1 00:00:08,009 --> 00:00:12,305 ఒక గొప్ప ఫిలాసఫర్ ఒకసారి ఇలా అన్నాడు, "ప్రపంచం ఒక పుస్తకం లాంటిది 2 00:00:13,098 --> 00:00:18,478 ఆ ప్రపంచాన్ని చూడని వారు ఒక్క పేజీ మాత్రమే చదివిన వారితో సమానం." 3 00:00:26,903 --> 00:00:28,363 సరే, నన్ను అడిగితే, 4 00:00:28,363 --> 00:00:32,616 నేను కొన్ని పేజీలు తిరగేశానని చెప్పగలను, కానీ మొత్తం పుస్తకం చదవాలనే కోరికైతే నాకు లేదు. 5 00:00:33,535 --> 00:00:36,621 చాలా కారణాల వల్ల నాకు ప్రయాణాలు చేయడం అంతగా నచ్చదు. 6 00:00:37,205 --> 00:00:38,582 బాగా చల్లగా ఉంటే, 7 00:00:38,582 --> 00:00:39,666 అసౌకర్యంగా ఉంటుంది. 8 00:00:39,666 --> 00:00:41,501 ఐసులో ఈత కొట్టడమా, బట్టలు లేకుండా? 9 00:00:41,501 --> 00:00:44,379 - అవును. - భలే, చాలా మంచి ఆహ్వానంలా ఉంది. 10 00:00:46,756 --> 00:00:49,801 మరీ వేడిగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పగలరా? నాకు అసౌకర్యంగా ఉంటుంది. 11 00:00:49,801 --> 00:00:51,887 నేను అంత వేగంగా నడవలేను. 12 00:00:52,470 --> 00:00:55,223 - కానీ నాకు 75 ఏళ్ళు. - మీకు సహాయం కావాలా? 13 00:00:55,223 --> 00:00:56,433 వద్దు, అవసరం లేదు. 14 00:00:57,142 --> 00:01:01,062 బహుశా ఇప్పుడు నా రెక్కలు చాచే సమయమైందేమో. 15 00:01:06,818 --> 00:01:08,194 ఓరి, దేవుడా. 16 00:01:09,404 --> 00:01:11,823 ఒక ఏనుగు వెనుక భాగంలో చేయి పెట్టడం ఇదే మొదటి సారి. 17 00:01:12,407 --> 00:01:13,658 కానీ మంచి విషయం ఏంటంటే, 18 00:01:14,659 --> 00:01:17,954 నాకు నమ్మశక్యం కాని హోటళ్లలో గడపగలుగుతున్నాను. 19 00:01:17,954 --> 00:01:21,583 అమ్మో. ఇది భలే ఉంది. 20 00:01:26,504 --> 00:01:31,468 ఒకే ఒక్క షరతు ఏంటంటే, బయట ప్రపంచంలో ఏముందో చూస్తానని మాట ఇచ్చాను. 21 00:01:31,468 --> 00:01:33,553 - మీ అడుగులు చూసుకోండి. - అలాగే. 22 00:01:33,553 --> 00:01:35,639 - అందమైన పర్వతం. - అదొక అగ్నిపర్వతం. 23 00:01:35,639 --> 00:01:36,640 అది అగ్ని పర్వతమా? 24 00:01:36,640 --> 00:01:40,435 నేను నా జీవితమంతా దూరం పెట్టిన జీవితం ఇది. 25 00:01:41,561 --> 00:01:42,646 సేడి. 26 00:01:42,646 --> 00:01:45,315 ఓరి, నాయనో. 27 00:01:45,315 --> 00:01:48,526 ప్రాణాలతో బయట పడితే చాలు. 28 00:01:48,526 --> 00:01:51,655 ఒక ఫిన్నిష్ వ్యక్తితో అయిదు వోడ్కా షాట్ లు వేయడం ఇదే ఆఖరి సారి. 29 00:02:02,249 --> 00:02:05,168 నేను ఇప్పుడు యూరప్ ఖండం పశ్చిమ కోన దగ్గర ఉన్నాను. 30 00:02:07,295 --> 00:02:10,382 ఉత్తర అమెరికాకు అత్యంత దగ్గరగా ఉండే యూరోపియన్ నగరం ఇది, 31 00:02:11,716 --> 00:02:15,262 అయినా కూడా నాకు ఈ సిటీ గురించి ఏమాత్రం తెలీదు. 32 00:02:16,930 --> 00:02:19,933 లిస్బన్ 33 00:02:19,933 --> 00:02:21,017 నాకు యూరప్ అంటే చాలా ఇష్టం. 34 00:02:21,601 --> 00:02:23,770 నేను రోమ్, లండన్ అలాగే పారిస్ నగరాలకు వెళ్ళాను. 35 00:02:26,314 --> 00:02:29,818 మనకు సాధారణంగా ఆ సిటీల గురించి ఎక్కువగా తెలుస్తుంటుంది. 36 00:02:32,195 --> 00:02:38,118 నేను లిస్బన్ ని మ్యాప్ పై చూపలేను కూడా. ఆ మాట అనడానికే నాకు సిగ్గుగా ఉంది. 37 00:02:38,785 --> 00:02:41,830 కానీ ఈ సిటీ యూరప్ లోనే అత్యంత ఎక్కువగా సూర్యరశ్మి తగిలే సిటీ అని చెప్పారు. 38 00:02:41,830 --> 00:02:46,084 బహుశా ఈ కారణంగానే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చే యాత్రుకుల సంఖ్య రెట్టింపు అయిందేమో? 39 00:02:46,084 --> 00:02:49,129 నేను ఇక్కడ ఉండగా, నాకు ఏమాత్రం తెలీని విషయం, 40 00:02:49,129 --> 00:02:53,842 అలాగే వారికి బాగా తెలిసిన విషయం ఏంటో కనుగొనడానికి ప్రయత్నిస్తాను. 41 00:02:55,510 --> 00:02:56,720 ఆ కారు నాకోసమేనా? 42 00:02:57,762 --> 00:03:02,392 లిస్బన్ కి నన్ను ఆహ్వానిస్తూ, స్థానిక గైడ్ అలాగే అందగాడు బెర్నార్డో వచ్చాడు. 43 00:03:04,185 --> 00:03:08,690 అతని కారు తన మీసాల కంటే ఎక్కువగా ఒకప్పటి హాలీవుడ్ ని తలపిస్తోంది. 44 00:03:08,690 --> 00:03:10,817 - నాకోసమేనా? - అవును, మీకోసమే. 45 00:03:12,861 --> 00:03:13,945 - పదండి. - పదండి. 46 00:03:17,449 --> 00:03:21,119 సరే, బెర్నార్డో. నాకు లిస్బన్ గురించి చెప్పు. 47 00:03:21,119 --> 00:03:25,540 సరే, ఈ నగరం రోమ్ నగరం కంటే 400 ఏళ్ళు పురాతనమైంది. 48 00:03:26,124 --> 00:03:28,585 రోమ్ నగరం కంటే 400 ఏళ్ళు పురాతనమైందా? 49 00:03:28,585 --> 00:03:32,047 మనమైతే మన తాతలు తిరిగిన ఊర్లనే పురాతన ఊర్లుగా ఊహించుకుంటాము. 50 00:03:32,547 --> 00:03:35,884 కానీ ఈ ప్రదేశం ఇక్కడ దాదాపు 3000 ఏండ్లకు పైగానే ఉంది. 51 00:03:36,676 --> 00:03:38,011 ఇది చాలా అందంగా ఉంది. 52 00:03:38,011 --> 00:03:38,929 అవును. 53 00:03:41,848 --> 00:03:43,767 అట్లాంటిక్ మహాసముద్రం ముంగిట స్థాపించబడడంతో, 54 00:03:43,767 --> 00:03:48,855 ఈ లిస్బన్ నగరం యూరప్ ఇంకా ఆఫ్రికాల మధ్య కీలకమైన వర్తక నగరం అయింది. 55 00:03:49,564 --> 00:03:53,860 సరే, ఇది ఒకప్పటి ప్రధాన మార్కెట్. అప్పట్లో ఇక్కడే వర్తకం జరిపేవారు. 56 00:03:53,860 --> 00:03:57,239 అంటే పడవలు వచ్చినప్పుడు, సరుకులు ఇక్కడికి తెచ్చేవారన్నమాట. 57 00:03:57,239 --> 00:03:59,866 ఆ ప్రదేశంలో వ్యాపారం జరిగేది. 58 00:03:59,866 --> 00:04:00,867 అవును. 59 00:04:01,409 --> 00:04:05,247 లిస్బన్ వెలిగింది 16వ శతాబ్దంలోనే అయినా, 60 00:04:05,247 --> 00:04:09,084 ఆధునిక కాలంలో కూడా ఈ సిటీ ప్రపంచంపై గొప్ప ప్రభావాన్నే చూపించింది. 61 00:04:10,043 --> 00:04:14,548 చెప్పాలంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ సిటీని ముద్దుగా "గూఢచారుల నగరం" అనేవారు 62 00:04:14,548 --> 00:04:19,219 ఎందుకంటే నాజీ అలాగే మిత్రపక్ష దేశాల గూఢచారులు ఇక్కడ రహస్యంగా పనిచేసేవారు. 63 00:04:19,803 --> 00:04:23,932 అలాగే లిస్బన్ సిటీని ఏడు కొండల నగరం అని కూడా పిలుస్తారు. 64 00:04:23,932 --> 00:04:29,145 కానీ చూడడానికి ఇక్కడ ఏడు కాదు, ఇంకా చాలా కొండలే ఉన్నట్టు ఉన్నాయి. 65 00:04:30,188 --> 00:04:34,234 మేము వెళ్తున్న ప్రతీ మార్గాన్ని, ఆహ్, రాళ్లతో నిర్మించినట్టు ఉన్నారు. 66 00:04:34,234 --> 00:04:35,318 అవును. 