1 00:00:08,009 --> 00:00:12,347 ఒక గొప్ప ఫిలాసఫర్ ఒకసారి ఇలా అన్నాడు, "ప్రపంచం ఒక పుస్తకం లాంటిది, 2 00:00:13,098 --> 00:00:18,478 ఆ ప్రపంచాన్ని చూడని వారు ఒక్క పేజీ మాత్రమే చదివిన వారితో సమానం." 3 00:00:26,903 --> 00:00:28,363 సరే, నన్ను అడిగితే, 4 00:00:28,363 --> 00:00:32,616 నేను కొన్ని పేజీలు తిరగేశానని చెప్పగలను, కానీ మొత్తం పుస్తకం చదవాలనే కోరికైతే నాకు లేదు. 5 00:00:33,535 --> 00:00:36,621 చాలా కారణాల వల్ల నాకు ప్రయాణాలు చేయడం అంతగా నచ్చదు. 6 00:00:37,205 --> 00:00:38,582 బాగా చల్లగా ఉంటే, 7 00:00:38,582 --> 00:00:39,666 అసౌకర్యంగా ఉంటుంది. 8 00:00:39,666 --> 00:00:41,501 ఐసులో ఈత కొట్టడమా, బట్టలు లేకుండా? 9 00:00:41,501 --> 00:00:44,379 - అవును. - భలే, చాలా మంచి ఆహ్వానంలా ఉంది. 10 00:00:46,756 --> 00:00:49,801 మరీ వేడిగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పగలరా? నాకు అసౌకర్యంగా ఉంటుంది. 11 00:00:49,801 --> 00:00:51,887 నేను అంత వేగంగా నడవలేను. 12 00:00:52,470 --> 00:00:55,223 - నాకు 75 ఏళ్ళు. - మీకు సహాయం కావాలా? 13 00:00:55,223 --> 00:00:56,433 వద్దు, అవసరం లేదు. 14 00:00:57,142 --> 00:01:01,062 బహుశా ఇప్పుడు నా రెక్కలు చాచే సమయమైందేమో. 15 00:01:06,818 --> 00:01:08,194 ఓరి, దేవుడా. 16 00:01:09,404 --> 00:01:11,823 ఒక ఏనుగు వెనుక భాగంలో చేయి పెట్టడం ఇదే మొదటి సారి. 17 00:01:12,407 --> 00:01:13,658 కానీ మంచి విషయం ఏంటంటే, 18 00:01:14,659 --> 00:01:17,954 నాకు నమ్మశక్యం కాని హోటళ్లలో గడపగలుగుతున్నాను. 19 00:01:17,954 --> 00:01:21,583 అమ్మో. ఇది భలే ఉంది. 20 00:01:26,504 --> 00:01:31,468 ఒకే ఒక్క షరతు ఏంటంటే, బయట ప్రపంచంలో ఏముందో చూస్తానని మాట ఇచ్చాను. 21 00:01:31,468 --> 00:01:33,553 - మీ అడుగులు చూసుకోండి. - అలాగే. 22 00:01:33,553 --> 00:01:35,639 - అందమైన పర్వతం. - అదొక అగ్నిపర్వతం. 23 00:01:35,639 --> 00:01:36,640 అది అగ్ని పర్వతమా? 24 00:01:36,640 --> 00:01:40,435 నేను నా జీవితమంతా దూరం పెట్టిన జీవితం ఇది. 25 00:01:41,561 --> 00:01:42,646 సేడి. 26 00:01:42,646 --> 00:01:45,315 ఓరి, నాయనో. 27 00:01:45,315 --> 00:01:48,526 ప్రాణాలతో బయట పడితే చాలు. 28 00:01:48,526 --> 00:01:51,655 ఒక ఫిన్నిష్ వ్యక్తితో అయిదు వోడ్కా షాట్ లు వేయడం ఇదే ఆఖరి సారి. 29 00:02:03,917 --> 00:02:09,088 "వర్షారణ్యాలను కాపాడండి" అనే నినాదం నా మనసులో బలంగా నాటుకుపోయింది. 30 00:02:10,757 --> 00:02:13,468 "వర్షారణ్యానికి వెళ్ళాలి" అని మాత్రం ఎప్పుడూ అనిపించలేదు. 31 00:02:14,886 --> 00:02:18,557 {\an8}కోస్టారికా 32 00:02:18,557 --> 00:02:22,477 కోస్టారికాను తలచుకుంటే, నాకు అక్కడి ఉక్కపోతే గుర్తుకొస్తుంది. 33 00:02:22,477 --> 00:02:26,147 చిరాకు పుట్టించే వాతావరణం. 34 00:02:26,147 --> 00:02:30,944 బయట ప్రకృతి చాలా బాగుంది అని ఎవరైనా అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. 35 00:02:30,944 --> 00:02:33,697 నాకు ఎక్కువగా బయట వాతావరణంలో గడపడం నచ్చదు. 36 00:02:39,536 --> 00:02:41,871 సరే, కానీ ఇక్కడ చాలా మంచి విషయాలు ఉన్నాయి. 37 00:02:41,871 --> 00:02:43,623 ఆ విషయాన్ని నాకు నేను తరచుగా చెప్పుకోవాల్సి వస్తోంది. 38 00:02:44,708 --> 00:02:47,294 కోస్టారికా చాలా ప్రశాంతంగా ఉండే దేశమని ప్రసిద్ధి. 39 00:02:47,294 --> 00:02:48,962 ఈ దేశానికి సైన్యం కూడా లేదు. 40 00:02:48,962 --> 00:02:52,382 అలాగే కోస్టారికా ప్రజలు మిగతా దేశాల ప్రజల కంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు. 41 00:02:57,804 --> 00:03:01,016 కానీ అడవిలో, చుట్టూ మనల్ని చంపగల ప్రాణులు తిరుగుతుంటే 42 00:03:01,016 --> 00:03:04,686 అలా ప్రశాంతంగా ఆయుర్దాయం గురించి ఆలోచించుకుంటూ ఉండలేం కదా. 43 00:03:09,274 --> 00:03:11,526 నేనేం లగ్జరీ కారు కోసం ఎదురుచూడడం లేదు, 44 00:03:11,526 --> 00:03:14,404 కానీ కనీసం పైన రూఫ్ ఉన్న కారు పంపితే బాగుండేది కదరా? 45 00:03:15,071 --> 00:03:17,490 పుర విడ, కోస్టారికాకి స్వాగతం, మిస్టర్ లెవీ. 46 00:03:17,490 --> 00:03:19,743 - హలో. - హలో, మిమ్మల్ని కలవడం సంతోషం. 47 00:03:24,664 --> 00:03:28,752 ఇది సెంట్రల్ అమెరికాలో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన టూరిస్టు ప్రదేశం. 48 00:03:28,752 --> 00:03:31,504 ఇక్కడి గొప్ప వన్యప్రాణులను చూడడానికి జనం వస్తుంటారు. 49 00:03:32,422 --> 00:03:36,968 పర్యాటకులకు ఇక్కడ ఉండే అయిదు లక్షల జాతుల జీవులను చూడడం పండగలా ఉంటుంది. 50 00:03:37,844 --> 00:03:41,681 కానీ "ఏదైనా మరీ ఎక్కువైతే మంచిది కాదు" అని నా బలమైన నమ్మకం. 51 00:03:42,933 --> 00:03:45,894 సరే, కోస్టారికా ప్రజలు ఎలాంటి వారు? 52 00:03:45,894 --> 00:03:50,899 మా ముందు ఎలాంటి సమస్యలు ఉన్నా, మేము సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. 53 00:03:50,899 --> 00:03:53,485 అందుకే మేము తరచుగా "పుర విడ" అంటుంటాం. 54 00:03:54,319 --> 00:03:56,363 - పుర విడ అంటే ఏంటో తెలుసా? - పుర... తెలీదు. 55 00:03:56,363 --> 00:03:57,864 అదొక తత్త్వం. 56 00:03:57,864 --> 00:04:00,992 నిరంతరం ప్రేమను ఇచ్చి పుచ్చుకోవాలి అనే సిద్ధాంతం. 57 00:04:00,992 --> 00:04:02,452 పుర విడ. 58 00:04:02,452 --> 00:04:05,247 నేను నేర్చుకున్న మొదటి రెండు కోస్టారికన్ పదాలు. 59 00:04:07,040 --> 00:04:11,294 మీరు ఒక హాలీవుడ్ నటుడి జీవితం నిరంతరం పుర విడలా ఉంటుంది అనుకోవచ్చు. 60 00:04:11,294 --> 00:04:13,088 కానీ, ప్రస్తుతం నా పరిస్థితి, 61 00:04:13,088 --> 00:04:17,175 భయానికి, గందరగోళానికి మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టు ఉంది. 62 00:04:18,969 --> 00:04:21,221 స్వాగతం. పుర విడ. 63 00:04:21,221 --> 00:04:22,806 - పుర విడ! - పుర విడ. 64 00:04:22,806 --> 00:04:24,975 {\an8}నయార టెంటెడ్ క్యాంప్. 65 00:04:24,975 --> 00:04:28,687 నా జీవితంలో నాకు పెద్దగా పరిచయంలేని పదాలు ఏమైనా ఉన్నాయంటే, అవి ఇవే, 66 00:04:28,687 --> 00:04:31,565 - ఎందుకంటే నేను ముందెప్పుడూ క్యాంపింగ్ కి వెళ్ళలేదు... - అద్భుతం. 67 00:04:31,565 --> 00:04:33,525 ...అలాగే టెంట్ లో పడుకున్నది కూడా లేదు. 68 00:04:33,525 --> 00:04:36,903 - కాబట్టి, మన ఆరంభం బాగానే ఉన్నట్టు ఉంది. - మంచిది. ఇక వెళదాం. రండి. 69 00:04:36,903 --> 00:04:38,947 సరే, నాకు చాలా ఉత్సహంగా ఉంది. 70 00:04:38,947 --> 00:04:41,074 నేను అడవిలో టెంటు కింద పడుకోబోతున్నాను. 71 00:04:41,866 --> 00:04:44,703 నాకు భలే ఇష్టమైనవి అన్నీ ఒకేచోట ఉన్నాయి. 72 00:04:46,204 --> 00:04:50,667 సరే, నాకు టెంట్ అని చెప్పారు, కానీ ఆ టెంట్లు చెట్ల మధ్య కట్టారు. 73 00:04:50,667 --> 00:04:52,961 టెంట్లు చెట్ల మధ్య కట్టడం మంచి పని కాదు. 74 00:04:53,628 --> 00:04:55,547 నన్నడిగితే చెట్ల మధ్య ఏం ఉండాలి అంటారా? 75 00:04:55,547 --> 00:04:56,923 క్లౌన్లు. 76 00:04:58,592 --> 00:05:01,219 సరే, నాకైతే ఇది టెంటులాగ కనిపించడం లేదు. 77 00:05:04,472 --> 00:05:06,141 - రండి. - థాంక్స్. 