1 00:00:05,839 --> 00:00:10,511 వాస్తవం: ధైర్యం కలవాడు, అత్యుత్తమ విజయాలు సాధించిన వాడు, 2 00:00:10,594 --> 00:00:13,138 లేదా గొప్ప లక్షణాలు కలవాడినే నిఘంటువు హీరోగా నిర్వచిస్తుంది. 3 00:00:13,222 --> 00:00:15,724 కానీ, అదే ప్రశ్నను ఇప్పుడు మనం మూడో క్లాసు పిల్లల్ని అడిగితే... 4 00:00:15,807 --> 00:00:18,685 మీ దృష్టిలో "హీరో" అంటే ఎవరు? 5 00:00:18,769 --> 00:00:20,062 ఎగరగలిగిన వాడు. 6 00:00:20,145 --> 00:00:22,648 తన సమాజంలో న్యాయం కోసం పోరాడేవాడు. 7 00:00:22,731 --> 00:00:25,359 అద్భుతమైన వినికిడి శక్తి, కంటిచూపు ఉన్నవాడు. 8 00:00:25,442 --> 00:00:28,111 కార్లని, వస్తువుల్ని విసిరేసి సమస్యల్ని పరిష్కరించే వాడు. 9 00:00:28,195 --> 00:00:31,240 నా దృష్టిలో బోలెడుమంది రకరకాల హీరోలు ఉన్నారు. 10 00:00:31,323 --> 00:00:32,491 -కానీ... -నాకు తెలుసు. 11 00:00:32,573 --> 00:00:34,868 వాడు చెప్తుండగా మధ్యలో ఆపడం మంచి పద్ధతి కాదు. కానీ పరవాలేదు. 12 00:00:34,952 --> 00:00:36,912 వాడు చార్లెస్, నా తమ్ముడు. 13 00:00:36,995 --> 00:00:40,123 ఏదైతేనెం, అదే పిల్లలను మీ హీరో ఎవరని అడిగితే... 14 00:00:40,207 --> 00:00:43,168 -మా అమ్మ. -ఖచ్చితంగా మా అమ్మే. 15 00:00:43,252 --> 00:00:45,712 -మా నాన్న. -బిల్లీ ఐలిష్. 16 00:00:46,213 --> 00:00:47,214 వింతగా లేదూ, 17 00:00:47,297 --> 00:00:50,801 ఎందుకంటే నా స్నేహితుల తల్లిదండ్రులెవరూ గాల్లో ఎగరలేరు, కారు విసిరేయలేరు. 18 00:00:50,884 --> 00:00:54,263 బిల్లీ ఐలిష్ గురించి ఖచ్చితంగా చెప్పలేను, కానీ అనుమానించాల్సిన విషయమే. 19 00:00:54,346 --> 00:00:55,639 రాత్రంతా మండిన మంటలు కంట్రోల్ చేయబడ్డాయి 20 00:00:55,722 --> 00:00:59,309 స్థానికులను ఖాళీ చేయించడంతో అంతటా ఉద్రిక్తత నెలకొంది. 21 00:00:59,393 --> 00:01:01,520 మిడిల్టన్ అగ్ని మాపక సిబ్బంది 22 00:01:01,603 --> 00:01:04,565 చూపిన ధైర్య సాహసాల కారణంగా, 23 00:01:04,647 --> 00:01:07,651 -ఇక్కడ పరిస్థితి చూడబోతే... -నాన్నకి ఏమీ కాకూడదు. 24 00:01:07,734 --> 00:01:09,736 మీ నాన్న వేడి నీళ్ళతో తలస్నానం చేయాలనుకుంటున్నాడు. 25 00:01:09,820 --> 00:01:11,488 -హేయ్. -నాన్నా! 26 00:01:12,281 --> 00:01:15,242 -అది తప్ప నాకే ఇబ్బందీ లేదు. -నీకు భయం వేసిందా? 27 00:01:15,325 --> 00:01:18,537 బాగా భయపడ్డాను. ఎందుకంటే నేను కొద్ది సెకన్లు ఆలస్యంగా వెళ్లుంటే, 28 00:01:18,620 --> 00:01:21,415 మీకిష్టమైన కుకీస్ ఆఖరి బాక్సు అయిపోయి ఉండేవి. 29 00:01:22,624 --> 00:01:23,625 నీకు ఏమీ కాలేదు కదా. 30 00:01:25,127 --> 00:01:26,128 మరి వాళ్ళు రాత్రి పడుకున్నారా? 31 00:01:26,211 --> 00:01:29,089 లిజ్జీ ఎనిమిది గంటలు పడుకుంది. చార్లెస్ పెద్దగా పడుకోలేదు. 