1 00:00:08,009 --> 00:00:12,305 ఒక గొప్ప ఫిలాసఫర్ ఒకసారి ఇలా అన్నాడు, "ప్రపంచం ఒక పుస్తకం లాంటిది, 2 00:00:13,098 --> 00:00:18,478 ఆ ప్రపంచాన్ని చూడని వారు ఒక్క పేజీ మాత్రమే చదివినవారితో సమానం." 3 00:00:26,903 --> 00:00:28,363 సరే, నన్ను అడిగితే, 4 00:00:28,363 --> 00:00:32,616 నేను కొన్ని పేజీలు తిరగేశానని చెప్పగలను, కానీ మొత్తం పుస్తకం చదవాలనే కోరికైతే నాకు లేదు. 5 00:00:33,535 --> 00:00:36,621 చాలా కారణాల వల్ల నాకు ప్రయాణాలు చేయడం అంతగా నచ్చదు. 6 00:00:37,205 --> 00:00:38,582 బాగా చల్లగా ఉంటే, 7 00:00:38,582 --> 00:00:39,666 నాకు అసౌకర్యంగా ఉంటుంది. 8 00:00:39,666 --> 00:00:41,501 ఐసులో ఈత కొట్టడమా, అది కూడా బట్టలు లేకుండా? 9 00:00:41,501 --> 00:00:44,379 - అవును. - భలే, చాలా మంచి ఆహ్వానంలా ఉంది. 10 00:00:46,756 --> 00:00:49,801 మరీ వేడిగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పగలరా? నాకు అసౌకర్యంగా ఉంటుంది. 11 00:00:49,801 --> 00:00:51,887 నేను అంత వేగంగా నడవలేను. 12 00:00:52,470 --> 00:00:55,223 - కానీ నాకు 75 ఏళ్ళు. - మీకు సహాయం కావాలా? 13 00:00:55,223 --> 00:00:56,433 వద్దు, అవసరం లేదు. 14 00:00:57,142 --> 00:01:01,062 బహుశా ఇప్పుడు నా రెక్కలు చాచే సమయమైందేమో. 15 00:01:06,818 --> 00:01:08,194 ఓరి, దేవుడా. 16 00:01:09,404 --> 00:01:11,823 ఒక ఏనుగు వెనుక భాగంలో చేయి పెట్టడం ఇదే మొదటి సారి. 17 00:01:12,407 --> 00:01:13,658 కానీ మంచి విషయం ఏంటంటే, 18 00:01:14,659 --> 00:01:17,954 నాకు నమ్మశక్యం కాని హోటళ్లలో గడపగలుగుతున్నాను. 19 00:01:17,954 --> 00:01:21,583 అమ్మో. ఇది భలే ఉంది. 20 00:01:26,504 --> 00:01:31,468 ఒకే ఒక్క షరతు ఏంటంటే, బయట ప్రపంచంలో ఏముందో చూస్తానని మాట ఇచ్చాను. 21 00:01:31,468 --> 00:01:33,553 - మీ అడుగులు చూసుకోండి. - అలాగే. 22 00:01:33,553 --> 00:01:35,639 - అందమైన పర్వతం. - అదొక అగ్నిపర్వతం. 23 00:01:35,639 --> 00:01:36,640 అది అగ్ని పర్వతమా? 24 00:01:36,640 --> 00:01:40,435 నేను నా జీవితమంతా దూరం పెట్టిన జీవితం ఇది. 25 00:01:41,561 --> 00:01:42,646 సేడి. 26 00:01:42,646 --> 00:01:45,315 ఓరి, నాయనో. 27 00:01:45,315 --> 00:01:48,526 ప్రాణాలతో బయట పడితే చాలు. 28 00:01:48,526 --> 00:01:51,655 ఒక ఫిన్నిష్ వ్యక్తితో అయిదు వోడ్కా షాట్ లు వేయడం ఇదే ఆఖరి సారి. 29 00:02:01,331 --> 00:02:06,878 ఈ ప్రదేశం నేను ముందెప్పుడూ చూడనంత వింతగా ఉంది. 30 00:02:07,879 --> 00:02:09,256 యూటా 31 00:02:09,256 --> 00:02:11,341 కనుచూపు మేర ఏమీ లేదు. 32 00:02:13,260 --> 00:02:14,803 మహా సూన్యంలా ఉంది. 33 00:02:15,720 --> 00:02:16,805 అలాగే నేను కూడా ఉన్నాను. 34 00:02:17,305 --> 00:02:21,518 ఒక ఎడారికి రావడం నాకు ఇదే మొదటిసారి, 35 00:02:21,518 --> 00:02:26,856 వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా ఒకటి చెప్పగలను, ఇది నాకు అంతగా నచ్చలేదు. 36 00:02:28,692 --> 00:02:34,698 అంటే, ఇక్కడ వాతావరణంలో తేమ లేకపోవడం వల్ల నా జుట్టు బాగుంది అనుకోండి, అది మంచి విషయమే. 37 00:02:34,698 --> 00:02:37,409 కానీ నిజం చెప్పాలంటే, ఇక్కడ ఎక్కువ సమయం... 38 00:02:39,119 --> 00:02:41,454 వెచ్చించాలని నాకు లేదు. 39 00:02:45,500 --> 00:02:47,377 అలాగే అనుభవ పూర్వకంగా నాకు తెలిసింది ఏంటంటే, 40 00:02:48,503 --> 00:02:54,134 ఒక పరిస్థితి అంత బాగా లేనంత మాత్రాన, మరింత దిగజారదని మనం చెప్పలేము. 41 00:03:07,439 --> 00:03:10,984 నాకు ఎత్తులు అంటే భయం అని నేను ఎప్పుడైనా చెప్పానా? 42 00:03:11,484 --> 00:03:12,777 మిస్టర్ లెవీ, సర్. గుడ్ మార్నింగ్. 43 00:03:12,777 --> 00:03:14,321 నా పేరు టోనీ. ఇవాళ నేను మీ పైలట్ ని. 44 00:03:14,321 --> 00:03:15,280 గ్రాండ్ కాన్యన్ 45 00:03:15,280 --> 00:03:16,948 - టోనీ. యుజీన్. - సంతోషం. 46 00:03:16,948 --> 00:03:18,491 ఈ ప్రయాణంలో మీరు గొప్ప అందాలని చూస్తారు. 47 00:03:18,491 --> 00:03:20,410 మీరు చుట్టూ చూస్తూ ఎంజాయ్ చేయాలని నా ఆశ. 48 00:03:20,410 --> 00:03:25,707 నాకు బ్రిడ్జ్ నుండి కిందకి చూడడమే భయం. ఇక ఇప్పుడు ఎలా చూస్తానో మీరే చూడాలి. 49 00:03:27,000 --> 00:03:31,880 నాకు "ఇదేం బాలేదు" అనిపిస్తోంది. కానీ ప్రయాణం చాలా సురక్షితంగానే సాగుతుందని నాకు తెలుసు. 50 00:03:32,464 --> 00:03:34,090 ఇది మీరు నీటిలో పడితే తేలడం కోసం వేసుకోవాలి. 51 00:03:34,674 --> 00:03:37,844 దీనిని ఇలా నడుముకు చుట్టుకొని, ఇలా క్లిక్ చేయాలి, 52 00:03:37,844 --> 00:03:40,597 - దీనిని ఇలా ముందుకు ఉంచాలి. సరేనా? - సరే. 53 00:03:40,597 --> 00:03:42,682 మీరు ఇంతకు ముందెప్పుడైనా లైఫ్ బెల్ట్ వేసుకున్నారా? 54 00:03:42,682 --> 00:03:46,269 లేదు, ఇంతకు ముందెప్పుడూ దాని అవసరం రాలేదు. ముందెప్పుడూ చావుకు దగ్గరగా వెళ్ళలేదు. 55 00:03:46,269 --> 00:03:48,063 - సరే. - కానీ అది ఉందని తెలుసుకోవడం... 56 00:03:48,063 --> 00:03:49,481 - చాలా సంతోషం. - సరే. 57 00:03:49,481 --> 00:03:50,815 మీరు ఇక ఎక్కితే మనం బయలుదేరుదాం. 58 00:03:51,900 --> 00:03:53,318 - సరే. - ఇలా రండి. 59 00:03:56,279 --> 00:03:59,658 యూటా యుఎస్ఏ లో 45వ రాష్ట్రం, 60 00:04:00,533 --> 00:04:03,995 కానీ ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉందో మీరు చూడగలరు అనుకుంటున్నాను. 61 00:04:05,121 --> 00:04:07,123 ఇక అరుపులు మొదలుపెడదాం. 62 00:04:07,123 --> 00:04:09,376 నిజమైన భయం అంటే ఇదేనేమో. 63 00:04:09,876 --> 00:04:11,336 సరే. మనం వెళ్తున్నాం. 64 00:04:13,713 --> 00:04:14,631 దేవుడా. 65 00:04:17,216 --> 00:04:20,053 - కాస్త ఊగుతున్నట్టు ఉంది. - మీ అనుభవం ఎలా ఉంది? 66 00:04:20,845 --> 00:04:24,641 అంతే, పర్వాలేదు. అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తున్నాను. 67 00:04:25,892 --> 00:04:27,852 - భయం కారణంగా బిగుసుకుపోకండి. - సరే. 68 00:04:28,562 --> 00:04:32,691 నిజం చెప్పాలంటే నేను ఇంకా చుట్టూ ఎలా ఉందో చూడలేదు. ఇప్పుడే బయటకు చూస్తున్నాను. 69 00:04:32,691 --> 00:04:36,653 చూస్తుంటే మనం నేరుగా ఆ కొండను గుద్దడానికి వెళ్తున్నట్టు ఉంది, టోనీ. 70 00:04:36,653 --> 00:04:38,572 మనం దాని పై నుండి ఎగిరి వెళ్తాము. 71 00:04:38,572 --> 00:04:40,490 అవును, బాగా పై నుండి ఎగురుకుంటూ వెళ్ళాలి. 72 00:04:42,826 --> 00:04:44,202 ఓరి, దేవుడా. 73 00:04:44,202 --> 00:04:45,787 కొంచెం కుడివైపుకు వాల్చుతున్నాను, 74 00:04:45,787 --> 00:04:48,039 ఇప్పుడు మీరు ఆ గుర్రం కాలి ఆకారంలో ఉన్న లోయను చూడొచ్చు. 75 00:04:48,039 --> 00:04:49,958 కొంచెం అటువైపుగా వెళదాం, 76 00:04:49,958 --> 00:04:51,960 అప్పుడు బాగా చూడగలరు. 77 00:04:54,713 --> 00:04:55,964 అమ్మో. 78 00:04:55,964 --> 00:04:58,133 మనము చాలా ఎత్తులో ఉన్నాం, టోనీ. 79 00:05:00,260 --> 00:05:01,845 ఇప్పుడు అందమైన బ్యూట్ టవర్ వైపు వెళ్తున్నాం, 80 00:05:02,512 --> 00:05:05,932 అది నేలకు దాదాపు 300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 81 00:05:06,808 --> 00:05:08,894 - మనం అక్కడ ల్యాండ్ అవుతామా? - అవును, సర్. 