67 00:04:36,695 --> 00:04:39,406 బెర్నార్డోకి మంచి కైరోప్రాక్టర్ తెలిసి ఉండాలని కోరుకుందాం. 68 00:04:40,574 --> 00:04:44,119 - సరే, యుజీన్, వచ్చేసాం. - ఆహ్. 69 00:04:44,953 --> 00:04:47,747 ఆ పేరుగాంచిన కొండలలో ఒకదానిపై ఉన్న భవనం, 70 00:04:48,331 --> 00:04:50,584 ఈ హోటల్ ఒకప్పుడు అత్యంత 71 00:04:51,293 --> 00:04:55,130 ఆడంబరంగా బ్రతికిన ఒక దొర నివసించిన ప్యాలెస్. 72 00:04:58,258 --> 00:05:01,386 - స్వాగతం, మిస్టర్ లెవీ. - చాలా చాలా బాగుంది. 73 00:05:01,386 --> 00:05:02,929 నా వేషధారణ వీరి స్థాయికి తగ్గట్టుగా లేదు. 74 00:05:03,847 --> 00:05:07,767 ఇతనికి టిప్ ఇవ్వాలో, లేక కత్తితో యుద్ధం చేయాలో నాకు అర్థం కావడం లేదు. 75 00:05:09,019 --> 00:05:10,770 భలే అందమైన ప్రదేశం. 76 00:05:11,730 --> 00:05:15,817 ఈ భవనం లోపల చేయబడిన అలంకరణలు చూస్తే, ఆ దొర రుచి ఎలాంటిదో అర్థం అవుతుంది, 77 00:05:16,818 --> 00:05:20,405 నిరాడంబరత్వం అనేది అతనికి అంత బాగా నచ్చిన విషయం కాదనుకుంటా. 78 00:05:21,406 --> 00:05:26,411 ఆ పాత ప్యాలెస్ లో ఉన్న వాటిని మేము వీలైనంతగా... సంరక్షించాలని అనుకున్నాం. 79 00:05:26,411 --> 00:05:30,415 హోటల్ మేనేజర్ మార్గరిదా నన్ను ఒక రాయల్ సూట్ కి తీసుకెళ్తోంది, 80 00:05:30,415 --> 00:05:34,502 నేను ఇక్కడే అనేక వెలకట్టలేని పురాతన వస్తువుల మధ్య సౌకర్యంగా గడపబోతున్నాను. 81 00:05:34,502 --> 00:05:35,921 చాలా చాలా అందంగా ఉంది. 82 00:05:35,921 --> 00:05:39,257 ఒక గాజు వస్తువుల షాపులో ఎలాంటి ఫీలింగ్ వస్తుందో నాకు ఇక్కడ కూడా అదే ఫీలింగ్ వస్తోంది, 83 00:05:39,257 --> 00:05:41,593 ఏమైనా విరగగొడతానేమో అని భయంగా ఉంది. 84 00:05:41,593 --> 00:05:47,015 మీరు ఇక్కడ చూసేవి అన్నీ వెర్హీది దొర అడిగినట్టే చేయబడ్డ వస్తువులు. 85 00:05:47,015 --> 00:05:50,018 - వెర్హీది దొర. - వెర్హీది. 86 00:05:50,018 --> 00:05:53,730 నేను యూదుడిని కాబట్టి నేను అలా అనగలను, 87 00:05:53,730 --> 00:05:57,692 - అలాంటి... పదాలు మాకు కామన్. - అవును... నిజం. 88 00:05:57,692 --> 00:06:00,487 - కాబట్టి పలకడం నాకు కష్టం కాదు. - కొన్ని భాషల్లోనే అలాంటి శబ్దం... 89 00:06:00,487 --> 00:06:02,280 - నిజమే. - కదా? 90 00:06:02,280 --> 00:06:07,827 అన్నీ ఆయనే చేయించాడు. సీలింగ్ మీద ఉన్న డిజైన్, చెక్కపని. 91 00:06:07,827 --> 00:06:10,705 అతను చాలా ధనవంతుడు, అతని సంపదను చూపించాలని అనుకున్నాడు. 92 00:06:12,540 --> 00:06:17,712 బాత్ రూమ్ అంటే ఇలా ఉండాలి. 93 00:06:18,380 --> 00:06:22,133 - టైల్స్ తో చేసిన పని చాలా అందంగా ఉంది. - అవును. 94 00:06:22,133 --> 00:06:25,220 హోటల్ అనేది ఇంటికి దూరంగా ఉండే ఇల్లు లాంటిది అంటుంటారు. 95 00:06:26,429 --> 00:06:29,057 నాకు గనుక ఇంటికి దూరంగా ఇలా కనిపించే ఇల్లు ఉందంటే, 96 00:06:29,558 --> 00:06:31,434 నేను చాలా సంతోషపడతాను. 97 00:06:31,434 --> 00:06:32,936 ఆ గోడ మీద ఉన్నది ఎవరి ఫోటో? 98 00:06:32,936 --> 00:06:38,692 {\an8}ఆమె ఇంగ్లాండ్ రాజును పెళ్లి చేసుకున్న పోర్చుగ్రీస్ రాణి. 99 00:06:38,692 --> 00:06:41,903 {\an8}అలాగే పోర్చుగల్ లో మాకు టీ తాగే అలవాటు ఉంది, 100 00:06:41,903 --> 00:06:46,825 నిజానికి ఇంగ్లాండ్ కి టీ తీసుకెళ్లింది ఆవిడే. 101 00:06:46,825 --> 00:06:48,785 అది చాలా గొప్ప సమాచారం. 102 00:06:48,785 --> 00:06:51,580 ఆ విషయాన్ని మీరు నా నుండే తెలుసుకున్నాను అని అందరికీ చెప్తారా? 103 00:06:51,580 --> 00:06:53,540 - అలాగే, ఓహ్, సరే. అలాగే. - సరే. అలాగే. 104 00:06:53,540 --> 00:06:56,626 - నాకు ఇది మీరే చెప్పారని అందరికీ చెప్తాను. - అలా చేస్తే చాలా సంతోషం. 105 00:06:58,587 --> 00:07:02,632 అప్పుడైతే అందరి ముందు ఏదో టీ-నిపుణుడిని అన్నట్టు ఫోజు కొట్టొచ్చు. 106 00:07:02,632 --> 00:07:06,386 - మీ తర్వాత వస్తా. అడుగు చూసుకోండి, ప్లీజ్. - అమ్మో. 107 00:07:06,386 --> 00:07:10,056 నాకు ఇప్పటికీ లిస్బన్ గురించి ఒక్క విషయం కూడా తెలీదు. 108 00:07:12,058 --> 00:07:13,184 చూడడానికి భలే ఉంది. 109 00:07:14,227 --> 00:07:17,022 సరే, నేను... నేను కిందకి చూశాను. 110 00:07:17,022 --> 00:07:18,148 - నేను అంచుకు... - బాగానే ఉన్నారా? 111 00:07:18,148 --> 00:07:19,524 ...ఎంత దగ్గరగా ఉన్నానో ముందు చూడలేదు. 112 00:07:19,524 --> 00:07:21,484 లోనికి వెళదాం పదండి. 113 00:07:21,484 --> 00:07:26,740 కానీ నేను ఆరిన గట్టి నేలపై ఉన్నప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంటానని నాకు బాగా తెలుసు. 114 00:07:26,740 --> 00:07:31,369 కానీ మార్గరిదా నాతో ఈ సముద్రయానం పట్టణ అందాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే, 115 00:07:31,369 --> 00:07:34,664 తాగస్ నదిపై ప్రయాణించాల్సిందే అని చెప్పింది. 116 00:07:35,540 --> 00:07:38,627 కాబట్టి, నేను మా టూర్ గైడ్ లుయీసతో వెళ్తున్నాను. 117 00:07:39,419 --> 00:07:41,838 - సరే. - నేను మీకు మా కెప్టెన్ 118 00:07:41,838 --> 00:07:43,548 ఏంజెలోని పరిచయం చేస్తున్నాను. 119 00:07:43,548 --> 00:07:44,758 హేయ్, ఏంజెలో. 120 00:07:44,758 --> 00:07:47,886 - మీకు స్వాగతం. బోటు నచ్చిందా? - ఆహ్, సరే. 121 00:07:47,886 --> 00:07:51,056 - నాకు ఇదే మొదటి సారి... సెయిల్ బోటు ఎక్కడం... - సరే. 122 00:07:51,056 --> 00:07:53,475 ...అలాగే ఇక్కడ పెద్దగా పనివారు ఎవరూ కనిపించడం లేదు. 123 00:07:53,475 --> 00:07:56,978 అవును, విషయం ఏంటంటే మాకు మీ సహాయం కావాలి. 124 00:07:56,978 --> 00:07:59,731 అంటే, సరే, నేను... నాకు చేతనైన సహాయం చేస్తాను. 125 00:07:59,731 --> 00:08:04,069 నాకు అసలు ఎంతవరకు చేతనవుతుందో ఏంజెలోకి అస్సలు తెలీదు. 126 00:08:04,569 --> 00:08:07,364 ఆ తాళ్లను తీయడానికి సహాయం చేస్తారా? 127 00:08:07,364 --> 00:08:09,366 - తాళ్లను తీయండి. - తాళ్లు. 128 00:08:09,366 --> 00:08:12,869 తాళ్లు అంటే నాటికల్ పరిభాషలో వేరే అర్థం ఏమైనా ఉందా లేక ఉత్తి తాళ్లేనా? 129 00:08:12,869 --> 00:08:14,621 - తాళ్లే. - ఓహ్, సరే. అలాగే. 130 00:08:14,621 --> 00:08:16,206 ఇక తెరచాపను విసురుదామా? 131 00:08:16,206 --> 00:08:17,374 తెరచాపా తెరుచుకో! 