1 00:00:06,090 --> 00:00:07,508 షెల్టర్లో ఇంతకు ముందు... 2 00:00:07,633 --> 00:00:09,510 -ఇతని గురించి షీరా చెప్పింది. -డిలన్. 3 00:00:09,593 --> 00:00:11,554 బేస్ బాల్ ఆట అయిపోగానే మాయమయ్యాడు. 4 00:00:11,637 --> 00:00:13,764 దీనిలో డిలన్కున్న టోపీ మా నాన్నకూ ఉంది. 5 00:00:14,014 --> 00:00:15,433 వాళ్ళు మంచి స్నేహితులు. 6 00:00:15,516 --> 00:00:18,227 నా మేనల్లుడిని అరెస్ట్ చేయటంద్వారా నా దృష్టిలో పడాలని 7 00:00:18,310 --> 00:00:20,479 -నీవు... -అతిగా ఊహించుకోకు. 8 00:00:21,147 --> 00:00:22,690 నీ గురించి ఆలోచించటం ఆపేశాను. 9 00:00:22,773 --> 00:00:24,150 నన్ను క్షమించండి. 10 00:00:24,442 --> 00:00:26,110 -షీరా? -హానా. 11 00:00:26,777 --> 00:00:28,028 ఓహ్, దేవుడా. 12 00:00:28,112 --> 00:00:29,447 కిట్టీ నిమిషంలో వస్తుంది. 13 00:00:29,530 --> 00:00:31,699 మీ ఇద్దరితో ఒక విషయం చెప్పాలి. 14 00:00:31,866 --> 00:00:35,119 మీరు కొద్దికాలం తేలిగ్గా తీసుకోవాలి. సరేనా? 15 00:00:35,202 --> 00:00:36,537 మిక్కీ! 16 00:00:36,620 --> 00:00:39,039 అమ్మా. నిన్ను బాగా మిస్ అయ్యాను. 17 00:00:39,206 --> 00:00:42,293 అయితే డాక్టర్ కెంట్పై దాడిచేసినవారే యాష్లీ అదృశ్యానికి 18 00:00:42,418 --> 00:00:43,878 సంబంధం ఉందని మనం అనుకోవాలి. 19 00:00:44,044 --> 00:00:47,047 అవును. కెంట్లు యాష్లీ తల్లిదండ్రులని అనుకున్నారు. 20 00:00:47,131 --> 00:00:49,967 నా భర్తను ఇలా చేసినవాడి ముఖంపై ఒక పచ్చబొట్టు ఉంది. 21 00:00:50,050 --> 00:00:51,302 పచ్చబొట్టు ఎలాంటిది? 22 00:00:51,844 --> 00:00:53,053 ఒక ఆక్టోపస్. 23 00:00:55,055 --> 00:00:56,682 అది నీది కాదు. 24 00:00:58,601 --> 00:01:01,479 గబ్బిలం మహిళ ఇంటి దగ్గర నువ్వు, స్పూన్ చూసిన మనిషి 25 00:01:01,562 --> 00:01:03,022 గుండు, సన్ గ్లాసెస్తో ఉంటాడా? 26 00:01:03,272 --> 00:01:05,149 అమ్మో! అతను మననిప్పుడు చూస్తున్నాడా? 27 00:01:07,568 --> 00:01:09,153 ఏయ్! ఆగు, ఆగు! 28 00:01:10,237 --> 00:01:11,989 ఎవరు నీవు? ఆ ఇంట్లో ఎందుకున్నావు? 29 00:01:12,114 --> 00:01:12,990 నా వెనుక ఎందుకు? 30 00:01:13,073 --> 00:01:14,950 జవాబులకు నువ్వు సిద్ధంగా లేవు. 31 00:01:15,242 --> 00:01:16,786 గబ్బిలం మహిళ నాన్న ఉన్నాడంది. 32 00:01:17,203 --> 00:01:18,078 నన్ను నమ్ము. 33 00:01:18,162 --> 00:01:19,371 ఆమె అలా చెప్పిఉండకూడదు. 34 00:01:19,830 --> 00:01:20,789 మా అమ్మ కనబడటంలేదు. 35 00:01:20,873 --> 00:01:22,082 ఆమె ఇంటికి రాలేదు. 36 00:01:27,670 --> 00:01:30,382 మిక్కీ! వెర్రివాడా, నువ్వు తలుపు తాళం వేసుకోలేదు. 37 00:03:08,647 --> 00:03:09,815 ఏమైనా? 38 00:03:09,899 --> 00:03:11,233 యాష్లీ గురించి ఏమైనా? 39 00:03:12,067 --> 00:03:13,110 ఇంకా చూస్తున్నాను. 40 00:03:19,992 --> 00:03:22,077 మిక్కీకి అతను బతికి ఉన్నాడని చెప్పావు. 41 00:03:23,287 --> 00:03:24,204 నాకు తెలుసు. 42 00:03:25,039 --> 00:03:26,165 ఎందుకు? 43 00:03:28,334 --> 00:03:29,168 సరే. 44 00:03:29,543 --> 00:03:31,921 యాష్లీ గురించి ఇక్కడ ఏదో ఉండి ఉంటుంది. 45 00:03:34,340 --> 00:03:35,633 ఇంతవరకే చేయగలిగాము. 46 00:03:36,341 --> 00:03:37,301 సరే... 47 00:03:38,510 --> 00:03:39,803 ఏది చేయాలో అది చేద్దాం. 48 00:03:40,179 --> 00:03:41,180 కానీ? 49 00:03:42,014 --> 00:03:43,891 అందరూ బతికి ఉంటారని నమ్మకం లేదు. 50 00:03:47,895 --> 00:03:50,189 కొత్త పరిణామాలు ఏమైనా ఉంటే మేము చెబుతాము. 51 00:03:50,272 --> 00:03:53,025 ప్రస్తుతానికి, ఆమెకు కొంత సమయం కావాలి. 52 00:03:55,319 --> 00:03:57,738 ఈ వ్యవధిలో ఎవరూ కలవకూడదు. 53 00:03:58,822 --> 00:04:00,282 సరే. 54 00:04:00,366 --> 00:04:01,533 మంచిది. ధన్యవాదాలు. 55 00:04:01,742 --> 00:04:02,660 పరవాలేదు. 56 00:04:15,506 --> 00:04:18,591 మీ అమ్మను మళ్ళీ ఆసుపత్రిలో చేర్చాల్సివచ్చింది. 57 00:04:19,510 --> 00:04:20,427 ఆమె సిద్ధంగా లేదు. 58 00:04:20,761 --> 00:04:22,513 లేదు, సిద్ధంగా లేదు. 59 00:04:27,393 --> 00:04:29,895 మా అమ్మను మా నాన్న చేసుకోవటానికి వద్దంది ఇందుకేనా? 60 00:04:31,105 --> 00:04:32,147 కుంగుబాటు? 61 00:04:36,986 --> 00:04:37,903 అది సంక్లిష్టం. 62 00:04:41,365 --> 00:04:42,282 కారు తీస్తాను. 63 00:05:11,020 --> 00:05:12,354 అది నీది కాదు. 64 00:05:25,492 --> 00:05:30,914 హార్లన్ కోబెన్స్ షెల్టర్ 65 00:05:33,125 --> 00:05:34,960 రేచెల్ కాల్డ్వెల్. 66 00:05:35,753 --> 00:05:37,212 మిక్కీ బోలిటార్. 67 00:05:39,631 --> 00:05:40,716 -షార్లెట్? -ఇక్కడ! 68 00:05:40,799 --> 00:05:42,301 సరే, ఇదిగో. 69 00:05:44,053 --> 00:05:45,596 -డాన్? -ప్రెజెంట్. 70 00:05:48,223 --> 00:05:50,726 నీ పిల్ల, బోలిటార్ బయట. ఎందుకు? 71 00:05:59,568 --> 00:06:01,820 కూర్చో, టేలర్. ఏం చేస్తున్నావు? 72 00:06:05,115 --> 00:06:07,576 ఏయ్. మిక్కీ ఏమైనా ఫోన్ చేశాడా? 73 00:06:08,494 --> 00:06:11,580 లేదు. బహుశా వాళ్ళ అమ్మతో ఉండి ఉంటాడు. 74 00:06:12,289 --> 00:06:13,248 అవును. 75 00:06:13,916 --> 00:06:15,125 నాకు తెలియదు. 76 00:06:15,209 --> 00:06:18,629 మా నాన్న చేసిన కొబ్బరి మిఠాయి అతనికిచ్చిన తర్వాత నాతో మాట్లాడలేదు 77 00:06:18,712 --> 00:06:19,963 అతను మెసేజ్ ఇస్తాడని... 78 00:06:20,047 --> 00:06:22,174 నిజంగానా? నువ్వు అక్కడకు వెళ్ళావా? 79 00:06:22,925 --> 00:06:24,134 అతనికి భంగం కలిగించకూడదు. 80 00:06:24,218 --> 00:06:25,385 నీ సమస్య ఏమిటి? 81 00:06:25,469 --> 00:06:27,179 భంగం కలిగించలేదు. అక్కడ ఎవరూ లేరు. 82 00:06:29,306 --> 00:06:30,641 సరే, అక్కడ ఉండాలే. 83 00:06:31,433 --> 00:06:33,018 సరే, ఎవరూ లేరు. 84 00:06:33,894 --> 00:06:35,437 ఆగు. అక్కడ ఎవరో ఉన్నారు. 85 00:06:35,521 --> 00:06:37,523 ఇది నిజానికి భయానకమైనది. 86 00:06:40,859 --> 00:06:42,027 ఇతన్ని కనుగొన్నాను. 87 00:06:43,028 --> 00:06:44,279 ఇతను ముద్దుగా ఉన్నాడు. 88 00:06:44,738 --> 00:06:47,908 ఇంకా, ఇతను నాలాగా లేడా? అంటే, కొద్దిగా, ఒక టోపీతో. 89 00:06:48,909 --> 00:06:51,328 దీన్ని అతని ఇంట్లో దొంగిలించావా? 90 00:06:51,411 --> 00:06:52,329 దొంగిలించలేదు... 91 00:06:53,497 --> 00:06:55,415 ఇది అక్కడ దొరికిందంటే మిక్కీ సంతోష... 92 00:06:55,541 --> 00:06:56,375 సరే. 93 00:06:56,750 --> 00:06:57,626 సరే. 94 00:06:57,793 --> 00:06:59,711 నీ డెస్క్ దగ్గరకు రా, స్పిండెల్. 95 00:07:00,087 --> 00:07:01,004 అలాగే. 96 00:07:06,635 --> 00:07:08,387 తదుపరి పీరియడ్ అసెంబ్లీకి వెళతావా? 97 00:07:12,558 --> 00:07:15,018 అవును. అంటే, అది తప్పనిసరి, కదా? 98 00:07:15,269 --> 00:07:16,603 నీకు ఇష్టం ఉన్నట్లు. 