1 00:02:10,380 --> 00:02:11,965 - సరే మరి. - హా. 2 00:02:14,092 --> 00:02:15,093 అతడిని ఏమీ చేయవద్దు. 3 00:02:16,011 --> 00:02:17,221 ఒకవేళ అతను పారిపోవడానికి ప్రయత్నిస్తే? 4 00:02:17,221 --> 00:02:18,972 అతడిని ఏమీ చేయకుండా ఉండటానికే ప్రయత్నించు. 5 00:02:20,307 --> 00:02:21,266 తప్పకుండా. 6 00:02:30,359 --> 00:02:32,444 మోటల్ ఖాళీ లేదు 7 00:02:41,411 --> 00:02:44,957 జనాలు సమస్యల్లో ఉన్నప్పుడు, వాళ్లు దాని గురించి మాట్లాడాలి. కానీ నీకు పాత సామెత ఒకటి తెలుసు కదా. 8 00:02:46,250 --> 00:02:47,334 విషయం తెలీనప్పుడు ఏ బాధా ఉండదు. 9 00:02:51,463 --> 00:02:52,714 - హేయ్. - హేయ్. 10 00:02:53,882 --> 00:02:54,883 ఎలా ఉంది? 11 00:02:57,928 --> 00:03:01,640 ఎలా ఉంది అని అడుగుతున్నావా? మనిషినని అనిపిస్తోంది, కానీ... 12 00:03:03,892 --> 00:03:05,018 పర్వాలేదు. 13 00:03:05,018 --> 00:03:09,147 నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని హెన్రీ చెప్పాడు. 14 00:03:09,731 --> 00:03:11,817 దానర్థం స్పృహ తప్పి నేల మీద పడిపోవడం కాదు అనుకుంటా కదా. 15 00:03:11,817 --> 00:03:13,986 నేనేమీ స్పృహ తప్పి పడిపోలేదు. నాకు నేల మీద పడుకోవడం ఇష్టం. 16 00:03:13,986 --> 00:03:15,404 తెలుస్తోందిలే. 17 00:03:17,948 --> 00:03:19,449 నిద్రలో నువ్వు కలవరించావు. 18 00:03:21,451 --> 00:03:22,870 ఎవరినో గట్టిగా పిలుస్తూ ఉన్నావు. 19 00:03:22,870 --> 00:03:25,497 వేరే భాషలా అనిపించింది. 20 00:03:28,125 --> 00:03:29,501 నీకు వేరే భాష కూడా వచ్చా? 21 00:03:30,085 --> 00:03:31,837 హా, నాకు చాలా భాషలు వచ్చు. 22 00:03:35,841 --> 00:03:36,842 సమయం ఎంత అయింది? 23 00:03:37,384 --> 00:03:38,468 పది గంటలు దాటింది. 24 00:03:39,178 --> 00:03:42,264 ఇక నేను స్నానం చేసి, పనులు మొదలుపెడతా. 25 00:03:42,264 --> 00:03:43,307 నేను వెళ్లి కాఫీ తెస్తా. 26 00:03:43,307 --> 00:03:44,808 - వద్దు, మెలనీ. - షుగర్, 27 00:03:44,808 --> 00:03:47,686 ఈ చెత్త పంచాయితీ ఏంటి అని వివరించకుండానే, అందులోకి నన్ను లాగగలవని 28 00:03:47,686 --> 00:03:51,190 నువ్వు నిజంగా, మనస్ఫూర్తిగా అనుకుంటున్నావా? 29 00:03:53,901 --> 00:03:54,860 అలా చేయలేనని తెలిసిపోతోంది. 30 00:03:55,652 --> 00:03:57,487 - వెళ్లి కాఫీ తెస్తా. - సరే. కాఫీ. 31 00:04:01,825 --> 00:04:05,245 తనకి అంతా చెప్పేయాలని ఉంది, కానీ చెప్పలేను. ఎప్పటికీ చెప్పలేను. 32 00:04:18,550 --> 00:04:19,551 డేవిడ్ సీగల్ 1988 - 2023 33 00:04:19,551 --> 00:04:24,139 "నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు, వారి దినములు దాటిపోవు నీడవలె ఉన్నవి. 34 00:04:25,265 --> 00:04:26,850 వరదచేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా. 35 00:04:27,851 --> 00:04:32,606 వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగురింతురు. 36 00:04:34,525 --> 00:04:40,280 ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును." 37 00:04:59,508 --> 00:05:00,843 కార్లోస్, ఒక నిమిషం మాకు ఏకాంతం ఇవ్వు. 38 00:05:05,472 --> 00:05:10,185 మీ అమ్మ చనిపోయినప్పుడు... నాకు చాలా కష్టంగా అనిపించింది. 39 00:05:11,645 --> 00:05:14,481 కానీ తన వయస్సు పైబడిందని, భూమ్మీద తనకి కాలం చెల్లిందని అనుకొని... 40 00:05:16,400 --> 00:05:17,609 నాకు నేను సర్దిచెప్పుకున్నాను. 41 00:05:20,320 --> 00:05:21,321 కానీ ఇది? 42 00:05:25,409 --> 00:05:26,910 ఇది వేరు. 43 00:05:30,163 --> 00:05:34,042 తల్లిదండ్రులు బతికి ఉండగానే పిల్లలు పోవడం దారుణం. 44 00:05:38,213 --> 00:05:40,549 నా సానుభూతి తెలియజేస్తున్నాను. 45 00:05:51,602 --> 00:05:53,270 ఒలీవియా గురించి ఇంకా ఏమీ తెలీలేదు కదా? 46 00:05:53,770 --> 00:05:56,148 లేదు, తెలిసి ఉంటే నీకు చెప్పేవాడినే. 47 00:05:58,358 --> 00:06:01,195 గతంలో తను ఎంత బాధ్యతారహితంగా ఉన్నా కానీ, 48 00:06:01,195 --> 00:06:04,072 తను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ, ఇక్కడికైతే తప్పనిసరిగా వచ్చేది. 