1 00:00:08,050 --> 00:00:12,305 ఒక గొప్ప ఫిలాసఫర్ ఒకసారి ఇలా అన్నాడు, "ప్రపంచం ఒక పుస్తకం లాంటిది, 2 00:00:13,098 --> 00:00:18,478 ఆ ప్రపంచాన్ని చూడని వారు ఒక్క పేజీ మాత్రమే చదివిన వారితో సమానం." 3 00:00:26,903 --> 00:00:28,363 సరే, నన్ను అడిగితే, 4 00:00:28,363 --> 00:00:32,616 నేను కొన్ని పేజీలు తిరగేశానని చెప్పగలను, కానీ మొత్తం పుస్తకం చదవాలనే కోరికైతే నాకు లేదు. 5 00:00:33,535 --> 00:00:36,621 చాలా కారణాల వల్ల నాకు ప్రయాణాలు చేయడం అంతగా నచ్చదు. 6 00:00:37,205 --> 00:00:38,582 బాగా చల్లగా ఉంటే, 7 00:00:38,582 --> 00:00:39,666 అసౌకర్యంగా ఉంటుంది. 8 00:00:39,666 --> 00:00:41,501 ఐసులో ఈత కొట్టడమా, బట్టలు లేకుండా? 9 00:00:41,501 --> 00:00:44,379 - అవును. - భలే, చాలా మంచి ఆహ్వానంలా ఉంది. 10 00:00:46,756 --> 00:00:49,801 మరీ వేడిగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పగలరా? నాకు అసౌకర్యంగా ఉంటుంది. 11 00:00:49,801 --> 00:00:51,887 నేను అంత వేగంగా నడవలేను. 12 00:00:52,470 --> 00:00:55,223 - కానీ నాకు 75 ఏళ్ళు. - మీకు సహాయం కావాలా? 13 00:00:55,223 --> 00:00:56,433 వద్దు, అవసరం లేదు. 14 00:00:57,142 --> 00:01:01,062 బహుశా ఇప్పుడు నా రెక్కలు చాచే సమయమైందేమో. 15 00:01:06,818 --> 00:01:08,194 ఓరి, దేవుడా. 16 00:01:09,404 --> 00:01:11,823 ఒక ఏనుగు వెనుక భాగంలో చేయి పెట్టడం ఇదే మొదటి సారి. 17 00:01:12,407 --> 00:01:13,658 కానీ మంచి విషయం ఏంటంటే, 18 00:01:14,659 --> 00:01:17,954 నేను నమ్మశక్యం కాని హోటళ్లలో గడపగలుగుతున్నాను. 19 00:01:17,954 --> 00:01:21,583 అమ్మో. ఇది భలే ఉంది. 20 00:01:26,504 --> 00:01:31,468 ఒకే ఒక్క షరతు ఏంటంటే, బయట ప్రపంచంలో ఏముందో చూస్తానని మాట ఇచ్చాను. 21 00:01:31,468 --> 00:01:33,553 - మీ అడుగులు చూసుకోండి. - అలాగే. 22 00:01:33,553 --> 00:01:35,639 - అందమైన పర్వతం. - అదొక అగ్నిపర్వతం. 23 00:01:35,639 --> 00:01:36,640 అది అగ్ని పర్వతమా? 24 00:01:36,640 --> 00:01:40,435 నేను నా జీవితమంతా దూరం పెట్టిన జీవితం ఇది. 25 00:01:41,561 --> 00:01:42,646 సేడి. 26 00:01:42,646 --> 00:01:45,315 ఓరి, నాయనో. 27 00:01:45,315 --> 00:01:48,526 ప్రాణాలతో బయట పడితే చాలు. 28 00:01:48,526 --> 00:01:51,655 ఒక ఫిన్నిష్ వ్యక్తితో అయిదు వోడ్కా షాట్ లు వేయడం ఇదే ఆఖరి సారి. 29 00:02:03,541 --> 00:02:07,295 నేను సౌత్ ఆఫ్రికాలో సఫారికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు, 30 00:02:07,295 --> 00:02:10,799 మా వాళ్ళు "వావ్. నీకు భలే సంతోషంగా ఉండి ఉంటుందే" అన్నారు. 31 00:02:13,093 --> 00:02:16,054 అందుకు నేను, "సంతోషపడక తప్పదు" అంటాను. 32 00:02:18,014 --> 00:02:21,935 కానీ నాకు అడవులంటే అంత ఇష్టం లేదు. 33 00:02:22,602 --> 00:02:26,856 సౌత్ ఆఫ్రికా 34 00:02:28,525 --> 00:02:31,653 నేను ప్రకృతికి సంబంధించిన కార్యక్రమాలు చూశాను, 35 00:02:31,653 --> 00:02:36,408 అలాగే ఇక్కడ కనిపించబోయే దాదాపు ప్రతీ జంతువును ముందే చూశాను, 36 00:02:36,908 --> 00:02:40,870 వాటిని చూడడానికి సగం ప్రపంచం దాటుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం రాలేదు కూడా. 37 00:02:44,416 --> 00:02:50,422 కానీ వర్ణనాతీతమైన అందంతో ఉట్టిపడుతున్న ఈ దేశానికి రానే వచ్చాను. 38 00:02:50,422 --> 00:02:54,634 ప్రపంచంలోని ఏడు శాతం కీటక అలాగే జంతు జాతులకు నిలయమైన దేశం. 39 00:02:56,094 --> 00:02:57,971 నేను కూడా జంతు ప్రేమికుడినే, 40 00:02:57,971 --> 00:03:01,600 కానీ నన్నే భోజనంగా చూసే జంతువుల విషయానికి వస్తే, నేను ఇంట్లోనే వాటిని టీవీలో 41 00:03:01,600 --> 00:03:03,560 చూడడానికే నేను ఎక్కువగా ఇష్టపడతాను. 42 00:03:04,936 --> 00:03:06,646 హలో, నా పేరు బొంగా. 43 00:03:06,646 --> 00:03:07,898 బొంగా, నేను యుజీన్. 44 00:03:07,898 --> 00:03:10,400 - మిమ్మల్ని కలవడం సంతోషం. లోనికి ఎక్కండి. - మిమ్మల్ని కలవడం సంతోషం. 45 00:03:10,400 --> 00:03:12,986 బొంగాని కలవడం నాకు నిజంగానే సంతోషంగా ఉంది, 46 00:03:13,486 --> 00:03:16,990 ఎందుకంటే నన్ను సురక్షితముగా హోటల్ కి తీసుకెళ్ళబోయేది ఇతనే. 47 00:03:22,996 --> 00:03:27,417 క్రూగర్ నేషనల్ పార్క్ ఆఫ్రికాలో ఉన్న అత్యంత పెద్ద రక్షిత అడవుల్లో ఒకటి. 48 00:03:27,417 --> 00:03:29,419 20,719 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 49 00:03:29,419 --> 00:03:34,382 న్యూజెర్సీ నగర వైశాల్యం ఉన్న ప్రదేశాన్ని సింహాలు, హైనాలతో నింపినట్టు ఉంటుంది. 50 00:03:35,550 --> 00:03:39,095 ప్రతీ ఏడాది లక్షల మంది క్రూగర్ కి వస్తుంటారని అంటున్నారు. 51 00:03:39,095 --> 00:03:42,599 కాకపోతే ఎంతమంది సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్తారో మనకు చెప్పరు అనుకోండి. 52 00:03:43,892 --> 00:03:47,312 ఈ పార్క్ లో అన్ని విధాలైన జంతువులూ ఉంటాయా? 53 00:03:47,812 --> 00:03:52,108 క్రూగర్ నేషనల్ పార్క్ ఇక్కడి అయిదు భారీ మృగాలకు పేరుగాంచింది. 54 00:03:52,108 --> 00:03:56,655 అంటే, ఈ జంతువులు మనం కాలి నడకన వెళ్తే ప్రమాదకరమైనవి. 55 00:03:56,655 --> 00:03:58,990 ఆ అయిదు పెద్ద జంతువులు ఏంటి? 56 00:03:58,990 --> 00:04:03,787 అవి ఏనుగు, అడవి దున్న, సింహం, చిరుత పులి, 57 00:04:04,329 --> 00:04:06,498 అలాగే చివరిగా ఖడ్గ మృగం. 58 00:04:07,415 --> 00:04:08,917 మంచిది. మంచి విషయం. 59 00:04:13,255 --> 00:04:15,715 ఇదేనా మన హోటల్? 60 00:04:15,715 --> 00:04:18,384 అవును. ఇక్కడే మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. 61 00:04:18,884 --> 00:04:19,886 అద్భుతం. 62 00:04:21,054 --> 00:04:24,349 సరే, యుజీన్, మీరు ఇప్పుడు ఆ రైలు పట్టాలను ఫాలో అవుతూ వెళ్ళాలి. 63 00:04:24,849 --> 00:04:27,227 బయటకు దిగి పట్టాలను ఫాలో అవ్వాలా? 64 00:04:27,227 --> 00:04:31,856 అద్భుతం. జంతువులకు ఆహారం అవుతానేమో అన్న భయం పోయి 65 00:04:31,856 --> 00:04:34,651 ఎక్కడ రైలు వచ్చి గుద్దుతుందో అన్న భయం మొదలైంది. 