99 00:07:17,187 --> 00:07:18,313 ఇక్కడ కూర్చుంటే... 100 00:07:22,484 --> 00:07:24,194 వావ్, ఇది ఏమిటి? 101 00:07:25,112 --> 00:07:28,157 అది... అది ఏమీ లేదు. 102 00:07:28,282 --> 00:07:32,286 అంతగా ఇబ్బంది పడకు. అది చాలా రహస్యం. నాకు అది బాగా ఇష్టం. 103 00:07:34,496 --> 00:07:36,081 -నీకు యూడూయూ ఉందా? -లేదు. 104 00:07:36,165 --> 00:07:37,957 -అంటే, లేదు. -తీసుకో. 105 00:07:38,041 --> 00:07:39,376 నీ కళను అక్కడ చూపాలి. 106 00:07:42,462 --> 00:07:45,132 నేను... నేను వెళ్ళాలి. 107 00:07:52,764 --> 00:07:54,808 ఆలెన్, ఆమె బరువు పెరిగిందా? 108 00:07:55,142 --> 00:07:57,227 చీలమండలు వాచినాయా, సాక్సులు వేసుకుందా, 109 00:07:57,311 --> 00:07:59,688 అనేది నేను చెప్పలేను. 110 00:07:59,897 --> 00:08:01,315 ఎలెన్, అవి చీలమండలు. 111 00:08:01,982 --> 00:08:03,650 ఆమె అందంగా ఉంది. 112 00:08:03,984 --> 00:08:06,403 కానీ, తన తల్లి అంత అందంగా లేదు. 113 00:08:07,362 --> 00:08:09,156 -ముఖ స్తుతి. -ప్రణయపూర్వక మాటలు. 114 00:08:10,157 --> 00:08:11,450 దేనికోసమో వలవేస్తున్నావు. 115 00:08:11,617 --> 00:08:13,035 చాలావాటికోసం ఆశిస్తున్నాను. 116 00:08:13,368 --> 00:08:14,536 హలో? 117 00:08:17,748 --> 00:08:18,624 అమ్మా? 118 00:08:19,249 --> 00:08:20,292 హాయ్, బంగారం. 119 00:08:20,375 --> 00:08:21,293 హాయ్ నాన్నా. 120 00:08:21,543 --> 00:08:22,794 ఇంకా గురక పెడుతున్నావు. 121 00:08:22,878 --> 00:08:24,463 దానికి ఒక యాప్ ఉంది, తెలుసా? 122 00:08:24,546 --> 00:08:26,340 అవును, దాని పేరు ఆప్-నియా. 123 00:08:27,341 --> 00:08:28,383 ఓహ్, భగవాన్. 124 00:08:28,884 --> 00:08:30,552 మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? 125 00:08:30,636 --> 00:08:32,888 మన ఇంటికి రావటానికి మాకు ఆహ్వానం కావాలా? 126 00:08:32,971 --> 00:08:34,640 మనం ఫోన్ చేద్దామని చెప్పాను. 127 00:08:34,722 --> 00:08:36,808 నేను మెసేజ్ ఇచ్చాను. ఏమిటి సమస్య? 128 00:08:36,892 --> 00:08:38,477 సరే. నాకు కొద్దిగా కాఫీ కావాలి. 129 00:08:40,895 --> 00:08:45,359 నేను ఇంకా కాలేజిలో లేను. మీరు నా ఫ్రిజ్ను నింపేయాల్సిన అవసరంలేదు. 130 00:08:45,692 --> 00:08:47,027 బంగారం, అవి నీకోసం కాదు. 131 00:08:47,110 --> 00:08:48,820 అవి మన పార్టీకి వచ్చే అతిథులకోసం. 132 00:08:49,196 --> 00:08:50,405 ఏమి పార్టీ? 133 00:08:50,489 --> 00:08:52,407 మా 49వ వివాహ వార్షికోత్సవం. 134 00:08:52,574 --> 00:08:53,867 నువ్వు మర్చిపోయావు, కదూ? 135 00:08:54,201 --> 00:08:56,203 మనం అందరం ఒక నౌకపై వెళ్ళబోతున్నాం. 136 00:08:56,286 --> 00:08:58,997 బహామాస్కు. లాడర్డేల్ కోటనుంచి. క్యాబిన్ అప్ గ్రేడ్. 137 00:08:59,081 --> 00:09:01,083 కానీ కిట్టీకి అలా జరిగింది కాబట్టి... 138 00:09:01,750 --> 00:09:03,001 ఇది సరైన పని. 139 00:09:04,461 --> 00:09:05,504 కుటుంబంతో మరింత సమయం. 140 00:09:06,088 --> 00:09:07,839 ఇది మిక్కీకి బాగుంటుంది. 141 00:09:08,674 --> 00:09:11,426 పార్టీ ఎప్పుడు? 142 00:09:11,510 --> 00:09:14,930 ఇంకో ఐదు గంటలలో. 143 00:09:19,559 --> 00:09:22,771 కాసెల్టన్ కేమెల్స్కు స్వాగతం! 144 00:09:22,854 --> 00:09:24,106 కాసెల్టన్ హైస్కూల్ 145 00:09:24,815 --> 00:09:25,816 అవును! 146 00:09:29,111 --> 00:09:30,153 వచ్చినందుకు 147 00:09:30,404 --> 00:09:31,571 ధన్యవాదాలు. మీలో... 148 00:09:31,738 --> 00:09:32,572 మిక్కీ రాలేదు. 149 00:09:33,156 --> 00:09:34,283 పరవాలేదు. 150 00:09:34,366 --> 00:09:35,659 ...యూరోపియన్ చరిత్ర. 151 00:09:36,159 --> 00:09:39,621 మీ అందరికీ ఒక పెద్ద వార్త చెప్పాలి! 152 00:09:39,871 --> 00:09:40,956 కానీ మొదట, 153 00:09:41,039 --> 00:09:42,790 ఒక చిన్న చెడ్డవార్త. 154 00:09:42,874 --> 00:09:46,295 మనకు ప్రియమైన నాటక గురువు, మిస్టర్ వీ... 155 00:09:46,378 --> 00:09:47,212 "మి. వి" వామర్ 156 00:09:47,296 --> 00:09:49,673 ...ఆయన ఒక అత్యవసరమైన పనిమీద వెళ్ళిపోయారు, 157 00:09:49,756 --> 00:09:53,093 ఆయనకు మంచి జరగాలని కోరుకుందాం. 158 00:09:53,176 --> 00:09:54,761 మీడియావాళ్ళకు ఏమయింది? 159 00:09:54,845 --> 00:09:56,972 దాని అర్థం ఈ ఏడాది స్కూల్ సంగీతోత్సవం... 160 00:09:57,180 --> 00:09:58,390 నాకు తెలియదు. 161 00:09:58,515 --> 00:09:59,808 ...నేను చూసుకోవాలి. 162 00:10:00,309 --> 00:10:01,351 నా జుట్టు ఎలా ఉంది? 163 00:10:03,437 --> 00:10:06,815 పిల్లి దాడికి గురయిన పిచ్చిక గూడు ఎప్పుడైనా చూశావా? 164 00:10:06,898 --> 00:10:08,358 భగవాన్, చూడలేదు. 165 00:10:08,734 --> 00:10:11,570 కర్టన్ కాల్ అనేది ఒక లాభాపేక్ష లేని సంస్థ 166 00:10:11,778 --> 00:10:16,658 ఏడాదికి ఓ హైస్కూల్ సంగీతోత్సవం స్పాన్సర్ చేయటానికి ఓ ప్రముఖ వ్యక్తిని ఎంచుకుంటుంది. 167 00:10:16,825 --> 00:10:17,993 -స్పాన్సర్కు... -ఇదిగో. 168 00:10:18,076 --> 00:10:19,870 -...పరిచయం అవసరంలేదు. -వచ్చావు. 169 00:10:19,953 --> 00:10:22,497 పిల్లలూ, నేను ఆహ్వానిస్తున్నాను 170 00:10:22,956 --> 00:10:26,585 మన ఏంజెలికా వయట్ను! 171 00:10:31,214 --> 00:10:32,049 హాయ్! 172 00:10:35,594 --> 00:10:36,553 ధన్యవాదాలు. 173 00:10:48,732 --> 00:10:51,818 -కాస్త ప్రశాంతంగా కూర్చుంటావా, ప్లీజ్? -అస్సలు కూర్చోలేను. 174 00:10:51,902 --> 00:10:54,321 ఏంజెలికా వయట్ నా అభిమాన నటి, ఎప్పటికీ. 175 00:10:54,446 --> 00:10:55,906 ఆమె ఈగాట్ విజేత. 176 00:10:55,989 --> 00:10:57,157 ఆమె ఎమ్మీ, గ్రామీ... 177 00:10:57,240 --> 00:10:58,909 నాకు అనవసరం స్పూన్. 178 00:10:58,992 --> 00:11:00,535 ఫ్లిప్పింగ్ ఫర్ లవ్ చూశావా? 179 00:11:00,619 --> 00:11:02,245 ఓ డాల్ఫిన్ కోసం వరసగా 12 ఏళ్ళు 180 00:11:02,329 --> 00:11:04,039 కోరుకున్నాను. అంటే 96 రాత్రిళ్ళు. 181 00:11:05,540 --> 00:11:07,125 చాలా ఆకర్షణీయంగా ఉన్నావు. 182 00:11:10,962 --> 00:11:11,922 కళ. 183 00:11:12,297 --> 00:11:14,174 కళ కోసం కళ. 184 00:11:15,467 --> 00:11:17,886 అది జీవితాన్ని ఎంతో ఆసక్తిగా మారుస్తుంది. 185 00:11:18,720 --> 00:11:20,263 ఎంతో అనుకూలంగా మారుస్తుంది. 186 00:11:21,306 --> 00:11:22,516 నిజం ఏమిటంటే, 187 00:11:23,433 --> 00:11:25,519 మాధ్యమం ముఖ్యం కాదు. 188 00:11:25,894 --> 00:11:28,814 ముఖమైనది ఏమిటంటే, అక్కడకు చేరుకోవటం, చేయటం. 189 00:11:28,897 --> 00:11:29,898 అవును. చేస్తున్నాము. 190 00:11:29,981 --> 00:11:31,525 మీకు ఇష్టమైది చేయటం. 191 00:11:32,150 --> 00:11:34,861 మిమ్మల్ని భయపెట్టే పనులు చేయటం. 192 00:11:35,987 --> 00:11:37,948 సారీ. ఇలా అనవచ్చా? 193 00:11:39,699 --> 00:11:41,118 ఆమె చెడ్డది, మిత్రమా! 