82 00:05:08,894 --> 00:05:11,479 మీకు ఈ ప్రదేశంలో ఉన్న అందాన్ని చూపించాలని అనుకుంటున్నాను. 83 00:05:12,814 --> 00:05:15,817 అవును, నేను చుట్టూ చూశాను. చాలా అందంగా ఉన్నాయి. 84 00:05:15,817 --> 00:05:17,777 కానీ మనం అక్కడ ఎందుకు ల్యాండ్ అవ్వాలో అర్థం కావడం లేదు. 85 00:05:19,529 --> 00:05:20,780 దిగుతున్నాం. 86 00:05:20,780 --> 00:05:23,575 టోనీ, నీ పనిని ఎలా చేయాలో నీకు చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. 87 00:05:23,575 --> 00:05:25,160 అక్కడ ల్యాండ్ అవ్వడానికి స్థలం లేకపోవచ్చు. 88 00:05:26,536 --> 00:05:27,829 ఓరి, దేవుడా. 89 00:05:29,289 --> 00:05:31,291 సరే, సర్. బ్యూట్ టవర్ కి స్వాగతం. 90 00:05:33,877 --> 00:05:36,213 హెలికాప్టర్ దిగిన తర్వాత నాకు కొంచెం భయం వేయడం 91 00:05:36,213 --> 00:05:38,089 ఆగుతుంది అనుకున్నాను. 92 00:05:39,049 --> 00:05:40,091 కానీ అలా జరగలేదు. 93 00:05:40,592 --> 00:05:42,552 - మీ అడుగులు చూసుకోండి. - అదే చేస్తున్నా. 94 00:05:43,178 --> 00:05:46,264 - లక్షలు పెట్టినా దొరకని సీనరీ చూసి ఆనందించండి. - వావ్. 95 00:05:46,765 --> 00:05:51,394 మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రదేశం అంతా రక్షిత ప్రాంతం కదా? 96 00:05:51,394 --> 00:05:53,939 మనం నిజానికి నావహో నేషన్ ప్రాంతంలో ఉన్నాం. 97 00:05:54,522 --> 00:05:58,026 - ఇది నావహో ప్రజల ప్రాంతం. - నావహో ప్రజలకు ఇది ప్రవిత్ర ప్రదేశం. 98 00:06:00,195 --> 00:06:03,323 వావ్. అంటే, ఈ కొండలను చూస్తుంటే, 99 00:06:03,323 --> 00:06:08,536 ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఎత్తులో ఉండేది అనిపిస్తోంది. 100 00:06:08,536 --> 00:06:12,165 అవును. దాదాపు 16.5 కోట్ల సంవత్సరాల క్రితం, 101 00:06:12,165 --> 00:06:14,626 చుట్టూ ఉన్న ప్రదేశాలలో నేల మనం నిలబడిన 102 00:06:14,626 --> 00:06:15,919 లెవెల్ ఎత్తులో ఉండేది. 103 00:06:16,670 --> 00:06:18,088 సరే, ఇప్పుడు ఎక్కడికి? 104 00:06:18,088 --> 00:06:21,633 తర్వాత, ఆ శిఖరం పై నుండి ఎగరాలని టోనీ నాతో చెప్పాడు. 105 00:06:22,759 --> 00:06:24,302 అదెలా జరుగుతుందో చూద్దాం. 106 00:06:26,721 --> 00:06:28,265 సరే, సర్. సిద్ధంగా ఉన్నారా? 107 00:06:28,765 --> 00:06:29,891 సరే. వెళ్తున్నాం. 108 00:06:29,891 --> 00:06:31,560 ఓహ్, బేబీ! 109 00:06:35,063 --> 00:06:36,314 అమ్మో! 110 00:06:36,314 --> 00:06:39,317 శిఖరం పై నుండి దూకే అనుభవానికి నేను అంత దగ్గరకు వెళ్లడం అదే మొదటిసారి. 111 00:06:41,778 --> 00:06:43,655 సరే, యుజీన్. మనం ఇప్పుడు ఇక్కడ తిరిగితే 112 00:06:43,655 --> 00:06:45,115 మీకు మీ హోటల్ కనిపించడం మొదలవుతుంది. 113 00:06:46,157 --> 00:06:47,659 మన ముందు ఉన్నది ప్రధాన రిసార్ట్. 114 00:06:47,659 --> 00:06:48,827 అక్కడ ఉన్నదే కదా? 115 00:06:48,827 --> 00:06:50,078 మీకేది అంత బాగా కనిపించకపోవచ్చు. 116 00:06:51,538 --> 00:06:52,789 అదిగో అక్కడ ఉంది. 117 00:06:54,583 --> 00:06:58,670 ది ఆమంగిరి. రానున్న కొన్ని రోజలు నేను ఉండబోయే ప్రదేశం. 118 00:06:59,754 --> 00:07:01,923 ఎందుకు నన్నిలా ఇబ్బందుల్లోకి నెట్టుకుంటానో ఏమో. 119 00:07:05,385 --> 00:07:07,721 - సరే, సర్, స్వాగతం. - బాగా ల్యాండ్ చేశావు. 120 00:07:10,640 --> 00:07:13,935 "ఆమంగిరి" అనే పదానికి "ప్రశాంతమైన కొండ" అని అర్థం అని చెప్పారు. 121 00:07:14,644 --> 00:07:19,149 ఒక రాత్రికి దాదాపు మూడు వేల డాలర్లు ఖరీదు చేసే ఈ ప్రదేశంలో ప్రశాంతత చీప్ కాదు. 122 00:07:20,025 --> 00:07:23,778 వావ్. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. 123 00:07:29,951 --> 00:07:31,786 హలో. ఆమంగిరికి స్వాగతం. 124 00:07:31,786 --> 00:07:33,622 - థాంక్స్. హాయ్. - నేను కారుయ్. మిమ్మల్ని కలవడం సంతోషం. 125 00:07:33,622 --> 00:07:35,290 యుజీన్. మిమ్మల్ని కలవడం సంతోషం. 126 00:07:36,541 --> 00:07:39,002 కారుయ్ నాకు నా గదిని చూపడానికి వచ్చింది. 127 00:07:40,378 --> 00:07:42,088 ఓరి, నాయనో. 128 00:07:42,589 --> 00:07:45,467 అలాగే ఆ ప్రదేశాన్ని చూసి పోయిన నా మతిని వెతకడానికి కూడా. 129 00:07:46,051 --> 00:07:49,012 ఇది నమ్మశక్యం కానంత అందంగా ఉంది. 130 00:07:49,012 --> 00:07:50,096 లోనికి వెళ్ళండి. 131 00:07:52,557 --> 00:07:53,558 ఈ ప్రదేశం చాలా బాగుంది. 132 00:07:53,558 --> 00:07:55,018 ఇది మా గిరిజాల సూట్, 133 00:07:55,018 --> 00:07:58,188 సంస్కృతంలో దానికి "పర్వత శిఖరం" అని అర్థం. 134 00:07:58,188 --> 00:08:01,358 ఈ నిర్మాణం నాకు చాలా నచ్చింది. ఇదంతా చూడండి. 135 00:08:01,358 --> 00:08:07,739 చివరికి ఇక్కడ ఉన్న గొడుగులు టోపీలు కూడా పరిసరాల్లో కలిసిపోయేలా ఉన్నాయి. 136 00:08:07,739 --> 00:08:11,826 నా బీరువాను చూసి, అందులోని రంగులకు అనుగుణంగా 137 00:08:11,826 --> 00:08:13,495 ఈ ప్రదేశాన్ని చేసినట్టు ఉంది. 138 00:08:13,995 --> 00:08:15,664 మీ వ్యక్తిగత బాల్కనీ ఇక్కడ ఉంది. 139 00:08:15,664 --> 00:08:20,502 ఈ హోటల్ చుట్టుపక్కల పరిసరాల్లో ఇమిడిపోయే విధానం నాకు చాలా నచ్చింది. 140 00:08:20,502 --> 00:08:22,420 అంటే, మాకు ఈ ప్రాంతం చాలా ముఖ్యం. 141 00:08:22,420 --> 00:08:25,340 మేము మా నేటివ్ అమెరికన్ సాంస్కృతిక విలువలకు అనుగుణంగా అన్నీ చేయడానికి ప్రయత్నిస్తాం. 142 00:08:25,340 --> 00:08:27,300 నేను కూడా నావహో అమ్మాయినే. 143 00:08:27,300 --> 00:08:29,761 కాబట్టి ఈ రిసార్ట్ లో అది నాకు నచ్చే ఒక విషయం. 144 00:08:29,761 --> 00:08:32,597 భలే, నేను ఇక్కడ ఉన్న ఈ సమయంలో 145 00:08:32,597 --> 00:08:35,517 ఆ విషయాలను మరింత తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 146 00:08:35,517 --> 00:08:36,643 - తప్పకుండా. - కచ్చితంగా చేద్దాం. 147 00:08:38,477 --> 00:08:41,523 సరే, ఈ ప్రదేశాన్ని నిజానికి ఫెడరల్ భూభాగంలో నిర్మించారు, 148 00:08:41,523 --> 00:08:44,234 కానీ ఇది నావహో నేషన్, యుఎస్ లో ఉన్న అతిపెద్ద నేటివ్ అమెరికన్ రిజెర్వేషన్ 149 00:08:45,235 --> 00:08:49,114 భూభాగానికి అంచున కట్టడం జరిగింది. 150 00:08:50,282 --> 00:08:52,701 ఈ ప్రదేశం దాని చుట్టుపక్కల ప్రదేశాలలో భలే ఇమిడిపోతోంది, 151 00:08:52,701 --> 00:08:55,912 ఆ భావన సాధారణంగా నేను అర్థం చేసుకోగల విషయం కాదు. 152 00:08:55,912 --> 00:08:56,997 ఈ ప్రదేశాన్ని చూడండి. 153 00:09:01,793 --> 00:09:03,753 ఇది అత్యద్భుతంగా ఉంది. 154 00:09:05,255 --> 00:09:08,925 ఈ ఎడారిలో ఇలాంటి గొప్ప హోటల్ ని కట్టడానికి ఎంత శ్రమపడి ఉంటారో ఊహించలేకపోతున్నా. 155 00:09:09,801 --> 00:09:11,678 అదృష్టవశాత్తు నా ఊహతో పని లేదు, 156 00:09:12,387 --> 00:09:16,016 ఆ విషయాన్ని నేను నేరుగా ఈ హోటల్ నిర్మాణవేత్తలలో ఒకరైన మార్వన్ ని అడిగి తెలుసుకుంటా. 157 00:09:17,434 --> 00:09:22,480 అయితే, హోటల్ లోనికి వచ్చిన తర్వాత కనిపించే మొదటి సీనరీ ఇదే కదా? 158 00:09:22,480 --> 00:09:25,984 అవును. మా ఉద్దేశం ఏంటంటే, మీరు హోటల్ కి వచ్చే క్రమంలో ఒక పెద్ద సిమెంటు గోడ, 159 00:09:25,984 --> 00:09:28,194 అలాగే పెద్ద రాయికి మధ్య ఉన్న చిన్న దారిలో ప్రయాణిస్తారు, 160 00:09:28,194 --> 00:09:32,699 అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు స్పష్టంగా తెలీదు, కాబట్టి మేము మీ దృష్టి మీపై కాకుండా, 161 00:09:32,699 --> 00:09:34,701 పరిసరం పై పడేలా చేయాలి అనుకున్నాం. 