1 00:00:08,050 --> 00:00:12,305 ఒక గొప్ప ఫిలాసఫర్ ఒకసారి ఇలా అన్నాడు, "ప్రపంచం ఒక పుస్తకం లాంటిది, 2 00:00:13,098 --> 00:00:18,478 ఆ ప్రపంచాన్ని చూడని వారు ఒక్క పేజీ మాత్రమే చదివిన వారితో సమానం." 3 00:00:26,903 --> 00:00:28,363 సరే, నన్ను అడిగితే, 4 00:00:28,363 --> 00:00:32,616 నేను కొన్ని పేజీలు తిరగేశానని చెప్పగలను, కానీ మొత్తం పుస్తకం చదవాలనే కోరికైతే నాకు లేదు. 5 00:00:33,535 --> 00:00:36,621 చాలా కారణాల వల్ల నాకు ప్రయాణాలు చేయడం అంతగా నచ్చదు. 6 00:00:37,205 --> 00:00:39,666 బాగా చల్లగా ఉంటే అసౌకర్యంగా ఉంటుంది. 7 00:00:39,666 --> 00:00:41,501 ఐసులో ఈత కొట్టడమా, బట్టలు లేకుండా? 8 00:00:41,501 --> 00:00:44,379 - అవును. - భలే, చాలా మంచి ఆహ్వానంలా ఉంది. 9 00:00:46,756 --> 00:00:49,801 మరీ వేడిగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పగలరా? నాకు అసౌకర్యంగా ఉంటుంది. 10 00:00:49,801 --> 00:00:51,887 నేను అంత వేగంగా నడవలేను. 11 00:00:52,470 --> 00:00:55,223 - కానీ నాకు 75 ఏళ్ళు. - మీకు సహాయం కావాలా? 12 00:00:55,223 --> 00:00:56,433 వద్దు, అవసరం లేదు. 13 00:00:57,142 --> 00:01:01,062 బహుశా ఇప్పుడు నా రెక్కలు చాచే సమయమైందేమో. 14 00:01:06,818 --> 00:01:08,194 ఓరి, దేవుడా. 15 00:01:09,404 --> 00:01:11,823 ఒక ఏనుగు వెనుక భాగంలో చేయి పెట్టడం ఇదే మొదటి సారి. 16 00:01:12,407 --> 00:01:13,658 కానీ మంచి విషయం ఏంటంటే, 17 00:01:14,659 --> 00:01:17,954 నాకు నమ్మశక్యం కాని హోటళ్లలో గడపగలుగుతున్నాను. 18 00:01:17,954 --> 00:01:21,583 అమ్మో. ఇది భలే ఉంది. 19 00:01:26,504 --> 00:01:31,468 ఒకే ఒక్క షరతు ఏంటంటే, బయట ప్రపంచంలో ఏముందో చూస్తానని మాట ఇచ్చాను. 20 00:01:31,468 --> 00:01:33,553 - మీ అడుగులు చూసుకోండి. - అలాగే. 21 00:01:33,553 --> 00:01:35,639 - అందమైన పర్వతం. - అదొక అగ్నిపర్వతం. 22 00:01:35,639 --> 00:01:36,640 అది అగ్ని పర్వతమా? 23 00:01:36,640 --> 00:01:40,435 నేను నా జీవితమంతా దూరం పెట్టిన జీవితం ఇది. 24 00:01:40,435 --> 00:01:41,978 వోవ్. సేడి. 25 00:01:42,729 --> 00:01:45,315 ఓరి, నాయనో. 26 00:01:45,315 --> 00:01:48,526 ప్రాణాలతో బయట పడితే చాలు. 27 00:01:48,526 --> 00:01:51,655 ఒక ఫిన్నిష్ వ్యక్తితో అయిదు వోడ్కా షాట్ లు వేయడం ఇదే ఆఖరి సారి. 28 00:02:04,918 --> 00:02:06,836 నేను ఇప్పుడు స్వర్గంలో ఉన్నాను. 29 00:02:07,504 --> 00:02:10,423 ఇందులో సందేహమే లేదు. ఇక్కడ చాలా చాలా అందంగా ఉంది. 30 00:02:11,132 --> 00:02:12,884 ఇలాంటి చోటు ఎవరికి నచ్చదు చెప్పండి? 31 00:02:13,552 --> 00:02:15,720 నేను ఇలా అంటుంటే వినడానికి వింతగా ఉండొచ్చు, 32 00:02:15,720 --> 00:02:19,057 కానీ నాలాగా నీళ్లంటే భయపడేవాడికి ఇలాంటి ప్రదేశం నచ్చడం కూడా కష్టమే. 33 00:02:19,057 --> 00:02:21,601 నాకు నేల మీద ఉండడమే నచ్చుతుంది. 34 00:02:22,561 --> 00:02:27,524 గట్టి నేల మీద నిలబడినప్పుడే నేను జీవితాన్ని ఆస్వాదించగలను. 35 00:02:28,149 --> 00:02:31,069 నేను నీళ్ల మధ్య ఉంటే, అంత సౌకర్యంగా ఉండలేను. 36 00:02:31,653 --> 00:02:34,072 ఇక్కడ చూస్తే నా చుట్టూ మహాసముద్రమే. 37 00:02:35,240 --> 00:02:37,284 నీళ్లు తప్ప ఇంకేం కనిపించడం లేదు. 38 00:02:37,867 --> 00:02:40,537 మాల్దీవులు 39 00:02:40,537 --> 00:02:44,165 లోతైన నీలి సముద్రం అందాలంటే నాకు కూడా ఇష్టమే, 40 00:02:44,165 --> 00:02:47,460 కానీ నేను గనుక ఎప్పుడైనా ఆ సముద్రంలో ఉన్నట్టు కనిపిస్తే, దయచేసి కాపాడండి. 41 00:02:47,460 --> 00:02:51,298 ఎందుకంటే కచ్చితంగా కాపాడమని చేతులు ఊపడం మీరు చూస్తారు. 42 00:02:51,965 --> 00:02:53,925 ఈ హిందూ మహా సముద్రంలో... 43 00:02:53,925 --> 00:02:55,969 నేను ఒక చిన్న ఇసుక రేణువులా ఉన్నాను. 44 00:02:56,845 --> 00:03:01,600 మనిషికి రెండు కాళ్ళు ఇవ్వబడింది నేల మీద నడవడానికి. 45 00:03:02,100 --> 00:03:05,896 ఇది నా సొంత 'కాస్ట్ అవే' సినిమాలా ఉంది. 46 00:03:07,480 --> 00:03:10,150 నన్ను కాపాడడానికి ఎవరైనా వస్తే బాగుండు అని నా ఆశ. 47 00:03:18,533 --> 00:03:19,743 మాల్దీవులు. 48 00:03:19,743 --> 00:03:26,291 పురాతన అగ్నిపర్వతాల వల్ల ఏర్పడిన 965 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే ఇసుక గుట్టలు అలాగే పగడపు దిబ్బలు. 49 00:03:27,417 --> 00:03:30,712 ఈ దేశంలో కేవలం ఒక్క శాతం మాత్రమే అసలైన నేల. 50 00:03:31,296 --> 00:03:36,134 కాబట్టి మిగతా 99% మీద నాకు ప్రస్తుతం ఎలాంటి ఆసక్తి లేదు, 51 00:03:36,134 --> 00:03:39,179 అందుకే ఈ సముద్ర విమానం మీద హోటల్ కి వెళ్తున్నాను. 52 00:03:39,179 --> 00:03:41,848 విమానంలో ఆక్సిజన్ ఉండి ఉంటే బాగుండు. 53 00:03:41,848 --> 00:03:43,934 "విమానం" అలాగే "సముద్రం" అనే పదాలు 54 00:03:43,934 --> 00:03:48,188 కలిపి పలికినప్పుడు నాకు "కూలిపోవడం" ఇంకా "శిధిలాలు" అనే పదాలు తడతాయి. 55 00:03:48,855 --> 00:03:50,315 ఏదైతేనేం... 56 00:03:50,315 --> 00:03:52,525 హాయ్, సర్. గుడ్ ఆఫ్టర్ నూన్. విమానంలోకి స్వాగతం. 57 00:03:52,525 --> 00:03:54,277 మీ లైఫ్ జాకెట్ సీటు కింద ఉంది. 58 00:03:54,277 --> 00:03:56,738 మీ సీట్ బెల్టులను తగిలించుకొని మీ ఫ్లైట్ ప్రయాణాన్ని ఆనందించండి. 59 00:03:56,738 --> 00:03:58,281 మీకు చాలా థాంక్స్. 60 00:04:00,659 --> 00:04:02,744 లైఫ్ జాకెట్ లు పెట్టడానికి సీటు కింద మంచి ప్రదేశం కాదు, కదా? 61 00:04:02,744 --> 00:04:04,996 లైఫ్ జాకెట్లను మన ఒళ్ళో పెడితే మంచిది కదా? 62 00:04:04,996 --> 00:04:06,248 వెంటనే వేసుకోవడానికి వీలవుతుంది. 63 00:04:06,248 --> 00:04:08,250 సీటు కింద అంటే, ఏమో... చెప్పలేను. 64 00:04:08,250 --> 00:04:11,836 కూలిపోయేటప్పుడు జనం భయపడతారు. ఏమంటారు? 65 00:04:11,836 --> 00:04:14,881 విమానం కూలేటప్పుడు మీరు భయపడి ఏం చేస్తున్నారో తెలీకుండా అయిపోరు? 66 00:04:14,881 --> 00:04:17,800 అలాంటప్పుడు, "అతను ఏమన్నాడు? 67 00:04:18,343 --> 00:04:19,636 లైఫ్ జాకెట్లు ఎక్కడ ఉన్నాయి? 68 00:04:19,636 --> 00:04:21,304 ఏమన్నాడు? సీటు కిందా?" అనుకుంటారు. 