194 00:11:43,787 --> 00:11:46,039 సరే, ఇక్కడకు వచ్చిన పని చెబుతాను, సరేనా? 195 00:11:47,207 --> 00:11:49,167 ఈ ఏడాది సంగీతోత్సవం... 196 00:11:50,043 --> 00:11:51,336 ఫాంటమ్ ఆఫ్ ది ఓపెరా. 197 00:11:57,884 --> 00:12:00,095 ఈమా, నేను స్వరపరీక్షకు వెళతాను, 198 00:12:00,262 --> 00:12:01,680 ఫాంటమ్ వేషం నాకొస్తుంది, 199 00:12:01,763 --> 00:12:05,684 ఆమె నా నుంచి మంచి నటనను రాబట్టుకుంటుంది. 200 00:12:05,767 --> 00:12:08,395 బాగా దగ్గరవుతాము, చాలా దగ్గర, మాకు బంధం ఏర్పడుతుంది 201 00:12:08,478 --> 00:12:11,064 నడవటానికి వెళతాము, నన్ను భోజనానికి పిలుస్తుంది, 202 00:12:11,314 --> 00:12:13,191 అప్పుడు మేము పెళ్ళి చేసుకుంటాము 203 00:12:13,275 --> 00:12:15,652 -అది బాగుంటుంది... -బాగాలేదు, స్పూన్. 204 00:12:15,861 --> 00:12:18,363 -నువ్వు ఆపాలి. -నువ్వు ఎదగాలి, ఈమా. 205 00:12:18,447 --> 00:12:21,241 ఫాంటమ్ పాత్ర వేయటానికి 206 00:12:21,324 --> 00:12:24,119 చాలా ధైర్యం, సాహసం ఉండాలి. 207 00:12:26,079 --> 00:12:28,832 బక్! బక్! బక్! బక్! 208 00:12:31,126 --> 00:12:33,295 బక్! బక్! బక్! బక్! 209 00:12:36,423 --> 00:12:37,883 అతని ప్రపంచం నాశనం చేస్తాను. 210 00:12:41,136 --> 00:12:43,972 ఈ ప్రక్రియను మీతో ప్రారంభించాలని ఉవ్విళ్ళూరుతున్నాను. 211 00:12:44,347 --> 00:12:46,224 ఈ ప్రయాణాన్ని కలిసి చేయబోతున్నాము, 212 00:12:46,558 --> 00:12:48,101 అద్భుతాన్ని సృష్టించబోతున్నాం. 213 00:12:50,645 --> 00:12:51,771 హేయ్... 214 00:12:52,439 --> 00:12:54,149 ఇప్పుడు ఆమె... 215 00:12:55,734 --> 00:12:57,068 మళ్ళీ ఆసుపత్రిలో చేర్చాము. 216 00:12:58,778 --> 00:12:59,613 మిక్కీ... 217 00:13:00,655 --> 00:13:01,698 నాకు బాధగా ఉంది. 218 00:13:01,781 --> 00:13:04,117 నిజంగా. నాకు కూడా. నిజంగా. 219 00:13:07,078 --> 00:13:08,622 యాష్లీని వెతకాలి. 220 00:13:11,625 --> 00:13:13,752 ఏదో కొత్తది ఉందని చెప్పారు. 221 00:13:14,544 --> 00:13:15,420 అతనికి చూపుదాం. 222 00:13:17,255 --> 00:13:18,882 మిక్కీ, నాకు బాధగా ఉంది. 223 00:13:19,466 --> 00:13:21,968 -మీ ఇంట్లో ఇది కొట్టేశాను. -అది కాదు, స్పూన్. 224 00:13:22,052 --> 00:13:23,220 యాష్లీ విషయం. 225 00:13:24,554 --> 00:13:27,682 -ఇది ఏమిటి? -సరే. పరవాలేదు. దానిగురించి కంగారుపడకు. 226 00:13:35,190 --> 00:13:36,358 ఏమిటి ఈ చోటు? 227 00:13:36,441 --> 00:13:41,613 నా అందమైన, అందమైన అమ్మాయిల్లారా, ఇది స్పిండెల్ ప్రదేశం. 228 00:13:44,699 --> 00:13:48,703 చాలామందికి ఇది రహస్యం, కొద్దిమంది అదృష్టవంతులకు స్వర్గం. 229 00:13:49,246 --> 00:13:50,080 సరే. 230 00:13:50,872 --> 00:13:52,374 ఇది పాడుబడిన బాయిలర్ గది కూడా. 231 00:13:52,457 --> 00:13:55,210 ఇది దాదాపు 1950ల నుంచో, ఏమో వాడబడటంలేదు. 232 00:14:00,340 --> 00:14:01,591 ఆ శబ్దం ఏమిటి? 233 00:14:03,176 --> 00:14:04,719 -ఉపాధ్యాయులు. -ఏమిటి? 234 00:14:04,803 --> 00:14:05,804 అవును. 235 00:14:05,887 --> 00:14:08,390 పాత గొట్టాలు శబ్దాన్ని ఎలా మోసుకెళతాయో తెలుసా? 236 00:14:08,932 --> 00:14:11,851 ఈ గొట్టం ఉపాధ్యాయుల గదిలోని సింక్కు వెళుతుంది. 237 00:14:11,935 --> 00:14:13,061 వాళ్ళ మాటలు వింటుంటాను. 238 00:14:13,186 --> 00:14:15,647 ఈ ఉపాధ్యాయులు చాలా, చాలా క్లిష్టమైన మనుషులు. 239 00:14:15,730 --> 00:14:18,108 ఇంకా, వాళ్ళకు మనం అంటే చాలా ద్వేషం. 240 00:14:18,608 --> 00:14:19,693 ఎలా కనుక్కున్నావు? 241 00:14:19,776 --> 00:14:21,861 నాన్న ఇక్కడ ప్రధాన కాపలాదారు, గుర్తుందా? 242 00:14:21,945 --> 00:14:23,572 మిల్ఫ్ క్లబ్కు వాడుకోనిస్తాడు. 243 00:14:23,697 --> 00:14:25,115 -ఏమిటి? -ఏమిటి ఇది? 244 00:14:26,575 --> 00:14:27,909 మ్యూజికల్స్ ఐ లవ్ ఫౌండేషన్. 245 00:14:27,993 --> 00:14:29,160 దీనిలో ఎవరుంటారు? 246 00:14:29,286 --> 00:14:30,161 సరే... 247 00:14:30,829 --> 00:14:34,415 -నేను ఉంటాను... -అతనికి అది చూపించు, స్పూన్! 248 00:14:35,750 --> 00:14:37,210 సరే. 249 00:14:47,637 --> 00:14:48,680 ఇదంతా ఏమిటి? 250 00:14:50,140 --> 00:14:51,474 డిలన్ షేక్స్. 251 00:14:51,558 --> 00:14:54,644 వాళ్ళు స్మారక కార్యక్రమం చేస్తున్నది ఈ పిల్లవాడికే. 252 00:14:54,769 --> 00:14:55,687 అవును, సరే. 253 00:14:55,770 --> 00:14:57,647 మనం కొద్ది రోజుల క్రితం అతని గురించి 254 00:14:57,856 --> 00:15:00,900 మాట్లాడుకున్న తర్వాత నా మెదడులో దురద మొదలయింది. 255 00:15:01,484 --> 00:15:03,903 డిలన్ షేక్స్, కాసెల్టన్లో అదృశ్యమైన పిల్లవాడు. 256 00:15:04,446 --> 00:15:06,906 యాష్లీ కెంట్, కాసెల్టన్లో అదృశ్యమైన అమ్మాయి. 257 00:15:07,198 --> 00:15:08,283 వాళ్ళకు సంబంధం ఉందా? 258 00:15:10,827 --> 00:15:14,497 డిలన్ షేక్స్ 1995లో లిటిల్ లీగ్ ఆట పూర్తవగానే అదృశ్యమయ్యాడు. 259 00:15:14,789 --> 00:15:16,583 వాళ్ళ నాన్నే అతన్ని చంపారని అంటారా? 260 00:15:16,791 --> 00:15:19,044 అవును, పోలీసులు అతనినే మొదటి నిందితుడిగా 261 00:15:19,127 --> 00:15:22,130 పరిగణించారు, కానీ అరెస్ట్ చేయటానికి సాక్ష్యం దొరకలేదు. 262 00:15:22,297 --> 00:15:23,548 వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడు? 263 00:15:23,632 --> 00:15:26,217 తెలియదు. ఆ తర్వాత కాసెల్టన్ నుంచి వెళ్ళిపోయాడు. 264 00:15:26,301 --> 00:15:29,596 సరే, అయితే ఒకే పట్టణం నుంచి ఇద్దరు పిల్లలు మాయమవటం విచిత్రం. 265 00:15:29,846 --> 00:15:31,181 ఒకరితో మరొకరికి సంబంధమేంటి? 266 00:15:31,306 --> 00:15:32,849 సరే, అక్కడే మెలిక ఉంది. 267 00:15:33,433 --> 00:15:35,226 డిలన్ సెప్టెంబర్ 8 మాయమయ్యాడు. 268 00:15:35,310 --> 00:15:36,603 ఆరోజే యాష్లీ మాయమయింది. 269 00:15:36,686 --> 00:15:38,146 అవును, 27 సంవత్సరాల ముందు. 270 00:15:38,229 --> 00:15:40,482 కానీ పరవాలేదు. దాని అర్థం ఏమిటి? 271 00:15:41,274 --> 00:15:45,779 -డిలన్ షేక్స్ నాన్న యాష్లీని తీసుకెళ్ళాడా? -అవకాశం ఉంది, కదా? 272 00:15:45,862 --> 00:15:47,155 కానీ ఇంకో అవకాశం ఉంది... 273 00:15:47,947 --> 00:15:50,575 డిలన్ మరియు యాష్లీల మధ్య సంబంధాలను పరిశీలించాలి. 274 00:15:50,659 --> 00:15:52,952 కానీ ఎలా? యాష్లీ గురించి ఆన్లైన్లో ఏమీలేదు. 275 00:15:53,078 --> 00:15:54,287 సోషల్ మీడియా ఏమీ లేదు. 276 00:15:54,371 --> 00:15:56,039 ఆమె అసలు లేనట్లుగా ఉంది. 277 00:16:00,835 --> 00:16:02,712 మనం అసలు చోట వెతకటం మర్చిపోయాం. 278 00:16:03,296 --> 00:16:04,214 ఎక్కడ? 279 00:16:06,174 --> 00:16:07,092 ఆమె లాకర్లో. 280 00:16:09,678 --> 00:16:11,388 దీనిలో ఏమీ లేదు. 281 00:16:12,305 --> 00:16:13,223 అవును. 282 00:16:13,348 --> 00:16:17,018 యాష్లీ వెళ్ళిపోయిన తర్వాత స్కూల్ వాళ్ళు దాన్ని ఖాళీ చేసి ఉండవచ్చు. 