78 00:05:07,309 --> 00:05:09,603 వావ్, ఇది చాలా బాగుంది. 79 00:05:09,603 --> 00:05:12,188 - వన్యప్రాణులు. - ఓరి, నాయనో. 80 00:05:13,481 --> 00:05:14,482 స్వర్గం. 81 00:05:14,482 --> 00:05:16,151 ఇది కచ్చితంగా పెద్ద అడవే... 82 00:05:16,151 --> 00:05:18,194 - అడవి. అవును. - ...ఎదురుగుండానే ఉంది కదా. 83 00:05:18,194 --> 00:05:20,530 అందమైన పర్వతం, చాలా బాగుంది. 84 00:05:20,530 --> 00:05:21,781 అదొక అగ్ని పర్వతం. 85 00:05:21,781 --> 00:05:23,408 - అది అగ్నిపర్వతమా? - అవును. 86 00:05:23,408 --> 00:05:26,953 - కానీ అది ఎంత కాలంగా నిద్రాణంగా ఉంది? - దాదాపు పదేళ్లుగా అది పేలలేదు. 87 00:05:26,953 --> 00:05:28,038 {\an8}జైరో 88 00:05:28,038 --> 00:05:30,206 - పదేళ్ల క్రితం పేలిందా? - అవును. 89 00:05:30,957 --> 00:05:33,043 దీనికంటే కాస్త ఎక్కువ కాలంగా నిద్రాణంగా ఉన్న పర్వతం దగ్గర హోటల్ 90 00:05:34,211 --> 00:05:35,378 - కట్టి ఉంటే బాగుండేది. - అవును. 91 00:05:36,129 --> 00:05:39,132 రోజుకు వేయి డాలర్లు ఖరీదు చేసే హోటల్ లో ఈ మాత్రం కిక్కు ఉంటుంది. 92 00:05:39,132 --> 00:05:41,676 ఒక ప్రకృతి వైపరీత్యానికి పక్కనే పడుకునే అవకాశం. 93 00:05:42,260 --> 00:05:44,971 - సరే, మీ సహాయానికి థాంక్స్, జైరో. - ఇక ఉంటాను. 94 00:05:44,971 --> 00:05:46,056 చాలా సంతోషం. 95 00:05:47,265 --> 00:05:48,892 ఇది చాలా అందంగా ఉంది. 96 00:05:48,892 --> 00:05:53,230 నేను చూసిన అత్యంత అందమైన టెంట్ ఇదే. 97 00:05:53,230 --> 00:05:56,233 ఇందాక నేను ఒక టెంట్ లో ఉన్నాను అనబోయాను, కానీ నేను ఎప్పుడూ టెంట్ లో ఉన్నది లేదు, కాబట్టి... 98 00:05:56,233 --> 00:05:59,402 ఇది బాగుంది, వన్యప్రాణుల పక్కనే... ఏమని చెప్పను? పురుగుల గురించా? 99 00:05:59,402 --> 00:06:03,240 నాకు పాములు, సాలీళ్ళు పెద్దగా ఇష్టం లేదు. కానీ ఉన్నది అడవిలో కదా. 100 00:06:03,907 --> 00:06:06,201 పక్కనే ఒక అగ్నిపర్వతం కూడా. 101 00:06:06,201 --> 00:06:08,995 ఇలాంటి విషయాలు... నాకు పెద్దగా అలవాటు లేనివి. 102 00:06:17,712 --> 00:06:19,172 కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత, 103 00:06:19,172 --> 00:06:22,717 దానర్థం, మూడు సార్లు పురుగుల మందు స్ప్రే చేసుకున్న తర్వాత, 104 00:06:23,301 --> 00:06:26,346 నాకు బయటకు వెళ్ళడానికి ధైర్యం వచ్చింది. 105 00:06:26,888 --> 00:06:29,849 యుజీన్, మా భూతలస్వర్గానికి స్వాగతం. 106 00:06:29,849 --> 00:06:31,434 దయచేసి ఇలా వచ్చి కూర్చోండి. 107 00:06:32,102 --> 00:06:35,522 నయార అనే ఈ రిసార్టు దాని యజమాని లియోకి వచ్చిన ఐడియా వల్ల ఏర్పడింది. 108 00:06:35,522 --> 00:06:39,859 ఇలాంటి వర్షారణ్యంలో హోటల్ పెట్టిన మిమ్మల్ని నేను చాలా ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను. 109 00:06:39,859 --> 00:06:45,574 మొదటిగా, మీరు హోటల్ పెట్టడానికి సిటీలో ఏం తక్కువ? 110 00:06:45,574 --> 00:06:49,202 అంటే, అసలు ఎక్కడి నుండి మొదలుపెట్టాలో నాకు తెలీడం లేదు. మీరు ఎలా ప్రారంభించారు? 111 00:06:49,202 --> 00:06:52,789 మీరు ఇప్పుడు చూస్తున్న ప్రదేశాన్ని కొన్ని సంవత్సరాల క్రితం వచ్చి చూసి ఉంటే అస్సలు గుర్తుపట్టలేరు. 112 00:06:52,789 --> 00:06:56,960 పశువుల కాపరులు ఈ ప్రదేశాన్ని సర్వనాశనం చేసేశారు. 113 00:06:56,960 --> 00:07:01,590 - అంటే ఇదేమీ ఉండేది కాదా... - లేదు, అంతా బురద నేల. 114 00:07:01,590 --> 00:07:03,967 - ఇంకేం ఉండేది కాదు. - నిజంగానా? 115 00:07:03,967 --> 00:07:05,176 కనీసం గడ్డి కూడా ఉండేది కాదు. 116 00:07:05,176 --> 00:07:06,553 సీతాకోకచిలుకలు ఉండేవి కాదు, 117 00:07:06,553 --> 00:07:08,430 వన్యప్రాణులు ఉండేవి కాదు, పక్షులు ఉండేవి కాదు. 118 00:07:08,430 --> 00:07:10,682 అసలు ఏమీ ఉండేది కాదు. 119 00:07:10,682 --> 00:07:12,726 వినడానికి నాకు సరిపోయే ప్రదేశంలా అనిపించింది. 120 00:07:12,726 --> 00:07:16,271 కానీ నిజానికి కోస్టారికాకి ఈ విషయంలో చాలా మంచి పేరు ఉంది. 121 00:07:16,271 --> 00:07:21,067 గడిచిన 20 ఏళ్లలో, ఈ దేశం డెబ్భై లక్షలకు పైగా మొక్కలు నాటి ఇక్కడి మొత్తం భూభాగంలో అయిదవ భాగాన్ని 122 00:07:21,067 --> 00:07:23,612 తిరిగి అడవి ప్రాంతంగా చేసింది. 123 00:07:25,530 --> 00:07:28,366 నేను ప్రకృతి మధ్యలో కూడా ఒక మంచి హోటల్ 124 00:07:28,366 --> 00:07:32,412 నిర్మించి, దానిని నడిపించగలం అని... 125 00:07:32,412 --> 00:07:34,915 - అవును. - ...ప్రపంచానికి నిరూపించాలి అనుకున్నాను. 126 00:07:35,582 --> 00:07:38,752 నేను ప్రకృతికి ఇంతకంటే దగ్గరగా వెళ్లి సౌకర్యంగా ఉండలేను. 127 00:07:38,752 --> 00:07:44,216 కానీ నాకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి ఉత్సాహాన్ని చూస్తుంటే ఇంతటితో ఆగేలా లేడు అనిపిస్తోంది. 128 00:07:46,092 --> 00:07:49,304 యుజీన్, ఇక్కడ ఒక స్లోత్ ఉన్నట్టు ఉంది, మీరు దానిని చూడొచ్చు. 129 00:07:49,304 --> 00:07:50,931 - ఇక్కడ స్లోత్ ఉందా? - అవును. 130 00:07:50,931 --> 00:07:55,352 స్లోత్ లు చాలా ఎత్తైన కొమ్మల్లో ఉంటాయి కాబట్టి అంత తరచుగా కనిపించవు. 131 00:07:56,102 --> 00:07:58,897 అది అక్కడ ఉన్నట్టు ఉంది. మీకు కనిపిస్తుందా? 132 00:07:59,898 --> 00:08:02,359 లేదు. నేరుగా పైనే ఉందా? 133 00:08:02,359 --> 00:08:03,485 అవును. 134 00:08:03,485 --> 00:08:04,736 నాకు కనిపించడం లేదు. 135 00:08:04,736 --> 00:08:06,154 ఇక్కడి నుండి బాగా కనిపిస్తుంది. 136 00:08:06,154 --> 00:08:07,781 వావ్, మేము స్లోత్ కోసం వెతుకుతున్నాం. 137 00:08:08,365 --> 00:08:09,824 సరే, పైనే నేరుగా చూడండి. 138 00:08:09,824 --> 00:08:11,952 సరిగ్గా నా తలపైనే. 139 00:08:11,952 --> 00:08:14,037 - అది నాకెందుకు కనిపించడం లేదు? - అవును, మీరు చూస్తున్నారు. 140 00:08:14,037 --> 00:08:16,915 - సరే, ఆయనకి... - నాకది కనిపించడం లేదు. 141 00:08:17,791 --> 00:08:19,084 నన్ను ఆటపట్టిస్తున్నారా? 142 00:08:19,084 --> 00:08:21,586 - కనిపించడం లేదు... అవును... - కనిపించిందా? 143 00:08:23,588 --> 00:08:24,464 లేదు. 144 00:08:25,090 --> 00:08:26,591 కొన్నిసార్లు ఎదుటివారి మాటకు ఊకొట్టి... 145 00:08:26,591 --> 00:08:28,426 అవును. 146 00:08:28,426 --> 00:08:29,928 ...అది స్లోత్ అనేయాలి. 147 00:08:29,928 --> 00:08:31,638 "నల్లగా కనిపిస్తోంది చూశారా?" అంటే, నేను వాళ్ళతో 148 00:08:31,638 --> 00:08:33,682 "అవును, అది నీడా?" అది నీడలా ఉంది అన్నాను. 149 00:08:33,682 --> 00:08:36,810 "మీకు కనిపిస్తుందా?" "అవును, కనిపించింది." 150 00:08:37,519 --> 00:08:42,023 సరే, ఇక నేను ఒక స్లోత్ ని చూశాను కాబట్టి, 151 00:08:42,023 --> 00:08:45,527 వన్యప్రాణులను చూసే పని అయిపోయింది అనుకున్నాను. 152 00:08:46,528 --> 00:08:49,406 కానీ లియో నాకు ఇంకా చూపించాలని అనుకుంటున్నట్టు ఉన్నాడు. 153 00:08:49,406 --> 00:08:52,909 యుజీన్, మీకు ఇక్కడి వన్యప్రాణులను చూడాలని ఉంటే... 154 00:08:52,909 --> 00:08:54,077 ఆహ్-హా. 155 00:08:54,077 --> 00:08:58,915 ...