69 00:04:27,394 --> 00:04:28,979 పైలట్లు బూట్లు వేసుకోలేదు. 70 00:04:30,146 --> 00:04:35,151 అందుకు కారణం, నీటిలో పడితే, బూట్లు ఉంటే కిందకు మునిగిపోతాం. 71 00:04:50,542 --> 00:04:52,627 నిజానికి ఇది అందంగా ఉంది. 72 00:04:52,627 --> 00:04:55,964 నేను ఈ దీవులను, ఇక్కడ ఉన్న అద్భుతమైన నీటిపై రంగులను చూస్తున్నాను. 73 00:04:55,964 --> 00:04:58,008 నేను ఇలాంటి అందాన్ని ముందెప్పుడూ చూడలేదు. 74 00:04:59,843 --> 00:05:03,346 మాల్దీవులలో 1200 దీవులు ఉన్నాయి, 75 00:05:03,346 --> 00:05:06,182 కానీ వీటిలో కేవలం 200 దీవులలో మాత్రమే జనం ఉంటున్నారు. 76 00:05:06,975 --> 00:05:11,688 {\an8}మేము కూడా ఇతర సాహసాలు చేయకుండా మనుషులు ఉన్న వాటికే వెళ్తున్నాం అని నా ఆశ. 77 00:05:13,064 --> 00:05:15,233 ఇది ఎలా ల్యాండ్ అవుతుందో నాకు తెలీదు. 78 00:05:15,233 --> 00:05:18,111 బహుశా నీటిలో కూల్చుతారేమో. 79 00:05:21,239 --> 00:05:23,283 ఓరి, దేవుడా. నీటిని తాకుతున్నాం. 80 00:05:35,378 --> 00:05:36,630 అరచేతులలో చెమటలు పడుతున్నాయి. 81 00:05:41,676 --> 00:05:46,348 కొన్ని సంవత్సరాల క్రితం, ఈ కూడడూ అనబడే దీవి కేవలం ఒక ఇసుక గుట్ట. 82 00:05:47,349 --> 00:05:51,061 కానీ తర్వాత దీని మీద 4.5 కోట్ల డాలర్లు ఖర్చు చేసి ఇది కట్టారు, 83 00:05:51,645 --> 00:05:53,813 దానర్థం నేను ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత 84 00:05:53,813 --> 00:05:58,235 ఖరీదైన హోటళ్లలో ఉండే అదృష్టం నాకు దొరికింది. 85 00:05:59,611 --> 00:06:02,322 ఈ రిసార్ట్ వారు అన్ని రకాలైన లగ్జరీని ఇస్తామని ప్రమాణం చేస్తున్నారు, 86 00:06:02,322 --> 00:06:03,740 అది జరిపించడానికి, 87 00:06:03,740 --> 00:06:07,702 వాళ్ళు నేను విమానం ఎక్కడానికి ముందు నుండే నా బస గురించి ప్లాన్ చేయడం ప్రారంభించారు. 88 00:06:07,702 --> 00:06:10,080 ఒక వారం ముందు 89 00:06:12,916 --> 00:06:19,798 ఇది హోటల్ వారు పంపించిన ఇష్టాల ఫారం, 90 00:06:19,798 --> 00:06:24,261 అక్కడికి వెళ్ళడానికి ముందు దీనిని నింపాలి అంట. 91 00:06:25,178 --> 00:06:27,180 సరే, "టైటిల్." 92 00:06:27,180 --> 00:06:30,850 సరే, "మిస్టర్, మిస్, మాస్టర్, డాక్టర్, 93 00:06:31,393 --> 00:06:32,477 రాజు." 94 00:06:33,603 --> 00:06:36,940 నాకైతే "రాజా" అని పెట్టాలని ఉంది, కానీ సింపుల్ గా "మిస్టర్" అని పెడతాను. 95 00:06:37,524 --> 00:06:39,067 "ప్రశాంతమైన సాహసాలు." 96 00:06:41,736 --> 00:06:43,405 సరే, ఇది వినడానికి చాలా ఈజీగా ఉంది. 97 00:06:43,405 --> 00:06:45,740 "ప్యాడిల్ బోర్డింగ్". వద్దు. 98 00:06:45,740 --> 00:06:48,618 "జెట్ స్కీ, కైట్ సర్ఫింగ్, స్కూబా డైవింగ్. 99 00:06:48,618 --> 00:06:51,955 సొర చేపల మధ్య స్కూటర్ తో స్కూబా డైవింగ్. 100 00:06:53,915 --> 00:06:55,166 నేను ఏం చేస్తానో చూడండి. 101 00:06:56,501 --> 00:06:57,669 వద్దు. 102 00:06:57,669 --> 00:07:00,797 "ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఏం చేయడానికి ఇష్టపడతారు?" 103 00:07:04,342 --> 00:07:05,343 విశ్రాంతి తీసుకోవడం. 104 00:07:06,011 --> 00:07:10,515 "మేము గనుక మీకు బాగా ఇష్టమైన ఒక వంటకాన్ని వండాలంటే, ఏం కావాలి అంటారు? 105 00:07:10,515 --> 00:07:12,392 మీరు ఏమైనా అడగొచ్చు." 106 00:07:15,520 --> 00:07:20,775 చీజ్ బర్గర్, ఫ్రైస్ ఇంకా షేక్. 107 00:07:21,568 --> 00:07:22,861 చాక్లెట్ లేదా వనిల్లా. 108 00:07:24,112 --> 00:07:25,614 అది వాళ్ళ ఇష్టానికే వదిలేస్తాను. 109 00:07:31,161 --> 00:07:33,163 గుడ్ మార్నింగ్, యుజీన్. కూడడూ, మాల్దీవులకు స్వాగతం. 110 00:07:33,163 --> 00:07:35,040 - నా పేరు బ్రాడ్ కోల్డర్, జనరల్ మేనేజర్ ని. - సరే. 111 00:07:35,040 --> 00:07:37,000 - నిన్ను కలవడం సంతోషం, బ్రాడ్. - నాకు కూడా సంతోషం. 112 00:07:37,000 --> 00:07:38,543 ఓరి, దేవుడా. 113 00:07:38,543 --> 00:07:43,215 నేను ముందెప్పుడూ ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు ఇలా జనం వచ్చి నన్ను ఆహ్వానించలేదు. 114 00:07:43,215 --> 00:07:46,176 - ఎప్పుడూ లేదా? - లేదు, ఇదే మొదటిసారి. 115 00:07:46,176 --> 00:07:48,136 అడుగుపెట్టడంతోనే అంతా బాగా మొదలైంది. 116 00:07:48,136 --> 00:07:50,096 మీకు ఈ దీవిని పరిచయం చేస్తాను. 117 00:07:51,640 --> 00:07:53,850 కూడా అంటే మాల్దీవి దేశ భాషలో "చిన్నది" అని అర్థం, 118 00:07:53,850 --> 00:07:56,061 కాబట్టి, ఇది చాలా చాలా చిన్న దీవి. 119 00:07:56,061 --> 00:07:57,604 పదిహేను ఇళ్ళు మాత్రమే ఉంటాయి. 120 00:07:58,605 --> 00:08:00,649 ఒకసారి అతిథి దీవి మీదకు అడుగు పెట్టిన తర్వాత, 121 00:08:00,649 --> 00:08:02,943 "ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా" అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం, 122 00:08:02,943 --> 00:08:07,322 అంటే మీకు ఏ సమయంలో అయినా, ఏం కావాలంటే అది ఇవ్వడానికి మా స్టాఫ్ సిద్ధంగా ఉంటారు. 123 00:08:07,322 --> 00:08:09,699 మీ ప్రతీ కోరిక, మాకు ఆజ్ఞ లాంటిది. 124 00:08:09,699 --> 00:08:12,160 - ఏదైనా, ఎప్పుడైనా... - ఎక్కడైనా. 125 00:08:12,160 --> 00:08:13,912 - ...ఎక్కడైనా. - అవును. 126 00:08:13,912 --> 00:08:16,289 ఈ మూడు పదాలు నాకు బాగా నచ్చాయి. 127 00:08:19,793 --> 00:08:21,127 ఈ బీచ్ ని చూడండి. 128 00:08:21,127 --> 00:08:23,547 - ఆ ఇళ్లలో ఒకటి నాదా? - అవును. 129 00:08:24,214 --> 00:08:27,217 ఇక్కడ ఏ సమయంలో అయినా 32 మంది అతిథులకు మించి ఉండరు, 130 00:08:27,217 --> 00:08:31,429 దానర్థం, వచ్చిన వారిని సుఖాల్లో ముంచి తేల్చడానికి ఇక్కడి స్టాఫ్ అన్ని విధాలుగా ప్లాన్ చేసుకోగలరు. 131 00:08:32,054 --> 00:08:36,601 నాకైతే నేను ఇక్కడ ఉన్నప్పుడు, గట్టినేల మీద చేసే కార్యక్రమాలు ఉంటే మంచిదని అనిపిస్తుంది. 132 00:08:36,601 --> 00:08:39,354 మీరు ఉంటున్న ప్రదేశం నుండే, మీరు నేరుగా సముద్రంలోకి దిగి ఊత కొట్టొచ్చు. 