132 00:08:17,374 --> 00:08:19,376 కాదు, కాదు. మనమే దాన్ని తెరవాలి. 133 00:08:19,376 --> 00:08:20,835 - నాతో రా. - నన్ను పైకి రమ్మంటున్నారా? 134 00:08:20,835 --> 00:08:23,755 - అవును, స్టీరింగ్ గురించి ఏం చింతించకండి. - ఏం కాదు. పర్లేదు. 135 00:08:29,010 --> 00:08:31,012 ఇప్పుడు మేము ప్రయాణిస్తున్నాం. 136 00:08:32,304 --> 00:08:35,517 మన ముందు కొన్ని బొట్లు వెళ్తున్నాయి. 137 00:08:35,517 --> 00:08:37,601 - ఏం పర్లేదు. - వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదా? 138 00:08:37,601 --> 00:08:39,813 - లేదు, లేదు, పర్లేదు. - వాళ్ళు మామూలు మనుషులేకదా. 139 00:08:40,981 --> 00:08:42,315 ఇది భలే పని కదా? 140 00:08:42,315 --> 00:08:46,695 నిజమే, ప్రాణం మీద పెద్దగా ఆశలు లేకపోతే ఇది చాలా హాయిగా నడిచే ఉద్యోగం. 141 00:08:47,612 --> 00:08:51,658 ఆశ్చర్యకరంగా, నేను మమ్మల్ని అందరినీ ఆ మారిన నుండి క్షేమంగా బయటకు తీసుకొచ్చాను. 142 00:08:53,535 --> 00:08:55,662 అది ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి. 143 00:08:55,662 --> 00:08:57,956 లిస్బన్ ని పూర్తిగా తెలుసుకోవడానికి ఇదే అత్యుత్తమ మార్గం. 144 00:08:57,956 --> 00:09:01,710 మీకు పాత టౌన్, కొండలు... పేరు గాంచిన కొండలు కనిపిస్తాయి, 145 00:09:01,710 --> 00:09:03,670 అలాగే ఇక్కడ మీకు ఆ విగ్రహం కూడా కనిపిస్తుంది. 146 00:09:04,170 --> 00:09:05,964 మేము దీనిని "క్రైస్ట్ ది కింగ్" అంటాము. 147 00:09:05,964 --> 00:09:09,384 అంటే, ఆ విగ్రహాన్ని చూస్తే మీకు వెంటనే ఇంకొక దేశం గుర్తుకొస్తుంది, కదా? 148 00:09:09,384 --> 00:09:12,929 - నేనైతే, ఆహ్, బ్రెజిల్ అంటాను. అవును. - బ్రెజిల్. అవును. 149 00:09:13,430 --> 00:09:17,350 ఏమైందంటే, లిస్బన్ లోని కార్డినల్ 1930లలో రియోకి వెళ్ళాడు, 150 00:09:17,350 --> 00:09:20,854 అక్కడ చూసిన "క్రైస్ట్ ది రిడీమర్" విగ్రహాన్ని చూసి చాలా ఇష్టపడ్డాడు, 151 00:09:21,438 --> 00:09:24,733 అందుకని ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత అలాంటిదే ఇక్కడ పెట్టాలి అనుకున్నాడు. 152 00:09:25,317 --> 00:09:27,819 ఓహ్. మరి అక్కడ ఉన్నది అదేంటి? 153 00:09:27,819 --> 00:09:31,364 దానికి పెట్టిన మొదటి పేరు సలాజర్ బ్రిడ్జ్. చూస్తే మీకు ఏదైనా గుర్తుకువస్తోందా? 154 00:09:31,364 --> 00:09:34,993 అవును, అది... అవును, నిజానికి, సాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జి. 155 00:09:36,661 --> 00:09:37,996 అందుకు ఒక కారణం ఉంది, 156 00:09:37,996 --> 00:09:41,625 ఎందుకంటే లిస్బన్ కి సాన్ ఫ్రాన్సిస్కోతో ఇంకొక విషయంలో పోలిక ఉంది. 157 00:09:41,625 --> 00:09:43,001 భూకంపాలు. 158 00:09:43,877 --> 00:09:49,257 నిజం చెప్పాలంటే, 1755లో వచ్చిన భారీ భూకంపంలో నగరంలో అధికభాగం నాశనమైంది 159 00:09:49,257 --> 00:09:50,550 కాబట్టి మళ్ళీ అంతా నిర్మించారు. 160 00:09:51,134 --> 00:09:53,178 ఓహ్, అవును. మనం బ్రిడ్జ్ కింద నుండి వెళ్తున్నాం. 161 00:09:53,178 --> 00:09:55,597 బ్రిడ్జ్ డిజైనింగ్ విషయానికి వస్తే, 162 00:09:55,597 --> 00:09:58,725 భూకంపాలకు పడిపోకుండా ఉండడానికి అమెరికన్లను ఆ పనికి పెట్టారు, 163 00:09:59,226 --> 00:10:00,560 కాలిఫోర్నియాలో కట్టినట్టు కట్టడానికి. 164 00:10:03,521 --> 00:10:04,856 తెలుసా, లిస్బన్ లో, 165 00:10:04,856 --> 00:10:08,735 మీరు ప్రపంచంలోని ప్రతీ భాగాన్ని ఒకే సిటీలో కొంచెం కొంచెంగా చూడగలరు, 166 00:10:13,156 --> 00:10:16,326 లిస్బన్ ఆకాశ రేఖను చూడగానే అంతర్జాతీయత ఉట్టిపడుతుంది, 167 00:10:16,826 --> 00:10:18,995 అనేక సంవత్సరాలుగా ప్రపంచ సంస్కృతులు కలిసిన ప్రదేశం కదా. 168 00:10:22,707 --> 00:10:27,420 చాలా మందికి తెలీని ఒక విషయాన్ని వేడుక చేసుకోవడానికి ఈ స్మారక చిహ్నం పెట్టబడింది. 169 00:10:29,339 --> 00:10:33,635 నిజానికి లిస్బన్ నుండి నావికులు నూతన ప్రపంచాన్ని కనుగొనడానికి... 170 00:10:33,635 --> 00:10:35,804 - సరే. - ...బయలుదేరింది ఇక్కడి నుండే. 171 00:10:37,222 --> 00:10:39,724 15వ అలాగే 16వ శతాబ్దాలలో, 172 00:10:39,724 --> 00:10:44,646 పోర్చుగీస్ వారే ఇండియా, బ్రెజిల్, చైనా ఇంకా జపాన్ దేశాలకు సముద్ర మార్గాలను కనుగొన్నారు. 173 00:10:45,146 --> 00:10:50,652 దాంతో ఒక్కసారిగా కొత్త ప్రజలు, అన్యదేశ ఉత్పత్తులు ఇక్కడికి రావడం మొదలైంది. 174 00:10:50,652 --> 00:10:54,948 యూరప్ అంతటిలో లిస్బన్ అత్యంత ధనిక నగరంగా మారింది. 175 00:10:57,033 --> 00:11:00,787 ఈ నగరాన్ని నేను చూపెట్టలేని మ్యాప్ నే తయారుచేయడంలో ఈ నగరం 176 00:11:00,787 --> 00:11:02,914 సహాయం చేసింది అంటే నమ్మలేకపోతున్నాను. 177 00:11:04,749 --> 00:11:09,045 ఇప్పటికీ పోర్చుగీస్ ప్రజలు ప్రపంచాన్ని అన్వేషించడానికి ఇష్టపడుతుంటారు. 178 00:11:09,045 --> 00:11:11,882 మాకు బయటకు వెళ్లి, కొత్త అనుభవాలను పొందడం ఇష్టం. 179 00:11:12,507 --> 00:11:15,594 మీ సంగతి ఏంటి? మీకు కూడా ప్రయాణించడం నచ్చుతుందా... 180 00:11:15,594 --> 00:11:16,720 నేను... అంటే, 181 00:11:16,720 --> 00:11:19,639 - సాహసం నా ఇంటిపేరు, లుయీస. - అద్భుతం. 182 00:11:19,639 --> 00:11:21,308 - అంటే, ప్రపంచాన్ని అన్వేషించడం... - హ్మ్. 183 00:11:21,308 --> 00:11:22,517 ...నా నైజం. 184 00:11:22,517 --> 00:11:24,185 అంటే మీరు కూడా పోర్చుగీస్ వారి లాంటి వ్యక్తే. 185 00:11:24,185 --> 00:11:26,813 నాలో కూడా కొన్ని పోర్చుగీస్ గుణాలు ఉన్నాయి అనొచ్చు లెండి. 186 00:11:26,813 --> 00:11:27,731 నేను చెప్పింది అబద్ధమే. 187 00:11:27,731 --> 00:11:31,860 నేను ప్రయాణాలను ఇష్టపడే వ్యక్తిని అనుకోని ఆమె ఆసక్తి పెరగడం చూసి అలా చెప్పాను. 188 00:11:31,860 --> 00:11:34,863 కాకపోతే కాస్త అతిగా వాగినట్టు ఉన్నాను. 189 00:11:35,530 --> 00:11:37,032 నాకు సాహసాలు చేయడం అస్సలు నచ్చదు. 190 00:11:37,824 --> 00:11:39,284 ఇలాంటి సమయంలోనే నటన సహాయ పడుతుంది. 191 00:11:39,826 --> 00:11:45,790 అంత చాకచక్యంగా మనలో ఉన్న అసమర్ధతను దాచుకోగలిగినప్పుడు, కచ్చితంగా ఆస్కార్ ఇవ్వాల్సిందే. 