162 00:09:34,701 --> 00:09:39,789 ఆ ఇరుకైన ప్రదేశం నుండి మీరు ఇలా మెట్లు ఎక్కి వస్తారు, రాగానే మతిపోయే సీనరీ ఎదురవుతుంది. 163 00:09:45,712 --> 00:09:48,548 మేము మీకు ఒక గొప్ప, ఉత్కంఠభరితమైన, 164 00:09:49,382 --> 00:09:52,135 - అనుభవాన్ని ఇవ్వాలి అనుకున్నాం. - ఇది నిజంగా అదిరిపోతోంది. 165 00:09:53,178 --> 00:09:55,847 ఇలాంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది. 166 00:09:55,847 --> 00:09:58,600 నన్ను అడిగితే, నా ప్రయాణాల కారణంగా వచ్చింది అంటా. 167 00:09:58,600 --> 00:10:00,894 అది మొరిక్కొలో అయినా, లేక జపాన్ లో అయినా, 168 00:10:00,894 --> 00:10:03,730 అక్కడ ఎటు చూసినా ఆ ప్రాంత శైలిలో కట్టడాలను చూస్తాం, 169 00:10:03,730 --> 00:10:06,733 అవన్నీ చాలా సింపుల్ గానే ఉన్నా ఎంతో అందంగా ఉంటాయి. 170 00:10:06,733 --> 00:10:12,572 కాబట్టి, ఆ సరళమైన శైలిలో నిర్మితమైన వాటిలో కూడా మనం విలాసాన్ని అనుభవించగలం. 171 00:10:12,572 --> 00:10:18,370 మన సమాజం కూడా సింపుల్ గా ఉండే జీవితాల వైపు మొగ్గుచూపుతోంది అనుకుంటున్నారా? 172 00:10:18,370 --> 00:10:19,287 అవును. 173 00:10:19,287 --> 00:10:22,332 ఈ హోటల్ ఇంత విజయవంతం కావడానికి నా ఉద్దేశంలో ఒక కారణం, 174 00:10:22,332 --> 00:10:24,501 జనానికి ఆ సింపుల్ జీవితాన్ని ఇవ్వడమే. 175 00:10:26,169 --> 00:10:28,922 మార్వన్ హోటల్ ని రెండు రెక్కల లాగ విడదీశాడు, 176 00:10:28,922 --> 00:10:33,760 అందుకు కారణం ఇక్కడ ఉన్న 34 సూట్ లలో నుండి ఈ ప్రదేశంలో అన్ని ముఖ్య ఆకర్షణలను చూసేలా చేయడమే. 177 00:10:35,136 --> 00:10:38,473 ఇక్కడ మా ఐడియా ఏంటంటే, మీరు ఉన్న ప్రదేశంలోని గొప్పతనాన్ని 178 00:10:38,473 --> 00:10:41,601 - ఒక సినిమాటిక్ విధానంలో చూపించాలని. - సరే. 179 00:10:41,601 --> 00:10:45,146 అలాగే, మీకు తెలిసిందే, పాశ్చాత్త అమెరికన్ చరిత్రను 180 00:10:45,146 --> 00:10:46,898 అనుకరించాలని ట్రై చేశాం. 181 00:10:46,898 --> 00:10:50,235 - జాన్ ఫోర్డ్ సినిమా వెస్ట్రనర్స్, అలాగే... - అవును. 182 00:10:50,235 --> 00:10:53,154 ...సెర్జియో లియోన్ సినిమా పానవిజన్ స్క్రీన్ లలో లాగ. 183 00:10:53,154 --> 00:10:54,364 అందులో ఉన్న ఆ సీన్ ఇదే. 184 00:10:54,364 --> 00:10:55,991 చూస్తుంటే జాన్ ఫోర్డ్ సినిమా చూస్తున్నట్టే ఉంది. 185 00:10:56,908 --> 00:11:00,495 ఈ ప్రదేశం మొత్తం ఈ ఎడారిలో ఒకటి అన్నట్టుగా భలే కలిసిపోయింది, 186 00:11:00,495 --> 00:11:04,499 నేను ఈ ప్రదేశంలో ఎలా ఇమడలేకపోతున్నానో దానికి పూర్తి వ్యతిరేకంగా. 187 00:11:05,333 --> 00:11:07,210 ఈ పూల్ ఆ అందమైన బండ 188 00:11:07,794 --> 00:11:12,883 చుట్టూ పారుతున్నట్టు కట్టిన విధానం నిజంగా చాలా బాగుంది. 189 00:11:12,883 --> 00:11:16,595 మేము ఈ ప్రదేశంలో ఉన్న వాటిని హైలైట్ చేయాలనుకున్నాం. 190 00:11:16,595 --> 00:11:18,972 - సరే. - చెప్పాలంటే, నీరు, రాయి, ఆకాశం. 191 00:11:18,972 --> 00:11:21,141 మేము ఈ రాళ్లను మాకు అడ్డు తీసేయలేం, 192 00:11:21,725 --> 00:11:24,811 కానీ జనం వాటిని సరికొత్త విధానంలో మెచ్చుకునేలా తీర్చిదిద్దగలం. 193 00:11:27,063 --> 00:11:29,107 మీరు చుట్టుపక్క పరిసరాల 194 00:11:29,107 --> 00:11:33,612 ఆధారంగా ఇక్కడ ఉన్న ప్రతీ విషయాన్ని డిజైన్ చేశారు చూడండి, 195 00:11:34,112 --> 00:11:35,697 చాలా గొప్పగా ఆలోచించారు. 196 00:11:36,197 --> 00:11:40,869 హోటల్ ఇరు భాగాలకు మధ్య ఒక చిన్న ఖాళీని ఏర్పాటు చేసాం, 197 00:11:40,869 --> 00:11:42,871 దీని ద్వారా మీరు మంచి స్లాట్ కాన్యన్ సీనరీనీ చూడగలరు. 198 00:11:42,871 --> 00:11:44,998 స్లాట్ కాన్యన్లు అంటే ఏంటి? 199 00:11:44,998 --> 00:11:49,127 గాలి అలాగే నీటి కారణంగా అరిగిపోయి 200 00:11:49,127 --> 00:11:53,340 వేర్వేరు దిశలలో వంగిపోయిన రాతితో ఏర్పడిన సన్నని మార్గాలు అవి. 201 00:11:53,340 --> 00:11:57,969 అలాగే, ఆ సొరంగాల ద్వారా కాంతి ప్రసరించినప్పుడు భలే అందంగా ఉంటుంది. 202 00:11:57,969 --> 00:12:00,847 - వావ్. అది ఎలా ఉంటుందో చూడాలని ఉంది. - మీరు తప్పకుండా చూడాలి. 203 00:12:03,016 --> 00:12:05,477 ఈ ప్రదేశాన్ని డిజైన్ చేసిన వ్యక్తితో మాట్లాడి 204 00:12:05,477 --> 00:12:07,646 అతనిచే ఈ ప్రదేశం గురించి 205 00:12:07,646 --> 00:12:11,441 వివరణ పొందడం భలే గొప్ప విషయం కదా? 206 00:12:11,441 --> 00:12:14,236 నా మట్టుకైతే, ఇలాంటి విషయాలు నాకు చాలా నచ్చుతాయి. 207 00:12:14,236 --> 00:12:16,655 నేను బాగా ఎంజాయ్ చేశాను. అతను ఎంజాయ్ చేశాడో లేదో. 208 00:12:17,614 --> 00:12:19,616 బహుశా అతను నాకంటే మంచి నటుడేమో. 209 00:12:29,292 --> 00:12:31,545 ఇక్కడ ఇంత చల్లగా అవుతుందని అనుకోలేదు. 210 00:12:31,545 --> 00:12:35,840 రాత్రిపూట ఎడారి, చల్లగా ఉన్నా అందంగా ఉంది. 211 00:12:37,259 --> 00:12:40,095 భౌగోళికంగా, మీరు ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు 212 00:12:40,095 --> 00:12:44,766 ఇక్కడ ఉన్న గొప్ప చరిత్ర మనకు కనిపిస్తుంది. 213 00:12:44,766 --> 00:12:50,605 వేరే ఏ ప్రదేశంలోనూ నేను చూడనంతగా ఈ గ్రహ నిర్మాణాన్ని ఇక్కడ 214 00:12:50,605 --> 00:12:53,608 నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. 215 00:12:53,608 --> 00:12:57,654 ఈ దేశానికి ఇక్కడి నేటివ్ అమెరికన్లదే అసలు చరిత్ర. 216 00:12:57,654 --> 00:13:00,198 కాబట్టి, నా ఉద్దేశంలో తమ సంస్కృతితో 217 00:13:00,198 --> 00:13:03,827 వాళ్లకు ఉన్న ఆ కనెక్షన్ ఉంది చూడండి, నాకు దాని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. 218 00:13:18,300 --> 00:13:20,510 నేను చాలా హాయిగా పడుకున్నాను. 219 00:13:21,636 --> 00:13:23,263 హోటల్ కి పూర్తి మార్కులు వేస్తున్నాను. 220 00:13:24,931 --> 00:13:27,684 కానీ ఇప్పుడు నా కార్యక్రమంలో అతి ముఖ్యమైన పని చేయాల్సి ఉంది. 221 00:13:30,020 --> 00:13:31,146 అదే ఉదయం టిఫిన్. 222 00:13:32,564 --> 00:13:37,569 ఆహారం విషయానికి వస్తే, నాకు అది చాలా ముఖ్యమైన విషయం. 223 00:13:37,569 --> 00:13:39,446 నా ఉద్యోగంలో నాకు బాగా నచ్చే విషయం. 224 00:13:39,446 --> 00:13:40,447 ఎరిక్ బేడెర్షర్ ప్రధాన చెఫ్ 225 00:13:40,447 --> 00:13:42,449 - ఎరిక్. - హలో. గుడ్ మార్నింగ్. 226 00:13:42,449 --> 00:13:44,409 - మిమ్మల్ని చూడడం సంతోషం, సర్. - నిన్ను కలవడం కూడా. 227 00:13:44,409 --> 00:13:45,535 సరే, మీకు వంట చేయడం వచ్చా? 228 00:13:46,161 --> 00:13:48,538 బార్బెక్యూ చేయడం వచ్చు. 229 00:13:48,538 --> 00:13:53,835 నాకు వంట వచ్చు అని నేను చెప్పలేను, ఎందుకంటే వంట చేయాలంటే చాలా తెలియాలి. 230 00:13:54,836 --> 00:13:58,423 నాకు గ్రిల్ మీద మాంసం పెట్టడం మాత్రమే వచ్చు, ఆ ఒక్కటి బాగా చేయగలను. 231 00:13:58,423 --> 00:13:59,841 ఇవాళ నేను మీకు పాన్ కేకు చేస్తా. 232 00:13:59,841 --> 00:14:01,468 - ఇది మాకు ఇక్కడ ఎక్కువగా... - పాన్ కేకులా? 233 00:14:01,468 --> 00:14:02,844 - పాన్ కేకులు. - సరే. 