32 00:01:29,756 --> 00:01:33,218 -వాడు నీ గురించి కంగారు పడ్డాడు. -నువ్వు ఎవరి ప్రాణమైనా కాపాడావా? 33 00:01:33,302 --> 00:01:35,304 కాపాడాననే చెప్పాలి. 34 00:01:35,387 --> 00:01:39,600 ఒక చిన్న పాప అలమరలో దాక్కుని చిక్కుకుపోయింది. 35 00:01:40,309 --> 00:01:41,685 తనని కలవాలనుందా? 36 00:01:45,355 --> 00:01:47,232 కుక్కపిల్లా! 37 00:01:48,984 --> 00:01:50,777 మేము దీన్ని పెంచుకోవచ్చా, ప్లీజ్? 38 00:01:51,278 --> 00:01:54,239 -ఇది నా పుట్టినరోజు గిఫ్ట్ అనుకుంటాను. -అదేం బాలేదు. 39 00:01:54,323 --> 00:01:57,034 -నేను పెద్దదాన్ని కాబట్టి అది నా కుక్క కావాలి. -అయితే? 40 00:01:57,117 --> 00:01:59,411 కుక్కల గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. 41 00:01:59,494 --> 00:02:02,414 -పిల్లలూ, ఇక ఆపండి. -అందరికంటే కుక్కల గురించి నీకే ఎక్కువ తెలుసు. 42 00:02:02,497 --> 00:02:05,167 -అయితే? అమ్మా, నేను చెప్పిందే కరెక్టని చెప్పు. -నాన్నా, నువ్వు చెప్పు. 43 00:02:05,250 --> 00:02:08,044 సరే. హేయ్. వినండి. మీ నాన్న, నేను దీని గురించి మాట్లాడుకున్నాం, 44 00:02:08,127 --> 00:02:10,255 మనం కుక్కపిల్లని పెంచుకోవడానికి సిద్ధంగా లేమని అనుకుంటున్నాం. 45 00:02:10,339 --> 00:02:12,382 -ఏంటి? -ఏంటి? మీరు ఎప్పుడు మాట్లాడుకున్నారు? 46 00:02:12,466 --> 00:02:15,427 ఇప్పుడే. ఒకరినొకరం ఇలా చూసుకున్నాం. 47 00:02:17,137 --> 00:02:18,931 అది మాట్లాడుకోవడం ఎలా అవుతుంది? 48 00:02:19,014 --> 00:02:22,976 నేను నీ వంక ఇలా చూసినప్పడు నీకెలా అర్ధమవుతుందో సరిగ్గా అలాగే. 49 00:02:24,144 --> 00:02:27,523 -అంటే మనం దాన్ని ఉంచుకోకూడదు. -ఫైర్ స్టేషన్ వాళ్ళు 50 00:02:27,606 --> 00:02:30,734 దీని యజమానిని కనుక్కోడానికి పామ్ ప్లేట్స్ వేసి, ఈ మెయిల్స్ పంపుతారు. 51 00:02:30,817 --> 00:02:34,238 పెంపుడు జంతువు యజమాని వారం రోజుల్లోగా దొరక్కపోతే, 52 00:02:34,321 --> 00:02:36,782 దానిని వదిలేయడానికి 90% అవకాశం ఉందని తెలుసా? 53 00:02:36,865 --> 00:02:41,370 అయితే దీని యజమాని కోసం వెతికే వరకూ, ఇది ఎక్కడ ఉంటుంది? 54 00:02:45,165 --> 00:02:47,793 వీళ్ళ చర్చ బాగా నడుస్తోందని అనిపిస్తోంది. 55 00:02:47,876 --> 00:02:48,877 నాక్కూడా. 56 00:02:50,462 --> 00:02:54,883 అంటే, కొద్ది రోజులే కదా. అది మరీ దారుణంగా ప్రవర్తించదనే అనుకుంటున్నాను. 57 00:02:54,967 --> 00:02:56,844 -అవును! -అవును! థాంక్యూ. 58 00:02:56,927 --> 00:02:57,928 చెప్పానా. 59 00:02:58,846 --> 00:03:01,765 నేనొక మంచి పేరు ఆలోచించాను, యాష్లీ. 60 00:03:01,849 --> 00:03:05,310 మనం దాన్ని యాష్ అని పిలవొచ్చు, ఎందుకంటే ఇది నాన్నకి దొరికింది బూడిదలోనే కదా. 