192 00:11:48,627 --> 00:11:51,254 రోజంతా షిప్ ని నడిపించి అలసిపోయిన తర్వాత, 193 00:11:51,254 --> 00:11:55,592 నేను నటించాల్సిన అవసరం లేని ఒకే ఒక్క విషయం కాక్టైల్స్ పై నాకున్న ఇష్టం. 194 00:11:56,509 --> 00:12:00,096 అలాగే ఈ హోటల్ వారు నావికా శైలిలో వీటిని భలే ఇస్తున్నారు. 195 00:12:00,096 --> 00:12:02,390 ఓహ్, ఇది ఒక బోట్ అన్నమాట. 196 00:12:02,390 --> 00:12:05,227 ఇప్పుడు అర్థమైంది. తెరచాపలు. 197 00:12:09,314 --> 00:12:10,190 ఓహ్, భలే ఉంది. 198 00:12:14,319 --> 00:12:18,031 సాయంత్రపు డ్రింక్స్ ని పక్కనే సంగీతం వాయిస్తూ సెర్వ్ చేస్తున్నారు. 199 00:12:19,866 --> 00:12:23,620 ఇది సాయంత్రపు వేళలో ఆస్వాదించడానికి లిస్బన్ లో ప్రసిద్ధిగాంచిన సంగీతం, ఫాడో. 200 00:12:24,120 --> 00:12:29,084 వీరి ఆనవాయితీ ప్రకారం, ఇది నావికుల సంగీతం, ప్రస్తుతం నేను కూడా నావికుడినే అనుకోండి. 201 00:12:32,587 --> 00:12:35,215 ఈ రాత్రికి ఒక మెగాస్టార్ పాడబోతున్నాడు. 202 00:12:38,885 --> 00:12:41,513 ఇతన్ని ఫాడో సంగీతానికి బానో అనుకుందాం. 203 00:12:46,184 --> 00:12:48,228 మిమ్మల్ని కలవడం సంతోషం. ఎలా ఉన్నారు? నా పేరు హెల్డర్. 204 00:12:48,228 --> 00:12:49,312 - హెల్డర్? - హెల్డర్. 205 00:12:50,772 --> 00:12:53,024 ఈ సంగీతం ఎలా మొదలైంది? 206 00:12:53,024 --> 00:12:57,070 మొట్టమొదటి ఫాడో పాట పాడింది ఒక మహిళ. ఆమె పేరు మరియా సెవెర. 207 00:12:57,779 --> 00:13:01,992 ఆమె ఒక... ఒక వేశ్య, అలాగే ఆమె గిటార్ వాయించేది. 208 00:13:02,617 --> 00:13:05,245 - ఒక వేశ్యా? - అవును. 209 00:13:07,581 --> 00:13:09,499 అది ఆసక్తికరమైన చరిత్ర. 210 00:13:09,499 --> 00:13:12,752 ఆ రాగాలను కనిపెట్టింది ఒక వేశ్య అని నేను అస్సలు 211 00:13:12,752 --> 00:13:15,463 కనిపెట్టి, ఆహ్, ఉండేవాడిని కాదు. 212 00:13:15,964 --> 00:13:17,424 కానీ ఆమెకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. 213 00:13:18,049 --> 00:13:20,969 అప్పట్లో క్రెడిట్ తీసుకొని ఉండేది కాదు ఏమో. 214 00:13:21,511 --> 00:13:23,763 కేవలం క్యాష్, ఆహ్, మాత్రమే. 215 00:13:24,973 --> 00:13:27,517 చాలా పొడవాటి రాగాలు ఉన్నాయి. 216 00:13:27,517 --> 00:13:30,604 అబ్బా, ఫాడో పాడాలి అంటే బలమైన గాత్రం ఉండాల్సిందే. 217 00:13:30,604 --> 00:13:32,314 మీరు కూడా మ్యుజిషియనా? 218 00:13:32,314 --> 00:13:34,190 - కో... - కానీ మీరు వాయిద్యాన్ని వాయిస్తారు కదా? 219 00:13:34,190 --> 00:13:35,567 - కొంచెం, ఆహ్... - ఓహ్, అంత బాగోదు. 220 00:13:35,567 --> 00:13:37,027 ఏం వాయిస్తారు? 221 00:13:37,027 --> 00:13:38,278 - గిటార్. - గిటార్? 222 00:13:38,278 --> 00:13:42,198 ఆహ్, ఇంకొక రెండు రోజులలో, మేము ఇంకొక, ఆహ్, ఫాడో క్లబ్ కి వెళ్తున్నాం. 223 00:13:42,198 --> 00:13:45,827 మీరు అక్కడికి వచ్చి కొంచెం... కొంచెం వాయించవచ్చు కదా? 224 00:13:47,746 --> 00:13:51,166 ఆయన చాలా మంచిగా నన్ను ప్రదర్శించమని అడుగుతున్నాడు. 225 00:13:51,708 --> 00:13:55,295 కానీ నేను ఆయనతో కలిసి గిటార్ వాయించడం అంటే... 226 00:13:55,295 --> 00:13:58,882 నేను ఆయన పాటను నాశనం చేసేస్తాను. 227 00:13:58,882 --> 00:14:01,551 నేను మీతో కలిసి ప్లే చేయగలనో లేదో... 228 00:14:01,551 --> 00:14:03,053 - సరే, కనీసం ప్రయత్నించండి. - ...తెలీదు. 229 00:14:03,053 --> 00:14:04,763 ఉమ్. మ్మ్. 230 00:14:04,763 --> 00:14:09,851 అనుకోకుండా తప్పుడు సమయంలో తప్పుడు నోట్ వాయించి అతనికి కోపం తెప్పించడం నాకు ఇష్టం లేదు. 231 00:14:10,602 --> 00:14:13,313 నేను గిటార్ వాయించి చాలా ఏళ్ళు అవుతుంది. 232 00:14:13,313 --> 00:14:16,233 నన్ను నమ్మండి, అందరి ముందు పరువు పోగొట్టుకోవడం నాకు అంత నచ్చదు. 233 00:14:17,776 --> 00:14:20,237 కానీ బహుశా హెల్డర్ తో కలిసి స్టేజి మీద 234 00:14:20,237 --> 00:14:24,032 వాయించడమే నన్ను నేను అర్థం చేసుకోవడానికి అవసరమైన అన్వేషణ అయ్యుండొచ్చు. 235 00:14:28,078 --> 00:14:33,333 లిస్బన్ లో సూర్యుని వెలుగుతో కళకళలాడే 220 రోజులలో ఇది ఇంకొక రోజు. 236 00:14:35,335 --> 00:14:38,588 సరే, కొత్త వాటిని ట్రై చేయాలంటే నాకు చమటలు పడతాయని అందరికీ తెలుసు, 237 00:14:38,588 --> 00:14:41,633 కానీ ఆహారం విషయంలో ఆ భయం నాకు ఇంకా ఎక్కువ. 238 00:14:42,467 --> 00:14:44,886 కానీ ఈ ప్రదేశం ఆహార ప్రియులకు స్వర్గధామం, 239 00:14:44,886 --> 00:14:48,098 కాబట్టి నేను ఇక్కడి రుచులు చూడడానికి టౌన్ లోకి వెళ్తున్నాను. 240 00:14:48,723 --> 00:14:50,684 ముందుగా నేను టౌన్ లోకి వెళ్ళాలి. 241 00:14:51,726 --> 00:14:56,147 లిస్బన్ లో ఐకానిక్ రవాణా ఏదైనా ఉందంటే అది ఇక్కడి ట్రాములే. 242 00:14:56,147 --> 00:15:00,068 తప్పుగా అనుకోకండి, నాకు వ్యాయామం చేయడం అంటే చాలా చాలా ఇష్టం. 243 00:15:00,944 --> 00:15:02,737 కానీ ఇక్కడ చాలా గుట్టలు ఉన్నాయి. 244 00:15:03,530 --> 00:15:06,992 అమెరికాలో ఉన్న కేబుల్ కార్లను స్ఫూర్తిగా తీసుకొని చేయబడిన వీటిని, 245 00:15:06,992 --> 00:15:09,786 ప్రారంభంలో వీళ్ళు అమెరికానోలు అనేవారు. 246 00:15:10,829 --> 00:15:12,163 ముందెప్పుడూ ట్రామ్ మీద ప్రయాణించింది లేదు. 247 00:15:12,872 --> 00:15:18,253 టొరంటోలో స్ట్రీట్ కారులు ఉన్నాయి, కానీ ట్రామ్లు లేవు. 248 00:15:20,297 --> 00:15:25,594 నాకు పెద్దగా సడన్ ట్విస్టులు ఇవ్వని రవాణాలో ప్రయాణించడమే నచ్చుతుంది. 249 00:15:31,766 --> 00:15:34,311 - ఒక సమస్య ఎదురైంది అనుకుంటున్నాను. - సమస్య ఎదురైందా? 250 00:15:34,895 --> 00:15:35,812 కార్ అడ్డుగా పార్క్ చేశారు. 251 00:15:36,396 --> 00:15:38,481 అంటే, ఇది... నేను వెళ్లి ఏమైనా చేయాల్సిందే. 252 00:15:42,068 --> 00:15:46,531 ఇక్కడ ఒక కారు పార్క్ చేశారు. అది ట్రాక్స్ కి మరీ దగ్గరగా ఉంది. 253 00:15:47,699 --> 00:15:51,453 నేను ఇలాంటి అత్యవసర పరిస్థితి ఎదురవుతుంది అని అస్సలు ఊహించలేదు. 254 00:15:52,120 --> 00:15:54,915 - పోనిచ్చేయొచ్చు కదా. - లేదు, లేదు, ప్లీజ్. 255 00:15:55,957 --> 00:15:58,919 నేనే గనుక డ్రైవర్ ని అయితే, గుద్దుకొని పోయేవాడిని, 256 00:15:58,919 --> 00:16:02,088 కారు ముందు భాగాన్ని చిత్తు చేసేసేవాడిని, తెలుసా? 