234 00:14:02,844 --> 00:14:06,556 ఆమంగిరి లాంటి ప్రదేశం అనగానే, సాధారణంగా... 235 00:14:06,556 --> 00:14:10,435 బాగా ఫ్యాన్సీగా ఉండే, రకరకాల ఐటెంలు ఉంటాయి అనుకుంటాం. 236 00:14:10,435 --> 00:14:12,437 నా వరకైతే, మరీ క్లాసుగా ఉంటే, 237 00:14:12,437 --> 00:14:16,441 నాకు తినడానికి నచ్చేది వెతుక్కోవడం కష్టం అవుతుంది. 238 00:14:17,442 --> 00:14:20,070 అవును. మేము మా అతిథులను తమ ఇంట్లో ఉన్నట్టే ఉండేలా చూసుకుంటాం. 239 00:14:20,070 --> 00:14:21,154 సరే. 240 00:14:21,154 --> 00:14:23,406 ఇప్పుడు నేను వెళ్లి, ఆ లోపల ఉన్న హాట్ పాన్ ని తీసుకుంటా. 241 00:14:23,406 --> 00:14:24,491 సరే. తీసుకో. 242 00:14:24,491 --> 00:14:26,034 ఇప్పుడు నెయ్యి తీసుకుంటా, 243 00:14:26,618 --> 00:14:29,621 ఆ తర్వాత దీనిని ఇలా ఒవేన్ లో పెడతాను. 244 00:14:29,621 --> 00:14:33,917 అంటే అది ఒవేన్ లో ఉండగా, నెయ్యిలో కాలుతుందా? 245 00:14:33,917 --> 00:14:37,629 ఓరి, దేవుడా. ఇది భలే ఉంది. 246 00:14:38,255 --> 00:14:41,049 ఇంటిలో ఉండే ఆహరం అనగానే నమ్మేయకండి. 247 00:14:41,049 --> 00:14:44,052 ఈ ప్రదేశానికి బాగా పేరుగాంచిన వ్యక్తులు తరచుగా వస్తుంటారు. 248 00:14:45,011 --> 00:14:47,722 కానీ సమస్య ఏంటంటే, ఎరిక్ కి ఆ వచ్చిన వారు ఎవరో 249 00:14:47,722 --> 00:14:49,849 ఇతరులకు చెప్పకూడదని సూచనలు ఇచ్చి ఉంటారు. 250 00:14:50,559 --> 00:14:51,601 దాదాపుగా పూర్తి అయింది. 251 00:14:51,601 --> 00:14:53,812 ఇదే సరదాగా ఉంటుంది. 252 00:14:54,354 --> 00:14:57,315 మెల్లిగా విషయాన్ని బయటకు లాగగలమేమో చూద్దాం. 253 00:14:57,315 --> 00:15:03,113 సరే, నేను గనుక, "జార్జ్ క్లూనీ, నీ పాన్ కేకులు తిన్నారా?" అని అడిగితే 254 00:15:03,113 --> 00:15:05,699 - నువ్వు ఏమని... - నేను అవునని, లేదా కాదని చెప్పలేను. 255 00:15:05,699 --> 00:15:07,867 అవును అనలేవు, కాదు అనలేవు. 256 00:15:08,451 --> 00:15:13,456 నువ్వు ఎప్పుడైనా బ్రాడ్ పిట్ కి పాన్ కేకులు చేశావా? 257 00:15:16,251 --> 00:15:18,044 చేసి పెట్టావు అనుకుంటున్నాను. 258 00:15:19,170 --> 00:15:21,089 నేను నీకు పేరులోని అక్షరాలు చెప్తే 259 00:15:22,299 --> 00:15:24,885 నువ్వు తల ఊపు, చాలు... 260 00:15:24,885 --> 00:15:26,928 నేను ఇక్కడికి యుజీన్ లెవీ వచ్చారు అని చెప్పగలను. 261 00:15:28,680 --> 00:15:30,849 అది భలే విషయం కదా? 262 00:15:31,641 --> 00:15:34,060 - మీకు కొంచెం మేపుల్ సిరప్ వేయనా? - అవును, వెయ్యి. 263 00:15:34,060 --> 00:15:36,521 నేను కెనెడియన్ ని, ఆ విషయం చెప్పలేదేమో. 264 00:15:38,231 --> 00:15:40,483 - వావ్. - దయచేసి ఎంజాయ్ చేయండి. 265 00:15:45,447 --> 00:15:46,615 వావ్, ఇది భలే ఉంది. 266 00:15:46,615 --> 00:15:48,575 చాలా బాగుంది. థాంక్స్. 267 00:15:48,575 --> 00:15:51,578 - ఇది నేను జీవితంలో తిన్న అత్యంత... - మీకు చాలా థాంక్స్. 268 00:15:51,578 --> 00:15:53,038 ...మధురమైన పాన్ కేకు. 269 00:15:55,665 --> 00:15:58,585 ఈ పాన్ కేకు తిన్న తర్వాత జార్జ్ క్లూనీ ఏమన్నారు? 270 00:16:02,505 --> 00:16:05,634 సరే, నేను ఇక్కడికి నా జీవితాన్ని మార్చేయగల అనుభవాన్ని వెతుక్కుంటూ వచ్చాను, 271 00:16:05,634 --> 00:16:08,428 ఆ విషయంలో పాన్ కేకులు న్యాయం చేసాయి. 272 00:16:08,929 --> 00:16:10,388 తర్వాత నా డాక్టర్ ని అడిగితే చెప్తాడు. 273 00:16:11,640 --> 00:16:16,144 కానీ, నేను ఇప్పుడు ఇక ఎరిక్ కి వీడుకోలు చెప్పి, బయటకు వెళ్లాల్సి ఉంది. 274 00:16:16,144 --> 00:16:20,190 సాధారణంగా ఈ కాలంలో బయట గాలి చల్లగా ఉంటుంది అంట, 275 00:16:20,190 --> 00:16:26,154 కాబట్టి నేను కాస్త వెచ్చగా ఉండడానికి మందమైన బట్టలు వేసుకుంటున్నాను. 276 00:16:27,113 --> 00:16:28,657 ఆమంగిరి - బ్రైస్ - గ్రాండ్ కాన్యన్ - లాస్ వేగాస్ 277 00:16:28,657 --> 00:16:31,534 ఇక్కడి లోకల్ గైడ్, రేమండ్ నన్ను ఈ హోటల్ నిర్మాణానికి స్ఫూర్తిని ఇచ్చిన 278 00:16:31,534 --> 00:16:34,788 ఒక సహజ నిర్మాణాన్ని చూపించడానికి ఒక ప్రదేశానికి తీసుకెళ్తున్నాడు. 279 00:16:36,623 --> 00:16:38,833 మీతో ఈ ఉదయం ఇలా స్లాట్ కాన్యన్ లకు 280 00:16:38,833 --> 00:16:41,503 వెళ్లడం నాకు చాలా సంతోషంగా ఉంది. 281 00:16:42,128 --> 00:16:46,550 నాకు కూడా వాటిని చూడాలని ఆతృతగా ఉంది. మీరు ఇక్కడే ఉంటుంటారా? 282 00:16:46,550 --> 00:16:48,510 నేను పుట్టి పెరిగింది ఇక్కడే. కాబట్టి, ఈ ప్రదేశంతో 283 00:16:48,510 --> 00:16:51,388 మా కుటుంబ బంధం ముడిపడి ఉంది. 284 00:16:53,515 --> 00:16:54,808 నేను ఒక మాట చెప్పాలి. 285 00:16:55,350 --> 00:16:59,563 ఎడారిలో స్లాట్ లు అంటే, నాకు మొదట లాస్ వేగాస్ గుర్తుకువస్తుంది. 286 00:17:00,230 --> 00:17:03,316 కానీ ప్రపంచంలో ఇంకెక్కడా లేనన్ని ఇలాంటి స్లాట్ కాన్యన్లు 287 00:17:03,316 --> 00:17:05,110 దక్షిణ యూటాలో ఉన్నాయి. 288 00:17:09,197 --> 00:17:11,866 వావ్. ఇది చాలా అందంగా ఉంది. 289 00:17:15,579 --> 00:17:17,037 ఇక్కడ చూడండి. 290 00:17:19,332 --> 00:17:23,753 ఇక్కడ ఉన్న ఈ రాయి భూగర్భ శాస్త్రం ప్రకారం 19 కోట్ల సంవత్సరాల నాటిది. 291 00:17:26,298 --> 00:17:30,176 కాలక్రమంలో, ప్రకృతి శక్తుల కారణంగా నా చుట్టూ ఉన్నఈ ప్రదేశం 292 00:17:30,176 --> 00:17:31,469 ఇలాంటి రూపాన్ని పొందింది. 293 00:17:32,971 --> 00:17:36,725 ప్రకృతి స్వయంగా నిర్మాణం చేపడితే ఇలాగే జరుగుతుంది. 294 00:17:37,851 --> 00:17:39,311 ఇక్కడ ఏం జరుగుతుందంటే 295 00:17:39,311 --> 00:17:43,273 బలంగా వీచే గాలుల కారణంగా, మనం చూస్తున్న ఈ నున్నని పైభాగం 296 00:17:43,273 --> 00:17:44,691 ఏర్పడడం జరిగింది. 297 00:17:49,571 --> 00:17:54,200 నావహో ప్రజలకు ఈ లోయ ప్రాంతాలు ఎంత ప్రాముఖ్యమైనవి? 298 00:17:54,701 --> 00:17:57,203 మా సంస్కృతిలో చాలా మంది 299 00:17:57,203 --> 00:17:59,623 వీటి గురించి చాలా కథలను చెప్తుంటారు. 300 00:18:00,457 --> 00:18:04,377 వాళ్ళ ప్రకారం మా వారిలో కష్టాలను ఎదుర్కొన్న వారి శ్వాస ఈ లోయలను 301 00:18:04,377 --> 00:18:08,715 చేరుకొని ఈ విధమైన రూపాలను ఇచ్చింది అంటుంటారు. 302 00:18:09,424 --> 00:18:14,095 అంటే, మనం ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, 303 00:18:14,721 --> 00:18:16,848 దీర్ఘంగా విడిచే నిట్టూర్పులు ఉంటాయి కదా... 304 00:18:19,976 --> 00:18:21,019 గాలి. 305 00:18:21,811 --> 00:18:25,607 అది ఆ ప్రతికూలమైన భావనను, నిరాశను 306 00:18:26,775 --> 00:18:29,361 ఈ లోయలలోకి తీసుకొచ్చి వదులుతుంది. 307 00:18:29,361 --> 00:18:32,113 - అలా ప్రతికూలమైన... - అందంగా మార్చుతుంది. 308 00:18:32,113 --> 00:18:35,367 - ఆలోచనలను అందంగా మార్చుతుంది. - అవును, అంతే. 309 00:18:35,867 --> 00:18:36,910 ఈ ప్రదేశాన్ని చూస్తుంటే, 310 00:18:36,910 --> 00:18:40,121 - ఆ ప్రార్ధనలు ఫలించినట్టు ఉన్నాయి. - అవును. 311 00:18:40,121 --> 00:18:41,581 అవును, నిజమే. 312 00:18:43,792 --> 00:18:46,670 రేమండ్ దగ్గర నేను అక్కడ నేర్చుకున్నది ఏంటంటే... 313 00:18:47,796 --> 00:18:50,674 మన కంటికి కనిపించేదానికంటే అక్కడ చాలా ఉంది. 314 00:18:52,425 --> 00:18:57,264 కేవలం రాళ్లు, లేదా చరిత్రకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. 