1 00:00:04,630 --> 00:00:05,964 హలో? 2 00:00:08,050 --> 00:00:09,218 హలో? 3 00:00:10,135 --> 00:00:11,887 కింద నుంచి నీకు నేను కనిపిస్తున్నానా? 4 00:00:15,599 --> 00:00:16,600 హలో! 5 00:00:17,851 --> 00:00:19,770 తరువాత కలుద్దాం, మెల్లగా నడిచే మిత్రులారా! 6 00:00:27,611 --> 00:00:29,904 మనం హైకింగ్ ని చాలా నెమ్మదిగా చేస్తున్నామని టియా అనడం, 7 00:00:29,905 --> 00:00:33,449 ఇంకా తను ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్లి తరువాత హేళనగా మనకి గుడ్ బై అంటూ చేతులూపడం గుర్తుందా? 8 00:00:33,450 --> 00:00:36,827 నాకు గుర్తులేదు ఎందుకంటే హైకింగ్ కి నన్ను మీరు ఆహ్వానించేవారు కాదు 9 00:00:36,828 --> 00:00:39,331 ఎందుకంటే నేను చిరాకు పడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడతానని మీరు అనుకునే వారు. 10 00:00:40,374 --> 00:00:41,374 ఇప్పుడు మేమలా అనుకోవడం లేదు. 11 00:00:41,375 --> 00:00:43,377 నేను నేనుగానే ఉన్నాను. 12 00:00:43,877 --> 00:00:47,129 కానీ ఈ విచిత్రమైన ప్యాంట్ వేసుకున్న మన పిల్లని చూడండి. 13 00:00:47,130 --> 00:00:48,464 అవును, ఇవి నా ఫేవరెట్ దుస్తులు. 14 00:00:48,465 --> 00:00:50,466 అవును, నేను ట్రెండ్ ని ఫాలో అవుతున్నాను. 15 00:00:50,467 --> 00:00:52,260 యానిమేటెడ్ హాబిట్ ని మళ్లీ చూశాను, 16 00:00:52,261 --> 00:00:54,428 నా గోళ్లు కత్తిరించుకుని, వాటి మీద చిన్న కత్తులు పెయింట్ చేసుకున్నాను. 17 00:00:54,429 --> 00:00:57,640 చూడబోతే అది చిన్న పురుషాంగంలా వచ్చింది. ఇవి చిన్న హాబిట్ అంగాల్లా కనిపిస్తున్నాయి. 18 00:00:57,641 --> 00:00:59,268 మొత్తానికి మా వాడిని మొదటి హైకింగ్ కి తీసుకొచ్చా. 19 00:00:59,768 --> 00:01:00,977 అవును, నాకు హైకింగ్ గురించి తెలియదు. 20 00:01:00,978 --> 00:01:02,478 ఏంటి? ఎండగా ఉన్నప్పుడు మీరు నడుస్తారా? 21 00:01:02,479 --> 00:01:04,104 కొన్నిసార్లు తొడలు రాసుకుపోయి ఎరుపెక్కుతాయి. 22 00:01:04,105 --> 00:01:06,649 - మనం గ్యాబీ గురించే మాట్లాడుకుందామా, ప్లీజ్? - థాంక్యూ. 23 00:01:06,650 --> 00:01:09,777 అయితే దాని అర్థం రేపు నువ్వు తిరిగి ఆఫీసుకి వస్తున్నావు కదా? 24 00:01:09,778 --> 00:01:10,987 దాని గురించి నేనింకా ఆలోచిస్తున్నాను. 25 00:01:10,988 --> 00:01:12,280 తను ఆలోచిస్తోంది, జిమ్మీ. 26 00:01:12,281 --> 00:01:14,073 దేవుడా, నువ్వు కల్పించుకోవద్దు, బాబూ. 27 00:01:14,074 --> 00:01:16,033 సరే, అందరూ నా మీద ఎందుకు విరుచుకుపడుతున్నారు? 28 00:01:16,034 --> 00:01:17,910 - సరదా కోసం. - నాకు ఇప్పుడు హైకింగ్ నచ్చింది. 29 00:01:17,911 --> 00:01:19,663 - అవును. - జిమ్మీ, నాకు, అంటే, 30 00:01:20,455 --> 00:01:22,039 ఆలోచించుకోవడానికి కనీసం ఒక వారం టైమ్ కావాలి. 31 00:01:22,040 --> 00:01:23,749 ఏంటి? పాల్ తో కలిసి తిరగడం నీకు విసుగ్గా ఉందా? 32 00:01:23,750 --> 00:01:26,752 ప్రతి రోజూ ఉదయం తను నన్ను "అకాయా" కోసం ఆగమంటాడు. 33 00:01:26,753 --> 00:01:28,129 అది నిజానికి 'ఆసాయి.' 34 00:01:28,130 --> 00:01:30,131 ఇంకా ఆ మనిషికి 'స్మాష్ మౌత్' రాక్ బ్యాండ్ ని ఎవరు పరిచయం చేశారు? 35 00:01:30,132 --> 00:01:31,216 నేనే. 36 00:01:31,800 --> 00:01:34,594 కాలేజీలో చేరే ముందు నా హెయిర్ స్టయిల్ ఏమన్నా మళ్లీ మార్చాలంటావా? 37 00:01:34,595 --> 00:01:35,803 నీలం లేదా గులాబీ రంగు వేసుకోనా? 38 00:01:35,804 --> 00:01:37,930 లేదా నువ్వు మొత్తం గుండు గీయించుకుని పూర్తిగా రౌడీ పిల్లలా కూడా మారచ్చు. 39 00:01:37,931 --> 00:01:39,098 దానిని నేను సమర్థిస్తాను. 40 00:01:39,099 --> 00:01:41,934 నువ్వు సైకో అనో లేదా, ఇంకా, అనారోగ్యంతో చావబోతున్నావనో జనం అనుకుంటారేమో. 41 00:01:41,935 --> 00:01:45,897 ఏది ఏమైనా, జనం నీ జోలికి రారు కాబట్టి నీ ఇష్టమొచ్చినట్లు ఉండచ్చు, కాబట్టి, ఎలాగైనా గెలుపు నీదే. 42 00:01:45,898 --> 00:01:47,857 - హేయ్, బాబు. - హేయ్. 43 00:01:47,858 --> 00:01:49,860 నీ లంచ్ గంట కిందటే ముగించావు. 44 00:01:50,485 --> 00:01:51,819 ఊరికే ఇక్కడ కూర్చుని ఏం చేస్తావు? 45 00:01:51,820 --> 00:01:53,822 బహుశా నా ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవుతున్నానేమో. 46 00:01:54,406 --> 00:01:56,532 - ఆ దుర్వార్త తనకి ఎవరు ముందుగా చెబుతారు? - నేను చూసుకుంటాను. 47 00:01:56,533 --> 00:01:58,534 బ్రయాన్, నువ్వంటే మాకు ఇష్టం, కానీ నువ్వు పెద్దవాడివి అయిపోయావు. 48 00:01:58,535 --> 00:02:00,453 నేను ఇప్పుడు దాదాపు చెంపదెబ్బ కొట్టబోయాను. 49 00:02:00,454 --> 00:02:02,747 ఇంకా చెప్పాలంటే, నేను పెద్దవాడిని కాలేదు. 50 00:02:02,748 --> 00:02:04,165 ఈ వాక్యాన్ని పూర్తి చేయి. 51 00:02:04,166 --> 00:02:05,750 - "వూప్..." - ఇదిగో చూడు. 52 00:02:05,751 --> 00:02:06,877 ఓహ్, డామిట్. 53 00:02:07,461 --> 00:02:09,462 సరే, మంచిది. నాకు చార్లీ నుండి బ్రేక్ కావాలి. 54 00:02:09,463 --> 00:02:11,964 మేము సట్టన్ కి నిద్రపోవడం గురించి ట్రయినింగ్ ఇస్తున్నాం ఇంకా గొడవ పడుతున్నాం. 55 00:02:11,965 --> 00:02:13,466 నిన్న రాత్రి, అతను చిరాకు వచ్చేలా ప్రవర్తించాడు 56 00:02:13,467 --> 00:02:15,511 దాంతో నువ్వు తండ్రివి కాదని అతనికి చెప్పాను, 57 00:02:16,178 --> 00:02:17,762 అది పూర్తిగా నిజం అనుకో, 58 00:02:17,763 --> 00:02:21,057 కానీ "నువ్వు కూడా తండ్రివి కావు" అని నాపైన తిరిగి అరిచాడు, 59 00:02:21,058 --> 00:02:22,392 అది నిజంగా 60 00:02:23,101 --> 00:02:24,228 నన్ను చాలా బాధపెట్టింది. 61 00:02:25,229 --> 00:02:28,022 ఓహ్, చచ్చాం. డ్రె థిబొడౌ ఫోన్ చేస్తున్నాడు. 62 00:02:28,023 --> 00:02:30,149 - ఓహ్, అది భలే విచిత్రమైన పేరు. - కదా? 63 00:02:30,150 --> 00:02:32,777 ఇది 'ఫర్స్టీ-లాస్టీ' పేరు. ఎప్పుడూ రెండు పేర్లు కలిపే అనాలి. 64 00:02:32,778 --> 00:02:35,154 హేయ్, డ్రె... థిబొడౌ. 65 00:02:35,155 --> 00:02:36,573 చెప్పాను కదా. 66 00:02:37,157 --> 00:02:39,576 సరే. వినడానికి బాగుంది. 67 00:02:42,204 --> 00:02:43,288 అది వినడానికి బాధగా ఉంది. 68 00:02:44,706 --> 00:02:45,832 సరే, ఫోన్ చేసినందుకు థాంక్స్. 69 00:02:47,459 --> 00:02:49,586 అయ్యో. నీకు ఉద్యోగం రాలేదా? 70 00:02:50,170 --> 00:02:51,338 లేదు, అతని ఆంటీ చనిపోయిందట. 71 00:02:52,005 --> 00:02:53,631 కానీ నాకు ఉద్యోగం వచ్చింది. నాకు ఆ ఉద్యోగం వచ్చింది. 72 00:02:53,632 --> 00:02:54,715 నేను ఇప్పుడు సూ చెఫ్, బేబీ! 73 00:02:54,716 --> 00:02:56,635 బేబీ! యస్! 74 00:02:59,429 --> 00:03:01,180 ఓహ్, దేవుడా. 75 00:03:01,181 --> 00:03:02,348 - ఏంటి? - ఓహ్, చచ్చాం. 76 00:03:02,349 --> 00:03:04,725 చూడండి, హోర్హే కి ఈ విషయం ఇంకా తెలియదు, కాబట్టి విషయం చెప్పకండి. 77 00:03:04,726 --> 00:03:06,895 హేయ్, మీరంతా దేనికి సెలబ్రేట్ చేసుకుంటున్నారు? 78 00:03:08,647 --> 00:03:10,982 మా పాపాయి మొదటిసారి మాట్లాడింది. 79 00:03:10,983 --> 00:03:12,316 - అది క్రేజీ విషయం. - హా. 80 00:03:12,317 --> 00:03:13,402 పాప ఏం మాట్లాడింది? 81 00:03:13,986 --> 00:03:15,153 తను ఏం అందంటే, 82 00:03:15,988 --> 00:03:17,780 "నాన్న చాలా యంగ్ గా ఉన్నాడు" అంది. 83 00:03:17,781 --> 00:03:19,156 బాబూ, నేను పుట్టినప్పుడు నువ్వు ఉన్నావు. 84 00:03:19,157 --> 00:03:20,533 నీకు ల్యాండ్ లైన్ ఉండేది. 85 00:03:20,534 --> 00:03:22,202 నువ్వు ఇంకా దాన్ని చెకొస్లొవేకియా అనే పిలుస్తున్నావు. 86 00:03:22,786 --> 00:03:23,787 ఎందుకు? ఏం జరిగింది? 87 00:03:26,123 --> 00:03:27,124 సరే. 88 00:03:29,209 --> 00:03:30,877 నువ్వు మా పొరుగులోనే ఉండటం నాకు సంతోషంగా ఉంది. 89 00:03:30,878 --> 00:03:33,004 అంటే, నేను నిజంగా ఇటువైపు రాలేదేమో. 90 00:03:33,005 --> 00:03:35,507 నిన్ను చూడాలనే ఇక్కడికి వచ్చానేమో. 91 00:03:36,425 --> 00:03:38,093 నువ్వు ఆ మాట అనాలని నేను కోరుకుంటున్నాను. 92 00:03:38,677 --> 00:03:39,844 లేదులే, నేను ఇటువైపే ఉన్నాను. 93 00:03:39,845 --> 00:03:41,013 ఓహ్, డామిట్. 94 00:03:41,555 --> 00:03:43,347 మా వ్యాయామం క్లాసు ఈ వీధిలోనే ఉంది. 