693 --> 00:01:12,032 ...అక్క, సారాతో, ఇంకా అన్న, యాష్లీతో టీవీ బాగా చూసేదాన్ని. 12 00:01:16,369 --> 00:01:18,955 మైటీ బోల్ట్, తన విద్యుత్ శక్తితో 13 00:01:19,039 --> 00:01:23,335 నగరాన్ని కాపాడతాడు 14 00:01:24,753 --> 00:01:27,714 నా జీవితమే మారిపోయిన ఆ భయంకరమైన రోజు కూడా 15 00:01:27,797 --> 00:01:29,799 ఇంకా నాకు గుర్తుంది. 16 00:01:29,883 --> 00:01:33,803 - తల నొప్పిరా బాబోయ్! - సీసీ, ఏమైంది నీకు? 17 00:01:35,430 --> 00:01:37,057 సీసీ? సీసీ! 18 00:01:38,099 --> 00:01:40,060 అమ్మా, సీసీకి ఏదో అవుతోంది. 19 00:01:43,772 --> 00:01:44,898 సీసీ. 20 00:01:50,320 --> 00:01:51,321 ఓరి దేవుడా! 21 00:01:52,322 --> 00:01:53,490 సీసీ? 22 00:01:55,075 --> 00:01:56,493 ఒళ్ళు బాగా వేడెక్కింది. 23 00:01:57,327 --> 00:01:58,370 జార్జ్! 24 00:01:58,453 --> 00:02:01,289 - ఏంటి? ఏం జరుగుతోంది? - మనం ఏదోకటి చేయాలి! - ఏంటి? ఏం జరుగుతోంది? - మనం ఏదోకటి చేయాలి! 25 00:02:01,373 --> 00:02:04,376 సరే. ఆసుపత్రికి తీసుకెళ్దాం పదండి. 26 00:02:05,710 --> 00:02:07,796 నేను ఉన్నాలే, బంగారం, నిబ్బరంగా ఉండు. 27 00:02:10,715 --> 00:02:12,676 ఇన్ఫెక్షన్ తీవ్రంగా వచ్చింది. 28 00:02:12,759 --> 00:02:14,094 అయ్యయ్యో. 29 00:02:14,177 --> 00:02:16,930 మేము తనకి మందులు ఇచ్చి, తన పురోగతిని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం. 30 00:02:17,013 --> 00:02:21,017 తనని బాగా చూసుకుంటాం, కానీ కొంత సమయం అయితే పడుతుంది. 31 00:02:43,707 --> 00:02:47,627 కంగారుపడకు, సీసీ. అంతా సర్దుకుంటుంది. 32 00:03:23,204 --> 00:03:25,916 అంతా నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించింది. 33 00:03:38,511 --> 00:03:42,307 అంతా నిరాశాజనకంగానే ఉందనుకోకండి. నేను చాలా బొమ్మలని గీశాను. 34 00:03:46,186 --> 00:03:47,270 ...చాలా బాగుంది. 35 00:03:53,693 --> 00:03:56,613 నాకు మంచి మంచి గిఫ్ట్స్ వచ్చాయి! 36 00:04:09,709 --> 00:04:12,003 నేను కోలుకోవడం మొదలుపెట్టాను. 37 00:04:17,175 --> 00:04:19,970 ఎట్టకేలకు ఇంటికి వెళ్లే సమయం వచ్చేసింది. 38 00:04:20,929 --> 00:04:22,347 సుస్వాగతం, సీసీ. 39 00:04:28,311 --> 00:04:33,900 ఇక ఆసుపత్రిలోనే ఉండిపోతానేమో అని చాలా భయపడిపోయాను. 40 00:04:35,610 --> 00:04:39,614 అందుకే అమ్మ దగ్గరే ఉండేదాన్ని, తను ఎక్కడికి వెళ్లినా తన దగ్గరే ఉండేదాన్ని. 41 00:04:44,995 --> 00:04:47,998 కానీ ఒక రోజు, అమ్మ మాటలు వినబడలేదు. 42 00:04:48,498 --> 00:04:50,667 అమ్మా? అమ్మా? 43 00:05:04,848 --> 00:05:09,227 అప్పుడే నాకు విషయం అర్థమైంది, అమ్మది కూడా అర్థమైనట్టు ఉంది. 44 00:05:10,145 --> 00:05:12,230 నాకు వినికిడి శక్తి పోయింది. 45 00:05:14,441 --> 00:05:16,776 ఆడియాలజీ 46 00:05:53,146 --> 00:05:54,898 దీన్ని ఇక్కడికి తెచ్చి చూద్దాం. 47 00:06:06,743 --> 00:06:08,078 పరీక్ష ఎలా జరుగుతుంది? 48 00:06:08,161 --> 00:06:10,747 తనకి వినికిడి శక్తి చాలా వరకు పోయినట్టుంది. 49 00:06:15,544 --> 00:06:21,132 అతను నాకు చెవిటి మెషిన్ కావాలన్నాడు, ఒక వారం తర్వాత, నాకోసం ఒకటి తెప్పించారు. 50 00:06:34,229 --> 00:06:36,022 ...ఇక చూసుకో. సూపర్! 51 00:06:43,154 --> 00:06:44,698 నీకు వినబడుతోందా? 