315 00:18:58,723 --> 00:19:00,850 - సరేనా? మంచిది. - అవును. 316 00:19:02,561 --> 00:19:05,730 నాకు 75 ఏళ్ళు, రేమండ్, 317 00:19:06,523 --> 00:19:10,735 కానీ దేశంలో ఉన్న ఈ అందమైన ప్రదేశాన్ని 318 00:19:11,486 --> 00:19:16,074 చూడడానికి నాకు ఇంత కాలం పట్టింది అని చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. 319 00:19:19,452 --> 00:19:22,706 ఆ ఎడారి గాలులు కేవలం మనలో ఉన్న ప్రతికూలమైన ఆలోచనలను మాత్రం తీసేయవు. 320 00:19:23,206 --> 00:19:27,210 నాలాగా సుఖానికి అలవాటు పడిన వ్యక్తిలో ఉన్న సంశయాలను కూడా 321 00:19:27,210 --> 00:19:29,379 సమూలంగా తీసేయగలవు, 322 00:19:29,880 --> 00:19:34,259 ఎందుకంటే నేను, ఈ మాట అనడం నాకు పెద్దగా అలవాటు లేదు, కానీ, 323 00:19:35,051 --> 00:19:38,513 ఈ మధ్యాహ్నం ఒకటి చేయాలని ఒక కార్యక్రమాన్ని బుక్ చేసుకున్నాను. 324 00:19:39,806 --> 00:19:41,308 గుర్రపు స్వారీ చేయాలని. 325 00:19:44,769 --> 00:19:48,648 నా గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. నాకు గుర్రాలు నచ్చుతాయా? 326 00:19:49,357 --> 00:19:51,276 నాకు గుర్రాలంటే మొదటి నుండి పెద్దగా ఇష్టం లేదు. 327 00:19:51,860 --> 00:19:54,321 నాకు ఒక గుర్రం ఎప్పుడు సంతోషంగా ఉంటుందో చెప్పడం రాదు. 328 00:19:56,364 --> 00:19:57,532 నేను అనేది మీకు అర్థం అవుతుందా? 329 00:19:58,533 --> 00:20:02,412 ఒక కుక్క మనల్ని చూసి సంతోషంగా ఉన్నప్పుడు తెలుస్తుంది. కానీ ఒక గుర్రం ఎప్పుడు సంతోషంగా ఉందో... 330 00:20:02,412 --> 00:20:05,874 అది మనల్ని చూసి సంతోషంతో తోక ఊపుతుందా? 331 00:20:08,126 --> 00:20:11,713 కానీ నా చిన్నప్పుడు, టీవీలో వచ్చే ప్రతీ కార్యక్రమం 332 00:20:13,381 --> 00:20:16,343 పాశ్చాత్త అమెరికన్ సంస్కృతికి సంబంధించిందే. 333 00:20:16,343 --> 00:20:21,765 అంటే, రాయ్ రాజర్స్, ది సిస్కో కిడ్, వైల్డ్ బిల్ హికాక్. 334 00:20:22,349 --> 00:20:25,769 వెళ్లి నా సొంత పాశ్చాత్త కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. 335 00:20:27,437 --> 00:20:28,438 హాయ్. 336 00:20:28,438 --> 00:20:29,814 హౌడీ. 337 00:20:30,690 --> 00:20:31,691 ఎలా ఉన్నారు? 338 00:20:31,691 --> 00:20:34,361 - నేను బాగానే ఉన్నాను. నా పేరు యుజీన్. - మంచిది. నా పేరు బ్రూక్. 339 00:20:34,361 --> 00:20:37,113 - బ్రూక్, ఎలా ఉన్నారు? - బాగానే ఉన్నాను. మీకు గుర్రాలని కలవాలని ఉందా? 340 00:20:37,113 --> 00:20:39,032 వినడానికి అదొక వింతైన ఆట పేరులా ఉంది. 341 00:20:39,783 --> 00:20:41,576 - ఇది ఎవరు? - దీని పేరు సాడి. 342 00:20:41,576 --> 00:20:43,203 హేయ్, సాడి. 343 00:20:44,120 --> 00:20:46,206 - ఇదే నా గుర్రమా? - అదే మీ గుర్రం. 344 00:20:46,206 --> 00:20:50,085 సరే. దానికి తెలుస్తుంది, "ఒక కొత్త వ్యక్తి వచ్చాడు" అనుకుంటుంది. 345 00:20:51,795 --> 00:20:53,046 లేదు, ఇది చాలా మంచి గుర్రం. 346 00:20:53,046 --> 00:20:57,217 నేను చివరిగా ఒక గుర్రం ఎక్కింది, 347 00:20:57,217 --> 00:21:00,220 యాభై ఏళ్ల క్రితం, 348 00:21:00,220 --> 00:21:02,305 - నేను ఒక ఫ్రెండ్ తో కలిసి స్వారీ చేయడానికి వెళ్ళినప్పుడు. - సరే. 349 00:21:02,305 --> 00:21:07,143 అప్పుడు మా గుర్రాలు రెండూ ఒకదానికి ఒకటి రాసుకున్నాయి. 350 00:21:07,811 --> 00:21:10,438 - నేను ఎగిరిపడ్డాను... - అయ్యో. 351 00:21:10,438 --> 00:21:12,440 ...కానీ అదృష్టవశాత్తు, పొదలో పడ్డాను 352 00:21:12,440 --> 00:21:13,692 - కాబట్టి నాకు... - మీకు ఏం కాలేదు. 353 00:21:13,692 --> 00:21:18,029 తర్వాత లేచి నిలబడి, "బహుశా గుర్రాలను స్వారీ చేసే సామర్ధ్యం నాకు లేదేమో" అనుకున్నా. 354 00:21:19,239 --> 00:21:20,949 చూడడానికి ఒక పోలో ఆటగాడిలా ఉన్నారు. 355 00:21:20,949 --> 00:21:22,492 చిన్నగా పోలో ఆడి... 356 00:21:22,492 --> 00:21:24,494 - అవును. - ...తర్వాత క్రికెట్ ఆడదాం. 357 00:21:24,494 --> 00:21:25,704 ఎలా ఉంది? 358 00:21:28,748 --> 00:21:30,083 - బాగుందా? - అవును. 359 00:21:30,917 --> 00:21:35,881 అందుకే కౌబాయ్ లు కళ్లద్దాలు పెట్టుకోరు. చూడడానికి అస్సలు బాగోదు. 360 00:21:35,881 --> 00:21:36,965 ఎలా అనిపిస్తోంది? 361 00:21:36,965 --> 00:21:40,176 అంటే, అంత సౌకర్యంగా లేదు. 362 00:21:40,176 --> 00:21:43,096 - సరే. వదులుగా పట్టుకుంటే ముందుకు వెళ్తుంది, సరేనా? - అలాగే. 363 00:21:43,096 --> 00:21:44,848 - సరే, ఆ తర్వాత మీరు వెనక్కి వాలాలి. - మంచి గుర్రం. 364 00:21:44,848 --> 00:21:47,183 అవును, ఆ తర్వాత ఆగాలి అనుకుంటే, మీ హీల్స్ తో కిందకి అనండి. 365 00:21:47,183 --> 00:21:49,895 సరే. సిద్ధంగా ఉన్నారా? 366 00:21:49,895 --> 00:21:52,772 నా గుర్రం సిద్ధంగా ఉందేమో. నేను లేను. 367 00:21:52,772 --> 00:21:54,482 సరే. ఇలా రా, సేడి. 368 00:21:54,482 --> 00:21:56,359 వోవ్. సేడి. 369 00:21:56,359 --> 00:21:59,946 - వోవ్. సేడి! - సరే, బుజ్జి. 370 00:21:59,946 --> 00:22:01,156 తాడును బిగించండి. 371 00:22:01,156 --> 00:22:03,867 సరే, మీ చేతులో ఉన్న తాడును అలా గట్టిగా పట్టుకోండి 372 00:22:03,867 --> 00:22:05,827 - అప్పుడు అది అలా చేయదు. - సరే. 373 00:22:06,703 --> 00:22:07,996 లేదు. ఇలా రా, బుజ్జి. 374 00:22:07,996 --> 00:22:10,415 - కానివ్వు. అంతే. - అంతే. 375 00:22:10,415 --> 00:22:12,876 అంతే, నా కంట్రోల్ లో ఉంది. గుర్రపు స్వారీ ఇలా చేయాలి. 376 00:22:13,710 --> 00:22:15,462 కంట్రోల్ ఎవరి చేతులో ఉందో దానికి తెలిసేలా చేయాలి, కదా? 377 00:22:16,379 --> 00:22:17,464 వోవ్. 378 00:22:20,425 --> 00:22:23,386 సరే, ఇలా గుర్రంతో స్వారీ చేయడానికి ఇక్కడ పది కిలోమీటర్ల దారి ఉంది అని చెప్పారు, 379 00:22:23,386 --> 00:22:27,015 కానీ నాలాంటి వాడికి అంత దూరం ఉన్నా వెళ్లే ఓపిక చాలదు. 380 00:22:29,226 --> 00:22:32,354 నేను గుర్రం మీద వెనక్కి వెళతానో లేదో చెప్పలేను, 381 00:22:32,354 --> 00:22:38,068 కానీ సాధారణంగా చేయని పనిని వీలైనంత బాగా చేయడానికి కృషి చేస్తున్నాను. 382 00:22:38,068 --> 00:22:39,736 మీకు కౌబాయ్ అన్న ఫీలింగ్ వస్తోందా? 383 00:22:39,736 --> 00:22:43,365 నాకు చాలా చెత్త కౌబాయ్ ని అన్న ఫీలింగ్ వస్తోంది. 384 00:22:43,365 --> 00:22:46,660 తన సొంత సినిమా తీసే సత్తా ఏమాత్రం లేని కౌబాయ్ ని నేను. 385 00:22:47,827 --> 00:22:51,456 ప్రస్తుతం నమలడానికి కాస్త పొగాకు, చేతికి తుపాకీ ఒక్కటే తక్కువ. 386 00:22:51,456 --> 00:22:55,001 ఇక్కడ ఉండే పాములు, తోడేళ్ళను చంపడానికి మేము మాతో తుపాకులు తీసుకెళ్తుంటాం. 387 00:22:57,337 --> 00:23:00,298 మీరు ఎప్పుడైనా ఇలా ప్రయాణిస్తుండగా పామును చూశారా? 388 00:23:00,298 --> 00:23:01,383 చూశాను. 389 00:23:01,383 --> 00:23:04,261 ఇక చాలు. నాలో బెదురు మొదలైంది. 390 00:23:07,722 --> 00:23:10,809 ఎందుకో తెలీదు కానీ, సేడి నన్ను ఇవాళ చంపాలనుకోలేదు 391 00:23:11,393 --> 00:23:13,103 కారణంగా నేను హోటల్ కి రాగలిగాను. 392 00:23:14,521 --> 00:23:16,231 నా మంచం నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది, 393 00:23:16,231 --> 00:23:19,276 కానీ ఇవాళ రాత్రి, ఒక గొప్ప షోకి నాకోసం కొన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. 