257 00:16:02,088 --> 00:16:03,256 అలా చేయకూడదా? 258 00:16:03,256 --> 00:16:05,217 - నువ్వు పోనిచ్చేయకూడదా? - లేదు, కుదరదు. 259 00:16:05,217 --> 00:16:07,302 - నాదే తప్పు అంటారు. - కానీ అది వాళ్ళ తప్పు కదా. 260 00:16:07,302 --> 00:16:08,887 ఇలా అస్తమాను అవుతుందా? 261 00:16:09,721 --> 00:16:11,598 ఇది... తరచుగా అవుతుంది. 262 00:16:11,598 --> 00:16:17,270 ఆ కారుకు ఫైన్ వేస్తారు, అయినా అక్కడే వదిలేస్తే దాని తీసుకుపోతారు. 263 00:16:17,938 --> 00:16:20,899 అంతా మామూలైపోతుంది. నన్నడిగితే అదే శుభం కార్డు పడినట్టు అంటాను. 264 00:16:21,858 --> 00:16:25,278 కానీ దురదృష్టవశాత్తు, అక్కడే కూర్చొని న్యాయం జరిగేవరకు ఎదురుచూసే సమయం నాకు లేదు. 265 00:16:25,278 --> 00:16:30,951 కాబట్టి ఇక్కడి రుచులు చూడడానికి నేను కాలి బాట పట్టక తప్పేలా లేదు. 266 00:16:30,951 --> 00:16:33,161 యుజీన్, నా పేరు లుయీస. 267 00:16:33,161 --> 00:16:36,665 - లుయీస, నిన్ను కలవడం సంతోషం. - రానున్న కొన్ని గంటలు మీ యోగక్షేమాలు 268 00:16:36,665 --> 00:16:38,166 ఇక నా బాధ్యత. 269 00:16:38,166 --> 00:16:39,084 ఆహ! 270 00:16:39,084 --> 00:16:42,045 నా కడుపులోకి ఏం వెళ్ళాలి అనే విషయంలో బాధ్యత మీదే. 271 00:16:42,045 --> 00:16:45,298 అలాగే పోర్చుగల్ లో మాకు ఆహారం అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు అర్థం కావాలనేది నా కోరిక. 272 00:16:45,298 --> 00:16:49,177 మాకు మొదట నచ్చేది ఆహారం, రెండవది కూడా ఆహారమే, మూడవది ఆహారం అలాగే సూర్యుడు. 273 00:16:49,177 --> 00:16:50,387 నేను అర్థం చేసుకోగలను. అర్థమైంది. 274 00:16:50,387 --> 00:16:54,641 సరే, మీ భోజనాన్ని వండడానికి మనకు కావాల్సిన వాటిని కొందాం. 275 00:16:54,641 --> 00:16:58,478 లుయీస ఇక్కడ వంటల క్లాసులు చెప్పే ఒక స్థానిక చెఫ్. 276 00:16:58,478 --> 00:17:02,107 సరే, ఇది లిస్బన్ అంతటిలో అత్యుత్తమ మార్కెట్. 277 00:17:02,107 --> 00:17:04,276 నేను ఇక్కడికి రోజూ వస్తాను, ఎందుకో తెలుసా? 278 00:17:04,276 --> 00:17:07,112 మీరు ఒక దేశాన్ని, అక్కడి సంస్కృతిని తెలుసుకోవాలంటే 279 00:17:07,112 --> 00:17:09,030 - ఆహారం ద్వారానే సాధ్యం. - అది నిజం. 280 00:17:09,613 --> 00:17:13,868 అలాగే అంతర్జాతీయ ఆహారం అంటే లిస్బన్ లో చాలా ఆదరణ ఉంది. 281 00:17:13,868 --> 00:17:18,957 మేము ప్రపంచం అంతటి నుండి అనేక రుచులు, దినుసులు పోర్చుగల్ కి తీసుకొచ్చాము. 282 00:17:18,957 --> 00:17:21,668 విశాలమైన పోర్చుగీస్ ట్రేడింగ్ వ్యవస్థ 283 00:17:21,668 --> 00:17:26,339 ఆఫ్రికా, ఇండియా అలాగే సుదూర తూర్పు ప్రాంతాల నుండి ఆహారాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. 284 00:17:26,339 --> 00:17:32,220 - నేను పిరిపిరి సాస్ గురించి చాలా విన్నాను... - వావ్. 285 00:17:32,220 --> 00:17:36,224 ...పోర్చుగీస్ వంటకాలలో అత్యంత రుచికరమైన వంట అని. 286 00:17:36,224 --> 00:17:37,726 మీకు పిరిపిరి సాస్ బాగా నచ్చుతుంది. 287 00:17:37,726 --> 00:17:42,314 ఇక్కడి నావికులు మొజాంబిక్యూలో కారం బాగా ఉండే పక్షి కన్ను మిర్చిని కనుగొని 288 00:17:42,314 --> 00:17:44,608 దాని నుండి పిరిపిరిని సృష్టించారు. 289 00:17:44,608 --> 00:17:47,319 దానికి అర్థం స్వాహిలిలో, "మిర్చి, మిర్చి" అని. 290 00:17:48,320 --> 00:17:51,156 తీవ్రమైన ఘాటు కారణంగా, దాన్ని రెండుసార్లు పిలిచారు. 291 00:17:51,156 --> 00:17:54,075 - ఇవి చూడడానికి బాగా కారం ఉండేలా ఉన్నాయి. కారం ఉంటాయా? - అన్నీ చాలా కారం ఉంటాయి. 292 00:17:54,075 --> 00:17:56,286 - కారం అంటే, కా-కా-కా-కారం అనేలాగా? - అవును, అవును. 293 00:17:56,870 --> 00:17:59,581 "నాకు టమాటా సాస్ అయితే బాగా నచ్చుతుంది" అని చెప్పడానికి 294 00:17:59,581 --> 00:18:01,833 నాకు కొంచెం పోర్చుగీస్ వచ్చి ఉంటే బాగుండు. 295 00:18:03,126 --> 00:18:07,923 తర్వాత మెనూలో ఉన్న ఐటమ్ ని స్థానికులు పిరి పిరికన్నా ఎక్కువగా ఇష్టపడతారు. 296 00:18:07,923 --> 00:18:08,840 చేపలు. 297 00:18:09,424 --> 00:18:12,761 కేవలం జపాన్ ఇంకా ఐస్లాండ్ వారు మాత్రమే సగటున మాకంటే ఎక్కువ చేపలు తింటారు. 298 00:18:12,761 --> 00:18:16,514 సరే, మనం ఆ చేపను వండుకోబోతున్నాము. 299 00:18:17,182 --> 00:18:18,183 అమ్మో. 300 00:18:19,059 --> 00:18:22,187 నీకు చేపల మార్కెట్లు అంటే మొదటి నుండి అంత ఇష్టం లేదు, 301 00:18:22,771 --> 00:18:24,981 చేపలకు కూడా అంత ఇష్టం ఉండి ఉండదులే. 302 00:18:28,735 --> 00:18:29,736 నాకు ఆ శబ్దం వినిపిస్తోంది. 303 00:18:30,445 --> 00:18:31,446 ఏదో విరుగుతున్నట్టు ఉంది. 304 00:18:32,864 --> 00:18:34,074 వావ్. 305 00:18:39,162 --> 00:18:41,623 ఇందుకే నేను చేపలు పట్టడం జరిగేపని కాదు. 306 00:18:43,708 --> 00:18:47,170 ఆ చేప కన్నులు నన్ను చూసిన ఆ దృశ్యం ఎన్నో ఏళ్ళు నా మదిలో 307 00:18:47,170 --> 00:18:48,255 ఉండిపోబోతుంది. 308 00:18:53,426 --> 00:18:56,513 కానీ ఇప్పుడు నాకు ఇంకాస్త అలవాటు లేని పని చేయడానికి వచ్చాను. 309 00:18:57,013 --> 00:18:59,766 నా చిన్ని ఇంటికి మీకు స్వాగతం. 310 00:18:59,766 --> 00:19:00,684 వంటలు. 311 00:19:02,435 --> 00:19:07,399 సరే, యుజీన్, ఇక్కడ మన ముందు పిరిపిరి సాస్ చేయడానికి అవసరమైనవి ఉన్నాయి. 312 00:19:07,399 --> 00:19:09,025 సరే, నేను దీనిని కోస్తాను. 313 00:19:09,025 --> 00:19:10,986 - ముందుగా, దీనిని ఇలా కోస్తాను. - అవును. 314 00:19:10,986 --> 00:19:12,028 దీనిని సన్నగా కోయాలా? 315 00:19:12,028 --> 00:19:14,781 - ముందు దాని తొక్క తీయాలి, యుజీన్. - ఆహ్? ఓహ్, మీరు తొక్క తీస్తారా? 316 00:19:14,781 --> 00:19:16,283 - అవును. - ఓహ్, సరే. 317 00:19:16,283 --> 00:19:18,243 - ఉల్లిపాయలకు తొక్క తీయాలి. - అంటే, మా సంస్కృతిలో అలా చేయము. 318 00:19:19,536 --> 00:19:22,539 నాకు తినడం అంటే ఇష్టం. దానిని వండడం మాత్రం అంత నచ్చదు, సరేనా? 319 00:19:22,539 --> 00:19:26,001 వంటలు చేసేటప్పుడు జనం గురించి మనం చాలా తెలుసుకోగలం, కదా? 320 00:19:26,001 --> 00:19:30,088 అంటే, ఇక ఇంతకంటే... మీ ముందు పని చేయాలంటే... నాకు భయంగా ఉంది. 