66 00:04:35,235 --> 00:04:37,862 క్రూగర్ షలాటికి స్వాగతం, యుజీన్. నా పేరు గావిన్. 67 00:04:37,862 --> 00:04:39,364 గావిన్. ఎలా ఉన్నావు? 68 00:04:39,364 --> 00:04:40,448 చాలా బాగున్నాను, థాంక్స్. 69 00:04:41,616 --> 00:04:45,829 ప్రపంచంలోనే అత్యంత వ్యత్యాసమైన హోటళ్లలో ఒకదానికి గావిన్ మేనేజర్. 70 00:04:45,829 --> 00:04:50,041 క్రూగర్ షలాటి హోటల్ ని 13 ట్రైన్ బోగీలతో నిర్మించారు, 71 00:04:50,041 --> 00:04:53,587 దీనిని సాబి నదిపై వేయి అడుగుల వెడల్పు ఉన్న బ్రిడ్జ్ మీద ఏర్పరిచారు. 72 00:04:53,587 --> 00:04:58,174 దీని వల్ల ఇతర ట్రైన్ల రాకపోకలకు అంతరాయం కలిగేలా ఉంది. 73 00:04:58,174 --> 00:04:59,634 ఇది కొంచెం వెరైటీగా ఉంది, కదా? 74 00:04:59,634 --> 00:05:03,471 నేను ముందెప్పుడూ ఇలాంటి హోటల్ ని చూడలేదు. 75 00:05:04,681 --> 00:05:09,728 100 ఏండ్ల క్రితం, ఈ అడవికి రావడానికి ఈ రైల్ వే మార్గం ఒక్కటే దారి, 76 00:05:09,728 --> 00:05:12,397 కానీ దీనిని 1973లో మూసేశారు, 77 00:05:12,981 --> 00:05:17,068 అందుకు ఒక కారణం ట్రైన్స్ వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్న జంవుతులే. 78 00:05:18,028 --> 00:05:21,072 ఈ ఇంజినీరింగ్ అద్భుతాన్ని నిజం చేయడానికి ఈ హోటల్ కోసం 79 00:05:21,072 --> 00:05:24,451 ఆఫ్రికా అంతటి నుండి వీళ్ళు రైలు బోగీలను సేకరించారు. 80 00:05:25,160 --> 00:05:28,705 - నీటిలోకి వెళదామా, లేదా వద్దా? - వద్దు, నాకు అవసరం లేదు. 81 00:05:28,705 --> 00:05:31,249 ఈ హోటల్ ని 2020లో తెరిచారు, 82 00:05:31,249 --> 00:05:36,630 భలే ప్రమాదకరమైన వాటి చర్యలను అత్యంత అద్భుతమైన రీతిలో చూపించగల హోటల్ ఇది. 83 00:05:37,547 --> 00:05:39,216 గత రాత్రి, మా... 84 00:05:39,216 --> 00:05:42,260 మా నైట్ కెమెరాలో ఇక్కడ సింహాలను చూశాము. 85 00:05:42,260 --> 00:05:44,846 - సరిగ్గా మన కిందే. - లేదు. 86 00:05:44,846 --> 00:05:48,225 కొందరు అతిథులు వాటి గర్జనను విని మమ్మల్ని ప్రశ్నించారు కూడా, 87 00:05:48,225 --> 00:05:51,186 - "అవి పైకి వచ్చాయా?" అని. - లేదు. చెప్పండి. 88 00:05:51,978 --> 00:05:53,438 అవి పైకి వచ్చాయా? 89 00:05:53,438 --> 00:05:54,898 - లేదు, అవి పైకి రాలేదు. - సరే. 90 00:05:54,898 --> 00:05:57,567 - మనం సురక్షితంగానే ఉంటాం... - సురక్షితమే, కానీ పూర్తి సురక్షితం కాదు. 91 00:05:57,567 --> 00:06:00,528 - కొంచెం సురక్షితం. అవును. - అవును, మీరు ఆఫ్రికాలో ఉన్నారని మర్చిపోకండి. 92 00:06:00,528 --> 00:06:01,738 సరే. 93 00:06:02,822 --> 00:06:05,867 నేను ఆఫ్రికాలో ఉన్నానని మర్చిపోవడానికి లేదు. 94 00:06:05,867 --> 00:06:09,537 నా చుట్టూ ఇదే ఉంది, చూడడానికి మతి పోయేలా ఉంది. 95 00:06:10,080 --> 00:06:14,918 ఓరి, నాయనో. ఇది చూడండి. 96 00:06:15,502 --> 00:06:19,339 మీరు వచ్చి రోజంతా కూర్చొని అడవి జంతువులను చూడడానికి ఇదే మంచి ప్రదేశం. 97 00:06:26,221 --> 00:06:27,847 - అదేంటి? - అదొక నీటి ఏనుగు. 98 00:06:29,015 --> 00:06:30,016 సరే. 99 00:06:30,016 --> 00:06:32,102 - మిమ్మల్ని మీ రూమ్ కి తీసుకెళ్ళనా? - సరే. 100 00:06:32,102 --> 00:06:33,228 వెళదాం రండి. 101 00:06:37,440 --> 00:06:39,818 మేము మీకోసం ఒక సఫారీ బుక్ చేశాము. 102 00:06:39,818 --> 00:06:43,238 ఒకసారి మీరు లోపల అన్ని సర్దుకున్నాకా, మిమ్మల్ని వాహనంలో కలుస్తాము. 103 00:06:43,238 --> 00:06:44,698 థాంక్స్. 104 00:06:45,657 --> 00:06:48,451 ఈ బోగీలు 1950 నాటివి. 105 00:06:53,248 --> 00:06:58,795 కానీ ఈ బోగీలను వీళ్ళు రాజభవనాల్లా చేసిపెట్టారు, నిజం చెప్పాలంటే, నాకు ఇది చాలా నచ్చింది. 106 00:07:00,547 --> 00:07:02,549 చూడడానికి భలే అద్భుతంగా ఉంది. 107 00:07:03,216 --> 00:07:06,136 ఇక్కడ మీరు కచ్చితంగా ఆఫ్రీకాలో ఉన్నారన్న అనుభూతి కలుగుతుంది. 108 00:07:10,098 --> 00:07:12,392 సరే. అదేంటో నాకు తెలీదు. 109 00:07:15,228 --> 00:07:18,273 ఈ బాల్కనీ, అలాగే ఫ్లోర్ నుండి సీలింగ్ వరకు ఉండే అద్దాల కారణంగా, 110 00:07:18,273 --> 00:07:20,025 ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. 111 00:07:21,067 --> 00:07:22,736 ఒక్కోసారి మరీ దగ్గరగా. 112 00:07:24,487 --> 00:07:26,239 అదేం జంతువు? 113 00:07:31,036 --> 00:07:34,664 సరే, ఏదో జంతువును మృగాలు చంపుతున్నాయి. ఆ శబ్దం ఏంటో నాకు తెలీడం లేదు. 114 00:07:34,664 --> 00:07:38,668 చాలా దారుణంగా ఉంది, అంటే కోస్తున్నట్టు. దేన్నో చీల్చేస్తున్నాయి. 115 00:07:43,673 --> 00:07:46,551 ఇక్కడి వారు అయిదు భారీ మృగాల గురించి చెప్తున్నారు. 116 00:07:46,551 --> 00:07:51,806 కానీ నేనైతే ఒకే ఒక పెద్ద విషయానికి అంతరాయం కలుగకుండా ఉంటే సంతోషిస్తాను: ప్రాణాలతో ఉండడం. 117 00:07:52,641 --> 00:07:54,976 ఇది చాలా అద్భుతంగా ఉంది. 118 00:07:56,144 --> 00:08:01,274 కానీ ధైర్యవంతులకే జీవితం కలిసి వస్తుంది, కాబట్టి బొంగాతో కలిసి సఫారీకి వెళ్తున్నాను. 119 00:08:04,486 --> 00:08:08,907 ఒకసారి మనం వాహనంలోకి ఎక్కిన తర్వాత, దిగకూడదు. అన్ని సమయాల్లో కూర్చొనే ఉండాలి. 120 00:08:08,907 --> 00:08:10,242 ఓహ్, వావ్. 121 00:08:11,201 --> 00:08:15,705 - ఓరి, నాయనో. దానిని చూడండి. - ముసలి. ముసలి. 122 00:08:15,705 --> 00:08:18,625 - ఇది భలే ఉంది, పెద్ద ముసలి. - వావ్. 123 00:08:18,625 --> 00:08:20,377 అవును, దాని పళ్ళను చూడండి, 124 00:08:20,377 --> 00:08:23,213 - ఎలా బయటకు పొడుచుకొని వస్తున్నాయో చూడండి. - నాకు... ఆ పళ్ళు కనిపిస్తున్నాయి. 125 00:08:23,213 --> 00:08:25,257 దానినే చావుకు ఉన్న నవ్వు అంటాము. 126 00:08:25,257 --> 00:08:29,511 ఎందుకంటే అది ఒక మనిషిని అమాంతంగా రెండుగా విరగగొట్టగలదు. 127 00:08:32,722 --> 00:08:34,432 ఇది చూడడానికి నమ్మశక్యంగా లేదు. 