1 00:00:50,300 --> 00:00:51,301 తీసుకో. 2 00:00:59,309 --> 00:01:01,061 ఆ టర్కీ మాంసం తిని విసుగొచ్చింది. 3 00:01:07,484 --> 00:01:08,861 బుల్లి బ్యాండిట్. 4 00:01:11,196 --> 00:01:12,739 నంచుకోవడానికి చిప్స్ కావాలా? 5 00:01:15,784 --> 00:01:19,288 "బ్యాండిట్" 6 00:01:19,371 --> 00:01:22,291 అది ఆకలితో అలమటిస్తూ ఉండుంటుంది. మీరు చాలా మంచి పని చేశారు. 7 00:01:22,374 --> 00:01:23,876 మా మంచి టావ్ మావయ్య. 8 00:01:23,959 --> 00:01:26,753 చూడ్డానికి పట్టించుకోనట్లు ఉంటాడు, మనసు మాత్రం సున్నితం. 9 00:01:27,379 --> 00:01:28,589 నువ్వది నమ్ముతున్నావా? 10 00:01:29,464 --> 00:01:30,507 లేదు. 11 00:01:30,591 --> 00:01:31,717 నమ్మి తీరాలి. 12 00:01:33,468 --> 00:01:37,264 మీరు చాలా దూరం వెళ్ళాలి కదా. తినడానికి ఏదైనా ఇవ్వమంటారా? 13 00:01:37,347 --> 00:01:39,433 -థాంక్యూ, నాకేమీ అవసరం లేదు. -సరే. 14 00:01:39,516 --> 00:01:42,144 శాండ్విచ్ దొంగిలించినందుకు మీరు దానికి బ్యాండిట్ అని పేరు పెట్టారా? 15 00:01:42,227 --> 00:01:43,645 లేదంటే మీ మనసు దోచుకుంది కాబట్టా? 16 00:01:44,354 --> 00:01:46,356 అదేం లేదు, కేవలం నా శాండ్విచ్ తిన్నందుకే. 17 00:01:50,819 --> 00:01:52,154 ఇకపై దొంగిలించకూడదు, బ్యాండిట్. 18 00:01:52,237 --> 00:01:53,739 ఈ మంచివాళ్లు నీకోసం ఒక ఇంటిని 19 00:01:53,822 --> 00:01:55,908 వెతికి పెట్టాలంటే నువ్వు మంచి కుక్కగా మారాలి. 20 00:01:55,991 --> 00:01:58,410 పద, బ్యాండిట్. నేను నీకు మంచి స్నాక్ ఇస్తాను. 21 00:02:02,831 --> 00:02:04,458 అబ్బో. దీనికి చాలా ఎనర్జీ ఉంది. 22 00:02:07,169 --> 00:02:08,336 అవును. 23 00:02:08,961 --> 00:02:11,548 చార్లెస్, నేను రేపు డాక్టర్ యాబీ దగ్గరికి బ్యాండిట్ ని చెకప్ కి తీసుకెళ్తాం. 24 00:02:11,632 --> 00:02:13,509 ఈలోగా, దాన్ని ప్రేమగా చూసుకుంటాం. 25 00:02:13,592 --> 00:02:15,761 అది పడిన కష్టాలకి ఆ మాత్రం దక్కి తీరాలి. 26 00:02:15,844 --> 00:02:18,972 అవును రా, తల్లీ. ఇది సరైన వాళ్ళ చేతిలో ఉంది. 27 00:02:19,056 --> 00:02:20,015 అంతరాయం కలిగించినందుకు సారీ. 28 00:02:20,098 --> 00:02:22,601 -మనం సమస్యలో పడ్డాం. -ఏంటది? 29 00:02:22,684 --> 00:02:24,353 డిస్ట్రిబ్యూటర్ తో ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను. 30 00:02:24,436 --> 00:02:25,854 వాళ్ళకసలు మన ఆర్డర్ అందలేదు. 31 00:02:25,938 --> 00:02:27,689 నేను వారం క్రితమే ఆర్డర్ చేశాను. 32 00:02:27,773 --> 00:02:29,691 నాకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వచ్చింది... 33 00:02:29,775 --> 00:02:31,985 మమ్మల్ని క్షమించండి. అసలు... నేను చూడొచ్చా? 34 00:02:32,069 --> 00:02:33,904 సిరప్ కావాల్సిన సంక్షోభం ఎలాంటిది? 35 00:02:33,987 --> 00:02:36,573 ఫైర్ స్టేషన్ నిర్వహించే వార్షిక ప్యాన్ కేకుల కార్యక్రమం, ఇంకా ఓపెన్ హౌస్ కోసం. 36 00:02:36,657 --> 00:02:38,367 నా అమ్మానాన్నలు ఇన్ ఛార్జ్ గా ఉంటామని చెప్పారు. 37 00:02:39,076 --> 00:02:41,578 మేపుల్ సిరప్ లేకుండా ప్యాన్ కేకులు ఎలా తింటారు. 38 00:02:41,662 --> 00:02:42,788 నిజమే. 