95 00:03:43,348 --> 00:03:45,433 వారంలో మూడుసార్లు నిన్ను కలవచ్చని అనుకున్నాను, 96 00:03:45,434 --> 00:03:47,393 రెండు వారాలకి ఒకసారి వస్తానంతే, 97 00:03:47,394 --> 00:03:49,229 పిచ్చగా డోనట్స్ తినేసి, నా మీద నాకే అసహ్యం వేసినప్పుడు వస్తుంటా. 98 00:03:49,730 --> 00:03:52,065 - విప్డ్ క్రీమ్ ఇంకొంచెం కావాలి, ప్లీజ్. - తప్పకుండా. 99 00:03:54,776 --> 00:03:57,028 అయితే నిన్ను మళ్ళీ చూడాలంటే నీ మీద నీకు అసహ్యం వేసేదాకా 100 00:03:57,029 --> 00:03:58,321 ఆగాలన్నమాట, అవునా? 101 00:03:58,322 --> 00:04:01,407 అవును, కానీ నేను ఎప్పుడైనా అక్కడికి రాగలను. 102 00:04:01,408 --> 00:04:03,492 - మంచిది. నేను కూడా. - సరే. 103 00:04:03,493 --> 00:04:04,745 మరి ఈ రాత్రి సంగతి ఏంటి? 104 00:04:05,579 --> 00:04:06,580 ఛ. 105 00:04:07,080 --> 00:04:10,166 నాకు పెద్దగా పనేమీ లేదు, ఎప్పుడూ ఉండదు, 106 00:04:10,167 --> 00:04:12,877 కానీ దురదృష్టం కొద్దీ, ఈ రాత్రి మా నాన్న వస్తున్నాడు. 107 00:04:12,878 --> 00:04:16,130 సరే. అయినా అప్పుడే పేరెంట్స్ ని కలవడం కొంచెం తొందరపాటే అవుతుంది. 108 00:04:16,964 --> 00:04:20,134 నా ఉద్దేశం, నువ్వు ఇప్పటికే నా మాజీ భర్తనీ, మా అబ్బాయినీ కలుసుకున్నావు 109 00:04:20,135 --> 00:04:22,052 ఇంకా నా హౌస్ బ్రాని కొద్దిగా తాకావు, 110 00:04:22,053 --> 00:04:23,679 కాబట్టి మనం దాదాపుగా దగ్గరవుతున్నాం అనుకుంటా. 111 00:04:23,680 --> 00:04:25,933 విను, మనం త్వరగా దగ్గరవ్వడం గురించి నేనేమీ భయపడటం లేదు. 112 00:04:26,433 --> 00:04:27,434 మనం రూల్స్ ని బ్రేక్ చేసేవాళ్లం. 113 00:04:28,644 --> 00:04:29,770 గుడ్ మార్నింగ్, జిమ్మీ. 114 00:04:31,063 --> 00:04:32,897 గుడ్ మార్నింగ్, ఎవరో తెలియని భామ. 115 00:04:32,898 --> 00:04:35,149 పాల్, తను సోఫీ. 116 00:04:35,150 --> 00:04:36,902 సోఫీ, ఈయన పాల్, 117 00:04:37,486 --> 00:04:38,862 నా గురువు. 118 00:04:39,530 --> 00:04:42,198 హేయ్, ఈ వీకెండ్ చిన్న దెబ్బ తగిలింది. 119 00:04:42,199 --> 00:04:44,076 జూలీ నన్ను ఇది వాడమని ఇచ్చింది. 120 00:04:45,410 --> 00:04:47,913 సరే, మీరు కానివ్వండి, ఎంజాయ్ చేయండి. 121 00:04:48,413 --> 00:04:49,915 మీ ఫర్ కోట్ ని కారులోనే వదిలేశారా? 122 00:04:51,875 --> 00:04:53,877 నేను అలా ఎందుకు అన్నానో నాకే తెలియదు. నాకు మీరెవరో కూడా తెలియదు. 123 00:04:54,503 --> 00:04:55,628 తను నీకు సరైన జోడీ. 124 00:04:55,629 --> 00:04:58,130 దాన్ని ప్రశంసగా మీరు చెప్పడం లేదు, కదా? 125 00:04:58,131 --> 00:04:59,591 నేను అలా చెప్పడం లేదు. 126 00:05:00,217 --> 00:05:02,094 సరే, అయితే, నేను ఇంక బయలుదేరతాను. 127 00:05:03,470 --> 00:05:05,430 - నేను త్వరలోనే మళ్లీ నీతో మాట్లాడతాను. సరే. - సరే. 128 00:05:06,640 --> 00:05:07,683 మిమ్మల్ని కలవడం సంతోషం, పాల్. 129 00:05:08,267 --> 00:05:09,351 నిన్ను కలవడం సంతోషం. 130 00:05:11,562 --> 00:05:12,562 వావ్. 131 00:05:12,563 --> 00:05:13,730 ఓహ్, ఇంక ఆపు. 132 00:05:14,523 --> 00:05:17,984 - ఏంటి? - నిన్ను తిరిగి ప్రేమలో పడమని 133 00:05:17,985 --> 00:05:20,487 నా పెళ్లిలో నిన్ను ఎవరో ప్రోత్సహించినట్లు గుర్తు. 134 00:05:21,154 --> 00:05:24,241 అది ఎవరైనా కానీ, వాళ్ల వివేకంతో చెప్పిన సలహాకి నువ్వు థాంక్స్ చెబుతావు అనుకున్నాను. 135 00:05:25,409 --> 00:05:26,742 థాంక్యూ, పాల్. 136 00:05:26,743 --> 00:05:27,953 నిన్ను చూసి గర్వపడుతున్నాను. 137 00:05:29,037 --> 00:05:30,372 అలాగే ధైర్యంగా ఉండు. 138 00:05:32,583 --> 00:05:34,083 గ్యాబీ వచ్చిందా? 139 00:05:34,084 --> 00:05:35,918 తనకి ఇంకో వారం విశ్రాంతి కావాలని చెప్పింది. 140 00:05:35,919 --> 00:05:37,587 డామిట్. అది మంచిది కాదు. 141 00:05:37,588 --> 00:05:39,505 నీకు కావాలంటే నేను వెళ్లి తనతో మళ్లీ మాట్లాడతాను. 142 00:05:39,506 --> 00:05:42,259 వద్దు. నేనే ఆమె మనసు విరిచేశాను. నేనే సరి చేస్తాను. 143 00:05:43,218 --> 00:05:46,637 అవసరమైతే, నేను ఆమెని పనిలోకి ఈడ్చుకుని తీసుకొస్తాను. 144 00:05:46,638 --> 00:05:48,640 అది ఒక గురువు మాట్లాడినట్లు ఉంది. 145 00:05:49,308 --> 00:05:50,517 ఆవేశపడకు, బాబు. 146 00:05:58,859 --> 00:06:01,236 మీకేమయినా పాటలు కావాలా? నాకు ఒక క్వార్టరు ఇవ్వండి, నేను ఏ పాటయినా వాయిస్తాను. 147 00:06:01,862 --> 00:06:02,988 ఏ పాట కావాలో చెప్పండి చాలు. 148 00:06:05,157 --> 00:06:06,575 - హాయ్. - హేయ్. 149 00:06:07,868 --> 00:06:09,118 వావ్, హౌస్ ఫుల్ అయింది కదా, హా? 150 00:06:09,119 --> 00:06:11,704 అవును, చూడు, నాకు ఇంట్లో ఉండి బోరు కొడుతోంది. 151 00:06:11,705 --> 00:06:13,039 మీ నాన్న రావడం చూశాను, 152 00:06:13,040 --> 00:06:16,918 ఇంకా నువ్వు ఎప్పుడూ అంటూంటావు కదా, "మా ఇల్లే మీ ఇల్లు అనుకోండి" అని. 153 00:06:16,919 --> 00:06:18,336 నేను ఒక్కసారి కూడా ఆ మాట అనలేదు. 154 00:06:18,337 --> 00:06:20,129 - అయితే, నువ్వు అనాలి. - సరే. 155 00:06:20,130 --> 00:06:22,340 మీకు తెలుసా, జిమ్మీ పియానో వాయిస్తాడు. 156 00:06:22,341 --> 00:06:24,009 అవును, మా అందరికీ ఆ బాధ తెలుసు. 157 00:06:24,676 --> 00:06:26,719 దానికి నేను కొద్దిగా క్రెడిట్ తీసుకుంటాను. నేను, చూడండి... 158 00:06:26,720 --> 00:06:28,679 ఒకసారి నేను బిల్లీ జోల్ షోని చూడటానికి టికెట్లు తీసుకున్నాను. 159 00:06:28,680 --> 00:06:31,849 మా ఫ్రెండ్ రాలేకపోయాడు. అప్పుడు నేను, అంటే... "జిమ్మీని తీసుకువెళతాను" అనుకున్నాను. 160 00:06:31,850 --> 00:06:34,143 మర్నాడు స్కూలుకి వెళ్లాలి. అందుకే వాళ్ల అమ్మ ఒప్పుకోలేదు, 161 00:06:34,144 --> 00:06:36,270 కానీ లైవ్ మ్యూజిక్ లో ఉండే మజాని 162 00:06:36,271 --> 00:06:39,148 - వాడు ఆస్వాదించాలి అనుకున్నాను, అందుకే... - హా. 163 00:06:39,149 --> 00:06:42,985 వాడు ఎంతగా మైమరచిపోయాడో. తరువాత దాదాపు వారం రోజుల పాటు ఏదో మైకం కమ్మిన వాడిలా తిరిగాడు. 164 00:06:42,986 --> 00:06:44,779 నాకేం మైకం ఎక్కలేదు. 165 00:06:44,780 --> 00:06:45,863 నేను బెదిరిపోయాను. 166 00:06:45,864 --> 00:06:48,116 నా పక్కన నిలబడిన అరవై ఏళ్ల ఆవిడ 167 00:06:49,159 --> 00:06:51,410 తన ప్యాంటీలని చింపుకొని వాటిని స్టేజ్ మీదకి విసిరింది. 168 00:06:51,411 --> 00:06:54,830 ఒక ఏడేళ్ల పిల్లవాడు చూడకూడనివి నేను చూశాను. 169 00:06:54,831 --> 00:06:57,751 ఆ తర్వాత వాడిని పియానో క్లాసులో చేర్పించా, ఇక ఆ తరువాత జరిగింది అందరికీ తెలిసిందే. 170 00:06:58,335 --> 00:07:00,295 ఆమె పేరు వాలరీ షాన్బర్గర్. 171 00:07:00,921 --> 00:07:02,839 చూడండి, ఇది భలే కథ. 172 00:07:02,840 --> 00:07:04,675 నువ్వు మా నాన్న అయితే బాగుండేది. 173 00:07:05,259 --> 00:07:06,551 ఈ కథ వింటే నాకు ఒకటి గుర్తుకొస్తోంది. 174 00:07:06,552 --> 00:07:09,554 ఒకసారి, నేను ఎడ్ షరీన్ కంసర్ట్ లో నేను అతనికి రహస్యంగా పుట్టిన కూతుర్ని అని చెప్పి 175 00:07:09,555 --> 00:07:11,472 స్టేజ్ వెనుకకి వెళ్లడానికి ప్రయత్నించాను. 176 00:07:11,473 --> 00:07:13,933 కానీ చూడబోతే ఎర్ర జుట్టు ఉన్న చాలామంది అలా చెబుతున్నారని 177 00:07:13,934 --> 00:07:16,728 ఎడ్ షరీన్ తో పాటు పితృత్వ పరీక్షలు చేయడానికి ఒక మనిషి అతనితో పాటు ట్రావెల్ చేస్తుంటాడట. 178 00:07:18,146 --> 00:07:19,147 ఎవరికైనా కాఫీ కావాలా? 179 00:07:49,678 --> 00:07:51,470 {\an8}రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? 180 00:07:51,471 --> 00:07:54,140 {\an8}నేను ఒక కొత్త కారు తీసుకుని కొద్దిగా మార్పులు చేయించుకోవాలి. 181 00:07:54,141 --> 00:07:57,518 {\an8}మనం ఆ కారు పనులు చూసుకుంటూ, మ్యూజిక్ వింటూ రోజంతా గడపవచ్చని అనుకున్నాను. 182 00:07:57,519 --> 00:07:59,478 {\an8}ఫ్రీగా పని చేసిపెట్టడం సరదాగానే ఉంటుంది, 183 00:07:59,479 --> 00:08:02,148 {\an8}కానీ వాస్తవంగా ఆలీస్ హాస్టల్ రూమ్ కోసం రేపు కొన్ని సామాన్లు కొనాల్సి ఉంది. 184 00:08:02,149 --> 00:08:03,816 {\an8}కానీ, వాటిని మనం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. 185 00:08:03,817 --> 00:08:05,568 {\an8}నాకు తాతయ్యతో కలిసి కారు పని చూడాలని ఉంది. 186 00:08:05,569 --> 00:08:08,906 {\an8}మన్నించాలి. "కారు పని" మీద నీకు ఉన్న ఆసక్తి గురించి నేను మర్చిపోయాను. 