128 00:08:34,432 --> 00:08:37,269 దానిని టూరిస్టులు చూడడం కోసం ఎవరో 129 00:08:37,269 --> 00:08:40,272 కావాలని పెట్టినట్టు ఉంది అంతే. 130 00:08:42,356 --> 00:08:43,817 రోడ్డుకు అటు వైపు చూడండి. ఒక చిరుతపులి. 131 00:08:43,817 --> 00:08:45,610 ఓహ్, అవును. 132 00:08:46,236 --> 00:08:49,281 - నేను చూసిన మొదటి చిరుతపులి. - అది అయిదు పెద్ద మృగాలలో ఒకటి. 133 00:08:49,281 --> 00:08:50,574 మంచి విషయం. 134 00:08:52,492 --> 00:08:53,994 ఆపు, ఆగండి, ఆగండి, ఆపు. ఎడమవైపు చూడండి. 135 00:08:53,994 --> 00:08:55,453 ఏనుగు. 136 00:08:55,453 --> 00:08:57,539 అది అయిదు భారీ జంతువులలో ఇంకొకటి. 137 00:08:57,539 --> 00:08:59,499 భలే ఉంది. 138 00:08:59,499 --> 00:09:02,127 అవి అనేక విధాలుగా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. 139 00:09:02,127 --> 00:09:04,629 అంటే, అవి కడుపుతో ఒక విధమైన శబ్దాన్ని చేస్తాయి, 140 00:09:04,629 --> 00:09:07,424 ఆ శబ్దం నేలలోకి ఒక సిగ్నల్ పంపుతుంది, 141 00:09:07,424 --> 00:09:10,093 అలాగే వాటి పాదాలలో ఆ కంపనని గ్రహించగల 142 00:09:10,093 --> 00:09:12,053 గ్రాహకాలు ఉంటాయి. 143 00:09:12,053 --> 00:09:13,388 - వావ్. - అవును. 144 00:09:14,556 --> 00:09:16,349 {\an8}- అన్నీ భలే చూస్తున్నాం. - అవును నిజమే. 145 00:09:16,349 --> 00:09:19,603 {\an8}మేము రెండిటిని అప్పుడే చూసేసాము. నన్ను కలవడానికి ఇవి లైన్ కట్టినట్టు ఉన్నాయి. 146 00:09:19,603 --> 00:09:21,313 బహుశా షిట్స్ క్రీక్ ఫ్యాన్స్ అయ్యుంటాయి. 147 00:09:21,313 --> 00:09:23,148 - రోడ్డు మీద ఏం ఉందో చూడు. - అది నీటి ఏనుగా? 148 00:09:23,148 --> 00:09:24,941 కాదు, కాదు. అదొక అడవి పంది. 149 00:09:24,941 --> 00:09:29,863 - అది అడవిపంది. ఇది మరీ దారుణం. వావ్. - అది అడవి పంది. 150 00:09:29,863 --> 00:09:31,489 అవును, అవును. 151 00:09:31,489 --> 00:09:33,909 అది అంత అందంగా ఏం లేదు. 152 00:09:34,576 --> 00:09:37,037 వాటికి అద్భుతమైన వినికిడి శక్తి ఉంటుంది. 153 00:09:37,037 --> 00:09:39,623 పోనిలే, కనీసం అదైనా ఉంది వీటికి. 154 00:09:44,628 --> 00:09:48,048 ఆఫ్రికాలో కనిపించేటటువంటి సూర్యాస్తమయం ఇంకెక్కడా ఉండదు అంటుంటారు. 155 00:09:48,048 --> 00:09:49,466 అలాగే నేను ఒకటి చెప్పాలి, 156 00:09:49,466 --> 00:09:54,137 నేను ఈ జీపులో సౌకర్యంగా కూర్చొని సూర్యుని వెలుగులో ఈ అందమైన భూభాగాన్ని బాగా ఆస్వాదిస్తున్నాను. 157 00:09:54,137 --> 00:09:56,348 మనం ఇప్పుడు నడవాలి. 158 00:09:56,348 --> 00:09:59,643 - మనం నడవాలా? - నడవాలి. అవును. 159 00:09:59,643 --> 00:10:01,645 మనం జీపు దిగి కిందకు వెళ్ళకూడదు కదా. 160 00:10:02,604 --> 00:10:04,481 సరే, నాకు సూర్యాస్తమయాలు ఇష్టమే, 161 00:10:04,481 --> 00:10:07,025 కానీ జంతువులకు ఆహారం అయ్యేంత ఇష్టం కాదు. 162 00:10:08,193 --> 00:10:10,111 బొంగా దిగడం సురక్షితమే అన్నాడు. 163 00:10:10,695 --> 00:10:13,949 అలాగే పక్కనే తుపాకీతో నిలబడ్డ వ్యక్తి ఉండగా "సురక్షితంగా" ఉన్నామని తప్ప ఇంకేం ఫీలింగ్ రాదు. 164 00:10:13,949 --> 00:10:16,701 ఆ ఆయుధం బాగా శక్తివంతమైందిలా ఉంది. 165 00:10:16,701 --> 00:10:17,953 అవును. 166 00:10:20,038 --> 00:10:22,165 - మనం ఒకే లైన్ లో నడవాలి. - సరే. 167 00:10:22,165 --> 00:10:26,336 మీరు ఏదైనా గేదె లేదా నీటి ఏనుగుని చూస్తే, మాకు చెప్పండి. 168 00:10:26,336 --> 00:10:28,588 "ఎడమవైపు గేదె," "కుడివైపు నీటి ఏనుగు." 169 00:10:28,588 --> 00:10:31,925 అవన్నీ నేనే మీకు చెప్పాలి అంటుంటే నాకు కొంచెం భయంగా ఉంది, 170 00:10:31,925 --> 00:10:34,594 "ఎడమవైపు నీటి ఏనుగు," "కుడివైపు గేదె." 171 00:10:34,594 --> 00:10:38,181 అంటే, మీరిద్దరూ ఏమో, "ఏంటి?" అన్నట్టు ఉంటారేమో అనిపిస్తుంది. 172 00:10:39,808 --> 00:10:41,685 ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? 173 00:10:41,685 --> 00:10:44,688 "మనం ఈ పని ఎందుకు చేస్తున్నాం?" నాకు తడుతున్న ప్రశ్న అదే. 174 00:10:48,525 --> 00:10:50,318 - సరే, ఒకే లైన్ లో. - అలాగే. 175 00:10:50,986 --> 00:10:54,114 సూర్యుడు అస్తమించినప్పుడు, సింహాలు బయటకు వస్తాయి కదా? 176 00:10:55,490 --> 00:10:58,577 అవును. చీకటి పడినప్పుడే సింహాలు ఎక్కువగా తిరుగుతాయి, 177 00:10:58,577 --> 00:11:02,038 ఎందుకంటే అవి చీకటిలో అద్భుతంగా చూడగలవు. 178 00:11:02,956 --> 00:11:04,249 నువ్వు లైన్ లో లేవు. 179 00:11:04,249 --> 00:11:07,252 క్షమించండి. ఓహ్, అయ్యో. క్షమించండి. 180 00:11:07,252 --> 00:11:10,338 - నువ్వు దేన్ని చూపిస్తున్నావు? - కోతులను. 181 00:11:10,338 --> 00:11:12,549 - చూడండి, ఎడమవైపు కోతులు ఉన్నాయి. - కోతులా? 182 00:11:12,549 --> 00:11:14,843 అవును, చీకటి పడుతుంది కాబట్టి 183 00:11:14,843 --> 00:11:16,136 కోతులు చెట్లపైకి వెళ్లిపోతున్నాయి. 184 00:11:16,136 --> 00:11:20,181 అంటే, నువ్వు ఒకే లైన్ లో లేవు. నన్ను చంపేయడానికి చూస్తున్నావా? 185 00:11:22,934 --> 00:11:24,311 - ఇలా రండి. - హేయ్, చూడండి. 186 00:11:24,311 --> 00:11:26,479 మేము దీన్నే సాయంత్రపు తీరిక కార్యక్రమం అంటాం. 187 00:11:26,479 --> 00:11:28,982 నేనైతే "ఇది కదా మనకు కావాల్సింది" అంటాను. 188 00:11:29,941 --> 00:11:32,777 ఇక్కడ ఎండబెట్టిన అడవి పంది సాసేజ్ ఉంది. 189 00:11:33,403 --> 00:11:34,654 - ఆహ్-హాహ్. సరే. - అలాగే ఇక్కడ... 190 00:11:34,654 --> 00:11:38,366 మొసలి మాంసం ష్నిట్జెల్ ఉంది. 191 00:11:38,366 --> 00:11:41,536 - మొసలి మాంసం ష్నిట్జెలా? - అవును. 192 00:11:41,536 --> 00:11:44,623 సరే, నువ్వు అది తింటుంటే నేను చూసి ఆస్వాదిస్తాను, బొంగా. 193 00:11:44,623 --> 00:11:45,832 ఇది అద్భుతంగా ఉంది. 194 00:11:45,832 --> 00:11:47,918 నాకు ఒక వోడ్కా టానిక్ చాలు. 195 00:11:47,918 --> 00:11:49,211 అద్భుతం. 196 00:11:51,796 --> 00:11:53,381 - చీర్స్. - చీర్స్. 197 00:11:54,216 --> 00:11:55,217 చీర్స్. 