39 00:02:50,671 --> 00:02:52,381 ఎవరో ప్యాన్ కేకుల గురించి విన్నారు. 40 00:02:53,590 --> 00:02:55,592 మళ్ళీనా? సరే, బ్యాండిట్. 41 00:02:58,554 --> 00:03:00,556 నా ట్రెబూషె తీసుకుని ఏం చేస్తున్నావు? 42 00:03:00,639 --> 00:03:02,182 బ్యాండిట్ తో బాల్ ఆట ఆడుతున్నాను. 43 00:03:02,266 --> 00:03:03,600 సరే, అది బొమ్మ కాదు. 44 00:03:03,684 --> 00:03:05,936 కోట గోడలపై దాడి చేయడానికి ఉపయోగించే కాటపుల్ట్, 45 00:03:06,019 --> 00:03:08,313 నా మధ్య యుగాల ప్రెజెంటేషన్ కోసం కావాలి. 46 00:03:08,397 --> 00:03:11,400 ఇది కోట గోడల్ని కూలగొడుతుందని నాకు అనిపించడం లేదు, 47 00:03:11,483 --> 00:03:13,569 కాబట్టి ఇది బొమ్మే. 48 00:03:13,652 --> 00:03:15,571 పైగా బ్యాండిట్ తో ఆడీ ఆడీ, 49 00:03:15,654 --> 00:03:18,907 నా చేయి నొప్పి పుడుతోంది కాబట్టి నాకిది అవసరం. 50 00:03:20,534 --> 00:03:22,327 ఎంత ఆనందంగా ఉందో చూడు. 51 00:03:24,037 --> 00:03:26,290 సరేలే. ఉంచుకో. 52 00:03:26,373 --> 00:03:29,585 నాకు మార్కులు ఇచ్చేవరకూ దాన్ని విరగ్గొట్టకుండా ఉంచు చాలు. 53 00:03:32,880 --> 00:03:34,464 ఆగు, బ్యాండిట్ ఎక్కడ? 54 00:03:34,548 --> 00:03:36,091 వింతగా ఉంది. 55 00:03:42,306 --> 00:03:44,558 మొత్తానికి అలిసిపోయింది. 56 00:03:48,145 --> 00:03:49,646 చార్లెస్? 57 00:03:49,730 --> 00:03:52,232 బ్యాండిట్ ఏదో తేడాగా కనిపిస్తోంది. 58 00:03:52,858 --> 00:03:54,193 అది అలిసిపోయిందంతే. 59 00:03:54,818 --> 00:03:56,945 లేదు, దీని ఊపిరి తేడాగా ఉంది. 60 00:03:58,155 --> 00:03:59,364 అది విన్నావా? 61 00:04:00,782 --> 00:04:03,160 ఊపిరి గుర్రుగా వస్తోంది. 62 00:04:04,119 --> 00:04:05,829 అంటే దానర్థం ఏంటో తెలుసా? 63 00:04:05,913 --> 00:04:08,457 అంటే దానర్థం మనం డాక్టర్ యాబీకి కాల్ చేయాలి. 64 00:04:08,540 --> 00:04:09,541 ఇప్పుడే. 65 00:04:12,294 --> 00:04:14,004 మంచి వెటర్నరీ డాక్టర్ ఎవరు? మొబైల్ వెటర్నరీ కేర్ 66 00:04:14,087 --> 00:04:16,089 -ఎందుకంత సమయం పడుతోంది? -కంగారుపడకు, చార్లెస్. 67 00:04:16,173 --> 00:04:17,798 దానికి ఖచ్చితంగా ఏమీ కాదు. 68 00:04:17,882 --> 00:04:19,927 నీకు ఖచ్చితంగా తెలుసా? 69 00:04:22,137 --> 00:04:23,138 లేదు. 70 00:04:27,935 --> 00:04:30,562 -హాయ్, బ్యాండిట్. -దీనికి ఎలా ఉంది? అంతా బాగానే ఉందా? 71 00:04:30,646 --> 00:04:34,441 అవుననే చెప్పాలి, దీనికి ఎలాంటి నొప్పిగానీ, వెంటనే కలిగే ప్రమాదం కానీ లేదు. 72 00:04:34,525 --> 00:04:37,778 -అంటే ఏదో సమస్య ఉందన్నమాట. -ఇది ఊపిరి ఎందుకలా తీసుకుంటోంది? 73 00:04:38,362 --> 00:04:40,489 దీని గుండె నాళాల్లో ఒకటి సరిగా పనిచేయడం లేదు, 74 00:04:40,572 --> 00:04:42,449 కాబట్టి ఎక్కువగా అలసిపోవడం మంచిది కాదు. 75 00:04:42,533 --> 00:04:46,245 అంతా నా తప్పే. నేను మరీ ఎక్కువగా ఆడి ఉండకూడదు. 76 00:04:46,328 --> 00:04:49,498 నువ్వు ఏ తప్పూ చేయలేదు. ఇది పుట్టినప్పటినుండీ, దానికా సమస్య ఉన్నట్లుంది. 77 00:04:51,375 --> 00:04:52,626 చూశావా, చార్లెస్? 78 00:04:52,709 --> 00:04:56,129 నీ తప్పు ఉండుంటే, బ్యాండిట్ నీ దగ్గరికి వస్తానని అడిగి ఉండేది కాదు. 