133 00:08:39,354 --> 00:08:43,191 సాధారణంగా మీరు స్నోర్కెలింగ్ చేసేటప్పుడు, ఏ సమయంలో అయినా కనీసం 134 00:08:43,191 --> 00:08:44,401 - అయిదు రకాల చేపలు ఉంటాయి. - భలే. 135 00:08:44,401 --> 00:08:46,570 కాకపోతే ఒకే ఒక్క ప్రమాదకరమైన విషయం ఏంటంటే, 136 00:08:46,570 --> 00:08:48,989 మీరు ట్రిగ్గర్ ఫిష్ అనబడే ఒక పెద్ద చేపను గనుక చూశారంటే, 137 00:08:48,989 --> 00:08:51,074 అప్పుడు కొంచెం దూరం పాటించడం మంచిది. 138 00:08:51,074 --> 00:08:54,035 ఒక మహిళకు ఆ ట్రిగ్గర్ ఫిష్... 139 00:08:54,035 --> 00:08:55,912 - ఓహ్, అమ్మో. - ...చెవి కొరికేసింది, కాబట్టి... 140 00:08:55,912 --> 00:08:57,080 పర్లేదు, మీరేం చింతించకండి. 141 00:08:57,080 --> 00:08:58,790 - నేను వీలైనంత దూరంగా ఉంటాను. - అలాగే. 142 00:08:58,790 --> 00:09:01,626 "దూరంగా ఉండడం" అంటే ఏంటో మీరు నన్ను చూసి తెలుసుకుంటారు. 143 00:09:03,378 --> 00:09:05,171 అప్పుడప్పుడు సొర చేప వస్తుంటుంది. 144 00:09:06,423 --> 00:09:07,799 ఈ నీటిలో సొర చేపలు ఉన్నాయా? 145 00:09:11,845 --> 00:09:13,179 అది మంచి విషయం కాదు. 146 00:09:31,907 --> 00:09:34,284 ఇది నిజంగానే భలే ఉంది. 147 00:09:35,076 --> 00:09:37,245 నేను సముద్రం కనిపించే గది కావాలి అన్నాను, 148 00:09:37,245 --> 00:09:39,205 వాళ్ళు సరిగ్గా అదే ఇచ్చారు. 149 00:09:41,458 --> 00:09:44,878 మాల్దీవులు ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తులో ఉండే దేశం. 150 00:09:44,878 --> 00:09:48,632 ఇక్కడి దీవులు ఏవీ కూడా సముద్ర మట్టానికి ఆరు అడుగులకు మించిన ఎత్తులో ఉండవు, 151 00:09:48,632 --> 00:09:52,886 కాబట్టి ఎటు చూసినా, అద్భుతమైన సముద్రం కనిపిస్తుంది. 152 00:09:54,054 --> 00:09:55,055 {\an8}ఇదెలా ఉందో చూడండి. 153 00:09:56,389 --> 00:09:58,183 స్వాగతం యుజీన్ 154 00:09:58,183 --> 00:09:59,476 రాత్రికి నేను ఎక్కడ పడుకోవాలి? 155 00:09:59,476 --> 00:10:00,977 {\an8}ఎందుకంటే దీనిని చెరపడం నాకు ఇష్టం లేదు. 156 00:10:02,229 --> 00:10:05,732 {\an8}అయినా, నా భార్య డెబ్ కూడా ప్రతీ రాత్రి నా పరుపు మీద ఇలాగే పెడుతుంది అనుకోండి, 157 00:10:05,732 --> 00:10:07,442 {\an8}కాబట్టి ఇదేం అంత స్పెషల్ కాదు. 158 00:10:09,778 --> 00:10:15,867 ఈ 3000 చదరపు అడుగుల విల్లాలో సొర చేపలు లేని మంచి పూల్ కూడా ఉంది, 159 00:10:15,867 --> 00:10:19,371 ఒక రాత్రి ఇక్కడ ఉండడానికి 7,000 డాలర్లకు పైనే ఖర్చు అవుతుంది. 160 00:10:24,125 --> 00:10:25,627 నాకు ఇక్కడ నచ్చేలా ఉంది. 161 00:10:28,505 --> 00:10:29,756 - హలో. - హాయ్. 162 00:10:29,756 --> 00:10:32,509 నా పేరు షోఫ. నేను మీ పర్సనల్ బట్లర్ ని. 163 00:10:32,509 --> 00:10:35,345 - లోనికి రావచ్చా? - అవును, రండి... దయచేసి రండి. 164 00:10:35,345 --> 00:10:36,596 థాంక్స్. 165 00:10:36,596 --> 00:10:38,056 - నా పర్సనల్ బట్లరా? - మీకు... 166 00:10:38,056 --> 00:10:39,182 అవును, అదే. 167 00:10:39,182 --> 00:10:43,270 మీకు నచ్చేవి, నచ్చనివి నాకు కొంచెం చెప్తారా? 168 00:10:43,270 --> 00:10:46,398 నాకు నీటిలో చేయాల్సిన పనులు ఏవీ నచ్చవు. 169 00:10:46,982 --> 00:10:47,941 అవును. 170 00:10:47,941 --> 00:10:49,526 మీరు... మీరు మాల్దీవులలో ఉన్నారు. 171 00:10:49,526 --> 00:10:52,112 - అవును. నిజమే. - ఇక్కడ 99% నీరే ఉంటుంది. 172 00:10:52,112 --> 00:10:55,282 అదే కదా ఇక్కడ ఎదురవుతున్న వింత సమస్య. 173 00:10:55,907 --> 00:10:58,994 కానీ నీటిలో ఆడే ఆటలు ఉన్నాయి చూడండి, నాకు అవేమీ నచ్చవు. 174 00:10:58,994 --> 00:11:00,620 మీకు బాగా నచ్చే ఆట ఏది? 175 00:11:01,204 --> 00:11:02,122 గోల్ఫ్. 176 00:11:02,122 --> 00:11:05,000 మాల్దీవులలో మేము గోల్ఫ్ ఆడము, కానీ నేను ఏదోకటి చేస్తాను. 177 00:11:05,000 --> 00:11:06,084 సరే. 178 00:11:08,503 --> 00:11:10,714 నేను దీనికి ఎంతగా అలవాటు పడగలిగినా, 179 00:11:10,714 --> 00:11:13,341 ఈ అనుభవం వల్ల నాకు తల బరువు ఎక్కుతుందని ఎవరూ అనుకోవడం ఇష్టం లేదు. 180 00:11:14,968 --> 00:11:18,972 "ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా" అనబడే ఈ సిద్ధాంతం ఒక కెనెడియన్ పౌరుడిగా 181 00:11:18,972 --> 00:11:20,223 జీర్ణించుకోవడం నాకు కష్టం, తెలుసా? 182 00:11:20,223 --> 00:11:23,685 కొంచెం అతిగా అడుగుతున్నాం అనే భావన మాలో పుడుతుంది. 183 00:11:24,352 --> 00:11:27,731 ఒకసారి ఈ విషయాన్ని, ఉన్న ప్రదేశాన్ని ఆలోచిస్తే, 184 00:11:27,731 --> 00:11:30,358 ఎంతైనా శూన్యానికి మధ్యలో ఉన్నాం, 185 00:11:30,984 --> 00:11:34,362 ఎవరికైనా వారికి కావాల్సింది సరిగ్గా ఎలా తెచ్చి ఇవ్వగలరు? 186 00:11:34,362 --> 00:11:36,740 నాకు ఆ విషయాన్ని ఇంకాస్త తెలుసుకోవాలని ఉంది, 187 00:11:36,740 --> 00:11:39,659 ఎందుకంటే ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు. 188 00:11:41,745 --> 00:11:43,330 ముందు ప్రాధమిక అంశాలతో మొదలెడదాం. 189 00:11:43,330 --> 00:11:47,334 నాకైతే, నన్ను సంతృప్తి పరచడానికి ఉన్న దారి నా కడుపు నింపడం ద్వారానే. 190 00:11:48,126 --> 00:11:51,796 కాబట్టి నేను ఎగ్జిక్యూటివ్ చెఫ్, ఎడ్వార్డ్ ని కలవడానికి వెళ్తున్నాను, 191 00:11:51,796 --> 00:11:55,300 అతని నుండి అతను అతిథులను ఎలా సంతోషపెట్టగలడో తెలుసుకుంటాను. 192 00:11:56,384 --> 00:11:57,928 - ఎడ్వార్డ్. - యుజీన్. 193 00:11:57,928 --> 00:11:59,596 - ఎలా ఉన్నారు? - బాగున్నాను. మీరు? 194 00:11:59,596 --> 00:12:01,056 నేను అద్భుతంగా ఉన్నాను. 195 00:12:02,140 --> 00:12:04,935 - మనం సరిగ్గా శూన్యానికి మధ్యలో ఉన్నాం... - చుట్టూ ఏమీ లేదు. అవును. 196 00:12:04,935 --> 00:12:07,771 - ...కానీ మీరు ఆహార విషయంలో ఏ సమయంలో అయినా... - ఏది కావాలంటే అది. 197 00:12:07,771 --> 00:12:10,190 - ...ఏది కావాలంటే అది పెట్టగలరు. - అవును. 198 00:12:10,190 --> 00:12:11,274 ఇదెలా సాధ్యం? 199 00:12:11,274 --> 00:12:15,362 అదృష్టవశాత్తు మాల్దీవులు ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్ అలాగే యూరప్ కి 200 00:12:15,362 --> 00:12:18,657 మధ్యలో ఉంది. 