198 00:11:55,759 --> 00:12:00,263 మేము బాగానే నడిచాం అనిపిస్తుంది. కొన్ని మంచి ప్రదేశాలను చూశాం. 199 00:12:00,764 --> 00:12:02,515 - చాలా జంతువులను చూశాము. - అవును. 200 00:12:02,515 --> 00:12:04,559 అందుకు నువ్వు కొంత వరకు కారణం అని నాకు అనిపిస్తోంది. 201 00:12:04,559 --> 00:12:07,395 ఎలా అయిందో నాకు తెలీదు, కానీ నువ్వు అది నాకోసం ఏర్పాటు చేసావు అనిపిస్తోంది. 202 00:12:09,439 --> 00:12:14,903 జంతువులను టీవీలో చూసినప్పుడు, మనం మన గడ్డపై ఉంటాం. 203 00:12:14,903 --> 00:12:18,990 కానీ ఇక్కడ, మనం వాటి గడ్డపై ఉంటాం. 204 00:12:18,990 --> 00:12:23,203 కాబట్టి ప్రమాదం మన చుట్టూనే ఉంది అన్న ఆ భావన 205 00:12:23,870 --> 00:12:27,958 మనలో ఒక విధమైన ఆసక్తిని పుట్టిస్తుంది. 206 00:12:29,459 --> 00:12:30,877 ఇది అందంగా ఉంది. 207 00:12:38,552 --> 00:12:42,222 ఆ జంతువులను అడవిలో చూడడం ఎంత ఆసక్తిగా ఉన్నా సరే, 208 00:12:42,222 --> 00:12:45,892 నేను ఉండే హోటల్ లో గనుక ఒకటి తారసపడితే నా వల్ల కాదు. 209 00:12:46,643 --> 00:12:48,895 కాబట్టి కిటికీలు మూసి ఉంచుతాను. 210 00:12:49,521 --> 00:12:51,773 నాకు నిద్రరాకుండా చేయగల ఒకే ఒక్క విషయం ఏమైనా ఉంది అంటే, 211 00:12:52,399 --> 00:12:55,443 అది ఇంకొక మృగం చేతుల్లో చీల్చబడుతూ 212 00:12:55,443 --> 00:12:59,489 తన ప్రాణాల కోసం వేరొక జీవి పెట్టే ఆర్తనాదాలే. 213 00:13:10,250 --> 00:13:12,711 ఆశ్చర్యంగా రాత్రి నాకు అద్భుతమైన నిద్ర పట్టింది, 214 00:13:12,711 --> 00:13:17,340 ఇప్పుడిక వేరొక జంతువు నన్ను టిఫిన్ గా తినడానికి ముందు, నేనే టిఫిన్ తినడానికి బయలుదేరుతున్నాను. 215 00:13:18,383 --> 00:13:20,427 - గుడ్ మార్నింగ్, యుజీన్. - హాయ్. 216 00:13:20,427 --> 00:13:23,179 మాతో కలిసి ఉండడం మీకు ఎలా ఉంది? 217 00:13:23,179 --> 00:13:27,350 - అంటే, ఇప్పటివరకు బాగానే ఉంది. అవును. - ఇప్పటి వరకు బాగుంది అంటారు. 218 00:13:28,852 --> 00:13:30,687 ఆ పురుగుకి మీరు నచ్చినట్టు ఉన్నారు. 219 00:13:30,687 --> 00:13:32,647 - ఏంటి? ఇది ఏంటి? - ఊష్. 220 00:13:32,647 --> 00:13:34,482 - ఇక్కడ ఒక పురుగు ఉంది. - ఓరి, దేవుడా. 221 00:13:34,482 --> 00:13:36,610 - ఒక సహాయం చేయండి. దాన్ని పోగొట్టండి. - ఇదుగో. 222 00:13:36,610 --> 00:13:38,278 వచ్చేసింది. 223 00:13:39,070 --> 00:13:39,946 అద్భుత... 224 00:13:41,448 --> 00:13:43,533 - భయపడకండి. - లేదు, అదేం లేదు. 225 00:13:43,533 --> 00:13:46,494 అది... ఏది ఏమైనా సరే. చాలా పెద్దదానిలా ఉంది, కదా? 226 00:13:46,494 --> 00:13:48,246 ఇదొక మిడత. 227 00:13:49,414 --> 00:13:52,334 ఇది ఇక్కడ మొట్టమొదటి ఉదయం, అప్పుడే నాపై దాడి మొదలైంది, 228 00:13:52,334 --> 00:13:54,127 చూశారా, ఒక భారీ ప్రేయింగ్ మాంటిస్. 229 00:13:59,382 --> 00:14:01,676 ఇవాళ కొంచెం నెమ్మదిగా గడుపుదాం అనుకుంటున్నాను. 230 00:14:01,676 --> 00:14:06,306 నా జీవితం లేదా ఒక అవయవానికి హాని ఏర్పడని పని ఏమైనా చేయాలి. 231 00:14:07,724 --> 00:14:13,355 అదృష్టవశాత్తు, హోటల్ మేనేజర్ గావిన్ నన్ను గోల్ఫ్ ఆడటానికి ఆహ్వానించాడు. 232 00:14:14,689 --> 00:14:16,524 ఇది భలే ఆసక్తిగా ఉంది. 233 00:14:17,067 --> 00:14:22,364 అంటే, జనం ఇక్కడ గోల్ఫ్ ఆడుతూ ఉంటారు, కాబట్టి ఈ ప్రదేశం సురక్షితమై ఉంటుంది. 234 00:14:26,534 --> 00:14:29,412 "గోల్ఫ్ కోర్స్ లో ఆడుతుండగా మీ క్షేమం మీ బాధ్యత. 235 00:14:29,412 --> 00:14:32,332 ఎలాంటి నష్టానికైనా, గాయానికైనా లేదా దెబ్బకైనా 236 00:14:32,332 --> 00:14:35,502 మేము బాధ్యులం కాదు. ప్రాణహాని ఉన్నా లేకున్నా." 237 00:14:39,422 --> 00:14:41,466 వెళ్లి గావిన్ తో కొంచెం మాట్లాడి వస్తాను. 238 00:14:43,009 --> 00:14:47,055 స్కకూజా గోల్ఫ్ కోర్స్ ప్రపంచంలోనే అత్యంత నమ్మశక్యం కానిది. 239 00:14:47,055 --> 00:14:51,518 జంతువులు లోనికి రాకుండా ఆపడానికి ఇక్కడ ఏదీ లేదు. కనీసం డ్రెస్ కోడ్ కూడా. 240 00:14:52,102 --> 00:14:54,062 అంటే, ఫెన్స్ ఏం లేదా? అంటే... 241 00:14:54,062 --> 00:14:55,397 అవును. 242 00:14:56,648 --> 00:14:57,691 అలా అయితే ఎలా మరి? 243 00:14:57,691 --> 00:14:59,776 మనం గనుక బాల్స్ ని ఫీల్డ్ అవతలికి కొడితే, 244 00:14:59,776 --> 00:15:01,987 అక్కడే వదిలేయడం మంచిది అని నా ఉద్దేశం. 245 00:15:01,987 --> 00:15:03,655 - సరే. - అలాగే మీ వెనుక పొదలో నుండి 246 00:15:03,655 --> 00:15:05,824 ఏదైనా శబ్దం వస్తే తలను కిందకు పెట్టుకోవడం మర్చిపోకండి. 247 00:15:06,408 --> 00:15:08,243 ఇక మేము వెళ్లి యుజీన్ ని ఆయన కార్ట్ లోకి ఎక్కించమా? 248 00:15:12,831 --> 00:15:13,999 పదండి. 249 00:15:13,999 --> 00:15:15,542 సరే. ఇక బయలుదేరుతున్నాం. 250 00:15:18,169 --> 00:15:21,464 గత వారం, ఇక్కడ మా ఎదురుగా నీటి ఏనుగు ఉండగా వీడియో తీసాను. 251 00:15:21,464 --> 00:15:24,217 - అక్కడ ఉన్న బయళ్లలో. - వావ్. 252 00:15:25,010 --> 00:15:28,930 నీటి ఏనుగులు పది సెకన్లకు వంద మీటర్లు పరిగెత్తగలవు. 253 00:15:28,930 --> 00:15:32,142 కాబట్టి, నేను తొమ్మిది సెకన్లలోనే పరిగెత్తాలని నిర్ణయించుకున్నాను. 254 00:15:32,142 --> 00:15:34,060 భలే, ఇది నిజంగా అద్భుతంగా ఉంది. 255 00:15:34,060 --> 00:15:35,645 అవును. ఓరి, నాయనో. అది చూడండి. 256 00:15:37,314 --> 00:15:38,356 అమ్మో! 257 00:15:38,356 --> 00:15:40,984 నీటి ఏనుగు అత్యంత ప్రమాదకరమైన జంతువు. 258 00:15:40,984 --> 00:15:43,194 ఇక్కడ వేరే ఏ ఇతర జంతువుకంటే అదే ఎక్కువమందిని చంపుతుంది. 259 00:15:43,194 --> 00:15:44,821 నాకు ఇదంతా ఎందుకు చెప్తున్నావో నాకు తెలుసు. 260 00:15:44,821 --> 00:15:48,617 గావిన్, నీటి మీద నుండి కొట్టడం అసలే కష్టం. 261 00:15:49,159 --> 00:15:50,702 పైగా ఇతను నా ఆట చెడగొట్టడానికి భయపెడుతున్నాడు. 262 00:15:50,702 --> 00:15:52,996 "నీటి ఏనుగు అత్యంత ప్రమాదకరమైన జంతువు" అంట. 263 00:15:52,996 --> 00:15:55,957 పెద్ద మాయగాడు. అతను ఇలా భయపెట్టి ఆడే రకం అని నేను అనుకోలేదు. 