79 00:04:59,424 --> 00:05:00,425 మంచి కుక్క. 80 00:05:00,509 --> 00:05:02,094 అయితే, ఇది బాగానే ఉంటుందా? 81 00:05:02,177 --> 00:05:03,428 తప్పకుండా. 82 00:05:03,512 --> 00:05:06,431 ఇది అలసిపోకుండా, ఎక్కువ ఉత్సాహపడకుండా చూసుకుంటే బాగుంటుంది. 83 00:05:06,515 --> 00:05:09,226 దీని గుండె సంగతేంటి? మేము చేయగలిగింది ఏదైనా ఉందా? 84 00:05:09,309 --> 00:05:12,312 అందుకు ఒక సర్జరీ చేయాలి, నిపుణుడి అవసరం ఉంటుంది. 85 00:05:12,396 --> 00:05:14,398 కొంచెం ఖరీదైంది కూడా. 86 00:05:14,481 --> 00:05:17,609 అయితే అది చేయించకపోయినా బ్యాండిట్ ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితం గడపగలదు. 87 00:05:18,402 --> 00:05:20,237 ఇక బాల్ ఆట వద్దు, బ్యాండిట్. 88 00:05:20,320 --> 00:05:22,322 దీన్ని మిస్ అవుతావు, కదూ? 89 00:05:23,031 --> 00:05:26,493 దీన్ని చూసుకోవడం మరీ కష్టంగా ఉంటే, నేను వేరే ఏర్పాట్లు చేయగలను. 90 00:05:26,577 --> 00:05:30,163 వద్దు. మేము బ్యాండిట్ అలసిపోకుండా చూసుకుంటాం, కదూ చార్లెస్? 91 00:05:30,247 --> 00:05:31,373 అవును. 92 00:05:35,502 --> 00:05:37,504 ఈ కోటు దీన్ని ప్రశాంతంగా ఉంచుతుందేమో చూద్దాం. 93 00:05:37,588 --> 00:05:39,506 అమ్మానాన్న ఉండుంటే బ్యాండిట్ కి 94 00:05:39,590 --> 00:05:42,509 మన చిన్నప్పటి విషయాల్ని కథలుగా చెప్పేవాళ్ళు. 95 00:05:42,593 --> 00:05:45,220 అవి వింటే నాకు ఎప్పుడూ నిద్రొస్తుంది. 96 00:05:47,556 --> 00:05:50,017 దీనికోసం ప్రశాంతమైన సంగీతం వినిపిస్తాను. 97 00:05:56,815 --> 00:05:58,692 బ్యాండిట్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా 98 00:05:58,775 --> 00:06:01,612 చూసుకునే వాళ్ళని మనం ఎలా కనిపెట్టగలం? 99 00:06:01,695 --> 00:06:03,864 ప్రతి కుక్కకీ తగిన ఇల్లు దొరుకుతుంది, మర్చిపోయావా? 100 00:06:05,407 --> 00:06:06,825 హేయ్, ఏం చేస్తున్నారు. 101 00:06:06,909 --> 00:06:08,660 బుడ్డోడు ఎలా ఉన్నాడు? 102 00:06:09,536 --> 00:06:12,789 మేము దీనికోసం ప్రశాంతంగా ఉండే వాతావరణం సృష్టిస్తున్నాం. 103 00:06:13,707 --> 00:06:14,875 సారీ, పిల్లలూ. 104 00:06:15,709 --> 00:06:19,046 చూడు, నువ్వు యోగా మానేసి, బ్యాండిట్ తో కలిసి ఉండాలనుకుంటే, 105 00:06:19,129 --> 00:06:21,924 -నేను అర్థం చేసుకోగలను. -లేదు, నేను వస్తున్నాను. 106 00:06:22,633 --> 00:06:23,717 సరే. 107 00:06:24,259 --> 00:06:27,262 -నువ్వు ఒక్కడివే దాన్ని చూసుకోగలవా? -చూసుకుంటా, పరవాలేదు. 108 00:06:27,346 --> 00:06:29,640 మేము ఏదో ఒక ఆట ఆడుకుంటాం, అవునా? 109 00:06:29,723 --> 00:06:31,725 పరిగెత్తే ఆటలు మాత్రం ఆడొద్దు. 110 00:06:31,808 --> 00:06:35,020 సరే, అయితే నిమురుతూ కూర్చుంటాలే. 111 00:06:36,021 --> 00:06:36,855 మంచిది. 112 00:06:42,319 --> 00:06:47,449 ఓం. 113 00:06:51,620 --> 00:06:52,621 నమస్తే. 114 00:06:53,622 --> 00:06:55,165 నమస్తే. 115 00:07:02,548 --> 00:07:03,549 నాకు హాయిగా ఉంది. 116 00:07:03,632 --> 00:07:06,760 ఒక్కసారి కూడా ప్యాన్ కేకుల గురించీ, సిరప్ గురించీ ఆలోచించలేదు. 117 00:07:08,220 --> 00:07:09,888 నువ్వు బానే ఉన్నావా, తల్లీ? 