201 00:12:18,657 --> 00:12:22,369 కాబట్టి ఆ కారణంగా మేము దేనినైనా 24 గంటల్లో తెప్పించగలం. 202 00:12:22,369 --> 00:12:27,249 మిమ్మల్ని ఒకరు అడిగిన అత్యంత కష్టమైన విషయం ఏంటి? 203 00:12:27,249 --> 00:12:30,168 అది ఒక మాములు బటర్ గురించి. 204 00:12:30,752 --> 00:12:32,921 అది ఫ్రాన్స్ లో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రదేశంలోని 205 00:12:32,921 --> 00:12:34,798 ప్రత్యేకమైన సప్లయర్ నుండి తేవాల్సి వచ్చింది. 206 00:12:35,298 --> 00:12:36,633 - అవునా? - బ్రిట్టని నుండి. 207 00:12:36,633 --> 00:12:41,221 వాళ్ళు శనివారం ఉదయం పదింటికి దానిని అడిగారు, మేము తర్వాత రోజు, ఆదివారం ఉదయం 208 00:12:41,221 --> 00:12:42,889 టిఫిన్ సమయానికి దానిని 209 00:12:42,889 --> 00:12:44,516 ఇక్కడికి తెప్పించి వారికి వడ్డించాము. 210 00:12:44,516 --> 00:12:45,559 వావ్. 211 00:12:46,518 --> 00:12:51,147 నేనే గనుక మీ స్థానంలో ఉండి ఉంటే, "అంత సీన్ లేదు" అనేవాడిని. 212 00:12:52,190 --> 00:12:54,818 "కాస్త ఆలోచించి అడగండి" అనేవాడిని. 213 00:12:54,818 --> 00:12:56,111 కానీ మేము ఇలాగే చేస్తాం. 214 00:12:56,111 --> 00:13:01,283 చెప్పాలంటే, ఎడ్వార్డ్ తానే స్వయంగా తన అతిథులను కావాలని మెన్యులో లేనివి అడగమంటాడు. 215 00:13:01,866 --> 00:13:05,245 దీనినే వారు "స్క్రిప్ట్ చేయబడని డైనింగ్" అంటారు. 216 00:13:06,246 --> 00:13:07,998 సరే, నేను ఇంతకుముందు వంటలు చేయడం చూశాను, 217 00:13:07,998 --> 00:13:11,501 కాబట్టి నేను ఈ వంటగదిలో నాకు వీలైనంత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 218 00:13:12,002 --> 00:13:15,088 నేను సగం ఏప్రన్ కట్టుకుంటా. ఇలా కడితే మీరు ఏమంటారు? 219 00:13:15,088 --> 00:13:17,048 - ఏప్రన్ అనే అంటాం. - దీనిని హాఫ్-ఏప్రన్ అనరా? 220 00:13:17,048 --> 00:13:20,010 ఉత్తి ఏప్రన్ అంతే. సరే. 221 00:13:20,010 --> 00:13:23,847 ఒక అతిథి వచ్చి, "నాకు ఉల్లిపాయ సూప్ అంటే ఇష్టం, కానీ దానిని కొంచెం 222 00:13:24,514 --> 00:13:26,600 స్పెషల్ గా చేయగలరా?" అని అడిగారు. 223 00:13:26,600 --> 00:13:30,937 అందుకు మనం కొంచెం బ్రాందీ, అలాగే బ్లాక్ ట్రఫుల్ వాడాలి. 224 00:13:31,479 --> 00:13:32,772 మనకు కొంచెం చీజ్ కూడా కావాలి. 225 00:13:32,772 --> 00:13:33,857 మీకు ఏ చీజ్ కావాలి? 226 00:13:33,857 --> 00:13:37,777 నాకు కొంచెం 'గృయెర్', కొంచెం 'టెట్ దు మోన్' అలాగే 'పార్మజాన్' చీజ్లు కావాలి. 227 00:13:37,777 --> 00:13:38,862 వెంటనే తెస్తా. 228 00:13:41,656 --> 00:13:43,116 ఇది కూడడూ కాబట్టి, 229 00:13:43,116 --> 00:13:45,702 చీజ్ ని వీళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టరు. 230 00:13:45,702 --> 00:13:48,622 దాని కోసం ఒక సెల్లార్ మొత్తాన్నే కేటాయించారు. 231 00:13:52,542 --> 00:13:56,046 అలాగే లోనికి వచ్చిన వెంటనే మొహం మీద కొట్టినట్టు బలమైన వాసన రావడం మొదలైంది. 232 00:13:56,046 --> 00:13:57,297 వావ్. 233 00:13:59,633 --> 00:14:03,678 సరే. ఇది గృయెర్, పార్మజాన్ 234 00:14:04,429 --> 00:14:05,639 అలాగే... 235 00:14:09,392 --> 00:14:10,393 ఫ్రెంచ్? 236 00:14:15,190 --> 00:14:19,194 నేను అంత వేగంగా కదలలేను అని ఎడ్వార్డ్ కి చెప్పడం మర్చిపోయా. 237 00:14:19,194 --> 00:14:22,155 నాకు ఆ గృయెర్ లేదా ఇంకొక చీజ్ కనిపించడం లేదు... 238 00:14:25,033 --> 00:14:26,785 నేను వీటిని తీసుకెళ్తా. 239 00:14:28,745 --> 00:14:29,913 కొంచెం బ్రై చీజ్ కూడా. 240 00:14:32,958 --> 00:14:34,501 ఎంతైనా, అది కూడా చీజ్ కదా? 241 00:14:36,586 --> 00:14:40,006 నాకు మీరు చెప్పిన ఫ్రెంచ్ చీజ్ పేరు గుర్తులేదు, 242 00:14:40,006 --> 00:14:42,759 అందుకే కొంచెం బ్రై చీజ్ తెచ్చా, ఇది కూడా ఫ్రెంచ్ చీజే. 243 00:14:42,759 --> 00:14:44,886 మంచి ప్రయత్నం, యుజీన్. మీరు చీజ్ గదిలోకి వెళ్లిన వెంటనే 244 00:14:44,886 --> 00:14:46,471 - అది మీకు ఎదురుగా ఉంటుంది. - అలాగే. 245 00:14:50,725 --> 00:14:52,978 - ఇది సరైనది. - ఇదేనా అది? 246 00:14:53,645 --> 00:14:55,438 - సరే. కావాల్సింది ఇదే. - మంచిది. 247 00:14:56,064 --> 00:14:58,149 కొంచెం బ్రాందీ, బ్లో టార్చ్ తీసుకోండి. 248 00:15:12,581 --> 00:15:14,666 సరే, ఇదేదో భలే ఉండేలా ఉంది. 249 00:15:19,504 --> 00:15:22,215 - అన్నీ సమయానికే చేయగలమా, ఎడ్వార్డ్? - కొంచెం వేగంగా చేయాలి. 250 00:15:22,215 --> 00:15:23,341 - సరే. - ఇంకాస్త వేగంగా పని చేయాలి. 251 00:15:23,341 --> 00:15:25,719 మీవల్లే ఇంత లేట్ అవుతుంది. మీరు... 252 00:15:26,261 --> 00:15:29,514 నేను నాకు వీలైనంత వేగంగా పని చేస్తున్నా. ఇంతకంటే వేగంగా చూడలేను కదా. 253 00:15:30,974 --> 00:15:32,517 వొలా. 254 00:15:32,517 --> 00:15:37,772 బాగా మగ్గిన ఉల్లిపాయలు, బీఫ్ పులుసు, బ్రాందీ ఇంకా బ్లాక్ ట్రఫుల్ తో 255 00:15:37,772 --> 00:15:41,651 అద్భుతమైన మూడు చీజ్ల సమ్మేళనంతో చేయబడిన సూప్. 256 00:15:43,862 --> 00:15:45,113 ఓరి, దేవుడా. 257 00:15:45,113 --> 00:15:49,618 నేను చూసిన అత్యంత ప్రత్యేకమైన ఉల్లిపాయ సూప్ ఇదే. 258 00:15:51,077 --> 00:15:54,915 వ్యక్తిగతంగా అయితే, బ్రెడ్ తో పాటు ఇంకాస్త సూప్ ఉంటే బాగుండు అనిపించింది. 259 00:15:54,915 --> 00:15:56,458 కానీ నాలాంటి వాడికి కూడా, 260 00:15:56,458 --> 00:16:00,879 "ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా" అనబడే సిద్ధాంతం కాస్త అతిగానే అనిపిస్తుంది. 261 00:16:01,880 --> 00:16:05,175 నేనైతే తెల్లవారుజామున నాలుగింటికి ఫోన్ తీసి 262 00:16:05,175 --> 00:16:07,594 ఏదోకటి ఆర్డర్ చేసే మనిషిని కాదు. 263 00:16:07,594 --> 00:16:10,805 అంటే, అలాంటి పని చేయాలంటే అమెరికన్లకే సాధ్యం. 264 00:16:11,431 --> 00:16:14,351 కానీ ఇది ఇక్కడ ఉన్న ఆసక్తికరమైన ఫిలాసఫి. 265 00:16:16,728 --> 00:16:18,521 మొదటి రోజు చాలా చక్కగా గడిచింది. 266 00:16:18,521 --> 00:16:20,190 కాకపోతే, అంతా నేనే చేశాను అనలేను. 