61 00:03:05,394 --> 00:03:08,564 లేదంటే, బూడిదలోంచి బయటికి వచ్చింది కాబట్టి ఫీనిక్స్ అని పిలవొచ్చు. 62 00:03:08,647 --> 00:03:11,149 నేను పౌరాణిక జీవుల గురించి ఒక పుస్తకం చదువుతున్నాను. 63 00:03:11,733 --> 00:03:13,861 కానీ నాకు యాష్ అన్న పేరు కూడా నచ్చింది. 64 00:03:14,778 --> 00:03:18,323 ఏదైతేనేం, నాకు పనిలో ఒక డెడ్ లైన్ ఉంది, కాబట్టి దాని బాధ్యత మీదే. 65 00:03:18,407 --> 00:03:20,868 తిండి పెట్టడం, శుభ్రం చేయడం, ఎలాంటి సమస్యలూ తీసుకురాకుండా చూడడం. 66 00:03:20,951 --> 00:03:22,202 అవన్నీ తేలిగ్గా చేసేస్తాం అమ్మా. 67 00:03:22,286 --> 00:03:28,333 దాన్ని కార్పెట్ కి దూరంగా ఉంచండి. ఈసారికి మీ నాన్న మాటకి సరే అంటున్నా. 68 00:03:30,002 --> 00:03:32,671 కొత్త చోటులో ఇది యాష్ మొదటిరోజు కాబట్టి, 69 00:03:32,754 --> 00:03:36,341 చార్లెస్, నేను స్కూలు మానేసి దానికి తోడుగా ఉంటే బాగుంటుందేమోనని 70 00:03:36,425 --> 00:03:39,678 -నా ఆలోచన. -అవును, చాలా మంచి ఐడియా. 71 00:03:39,761 --> 00:03:40,762 మానేయొచ్చా? 72 00:04:05,621 --> 00:04:06,622 ఏంటి? 73 00:04:13,712 --> 00:04:15,672 పప్పీ కేర్ లిజ్జీ: నీళ్ళు, కుక్క ఆహారం కోసం గిన్నెలు 74 00:04:15,756 --> 00:04:17,132 చార్లెస్: ఇంటిని పాడుచేయకుండా ఏర్పాట్లు చేయాలి 75 00:04:18,634 --> 00:04:21,345 -డిబేట్ క్లబ్? -ప్రసంగం చివరన చెప్పాల్సింది చెప్పి వచ్చేశా. 76 00:04:21,428 --> 00:04:23,805 -కుకింగ్ క్లాస్? -పిండి అయిపోయిందట. 77 00:04:23,889 --> 00:04:26,266 -మంచిది. మూడింటికి బస్టాండ్ లో కలుద్దామా? -అలాగే. 78 00:04:33,190 --> 00:04:34,399 నువ్వెంత మంచి కుక్కపిల్లవి. 79 00:04:35,400 --> 00:04:38,278 ఎవరు మంచి కుక్కపిల్ల? నువ్వే. 80 00:04:40,280 --> 00:04:43,867 నన్ను ఎన్నో పేర్లతో పిలిచారు, మిస్టర్ పీటర్సన్, కానీ మంచి కుక్కపిల్ల అని... 81 00:04:43,951 --> 00:04:47,120 పిలవడం ఇదే మొదటిసారి. మంచి నిద్ర పోయినట్లున్నావ్. 82 00:05:01,969 --> 00:05:04,012 హేయ్, చార్లెస్, బ్యాగులో ఏముంది? 83 00:05:04,513 --> 00:05:07,975 వెజ్ కీమా, గ్రిల్డ్ ఛీజ్ ముక్కలు, ఇంకా... 84 00:05:08,058 --> 00:05:10,727 కుక్కపిల్లకి మిగిలిపోయిన చెత్త తినిపించకూడదు. 85 00:05:10,811 --> 00:05:14,314 -మంచి పోషకాహారం ఇవ్వాలి. -అవును, నాకు తెలుసు. 86 00:05:14,940 --> 00:05:16,817 సరే, మనం ఎలాంటి పొరబాట్లూ చేయకూడదు. 87 00:05:16,900 --> 00:05:19,903 యాష్ మన దగ్గరే ఉండేలా అమ్మానాన్నల్ని ఒప్పించాలంటే, 88 00:05:19,987 --> 00:05:21,488 -ప్రతీదీ పర్ఫెక్ట్ గా ఉండాలి. -అలాగా. 89 00:05:26,201 --> 00:05:27,452 ఓరి, నాయనో. 90 00:05:27,536 --> 00:05:30,122 -ఓరి, దేవుడా. -నువ్వసలు ఏం చేశావు? 91 00:05:32,624 --> 00:05:34,585 ఛీ! నువ్వు ఇప్పటికీ పొగ కంపు కొడుతున్నావు. 