118 00:07:10,639 --> 00:07:13,642 ఉన్నాను, బ్యాండిట్ గురించే నా ఆలోచనంతా. 119 00:07:13,725 --> 00:07:14,893 నాకు అర్థమయింది. 120 00:07:14,977 --> 00:07:18,021 కానీ దాన్ని చూసుకోవడానికి మీరిద్దరూ ఉండడం వల్ల అదెంత అదృష్టవంతురాలో గుర్తుపెట్టుకో. 121 00:07:18,105 --> 00:07:21,567 మీకు ఎలాంటి సాయం కావాలన్నా మీ నాన్నా, నేనూ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. 122 00:07:22,109 --> 00:07:24,903 థాంక్స్, అమ్మా. చార్లెస్, నేను కలిసి ఏదో ఒకటి చేస్తాం. 123 00:07:25,571 --> 00:07:26,864 మీకా సామర్థ్యం ఉంది. 124 00:07:28,532 --> 00:07:29,449 నేను ఇప్పడే వస్తాను. 125 00:07:36,039 --> 00:07:37,916 నిన్ను మళ్ళీ కలవడం బాగుంది, లిజ్జీ. 126 00:07:38,000 --> 00:07:41,587 -నీకు క్లాసు నచ్చిందనే అనుకుంటున్నాను. -నచ్చింది. చాలా బాగుంది. 127 00:07:41,670 --> 00:07:43,130 నీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. 128 00:07:43,755 --> 00:07:47,176 కానీ ఈరోజు సరిగా మనసు పెట్టినట్లు అనిపించలేదు. 129 00:07:49,178 --> 00:07:51,305 నేను ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. 130 00:07:51,388 --> 00:07:53,640 ఒక్కోసారి ఒత్తిడి పెరగడం సహజమే. 131 00:07:53,724 --> 00:07:56,643 అందుకే నేనిక్కడ ఈ ఆధ్యాత్మిక ప్రదేశాన్ని స్థాపించడానికి ప్రయత్నించాను. 132 00:07:56,727 --> 00:08:01,064 అవును, ఖచ్చితంగా. ఇదే నా స్టూడియో అయ్యుంటే, నేను దీన్ని వదిలి బయటికి వెళ్ళను. 133 00:08:01,148 --> 00:08:03,442 నేను అరుదుగా వెళతాను. వెళ్ళాల్సిన అవసరమేముంది? 134 00:08:03,984 --> 00:08:07,196 నాకు కావలసినవన్నీ ఈ చిన్న గది అందిస్తోంది. 135 00:08:09,156 --> 00:08:10,782 మీరు ఎప్పుడైనా కుక్క కావాలని అనుకున్నారా? 136 00:08:19,124 --> 00:08:20,292 ఏయ్, బ్యాండిట్. 137 00:08:27,966 --> 00:08:31,720 నీకు ఆడుకోవాలని ఉందని నాకు తెలుసు. నాక్కూడా ఉంది, కానీ మనం ఆడకూడదు. 138 00:08:33,263 --> 00:08:37,017 ఆగు, మనిద్దరం సరదాగా ఎలా గడపొచ్చో నాకు తెలుసు. 139 00:08:40,354 --> 00:08:42,397 పద. వెళ్దాం. 140 00:08:56,161 --> 00:08:59,122 బాల్ కోసం పరిగెత్తినట్లే ఉంది కదూ, బ్యాండిట్? 141 00:09:05,754 --> 00:09:07,840 ఇక్కడ ఉండు. ఆగు! బ్యాండిట్! 142 00:09:09,258 --> 00:09:10,592 బ్యాండిట్, ఆగు! 143 00:09:12,261 --> 00:09:13,470 అయిపోయిందా? 144 00:09:14,096 --> 00:09:15,514 వెనక్కి రా! 145 00:09:19,518 --> 00:09:20,978 పద, బ్యాండిట్. 146 00:09:26,024 --> 00:09:28,569 నువ్వు ఇలా పరిగెత్తకూడదు! 147 00:09:29,444 --> 00:09:31,655 -బ్యాండిట్! -చార్లెస్. 148 00:09:31,738 --> 00:09:34,032 నువ్వు ఎక్కడికి వెళ్లావు? బ్యాండిట్ తో ఎందుకు ఆడుకుంటున్నావు? 149 00:09:34,116 --> 00:09:35,534 దాన్ని సైకిల్ మీద ఎక్కించుకుని తిప్పుకొచ్చాను. 150 00:09:35,617 --> 00:09:38,620 -నువ్వు దాన్ని పరిగెత్తేలా చేస్తున్నావు. -అదే పరిగెత్తుతోంది. నేను కాదు. 151 00:09:38,704 --> 00:09:40,372 చార్లెస్, నీకు ఏం కావాలన్న దాని గురించి కాదు. 152 00:09:40,455 --> 00:09:42,624 -బ్యాండిట్ కి ఏది మంచిదో అది చేయాలి. -నాకు తెలుసు. 