394 00:23:20,986 --> 00:23:25,156 నా నావహో గైడ్ మైలోతో ప్రైవేటుగా నక్షత్రాలను చూసే కార్యక్రమం. 395 00:23:26,116 --> 00:23:27,576 - ఎలా ఉన్నారు, యుజీన్? - ఎలా ఉన్నారు? 396 00:23:27,576 --> 00:23:28,743 నేను బాగానే ఉన్నాను. 397 00:23:28,743 --> 00:23:29,995 - మీరు ఇక్కడికి రావడం సంతోషం. - వావ్. 398 00:23:29,995 --> 00:23:32,622 ఇక్కడ నా పని వెనక్కి వాలి పైకి చూడడమే, 399 00:23:33,248 --> 00:23:36,668 ఆ పనిని నేను చక్కగా చేయగలను అని అనిపిస్తోంది. 400 00:23:37,419 --> 00:23:39,546 ఆకాశంలో మీకు బాగా నచ్చేది ఏమైనా ఉందా? 401 00:23:40,046 --> 00:23:44,926 ఈ మహా విశ్వాన్ని చూసినప్పుడు, ఆ బ్రహ్మాండంతో పోల్చితే 402 00:23:44,926 --> 00:23:47,012 - మనం చాలా అధములం అన్న భావన కలుగుతుంది. - అవును. 403 00:23:47,012 --> 00:23:48,930 సరే, ఇవాళ మా సాంస్కృతిక కథల ద్వారా 404 00:23:48,930 --> 00:23:51,683 మీకు కొన్ని కొత్త విషయాలను చెప్తాను. 405 00:23:51,683 --> 00:23:52,809 సరే. 406 00:23:53,310 --> 00:23:55,186 మీరు రావడానికి ముందు, కొన్ని పుల్లలు అక్కడ పెట్టాను. 407 00:23:55,186 --> 00:23:57,689 వాటిని కాస్త తెస్తే, నేను ఇక్కడ ఉన్న పెద్ద కర్రలను పేర్చుతాను... 408 00:23:57,689 --> 00:23:59,733 - సరే. - ...మనం కొంచెం మంట వేసుకుందాం. 409 00:24:01,359 --> 00:24:03,320 మీరు చివరిగా చలిమంట వేసుకొని ఎన్నాళ్లు అవుతుంది? 410 00:24:05,530 --> 00:24:07,032 ఎప్పుడూ వేయలేదు. 411 00:24:07,032 --> 00:24:09,868 సరే. మంచిది, ఇవాళ వేద్దాం. 412 00:24:09,868 --> 00:24:11,661 ఉత్తర తార ఎక్కడ ఉందో మీకు తెలుసా? 413 00:24:17,208 --> 00:24:19,920 నాకు అది తెలుసు అనుకుంటున్నా. 414 00:24:21,338 --> 00:24:22,797 నాకు తెలిసి అది... 415 00:24:24,049 --> 00:24:25,717 - అవును. - ...అక్కడ ఉంటుంది. 416 00:24:25,717 --> 00:24:26,968 అది నిజానికి అక్కడ ఉంది. 417 00:24:26,968 --> 00:24:29,221 - నేను అదే చూపించాలి అనుకున్నాను. - అవును. 418 00:24:29,221 --> 00:24:31,681 - విశ్వ ప్రారంభం గురించిన మా కథలలో... - సరే. 419 00:24:31,681 --> 00:24:33,475 ...అది సృష్టించబడిన మొట్టమొదటి తారలతో ఒకటి 420 00:24:33,475 --> 00:24:35,560 అన్నిటికంటే ప్రకాశవంతంగా వెలగడం కోసం అది సృష్టించబడింది. 421 00:24:35,560 --> 00:24:37,729 మా జనం ఎక్కడికి వెళ్లినా కూడా, 422 00:24:37,729 --> 00:24:39,439 వాళ్ళు మాకున్న బోధనలను స్మరించుకోవడం కోసం 423 00:24:39,439 --> 00:24:41,191 ఎప్పుడైనా సరే దానిని ఆకాశంలో చూడగలరంట. 424 00:24:42,317 --> 00:24:46,071 ఆ నక్షత్రం మీద ఏదైనా కథ ఉందా? 425 00:24:46,738 --> 00:24:49,324 మా తాతయ్య మహా జ్ఞాని. 426 00:24:49,324 --> 00:24:51,493 నా చిన్నప్పుడు ఆయన నాకు చెప్పిన ఒక కథ ఏంటంటే, 427 00:24:51,493 --> 00:24:54,246 మనం అందరం ఆ తారలు చేయబడిన పదార్థాలతోనే చేయబడ్డాం అంట. 428 00:24:54,246 --> 00:24:58,291 ఆయన, "భూమి మీద ఉన్న మనుషులు కూడా ఆ తారల లాంటి వారే అని గుర్తుంచుకో, 429 00:24:58,291 --> 00:25:01,711 ఎందుకంటే ఒక తారను ఇంకొక తారతో కలిపినప్పుడు, 430 00:25:02,212 --> 00:25:04,548 అనేక తరాలను కలిపినట్టే" అనేవారు. 431 00:25:04,548 --> 00:25:07,342 ఆకాశంలో ఉన్న ప్రతీ నక్షత్రం లాగే, 432 00:25:07,968 --> 00:25:10,887 మనం కూడా చాలా ముఖ్యమైన వారం అని గుర్తుంచుకో అనేవారు. 433 00:25:11,471 --> 00:25:14,474 వావ్. అది చాలా గొప్ప మాట, మైలో. 434 00:25:15,392 --> 00:25:20,605 నేను ఆకాశాన్ని చూస్తూ అల్పమైన వాడిని అన్నట్టు అనిపిస్తుంది అన్నాను. 435 00:25:21,189 --> 00:25:25,610 కానీ నువ్వు చెప్పేదాన్ని బట్టి, ఆకాశం వైపు చూసినప్పుడు, 436 00:25:25,610 --> 00:25:30,156 ఆ మహా చీకటిని చూస్తున్నప్పుడు, నేను ప్రాముఖ్యమైనవాడిని అనుకోవాలి అన్నట్టు ఉంది. 437 00:25:30,991 --> 00:25:32,284 దారి తోచని వాడిగా ఉండకూడదని. 438 00:25:32,284 --> 00:25:34,744 అవును, ఎందుకంటే మనం ఏమీ తోచని స్థితిలో ఉన్నప్పుడు పైకి చూస్తే, 439 00:25:35,245 --> 00:25:38,498 మనకు మనం గుర్తుచేసుకోలేని విషయాలను అవి మనకు గుర్తుచేస్తాయి. 440 00:25:40,041 --> 00:25:41,751 నువ్వు కూడా నాతో కలిసి ప్రయాణిస్తావా? 441 00:25:41,751 --> 00:25:46,298 ఎందుకంటే నువ్వు మాట్లాడుతుండగా వినడం అద్భుతంగా ఉంది. 442 00:25:46,798 --> 00:25:50,760 ప్రాముఖ్యమైనవాడిగా ఫీల్ అవ్వడం నిజంగా భలే ఉంది. 443 00:25:50,760 --> 00:25:53,263 ఎడారి మనకు ఆ ఫీలింగ్ ని ఇస్తుంది. ఇదొక ఆత్మీయమైన ప్రదేశం. 444 00:25:53,263 --> 00:25:54,556 నాకది తెలుస్తుంది. 445 00:25:54,556 --> 00:25:56,933 మీరు ఆత్మీయమైన వ్యక్తేనా? 446 00:25:57,976 --> 00:25:59,769 నా మనసు లోలోపల నేను ఆత్మీయుడినే. 447 00:26:00,979 --> 00:26:03,690 కానీ ఆ ఆత్మీయ అనుభవం 448 00:26:03,690 --> 00:26:09,654 నాకు అత్యంత బలంగా ఎదురైన ప్రదేశం ఏదైనా ఉందంటే, అది ఈ ప్రదేశమే. 449 00:26:09,654 --> 00:26:13,867 కాబట్టి, నేను ఆత్మీయత వైపు ఒక మంచి అడుగు వేశాను అనిపిస్తోంది. 450 00:26:13,867 --> 00:26:16,328 - అవును. - మీకు థాంక్స్ చెప్పాలి, సర్. 451 00:26:20,206 --> 00:26:23,877 ఇతర ప్రదేశాలు చూపలేని విధంగా ఈ ప్రదేశం నాపై బలమైన ప్రభావాన్ని చూపించింది. 452 00:26:23,877 --> 00:26:27,923 ఈ ప్రదేశంలోని ఆత్మీయ కోణం నాకు అర్థమైంది. 453 00:26:27,923 --> 00:26:31,134 నాకు తెలుస్తుంది. ఫీల్ అవ్వగలుగుతున్నా. దాని స్పర్శ నాకు తెలుస్తుంది. 454 00:26:31,676 --> 00:26:34,304 మీకు ఆ స్పర్శ తెలుస్తుంది. 455 00:26:34,304 --> 00:26:39,392 నావహో నేషన్ వారి కథను మైలో చాలా చక్కగా 456 00:26:39,392 --> 00:26:44,064 వారి దృక్కోణం నుండి వివరించాడు. 457 00:26:51,738 --> 00:26:54,824 ఇవాళ నా ఆఖరి రోజు, నేను చాలా నేర్చుకున్నాను. 458 00:26:54,824 --> 00:26:58,161 ముఖ్యంగా మనం ఎడారి ప్రాంతం కాబట్టి వేడిగా ఉంటుంది అనుకుంటాం కదా, 459 00:26:58,161 --> 00:26:59,371 అది నిజం కాదు. 460 00:26:59,871 --> 00:27:04,417 రాత్రి బాగా చలి వేసింది, కదా? చాలా చలి వేసింది. అవును. 461 00:27:05,001 --> 00:27:10,674 తిరిగి ఈ ప్రదేశానికి రావడం మిఠాయి మీద తేనె వేసినట్టు ఉంది. 462 00:27:12,175 --> 00:27:13,843 కానీ నేను ఇంటికి వెళ్ళడానికి ముందు, 463 00:27:13,843 --> 00:27:17,305 నావహో రిజెర్వేషన్ లో ఒక పొలానికి రమ్మని ప్రత్యేకంగా ఆహ్వానించారు, 464 00:27:17,305 --> 00:27:20,642 అది మైలో పుట్టి పెరిగిన ప్రదేశం. 465 00:27:21,226 --> 00:27:24,396 నిజం చెప్పాలంటే, మా నేలకు సరిహద్దు కొలొరాడొ నదే. 466 00:27:25,188 --> 00:27:27,774 అంటే దానికి ఇవతల ఉన్నది ఏదైనా సరే, అది నావహో నేలే. 467 00:27:27,774 --> 00:27:31,778 అంటే, మేము 1868లో ఒప్పందం మీద సంతకం చేసినప్పుడు, 468 00:27:32,279 --> 00:27:36,324 ఫెడరల్ ప్రభుత్వం మాకు, "ఇదే మీకు రిజర్వుగా ఇస్తున్న స్థలం" అని ధృవీకరించింది. 469 00:27:37,325 --> 00:27:39,703 మేము ఇప్పుడు ఆ ప్రదేశంలోనే ఉంటున్నాం. 