267 00:16:20,941 --> 00:16:22,734 నేను ఫ్రెంచ్ ఉల్లిపాయ సూప్ చేసి, 268 00:16:22,734 --> 00:16:25,737 సముద్ర విమానంలో ప్రయాణం చేసి, నీటికి దూరంగా ఉన్నాను అనుకోండి. 269 00:16:26,321 --> 00:16:28,949 మళ్ళీ ఆలోచిస్తే, మొత్తం నేనే చేశాను అని చెప్పడమే బాగుంది లెండి. 270 00:16:30,909 --> 00:16:37,332 షోఫ, నా బట్లర్ రేపటికి నాకోసం కొన్ని ప్లాన్ చేసింది. 271 00:16:38,416 --> 00:16:42,254 ఆమె ఉత్సాహం అలాగే ఆసక్తిని చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉంది. 272 00:16:42,837 --> 00:16:44,881 నీటిలోకి వెళ్ళను అని చెప్పేశాను, 273 00:16:44,881 --> 00:16:47,300 కాబట్టి రాత్రికి మంచిగా పడుకొని, 274 00:16:48,051 --> 00:16:52,597 రేపు ఏం జరగబోతుందా అని అనవసరంగా భయపడకుండా ఉంటానని ఆశిస్తున్నాను. 275 00:17:10,614 --> 00:17:11,699 గుడ్ మార్నింగ్. 276 00:17:11,699 --> 00:17:15,035 అవును, ఈ ఉదయం నిజానికి చాలా బాగుంది. 277 00:17:15,035 --> 00:17:16,662 పూల్ లో ఏముందో చూశారా? 278 00:17:18,164 --> 00:17:19,165 పదండి. 279 00:17:26,171 --> 00:17:27,591 ఇది చూడండి. 280 00:17:28,550 --> 00:17:32,137 నేను ఇప్పటి వరకు చూసిన అత్యంత ఆర్భాటమైన టిఫిన్ ప్లేట్ అది, 281 00:17:32,137 --> 00:17:34,180 వాళ్ళు దానిని పూల్ లో పెట్టారు. 282 00:17:34,806 --> 00:17:36,349 ఇది చాలా మంచి ఐడియా, 283 00:17:36,933 --> 00:17:38,768 కానీ నేను దానిని అందుకోలేకపోతున్నాను. 284 00:17:39,686 --> 00:17:44,441 ఇలా రా! 285 00:17:45,692 --> 00:17:47,277 ఓరి, దేవుడా. 286 00:17:47,277 --> 00:17:49,613 వాళ్ళు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారో నాకు తెలుసు. 287 00:17:49,613 --> 00:17:53,116 ముందు నన్ను పూల్ లోకి దించి, తర్వాత సముద్రంలోకి దించుతారు. 288 00:17:54,284 --> 00:17:57,871 కానీ టిఫిన్ చేసేటప్పుడు, నాకు నా ప్యాంట్లు వేసుకొని తినడమే నచ్చుతుంది. 289 00:17:58,997 --> 00:18:01,124 "గుడ్ మార్నింగ్, యుజీన్. 290 00:18:01,625 --> 00:18:05,629 ఇక్కడి మీ బస మైమరపించజేసేలా ఉండడం కోసం"... 291 00:18:06,463 --> 00:18:07,631 మైమరపింపజేసేలాగ. 292 00:18:08,298 --> 00:18:11,635 "నేను మీకోసం ఈ దీవి మీద ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశా. 293 00:18:11,635 --> 00:18:14,888 శబ్దంతో స్నానం చేసే ధ్యానం 294 00:18:16,097 --> 00:18:20,060 మా యోగ థెరపిస్ట్, నందిని చేత. 295 00:18:20,060 --> 00:18:23,438 మీకు మా శుభాకాంక్షలు. మీ బట్లర్, షోఫ." 296 00:18:24,356 --> 00:18:25,565 ఆసక్తికరంగా ఉంది. 297 00:18:28,985 --> 00:18:30,237 థాంక్స్. 298 00:18:33,073 --> 00:18:35,492 శబ్ద స్నానం అంటే ఏంటి? ఏంటో తెలుసుకోవాలని ఉందా? 299 00:18:35,492 --> 00:18:38,828 సరే. అలాగే. కానీ అందుకు మనం బోట్ లో ప్రయాణించాలి. 300 00:18:39,537 --> 00:18:41,122 ఇలా చేసే మిమ్మల్ని ఇక్కడి నుండి వెళ్లకుండా చేస్తారు. 301 00:18:42,207 --> 00:18:48,088 కొంచెం కుదుపులు ఎక్కువ ఉన్నాయి, నాకు కొంచెం కడుపు తిప్పుతుంది. 302 00:18:50,131 --> 00:18:52,926 మేము సరిగ్గా ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలీడం లేదు. 303 00:18:52,926 --> 00:18:57,514 కానీ, అక్కడ మంచి నేల ఉండాలని మాత్రం బలంగా కోరుకుంటున్నాను. 304 00:19:00,559 --> 00:19:03,687 శబ్ద స్నానం అంటే సౌనాలాగ ఉంటుంది ఏమో, 305 00:19:03,687 --> 00:19:06,982 లేదా వీళ్ళు అనేదాన్ని బట్టి ష్విట్జ్ స్నానంలా ఉండొచ్చు ఏమో అనిపిస్తోంది. 306 00:19:07,566 --> 00:19:10,902 నాకు అది అంతగా నచ్చదు. పెద్దగా ఎంజాయ్ చేయలేను. 307 00:19:11,486 --> 00:19:14,072 కానీ అది ఏమైనా సరే, వీలైనంతగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తాను. 308 00:19:23,623 --> 00:19:27,335 సరే, ఇక్కడ శబ్ద స్నానం ఎక్కడ చేయిస్తారు? 309 00:19:27,836 --> 00:19:29,296 ఇదేమైనా ఒక చెరశాల లాంటిదా? 310 00:19:47,147 --> 00:19:51,276 ఓరి, దేవుడా. నమ్మశక్యంగా లేదు. 311 00:19:53,695 --> 00:19:55,488 నమస్తే, మిస్టర్ యుజీన్! 312 00:19:55,488 --> 00:19:59,117 సముద్రగర్భంలో ధ్యానం చేయడానికి స్వాగతం. ఎలా ఉంది? 313 00:19:59,117 --> 00:20:01,494 ఇది ఎలా ఉందా? మనం నీటి కింద ఉన్నాం. 314 00:20:03,288 --> 00:20:05,290 అందమైన చేపలు. 315 00:20:05,290 --> 00:20:09,920 ప్రపంచంలోనే అతి పెద్ద పగడపు దిబ్బలలో కొన్ని మాల్దీవులలో ఉన్నాయి, 316 00:20:09,920 --> 00:20:12,881 అలాగే 2000 పైనే చేపల జాతులు ఉన్నాయి. 317 00:20:12,881 --> 00:20:17,886 నీటి కింద 20 అడుగుల లోతున వాటిలో వేటినీ నేను స్వయంగా చూస్తానని ఊహించలేదు. 318 00:20:19,095 --> 00:20:22,641 కొంచెం నా మనసు శాంతించే వరకు ఆగండి. 319 00:20:25,644 --> 00:20:28,897 ఇది నమ్మశక్యంగా లేదు. 320 00:20:29,481 --> 00:20:34,402 దీనిని నిర్మించిన వారు ఎవరు, వాళ్లకు ఉన్న అర్హతలు ఏంటి? 321 00:20:35,820 --> 00:20:37,822 శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? 322 00:20:37,822 --> 00:20:39,616 నిజానికి శబ్ద స్నానం అంటే ఏంటి? 323 00:20:39,616 --> 00:20:42,661 మన శరీరంలో 65% నీరే ఉంటుంది. 324 00:20:42,661 --> 00:20:46,623 ఆ నీరు, ఆ శబ్దానికి స్పందిస్తుంది, 325 00:20:46,623 --> 00:20:49,876 అలా మన శరీరంలో ఉన్న అడ్డంకులను తీసేస్తుంది. 326 00:20:49,876 --> 00:20:54,381 కానీ నాకు మాత్రం శరీరంలో ఉన్న అడ్డంకుల వల్లనే నేను బ్రతుకుతున్నాను కదా అనిపించింది. 327 00:20:54,381 --> 00:20:59,302 మీ శరీరం అప్పుడు... పాజిటివ్ శక్తిని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. 328 00:20:59,302 --> 00:21:04,432 - మీ మనసు ప్రశాంతంగా, రిలాక్స్ అయి, హాయిగా ఉంటుంది. - నేను దానిని చూసేంత వరకు నా మనసు హాయిగానే ఉంది, 329 00:21:04,432 --> 00:21:07,811 అది చూడడానికి మామూలు చేపలా లేదు. 330 00:21:08,770 --> 00:21:12,190 శ్వాస తీసుకోండి. మొదలెడదాం. 331 00:21:12,190 --> 00:21:19,281 - ఓం. - ఓం. 332 00:21:28,373 --> 00:21:30,166 వావ్. భలే ఉంది. 