153 00:09:42,708 --> 00:09:43,834 హేయ్, ఏంటి సంగతి? 154 00:09:45,169 --> 00:09:46,920 ఏదో జరిగింది. 155 00:09:52,384 --> 00:09:53,802 ఇదంతా నా తప్పే. 156 00:09:53,886 --> 00:09:56,763 బ్యాండిట్ ని మీ దగ్గరికి తీసుకురమ్మని టావ్ మావయ్యని అడిగి ఉండాల్సింది కాదు. 157 00:09:56,847 --> 00:09:59,766 లేదు, అది నీ తప్పు కాదు, మరియా. ఎవరి తప్పూ కాదు. 158 00:09:59,850 --> 00:10:02,603 -బ్యాండిట్ కి బాలేదన్న విషయం నీకు తెలీదు కదా. -మనలో ఎవరికీ తెలీదు. 159 00:10:02,686 --> 00:10:05,814 దీనికి ఆడుకోవడం ఇష్టం, బలహీనత ఉన్నట్టే కనిపించదు. 160 00:10:05,898 --> 00:10:08,025 అవును, కానీ బలహీతన ఉంది కదా. 161 00:10:08,734 --> 00:10:09,735 ఇటివ్వు. 162 00:10:09,818 --> 00:10:11,069 తీసుకో. 163 00:10:13,488 --> 00:10:15,449 నీకేం కాదు, బ్యాండిట్. 164 00:10:16,825 --> 00:10:19,286 -నేను దీనికి సరైన ఇంటినే కనిపెట్టాననుకుంటున్నాను. -ఏంటి? 165 00:10:19,369 --> 00:10:20,412 అమ్మ వాళ్ళ యోగా టీచర్. 166 00:10:21,079 --> 00:10:23,957 ఆమెకి కుక్క కావాలి, కానీ పరిగెత్తడానికి పెరడు లేదని ఆలోచిస్తోంది. 167 00:10:24,041 --> 00:10:25,626 పరిగెత్తడానికి పెరడు లేదా? 168 00:10:26,335 --> 00:10:27,836 అయితే సరిగ్గా సరిపోతుంది. 169 00:10:27,920 --> 00:10:29,796 ఆవిడ యోగా స్టూడియో చాలా ప్రశాంతంగా ఉంటుంది. 170 00:10:29,880 --> 00:10:31,548 ఆవిడ చాలా మంచిది, చూడగానే మూడ్ కనిపెట్టేస్తుంది. 171 00:10:31,632 --> 00:10:33,759 అంటే నువ్వు లోపల ఎలా ఫీలవుతున్నావో కనిపెట్టగలదు. 172 00:10:33,842 --> 00:10:35,385 కుక్కల లాగానా? 173 00:10:35,469 --> 00:10:36,637 ఒక రకంగా అలాగే. 174 00:10:36,720 --> 00:10:40,265 బ్యాండిట్ ఏమనుకుంటోందో ఆమె కనిపెడితే, దీన్ని ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంచగలదు. 175 00:10:40,349 --> 00:10:42,267 లిజ్జీ, ఇది వినడానికే చాలా అద్భుతంగా ఉంది. 176 00:10:42,893 --> 00:10:44,394 టావ్ మావయ్య ఆనందిస్తారు. 177 00:10:44,478 --> 00:10:47,356 ఇదెలా ఉందో కనుక్కోవడానికి నిన్న, ఈరోజు కాల్ చేశారు. 178 00:10:47,439 --> 00:10:49,650 ఆయన ఇకపై కంగారుపడాల్సిన అవసరం లేదని చెప్పు. 179 00:10:49,733 --> 00:10:52,736 అయితే, బ్యాండిట్ అక్కడ ఖచ్చితంగా సంతోషంగా ఉండగలదని అనుకుంటున్నావా? 180 00:10:53,737 --> 00:10:55,948 అంతకంటే మంచి చోటు లేదు. 181 00:11:01,828 --> 00:11:03,497 ఇక్కడ చాలా వేడిగా ఉంది. 182 00:11:03,580 --> 00:11:05,582 అంటే బాగా ఉందన్నమాట. 183 00:11:06,166 --> 00:11:07,960 నేటి సాధనను ఓం చెప్పి ముగిద్దాం. 184 00:11:16,301 --> 00:11:18,303 బ్యాండిట్! ష్. 185 00:11:19,096 --> 00:11:20,681 వాళ్ళ క్లాసు పూర్తయింది. 186 00:11:21,890 --> 00:11:24,434 ఆహ్, ఇది కూడా క్లాసులో భాగం కావాలని కోరుకుంటోంది. 187 00:11:30,691 --> 00:11:32,568 బ్యాండిట్! బ్యాండిట్! 188 00:11:37,990 --> 00:11:39,908 నన్ను క్షమించండి, సుసానా. 189 00:11:39,992 --> 00:11:41,493 పరవాలేదు. 190 00:11:41,577 --> 00:11:44,204 బ్యాండిట్ కి యోగా పట్ల ఉత్సాహం ఉండడం మంచి విషయం. 191 00:11:45,122 --> 00:11:47,124 -దానికి మీరు నచ్చారు. -అవునా, బ్యాండిట్? 