264 00:15:55,957 --> 00:15:58,376 మీరు మీ తలను కిందకు పెట్టొచ్చు. నేను మీకు గస్తీ కాస్తాను. 265 00:16:00,879 --> 00:16:02,172 అయ్యో! 266 00:16:03,089 --> 00:16:04,341 మళ్ళీ ప్రయత్నిద్దాం. 267 00:16:08,261 --> 00:16:09,304 ఆ పక్షి నవ్వుతుందా? 268 00:16:13,975 --> 00:16:15,518 అది ఎక్కడికి పోయింది? 269 00:16:15,518 --> 00:16:17,270 మన వెనుకే ఉంది. 270 00:16:19,314 --> 00:16:21,816 - నువ్వు ఎలా ఆడతావో చూపించు. కానివ్వు. - సరే. అలాగే. 271 00:16:21,816 --> 00:16:23,443 మీరే చూడండి. 272 00:16:25,904 --> 00:16:27,614 అలాగే, సర్. 273 00:16:28,657 --> 00:16:33,703 నేను అతన్ని భయపెట్టకూడదు అని కొంచెం సాదాసీదాగా ఆడాను. కాబట్టి, నేను... 274 00:16:39,668 --> 00:16:41,962 సరే, పరిస్థితి కొంచెం భయోత్పాతంగా తయారవుతుంది, కదా? 275 00:16:42,879 --> 00:16:45,799 నేను ఇప్పుడు ఇక భోజనం వడ్డించే ప్రదేశానికి వెళ్లి 276 00:16:45,799 --> 00:16:47,801 చిన్న పిల్లల వెనుక దాక్కుంటాను. 277 00:16:54,641 --> 00:16:56,560 ఒక రౌండ్ గోల్ఫ్ ఆడిన తర్వాత, 278 00:16:57,644 --> 00:17:01,773 వన్యప్రాణులకు అంతకంటే దగ్గరగా నేను వెళ్ళగలను అనుకోలేదు. 279 00:17:02,983 --> 00:17:05,986 కానీ బొంగా నాకోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పరిచాడు, 280 00:17:05,986 --> 00:17:10,198 ఇందులో దగ్గరగా ఉండి చూడడం అనే వాక్యానికి కొత్త అర్థాన్ని చూస్తాను అని నాకు ప్రమాణం చేశాడు. 281 00:17:10,739 --> 00:17:13,118 మొదటిగా, మనం అక్కడికి వెళ్ళాలి. 282 00:17:14,119 --> 00:17:19,457 ఓరి, నాయనో. ఆ గేదెని చూడండి. వావ్, అవి చాలా పెద్దగా ఉన్నాయి. 283 00:17:20,041 --> 00:17:23,128 ట్రాఫిక్ ని ఆపగల భయంకరమైన మొహం ఉండడం గురించి నేను విన్నాను, 284 00:17:23,128 --> 00:17:25,839 కానీ ఇవి ఆ భావనను మరొక స్థాయికి తీసుకెళ్లగలవు. 285 00:17:27,924 --> 00:17:31,636 అవి నిజానికి మనవైపే చూస్తున్నాయి. 286 00:17:32,596 --> 00:17:34,681 సరే, ఇప్పుడు కొంచెం భయం పుడుతోంది. 287 00:17:36,016 --> 00:17:37,142 పోనిలే, చూస్తే చూడనిద్దాం. 288 00:17:37,809 --> 00:17:41,521 కొన్నిసార్లు ఈ జంతువులకు వాటిపై ఆధిపత్యం ఎవరిదో మనమే చూపించాలి. 289 00:17:42,898 --> 00:17:47,444 ఆ పనిని నేను ఈ వ్యాను వెనుక సీటులో కూర్చొని బాగా చేయగలను. 290 00:17:47,444 --> 00:17:52,657 మంచి విషయం ఒకటి చెప్పనా? భారీ అయిదు జంతువులలో ఇది ఇంకొకటి. చెడ్డ విషయం? 291 00:17:52,657 --> 00:17:58,079 ఇవి ఏడాదికి 200 మందిని చంపుతాయి. కాబట్టి, వాటి పని అవి చేసుకోవడానికి వదిలేస్తే మంచిది. 292 00:18:00,790 --> 00:18:02,959 రోడ్డుకు అడ్డుపడిన గేదెలు వెళ్లిన తర్వాత, 293 00:18:02,959 --> 00:18:06,671 {\an8}చివరికి నేను పీటర్ ని కలవడానికి వచ్చేసాను, క్రూగర్ లో ఉన్న ప్రధాన జంతు వైద్యుడు. 294 00:18:07,172 --> 00:18:10,217 అయితే, పీటర్, ఇవాళ మనం ఏం చేయబోతున్నాం? 295 00:18:10,217 --> 00:18:13,428 ఇవాళ మేము ఒక ఏనుగును కదలకుండా చేయాలి అని ప్రయతించబోతున్నాం, 296 00:18:14,012 --> 00:18:17,349 ఎందుకంటే అది మనకు అందుబాటులో ఉన్నప్పుడే దాని ఆరోగ్యాన్ని చెక్ చేయడం మంచిది. 297 00:18:17,349 --> 00:18:22,229 నేను ముందెప్పుడో అంత హాయిగా "ఏనుగును కదలకుండా చేయబోతున్నాం" అనడం వినలేదు. 298 00:18:22,729 --> 00:18:24,648 నేను ఎలా సహాయపడగలను? 299 00:18:24,648 --> 00:18:28,235 మీ నుండి మేము వీలైనంతగా సహాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. 300 00:18:29,110 --> 00:18:31,321 సరే. కానీ నా ఆశ 301 00:18:31,321 --> 00:18:35,242 వాళ్ళు నా మీద పెద్దగా ఆశలు పెట్టుకోకూడదని 302 00:18:35,742 --> 00:18:38,286 ఎందుకంటే నేను కామిడి చేసుకుంటూ పైకి వచ్చినవాడిని. 303 00:18:38,286 --> 00:18:41,289 మాలాంటి నటులకు జాగ్రత్తలు చెప్తుంటే వినడం అలవాటే, 304 00:18:41,289 --> 00:18:44,834 కానీ ఇవాళ నేను దృష్టి మరల్చకుండా విన్నాను. 305 00:18:44,834 --> 00:18:46,336 మీరు గనుక ఏనుగు కదలడం చూసినా, 306 00:18:46,336 --> 00:18:49,381 అది మూత్రం పోయడం చూసినా, నాకు చెప్పండి, 307 00:18:49,381 --> 00:18:51,591 ఎందుకంటే దానికి అర్థం ఆ ఏనుగు నిద్ర లేవడం మొదలైంది అని అర్థం. 308 00:18:52,467 --> 00:18:54,928 ఏనుగు మూత్రం పోయడం మొదలెడితే, 309 00:18:54,928 --> 00:18:57,138 నేను ఎంత దూరం వెనక్కి వెళ్ళాలి? 310 00:18:57,138 --> 00:18:58,348 కాదు, మీరు వెంటనే పరుగు అందుకోవాలి. 311 00:19:00,141 --> 00:19:01,142 పరిగెత్తాలి అన్నమాట. 312 00:19:01,142 --> 00:19:03,019 - అవును. - అలాగే. 313 00:19:04,479 --> 00:19:07,065 విషయం ఏంటంటే నాకు హెలికాప్టర్లు పెద్దగా నచ్చవు, 314 00:19:07,065 --> 00:19:11,152 కాబట్టి నేను పీటర్ సహోద్యోగి, మిషెల్ తో కలిసి ట్రాకింగ్ వాహనంలో ప్రయాణించనున్నాను. 315 00:19:11,861 --> 00:19:13,697 వాళ్ళు డార్ట్ వేసేటప్పుడు హెలికాప్టర్ లో 316 00:19:13,697 --> 00:19:16,157 ఉండకూడదు అని నేను ఎక్కువగా అందరికీ సూచిస్తూ ఉంటాను. 317 00:19:16,157 --> 00:19:18,243 అందుకు మీరు నన్ను బలవంతం చేయాల్సిన పనిలేదు. 318 00:19:25,292 --> 00:19:27,544 హేయ్, మనకు కావాల్సింది అదే అనుకుంట. 319 00:19:28,211 --> 00:19:32,841 వాళ్ళు ఏం చేయడానికి చూస్తున్నారు అంటే, జంతువును హెలికాఫ్టర్ సహాయంతో ఇటు పంపడానికి చూస్తున్నారు, 320 00:19:32,841 --> 00:19:36,761 - అప్పుడు పీటర్ డార్ట్ వేస్తాడు. - సరే. అలాగే. 321 00:19:43,268 --> 00:19:45,645 వావ్. అది చూడండి. 322 00:19:45,645 --> 00:19:49,733 ఎంత బాగా ఎగరవేస్తున్నాడో చూడండి. ముందెప్పుడైనా అలా ఎగరేయడం చూసారా? 323 00:19:49,733 --> 00:19:52,360 వాళ్ళు అది ఎటు వెళ్లాలని అనుకుంటున్నారో అది ఆటే వెళ్తోంది. 324 00:19:52,360 --> 00:19:55,238 - సరే, ఇప్పుడు అడుగులు తడబడుతున్నాయి. - పడిపోతోంది. 