1 00:00:05,839 --> 00:00:07,049 లిజ్జీ! 2 00:00:09,426 --> 00:00:11,637 ప్రస్తుతం అందరి నోళ్లలో నానుతున్న వ్యక్తి, 3 00:00:11,720 --> 00:00:14,306 అత్యంత ప్రాచుర్యం పొందిన టైమ్ ట్రావెల్ సిరీస్ రచయిత 4 00:00:14,389 --> 00:00:17,851 బ్యాక్ ఇన్ టైమ్ విత్ బెక్కా బ్యాక్స్టర్. లిజ్జీ తరహాలో ఆహ్వానం పలుకుదాం... 5 00:00:17,935 --> 00:00:19,561 కిట్ స్మిథర్స్! 6 00:00:24,316 --> 00:00:28,362 మీరు ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది, కిట్. నేను మీకు పెద్ద అభిమానిని. 7 00:00:28,445 --> 00:00:31,573 ఇక్కడికి రావడం నాక్కూడా సంతోషంగా ఉంది లిజ్జీ. నేను కూడా నీకు పెద్ద అభిమానిని. 8 00:00:32,448 --> 00:00:33,951 ఇక మొదలుపెడదామా. 9 00:00:34,034 --> 00:00:36,995 మీరు రచయిత కాకముందు ఏం చేసేవారో చెప్పండి? 10 00:00:37,079 --> 00:00:39,581 నేను కాలంలో ప్రయాణం చేసేదాన్ని. 11 00:00:41,083 --> 00:00:43,752 వాస్తవానికి నేను స్కూల్ టీచరుని. 12 00:00:43,836 --> 00:00:47,005 చరిత్రలో అద్భుతమైన సంఘటనలు జరిగిన కాలానికి 13 00:00:47,089 --> 00:00:50,759 నేను ప్రయాణం చేయగలిగితే ఎంత బాగుంటుందో కదా అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. 14 00:00:51,343 --> 00:00:54,471 వాటిని అలాగే జరగనిచ్చేదాన్నా లేక మార్చడానికి ప్రయత్నించేదాన్నా? 15 00:00:55,180 --> 00:00:57,307 నేను రాయడం గురించి పక్కన పెడదాం. 16 00:00:57,391 --> 00:01:00,727 నువ్వు గత వారం పంపించిన అందమైన ఉత్తరం గురించి మాట్లాడుకుందామా? 17 00:01:01,562 --> 00:01:03,480 నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. 18 00:01:04,147 --> 00:01:06,942 నేను ఫ్లాట్ అయిపోయాను, కిట్. థాంక్యూ, నిజంగా. 19 00:01:07,025 --> 00:01:09,152 ప్రేక్షకుల దగ్గర్నుంచి ప్రశ్నలు ఆహ్వానిద్దాం. 20 00:01:09,236 --> 00:01:11,864 -మీరు? -నువ్వు కిట్ స్మిథర్స్ కి లెటర్ రాశావా? 21 00:01:11,947 --> 00:01:13,198 ఆవిడ రిప్లై ఇచ్చారా? 22 00:01:14,324 --> 00:01:15,617 లిజ్జీ? 23 00:01:15,701 --> 00:01:16,785 ఏంటి? 24 00:01:16,869 --> 00:01:19,997 ఓహ్, లేదు. ఇప్పుడే కాదు. 25 00:01:20,080 --> 00:01:22,040 నిజంగా రిప్లై ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోగలవా? 26 00:01:22,124 --> 00:01:25,127 ఊహించుకోవడమా? తను ఈ వారమంతా దాని గురించే మాట్లాడుతోంది. 27 00:01:25,210 --> 00:01:26,962 అది నిజం కాదు. 28 00:01:28,130 --> 00:01:30,591 -పోస్ట్ ఇంకా రాలేదా? -ఇంకా లేదు. 29 00:01:30,674 --> 00:01:34,261 స్వీటీ, కిట్ స్మిథర్స్ తన కొత్త పుస్తకాన్ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉండి ఉండవచ్చు. 30 00:01:34,344 --> 00:01:37,181 ఆవిడ రిప్లై ఇవ్వకపోతే నువ్వు బాధపడకూడదు. 31 00:01:37,264 --> 00:01:38,932 నేను పడను. నేను పడను. 32 00:01:39,433 --> 00:01:41,101 ఆవిడ రిప్లై ఇస్తుంది. 33 00:01:41,185 --> 00:01:43,562 ఆవిడ తర్వాతి బుక్ టూర్ కోసం 34 00:01:43,645 --> 00:01:47,065 మిడిల్టన్ వస్తోందన్న విషయం నీకు చెప్పానా? 35 00:01:47,149 --> 00:01:51,111 నేను ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నలు అడిగి తనని ఇంప్రెస్ చేద్దాం అని ఎదురుచూస్తున్నాను. 36 00:01:51,195 --> 00:01:55,199 బహుశా బుక్ క్లబ్ లో ఈ వారం మనిద్దరం కలిసి చదవొచ్చు. 37 00:01:55,282 --> 00:01:58,202 ఏంటి? మీ బుక్ క్లబ్ నిండిపోయిందని చెప్పావు కదా. 38 00:01:58,285 --> 00:02:01,622 అది లూయిస్ వాళ్ళ అమ్మకి ప్రమోషన్ వచ్చి, వాళ్ళ కుటుంబం స్పెయిన్ వెళ్లకముందు సంగతి. 39 00:02:01,705 --> 00:02:04,625 కాబట్టి, ఇప్పుడొక సీట్ ఖాళీగా ఉంది. నీకు జాయిన్ అవ్వాలని ఉంటే కావొచ్చు. 40 00:02:05,250 --> 00:02:06,960 దాని గురించి ఆలోచించనివ్వు. 41 00:02:07,044 --> 00:02:09,755 సరదాగా చదివే పిల్లల కథల్లో 42 00:02:09,838 --> 00:02:11,965 పాత్రలపై లోతైన చర్చలు చేయడమా? 43 00:02:12,049 --> 00:02:14,259 -నాకు ఖచ్చితంగా చేరాలని ఉంది! -మంచిది. 44 00:02:14,343 --> 00:02:17,763 నేను డాఫ్నీతో ఈ విషయం మాట్లాడతాను. ఆవిడే ఈ క్లబ్ ప్రెసిడెంట్. 45 00:02:18,305 --> 00:02:19,556 ఆ చప్పుడు విన్నావా? 46 00:02:19,640 --> 00:02:20,807 పోస్ట్ వచ్చినట్లుంది. 47 00:02:20,891 --> 00:02:22,935 ఈరోజు అన్నీ గొప్పగా జరుగుతున్నాయి. 48 00:02:29,107 --> 00:02:30,692 హాయ్, డాక్టర్ యాబీ. 49 00:02:30,776 --> 00:02:34,154 నన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నందుకు థాంక్స్, లిజ్జీ. నిన్ను మళ్ళీ కలవడం సంతోషంగా ఉంది. 50 00:02:34,238 --> 00:02:37,199 నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. డాఫ్నీతో మాట్లాడగానే నీకు చెబుతాను. 51 00:02:37,282 --> 00:02:38,700 -బై. -బై. 52 00:02:39,910 --> 00:02:42,579 సారీ. నేను పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. 53 00:02:42,663 --> 00:02:45,499 అదీ, నేను నీకు ఒకటి డెలివరీ ఇద్దామని వచ్చాను. 54 00:02:51,296 --> 00:02:54,466 హాయ్. హాయ్! 