52 00:06:46,825 --> 00:06:50,495 - సీసీ? నా మాటలు వినబడుతున్నాయా? - వినబడుతున్నాయి. 53 00:06:51,746 --> 00:06:54,624 వినబడుతున్నాయి, 54 00:06:54,708 --> 00:06:59,004 కానీ నా గొంతుతో సహా అందరి గొంతులూ విచిత్రంగా వినబడుతున్నాయి. 55 00:06:59,087 --> 00:07:02,549 కంగారు పడకండి. తను దీనికి అలవాటు పడిపోవడానికి ఎంతో సమయం పట్టదు. కంగారు పడకండి. తను దీనికి అలవాటు పడిపోవడానికి ఎంతో సమయం పట్టదు. 56 00:07:02,632 --> 00:07:05,135 లాలీపాప్ కావాలా, సీసీ? 57 00:07:19,065 --> 00:07:21,234 అయ్యయ్యో. 58 00:07:36,458 --> 00:07:39,336 హలో? హలో? 59 00:07:41,213 --> 00:07:42,839 చాలా వింతగా ఉంది. 60 00:07:48,178 --> 00:07:51,556 - అమ్మ సోడా తెచ్చిందంటే నమ్మలేకపోతున్నా! - అవును, కదా? 61 00:07:51,640 --> 00:07:53,183 మనం చాలా అదృష్టవంతులం. 62 00:08:02,359 --> 00:08:06,154 ఈ చెవిటి మెషిన్ వల్ల నేనేమైనా వింతగా కనిపిస్తున్నానా? 63 00:08:06,238 --> 00:08:08,490 అదేం లేదు! నువ్వు బాగానే కనిపిస్తున్నావు. 64 00:08:08,573 --> 00:08:11,618 కానీ నీ గొంతు కాస్త తమాషాగా ఉంది. 65 00:08:11,701 --> 00:08:14,663 అంటే, ఇంతకు ముందుతో పోలిస్తే కాస్త మారింది. 66 00:08:14,746 --> 00:08:19,751 ఏంటి? నా గొంతు తమాషగా ఉందా? మీ గొంతులే తమాషాగా ఉన్నాయి! 67 00:08:26,925 --> 00:08:28,802 ఆ రోజుల్లో నాకెప్పుడు బాధగా అనిపించినా, 68 00:08:28,885 --> 00:08:30,720 నేను టీవీ పెట్టుకొనేదాన్ని, 69 00:08:32,264 --> 00:08:35,517 ఆ శబ్దమే నాకు నిజంగా అనిపించేది. 70 00:08:45,318 --> 00:08:49,823 ఇక స్కూల్లో చేరే సమయం వచ్చేసరికి, నాకు చాలా భయం పుట్టింది. 71 00:08:52,993 --> 00:08:55,036 నాకు ఇతరులు చెప్పేది అర్థమవుతుందా? 72 00:08:55,120 --> 00:08:56,538 వచ్చేశాం! 73 00:08:57,706 --> 00:09:00,333 చూడు, సీసీ. ఇది చాలా బాగుంది కదా? చూడు, సీసీ. ఇది చాలా బాగుంది కదా? 74 00:09:00,417 --> 00:09:03,044 నేను చెప్పేది ఎవరికైనా అర్థమవుతుందా? 75 00:09:03,128 --> 00:09:04,254 ఎవరు వచ్చారు? 76 00:09:05,672 --> 00:09:07,549 హాయ్, నా పేరు వెండీ. 77 00:09:09,384 --> 00:09:10,552 హాయ్. 78 00:09:13,263 --> 00:09:14,973 తనకి కూడా చెవిటి మెషిన్ ఉంది. 79 00:09:18,518 --> 00:09:19,978 లోపలికి రా! 80 00:09:20,061 --> 00:09:22,272 వచ్చి ఇక్కడ కూర్చోరాదూ! 81 00:09:24,774 --> 00:09:25,942 సరే. 82 00:09:26,026 --> 00:09:27,444 బై, అమ్మా. 83 00:09:28,069 --> 00:09:29,905 వచ్చి నా పక్కన కూర్చో! 84 00:09:31,114 --> 00:09:36,661 అందరికీ నమస్తే. నా పేరు డార్న్, నేను మీ కొత్త టీచర్ ని. 85 00:09:36,745 --> 00:09:40,123 ఈ సంవత్సరం మనం చాలా నేర్చుకోబోతున్నాం, 86 00:09:40,206 --> 00:09:43,543 కానీ ఇవాళ మనం లిప్ రీడింగ్ గురించి తెలుసుకుందాం. 87 00:09:45,337 --> 00:09:50,175 లిప్ రీడింగ్ అంటే ఇతరుల మాట్లాడేటప్పుడు వారి పెదాలను గమనించడం, 88 00:09:50,258 --> 00:09:52,761 తద్వారా మీరు వాళ్లు మాట్లాడేది మరింత బాగా అర్థం చేసుకోగలరు. 89 00:09:54,346 --> 00:09:56,806 ప్రాక్టికల్ గా చూపితే మరింత బాగా ఆర్థమవుతుందనుకుంటా. 90 00:09:57,307 --> 00:09:58,892 సీసీ, నువ్వు సహాయపడగలవా? 91 00:10:00,769 --> 00:10:01,853 సరే. 92 00:10:01,937 --> 00:10:07,067 సరే, సీసీ. లిప్ రీడింగ్ కోసం నువ్వు ఏం చూడాలో చెప్పు. 