49 00:06:06,366 --> 00:06:08,202 తనకి ఏమైనా జరిగి ఉంటుందని అనిపిస్తోందా? 50 00:06:11,079 --> 00:06:13,123 హా, అవును. 51 00:06:17,294 --> 00:06:18,128 కార్లోస్. 52 00:06:21,089 --> 00:06:26,762 వాళ్లు బారులో కూర్చొని నా జీవన బండి నడపడానికి డబ్బు ఇస్తున్నారు 53 00:06:26,762 --> 00:06:31,183 "బాసూ, నీకు ఇక్కడేం పని?" అని అంటున్నారు 54 00:06:48,867 --> 00:06:51,870 దరిద్రుడా, నన్ను తాకావంటే అయిపోతావు! 55 00:06:52,913 --> 00:06:54,831 తాకావంటే అయిపోతావు. 56 00:07:09,429 --> 00:07:10,681 మాస్ ఫోన్. 57 00:07:11,723 --> 00:07:13,100 మాకు తిరిగి కాల్ చేయ్ టచ్ లో ఉండు. 58 00:07:13,100 --> 00:07:14,935 వాడి కోసం ఎవరో వెతుకుతున్నారు. 59 00:07:30,409 --> 00:07:32,119 నేను నిన్ను చాలా అడగాలి. 60 00:07:34,121 --> 00:07:35,122 జెన్ ఎవరు? 61 00:07:35,789 --> 00:07:38,792 నీ కలవరింతల్లో నాకు ఆ జెన్ అనే ఒక్క పదమే అర్థమైంది. ఎవరు ఆమె? 62 00:07:39,543 --> 00:07:40,836 తను నా చెల్లెలు. 63 00:07:40,836 --> 00:07:43,297 నీ చెల్లెలా? ఎక్కడ ఉంది తను? తనకి ఏమైనా... 64 00:07:43,297 --> 00:07:44,840 ఎవరో వస్తున్నారు. 65 00:07:57,269 --> 00:07:58,812 - మిల్లర్ వచ్చాడు. - మిల్లర్ ఎవరు? 66 00:07:58,812 --> 00:08:00,022 నా బాస్. 67 00:08:00,022 --> 00:08:02,691 షుగర్, తలుపు తెరువు. నీతో మాట్లాడాలి. 68 00:08:02,691 --> 00:08:04,193 నిన్ను పొడిచింది అతనేనా? 69 00:08:05,152 --> 00:08:06,320 లేదు. ఇతను నా స్నేహితుడు. 70 00:08:06,320 --> 00:08:07,988 స్నేహితుడు అయితే, తలుపు ఎందుకు తెరవట్లేదు నువ్వు? 71 00:08:09,031 --> 00:08:10,240 నాకు తెరవాలని లేదు కాబట్టి. 72 00:08:11,325 --> 00:08:13,035 టవల్ ర్యాక్ తీసుకొని కొడదామా అతడిని? 73 00:08:13,035 --> 00:08:14,786 టవల్ ర్యాక్ తో అతడిని ఆపలేం. 74 00:08:28,258 --> 00:08:29,259 వెనుక పక్కకి వెళ్లి చూడండి. 75 00:08:55,953 --> 00:08:56,912 పద. 76 00:08:58,830 --> 00:08:59,998 హేయ్. 77 00:09:01,041 --> 00:09:04,211 కొట్టినందుకు సారీ. నీతో మాట్లాడాలనే వచ్చా. 78 00:09:08,173 --> 00:09:10,008 కారు తీసుకురా. ఇదుగో. 79 00:09:18,684 --> 00:09:20,352 మిల్లర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? 80 00:09:20,352 --> 00:09:23,438 ఏదో జరిగి ఉంటుంది. ఏదో మారి ఉంటుంది. 81 00:09:28,610 --> 00:09:29,528 పక్కకి ఆపు. 82 00:09:50,132 --> 00:09:52,301 ఓరి దేవుడా. ఇందాక ఏం జరిగిందో చెప్పవా? 83 00:09:53,927 --> 00:09:55,721 అతను ఒంటి చేత్తో నిన్ను ఎత్తేశాడు? 84 00:09:56,680 --> 00:09:58,432 నేను అతడిని కొట్టాను. కొట్టాల్సి వచ్చింది. 85 00:09:58,432 --> 00:10:00,350 - హా. అతనికి ఏమీ కాదు. - అతనికి ఏమీ కాదు కదా? 86 00:10:00,350 --> 00:10:03,061 సరే మరి. అతను నీకు స్నేహితుడా? 87 00:10:05,022 --> 00:10:06,690 అతను నాకు చాలా కాలంగా తెలుసు. 88 00:10:06,690 --> 00:10:08,692 "నీతో మాట్లాడాలనే వచ్చా," అని అన్నాడు. ఎందుకలా అన్నాడు? 89 00:10:08,692 --> 00:10:10,277 దేని గురించి మాట్లాడాలట? ఏం చేశావు నువ్వు? 90 00:10:17,451 --> 00:10:18,452 ఇలా చూడు. 91 00:10:19,244 --> 00:10:20,662 చూడు, నేను... 92 00:10:22,039 --> 00:10:23,165 నేను వింటున్నా, చెప్పు. 93 00:10:23,165 --> 00:10:25,959 హా, కానీ... ఏంటంటే, అతని పేరు మిల్లర్. 94 00:10:25,959 --> 00:10:30,714 అతను, ఇంకా కొందరు, మేమందరం కలిసి పని చేస్తాం. 95 00:10:30,714 --> 00:10:32,883 అంటే? మీరందరూ ప్రైవేట్ డిటెక్టివ్సా? 96 00:10:32,883 --> 00:10:35,344 కాదు... అంటే... అది నా ఉద్యోగ వృత్తి మాత్రమే, 97 00:10:35,344 --> 00:10:38,138 ఒక్కొక్కరికీ ఒక్కో వృత్తి ఉంది. 98 00:10:42,392 --> 00:10:43,560 మాకు ఒక గ్రూప్ ఉంది. 99 00:10:44,394 --> 00:10:48,065 ఒక సంస్థలా అన్నమాట, దాని గురించి ఎవరికీ తెలీకూడదు. 