187 00:08:09,907 --> 00:08:11,449 {\an8}సరే, అయితే, మీ ఇద్దరూ ఆ పని చూసుకోండి. 188 00:08:11,450 --> 00:08:13,784 {\an8}నేను పూర్తి చేసుకోవలసిన పనులు చాలా ఉన్నాయి, కాబట్టి... 189 00:08:13,785 --> 00:08:16,996 {\an8}మంచిది. అయితే, నేను త్వరగా పడుకుంటాను. 190 00:08:16,997 --> 00:08:20,541 {\an8}స్టీలీ డాన్ పాట వాయించమని పది డాలర్లు ఇచ్చి డెరెక్ నన్ను అలసిపోయేలా చేశాడు. 191 00:08:20,542 --> 00:08:23,544 {\an8}- అతను సరదాగా ఉంటాడు. - నీతో అతను కూడా చాలా సరదాగా గడిపాడు, నాన్నా. 192 00:08:23,545 --> 00:08:25,546 {\an8}సరే, వెళ్లి విశ్రాంతి తీసుకో. 193 00:08:25,547 --> 00:08:27,508 {\an8}- బై, తాతయ్య. - కాసేపట్లో మళ్లీ కలుద్దాం. 194 00:08:29,218 --> 00:08:30,302 {\an8}నాకు ఏది విచిత్రంగా అనిపిస్తోందో తెలుసా? 195 00:08:31,428 --> 00:08:33,638 {\an8}మిగతా వాళ్లు ఆయనని ఇష్టపడటం నీకు నచ్చదు. 196 00:08:33,639 --> 00:08:35,807 {\an8}ఏంటి? కాదు. ఇలా చూడు. 197 00:08:36,808 --> 00:08:38,184 {\an8}సరే, కొద్దిగా నచ్చదేమో. 198 00:08:39,269 --> 00:08:40,354 {\an8}చూడు, బుజ్జీ. 199 00:08:43,524 --> 00:08:44,525 {\an8}తాతయ్య అందరినీ ఆకట్టుకోగలడు. 200 00:08:45,734 --> 00:08:47,693 {\an8}దాని అర్థం, జనం ఆయనలోని ఒక కోణాన్ని మాత్రమే చూడగలరు. 201 00:08:47,694 --> 00:08:49,654 {\an8}చూడు, నాన్నా, ఇది నేను గ్రాడ్యుయేషన్ లో చేరే వారం 202 00:08:49,655 --> 00:08:51,030 {\an8}ఇంకా నాకు ఉన్నది మీరు ఇద్దరే, 203 00:08:51,031 --> 00:08:52,533 {\an8}కాబట్టి మీరిద్దరూ కలిసి ఉండటమే నాకు కావాలి. 204 00:08:53,116 --> 00:08:54,283 {\an8}మాతో పాటు ఆ కారు పనికి నువ్వు కూడా రా, 205 00:08:54,284 --> 00:08:57,245 {\an8}ఆయనతో, నాతో కాస్త సరదాగా గడుపు, ప్లీజ్. 206 00:08:57,246 --> 00:08:58,412 {\an8}నీ కోసం ఏదైనా చేస్తాను. 207 00:08:58,413 --> 00:08:59,623 {\an8}- థాంక్యూ. - సరే. 208 00:09:01,834 --> 00:09:04,293 {\an8}నా డోర్మ్ రూమ్ కోసం నువ్వు వస్తువులు కొంటావు, కదూ? 209 00:09:04,294 --> 00:09:06,587 {\an8}తాతయ్య ప్రేమ ఉండగా మెరిసే లైట్లు ఇంకా బీన్ బ్యాగ్ కుర్చీ 210 00:09:06,588 --> 00:09:08,006 {\an8}ఎవరికి కావాలి? 211 00:09:08,507 --> 00:09:09,716 {\an8}డామిట్. 212 00:09:10,717 --> 00:09:14,387 {\an8}చూడు, నువ్వు ఇంటికి రావడాన్ని నేను మెచ్చుకుంటాను, కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు ముందే తెలుసు. 213 00:09:14,388 --> 00:09:16,681 {\an8}ఓహ్, మంచిది. అయితే, నిన్ను రేపు కలుస్తాను. 214 00:09:16,682 --> 00:09:17,766 {\an8}మంచి ప్రయత్నం. 215 00:09:18,559 --> 00:09:19,725 {\an8}చూడు, నా మనసులో నేనేం ఆలోచిస్తున్నానో 216 00:09:19,726 --> 00:09:21,645 {\an8}- నీకు ఎలా తెలియజేయాలి? - నాకు చెప్పు చాలు. 217 00:09:23,105 --> 00:09:25,983 {\an8}చూడు, ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలని నేను చాలా కలలు కన్నాను. 218 00:09:26,567 --> 00:09:28,693 {\an8}కాబట్టి ఇప్పుడు, చేసిన పనే చేయాలనే ఆలోచన వస్తేనే 219 00:09:28,694 --> 00:09:29,986 {\an8}నేను వెనక్కి పోతున్నానేమో అనిపిస్తోంది, 220 00:09:29,987 --> 00:09:31,571 {\an8}ఇంకా దాని వల్ల నాకు చాలా డిప్రెషన్ వస్తోంది, 221 00:09:31,572 --> 00:09:32,822 {\an8}దాన్ని నేను ఎంత అణచుకున్నా సరే. 222 00:09:32,823 --> 00:09:35,324 {\an8}- నువ్వు దాన్ని అణచివేయగలవు. - థాంక్యూ. 223 00:09:35,325 --> 00:09:38,119 {\an8}నేను ఏదో దీవిలో ఇరుక్కుపోయినట్లు 224 00:09:38,120 --> 00:09:40,455 {\an8}అదేదో సినిమాలో వాలీ బాల్ తో పాటు టామ్ హాంక్స్ ఇరుక్కుపోయిన మాదిరిగా అనిపిస్తోంది. 225 00:09:41,039 --> 00:09:42,415 {\an8}అలా జరిగిందంటే నేను నమ్మను. 226 00:09:42,416 --> 00:09:45,084 {\an8}ఏంటి? అతను రెండేళ్ల పాటు ఆ దీవిలో ఉండిపోతాడు. ఆ వాలీబాల్ తో అతను ఇంకేమి చేస్తాడు? 227 00:09:45,085 --> 00:09:46,752 {\an8}అంటే, అతను ఆ వాలీ బాల్ తో ఏదీ చేయలేదని నేను చెప్పలేదు. 228 00:09:46,753 --> 00:09:49,506 {\an8}అతను ఇంకా విల్సన్ అనే ఆ వాలీబాల్... 229 00:09:50,090 --> 00:09:51,424 {\an8}ఫ్రెండ్స్ అని మాత్రమే అంటున్నాను. 230 00:09:51,425 --> 00:09:56,847 {\an8}చూడు, మనం ఎందులో అయినా రాణిస్తున్నామంటే అది వెనక్కి వెళుతున్నట్లు కాదు. 231 00:10:00,017 --> 00:10:03,103 {\an8}ఆఫీసులో ఇదే నా ఆఖరి వారం. 232 00:10:04,313 --> 00:10:05,314 ఎప్పటికీ. 233 00:10:07,149 --> 00:10:09,443 నీకు గనుక ఆఫీసుకి తిరిగి రావడం ఇష్టం లేకపోతే... 234 00:10:13,113 --> 00:10:14,239 నా కోసం రా. 235 00:10:15,157 --> 00:10:18,034 ఇంకా అది... అది నీ వల్ల కాకపోతే, నెల రోజుల్లోనే నువ్వు ఆఫీసు మానేస్తే, 236 00:10:18,035 --> 00:10:22,289 కనెక్టికట్ లో నా బోటులో నన్ను కలుసుకుని నా ముఖం మీద నీ అభిప్రాయం చెప్పు. 237 00:10:24,625 --> 00:10:27,084 - సరే. - సరే. 238 00:10:27,085 --> 00:10:28,754 కానీ నేను ఎప్పటికీ కనెక్టికట్ కి రాను. 239 00:10:29,254 --> 00:10:31,173 ఆ ప్రదేశం తెల్ల జాతీయులు ఇంకా బోట్ షూస్ ఎక్కువగా ఉండే ప్రాంతం. 240 00:10:32,049 --> 00:10:33,800 మా సంస్కృతిని ఎగతాళి చేయకు. 241 00:10:39,181 --> 00:10:40,432 హేయ్, మిత్రమా. 242 00:10:41,600 --> 00:10:42,892 నీ కొత్త ఉద్యోగం గురించి విన్నాను. 243 00:10:42,893 --> 00:10:43,976 కంగ్రాట్స్. 244 00:10:43,977 --> 00:10:45,645 అవును, థాంక్స్, డీ. 245 00:10:45,646 --> 00:10:48,022 నువ్వు కూడా నాతో పాటు ఎగ్జయిట్ కావచ్చు. నా గుండె దాన్నితట్టుకోగలదు. 246 00:10:48,023 --> 00:10:51,443 వేరే విషయాలలో ఎగ్జయిట్ కావడానికి నాకు అనుమతి లేదు. 247 00:10:51,944 --> 00:10:52,944 శృంగారపరంగా. 248 00:10:52,945 --> 00:10:54,278 నాకు అర్థమైంది. 249 00:10:54,279 --> 00:10:55,906 మన పొరుగులో మొత్తం అందరికీ తెలుసు. 250 00:10:58,450 --> 00:10:59,743 నేనే ఇంకా ఆలోచిస్తున్నాను. 251 00:11:00,244 --> 00:11:01,703 సరే, మనం దాని గురించి మాట్లాడుకుందాం. 252 00:11:02,371 --> 00:11:04,498 నువ్వు పైకి ఇక్కడికి వస్తావా, లేదా నన్నే కిందకి రమ్మంటావా? 253 00:11:05,082 --> 00:11:06,290 నిజంగానే అంటున్నావా? 254 00:11:06,291 --> 00:11:08,751 బాబూ, ఈ వ్యూ చాలా గొప్పగా ఉంది. 255 00:11:08,752 --> 00:11:11,879 - హేయ్, డెక్ మీద నుంచి మూత్రం పోయాలని ఉందా? - ఖచ్చితంగా. 256 00:11:11,880 --> 00:11:14,257 ఖచ్చితంగా కుదరదు. 257 00:11:14,258 --> 00:11:18,303 మూత్రం కోసం ఇక్కడికి ఎవరినైనా ఆహ్వానించడం ఆపు. 258 00:11:18,971 --> 00:11:20,429 సరే. మళ్లీసారి చూద్దాం. 259 00:11:20,430 --> 00:11:22,223 లేదు. మళ్లీసారి కూడా లేదు. 260 00:11:22,224 --> 00:11:23,724 మళ్లీసారి. 261 00:11:23,725 --> 00:11:26,436 అయితే, నువ్వు దేని గురించి ఆందోళన పడుతున్నావు? 262 00:11:28,272 --> 00:11:30,022 నేను ఈ ఉద్యోగం చేయగలనని అనుకోవడం లేదు. 263 00:11:30,023 --> 00:11:31,190 నేను జోక్యం చేసుకోవచ్చా? 264 00:11:31,191 --> 00:11:34,068 కొన్ని షరతులతో. దాని వల్ల నీ మీద నేను మళ్లీ కోప్పడే అవకాశం ఉంటుందా? 265 00:11:34,069 --> 00:11:36,237 ఖచ్చితంగా అలాంటి అవకాశాలు ఉంటాయి. 266 00:11:36,238 --> 00:11:37,573 అయితే వదిలేయ్. 267 00:11:38,574 --> 00:11:40,033 ఇది నీ కలల ఉద్యోగం అనుకున్నానే. 268 00:11:40,951 --> 00:11:43,871 మనం సిద్ధంగా ఉన్నప్పుడు విశ్వం మనకి చెబుతుందని నీకు ఒకసారి చెప్పాను గుర్తుందా? 269 00:11:44,538 --> 00:11:46,747 ఇప్పుడు, నువ్వు చాలా సిద్ధంగా ఉన్నావు. 270 00:11:46,748 --> 00:11:51,420 విశ్వం నిన్ను వెన్నలో ముంచి మసాలాలు అద్దుతోంది. 271 00:11:52,546 --> 00:11:55,173 హోర్హే విషయంలో నేను ఎంత గందరగోళంలో ఉన్నానో నీకు తెలియదు. 272 00:11:55,174 --> 00:11:58,176 - మనం వేరే వాళ్లకి చెప్పలేని విషయాలు. - అవును. 273 00:11:58,177 --> 00:11:59,761 నా ట్రక్కు వెళ్లిపోతుంది... 274 00:12:01,471 --> 00:12:02,472 అతనికి వేరే ఉపాధి లేదు. 275 00:12:03,056 --> 00:12:04,349 నువ్వు ఒక మంచి మిత్రుడివి, షాన్, 276 00:12:04,933 --> 00:12:06,142 కానీ జీవితంలో ఈ ఒక్కసారికి, 277 00:12:06,143 --> 00:12:08,145 నీ కోసం నువ్వు ముందు ఆలోచించుకోవాలి. 