470 00:27:40,495 --> 00:27:43,248 మైలో నాకు నావహో అనే పదం 471 00:27:43,248 --> 00:27:48,378 "రైతుల లోయ" అనబడే ఒక ప్వాబ్లో పదాన్ని స్పానిష్ లోకి అనుకరించడం వల్ల పుట్టింది అంట, 472 00:27:48,378 --> 00:27:50,922 ఇప్పటికీ ఆ పదంతో చాలా మందిని సూచిస్తున్నారు. 473 00:27:51,423 --> 00:27:55,886 ఇది మా అమ్మా నాన్నల ఇల్లు. ఇది హైవేకి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. 474 00:27:56,386 --> 00:27:59,556 ఈ ప్రదేశంలో నీ చిన్నతనం ఎలా సాగింది? 475 00:27:59,556 --> 00:28:01,391 నాకు అన్నీ ఈ ప్రదేశమే. మీ... 476 00:28:01,391 --> 00:28:05,562 కుటుంబాన్ని చూసుకోవడమే మాకు ప్రాముఖ్యమైన బాధ్యత, 477 00:28:05,562 --> 00:28:09,482 అలాగే నా చిన్నతనం అంతా మా తాతయ్యతో కలిసి గడుపుతూనే సాగించేసా. 478 00:28:09,482 --> 00:28:12,736 అంటే, ఇది మీ అచ్చమైన పుట్టిల్లు అన్నమాట, కదా? 479 00:28:12,736 --> 00:28:15,655 అవును. అక్కడ మా అమ్మా నాన్నల ఇల్లు ఉంది. అక్కడే. ఆ మట్టి రంగులో ఉన్నది. 480 00:28:15,655 --> 00:28:16,907 - వావ్. - అలాగే అక్కడ, 481 00:28:16,907 --> 00:28:20,577 పింకు రంగులో ఉన్న ఆ ఇల్లు మా సోదరి ఉండే ఇల్లు. 482 00:28:24,664 --> 00:28:26,291 - సరే, యుజీన్... - వావ్. 483 00:28:26,291 --> 00:28:29,127 - ఈ ప్రదేశం ఎంత పెద్దది? - కొన్ని వేల ఎకరాలు ఉంటుంది. 484 00:28:29,127 --> 00:28:31,463 - అవును, చాలా... - కొన్ని వేల ఎకరాలా? 485 00:28:31,963 --> 00:28:34,090 - భూస్వామి అంటే ఇలాగే ఉంటుందేమో. - అవును. 486 00:28:34,090 --> 00:28:37,135 మనం వెళ్లి ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయో చూద్దాం రండి. 487 00:28:37,135 --> 00:28:39,387 - మీ బూట్లకు మట్టి అంటుకోవచ్చు, పర్లేదా? - ఇక్కడ గొర్రెలు ఉన్నాయా? 488 00:28:39,387 --> 00:28:42,140 అవును. అక్కడ గొర్రెలు ఉన్నాయి చూడండి. అక్కడ ఉన్నవి కనిపిస్తున్నాయా? 489 00:28:42,641 --> 00:28:44,643 మనం వెళ్లి వాటిని ఇటువైపు తోలుదాం రండి. 490 00:28:44,643 --> 00:28:49,064 మా దగ్గర ఒక గొర్రె కాస్త ధిక్కార స్వభావం ఎక్కువ ఉండేది ఉంది. దాని పేరు విల్బర్. 491 00:28:49,064 --> 00:28:54,110 దానికి నేను పెద్దగా నచ్చను. కానీ మీరు నచ్చుతారని ఆశిద్దాం. 492 00:28:54,110 --> 00:28:55,570 దానికి నువ్వే నచ్చవు అంటే, 493 00:28:55,570 --> 00:28:57,948 - ఇక నా సంగతి ఏంటి? - ఏమో. 494 00:28:58,531 --> 00:29:00,450 ఇది వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. 495 00:29:02,202 --> 00:29:05,830 సరే. మనం వాటిని ఇక్కడ గుంపుగా పోగేద్దాం రండి. 496 00:29:05,830 --> 00:29:07,707 - అక్కడ ఉంది. సరే. - అవును. 497 00:29:07,707 --> 00:29:09,042 భలే, ఇది చాలా ఈజీగా జరిగిపోయింది. 498 00:29:09,042 --> 00:29:11,294 అంటే, కొన్ని సార్లు అంతే. కొన్నిసార్లు ఇలా జరగదు. 499 00:29:11,294 --> 00:29:13,421 - అవి వస్తాయని నాకు... - ఒకటి అప్పుడే పారిపోతోంది. 500 00:29:13,922 --> 00:29:15,966 ఆహ్-ఓహ్. అటు వెళ్ళకూడదు, గొర్రెలు. 501 00:29:18,093 --> 00:29:19,177 అయ్యో. 502 00:29:21,846 --> 00:29:25,809 ఆ గొర్రెలు కొంచెం అల్లరి చేయకుండా ఉండి ఉంటే, నేను ఏం చేయగలిగేవాడినో చూపించేవాడిని. 503 00:29:26,643 --> 00:29:29,646 ఆ పదం ఏంటి? కాపలానా? గొర్రెలు కాయడమా? గొర్రెలు కాయడం. 504 00:29:29,646 --> 00:29:31,106 అవి పారిపోతున్నాయి. 505 00:29:31,106 --> 00:29:32,566 మంచి కాపరిని అని నాకు పేరు ఉంది. 506 00:29:32,566 --> 00:29:35,652 అంటే, దేనినైనా కాపలా కాస్తా. నాకది పుట్టుకతో వచ్చింది. 507 00:29:37,237 --> 00:29:38,238 నేను కాపుని. 508 00:29:40,740 --> 00:29:42,409 నా భార్య, డెబ్, నన్ను 509 00:29:42,409 --> 00:29:45,745 "కోషర్ కౌబాయ్" అని పిలుస్తుంది. 510 00:29:45,745 --> 00:29:48,164 ఇది నాకు బాగా తెలిసిన పనే. 511 00:29:48,164 --> 00:29:52,586 నా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం రావడం చాలా బాగుంది, 512 00:29:52,586 --> 00:29:55,422 చాలా మందికి ఈ అవకాశం రాదు. 513 00:29:55,422 --> 00:29:58,758 మైలో, నేను అంత వేగంగా పరిగెత్తలేను. వయసు సహకరించదు. 514 00:29:58,758 --> 00:30:00,385 మనం వాటిని పట్టుకోలేము. 515 00:30:00,385 --> 00:30:02,137 - అబ్బా, భలే పారిపోయాయి. - అవును. 516 00:30:03,096 --> 00:30:04,556 - ఎందుకు? - అవి మిమ్మల్ని నన్ను చూసి 517 00:30:04,556 --> 00:30:05,891 వెంటనే, "ఇక ఉంటాం" అనుకున్నాయి. 518 00:30:05,891 --> 00:30:08,768 ఆ గొర్రెలు నన్ను చూడగానే పారిపోయాయి. 519 00:30:08,768 --> 00:30:13,064 నేను నటించిన సినిమా ఏదైనా చూసి కోప్పడ్డాయేమో? 520 00:30:14,566 --> 00:30:17,027 - అవి పారిపోతున్నాయి, అవును. - ఇంకా ఆగడం లేదు. 521 00:30:17,027 --> 00:30:19,154 అవి వాటంతట అవే వెనక్కి వస్తాయా? 522 00:30:19,154 --> 00:30:21,031 అంటే, వాటికి తిరిగి రావాలని తెలుసు 523 00:30:21,031 --> 00:30:24,951 ఎందుకంటే ఇక్కడ ప్యూమాలు, నక్కలు, తోడేళ్ళు ఉన్నాయి. కాబట్టి... 524 00:30:24,951 --> 00:30:26,202 ఇక్కడ ప్యూమా పులులు ఉన్నాయా? 525 00:30:26,953 --> 00:30:29,122 అవి అక్కడ ఉన్న ఆ బండ్లలో ఉంటాయి. 526 00:30:29,122 --> 00:30:30,665 ఇక్కడ ఉన్న ఆ బండలేనా? 527 00:30:30,665 --> 00:30:33,627 - అవును. అంటే... - మరి, "అక్కడెక్కడో" అన్నట్టు చెప్తావేంటి? 528 00:30:33,627 --> 00:30:35,462 మా దగ్గర ఒక పంది ఉంది. మీరు లులుని చూస్తారా? 529 00:30:36,713 --> 00:30:38,381 నేను పందిని చూస్తాను. 530 00:30:38,381 --> 00:30:44,262 - అమ్మో. అది చాలా పెద్ద పంది. - అవును. అది చాలా పెద్దది. 531 00:30:44,262 --> 00:30:45,722 లులు. 532 00:30:45,722 --> 00:30:49,142 మీరు లోనికి వెళ్లి దానిని ముద్దు చేస్తే, అది శబ్దం చేస్తుంది. భలే సరదాగా ఉంటుంది. 533 00:30:49,142 --> 00:30:52,187 నన్ను ముద్దు చేస్తే నేను కూడా శబ్దం చేస్తాను. 534 00:30:53,730 --> 00:30:54,940 గొర్రెలు తిరిగి వచ్చాయి. 535 00:30:55,440 --> 00:30:58,193 నా అధికారం వాటికీ అర్థం కావడానికి కాస్త సమయం పట్టింది అంతే. 536 00:30:58,193 --> 00:31:00,362 హేయ్, ఇదుగోండి. అంతే. 537 00:31:00,362 --> 00:31:02,489 ఈ పాఠాన్ని బాగా గుర్తుంచుకోండి. 538 00:31:03,073 --> 00:31:06,493 నేను అనుమతి ఇస్తే తప్ప ఇలా పారిపోకూడదు, సరేనా? 539 00:31:06,493 --> 00:31:07,994 సరే. 540 00:31:07,994 --> 00:31:11,039 ఇదే వాటి మేత. మీరు వాటికి మేత వేస్తారా? 541 00:31:11,039 --> 00:31:13,583 సరే, పిల్లలు, ఆహారం తినే సమయమైంది. 542 00:31:14,167 --> 00:31:16,545 భోజనము... లేదు. 543 00:31:16,545 --> 00:31:18,380 విల్బర్ గొర్రెకు కొంచెం అల్లరి ఎక్కువని తెలిసింది. 544 00:31:18,380 --> 00:31:20,507 - సరే, ఒకటి చెప్పనా? - దానిని ఇలా తీసుకురండి. 545 00:31:20,507 --> 00:31:22,175 ఈ గొర్రెలను మరీ గారం చేశారు. 546 00:31:22,759 --> 00:31:25,136 - అది వాటికి ఐస్ క్రీం లాంటిది. - ఇదుగోండి... లేదు, పిల్లలు, ఆగాలి. 547 00:31:25,136 --> 00:31:28,557 మీరు గొర్రెలు సాధు జంతువులు అనుకుంటున్నారేమో, కానీ... 548 00:31:28,557 --> 00:31:30,350 లేదు, ఇది ఒక మదం ఎక్కిన ఎద్దులా ప్రవర్తిస్తుంది. 549 00:31:31,434 --> 00:31:33,144 సరే, ఒకటి చెప్పనా? 