321 00:19:30,839 --> 00:19:35,135 నేను నా భార్యతో వెళ్లిన మొట్టమొదటి డేట్ లో, 322 00:19:35,135 --> 00:19:39,890 నేను కొంచెం టీ చేయడానికి ప్రయత్నించా, నేను టీబ్యాగుని కప్పులో పెట్టి 323 00:19:39,890 --> 00:19:42,142 దానిని ఒక స్పూన్ తో నొక్కడం మొదలెట్టాను. 324 00:19:42,142 --> 00:19:44,227 ఆమె, "నువ్వు ఏం చేస్తున్నావు?" అంది. 325 00:19:44,227 --> 00:19:45,729 నేను, "నీకు ఒక కప్పు టీ చేస్తున్నాను" అన్నాను. 326 00:19:45,729 --> 00:19:47,939 ఆమె, "అయితే టీని వేడి నీళ్లలో వేయవా?" అంది. 327 00:19:47,939 --> 00:19:50,108 నేను, "అదెలా చేస్తారో నాకు తెలీదు" అన్నాను. 328 00:19:50,108 --> 00:19:52,819 అలా వాదించుకోవడం మొదలెట్టాము. అది మా మొట్టమొదటి డేట్. 329 00:19:52,819 --> 00:19:55,488 ఆమెను తిరిగి గెలుచుకోవడానికి మీరు కష్టపడ్డారా? 330 00:19:55,488 --> 00:19:56,990 లేదు, నాకెలాంటి ఇబ్బంది రాలేదు. 331 00:19:56,990 --> 00:20:00,201 ఆమె నా వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయింది. 332 00:20:00,201 --> 00:20:01,870 ఆమె మిమ్మల్ని చాలా ప్రేమించింది. 333 00:20:01,870 --> 00:20:03,371 ఆహ్, మెల్లిమెల్లిగా. 334 00:20:03,371 --> 00:20:04,915 మీకు పెళ్లి అయి ఎన్నాళ్లు అయింది? 335 00:20:04,915 --> 00:20:10,295 మాకు పెళ్లి అయి 45 ఏళ్ళు అవుతుంది. 336 00:20:11,087 --> 00:20:12,964 - వావ్, అది గొప్ప విషయం. - అవును. 337 00:20:12,964 --> 00:20:16,593 నేను... మాదే నాకు తెలిసిన సుదీర్ఘ కాల పెళ్లి అని అనుకుంటున్నాను. 338 00:20:16,593 --> 00:20:18,220 - అయితే మీకు పెళ్లి అయి... - ముప్పై ఎనిమిది. 339 00:20:18,220 --> 00:20:19,137 - ముప్పై ఎనిమిదా? - అవును. 340 00:20:19,137 --> 00:20:20,805 - అంటే, దగ్గర దగ్గరగానే ఉంది. - అవును. 341 00:20:20,805 --> 00:20:22,015 - మీకంటే ఏడేళ్లు ఎక్కువ అంతే. - అవును. 342 00:20:22,015 --> 00:20:24,142 ఇప్పుడిక విడాకులు తీసుకొని లాభం లేదు. 343 00:20:25,685 --> 00:20:27,687 - లేదు. - లేదు. ఎలాంటి... ఎలాంటి ప్రయోజనం లేదు. 344 00:20:27,687 --> 00:20:31,566 మా భార్య ఒకటి అంటుంటుంది, మళ్ళీ పెళ్ళి చేసుకుంటే, కొత్త అత్తమామలతో వేగాలి అని. 345 00:20:31,566 --> 00:20:32,943 - అవును, నిజమే. - కదా? 346 00:20:33,818 --> 00:20:37,113 ఏమైనా కానీ, నేను మీ భార్యకు ఒక లెటర్ రాయాలి, 347 00:20:37,113 --> 00:20:40,533 - మీ వల్ల ఆమె ఇబ్బంది పడుతుంటుంది అనిపిస్తుంది. - నిజమే. 348 00:20:41,284 --> 00:20:44,871 లుయీసకి నాతో ఆమె చేయించగల అత్యుత్తమమైన పని 349 00:20:44,871 --> 00:20:47,499 నేను వంట చూస్తూ ఏమైనా తినమనడమే అని అర్థమైంది. 350 00:20:48,083 --> 00:20:49,376 - మిర్చీలా? - మిర్చీలు. 351 00:20:49,376 --> 00:20:50,335 నిమ్మకాయ. 352 00:20:50,835 --> 00:20:54,422 ఒక మంచి పిరి పిరిలో, మిర్చీల మంట తగ్గించడానికి 353 00:20:54,422 --> 00:20:59,803 జాగ్రత్తగా నిమ్మకాయ, వెల్లుల్లి, ఉల్లి ఇంకా ఉప్పు వేస్తారు. 354 00:21:00,303 --> 00:21:03,181 చివరికి నేను అక్కడికి వెళ్లినందుకు ఉపయోగపడిన తర్వాత... 355 00:21:04,015 --> 00:21:05,475 - చాలా? - చాలు. 356 00:21:05,475 --> 00:21:06,893 ...సాస్ సిద్ధమైంది. 357 00:21:06,893 --> 00:21:10,063 నేను ఇప్పుడు చేపను నానబెడతాను. 358 00:21:10,063 --> 00:21:12,857 అలాగే పోర్చుగీస్ సంప్రదాయాన్ని ఫాలో అవుతూ, 359 00:21:12,857 --> 00:21:17,153 లుయీస ఆ చేపను మరిన్ని పదార్దాలలో ముంచి తీస్తుంది. 360 00:21:17,153 --> 00:21:19,364 ఆ చేప పాలలో ఉంది. 361 00:21:20,865 --> 00:21:22,951 - ఏంటి? - మీరు నా మనవడికంటే దారుణం. 362 00:21:22,951 --> 00:21:24,160 నేను అన్నీ తినలేను. 363 00:21:24,160 --> 00:21:27,497 - దీని వల్ల... - చేప మెత్తబడుతుందా? 364 00:21:27,497 --> 00:21:29,749 - ...చేప మెత్తబడుతుంది. తింటే మీకే అర్థమవుతుంది. - అవునా? 365 00:21:31,835 --> 00:21:36,923 ఆమె చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడింది, కాబట్టి ఆమెపై నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. 366 00:21:38,091 --> 00:21:39,384 నాకు భయంగా ఉంది. 367 00:21:40,802 --> 00:21:44,931 చేప, అలాగే పిరి పిరి సాస్. జాగ్రత్తగా ఉండండి. 368 00:21:46,016 --> 00:21:47,017 సరే. 369 00:21:52,939 --> 00:21:56,026 ఓరి, నాయనో. ఇది అద్భుతంగా ఉంది. 370 00:21:57,193 --> 00:22:00,947 నేను తిన్న అత్యంత రుచికరమైన వంటకం ఇదే, పోర్చుగల్ లో. 371 00:22:00,947 --> 00:22:03,825 అద్భుతం. నన్ను నమ్మినందుకు థాంక్స్. 372 00:22:03,825 --> 00:22:07,579 భోజనం విషయంలో నేను అంత ఛండాలంగా ఏం చేయలేదని నా ఉద్దేశం. 373 00:22:09,039 --> 00:22:11,333 లుయీసతో పనులు చెప్పించుకోవడం నాకేం ఇబ్బందిగా లేదు. 374 00:22:11,833 --> 00:22:13,793 - చేప కోసం. - చేప కోసం. 375 00:22:15,629 --> 00:22:18,965 లిస్బన్ ప్రజలపై వింతైన ప్రభావం చూపుతుంది అని నాకు అర్థమైంది. 376 00:22:19,466 --> 00:22:23,386 నేను కొత్తవాటిని ప్రయత్నించడం మాత్రమే కాదు, కొన్నిటిని ఇష్టపడుతున్నాను కూడా. 377 00:22:24,512 --> 00:22:28,516 బహుశా ఈ టౌన్ కు ఉన్న సాహసోపేతమైన గుణం నాకు కూడా అబ్బుతుందేమో. 378 00:22:30,018 --> 00:22:34,189 కానీ నేను సిద్ధపడాల్సిన ఇంకొక పెద్ద విషయం ఉంది, హెల్డర్ తో సంగీతం వాయించడం. 379 00:22:34,898 --> 00:22:37,692 నాకు ఏదీ గుర్తుకురావడం లేదు. 380 00:22:39,361 --> 00:22:41,655 నేను గిటార్ ని ముట్టుకొనే చాలా ఏళ్ళు అవుతుంది. 381 00:22:41,655 --> 00:22:47,160 నేను వాయించడం వింటే, అక్కడక్కడా తప్పులు చేస్తున్నానని తెలుస్తుంది. 382 00:22:47,911 --> 00:22:51,748 కాబట్టి, స్టేజి ఎక్కి అనవసరమైన గోల చేసేలా ఉన్నాను. 383 00:22:52,499 --> 00:22:57,087 నా ఒక్కడి కారణంగా వాళ్ళ ప్రదర్శన మొత్తం పాడయ్యే అవకాశం ఉంది. 384 00:22:57,087 --> 00:23:00,549 కానీ ఫాడో సంగీతం అంటేనే అంత కదా? ఏమంటారు? 385 00:23:01,091 --> 00:23:05,095 కాబట్టి, ఒక మెరుగైన మ్యుజిషియన్ కావాలన్న వాళ్ల కోరికను 386 00:23:05,887 --> 00:23:08,515 దీనితో కలిసి అక్కడ తీర్చడం నాకు సంతోషమే. 387 00:23:10,767 --> 00:23:14,813 అవును, నేను రాత్రంతా మేల్కొని ప్రాక్టీసు చేయాల్సి వచ్చింది. 