నేను మీకోసం రాత్రికి ఒక నైట్ జంగిల్ టూర్ ని ఏర్పాటు చేశాను. 156 00:08:58,915 --> 00:09:03,336 భలే, అది వినడానికి చాలా బాగుంది, కానీ నాకు వద్దనిపిస్తోంది. 157 00:09:03,336 --> 00:09:04,504 - అవును. - ప్రమాణం చేస్తున్నాను... 158 00:09:04,504 --> 00:09:07,132 - అవును. - ...మీరు చాలా అడవి జీవులను చూస్తారు. 159 00:09:09,217 --> 00:09:14,222 వన్యప్రాణుల గురించి నా అభిప్రాయం ఏంటో నేను చాలా స్పష్టంగా తెలియజేశాను అనుకున్నాను. 160 00:09:17,726 --> 00:09:20,353 తెలిసింది ఏంటంటే, నన్ను వీళ్ళు అడవిలో షికారుకు తీసుకెళ్తున్నారట. 161 00:09:21,396 --> 00:09:24,816 సాధారణంగా నేను రాత్రుళ్ళు హైకింగ్ చేయను. 162 00:09:24,816 --> 00:09:27,694 నేను అతనితో "కుదరదు" అని చెప్పేవాడినే, కానీ తర్వాత అతను అందరి దగ్గరకు వెళ్లి, 163 00:09:27,694 --> 00:09:30,155 "అబ్బె, ఆయనతో వేగడం చాలా కష్టం" అని చెప్పకూడదు కాబట్టి వెళ్లాల్సి వస్తోంది. 164 00:09:30,155 --> 00:09:31,364 అదే జరిగితే, ఆ మాట బయటకు పొక్కి, 165 00:09:31,364 --> 00:09:34,034 "లెవీ గురించి విన్నారా? అతనికి కొవ్వు ఎక్కువంట." 166 00:09:34,034 --> 00:09:36,870 ఆ హోటల్ అతను, "బాబోయ్, ఆయన అంత బాగా కలవడు. 167 00:09:36,870 --> 00:09:39,664 చాలా కష్టం, ఆహ్, ఆయనతో గడపడం ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు" అంటారు. 168 00:09:39,664 --> 00:09:41,958 "మీకు కూడా ఆయనతో... నాకు అతనితో తిరగాలని లేదు, వద్దు." 169 00:09:45,003 --> 00:09:46,880 ఏదైతేనేం, ఇవన్నీ నాకు అనుభవం నేర్పిన పాఠాలు. 170 00:09:52,177 --> 00:09:55,889 సరే, రాత్రిపూట అడవిలో తిరిగే విషయంలో నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, 171 00:09:55,889 --> 00:09:58,350 ఆ సమస్యలను మూడు పదాల్లో చెప్పగలను. 172 00:09:58,350 --> 00:10:00,894 అడవి, రాత్రి, అలాగే నడక. 173 00:10:01,478 --> 00:10:03,813 - హలో. - పుర విడ, మిమ్మల్ని కలవడం సంతోషం. 174 00:10:03,813 --> 00:10:05,398 నా పేరు ఈసిద్రో. 175 00:10:05,398 --> 00:10:06,483 ఈసిద్రో. 176 00:10:06,483 --> 00:10:08,985 ఈ రాత్రి వర్షారణ్యంలో నేనే మీ బెస్ట్ ఫ్రెండ్ అలాగే గైడ్ ని. 177 00:10:08,985 --> 00:10:10,320 {\an8}నయార రిసార్టులు ఈసిద్రో 178 00:10:10,320 --> 00:10:12,155 సరే, నీకు ఈ రాత్రి చాలా పని ఉంది. 179 00:10:13,406 --> 00:10:16,034 ఇక్కడ మనం చూడబోయే కొన్ని జీవులు బహుశా... 180 00:10:16,034 --> 00:10:18,119 - కొన్ని జీవులేనా? సరే అయితే. - ఆహ్-హా. 181 00:10:18,119 --> 00:10:21,748 ...వాటిలో కొన్ని సాలిపురుగులు, అలాగే పాములు అవ్వొచ్చు. 182 00:10:21,748 --> 00:10:24,459 సాలిపురుగులు ఇంకా పాములా? నువ్వు ఏం చేయాలని చూస్తున్నావో నాకు అర్థం అవుతోంది. 183 00:10:24,459 --> 00:10:25,794 నన్ను భయపెట్టాలని చూస్తున్నావు. 184 00:10:25,794 --> 00:10:27,087 - అంతే. - సరే, ఇక బయలుదేరుదామా? 185 00:10:27,087 --> 00:10:29,548 - నేను రెడీ, సరే. అలాగే. - సరే, ఇక అదరగొడదాం. 186 00:10:29,548 --> 00:10:31,216 - నేను నీతోనే ఉంటాను. - సరే, మంచిది. 187 00:10:31,216 --> 00:10:32,551 నీ వెనుకే వస్తాను. 188 00:10:33,176 --> 00:10:36,179 అవంటే నాకెంత భయమో వాటికి నేను అంటే ఇంకా భయం అని నాకు చెప్పడానికి ప్రయత్నించకండి, 189 00:10:36,179 --> 00:10:39,057 ఎందుకంటే అది అసాధ్యం. 190 00:10:39,683 --> 00:10:42,185 సరే, ఇక్కడ ఏముందంటే... రండి, ఇక్కడ చూడండి. 191 00:10:42,185 --> 00:10:44,646 ఇక్కడ ఒక సాలిపురుగు ఉంది. 192 00:10:44,646 --> 00:10:46,231 - ఇక్కడే ఉంది, చూస్తున్నారా? - ఓరి, దేవుడా. 193 00:10:46,231 --> 00:10:47,607 - మీకు కనిపిస్తోందా? - అవును, కనిపిస్తోంది. 194 00:10:48,108 --> 00:10:50,318 - అవును. నాకు కనిపిస్తోంది. - దానిని చూడండి. 195 00:10:50,318 --> 00:10:51,486 వావ్, గూడు భలే అల్లింది. 196 00:10:51,486 --> 00:10:52,904 కొన్ని సాలిపురుగులు ఏం చేస్తాయంటే, 197 00:10:52,904 --> 00:10:54,990 - చాలా పెద్ద గూడులు అల్లుతుంటాయి... - నాకు తెలుసు. 198 00:10:54,990 --> 00:10:57,534 ...వీలైనన్ని కీటకాలను పట్టుకోవడానికి. 199 00:10:57,534 --> 00:10:58,702 - కాబట్టి... - నిజం. 200 00:10:58,702 --> 00:11:00,495 ...అది మనుషులకు అంత మంచిది కాదు. 201 00:11:00,495 --> 00:11:02,289 సరే, ఇప్పుడు దేన్ని చూసి జాగ్రత్తగా ఉండాలో నాకు తెలిసింది. 202 00:11:02,289 --> 00:11:03,790 - అక్కడే ఉంది, చూడండి. - అక్కడే ఉంది. 203 00:11:03,790 --> 00:11:05,959 - అది చిన్న తీగ, ఇంకేం కాదు. - అవును. 204 00:11:05,959 --> 00:11:07,043 - క్షమించాలి. - ఏం పర్లేదు. 205 00:11:07,043 --> 00:11:09,296 - చాలా భయంగా ఉంది అందుకే కంగారు పడ్డా. - పర్లేదు. 206 00:11:13,758 --> 00:11:16,136 - నేను మాటల్లో చెప్పలేను, ఈసిద్రో... - ఆహ్-హా. 207 00:11:16,136 --> 00:11:17,804 ...కానీ నాకు సరదాగా మొత్తం తీరిపోతోంది. 208 00:11:18,847 --> 00:11:20,015 ఇది భలే ఉంది. 209 00:11:21,224 --> 00:11:22,225 ఏం కాదు. 210 00:11:22,225 --> 00:11:25,270 ఇదుగోండి. ఇక్కడ చూడండి. సరిగ్గా ఇక్కడ. 211 00:11:25,270 --> 00:11:26,855 దీనిని బుల్లెట్ చీమ అంటారు. 212 00:11:26,855 --> 00:11:28,899 - అది బుల్లెట్ చీమా? - అదే బుల్లెట్ చీమ. 213 00:11:28,899 --> 00:11:32,819 ఈ చీమ గనుక మిమ్మల్ని కుడితే, 24 గంటలు భరించలేని నొప్పి వస్తుంది. 214 00:11:32,819 --> 00:11:35,113 - దానితో కుట్టించుకోవడం... సర్లే. - అవును... అదే. 215 00:11:35,113 --> 00:11:36,781 - దీనితోనే. - అయితే ఇంకా మనం ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాం? 216 00:11:38,408 --> 00:11:42,412 నాకెందుకో ఈ ఈసిద్రో నాకు చావును దగ్గర నుండి చూపించేవరకు 217 00:11:42,412 --> 00:11:45,665 ఊరుకునేలా లేడు అనిపిస్తోంది. 218 00:11:45,665 --> 00:11:46,750 సరే, దీనిని చూడండి. 219 00:11:46,750 --> 00:11:48,043 ఇక్కడ ఒక ఆసక్తికరమైన జీవి ఉంది. 220 00:11:48,835 --> 00:11:50,337 - ఏముంది? - ఈ పామును చూడండి, 221 00:11:50,337 --> 00:11:53,006 దీనిని ఐలాష్ పిట్ వైపర్ అంటారు. 222 00:11:53,006 --> 00:11:55,217 - అలా పిలవడానికి కారణం అది... - అంటే... ఆహ్-హా. 223 00:11:55,217 --> 00:11:57,385 - ...నేరుగా కంటి మీద కుడుతుందా? సరే. - కాదు. 224 00:11:57,385 --> 00:12:01,139 దాని తల మీద చూస్తే, కనుబొమ్మలు ఉన్నట్టు ఉంటుంది. 225 00:12:01,139 --> 00:12:03,350 - అది విషపూరితమైందా? 226 00:12:03,350 --> 00:12:05,227 - చాలా విషపూరితమైంది. - విషపూరితమైన పాములు. 227 00:12:05,227 --> 00:12:08,438 - ఈ పాములలో హీమోటాక్సిన్ అనబడే విషం ఉంటుంది. - సరే. 228 00:12:08,438 --> 00:12:10,857 - అంటే, ఈ పాము గనుక మనల్ని కరిస్తే... - సరే. 229 00:12:10,857 --> 00:12:13,276 - ...అంత బాగుండదేమో కదా... - లేదు, చాలా దారుణంగా ఉంటుంది. 230 00:12:13,276 --> 00:12:16,613 సరే, ఒకవేళ మనల్ని ఈ ఐలాష్ వైపర్ పాము కాటేసింది అనుకో, 231 00:12:16,613 --> 00:12:20,450 మనకు చికిత్స తీసుకోవడానికి, 232 00:12:20,450 --> 00:12:22,994 - లేదు చావడానికి ఎంత సమయం... - సరే. 