278 00:12:08,729 --> 00:12:11,147 - అది... అది నాకు చాలా కష్టం, బాబు. - లేదు, నాకు అర్థమైంది. 279 00:12:11,148 --> 00:12:13,942 నేను కూడా స్వార్థంతో ఏదీ ఆలోచించలేను. 280 00:12:15,819 --> 00:12:17,863 మనకి ఒక నిపుణుడి నుంచి మంచి సలహా అవసరం. 281 00:12:19,406 --> 00:12:22,033 నాకు ఇంత సంతోషం కలిగించినందుకు మీ రుణం ఎలా తీర్చుకోగలను? 282 00:12:22,034 --> 00:12:23,118 చెప్పాను కదా. 283 00:12:24,953 --> 00:12:26,913 సస్పెన్షన్ కాస్త వదులుగా ఉంది. 284 00:12:26,914 --> 00:12:29,582 ఆలీస్, ఆ గేర్ రెంచ్ ఫ్లెక్స్ సాకెట్ ని ఇలా అందుకో. 285 00:12:29,583 --> 00:12:31,000 అదేంటో నాకు తెలియదు. 286 00:12:31,001 --> 00:12:33,629 ఓహ్, హంచ్ బ్యాక్ తో ఉండే ఫ్లాష్ లైట్ మాదిరిగా ఉంటుంది, అదే కదా. 287 00:12:34,213 --> 00:12:37,840 తను తెలివైనది ఇంకా టూల్ బాక్స్ గురించి ఆమెకి మంచి అవగాహన ఉంది. అదృష్టవంతుడివి. 288 00:12:37,841 --> 00:12:39,592 నా ఉద్దేశం, నాకు కూడా వాటి గురించి తెలుసు, నాన్నా. 289 00:12:39,593 --> 00:12:41,552 ఓహ్, నీకు వాటి గురించి తెలుసా, హా? 290 00:12:41,553 --> 00:12:42,637 - అవును. - సరే. 291 00:12:42,638 --> 00:12:45,098 ఆ హూలా అమ్మాయి కథ ఏంటి? 292 00:12:45,682 --> 00:12:47,726 ఆమె పేరు లూనా. తను హవాయ్ లో పుట్టింది. 293 00:12:48,227 --> 00:12:50,520 ఆమెకి ఒక కల ఉండేది, హూలా డాన్స్ చేయాలని, 294 00:12:50,521 --> 00:12:51,855 కానీ ఆమె ఫెయిల్ అయింది. 295 00:12:52,356 --> 00:12:53,648 ఎందుకంటే తను చాలా పొట్టిగా ఉండేది. 296 00:12:53,649 --> 00:12:55,566 దేవుడా, నేను ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నాను? 297 00:12:55,567 --> 00:12:57,276 అవును, అది పూర్తిగా ఎదిగిన ఆడవారి ఆట. 298 00:12:57,277 --> 00:12:58,528 మనం వాళ్లని పట్టించుకోకుండా ఉంటే 299 00:12:58,529 --> 00:12:59,821 వాళ్లే ఆపేస్తారు. 300 00:13:00,531 --> 00:13:03,032 ఇది ప్రత్యేకమైన కారు, తాతయ్య. ఇది ఏ సంవత్సరానిది? 301 00:13:03,033 --> 00:13:04,868 లేదా వీడు? దీనికి ఏమైనా పేరు పెట్టావా? 302 00:13:05,452 --> 00:13:07,578 శాలీ ఆడ కారు, 1989 మోడల్. 303 00:13:07,579 --> 00:13:08,955 అది ఎంత గొప్ప సంవత్సరమో. 304 00:13:08,956 --> 00:13:10,706 ఆ ఏడాది నా మొదటి డీలర్షిప్ ని ప్రారంభించాను. 305 00:13:10,707 --> 00:13:12,334 అదే ఏడాది బెర్లిన్ వాల్ కూలిపోయింది. 306 00:13:12,918 --> 00:13:15,963 అలాగే, అదే ఏడాది జిమ్మీ మొదటిసారి హోమ్ రన్ కొట్టి 307 00:13:16,463 --> 00:13:20,174 తన టీమ్ కోసం లిటిల్ లీగ్ చాంపియన్షిప్ టైటిల్ గెల్చుకున్నాడు, 308 00:13:20,175 --> 00:13:21,300 - అది బ్యాడ్జర్స్ టీమ్. - అవును. 309 00:13:21,301 --> 00:13:22,636 సరే, నాన్నా. 310 00:13:23,303 --> 00:13:25,763 వీడిని హోమ్ ప్లేట్ దగ్గర కలుసుకున్నాం. మేము ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామంటే 311 00:13:25,764 --> 00:13:29,433 తన పాల పళ్లలో ఒకటి విరిగి ఊడిపోయి 312 00:13:29,434 --> 00:13:32,645 సరిగ్గా నా షర్ట్ పాకెట్ లో పడే వరకూ, వీడు తెలుసుకోలేకపోయాడు. 313 00:13:32,646 --> 00:13:33,938 అయ్యో. 314 00:13:33,939 --> 00:13:37,233 ఆ రాత్రి వాళ్ల అమ్మ దుస్తులు ఉతుకుతుంటే ఆమెకి దాదాపు గుండెపోటు వచ్చినంత పనైంది. 315 00:13:37,234 --> 00:13:41,112 దేవుడా, నా భర్త జేబులో రక్తంతో ఉన్న పన్ను ఏదైనా నాకు దొరికితే, 316 00:13:41,113 --> 00:13:43,406 అతను ఒక సీరియల్ కిల్లర్ అనుకునే దాన్ని. 317 00:13:43,407 --> 00:13:45,741 తను కూడా సరదాగానే ఉంది. ఈమె నీకు మంచి జోడీ అనుకుంటా. 318 00:13:45,742 --> 00:13:46,909 మీరు కూడా. 319 00:13:46,910 --> 00:13:49,580 నా ఉద్దేశం, నాకు జోడీ అని కాదు. వేరే వాళ్లకి మంచి జోడీ అని. 320 00:13:50,330 --> 00:13:52,164 కొన్నిసార్లు, థాంక్స్ చెబితే సరిపోతుంది. 321 00:13:52,165 --> 00:13:53,250 థాంక్స్. 322 00:13:54,293 --> 00:13:56,085 సరే, నేను వెళ్లి మనకి మంచి నీళ్లు తీసుకొస్తాను. 323 00:13:56,086 --> 00:13:57,212 మంచిది. 324 00:13:59,047 --> 00:14:00,047 పద, బుజ్జీ. 325 00:14:00,048 --> 00:14:02,509 మనం కొన్ని వదులుగా ఉన్న స్క్రూలని బిగిద్దాం. 326 00:14:10,100 --> 00:14:11,392 నువ్వు నిజంగానే నీళ్లు పడుతున్నావు. 327 00:14:11,393 --> 00:14:12,810 వాళ్లని పని చేసుకోనివ్వడానికి 328 00:14:12,811 --> 00:14:14,354 నువ్వు ఏదో కోడ్ భాష వాడావని అనుకున్నాను. 329 00:14:16,815 --> 00:14:17,816 ఆయన నాకు నచ్చాడు. 330 00:14:18,400 --> 00:14:19,735 అవును, ఆయన అందరికీ నచ్చుతాడు. 331 00:14:20,819 --> 00:14:21,819 సారీ, అది కేవలం... 332 00:14:21,820 --> 00:14:25,490 నా చిన్నతనం గురించి గొప్ప కథలు నిజంగా జరిగినట్లు నమ్మించేలా చెప్పడం... 333 00:14:26,408 --> 00:14:27,533 ఆయనకు చాలా ఇష్టం. 334 00:14:27,534 --> 00:14:30,536 అయితే, చాంపియన్షిప్ గెలవడానికి నువ్వు హోమ్ రన్ కొట్టలేదా? 335 00:14:30,537 --> 00:14:32,289 ఓహ్, లేదు, నేను కొట్టాను. అది చాలా గొప్పగా ఉండింది. 336 00:14:34,082 --> 00:14:37,336 లేదు, ఆయన అక్కడ ఉండటం అనేది, అంటే, పూర్తిగా యాదృచ్ఛికం. 337 00:14:38,962 --> 00:14:41,173 చూడు, మా నాన్న మా దగ్గర ఉంటే, అంతా బాగుండేది. 338 00:14:43,008 --> 00:14:44,718 ఆయన ఎప్పుడూ ఇంకేదో చేయాలి అన్నట్లుగా 339 00:14:46,178 --> 00:14:47,846 వ్యవహరిస్తూ ఉండేవాడు. 340 00:14:49,556 --> 00:14:52,350 కానీ తరువాత టియా చనిపోయాక, ఆయన అంత్యక్రియలకి వచ్చాడు, 341 00:14:52,351 --> 00:14:53,936 అప్పుడు ఆయన పెద్ద ప్రసంగం చేశాడు, 342 00:14:54,686 --> 00:14:58,481 నన్ను, ఆలీస్ ని చూసుకోవడం తనకి ఎంత ముఖ్యమో చెప్పాడు 343 00:14:58,482 --> 00:15:00,275 ఇంకా ఎప్పుడూ మాకు అండగా ఉంటానని చెప్పాడు. 344 00:15:00,776 --> 00:15:03,694 కానీ తరువాత ఏం అయిందో నాకు తెలియదు. ఏదో, అంటే, గొప్ప పని చేయాల్సి వచ్చిందో ఏమో 345 00:15:03,695 --> 00:15:05,571 రెండేళ్ల పాటు ఆయన మాకు మళ్లీ కనిపించలేదు. 346 00:15:05,572 --> 00:15:07,324 - ఓరి బాబోయ్. - కదా? 347 00:15:07,908 --> 00:15:11,410 తండ్రితో సమస్యలు ఉన్న 42 ఏళ్ల థెరపిస్టువి నువ్వు. 348 00:15:11,411 --> 00:15:12,787 చెత్త. 349 00:15:12,788 --> 00:15:13,997 చూడు, నాకు అర్థమైంది. 350 00:15:14,831 --> 00:15:16,624 మీ నాన్న నిన్ను సరిగ్గా చూసుకోలేదు. 351 00:15:16,625 --> 00:15:18,918 సరే, నీకు ఇది పనికొస్తుందేమో, ఈ ఉదయం మా అమ్మ నాకు మెసేజ్ పంపింది 352 00:15:18,919 --> 00:15:20,920 నా హెయిర్ కట్ కేవలం వయసు తక్కువ అమ్మాయిలకే బాగుంటుందని చెప్పింది. 353 00:15:20,921 --> 00:15:22,255 ఓహ్, చెత్త. 354 00:15:22,256 --> 00:15:25,175 కానీ నువ్వు పెద్ద వాడివి, జిమ్మీ, ఇంకా చాలా గొప్పవాడివి. 355 00:15:26,718 --> 00:15:28,720 అయితే మీ నాన్న ఒక మంచి పని చేశాడు. 356 00:15:29,346 --> 00:15:32,598 పైగా, ఆలీస్ గ్రాడ్యుయేషన్ కి వెళుతోంది, దాన్ని ఆస్వాదించాలి అనుకుంటున్నావని నాకు తెలుసు, 357 00:15:32,599 --> 00:15:35,561 కాబట్టి గతాన్ని మర్చిపోయి మామూలుగా ఉండటానికి ప్రయత్నించు. 358 00:15:36,478 --> 00:15:37,562 ఎవరికి తెలుసు? 359 00:15:37,563 --> 00:15:39,730 చూడు, ఆయన నిన్ను సర్ ప్రైజ్ చేయచ్చు. 360 00:15:39,731 --> 00:15:43,359 అంటే, చూడు, ఆలీస్ గ్రాడ్యుయేషన్ కోసం వచ్చి ఇప్పటికే ఆయన నన్ను సర్ ప్రైజ్ చేశాడు. 361 00:15:43,360 --> 00:15:45,112 అవును, సరే. 362 00:15:46,488 --> 00:15:47,489 నేను చెప్పడం మర్చిపోయాను. 363 00:15:48,824 --> 00:15:50,658 - నీ హెయిర్ కట్ చక్కగా ఉంది. - హమ్మయ్య. 364 00:15:50,659 --> 00:15:52,369 మనం దాదాపు దగ్గరయ్యాం. 365 00:15:52,953 --> 00:15:55,496 నువ్వు చెప్పింది విన్నాను, లీసా. కోపంలో మెసేజ్ పెట్టి తరువాత పశ్చాత్తాపపడని వారు ఎవరుంటారు? 366 00:15:55,497 --> 00:15:57,498 నాతో పాటు డేటింగ్ కి వచ్చిన ఒక కుర్రవాడికి నేను ఒకసారి మెసేజ్ పెట్టాను, 367 00:15:57,499 --> 00:15:58,875 "పోరా, బక్కపల్చని బట్టతల వెధవ. 368 00:15:58,876 --> 00:16:00,418 నువ్వు స్లెండర్ మ్యాన్ మాదిరిగా ఉంటావు కదా." 369 00:16:00,419 --> 00:16:01,586 అవును. 370 00:16:01,587 --> 00:16:03,338 నేను పొరపాటున టిజిఐ ఫ్రైడేస్ రెస్టారెంట్ కి వెళ్లానా? 371 00:16:03,839 --> 00:16:05,007 అది కూడా, నిజం. 372 00:16:05,924 --> 00:16:07,258 కీలకమైన విషయం ఏమిటంటే 373 00:16:07,259 --> 00:16:09,510 మనకి అసౌకర్యం కలిగించే మనుషులతో కూడా కూర్చోగలిగే స్థయిర్యం ఉండాలి, సరేనా? 374 00:16:09,511 --> 00:16:11,471 కానీ ఆవేశంలో మనం పరుషంగా మాట్లాడకూడదు. 375 00:16:12,055 --> 00:16:13,514 ఈలోగా కావాలంటే, నీ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది. 376 00:16:13,515 --> 00:16:16,475 నీకు కోపంగా ఏదైనా అనాలనే ఆలోచన వస్తే, నువ్వు ఆ కోపంగా పెట్టే మెసేజులన్నీ నాకు పంపించు. 377 00:16:16,476 --> 00:16:19,145 "ఇది గ్యాబీ గురించి కాదు" అని మొదలుపెట్టు అప్పుడు నేను తిరిగి నిన్ను తిట్టకుండా ఉంటాను, 378 00:16:19,146 --> 00:16:21,314 - సరేనా? - అలాగే, పెడతాను. థాంక్స్. 379 00:16:21,315 --> 00:16:23,692 నువ్వు తిరిగి రావడం నిజంగా సంతోషంగా ఉంది. 380 00:16:24,568 --> 00:16:25,652 తిరిగి రావడం నాకూ సంతోషంగానే ఉంది. 381 00:16:29,489 --> 00:16:31,490 చాలా ఆలస్యమైంది. నేను అది చూశాను. 382 00:16:31,491 --> 00:16:33,326 సరే, ఫర్వాలేదు. అవును, 383 00:16:33,327 --> 00:16:36,412 నేను రాక్ స్టార్ ని, సరే. థెరపిస్టులకి మౌంట్ రష్మోర్ గనుక ఉండి ఉంటే, 384 00:16:36,413 --> 00:16:39,498 ఫ్రాయడ్, జంగ్, చార్లీ బ్రౌన్ లో లూసీ ఇంకా నేను ఆ కొండ మీద ఉంటాం. 385 00:16:39,499 --> 00:16:41,959 నేను చెప్పినట్లు, ఒక్క మాట చెప్పు. 386 00:16:41,960 --> 00:16:43,419 ఇదంతా నీ సొంతం అవుతుంది. 387 00:16:43,420 --> 00:16:44,755 అది ఎలా ఉండబోతోంది? 388 00:16:45,923 --> 00:16:47,089 నీ డెస్క్ నాకు ఇస్తావా? 389 00:16:47,090 --> 00:16:48,174 నీ ఆఫీసు? 390 00:16:48,175 --> 00:16:49,258 జూలీ? 391 00:16:49,259 --> 00:16:51,802 ఎందుకంటే అదే నిజమైతే మాత్రం, నేను రోజంతా నా కాళ్ళకి నూనె రాసుకుని 392 00:16:51,803 --> 00:16:54,431 వాటిని ఒక జారుడు బల్లలా వాడేస్తాను, అర్థమైందా? 393 00:16:55,349 --> 00:16:56,432 - కంగారుపడకు. - కూర్చో. 394 00:16:56,433 --> 00:16:57,851 సరే. 395 00:16:58,810 --> 00:17:00,521 నేను అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువగా వర్ణించాను. 396 00:17:02,356 --> 00:17:04,650 నేను ఈ వృత్తిలో నా జీవితమంతా గడిపాను. 397 00:17:05,358 --> 00:17:07,694 నేర్చుకుంటూ, మెరుగుపర్చుకుంటూ గడిపాను. 398 00:17:08,278 --> 00:17:10,531 ఎందుకంటే అది మనుషులకి ఎలా ఉపయోగపడుతుందో నేను చూశాను, 399 00:17:11,240 --> 00:17:13,991 ఇంకా కొద్ది సంవత్సరాలుగా నీకు గురువుగా ఉన్నానని 400 00:17:13,992 --> 00:17:17,870 నువ్వు చెప్పిన దాని గురించి కూడా నేను ఆలోచించాను. 401 00:17:17,871 --> 00:17:19,038 అవునా? 402 00:17:19,039 --> 00:17:23,961 నాకు ఉన్న విజ్ఞానాన్ని నీకు అందించాక దాన్ని నువ్వు ముందుకు తీసుకువెళితే 403 00:17:24,711 --> 00:17:28,257 నాకు అంతకన్నా కావాల్సింది ఏమీ ఉండదు. 404 00:17:30,759 --> 00:17:31,843 దాని వల్ల నాకేమి లాభం? 405 00:17:31,844 --> 00:17:36,138 నా విజ్ఞానాన్ని నీకు అందిస్తే... దాని వల్ల నీకేం లాభం అంటావా? 406 00:17:36,139 --> 00:17:37,473 నీకు నువ్వే వలలో పడ్డావు. 407 00:17:37,474 --> 00:17:38,766 ఇది జరగాలని నువ్వే బాగా కోరుకున్నావు. 408 00:17:38,767 --> 00:17:39,852 మంచిది. 409 00:17:40,352 --> 00:17:41,353 నీ షరతులు ఏంటి? 410 00:17:41,979 --> 00:17:43,479 నువ్వు నా షెడ్యూలు ప్రకారం పని చేయాలి. 411 00:17:43,480 --> 00:17:44,897 - నాకు మంచి ఐడియాస్ వస్తాయని... - సరే. 412 00:17:44,898 --> 00:17:45,982 ...నువ్వు అప్పుడప్పుడు ఒప్పుకోవాలి, 413 00:17:45,983 --> 00:17:49,110 ఇంకా ఖరీదైన సుషీ విందుకి నువ్వు నన్ను తీసుకువెళ్లాలి. 414 00:17:49,111 --> 00:17:50,736 ఆ స్పైసీ ట్యూనా వంటకాలు ఏవీ నాకు తినిపించకూడదు. 415 00:17:50,737 --> 00:17:52,822 చచ్చేంత ప్రమాదకరమైన బ్లోఫిష్ లాంటి షరతులు కదా. 416 00:17:52,823 --> 00:17:55,950 రెండు షరతులతో నేను ఒప్పుకుంటాను. 417 00:17:55,951 --> 00:17:59,204 ఈ ఒక్క సారికి నన్ను ప్రశాంతంగా ఈ సారా తాగనివ్వు, వెళ్లి నా మీద చాడీలు చెప్పకు. 418 00:17:59,705 --> 00:18:00,955 ఇంక రెండోది, 419 00:18:00,956 --> 00:18:03,833 నీ థెరపిస్టుల మౌంట్ రష్మోర్ మీద 420 00:18:03,834 --> 00:18:05,210 ఫ్రాయడ్ బదులు నువ్వు నన్ను పెట్టాలి. 421 00:18:07,713 --> 00:18:08,714 డీల్. 422 00:18:11,091 --> 00:18:13,134 సరే, ఇది సరదాగా ఉంది ఎందుకంటే నేను టెడ్ టాక్ చేయగలనని 423 00:18:13,135 --> 00:18:16,638 ఇంకా నా స్పీచ్ తో అదరగొట్టేస్తానని నా ఫ్రెండ్స్ కొందరితో నేను పందెం కాశాను, 424 00:18:17,139 --> 00:18:20,517 అది నేను చెప్పడానికి అనుమతి ఉంది ఎందుకంటే నేను పెద్ద వయస్కుడిని కాను కాబట్టి. 425 00:18:22,102 --> 00:18:23,145 సరే, ఇంక మొదలుపెడదాం. 426 00:18:27,566 --> 00:18:28,567 స్వార్థం. 427 00:18:29,276 --> 00:18:32,529 నేను, బ్రయాన్ లొరెంజో, ఒక స్వార్థపరుడిని. 428 00:18:33,447 --> 00:18:34,698 స్వార్థపరులైన మనుషులు 429 00:18:36,408 --> 00:18:37,783 విజేతలుగా నిలుస్తారు. 430 00:18:37,784 --> 00:18:40,537 మన కోసం మనం ఎన్నిసార్లు ఆలోచించుకున్నాము, 431 00:18:41,205 --> 00:18:44,290 "నాకు నిజంగా కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నిస్తే ఎంత బాగుండేదో! 432 00:18:44,291 --> 00:18:48,002 కానీ, నా ముందున్న ఈ అందమైన యంగ్ గే అబ్బాయిలా నేను కాదు, 433 00:18:48,003 --> 00:18:51,672 నేను మంచివాడిని కావాలి, 434 00:18:51,673 --> 00:18:53,799 'వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి' అనే బరువులు మోస్తున్నాను, 435 00:18:53,800 --> 00:18:56,802 అందుకే, ఒకవేళ ఏంజెలా అనే అమ్మాయి ఆర్డర్ నా ఆర్డర్ లాగే ఉన్నా 436 00:18:56,803 --> 00:18:59,890 నాకు వెళ్ళాలని తొందరగా ఉన్నా కూడా తన కాఫీని నేను దొంగిలించలేకపోతున్నాను." 437 00:19:00,682 --> 00:19:01,683 న్యూస్ ఫ్లాష్. 438 00:19:02,267 --> 00:19:05,646 మనమంతా స్వార్థపరులమే. 439 00:19:07,481 --> 00:19:11,318 - అవును. - ఆఖరికి మదర్ థెరెస్సా కూడా స్వార్థపరురాలే. 440 00:19:11,818 --> 00:19:17,783 ఆమె ఇతరులకు ఎందుకు సేవ చేశారంటే అది ఆమెకి అమితానందాన్ని ఇచ్చేది గనుక. 441 00:19:18,575 --> 00:19:21,745 విషయం ఏమిటంటే, మదర్ థెరెస్సా ఇంకా నేను ఒకే లాంటి వాళ్లం. 442 00:19:22,329 --> 00:19:24,956 నాకు ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే చేస్తాను, 443 00:19:24,957 --> 00:19:26,749 ఆ క్రేజీ నన్ మాదిరిగా. 444 00:19:26,750 --> 00:19:29,710 నాకు ఏదైనా తినాలి అనిపిస్తే, అది తింటాను. ఏదైనా కొనాలి అనిపిస్తే, కొంటాను. 445 00:19:29,711 --> 00:19:31,796 ఒక అందమైన అపరిచిత వ్యక్తితో సెక్స్ చేయాలి అనిపిస్తే, నేను... 446 00:19:31,797 --> 00:19:33,172 వాస్తవానికి, నేను ఇప్పుడు అది చేయడం లేదు, 447 00:19:33,173 --> 00:19:36,008 ఇంకా మదర్ థెరెస్సా కూడా అలా చేయరు అనుకుంటా. 448 00:19:36,009 --> 00:19:37,635 - సరే... - నువ్వు ఒక విషయం తెలుసుకుంటావా? 449 00:19:37,636 --> 00:19:41,430 నన్ను నేను ఒక రాజకుమారుడిలా గౌరవించుకోవడం వల్ల నాకు వచ్చే ఆ ఎనర్జీనే 450 00:19:41,431 --> 00:19:45,601 చార్లీకి, సట్టన్ కి నేను అండగా ఉండటానికి నాకు శక్తిని ఇస్తుంది. 451 00:19:45,602 --> 00:19:49,356 నా ఉద్దేశం, నేను సంతోషంగా లేకపోతే 452 00:19:50,232 --> 00:19:51,775 నా జీవితంలో ఉన్న వారికి నేను ఎలా సాయం చేయగలను? 453 00:19:52,276 --> 00:19:55,194 బింగో! చివరికి అతను ఒక అర్థవంతమైన మాట అన్నాడు. 454 00:19:55,195 --> 00:19:56,821 - నాకు అర్థమైంది. - సరే. 455 00:19:56,822 --> 00:19:58,281 ఓహ్, చెత్త, నేను దీన్ని రికార్డు చేసి ఉండాల్సింది. 456 00:19:58,282 --> 00:20:00,533 - సరే. ఇంక మొదలుపెడదాం. మొదటి నుంచి. - సరే. ఈ కేక్ ఇచ్చినందుకు థాంక్స్. 457 00:20:00,534 --> 00:20:03,953 నేను, బ్రయాన్ లొరెంజో, నేను ఒక... 458 00:20:03,954 --> 00:20:07,583 ఓహ్, సరే. మీకు కావాల్సింది మీకు దక్కింది అందుకే వెళ్లిపోతున్నారు కదా, హా? 