92 00:05:34,668 --> 00:05:37,087 సరే. అమ్మ ఇంటికి రావడానికి మనకి అరగంట టైముంది. 93 00:05:37,171 --> 00:05:39,089 నేను దానికి స్నానం చేయిస్తాను. నువ్వు గది శుభ్రం చేయి. 94 00:05:39,173 --> 00:05:41,967 నేనే దానికి స్నానం చేయిస్తే, నువ్వే గది ఎందుకు సర్దకూడదు? 95 00:05:42,050 --> 00:05:45,637 చార్లెస్, వాదించడానికి సమయం లేదు. మనం ఒక జట్టుగా పని చేయాలి. 96 00:05:45,721 --> 00:05:47,472 అప్పుడే మనం దాన్ని ఉంచుకోగలం. 97 00:05:47,556 --> 00:05:49,808 సరే, మరి అది నీ కుక్క అవుతుందా లేక నా కుక్క అవుతుందా? 98 00:05:49,892 --> 00:05:51,852 రెండూ కాదు. అది మన కుక్క అవుతుంది. సరేనా? 99 00:05:51,935 --> 00:05:54,479 సరే. నేను దానికి స్నానం చేయిస్తే, నువ్వే గది ఎందుకు సర్దకూడదు? 100 00:05:54,563 --> 00:05:57,691 నువ్వు చేయిస్తే దీని కళ్ళలోకి సబ్బు పోవచ్చు. అప్పుడు కడగడానికి సెలైన్ కావాలి, 101 00:05:57,774 --> 00:06:00,736 మన దగ్గర అది లేదు, నాన్నకి కంటి ఆపరేషన్ చేసినపుడు అమ్మ దాన్ని పారేసింది. 102 00:06:00,819 --> 00:06:03,488 -మనం సొంతగా కూడా దాన్ని తయారు... -వదిలేయ్. 103 00:06:04,656 --> 00:06:08,243 -నువ్వే దానికి స్నానం చేయించు, నేనే గది శుభ్రం చేస్తాను. -మంచిది. పద, యాష్. 104 00:06:17,794 --> 00:06:21,465 అమ్మ వచ్చేసింది. గది శుభ్రం చేసేశా. యాష్ స్నానం అయిందా? 105 00:06:25,511 --> 00:06:26,512 ఒకసారి ఇటు చూడు. 106 00:06:27,095 --> 00:06:30,265 -ఏంటిది! -నమ్మి తీరాలి. 107 00:06:30,766 --> 00:06:34,102 ఒళ్ళంతా బూడిదతో నిండిపోయింది. తీరాచూస్తే ఇది గోల్డెన్ రిట్రీవర్. 108 00:06:34,186 --> 00:06:36,396 లిజ్జీ? చార్లెస్? 109 00:06:36,480 --> 00:06:37,731 ఇక్కడ. 110 00:06:38,273 --> 00:06:40,442 సరే. అమ్మకి చూపించాల్సిన, పరిచయం చేయాల్సిన టైం వచ్చింది... 111 00:06:40,526 --> 00:06:43,403 -మన గోల్డీని. -గోల్డీ? 112 00:06:43,487 --> 00:06:46,031 ఇప్పుడిక ఇది బూడిద రంగులో లేదు కదా? 113 00:06:46,114 --> 00:06:48,450 గోల్డీ, గోల్డెన్ రిట్రీవర్? 114 00:06:50,285 --> 00:06:51,495 నాకు నచ్చింది. 115 00:06:51,578 --> 00:06:54,414 యాష్ మొదటిరోజు ఎలా గడిచింది... 116 00:06:55,541 --> 00:06:56,542 ఎవరది? 117 00:07:04,591 --> 00:07:07,302 పొగ ఎక్కువగా పీల్చేసిందేమోనని మాకు కంగారుగా ఉంది. 118 00:07:07,386 --> 00:07:09,137 కుక్కలకి అది మంచిది కాదు కదా. 119 00:07:09,221 --> 00:07:10,973 ఆవిడకి ఆ విషయం తెలిసే ఉంటుంది. 120 00:07:11,723 --> 00:07:16,270 నాకిక్కడ ఒకటి కనిపించింది. ముద్దొచ్చే బుల్లి కుక్కపిల్ల గులాబీ రంగు చెవి. 121 00:07:17,396 --> 00:07:19,356 దీని ఊపిరితిత్తులు బాగున్నాయి. గుండె చప్పుడు సరిగా ఉంది. 