233 00:12:22,994 --> 00:12:24,120 ...పట్టవచ్చు? 234 00:12:24,120 --> 00:12:25,872 దాదాపుగా ఒక గంట సమయం ఉంటుంది. 235 00:12:25,872 --> 00:12:27,791 - హాస్పిటల్ కి వెళ్ళడానికి గంట సమయం ఉంటుందా? - అవును. 236 00:12:27,791 --> 00:12:29,334 ఇక్కడి నుండి హాస్పిటల్ ఎంత దూరం? 237 00:12:29,334 --> 00:12:32,087 - నలభై-అయిదు నిమిషాల దూరం. - 45 నిమిషాల దూరమా? 238 00:12:32,087 --> 00:12:33,171 అవును. 239 00:12:33,171 --> 00:12:34,881 ఒకవేళ ట్రాఫిక్ ఉంటే? 240 00:12:34,881 --> 00:12:37,133 - ట్రాఫిక్ ఉంటే, పరిగెత్తాల్సిందే. అవును. - సరే. 241 00:12:37,133 --> 00:12:39,886 ఇలాంటి పాముల విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. 242 00:12:39,886 --> 00:12:42,305 - సరే... నిజమే, తెలుస్తోంది. - చెప్పాలంటే, ఈ పాము కనిపించడమే అదృష్టం. 243 00:12:42,305 --> 00:12:44,641 - చాలా అదృష్టం. అదృష్టం అంటే ఇదే. - మంచిది. 244 00:12:44,641 --> 00:12:46,560 ఇదుగోండి, ఎంత అందంగా ఉందో. 245 00:12:46,560 --> 00:12:49,145 - అవును, నిజమే. చాలా అందంగా ఉంది. - ఇలాంటి అనుభవం కచ్చితంగా ఉండాలి. 246 00:12:49,145 --> 00:12:51,231 దీనినే నేను జీవితంలో ఒకసారి మాత్రమే ఎదురయ్యే అనుభవం అంటాను. 247 00:12:51,231 --> 00:12:52,691 అవును. 248 00:12:52,691 --> 00:12:56,069 కొంతమందికి ఆ ఒక్కసారి కూడా ఎక్కువే అనిపిస్తుంది అనుకోండి. 249 00:12:56,570 --> 00:12:58,405 నాకైతే మనల్ని 45 నిమిషాలలో 250 00:12:58,405 --> 00:13:03,368 చంపేయగల పామును ఒక చెట్టు కొమ్మ మీద చూడడం థ్రిల్ ఇచ్చింది అని ఒప్పుకుంటాను. 251 00:13:03,368 --> 00:13:05,161 అది చాలా ఆసక్తికరమైన విషయం. 252 00:13:05,161 --> 00:13:07,622 నాకు నెమ్మదిగా కోస్టారికన్ లు ప్రకృతికి 253 00:13:07,622 --> 00:13:13,169 అంత దగ్గరగా ఎందుకు ఫీల్ అవుతారో అర్థం అవుతుంది, ఎందుకంటే ఇదే వారి జీవన విధానం, 254 00:13:13,169 --> 00:13:16,423 వారు ఎంతగానో ప్రేమించే ప్రపంచం ఇదే. 255 00:13:16,923 --> 00:13:19,718 నేను ఇప్పుడు అడవిలో యాత్ర చేసానని చెప్పుకోవచ్చు. 256 00:13:19,718 --> 00:13:22,220 అడవిలో రాత్రిపూట తిరుగుతూ 257 00:13:22,220 --> 00:13:25,599 ఒక ఐలాష్ వైపర్ పామును చూశానని అందరికీ చెప్పుకోవచ్చు. 258 00:13:25,599 --> 00:13:27,934 కానీ ఈ పనిని మళ్ళీ చేస్తానా? 259 00:13:28,977 --> 00:13:30,312 నాకు అలా అనిపించడం లేదు. 260 00:13:35,567 --> 00:13:36,568 టిటి 261 00:13:36,568 --> 00:13:38,653 చూడండి, ఇలాంటి ప్రదేశాలు నాకు బాగా నచ్చుతాయి. 262 00:13:38,653 --> 00:13:39,779 పాములు, పురుగులకు అవి ఉండే 263 00:13:39,779 --> 00:13:41,698 ప్రదేశం వాటికి ఉంది... 264 00:13:43,450 --> 00:13:45,201 అలాగే ఇది నేను ఉండాలనుకునే ప్రదేశం. 265 00:13:46,786 --> 00:13:47,871 ఆ శబ్దం ఏంటి? 266 00:13:54,252 --> 00:13:58,381 నేను అనుకున్నట్టే, రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. 267 00:13:59,216 --> 00:14:03,929 కాకపోతే, మెలకువ వచ్చేసరికి నా చుట్టూ ప్రాణాపాయం ఉందన్న విషయం మర్చిపోయా. 268 00:14:03,929 --> 00:14:08,934 సరిగ్గా నా కిటికీ బయటకు చూసి ఎదురుగా కనిపించే అగ్నిపర్వతం పేలుతుంది 269 00:14:08,934 --> 00:14:10,894 అని తప్పుగా భావించేవరకు. 270 00:14:12,646 --> 00:14:14,064 అగ్నిపర్వతం పేలుతోంది. 271 00:14:15,649 --> 00:14:16,858 మనం ఎవరికైనా ఫోన్ చేయాలా? 272 00:14:18,985 --> 00:14:21,196 అనవసరంగా భయపెట్టినందుకు క్షమించండి. 273 00:14:21,196 --> 00:14:25,158 ఏమని చెప్పమంటారు? నాకు అగ్నిపర్వతాలంటే అంత భయం మరి. 274 00:14:27,118 --> 00:14:29,454 కానీ కొందరికి ఇదే వారి ఇల్లు. 275 00:14:30,080 --> 00:14:34,251 ల ఫార్ట్యూన అనబడే ఊరిలో ఉన్న ఇక్కడి ప్రజల మాదిరిగా. 276 00:14:36,878 --> 00:14:39,130 భలే, ఈ పార్కు చాలా అందంగా ఉంది... 277 00:14:39,130 --> 00:14:41,675 ఇది ల ఫార్ట్యూన నగర మధ్యలో ఉంది. 278 00:14:41,675 --> 00:14:43,677 - హలో, నా పేరు మారియో. - భలే. 279 00:14:43,677 --> 00:14:44,761 పుర విడ. 280 00:14:45,428 --> 00:14:48,139 అందరూ చాలా హాయిగా రిలాక్స్ అవుతున్నట్టు ఉన్నారు. 281 00:14:48,139 --> 00:14:51,935 అంటే, ఈ ప్రదేశంలో ప్రశాంతపరిచే వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. 282 00:15:02,571 --> 00:15:03,572 వావ్. 283 00:15:04,281 --> 00:15:05,907 కోస్టారికాలో భలే కళాకారులు ఉన్నారు. 284 00:15:07,492 --> 00:15:09,995 {\an8}ఇక్కడ అందరూ ఇంత ఆనందంగా ఉండడానికి 285 00:15:09,995 --> 00:15:12,706 ఒక కారణం ఉందని నాకు తెలిసింది. 286 00:15:12,706 --> 00:15:14,749 హేయ్, పుర విడ. 287 00:15:16,334 --> 00:15:18,753 ల ఫార్ట్యూన అన్న పదానికి "అదృష్టం" అని అర్థం. 288 00:15:19,254 --> 00:15:22,048 ఈ ఊరి చుట్టూ సారవంతమైన అగ్నిపర్వత నేల ఉంది, 289 00:15:23,884 --> 00:15:26,636 ఒక విధమైన పంట వేయడానికి అది సరిగ్గా సరిపోతుంది. 290 00:15:27,762 --> 00:15:31,349 కాఫీ. ఈ దేశ ఆర్ధిక వ్యవస్థకు అది ఎంత ముఖ్యమైంది అంటే 291 00:15:31,349 --> 00:15:33,852 ఆ పంటను ఇక్కడ బంగారు ధాన్యం అని పిలుస్తారు. 292 00:15:33,852 --> 00:15:37,772 రాత్రి నిద్రపట్టలేదు కాబట్టి, నాకు కూడా ఒక కప్పు తాగాలని ఉంది. 293 00:15:38,356 --> 00:15:42,652 అందుకే, ఇక్కడ ఉన్న అయిదవ తరం కాఫీ రైతు, అల్లాన్ ని కలుస్తున్నాను. 294 00:15:42,652 --> 00:15:46,948 - పుర విడ. - అద్భుతం. మా తోటకు స్వాగతం. 295 00:15:46,948 --> 00:15:48,909 ఇతను నా బిజినెస్ పార్ట్నర్, ఆంటోనియో. 296 00:15:48,909 --> 00:15:50,452 అది మాక్సిమో, ఈయన తండ్రి. 297 00:15:50,452 --> 00:15:52,329 మేము ఇప్పుడు కొన్ని కాఫీ మొక్కలు నాటుతున్నాం. 298 00:15:52,913 --> 00:15:54,873 మొక్కలు నాటే ప్రక్రియ ఇలా ఉంటుందా? 299 00:15:54,873 --> 00:16:00,795 చూడండి, నాకు కోస్టారికన్ కాఫీ మిగతా దేశాల కాఫీతో పోల్చితే ఎందుకు వేరుగా ఉంటుందో... 300 00:16:00,795 --> 00:16:02,422 - అవును, ఇతర దేశాలు కదా? - ...అస్సలు తెలీదు. 301 00:16:02,422 --> 00:16:06,134 మా నేల చాలా సారవంతమైంది. కోస్టారికా అంతటా సారవంతమైన అగ్నిపర్వత నేల ఉంటుంది, 302 00:16:06,134 --> 00:16:08,428 కాబట్టి ఇక్కడ కాఫీ మొక్క బాగా పెరిగి, మంచి రుచి ఉంటుంది. 303 00:16:08,428 --> 00:16:12,891 ఆయన ఏమీ అనుకోను అంటే, డాన్ మాక్సిమో వయసు ఎంతో అడగొచ్చా? 304 00:16:15,477 --> 00:16:16,519 ఎనభై-అయిదు ఏళ్ళు, యుజీన్. 305 00:16:16,519 --> 00:16:19,356 మీరు ఈ వయసులో ఇంత కష్టపడడం మంచిదేనా? 306 00:16:22,651 --> 00:16:24,945 - ఆయనకు ఈ పని చాలా ఇష్టం. - నిజమే కావచ్చు, కానీ ఆయన... 307 00:16:24,945 --> 00:16:26,696 మేము ఈ పనిని చాలా ఏళ్లుగా చేస్తున్నాం, యుజీన్. 308 00:16:26,696 --> 00:16:29,324 తెలుసు, కానీ నాకు భయంగా ఉంది. 309 00:16:30,492 --> 00:16:35,247 ఆ 85 ఏండ్ల వ్యక్తి పని చేస్తుంటే పక్కన నిలబడడం నాకు తప్పుగా అనిపించింది. 310 00:16:35,247 --> 00:16:40,585 సాధారణంగా అందరూ నన్ను పని చేయడానికి ఇష్టపడని వ్యక్తిని అంటుంటారు. 