100 00:10:50,108 --> 00:10:53,487 దాని గురించి నేను... నేను నీకు చెప్పలేను. 101 00:10:53,487 --> 00:10:56,490 నేను టవల్ బారుతో ఇందాకే ఒకడి నెత్తిని పగులగొట్టాను. 102 00:10:56,490 --> 00:10:58,408 - కాబట్టి నువ్వు చెప్పి తీరాలి. - ఆ పని చేసినందుకు ధన్యవాదాలు. 103 00:10:58,408 --> 00:11:00,285 కానీ అది చాలా ప్రమాదకరం, అందుకే నేను నీకు చెప్పలేను. 104 00:11:01,495 --> 00:11:02,955 అది నీకు మాత్రమే ప్రమాదం కాదు, 105 00:11:02,955 --> 00:11:06,041 నాకు, నా స్నేహితులలో చాలా మందికి, నా ఆత్మీయులకి కూడా ప్రమాదకరం. 106 00:11:07,709 --> 00:11:10,170 ఆ రహస్యాన్ని నేను చాలా కాలంగా దాచి ఉంచాను. 107 00:11:12,548 --> 00:11:13,715 మేమందరమూ కూడా. 108 00:11:17,094 --> 00:11:19,137 నేను దాన్ని ఎప్పుడూ ఎవరికీ చెప్పాలనుకోలేదు, 109 00:11:20,347 --> 00:11:24,226 నీకు చెప్పాలని చాలా ఉంది, కానీ... నేను చెప్పలేను. 110 00:11:31,650 --> 00:11:32,484 నువ్వు గూఢచారివి. 111 00:11:34,152 --> 00:11:35,362 నీకు చాలా భాషలు తెలుసు. 112 00:11:35,362 --> 00:11:36,822 ఎప్పుడూ గమనిస్తూ, ఆలకిస్తూ ఉంటావు. 113 00:11:36,822 --> 00:11:39,700 నీ కన్నా... నీ గురించి చెప్పుకోవడం కన్నా ఇతరుల విషయాల్లోనే ఆసక్తి చూపేవాడివి. 114 00:11:39,700 --> 00:11:42,870 బాబోయ్, నేను ముందే గ్రహించి ఉండాల్సింది. 115 00:11:42,870 --> 00:11:45,038 కన్యా రాశి వాళ్లకి అది ఎక్కువే అయినా, దాని గురించి ఓసారి ఆలోచించి ఉండాల్సింది. 116 00:11:45,038 --> 00:11:47,124 నిన్ను నేను ప్రశ్నలు అడగడానికి ఏకైక కారణం ఏంటంటే, 117 00:11:47,124 --> 00:11:49,126 ఆ సమాధానాలను నా అవసరాల కోసం నేను తెలుసుకోవాలనుకున్నా, అంతే. 118 00:11:49,710 --> 00:11:51,003 నువ్వు గూఢచారివి. 119 00:11:52,379 --> 00:11:55,424 అందుకే కదా ఈ పంచాయితీ అంతా? నువ్వు విదేశీ గూఢచారివి. 120 00:12:00,429 --> 00:12:01,763 మేము ఇక్కడికి గమనించడానికే వచ్చాం. 121 00:12:03,724 --> 00:12:05,142 అయ్య బాబోయ్. 122 00:12:05,893 --> 00:12:07,519 అదే మా లక్ష్యం. మా ఏకైక లక్ష్యం అదే. 123 00:12:07,519 --> 00:12:09,313 దేవుడా. ఒక సిగరెట్ తాగాలనిపిస్తోంది నాకు. 124 00:12:12,065 --> 00:12:13,233 - మరి థోర్ప్ సంగతేంటి? - అతనికి ఏమైంది? 125 00:12:13,233 --> 00:12:14,568 అతను కూడా మీవాడే కదా? 126 00:12:15,360 --> 00:12:16,403 అవును. 127 00:12:16,403 --> 00:12:18,655 - కానీ అతను నీ వెంట పడటం లేదు. నీకు సాయపడుతున్నాడా? - అయ్యయ్యో. 128 00:12:18,655 --> 00:12:19,740 ఏమైంది? 129 00:12:19,740 --> 00:12:21,283 హెన్రీ. తర్వాత వాళ్లు అతని దగ్గరికే వెళ్తారు. 130 00:12:21,283 --> 00:12:22,951 మనం బయలుదేరాలి. మనం విశ్వవిద్యాలయానికి వెళ్లాలి. 131 00:12:23,869 --> 00:12:28,373 కాబట్టి అవును, ఆ లార్సెన్ గురించి కూడా మనం కొంత చర్చించుకుంటాం. 132 00:12:28,373 --> 00:12:31,210 మనం చివరిసారిగా కలిసినప్పుడు, పేలియోలితిక్ కాలం ఆఖరి రోజుల గురించి చర్చించుకున్నాం. 133 00:12:32,586 --> 00:12:35,839 తర్వాత మెసోలితిక్ కాలం గురించి చర్చిస్తాం. 134 00:12:37,049 --> 00:12:41,929 ఇక సుమారుగా 30,000 ఏళ్ల క్రితం నియాండెర్తల్స్, హోమో సేపియన్స్, 135 00:12:41,929 --> 00:12:44,181 ఇంకా జాతి పరిణామం చెందడం ప్రారంభమైంది. 136 00:12:44,181 --> 00:12:45,390 ఎత్తు, హెన్రీ. 137 00:12:47,601 --> 00:12:48,602 అతను ఫోన్ ఎత్తడం లేదు. 138 00:12:49,603 --> 00:12:51,855 సంక్లిష్టత, విభిన్నత. 139 00:12:51,855 --> 00:12:55,359 వివిధ రకాల విరుద్ధ భావాలను, ఆలోచనలను ఒకే సమయంలో 140 00:12:55,359 --> 00:12:58,403 మెదడులో ఉంచుకోగల సామర్థ్యం. 141 00:12:59,696 --> 00:13:04,201 దాని వల్లనే మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు, మీ పూర్వీకులు లేరు. 142 00:13:07,913 --> 00:13:08,997 మీకు ఏం కావాలి? 143 00:13:08,997 --> 00:13:12,125 నేను ఒక స్నేహితుని కోసం వచ్చాను. ఆయన ఆంథ్రపాలజీ ప్రొఫెసర్, హెన్రీ థోర్ప్. 