333 00:21:30,166 --> 00:21:33,295 - నిజానికి నేను కొంచెం షాక్ కి గురయ్యాను. - మీరు అద్భుతంగా చేశారు! 334 00:21:34,379 --> 00:21:37,215 నందిని నేను ఒక నటుడిని అని కనిపెట్టేసింది. 335 00:21:37,215 --> 00:21:41,094 నన్ను కొంచెం మెచ్చుకుంటే, నాతో ఏమైనా చేయించవచ్చు అని తెలుసుకుంది. 336 00:21:41,887 --> 00:21:42,888 ఇది భలే ఉంది. 337 00:21:43,722 --> 00:21:47,976 శ్వాస తీసుకోండి. 338 00:21:52,731 --> 00:21:58,612 శ్వాస వదలండి. 339 00:21:58,612 --> 00:22:02,699 ఇది నిజానికి చాలా గొప్ప ఉద్దేశంతో ఏర్పరచిన పని. 340 00:22:05,285 --> 00:22:08,830 కానీ "పగుళ్లు ఏర్పడితే ఇప్పుడు పరిస్థితి ఏంటి?" అన్న ఆలోచన నాలో నుండి పోవడం లేదు. 341 00:22:08,830 --> 00:22:11,207 "నీరు లీక్ అయితే ఏంటి?" అన్నట్టు. 342 00:22:20,675 --> 00:22:23,386 "కొంప మునిగింది" అంటుంటాం కదా, అలా ఉంటుందేమో? 343 00:22:24,429 --> 00:22:26,139 అలా చెప్పుకోవడం భలే ఉంటుంది. 344 00:22:27,807 --> 00:22:30,393 మెల్లిగా మీ కళ్ళు తెరవండి. 345 00:22:31,853 --> 00:22:33,563 నెమ్మదిగా. 346 00:22:33,563 --> 00:22:35,190 అవి ఈల్ చేపలా? 347 00:22:37,609 --> 00:22:40,612 ఇది భలే ఉంది, ఒకసారి అక్కడ రిలాక్స్ అయిన తర్వాత, 348 00:22:40,612 --> 00:22:44,824 నీటి కింద జరిగే వాటిని చూడడం చాలా బాగుంది. 349 00:22:46,159 --> 00:22:49,162 ధ్యానం మధ్యలో నేను దాదాపు నిద్రపోయాను అనుకోండి. 350 00:22:49,162 --> 00:22:50,580 నాకు నిద్ర చాలా ఈజీగా వచ్చేస్తుంది. 351 00:22:52,791 --> 00:22:54,292 అన్ని ఒడిదుడుకుల మధ్య కూడా, 352 00:22:54,292 --> 00:22:59,422 షోఫ నాకు నీటి మధ్య ఒక మంచి అనుభవాన్ని ఇవ్వడంలో విజయం సాధించింది. 353 00:23:00,465 --> 00:23:01,508 హలో! 354 00:23:01,508 --> 00:23:04,177 నీటిలోకి వెళ్లకుండానే, స్నోర్కెలింగ్ అనుభవం ఎలా ఉంటుందో 355 00:23:04,177 --> 00:23:06,471 అనుభవించిన తర్వాత, 356 00:23:06,471 --> 00:23:09,474 ఇప్పుడు నా బట్లర్ ఏం ప్లాన్ చేసిందో చూడాలి. 357 00:23:09,474 --> 00:23:11,601 - పెద్ద అడుగు వేయాలి. అంతే. - థాంక్స్. 358 00:23:11,601 --> 00:23:16,022 తెలిసింది ఏంటంటే, నేను మెరైన్ బయోలజిస్టు, జాస్మిన్ తో బోటు మీద వెళ్ళబోతున్నాను. 359 00:23:16,022 --> 00:23:18,692 బహుశా సముద్రం గురించి నేను మరింత తెలుసుకోగలిగితే, 360 00:23:18,692 --> 00:23:21,027 నేను ఇక్కడ ఇంకాస్త బాగా ఎంజాయ్ చేయగలనేమో. 361 00:23:21,611 --> 00:23:25,865 లేదా బహుశా నాకు ఇంకా తెలీని, నాకు హాని తలపెట్టగల జీవుల గురించి తెలుసుకుంటానేమో. 362 00:23:25,865 --> 00:23:28,034 బోటు అంటే ఇలా ఉండాలి. 363 00:23:28,034 --> 00:23:30,495 కుదుపులు లేవు. కడుపు తిప్పడం లేదు. 364 00:23:31,538 --> 00:23:33,873 సాఫీగా వెళ్తుంది. నాకు ఏమీ తెలీడం లేదు. 365 00:23:33,873 --> 00:23:35,834 మీరు సాధారణంగా ఇలాంటివి చేస్తుంటారా? 366 00:23:35,834 --> 00:23:38,920 - నేను ఇలాంటివి అస్సలు చేయను. లేదు. - నిజంగా చేయరా? 367 00:23:40,839 --> 00:23:46,219 మీకు సముద్రం మీద ఉన్న ఇష్టం నాకు అస్సలు లేదు. 368 00:23:46,803 --> 00:23:49,306 - లేదా? - కానీ అందుకు కారణం నా భయమే. 369 00:23:49,306 --> 00:23:52,017 - తెలుసా? మునిగిపోతానేమో అన్న భయం... - అవును. 370 00:23:52,017 --> 00:23:56,521 ...అలాగే ఏదైనా సొరచేప వచ్చి ఒక ముక్క కోరుకుతుందేమో 371 00:23:56,521 --> 00:23:59,065 - ఆ తర్వాత మునుగుతానేమో అన్న భయం. - పెద్ద సొరచేప. అవును. 372 00:24:00,650 --> 00:24:05,697 మాల్దీవులకు ఈ ప్రత్యేకతను ఇచ్చే విషయం ఏంటి? 373 00:24:05,697 --> 00:24:09,534 సరే, మాల్దీవులలో ప్రపంచ పగడపు దిబ్బలలో అయిదు శాతం ఉన్నాయి. 374 00:24:09,534 --> 00:24:12,037 - భలే, అది గొప్ప విషయం... - అది చాలా ఎక్కువే కదా? 375 00:24:12,037 --> 00:24:15,332 ...ఎందుకంటే మీరు మ్యాప్ లో మాల్దీవులను చూస్తే, చిన్న చుక్కలాగ ఉంటుంది. 376 00:24:15,332 --> 00:24:17,208 - కొన్నిసార్లు మ్యాప్ లో కనిపించదు కూడా. - అవును. 377 00:24:17,208 --> 00:24:18,710 అంటే చాలా పగడపు దిబ్బలు ఉన్నాయి. 378 00:24:18,710 --> 00:24:20,128 - ఎంత అంటే... - అవును. 379 00:24:20,128 --> 00:24:22,881 ...ప్రస్తుతం సముద్ర చరాల్లో పావు వంతు 380 00:24:22,881 --> 00:24:24,466 పగడపు దిబ్బల వద్దే ఉంటాయి. 381 00:24:25,425 --> 00:24:31,389 అందుకే ఇక్కడ ఉన్న సముద్ర జీవులు చాలా ప్రత్యేకమైనవి. 382 00:24:31,389 --> 00:24:33,516 - అవును. - అలాగే ఆ పగడపు దిబ్బ వల్లే 383 00:24:33,516 --> 00:24:37,437 ఇక్కడ ఉన్న ఈ ఇసుక కూడా నమ్మశక్యం కానంత తెల్లగా ఉంటుంది. 384 00:24:38,980 --> 00:24:44,110 నిజం చెప్పాలంటే, ప్రపంచంలో కేవలం అయిదు శాతం బీచ్ లు మాత్రమే ఇలా పగడపు దిబ్బలతో నిర్మితమై ఉంటాయి. 385 00:24:46,029 --> 00:24:48,448 అంటే, పక్కనే ఉన్న ఈ సముద్రంతో కలిపి చూస్తే, 386 00:24:48,448 --> 00:24:50,325 ఇది నిజంగా చాలా అందంగా ఉంది. 387 00:24:50,325 --> 00:24:51,409 - కదా? - అవును. నిజమే. 388 00:24:51,409 --> 00:24:55,872 అలాగే, ఎవరో చెప్పారు అన్నట్టు, ఈ సముద్రం నాకోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది, 389 00:24:55,872 --> 00:25:00,210 ఇలాంటి దానిని చివరికి నా పర్సనల్ బట్లర్ కూడా ప్లాన్ చేయగలిగేది కాదు ఏమో. 390 00:25:01,419 --> 00:25:03,672 అక్కడ. మీ వెనుక ఉన్నాయి. చూశారా? 391 00:25:05,298 --> 00:25:09,719 - కనిపించాయా? - ఓహ్, భలే! డాల్ఫిన్ లు వచ్చాయి. 392 00:25:11,054 --> 00:25:12,847 కింద చూడండి. కనిపించిందా? 393 00:25:13,431 --> 00:25:16,726 - ఓహ్, అవును. అవును! - ఒకటి. ఇక్కడ. 394 00:25:16,726 --> 00:25:18,728 - నాలుగు, అయిదు. - అక్కడ ఉన్నాయి! 395 00:25:18,728 --> 00:25:20,855 - అవును. - భలే! 396 00:25:20,855 --> 00:25:22,566 - కనిపించాయా? - అవి గెంతుతున్నాయి. 397 00:25:28,113 --> 00:25:29,489 ఇది చాలా బాగుంది కదా? 398 00:25:29,489 --> 00:25:33,660 అద్భుతం. నిజంగా మతి పోతుంది. 399 00:25:33,660 --> 00:25:36,496 మాల్దీవులు దీవులతో చేయబడిన ఒక స్వర్గం లాంటిది, 400 00:25:36,496 --> 00:25:39,416 దీవి అంటే సముద్రంలోనే కదా ఉండేది. 