311 00:16:40,585 --> 00:16:42,128 - మీరు ట్రై చేస్తారా? - అంటే, 312 00:16:42,128 --> 00:16:44,256 సరే, ఇవ్వండి. పారతో తవ్వడమే కదా. 313 00:16:44,256 --> 00:16:47,342 ఇది చేయడం కష్టం ఏం కాదు, నేను కూడా చాలా పనులు చేసి వచ్చాను. 314 00:16:47,342 --> 00:16:51,763 నేను ఎన్నో ఏళ్ళు చెత్తను ఏరే వ్యక్తిగా పనిచేసాను. 315 00:16:51,763 --> 00:16:56,726 అదంతా కూడా ఆ ఆటోమేటిక్ మెషిన్ లు రావడానికి ముందు, 316 00:16:56,726 --> 00:16:58,979 అంటే, ఆ చెత్త డబ్బాని ట్రక్ లోకి అదే ఎక్కించి 317 00:16:58,979 --> 00:17:02,315 చెత్తను లాగుతుంది కదా, అవి లేకముందే... నేను కనిపించేంత సున్నితమైన వ్యక్తిని కాను. 318 00:17:02,899 --> 00:17:05,485 - బాగా చేశారు. - నా భార్య ఈ వీడియో చూస్తే బాగుండు 319 00:17:05,485 --> 00:17:07,152 ఎందుకంటే ఆమె నేను అస్సలు పని చేయను... 320 00:17:09,322 --> 00:17:10,574 అంటుంటుంది. 321 00:17:11,324 --> 00:17:12,324 సరే, ఇప్పుడు మీరు... 322 00:17:12,324 --> 00:17:16,496 ఇప్పుడు మనం ఈ మొక్క కాఫీ గింజలు కాయడానికి దాదాపు మూడు సంవత్సరాలు ఎదురుచూడాలి. 323 00:17:16,496 --> 00:17:18,998 సరే, కానీ అంతకాలం ఎదురుచూసే ఓపిక నాకు లేదు. 324 00:17:20,375 --> 00:17:23,503 నా టైమ్ బాగుందేమో, ఆ సమయానికి ఆ ఏడాది పంట చేతికి వచ్చింది. 325 00:17:24,004 --> 00:17:25,296 ఇదేనా ఆ గింజ? 326 00:17:25,296 --> 00:17:26,631 కొంతమంది దానిని అలాగే తింటుంటారు. 327 00:17:26,631 --> 00:17:28,717 మీరు తిని చూడండి. అంతే. 328 00:17:31,845 --> 00:17:34,431 - అస్సలు కాఫీ గింజలా లేదు కదా? - లేదు, ఆ రుచి అస్సలు లేదు. 329 00:17:34,431 --> 00:17:36,975 అవును, ఆ రుచి గింజను వేయించినప్పుడు వస్తుంది. 330 00:17:38,643 --> 00:17:41,688 కాఫీకి ఫ్లేవర్ రావాలంటే దానిని 331 00:17:41,688 --> 00:17:43,857 వేయించే ప్రక్రియ అన్నిటికంటే చాలా ముఖ్యం. 332 00:17:43,857 --> 00:17:47,193 నాలాగ జోకులు వేసే వ్యక్తులు చేసే పని కాదది. 333 00:17:47,694 --> 00:17:49,404 సరే, ఇక్కడ మీరు మీ సొంత కాఫీ రకాన్ని చేయొచ్చు. 334 00:17:49,404 --> 00:17:50,822 ఆ సొంత కాఫీ రకమా? 335 00:17:50,822 --> 00:17:52,490 అవును. మీ సొంత రకం కాఫీ. 336 00:17:53,450 --> 00:17:55,410 - మీరు కొన్ని గింజలు వేస్తారా? - సరే, అలాగే. 337 00:17:55,410 --> 00:17:57,412 ఇక్కడ కాఫీ వ్యాపారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. 338 00:17:57,996 --> 00:18:00,457 అత్యుత్తమ క్వాలిటీ బీన్స్ తప్ప వేరే రకం వాటిని పెంచడం చట్టరీత్య నేరంగా 339 00:18:00,457 --> 00:18:04,920 పరిగణించే ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క దేశం కోస్టారికానే. 340 00:18:04,920 --> 00:18:08,632 నాకు ఇన్స్టంట్ కాఫీ అంటే ఇష్టం అని ఇక్కడ చెప్తే ఏమవుతుందో. 341 00:18:08,632 --> 00:18:13,178 నేను ఈ పనిని ఎంత చక్కగా చేస్తున్నానో చూసి మీ మతి పోవడం లేదా? 342 00:18:13,178 --> 00:18:14,554 నిజమే. 343 00:18:14,554 --> 00:18:18,433 లైట్ గా వేయిస్తే తీయని, కాస్త పులుపు వచ్చే రుచి వస్తుంది. 344 00:18:18,433 --> 00:18:22,604 బాగా వేయిస్తే చేదుగా వస్తుంది. నాకు తెలిసిన కాఫీ విషయాలు ఇవి. 345 00:18:23,271 --> 00:18:26,650 నా సొంత రకం కాఫీని వేయించడం ఎప్పుడు ఆపాలో మీరే చెప్పాలి. 346 00:18:27,901 --> 00:18:29,027 ఇప్పుడు బాగానే ఉన్నట్టు ఉంది. 347 00:18:30,070 --> 00:18:33,698 పోనిలే, చివరికి రోజంతా కష్టపడినందుకు ప్రతిఫలం అందుతుంది. 348 00:18:34,866 --> 00:18:36,451 - నా రకమా? - మీ రకమే? 349 00:18:36,451 --> 00:18:39,955 ఇందులోకి కొంచెం మరుగుతున్న నీళ్లను వేస్తే, మెల్లిగా కాఫీ వస్తుంది. 350 00:18:40,830 --> 00:18:42,958 ఉదయమే అర్జంటుగా ఆఫీసుకు వెళ్ళేటట్టు అయితే ఇది చేయలేము... 351 00:18:42,958 --> 00:18:44,251 అస్సలు కుదరదు. 352 00:18:44,251 --> 00:18:46,002 అప్పుడైతే తాగడానికి... 353 00:18:46,002 --> 00:18:47,921 సరే, ఇక ఇప్పుడు నేను కూడా మీతో కలిసి తాగుతాను. 354 00:18:47,921 --> 00:18:49,256 సరే, ఇప్పుడు నాకు కాస్త కంగారుగా ఉంది. 355 00:18:49,256 --> 00:18:51,174 - ఎందుకు? - ఎందుకంటే ఇది నేను వేయించింది కదా. 356 00:18:56,763 --> 00:18:58,515 - ఇది చాలా బాగుంది. - అవును. 357 00:18:58,515 --> 00:19:02,060 ఇందులో పంచదార ఏం లేదు. కానీ, దీనిలో కాస్త తీపి ఉన్నట్టు ఉంది. 358 00:19:02,060 --> 00:19:03,144 అవును. 359 00:19:03,144 --> 00:19:06,815 నేను ఈ కాఫీకి వాణిజ్య ప్రకటన ఇవ్వగలుగుతాను. 360 00:19:11,945 --> 00:19:15,824 ధృడమైన మరియు హాయిని ఇచ్చే రుచి. 361 00:19:30,005 --> 00:19:32,632 మాలాంటి కాఫీ నిపుణులకు ఆకలి కూడా ఎక్కువే వేస్తుంది. 362 00:19:33,466 --> 00:19:38,221 కాబట్టి ఈ సాయంత్రం, నేను నయారలోని హెడ్ చెఫ్ చేతి వంట తినే అదృష్టాన్ని కొట్టేసాను. 363 00:19:38,221 --> 00:19:41,808 మీరు క్విన్టిన్ అనుకుంట. ఎలా ఉన్నారు, సర్? 364 00:19:41,808 --> 00:19:42,976 నేను బాగున్నాను, మీరు? 365 00:19:42,976 --> 00:19:47,355 నేను కూడా బానే ఉన్నాను. రోజులో నాకు బాగా నచ్చే సమయం ఇదే. 366 00:19:47,856 --> 00:19:52,152 నేను ఇవాళ మీకు కోస్టారికన్ వ్యాగు బీఫ్ వండి ఇవ్వబోతున్నాను. 367 00:19:52,152 --> 00:19:54,696 దానిని కాఫీతో కలిపి వండుతాము. 368 00:19:54,696 --> 00:19:57,240 - కాఫీతో. వినడానికి ఆసక్తిగా ఉంది. - "కాఫీతో వంట. అయితే..." 369 00:19:57,240 --> 00:20:00,035 సరే, మీరు కోస్టారికాకు చెందిన వారు కాదు కదా? 370 00:20:00,035 --> 00:20:02,829 నేను కోస్టారికా వాడిని కాను. నిజానికి నేను బృస్సల్స్ నుండి వచ్చాను. 371 00:20:02,829 --> 00:20:06,625 బెల్జియం నుండి కోస్టారికాకి ఎలా వచ్చారు? 372 00:20:06,625 --> 00:20:08,043 నేను ఒక కోస్టారికా వ్యక్తిని కలిసాను. 373 00:20:09,544 --> 00:20:11,046 - దాంతో ఇక్కడికి వచ్చి ఉండిపోయారా? - అయితే... 374 00:20:11,046 --> 00:20:12,881 నాకు ఈ దేశం చాలా ఇష్టం. 375 00:20:12,881 --> 00:20:14,591 ఇక్కడి ప్రజలంటే చాలా ఇష్టం. 376 00:20:14,591 --> 00:20:16,927 కాబట్టి, ఇక్కడే ఉండిపోవాలి అనుకున్నాను. 377 00:20:17,802 --> 00:20:20,055 - ఇక్కడే జీవితాన్ని ముగించాలి అనుకుంటున్నాను. అవును. - వావ్. 378 00:20:20,055 --> 00:20:22,766 సరే, అంటే మీ విషయంలో పుర విడ... 379 00:20:22,766 --> 00:20:23,934 పుర విడకి నేనిచ్చుకున్న అర్థం. 380 00:20:23,934 --> 00:20:26,186 - ...భావన నెలకొంది అనుకుంటున్నాను. - అంటే, అది... 381 00:20:26,186 --> 00:20:28,730 నేను ఇంకా ఆ పదానికి అర్థం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ... 382 00:20:28,730 --> 00:20:32,567 నా విషయంలో అయితే, పుర విడ అనే మాటకు అర్థం జీవితం పట్ల మనకు ఉన్న దృక్కోణం. 383 00:20:32,567 --> 00:20:36,071 వాళ్ళు జీవించే విధానం. వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న విధానం. అది... 384 00:20:36,071 --> 00:20:39,950 - అదొక జీవనశైలి అంటారు అంతేనా? - అదొక జీవనశైలి. అవును. 