283 00:16:18,561 --> 00:16:19,521 అయుండొచ్చు. 284 00:16:21,064 --> 00:16:22,315 మిత్రులారా? 285 00:16:24,567 --> 00:16:27,487 ఇది మన ప్రతి కదలికనూ రోజంతా రికార్డ్ చేస్తుంది. 286 00:16:30,073 --> 00:16:32,909 యాష్లీ మాయమైనరోజున సెక్యూరిటీ దృశ్యాలను మనం తీసుకుంటే, 287 00:16:32,992 --> 00:16:35,370 ఆ రోజున ఏమయిందో మనకు అర్థమవుతుంది. 288 00:16:35,870 --> 00:16:37,831 ఆమెకు ఏమయిందో మనకు తెలియవచ్చు. 289 00:16:38,123 --> 00:16:40,083 సరే, ఆ దృశ్యాలు మనకు ఎలా దొరుకుతాయి? 290 00:16:40,165 --> 00:16:44,462 అవును, యాష్లీ మాయమైన రోజు ప్రతి నిఘా కెమెరానుంచి ప్రతి సెకనునూ 291 00:16:44,546 --> 00:16:47,757 డౌన్ లోడ్ చేయటం అంటే 292 00:16:47,841 --> 00:16:49,551 తప్పనిసరిగా కష్టం అవుతుంది. 293 00:16:51,594 --> 00:16:55,432 సరే, యాష్లీ మాయమైన రోజున ప్రతి నిఘా కెమెరా నుంచి ప్రతి సెకనునూ 294 00:16:55,557 --> 00:16:56,474 డౌన్ లోడ్ చేశాను. 295 00:16:56,558 --> 00:16:57,517 -ఎలా చేశావు? -నిజమా? 296 00:16:57,684 --> 00:16:59,853 బేలీ బేరియోస్ జిమ్ క్లాస్ ఎగ్గొట్టటానికి 297 00:16:59,936 --> 00:17:03,356 కుంటుతుందేమో అని అనుమానంతో సెక్యూరిటీ సిస్టమ్ను హ్యాక్ చేశాను. 298 00:17:03,440 --> 00:17:05,483 ఆమెకు మోకాళ్ళ నొప్పి ఉంది, వెధవ. 299 00:17:05,567 --> 00:17:07,819 సరే. నా అనుమానం నిజమని చెప్పానా? 300 00:17:08,194 --> 00:17:10,780 మిత్రులారా, ఇంత వీడియోను చూడాలంటే రోజులు పడుతుంది. 301 00:17:10,864 --> 00:17:12,490 -వంతులవారీగా చూడాలి. -మొదట నేను. 302 00:17:12,574 --> 00:17:14,534 రోజూ రానని నా ఉపాధ్యాయులకు చెప్పాను. 303 00:17:14,784 --> 00:17:15,617 నువ్వు? 304 00:17:16,911 --> 00:17:19,122 ఇష్టమొచ్చినప్పుడు చదువుకుంటాను మిక్కీ. 305 00:17:20,582 --> 00:17:23,917 మీకు ఇష్టమైతే, నేను మొదట చూస్తాను. 306 00:17:53,239 --> 00:17:54,866 నాకు చాలా కంగారుగా ఉంది మిక్కీ. 307 00:17:55,116 --> 00:17:56,284 నీకు కంగారుగా ఉందా? 308 00:17:56,910 --> 00:17:58,453 హేయ్, అంతా బాగానే అవుతుంది. 309 00:17:58,536 --> 00:17:59,954 మిక్కీ, అలా చెప్పటం సులభం. 310 00:18:00,038 --> 00:18:02,165 అంటే, నీవు స్పానిష్ బాగా మాట్లాడతావు. 311 00:18:02,248 --> 00:18:03,750 -సరే. -స్పానిష్ మాట్లాడాలని 312 00:18:03,833 --> 00:18:05,376 చూస్తే నా మాటలు తడబడతాయి. 313 00:18:05,460 --> 00:18:07,086 ఎక్కువగా ఆలోచిస్తున్నావు. 314 00:18:07,170 --> 00:18:09,631 స్పానిష్ కవిత్వం లాంటిది. 315 00:18:10,048 --> 00:18:12,675 నువ్వు స్పానిష్ భాషలో ఆలోచించాలి. 316 00:18:13,134 --> 00:18:14,803 నీ శరీరంలో దాన్ని ఇముడ్చుకోవాలి. 317 00:18:14,886 --> 00:18:17,388 "నీ శరీరంలో ఇముడ్చుకోవాలి" అన్నావా? 318 00:18:17,680 --> 00:18:20,725 సరే. స్పానిష్ మాట్లాడేవారు. 319 00:18:21,226 --> 00:18:25,730 ఒక ఉద్రేకపూరిత సంభాషణ ఎలా ఉంటుందో చూద్దాం. 320 00:18:26,731 --> 00:18:29,526 యాష్లీ, మిక్కీ, మీరు రండి. 321 00:18:30,693 --> 00:18:31,528 ఏయ్! ఆగు! 322 00:18:31,611 --> 00:18:32,946 ఇది నా పార్కింగ్ స్థలం! 323 00:18:33,112 --> 00:18:34,823 కాదు సార్! ఈ పార్కింగ్ స్థలం... 324 00:18:35,907 --> 00:18:37,742 ఇది నాది. 325 00:18:37,826 --> 00:18:40,078 కాదు. నీకు అర్థం కావటంలేదేమో. 326 00:18:40,161 --> 00:18:44,040 ఎన్నో ఏళ్ళుగా ఇది నా పార్కింగ్ స్థలం. 327 00:18:48,169 --> 00:18:51,297 అది నిరూపించండి లేదా నేను ఇక్కడే పార్క్ చేస్తాను! 328 00:18:57,887 --> 00:18:59,180 మికీ 329 00:18:59,264 --> 00:19:02,475 సరే, నా పేరు ఆ బోర్డ్పై ఉంది. 330 00:19:03,393 --> 00:19:05,103 ఓహ్, అవును! 331 00:19:07,146 --> 00:19:08,398 ఓహ్, అవును. 332 00:19:10,400 --> 00:19:16,364 మీ పేరు బోర్డ్పైన ఉన్నమాట నిజం, అయితే మీరు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. 333 00:19:18,408 --> 00:19:20,034 సరే, ధన్యవాదాలు. 334 00:19:32,463 --> 00:19:33,339 ఏయ్. 335 00:19:33,423 --> 00:19:34,465 ఏయ్. బాగానే ఉన్నావా? 336 00:19:34,841 --> 00:19:36,092 అవును. బాగున్నాను. 337 00:19:36,885 --> 00:19:37,886 టైమ్ ఎంత అయింది? 338 00:19:38,052 --> 00:19:39,679 5:00 గం. అయింది. ఇప్పుడు నా వంతు. 339 00:19:39,762 --> 00:19:41,014 అబ్బా. నేను వెళ్ళాలి. 340 00:19:42,515 --> 00:19:43,892 -ఎక్కడకు? -ఇంటికి. 341 00:19:44,434 --> 00:19:47,186 రేచెల్తో చరిత్ర ప్రాజెక్ట్ చేస్తున్నాను ఆలస్యమయింది. 342 00:19:47,270 --> 00:19:49,564 -వెళతాను. -వెళ్ళిరా. 343 00:19:52,275 --> 00:19:55,445 ఛీర్ ప్రిన్సెస్ను ఎక్కువసేపు వేచి ఉండేలా చేయలేను. 344 00:20:09,292 --> 00:20:12,420 ఇదిగో, నా అందమైన కుర్రాడు. 345 00:20:12,503 --> 00:20:13,671 నానమ్మా! 346 00:20:13,755 --> 00:20:14,964 నానమ్మకు ముద్దులు ఇవ్వు! 347 00:20:15,298 --> 00:20:17,008 నాకు కౌగిలింతలు చాలు బాబూ. 348 00:20:18,217 --> 00:20:19,969 మిమ్మల్ని చూడటం నమ్మలేకపోతున్నాను. 349 00:20:20,053 --> 00:20:22,680 ఎత్తు పెరిగావా? వీడు ఎత్తు పెరిగాడు. కనీసం అడుగు. 350 00:20:22,764 --> 00:20:24,057 ఇంకా అందంగా అయ్యాడు. 351 00:20:24,140 --> 00:20:27,060 అది ఆశ్చర్యమేమీ కాదు. ఆశ్చర్యమేమిటంటే 352 00:20:27,143 --> 00:20:31,272 ఆ అందమైన అమ్మాయి రేచెల్ను అంతసేపు వేచి ఉండేలా ఎందుకు చేశావని. 353 00:20:35,568 --> 00:20:37,070 నన్ను మన్నించు. 354 00:20:37,195 --> 00:20:38,029 పరవాలేదు. 355 00:20:38,112 --> 00:20:39,948 నువ్వు ముద్దుల పనిలో ఉన్నావు. 356 00:20:41,908 --> 00:20:43,159 నీకు ఆకలి వేస్తూ ఉండవచ్చు. 357 00:20:43,242 --> 00:20:44,786 తింటానికి ఒకటి చేసి పెడతాను. 358 00:20:44,911 --> 00:20:45,995 నాయనమ్మా, శ్రమపడవద్దు. 359 00:20:46,079 --> 00:20:49,165 మేము కిందకు వెళ్ళి చరిత్ర ప్రాజెక్ట్ చేయాలి. 360 00:20:49,624 --> 00:20:51,834 వాళ్ళకు హోమ్ వర్క్ ఉంది ఎలెన్. 361 00:20:51,918 --> 00:20:53,670 నాన్నా, ఆగు, నిజంగా. 362 00:20:53,753 --> 00:20:55,546 నిజమైన హోమ్ వర్క్ తాతా. 363 00:20:56,172 --> 00:20:57,507 ఏమి ప్రాజెక్ట్? 364 00:20:57,590 --> 00:20:59,342 లిజ్జీ సోబెక్ అనే పిల్ల గురించి. 365 00:20:59,550 --> 00:21:01,719 లిజ్జీ... లిజ్జీ సోబెక్? 366 00:21:01,803 --> 00:21:03,429 -అవును. -మీకు ఆమె గురించి తెలుసా? 367 00:21:03,513 --> 00:21:04,472 కచ్చితంగా, తెలుసు. 368 00:21:04,555 --> 00:21:06,975 ఆష్విజ్ వెళ్ళే రైలులో పిల్లలను ఆమె రక్షించింది. 369 00:21:07,141 --> 00:21:08,476 చాలామందికి ఆమె తెలియదు, 370 00:21:08,559 --> 00:21:11,270 కొందరు ఆమె లేదని, ఆమెది ఒక కథ అని అనుకుంటారు. 371 00:21:11,354 --> 00:21:13,648 కానీ ఆమె మాకు ఒక కథానాయకురాలు. 