192 00:11:47,666 --> 00:11:49,084 నేను నీకు నచ్చానా? 193 00:11:50,627 --> 00:11:53,630 మీరు దాని మనసు చదువుతున్నారా? 194 00:11:53,714 --> 00:11:55,299 -చార్లెస్. -ఏంటి? 195 00:11:55,382 --> 00:11:57,885 మీరు మనసు పసిగట్టగలరని చెప్పాను, అంతే. 196 00:11:58,802 --> 00:12:00,679 నేను బ్యాండిట్ మనసు చదవలేదు. 197 00:12:01,305 --> 00:12:03,098 అయితే, ఇది రోజంతా ధ్యానం చేసే 198 00:12:03,182 --> 00:12:06,185 దిండు మీద కూర్చోలేదని మాత్రం నాకు తెలుస్తోంది. 199 00:12:06,268 --> 00:12:09,104 కానీ ఇది ప్రశాంతమైన వాతావరణంలో పెరగాలి. 200 00:12:13,859 --> 00:12:18,197 కావచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని అదికూడా కోరుకోవాలి కదా. 201 00:12:22,492 --> 00:12:25,454 నువ్వు చెప్పినట్లే ఆవిడ కూడా అనుకుంటోంది. 202 00:12:27,039 --> 00:12:29,082 బ్యాండిట్ ఇక్కడ సంతోషంగా ఉండలేదు. 203 00:12:29,166 --> 00:12:30,584 అయితే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? 204 00:12:31,627 --> 00:12:33,754 మనకి ఒకే ఒక్క అవకాశం ఉందనిపిస్తోంది. 205 00:12:33,837 --> 00:12:37,799 సరే, థాంక్స్, డాక్టర్ యాబీ. చార్లెస్, నేను ఏదో ఒక మార్గం కనిపెడతాం. 206 00:12:38,926 --> 00:12:40,135 సరే అయితే. 207 00:12:41,345 --> 00:12:42,471 మరైతే? 208 00:12:42,554 --> 00:12:45,140 బ్యాండిట్ కి సర్జరీ చేసే స్పెషలిస్ట్ తో మాట్లాడింది. 209 00:12:45,224 --> 00:12:47,851 ఆ తర్వాత బ్యాండిట్ గుండె పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. 210 00:12:47,935 --> 00:12:49,061 మంచిది. 211 00:12:49,144 --> 00:12:52,314 కానీ సర్జరీకి 4,000 డాలర్లు ఖర్చవుతుంది. 212 00:12:52,397 --> 00:12:54,816 నాలుగు వేల డాలర్లా? 213 00:12:54,900 --> 00:12:57,152 మనకి నాలుగు వేల డాలర్లు ఎక్కడి నుండి వస్తాయి? 214 00:12:59,321 --> 00:13:00,322 ఇదిగో ఇలా. 215 00:13:00,405 --> 00:13:02,449 బ్యాండిట్ ని కాపాడడం కోసం సాయం చేయండి 216 00:13:02,533 --> 00:13:04,535 మనం బోలెడన్ని పామ్ ప్లేట్స్ ప్రచురిస్తాం. 217 00:13:07,037 --> 00:13:09,706 నేను నా స్పెషల్ హోంమేడ్ డాగ్ స్నాక్స్ చేస్తాను. 218 00:13:16,421 --> 00:13:17,548 హోంమేడ్ బిస్కెట్స్ 219 00:13:17,631 --> 00:13:19,758 మనం ఒక జబ్బుపడ్డ కుక్కకి సాయం చేయడం కోసం 220 00:13:19,842 --> 00:13:22,261 వీటిని అమ్ముతున్నాం కాబట్టి జనం బాగా కొనుక్కుంటారు. 221 00:13:29,518 --> 00:13:30,769 థాంక్యూ! 222 00:13:30,853 --> 00:13:33,397 చార్లెస్, నువ్వు అస్సలు నమ్మలేవు. 223 00:13:33,480 --> 00:13:36,775 మనం 83 డాలర్లు సంపాదించాం. 224 00:13:40,070 --> 00:13:42,197 మనం ఇలా ప్రతి వారంతం చేసినప్పటికీ, 225 00:13:42,281 --> 00:13:45,242 బ్యాండిట్ సర్జరీ డబ్బు వచ్చేసరికి ఒక ఏడాది పడుతుంది. 226 00:13:45,909 --> 00:13:47,160 బ్యాండిట్! 227 00:13:59,381 --> 00:14:01,341 అవన్నీ ఓపెన్ హౌస్ కోసమేనా? 228 00:14:02,259 --> 00:14:04,094 ఇవి కేవలం శాంపుల్ మాత్రమే. 229 00:14:04,178 --> 00:14:07,264 ఎంతమంది కోసం ప్యాన్ కేకులు తయారు చేస్తున్నారు? 