325 00:19:55,238 --> 00:19:58,575 - అవును. అది నేలపై పడుతోంది. - పడిపోయింది. అంతే. 326 00:19:59,576 --> 00:20:03,371 వాళ్ళు దాన్ని అటువైపుకు పడేయడానికి ప్రయత్నిస్తున్నారు. 327 00:20:13,131 --> 00:20:14,341 అద్భుతంగా చేశారు. 328 00:20:15,467 --> 00:20:18,303 ఇలాంటి స్పాట్ చెక్లు, ఏనుగుల జనాభా 329 00:20:18,303 --> 00:20:20,680 ఆరోగ్యాన్ని కనిపెట్టుకొని ఉండడానికి పనికొస్తాయి. 330 00:20:20,680 --> 00:20:24,434 ప్రమాదకరం కాని ఆ ట్రాంక్విలైజర్ ప్రభావం పోవడానికి ముందు తమకు కావాల్సిన సమాచారం 331 00:20:24,434 --> 00:20:27,562 పొందడానికి ఈ బృందానికి ఇప్పుడు ముప్పై నిమిషాల సమయం ఉంది. 332 00:20:27,562 --> 00:20:30,106 మీ మొదటి ఏనుగు. వచ్చి దాన్ని ముట్టుకొండి. 333 00:20:30,106 --> 00:20:31,233 వావ్. 334 00:20:31,733 --> 00:20:35,862 చాలా ప్రశాంతంగా, మనం పని చేయడానికి వీలు కలిగేలా ఉంది. 335 00:20:35,862 --> 00:20:37,948 నాకంటే చాలా ప్రశాంతంగా ఉంది. 336 00:20:39,991 --> 00:20:43,536 నాకు మెడికల్ కార్యక్రమాలు అంటే పెద్దగా నచ్చవు. 337 00:20:44,120 --> 00:20:47,374 అంటే, ఇప్పుడు వాళ్ళు... దాని నోరుని బలవంతంగా తెరుస్తున్నారు. 338 00:20:49,000 --> 00:20:51,711 సరే, ఇప్పుడు వాళ్ళు... అమ్మో. 339 00:20:55,507 --> 00:20:57,968 - ప్రస్తుతానికి అంతా బాగానే ఉందా? - ప్రస్తుతానికి బాగానే ఉంది. 340 00:20:57,968 --> 00:20:59,302 సరే. ఏం జరిగేది నాకు చెప్తూ ఉండండి. 341 00:20:59,302 --> 00:21:00,303 సరే. 342 00:21:02,264 --> 00:21:03,557 - యుజీన్, మీకు సహాయం... - ఏంటి? 343 00:21:03,557 --> 00:21:05,767 ...చేయాలని ఉందో లేదో తెలీదు, వచ్చి శాంపిల్స్ తీసుకుంటారా? 344 00:21:05,767 --> 00:21:08,937 - శాంపిల్స్ తీసుకోవాలా? - శాంపిల్స్ తీసుకోండి, అవును. 345 00:21:10,730 --> 00:21:12,107 - దీనికి పెద్ద గ్లోవ్ కావాలి. - అలాగా? 346 00:21:12,774 --> 00:21:14,067 మీరు ఊహించుకోగలరు... 347 00:21:14,943 --> 00:21:17,153 ఏమో నాకు తెలీదు. నాకు అర్థం... 348 00:21:17,153 --> 00:21:19,990 - మీరు మీ చేతిని ఇక్కడి నుండి... - ఓహ్, సరే. చేయను. 349 00:21:21,866 --> 00:21:23,535 లేదు. లేదు. 350 00:21:24,327 --> 00:21:27,080 మీరు చెప్తున్నది నాకు అంతగా నచ్చేలా లేదు. 351 00:21:27,080 --> 00:21:28,665 - సరే, మీరు ఇప్పుడు... - సరే. 352 00:21:28,665 --> 00:21:30,000 ...మలం శాంపిల్ తీసుకోవాలి. 353 00:21:30,000 --> 00:21:33,837 - అంటే, మొత్తం తీయాల్సిన పనిలేదు... సరే. - మలం శాంపిల్ తీయాలా? 354 00:21:33,837 --> 00:21:37,883 సరే. ఒకవేళ మధ్యలో ఈ ఏనుగు నిద్ర లేస్తే ఏంటి సంగతి, 355 00:21:37,883 --> 00:21:40,051 అంటే, నా చేయి లోపల ఉండగా? 356 00:21:40,051 --> 00:21:41,845 అంత సుకుమారంగా చేయాల్సిన పనిలేదు. 357 00:21:42,470 --> 00:21:45,932 ఓరి, దేవుడా. ఓరి, దేవుడా. 358 00:21:48,435 --> 00:21:50,937 - బిగుస్తోంది. - బిగుస్తుందా? 359 00:21:50,937 --> 00:21:52,689 - అవును. - సరే. 360 00:21:52,689 --> 00:21:54,357 అందుకు నేను దీనిని నిందించను! 361 00:21:56,151 --> 00:21:59,070 - ఏమైనా దొరికిందా? - ఏమో. 362 00:21:59,070 --> 00:22:01,948 - తడిమి చూడండి. - నువ్వే తడిమి చూడు. అప్పుడెలా ఉంటుంది? 363 00:22:03,366 --> 00:22:04,868 - దొరికింది. - అంతే. 364 00:22:06,286 --> 00:22:10,248 నిజం చెప్పాలంటే, ఒక ఏనుగు వెనుక భాగంలో చేయి పెట్టడం ఇదే మొదటి సారి. 365 00:22:10,749 --> 00:22:12,584 చచ్చే ముందు మళ్ళీ ఇది చేయాల్సిన పని ఉండదు. 366 00:22:13,084 --> 00:22:18,506 నేను ఎదుర్కొన్న అత్యంత దారుణమైన అనుభవాలలో ఇది ఒకటి... 367 00:22:18,506 --> 00:22:19,674 అరే, ఇది మనం కావాలనుకున్న 368 00:22:19,674 --> 00:22:21,259 - మలం కాదు, కదా? - కాదు. అది కాదు. 369 00:22:21,259 --> 00:22:23,053 నేను సహాయం చేస్తే మంచిదేమో. 370 00:22:23,595 --> 00:22:25,847 మంచిది. లోనికి ఎంత దూరం వెళ్లాల్సి ఉంటుందో నాకు తెలీదు. 371 00:22:25,847 --> 00:22:28,266 - చూద్దాం. - కానీ, ట్యాక్సీ కట్టించమంటే... 372 00:22:28,266 --> 00:22:29,184 సరే. 373 00:22:30,435 --> 00:22:32,062 - నేను అనేది అర్థమవుతుందా? - నాకు అందింది. 374 00:22:32,062 --> 00:22:33,230 సరే. 375 00:22:35,690 --> 00:22:38,485 - ఇది మనకు కావాల్సింది. - సరే. 376 00:22:40,654 --> 00:22:42,322 ఆఫ్రికాలో చాలా సరదాగా ఉంది. 377 00:22:45,867 --> 00:22:48,370 ఏనుగులు ఎప్పటికీ మర్చిపోవు అంటుంటారు... 378 00:22:49,412 --> 00:22:51,373 అది మీకోసమే వెతుకుతున్నట్టు ఉంది, యుజీన్. 379 00:22:51,373 --> 00:22:54,709 నిజమే. నన్ను నమ్మండి, నేను ఇక్కడే కాస్త కిందకి వంగి దాక్కుంటాను. 380 00:22:57,963 --> 00:23:00,674 నేను మళ్ళీ ఈ మైదానంలోకి వెళ్తాను అని చెప్పలేను 381 00:23:01,174 --> 00:23:05,011 ఎందుకంటే దానికి ఈ చేయి గుర్తుంటుంది. తెలుసా? 382 00:23:05,011 --> 00:23:06,513 మొహాలు అంత బాగా గుర్తుండకపోవచ్చు, 383 00:23:06,513 --> 00:23:08,765 కానీ ఈ చేతిని ఒక్కసారి చూడగానే, దానికి... 384 00:23:12,602 --> 00:23:15,272 ఆ భారీ జంతువును చూడడం 385 00:23:15,272 --> 00:23:18,358 అలాగే దానిని ముట్టుకొనే అవకాశం, స్పర్శించే అవకాశం రావడం, 386 00:23:18,358 --> 00:23:22,529 దాని గుండె లయను తెలుసుకోవడం నిజానికి ఒక గొప్ప అనుభవం. 387 00:23:23,530 --> 00:23:27,242 నా జీవితంలో ఇలాంటి అనుభవాన్ని ఇంతకు ముందు పొందాను అని చెప్పలేను, 388 00:23:27,242 --> 00:23:29,578 అలాగే బహుశా మళ్ళీ ఎప్పటికీ పొందలేను, 389 00:23:29,578 --> 00:23:31,663 కానీ ఇది నమ్మశక్యం కాని అనుభవం. 390 00:23:41,923 --> 00:23:45,176 ఆఫ్రికాలో సూర్యాస్తమయం అయిన తర్వాత, 391 00:23:45,176 --> 00:23:48,930 ఈ మృగాల మధ్య మన రోజు కూడా ముగిసింది అని భావించకూడదని తెలుసుకున్నాను. 392 00:23:49,431 --> 00:23:50,932 - చూడండి, రోడ్డు మీద ఏముందో. - అవునా? 