459 00:20:08,876 --> 00:20:09,917 వాళ్లకి అది నేనే నేర్పించాను. 460 00:20:09,918 --> 00:20:11,794 సరే, మీరు ఏం అనుకుంటున్నారు? 461 00:20:11,795 --> 00:20:13,713 ఓహ్, తను వెళ్లడానికి రెడీగా ఉంది. 462 00:20:13,714 --> 00:20:15,215 అవును, ఇది చాలా ముచ్చటగా ఉంది. 463 00:20:15,716 --> 00:20:17,258 అవును, అవును, బాబు. 464 00:20:17,259 --> 00:20:18,968 ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. 465 00:20:18,969 --> 00:20:20,720 ఇది బయలుదేరడానికి సిద్ధంగా ఉంది... 466 00:20:20,721 --> 00:20:23,015 ఈ వీధుల గుండా వ్రూమ్ అంటూ దూసుకుపోబోతోంది... 467 00:20:24,016 --> 00:20:26,434 తాతయ్యా, నువ్వు ఈ కారుని డ్రైవ్ చేశావంటే ఆడవాళ్లందరినీ నువ్వే ఆకర్షిస్తావు. 468 00:20:26,435 --> 00:20:29,395 కానీ, నేను అందంగా కనిపించడం మీదనే దృష్టి పెట్టాలి, బుజ్జీ, 469 00:20:29,396 --> 00:20:30,772 ఎందుకంటే ఇది నా కార్ కాదు. 470 00:20:31,481 --> 00:20:33,358 - ఇది నీది. - ఏంటి? 471 00:20:33,942 --> 00:20:36,278 నిజంగా అంటున్నావా? అంటే... 472 00:20:39,823 --> 00:20:41,532 నువ్వు నా మీద అపారమైన ప్రేమ చూపిస్తున్నావు, 473 00:20:41,533 --> 00:20:43,243 కానీ నాన్న నాకు ఇప్పటికే కారు కొనిచ్చారు. 474 00:20:44,453 --> 00:20:45,454 తన పుట్టినరోజు కానుక. 475 00:20:46,038 --> 00:20:49,208 ఆలిస్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ టియా నడిపిన అచ్చం అలాంటి పసుపు మినీ కూపర్ అది. 476 00:20:49,791 --> 00:20:51,626 దాని ద్వారానే నేను, సోఫీ కలిశాం. ఆ కారుని తనే నాకు అమ్మింది. 477 00:20:51,627 --> 00:20:52,710 అవును, పిచ్చోడా. 478 00:20:52,711 --> 00:20:54,629 అయితే, ఇప్పుడు నేను ఒక ఇడియట్ ని అనిపిస్తోంది. 479 00:20:54,630 --> 00:20:57,173 చూడు, నేను ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. 480 00:20:57,174 --> 00:20:58,258 గత కొన్ని ఏళ్లుగా 481 00:20:59,092 --> 00:21:02,678 జీవితంలో ఉన్న గొడవల వల్ల నేను మీకు సరిగ్గా తోడుగా ఉండలేకపోయాను, దానికి ప్రాయశ్చిత్తంగానే 482 00:21:02,679 --> 00:21:03,763 ఇదంతా చేస్తున్నాను. 483 00:21:03,764 --> 00:21:05,431 ఏది ఏమైనా, అంటే, నువ్వు రెండు కార్లూ వాడుకోవచ్చు, 484 00:21:05,432 --> 00:21:07,642 ఒక ఈస్ట్ కోస్ట్ కారు ఇంకా ఒక వెస్ట్ కోస్ట్ కారు. 485 00:21:07,643 --> 00:21:10,520 లేదా నాకు తెలియదు, కావాలంటే దీన్ని అమ్మేసుకోండి. 486 00:21:10,521 --> 00:21:11,854 నేను దీన్ని ఉంచుకుంటాను. 487 00:21:11,855 --> 00:21:13,564 చాలా థాంక్స్, తాతయ్య. 488 00:21:13,565 --> 00:21:15,441 ఇది నాకు నచ్చింది. థాంక్యూ. 489 00:21:15,442 --> 00:21:16,901 సంతోషం. 490 00:21:16,902 --> 00:21:17,985 థాంక్యూ, నాన్నా. 491 00:21:17,986 --> 00:21:19,821 అవును, నిజంగానే అంటున్నావా? ఎంత బాగుంది. 492 00:21:23,033 --> 00:21:26,869 ఈ కారు చూస్తే చాలు, కుర్రవాళ్ళంతా గుమిగూడి తెగ ముచ్చట్లు పెట్టేస్తారు. 493 00:21:26,870 --> 00:21:29,914 నా దగ్గరికి వచ్చి ఈ కారు గురించి నాకు వివరించే ఆ కుర్రవాళ్లని కలవడానికి నేను ఆత్రుతతో ఉన్నాను. 494 00:21:29,915 --> 00:21:32,208 సరే, నువ్వు చెప్పిన ఆ చివరి టూల్ పేరు ఏంటి? 495 00:21:32,209 --> 00:21:33,501 స్పేస్ యాంగర్? 496 00:21:33,502 --> 00:21:34,919 కాస్మిక్ రేజ్. 497 00:21:34,920 --> 00:21:37,129 ఎవరైనా నిన్ను విమర్శించినా లేదా తక్కువ చేసి చూసినా నీకు కలిగే ఆ ఆవేశమే ఇది. 498 00:21:37,130 --> 00:21:38,756 పాల్, ఈ పేర్లు మరీ తీవ్రంగా ఉన్నాయి. 499 00:21:38,757 --> 00:21:40,800 ద వోర్టెక్స్, ద బ్లాక్ సన్, 500 00:21:40,801 --> 00:21:41,884 ప్రొజెక్షన్ డిజాల్వింగ్. 501 00:21:41,885 --> 00:21:44,512 నిజాయితీగా చెప్పు, ఆ రోజుల్లో నువ్వు ఎంత గంజాయి తాగేవాడివి? 502 00:21:44,513 --> 00:21:46,097 బహుశా కొద్దిగా తాగి ఉండచ్చు. 503 00:21:46,098 --> 00:21:48,808 - చూడు, వీటిలో కొన్నింటికి నేను పేర్లు మారుస్తాను. - సరే, 504 00:21:48,809 --> 00:21:50,852 కానీ హో అనే పదం మాత్రం వాటిల్లో ఉండకూడదు. 505 00:21:50,853 --> 00:21:53,020 దాని గురించి రేపు మాట్లాడుకుందాం. మనకి వారమంతా సమయం ఉంది. 506 00:21:53,021 --> 00:21:55,648 ఏంటి? నేను ఈ పనులన్నీ వారంలో పూర్తి చేయలేను. 507 00:21:55,649 --> 00:21:58,861 నేను వెళ్లిపోయాక కూడా నువ్వు నాతో టచ్ లో ఉండాలి. 508 00:21:59,444 --> 00:22:02,698 నేను ఏం ఆలోచిస్తున్నానంటే, ప్రతి రోజూ ఉదయం మొదటగా, జూమ్ కాల్ లో కొద్ది గంటలు మాట్లాడుకోవాలి. 509 00:22:03,198 --> 00:22:04,866 తను ఎంత సంతోషంగా ఉన్నాడో నువ్వు చూడాల్సింది. 510 00:22:04,867 --> 00:22:07,869 ఇందులో ప్రయోజనం ఏమిటంటే, అతనితో ఖరీదైన ఒమకాసే డిన్నర్ ఇప్పించుకుంటున్నాను. 511 00:22:07,870 --> 00:22:09,370 - దానికి నువ్వు కూడా రావచ్చు. - కొన్నిచీవా! 512 00:22:09,371 --> 00:22:10,997 వద్దు, బ్యాడ్ లిజ్. 513 00:22:10,998 --> 00:22:13,165 దేనికి? నేను కాలేజీలో జపనీస్ భాష నేర్చుకున్నాను. 514 00:22:13,166 --> 00:22:14,917 - లేదు, నువ్వు నేర్చుకోలేదు. - నేను నేర్చుకోలేదులే. 515 00:22:14,918 --> 00:22:16,794 విచిత్రం ఏంటంటే, నేను భయపడి 516 00:22:16,795 --> 00:22:19,213 నా ట్రామా వర్క్ నుండి తప్పించుకున్నందుకు నన్ను తిడతాడని అనుకున్నాను, 517 00:22:19,214 --> 00:22:20,548 కానీ పాల్ అలా చేయలేదు. 518 00:22:20,549 --> 00:22:22,718 బహుశా ఆ పనులకి నేను పనికిరానని పాల్ కి కూడా తెలిసిపోయినట్టు ఉంది. 519 00:22:25,262 --> 00:22:26,513 - ఏంటి? - ఏమీ లేదు. 520 00:22:28,473 --> 00:22:30,141 నువ్వు ఏం చేస్తున్నావు? 521 00:22:30,142 --> 00:22:33,519 నేను ఎందుకు ఎప్పుడూ ఇక్కడికి వచ్చి గ్యాబీ గురించి నీ మీద అరవాలి? 522 00:22:33,520 --> 00:22:36,190 ఎందుకంటే నువ్వు సమాజ విద్రోహివి ఇంకా నీకు హద్దులంటూ లేవు కాబట్టి. 523 00:22:36,857 --> 00:22:38,192 నా ఆఫీసు నుండి బయటకి పో. 524 00:22:40,569 --> 00:22:43,362 నువ్వు 'కవెనెంట్ ఆఫ్ ద రాక్' సంఘంలో ఉన్నావు. 525 00:22:43,363 --> 00:22:44,948 నువ్వు దీన్ని ఉంచుకోవాలని అనుకుంటున్నావా? 526 00:22:45,616 --> 00:22:47,868 అయితే ప్రశాంతంగా కూర్చుని నేను చెప్పేది విను. 527 00:23:01,965 --> 00:23:04,218 - హేయ్. - హేయ్. 528 00:23:05,636 --> 00:23:07,136 నువ్వు ఆలీస్ కోసం చేసిన పని చాలా బాగుంది. 529 00:23:07,137 --> 00:23:09,222 అవును, తను నా ఏకైక మనవరాలు కదా. 530 00:23:09,223 --> 00:23:10,765 నేను కేవలం కారు గురించి మాట్లాడటం లేదు. 531 00:23:10,766 --> 00:23:13,434 నువ్వు చెప్పిన దాని గురించి... ఇంకా తన గ్రాడ్యుయేషన్ కోసం వచ్చినందుకు. 532 00:23:13,435 --> 00:23:14,686 అది ఆమెకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. 533 00:23:15,646 --> 00:23:17,231 అది నాకు కూడా అంతే ముఖ్యం, నాన్నా. 534 00:23:18,148 --> 00:23:19,525 అవును, నాకు కూడా సంతోషమే. 535 00:23:21,485 --> 00:23:23,237 గ్రాడ్యుయేషన్ గురించి చెప్పాలి... 536 00:23:24,071 --> 00:23:26,364 నేను ఆ వేడుకకి హాజరు కాలేకపోవచ్చు. 537 00:23:26,365 --> 00:23:28,491 నా ఫ్రెండ్ ఒకడు కాటలీనా తీరంలో 538 00:23:28,492 --> 00:23:29,951 సముద్ర గర్భంలో ఫిషింగ్ కోసం నన్ను ఆహ్వానించాడు. 539 00:23:29,952 --> 00:23:32,454 అది జీవితంలో ఒకసారి మాత్రమే చేయగలిగేది. 540 00:23:33,038 --> 00:23:34,497 అలాగే తన గ్రాడ్యుయేషన్ డే కూడా. 541 00:23:34,498 --> 00:23:37,626 ఇలా చూడు, అది... అది హై స్కూలే కదా. 542 00:23:38,126 --> 00:23:42,381 అంటే, దానికి తోడు, ఆ కారు ఇచ్చినందుకు తను సంతోషంగా ఉంది, అర్థం చేసుకుంటుంది. 543 00:23:43,966 --> 00:23:45,132 నువ్వు ఈ విషయం ఆలీస్ కి చెప్పావా? 544 00:23:45,133 --> 00:23:46,926 నేను వెళ్లిపోయే వరకూ చెప్పకుండా ఉంటే మంచిది. 545 00:23:46,927 --> 00:23:48,344 చూడు, ఏదో అర్జెంటు పని పడిందని చెప్పు. 546 00:23:48,345 --> 00:23:50,805 తను మంచి అమ్మాయి. తను దాని గురించి పెద్దగా ఆలోచించదు. 547 00:23:50,806 --> 00:23:51,890 నాన్నా... 548 00:23:52,474 --> 00:23:55,059 మనం సమ్మర్ ఇంటికి వెళదాం. నా కొత్త కారుని తనకి చూపించాలని ఉంది. 