230 00:14:07,347 --> 00:14:09,183 వందల్లో వస్తారని అంటున్నారు. 231 00:14:14,438 --> 00:14:16,899 కెప్టెన్ కార్టర్ ఈసారి చాలా గొప్పగా ఉంటుందని అన్నారు. 232 00:14:16,982 --> 00:14:19,526 చెప్పాలంటే, టిక్కెట్లు చాలా వేగంగా అమ్ముడవుతున్నాయి. 233 00:14:19,610 --> 00:14:21,820 ఈ విషయం చెప్పడానికి ఎన్ని రోజుల నుండి ఎదురుచూస్తున్నావు? 234 00:14:21,904 --> 00:14:23,739 -సుమారు మూడు రోజులు. -అవును. 235 00:14:27,659 --> 00:14:28,785 హేయ్, అమ్మా. 236 00:14:28,869 --> 00:14:32,164 బ్యాండిట్ కోసం ఏ సాయమైనా చేస్తామని చెప్పిన విషయం గుర్తుందా? 237 00:14:32,247 --> 00:14:33,373 గుర్తుంది. 238 00:14:33,457 --> 00:14:35,709 మీరిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం. 239 00:14:40,964 --> 00:14:43,091 స్వాగతం 240 00:14:43,175 --> 00:14:44,551 బాగా చేశాను. 241 00:14:44,635 --> 00:14:46,386 జనం బాగా వచ్చారు. 242 00:14:46,470 --> 00:14:48,347 తిరగేస్తే, తినడానికి వస్తారు. 243 00:14:49,056 --> 00:14:51,517 నీ దగ్గర ప్యాన్ కేకు జోకులు చాలా ఉన్నట్లున్నాయే? 244 00:14:56,063 --> 00:14:57,147 థాంక్యూ. 245 00:14:58,232 --> 00:15:01,735 దయ చూపించండి, చిన్ని గుండెని కాపాడండి! బ్యాండిట్ సర్జరీకి సాయం చేయండి! 246 00:15:01,818 --> 00:15:03,111 థాంక్యూ. 247 00:15:04,905 --> 00:15:05,906 థాంక్యూ. 248 00:15:06,782 --> 00:15:07,950 బ్యాండిట్ కూడా థాంక్స్ చెబుతోంది! 249 00:15:12,913 --> 00:15:14,957 బ్యాండిట్ టీం బోలెడంత డబ్బు సంపాదిస్తోంది! 250 00:15:15,040 --> 00:15:17,459 అవును. బాగా నడుస్తోంది. చాలా మంది వస్తున్నారు. 251 00:15:17,543 --> 00:15:18,919 దాదాపు అన్నీ అమ్ముడయ్యాయి. 252 00:15:21,505 --> 00:15:22,589 ఇదిగో తీసుకో. 253 00:15:22,673 --> 00:15:24,967 మీరు డొనేట్ చేయాల్సిన అవసరం లేదు, డాక్టర్ యాబీ. 254 00:15:25,801 --> 00:15:27,594 సరిగ్గా చెప్పావు. అవసరం లేదు. 255 00:15:28,679 --> 00:15:30,180 అయ్యయ్యో. 256 00:15:32,349 --> 00:15:33,433 హేయ్. 257 00:15:35,894 --> 00:15:37,020 హీరోలతో ఫోటోలు! 258 00:15:40,315 --> 00:15:41,316 -అవును! -అవును! 259 00:15:43,485 --> 00:15:44,736 థాంక్యూ. 260 00:15:46,113 --> 00:15:48,323 సిపిఆర్ నేర్చుకోండి జీవితాన్ని కాపాడండి 261 00:15:52,160 --> 00:15:53,161 దయ చూపించండి! 262 00:16:20,856 --> 00:16:23,442 ఎంతైంది? బ్యాండిట్ సర్జరీకి సరిపడా సంపాదించామా? 263 00:16:25,861 --> 00:16:27,613 -మనం సాధించాం! -అవును! 264 00:16:27,696 --> 00:16:31,325 అందరికంటే ఎక్కువ డొనేషన్ నా బెస్ట్ ఫ్రెండ్ మరియా ఇచ్చింది. 265 00:16:31,408 --> 00:16:33,660 -నిజంగా? -కాదు, అదేం లేదు. 266 00:16:33,744 --> 00:16:34,870 టావ్ మావయ్య ఇచ్చారు. 267 00:16:34,953 --> 00:16:39,416 బ్యాండిట్ ఎలా ఉందని అడగడానికి కాల్ చేశారు, నిధుల సేకరణ గురించి చెప్పాను. 268 00:16:39,499 --> 00:16:42,878 ఈరోజు మనకి గొప్ప విజయం అందిందని చెబుతాను. 269 00:16:42,961 --> 00:16:45,964 మీ సంగతేమో గానీ, మీ అమ్మ, నేను ఆకలితో మాడిపోతున్నాం. 270 00:16:46,048 --> 00:16:47,549 అందరం కలిసి పార్టీ చేసుకుందామా? 