55 00:02:55,592 --> 00:02:57,636 దీని పేరేంటి? 56 00:02:59,555 --> 00:03:03,058 "జాక్" 57 00:03:03,642 --> 00:03:05,477 నా క్లైంట్ లలో ఒకరు మాస్టిఫ్ జాతి కుక్క 58 00:03:05,561 --> 00:03:08,230 మర్ఫికి తోడుగా ఉంటుందని జాక్ ని ఇక్కడికి తీసుకొచ్చారు. 59 00:03:08,313 --> 00:03:11,650 కానీ వాటికి పొసగలేదు. కలిసినప్పటి నుండి ఆ రెండూ ఎడమొహం పెడమొహంగా ఉండేవి. 60 00:03:11,733 --> 00:03:13,610 మాస్టిఫ్ జాతి కుక్కలు చాలా పెద్దవి. 61 00:03:13,694 --> 00:03:17,823 జాక్ బాగా భయపడిపోయి ఉంటుంది. పాపం. 62 00:03:23,078 --> 00:03:26,081 -దీనికి ఇల్లంతా తిరగాలని ఉంది అనుకుంట. -అవును. 63 00:03:31,670 --> 00:03:35,424 బాక్సర్ పప్పీలని ఎక్కువగా పట్టించుకోవాలి. 64 00:03:36,383 --> 00:03:38,385 మేము దీన్ని బాగా పట్టించుకుంటాం. 65 00:03:38,468 --> 00:03:40,304 అందుకే మీరంటే నాకు ఇష్టం. 66 00:03:41,513 --> 00:03:43,140 పట్టించుకోవడం విషయానికొస్తే, 67 00:03:43,223 --> 00:03:46,226 నేనిప్పుడు వెళ్లి జ్వరంతో ఉన్న ఒక చిలుకని పట్టించుకోవాలి. 68 00:03:46,310 --> 00:03:48,020 -మళ్ళీ థాంక్స్. -పరవాలేదు. 69 00:03:48,103 --> 00:03:49,438 -థాంక్యూ. -తప్పకుండా. 70 00:03:50,105 --> 00:03:54,067 లిజ్జీ, నువ్వు లెటర్ కోసం ఎదురుచూస్తున్నావు, కదూ? 71 00:03:55,569 --> 00:03:57,821 నిజంగా? ఓహ్, ఓరి దేవుడా. 72 00:03:57,905 --> 00:04:00,407 ఆవిడ నాకు రిప్లై ఇచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. 73 00:04:00,490 --> 00:04:02,451 నువ్వు ఇప్పటికీ దాన్ని తెరవకపోవడం నేను నమ్మలేకపోతున్నాను. 74 00:04:06,330 --> 00:04:08,081 జాక్, వద్దు! 75 00:04:08,165 --> 00:04:09,374 -జాక్! -జాక్. 76 00:04:09,458 --> 00:04:11,460 వద్దు, జాక్, ఆగు! 77 00:04:11,543 --> 00:04:14,129 -వదులు, జాక్. -నువ్వు దాన్ని భయపెడుతున్నావు! 78 00:04:14,213 --> 00:04:16,380 నీ హడావిడికి తగ్గట్లు అది ప్రవర్తిస్తోంది, తల్లీ. 79 00:04:17,548 --> 00:04:19,051 అవును, కాదు, సరిగ్గా చెప్పావు. 80 00:04:19,134 --> 00:04:21,470 బాక్సర్ కుక్కలు సున్నితంగా ఉంటాయి, ఊరికే ఆవేశపడతాయి. 81 00:04:26,016 --> 00:04:28,101 ఇటురా, జాక్. పరవాలేదు రా. 82 00:04:28,185 --> 00:04:29,811 దగ్గరికి రా, బుజ్జీ. 83 00:04:31,313 --> 00:04:33,190 కమాన్. ఇక్కడికి తీసుకురా, జాక్. 84 00:04:33,774 --> 00:04:35,192 కమాన్. 85 00:04:35,275 --> 00:04:36,568 పరవాలేదు, బుజ్జీ. 86 00:04:37,736 --> 00:04:39,571 ఇక్కడికి రా. 87 00:04:41,073 --> 00:04:43,784 బాగా చేస్తున్నావ్. ఇక్కడికి రా. 88 00:04:44,409 --> 00:04:45,410 మంచి దానివి, జాక్. 89 00:04:47,496 --> 00:04:49,623 చాలా బాగా చేశావు. 90 00:04:50,832 --> 00:04:52,501 అవును. చేశాను. 91 00:04:54,586 --> 00:04:55,629 డియర్ లిజ్జీ 92 00:04:56,880 --> 00:05:00,092 సరే, ఇక అయిపోయిందనుకుంటా. 93 00:05:03,303 --> 00:05:08,600 "డియర్ లిజ్జీ," ఏదో ఏదో రాసుంది. కుక్కపిల్ల నాలుక వల్ల తడిచింది. 94 00:05:08,684 --> 00:05:12,646 ఏదో తెలియట్లేదు, "మంచి ఆలోచన." 95 00:05:13,313 --> 00:05:15,607 ఏదో, ఏదో. 96 00:05:19,528 --> 00:05:20,863 ప్రయత్నించినందుకు థాంక్స్. 97 00:05:20,946 --> 00:05:23,949 బంగారు తల్లీ, నువ్వు ఈ లెటర్ కోసం ఎన్నో వారాల నుండి ఎదురు చూస్తున్నావని తెలుసు. 98 00:05:26,076 --> 00:05:31,999 "నీలాంటి అభిమానుల వల్లే నేను..." 99 00:05:33,542 --> 00:05:35,252 "రాస్తున్నాను" అని రాశారనుకుంటా. 100 00:05:37,004 --> 00:05:40,340 ఏంటి? రచయిత కావడానికి నాలాంటి అభిమానులే కారణమా? 101 00:05:40,424 --> 00:05:42,926 కిట్ స్మిథర్స్ రచనలు చేయడానికి నేనే కారణం. 102 00:05:43,010 --> 00:05:45,512 సరే, ఈ లెటర్ ని ఎవరూ ముట్టుకోకూడదు. నేను ఫోటో ఫ్రేం వెతుకుతాను. 103 00:05:50,017 --> 00:05:51,226 ఇక్కడ ఉండు, జాక్. 104 00:05:51,852 --> 00:05:55,314 నీకు కొరకాలని అనిపిస్తే, దీన్ని కొరుక్కో. 105 00:06:00,235 --> 00:06:01,320 ఏం చేస్తోంది? 106 00:06:02,779 --> 00:06:05,657 సరే. కాస్త బెదురుగా ఉంది, అందుకని క్రేట్ లో ఉంచుతున్నాను. 107 00:06:05,741 --> 00:06:08,619 అందులో ఉంటే ఈ కొత్త వాతావరణంలో ఇమడడానికి సాయపడుతుంది. 108 00:06:09,203 --> 00:06:11,246 మేము నీకు చేసినట్లుగానే, దానికి కూడా చేస్తున్నావు అన్నమాట. 109 00:06:11,330 --> 00:06:14,082 కాకపోతే జాక్ ఎక్కువ సేపు టివి చూస్తానని అడగడం లేదు అంతే. 110 00:06:14,166 --> 00:06:15,626 జోకులెయ్యకు, నాన్నా. 111 00:06:15,709 --> 00:06:18,253 -మంచి జోకు. -థాంక్యూ, స్వీటీ. 112 00:06:18,337 --> 00:06:20,214 -నిన్ను చూసి గర్విస్తున్నాం. -అవును. 113 00:06:23,800 --> 00:06:26,595 నీకా డాల్ఫిన్ బాగా నచ్చినట్లుందే? 114 00:06:31,350 --> 00:06:34,102 ఓహ్, ఓరి దేవుడా. చేత్తో రాశారా. 115 00:06:34,186 --> 00:06:37,189 -నీకోసం టైమ్ కేటాయించింది. -అవును. 116 00:06:37,272 --> 00:06:40,317 ఇదొక మంచి స్నేహానికి ఆరంభం అనుకుంటున్నాను. 117 00:06:40,400 --> 00:06:41,777 లేదంటే కనీసం కలం స్నేహం చేయడానికి. 118 00:06:41,860 --> 00:06:44,154 నేను కూడా మిచెల్ ఒబామాకి లెటర్ రాద్దామని అనుకుంటున్నాను. 119 00:06:44,238 --> 00:06:46,406 నేను సీరియస్ గా చెబుతున్నాను, మరియా. 120 00:06:46,490 --> 00:06:49,910 నా ఫేవరెట్ బుక్ షాపులో ఆవిడ చదవబోతోందని తెలిసింది, 121 00:06:49,993 --> 00:06:53,372 ఆ తర్వాత నాకు రిప్లై ఇచ్చింది, ఆవిడకి కుక్కలంటే ఇష్టమట. 122 00:06:53,872 --> 00:06:56,041 ఇది ఆవిడ బాక్సర్, కబూడుల్. 123 00:06:56,124 --> 00:06:58,168 జాక్ లాగే అది కూడా బాక్సర్. 124 00:06:58,252 --> 00:06:59,336 నాకు తెలుసు. 125 00:07:00,462 --> 00:07:02,965 కాబట్టి, ఇంకో ఆసక్తికరమైన న్యూస్ ఏంటంటే, 126 00:07:03,048 --> 00:07:05,926 -బుక్ క్లబ్ గురించి నేను డాఫ్నీతో మాట్లాడాను. -ఆవిడ ఏం చెప్పింది? 127 00:07:06,510 --> 00:07:09,054 అడ్మిషన్ కమిటీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఒప్పుకుంది. 128 00:07:09,137 --> 00:07:10,764 రేపు మధ్యాహ్నం, మీ ఇంట్లో. 129 00:07:10,848 --> 00:07:13,308 అడ్మిషన్స్ కమిటీ? నిజమా? 130 00:07:13,892 --> 00:07:16,478 నాకు తెలుసు. కానీ కంగారుపడకు. నువ్వు బాగా చేయగలవు. 131 00:07:16,562 --> 00:07:19,815 వరల్డ్ ఫేమస్ రచయితతో పరిచయం ఏర్పడుతున్న వ్యక్తిని 132 00:07:19,898 --> 00:07:22,150 బుక్ క్లబ్ లోకి రానివ్వకుండా ఎవరైనా ఉంటారా? 133 00:07:24,528 --> 00:07:26,905 నేను వెళ్ళాలి. థాంక్స్, మరియా. 134 00:07:33,453 --> 00:07:35,789 ఓహ్, అయ్యో. అయ్యో పాపం కుక్కపిల్ల. 135 00:07:37,082 --> 00:07:39,668 హేయ్, పరవాలేదు, జాక్. మేము ఇక్కడే ఉన్నాం. 136 00:07:46,175 --> 00:07:49,261 ఇది ఇంతకుముందు డాల్ఫిన్ లాగా ఉండేదా? 137 00:07:51,054 --> 00:07:53,390 దీనికి టేప్ వేయడం సాధ్యం కాదు. 138 00:07:55,601 --> 00:07:57,477 ఇక్కడ ఏం జరుగుతోంది? 139 00:07:57,561 --> 00:08:00,522 ఒంటరిగా ఉండడం ఇష్టం లేక ఇలా చేస్తోంది. 140 00:08:00,606 --> 00:08:02,524 బాక్సర్ కుక్కలకి ఎవరో ఒకరు తోడుండాలి. 141 00:08:12,868 --> 00:08:14,494 ఇక్కడికి రా, జాక్. 142 00:08:14,995 --> 00:08:16,455 ఇక్కడికి రా. 143 00:08:17,039 --> 00:08:19,416 -హేయ్, బుజ్జీ. -మంచి దానివి. మంచి దానివి. 144 00:08:22,920 --> 00:08:25,422 ఇప్పుడు సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తోంది. 145 00:08:47,819 --> 00:08:49,321 గుడ్ మార్నింగ్. 146 00:08:51,990 --> 00:08:55,077 సరిగా నిద్రపోలేదా? దుప్పట్లన్నీ జాక్ లాగేసుకుంది అనుకుంటాను. 147 00:08:55,160 --> 00:08:57,913 -మేము మిమ్మల్ని నిద్ర లేపాలని అనుకోలేదు. -లేపాలి అనుకున్నా కుదరదు బాబు. 148 00:08:57,996 --> 00:08:59,831 సరే, సరే. 149 00:08:59,915 --> 00:09:01,208 మేము జాక్ గురించి బాధపడుతున్నాం, 150 00:09:01,291 --> 00:09:03,877 అది సురక్షితంగా ఫీలయ్యేలా చేసేందుకు సాయం చేయాలని అనుకున్నాం. 151 00:09:03,961 --> 00:09:07,381 ఆ రెండో కుక్క దీనితో ఎందుకలా ప్రవర్తించిందో నాకు తెలీదు. ఇది ఎంతో మంచిది. 152 00:09:08,507 --> 00:09:12,386 -మనం జాక్ కి తోడుగా ఇంకొక కుక్కని తెస్తే? -నిజానికి అది చాలా మంచి ఆలోచన. 153 00:09:12,469 --> 00:09:14,596 దీనితో పొసిగే ఇంకో కుక్క అను. 154 00:09:14,680 --> 00:09:16,098 నేను శామీకి కాల్ చేస్తాను. 155 00:09:16,181 --> 00:09:20,727 రూఫస్, గోల్డీలని తీసుకురావచ్చు. వాటిని మించి స్నేహంగా ఉండే కుక్కలు ఈ ప్రపంచంలో ఉండవు. 156 00:09:20,811 --> 00:09:23,480 -జాక్ వాటిని ఇష్టపడుతుంది. -ప్లాన్ బాగుంది. 157 00:09:23,564 --> 00:09:27,234 గుర్తుపెట్టుకో, సమాజంతో పరిచయం ఏర్పరచుకోవడంలో భాగంగా, 158 00:09:27,317 --> 00:09:29,778 జాక్ ని నువ్వు ఎవరితో పరిచయం చేస్తున్నావన్నది కూడా ముఖ్యమే. 159 00:09:29,862 --> 00:09:32,614 మంచిది. కానీ "నువ్వు" అని ఎందుకు అంటున్నావు? 160 00:09:32,698 --> 00:09:35,409 ఎందుకంటే నేను నా ఇంటర్వ్యూ కోసం తయారవ్వాలి. 161 00:09:45,460 --> 00:09:47,004 స్మోర్స్. మంచి ఛాయిస్. 162 00:09:47,087 --> 00:09:50,174 నిజానికి అవి "టోని స్మోరిసన్స్." 163 00:09:51,216 --> 00:09:52,301 ఎందుకంటే బుక్ క్లబ్ కదా. 164 00:09:52,384 --> 00:09:55,762 బుక్ క్లబ్ ప్రెసిడెంట్ మనసు గెలవాలంటే పదాలతో ఆడుకోవడం సులువైన మార్గం. 165 00:09:56,638 --> 00:10:00,267 ఆ తర్వాత నా లెటర్ ని వాళ్ళకి చూపిస్తాను. 166 00:10:00,934 --> 00:10:03,729 మంచి ఆలోచన. వాళ్ళు నిన్ను ఇష్టపడతారు. 167 00:10:03,812 --> 00:10:07,107 అలా అయితే బాగుంటుంది. సరే, నేను రెడీ. కానిద్దాం. 168 00:10:07,191 --> 00:10:09,943 వాళ్ళు రావడానికి ఇంకో గంట పడుతుందని తెలుసు కదా? 169 00:10:10,027 --> 00:10:13,071 నాకు తెలుసు. నేను పూర్తిగా సిద్ధమై పోయాను. 170 00:10:13,572 --> 00:10:16,366 అదీ, పియర్ తో చేసిన ఈ స్వీట్ ని... 171 00:10:16,450 --> 00:10:20,662 అంటే "షేక్స్ పియర్" స్వీటుని తిరిగి ఫ్రిడ్జ్ లో పెడతాను. 172 00:10:21,914 --> 00:10:23,415 సరే అయితే, ఇక్కడ ఉండండి. 173 00:10:24,208 --> 00:10:26,460 గోల్డీ, రూఫస్! 174 00:10:27,044 --> 00:10:30,380 వీటి ఉత్సాహాన్ని తగ్గించడానికి వీటితో తాడు లాగే ఆట ఆడించాను. 175 00:10:30,464 --> 00:10:33,050 ఒంట్లో శక్తి ఎక్కువగా ఉంటే మా అమ్మమ్మ అలా అంటుంది. 176 00:10:33,133 --> 00:10:36,386 -కొత్త ఫ్రెండ్ ని కలిసినందుకు సంతోషిస్తాయి. -మంచిది. నేను జాక్ ని తీసుకొస్తాను. 177 00:10:36,470 --> 00:10:39,097 సరే. రెడీ పిల్లలూ? మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. 178 00:10:39,890 --> 00:10:41,975 రా, జాక్. వెళ్దాం పద. 179 00:10:43,352 --> 00:10:45,312 పద వెళ్దాం. పద. భయపడకు. 180 00:10:48,190 --> 00:10:49,441 జాక్. 181 00:10:49,525 --> 00:10:52,152 -సరే, పిల్లలూ. -పరవాలేదు. 182 00:10:52,236 --> 00:10:53,403 జాక్, వద్దు. 183 00:10:56,156 --> 00:11:00,035 గోల్డీ, రూఫస్ ఒకదానితో ఒకటి చనువుగా ఉంటాయి కాబట్టి జాక్ అసూయపడిందా? 184 00:11:00,118 --> 00:11:04,498 ఏమో. ప్రపంచంలోనే అత్యంత స్నేహంగా ఉండే కుక్కలతో స్నేహం చేయలేకపోయిందంటే, 185 00:11:04,581 --> 00:11:05,958 ఎక్కడో ఏదో పొరబాటు జరుగుతోంది. 186 00:11:06,041 --> 00:11:09,294 అవును. ఆ ఇంకో కుక్క దీంతో ఎలా ప్రవర్తించిందో ఏంటో. 187 00:11:10,337 --> 00:11:11,964 నేను కనిపెడతాను. 188 00:11:12,714 --> 00:11:15,592 మొదటిది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే కాట్నిస్ కి అసలు స్వార్థమే ఉండదు. 189 00:11:15,676 --> 00:11:17,803 నేను కూడా అదే అనుకున్నాను. 190 00:11:17,886 --> 00:11:20,973 వావ్. ఎన్నో ఆసక్తికరమైన పుస్తకాలు. 191 00:11:21,056 --> 00:11:22,933 మా ఇంట్లో అందరం పుస్తకాలు చదువుతాం. 192 00:11:25,227 --> 00:11:28,188 అయితే లిజ్జీ, 'లిటిల్ విమెన్' పై నీ అంచనా ఏంటి? 193 00:11:28,689 --> 00:11:29,690 అద్భుతం. 194 00:11:29,773 --> 00:11:31,108 టు కిల్ ఎ మోకింగ్ బర్డ్? 195 00:11:31,191 --> 00:11:34,987 అదో క్లాసిక్. కానీ హార్పర్ లీ తన రచనలు కొనసాగించకపోవడం ఎంతో బాధాకరం. 196 00:11:35,070 --> 00:11:36,446 -ఆడియో బుక్స్? -అవి నచ్చుతాయి, 197 00:11:36,530 --> 00:11:39,867 -కానీ ముందుగా పుస్తకంగా చదవడమే ఇష్టం. -మరియా సరిగానే చెప్పింది. 198 00:11:39,950 --> 00:11:42,619 -నువ్వు మా బుక్ క్లబ్ కి సరిగ్గా సరిపోతావు. -చెప్పానుగా. 199 00:11:42,703 --> 00:11:45,622 ఈ స్మోరిసన్ కుకీస్ అద్భుతంగా ఉన్నాయి. 200 00:11:45,706 --> 00:11:47,332 అంటే నన్ను చేర్చుకున్నట్లేనా? 201 00:11:49,209 --> 00:11:52,129 సమస్యేంటంటే, మాకు ఒకే సీట్ ఖాళీగా ఉంది, 202 00:11:52,212 --> 00:11:55,716 ఈరోజు ఉదయం మేము ఇంకో అభ్యర్థిని కలిశాం. తనకు కూడా చాలా అర్హతలున్నాయి. 203 00:11:55,799 --> 00:11:57,467 వాళ్ళింట్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, 204 00:11:57,551 --> 00:12:00,345 వేసవిలో మా కార్యక్రమాలకు బాగుంటుంది. 205 00:12:01,680 --> 00:12:04,725 ఇది పెద్ద నిర్ణయం, రాత్రంతా ఆలోచించాలి. 206 00:12:04,808 --> 00:12:06,727 నిన్ను కలవడం చాలా సంతోషం, లిజ్జీ. 207 00:12:08,187 --> 00:12:09,605 ఆగండి. 208 00:12:09,688 --> 00:12:13,108 ఆదివారం మన సమావేశానికి నేను నిజమైన రచయితని తీసుకొస్తే? 209 00:12:13,192 --> 00:12:15,652 ఆవిడ బుక్స్ చదివి, వాటిపై చర్చలు జరపవచ్చు. 210 00:12:16,445 --> 00:12:17,988 ఏ రచయిత? 211 00:12:18,071 --> 00:12:21,408 కిట్ స్మిథర్స్. లిజ్జీ కి కిట్ స్మిథర్స్ తెలుసు. 212 00:12:21,491 --> 00:12:24,620 -అవును తెలుసు. -ఆవిడ రచనలు నాకు తెలీదు. 213 00:12:24,703 --> 00:12:28,040 ఆగు. నీకు నిజంగా కిట్ స్మిథర్స్ తెలుసా? 214 00:12:28,540 --> 00:12:30,542 నాకు బెక్కా బ్యాక్స్టర్ పాత్ర ఇష్టం. 215 00:12:31,126 --> 00:12:34,588 సస్పెన్స్ నిండిన కథనం, ఉత్తేజపరిచే మహిళా పాత్ర. ఆవిడ నీకు నచ్చుతుంది. 216 00:12:34,671 --> 00:12:38,467 అవును. నిజానికి, ఆవిడ నాకు రాసిన లెటర్ ఇది. 217 00:12:39,718 --> 00:12:41,512 ఇది చదవలేకపోతున్నాను. 218 00:12:42,012 --> 00:12:47,935 ఎక్కువ భాగం వ్యక్తిగత అంశాలు, నేను, కిట్ వేసుకునే జోకులు. 219 00:12:48,519 --> 00:12:49,520 ఆగు. 220 00:12:53,690 --> 00:12:55,317 రచనలు ప్రచురితమైన రచయితని ఇంతవరకూ కలవలేదు. 221 00:12:55,400 --> 00:12:58,737 సొంతగా ప్రచురించిన వారు లెక్కలోకి వస్తారో లేదో నాకు తెలీదు. 222 00:13:00,280 --> 00:13:02,282 బుక్ క్లబ్ లోకి స్వాగతం, లిజ్జీ. 223 00:13:09,915 --> 00:13:12,042 జాక్ పాత ఓనర్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటారని నీకు తెలుసా? 224 00:13:12,125 --> 00:13:15,045 ప్రతిరోజూ మధ్యాహ్నం మూడు గంటలకి డాగ్ పార్కుకు వస్తుందని డాక్టర్ యాబీ చెప్పారు. 225 00:13:15,128 --> 00:13:18,549 ఒకవేళ రాకపోయినా కూడా, జాక్ ఆడుకోడానికి ఏవైనా దొరుకుతాయేమో చూద్దాం. 226 00:13:18,632 --> 00:13:20,175 -ఇక్కడ బోలెడన్ని ఉన్నాయి. -అవును. 227 00:13:22,719 --> 00:13:25,806 -దీని లీష్ వదిలేద్దామా? -అలాగే. 228 00:13:25,889 --> 00:13:27,850 జాక్, ఫ్రెండ్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నావా? 229 00:13:30,727 --> 00:13:32,187 వెళ్ళు. 230 00:13:35,315 --> 00:13:36,984 బయటికి రా, జాక్. 231 00:13:38,443 --> 00:13:39,695 మళ్ళీ మొదటికొచ్చింది. 232 00:13:40,571 --> 00:13:42,239 బయటికి రా, జాక్. పరవాలేదు. 233 00:13:44,700 --> 00:13:46,410 ఆ కుక్క నాకంటే పెద్దగా ఉంది. 234 00:13:46,493 --> 00:13:48,829 అది మాస్టిఫ్. ఆవిడ ఖచ్చితంగా ఆండ్రియా అయ్యుంటుంది. 235 00:13:48,912 --> 00:13:50,330 ఓహ్, ఆవిడ సరిగ్గా సమయనికొచ్చింది. 236 00:13:53,417 --> 00:13:54,710 జాక్? 237 00:13:56,378 --> 00:13:59,173 జాక్! హాయ్! 238 00:13:59,256 --> 00:14:02,926 యే! హలో. నిన్ను మిస్ అయ్యాను. 239 00:14:03,010 --> 00:14:04,887 హాయ్. 240 00:14:06,471 --> 00:14:08,849 మీలో ఒకరు చార్లెస్ పీటర్సన్ అయ్యుంటారు. 241 00:14:08,932 --> 00:14:11,393 అది నేనే. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ శామీ. 242 00:14:11,476 --> 00:14:12,936 -హాయ్. -హాయ్. 243 00:14:13,020 --> 00:14:17,858 నేను జాక్ పాత ఓనర్ ని. అనుకోకుండా భలే కలిశామే. 244 00:14:17,941 --> 00:14:19,276 అనుకోకుండా కాదు. 245 00:14:19,359 --> 00:14:23,238 -మీతో జాక్ గురించి మాట్లాడాలని వచ్చాను. -అవునా? ఎందుకు? ఏంటి సమస్య? 246 00:14:23,322 --> 00:14:26,533 ఇది ఎడ్జెస్ట్ కావడానికి చాలా కష్టపడుతోంది. 247 00:14:26,617 --> 00:14:30,370 మీ కుక్క దాన్ని బాగా భయపెట్టిందనుకుంటా. 248 00:14:30,454 --> 00:14:32,039 మర్ఫీనా? 249 00:14:32,122 --> 00:14:35,000 జోక్ చేస్తున్నారా? అది ఈగకి కూడా హాని తలపెట్టదు. 250 00:14:35,083 --> 00:14:38,795 అది ముసలిది, చాలా మంచిది. 251 00:14:41,340 --> 00:14:45,344 నిజమేంటంటే, దగ్గరికి రావడానికి ఇష్టపడనిది ఎవరైనా ఉంటే, అది జాక్. 252 00:14:45,427 --> 00:14:49,598 నా ఉద్దేశం, నా పిల్లలతో బాగా ఆడుకుంటుంది, కానీ మర్ఫీతో అస్సలు ఆడుకునేది కాదు. 253 00:14:49,681 --> 00:14:52,392 దానితో ఆడుకోవాలని ప్రయత్నించినా లేక దగ్గరికి రావాలని ప్రయత్నించినా, 254 00:14:52,476 --> 00:14:54,269 జాక్ ఎప్పుడూ మొరుగుతూ ఉండేది. 255 00:14:54,353 --> 00:14:56,730 రూఫస్, గోల్డీలతో కూడా అలాగే చేసింది. 256 00:14:56,813 --> 00:14:58,565 -అవును. -నేను దీన్ని ఇచ్చేయాలని అనుకోలేదు, 257 00:14:58,649 --> 00:15:01,568 మర్ఫీ కోసం కాకపోతే, నేనసలు ఇచ్చి ఉండేదాన్నే కాదు. 258 00:15:03,278 --> 00:15:08,200 మీరు దానికి మంచి ఇల్లు వెతుకుతారని అనుకుంటున్నాను. అది మంచి కుక్కపిల్ల. 259 00:15:09,785 --> 00:15:12,829 -అవును. -వెళ్దాం పద, జాక్. 260 00:15:16,416 --> 00:15:18,043 నిజంగానే మంచి కుక్క. 261 00:15:18,126 --> 00:15:20,546 భయపడకు, జాక్. నిన్ను పట్టించుకోవడం మానేయనులే. 262 00:15:23,966 --> 00:15:25,968 కాబట్టి వాస్తవాల మీద దృష్టి పెడదాం. 263 00:15:26,051 --> 00:15:29,513 గతంలో నువ్వు సాయం చేసే వాటిని, వెంటబడే వాటిని, 264 00:15:29,596 --> 00:15:33,141 కొంచెం ఎక్కువ పట్టించుకోవాలని కోరుకునే ముద్దొచ్చే పప్పీలని చూసుకున్నావు. 265 00:15:33,225 --> 00:15:36,228 కానీ జాక్, ఇది సుయ్ జెనరస్. 266 00:15:36,311 --> 00:15:38,814 ఇది కూడా మీ అమ్మమ్మ పెట్టిన పేరేనా? 267 00:15:38,897 --> 00:15:41,149 ఓహ్, లేదు. ఇది ల్యాటిన్ పదం... 268 00:15:42,776 --> 00:15:45,612 "ప్రత్యేకమైనది" అని అర్థం. 269 00:15:46,196 --> 00:15:48,031 అంటే దీన్ని ఒంటరిగా వదిలేస్తే ఇష్టపడదు. 270 00:15:48,115 --> 00:15:52,119 -దీనికి మిగిలిన కుక్కలు కూడా నచ్చవు. -వేరే కుక్కలు నచ్చనిది ఎవరికి? 271 00:15:52,202 --> 00:15:55,497 దీనికే. ఈరోజు అనుకున్నట్లుగా ఏదీ జరగలేదు. 272 00:15:56,415 --> 00:15:57,708 అది బాగానే ఉందా? 273 00:15:57,791 --> 00:15:59,501 సమయమిస్తే బాగానే ఉంటుంది. 274 00:15:59,585 --> 00:16:02,921 ఇంట్లో గానీ, కుక్కల పార్కులో గానీ ఇది తప్ప 275 00:16:03,005 --> 00:16:04,423 వేరే కుక్క ఉండడం దీనికి ఇష్టం లేదు. 276 00:16:04,506 --> 00:16:07,342 ఈ విషయం కనిపెట్టడానికి ఆ చార్టు వేశారా? 277 00:16:07,426 --> 00:16:09,803 లేదు, మాకు బోర్ కొట్టింది. 278 00:16:09,887 --> 00:16:13,307 సరే, నీ పని పూర్తయ్యాక, మీ అక్క సంగతి చూడు. 279 00:16:13,390 --> 00:16:15,893 తనకి కూడా ఈరోజు అనుకున్నట్లు జరగలేదు. 280 00:16:16,810 --> 00:16:18,604 -సరే. -సరే. 281 00:16:26,111 --> 00:16:29,865 -అయితే, కిట్ సంగతి ఏం చేస్తావు? -నేను ఆవిడ ఈమెయిల్ ఐడి కనిపెట్టాను, 282 00:16:29,948 --> 00:16:32,284 తనకొక మంచి మెసేజ్ పంపిస్తున్నాను... 283 00:16:33,410 --> 00:16:35,913 -ఇప్పుడే. -సరే, మొదలు బాగానే ఉంది. 284 00:16:35,996 --> 00:16:37,664 కానీ స్పందించడానికి కొన్నిరోజులు సమయం ఇవ్వు. 285 00:16:37,748 --> 00:16:40,834 గుర్తుపెట్టుకో, బాధపడడం వల్ల ఆవిడ తొందరగా స్పందిస్తుందని అనుకోకు. 286 00:16:42,961 --> 00:16:44,755 నాకు కిట్ నుండి మెయిల్ వచ్చింది! 287 00:16:44,838 --> 00:16:46,882 అవునా! అందులో ఏం రాశారు? 288 00:16:46,965 --> 00:16:51,053 "కిట్ స్మిథర్స్ ఆఫీసులో లేరు. భారీ మొత్తంలో మెసేజీలు వస్తున్నందువల్ల, 289 00:16:51,136 --> 00:16:53,555 ఆవిడ ఈ సమయంలో మీకు రిప్లై ఇవ్వలేరు." 290 00:16:54,056 --> 00:16:55,474 ఇలా అవుతుందని అనుకోలేదు. 291 00:16:56,808 --> 00:17:00,521 నేనసలు ఏమాలోచిస్తున్నాను? ఆవిడ ఎంతో బిజీగా ఉండే వ్యక్తి. 292 00:17:00,604 --> 00:17:04,066 ముక్కూ మొహం తెలియని అమ్మాయి అడిగినంత మాత్రాన ఆవిడకు సమయం ఉండాలి కదా. 293 00:17:04,148 --> 00:17:06,818 నువ్వు ముక్కూ మొహం తెలియని అమ్మాయివి కాదు. నువ్వు ఆవిడకి పెద్ద ఫ్యాన్ వి. 294 00:17:07,402 --> 00:17:09,530 అదీ, నేను ఖచ్చితంగా తను ఫ్రెండ్ కాదు. 295 00:17:10,071 --> 00:17:12,031 అయితే, ఏం చేయాలని అనుకుంటున్నావ్? 296 00:17:12,115 --> 00:17:14,076 ఏమో తెలీదు. ఏదో ఒకటి ఆలోచించాలి. 297 00:17:14,159 --> 00:17:16,828 నేను కూడా ఏదో ఒకటి ఆలోచిస్తాను. మళ్ళీ మాట్లాడతాను. 298 00:17:16,912 --> 00:17:18,789 సరే. బై. 299 00:17:20,582 --> 00:17:23,335 మేము నిన్ను సంతోషపెట్టాలని వచ్చాం. ఇది జాక్ ఐడియా. 300 00:17:25,712 --> 00:17:28,048 నేను కోరుకున్నదల్లా మరియా వాళ్ళ బుక్ క్లబ్ లో చేరడం. 301 00:17:28,131 --> 00:17:30,551 కానీ నేను వాళ్ళతో అబద్ధం ఆడి, అంతా చెడగొట్టాను. 302 00:17:30,634 --> 00:17:32,636 నువ్వు అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటో నాకు తెలియట్లేదు. 303 00:17:32,719 --> 00:17:35,264 నువ్వు బుక్ క్లబ్ లో ఎందుకు చేరాలనుకుంటున్నావో కూడా నాకు తెలియట్లేదు. 304 00:17:35,347 --> 00:17:37,349 -నువ్వు సినిమా చూడొచ్చు కదా. -చార్లెస్. 305 00:17:37,432 --> 00:17:40,018 నేను నీ మూడ్ బాగుచేయాలని ప్రయత్నిస్తున్నాను, సరేనా? 306 00:17:40,102 --> 00:17:42,479 నేను, కిట్ స్మిథర్స్ మంచి ఫ్రెండ్స్ అని వాళ్ళకి చెప్పాను. 307 00:17:42,563 --> 00:17:44,857 ఆదివారం ఆవిడని మా మీటింగ్ కి తీసుకొస్తానని చెప్పాను. 308 00:17:46,066 --> 00:17:47,901 ఆవిడేమో నా మెయిల్స్ కి జవాబు కూడా ఇవ్వలేదు. 309 00:17:47,985 --> 00:17:51,113 కానీ ఆవిడ ఈ శనివారం కోజీ నూక్ బుక్స్ కి వస్తుందని చెప్పావు. 310 00:17:51,196 --> 00:17:53,115 అప్పుడు వెళ్లి తనని అడగొచ్చు కదా? 311 00:17:53,198 --> 00:17:56,910 -నేనిక ఆమెని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. -అడిగితేనే కదా విషయం ఏంటని తెలుస్తుంది. 312 00:17:56,994 --> 00:17:59,454 నువ్వు చెప్పినట్లే, బహుశా ఆవిడ బిజీగా ఉండుండొచ్చు. 313 00:17:59,538 --> 00:18:02,207 నువ్వు దొంగచాటుగా వింటున్నావా? పిచ్చివాడా! 314 00:18:02,291 --> 00:18:05,711 లేదు. నువ్వు మరియాతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపలికి వచ్చుంటే, 315 00:18:05,794 --> 00:18:07,629 అది పిచ్చితనం అవుతుంది. 316 00:18:07,713 --> 00:18:08,714 అవును. 317 00:18:11,175 --> 00:18:13,427 నేను నీకు ఏ విధంగా అయినా సాయం చేయగలనా? 318 00:18:13,510 --> 00:18:15,304 నీకు కిట్ స్మిథర్స్ తెలిస్తే తప్ప ఏమీ చేయలేవు. 319 00:18:17,681 --> 00:18:19,349 నాకు తెలిసిన విషయం చెబుతాను. 320 00:18:19,433 --> 00:18:22,936 మనం పప్పీ కోసం ఇల్లు వెతికేటపుడు, నువ్వు అస్సలు వెనకడుగు వేయవు. 321 00:18:23,020 --> 00:18:25,439 కానీ ఈ విషయంలో అలా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. 322 00:18:25,939 --> 00:18:27,274 కమాన్, లిజ్జీ. 323 00:18:27,357 --> 00:18:30,611 నీకు మద్దతు ఇవ్వడానికి నీతో పాటు బుక్ స్టోర్ కి నేను, జాక్ కూడా వస్తాం. 324 00:18:31,111 --> 00:18:34,907 నువ్వు కొత్త మెజెస్టిక్ డాగ్ వారియర్ కామిక్ బుక్ కొనిపించుకోవడం కోసం వస్తున్నావని నాకు తెలుసు. 325 00:18:34,990 --> 00:18:36,450 నువ్వు నీ పాకెట్ మనీ ఎలా వాడతావో 326 00:18:36,533 --> 00:18:38,660 నాకు సంబంధం లేని విషయం. 327 00:18:38,744 --> 00:18:41,079 పైగా అది కామిక్ బుక్ కాదు. అది మాంగా. 328 00:18:42,206 --> 00:18:44,458 జాక్ కోసం ఇల్లు వెతకడం ఎంతవరకూ వచ్చింది? 329 00:18:45,459 --> 00:18:47,002 ఇప్పటికైతే, ఒక్క అవకాశం ఉంది. 330 00:18:47,085 --> 00:18:49,963 సరే, అది సరైనదైతే ఇక సమస్యేముంది. 331 00:18:50,047 --> 00:18:51,965 అది విజయవంతమవుతుందని అనిపించడం లేదు. 332 00:18:56,428 --> 00:18:57,429 చెప్పు? 333 00:18:57,513 --> 00:18:59,056 నేను ఆలోచిస్తున్నాను. 334 00:18:59,139 --> 00:19:01,600 పెంచుకోవడం గురించి ఆలోచిస్తున్నావా? 335 00:19:01,683 --> 00:19:06,021 లేదా ఎప్పుడూ చేసినట్లుగా, ఏ తప్పు వెతుకుదామా అని ఆలోచిస్తున్నావా? 336 00:19:06,605 --> 00:19:11,485 ఇందులో ఏ లోపం లేదు. స్నేహం చేసేలా ఉంది. దీని చెవులు నచ్చాయి. 337 00:19:11,568 --> 00:19:13,695 గుర్తుపెట్టుకో, దీనికి వేరే కుక్కలు నచ్చవు. 338 00:19:13,779 --> 00:19:16,949 నాకు వేరే కుక్కలు లేవు. కాబట్టి అది మంచి విషయం. 339 00:19:17,032 --> 00:19:18,867 -నిజంగా? -ఖచ్చితంగా. 340 00:19:18,951 --> 00:19:20,285 అది అద్భుతమైన విషయం! 341 00:19:20,369 --> 00:19:24,706 కాకపొతే విషయం ఏంటంటే, ఇది బాక్సర్ కాబట్టి నాకు బాక్సింగ్ గుర్తొస్తుంది. 342 00:19:24,790 --> 00:19:26,875 బాక్సింగ్ అంటే గుద్దడమే కదా. 343 00:19:26,959 --> 00:19:29,962 -జూడో ప్రాక్టీసు చేసే వ్యక్తిగా... -నాకు తెలుసులే. 344 00:19:31,505 --> 00:19:33,298 ఈరోజు మధ్యాహ్నం: కిట్ స్మిథర్స్ 345 00:19:34,508 --> 00:19:36,260 -హాయ్, డారియో. -హేయ్, లిజ్జీ. 346 00:19:36,343 --> 00:19:39,680 -నేను ఎందుకు వచ్చానంటే... -మెజెస్టిక్ డాగ్ వారియర్ కొత్త కాపీ వచ్చిందా? 347 00:19:39,763 --> 00:19:41,557 కామిక్ బుక్స్ దగ్గర ఉంది. 348 00:19:41,640 --> 00:19:44,560 -అవును, అది మాంగా అని తెలుసు. -సరే. థాంక్స్. 349 00:19:44,643 --> 00:19:47,020 కిట్ రీడింగ్ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఆగలేవా? 350 00:19:47,104 --> 00:19:48,105 లేదు. 351 00:19:50,065 --> 00:19:53,485 -నేను మిమ్మల్ని ఒక సాయం అడగొచ్చా? -నా బెస్ట్ కస్టమర్ ఏ సాయమైనా అడగొచ్చు. 352 00:19:53,569 --> 00:19:54,862 మీకు అవకాశం ఉంటే, 353 00:19:54,945 --> 00:19:57,573 -నన్ను కిట్ కి పరిచయం... -ఎక్స్క్యూజ్ మీ. 354 00:19:57,656 --> 00:19:58,907 డార్... 355 00:19:58,991 --> 00:20:01,743 -సారీ. -డారియో, మిస్ స్మిథర్స్. 356 00:20:01,827 --> 00:20:04,496 సరే, కిట్ అనండి, మిస్ స్మిథర్స్ కాదు. 357 00:20:04,580 --> 00:20:08,959 మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను నా కళ్ళద్దాలు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. 358 00:20:09,042 --> 00:20:11,712 నేను వెతికి చూస్తాను. 359 00:20:12,379 --> 00:20:13,922 హాయ్, కిట్. 360 00:20:14,006 --> 00:20:15,340 హలో. 361 00:20:15,424 --> 00:20:16,717 నేను మీకు వీరాభిమానిని. 362 00:20:16,800 --> 00:20:19,595 మీకు చాలా పెద్ద అభిమానిని. దాన్ని ఎలా కొలవాలో నాకు తెలీదు. 363 00:20:19,678 --> 00:20:22,139 కానీ నేను మీకు లెటర్ రాశాను, మీరు రిప్లై ఇచ్చారు. 364 00:20:22,222 --> 00:20:24,141 కాకపోతే, దాన్ని కుక్క నమిలేసింది. 365 00:20:24,224 --> 00:20:27,352 కానీ మీరు కిట్ స్మిథర్స్ కాబట్టి నేను దాన్ని ఫ్రేం కట్టి ఉంచాను. 366 00:20:27,436 --> 00:20:31,231 నిన్ను కలవడం సంతోషం. నాకు అనుమతిస్తే... 367 00:20:31,315 --> 00:20:33,817 మీ అభిమానులే మీకు స్ఫూర్తి అని మీరు లెటర్లో రాశారు. 368 00:20:33,901 --> 00:20:34,902 మీకు స్వాగతం. 369 00:20:34,985 --> 00:20:36,528 అంటే, థాంక్యూ. 370 00:20:36,612 --> 00:20:40,157 మీరు రేపు బుక్ క్లబ్ లో ప్రత్యేక అతిథిగా రాగలరేమో 371 00:20:40,240 --> 00:20:41,533 అని అడగాలనుకుంటున్నాను. 372 00:20:41,617 --> 00:20:44,328 దాంతోపాటే పుస్తకానికి తగ్గ రుచికరమైన స్నాక్స్ కూడా ఉంటాయి. 373 00:20:45,204 --> 00:20:46,663 నన్ను క్షమించు. 374 00:20:46,747 --> 00:20:49,333 -ఎవరికీ కనిపించలేదు. -అయ్యో ఇప్పుడెలా. 375 00:20:49,416 --> 00:20:51,543 చదవలేనపుడు పుస్తక పఠనం చేయాలంటే చాలా కష్టం. 376 00:20:51,627 --> 00:20:54,588 నా కారులో ఇంకో జత ఉన్నట్లు గుర్తు. 377 00:20:56,715 --> 00:20:58,342 సారీ తల్లీ, 378 00:20:58,425 --> 00:21:02,638 నా అభిమానుల బుక్ క్లబ్స్ కి నేను ఎప్పుడూ వెళ్ళను. 379 00:21:03,555 --> 00:21:07,392 -కానీ నా రీడింగ్ పూర్తయ్యేవరకూ ఉంటావని ఆశిస్తున్నా. -ఓహ్, ఉంటాను. 380 00:21:09,811 --> 00:21:11,063 తప్పకుండా. 381 00:21:11,563 --> 00:21:12,564 ఏమైంది? 382 00:21:13,857 --> 00:21:17,861 కిట్ కి నేనెవరో తెలీదు, నా బుక్ క్లబ్ కి రానని కూడా చెప్పారు. 383 00:21:17,945 --> 00:21:20,656 -నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, చార్లెస్. -నాక్కూడా. 384 00:21:20,739 --> 00:21:22,908 మెజెస్టిక్ డాగ్ వారియర్ కాపీలు అమ్ముడైపోయాయి. 385 00:21:22,991 --> 00:21:25,160 ఇప్పుడు రీడింగ్ జరిగేటపుడు చదవడానికి ఏమీ లేదు. 386 00:21:26,328 --> 00:21:29,873 నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఉంటాను అన్నావు చూడు, అది సంతోషం. 387 00:21:30,541 --> 00:21:32,459 పైగా, జాక్ కి బోరు కొడుతుంది. 388 00:21:35,921 --> 00:21:37,339 నిజమా? 389 00:21:37,422 --> 00:21:39,258 అవును, నిజంగానే. 390 00:21:40,175 --> 00:21:42,719 సరే, థాంక్స్. కమాన్, జాక్. 391 00:21:56,149 --> 00:21:58,610 హేయ్, మరియా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 392 00:21:58,694 --> 00:22:01,446 కిట్ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను కూడా ఏదో ఒకటి 393 00:22:01,530 --> 00:22:03,448 ఆలోచిస్తానని చెప్పిన విషయం గుర్తుందా? 394 00:22:03,532 --> 00:22:06,201 -అదీ, నేనొకటి ఆలోచించాను. -సరే. 395 00:22:06,285 --> 00:22:08,871 కిట్ రేపు ఉదయమే వెళ్ళిపోవాలని, క్లబ్ కి రాలేరని, 396 00:22:08,954 --> 00:22:11,832 నువ్వు తనతో వాదించావనీ డాఫ్నీ, విన్సెంట్ లకి చెప్పాను. 397 00:22:11,915 --> 00:22:14,668 "కానీ, కిట్, మీరు మాటిచ్చారు. బుక్ క్లబ్ లో నా పరువు పోతుంది" అని చెప్పాను. 398 00:22:15,169 --> 00:22:16,628 వాళ్ళు నిన్ను నమ్మారా? 399 00:22:16,712 --> 00:22:20,257 100%. అంతేకాదు, నువ్వు ఎంత బాధపడుతున్నావో కూడా చెప్పాను, 400 00:22:20,340 --> 00:22:22,050 వాళ్ళు పరవాలేదని చెప్పారు. 401 00:22:22,134 --> 00:22:25,179 ఆగు, అంటే, నేను బుక్ క్లబ్ లో ఉన్నట్లేనా? 402 00:22:25,762 --> 00:22:27,264 మరియా, అది అద్భుతమైన విషయం. 403 00:22:27,347 --> 00:22:30,684 -లేదు, అది కాదు. -అయితే, ఏంటి? 404 00:22:31,268 --> 00:22:32,603 అదిగో వచ్చారు. 405 00:22:32,686 --> 00:22:34,313 లిజ్జీ! 406 00:22:34,396 --> 00:22:37,065 మరియా మాకు అంతా వివరించింది. బాధపడొద్దు. అది మీ తప్పుకాదు. 407 00:22:37,149 --> 00:22:39,151 అంతేకాదు, ఈరోజు మమ్మల్ని పరిచయం చేయి. 408 00:22:39,234 --> 00:22:41,778 ఆవిడ కొత్త పుస్తకం ఎంత నచ్చిందో చెప్పడానికి ఆగలేకపోతున్నాను. 409 00:22:41,862 --> 00:22:45,574 మిగిలిన వాళ్ళందరూ సంతకాలు చేయించుకున్నాక మనతో కలిసి టీ తాగొచ్చు. 410 00:22:46,325 --> 00:22:47,868 విఐపిగా ఉండడం బాగుంటుంది. 411 00:22:55,000 --> 00:22:57,377 నేను మీ ఇద్దరికీ ఒక విషయం చెప్పాలి. 412 00:22:59,338 --> 00:23:01,256 నాకు కిట్ స్మిథర్స్ బాగా తెలీదు. 413 00:23:02,424 --> 00:23:05,761 నేను ఆమెకొక లెటర్ రాశాను. తను రిప్లై ఇచ్చింది. అంతకుమించి ఏం లేదు. 414 00:23:06,762 --> 00:23:11,517 నేను మీ బుక్ క్లబ్ లో ఉండాలనుకున్నా. మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లేదు, కాబట్టి కంగారుపడిపోయాను. 415 00:23:11,600 --> 00:23:13,727 అందరూ ఒకసారి నా మాట వినండి. 416 00:23:13,810 --> 00:23:18,398 కోజీ నూక్ తరపున కిట్ స్మిథర్స్ కి స్వాగతం పలకండి. 417 00:23:23,654 --> 00:23:27,741 వచ్చినందుకు అందరికీ థాంక్యూ. మీ షాప్ చాలా అందంగా ఉంది. 418 00:23:27,824 --> 00:23:29,868 నువ్వు అలా ఎందుకు చేశావో నేను అర్థం చేసుకోగలను. 419 00:23:29,952 --> 00:23:31,828 -మనం ప్రారంభించబోయే ముందు... -నిజంగా? 420 00:23:31,912 --> 00:23:34,414 నిజంగా. కానీ డాఫ్నీ కథ వేరు. 421 00:23:34,498 --> 00:23:38,627 ...నేను నా జీవితంలోని ఒక అంశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 422 00:23:39,378 --> 00:23:40,754 మీలో కొందరికి తెలుసు, 423 00:23:40,838 --> 00:23:44,466 నా బెస్ట్ ఫ్రెండ్ కుక్క కబూడుల్ కి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. 424 00:23:45,551 --> 00:23:47,761 కబూడుల్ చక్కని జీవితం గడిపింది, 425 00:23:47,845 --> 00:23:51,598 అది చనిపోయినప్పటి నుండి నా మనసు మనసులో లేదు. 426 00:23:51,682 --> 00:23:52,683 అందుకే, 427 00:23:52,766 --> 00:23:57,229 పదినిమిషాల క్రితం పార్కింగ్ లాట్ లో ముద్దొచ్చే బాక్సర్ పప్పీని చూశాను, 428 00:23:57,312 --> 00:23:59,439 నేను హలో చెప్పక తప్పలేదు. 429 00:23:59,523 --> 00:24:02,901 దాన్ని తీసుకెళుతున్న అబ్బాయి నన్ను గుర్తుపట్టి, నాతో కాసేపు మాట్లాడాడు, 430 00:24:02,985 --> 00:24:06,446 అతను నా విషయంలో కొంచెం అప్సెట్ అయి ఉన్నాడని తెలిసింది. 431 00:24:06,947 --> 00:24:08,073 ఓహ్, బాబోయ్. 432 00:24:09,032 --> 00:24:10,993 కానీ మేము త్వరలోనే రాజీకొచ్చాం. 433 00:24:11,076 --> 00:24:14,997 అందుకే నేను ఇక్కడున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తికి థాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను, 434 00:24:15,747 --> 00:24:17,124 లిజ్జీ పీటర్సన్... 435 00:24:18,208 --> 00:24:23,714 నాకు గుర్తొస్తోంది, నాకు ఎంతో నచ్చిన, అత్యంత ఆలోచనాత్మకమైన 436 00:24:23,797 --> 00:24:25,007 లెటర్ రాసిన వ్యక్తి తను. 437 00:24:26,258 --> 00:24:28,802 నేను లిజ్జీకి, ఆమె తమ్ముడు చార్లెస్ కి థాంక్స్ చెప్పాలి, 438 00:24:28,886 --> 00:24:33,182 నా కొత్త బెస్ట్ ఫ్రెండ్ జాక్, నేను కలిసి వెర్మోంట్ వెళ్ళబోతున్నాం. 439 00:24:33,265 --> 00:24:34,683 ఏంటి? 440 00:24:34,766 --> 00:24:37,269 అద్భుతంగా ఉంది. 441 00:24:40,272 --> 00:24:44,484 సరే, ఇంతకీ బెక్కా బ్యాక్స్టర్ ఏమంటుందో చూద్దామా? 442 00:24:45,068 --> 00:24:46,904 అది ఆరో అధ్యాయం లోంచి, 443 00:24:46,987 --> 00:24:52,159 బెక్కా, సార్డోలు ఒక చీకటి కోటలో ఉండిపోయినప్పటి సంగతి. 444 00:24:52,242 --> 00:24:53,619 బ్యాక్ ఇన్ టైమ్ విత్ బెక్కా బ్యాక్స్టర్ 445 00:24:55,078 --> 00:24:58,540 బెంజమిన్ ని పరిచయం చేయడానికి ఆఖరి అధ్యాయం వరకూ ఎందుకు ఆగినట్లు? 446 00:24:59,124 --> 00:25:03,337 కిట్ స్మిథర్స్ గురించి నాకు తెలుసు, ఆవిడ తరువాతి పుస్తకంలో అది మనకి తెలుస్తుంది. 447 00:25:04,213 --> 00:25:05,506 ఏమంటారు? 448 00:25:09,843 --> 00:25:11,136 ఇంకెవరైనా మాట్లాడతారా? 449 00:25:34,201 --> 00:25:36,119 స్కొలాస్టిక్ బుక్ సిరీస్ పై ఆధారపడింది ఎల్లెన్ మైల్స్ రచన THE PUPPY PLACE 450 00:26:52,196 --> 00:26:54,198 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