93 00:10:07,984 --> 00:10:10,737 - పెదాలనే కదా? - అవును! సరిగ్గా చెప్పావు. 94 00:10:11,238 --> 00:10:15,200 మరి నేను ఇలా చేసినప్పుడు నేనేం చెప్తున్ననో నువ్వు చెప్పగలవా? 95 00:10:18,411 --> 00:10:19,621 మీరేం అన్నారో నాకు తెలీదు. 96 00:10:19,704 --> 00:10:22,540 మరేం పర్వాలేదు. ఇప్పుడు చెప్పు. 97 00:10:22,624 --> 00:10:24,417 హలో, సీసీ. 98 00:10:25,377 --> 00:10:27,170 హలో, సీసీ? 99 00:10:27,254 --> 00:10:30,423 అంతే! నువ్వు నా పెదాలను చూస్తూ విని, 100 00:10:30,507 --> 00:10:32,425 నేనేం చెప్పానో తెలుసుకున్నావు. 101 00:10:32,509 --> 00:10:34,219 అదే లిప్ రీడింగ్ అంటే. 102 00:10:34,302 --> 00:10:35,929 మేము బదిరుల బాషను కూడా నేర్చుకున్నామా అని 103 00:10:36,012 --> 00:10:39,099 మీరు తెలుసుకోవలనుకుంటుంటే, మేము అది నేర్చుకోలేదు. 104 00:10:39,599 --> 00:10:41,768 ఆ రోజుల్లో, చాలా మంది చెవిటి పిల్లలకు 105 00:10:41,851 --> 00:10:44,688 లిప్ రీడింగ్ మాత్రమే నేర్పేవారు. 106 00:10:44,771 --> 00:10:49,442 ఇతరులు మాట్లాడేటప్పుడు వారి హావభావాలను చూసినప్పుడు కూడా మీకు బాగా అర్థమవుతుంది. 107 00:10:50,277 --> 00:10:53,029 నాకు బాధగా ఉంది. 108 00:10:53,613 --> 00:10:55,365 నాకు బాధగా ఉంది! 109 00:10:55,448 --> 00:10:58,702 బాగా చెప్పావు! ఇప్పుడు ఇది చెప్పు. 110 00:10:58,785 --> 00:11:01,329 నాకు చాలా ఆనందంగా ఉంది! నాకు చాలా ఆనందంగా ఉంది! 111 00:11:01,413 --> 00:11:05,125 - నాకు చాలా ఆనందంగా ఉంది! - అవును. అంతే! 112 00:11:05,208 --> 00:11:10,088 నీకు లిప్ రీడింగ్ వచ్చేసినందుకు నాకు నిజంగానే చాలా ఆనందంగా ఉంది. 113 00:11:10,797 --> 00:11:12,257 సరే, అందరూ నేను చెప్పేది వినండి. 114 00:11:12,340 --> 00:11:13,967 మీరు ఇంటికి చేరుకున్నప్పుడు, 115 00:11:14,050 --> 00:11:17,596 మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లిప్ రీడింగ్ ని ప్రాక్టీస్ చేయండి. 116 00:11:17,679 --> 00:11:22,601 ఇవాళ రాత్రి డిన్నర్ కి నాటు కోడి కూర, మటన్ కుర్మా చేశాను. 117 00:11:22,684 --> 00:11:26,563 - నాటు కోడి కూడా, మటన్ కుర్మా! - అవును! సరిగ్గా చెప్పావు! 118 00:11:26,646 --> 00:11:28,607 కానీ డార్న్ చెప్పని విషయమేంటంటే, 119 00:11:28,690 --> 00:11:33,361 చాలా సార్లు లిప్ రీడింగ్ అనేది కష్టం అవుతుంది. 120 00:11:33,445 --> 00:11:35,405 జనాలు అరిచినప్పుడు... 121 00:11:37,574 --> 00:11:38,575 ఏంటి? 122 00:11:41,244 --> 00:11:42,829 ...జనాలకు మీసాలు ఉన్నప్పుడు... 123 00:11:48,418 --> 00:11:51,129 నోట్లో ఆహారం ఉండగా మాట్లాడినప్పుడు. 124 00:11:55,342 --> 00:11:59,095 అప్పుడప్పుడూ, మనకి ఇతరుల పెదాలు అస్సలు కనిపించవు! 125 00:12:03,850 --> 00:12:05,393 ఏంటి? 126 00:12:12,275 --> 00:12:15,153 "ఐస్ క్రీమ్." నువ్వు అన్నది అదే కదా! 127 00:12:15,237 --> 00:12:17,572 నేను "డెసర్ట్" అన్నాను. 128 00:12:17,656 --> 00:12:19,199 రెండూ ఒకటే కదా! 129 00:12:21,326 --> 00:12:23,286 - వావ్! - కానీ దారుణమైన విషయమేంటంటే, 130 00:12:23,370 --> 00:12:25,872 అందరూ ఒకేసారి మాట్లాడినప్పుడు. 131 00:12:25,956 --> 00:12:27,666 అప్పుడు చచ్చింది గొర్రె. 132 00:12:30,377 --> 00:12:31,545 ఏంటి? 133 00:12:38,802 --> 00:12:40,845 ఇది అసంభవంరా నాయనోయ్. 134 00:12:42,681 --> 00:12:45,058 నిన్న రాత్రి అందరూ లిప్ రీడింగును ప్రాక్టీస్ చేశారా? 135 00:12:45,642 --> 00:12:46,935 ప్రాక్టీస్ ఎలా జరిగింది? 136 00:12:47,018 --> 00:12:50,855 లిప్ రీడింగ్ చేయడం, దాన్ని అర్థం చేసుకోవడం, 137 00:12:50,939 --> 00:12:53,650 అదంతా చిన్న విషయం కాదు. 138 00:12:53,733 --> 00:12:58,321 ఇదంతా మా స్కూల్లో వాళ్లకు తప్ప ఇతరులకి వివరించడం కూడా 139 00:12:58,405 --> 00:13:00,323 చాలా కష్టం. చాలా కష్టం. 140 00:13:01,950 --> 00:13:04,911 నా సహవిద్యార్థులూ, నేనూ, మాకు అర్థమయ్యేది. 141 00:13:05,662 --> 00:13:07,998 అంతా కొత్తగా, వేరుగా ఉండింది. 142 00:13:08,999 --> 00:13:13,169 అందరిదీ ఓ లోకం, మాది ఓ లోకం అన్నట్టుగా ఉండేది, 143 00:13:13,253 --> 00:13:16,464 కానీ కనీసం మేము ఒకే లోకంలోనైనా ఉన్నాములెండి. 144 00:13:25,640 --> 00:13:28,059 కానీ నా వయస్సు పెరిగే కొద్దీ 145 00:13:28,143 --> 00:13:30,979 ఆ లోకంలో ఎన్ని మార్పులు వస్తాయో అని అప్పుడు నాకు తెలియలేదు. 146 00:13:46,995 --> 00:13:49,497 ఇప్పుడు నేనే వెళ్లే క్లాసు, నా పాత క్లాసు లాంటిదేనా? 147 00:13:49,581 --> 00:13:51,249 కాదు, ఇది వేరేదమ్మా. 148 00:13:51,333 --> 00:13:53,418 మీ కొత్త స్కూల్లో అలాంటి క్లాసు ఉండదు. 149 00:13:53,501 --> 00:13:56,588 అయితే, నా లాంటి వాళ్ళు ఎవరూ ఉండరా? 150 00:13:57,088 --> 00:13:59,507 అందరూ నన్ను వింతగా చూస్తే? 151 00:13:59,591 --> 00:14:01,927 అలా ఏమీ చూడరులే! నీకు లిప్ రీడింగ్ బాగా తెలుసు కదా. అలా ఏమీ చూడరులే! నీకు లిప్ రీడింగ్ బాగా తెలుసు కదా. 152 00:14:02,427 --> 00:14:07,140 అదీగాక, నీ స్కూల్ కోసమని నేనూ, మీ నాన్న 153 00:14:07,224 --> 00:14:08,725 ఈ సరికొత్త అద్భుతమైన చెవిటి మెషిన్ ని తెచ్చాం. 154 00:14:08,808 --> 00:14:09,893 చూశావా? 155 00:14:10,477 --> 00:14:12,812 అమ్మా! అది చాలా పెద్దగా ఉంది. 156 00:14:12,896 --> 00:14:17,567 అంటే, ఇది కూడా నువ్వు వాడే చెవిటి మెషిన్స్ లాగే పని చేస్తుంది, 157 00:14:17,651 --> 00:14:20,153 కానీ ఒక పెద్ద తేడా ఉంది. 158 00:14:20,695 --> 00:14:23,406 నువ్వు దీన్ని ఉపయోగిస్తావు అన్నమాట. ఇది మైక్రోఫోన్. 159 00:14:23,490 --> 00:14:24,991 మీ టీచర్ దీన్ని పెట్టుకుంటుంది, 160 00:14:25,075 --> 00:14:27,577 తన మాటలన్నీ నీకు నేరుగా నీ మెషిన్ ద్వారా నీ చెవులలో వినిపిస్తాయి. 161 00:14:27,661 --> 00:14:30,413 ఆమె చెప్పే మాటలన్నీ నీకు వినబడతాయి. 162 00:14:30,497 --> 00:14:32,540 ఏమో... ఏమో మరి. 163 00:14:33,124 --> 00:14:35,835 సీసీ. ఓసారి ప్రయత్నించి చూడరాదూ? 164 00:14:35,919 --> 00:14:37,337 ఎలా ఉంటుందో ఒకసారి చూడు. 165 00:15:07,826 --> 00:15:09,869 ఒక్క నిమిషం. అతను ఏమన్నాడు? 166 00:15:11,705 --> 00:15:12,789 "తెర మీద పదాలను 167 00:15:12,872 --> 00:15:16,710 చూడటానికి సబ్ టైటిల్స్ పెట్టుకోవచ్చుగా?" అని మీరు అనుకోవచ్చు. 168 00:15:19,462 --> 00:15:22,632 నా చిన్నప్పుడు సబ్ టైటిల్స్ లేవులే. 169 00:15:23,258 --> 00:15:26,428 కాబట్టి, టీవీలోని పాత్రల లిప్ రీడింగ్ చేయాలని నా శాయశక్తులా ప్రయత్నించాను. 170 00:15:26,511 --> 00:15:28,430 అప్పుడప్పుడూ అర్థం అయ్యేది. 171 00:15:28,513 --> 00:15:30,724 భోజనం తినే సమయమైంది, మైటీ బోల్ట్. 172 00:15:30,807 --> 00:15:33,226 నీకు వడలంటే ఇష్టమనే అనుకుంటున్నా! 173 00:15:35,270 --> 00:15:36,438 థ్యాంక్స్, లంచ్ మీట్, 174 00:15:36,521 --> 00:15:39,274 కానీ నాకు మినప వడలంటే ఇష్టం. 175 00:15:39,357 --> 00:15:41,902 కానీ ఎక్కువ సార్లు నాకు అర్థమయ్యేదే కాదు. 176 00:15:52,245 --> 00:15:53,246 తొక్కలోది. 177 00:15:53,830 --> 00:15:55,582 వాడు వెనక్కి ఉంటే లిప్ రీడింగ్ ఎలా చేసేది! 178 00:15:59,002 --> 00:16:01,755 హేయ్! నేను అది చూస్తున్నాగా. హేయ్! నేను అది చూస్తున్నాగా. 179 00:16:01,838 --> 00:16:03,298 మేము ఇద్దరం, నువ్వు ఒక్కదానివే. 180 00:16:07,761 --> 00:16:10,889 చూడండి! తనకి కూడా చెవిటి మెషిన్ ఉంది. 181 00:16:14,267 --> 00:16:16,645 ఒక్క నిమిషం. ఇప్పుడు తనేం అంది? 182 00:16:17,896 --> 00:16:19,189 అంటే... 183 00:16:21,900 --> 00:16:25,946 ఒక పాప ఇంకో పాపని... "చెవిటిదానా," అని అంది. 184 00:16:26,029 --> 00:16:28,990 "చెవిటిదానానా"? అది దారుణం. 185 00:16:31,284 --> 00:16:32,285 చెవిటిదానా! 186 00:16:36,039 --> 00:16:37,540 ఎందుకు నవ్వుతున్నావు? 187 00:16:37,624 --> 00:16:40,460 ఆ పదం చాలా తమాషాగా ఉంది! 188 00:16:42,045 --> 00:16:43,088 చెవిటిదానా! 189 00:16:47,217 --> 00:16:48,218 చెవిటిదానా. 190 00:16:51,179 --> 00:16:53,098 నాకు ఏమైంది? 191 00:16:53,181 --> 00:16:56,393 "చెవిటిదానా" అనే పదం వినడానికి సరదాగానే ఉండవచ్చు, 192 00:16:56,476 --> 00:16:59,354 కానీ నిజానికి అది అస్సలు సరదా విషయం కాదు. 193 00:17:50,530 --> 00:17:53,158 ఇప్పుడు కాస్త బాగుంది. 194 00:17:54,409 --> 00:17:55,744 అయ్యయ్యో. 195 00:18:02,334 --> 00:18:04,169 హేయ్ "చెవిటిదానా." 196 00:18:05,962 --> 00:18:08,715 స్కూల్లో అందరూ నన్ను కూడా "చెవిటిదానా" అని అంటారా? 197 00:18:16,806 --> 00:18:18,058 బై, సీసీ. 198 00:18:18,141 --> 00:18:19,559 కంగారు పడకు. 199 00:18:19,643 --> 00:18:21,478 ఇవాళ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు. 200 00:18:25,941 --> 00:18:28,109 - బైబై. - బై, అమ్మా. 201 00:18:39,955 --> 00:18:41,081 హేయ్, కేరీ. 202 00:18:50,507 --> 00:18:52,259 హేయ్, జానీ, ఏంటది? 203 00:18:52,342 --> 00:18:53,552 ఇది నా రేడియో. 204 00:18:53,635 --> 00:18:55,303 ఆన్ చేయ్, ఆన్ చేయ్! 205 00:18:57,764 --> 00:19:00,642 - ఓరి దేవుడా! నాకు ఈ పాటంటే చాలా ఇష్టం! - నాకు కూడా. - ఓరి దేవుడా! నాకు ఈ పాటంటే చాలా ఇష్టం! - నాకు కూడా. 206 00:19:00,725 --> 00:19:01,810 నాకు కూడా! 207 00:19:12,821 --> 00:19:16,658 ఈ పాట మీ మదిని పులకింపజేస్తుంది! 208 00:19:20,954 --> 00:19:22,038 హేయ్! 209 00:19:22,122 --> 00:19:23,707 త్వరగా, ఆమె వచ్చేస్తోంది! 210 00:19:45,228 --> 00:19:46,354 హాయ్, మిసెస్ సింకుల్మాన్. 211 00:19:46,855 --> 00:19:48,523 ఇది నా మైక్రోఫోన్. మీరు... 212 00:19:48,607 --> 00:19:50,567 మీరు దీన్ని మీ మెడకు తగిలించుకోండి. 213 00:19:50,650 --> 00:19:52,861 సూపర్. థ్యాంక్ యూ, సీసీ. 214 00:19:54,154 --> 00:19:55,947 మళ్లీ మొదలుపెడదాం. 215 00:20:02,078 --> 00:20:03,371 అవును. 216 00:20:06,291 --> 00:20:07,584 అంతా బాగుందా? 217 00:20:11,004 --> 00:20:12,464 ఇది పని చేస్తుందా? 218 00:20:17,010 --> 00:20:20,430 అందరికీ సుస్వాగతం 219 00:20:20,513 --> 00:20:23,600 నా పేరు మిసెస్ సింకుల్మాన్ 220 00:20:23,683 --> 00:20:26,186 మైక్రోఫోన్ వల్ల మిసెస్ సింకుల్మాన్ గొంతు 221 00:20:26,269 --> 00:20:28,772 చాలా గట్టిగా, చాలా స్పష్టంగా వినబడసాగింది. 222 00:20:29,356 --> 00:20:32,108 ఆమె వేరే వైపు చూస్తున్నప్పుడు కూడా 223 00:20:32,192 --> 00:20:34,653 నాకు ఆమె పలికే ప్రతీ పదం అర్థమయ్యేది. 224 00:20:34,736 --> 00:20:37,280 హోమ్ వర్క్ చేయాలని గుర్తుంచుకోండి 225 00:20:37,364 --> 00:20:40,659 ఇలా కళ్లు మూసి తెరిచే లోపు రోజు ముగిసిపోతుంది 226 00:20:40,742 --> 00:20:44,496 కనుక ఉల్లాసంగా గడుపుదాం 227 00:20:46,831 --> 00:20:48,667 నీకు చెముడా? 228 00:20:49,167 --> 00:20:50,335 కావచ్చు. 229 00:20:50,418 --> 00:20:52,254 ఇది వినిపిస్తోందా? 230 00:20:56,967 --> 00:20:58,051 జానీ విల్సన్! 231 00:20:58,134 --> 00:21:01,388 వెంటనే దాన్ని ఆపి నాతో రా! బయలుదేరు! వెంటనే దాన్ని ఆపి నాతో రా! బయలుదేరు! 232 00:21:03,056 --> 00:21:07,686 మీరందరూ మీ నోట్ బుక్స్ తెరిచి, మీకు ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా గీయండి. 233 00:21:07,769 --> 00:21:09,104 నేను త్వరగానే వచ్చేస్తాను. 234 00:21:13,108 --> 00:21:15,735 జానీ, నీ ప్రవర్తన వల్ల నాకు చాలా అంటే చాలా కోపం... 235 00:21:16,403 --> 00:21:18,530 హలో, మిసెస్ జోన్స్! 236 00:21:20,115 --> 00:21:22,617 ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం పదా, బుల్లోడా. 237 00:21:28,456 --> 00:21:32,460 ప్రిన్సిపల్ ఎక్హార్ట్, మీతో ఇతను మాట్లాడాలనుకుంటున్నాడు. 238 00:21:32,544 --> 00:21:34,087 నిజమే కదా, జానీ? 239 00:21:34,170 --> 00:21:36,214 - బాధగా ఉందా? - అయ్యయ్యో! 240 00:21:36,298 --> 00:21:38,425 ఇక్కడికి ఎందుకు వచ్చానురా బాబూ అని అనిపిస్తోందా? 241 00:21:38,508 --> 00:21:41,761 అది భలే సరదాగా ఉండింది. 242 00:21:41,845 --> 00:21:45,599 మిసెస్ సింకుల్మాన్ స్కూల్లో ఎక్కడ ఉన్నా, తన మాటలు 243 00:21:45,682 --> 00:21:48,768 నాకు స్పష్టంగా అర్థమయ్యేవి. 244 00:21:56,860 --> 00:21:58,653 తను... 245 00:21:59,988 --> 00:22:01,406 టాయిలెట్ కి వెళ్లినప్పటి శబ్దం కూడా! టాయిలెట్ కి వెళ్లినప్పటి శబ్దం కూడా! 246 00:22:05,702 --> 00:22:07,370 ఎందుకు నవ్వుతున్నావు? 247 00:22:08,747 --> 00:22:09,748 ఏంలేదులే. 248 00:22:10,248 --> 00:22:12,292 కానీ నేనేదో ఊరికే నవ్వలేదు. 249 00:22:12,375 --> 00:22:14,169 అది గొప్ప విషయం. 250 00:22:15,003 --> 00:22:17,088 చాలా గొప్ప విషయం! 251 00:22:17,672 --> 00:22:20,592 మైటీ బోల్ట్ ఎలా అయితే న్యాయం కోసం తన వద్ద ఉండే 252 00:22:20,675 --> 00:22:22,594 ఆ పరికరాలన్నింటినీ ఉపయోగిస్తాడో, 253 00:22:23,970 --> 00:22:29,017 నేను కూడా నా పరికరం, ఫోనిక్ ఇయర్ ని ఉపయోగించి, 254 00:22:29,100 --> 00:22:31,186 సూపర్ హీరోని అవ్వగలను. 255 00:22:31,853 --> 00:22:34,522 ఇతరులు నన్ను "చెవిటిది" అని పిలవవచ్చు గాక... 256 00:22:37,901 --> 00:22:41,821 కానీ మీరు నన్ను "ఎల్ డెఫో" అని పిలవవచ్చు. 257 00:22:42,614 --> 00:22:45,533 ఫ్లష్! 258 00:22:46,660 --> 00:22:47,702 ఏమైంది? 259 00:22:49,621 --> 00:22:50,622 ఏం లేదులే. 260 00:22:51,706 --> 00:22:52,707 చిప్స్ కావాలా? 261 00:22:54,125 --> 00:22:55,168 థ్యాంక్స్. 262 00:22:56,461 --> 00:22:59,881 నా పేరు లారా, నీ పేరు కన్నా నా పేరే బాగుంది. 263 00:23:00,382 --> 00:23:01,466 నువ్వు భలే సరదాగా ఉన్నావు. 264 00:23:01,550 --> 00:23:03,927 ఎప్పుడైనా స్కూల్ తర్వాత మా ఇంటికి వస్తావా? 265 00:23:04,010 --> 00:23:05,262 అలాగే. 266 00:23:05,345 --> 00:23:07,305 మంచిది. అయితే ఈ పని చేద్దాం. 267 00:23:08,265 --> 00:23:10,392 ఇంట్లో చేసిన బ్రౌనీలను స్నాక్స్ గా తిని, 268 00:23:10,475 --> 00:23:11,977 దుప్పట్లతో ఓ కోట కట్టుకుందాం. 269 00:23:12,060 --> 00:23:14,729 ఆ తర్వాత మనం ఏదైనా డ్రాయింగ్ చేసి, నా కుక్క, ఫ్లఫ్ తో ఆడుకుందాం. 270 00:23:21,278 --> 00:23:22,404 చాలా బాగా గీశావు. 271 00:23:22,487 --> 00:23:23,530 థ్యాంక్స్. 272 00:23:24,030 --> 00:23:26,074 కానీ నాదే బాగుంది, ఏమంటావు? 273 00:23:27,284 --> 00:23:28,285 సరే. 274 00:23:28,368 --> 00:23:30,870 హేయ్. ఇక డైనింగ్ రూమును ఆడదాం. 275 00:23:31,871 --> 00:23:33,540 అలాగే. కానీ ఆ ఆటను ఎలా ఆడాలి? 276 00:23:33,623 --> 00:23:36,710 టేబుల్ చుట్టూ ఏం పెట్టాలో అవి పెడ్తే సరి. మంచి తమాషాగా ఉంటుందిలే! 277 00:23:41,339 --> 00:23:42,465 అంతేనా? 278 00:23:42,549 --> 00:23:44,718 పోనుపోను బాగవుతుందిలే. తిరుగుతూ ఉండు. 279 00:23:55,103 --> 00:23:56,563 ఫ్లఫ్, చల్. 280 00:23:57,063 --> 00:23:58,106 ఇప్పుడే! 281 00:24:04,029 --> 00:24:06,615 నీ ముఖం చూడాల్సింది, పగలబడి నవ్వేదానివి. 282 00:24:09,951 --> 00:24:13,330 నాతో స్నేహం చేస్తావా, ఎల్ డెఫో? 283 00:24:14,331 --> 00:24:18,835 నా మాయాజాలంతో నిన్ను ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలను, 284 00:24:18,919 --> 00:24:21,338 నిన్ను పూర్తిగా నా గుప్పెట్లో ఉంచుకోగలను. 285 00:24:26,676 --> 00:24:29,930 నన్ను నువ్వు గుప్పెట్లో ఉంచుకోలేవు, పనికిమాలిన డాక్టర్! 286 00:24:30,013 --> 00:24:31,681 తన పని పట్టు, ఫ్లఫ్! 287 00:24:33,475 --> 00:24:35,393 అంత ఆవేశం వద్దు, కుక్క పిల్లా. 288 00:24:41,316 --> 00:24:44,236 నా విన్యాసాలు ఎలా ఉన్నాయి, పనికిమాలిన డాక్టర్? 289 00:24:44,319 --> 00:24:46,655 ఏడ్చినట్టు ఉన్నాయి, ఎల్ డెఫో! 290 00:24:46,738 --> 00:24:49,866 ఓయబ్బో. ఇప్పుడు కాచుకో! 291 00:24:51,534 --> 00:24:53,495 కాపాడండి! కాపాడండి! 292 00:24:54,537 --> 00:24:58,166 పనికిమాలిన డాక్టర్ లాంటి "స్నేహితుల"తో ఉత్తమంగా ఎలా వ్యవహరించాలో తెలుసా? 293 00:24:58,750 --> 00:25:00,001 పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. 294 00:25:00,085 --> 00:25:01,002 కాపాడండి! 295 00:25:13,807 --> 00:25:14,808 మన్నించు. 296 00:25:14,891 --> 00:25:16,768 సరే. మర్చిపోవద్దు, 297 00:25:16,851 --> 00:25:19,437 ఈ వారం స్కూలుకు మనం కవలలాగా తయారై వద్దాం. 298 00:25:19,521 --> 00:25:23,316 కాబట్టి, రేపు నీలి చొక్కా, తెల్ల ప్యాంట్ వేసుకొని రా, సరేనా? 299 00:25:23,942 --> 00:25:24,943 అలాగే. 300 00:25:29,948 --> 00:25:31,658 అబ్బా, ఇవాళ హోమ్ వర్క్ చేయడం మర్చిపోయాను. 301 00:25:33,577 --> 00:25:36,246 కంగారుపడకు, నేను నా హోమ్ వర్క్ చేసి కొన్ని యుగాలు అయింది. 302 00:25:39,040 --> 00:25:41,209 ఈ నీలం రంగు చొక్కా కాదు. 303 00:25:41,293 --> 00:25:43,795 అబ్బా. ఇప్పుడు మన బట్టలు ఒకేలా లేవు. 304 00:25:45,672 --> 00:25:48,925 అందరూ వినండి, తను మన కొత్త విద్యార్థిని, జిన్నీ. 305 00:25:49,009 --> 00:25:51,386 జిన్నీ, నువ్వు వెళ్లి సీసీ పక్కన కూర్చో. 306 00:26:00,437 --> 00:26:03,231 అది చెవిటి మెషిన్ ఆ? 307 00:26:04,149 --> 00:26:05,358 అవును. 308 00:26:05,442 --> 00:26:06,943 నేను కుడా అదే అనుకున్నా. 309 00:26:12,741 --> 00:26:14,492 మైటీ బోల్ట్ ఒక పిచ్చోడు. 310 00:26:14,576 --> 00:26:17,078 అతనన్నా, అతని లంచ్ బాక్స్ అన్నా ఎవరికీ ఇష్టముండదు. 311 00:26:17,162 --> 00:26:20,540 మైటీ బోల్ట్ సూపర్ గా ఉంటాడు. 312 00:26:20,624 --> 00:26:23,418 కానే కాదు. అది చిన్న పిల్లల షో. 313 00:26:23,501 --> 00:26:27,214 మన్నించాలి, లారా, నేను నీతో ఏమీ మాట్లాడటం లేదు. 314 00:26:36,890 --> 00:26:39,100 అది కాదు పాట. 315 00:26:41,228 --> 00:26:43,396 నా పుట్టిన రోజుకు ఇంకా ఎన్నో రోజులు లేవు. 316 00:26:43,480 --> 00:26:45,941 మా ఇంటికి వచ్చి పడుకుంటావా? 317 00:26:46,566 --> 00:26:49,361 ఆ పిచ్చిదాని ఇంటికి వెళ్తావా ఏంటి? 318 00:26:50,528 --> 00:26:52,197 వెళ్ళనులే. 319 00:26:55,242 --> 00:26:58,286 - నన్ను క్షమించు. - అవును, తను రాదు. 320 00:26:58,370 --> 00:27:00,872 తను నా ప్రాణ స్నేహితురాలు, నీది కాదు. తను నా ప్రాణ స్నేహితురాలు, నీది కాదు. 321 00:27:02,749 --> 00:27:05,752 నన్ను నువ్వు గుప్పెట్లో ఉంచుకోలేవు, పనికిమాలిన డాక్టర్! 322 00:27:09,798 --> 00:27:13,677 జిన్నీ, ఆగు. నేను వస్తానులే. 323 00:27:14,177 --> 00:27:15,428 నువ్వు వెళ్తున్నావా? 324 00:27:15,512 --> 00:27:17,973 సరే మరి. బాగా పండగ చేస్కో. 325 00:27:18,056 --> 00:27:19,766 మామూలుగా చేసుకోము. 326 00:27:20,392 --> 00:27:21,810 ఇక అలా, 327 00:27:21,893 --> 00:27:25,605 లారాకి సెలవు చెప్పి, జిన్నీకి స్నేహ హస్తం అందించాను. 328 00:27:26,106 --> 00:27:27,524 దేవుని దయ ఉండాలని, 329 00:27:27,607 --> 00:27:32,571 తను కలకాలంపాటు నా ప్రాణ స్నేహితురాలిగా ఉండాలని కోరుకున్నాను. 330 00:27:33,530 --> 00:27:34,614 సీసీ బెల్ రాసిన గ్రాఫిక్ నవల, అలాగే ఒరిజినల్ ఆర్ట్ వర్క్ ఆధారితమైనది 331 00:27:34,698 --> 00:27:40,328 నా జీవితంలోకి నువ్వు వచ్చి 332 00:27:41,162 --> 00:27:43,582 నీ వైపు లాక్కోవడంతో 333 00:27:43,665 --> 00:27:46,751 నా జీవితం ఇప్పుడు హాయిగా ఉంది 334 00:27:47,878 --> 00:27:50,380 మనమిద్దరమూ ఇలాగే కలిసి ఉంటే 335 00:27:50,463 --> 00:27:56,469 మన బంధం ఎక్కడికో వెళ్లిపోగలదు 336 00:27:57,345 --> 00:28:01,433 మన బంధం ఒక రూపు సంతరించుకుంటోంది మన బంధం ఒక రూపు సంతరించుకుంటోంది 337 00:28:01,933 --> 00:28:04,811 నాకు వెనకపడిపోవాలని లేదు 338 00:28:04,895 --> 00:28:10,150 నువ్వు దగ్గరే ఉంటే నాకు చింతే ఉండదు 339 00:28:11,026 --> 00:28:16,573 మనిద్దరం కలిసి ఎన్నెన్నో శిఖరాలను అధిరోహించగలం 340 00:28:22,913 --> 00:28:25,790 నాకు వెనకపడిపోవాలని లేదు 341 00:28:25,874 --> 00:28:31,588 నువ్వు దగ్గరే ఉంటే నాకు చింతే ఉండదు 342 00:28:32,088 --> 00:28:36,009 మనిద్దరం కలిసి ఎన్నెన్నో శిఖరాలను అధిరోహించగలం 343 00:28:36,092 --> 00:28:38,094 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య