271 00:16:49,218 --> 00:16:51,678 -డిన్నర్ కి కూడా ఇవే తిందామా? -నువ్వు జోక్ చేస్తున్నావు, కదూ? 272 00:16:53,680 --> 00:16:54,765 వాడు జోక్ చేస్తున్నాడు. 273 00:16:57,476 --> 00:16:58,519 వాడు జోక్ చేయడం లేదు. 274 00:17:03,065 --> 00:17:04,191 ఇంకా రారేంటి? 275 00:17:04,273 --> 00:17:08,237 బ్యాండిట్ ని చూడడానికి రెండు వారాలు ఎదురుచూశాం. ఇంకో నిమిషం ఎదురుచూస్తే... 276 00:17:10,405 --> 00:17:12,074 వాళ్ళు వచ్చేశారు! 277 00:17:13,282 --> 00:17:14,326 హాయ్, పిల్లలూ. 278 00:17:15,117 --> 00:17:16,453 సరే అయితే. 279 00:17:17,538 --> 00:17:20,290 హాయ్, బేబీ, బయటికి రా. 280 00:17:24,711 --> 00:17:26,088 ఎలా ఉంది? 281 00:17:26,171 --> 00:17:28,882 కుట్లు ఊడిపోయాయి. గుండె చక్కగా పనిచేస్తోంది. 282 00:17:28,966 --> 00:17:30,676 సర్జన్ అద్భుతంగా చేశారు. 283 00:17:30,759 --> 00:17:31,844 నేను ఎత్తుకోవచ్చా? 284 00:17:31,927 --> 00:17:33,387 పట్టుకోగలిగితే ఎత్తుకో. 285 00:17:37,182 --> 00:17:38,433 అది ఆడుకోడానికి రెడీగా ఉంది. 286 00:17:38,517 --> 00:17:40,894 దీనికి ఇప్పుడు ఇల్లు వెతకడం చాలా తేలిక. 287 00:17:41,520 --> 00:17:42,938 మీరనుకున్న దానికంటే తేలికే. 288 00:17:49,736 --> 00:17:51,071 అది నిన్ను మిస్సయింది. 289 00:17:55,158 --> 00:17:56,785 నేను కూడా నిన్ను మిస్సయ్యాను, బుజ్జి బ్యాండిట్. 290 00:17:57,995 --> 00:18:00,122 బ్యాండిట్ ఈరోజు ఇంటికి వస్తుందని టావ్ మావయ్యకి చెప్పాను. 291 00:18:00,205 --> 00:18:02,875 కానీ ఆయనే ఇక్కడికి వస్తారని నేను ఊహించలేదు. 292 00:18:03,500 --> 00:18:05,169 నాతో ఇంటికి రావడానికి రెడీగా ఉన్నావా? 293 00:18:06,128 --> 00:18:09,089 నాకు తెలుసు. దీన్ని మీరే పెంచుకుంటారని నాకు తెలుసు. 294 00:18:09,840 --> 00:18:12,551 అంటే, నాకు తెలీదు, కానీ పెంచుకుంటే బాగుంటుందని అనుకున్నాను. 295 00:18:15,179 --> 00:18:17,514 దీన్ని వదిలిపెట్టిన దగ్గరి నుండీ దీని గురించే ఆలోచిస్తున్నాను. 296 00:18:17,598 --> 00:18:20,893 అవును. నా శాండ్విచ్ కంటే ఎక్కువగా మనసును దోచుకున్నావు. 297 00:18:21,685 --> 00:18:24,396 చీకటి పడకముందే బయలుదేరితే మంచిదేమో? 298 00:18:26,190 --> 00:18:27,524 అవునంటోంది. 299 00:18:30,027 --> 00:18:33,030 బ్యాండిట్, నేను వచ్చే నెల మళ్ళీ ఈ ఊరు వస్తాం. 300 00:18:33,113 --> 00:18:35,449 కాసేపు మాతో గడిపేందుకు ఆగుతారా? 301 00:18:35,532 --> 00:18:38,493 ఆపకపోతే బ్యాండిట్ ఒప్పుకోదు అనుకుంటున్నా. 302 00:18:38,577 --> 00:18:39,578 ఆగండి. 303 00:18:39,661 --> 00:18:42,289 మీరు బ్యాండిట్ ని పెంచుకునేట్లయితే, మీకిది కావాలి. 304 00:18:53,050 --> 00:18:54,051 బాధపడకు బుజ్జీ. 305 00:18:54,134 --> 00:18:57,012 మనం ఆగినప్పుడల్లా దీంతో ఆడుకుందాం, సరేనా? 306 00:18:57,638 --> 00:18:58,764 సీట్ బెల్టు పెట్టుకోండి. 307 00:19:00,974 --> 00:19:02,434 సరే అయితే. 308 00:19:25,249 --> 00:19:27,167 స్కొలాస్టిక్ బుక్ సిరీస్ పై ఆధారపడింది ఎల్లెన్ మైల్స్ రచన THE PUPPY PLACE 309 00:20:43,243 --> 00:20:45,245 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