388 00:23:22,946 --> 00:23:28,243 ఇవాళ ఉదయం, హోటల్ యాజమాని కీస్ నన్ను అలా షికారుకు తీసుకెళ్తాను అన్నాడు, 389 00:23:28,243 --> 00:23:30,662 బయటకు వెళ్లడం నాకు నచ్చుతుంది అన్నాడు. 390 00:23:30,662 --> 00:23:33,456 గుడ్ మార్నింగ్. 391 00:23:33,456 --> 00:23:37,043 - మీ స్టయిల్ భలే అదిరిపోయింది. నాకు బాగా నచ్చింది. - అవునా? 392 00:23:37,043 --> 00:23:40,839 నా కొడుకైతే ఈ బట్టలు చూసి 393 00:23:40,839 --> 00:23:42,132 - బాగా ఇష్టపడేవాడు. - అవునా? 394 00:23:43,466 --> 00:23:46,845 డచ్ వాడైన కీస్ 40 ఏండ్ల క్రితం ప్రపంచమంతా విహరించిన తర్వాత 395 00:23:46,845 --> 00:23:48,513 ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు. 396 00:23:49,639 --> 00:23:51,182 నేను ఇక్కడికి రావడానికి కారణం 397 00:23:51,182 --> 00:23:54,269 ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాలలో లిస్బన్ కూడా ఒకటి. 398 00:23:54,269 --> 00:23:57,063 ఆ విషయం నాతో ఒప్పించాలన్న ప్రయత్నంగా 399 00:23:57,063 --> 00:24:00,817 అతను నన్ను మచ్చిక చేసుకోవడానికి ఒక దారి కనుగొన్నాడు: పేస్ట్రీలు. 400 00:24:00,817 --> 00:24:04,696 నేను మీకోసం కొన్ని చిన్న కస్టర్డ్ టార్ట్ లు కొంటాను. 401 00:24:04,696 --> 00:24:06,197 కస్టర్డ్ టార్ట్ లా? 402 00:24:06,197 --> 00:24:09,367 అరెరే. నాకు ఇవి భలే నచ్చాయి. 403 00:24:09,367 --> 00:24:11,995 ఈ పాస్టెల్ డే నాటస్ వెనుకున్న కథ ప్రకారం సన్యాసినీలు 404 00:24:11,995 --> 00:24:15,498 తమ అలవాట్ల కారణంగా గుడ్డు తెల్ల సొనని మాత్రమే వాడుకునేవారు, 405 00:24:15,498 --> 00:24:19,085 కారణంగా సన్యాసులు మిగిలిన పచ్చ సొనను కస్టర్డ్ గా చేయడం మొదలెట్టారు. 406 00:24:19,586 --> 00:24:21,838 ఆ సన్యాసులను చల్లగా ఉండాలి. ఏమంటారు? 407 00:24:22,464 --> 00:24:23,465 నేను ఇక ఎదురుచూడలేను. 408 00:24:29,262 --> 00:24:31,973 ఇక్కడ ప్రతీ వీధిలో మీరు బోలెడన్ని టైల్స్ ని చూస్తారు. 409 00:24:31,973 --> 00:24:32,891 ఓహ్. 410 00:24:32,891 --> 00:24:36,186 లిస్బన్ లేదా పోర్చుగల్ లో వీటిని అజులెయోస్ అంటాము. 411 00:24:36,686 --> 00:24:40,148 ఈ పెయింట్ వేయబడిన టైల్స్ మూర్స్ ప్రజల ద్వారా ఇక్కడికి వచ్చాయి. 412 00:24:40,148 --> 00:24:44,361 అజులెయో అనే పదానికి అరబిక్ లో "పాలీషు చేయబడిన రాయి" అని అర్థం. 413 00:24:45,445 --> 00:24:50,116 - ఇప్పటికీ వీటిని లిస్బన్ లోనే చేస్తున్నారా? - అవును. 414 00:24:50,116 --> 00:24:54,079 అంటే, మా హోటల్ లో ఉన్న టైల్స్ ని కూడా ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఫ్యాక్టరీ వారే 415 00:24:54,079 --> 00:24:55,789 స్వయంగా చేతులతో చేశారు. 416 00:24:56,915 --> 00:25:01,753 నేను ఈ సిటీలో క్రితం గమనించని ఒక వ్యక్తిత్వాన్ని ఇప్పుడు గమనించడం 417 00:25:01,753 --> 00:25:04,172 ప్రారంభించాను. 418 00:25:05,840 --> 00:25:07,175 ఇది అద్భుతంగా ఉంది. 419 00:25:07,175 --> 00:25:11,054 యుజీన్, బహుశా ఇక మనం ఇప్పుడు పాస్తా డే నాటాస్ తింటే మంచిదేమో. 420 00:25:11,054 --> 00:25:13,640 నా మనసు ఎరిగిన వ్యక్తి మీరు. 421 00:25:14,307 --> 00:25:15,267 - చీర్స్. - చీర్స్. 422 00:25:22,107 --> 00:25:23,108 అమ్మో. 423 00:25:23,608 --> 00:25:25,735 ఈ టార్ట్ లు అద్భుతంగా ఉన్నాయి. 424 00:25:26,236 --> 00:25:29,823 వీటి రుచి నిజంగా అమోఘం. 425 00:25:30,949 --> 00:25:31,783 వావ్. 426 00:25:31,783 --> 00:25:35,078 లిస్బన్ కి రావాలంటే అవి ఒక్కటే కారణం, టార్ట్ ల కోసమే రావాలి. 427 00:25:35,078 --> 00:25:36,538 మొత్తం తినేస్తున్నాను. 428 00:25:36,538 --> 00:25:41,334 లిస్బన్ లో ప్రధాన కస్టర్డ్ టార్ట్ రుచి చూసే ఆఫీసర్ పదవికి నేను వాలంటీర్ ని కావడానికి సిద్ధం అయిపోయా, 429 00:25:41,334 --> 00:25:43,795 {\an8}కానీ కీస్ నామీద వేరే ప్లానులు వేశాడు. 430 00:25:44,546 --> 00:25:48,842 {\an8}ఆయన నన్ను సిటీలోని అతిపురాతన టైల్ ఫ్యాక్టరీలలో ఒకదానికి వెళ్ళమని సూచించాడు. 431 00:25:49,676 --> 00:25:56,141 ఇక్కడ వీళ్ళు రూపం ఇచ్చి, కాల్చి, మెరుగు పెట్టి, పెయింట్ వేసి 432 00:25:56,141 --> 00:25:58,518 రోజుకు 20,000 టైల్స్ చేస్తారు. 433 00:26:01,479 --> 00:26:03,231 నేను డియోగోని కలుస్తున్నాను, 434 00:26:03,899 --> 00:26:07,360 అతను ఈ సిరామిక్ ప్రపంచానికి నూతన రకమైన డిజైన్లను పరిచయం చేశాడు. 435 00:26:07,986 --> 00:26:10,864 ఒక అద్భుతమైన కళాకారుడు ఇంకొక అద్భుతమైన కళాకారుడిని కలుస్తున్నాడు. 436 00:26:11,448 --> 00:26:12,824 - నేను డియోగో. - డియోగో. 437 00:26:12,824 --> 00:26:14,743 - యుజీన్. - నువ్వే అన్నమాట. 438 00:26:15,327 --> 00:26:19,956 డియోగో చేసే టైల్స్ అజులెయోస్ లో వాడే అదే తెలుపు ఇంకా నీలాలను వాడతాడు. 439 00:26:20,624 --> 00:26:23,919 ఇక్కడ విషయం ఏంటంటే, నా ఆర్ట్ చూడడానికి సంప్రదాయబద్ధంగా ఉంటుంది. 440 00:26:23,919 --> 00:26:25,170 కానీ ఇది అస్సలు సంప్రదాయబద్ధమైంది కాదు. 441 00:26:26,129 --> 00:26:31,134 నేను ఎక్కువగా ఆకారాలపై, ఆ ఆకారాలలో ఉన్న అంశాలపై ఎక్కువగా దృష్టి పెడతాను. 442 00:26:31,134 --> 00:26:33,386 - సరే. - మీరు ఇక్కడ ఉన్న ఆకారాన్ని చూస్తే, 443 00:26:33,386 --> 00:26:38,058 మీకు అప్పుడు ఇది ఒక చిన్న జంతువు లేదా కార్టూన్ లో కనిపించే బొమ్మ లాంటిది ఉన్నట్టు... 444 00:26:38,058 --> 00:26:39,851 ఓహ్, కనిపించింది. నాకు కనిపించింది. 445 00:26:40,352 --> 00:26:44,731 డియోగో చేసే లిమిటెడ్ ఎడిషన్ టైల్స్ ని వందల డాలర్లకు కొంటారు. 446 00:26:45,315 --> 00:26:47,817 వీటికి చాలా ఓర్పుతో చేతితో పెయింట్ వేస్తారు. 447 00:26:48,944 --> 00:26:53,323 మాన్యులా ఇక్కడే ఉంది. ఈమె టైల్ పెయింటింగ్ లో మాస్టర్ నిపుణురాలు. 448 00:26:55,617 --> 00:26:57,744 ఈమె ఇక్కడ 42 ఏళ్లుగా పనిచేస్తోంది. 449 00:26:58,453 --> 00:27:00,330 నలభై-రెండా? అద్భుతం. 450 00:27:01,957 --> 00:27:03,375 ట్రై చేస్తారా అని అడుగుతుంది? ట్రై చేయాలని ఉందా? 451 00:27:03,375 --> 00:27:06,002 - మీరు ప్రయత్నిస్తే బాగుంటుంది. - పెయింటింగ్ ట్రై చేయాలా? ఏమో. 