122 00:07:19,439 --> 00:07:20,941 ఇది ఆరోగ్యంగా ఉంది, ఏ సమస్యా లేదు. 123 00:07:21,024 --> 00:07:23,318 మరి, మేము మీకు ఎంత ఇవ్వాలి? 124 00:07:23,402 --> 00:07:24,570 చూసి చెబుతా. 125 00:07:24,653 --> 00:07:28,949 కాలిపోయే బిల్డింగ్ నుండి రక్షించిన అందమైన కుక్కపిల్లలకి చెకప్ ఉచితం. 126 00:07:29,700 --> 00:07:31,743 -థాంక్స్. -థాంక్యూ. 127 00:07:31,827 --> 00:07:34,830 గోల్డీని బాగా చూసుకుంటున్నందుకు మీ ఇద్దరికీ థాంక్యూ. ఇది చక్కగా ఉంది. 128 00:07:34,913 --> 00:07:38,917 -ఇప్పుడు దీనికి కావలసిందల్లా పి.ఎల్.సి. -టి.ఎల్.సి? 129 00:07:39,001 --> 00:07:42,629 కాదు, పి.ఎల్.సి. అంటే ఓర్పు, ప్రేమ, క్రమ పద్ధతి. 130 00:07:42,713 --> 00:07:45,382 ప్రేమ విషయంలో మీరు దీనికి ఎలాంటి లోటు రానివ్వరని నాకు తెలుసు. 131 00:07:45,465 --> 00:07:49,094 -కానీ కుక్కపిల్లకి శిక్షణ ఇవ్వడం కష్టం. -మీరు ఏవైనా సలహాలు ఇస్తే... 132 00:07:49,678 --> 00:07:53,265 చిన్నప్పుడే ఇతర జంతువులను పరిచయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. 133 00:07:53,849 --> 00:07:55,475 ఇతర కుక్కలకి దీన్ని పరిచయం చేయడం. 134 00:07:55,559 --> 00:07:57,936 పెంపుడు జంతువుల పెంపకం విషయంలో అదొక డిబేట్ అయిపోయింది, 135 00:07:58,020 --> 00:08:00,439 -కానీ వాళ్ళు ఏమంటున్నారంటే... -డిబేట్. 136 00:08:00,522 --> 00:08:03,775 అయ్యో, పోటీకి ఆలస్యమైపోయింది. నేను వెళ్ళాలి. 137 00:08:03,859 --> 00:08:06,778 ఏయ్, దాన్ని నేరుగా ఇంటికి తీసుకు వెళతానని నాకు మాటివ్వు. 138 00:08:06,862 --> 00:08:09,114 -సరే. ఒట్టు. -బై. 139 00:08:09,198 --> 00:08:10,407 బై. 140 00:08:11,158 --> 00:08:12,576 ఈ కుక్క ఇక నీకే. 141 00:08:15,495 --> 00:08:16,830 గోల్డీ, చూడు. 142 00:08:22,085 --> 00:08:23,086 హాయ్. 143 00:08:24,421 --> 00:08:27,090 మీ గోల్డెన్ రిట్రీవర్ కిటికీలో కూర్చుని ఉండడం చూశాను, 144 00:08:27,174 --> 00:08:30,469 దాంతో మా కుక్క కొంచెం పరిచయం పెంచుకుంటుందేమో అనుకుంటున్నాను. 145 00:08:30,552 --> 00:08:34,472 పరిచయమా? రూఫస్ తోనా? వద్దు, వద్దు, వద్దు. 146 00:08:34,556 --> 00:08:38,894 రూఫస్ కి కిటికీ దగ్గర కూర్చుని ఉండటం ఒక్కటే ఇష్టమైన పని. 147 00:08:40,437 --> 00:08:41,355 ఎందుకు? 148 00:08:41,438 --> 00:08:46,026 గత సంవత్సరం నా ప్రియమైన హెన్రీ చనిపోయినప్పటినుండీ అది అలాగే ఉంది. 149 00:08:47,569 --> 00:08:48,946 నన్ను క్షమించు. 150 00:08:52,741 --> 00:08:57,871 మీకు నా గురించీ, గోల్డీ గురించీ తెలీదు, కానీ మనం ప్రయత్నించొచ్చు కదా? 151 00:08:57,955 --> 00:09:01,708 నా ఉద్దేశంలో తనకీ, రూఫస్ కీ కూడా అది మంచిది అనుకుంటున్నాను. 