549 00:23:55,060 --> 00:23:58,312 నీ జీవితంలో ఒక భాగం కావడం నాకు ఇష్టమే, ఆలీస్, కానీ తనో నేనో తేల్చుకో. 550 00:23:58,313 --> 00:23:59,981 మంచిది, అయితే ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం. 551 00:23:59,982 --> 00:24:01,400 రండి, సోఫీ కారులో ఉంది. 552 00:24:03,235 --> 00:24:04,236 చూడు, 553 00:24:06,029 --> 00:24:10,116 నాకు టియా తెలుసు ఇంకా నేను తనతో సరిగ్గా లేను, కానీ సోఫీ విషయంలో నాకు సదభిప్రాయం ఉంది. 554 00:24:10,117 --> 00:24:12,118 నాకు నిజంగా ఆ అమ్మాయి నచ్చింది. 555 00:24:12,119 --> 00:24:15,247 నిజం చెప్పాలంటే, తను నీకు టియా కన్నా మంచి జోడీ అనిపిస్తుంది. 556 00:24:21,879 --> 00:24:24,672 నాకు ఈ వారసత్వం గోల అంతా అర్థమైందిలే. 557 00:24:24,673 --> 00:24:28,467 ఒకేసారి విసిగిస్తూనే, అందరి ప్రేమని పొందే కూతురు కోసం 558 00:24:28,468 --> 00:24:32,597 నేను ఏమైనా చేస్తాను. 559 00:24:32,598 --> 00:24:36,058 నువ్వు అసలు ఈ వారసత్వం లాంటి వాటిని 560 00:24:36,059 --> 00:24:38,687 అస్సలు పట్టించుకోవు అనుకున్నాను. 561 00:24:39,271 --> 00:24:45,318 చూడు, ముగ్గురు తెలివిలేని కొడుకులు ఉన్నారన్న నీ బాధని 562 00:24:45,319 --> 00:24:48,697 నా జీవితాశయాన్ని నా వారసులకి అందించాలనే నా కోరికతో అస్సలు పోల్చకు. 563 00:24:49,281 --> 00:24:51,617 వాళ్లలో ఇద్దరే దద్దమ్మలు. 564 00:24:53,118 --> 00:24:57,914 విను, గ్యాబీ నీ నుంచి ఒక్కటే కోరుకుంది 565 00:24:57,915 --> 00:25:00,333 తన కలని నెరవేర్చుకోకుండా భయపడి పారిపోతున్నందుకు, 566 00:25:00,334 --> 00:25:03,794 నువ్వు తిడతావని ఆశించింది కానీ నువ్వలా చేయలేదు ఎందుకంటే నువ్వు స్వార్థపరుడివి గనుక. 567 00:25:03,795 --> 00:25:05,546 నీ అభిప్రాయానికి ధన్యవాదాలు. 568 00:25:05,547 --> 00:25:08,758 నేను ఇప్పుడు నీతో వాదించలేను. నా కోసం ఒక పేషంట్ వస్తున్నారు. 569 00:25:08,759 --> 00:25:11,928 నేను సంతోషంగా వెళతాను ఎందుకంటే ఇప్పుడు నేను నీ మెదడుని తొలిచేస్తాను, 570 00:25:11,929 --> 00:25:17,100 అది నీకు అర్థమయ్యేసరికి, నీకు చాలా కోపం వస్తుంది. 571 00:25:17,726 --> 00:25:20,062 అది నీ దిమ్మతిరిగేలా చేస్తుంది. 572 00:25:20,562 --> 00:25:22,104 ఇంక ఆపేస్తాను. 573 00:25:22,105 --> 00:25:23,731 ఓహ్, ఆగు. సారీ. నేను దాన్ని మళ్లీ తీసుకోవాలి. 574 00:25:23,732 --> 00:25:25,692 - మైక్ నీ తల మీద ఉండాలి. - హేయ్. 575 00:25:26,777 --> 00:25:28,153 నువ్వు నాకు దెబ్బ తగలించబోయావు. 576 00:25:28,737 --> 00:25:32,658 ఒక మనిషి కలని చంపేసే బదులు నీ తల పగులగొట్టడానికైనా నేను సిద్ధమే. 577 00:25:33,158 --> 00:25:34,158 రెండోసారి మైక్ పడేస్తున్నాను. 578 00:25:34,159 --> 00:25:36,619 నువ్వు ఎక్కువసార్లు మైక్ ని పడేయలేవు. 579 00:25:36,620 --> 00:25:38,162 ఏంటి? ఏంటి... 580 00:25:38,163 --> 00:25:39,706 నా పాకెట్ లో ఏం ఉందో నీకు తెలుసా? 581 00:25:40,290 --> 00:25:41,291 మూడోసారి. 582 00:25:47,005 --> 00:25:49,882 చివరి నిమిషంలో చెబుతున్నానని ఏమీ అనుకోకు, కానీ నేను వచ్చే వారమే ఉద్యోగంలో చేరాలి, 583 00:25:49,883 --> 00:25:51,717 ఇంకా నీకు ఈ నెలకి జీతం ఇవ్వడానికి నా దగ్గర డబ్బు ఉంది... 584 00:25:51,718 --> 00:25:52,802 నాతో తమాషాలు చేస్తున్నావా? 585 00:25:52,803 --> 00:25:55,888 ఏంటి? నాకు డబ్బు ఇస్తే సంతోషంగా వెళ్లిపోతాను అనుకుంటున్నావా? 586 00:25:55,889 --> 00:25:58,307 బ్రదర్, మనం ఒకరికి ఒకరం తోడున్న సంగతి మర్చిపోయావా? 587 00:25:58,308 --> 00:26:00,352 నీ కోసం నేను నిలబడ్డాను. 588 00:26:01,019 --> 00:26:03,271 దానికి తోడు, మేరిసోల్ నీ చిన్న హృదయాన్ని గాయపరిస్తే, 589 00:26:03,272 --> 00:26:06,524 నీ పని కూడా నేనే చేయడం కోసం డబుల్ డ్యూటీ చేశాను, మిత్రమా. 590 00:26:06,525 --> 00:26:08,860 నీ జీవితంలో అందరినీ ఎందుకిలా మోసం చేస్తావు? 591 00:26:08,861 --> 00:26:10,486 నువ్వు ఇష్టపడే అందరినీ, 592 00:26:10,487 --> 00:26:12,196 ఇలాగే వదిలేస్తూ ఉంటావు. 593 00:26:12,197 --> 00:26:14,240 అతను అరుస్తూనే ఉన్నాడు 594 00:26:14,241 --> 00:26:16,492 ఇంకా సాధారణంగా అలాంటి తిట్లకి వర్ణవివక్ష తోడయినప్పుడు 595 00:26:16,493 --> 00:26:18,536 - నేను నిగ్రహం కోల్పోతాను... - పోరా. 596 00:26:18,537 --> 00:26:19,662 ...కానీ నేను అలా చేయలేదు. 597 00:26:19,663 --> 00:26:21,289 అంటే, అది చాలా ఘోరంగా ముగిసింది. 598 00:26:21,290 --> 00:26:22,999 అతను నా మీదకి ఒక రొయ్యని విసిరాడు 599 00:26:23,000 --> 00:26:25,001 ఇంకా నన్ను "మిత్రమా" అన్నాడు. 600 00:26:25,002 --> 00:26:28,421 మిత్రమా అన్నాడా? డెలివరీ కుర్రవాడు నన్ను "చీఫ్" అని పిలిచినట్లుగా ఉంది. 601 00:26:28,422 --> 00:26:30,174 ఖచ్చితంగా, అది ఇంకా ఘోరం. 602 00:26:31,758 --> 00:26:33,092 కానీ నేను మౌనంగా ఉండిపోయాను. 603 00:26:33,093 --> 00:26:34,510 మంచిది. 604 00:26:34,511 --> 00:26:35,846 ఇదంతా నువ్వే చేశావు, పాల్. 605 00:26:36,513 --> 00:26:37,764 నీ ఉచిత థెరపీయే దీనికి కారణం. 606 00:26:38,932 --> 00:26:42,351 హేయ్, నువ్వు నా నుంచి ఫీజు వసూలు చేసి ఉంటే ఈపాటికి ఎంత అయి ఉండేది? 607 00:26:42,352 --> 00:26:43,979 లక్షా ఇరవై వేల డాలర్లు. 608 00:26:44,563 --> 00:26:46,106 నేను దాని గురించి లెక్క వేస్తున్నాను అనుకోకు. 609 00:26:49,693 --> 00:26:51,778 ఇదే మన చివరి సెషన్ అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. 610 00:26:53,363 --> 00:26:55,449 - చివరిగా ఏమైనా టూల్స్ ఉన్నాయా? - ఉన్నాయి. 611 00:26:57,492 --> 00:26:59,493 దానికి ఒక పేరు ఉంది 612 00:26:59,494 --> 00:27:00,746 అదే, హగ్. 613 00:27:02,456 --> 00:27:03,457 ఇలా రా, బాబు. 614 00:27:08,378 --> 00:27:09,421 నీకు నిజంగానే అంత సెంటిమెంట్ ఉందా? 615 00:27:10,005 --> 00:27:11,423 లేదు, కానీ నువ్వు సెంటిమెంటల్ అని నాకు తెలుసు. 616 00:27:12,883 --> 00:27:17,596 నువ్వు ఎంతలా మారావో ఇంకా ఎదిగావో చూడటం 617 00:27:18,305 --> 00:27:19,764 నిజంగా ఒక అదృష్టం. 618 00:27:19,765 --> 00:27:21,058 కేవలం నేనే కాదు, పాల్. 619 00:27:22,559 --> 00:27:24,686 నువ్వు కూడా మారావు. చాలా మారావు. 620 00:27:25,604 --> 00:27:28,065 ఇలా చూడు, బాబు. నేను నిన్ను కనీసం గుర్తుపట్టలేకపోతున్నాను. 621 00:27:34,530 --> 00:27:35,572 చెత్త లిజ్. 622 00:27:39,076 --> 00:27:40,369 డామిట్. 623 00:27:46,083 --> 00:27:48,544 హేయ్, ఇక్కడ ఉన్నావా? 624 00:27:49,795 --> 00:27:50,879 అంతా బాగానే ఉందా? 625 00:27:52,256 --> 00:27:53,923 మా నాన్న గ్రాడ్యుయేషన్ వేడుకకి రావడం లేదు. 626 00:27:53,924 --> 00:27:55,716 ఆగు, ఏం అంటున్నావు? ఆయన ఇక్కడే ఉన్నాడుగా. 627 00:27:55,717 --> 00:27:57,845 అవును. ఏదో ఫిషింగ్ ట్రిప్ కి ఆహ్వానం వచ్చిందట. 628 00:27:58,720 --> 00:28:00,764 ఆ ఫిషింగ్ ట్రిప్ కి వెళ్లడం అంత అర్జెంటా? 629 00:28:01,932 --> 00:28:02,933 ఇంత త్వరగా. 630 00:28:04,142 --> 00:28:05,519 నిజంగా సారీ, జిమ్మీ. 631 00:28:06,478 --> 00:28:08,230 బాధపడకు. నా ఉద్దేశం, ఆయన అలాగే చేస్తాడు. 632 00:28:09,022 --> 00:28:10,107 ఇంకా తెలుసుకుని ఉండాల్సింది. 633 00:28:10,607 --> 00:28:15,112 నేను నోరు మూసుకుని దూరంగా ఉండాల్సింది. 634 00:28:19,283 --> 00:28:20,325 ఏంటి ఇది? 635 00:28:22,411 --> 00:28:24,120 - ఏంటి? - ఏమీ మాట్లాడకుండా ఉండటం. 636 00:28:24,121 --> 00:28:25,622 నేను ఏమీ మౌనంగా ఉండటం లేదే. 637 00:28:26,206 --> 00:28:28,083 చూడు, నువ్వు నా వల్ల కలత చెందితే, దాని గురించి మాట్లాడుకోవచ్చు. 638 00:28:29,459 --> 00:28:31,211 నాకు దాని గురించి మాట్లాడాలని లేదు. నేను బాగానే ఉన్నాను, సరేనా? 639 00:28:31,795 --> 00:28:33,880 నా ఉద్దేశం... 640 00:28:33,881 --> 00:28:36,883 నువ్వు చాలాకాలం వివాహబంధంలో ఉన్నావు. ఎప్పుడైనా గొడవలు వస్తే ఇలాగే వ్యవహరించేవాడివా? 641 00:28:36,884 --> 00:28:39,678 టియా, నేను చాలా విషయాలలో గొడవ పడేవాళ్లం, 642 00:28:40,262 --> 00:28:41,889 ముఖ్యంగా మా నాన్న విషయంలో ఎక్కువ. 643 00:28:42,931 --> 00:28:44,349 ఆమెని ఆ విషయంలో ఎక్కువగా మిస్ అవుతాను. 