144 00:13:12,125 --> 00:13:13,627 ఈరోజు ఆయన కోసం చాలా మంది వచ్చారు. 145 00:13:13,627 --> 00:13:15,087 ఎందుకలా అన్నారు? 146 00:13:37,359 --> 00:13:38,485 ఇప్పుడే ఎటైనా వెళ్లిపోయాడేమో? 147 00:13:38,485 --> 00:13:40,153 అబ్బా. మిల్లర్ తీసుకొని వెళ్లుంటాడు. 148 00:13:52,457 --> 00:13:53,458 ఒక గంటలో అక్కడ ఉంటా. 149 00:13:53,458 --> 00:13:55,127 ఎవరో తమ పనులను కప్పిపుచ్చే పనిలో ఉన్నారు. 150 00:13:56,378 --> 00:13:59,173 స్టాలింగ్స్ తో సంబంధం ఉన్నవాళ్లందరి నోర్లూ మూయిస్తున్నారు. 151 00:13:59,173 --> 00:14:00,465 ఇప్పుడు ఏంటి? 152 00:14:01,091 --> 00:14:05,053 మాస్ దగ్గరికి వాళ్ల కన్నా ముందే నేను చేరుకోవాలి. హెన్రీ సంగతి తర్వాత చూస్తా. 153 00:14:05,846 --> 00:14:06,889 సరే, పద. 154 00:14:18,400 --> 00:14:20,152 నేను నీకు ఒకటి చెప్తాను, దానితో నీకు చాలా కోపం వస్తుంది. 155 00:14:20,152 --> 00:14:21,695 కానీ నాకు కూడా కోపంగానే ఉందని తెలుసుకో. 156 00:14:21,695 --> 00:14:23,030 ఏంటి? 157 00:14:23,030 --> 00:14:25,616 నా వాళ్లు... అంటే మిల్లర్, ఇంకా ఇంకొందరు... 158 00:14:27,409 --> 00:14:29,453 వీళ్లందరూ ఒలీవియా ఆచూకీ కనుగొనే నా పనికి అడ్డుపడుతున్నారు. 159 00:14:30,621 --> 00:14:32,915 ఒక్క నిమిషం. ఒలీవియాని అపహరించింది మీవాళ్లేనా? 160 00:14:32,915 --> 00:14:34,666 కాదు. కాదు. కానే కాదు. వాళ్లు... 161 00:14:34,666 --> 00:14:35,876 వాళ్లు తననేం చేశారు? 162 00:14:35,876 --> 00:14:37,628 - ఏమీ చేయలేదు. - దేవుడా. 163 00:14:37,628 --> 00:14:40,506 మేము జనాలకు హాని తలపెట్టం. మేము అలాంటి వాళ్లం కాదు. సరేనా? ప్రమాణపూర్తిగా చెప్తున్నా. 164 00:14:41,507 --> 00:14:43,759 - దీన్ని నేను సరి చేస్తా. - ఓరి దేవుడా. 165 00:15:14,164 --> 00:15:15,541 తను ఈ ఇంట్లో ఉందంటావా? 166 00:15:15,541 --> 00:15:17,960 లేదు, ఇది స్టాలింగ్స్ మనుషుల్లో ఒకడి ఇల్లు. 167 00:15:18,585 --> 00:15:20,671 అతను ఇక్కడే ఉంటాడు, మనకి కావాల్సిన కొన్ని విషయాలు ఇతనికి తెలిసి ఉండవచ్చు. 168 00:15:24,007 --> 00:15:25,175 నువ్వు ఇక్కడే ఉండు. సరేనా? 169 00:15:26,552 --> 00:15:28,011 పర్వాలేదులే, నాకు ఎలాగూ లోపలికి రావాలని లేదు. 170 00:15:28,011 --> 00:15:29,429 సరే. 171 00:16:06,049 --> 00:16:07,050 ఏం చేస్తున్నావు? 172 00:16:07,050 --> 00:16:09,511 మనస్సు మార్చుకొని, నీతో వస్తున్నా. 173 00:16:11,555 --> 00:16:12,890 - నా పక్కనే ఉండు. - సరే. 174 00:16:53,639 --> 00:16:54,640 షుగర్. 175 00:17:03,524 --> 00:17:05,733 సరే. వెళ్దాం పద. రా. 176 00:17:14,785 --> 00:17:16,244 పరిస్థితులు అదుపు తప్పాయి. 177 00:17:16,869 --> 00:17:20,165 కాస్త నిదానించాల్సిన, శాంతించాల్సిన సమయం ఆసన్నమైందేమో. 178 00:17:21,208 --> 00:17:23,669 "ప్రశాంతంగా ఉంటే పైచేయి సాధించవచ్చు" లాగా అన్నమాట. 179 00:17:23,669 --> 00:17:26,003 సహజంగా నేను ప్రతిభావంతుడిని అని చాలా మంది అంటుంటారు. 180 00:17:26,713 --> 00:17:28,464 కానీ నేను పరిస్థితులను ఏ మాత్రం అంచనా వేయలేను. 181 00:17:29,466 --> 00:17:31,927 హా. ఇలా కూడా పని చేయవచ్చు. 182 00:17:37,599 --> 00:17:39,518 క్లింటన్ వచ్చి, నిన్ను వేరే గదికి మారుస్తాడు, 183 00:17:39,518 --> 00:17:41,478 ఎందుకైనా మంచిదనిలే. నేను వచ్చేస్తాను ఇంకో... 184 00:17:42,896 --> 00:17:44,523 ఎంత సేపు పడుతుందో తెలీదు. కానీ వచ్చేస్తా. 185 00:17:45,023 --> 00:17:46,149 - సరే. - హా. 186 00:17:49,069 --> 00:17:50,904 హేయ్. నువ్వు బాగానే ఉన్నావా? 187 00:17:52,739 --> 00:17:54,032 నేను వస్తే ఒలీవియాతోనే వస్తా, లేకపోతే రాను. 188 00:17:56,869 --> 00:17:57,703 మంచిది. 189 00:18:20,726 --> 00:18:21,727 తేల్చుకోవాల్సిన సమయం ఇది. 190 00:18:23,770 --> 00:18:25,522 ఈరాత్రి నాకు సమాధానాలు లభించాల్సిందే. 191 00:18:28,108 --> 00:18:29,484 అది ఎలాగైనా కానీ. 