385 00:20:39,950 --> 00:20:42,035 వాళ్ళు నిజంగా యురోపియన్ లతో పోల్చితే 386 00:20:42,035 --> 00:20:43,620 తక్కువగా ఒత్తిడి చెందే ప్రజలు. 387 00:20:43,620 --> 00:20:45,497 - వాళ్ళు చాలా... - అక్కడి కన్నా నేను ఇక్కడ హాయిగా... 388 00:20:45,497 --> 00:20:48,667 - అవును, నిజం... చివరికి నా ఉద్యోగంలో కూడా. - యూరోప్ కన్నా. 389 00:20:48,667 --> 00:20:52,128 అంటే, వంట పని గురించి మీకు తెలిసిందే కదా, చాలా ఒత్తిడితో కూడుకున్న పని. 390 00:20:52,128 --> 00:20:55,298 అవును, నాకు తెలుసు, నేను హెల్స్ కిచన్ కార్యక్రమం చూశాను. అంతే. చాలా భయం వేసింది. 391 00:21:05,725 --> 00:21:07,102 ఇది చూడడానికి చాలా బాగుంది. 392 00:21:07,102 --> 00:21:08,478 రుచి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. 393 00:21:14,818 --> 00:21:15,819 ఎలా ఉంది? 394 00:21:16,778 --> 00:21:19,990 నా జీవితంలో తిన్న అత్యంత రుచికరమైన మాంసం ఇది... 395 00:21:19,990 --> 00:21:22,867 - అవునా? - అవును, చాలా రుచిగా ఉంది. 396 00:21:22,867 --> 00:21:25,161 - ఇది చేసినందుకు థాంక్స్. - చాలా సంతోషం, యుజీన్. థాంక్స్. 397 00:21:25,996 --> 00:21:29,165 ఇలాంటి భోజనం తిన్నప్పుడు, మనం మైమరచిపోతుంటాం. 398 00:21:29,165 --> 00:21:31,418 మనలో ఉన్న చింతలన్నీ ఒక్కసారిగా మాయం అయిపోతాయి, 399 00:21:32,627 --> 00:21:36,423 చుట్టూ పాముల మధ్య చెట్లలో పడుకుంటున్నాను అన్న చింతతో సహా. 400 00:21:38,008 --> 00:21:39,009 దాదాపుగా. 401 00:21:42,804 --> 00:21:45,849 సరే, ఇంకొక రాత్రి అగ్నిపర్వతం గురించి ఎలాంటి వార్త వినకుండా నిద్ర లేచాను. 402 00:21:45,849 --> 00:21:49,019 అగ్నిపర్వతం కదా, ఎలాంటి వార్త లేదంటే అది మంచి వార్తనే అర్థం. 403 00:21:49,019 --> 00:21:51,313 కొన్ని శబ్దాలైతే వినిపించాయి 404 00:21:51,313 --> 00:21:54,691 కానీ అవి ఏంటో నాకు సరిగా అర్థం కాలేదు. 405 00:21:54,691 --> 00:21:56,568 అయినా నాకు నిద్ర పట్టేసింది. 406 00:21:56,568 --> 00:22:00,488 ఇది చాలా అందమైన ఉదయం. నాకు నా కాఫీ ఉంది. 407 00:22:00,989 --> 00:22:05,702 ఇలాంటి కోస్టారికన్ జీవనశైలికి నేను చాలా త్వరగా అలవాటు పడగలను. 408 00:22:07,454 --> 00:22:10,540 కానీ ఇంకా నాకు పుర విడ అనే మాట అర్థం కాకుండానే ఉంది. 409 00:22:11,041 --> 00:22:12,876 కానీ, ఇది నా చివరి రోజు కాబట్టి 410 00:22:12,876 --> 00:22:16,379 సాలిపురుగులతో గడపడం కంటే 411 00:22:16,379 --> 00:22:18,506 ఎక్కువగా నేను ఇష్టపడని పనిని చేయబోతున్నాను. 412 00:22:19,174 --> 00:22:22,344 నేను నా స్నేహితులకు చెప్పుకోవడానికే సిగ్గుపడే పని అది. 413 00:22:23,720 --> 00:22:28,934 అడవి థెరపిస్ట్ తో ఒక సెషన్. అదేంటో నాకు తెలీదు. 414 00:22:28,934 --> 00:22:32,312 కానీ నా మాట వినండి, ఎలా ఉంటుందో చూద్దామని... నేను ఇంతకు ముందెప్పుడూ థెరపీకి వెళ్ళలేదు. 415 00:22:33,188 --> 00:22:36,149 అంటే, నాకు నా గురించి చెప్పుకోవడం అంతగా నచ్చే పని కాదు. 416 00:22:36,149 --> 00:22:40,195 నేను ఏదైనా గోప్యంగా నాలోనే ఉంచుకునే వ్యక్తిని. నేను "అది వ్యక్తిగతం" అని చెప్తుంటాను. 417 00:22:40,695 --> 00:22:45,492 అవును, అవన్నీ అడగకూడదు. ఆ టాపిక్ ఎత్తకండి అంటుంటాను. 418 00:22:46,743 --> 00:22:48,828 యుజీన్ లెవీ, గోప్యత కలిగిన మనిషి. 419 00:22:50,205 --> 00:22:54,000 నాకు ఇది చేయడానికి బదులు ఆ ఐలాష్ వైపర్ పాముతో ఉండడానికే ఇష్టంగా ఉంది. 420 00:23:00,173 --> 00:23:01,466 - స్వాగతం, మిస్టర్ లెవీ. - హాయ్. 421 00:23:02,092 --> 00:23:03,718 - మిమ్మల్ని కలవడం సంతోషం. - మిమ్మల్ని కలవడం సంతోషం. 422 00:23:03,718 --> 00:23:09,224 మనతో ఉన్న టడేయో, కోస్టారికాలో ఉన్న 11 మంది అధికారిక అడవి థెరపిస్ట్ లలో ఒకరు. 423 00:23:10,350 --> 00:23:13,562 ఆ 11 మందిలో ఒకరు కాని వారు ఎవరైనా సరే, చెట్లతో మాట్లాడుకునే 424 00:23:13,562 --> 00:23:15,772 వెర్రోళ్లు అని తెలుసుకోండి. 425 00:23:16,398 --> 00:23:19,025 అడవి థెరపీ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? 426 00:23:19,025 --> 00:23:24,906 నన్ను అడిగితే, ప్రకృతితో ఒక్కటిగా, మమేకమై ఉండడం ఏమో అంటాను. 427 00:23:24,906 --> 00:23:25,991 అవును, దాదాపుగా అలాంటిదే. 428 00:23:25,991 --> 00:23:27,701 - అలాంటిదేనా? సరే. - అవును, సర్. 429 00:23:27,701 --> 00:23:31,246 కానీ ఉష్ణమండల వర్షారణ్యంలో జీవులు అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ సహజీవనం చేస్తూ 430 00:23:31,913 --> 00:23:36,835 - నడిచే వ్యవస్థ ఒకటి ఉంటుంది. - సరే. 431 00:23:36,835 --> 00:23:41,548 మీరు మీ ఇంద్రియాలను ఆ అరణ్యానికి అప్పగిస్తే, మీరు ఎన్నో లాభాలను పొందుతారు. 432 00:23:41,548 --> 00:23:45,135 నన్ను అడిగితే, నేను ముందెప్పుడూ థెరపీ, 433 00:23:45,135 --> 00:23:48,805 చెప్పాలంటే జీవితంలో ఎప్పుడూ చేయించుకోలేదు. కాబట్టి, నేను... 434 00:23:48,805 --> 00:23:51,975 నేను థెరపిస్టును కాను అని మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను కేవలం ఒక గైడ్ ని. 435 00:23:51,975 --> 00:23:53,894 నన్ను థెరపిస్ట్ దగ్గరకి తీసుకెళ్లే గైడా? 436 00:23:53,894 --> 00:23:56,271 - లేక... అర్థమైంది. - అవును, అరణ్యమే మీ థెరపిస్ట్. 437 00:23:56,855 --> 00:23:58,023 నిజానికి అరణ్యమే మీ థెరపిస్ట్. 438 00:23:58,815 --> 00:24:04,195 అంటే, నేను ఇక్కడికి వచ్చింది టడేయోకి నా సమస్యలు చెప్పుకోవడానికి కాదన్నమాట. 439 00:24:04,905 --> 00:24:07,032 నేనే చెట్లతో మాట్లాడబోతున్నాను. 440 00:24:08,241 --> 00:24:12,829 ముందుగా, నేను అరణ్యంతో మీ మనసులో ఉన్న మాటను పంచుకోమని అడుగుతాను. 441 00:24:13,413 --> 00:24:17,125 బహుశా మీరు ముందెప్పుడూ ఎవరికీ చెప్పని విషయాన్ని అక్కడ చెప్పవచ్చు. 442 00:24:17,125 --> 00:24:20,003 - అడవితో చెప్పాలి. - రెండవదిగా, 443 00:24:20,003 --> 00:24:23,715 జీవితంలో మీరు దేని గురించైతే కృతజ్ఞత కలిగి ఉన్నారో అది అడవితో చెప్పండి. 444 00:24:23,715 --> 00:24:25,592 జీవితంలో నేను కృతజ్ఞత కలిగి ఉన్న విషయమా? 445 00:24:25,592 --> 00:24:28,762 అవును. నేను నా డ్రమ్ వాయించి మిమ్మల్ని పిలుస్తాను. 446 00:24:31,723 --> 00:24:32,557 దీనితో. 447 00:24:34,559 --> 00:24:37,354 మీరు దీనిని విన్న తర్వాత, మీరు తిరిగి ఇక్కడికి వచ్చేయాలి, 448 00:24:37,354 --> 00:24:39,439 ఆ తర్వాత మనం ఆ విషయం మాట్లాడుకుందాం. దయచేసి ఇలా రండి. 449 00:24:43,735 --> 00:24:46,112 అంటే, నేను మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పాలని చూస్తున్నాను. 450 00:24:47,113 --> 00:24:52,118 ప్రకృతితో మిమ్మల్ని ఒకటి చేసే ప్రతీ విషయాన్ని నేను స్వాగతించాలి అన్నట్టు అనిపిస్తోంది. 451 00:24:52,619 --> 00:24:56,122 దురదృష్టవశాత్తు, నేను పెద్దగా గడపడానికి ఇష్టపడని 452 00:24:56,122 --> 00:24:58,959 విషయాలలో ప్రకృతి కాస్త పై స్థాయిలోనే ఉంది. 453 00:24:59,459 --> 00:25:00,794 కానీ, ప్రకృతికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నా. 454 00:25:02,087 --> 00:25:06,049 మొదటిగా, నేను ఎవరికీ చెప్పని ఒక విషయాన్ని చెప్పాలి. 