644 00:28:45,642 --> 00:28:48,477 నీ భార్యని నువ్వు ఎక్కువగా మిస్ అయ్యేది, ఆమె మీ నాన్నని ఇష్టపడకపోవడం గురించే కదా. 645 00:28:48,478 --> 00:28:49,646 చాలా కారణాల్లో అది ఒకటి. 646 00:28:51,064 --> 00:28:52,231 - టాప్ ఫైవ్. - సరే. 647 00:28:52,232 --> 00:28:53,317 సరే. 648 00:28:58,614 --> 00:29:01,490 చూడు, నువ్వు సరిగ్గా నా భయాన్నే బయటపెడుతున్నావు, 649 00:29:01,491 --> 00:29:03,076 అందుకే నేను... ఈ మాట చెప్పేస్తున్నాను... 650 00:29:05,037 --> 00:29:07,706 నీ భార్య గురించి ప్రస్తావించి నన్ను దోషిగా నిలబెట్టడం అంత కరెక్ట్ కాదనిపిస్తోంది. 651 00:29:09,041 --> 00:29:11,543 నేను ఎప్పుడూ దీనితో ఇలాగే సతమతమవ్వాలా? 652 00:29:12,753 --> 00:29:13,879 దీని కోసం నేను సిద్ధంగా లేను. 653 00:29:16,423 --> 00:29:17,549 మన బంధం కోసం కూడా సిద్ధంగా లేను. 654 00:29:18,300 --> 00:29:19,885 నేను సిద్ధమయ్యానని అనుకున్నాను. కానీ సారీ. 655 00:29:21,178 --> 00:29:22,179 నేను సిద్ధంగా లేను. 656 00:29:25,140 --> 00:29:26,141 వావ్. 657 00:29:29,728 --> 00:29:32,022 మనం నిజంగానే తొందరపడ్డాం, కదా? 658 00:29:37,819 --> 00:29:38,820 సరే. 659 00:29:55,420 --> 00:29:58,131 బెల్ వ్యూలో నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు, 660 00:29:59,091 --> 00:30:00,758 నేను చాలా అసౌకర్యంగా ఉన్నాను. 661 00:30:00,759 --> 00:30:01,843 నెర్వస్ గా ఉన్నాను. 662 00:30:01,844 --> 00:30:04,011 నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను. నువ్వు నాకు ఇంకో కథ చెప్పబోతున్నావా, 663 00:30:04,012 --> 00:30:05,597 దానికి కనీసం వివరాలు కూడా చెప్పవా? ఏంటిదంతా? 664 00:30:06,181 --> 00:30:07,850 నా మొదటి పేషెంట్ చనిపోయినప్పుడు, 665 00:30:08,892 --> 00:30:11,602 అది నన్ను ఎంతగా కదిలించివేసిందంటే నేను మానసికంగా చీలిపోయాను. 666 00:30:11,603 --> 00:30:13,355 చాలాకాలం పాటు 667 00:30:14,356 --> 00:30:15,774 నేను అందుకు పశ్చాత్తాపపడ్డాను. 668 00:30:16,483 --> 00:30:18,025 - ఎంత కాలం? - కొన్ని వారాల పాటు. 669 00:30:18,026 --> 00:30:19,778 నువ్వు అది అడుగుతావు అనుకోలేదు. 670 00:30:20,445 --> 00:30:25,367 ఏది ఏమైనా, నేను సొంతంగా నా సి.బి.టి.ని అభివృద్ధి చేసుకున్నాను. 671 00:30:26,785 --> 00:30:30,122 నిత్యం మానసిక సమస్యలు ఎదుర్కొనే... మనుషులకు సాయం చేయడం మొదలుపెట్టాను. 672 00:30:31,164 --> 00:30:34,168 కానీ ఆ అసలైన ట్రామా చికిత్స... 673 00:30:35,085 --> 00:30:36,461 చావు బతుకుల సమస్యలు... 674 00:30:38,797 --> 00:30:40,716 నేను వాటిని హ్యాండిల్ చేయలేకపోయాను. 675 00:30:41,508 --> 00:30:43,927 - నేను కూడా అంతే. - నువ్వు అంతే కాదు. 676 00:30:45,095 --> 00:30:46,555 నువ్వు నాకన్నా గట్టి దానివి. 677 00:30:48,098 --> 00:30:49,975 ఆ విషయం నాకు తెలుసు 678 00:30:50,559 --> 00:30:51,685 ఎందుకంటే నువ్వు నాకు 679 00:30:52,686 --> 00:30:53,812 చాలా సాయం చేశావు. 680 00:30:54,479 --> 00:30:55,479 పాల్... 681 00:30:55,480 --> 00:31:01,695 మా నాన్నతో పెరిగిన ఆ రోజుల్లో, ఎన్నో చీకటి జ్ఞాపకాలను ఇప్పటికీ నా గుండెల్లో మోస్తూనే ఉన్నాను. 682 00:31:02,863 --> 00:31:04,072 చెత్తవెధవ. 683 00:31:04,990 --> 00:31:05,991 హింసాత్మక ప్రవృత్తి. 684 00:31:07,993 --> 00:31:10,162 అదే నన్ను ఎవరితోనూ కలవనివ్వకుండా, నా మనసుని మూసేసుకునేలా చేసింది. 685 00:31:10,746 --> 00:31:12,456 సారీ. అది నొప్పిస్తుంది. 686 00:31:14,041 --> 00:31:18,086 కానీ ఎంతగా ఎదిగానో ఈ రోజు నేను గుర్తించేలా చేశారు. 687 00:31:18,670 --> 00:31:20,797 ఆ క్రెడిట్ లో ఎక్కువ భాగం నేను నీకే ఇస్తాను. 688 00:31:21,507 --> 00:31:23,675 నువ్వు నాకు ఎన్నో కొత్త విషయాలు నేర్పించావు. 689 00:31:25,010 --> 00:31:28,138 చూడు, నేను ఎంత హైడ్రేటెడ్ గా ఉన్నానో. 690 00:31:28,722 --> 00:31:31,308 ఆ మాటని మొదటిసారి సరిగ్గా ఉపయోగించినందుకు కంగ్రాట్యులేషన్స్. 691 00:31:31,892 --> 00:31:33,602 నా జీవితంలోకి కొందరిని ప్రవేశించనివ్వగలిగాను. 692 00:31:37,648 --> 00:31:39,107 జూలీని పెళ్లి చేసుకున్నాను. 693 00:31:40,317 --> 00:31:41,860 కార్లలో పాటలు పాడుతున్నాను. 694 00:31:42,945 --> 00:31:44,654 ఎన్ వోగ్ అంటే ఎవరో తెలుసుకున్నాను. 695 00:31:44,655 --> 00:31:46,156 మీ మనసుని ఖాళీ చేసుకో, బేబీ. 696 00:31:48,325 --> 00:31:50,077 నువ్వు నా జీవితాన్ని మార్చావు. 697 00:31:50,911 --> 00:31:52,871 మిగతా విషయాలన్నీ పక్కనపెట్టు. 698 00:31:53,497 --> 00:31:54,915 గ్యాబీ... 699 00:31:55,541 --> 00:31:56,750 నువ్వే నా లెగసీ. 700 00:32:00,087 --> 00:32:01,463 ఇంక ఆపు, పాల్. 701 00:32:02,339 --> 00:32:05,592 నా ప్రాక్టీసు నీకు కావాలంటే, అదంతా నీదే. 702 00:32:07,135 --> 00:32:11,890 ఇంకా, ఈ మొత్తం బిల్డింగ్ నువ్వే ఉంచుకున్నా నేను పట్టించుకోను. 703 00:32:12,891 --> 00:32:15,310 కానీ దీన్ని మన పాత పనులకే, పాత చికిత్సలకే ఉపయోగిస్తే, 704 00:32:15,894 --> 00:32:18,897 నువ్వు నాకు లక్షల కోట్ల డాలర్ల రుసుము చెల్లించాల్సి వస్తుంది. 705 00:32:19,481 --> 00:32:22,316 లేదా నువ్వు కేవలం నెలకి ఒక్క డాలరు చెల్లించచ్చు, 706 00:32:22,317 --> 00:32:24,695 అది కూడా నీ ట్రామా సెంటర్ ని నడిపితేనే. 707 00:32:28,407 --> 00:32:29,408 హేయ్. 708 00:32:31,243 --> 00:32:32,870 పిరికిపందలా ఆలోచించడం మానుకో. 709 00:32:33,453 --> 00:32:34,495 సరే. 710 00:32:34,496 --> 00:32:35,664 ఇలా రా. 711 00:32:41,837 --> 00:32:44,672 కానీ దానికి నువ్వు రోడ్స్ ట్రామా సెంటర్ అని పేరు పెట్టాలి. 712 00:32:44,673 --> 00:32:46,133 అస్సలు పెట్టను. 713 00:32:47,676 --> 00:32:48,677 సరే. 714 00:32:49,928 --> 00:32:53,974 నేల పైనున్న ఆ చెక్క పలకలు నీ చొక్కాపై ఆ ముడతను ఎలా వదిలి వెళ్ళాయో 715 00:32:54,892 --> 00:32:57,727 నేను నీ కాలేజీ సాకర్ గేమ్స్ కి వస్తాను, నీకు ఇబ్బంది లేకపోతే, 716 00:32:57,728 --> 00:32:59,729 నువ్వు గోల్ కొట్టినప్పుడు అందరిలో నన్నే చూస్తూ ఒక సైగ చెయ్యి, 717 00:32:59,730 --> 00:33:01,272 అందరికీ తెలిసేలా వద్దు. 718 00:33:01,273 --> 00:33:03,775 నాకు అర్థమైంది. ఏదైనా నీకు మాత్రమే తెలిసేలా చిన్న సైగ చేస్తాను. 719 00:33:04,359 --> 00:33:05,443 - ఈ విధంగా. - అది నాకు నచ్చింది. 720 00:33:05,444 --> 00:33:07,905 నేను కూడా సరిగ్గా అదే విధంగా నీకు సైగ చేస్తాను. బాగుంది. పెద్ద విషయమే కాదు. 721 00:33:09,072 --> 00:33:10,531 హేయ్, సోఫీ ఎక్కడ? తను వెళ్లిపోయిందా? 722 00:33:10,532 --> 00:33:12,409 తనని గ్రాడ్యుయేషన్ డేకి ఆహ్వానించాలని అనుకుంటున్నాను. 723 00:33:15,287 --> 00:33:17,205 లేదు, కేవలం... మన కుటుంబం వరకే పరిమితం చేద్దాం. 724 00:33:17,206 --> 00:33:20,500 నీ రెండో అంతస్తు ఫ్లాట్ లో ఎక్కడో ఒక గోడ మీద 725 00:33:20,501 --> 00:33:23,377 నేను ఒక లవ్ లెటర్ దాచాను దాన్ని తిరిగి పొందలేను 726 00:33:23,378 --> 00:33:27,215 దాని మీద మీ నాన్న ఫోటో ఉంది ఇంకా తాళం మీద ఒక మాట 727 00:33:27,216 --> 00:33:29,510 నువ్వు నన్ను గుర్తుంచుకుంటావని నా ఆశ 728 00:33:30,427 --> 00:33:33,471 భూమి పగుళ్ళలా బాధలో ఉన్న నీ కళ్ళలా 729 00:33:33,472 --> 00:33:36,807 నేల పైనున్న ఆ చెక్క పలకలు నీ చొక్కాపై ఆ ముడతను ఎలా వదిలి వెళ్ళాయో 730 00:33:36,808 --> 00:33:41,271 ప్రస్తుతానికి నిన్ను నేను అలానే గుర్తుంచుకుంటాను 731 00:33:42,773 --> 00:33:45,858 వీధిలో పరుచుకున్న ఆ పొగమంచులా అది నాకు కలిగించిన ఆ అనుభూతిలా 732 00:33:45,859 --> 00:33:49,195 అలసిపోయి నీ చేతులు స్టీరింగ్ మీద ఉండగానే నువ్వు నిద్రలోకి జారుకున్న ఆ క్షణంలా 733 00:33:49,196 --> 00:33:53,367 ప్రస్తుతానికి నిన్ను నేను అలానే గుర్తుంచుకుంటాను 734 00:33:55,911 --> 00:34:00,499 నేను వేసుకున్న ఈ స్వెటర్ దారాన్ని లాగకూడదని నాకు తెలుసు 735 00:34:00,999 --> 00:34:03,752 కానీ అది విడిపోతుంటే నేను ఆపలేకపోతున్నాను 736 00:34:04,628 --> 00:34:07,755 నా హృదయం నా మీద విజయం సాధిస్తోంది 737 00:34:07,756 --> 00:34:12,886 ఆ కటిక చలికాలంలో నువ్వు అసలు ప్రేమలో పడనని చెప్పావు 738 00:34:13,719 --> 00:34:15,722 తెలుగు అనువాదకర్త: హరీష్