401 00:25:39,416 --> 00:25:41,626 పేరును బట్టి అర్థం అవుతుంది. 402 00:25:43,336 --> 00:25:46,006 నాకు ఈ బోటులో ఇంకా చక్కర్లు కొట్టడానికి 403 00:25:46,006 --> 00:25:47,632 ఇంకాస్త ఓపిక ఉన్నా కూడా, 404 00:25:47,632 --> 00:25:51,344 ప్రస్తుతానికి సముద్రంలో అన్నీ చెడ్డవి మాత్రమే 405 00:25:51,344 --> 00:25:54,973 లేవు అన్న విషయం తెలుసుకొని నా ప్రయాణాన్ని ముగిస్తున్నాను. 406 00:26:03,273 --> 00:26:06,067 ఈ లగ్జరీ జీవితాన్ని నేను... 407 00:26:06,651 --> 00:26:09,112 చాలా చక్కగా, సౌకర్యంగానే ఆస్వాదిస్తున్నాను. 408 00:26:10,780 --> 00:26:14,701 కానీ ఇక్కడ ఉన్న ఈ సుఖాలలో మునిగి తేలడం నాకు సిగ్గుగా ఉంది, 409 00:26:14,701 --> 00:26:17,120 కాబట్టి ప్రతీ దానికి నా పర్సనల్ బట్లర్ మీద ఆధారపడకుండా 410 00:26:17,120 --> 00:26:20,665 కొంచెం ఈ దేశంలో ఇంకేముందో చూడాలి అనిపించింది. 411 00:26:23,793 --> 00:26:26,838 మాల్దీవులలో దాదాపు యాభై లక్షల మంది ఉంటున్నారు. 412 00:26:26,838 --> 00:26:29,132 వారంతా 200 దీవుల మీద ఉంటున్నారు, 413 00:26:29,132 --> 00:26:34,179 కారణంగా ప్రపంచంలోనే భౌగోళికంగా అత్యంత చదరగొట్టబడిన దేశం అయింది. 414 00:26:34,179 --> 00:26:38,975 కాబట్టి, ఇక్కడి స్టాఫ్ ని తప్ప, ఇంకెవరినీ కలవకపోవడం నాకు ఆశ్చర్యం వేయలేదు. 415 00:26:41,895 --> 00:26:47,150 నా నైజానికి వ్యతిరేకంగా, నేనే ఇవాళ స్వయంగా బోటు ఎక్కి, 416 00:26:47,150 --> 00:26:50,654 ఇక్కడ జనం ఎక్కువగా ఉండే దీవులలో ఒకటైన నైఫరుకి వెళ్లి, 417 00:26:50,654 --> 00:26:54,574 అక్కడ ఉండే ఒకరిని కలవబోతున్నాను. 418 00:26:55,367 --> 00:26:57,661 - మీరు శాండీ అనుకుంట కదా. - అవును. 419 00:26:58,453 --> 00:27:02,916 ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేకుండా, ప్రస్తుతం మాల్దీవుల ప్రభుత్వం 420 00:27:02,916 --> 00:27:06,461 వారి పావు వంతు ఆదాయాన్ని దేశంలోనే అతిపెద్ద పరిశ్రమైన టూరిజం ద్వారా ఆర్జిస్తోంది. 421 00:27:07,087 --> 00:27:11,841 నైఫరులో బ్రతికే చాలా మంది జనం దగ్గరలో ఉండే టూరిస్టు రిసార్టులలో పనిచేస్తుంటారు. 422 00:27:11,841 --> 00:27:14,928 శాండీ కూడా ఇటీవలే రిటైర్ అయ్యారు. 423 00:27:14,928 --> 00:27:17,222 ఇంతకీ ఇది ఏంటి? 424 00:27:17,222 --> 00:27:19,808 - నేను చేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది... - లేదు, అది తెలుస్తుంది. 425 00:27:19,808 --> 00:27:21,142 కానీ... నాకు ఇదేంటో... 426 00:27:21,142 --> 00:27:24,104 ఇది నా భార్య... టాయిలెట్ ని శుభ్రం చేయడానికి వాడిన డబ్బాలలో ఒకటి. 427 00:27:24,104 --> 00:27:26,773 నేను దీనిని మళ్ళీ వాడుతున్నాను. ఇది నా గాలం రీల్. 428 00:27:26,773 --> 00:27:28,024 మీరు ట్రై చేస్తారా? 429 00:27:28,024 --> 00:27:29,818 ఓహ్, తప్పకుండా, నేను... అలాగే. 430 00:27:33,780 --> 00:27:34,864 బాగానే వేశారు. 431 00:27:34,864 --> 00:27:36,825 - మీరు దీనిని పట్టుకోవాలి. - సరే. 432 00:27:38,910 --> 00:27:40,120 లాగుతుందా? 433 00:27:40,120 --> 00:27:41,413 లాగినట్టు ఉంది. 434 00:27:42,831 --> 00:27:44,958 కానీ ఇంకా ఏదీ పట్టుకున్నట్టు లేదు. 435 00:27:47,961 --> 00:27:51,423 చేపను పట్టుకోవడమా? బహుశా నేను అది చేయగలనేమో. 436 00:27:52,173 --> 00:27:53,592 ఏదో పట్టుకుంది. 437 00:27:53,592 --> 00:27:55,635 ఇక్కడ ఇంకొన్నాళ్ళు ఉంటే చేయగలను. 438 00:27:56,845 --> 00:27:59,222 కానీ ఇంకా ఏదీ పడలేదు. ఇంకా లేదు. 439 00:27:59,806 --> 00:28:01,308 అంటే అవసరమైనంత కాలం ఉండాలి. 440 00:28:02,100 --> 00:28:03,435 ఏమైనా పట్టుకుందా? 441 00:28:03,435 --> 00:28:05,395 - లేదు, ఏమీ లేదు. - ఎర. 442 00:28:05,395 --> 00:28:07,772 అంటే, బహుశా కొన్ని ఏళ్ళు పడుతుంది. 443 00:28:09,399 --> 00:28:11,401 అందుకే నాకు ఏదీ పట్టుకున్నట్టు అనిపించలేదు. 444 00:28:11,401 --> 00:28:13,612 అందుకే నాకు ఏదీ పట్టుకున్నట్టు అనిపించలేదు! 445 00:28:13,612 --> 00:28:15,447 నేను దీనిని నీళ్ల నుండి బయటకు లాగుతున్నాను. 446 00:28:18,283 --> 00:28:20,201 అంతే, ఇదుగోండి. 447 00:28:20,201 --> 00:28:23,496 ఈ ప్రదేశం ఆసియా, ఆఫ్రికా అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతాల 448 00:28:23,496 --> 00:28:26,750 పురాతన వర్తక మార్గాల మధ్య స్థిరపడి ఉంది. 449 00:28:26,750 --> 00:28:30,337 దానర్థం మాల్దీవులు అంటే అనేక సంప్రదాయాలు కలగలిసే ప్రదేశం. 450 00:28:32,422 --> 00:28:35,383 శాండీ, నాకు మాల్దీవులలో జీవితం ఎలాంటిదో కొంచెం చెప్పండి. 451 00:28:35,383 --> 00:28:39,888 ఇక్కడ ఉన్నవన్నీ సముద్రం నుండి వస్తాయి, కాబట్టి మాకు అదే దిక్కు. 452 00:28:39,888 --> 00:28:43,391 నేను దానిని ఖాండు బాండ అంటాను. 453 00:28:44,351 --> 00:28:47,395 - ఖాండు అంటే సముద్రం. బాండ అంటే కడుపు. - సరే. 454 00:28:47,395 --> 00:28:49,731 - సముద్రం నుండి కడుపుకు. - అవును. 455 00:28:49,731 --> 00:28:53,026 ఇది చాలా స్థిరత్వం కలిసిన జీవన శైలి. 456 00:28:53,026 --> 00:28:56,821 అవును, అంటే, మీరు సిటీలో ఉంటే, 457 00:28:57,405 --> 00:29:00,784 - జనం కంగారుగా నిరాశలో బ్రతకడం చూస్తారు. - అవును. 458 00:29:00,784 --> 00:29:02,077 అవును, నేను అలాంటి వాడినే. 459 00:29:04,162 --> 00:29:05,372 మీరు ఒకసారి సముద్రాన్ని చూస్తే, 460 00:29:05,372 --> 00:29:08,416 మీరు ఈ ప్రపంచంతో ఒకటైనట్టు తెలుసుకోగలరు, సరేనా? 461 00:29:08,416 --> 00:29:12,045 దాని నుండి వచ్చే ప్రేమను, సంతోషాన్ని పంచుకుందాం. 462 00:29:15,507 --> 00:29:18,385 - ఇలాగా అంటారా? - చివరి వరకు... మీరు బీచ్ ని చూడగలరు. 463 00:29:19,344 --> 00:29:20,345 యాభై ఏళ్ల క్రితం, 464 00:29:20,345 --> 00:29:24,891 మాల్దీవులు శాండీ లాంటి స్థానిక ప్రజలు నివసించిన చిన్న దేశం. 465 00:29:25,559 --> 00:29:29,938 కానీ 1972లో ఇక్కడ మొట్టమొదటి రిసార్ట్ స్థాపించబడినప్పటి నుండి, 466 00:29:29,938 --> 00:29:34,734 టూరిస్టులు ఈ దీవిలోని రహస్యాలను కనుగొనడానికి బాగా రావడం ప్రారంభించారు. 