372 00:21:13,731 --> 00:21:14,899 చాలా స్ఫూర్తిదాయకం. 373 00:21:14,983 --> 00:21:15,942 వావ్. 374 00:21:16,234 --> 00:21:17,735 ఆమెకు న్యాయం చేయగలమని ఆశ. 375 00:21:17,819 --> 00:21:19,112 నాకు సందేహం లేదు. 376 00:21:19,696 --> 00:21:22,365 -నాన్నా, వాళ్ళను పని చేసుకోనివ్వు. -మంచిది, మంచిది. 377 00:21:22,740 --> 00:21:24,367 తలుపు తెరచి ఉంచండి, మీ ఇద్దరూ. 378 00:21:24,575 --> 00:21:25,535 తాతా. 379 00:21:28,204 --> 00:21:29,372 పరవాలేదు. 380 00:21:29,580 --> 00:21:30,623 కంగారుపడవద్దు. 381 00:22:15,168 --> 00:22:16,085 యాష్లీ. 382 00:22:30,808 --> 00:22:31,809 అబ్బా. 383 00:22:34,520 --> 00:22:37,190 మేము బాగున్నాము నాన్నా. ప్రశాంతంగా ఉండు, ఆనందించు. 384 00:22:38,399 --> 00:22:39,317 ఆశ్చర్యం! 385 00:22:42,945 --> 00:22:43,988 షీరా. 386 00:22:45,239 --> 00:22:46,699 హేయ్, రండి. 387 00:22:47,909 --> 00:22:49,994 మీ నాన్నను సూపర్ మార్కెట్ దగ్గర కలిశాను, 388 00:22:50,078 --> 00:22:53,581 ఆయన మీ అమ్మకు చెప్పారు, ఆమె ఫోన్ చేసింది, మేము వచ్చేశాం. కనుక... 389 00:22:54,832 --> 00:22:56,209 పాత రోజుల్లోలాగా. 390 00:22:58,836 --> 00:22:59,962 ఏయ్. 391 00:23:00,088 --> 00:23:03,633 -ఏయ్ రేచెల్, అందంగా ఉన్నావు. -ధన్యవాదాలు. 392 00:23:03,716 --> 00:23:05,384 ఈ మధ్య ఇంటికి రావటంలేదే రేచెల్. 393 00:23:05,468 --> 00:23:07,136 ఛీర్లీడింగ్తో తీరికలేదా? 394 00:23:07,386 --> 00:23:08,304 -నాన్నా. -ఏమిటి? 395 00:23:09,680 --> 00:23:10,890 అలాంటిదే. 396 00:23:12,350 --> 00:23:13,810 నిజానికి చాలా హోమ్ వర్క్ ఉంది. 397 00:23:13,893 --> 00:23:15,103 నేను వెళ్ళాలి. 398 00:23:15,186 --> 00:23:17,021 కానీ మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది. 399 00:23:17,230 --> 00:23:18,231 మళ్ళీ కలుస్తాను. 400 00:23:27,907 --> 00:23:29,575 ఏయ్. నీ సంగతి ఏమిటి? 401 00:23:29,659 --> 00:23:30,785 మెసేజ్లకు బదులివ్వలేదు. 402 00:23:31,035 --> 00:23:32,453 ఇవాళ స్కూల్కు రాలేదు. 403 00:23:32,537 --> 00:23:34,497 -తీరిక లేదు. -బోలిటార్ కోసం తీరిక ఉంది. 404 00:23:34,580 --> 00:23:36,415 చరిత్ర ప్రాజెక్ట్ కలిసి చేస్తున్నాం. 405 00:23:36,499 --> 00:23:38,334 నాకున్న తలనొప్పి పనులలో అది ఒకటి. 406 00:23:38,417 --> 00:23:39,961 ఎప్పుడైనా ఆలోచిస్తావా నాకు... 407 00:23:40,044 --> 00:23:40,878 ఇక్కడకు రా. 408 00:23:40,962 --> 00:23:42,547 ఒత్తిడి ఉంటే చెప్పు, సరేనా? 409 00:23:42,630 --> 00:23:43,548 సాయం చేయగలను. 410 00:23:43,965 --> 00:23:44,882 సరేనా? 411 00:23:49,762 --> 00:23:50,847 అదీ కాక... 412 00:23:52,473 --> 00:23:54,433 నా దగ్గర ఒక ఇంద్రజాల దండం ఉంది. 413 00:23:55,560 --> 00:23:57,937 -దానితో అంతా పోతుంది. -అంతా చెడగొడతావు. 414 00:23:58,020 --> 00:23:59,438 చెత్త చేశాడు. 415 00:23:59,522 --> 00:24:01,983 -నిజంగా, నమ్మలేను... -ఊరుకో, తమాషాకు అన్నాను! 416 00:24:04,360 --> 00:24:05,903 నా నుంచి దూరంగా వెళ్ళిపో! 417 00:24:08,990 --> 00:24:10,867 నువ్వు... ఏమిటిది రేచెల్? 418 00:24:10,950 --> 00:24:13,077 మన్నించు. నేను కొట్టాలని అనుకోలేదు. 419 00:24:26,215 --> 00:24:27,216 అక్కడే ఉండు! 420 00:24:32,555 --> 00:24:34,557 నా నుంచి దూరంగా వెళ్ళిపో! 421 00:24:40,938 --> 00:24:44,483 నేను మీ నానమ్మవైపు తిరిగి, "బ్రాడ్ ఎక్కడ?" అని అడిగాను. 422 00:24:44,901 --> 00:24:48,863 బస్ దిగగానే, మాకు అర్థమయింది, మీ నాన్న దిగలేదు అని. 423 00:24:48,946 --> 00:24:50,406 అతని వయసు ఆరు మాత్రమే. 424 00:24:50,865 --> 00:24:53,201 కానీ షీరా ఆ బస్ నంబర్ గుర్తు పెట్టుకుంది. 425 00:24:53,743 --> 00:24:54,827 463. 426 00:24:55,119 --> 00:24:57,705 మీ నాన్నను పట్టుకోవటానికి రెండు గంటలు పట్టింది. 427 00:24:58,122 --> 00:24:59,207 తనని పట్టుకున్నప్పుడు, 428 00:25:00,124 --> 00:25:04,003 అతను బస్ డ్రైవర్తో మంచి స్నేహితుడైపోయాడు. 429 00:25:04,420 --> 00:25:06,547 ప్రయాణీకులు అతనికి తినటానికి పెట్టారు. 430 00:25:07,548 --> 00:25:09,342 అలాంటి పిల్లవాడు అతను. 431 00:25:11,344 --> 00:25:12,261 ఆకర్షిస్తాడు. 432 00:25:26,901 --> 00:25:29,904 మా నాన్నతో నీకు హైస్కూల్లో వ్యవహారం ఉండేదా? 433 00:25:29,987 --> 00:25:31,030 ఇక చాలు, ట్రాయ్. 434 00:25:31,864 --> 00:25:33,199 పరవాలేదు కెన్. 435 00:25:34,242 --> 00:25:36,827 అవును. నిజానికి మా మధ్య సంబంధం ఉండేది. 436 00:25:36,911 --> 00:25:39,205 ఇంకా నువ్వు మా అమ్మకు స్నేహితురాలివి. 437 00:25:39,497 --> 00:25:40,581 దగ్గర స్నేహితురాలిని. 438 00:25:42,250 --> 00:25:43,417 ఇప్పుడు వింతగా లేదా? 439 00:25:44,669 --> 00:25:47,630 నీ మాజీ ప్రేమికుడు నీ స్నేహితురాలిని పెళ్ళిచేసుకోవటం? 440 00:25:47,880 --> 00:25:49,590 చాలు బాబూ. అదంతా పురాతన చరిత్ర. 441 00:25:50,716 --> 00:25:53,177 డిగ్రీ తర్వాత నేను బయటకు వెళ్ళిపోయాను. 442 00:25:53,302 --> 00:25:57,723 -కనుక ఆ సంబంధాలన్నీ అయిపోయాయి. -అంతా మంచికే జరిగింది. 443 00:25:58,057 --> 00:26:00,726 హానా, కెన్ మంచిగా కలిసి ఉన్నారు. 444 00:26:00,977 --> 00:26:02,103 అద్భుతమైన పిల్లలు. 445 00:26:03,145 --> 00:26:05,147 -ఏం చెప్పదలుచుకున్నావు అమ్మా? -ఏమీ లేదు. 446 00:26:05,773 --> 00:26:07,566 జీవితం మన నిర్ణయాలకు ప్రతిబింబం. 447 00:26:08,359 --> 00:26:12,488 ఉదాహరణకు, నువ్వు సియాటిల్లో న్యాయశాస్త్ర రంగంలో బాగా స్థిరపడ్డావు. 448 00:26:13,197 --> 00:26:16,867 నీ ఉద్దేశ్యంలో నా పెళ్ళి విఫలం, పిల్లల్ని కనలేదు అనే కదా. 449 00:26:16,951 --> 00:26:18,703 నువ్వు పిల్లల్ని కనలేకపోతే 450 00:26:19,245 --> 00:26:22,081 అది నా తప్పు కాదు. 451 00:26:22,164 --> 00:26:24,125 నేను పట్టించుకోను. పిల్లలు అవసరంలేదు. 452 00:26:24,250 --> 00:26:25,334 నాకు పిల్లలు లేరు. 453 00:26:25,835 --> 00:26:26,877 నాకు సమస్య కాదు. 454 00:26:27,253 --> 00:26:30,131 -నీకే అది సమస్యగా ఉంది. -సరే, అది కేవలం... 455 00:26:32,425 --> 00:26:36,971 పిల్లల అవసరం బాగా ఉన్న ఈ సమయంలో నీకు వారు లేరు. 456 00:26:40,057 --> 00:26:43,311 సరే. నువ్వు ఏదయినా అనుకో. 457 00:26:57,241 --> 00:26:59,035 నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలుసు. 458 00:27:00,953 --> 00:27:03,122 మళ్ళీ కలిశాం. హైస్కూల్లో ఉన్నట్లుంది. 459 00:27:03,205 --> 00:27:04,206 ఓహ్, భగవాన్. 460 00:27:05,333 --> 00:27:06,959 సరే, మళ్ళీ కప్పు పైన కలిశాం. 461 00:27:07,293 --> 00:27:08,210 స్వాగతం. 462 00:27:10,254 --> 00:27:11,505 అది కొద్దిగా ఇస్తావా? 463 00:27:12,298 --> 00:27:14,091 అడుగు, నీకు అందుతుంది. 