393 00:23:50,932 --> 00:23:52,309 హేయ్, అమ్మో. 394 00:23:53,518 --> 00:23:54,769 అదొక హైనా. 395 00:23:54,769 --> 00:23:56,021 - హైనా? - అవును. 396 00:23:56,021 --> 00:23:57,856 - అదిగో. - దానిని చూడండి. 397 00:23:58,607 --> 00:23:59,649 వావ్. 398 00:24:00,150 --> 00:24:02,444 బొంగా ఇంకా నేను కలిసి హోటల్ కి వెళ్తుండగా, 399 00:24:02,444 --> 00:24:06,031 అడవిలో రాత్రుళ్ళు తిరిగే జంతువులు మమ్మల్ని తినడానికి వచ్చాయి... 400 00:24:06,031 --> 00:24:07,240 కాదు, కలవడానికి వచ్చాయి. 401 00:24:07,866 --> 00:24:10,452 రోడ్డు ముందు ఇంకా కొన్ని ఉన్నాయి. త్వరగా, త్వరగా. పదా, వెళ్ళు. 402 00:24:10,952 --> 00:24:11,995 అదిగో. 403 00:24:12,495 --> 00:24:15,248 అవి నిజానికి ప్రస్తుతం వేట మీద పరిగెడుతున్నాయి. 404 00:24:15,248 --> 00:24:17,584 పోనిలే, ఆ వేట మనమే కాకూడదని నా కోరిక. 405 00:24:20,295 --> 00:24:22,172 ఆగండి, చూడండి. అదేంటి, అదేంటి, అదేంటి? 406 00:24:22,172 --> 00:24:24,257 - అది కుందెలా? - అదొక చెవుల పిల్లి. 407 00:24:24,257 --> 00:24:26,426 అది అయిదు భారీ మృగాలలో ఒకటి కాదు కదా? 408 00:24:26,426 --> 00:24:28,011 - చెవుల పిల్లా? - కాదు. కాదు. 409 00:24:29,930 --> 00:24:33,183 - ఖడ్గమృగాలు అయిదు భారీ మృగాలలో ఒకటి. - అవును. 410 00:24:33,183 --> 00:24:36,311 మనం ఈ రాత్రి ఒక ఖడ్గమృగాన్ని చూసే అవకాశం ఎంతవరకు ఉంది? 411 00:24:36,311 --> 00:24:39,022 అది అడవిలో ఖడ్గమృగాన్ని చూడడం చాలా అరుదు, 412 00:24:39,022 --> 00:24:41,524 ఎందుకంటే వాటిని వాటి కొమ్ము కోసం బాగా వేటాడేశారు. 413 00:24:42,067 --> 00:24:47,239 పది సంవత్సరాల క్రితం, నేను వారానికి మూడు సార్లు ఖడ్గమృగాన్ని చూసేవాడిని. 414 00:24:47,239 --> 00:24:52,410 కానీ ఇప్పుడు, ఒక ఖడ్గమృగం నెలకు ఒకసారి కనిపించడమే అరుదు. 415 00:24:52,410 --> 00:24:58,833 నా కొడుకుకైతే ఖడ్గమృగాన్ని చూసే అవకాశమే ఉండదని భయంగా ఉంది. 416 00:24:58,833 --> 00:25:02,087 ఓహ్, అయ్యో. చాలా దారుణం. 417 00:25:06,967 --> 00:25:08,343 నేను ఇలా అంటున్నానంటే నమ్మలేకపోతున్నాను, 418 00:25:08,343 --> 00:25:13,014 కానీ నేను ఊహించని విధంగా సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఆ వన్యప్రాణులు 419 00:25:13,014 --> 00:25:15,559 నా మీద ప్రభావం చూపుతున్నాయి. 420 00:25:16,893 --> 00:25:23,024 ఏనుగుకు అంత దగ్గరగా ఉన్న అనుభవం నాకు చాలా నచ్చింది. 421 00:25:23,858 --> 00:25:28,405 సఫారీలో జంతువులను చూడడం, 422 00:25:28,905 --> 00:25:33,118 అలాంటి అవకాశం టొరంటోలో మాకు ఉండదు. 423 00:25:33,702 --> 00:25:39,332 కానీ తిరిగి డెక్ మీదకు వచ్చి, మంట కాచుకుంటూ, అద్భుతమైన క్యాబర్నే తాగుతూ, 424 00:25:39,916 --> 00:25:43,879 ఆఫ్రికాలోని అడవి ప్రాణుల మధ్య రోజు ముగించాడనికి చాలా అందమైన మార్గం. 425 00:25:51,011 --> 00:25:55,181 అయిదు భారీ మృగాలలో మూడింటిని చూసాను. ఇక సింహం ఇంకా ఖడ్గమృగాన్ని చూడాలి అంతే. 426 00:25:56,433 --> 00:26:02,230 గత పది సంవత్సరాలలో, క్రూగర్ అడవిలో ఖడ్గమృగాల సంఖ్య 75% పడిపోయింది. 427 00:26:02,230 --> 00:26:05,483 కాబట్టి వాటిని చూడాలంటే నేను అడవిలో బాగా తిరగాల్సి ఉంటుంది. 428 00:26:06,359 --> 00:26:09,571 ఇంతకు ముందు దానిని దూరం పెట్టగలిగాను కానీ, 429 00:26:09,571 --> 00:26:13,700 ఈ సారి నాకు అంతగా నచ్చని మార్గంలో ప్రయాణం చేయక తప్పడం లేదు. 430 00:26:14,284 --> 00:26:17,787 మేము హెలికాఫ్టర్ లో ప్రయాణించబోతున్నాం. 431 00:26:19,414 --> 00:26:22,709 నాకు హెలికాఫ్టర్లు పెద్దగా నచ్చవు. నిజం చెప్తాను. 432 00:26:22,709 --> 00:26:25,337 నాకు ఎత్తులంటే చాలా భయం. 433 00:26:25,337 --> 00:26:27,672 ప్రత్యేకంగా, ఒక్కసారిగా పై నుండి పడడం అంటే. 434 00:26:28,798 --> 00:26:32,302 నాతో నేను, అయిదు పెద్ద మృగాలను చూడడం కోసం తప్పదని చెప్పుకుంటున్నాను. 435 00:26:32,886 --> 00:26:35,597 అక్కడ ఒక చెట్టు దగ్గర మగ ఏనుగు కూర్చొని ఉంది చూడండి. 436 00:26:36,806 --> 00:26:39,559 నేనైతే నేరుగా ఉన్న కొండనే చూస్తున్నాను. 437 00:26:42,562 --> 00:26:44,272 వచ్చేసాం. గట్టి నేల. 438 00:26:45,357 --> 00:26:46,358 ఇప్పుడు బాగుంది. 439 00:26:47,901 --> 00:26:51,488 - మిమ్మల్ని కలవడం సంతోషం. మీకు స్వాగతం. - మిమ్మల్ని కలవడం సంతోషం. యుజీన్. 440 00:26:51,488 --> 00:26:53,156 పెట్రోనెల్. పదండి. 441 00:26:55,283 --> 00:26:57,994 గూఫీ ఇంకా నాతో కలిసి లోనికి ఎక్కండి. అది నా కుక్క. 442 00:26:58,495 --> 00:27:00,747 హాయ్, గూఫీ. గూఫీ, గూఫీ. 443 00:27:02,415 --> 00:27:06,211 కేర్ ఫర్ వైల్డ్ కార్యక్రమం వెనుక ఉండి నడిపిస్తున్న వ్యక్తి పెట్రోనెల్, 444 00:27:06,211 --> 00:27:08,755 అది ప్రపంచంలోనే అతిపెద్ద ఖడ్గమృగాల అభయారణ్యం. 445 00:27:08,755 --> 00:27:13,885 ఒకసారి మీరు ఖడ్గమృగాన్ని చూస్తే, అది మీకు చాలా నచ్చేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 446 00:27:13,885 --> 00:27:17,305 మీరు వాటిని చూసి ప్రేమలో పడిపోయే ప్రమాదం ఉంది. 447 00:27:17,305 --> 00:27:23,728 అది జరిగే పని అని నేనైతే ముందెప్పుడూ అనుకోలేదు, కానీ చూద్దాం. 448 00:27:24,563 --> 00:27:29,192 2011 నుండి, ఇక్కడ ఉన్న బృందం 100 ఖడ్గమృగాలకు పైగా రక్షించారు. 449 00:27:30,068 --> 00:27:32,904 నేను రావడం రావడమే, చిన్న వాటికి పాలు ఇచ్చే సమయమైంది. 450 00:27:32,904 --> 00:27:35,365 - వావ్, బాటిల్ అంటే ఇలా ఉండాలి. - అవును. 451 00:27:36,533 --> 00:27:40,745 ఆ పిల్లలు ఇక్కడికి ఎలా వస్తాయి? 452 00:27:41,288 --> 00:27:42,330 మనం పిలవాలి. 453 00:27:45,500 --> 00:27:47,210 పిలవండి, యుజీన్. మీరు కూడా పిలవండి. 454 00:27:50,547 --> 00:27:51,548 బాగానే పిలుస్తున్నాం. 455 00:27:53,466 --> 00:27:54,968 మీ చిన్న రైనో వచ్చింది. 456 00:27:54,968 --> 00:27:56,386 రండి, రండి! 457 00:27:56,386 --> 00:27:58,054 - చూడండి! అది డాని... - వావ్. 