455 00:25:06,049 --> 00:25:07,801 నా భార్యకు కూడా చెప్పని విషయం. 456 00:25:11,388 --> 00:25:14,849 నేను ఒకసారి పేకాటలో 800 డాలర్లు పోగొట్టుకున్నా. 457 00:25:15,976 --> 00:25:17,352 ఆ విషయం ఎవరికీ తెలీదు 458 00:25:17,352 --> 00:25:21,189 ఒకవేళ తెలిసి ఉంటే నేను చాలా ఇబ్బందిలో పడాల్సి వచ్చేది. 459 00:25:25,110 --> 00:25:26,528 ఒట్టేసి చెప్తున్నాను. 460 00:25:29,030 --> 00:25:32,534 సరే, ఇక నేను కృతజ్ఞత తెలిపే విషయం. 461 00:25:32,534 --> 00:25:34,160 ఇది చాలా సులభం. 462 00:25:35,912 --> 00:25:39,249 నాకు నా కుటుంబం ఉన్నందుకు కృతజ్ఞతగా ఉంది. 463 00:25:40,667 --> 00:25:44,921 నా భార్య డెబ్ నాతో ఉన్నందుకు కృతజ్ఞతగా ఉంది. నా కొడుకు డేనియల్ నాకు ఉన్నందుకు కృతజ్ఞతగా ఉంది. 464 00:25:44,921 --> 00:25:48,675 నా కూతురు సారా నాకు ఉన్నందుకు కృతజ్ఞతగా ఉంది. నా సోదరుడు ఫ్రెడ్ నాకు ఉన్నందుకు కృతజ్ఞతగా ఉంది. 465 00:25:48,675 --> 00:25:52,095 నా సోదరి బార్బ్ నాకు ఉన్నందుకు కృతజ్ఞతగా ఉంది. 466 00:25:53,597 --> 00:25:57,809 నన్ను ప్రేమించే అతిగొప్ప కుటుంబం. అది నువ్వు అర్థం చేసుకోగలవు. 467 00:26:01,771 --> 00:26:03,565 ఆ డ్రమ్ మోగింది. ఇక తిరిగి వెళ్లే సమయమైంది. 468 00:26:04,357 --> 00:26:05,525 - మిస్టర్ లెవీ. - చెప్పండి. 469 00:26:06,318 --> 00:26:08,069 మీరు ఏం గమనించారు? 470 00:26:08,778 --> 00:26:12,866 నేను ఏం గమనించాను అంటే, 471 00:26:17,495 --> 00:26:19,789 ఏదో బంధం ఏర్పడింది అని నేను అనను, కానీ, 472 00:26:19,789 --> 00:26:23,376 అన్నిటి మధ్య ఒక కనెక్షన్ ఉన్నట్టు అనిపించింది. 473 00:26:23,877 --> 00:26:25,420 చాలా థాంక్స్. 474 00:26:25,420 --> 00:26:29,883 మీ అనుభవాన్ని సంపూర్ణం చేసుకోవడానికి ఇంకేమైనా చేయాలి అనుకుంటున్నారా? 475 00:26:31,259 --> 00:26:35,096 నాకైతే అది మంచి అనుభవంలాగే అనిపించింది, 476 00:26:35,096 --> 00:26:38,892 కానీ మీరు నాకు దక్కిన అనుభవాన్ని ఇంకా మెరుగు చేసే 477 00:26:38,892 --> 00:26:41,978 పని ఏమైనా ఉంది అనుకుంటే, మనం అదే చేయొచ్చు... 478 00:26:41,978 --> 00:26:43,438 మనం ఇంకొకటి చేయొచ్చు. 479 00:26:43,438 --> 00:26:45,899 - మీరు అది అంటారేమో అని భయపడ్డా, కానీ... - దయచేసి నాతో రండి. 480 00:26:45,899 --> 00:26:47,025 సరే. 481 00:26:48,860 --> 00:26:51,154 నాకు కాస్త బాధగానే ఉంది, కానీ టడేయోకి నాకు ఈ అనుభవం 482 00:26:51,154 --> 00:26:54,282 సరిపోలేదని వెంటనే తెలిసిపోయింది అనిపించింది. 483 00:26:54,282 --> 00:26:56,534 మనం ఎక్కడికి వెళ్తున్నాం, టడేయో? 484 00:26:57,202 --> 00:26:58,703 మీరు ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. 485 00:26:59,537 --> 00:27:01,164 నేను బాగా ఎంజాయ్ చేస్తానా? 486 00:27:01,790 --> 00:27:04,960 కానీ నా మీద ఆశలు వదులుకోకూడదని అతను నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు. 487 00:27:07,462 --> 00:27:08,463 సరే, మనం వచ్చేశాం. 488 00:27:10,465 --> 00:27:13,051 సరే, నేను సాధారణంగానే భయస్తుడిని. 489 00:27:13,051 --> 00:27:14,594 - ఇదే అది. - సరే. 490 00:27:14,594 --> 00:27:18,515 కానీ ఒక ఒక్క విషయం మాత్రం నా ప్రాణం పై నుండి పైకి పోయేంతగా భయపెట్టగలదు. 491 00:27:20,100 --> 00:27:21,309 ఎత్తులు. 492 00:27:23,895 --> 00:27:28,900 ఈ సన్నని బ్రిడ్జి నేలకు 180 అడుగుల ఎత్తున 493 00:27:28,900 --> 00:27:30,569 సన్నని కేబుల్స్ ఆధారంగా నిలబడి ఉంది. 494 00:27:32,612 --> 00:27:36,408 నేనైతే, ససేమిరా ఇది చేయగల పని కాదు. 495 00:27:38,868 --> 00:27:41,204 సరే. ఆగండి. ఒక్క క్షణం. 496 00:27:42,622 --> 00:27:43,873 సరే. 497 00:27:45,750 --> 00:27:48,420 - వెళ్లి మీ పుర విడని కనుగొనండి. - సర్లే, నాకు అలా అనిపించడం లేదు. 498 00:27:48,420 --> 00:27:52,382 నాకు ఇక్కడ నా పుర విడ దొరుకుతుందని అనిపించడం లేదు. 499 00:27:52,382 --> 00:27:57,345 నాకు... అంటే... నిజం చెప్పాలంటే, నాకు ఎత్తులంటే భయం, టడేయో. నిజం... నా వల్ల కాదు. 500 00:27:57,345 --> 00:27:59,347 - దీనిని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. - ఎంజాయ్ చేయడానికి ట్రై చేయాలా? 501 00:27:59,347 --> 00:28:01,600 - అవును. - సరే. 502 00:28:03,977 --> 00:28:08,481 సరే. "ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా" అనిపించే పరిస్థితికి ఇది పరాకాష్ట. 503 00:28:08,481 --> 00:28:09,816 సరే, ఇది మహా దారుణం. 504 00:28:19,492 --> 00:28:20,493 ఓహ్, దేవుడా. 505 00:28:24,706 --> 00:28:27,876 నేను జైంట్ వీల్ కూడా ఎక్కలేను. నా బాధ మీకు అర్థం అవుతుందా? 506 00:28:29,628 --> 00:28:33,757 నాకు ఎందుకో ఎత్తులంటే భయం. మేడపై నుండి కిందకి కూడా చూడలేను. 507 00:28:37,844 --> 00:28:38,929 ఓరి, దేవుడా. 508 00:28:44,059 --> 00:28:45,852 ఈ పని త్వరగా పూర్తి అయితే చాలు. 509 00:28:46,728 --> 00:28:47,729 ఓహ్, అమ్మో. 510 00:28:49,189 --> 00:28:52,567 కానీ, ఇక్కడ ఉన్న సీనరీని ఆస్వాదించడానికి నేను ఎందుకు 511 00:28:53,735 --> 00:28:55,278 బ్రిడ్జి మధ్యలో పదే పదే ఆగుతున్నాను? 512 00:29:05,372 --> 00:29:06,373 అది చాలా భయం వేసింది. 513 00:29:15,423 --> 00:29:16,424 వావ్. 514 00:29:18,468 --> 00:29:19,469 అవును. 515 00:29:20,679 --> 00:29:21,930 గుండె గొంతులోకి వచ్చింది. 516 00:29:25,433 --> 00:29:26,434 మంచిది. 517 00:29:27,018 --> 00:29:30,480 సరే. ఇదంతా బాగానే ఉంది. అడవితో ఒకటి అయ్యే అనుభవం. 518 00:29:30,480 --> 00:29:33,525 నాకు ఇది చాలా నచ్చింది, ఇది అందమైన ప్రదేశం అని నా ఉద్దేశం. 519 00:29:34,859 --> 00:29:39,823 అలాగే మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎలాంటి వారం అనే విషయంలో 520 00:29:39,823 --> 00:29:42,867 అడవితో ఏర్పడే ఆ బంధం మంచిది అనిపించింది, 521 00:29:44,953 --> 00:29:46,246 బహుశా ఏదో ప్రత్యేకత నిజంగానే ఉన్నట్టు ఉంది. 522 00:29:48,582 --> 00:29:52,043 నేను ఈ పనిని అనుమానంతోనే ప్రారంభించి ఉండొచ్చు, 523 00:29:52,043 --> 00:29:54,004 కానీ మన అతిపెద్ద భయాలను జయించడంలో ఏదో సంతోషం ఉంది. 524 00:29:54,588 --> 00:29:57,799 ముఖ్యంగా అది ఒక్కసారి మాత్రమే చేయాల్సి వచ్చినప్పుడు. 525 00:29:58,675 --> 00:30:02,262 జీవితం పట్ల నాకు దొరికిన ఈ కొత్త అభిరుచిని ఇతరులతో కలిసి వేడుక చేసుకోవడానికి 526 00:30:02,262 --> 00:30:04,472 ల ఫార్ట్యూనకి వెళ్లడం కంటే మంచి ఐడియా... 527 00:30:04,472 --> 00:30:05,599 హలో. 528 00:30:05,599 --> 00:30:07,142 ...ఇంకేముంటుంది చెప్పండి? 529 00:30:08,435 --> 00:30:12,022 కోస్టారికా ప్రజలు కొత్తవారిని స్వాగతించడంలో పేరుగాంచిన వారు, 530 00:30:12,022 --> 00:30:16,318 స్థానిక వండ్రంగి డాన్ రికార్డో పుట్టినరోజుకు వెళ్తున్న నేను, నా విషయంలో 531 00:30:16,318 --> 00:30:19,029 అదే నిజం కావాలని ఆశపడుతున్నాను. 532 00:30:19,029 --> 00:30:20,447 - హేయ్. - హలో. 533 00:30:20,447 --> 00:30:22,699 - హలో. యుజీన్? - అవును. 534 00:30:22,699 --> 00:30:25,827 - మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. నేను సెలిమ్. - సెలిమ్, మిమ్మల్ని కలవడం సంతోషం. 535 00:30:25,827 --> 00:30:29,122 మీరు డాన్ రికార్డో కొడుకా? 536 00:30:29,122 --> 00:30:30,290 - అవును. నేను కొడుకునే. - సరే. 537 00:30:30,290 --> 00:30:32,959 ఇవాళ నేను ఆయన కోసం కేకు తీసుకెళ్లడానికి వచ్చాను. 538 00:30:32,959 --> 00:30:34,502 - భలే, చాలా ముఖ్యమైన పని అన్నమాట? - అవును. 539 00:30:34,502 --> 00:30:35,795 మార్టిజా. 540 00:30:37,047 --> 00:30:38,215 హలో. 541 00:30:39,132 --> 00:30:42,427 సరే. 542 00:30:42,969 --> 00:30:44,554 మాకు కేకులు కావాలంటే ఈమె దగ్గరకే వస్తాం... 543 00:30:44,554 --> 00:30:50,268 - చూడండి, ఆయన ఫొటోతో భలే ఉంది. - ఓహ్, భలే. చాలా బాగుంది! 544 00:30:50,268 --> 00:30:53,521 మీరు కేకుతో వస్తున్నారని ఆయనకు తెలుసా లేక ఇది సర్ప్రైజ్ పార్టీనా? 545 00:30:53,521 --> 00:30:56,316 - ఇది సర్ప్రైజ్ అని నేను అనుకోను... - నేను రావడమే సర్ప్రైజ్ అవొచ్చు ఏమో. 546 00:30:56,316 --> 00:30:57,609 అవును, అది నిజమే. 547 00:30:57,609 --> 00:30:59,819 ఇది చాలా ముఖ్యమైన పుట్టినరోజు. 85 ఏళ్ళు, కదా? 548 00:30:59,819 --> 00:31:03,323 ఆయన వందేళ్లకు పైనే బ్రతుకుతారు అని నేను అనుకుంటున్నాను. 549 00:31:04,157 --> 00:31:05,075 - సరే, సరే. - థాంక్స్. 550 00:31:05,075 --> 00:31:06,660 చెప్పాలంటే అది సాధ్యమే. 551 00:31:07,577 --> 00:31:11,081 ప్రపంచంలో బ్లూ జోన్స్ అని పిలువబడే అయిదు ప్రదేశాలలో కోస్టారికా కూడా ఒకటి, 552 00:31:12,415 --> 00:31:15,710 ఇలాంటి ప్రదేశాలలో ప్రజలు 90 ఏళ్లకు మించి బ్రతకడం కామన్. 553 00:31:18,004 --> 00:31:22,175 అనుకున్నట్టే, పుట్టినరోజు జరుపుకోబోయే బాబు కూడా బలంగానే ఉన్నాడు. 554 00:31:22,717 --> 00:31:25,929 నాకు సహాయం చేయాలనే ఉంది, కానీ ఏమైనా గుచ్చుకుంటుందేమో అని భయం. 555 00:31:27,305 --> 00:31:31,893 సెలిమ్ వాళ్ళ అక్కచెల్లెళ్ళు, అలాగే అతని అమ్మగారు, ఎల్మ నాకు ఒక పని చెప్పారు. 556 00:31:31,893 --> 00:31:33,603 ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. 557 00:31:33,603 --> 00:31:37,566 సరే, కాస్త వంటలు చేస్తున్నారు. నాకు టోర్టియా అంటే చాలా ఇష్టం. 558 00:31:37,566 --> 00:31:40,318 అవును. నేను కూడా ఒకప్పుడు టోర్టియాలు చేసేవాడిని, 559 00:31:40,318 --> 00:31:42,070 కానీ, అవును, ఇలా చేయాలి... 560 00:31:42,821 --> 00:31:46,074 అలాగే, దానిని అలా పెట్టండి... అంతే. 561 00:31:46,074 --> 00:31:47,784 చూశారా, ఇంతే కదా? 562 00:31:47,784 --> 00:31:53,498 నేను మీ అమ్మగారిని, ఆమెకు పుర విడ అంటే ఏంటో అడగొచ్చా? 563 00:32:05,969 --> 00:32:09,639 ఆమె, "నా మట్టుకైతే, పర్వతాలతో కలిసి ప్రకృతిలో ఒకటై ఉండడమే. 564 00:32:09,639 --> 00:32:11,600 నదులతో. అడవితో కలిసి ఉండడమే" అన్నారు. 565 00:32:11,600 --> 00:32:13,310 - సరే. - "నా భర్తతో 566 00:32:14,519 --> 00:32:15,937 నా పిల్లలు, నా కూతుళ్లు అలాగే కొడుకులతో." 567 00:32:16,980 --> 00:32:17,981 సరే. 568 00:32:17,981 --> 00:32:22,527 మీరు ఎక్కడి వారైనా, అదే అన్నిటికంటే ముఖ్యమైన విషయం, కదా? 569 00:32:22,527 --> 00:32:24,237 - నిజం. - కుటుంబమే ముఖ్యం. 570 00:32:24,237 --> 00:32:25,947 సరే, ఆయన బట్టలు మార్చుకున్నారు. ఆయన్ని చూడండి. 571 00:32:25,947 --> 00:32:27,365 పుట్టినరోజు కుర్రాడు. 572 00:32:29,576 --> 00:32:32,245 - సరే, ఇక పార్టీని మొదలుపెడదాం. - పార్టీ మొదలుపెడదాం. 573 00:32:34,581 --> 00:32:38,418 ఇవాళ పుట్టినరోజు విందును ఒక సహజ కోస్టారికన్ విధానంలో చేసుకోనున్నాం. 574 00:32:38,418 --> 00:32:42,923 అన్నం, వేయించిన బీన్స్, అరటికాయ అలాగే టోర్టియాలు కూడా. 575 00:32:43,506 --> 00:32:47,344 సరే, సెలిమ్, నన్ను ఈ పార్టీకి ఆహ్వానించినందుకు థాంక్స్. 576 00:32:47,344 --> 00:32:48,637 నాకు చాలా సంతోషంగా ఉంది. 577 00:32:48,637 --> 00:32:50,805 మీతో కలిసి డాన్ రికార్డో 578 00:32:50,805 --> 00:32:55,435 ఎనభై అయిదవ పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. 579 00:32:55,435 --> 00:32:58,230 మిమ్మల్ని కలవడం మా నాన్నగారికి చాలా మంచి బహుమతి లాంటిది, 580 00:32:58,230 --> 00:32:59,940 మా కుటుంబం, అలాగే అమ్మకు కూడా. 581 00:32:59,940 --> 00:33:03,109 తెలుస్తుంది. మీరంతా అమెరికన్ పై సినిమాకు ఫ్యాన్స్ అనుకుంట. 582 00:33:03,109 --> 00:33:04,110 - అవును! - అవునా? 583 00:33:04,110 --> 00:33:05,528 - అవును. నేనే! - ఓరి, దేవుడా. 584 00:33:05,528 --> 00:33:07,113 - నాకు చాలా ఇష్టం. - నేను జోక్ చేశాను. 585 00:33:10,242 --> 00:33:11,243 నాకు చాలా ఇష్టం. 586 00:33:11,243 --> 00:33:13,119 ఇక అందరం తిందాం. 587 00:33:13,119 --> 00:33:16,665 - సరే. చీర్స్! - నేను ఆగలేకపోతున్నా. థాంక్స్. చీర్స్! 588 00:33:18,833 --> 00:33:22,128 పై అంటే గుర్తుకువచ్చింది, నేను తీసుకున్న ఆ కేకు ఎక్కడ? 589 00:33:23,213 --> 00:33:24,464 కేకు వచ్చింది. 590 00:33:44,359 --> 00:33:45,527 వావ్. 591 00:33:47,362 --> 00:33:50,031 ఇది అందమైన కుటుంబం. నాకు ఈ కుటుంబం బాగా నచ్చింది. 592 00:33:52,576 --> 00:33:54,619 ఒక విధమైన ఆకర్షణ, ఒక సంతోషం, 593 00:33:54,619 --> 00:33:58,290 జీవితంలోని మంచి విషయాల పైన మాత్రమే దృష్టి ఉంచి 594 00:33:58,290 --> 00:34:01,459 అందరూ ఒకరితో ఒకరు గడపడంలో సంతోషాన్ని పొందుకుంటున్నారు. 595 00:34:01,459 --> 00:34:04,921 సింకో... 58. సింకో ఓచొ. 596 00:34:06,590 --> 00:34:08,383 నాకు ఈ దేశం, ఇక్కడి అందాలు 597 00:34:08,383 --> 00:34:11,052 మరి ముఖ్యంగా ఇక్కడి జనాలు చాలా నచ్చారు. 598 00:34:11,052 --> 00:34:13,762 ఇక్కడి జనం, చెప్పాలంటే... 599 00:34:15,222 --> 00:34:18,476 వాళ్ళతో నేను బాగా కలిసిపోయాను. 600 00:34:18,476 --> 00:34:21,646 నాకు తెలిసి వాళ్ళు చేప్పే ఆ పుర విడ అనేది, 601 00:34:21,646 --> 00:34:25,317 వాళ్ళకు ఆ ప్రత్యేకతను ఇస్తోంది అనుకుంటున్నాను. 602 00:34:26,233 --> 00:34:29,528 చింతలేని సంతోష జీవితం. ఇక్కడ అందరిలో అదే చూస్తున్నాను. 603 00:34:30,070 --> 00:34:32,907 ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే బాగుండేది. 604 00:34:32,907 --> 00:34:36,119 నేను ఇక్కడి వర్షారణ్యం, చెట్లు పుట్టలు 605 00:34:36,119 --> 00:34:38,329 నాకు మొదటి నుండి అవి అంటే 606 00:34:38,329 --> 00:34:42,791 భయం ఉండడంతో ఏవో తలచుకొని భయపడ్డాను. 607 00:34:42,791 --> 00:34:46,338 కానీ ఆ వర్షారణ్యం నిజానికి చాలా అందంగా ఉంది. 608 00:34:46,338 --> 00:34:48,340 నేను అక్కడికి వెళ్లాను అని గర్వంగా చెప్పగలను. 609 00:34:48,340 --> 00:34:50,133 "కోస్టారికాకి వెళ్ళావా?" అని ఎవరైనా అడిగితే, 610 00:34:50,133 --> 00:34:52,510 "అవును. వెళ్లాను. కొన్ని రోజులు గడిపాను. 611 00:34:52,510 --> 00:34:54,179 చాలా అద్భుతమైన ప్రదేశం. 612 00:34:54,179 --> 00:34:56,722 నువ్వు కూడా వెళ్ళాలి. వెళ్లి చూడాలి" అని చెప్పగలను. 613 00:35:43,812 --> 00:35:45,814 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్