464 00:27:17,428 --> 00:27:18,888 మీ అమ్మను అలా చూడటం అరుదు. 465 00:27:20,431 --> 00:27:22,433 ఆమె అలాగే ఉంటుంది. 466 00:27:26,937 --> 00:27:28,189 బాగానే ఉన్నావా? 467 00:27:29,940 --> 00:27:30,858 బాగున్నాను. 468 00:27:32,860 --> 00:27:33,861 అది కేవలం... 469 00:27:34,570 --> 00:27:37,531 నేను పిల్లల్ని కనలేదు కాబట్టి, 470 00:27:37,615 --> 00:27:39,825 నాకు తల్లి లక్షణాలు లేవని ఆమె ఉద్దేశ్యమా? 471 00:27:40,242 --> 00:27:41,952 ఆమె మాటల్లో అర్థం లేదు. 472 00:27:42,745 --> 00:27:44,789 నీకు ఉన్నాయి. నీకున్నాయని నీకు తెలుసు. 473 00:27:48,042 --> 00:27:50,086 నన్ను ఆమె ఇలా ఎందుకు నొప్పిస్తుంది. 474 00:27:50,169 --> 00:27:51,462 ఆమె నీ తల్లి. 475 00:27:52,254 --> 00:27:55,174 నీకు ఆమె చిరాకు పుట్టించాలని రాసిపెట్టి ఉంది. 476 00:27:56,133 --> 00:27:57,593 ట్రాయ్తో నేను పడుతున్నాను. 477 00:27:57,718 --> 00:28:00,805 భగవాన్, వాడికి నా పొడ అంటే గిట్టదు. 478 00:28:01,931 --> 00:28:03,391 మిక్కీ కూడా అంతే. 479 00:28:06,644 --> 00:28:08,020 నా ప్రవర్తనకు మన్నించు. 480 00:28:08,729 --> 00:28:10,564 ఆ రోజు స్టేషన్లో. 481 00:28:10,648 --> 00:28:12,149 నేను... మనం ఎదురుపడినప్పుడు. 482 00:28:12,358 --> 00:28:13,859 వద్దు, అలా అనుకోకు. 483 00:28:14,235 --> 00:28:17,530 నీకు కోపం ఉండటంలో న్యాయం ఉంది. 484 00:28:18,114 --> 00:28:23,327 నేను 18 ఏళ్ళ వయస్సులో స్వార్థంగా ఆలోచించాను. 485 00:28:24,745 --> 00:28:25,663 ఒప్పుకుంటాను. 486 00:28:28,833 --> 00:28:30,167 మళ్ళీ కొత్తగా ఆరంభిస్తే? 487 00:28:30,251 --> 00:28:31,752 పాత విషయాలన్నీ మర్చిపోదామా? 488 00:28:33,963 --> 00:28:34,922 అది బాగుంటుంది. 489 00:28:37,133 --> 00:28:39,343 నువ్వు నా మగవాడిని దొంగిలించినా కూడా. 490 00:28:39,593 --> 00:28:42,138 నీకు అతను ఇప్పుడు కావాలా? ప్లీజ్? 491 00:28:42,221 --> 00:28:45,266 నాకు వద్దు. నాకు వద్దు, నిజంగా. నాకు వద్దు. 492 00:28:45,349 --> 00:28:47,351 ఏర్పాటు చేసి ఉండేదాన్ని. 493 00:28:50,813 --> 00:28:55,317 యాష్లీ ఏడుస్తుండగా చూసినప్పుడు, నేను ఆమెను ఇంకా వెనక్కు వెళ్ళి చూసాను. 494 00:28:56,485 --> 00:28:57,695 ఎందుకు ఏడుస్తోందో అని. 495 00:28:57,778 --> 00:29:01,240 కానీ సమస్య ఏమిటంటే, యాష్లీ బయటకు వెళ్ళగానే, వీడియో లేదు. 496 00:29:02,658 --> 00:29:04,869 ఆమె వచ్చిన తలుపును ఎన్ని కెమెరాలు చూశాయి? 497 00:29:06,036 --> 00:29:07,037 రెండు. 498 00:29:07,329 --> 00:29:08,581 మనం చెరొకటి చూద్దాం. 499 00:29:08,664 --> 00:29:09,540 అలాగే. 500 00:29:11,125 --> 00:29:12,001 ఎల్లెన్... 501 00:29:14,420 --> 00:29:15,880 ఇది సరైన సమయం కాదు, ఆలెన్. 502 00:29:16,088 --> 00:29:17,965 సరైన సమయం ఎప్పుడూ ఉండదు. 503 00:29:18,048 --> 00:29:19,133 కానీ, మనం ఇలా ఉన్నాం. 504 00:29:19,383 --> 00:29:20,342 మన కొడుకు పోయాడు! 505 00:29:20,426 --> 00:29:21,719 దాని గురించి మాట్లాడాలి. 506 00:29:21,802 --> 00:29:23,137 ఆ విషయం నాకు తెలియదా? 507 00:29:23,220 --> 00:29:24,889 నీకు ఏమి తెలుసో నాకు తెలియదు. 508 00:29:24,972 --> 00:29:26,515 ఎందుకంటే నువ్వు నాకు చెప్పవు! 509 00:29:26,599 --> 00:29:27,975 అలాగే నేను బతుకుతున్నాను. 510 00:29:29,018 --> 00:29:32,313 నేను ప్రతిరోజూ అలాగే మేలుకొంటున్నాను. 511 00:29:34,231 --> 00:29:37,693 కోపంతో అరవకుండా అలా నేను ఉండగలుగుతున్నాను 512 00:29:37,776 --> 00:29:40,154 ఎందుకంటే మన కొడుకును మననుంచి తీసుకెళ్ళిపోయాడు. 513 00:29:41,822 --> 00:29:42,823 నాన్నా? 514 00:29:43,949 --> 00:29:46,744 నాన్నా? నీ చేతులకున్న రక్తం కడుక్కుంటున్నావు. 515 00:29:47,286 --> 00:29:48,245 ఏమయింది? 516 00:29:50,247 --> 00:29:51,665 -ఏమీ లేదు. -అమ్మ ఎక్కడ? 517 00:29:51,874 --> 00:29:54,001 ఆమె బాగుంది. కొద్ది గంటల్లో కలుస్తాము. 518 00:29:54,168 --> 00:29:56,420 -అయితే నేను అంతా సర్దనా? -ఏయ్ మిక్కీ. 519 00:29:56,712 --> 00:29:59,757 ఏయ్. మనకు సర్దటానికి సమయంలేదు. 520 00:29:59,840 --> 00:30:01,675 -మనం వెళ్ళాలి. -నాన్నా, భయమేస్తోంది. 521 00:30:01,759 --> 00:30:04,011 సరే, ఇక్కడకు రా. ఇక్కడకు రా. 522 00:30:04,470 --> 00:30:05,471 నా మాట విను. 523 00:30:07,598 --> 00:30:09,558 మీ అమ్మ, నేను ముఖ్యమైన పని చేస్తున్నాం. 524 00:30:10,267 --> 00:30:13,562 నిస్సహాయులైనవారికి సాయం చేస్తున్నాం. 525 00:30:14,188 --> 00:30:16,190 కానీ, మంచి పని చేయటం వలన ఈ ప్రపంచంలో ఉన్న 526 00:30:16,273 --> 00:30:18,067 చెడు నుంచి తప్పించుకోలేము. 527 00:30:18,150 --> 00:30:19,818 నా పని దాన్ని గమనించటం. 528 00:30:20,653 --> 00:30:22,029 దానికి ముందు నిలుచోవటం. 529 00:30:22,571 --> 00:30:25,574 అది విఫలమైతే, నా కుటుంబాన్ని కాపాడటం నా విధి. 530 00:30:25,908 --> 00:30:26,867 సరేనా? 531 00:30:28,786 --> 00:30:30,120 అదే నేను ఇప్పుడు చేసేది. 532 00:30:30,454 --> 00:30:31,747 నీవు, నేను వెళ్ళాలి. 533 00:30:32,498 --> 00:30:33,415 మనం వెళ్ళాలి. 534 00:30:36,293 --> 00:30:37,503 నీకూ ఆయన గుర్తొస్తాడు. 535 00:30:38,003 --> 00:30:39,838 మీరు పోట్లాడుకోవటం అతనికిష్టం ఉండదు. 536 00:30:41,173 --> 00:30:42,424 మిక్కీ... 537 00:30:48,180 --> 00:30:51,392 పాత ఇంటికి రావటం కొద్దిగా కష్టం. 538 00:30:51,850 --> 00:30:53,894 ప్రతి గదిలో మీ నాన్న ముఖం కనిపిస్తుంది. 539 00:30:55,604 --> 00:30:57,606 నీవు ఇక్కడ ఉండటంవలన కొంత మెరుగుగా ఉంది. 540 00:31:00,025 --> 00:31:01,986 ఇక్కడ దారుణంగా ఉంది, కదా? 541 00:31:03,237 --> 00:31:05,614 భరించలేని శీతాకాలం, ఘోరమైన వేసవికాలం. 542 00:31:07,533 --> 00:31:09,243 మీ నాన్న, మైరన్లకు ఈ ఊరు ఇష్టం. 543 00:31:09,743 --> 00:31:11,745 వాళ్ళు బాగా కలిసిపోయారు. 544 00:31:12,037 --> 00:31:14,248 ఎప్పుడూ పోట్లాడుకోలేదు, మన అదృష్టం కదా, ఎల్? 545 00:31:14,331 --> 00:31:15,332 ఎప్పుడూ లేదు. 546 00:31:16,333 --> 00:31:18,085 ఇప్పుడు మీ అత్త షీరా... 547 00:31:18,168 --> 00:31:20,879 సరే, పరవాలేదు, మనకు షీరా తలనొప్పి అయుండొచ్చు, 548 00:31:22,464 --> 00:31:24,508 మీ నాన్నకు తన అక్క 549 00:31:25,009 --> 00:31:27,595 బాస్కెట్ బాల్ ఆడే సమయంలో సాయపడటం అంటే ఎంతో ఇష్టం. 550 00:31:28,804 --> 00:31:33,601 మీ అత్త, మామయ్య, నాన్న మన ఇంటిముందే ఉండేవారు ఎప్పుడూ. 551 00:31:33,809 --> 00:31:34,727 బాస్కెట్ బాల్ ఆటలో. 552 00:31:35,311 --> 00:31:36,770 గంటల తరబడి. 553 00:31:37,980 --> 00:31:39,273 ఏయ్... 554 00:31:39,815 --> 00:31:42,443 నువ్వు బాస్కెట్ బాల్ ఆడటం మానేశావని విన్నాము. 555 00:31:42,526 --> 00:31:44,153 ఆలెన్, వాడిని విసిగించకు. 