152 00:09:01,792 --> 00:09:04,503 అప్పుడు మా అమ్మానాన్న దీన్ని మాతో ఉంచుకోనిస్తారు. 153 00:09:04,586 --> 00:09:07,422 ఊరికే కలిస్తే సమస్యేమీ ఉండదు, కదూ? 154 00:09:08,006 --> 00:09:09,591 సమస్యలో పడే అవకాశం ఉంది. 155 00:09:09,675 --> 00:09:13,470 రూఫస్ కి వయసు పెరిగాక కొంచెం విసుగు ఎక్కువైంది, 156 00:09:13,554 --> 00:09:17,933 నీ కుక్కపిల్లతో ఆడుకోవడానికి బదులు దీన్ని నమిలి పక్కన పడేస్తుంది. 157 00:09:18,016 --> 00:09:22,396 ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు, నేను రూఫస్ దగ్గరికి వెళ్ళా...రూఫస్! 158 00:09:23,313 --> 00:09:25,440 అయ్యో! అయ్యయ్యో! రూఫస్! 159 00:09:25,524 --> 00:09:27,860 -గోల్డీ, ఆగు! -రూఫస్, వద్దు! రూఫస్! 160 00:09:29,403 --> 00:09:31,446 అమ్మమ్మా, ఏం జరుగుతోంది? 161 00:09:32,030 --> 00:09:34,575 ఏం జరుగుతోందో నువ్వే చూడు, శామీ. 162 00:09:34,658 --> 00:09:37,828 -ఏంటిది. -నమ్మలేకపోతున్నా. 163 00:09:40,038 --> 00:09:42,332 ఒకే స్కూల్లో చదువుతున్నా మనిద్దరం ఒకరినొకరం చూసుకోకపోవడం వింతగా ఉంది. 164 00:09:42,416 --> 00:09:46,003 నాకు ఎక్కువ మంది తెలీదు. మా అమ్మమ్మా, నేను ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాం. 165 00:09:46,670 --> 00:09:49,965 -మీ తాతయ్య చనిపోయిన తర్వాతా? -మా తాతయ్యా? 166 00:09:50,048 --> 00:09:51,800 మీ తాతయ్య. హెన్రీ. 167 00:09:52,384 --> 00:09:56,054 కాదు. హెన్రీ మా ఇంకో కుక్క. అది ముసలిదైపోయింది. 168 00:09:58,640 --> 00:10:02,519 -గోల్డీకి ఆ బోన్ బాగా నచ్చింది. -రూఫస్ దాన్ని ఇస్తుందని నేను ఊహించలేదు. 169 00:10:02,603 --> 00:10:05,856 పీనట్ బటర్ బోన్స్ తనకి చాలా ఇష్టం. అది దానికి బాగా నచ్చినట్లుంది. 170 00:10:05,939 --> 00:10:07,316 దీనికి కూడా అది బాగా నచ్చినట్లుంది. 171 00:10:09,568 --> 00:10:11,528 రూఫస్ ఏవైనా ట్రిక్స్ చేస్తుందా? 172 00:10:11,612 --> 00:10:14,281 కొన్ని. హేయ్, రూఫస్. పా బంప్ చేయి. 173 00:10:16,033 --> 00:10:18,368 బాగుంది. నువ్వు గోల్డీకి నేర్పిస్తావా? 174 00:10:18,452 --> 00:10:20,245 నాకు తెలీదు. కానీ మనం ప్రయత్నించొచ్చు. 175 00:10:25,125 --> 00:10:26,752 అయితే డిబేట్ ఎలా జరిగింది? 176 00:10:26,835 --> 00:10:29,796 మీ అక్క బాగా చేసింది. నువ్వు ఉండుంటే ఎంజాయ్ చేసే వాడివి. 177 00:10:29,880 --> 00:10:32,424 -ఎక్కడికి వెళ్ళావ్? -అదో పెద్ద కథ, కానీ... 178 00:10:32,508 --> 00:10:34,676 -మార్నింగ్. -ఆలస్యంగా నిద్రపోయావు. 179 00:10:35,385 --> 00:10:36,386 మార్నింగ్. 180 00:10:36,970 --> 00:10:38,430 స్టేషన్లో కష్టంగా గడిచింది. 181 00:10:38,514 --> 00:10:41,391 మెగా కార్ట్ రేసర్ ఆటలో ఫ్లెక్ మ్యాన్ ని ఓడించడం కష్టమైంది. 