452 00:27:06,002 --> 00:27:08,296 కాబట్టి తనకు ఎంతో విలువైన డిజైన్లలో ఒకదానిని 453 00:27:08,296 --> 00:27:11,967 నా చేతికి ఇవ్వడంలో ఎలాంటి పొరపాటు లేదు. 454 00:27:11,967 --> 00:27:15,053 - చూశారా? - ఓహ్. నేను ఇక్కడ మొదలెడతా. 455 00:27:16,263 --> 00:27:18,557 - అంతే. - సరే. 456 00:27:19,307 --> 00:27:21,017 నేను నా టైల్ ని బాగానే ప్రారంభించాను. 457 00:27:21,810 --> 00:27:23,728 నా పని చూసి నాకే ఆశ్చర్యం వేసింది. 458 00:27:23,728 --> 00:27:25,939 ఆహ్, మీరు నిజానికి బాగానే వేస్తున్నారు. 459 00:27:25,939 --> 00:27:27,983 నేను మీకు ఇప్పుడు ఒక చిన్న సవాలు విసురుతాను. 460 00:27:27,983 --> 00:27:29,276 అలాగా? 461 00:27:29,276 --> 00:27:32,821 సరే, దీనికి ఇక్కడ తెల్లని లైన్ లు ఉన్నాయి. 462 00:27:32,821 --> 00:27:35,865 ఈ తెల్లని లైన్ ల చుట్టూ పెయింట్ వేయాలి అంటే మనం ఏం చేయాలి? 463 00:27:35,865 --> 00:27:37,325 - అది... - నేనైతే... 464 00:27:37,325 --> 00:27:39,828 ఆ పని ఇంకొకరికి అప్పగిస్తా, కానీ... 465 00:27:40,537 --> 00:27:43,331 - నేను ఇది చేస్తాను. సరే. - బాగానే ఉంది. 466 00:27:43,331 --> 00:27:47,210 మా నాన్న చాలా మంచి ఆర్టిస్టు. ఆయన చాలా బొమ్మలు లాంటివి వేసేవారు. 467 00:27:47,919 --> 00:27:49,838 చేతులు కదలకూడదు. పొజిషన్. 468 00:27:49,838 --> 00:27:52,173 - సిద్ధమా? - మీతో పాటే ఉన్నాం. 469 00:27:57,971 --> 00:28:00,307 ఆయన కళ నుండి నేను... ఏమీ నేర్చుకోలేదు. 470 00:28:00,307 --> 00:28:03,351 భలే, ఛండాలంగా ఉంది. ఇప్పుడు ఇది పాడైపోయింది. 471 00:28:04,519 --> 00:28:05,770 ఆ గుణం నాకెందుకు రాలేదు? 472 00:28:07,606 --> 00:28:08,899 - మనం కలిసి వేశాం, యుజీన్. - సరే. 473 00:28:08,899 --> 00:28:10,775 - మీకు ఇది నచ్చి ఉంటుందని నా ఆశ. - వావ్. 474 00:28:11,902 --> 00:28:13,778 అతనికి చాలా ట్యాలెంట్ ఉంది. 475 00:28:15,238 --> 00:28:18,575 నేను ఇక్కడైతే అంత మంచి పేరు సంపాదించుకోలేకపోవచ్చు, 476 00:28:18,575 --> 00:28:24,873 కానీ ఇవాళ రాత్రి కలిసి ప్రదర్శించబోయే కార్యక్రమంలో కాస్త పరిస్థితి అనుకూలించాలని కోరిక. 477 00:28:24,873 --> 00:28:26,333 నన్ను క్షమించండి. 478 00:28:26,333 --> 00:28:27,542 ఓహ్, అబ్బా. 479 00:28:34,758 --> 00:28:35,842 పర్లేదు. 480 00:28:37,844 --> 00:28:41,640 అనేక గంటల తరువాత, జనం నెమ్మదిగా రావడం మొదలైంది, 481 00:28:41,640 --> 00:28:45,143 పోర్చుగల్ లోని అతిగొప్ప ఫాడో గాయకుల కార్యక్రమం చూడడానికి. 482 00:28:45,143 --> 00:28:47,062 అతన్ని తలచుకుంటే బాధగా ఉంది. 483 00:28:47,771 --> 00:28:50,899 అతను ఎంత పెద్ద తప్పు చేశాడో అతనికి తెలుస్తున్నట్టు లేదు. 484 00:28:50,899 --> 00:28:54,736 అలాగే అతను పనికి పెట్టుకున్న అరకొర కెనెడియన్ గిటారిస్ట్ గురించి కూడా తెలీదు ఏమో. 485 00:28:55,612 --> 00:28:57,656 - యుజీన్. - హలో, యుజీన్. 486 00:28:57,656 --> 00:28:59,366 - హాయ్. - స్వాగతం. 487 00:28:59,366 --> 00:29:02,494 అదృష్టవశాత్తు నేను ఇక్కడ చేసుకున్న కొందరు పోర్చుగీస్ స్నేహితులు... 488 00:29:02,494 --> 00:29:03,954 - వావ్, భలే అందంగా ఉన్నారు. - వావ్. 489 00:29:03,954 --> 00:29:05,705 ...నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. 490 00:29:06,790 --> 00:29:09,751 ఇవాళ చాలా స్పెషల్ అతిథి వచ్చారు. 491 00:29:10,335 --> 00:29:14,756 మీ అందరికీ నేను మిస్టర్ యుజీన్ లెవీ ని పరిచయం చేయాలని అనుకుంటున్నాను. 492 00:29:15,590 --> 00:29:18,885 నేను కేవలం కొన్ని తీగలను సింపుల్ గా వాయించాలి అంతే, 493 00:29:18,885 --> 00:29:22,973 మిగతా క్లిష్టమైన పనిని ప్రొఫెషనల్స్ కి అప్పగిస్తే సమస్య ఉండదు. 494 00:29:22,973 --> 00:29:27,102 మా చుట్టూ ఇలా ఫాడో అభిమానులు గుమిగూడకుండా ఉండి ఉంటే పని సులభంగా అయిపోయేది. 495 00:29:27,102 --> 00:29:28,770 మీకు చాలా థాంక్స్. 496 00:29:28,770 --> 00:29:30,981 - నేను పాడబోయేది లేదు. - సరే. 497 00:29:32,190 --> 00:29:37,237 ఇది నా మొట్టమొదటి ఫాడో కన్సర్ట్. నేను ఇది పాడుచేయకుండా ఉంటే చాలు. 498 00:29:39,489 --> 00:29:40,490 మిత్రులారా. 499 00:30:19,613 --> 00:30:21,197 రెండు, మూడు, నాలుగు. 500 00:30:29,331 --> 00:30:32,000 అక్కడ వాళ్ళతో ఉండడం వల్ల నేను చాలా టెన్షన్ పడ్డాను, 501 00:30:32,000 --> 00:30:34,836 ఎందుకంటే వాళ్ళు తమ పనిలో నిష్ణాతులు. 502 00:30:39,549 --> 00:30:42,636 కానీ నేను... నేను ఏం పాడుచేసినట్టు ఏం లేను. 503 00:30:45,388 --> 00:30:48,183 నేను అనుకున్నదానికన్నా బాగానే వాయించాను. 504 00:30:53,438 --> 00:30:55,357 అవును, భలే! 505 00:31:03,865 --> 00:31:05,200 థాంక్స్. 506 00:31:08,578 --> 00:31:09,663 ఇది భలే సరదాగా ఉంది. 507 00:31:12,249 --> 00:31:17,254 కేవలం కొన్ని రోజుల క్రితం నాకు ఈ ఊరి గురించి ఏమీ తెలీదు అని చెప్పడం కష్టం. 508 00:31:17,963 --> 00:31:22,425 కానీ ఈ ప్రదేశం గురించి ఏమీ తెలీకుండా వచ్చిన నాకు కనువిప్పు కలిగింది 509 00:31:22,425 --> 00:31:23,969 అని చెప్పడంలో సందేహం లేదు. 510 00:31:24,553 --> 00:31:29,307 అన్వేషణ అలాగే సాహసం అనేవి లిస్బన్ ప్రజల రక్తంలో ఉన్నాయి. 511 00:31:29,891 --> 00:31:35,647 పోర్చుగీస్ వారు ప్రపంచాన్ని అన్వేషిస్తూ, కొత్తవైన అన్యమైన వాటిని కనిపెట్టారు, 512 00:31:35,647 --> 00:31:38,692 వాటిని తీసుకొచ్చి ఈ నగరంలో ఒకటి చేశారు. 513 00:31:39,276 --> 00:31:41,111 అది స్ఫూర్తిదాయకం. 514 00:31:41,695 --> 00:31:48,451 నేను ఇంకా ఆ సాహసోపేతమైన గుణాన్ని నాలో కనుగొంటున్నాను, తెలుసా? 515 00:31:48,451 --> 00:31:52,914 నాలో అది ఉందని నాకు ఇంకా అనిపించడం లేదు, కానీ ప్రయత్నం అయితే చేస్తున్నాను. 516 00:31:52,914 --> 00:31:54,708 నా ఫాడో ప్రీమియర్ కోసం. 517 00:31:54,708 --> 00:31:56,585 - సరే. - అవును! 518 00:31:56,585 --> 00:32:01,298 అలాగే ఇక ఇప్పుడు నన్ను ప్రపంచ ప్రయాణికుల క్లబ్ లో, ఆహ్, జూనియర్ సభ్యునిగా 519 00:32:02,757 --> 00:32:04,509 పరిగణిస్తారేమో అని అనుకుంటున్నాను. 520 00:32:55,518 --> 00:32:57,562 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్