556 00:31:44,528 --> 00:31:47,281 విసిగిస్తున్నానా? నా మనవడిని ఊరికే అడుగుతున్నాను. 557 00:31:52,453 --> 00:31:53,370 నాకు తెలియదు. 558 00:31:56,123 --> 00:31:57,458 నాకు ఆడాలని అనిపించటంలేదు. 559 00:32:00,753 --> 00:32:01,670 నాకు అర్థమయింది. 560 00:32:03,380 --> 00:32:04,298 నీ ఇష్టం. 561 00:32:07,718 --> 00:32:09,678 మా తాత ఒకటి చెప్పాడు. 562 00:32:11,889 --> 00:32:15,309 "తండ్రి కొడుకుకు ఏదైనా ఇస్తే, ఇద్దరూ నవ్వుతారు. 563 00:32:16,310 --> 00:32:20,439 "కొడుకు తండ్రికి ఏదైనా ఇస్తే, ఇద్దరూ ఏడుస్తారు." 564 00:32:23,484 --> 00:32:24,652 యూదు భాషలో బాగుంటుంది. 565 00:32:29,573 --> 00:32:30,908 ఏయ్, నాకు ఒకటి దొరికింది. 566 00:32:35,037 --> 00:32:36,330 ఇక్కడ, పైన మూలలో. 567 00:32:37,498 --> 00:32:38,332 కామ్ 19 ఎన్డబ్ల్యూ ఫీల్డ్ 568 00:32:42,586 --> 00:32:44,296 అసలు ఏమయింది? 569 00:32:45,005 --> 00:32:47,883 ఏదో ఛీర్ లీడర్ ఆటలో గొడవ. 570 00:32:49,718 --> 00:32:50,803 చెత్త అమ్మాయిలు. 571 00:32:58,686 --> 00:32:59,978 ఆగు. ఎక్కడకెళ్ళింది? 572 00:33:00,688 --> 00:33:02,523 ఈ వైపు మైదానాన్ని చూపే కెమెరా ఉందా? 573 00:33:03,232 --> 00:33:06,026 లేదు, అక్కడ కెమెరా లేదు. 574 00:33:06,360 --> 00:33:07,361 మనం చూస్తూ ఉందాము. 575 00:33:18,122 --> 00:33:20,457 ఏయ్, నువ్వు... 576 00:33:20,541 --> 00:33:22,918 ఒక ఆట ఆడతావా? 577 00:33:23,585 --> 00:33:24,628 లేదు, ఆడను. 578 00:33:25,838 --> 00:33:27,631 నాతో ఓడిపోతానని భయమా? 579 00:33:27,715 --> 00:33:29,299 అర్థమయింది. పరవాలేదు. 580 00:33:29,383 --> 00:33:33,470 కాదు, నేను నీతో కలిసి గచ్చు తుడిచేటప్పుడు నువ్వు మూలగటం నాకు ఇష్టంలేదు. 581 00:33:38,267 --> 00:33:42,813 ఇందాక అక్కడ ఉద్వేగ భరిత సంభాషణ జరిగిందని నానమ్మ చెప్పింది. 582 00:33:42,896 --> 00:33:43,814 అది ఏంటో చెబుతావా? 583 00:33:44,523 --> 00:33:45,941 వద్దు. ఇష్టం లేదు. 584 00:33:53,323 --> 00:33:55,868 అన్నట్లు, నువ్వు అన్నది నిజమే. 585 00:33:56,410 --> 00:34:01,290 మీ అమ్మ మీ నాన్నకు సరైన జోడీ కాదని నేను అనుకున్నాను. 586 00:34:04,460 --> 00:34:05,461 ఎందుకు? 587 00:34:07,963 --> 00:34:13,927 సరే, ఎందుకంటే, ఒక ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి వచ్చి 588 00:34:14,011 --> 00:34:16,929 నా తమ్ముడిని ఎగరేసుకుపోయింది. 589 00:34:17,014 --> 00:34:20,058 అతను తన జీవిత ప్రణాళికలు అన్నీ మార్చేయటం ఆరంభించాడు. 590 00:34:20,809 --> 00:34:22,518 అంటే, వాళ్ళు ఇద్దరూ కలిసి... 591 00:34:22,643 --> 00:34:25,481 -అది చాలా ఎక్కువ. -అవును, కఠినం. 592 00:34:33,822 --> 00:34:38,534 సరే, బాస్కెట్బాల్ జట్టులో స్థానం కోసం ప్రయత్నించు. 593 00:34:38,869 --> 00:34:40,204 అలా అనుకోవటంలేదు. 594 00:34:41,621 --> 00:34:47,210 కనీసం బాస్కెట్బాల్ పార్టీకి నాతో వస్తావా? 595 00:34:48,462 --> 00:34:49,922 బాస్కెట్ బాల్ పార్టీ? 596 00:34:50,464 --> 00:34:53,967 అవును, అది కేవలం పునశ్చరణ. తినడానికి చాలా ఉంటాయి. 597 00:34:54,342 --> 00:34:55,886 వాగ్దానాలు చేయనవసరంలేదు. 598 00:34:56,719 --> 00:34:58,138 మీ నాన్న... 599 00:35:00,390 --> 00:35:03,060 మీ నాన్న నువ్వు ఇది ఆడాలని అనుకున్నాడు. 600 00:35:05,687 --> 00:35:07,314 కొడుకు తండ్రికి ఇస్తే? 601 00:35:08,607 --> 00:35:09,608 -ఏమిటి? -అవును. 602 00:35:10,150 --> 00:35:11,860 తాత నాకు చెప్పినది. 603 00:35:18,283 --> 00:35:19,910 స్పూన్ - ఒకటి దొరికింది. వస్తావా? 604 00:35:24,331 --> 00:35:26,625 వెళ్ళు, నీ మిత్రులతో గడుపు. 605 00:35:27,876 --> 00:35:29,795 నాతో ఓడిపోవటం తప్పించుకోవచ్చు. 606 00:35:30,128 --> 00:35:31,046 సరే, తప్పకుండా. 607 00:35:31,171 --> 00:35:32,089 కలలు కను. 608 00:35:32,881 --> 00:35:33,882 కలుస్తాను. 609 00:35:34,132 --> 00:35:35,008 కలుస్తాను. 610 00:35:37,386 --> 00:35:38,929 ఇది చూడు. 611 00:35:39,763 --> 00:35:44,017 ఈ దృశ్యాలు తెల్లవారు 3:00 గం. సమయానివి యాష్లీ మాయమయిన మరుసటి రోజు ఉదయానివి. 612 00:35:44,101 --> 00:35:45,102 సరే. 613 00:35:46,228 --> 00:35:47,062 కామ్ 06 నడవా 614 00:36:02,578 --> 00:36:04,329 లాకర్ అప్పటికే ఖాళీగా ఉంది. 615 00:36:04,538 --> 00:36:06,748 ఆ తలుపుపై విలియమ్ ది హిప్పో అయస్కాంతం తప్ప. 616 00:36:12,880 --> 00:36:14,006 అతను ఆక్టోఫేసా? 617 00:36:31,398 --> 00:36:33,567 -ఎక్కడకు? -గబ్బిలం మహిళను అడగటానికి. 618 00:36:33,650 --> 00:36:34,735 సరే, పద వెళదాం. 619 00:36:34,818 --> 00:36:36,570 వద్దు, ఒక్కడినే వెళతాను. 620 00:36:50,000 --> 00:36:51,376 -హాయ్. -హాయ్. 621 00:36:53,420 --> 00:36:55,255 మీ అమ్మ పార్టీలు బాగా ఇస్తుంది. 622 00:36:55,589 --> 00:36:59,426 అవును, తర్వాత శుభ్రం చేయటం కూడా చేస్తే బాగుంటుంది. 623 00:37:00,928 --> 00:37:01,970 ఏదైనా మర్చిపోయావా? 624 00:37:03,680 --> 00:37:05,140 అవును, మర్చిపోయాను. 625 00:37:15,108 --> 00:37:16,193 మళ్ళీ మొదలుపెడదాం. 626 00:41:07,424 --> 00:41:08,633 చాలా సేపు తీసుకున్నావు. 627 00:41:14,264 --> 00:41:15,307 అసలు విషయం ఇదీ. 628 00:41:15,724 --> 00:41:17,434 గొంతు గురించి సాధన చేయకుండా లేను. 629 00:41:17,517 --> 00:41:18,935 సాధన చేస్తూ ఉన్నాను. 630 00:41:19,144 --> 00:41:21,605 గత ఏడాది ఆడిషన్లో చెడగొట్టానని తెలుసు 631 00:41:21,688 --> 00:41:24,608 దానికి ముందు ఏడాది నేను బాగా చిన్నగా ఉన్నాను, 632 00:41:24,691 --> 00:41:26,276 నా గొంతు అప్పుడు సరిపోలేదు. 633 00:41:26,359 --> 00:41:27,903 నాకు ఉద్వేగాల పరంగా కష్టమైన... 634 00:41:27,986 --> 00:41:30,280 మిక్కీతో మనం కూడా వెళ్ళి ఉండాల్సింది. 635 00:41:30,447 --> 00:41:32,824 కానీ అతను మనల్ని రావద్దని స్పష్టంగా చెప్పాడు. 636 00:41:33,950 --> 00:41:37,829 అవును, కానీ ప్రమాదాన్ని గుర్తించటంలో మీ ఇద్దరికీ తెలివి లేదు. 637 00:41:37,913 --> 00:41:39,122 నిజమే. 638 00:41:39,581 --> 00:41:42,000 ఏం జరుగుతుందో నువ్వు చూశావా? 639 00:41:43,084 --> 00:41:46,379 మేకును తలపై కొట్టటం కాదు, 640 00:41:46,463 --> 00:41:49,257 కానీ అతను చూపిస్తున్నాడు, కదా? 641 00:41:49,925 --> 00:41:51,468 తన నాన్నను కాపాడలేకపోయాడు, 642 00:41:51,927 --> 00:41:53,136 తల్లిని కాపాడలేకపోయాడు. 643 00:41:53,220 --> 00:41:54,346 అందుకే యాష్లీని కాపాడాలని. 644 00:41:54,429 --> 00:41:55,388 అవును. 645 00:41:56,973 --> 00:41:58,183 బాగా ఆలోచించావు స్పూన్. 646 00:41:58,266 --> 00:41:59,976 నాలో ఆశ్చర్యాలు చాలా ఉన్నాయి. 647 00:42:01,269 --> 00:42:04,856 నీలో ఏవేవో చాలా ఉన్నాయి. 648 00:42:06,441 --> 00:42:07,734 మరి తర్వాత ఏమిటి? 