182 00:10:41,475 --> 00:10:45,312 కంగ్రాట్స్. కారు తిప్పడం నువ్వు ఎంతగా ప్రాక్టీసు చేస్తున్నావో నాకు తెలుసు. 183 00:10:45,395 --> 00:10:46,688 పప్పీ గురించి ఏమైనా తెలిసిందా? 184 00:10:46,772 --> 00:10:50,108 చెప్పాలంటే, ఒక మంచి విషయం, చెడ్డ విషయం రెండూ ఉన్నాయి. 185 00:10:51,985 --> 00:10:53,195 చెడ్డ విషయం చెప్పండి, ప్లీజ్. 186 00:10:53,278 --> 00:10:56,823 దాన్ని తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు, కాబట్టి నువ్వు చెప్పిందే కరెక్ట్. 187 00:10:56,907 --> 00:10:58,408 గోల్డీని వదిలేసినట్లేనని చెప్పాలి. 188 00:10:59,535 --> 00:11:03,539 -అయితే మంచి విషయం ఏంటి? -కొత్తగా పెళ్ళైన జంట పామ్ ప్లేట్ చూసి, 189 00:11:03,622 --> 00:11:06,250 గోల్డీని పెంచుకోవడానికి ముందుకొచ్చారు. 190 00:11:07,417 --> 00:11:10,504 -ఈ వీకెండ్ దాన్ని చూడ్డానికి వస్తున్నారు. -మంచి విషయం అన్నావు కదా. 191 00:11:10,587 --> 00:11:12,464 ఇది అన్నిటికంటే దారుణమైన న్యూస్! 192 00:11:12,548 --> 00:11:16,635 -బంగారం, కొద్ది రోజులే అనుకున్నాం కదా. -లేదు, కొద్ది రోజులే అని నువ్వు అన్నావు. 193 00:11:16,718 --> 00:11:21,306 ఒప్పుకోవచ్చు కదా. గోల్డీ చాలా మంచి పప్పీ. తెలివైంది. చూడు. 194 00:11:23,100 --> 00:11:25,102 ఆగు, ఏం చేస్తున్నావ్? 195 00:11:25,686 --> 00:11:27,980 చార్లెస్, కొత్త కార్పెట్ మీదికి దాన్ని తేవద్దని చెప్పాను కదా. 196 00:11:28,063 --> 00:11:30,440 నేను దానికో ట్రిక్ నేర్పించాను. నన్ను నమ్మండి. 197 00:11:31,400 --> 00:11:33,151 ఓకే, గోల్డీ. పా బంప్. 198 00:11:35,946 --> 00:11:37,531 కమాన్, నీకు తెలుసు కదా. పా బంప్. 199 00:11:38,740 --> 00:11:40,158 గోల్డీ, వద్దు! 200 00:11:40,993 --> 00:11:43,370 పద కుక్కపిల్లా. హేయ్. బయటికి వెళ్లాం పద. 201 00:11:43,453 --> 00:11:45,372 చార్లెస్, వంటగదిలోకి రా. 202 00:11:45,455 --> 00:11:47,916 మీ ఇద్దరి పిగ్గీ బ్యాంక్స్ తీసుకురండి. 203 00:11:50,335 --> 00:11:53,630 గొప్ప ట్రిక్ నేర్పావు, చార్లెస్. మనకున్న అవకాశాన్ని నాశనం చేసినందుకు థాంక్స్. 204 00:11:56,133 --> 00:11:59,094 అదీ సంగతి. నేను మొత్తం చెడగొట్టాను. 205 00:12:02,931 --> 00:12:04,600 లిజ్జీ నాతో మాట్లాడడం లేదు... 206 00:12:05,726 --> 00:12:08,687 అది అంత బాధపడే విషయం కాకపోయినా, కొద్దిగా బాధపడే విషయం. 207 00:12:08,770 --> 00:12:10,939 ఆగు, వద్దు. ఇదిగో, దీన్ని వాడు. 208 00:12:12,191 --> 00:12:14,359 ఈ ఒక్క స్ట్రా ఉంటే సరిపోతుంది. 209 00:12:14,443 --> 00:12:17,696 నా ఉద్దేశం, ఎన్ని చెట్లు రక్షించబడతాయో తెలుసా? ఇంకా తాబేళ్లు కూడా. 210 00:12:17,779 --> 00:12:20,282 మా అమ్మానాన్నలు ఇప్పుడు కనీసం తాబేలు కూడా పెంచుకోనివ్వరు. 