192 00:18:43,832 --> 00:18:47,002 మిల్లర్ 193 00:19:10,817 --> 00:19:12,694 నేను తనకి చెప్పింది నిజమే. 194 00:19:12,694 --> 00:19:13,904 మేము ఇలాంటి వాళ్లం కాదు. 195 00:19:14,738 --> 00:19:16,823 అపహరణలు. హత్యలు. 196 00:19:18,534 --> 00:19:20,577 మాస్ వెధవనా, కాదా అన్నదానితో సంబంధం లేదు. 197 00:19:21,954 --> 00:19:24,039 మేము జనాలకు హాని తలపెట్టకూడదు. 198 00:19:26,250 --> 00:19:30,379 మేము ఇక్కడికి రావడానికి గల ఏకైక కారణం ఏంటంటే, మా శాంతియుత జీవనాన్ని పరిరక్షించుకోవడం. 199 00:19:32,840 --> 00:19:34,341 కానీ ఈ చోటు మమ్మల్ని మార్చేస్తోంది. 200 00:19:36,093 --> 00:19:37,177 మా అందరినీ మార్చేస్తోంది. 201 00:20:38,488 --> 00:20:39,656 ఏం జరుగుతోంది? 202 00:20:44,828 --> 00:20:45,662 మన పని పూర్తి అయిపోయింది. 203 00:20:47,789 --> 00:20:48,999 వెనక్కి వచ్చేయమని మనకి పిలుపు వచ్చింది. 204 00:20:50,125 --> 00:20:51,460 ఏంటి? 205 00:20:51,460 --> 00:20:53,337 - అవును. - హెన్రీ. 206 00:20:54,213 --> 00:20:57,049 నాకేమీ కాలేదు. నాకు... నువ్వు తన మాట విను. 207 00:20:57,049 --> 00:20:59,092 ఒక్క నిమిషం ఆగండి. ఏంటి? 208 00:20:59,885 --> 00:21:01,512 మన నివాసం నుండి ఈ ఉదయం ఒక వర్తమానం వచ్చింది. 209 00:21:01,512 --> 00:21:02,930 అది మాట్లాడాలనే మిల్లర్ నీ దగ్గరికి వచ్చాడు. 210 00:21:02,930 --> 00:21:03,889 అందుకే మేము ఇక్కడికి వచ్చాం. 211 00:21:03,889 --> 00:21:05,933 - ఎలా వెళ్లిపోవాలి అని ప్లాన్స్ ని చర్చిస్తున్నాం. - మన పని పూర్తి కాలేదు. 212 00:21:05,933 --> 00:21:07,184 పూర్తి అయింది. 213 00:21:07,684 --> 00:21:11,438 ఒకటి, రెండు రోజులలో, నీతో పాటు ఈ గదిలో ఉన్న వాళ్లందరూ 214 00:21:11,438 --> 00:21:13,232 మన సహచరులందరూ, ఈ గ్రహం నుండి బయలుదేరిపోతారు. 215 00:21:13,232 --> 00:21:14,942 - అలా అని ఎవరు ఉన్నారు? - మన నివాసంలో ఉన్నవారు. 216 00:21:15,817 --> 00:21:17,945 ఇప్పుడు నువ్వు ఎలా వెళ్లిపోవాలి అనేదాని గురించి మిల్లర్ తో మాట్లాడు. 217 00:21:17,945 --> 00:21:20,197 లేదు, లేదు. బాగానే ప్రయత్నించావు కానీ, తనని కనిపెట్టే దాకా నేను రాను. 218 00:21:20,864 --> 00:21:22,115 నువ్వు వెళ్లాల్సిందే. 219 00:21:24,660 --> 00:21:25,786 తనని కనిపెట్టాకే నేను వస్తా. 220 00:21:27,204 --> 00:21:28,205 ఒలీవియా సీగల్. 221 00:21:29,331 --> 00:21:32,459 నేను గాలిస్తున్న మహిళ తను. 222 00:21:34,169 --> 00:21:36,755 ఆ మహిళ ఆచూకీని నేను కనిపెట్టడం ఈ గదిలో ఉన్న కొందరికి, ఎందుకో కానీ ఇష్టం లేదు, 223 00:21:36,755 --> 00:21:38,674 అది మాత్రం నేను పక్కాగా చెప్పగలను. 224 00:21:39,258 --> 00:21:40,259 ఇప్పుడు ఇలా అంటారా? 225 00:21:40,259 --> 00:21:42,344 ఇంత కాలం తర్వాత, ఉన్నట్టుండి, ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా 226 00:21:42,344 --> 00:21:44,054 వచ్చేయమంటే అన్నీ సర్దేసుకొని వెళ్లిపోవాలా? అది జరగని పని! 227 00:21:44,054 --> 00:21:46,348 మన లక్ష్యం ఒలీవియా సీగల్ కాదు, షుగర్. 228 00:21:47,182 --> 00:21:48,976 నువ్వు లోక కళ్యాణం గురించి ఆలోచించడం లేదు. 229 00:21:48,976 --> 00:21:50,310 తను ఎక్కడ ఉంది? 230 00:21:50,310 --> 00:21:52,855 - జాన్. - లేదు, ఆగు. ఇక తప్పించుకోవడాలు, అబద్ధాలు వద్దు. 231 00:21:52,855 --> 00:21:55,148 - జాన్. - ఆగు, హెన్రీ! దయచేసి ఆగు. 232 00:21:58,610 --> 00:22:00,946 మర్యాదగా అడుగుతున్నా, తను ఎక్కడ ఉందో చెప్పండి. 233 00:22:00,946 --> 00:22:02,614 ఇక్కడున్న వారిలో ఆ విషయం కొందరికి తెలుసని నాకు తెలుసు. 234 00:22:02,614 --> 00:22:04,116 అది నిజమే. నేను చెప్తాను. 235 00:22:04,116 --> 00:22:06,285 వద్దు. ఆ పని చేయకు, హెన్రీ. 236 00:22:06,285 --> 00:22:08,745 నువ్వే గెలిచావు. ఎలాగూ అందరం వెళ్లిపోతున్నాం కదా. చెప్పేయడం వల్ల పోయేదేముంది? 237 00:22:08,745 --> 00:22:10,414 నేను చెప్తాను. రా. 238 00:22:16,170 --> 00:22:17,504 ఇదంతా నాకు ఈరోజే తెలిసింది. నేను... 