649 00:42:07,943 --> 00:42:10,403 సన్ గ్లాస్లు పెట్టుకున్నవాడికంటే ముందు 650 00:42:10,487 --> 00:42:12,864 యాష్లీ లాకర్ను ఎవరో తెరిచారని అర్థమయింది, కదా? 651 00:42:13,031 --> 00:42:13,949 అవును. 652 00:42:16,451 --> 00:42:17,786 నీకు ధైర్యం ఉంది బాబూ. 653 00:42:18,453 --> 00:42:20,163 నువ్వు ఈ పనులలో ఇంకా ఆరితేరాలి. 654 00:42:20,330 --> 00:42:21,456 నువ్వు కూడా. 655 00:42:21,998 --> 00:42:23,083 ఏమన్నావు? 656 00:42:23,583 --> 00:42:27,587 యాష్లీ కెంట్ లాకర్ను నువ్వు తెరవటం నేను నిఘా కెమెరాలలో చూశాను. 657 00:42:28,255 --> 00:42:29,130 నిర్లక్ష్యం. 658 00:42:29,214 --> 00:42:30,507 ఇక్కడ ఉన్నావు, కదా? 659 00:42:31,466 --> 00:42:33,301 విను, యాష్లీ మాయమవటం వెనుక నువ్వు, 660 00:42:33,385 --> 00:42:35,428 గబ్బిలం మహిళ ఉన్నారని నాకు తెలుసు. 661 00:42:36,263 --> 00:42:37,847 అది నీకు తెలుసా? 662 00:42:41,643 --> 00:42:44,020 యాష్లీ ఎక్కడ ఉందో మీరు నాకు చెప్పాలి. 663 00:42:44,187 --> 00:42:45,939 నీవు చెబుతావని నేను అనుకుంటున్నాను. 664 00:42:46,064 --> 00:42:47,565 నేనా? నేను అందుకే వచ్చాను. 665 00:42:48,066 --> 00:42:49,317 నాకు తెలియదు. 666 00:42:50,110 --> 00:42:52,737 అది ఒక్క కారణమేనా మిక్కీ? 667 00:42:52,988 --> 00:42:54,239 మీ నాన్న... 668 00:42:54,990 --> 00:42:56,866 మీ నాన్న చనిపోలేదు. 669 00:42:57,200 --> 00:42:58,868 అతను బతికే ఉన్నాడు. 670 00:43:01,705 --> 00:43:03,832 మా నాన్న బతికే ఉన్నాడని నువ్వు చెప్పావు. 671 00:43:06,960 --> 00:43:07,877 ఉన్నాడా? 672 00:43:10,714 --> 00:43:11,631 మిక్కీ... 673 00:43:17,637 --> 00:43:19,514 చీకటిలో చూడగలవా? 674 00:43:21,266 --> 00:43:22,392 నాకు అర్థం కాలేదు. 675 00:43:23,059 --> 00:43:25,937 మనుషులకు ప్రతిరోజూ దారుణమైన విషయాలు జరుగుతాయి. 676 00:43:26,563 --> 00:43:30,025 వాళ్ళు బతికితే, కొందరు మనుషులు 677 00:43:30,900 --> 00:43:33,820 ఆ దారుణమైన జ్ఞాపకాలను తమ మనసునుంచి తుడిచివేస్తారు 678 00:43:33,987 --> 00:43:36,323 ఇంకొందరు తమ కథలను చెబుతారు, 679 00:43:36,740 --> 00:43:39,117 కానీ ఆ ఘోరాన్ని ప్రతిసారీ తగ్గిస్తారు. 680 00:43:40,160 --> 00:43:43,788 ఎందుకంటే మనసు అలా తట్టుకుంటుంది. 681 00:43:45,123 --> 00:43:46,458 స్వీయ భ్రాంతి. 682 00:43:47,250 --> 00:43:49,961 చీకటిలో బతకటానికి బలం కావాలి, 683 00:43:50,211 --> 00:43:54,674 ఆ చీకటి కచ్చితంగా ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవటానికి. 684 00:43:55,383 --> 00:43:56,801 అందరికీ సాధ్యం కాదు. 685 00:43:57,427 --> 00:43:58,887 ప్రశ్న ఏమిటంటే... 686 00:44:00,305 --> 00:44:01,848 నీవల్ల అవుతుందా, మిక్కీ? 687 00:44:04,100 --> 00:44:06,895 -నేను సిద్ధం. -అతను సిద్ధంగా లేడు. 688 00:44:10,148 --> 00:44:11,066 నేను సిద్ధం. 689 00:44:16,154 --> 00:44:20,241 శ్రీమతి ఫ్రీడ్మన్ మీకు చిన్న లిజ్జీ సోబెక్ గురించి చెప్పిందా? 690 00:44:22,202 --> 00:44:23,953 -అవును. -ఏమి నేర్చుకున్నావు? 691 00:44:25,038 --> 00:44:28,541 ఆష్విజ్ వెళుతున్న రైలునుంచి ఆమె 50 మంది పిల్లలను కాపాడింది. 692 00:44:28,666 --> 00:44:33,046 ఆ అద్భుత సీతాకోక చిలుకల గురించి శ్రీమతి ఫ్రీడ్మన్ చెప్పిందా? 693 00:44:33,797 --> 00:44:35,048 అద్భుత సీతాకోకచిలుకలా? 694 00:44:35,215 --> 00:44:38,843 ఆ పిల్లలను లిజ్జీ తగ్గరకు, భద్రతవైపుకు తీసుకెళ్ళిన సీతాకోక చిలుకలు. 695 00:44:39,344 --> 00:44:43,807 లిజ్జీ కథలో తర్వాత చెప్పేటప్పుడు అవి ఒక కీలక భాగం అయ్యాయి, 696 00:44:43,890 --> 00:44:45,475 ఎందుకంటే, మిక్కీ... 697 00:44:47,435 --> 00:44:48,937 నిజాన్ని భరించలేము. 698 00:44:50,814 --> 00:44:51,773 నాకు తెలుసు. 699 00:44:54,067 --> 00:44:55,151 నేను అక్కడ ఉన్నాను. 700 00:44:57,445 --> 00:44:58,905 అక్కడ సీతాకోక చిలుకలు ఉన్నాయి, 701 00:44:59,072 --> 00:45:02,075 కానీ మీరు ఊహించుకునే సీతాకోక చిలుకలు కాదు. 702 00:45:06,996 --> 00:45:12,085 అవి కొందరిని భద్రతవైపుకు తీసుకెళ్ళాయి, మరికొందరికి ఆ అదృష్టం దక్కలేదు. 703 00:45:27,934 --> 00:45:30,019 ఏ30432 704 00:45:37,694 --> 00:45:38,736 చివరకు, 705 00:45:39,863 --> 00:45:42,532 49 మందిలో ఆరుగురు మాత్రమే తప్పించుకున్నారు. 706 00:45:48,997 --> 00:45:50,331 లిజ్జీ సోబెక్ నువ్వే. 707 00:45:54,169 --> 00:45:55,086 ఆ రైలు ఎందుకు? 708 00:45:55,170 --> 00:45:58,423 యాష్లీకి, మా నాన్నకు దానితో సంబంధం ఏమిటి? 709 00:46:01,134 --> 00:46:06,222 ఆ 43 మంది పిల్లలను చంపింది బుచర్ ఆఫ్ లొడ్జ్. 710 00:46:07,682 --> 00:46:10,393 ఆ రైలును ఎందుకు ఎంచుకున్నానంటే అతను దానిలో ఉన్నాడు. 711 00:46:11,478 --> 00:46:12,312 ఎందుకు? 712 00:46:12,520 --> 00:46:14,689 ఎందుకంటే అతను మా నాన్నను చంపాడు. 713 00:46:15,356 --> 00:46:17,859 మన ఇద్దరికీ ఒక పోలిక ఉంది. 714 00:46:18,610 --> 00:46:21,362 మన కళ్ళ ముందే మన తండ్రులు చనిపోయారు. 715 00:46:31,498 --> 00:46:34,334 మా నాన్నను చంపిన రాక్షసుడు ఇతడే. 716 00:46:43,676 --> 00:46:45,053 అది అసాధ్యం. 717 00:46:46,054 --> 00:46:46,971 కాదు. 718 00:46:47,305 --> 00:46:48,223 కాదు. 719 00:46:50,391 --> 00:46:51,309 ఇది సాధ్యం కాదు. 720 00:46:56,439 --> 00:46:57,649 నేను ఒకరిని చూశాను. 721 00:47:03,696 --> 00:47:07,033 అయితే వాళ్ళకు యాష్లీ లాకర్ నంబర్ స్పష్టంగా తెలుసు. 722 00:47:08,660 --> 00:47:10,328 అది యాష్లీయేనా? 723 00:47:10,411 --> 00:47:12,497 ఎవరో తెలియటంలేదు. 724 00:47:12,580 --> 00:47:15,375 కెమెరాలో కనబడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. 725 00:47:15,458 --> 00:47:16,751 వేరే కోణంనుంచి చూడు. 726 00:47:22,382 --> 00:47:24,425 అది రేచెల్ కాల్డ్వెల్. 727 00:47:25,093 --> 00:47:26,511 అబ్బా! 728 00:47:26,594 --> 00:47:28,096 మిక్కీ దెబ్బ తింటాడు. 729 00:47:56,457 --> 00:47:58,751 మీ అమ్మ, నేను ముఖ్యమైన పని చేస్తున్నాం. 730 00:47:59,419 --> 00:48:01,921 నిస్సహాయులైనవారికి మేము సాయం చేస్తాం. 731 00:48:02,797 --> 00:48:04,882 కానీ, మంచి పని చేయటం వలన 732 00:48:04,966 --> 00:48:07,844 ఈ ప్రపంచంలోని చెడునుంచి మనం తప్పించుకోలేము. 733 00:48:08,303 --> 00:48:09,429 అది ఎప్పుడూ అంతే. 734 00:48:10,722 --> 00:48:13,850 దాన్ని గమనించటం నా పని. 735 00:48:23,401 --> 00:48:25,361 హార్లన్ కోబెన్స్ రచించిన నవల ఆధారంగా 736 00:49:36,307 --> 00:49:38,309 సబ్టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 737 00:49:38,393 --> 00:49:40,395 క్రియేటివ్ సూపర్వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి