1 00:00:05,672 --> 00:00:09,051 ఉష్ణోగ్రత పడిపోతోంది. ఆలస్యం అయిపోతోంది. 2 00:00:09,134 --> 00:00:11,970 కానీ నేను వెనక్కి తిరగదలుచుకోలేదు. కేసీ కూడా అంతే. 3 00:00:12,054 --> 00:00:13,055 సెర్చ్ అండ్ రెస్క్యూ 4 00:00:13,138 --> 00:00:15,724 హైకింగ్ చేసే వ్యక్తి ఒకరు లోతుగా ఉన్న గుంటలో పడిపోయాడు. 5 00:00:15,807 --> 00:00:17,726 ఎన్నో గంటలుగా అక్కడే ఉన్నాడు. 6 00:00:17,809 --> 00:00:22,189 కానీ కేసీ లేకపోయుంటే తీవ్రమైన హిమ ఘాతం కారణంగా అతన్ని కనిపెట్టడం అసాధ్యమయ్యేది. 7 00:00:22,773 --> 00:00:24,024 వినడానికే అద్భుతంగా ఉంది. 8 00:00:24,608 --> 00:00:27,110 లేదు. వినడానికి దారుణంగా ఉంది. 9 00:00:33,742 --> 00:00:37,079 సెర్చ్ అండ్ రెస్క్యూ అనేది కొన్నిసార్లు ఎంతో ప్రమాదకరం మారొచ్చు, చార్లెస్. 10 00:00:37,162 --> 00:00:37,996 మిడిల్టన్ అగ్నిమాపక విభాగం 11 00:00:38,080 --> 00:00:40,916 -నేను చెప్పింది విని భయపడినట్లున్నావ్. -నేనేమీ భయపడలేదు. 12 00:00:40,999 --> 00:00:42,835 నాకు ఇరుక్కుపోయిన ఫీలింగ్ ఇష్టం లేదు. 13 00:00:42,918 --> 00:00:45,212 మీ కథలో విషయం అదే కదా. 14 00:00:46,213 --> 00:00:50,425 నేను ఏమనుకుంటున్నానంటే, కేసీ ఎంత గొప్ప కుక్కో మెగ్ చెప్పాలని ప్రయత్నిస్తోంది. 15 00:00:52,553 --> 00:00:56,306 -చూడబోతే కేసీయే మాట్లాడేలా ఉంది. -తన గురించి మాట్లాడితే దానికి నచ్చుతుంది. 16 00:00:56,390 --> 00:00:58,559 నేను ఫస్ట్ ఎయిడ్ సెమినార్ కి వెళ్తున్నాను 17 00:00:58,642 --> 00:01:00,644 లేదంటే మంచి సిపిఆర్ డమ్మీలని వేరే వాళ్ళు తీసేసుకుంటారు. 18 00:01:00,727 --> 00:01:03,230 నేను కూడా నిమిషంలో వచ్చేస్తాను. ఇదిగో స్కౌట్ వచ్చేసింది. 19 00:01:06,191 --> 00:01:09,152 -ఎంత ముద్దొస్తోందో. -దీనిని చూసుకుంటున్నందుకు థాంక్స్. 20 00:01:09,236 --> 00:01:12,239 దీన్ని పెంచుకోబోయే కుటుంబం వచ్చేవారం గానీ తీసుకు వెళ్ళరు. 21 00:01:12,322 --> 00:01:15,492 -ఇది సెర్చ్ అండ్ రెస్క్యూ డాగ్ గా ఎందుకు లేదు? -స్కౌట్ చాలా తెలివైంది, 22 00:01:15,576 --> 00:01:17,786 కానీ ఏకాగ్రత లేకపోవడం వల్ల ఇది ఫెయిల్ అయింది. 23 00:01:17,870 --> 00:01:19,997 నామీద మాత్రం చాలా ఏకాగ్రత చూపిస్తోంది. 24 00:01:20,080 --> 00:01:23,292 స్కౌట్ మనుషుల ప్రాణాలు కాపాడలేకపోవచ్చు, కానీ ముద్దొచ్చే విషయంలో ఏ లోటూ లేదు. 25 00:01:23,375 --> 00:01:24,918 అవును, ఖచ్చితంగా. 26 00:01:26,044 --> 00:01:29,464 హేయ్, మెగ్. మా స్కూలు సేఫ్టీ వీక్ కోసం మీరు కేసీని తీసుకొచ్చి 27 00:01:29,548 --> 00:01:32,467 -ప్రదర్శన ఇవ్వగలరా? -ప్రతి ఏడాదీ ఆ పని మీ నాన్న చేస్తారు కదూ? 28 00:01:32,551 --> 00:01:35,387 అదే కదా సమస్య. ఆయన వేసే జోకులన్నీ పిల్లలకి బాగా తెలుసు. 29 00:01:35,470 --> 00:01:39,141 ఖచ్చితంగా వస్తాను. నా కుక్క ఎంత గొప్పదో పొగిడే అవకాశాన్ని నేను అస్సలు వదులుకోను. 30 00:01:47,065 --> 00:01:50,611 "స్కౌట్" 31 00:01:51,612 --> 00:01:55,407 నీ వయసులో ఉన్నప్పుడు, నేను జర్మన్ షెపర్డ్స్ అంటే భయపడేదాన్ని. 32 00:01:55,490 --> 00:01:57,201 కానీ ఇది చాలా స్నేహంగా ప్రవర్తిస్తోంది. 33 00:01:57,284 --> 00:01:59,119 దీన్ని చూస్తే ఎవరూ భయపడరు. 34 00:01:59,203 --> 00:02:01,663 అందుకే ఇది సెర్చ్ అండ్ రెస్క్యూ డాగ్ కాలేకపోతోంది. 35 00:02:01,747 --> 00:02:04,333 తను చేయాల్సిన పనిమీద కంటే, ఆడుకోవడం మీదే దీనికి శ్రద్ధ. 36 00:02:04,416 --> 00:02:08,252 నిజం చెప్పాలంటే అలాగనడం ఏం బాలేదు. నా ఉద్దేశం, ఇదింకా చిన్నదే కదా. 37 00:02:08,336 --> 00:02:12,132 పిల్లలూ, నేను సేఫ్టీ వీక్ ప్రదర్శనకి సిద్ధంగా ఉన్నాను. 38 00:02:12,216 --> 00:02:15,594 ఎలా ఉన్నాను? హెల్మెట్ పెట్టుకోనా? వద్దా? 39 00:02:17,095 --> 00:02:20,140 పని చేయని సమయంలో యూనిఫారం వేసుకోవడం నీకు అస్సలు నచ్చదేమో కదా. 40 00:02:20,224 --> 00:02:24,811 అవును. చిన్నపిల్లలకి ఉపన్యాసం ఇవ్వడం కూడా ఇబ్బందిగా ఉండొచ్చు. 41 00:02:25,312 --> 00:02:28,065 అదేం లేదు. ఆగండి, మీ ఇద్దరికీ ఇబ్బందిగా ఉందా? 42 00:02:29,107 --> 00:02:32,819 అందరూ ఇష్టపడే ఉద్యోగాల్లో ఫైర్ ఫైటర్ జాబ్ మొదటి మూడిటిలో ఒకటి, తెలుసా? 43 00:02:32,903 --> 00:02:35,113 సరే, ఉన్నట్లుండి మంటలు చెలరేగి 44 00:02:35,197 --> 00:02:37,616 వాళ్ళకి తమ ధైర్యవంతమైన ఆఫీసర్ కావాల్సి వస్తే? 45 00:02:37,699 --> 00:02:39,701 -అవును. -సరే. ఆగు. 46 00:02:39,785 --> 00:02:42,287 గతేడాది పైపులోంచి నీళ్ళు సరిగా రాలేదనా? 47 00:02:44,998 --> 00:02:48,669 -నీ బదులు మెగ్, కేసీలని రమ్మని అడిగాం. -అవును. 48 00:02:48,752 --> 00:02:50,254 అయ్యో. 49 00:02:51,213 --> 00:02:55,425 ప్రదర్శనలో కుక్క ఉంటే బాగుంటుందని అనుకున్నాం, అంతే. 50 00:02:55,509 --> 00:02:56,677 మెగ్ కూడా అదే అనుకుంది. 51 00:02:56,760 --> 00:02:58,762 -అవును. -నన్ను క్షమించు, నాన్నా. 52 00:02:59,805 --> 00:03:01,056 మరేం పరవాలేదు. 53 00:03:01,139 --> 00:03:05,269 ప్రతిసారీ కొత్తగా ప్రదర్శన ఇవ్వాలన్నా కూడా కష్టమే. 54 00:03:16,280 --> 00:03:17,281 ఒకటా? 55 00:03:18,740 --> 00:03:21,118 -డెబ్భై లక్షలు కావాలా? -ఒక్కటి చాలు. 56 00:03:24,454 --> 00:03:27,541 నీ బదులు మెగ్, కేసీలు రావడం నీకు ఓకేనా? 57 00:03:27,624 --> 00:03:32,129 ఖచ్చితంగా. నాకు అర్థమయింది. కుక్క ఉందంటే ఇక పండగే. 58 00:03:32,713 --> 00:03:36,800 అంతేకాదు, నువ్వు మంటల్లోకి వెళ్ళడం లాంటి విషయాలు వినాలంటే కష్టంగా ఉంటుంది తెలుసా. 59 00:03:36,884 --> 00:03:39,219 నువ్వు భయపడతావన్న ఆలోచనే నాకు నచ్చదు. 60 00:03:40,596 --> 00:03:42,973 భయపడడం నా ఉద్యోగంలో ఒక భాగం. 61 00:03:43,056 --> 00:03:45,767 కానీ దాన్నుండి నన్ను బయటపడేసే విషయం ఏదో చెప్పనా. 62 00:03:45,851 --> 00:03:50,314 నాకు సంతోషం కలిగించే విషయం గురించి ఆలోచిస్తాను, అది మీ అమ్మ, ఇంకా మీరు. 63 00:03:51,356 --> 00:03:52,900 నీకు సంతోషం కలిగించే విషయమేది? 64 00:03:55,986 --> 00:03:59,948 కుక్కపిల్లలు, పెద్ద కుక్కలు అనుకుంటాను... 65 00:04:01,408 --> 00:04:03,327 ఇంకా అమ్మచేసే క్రిస్మస్ వంట. 66 00:04:03,410 --> 00:04:04,703 అది సంగతి. 67 00:04:08,999 --> 00:04:10,417 గుడ్ నైట్, చార్లెస్. 68 00:04:10,501 --> 00:04:14,505 -నాన్నా, తలుపు వేయొద్దు. -సారీ, మర్చిపోయాను. 69 00:04:20,219 --> 00:04:23,514 కేసీ నైపుణ్యాలు మీకు చూపించబోయే ముందు, మీకెవరికైనా సందేహాలున్నాయా? 70 00:04:23,597 --> 00:04:25,724 ఉంది, ప్రకటన రూపంలో ఉన్న ప్రశ్న. 71 00:04:25,807 --> 00:04:27,184 మీరు డ్రోన్స్ గురించి మాట్లాడలేదు. 72 00:04:27,267 --> 00:04:29,561 సెర్చ్ అండ్ రెస్క్యూ భవిష్యత్తు డ్రోన్స్. 73 00:04:29,645 --> 00:04:33,232 రెస్క్యూ సిబ్బందికి హాని కలగకుండా, డ్రోన్స్ తో చిక్కుకుపోయిన బాధితుల్ని గుర్తుంచవచ్చు. 74 00:04:33,315 --> 00:04:35,817 ఆవిడ డ్రోన్స్ గురించి మాట్లాడడానికి రాలేదు, రస్సెల్. 75 00:04:35,901 --> 00:04:39,696 పరవాలేదు, చార్లెస్. సెర్చ్ అండ్ రెస్క్యూలో డ్రోన్స్ కి ఖచ్చితంగా ముఖ్య పాత్ర ఉంది, 76 00:04:39,780 --> 00:04:41,990 కానీ కేసీ చేసి చూపించబోయే పనిని అవి చేయలేవు. 77 00:04:42,074 --> 00:04:43,700 -నాకు ఎవరైనా వాలంటీర్ చేస్తారా? -నేను! 78 00:04:43,784 --> 00:04:44,910 హాయ్, నాపేరు రెమి. 79 00:04:44,993 --> 00:04:47,538 -మిమ్మల్ని కలవడం సంతోషం. -హాయ్, రెమి. ఇది తీసుకో. 80 00:04:48,539 --> 00:04:49,623 చాలా బాగుంది. 81 00:04:49,706 --> 00:04:53,168 నువ్వు చేయాల్సింది ఏంటంటే, దీన్ని కేసీకి వాసన చూపించాలి. 82 00:04:53,252 --> 00:04:55,045 -ఈ స్వెటర్ ఎవరిదో వాళ్ళని అది కనిపెడుతుంది. -సరే. 83 00:04:57,756 --> 00:04:59,341 సరే, కేసీ. కనిపెట్టు. 84 00:05:15,816 --> 00:05:17,901 గుడ్ గర్ల్! నన్ను కనిపెట్టావు. 85 00:05:18,735 --> 00:05:19,736 వెళ్దాం పద. 86 00:05:24,950 --> 00:05:26,535 నాకు సాయం చేసినందుకు థాంక్స్, లిజ్జీ. 87 00:05:26,618 --> 00:05:28,954 దాందేముంది. అది చాలా సరదాగా ఉంది. 88 00:05:29,037 --> 00:05:31,915 కావాలంటే, వేరే ప్రదర్శనల్లో కూడా నేను సాయం చేయగలను. 89 00:05:31,999 --> 00:05:33,750 -ఎప్పుడైనా సిద్ధం. -నేను కూడా. 90 00:05:36,670 --> 00:05:38,463 కేసీ ఎంత అద్భుతంగా చేసిందో? 91 00:05:38,547 --> 00:05:42,217 అవును. సెర్చ్ అండ్ రెస్క్యూ డాగ్స్ గొప్పవే. కానీ డ్రోన్స్ అంత గొప్పవి కాదు. 92 00:05:42,301 --> 00:05:46,680 థర్మల్ ఇమేజింగ్ ఉన్న రేసర్ ఎక్స్ డ్రోన్ నిన్ను రెండు క్షణాల్లో కనిపెట్టి ఉండేది. 93 00:05:46,763 --> 00:05:50,267 కావొచ్చు, కానీ కుక్కలకు అదనంగా వాసన పనిగట్టే గుణం ఉండడం వల్ల అవి వాసన లేని 94 00:05:50,350 --> 00:05:52,603 -వస్తువులను కూడా కనిపెట్టగలవు. -డ్రోన్స్ ఎగరగలవు. 95 00:05:52,686 --> 00:05:54,521 కుక్కలు ఫెన్స్ కింది నుండి దూరగలవు. 96 00:05:54,605 --> 00:05:57,441 -డ్రోన్స్ కి డాక్టర్ల అవసరం ఉండదు. -కుక్కలు విసిగించవు. 97 00:05:57,524 --> 00:05:59,985 డ్రోన్స్ కీ, డాగ్స్ కీ వేటికి ఉండే విలువ వాటికుందని అనుకుంటున్నాను. 98 00:06:00,068 --> 00:06:02,738 అయితే కుక్కలు మనతో స్నేహం చేస్తాయి 99 00:06:02,821 --> 00:06:06,241 అలాగే ఒక చెవి మడిచినపుడు, ఎంతో అందంగా కనిపిస్తాయి. 100 00:06:06,325 --> 00:06:08,076 పైగా, నువ్వు డ్రోన్ ని ప్రేమించలేవు. 101 00:06:08,869 --> 00:06:10,412 ఓహ్, అవునా? 102 00:06:15,125 --> 00:06:16,376 ధైర్యంగా ఉండు, చార్లెస్. 103 00:06:19,796 --> 00:06:23,175 అప్పుడు కేసీ నన్ను వెతికి పట్టుకోవడానికి షెడ్ తలుపుల్ని విరగ్గొట్టినంత పనిచేసింది. 104 00:06:23,258 --> 00:06:27,012 మాకు థావ్ వాళ్ళ అమ్మ ప్రమాద సమయంలో ఎలాంటి ఆహారాన్ని సిద్ధం చేయాలో చూపించింది. 105 00:06:27,095 --> 00:06:30,390 -చాక్లెట్ లేని ఆహారం. -చాక్లెట్ లేదా? కష్టమే. 106 00:06:30,474 --> 00:06:33,602 మెగ్ లాగా సెర్చ్ అండ్ రెస్క్యూ విభాగంలో ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. 107 00:06:33,685 --> 00:06:36,605 ప్రయాణించొచ్చు, జనానికి సాయం చేయొచ్చు, కుక్కలతో పనిచేయొచ్చు. 108 00:06:36,688 --> 00:06:38,398 నీకు సరిగ్గా సరిపోతుంది. 109 00:06:38,482 --> 00:06:43,195 చెప్పాలంటే, మనకి సరిగ్గా సరిపోతుంది. నువ్వు కుక్కలతో పనిచేయి, నేను ప్రయాణం చేస్తాను. 110 00:06:45,072 --> 00:06:47,699 హాయ్, చార్లెస్. హాయ్, స్కౌట్. 111 00:06:47,783 --> 00:06:49,034 ఇక్కడికి రా, స్కౌట్. 112 00:06:50,285 --> 00:06:52,621 -హాయ్. -ఇప్పుడు ఏకాగ్రతతో ఉన్నట్లు కనిపిస్తోంది. 113 00:06:52,704 --> 00:06:55,999 ఇది కూడా కేసీలాగా మంచి సెర్చ్ అండ్ రెస్క్యూ కుక్క కాగలదు. 114 00:06:56,083 --> 00:06:57,584 మీరిద్దరూ మంచి జట్టు అవుతారు. 115 00:06:59,795 --> 00:07:01,296 ఒకసారి ప్రయత్నించి చూద్దాం. 116 00:07:03,715 --> 00:07:05,217 వాసన చూడు. 117 00:07:05,843 --> 00:07:08,762 సరే, చార్లెస్. స్కౌట్ ని అటువైపు తిప్పు, నన్ను చూడనివ్వకు. 118 00:07:08,846 --> 00:07:11,473 సరే. ఇటు రా, స్కౌట్. 119 00:07:12,891 --> 00:07:15,561 మంచి ప్రయోగాన్ని మించింది మరేదీ లేదు. 120 00:07:20,774 --> 00:07:23,402 సరే, స్వీటీ. ఇప్పుడు కనిపెట్టు. చెప్పుని కనిపెట్టు. 121 00:07:27,281 --> 00:07:30,242 ఇది చేయగలదని నాకు తెలుసు. ఎంత సంతోషంగా ఉందో చూడు. 122 00:07:30,325 --> 00:07:32,411 చూశావా? ఇది సెర్చ్ అండ్ రెస్క్యూ కుక్క కాగలదు. 123 00:07:32,494 --> 00:07:35,539 మనకి వారం మాత్రమే ఉంది, కానీ మెగ్ కి నిరూపించడానికి ఆ సమయంచాలు. 124 00:07:35,622 --> 00:07:37,082 అయితే ఈరోజు ఎలా గడిచింది? 125 00:07:37,165 --> 00:07:39,835 పిల్లలు మెగ్ ని చూసి కేకలు వేస్తూ చప్పట్లు కొట్టారా లేక మామూలుగా చప్పట్లు కొట్టారా? 126 00:07:39,918 --> 00:07:41,420 ఎందుకంటే నన్ను చూసి ఎప్పుడూ కేకలు వేస్తారు. 127 00:07:41,503 --> 00:07:44,006 హనీ, తప్పు చేశామని పిల్లలు అనుకునేలా చేయకు. 128 00:07:44,840 --> 00:07:47,301 నా చెప్పు ఇక్కడుందా. ఎక్కడ దొరికింది? 129 00:07:47,384 --> 00:07:48,468 నేను తీసుకురాలేదు. 130 00:07:55,392 --> 00:07:58,562 రేంజ్ విషయంలో, నిలకడగా ఉండడంలో, పేలోడ్ విషయంలో డ్రోన్స్ లో రకాలు ఉంటాయి. 131 00:07:58,645 --> 00:08:02,816 మల్టీ రోటర్ డ్రోన్ ప్లాట్ఫార్మ్ పై ఎనిమిది రోటర్ల వరకూ ఉండొచ్చని నీకు తెలుసా? 132 00:08:03,317 --> 00:08:05,819 తెలుసు. అంటే చాలా రోటర్లు ఉండొచ్చన్న మాట. 133 00:08:05,903 --> 00:08:07,613 అవును, ఎనిమిది. 134 00:08:08,280 --> 00:08:11,825 నిన్న పార్కు వెంట డ్రోన్ ఎగరేస్తున్నప్పుడు, నువ్వు నీ కుక్కని వాకింగ్ కి తీసుకురావడం చూశాను. 135 00:08:11,909 --> 00:08:13,035 అది నా కుక్క కాదు. 136 00:08:13,118 --> 00:08:15,913 అది కొత్త ఇంటికి వెళ్ళేవరకూ మేము దానికి చూసుకుంటున్నామంతే. 137 00:08:15,996 --> 00:08:18,498 కేసీలాగా దానికి సెర్చ్ అండ్ రెస్క్యూ చేయడం నేర్పిస్తున్నాం. 138 00:08:18,582 --> 00:08:23,295 ఎందుకంత కష్టం? అది నేర్చుకునేసరికి, డ్రోన్ టెక్నాలజీ ఇంకా మెరుగుపడుతుంది. 139 00:08:23,378 --> 00:08:24,671 ఆ విషయం నాకెలా తెలుసో చెప్పనా? 140 00:08:24,755 --> 00:08:27,716 ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ ఎప్పుడూ పురోగమిస్తూనే ఉంటుంది. 141 00:08:27,799 --> 00:08:32,304 ఏ గ్రహం మీదైనా, ఏ విశ్వంలోనైనా డ్రోన్స్ కుక్కల కంటే బాగా చేయలేవు. 142 00:08:32,386 --> 00:08:36,183 చూద్దామా. నా డ్రోన్ ని ఓడించమని నీ కుక్కకి సవాలు విసురుతున్నాను. 143 00:08:36,265 --> 00:08:39,019 -నేను ఒప్పుకుంటున్నాను. -అది ఏంటో కూడా నీకు సరిగా తెలీదు. 144 00:08:39,102 --> 00:08:41,313 నీక్కూడా తెలీదు. ఇప్పుడేగా దాని గురించి ఆలోచించావు. 145 00:08:42,231 --> 00:08:45,484 సరే. మనం ఏదైనా దాచిపెట్టి ముందుగా ఎవరు కనిపెడతారో చూద్దాం, 146 00:08:45,567 --> 00:08:47,402 నీ కుక్కో లేక నా డ్రోనో చూద్దాం. 147 00:08:47,486 --> 00:08:51,031 నేను, మా అక్క కలిసి స్కౌట్ కి ట్రైనింగ్ ఇస్తే, గెలిచేదెవరో కూడా నాకు తెలుసు. 148 00:08:51,114 --> 00:08:54,785 సవాలుకి సిద్ధం. పార్కులో శనివారం ఉదయం పది గంటలకి. 149 00:08:54,868 --> 00:08:57,746 -నాకు కుదరదు. -ముందే చేతులెత్తేస్తావని నాకు తెలుసు. 150 00:08:57,829 --> 00:09:01,166 అదికాదు. శనివారం ఉదయం పది గంటలకి మానాన్న పాన్ కేక్స్ వేస్తాడు. 151 00:09:02,543 --> 00:09:04,586 -పదకొండు గంటలకి? -ఖచ్చితంగా వస్తాను. 152 00:09:08,799 --> 00:09:11,051 సరే, స్కౌట్. నువ్వు చేయగలవు. 153 00:09:11,134 --> 00:09:13,136 నీ భవిష్యత్తు నీ పాదాలలోనే ఉంది. 154 00:09:13,220 --> 00:09:17,850 అది ఎంత బాగా పనిచేసేది అయినప్పటికీ, నువ్వు ఏ డ్రోనుకూ తీసిపోవు. 155 00:09:18,892 --> 00:09:20,269 ఏంటి? అంతే. 156 00:09:24,773 --> 00:09:26,400 నన్ను ఫాలో చేయి, స్కౌట్. 157 00:09:29,486 --> 00:09:31,446 రా, స్కౌట్. ఇక్కడికి రా. 158 00:09:36,118 --> 00:09:39,371 సరే, స్కౌట్. కూర్చో. కూర్చో. 159 00:09:42,332 --> 00:09:43,542 ఏదీ చేయవా? నిజంగా? 160 00:09:46,879 --> 00:09:47,880 రా, స్కౌట్. 161 00:09:49,089 --> 00:09:51,300 స్కౌట్, ఇక్కడికి రా. ఇక్కడికి రా. 162 00:09:56,263 --> 00:09:58,390 రా, స్కౌట్. ఏమీ కాదు. 163 00:10:01,101 --> 00:10:02,186 నువ్వు చేయగలవు. 164 00:10:12,321 --> 00:10:14,573 -అయితే, ఇప్పుడెలా? -విషయం మళ్ళీ మొదటికొచ్చింది. 165 00:10:14,656 --> 00:10:16,742 ప్రాథమిక పరీక్షల్లో స్కౌట్ సరిగా లేకపోయినప్పటికీ, 166 00:10:16,825 --> 00:10:20,037 అన్నిటికంటే ముఖ్యమైన విషయంలో అది అద్భుతంగా చేసింది: వాసన పసిగట్టడం. 167 00:10:20,120 --> 00:10:23,874 -అది నాన్న చెప్పు కాదు. -అది మరియాది. తను దాక్కుంది. 168 00:10:24,499 --> 00:10:27,127 సరే, స్కౌట్. నువ్వు మరియాని కనిపెట్టాలి, సరేనా? 169 00:10:27,711 --> 00:10:29,755 సరే, మా పరువు నిలబెట్టు. కనిపెట్టు. 170 00:10:33,258 --> 00:10:34,218 అదీ! 171 00:10:37,554 --> 00:10:41,767 అయ్యో! మన అంచనాలన్నీ తప్పుతున్నాయి. మళ్ళీ మొదటికొచ్చాం. 172 00:10:43,310 --> 00:10:46,146 మెగ్ సరిగ్గా చెప్పింది. ఇది సెర్చ్ అండ్ రెస్క్యూ గా కుక్కగా పనికిరాదు. 173 00:10:46,230 --> 00:10:48,106 దానికి నాన్న చెప్పొక్కటే ఇష్టం. 174 00:10:48,607 --> 00:10:50,359 అసలు విషయం చెప్పనా. 175 00:10:50,442 --> 00:10:53,779 స్కౌట్ గురించి అంచనా తప్పినందుకు బాధపడాలో లేక రస్సెల్ గెలుస్తాడని బాధపడాలో తెలీడం లేదు. 176 00:10:53,862 --> 00:10:55,906 స్కౌట్ గురించి మన అంచనా తప్పినందుకే బాధపడాలి. 177 00:10:55,989 --> 00:10:59,076 హేయ్, లిజ్జీ. హేయ్, చార్లెస్. నేను లోపలికి వస్తే పరవాలేదా. 178 00:10:59,159 --> 00:11:01,787 -హేయ్, రెమి. -ఒక మంచి వార్త. 179 00:11:01,870 --> 00:11:04,748 -కుక్కపిల్లని పెంచుకోవడానికి మా అమ్మ ఒప్పుకుంది. -మంచిది, రెమి. 180 00:11:04,831 --> 00:11:06,792 కానీ ప్రస్తుతం అలాంటి కుక్కపిల్లలు లేవు. 181 00:11:06,875 --> 00:11:08,126 మరైతే ఇదేంటి? 182 00:11:08,210 --> 00:11:10,337 ఇది స్కౌట్, కానీ ఇది అందుబాటులో లేదు. 183 00:11:10,420 --> 00:11:13,882 -ఇది వెళ్ళాల్సిన కుటుంబం సిద్ధంగా ఉంది. -తప్పించుకోవాలని చూస్తున్నారు, కదూ. 184 00:11:16,927 --> 00:11:22,474 బొచ్చు బాగుంది. అందమైన కళ్ళు. దీని పాదాలు చూడు ఎలా ఉన్నాయో. 185 00:11:22,558 --> 00:11:24,977 ఇది పెరిగితే చాలా పెద్దదవుతుంది. 186 00:11:27,563 --> 00:11:30,774 పిల్లి దూరేంత చిన్నగా ఉండాలని మా అమ్మ షరతు పెట్టింది, 187 00:11:30,858 --> 00:11:32,693 కాబట్టి ఇది ఎంతమాత్రం సరిపోదు. 188 00:11:32,776 --> 00:11:33,986 నన్ను క్షమించండి. 189 00:11:37,114 --> 00:11:39,032 రస్సెల్ కి కాల్ చేసి ఓడిపోయానని చెబుతావా? 190 00:11:39,116 --> 00:11:42,411 ఆ విషయం నేరుగా చెప్పడమే ఉత్తమమైన పద్ధతి. 191 00:11:44,204 --> 00:11:46,290 నీకు వాడి డ్రోన్ తో ఆడుకోవాలనుంది, కదూ? 192 00:11:46,373 --> 00:11:48,041 దానికి ఎనిమిది రోటర్స్ ఉన్నాయి. 193 00:11:49,835 --> 00:11:51,253 నేనిప్పుడు బయటికి రావొచ్చా? 194 00:11:51,336 --> 00:11:52,754 -అవును. -రావొచ్చు. 195 00:11:59,511 --> 00:12:01,763 అది పక్షా? లేక విమానమా? 196 00:12:01,847 --> 00:12:04,600 లేదంటే కొత్త ఫాల్కొనర్ 5000 డ్రోనా? 197 00:12:05,184 --> 00:12:06,685 చెప్పాలంటే ఇదొక డ్రోన్. 198 00:12:07,686 --> 00:12:09,646 నువ్వేదో తీసుకురావడం మర్చిపోయినట్లున్నావ్. 199 00:12:10,647 --> 00:12:13,275 స్కౌట్ కి ఉదయం నుండీ కడుపులో నొప్పిగా ఉంది. 200 00:12:13,358 --> 00:12:16,570 అనుకోకుండా కొన్ని బంగాళదుంపలు తినేసింది. 201 00:12:16,653 --> 00:12:18,071 కుక్కలు బంగాళదుంపలు తింటాయి. 202 00:12:18,155 --> 00:12:21,617 డాగ్ ఫుడ్ పేరుతో అమ్మే వాటిలో అధిక భాగం ఇదే ఉంటుంది. 203 00:12:21,700 --> 00:12:23,076 అవును, నాకు తెలుసు. 204 00:12:23,952 --> 00:12:26,747 -నువ్వు ఓడిపోయావు, కదూ? -అవును. 205 00:12:26,830 --> 00:12:29,666 -అంటే దానర్థం నేను గెలిచినట్లు, అవునా? -అవును. 206 00:12:29,750 --> 00:12:31,877 నీకు నా డ్రోన్ తో ఆడాలనుంది, అవునా? 207 00:12:32,503 --> 00:12:33,504 తప్పకుండా. 208 00:12:37,341 --> 00:12:41,011 నీ సంగతేంటి? ఇప్పుడు కూడా నువ్వు సెర్చ్ అండ్ రెస్క్యూ చేయొచ్చు. 209 00:12:42,054 --> 00:12:43,055 నాకు తెలీదు. 210 00:12:43,639 --> 00:12:46,808 నాకంటే కూడా స్కౌట్ విషయంలోనే నేను ఎక్కువ ఆసక్తిగా ఉన్నాను. 211 00:12:47,768 --> 00:12:51,021 దానికి ఇష్టం లేని పనిని చేయించడానికి ప్రయత్నించినందుకు నాకు చాలా బాధగా ఉంది. 212 00:12:56,026 --> 00:12:57,778 అడ్డంకులు ఎదుర్కొనే కోర్సు పెట్టారా, హా? 213 00:12:57,861 --> 00:13:00,405 చెప్పాలంటే, ఆ ప్రయోగం విఫలం అయింది. 214 00:13:01,865 --> 00:13:04,743 స్కౌట్ ఒక గొప్ప సెర్చ్ అండ్ రెస్క్యూ డాగ్ కాగలదని నేను అనుకున్నాను. 215 00:13:04,826 --> 00:13:07,329 నువ్వు సంతోషిస్తానంటే చెబుతాను, నేను కూడా అదే అనుకున్నాను. 216 00:13:07,412 --> 00:13:10,457 థాంక్స్. నిజంగానే నాకు కొంచెం బాగా అనిపిస్తోంది. 217 00:13:11,041 --> 00:13:12,417 మీరు స్కౌట్ కోసం వచ్చారా? 218 00:13:12,501 --> 00:13:15,337 అవును, నేను ముందే వచ్చానని తెలుసు, కానీ దీన్ని పెంచుకునే కొత్త కుటుంబం సిద్దంగా ఉంది. 219 00:13:15,420 --> 00:13:18,382 కాసేపాగి దీన్ని తీసుకొచ్చి దింపితే పరవాలేదా? 220 00:13:18,465 --> 00:13:21,260 -చార్లెస్ దీనికి గుడ్ బై చెప్పాలని అనుకుంటాడు. -తప్పకుండా. 221 00:13:21,343 --> 00:13:23,470 తనని బాగా చూసుకున్నందుకు థాంక్స్. 222 00:13:23,971 --> 00:13:27,599 మనం వెళ్లి వాడ్ని కనిపెట్టాలి. రస్సెల్ తో కలిసి డ్రోన్ ఎగరేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. 223 00:13:27,683 --> 00:13:29,601 తిరిగి ఎప్పుడొస్తాడో మనకి తెలీదు. 224 00:13:32,062 --> 00:13:36,567 ఇలా ఎగరేయాలంటే సాధారణంగా కొన్ని సంవత్సరాలు పడుతుంది, 225 00:13:36,650 --> 00:13:38,360 కానీ నేను కొద్ది నెలల్లోనే నేర్చుకున్నాను. 226 00:13:38,443 --> 00:13:39,778 నేను ప్రయత్నించనా? 227 00:13:40,362 --> 00:13:44,116 కాదని చెప్పడానికి మొహమాటం అడ్డొస్తోంది, కానీ జాగ్రత్తగా ఉండు. 228 00:13:46,410 --> 00:13:49,329 త్రోటిల్ ఎడమ వైపు, పిచ్ కుడివైపు ఉన్నాయి. నీ బొటనవేలు వాడు. 229 00:13:49,413 --> 00:13:54,042 నా కజిన్ బెక్కి దగ్గర ఒకటుంది. నీది నడపడం చాలా తేలిగ్గా ఉంది. 230 00:13:54,126 --> 00:13:55,627 సరే. ఇప్పుడు మళ్ళీ నా వంతు. 231 00:13:55,711 --> 00:13:58,046 వద్దు. దాన్ని కింద దింపనివ్వు. 232 00:13:59,423 --> 00:14:00,591 నువ్వు ఏం చేశావో చూడు! 233 00:14:00,674 --> 00:14:02,676 నువ్వు నా చేతిలోంచి లాక్కున్నావు! 234 00:14:07,931 --> 00:14:10,475 మొదటిసారి ఇలా పడిపోయింది, నీ వల్లే! 235 00:14:10,559 --> 00:14:12,978 నేనా? నేను సరిగానే ఎగరేసాను. 236 00:14:13,061 --> 00:14:16,231 నేను పైకెక్కి దాన్ని అందుకోగలను, కానీ నాకు ఎత్తులంటే భయం. 237 00:14:16,315 --> 00:14:19,484 చెప్పాలంటే నాకలాంటి అవసరం కలగలేదు, ఎందుకంటే నా దగ్గర డ్రోన్ ఉంది. 238 00:14:22,738 --> 00:14:25,657 పద. దాన్ని కిందికి దింపడానికి షెడ్లో ఏదైనా కర్ర దొరుకుతుందేమో చూద్దాం. 239 00:14:34,374 --> 00:14:36,168 చూడు. చెప్పానా. 240 00:14:42,132 --> 00:14:44,635 నేను తలుపు తెరవలేకపోతున్నాను. గడి పడిపోయి ఉంటుంది! 241 00:14:44,718 --> 00:14:46,887 ఏంటి? మనం చిక్కుకుపోయామా? 242 00:14:48,430 --> 00:14:50,057 నేను నమ్మలేకపోతున్నాను. 243 00:14:50,140 --> 00:14:51,558 ఇప్పుడు మనం ఏం చేయాలి? 244 00:14:53,977 --> 00:14:55,562 నేను... నాకు తెలీదు. 245 00:14:57,648 --> 00:15:02,569 -కాపాడండి! కాపాడండి! -కాపాడండి! కాపాడండి! 246 00:15:03,153 --> 00:15:04,404 ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరు. 247 00:15:04,488 --> 00:15:07,991 అవును. పైనెక్కడా డ్రోన్ ఎగురుతున్న జాడే లేదు. వాళ్ళు ఎక్కడున్నారు? 248 00:15:09,952 --> 00:15:11,161 లిజ్జీ. 249 00:15:11,912 --> 00:15:13,997 అయ్యో. ఇప్పుడు నాకు కంగారుగా ఉంది. 250 00:15:14,081 --> 00:15:15,290 చార్లెస్! 251 00:15:17,626 --> 00:15:19,753 ఇప్పుడు కాదు, స్కౌట్. ఎందుకలా లాక్కుంటున్నావు. 252 00:15:19,837 --> 00:15:21,088 ఇది ఏం చేస్తోంది? 253 00:15:21,797 --> 00:15:23,799 నేను... స్కౌట్, వెనక్కి రా! 254 00:15:30,013 --> 00:15:31,932 మన దగ్గర టార్చ్ ఉంటే బాగుండేది. 255 00:15:32,808 --> 00:15:36,937 డ్రోన్ రాత్రిపూట కూడా చూడగలదు, కానీ మనకిప్పుడు అది ఉపయోగపడదు. 256 00:15:37,020 --> 00:15:38,981 మనల్ని ఎవరూ కనిపెట్టకపోతే? 257 00:15:41,108 --> 00:15:42,442 ఎవరో ఒకరు వస్తారు. 258 00:15:43,402 --> 00:15:44,862 తెలుసా, నాకు భయం వేసినపుడు, 259 00:15:44,945 --> 00:15:47,948 నేను కుక్కలు, అలాగే మా అమ్మ వండే క్రిస్మస్ వంట గురించి ఆలోచిస్తాను. 260 00:15:48,031 --> 00:15:51,410 -నువ్వెందుకు ప్రయత్నించకూడదు? -మీ అమ్మ వంట గురించి నేనెందుకు ఆలోచించాలి? 261 00:15:51,493 --> 00:15:52,911 నేను తినను కూడా తినలేదు. 262 00:15:52,995 --> 00:15:56,498 నువ్వు సంతోషంగా ఫీలయ్యే విషయం గురించి ఆలోచించమని చెబుతున్నాను. 263 00:15:57,583 --> 00:15:59,001 అదీ, నాకు ఇష్టమైంది... 264 00:15:59,084 --> 00:16:00,544 డ్రోన్స్ ని పక్కన పెట్టి చెప్పు. 265 00:16:00,627 --> 00:16:03,172 బాస్కెట్ బాల్ ఆడటం ఇష్టమని చెప్పబోతున్నా. 266 00:16:03,255 --> 00:16:07,593 నిజంగా? నాక్కూడా. మనిద్దరం కలిసి ఎప్పుడైనా ఆడుకోవచ్చు. 267 00:16:07,676 --> 00:16:11,930 ఏమో మరి. ఆఖరిసారి మనిద్దరం కలిసి చేసిన పని సరిగా జరగలేదు. 268 00:16:16,602 --> 00:16:18,687 -అది ఎక్కడికి వెళ్లి ఉంటుంది? -ఎవరికి తెలుసు? 269 00:16:18,770 --> 00:16:22,316 నా తమ్ముడు, కుక్క పిల్లని ఒకేరోజు పోగొట్టుకున్నాను అంటే నమ్మలేకపోతున్నాను. 270 00:16:22,399 --> 00:16:25,319 సెర్చ్ అండ్ రెస్క్యూ ఉద్యోగానికి నేను పనికిరాను. 271 00:16:26,695 --> 00:16:27,946 చూడు. 272 00:16:29,573 --> 00:16:30,532 స్కౌట్! 273 00:16:35,996 --> 00:16:39,458 ప్రతిరోజూ స్కూలు పూర్తయ్యాక మనం చెరో 100 షాట్స్ వేస్తె, 274 00:16:39,541 --> 00:16:42,711 కొద్ది సంవత్సరాల్లో హైస్కూల్ టీమ్ లో స్థానం పొందగలం. 275 00:16:42,794 --> 00:16:46,798 నిజమే, కానీ మనిద్దరం బాగా ఎత్తు ఎదిగితేనే అది సాధ్యం. 276 00:16:48,592 --> 00:16:51,178 నిజానికి డ్రోన్ ఇరుక్కుపోవడానికి కారణం నేనే. 277 00:16:52,012 --> 00:16:53,222 అవును, నాకు తెలుసు. 278 00:17:02,356 --> 00:17:03,982 ఆగు. ఏదో వినిపిస్తోంది. 279 00:17:06,693 --> 00:17:07,694 కాపాడండి. 280 00:17:07,778 --> 00:17:10,489 -కాపాడండి! -మేము చిక్కుకుపోయాం. కాపాడండి! 281 00:17:10,571 --> 00:17:12,657 -కాపాడండి! -కాపాడండి! 282 00:17:12,741 --> 00:17:13,742 చార్లెస్? 283 00:17:14,785 --> 00:17:16,869 -చార్లెస్? -స్కౌట్! 284 00:17:16,954 --> 00:17:18,997 -మీరు బానే ఉన్నారా? -ఉన్నాం. 285 00:17:19,080 --> 00:17:20,290 మమ్మల్ని ఎలా కనిపెట్టారు? 286 00:17:20,374 --> 00:17:23,627 స్కౌట్ కనిపెట్టింది. చార్లెస్ టోపీని వాసన చూసి, మిమ్మల్ని వెతికి కనిపెట్టింది. 287 00:17:23,710 --> 00:17:25,212 దాని గురించి నా అంచనా సరైనదేనని నాకు తెలుసు. 288 00:17:26,003 --> 00:17:27,172 థాంక్స్, స్కౌట్. 289 00:17:27,256 --> 00:17:31,093 డ్రోన్స్ చేయలేనివీ, కుక్కలు మాత్రమే చేయగలిగిన పనులు కొన్ని ఉంటాయని నేను ఒప్పుకుని తీరాలి. 290 00:17:31,176 --> 00:17:33,804 అవును, కనబడగానే మొహం మీద నాకడం లాంటివి. 291 00:17:36,390 --> 00:17:37,391 హాయ్. 292 00:17:37,474 --> 00:17:40,853 ఇదంతా స్కౌట్ చేసిన పనే. మిమ్మల్ని కనిపెట్టేదాకా ఇది ఊరుకోలేదు. 293 00:17:40,936 --> 00:17:43,021 మీ కథ కూడా నా కథకి ఎంతమాత్రం తీసిపోలేదు. 294 00:17:43,105 --> 00:17:46,066 నువ్వు సరిగ్గా చెప్పావు, లిజ్జీ. బుజ్జి స్కౌట్ కి మంచి సామర్థ్యం ఉంది. 295 00:17:46,149 --> 00:17:49,194 మనం సరిగ్గానే అనుకున్నాం. మీకు కూడా స్కౌట్ మీద నమ్మకం ఉంది. 296 00:17:49,862 --> 00:17:51,947 మెగ్, స్కౌట్ అన్ని పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ, 297 00:17:52,030 --> 00:17:54,074 చార్లెస్, రస్సెల్ లను ఎలా కనిపెట్టగలిగింది? 298 00:17:54,157 --> 00:17:56,952 అత్యవసర సమయంలో గొప్ప సెర్చ్ అండ్ రెస్క్యూ తన సామర్ధ్యాన్ని చూపుతుంది. 299 00:17:57,035 --> 00:18:00,247 నిజంగా ప్రమాదం ఉందని గ్రహించి అది తన సహజ ప్రవృత్తిని అనుసరించింది. 300 00:18:00,330 --> 00:18:03,292 నేను మరోసారి తనకి పరీక్షలు నిర్వహించేలా చేసి, తిరిగి అంచనా వేస్తాను. 301 00:18:03,375 --> 00:18:05,169 వావ్. అయితే తను పాస్ అయితే... 302 00:18:05,252 --> 00:18:07,254 అంటే పాస్ అయినప్పుడు. 303 00:18:08,046 --> 00:18:10,465 అది పాస్ అయినప్పుడు, మీతో పాటు ఉండిపోతుందా? 304 00:18:11,550 --> 00:18:13,177 కేసీకి అభ్యంతరం లేకపోతే నాకే సమస్యా లేదు. 305 00:18:16,889 --> 00:18:18,098 అంటే ఒప్పుకున్నట్టే. 306 00:18:18,182 --> 00:18:19,641 అవును. 307 00:18:31,320 --> 00:18:33,739 హేయ్. ఈరోజు బాగా గడిచింది, కదూ? 308 00:18:33,822 --> 00:18:35,115 కాదంటావా? 309 00:18:35,699 --> 00:18:39,411 రస్సెల్ చాలా భయపడ్డానని చెప్పాడు. నువ్వు అక్కడ ఉండడం అదృష్టం అన్నాడు. 310 00:18:40,162 --> 00:18:45,125 వింతగా ఉంది. నేను కూడా భయపడ్డాను. అప్పుడు నాన్న నాతో అన్న మాటలు గుర్తొచ్చాయి. 311 00:18:45,709 --> 00:18:48,003 నువ్వు, స్కౌట్, ఇద్దరూ ఒకేలాంటి వాళ్ళు. 312 00:18:48,086 --> 00:18:50,088 అవసరం అయినపుడు మీరిద్దరూ ముందడుగు వేశారు. 313 00:18:50,672 --> 00:18:52,966 అవునననే అనుకుంటాను. 314 00:18:54,551 --> 00:18:56,887 -గుడ్ నైట్, చార్లెస్. -గుడ్ నైట్. 315 00:19:01,391 --> 00:19:02,643 హేయ్, లిజ్జీ? 316 00:19:03,936 --> 00:19:04,937 చెప్పు? 317 00:19:05,521 --> 00:19:06,980 తలుపు మొత్తం మూసేయొచ్చు. 318 00:19:27,417 --> 00:19:29,336 స్కొలాస్టిక్ బుక్ సిరీస్ పై ఆధారపడింది ఎల్లెన్ మైల్స్ రచన THE PUPPY PLACE 319 00:20:45,454 --> 00:20:47,456 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