239 00:22:17,504 --> 00:22:20,507 - నీకు తను ఎక్కడుందో తెలుసా? చెప్పు. - నాకు ఒక చిరునామా ఇచ్చారు. హా. 240 00:22:20,507 --> 00:22:21,675 సరే. ఆ చిరునామా చూపించు. 241 00:22:22,634 --> 00:22:23,844 సరే. రాసి ఇస్తా ఆగు. 242 00:22:24,720 --> 00:22:27,973 చిరునామా. ఇంత జరిగాక ఒక చిరునామా దొరికింది, నేను... 243 00:22:37,274 --> 00:22:38,901 నాకు తెలిసింది నీకు చెప్తాను, సరేనా? 244 00:22:40,777 --> 00:22:42,112 అలాగే. 245 00:22:42,112 --> 00:22:44,656 సరే. విషయం ఏంటంటే... 246 00:22:44,656 --> 00:22:48,035 వాళ్లకి మన గురించి తెలిసిపోయింది... మనుషులకి. 247 00:22:48,035 --> 00:22:49,912 అవును. కొందరికి తెలిసిపోయింది. 248 00:22:55,417 --> 00:22:56,919 ఈ చిరునామాలో ఉండే వాళ్లనే మనం కాపాడేది? 249 00:23:01,173 --> 00:23:02,257 వీళ్లు చాలా శక్తివంతులు. 250 00:23:02,257 --> 00:23:03,300 తెలిసిపోతోందిలే. 251 00:23:03,926 --> 00:23:05,010 కాబట్టి వాళ్ల తప్పులని మనం చూడట్లేదా? 252 00:23:05,010 --> 00:23:06,970 ఏమీ చేయకుండా, ఇలాంటి నీచపు పనిని చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నామా? 253 00:23:06,970 --> 00:23:08,263 మన వాళ్లని కాపాడుకోవడానికి తప్పట్లేదు. 254 00:23:09,139 --> 00:23:11,642 వాళ్లే తలుచుకుంటే, ఏ సమయంలోనైనా మనల్ని చంపేయగలరు. 255 00:23:11,642 --> 00:23:13,060 ఇక ఇప్పుడు మన పని ముగిసింది. 256 00:23:13,060 --> 00:23:14,478 - అవును. - ఇప్పుడు నాకు అన్నీ చెప్పవచ్చు. 257 00:23:14,478 --> 00:23:15,979 ఒలీవియాకి ఏం జరిగి ఉన్నా కానీ. 258 00:23:15,979 --> 00:23:17,648 తను ఎంత అనుభవించి ఉన్నా కానీ. 259 00:23:20,859 --> 00:23:22,027 ఈ... ఈ ఇంట్లో ఉండేది... 260 00:23:23,028 --> 00:23:24,655 ఒక పలుకుబడి ఉన్న రాజకీయవేత్త కొడుకు. 261 00:23:24,655 --> 00:23:26,323 ఈ పనికిమాలినోడు, స్టాలింగ్స్ క్లయింటా? 262 00:23:27,032 --> 00:23:28,158 - అవును. - అసలు ఎలా జరిగింది? 263 00:23:28,158 --> 00:23:30,702 ఎలా మన... వాళ్లకి మన గురించి ఎలా తెలిసింది? 264 00:23:30,702 --> 00:23:33,372 ఆ విషయం నాకు తెలీదు. ఏదేమైనా, ఇప్పుడు అది ముఖ్యం కాదు కదా? 265 00:23:33,372 --> 00:23:34,873 అది ముఖ్యమే. 266 00:23:36,542 --> 00:23:39,753 అన్నింటికన్నా ముఖ్యం అది. మనం ఇలాంటి నీచపు పనులు చేయం, హెన్రీ. 267 00:23:39,753 --> 00:23:43,674 కోపం నీ ఒక్కడికే వస్తోందని అనుకోకు. ఈ విషయంలో ఎవరూ ఆనందంగా లేరు. 268 00:23:43,674 --> 00:23:46,969 ఆనందమా? ఒలీవియాకి ఇది ఆనందపడే విషయమా? 269 00:23:47,678 --> 00:23:49,471 ఇలా అస్సలు జరిగి ఉండాల్సింది కాదు, హెన్రీ! 270 00:23:53,183 --> 00:23:55,769 నిజమే. కానీ జరిగిపోయింది. 271 00:24:00,691 --> 00:24:04,111 ఇప్పుడు మనం వెళ్లిపోతున్నాం. కాబట్టి దీన్ని సరిచేసేందుకు ప్రయత్నించు. 272 00:24:06,321 --> 00:24:08,448 ఎందుకంటే, ఒకవేళ తను బతికే ఉంటే, ఆ చిరునామాలోనే ఉంటుంది. 273 00:24:16,331 --> 00:24:21,962 ఆగు. స్టాలింగ్స్ ఇంట్లో ఏం జరిగిందో నాకు చెప్పారు. 274 00:24:23,338 --> 00:24:26,049 నువ్వు ముగ్గురిని చంపావని అన్నారు. 275 00:24:27,885 --> 00:24:29,970 - అది నిజమేనా? - అది నా ఆత్మరక్షణలో భాగంగా జరిగింది. 276 00:24:29,970 --> 00:24:31,054 అయితే నీకు వాళ్లని చంపక తప్పలేదా? 277 00:24:43,358 --> 00:24:44,860 మొదటి ఇద్దరి విషయంలో, తప్పలేదు. 278 00:24:46,486 --> 00:24:47,905 ఒక మగాడిని, ఒక మహిళని. 279 00:24:50,282 --> 00:24:51,533 నన్ను నేను కాపాడుకుందామని చేసిన పని అది. 280 00:24:55,329 --> 00:24:56,496 కానీ మూడవ హత్య, అది... 281 00:24:58,665 --> 00:24:59,750 అది నేను కాపాడుకుందామని చేసింది కాదు. 282 00:25:02,127 --> 00:25:04,129 నా మనస్సంతా ఆలోచనలతో నిండిపోయి ఉంది అన్నమాట. 283 00:25:05,631 --> 00:25:08,133 "నేను ప్రమాదంలో ఉన్నాను." "వాడు మంచివాడు కాదు." "ఒకవేళ వాడు ఏమైనా"... 284 00:25:09,968 --> 00:25:10,802 "బహుశా అదే న్యాయమైనది ఏమో. 285 00:25:12,012 --> 00:25:15,474 కనీసం సహేతుకమైనది ఏమో." 286 00:25:20,312 --> 00:25:21,980 కానీ సరిగ్గా నేను... 287 00:25:23,440 --> 00:25:25,150 నేను ట్రిగ్గర్ నొక్కే ముందు... 288 00:25:27,194 --> 00:25:30,280 ఆ ఆలోచనలన్నీ మాయమైపోయి, మనస్సంతా ప్రశాంతత కమ్మేసింది. 289 00:25:32,699 --> 00:25:33,534 ఇక... 290 00:25:37,371 --> 00:25:38,664 అతడిని కావాలనే చంపాను. 291 00:25:49,550 --> 00:25:50,759 అది పిచ్చిపనని తెలుసు. 292 00:25:55,222 --> 00:26:01,019 మనం ఇక్కడ ఎంత ఎక్కువ కాలం ఉంటే, అంత ఎక్కువగా మనుషుల్లా అయిపోతామేమో. 293 00:26:03,897 --> 00:26:05,023 నేను ఇక బయలుదేరుతా. 294 00:26:05,023 --> 00:26:09,695 నీ పనిలో భాగంగా... నువ్వు ఇక్కడ గడిపిన సమయంలో... మహా అయితే 25-30 మంది ఆచూకీ కనిపెట్టి ఉంటావు, 295 00:26:10,487 --> 00:26:12,406 అంతే కదా? ఆ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా అయ్యుండవచ్చు. 296 00:26:13,615 --> 00:26:16,910 నువ్వు... నువ్వు ఇక్కడ ఉన్నంత కాలమూ తప్పిపోయిన వారి కోసం గాలిస్తూనే గడిపావు. 297 00:26:19,329 --> 00:26:22,958 ఇవాళ ఒలీవియాని కూడా నువ్వు కనుగొనాలనే కోరుకుంటున్నా. 298 00:26:26,587 --> 00:26:31,758 కానీ నీ చెల్లెలు లేనంత కాలమూ, నువ్వు ఇలాగే నైరాశ్యంతో ఉంటావు. 299 00:26:52,738 --> 00:26:54,907 అయితే, ఒలీవియా కనిపించకుండా పోవడం వెనుక 300 00:26:54,907 --> 00:26:56,950 బాగా పలుకుబడి, హోదా ఉన్న వ్యక్తులు ఉన్నారు అన్నమాట. 301 00:27:02,623 --> 00:27:03,624 నాకు అంతా ఇప్పుడు అర్థమవుతోంది. 302 00:27:04,791 --> 00:27:07,252 మా గుట్టు బయటపెడతామని వాళ్లు బెదిరిస్తున్నారు. 303 00:27:09,087 --> 00:27:13,217 "ఈ కేసు నుండి షుగర్ ని తప్పుకోమని చెప్పండి, లేదా మీ రహస్యాన్ని లోకానికి బట్టబయలు చేస్తాము. 304 00:27:14,259 --> 00:27:17,763 'గ్రహాంతరవాసులు మన మధ్యే తిరుగుతున్నారు' అనే వార్త, ప్రధాన శీర్షికలో పడుతుంది." 305 00:27:20,307 --> 00:27:21,350 అది మంచి విషయం కాదు. 306 00:27:23,268 --> 00:27:25,103 నాకు అది నచ్చలేదు, కానీ అర్థం చేసుకున్నా. 307 00:27:30,776 --> 00:27:35,781 హెన్రీ చెప్పింది నిజమే. మేము ఇక్కడ చాలా కాలం ఉన్నాం. ఇక మేము మా స్వగ్రహానికి వెళ్లాలి. 308 00:27:53,841 --> 00:27:55,342 {\an8}పావిచ్ కి ఓటు వేయండి - యుఎస్ సెనేట్ "మీ పక్షాన ఉన్న నేత" 309 00:28:20,492 --> 00:28:22,619 {\an8}పావిచ్ యు.ఎస్ సెనేట్ 310 00:29:10,167 --> 00:29:13,253 - కదలవద్దు! సెక్యూరిటీ. చేతులు పైకెత్తండి. - ఎత్తాను. 311 00:29:14,838 --> 00:29:15,964 చూడండి. నేను చేతులు పైకెత్తే ఉన్నా. 312 00:29:15,964 --> 00:29:17,090 ఆయుధాన్ని కింద పడేయండి. 313 00:29:17,090 --> 00:29:18,842 - సరే. కాస్త శాంతించండి... - తుపాకీని కింద పెట్టండి. 314 00:29:18,842 --> 00:29:20,469 సరే. మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ తుపాకీని కింద పెడతా... 315 00:29:20,469 --> 00:29:21,595 "కదలవద్దు" అన్నా! 316 00:29:22,638 --> 00:29:24,598 నా మాట వినండి. మనం ఇక్కడి నుండి వెళ్లిపోకూడదు. 317 00:29:24,598 --> 00:29:26,934 నేను ప్రైవేట్ డిటెక్టివ్ ని. ఒక తప్పిపోయిన మహిళ ఆచూకీని కనుగొనే పనిలో ఉన్నాను. 318 00:29:26,934 --> 00:29:28,852 దొంగతనంగా ఇళ్లల్లోకి చొరబడటానికి ఇలాంటి సాకులు నేను లక్ష విన్నా. 319 00:29:28,852 --> 00:29:30,479 డ్రగ్స్ తీసుకున్న వాడిలా కనిపిస్తున్నానా? చెప్పేది వినండి. 320 00:29:30,479 --> 00:29:33,106 నా పర్సులో నా డిటెక్టివ్ లైసెన్స్, నా డ్రైవింగ్ లైసెన్స్ 321 00:29:33,106 --> 00:29:34,608 నా గుర్తింపు కార్డ్ అన్నీ ఉన్నాయి. 322 00:29:34,608 --> 00:29:36,860 - కోటులోని కుడి వైపు జేబులో ఉంది. లోపల ఉంది. హా. - కుడి వైపు జేబులోనా? 323 00:29:37,778 --> 00:29:40,489 -"జాన్ షుగర్." అది మీ అసలైన పేరేనా? - నా అసలైన... అవును, సర్. 324 00:29:40,489 --> 00:29:42,324 - అక్కడ ఉన్న నీలం కారు మీదేనా? - అవును, సర్. 325 00:29:42,324 --> 00:29:44,535 చూడండి, నేను తప్పు ఇంటికే వచ్చుండవచ్చు. బహుశా నేను పొరబడే ఉండవచ్చు. 326 00:29:44,535 --> 00:29:46,495 కానీ ఏదోకరోజు ఈ ఇంట్లో ఒక మహిళ చిత్రహింసలకు గురైందని, 327 00:29:46,495 --> 00:29:47,663 నరకం చూసిందని మీరు విన్నప్పుడు, 328 00:29:47,663 --> 00:29:49,957 కనీసం ఒక్క నిమిషం వెచ్చించి తనని కాపాడే ప్రయత్నమే చేయలేదని... 329 00:29:49,957 --> 00:29:52,125 అసలు తనిఖీ చేయకుండానే వెళ్లిపోయారని మీరు గ్రహించినప్పుడు... 330 00:29:52,125 --> 00:29:53,836 మీరు చాలా బాధపడిపోతారు. ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది. 331 00:29:53,836 --> 00:29:55,128 కాబట్టి ఇప్పుడే ఆ పని చేయండి. 332 00:29:55,128 --> 00:29:57,130 "టైమ్ ట్రావెల్ చేసి వెళ్లగలిగితే బాగుండు," అనుకొని బాధపడనక్కర్లేదు. 333 00:30:00,008 --> 00:30:01,009 కదలకుండా ఇక్కడే ఉండు. 334 00:30:05,681 --> 00:30:06,890 {\an8}నేను వెళ్లి బేస్మెంటులో చూసొస్తా. 335 00:30:10,269 --> 00:30:11,270 {\an8}హలో? 336 00:30:13,772 --> 00:30:15,107 {\an8}కింద ఎవరైనా ఉన్నారా? 337 00:30:19,194 --> 00:30:20,654 కింద ఎవరైనా ఉన్నారా? 338 00:30:24,157 --> 00:30:28,120 - హా, సెనేటర్ కొడుకు. - హలో? 339 00:30:30,789 --> 00:30:31,748 అర్థమైంది. 340 00:30:31,748 --> 00:30:32,833 హేయ్. 341 00:30:37,880 --> 00:30:38,881 హేయ్. 342 00:30:43,844 --> 00:30:46,513 ఏమన్నా దొరికిందా? 343 00:30:46,513 --> 00:30:51,143 ఏమీ దొరకలేదు. ఒక సుత్తి తప్ప. 344 00:30:52,936 --> 00:30:54,855 కానీ ఎవరైనా సుత్తిని బేస్మెంటులోనే కదా పెట్టుకొనేది. 345 00:30:55,355 --> 00:30:56,940 మీరు అంతా జాగ్రత్తగా వెతికారా? 346 00:30:58,400 --> 00:30:59,401 అంతా వెతికా. 347 00:31:00,903 --> 00:31:02,237 అయితే పొరబడ్డాను అన్నమాట. 348 00:31:04,656 --> 00:31:05,866 అది నిజమే. 349 00:31:06,450 --> 00:31:07,534 మరి ఇప్పుడు ఏం చేస్తారు? 350 00:31:16,752 --> 00:31:18,378 ఇక్కడ ఒకరిని బంధించి ఉంచారని మీకెవరు చెప్పారు? 351 00:31:21,548 --> 00:31:25,135 ఒక స్నేహితుడు. తప్పు సమాచారం అందింది. 352 00:31:26,303 --> 00:31:29,306 ఇలా అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. కానీ నాకు కాస్త అదోలా ఉంది. 353 00:31:29,306 --> 00:31:30,599 స్నేహితుడు అంటే ఎవరు? 354 00:31:31,558 --> 00:31:33,810 అంటే... ఆ విషయం మీకు చెప్పలేను. 355 00:31:35,854 --> 00:31:38,649 వాళ్ల గురించి గోప్యంగా ఉంచాలి... నా వృత్తిలో అది చాలా కీలకం కదా. 356 00:31:50,536 --> 00:31:52,371 నా బేస్మెంటులో ఒకరు ఉన్నారని నీకెవరు చెప్పారు? 357 00:31:56,250 --> 00:31:58,085 నేను అలారాలను ట్రిప్ చేయలేదు కదా. 358 00:31:59,461 --> 00:32:00,462 - మీ పని సూపర్ గా చేశారు. - అవునా? 359 00:32:00,462 --> 00:32:01,797 నేను అప్పుడే ఆఫీసు నుండి వస్తున్నా. 360 00:32:06,134 --> 00:32:06,969 అదృష్టవంతుడిని. 361 00:32:08,262 --> 00:32:09,263 కానీ నువ్వు దురదృష్టవంతుడివి. 362 00:32:10,097 --> 00:32:13,767 హేయ్, ఇది ఇలా జరగాల్సిన పని లేదు. 363 00:32:16,061 --> 00:32:17,813 అంటే, ఎవరికీ ఏమీ అవ్వాల్సిన పని లేదు. 364 00:32:19,314 --> 00:32:20,315 నీతో సహా. 365 00:32:21,191 --> 00:32:22,943 నిజం చెప్పాలంటే, జనాలకు ఏమైనా నాకు పర్లేదు. 366 00:32:24,361 --> 00:32:29,408 కానీ ప్రశ్న ఏంటంటే, "ముందు నీపై సుత్తిని ప్రయోగించనా, లేక ఇంకేదైనా ప్రయోగించనా?" అని. 367 00:32:54,850 --> 00:32:55,893 నీ పేరేంటి? 368 00:32:57,060 --> 00:32:58,437 - ర్యాన్. - ర్యాన్. 369 00:32:59,980 --> 00:33:03,942 అంతా ముగిసింది. సరేనా? కాబట్టి నీ ప్రతిఘటన ఆపేయ్, సరేనా? 370 00:33:06,111 --> 00:33:07,988 - సరే. - వద్దు. వద్దు! 371 00:35:03,312 --> 00:35:04,313 ఒలీవియా. 372 00:35:54,571 --> 00:35:56,573 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్