458 00:27:58,054 --> 00:27:59,681 - ...పరిగెడుతున్న పెద్దది. - పెద్దగా ఉన్నాయి. 459 00:27:59,681 --> 00:28:01,641 - అలాగే అది... - ఇవి చాలా పెద్ద పిల్లలు. 460 00:28:01,641 --> 00:28:05,729 సరే, అంతే. దానిని అలా పట్టుకోవాలి. 461 00:28:05,729 --> 00:28:08,315 అద్భుతం. అద్భుతం. 462 00:28:11,568 --> 00:28:14,988 - తాగేసింది. - మంచిది. అందుకే రెండు బాటిళ్లు పట్టిస్తాము. 463 00:28:16,615 --> 00:28:20,076 నేను చివరిసారిగా బాటిల్ లో పాలు పట్టించింది 36 ఏళ్ల క్రితం, 464 00:28:20,702 --> 00:28:24,664 అప్పుడు ఆ బాటిల్ చాలా చిన్నది. నా కూతురు కూడా చిన్నదే. 465 00:28:25,957 --> 00:28:28,752 ఆ పిల్ల ఉండాల్సినదానికన్నా కొంచెం చిన్నగా ఉంది, 466 00:28:28,752 --> 00:28:32,714 ఎందుకంటే దానికి కేవలం నెల వయసప్పుడు, దాని తల్లిని చంపేశారు. 467 00:28:33,465 --> 00:28:34,299 అయ్యో. 468 00:28:34,299 --> 00:28:36,635 ఈ పరిరక్షకులు ఎంతగా ప్రయత్నిస్తున్నా, 469 00:28:36,635 --> 00:28:39,221 వీటిని వేటాడటం ఇదే స్థాయిలో కొనసాగితే, 470 00:28:39,221 --> 00:28:43,141 అడవుల్లో ఉన్న ఖడ్గమృగాలు 15 ఏళ్లలో అంతరించుకుపోతాయి. 471 00:28:43,141 --> 00:28:47,187 వీటిని ఆందోళనకరమైన స్థాయిలో వేటాడేస్తున్నారు, 472 00:28:47,187 --> 00:28:49,773 అయినా కూడా వీళ్ళు తల్లి లేని ఇలాంటి పిల్లల్ని పోగేసి 473 00:28:49,773 --> 00:28:53,652 ఇక్కడికి తీసుకొచ్చి పెంచుతున్నారంటే, అది అద్భుతం అనే చెప్పాలి. 474 00:28:57,906 --> 00:29:01,701 నాకు ఇవి బాగా నచ్చుతున్నాయి. ఇవి భలే ముద్దొస్తున్నాయి. 475 00:29:04,537 --> 00:29:08,750 నాకైతే ఇది చాలా అందమైన అనుభవం. 476 00:29:11,753 --> 00:29:16,633 ఈ ఖడ్గమృగాల విషయంలో నన్ను ఆకట్టుకున్న గుణం ఏదో ఉంది. 477 00:29:18,176 --> 00:29:22,639 "నేను ఖడ్గమృగానికి పాలు పడుతున్నాను" అని మనసులో అనుకుంటూనే ఉన్నాను. 478 00:29:27,644 --> 00:29:31,231 పెట్రోనెల్ తన దగ్గర ఉన్న ఈ అనాథ ఖడ్గమృగాలను 479 00:29:31,231 --> 00:29:32,816 తిరిగి ప్రకృతిలో వదలాలని చూస్తోంది. 480 00:29:33,567 --> 00:29:36,903 ఇప్పుడు ఆమె నాకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని చూపించాలని అనుకుంటుంది. 481 00:29:38,238 --> 00:29:41,032 మనం ఇంతకు ముందు రిలీజ్ చేయబడిన ఖడ్గమృగాల దగ్గరకు వెళ్లి 482 00:29:41,032 --> 00:29:45,120 అవి ఎలా ఉన్నాయో చూడబోతున్నాము. 483 00:29:45,120 --> 00:29:47,872 అంటే, ఖడ్గమృగాలు అడవిలోనే నివసించాలి. 484 00:29:47,872 --> 00:29:49,833 - వాటి స్థానం అదే. - అవును. 485 00:29:54,671 --> 00:29:55,839 ఇది భలే ఉంది. 486 00:29:57,299 --> 00:30:03,513 ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు. చూడడానికి భలే అందంగా ఉంది. 487 00:30:07,183 --> 00:30:10,437 ఇది చాలా బాగుంది, పెట్రోనెల్. 488 00:30:10,437 --> 00:30:14,983 నేను ఇంతకు ముందు చూస్తాను అనుకోని దృశ్యం ఇది. 489 00:30:18,028 --> 00:30:19,154 వావ్. 490 00:30:21,072 --> 00:30:25,744 వీటిలో రెండు ఖడ్గమృగాలు, వింటర్ అలాగే స్టార్మ్ ఈటీవీలే చరిత్ర సృష్టించాయి. 491 00:30:26,369 --> 00:30:30,373 వింటర్ ఈ మధ్య ఇంకొక అనాథ ఖడ్గమృగం స్టార్మ్ తో జతకట్టింది, 492 00:30:30,373 --> 00:30:34,377 - వాటికి బ్లిజ్జి పుట్టింది. అదొక అద్భుతం. - వావ్. 493 00:30:35,545 --> 00:30:38,340 ప్రపంచంలో ఇలాంటి కేసు ఇదే మొదటిది. 494 00:30:38,340 --> 00:30:42,010 రెండు అనాథ ఖడ్గమృగాలు పుట్టిన మొట్టమొదటి పిల్ల ఖడ్గమృగం. 495 00:30:42,636 --> 00:30:45,805 మావరకైతే ఇది చంద్రునిపై మొదటి అడుగుపెట్టడంతో సమానం. 496 00:30:45,805 --> 00:30:47,599 - ఇది... ఇది కూడా సాధ్యమైంది. - అవును, అవును. 497 00:30:47,599 --> 00:30:51,269 మాలో ఆశ చిగురించింది. ఒక కొత్త ఖడ్గమృగాల యుగం మొదలవుతుంది. 498 00:30:53,021 --> 00:30:54,606 వావ్. అద్భుతం. 499 00:30:57,067 --> 00:31:01,738 ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన అనాథ ఖడ్గమృగాన్ని చూడడం 500 00:31:01,738 --> 00:31:07,827 "సౌత్ ఆఫ్రికా అంటే నా ఉద్దేశంలో ఏంటి?" అనే ప్రశ్న మనసులో ఉండిపోయేలా చేసింది. 501 00:31:09,454 --> 00:31:13,083 నేను వెళ్లిన మరే ఇతర దేశం కంటే ఈ దేశం చాలా వ్యత్యాసంగా ఉంది. 502 00:31:13,083 --> 00:31:15,877 నాపై కలకాలం ఉండిపోయే ముద్ర వేసింది. 503 00:31:16,586 --> 00:31:21,841 అడవిలో జంతువులను చూడడం కూడా టీవీలో చూసినట్టే ఉంటుంది అనుకున్నాను. 504 00:31:21,841 --> 00:31:23,301 కానీ నేను పొరబడ్డాను. 505 00:31:24,511 --> 00:31:27,347 జంతువులకు ఇంత దగ్గరగా ఉండడం అంటే, 506 00:31:27,847 --> 00:31:33,144 నేను నిజానికి ఊహించినదానికన్నా ఈ అనుభవాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేసింది. 507 00:31:34,020 --> 00:31:39,693 మన రోజువారీ జీవితంలో, మనం ఇక్కడ ఉన్న జంతువుల గురించి ఆలోచించము. 508 00:31:40,277 --> 00:31:44,531 మనం ఖడ్గమృగాలు అంతరించిపోవడం గురించి ఆలోచించము. 509 00:31:45,365 --> 00:31:50,412 కానీ ఇక్కడికి వస్తే, మనం వాటన్నిటి మధ్యలో నిలబడినట్టు ఉంటుంది. 510 00:31:50,912 --> 00:31:54,457 ఇవి జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అనుభవాలు, 511 00:31:54,457 --> 00:31:57,752 అనుకున్నట్టే నేను అనేక అద్భుతమైన వాటిని చూశాను, 512 00:31:57,752 --> 00:32:00,839 చాలా మందికి ఇలాంటి అవకాశం ఎప్పటికీ రాదు. 513 00:32:01,506 --> 00:32:04,134 నేను అయిదు భారీ మృగాలలో నాలుగింటిని చూశాను. 514 00:32:04,718 --> 00:32:06,511 వీళ్ళ ప్రకారం అది మంచి విషయమే అంట. 515 00:32:07,095 --> 00:32:09,222 సింహాన్ని చూడడం వీలు కాలేదు, 516 00:32:09,222 --> 00:32:12,809 కానీ నేను ఇంటికి వెళ్లిన తర్వాత "ది లయన్ కింగ్" సినిమా పెట్టుకొని చూస్తానులే. 517 00:33:09,032 --> 00:33:11,034 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్