550 00:31:33,144 --> 00:31:36,022 మనం ఈ గొర్రెలను క్రమశిక్షణలో పెట్టాలి. 551 00:31:36,022 --> 00:31:38,233 - సరే. - లేదు, ఇక్కడ ఏమీ లేదు. 552 00:31:39,401 --> 00:31:44,447 మీ ఆచారాలను కాపాడుకోవడం మీకు ఎంత ముఖ్యం? 553 00:31:44,948 --> 00:31:46,783 వీటన్నిటినీ కాపాడుకోవడం చాలా ముఖ్యం. 554 00:31:46,783 --> 00:31:48,868 ఈ నేలతో బలమైన బంధం ఉందని చెప్పడం సంతోషంగా ఉంటుంది, తెలుసా? 555 00:31:48,868 --> 00:31:51,079 మేము పుట్టినప్పుడు, బొడ్డుతాడులో ఒక ముక్కను 556 00:31:51,079 --> 00:31:53,081 ఈ నేలలో పాతిపెడతారు, 557 00:31:53,081 --> 00:31:58,044 తక్షణమే మాకు భూమితో ఒక బంధం ఏర్పడాలన్న ఉద్దేశంతో. 558 00:31:58,044 --> 00:32:01,965 అలాంటి ఒక బంధం మన జీవితాలలో లేకపోవడం, 559 00:32:03,174 --> 00:32:05,468 అందుకే జనం నిస్పృహలోకి పోవడం నేను చూస్తున్నాను. 560 00:32:06,970 --> 00:32:10,140 నావహో ప్రజల సమాజం మాతృస్వామ్య సమాజం. 561 00:32:10,140 --> 00:32:13,560 దానర్థం ఈ నేల అలాగే పశువులు ఆడవారి ఆధీనంలో ఉంటాయి. 562 00:32:13,560 --> 00:32:18,648 ఈ విధమైన సమాజంలోని మంచి విషయం ఏంటంటే, అన్నీ సక్రమంగా జరుగుతాయి. 563 00:32:18,648 --> 00:32:20,567 యుజీన్, ఈమె మా అమ్మ, షిమ. 564 00:32:21,067 --> 00:32:22,402 షిమ, హాయ్. 565 00:32:22,402 --> 00:32:24,446 - ఇది మా చెల్లి, పట్రీస. - అవును. హాయ్. 566 00:32:24,446 --> 00:32:25,864 - ఈమె డెసరే. - హలో. 567 00:32:25,864 --> 00:32:28,158 - డెసరే, నమస్కారం, నా పేరు యుజీన్. - హలో. మిమ్మల్ని కలవడం సంతోషం. 568 00:32:28,158 --> 00:32:29,951 - అవును. - లారెన్, నా భార్య. 569 00:32:29,951 --> 00:32:31,244 మిమ్మల్ని కలవడం సంతోషం, లారెన్. 570 00:32:31,244 --> 00:32:32,579 - నాకు కూడా. - సరే. 571 00:32:32,579 --> 00:32:35,081 అక్కడ కొంతమంది పిల్లల్ని చూశా... 572 00:32:35,081 --> 00:32:36,666 వారంతా అక్కడ ఉన్నారు. 573 00:32:36,666 --> 00:32:39,169 మా కుటుంబంలో దాదాపు 200 మంది ఉన్నారు. 574 00:32:39,794 --> 00:32:40,921 రెండు వందలా? 575 00:32:41,671 --> 00:32:45,258 - అవును. - అంటే, మీ కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలంటే, 576 00:32:45,258 --> 00:32:47,177 - చాలా మంది ఉంటారు. - అవును. 577 00:32:47,177 --> 00:32:48,261 - నిజమే. - మీకు... 578 00:32:48,261 --> 00:32:50,055 చాలా పెద్ద బల్ల కావాలి. 579 00:32:50,555 --> 00:32:51,723 అవును. 580 00:32:51,723 --> 00:32:55,769 ఇక్కడ మేము నేర్చుకునే విషయాలు, కచ్చితంగా మా పిల్లలకు నేర్పుతాం, 581 00:32:55,769 --> 00:32:59,564 అలా వారు ఆ విషయాలను తర్వాతి తరానికి అందించగలుగుతారు. 582 00:32:59,564 --> 00:33:01,024 అది చాలా ముఖ్యమైన విషయం. 583 00:33:01,024 --> 00:33:04,152 మా సంస్కృతిని, మా భాషను అలాగే మా వంశాన్ని, 584 00:33:04,152 --> 00:33:06,655 ముఖ్యంగా మా వేడుకలను కాపాడుకోవడమే. 585 00:33:06,655 --> 00:33:07,989 - వాటిని కాపాడుకోవాలి. - అవును, 586 00:33:07,989 --> 00:33:10,492 అలాగే మా తర్వాతి తరాలకు మేము ఏమిటని చెప్పాలి, 587 00:33:10,492 --> 00:33:14,496 ఎందుకంటే మమ్మల్ని ఒక్కటి చేసే సంప్రదాయాలను మా తాతముత్తాతలు మాకు నేర్పించారు, 588 00:33:14,496 --> 00:33:16,706 ఇప్పుడు వారు కాలం చేశారు. 589 00:33:16,706 --> 00:33:21,086 కారణంగా ఇప్పుడు ఆ సంప్రదాయాలను కాపాడుకోవడం కష్టంగా ఉంది, ఎందుకంటే, 590 00:33:21,086 --> 00:33:22,170 అది... 591 00:33:24,464 --> 00:33:26,716 - మేము కలిసి ఒకటిగా ఉండడం... - నిజమే. 592 00:33:26,716 --> 00:33:27,926 ...చాలా కష్టంగా ఉంది. 593 00:33:29,427 --> 00:33:34,140 నా మేనల్లుడు ఒవేన్ చాలా గొప్ప యువకుడు, 594 00:33:34,140 --> 00:33:36,309 వాడికి డాన్స్ వేయడం చాలా ఇష్టం. 595 00:33:36,893 --> 00:33:39,354 హూప్ డాన్సింగ్ వేయాలంటే మన ఊహకు పని చెప్పాల్సి ఉంటుంది. 596 00:33:39,354 --> 00:33:42,607 అలాగే వాడు చేసే వేర్వేరు కదలికల ద్వారా, వాడు మనకు 597 00:33:42,607 --> 00:33:46,152 రకరకాల జంతువులను చూపుతుంటాడు. 598 00:33:59,541 --> 00:34:01,543 సరే, ఈ మధ్యాహ్నం చాలా బాగా సాగింది. 599 00:34:02,544 --> 00:34:08,508 మైలో చాలా గొప్ప కుర్రాడు, అతనికి చాలా మంచి కుటుంబం ఉంది. 600 00:34:14,890 --> 00:34:19,561 అంటే, ఓవేన్ ని చూస్తూ, మైలోని గమించాను, 601 00:34:19,561 --> 00:34:22,021 అతని కళ్ళలో నీరు తిరగడం ప్రారంభమైంది. 602 00:34:22,646 --> 00:34:24,608 - ఓవేన్ ని చూస్తే గర్వంగా ఉంటుంది. - అవును. 603 00:34:24,608 --> 00:34:26,401 ...ఈ సంప్రదాయాన్ని నిలబెడుతున్నాడు. అవును. 604 00:34:26,401 --> 00:34:28,403 నీ కళ్ళలో నాకది తెలుస్తుంది, మైలో. 605 00:34:28,403 --> 00:34:29,570 అవును. 606 00:34:38,747 --> 00:34:41,583 ఒవేన్, అద్భుతం. 607 00:34:41,583 --> 00:34:44,169 - అద్భుతం! - బాగా వేశావు! 608 00:34:44,169 --> 00:34:45,586 - వావ్! - బాగా వేశావు, ఒవేన్. 609 00:34:45,586 --> 00:34:46,503 అవును. 610 00:34:46,503 --> 00:34:48,173 - అవును! - అవును! 611 00:34:48,798 --> 00:34:55,096 ఇంతకు ముందు నావహో ప్రజల గురించి నాకు పెద్దగా తెలీదు, 612 00:34:55,096 --> 00:34:57,474 కానీ ఈ అనుభవం నా కళ్ళు తెరిపించింది. 613 00:34:57,474 --> 00:34:59,434 - మీరు రావడం మాకు చాలా సంతోషం. చాలా... - వావ్. 614 00:34:59,434 --> 00:35:02,896 - అవును. - మా బామ్మ మాకు నేర్పినట్టుగా, 615 00:35:02,896 --> 00:35:04,814 మీకు ఈ నెక్లేస్ ని బహుకరిస్తున్నాం. 616 00:35:07,192 --> 00:35:08,401 ఇదుగోండి. 617 00:35:09,194 --> 00:35:11,988 మా సంస్కృతి, అలాగే మా భాష, ఎప్పుడూ మీతో ఉంటాయి. 618 00:35:11,988 --> 00:35:13,323 - థాంక్స్. - ఇది అద్భుతంగా ఉంది. 619 00:35:13,323 --> 00:35:15,617 ఇది చాలా ప్రత్యేకమైన బహుమతి. 620 00:35:17,827 --> 00:35:21,498 ఈ ఏడాదిలో ఎంతో ఖాళీ ఉంది, 621 00:35:21,498 --> 00:35:24,876 కానీ ఆ ఖాళీలో ఎంతో ఉంది. 622 00:35:24,876 --> 00:35:30,298 దాని చరిత్ర, దాని భూభాగం, అలాగే ఈ నేల మీద 15,000 సంవత్సరాలుగా 623 00:35:30,298 --> 00:35:33,843 నివసిస్తున్న ప్రజలు. 624 00:35:34,719 --> 00:35:39,891 ఈ నేల మీద వారితో కలిసి నడవడం నేను నా భాగ్యంగా భావిస్తున్నాను. 625 00:35:42,727 --> 00:35:44,187 ఇక్కడికి నేను నా అంతట నేనే వచ్చి ఉంటే, 626 00:35:44,187 --> 00:35:47,941 బహుశా ఆమంగిరిలో ఉండడం నచ్చేది ఏమో, 627 00:35:47,941 --> 00:35:52,028 కాబట్టి నా సమయం అంతా రిసార్ట్ లోనే గడిపేసేవాడినేమో. 628 00:35:52,028 --> 00:35:55,865 కానీ ఆ రిసార్ట్ బయట ఇక్కడ ఒక కొత్త ప్రపంచమే ఉంది 629 00:35:55,865 --> 00:35:59,786 దానిని చూసే భాగ్యం నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. 630 00:35:59,786 --> 00:36:04,249 అలాగే నావహో నేషన్ లో నేను కలుసుకున్న స్నేహితులు, 631 00:36:04,249 --> 00:36:07,085 నాకు తెలిసి నా ఉద్దేశంలో నేను ఎదుర్కొన్న... 632 00:36:09,838 --> 00:36:15,385 అతి గొప్ప అనుభవం అలాగే ఈ ట్రిప్ హైలైట్ వారే అని చెప్పాలి. 633 00:37:08,897 --> 00:37:10,899 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్