467 00:29:34,734 --> 00:29:38,113 మీరు జీవితాన్ని చాలా అందంగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు, 468 00:29:38,113 --> 00:29:41,324 మీరు ఇతరులకు ఏమని సహాలా ఇవ్వగలరు? 469 00:29:41,908 --> 00:29:44,536 మీరు అనుసంధానించబడాలి. 470 00:29:45,245 --> 00:29:50,750 మీ బూట్లను తీయండి, ఇసుకను స్పర్శించండి, నీళ్ళలోకి వెళ్ళండి, 471 00:29:50,750 --> 00:29:53,712 గాలిని ఫీల్ అవ్వండి, నీటి ఉప్పును రుచి చూడండి, 472 00:29:53,712 --> 00:29:57,841 అలా ఒక్కసారి చేస్తే, మీరు మీ ఆందోళన, నిరాశను మర్చిపోతారు. 473 00:29:57,841 --> 00:29:59,551 కాబట్టి, ప్రకృతితో ఒకటి కావడం నేర్చుకొండి. 474 00:30:00,760 --> 00:30:03,597 ఆ రిసార్టు ఒక బ్రహ్మాండమైన అనుభవాన్ని ఇస్తుంది, 475 00:30:03,597 --> 00:30:06,182 కానీ శాండీతో గడిపిన ఒక మధ్యాహ్నం 476 00:30:06,182 --> 00:30:09,644 మాల్దీవులలో ఉన్న నిజమైన మాయను నాకు పరిచయం చేసింది. 477 00:30:09,644 --> 00:30:12,856 నేను మీలో ఉన్న ఈ ఉత్సాహాన్ని కొంచెం నాతో వెనక్కి తీసుకెళ్తాను. 478 00:30:12,856 --> 00:30:15,609 అప్పుడైనా ఈ ట్రిప్ కి వచ్చి కొంచెం లాభం ఉంటుంది. 479 00:30:15,609 --> 00:30:16,818 నాకు చాలా సంతోషంగా ఉంది. 480 00:30:16,818 --> 00:30:22,657 ఇతరులకు నా దేశం గొప్పతనాన్ని చూపించడం నాకు చాలా ఇష్టం. 481 00:30:22,657 --> 00:30:23,825 ఇతను చాలా గొప్ప వ్యక్తి. 482 00:30:25,660 --> 00:30:26,661 థాంక్స్. 483 00:30:28,830 --> 00:30:32,918 శాండి, అతని వ్యక్తిత్వం నాకు నచ్చింది, నాకు కూడా అలాంటిది ఉంటే బాగుండు. 484 00:30:33,627 --> 00:30:38,006 నిజం చెప్పాలంటే, నాతో ఉండడం కంటే నాకు అతనితో ఉండడమే నచ్చింది. 485 00:30:39,716 --> 00:30:41,927 నేను నా దీవికి బయలుదేరిన తర్వాత, 486 00:30:41,927 --> 00:30:45,555 శాండీ మాల్దీవులను వివరించిన విధానంలో ఈ దేశాన్ని ఒక సెలవు కోసం వచ్చి 487 00:30:45,555 --> 00:30:50,393 పూర్తిగా ఆస్వాదించడం వీలు కాదు అన్న ఆలోచన మనసు వీడడం లేదు, 488 00:30:50,393 --> 00:30:52,187 మనం ఎంత ఖర్చు చేసినా అది వీలుకాదు. 489 00:30:53,855 --> 00:30:55,482 నేను రావడానికి ముందే, 490 00:30:55,482 --> 00:30:59,361 కూడడూ వారు నా కోరికలు తీర్చబడతాయి అని ప్రమాణం చేశారు. 491 00:30:59,361 --> 00:31:01,196 అలాగే శాండీ ఇచ్చిన స్ఫూర్తి వల్లేమో, 492 00:31:01,196 --> 00:31:06,534 వాళ్ళు నన్ను తప్పక సంతృప్తిపరచగల ఒక నిరాడంబర అనుభవాన్ని నాకోసం ఏర్పాటు చేశారు. 493 00:31:08,995 --> 00:31:10,163 అది నా కోసమేనా? 494 00:31:12,457 --> 00:31:14,334 షోఫను మెచ్చుకోక తప్పదు. 495 00:31:14,334 --> 00:31:17,837 నేను నా సొంత లెవీ స్వర్గంలోకి అడుగుపెట్టాను. 496 00:31:19,256 --> 00:31:22,509 నమ్మలేకపోతున్నాను. ఇది నా కలల భోజనమా? 497 00:31:23,760 --> 00:31:26,596 వెనిల్లా షేక్, ట్రఫుల్ ఫ్రైస్. ఇది కచ్చితంగా... 498 00:31:27,514 --> 00:31:28,515 చీజ్ బర్గర్. 499 00:31:30,600 --> 00:31:33,895 ఓరి, నాయనో. ఎడ్వార్డ్ భలే మనిషి. 500 00:31:40,527 --> 00:31:41,820 ఒకటి చెప్పనా? 501 00:31:41,820 --> 00:31:44,781 ఈ చీజ్ బర్గర్ నేను నా జీవితంలో తిన్న అత్యంత రుచికరమైన బర్గర్. 502 00:31:46,741 --> 00:31:50,370 ఇలా చూడండి, నాకు నా గురించి తెలుసు. నాతో వేగడం కొంచెం కష్టం అని తెలుసు, సరేనా? 503 00:31:50,370 --> 00:31:53,206 దేని గురించైనా ఏదోకటి ఫిర్యాదు చేస్తుంటాను. 504 00:31:53,957 --> 00:31:55,750 కానీ జీవితం ఇంతకంటే గొప్పగా ఉండదు. 505 00:31:57,794 --> 00:31:59,629 నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సందర్భాలా? 506 00:31:59,629 --> 00:32:01,006 నా పెళ్లి, 507 00:32:01,006 --> 00:32:02,966 నా కొడుకు డేనియల్ పుట్టడం, 508 00:32:02,966 --> 00:32:04,718 నా కూతురు సారా పుట్టడం. 509 00:32:04,718 --> 00:32:10,682 కాబట్టి, ఈ రోజు, మంచి మనుషులతో ఈ ప్రదేశంలో తింటున్న ఈ భోజనం ఆ అనుభవానికి దగ్గరగానే ఉంది. 510 00:32:12,309 --> 00:32:15,103 శాండీ అన్నట్టు, సాధారణ సంతోషాలు. 511 00:32:16,271 --> 00:32:17,647 ఒకానొకప్పుడు, 512 00:32:17,647 --> 00:32:21,192 ఇలాంటి ప్రదేశానికి వచ్చే ఆలోచన కూడా నేను చేసేవాడిని కాదు. 513 00:32:21,192 --> 00:32:23,737 ఇంత నీరంటే నాకు ఏమాత్రం నచ్చదు. 514 00:32:23,737 --> 00:32:29,826 కానీ నేను ఒక అద్భుతమైన, మనసును కట్టిపడేసే ఒక భూతల స్వర్గాన్ని కనుగొన్నాను. 515 00:32:30,660 --> 00:32:36,875 నేను చూసిన అత్యంత అందమైన ప్రదేశాలలో ఇది ఒకటి. 516 00:32:40,003 --> 00:32:44,341 ఈ ప్రయాణాన్ని కేవలం గట్టి నేల మీద మాత్రమే ఇష్టం ఉన్న వ్యక్తిగా ప్రారంభించినా, 517 00:32:44,341 --> 00:32:47,761 మాల్దీవులు నన్ను నేను మర్చిపోయేలా చేశాయి. 518 00:32:49,262 --> 00:32:50,764 - యుజీన్. - ఏంటి? 519 00:32:50,764 --> 00:32:52,349 మీరు సముద్రంలోకి వెళ్లారు. 520 00:32:59,814 --> 00:33:01,233 నేను సముద్రంలో ఉన్నాను. 521 00:33:02,776 --> 00:33:04,277 ఉత్తి సముద్రంలోనే లేను. 522 00:33:05,070 --> 00:33:06,446 హిందూ మహాసముద్రంలో ఉన్నాను. 523 00:33:07,197 --> 00:33:10,784 దీనికి మించిన ఒకే ఒక్క అనుభవం ఉంది, 524 00:33:11,743 --> 00:33:14,412 అనుకున్నట్టే షోఫ ఆమె చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంది. 525 00:33:17,374 --> 00:33:22,254 "చింతించకండి. గోల్ఫ్ బాల్స్ నీటిలో కరిగిపోతాయి. 526 00:33:22,254 --> 00:33:25,549 వాటిలో చేపల ఆహారం ఉంది. ఎంజాయ్. 527 00:33:33,139 --> 00:33:34,641 ఇది నమ్మశక్యంగా లేదు. 528 00:33:36,226 --> 00:33:37,477 అబ్బా, వావ్. 529 00:33:39,938 --> 00:33:42,816 ఈ మాల్దీవుల అందాన్ని నేను పూర్తిగా తెలుసుకుంటున్నాను. 530 00:33:44,317 --> 00:33:48,113 నేను ఇక్కడికి స్వర్గాన్ని కనుగొనడానికి వచ్చాను, 531 00:33:48,655 --> 00:33:52,409 దేవుడా, అది నాకు దొరికింది. 532 00:34:45,420 --> 00:34:47,422 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్