211 00:12:20,365 --> 00:12:23,744 అది మంచి విషయం. తాబేళ్లు వాటి సహజ నివాసాలలో ఉంటేనే ఆనందంగా ఉంటాయి, 212 00:12:23,827 --> 00:12:25,913 అవి దాదాపు వందేళ్ళకు పైగా బతకగలవు. 213 00:12:25,996 --> 00:12:28,874 నా ఉద్దేశం, అప్పుడు వాటిని ఎవరు చూసుకుంటారు? 214 00:12:30,000 --> 00:12:31,251 నేను ఊరికే అంటున్నాను. 215 00:12:32,169 --> 00:12:35,547 కుక్కపిల్లను పెంచుకునేంత వయసు వచ్చేవరకూ నేను ఆగాలి. 216 00:12:35,631 --> 00:12:36,632 అదీ, 217 00:12:36,715 --> 00:12:40,594 నువ్వు గోల్డీని మా ఇంటికి తీసుకొస్తే, బహుశా మనం దానికి ఏవైనా ట్రిక్స్ నేర్పించొచ్చు. 218 00:12:40,677 --> 00:12:42,930 అప్పుడు దాన్ని చూడడానికి వాళ్లు వచ్చేలోగా మీ అమ్మానాన్నలు 219 00:12:43,013 --> 00:12:45,849 -తమ మనసు మార్చుకుంటారేమో. -నాకు తెలీదు. 220 00:12:45,933 --> 00:12:50,938 ప్లీజ్. రూఫస్ బాధలో ఉంది. అది రోజంతా కిటికీ దగ్గరే కూర్చుని ఉంటుంది. 221 00:12:51,021 --> 00:12:53,106 కానీ అది గోల్డీతో చక్కగా ఆడుకుంది. 222 00:12:53,190 --> 00:12:56,068 నేను కూడా. దాన్ని చూస్తే నాకు హెన్రీ గుర్తొచ్చింది. 223 00:12:56,652 --> 00:13:01,240 సరే అయితే. మీ అమ్మమ్మ కార్పెట్ మీద ఒంటికి వెళితేనే సమస్య. 224 00:13:02,533 --> 00:13:04,201 -పా బంప్? -అవును. 225 00:13:12,501 --> 00:13:15,003 -నేనే. -అందుకే లాక్ చేశాను. 226 00:13:15,087 --> 00:13:19,466 కమాన్, లిజ్జీ. నేను తప్పు చేశానని తెలుసు. అయితే దాన్ని ఎలా సరిచేయాలో కూడా తెలుసు. 227 00:13:20,634 --> 00:13:25,180 కానీ నీ సాయం లేకుండా నేను ఆ పని చేయలేను. మనమొక జట్టు, అవునా? 228 00:13:34,606 --> 00:13:36,400 సరే, రూఫస్. కూర్చో. 229 00:13:37,609 --> 00:13:39,361 బాగుంది. ఇప్పుడు నీ వంతు. 230 00:13:39,444 --> 00:13:42,030 -హేయ్, గోల్డీ. లే, లేచి కూర్చో. -లెగు. 231 00:13:42,698 --> 00:13:45,868 కూర్చోవాలంటే ముందు నిలబడాలి. కాబట్టి నిలబడి తర్వాత కూర్చో. 232 00:13:56,920 --> 00:13:59,381 దీనికి ఆ పీనట్ బటర్ బోన్స్ అంటే ఎంత ఇష్టమో. 233 00:14:17,900 --> 00:14:19,151 హేయ్, చార్లెస్. 234 00:14:19,735 --> 00:14:23,906 చూడు, నీ మీద కోప్పడినందుకు బాధగా ఉంది. నిన్నలా అని ఉండాల్సింది కాదు. 235 00:14:24,489 --> 00:14:28,160 నా ఉద్దేశం, నువ్వు తప్పు చేయడం కొత్తేమీ కాదు, కానీ... ఈసారి వేరు. 236 00:14:28,243 --> 00:14:31,538 పర్లేదు లే. నువ్వు గోల్డీ వెళ్ళిపోతుందని అనుకున్నావు. 237 00:14:31,622 --> 00:14:34,583 -నేను కూడా అలాగే చేసే వాడినేమో. -అదొక్కటే కాదు. 238 00:14:34,666 --> 00:14:38,086 కొన్నిసార్లు నేను నిన్ను కంట్రోల్ చేయాలని చూస్తాను. 239 00:14:38,170 --> 00:14:39,546 కొన్నిసార్లా? 240 00:14:40,214 --> 00:14:44,426 ఏదో ఒకటిలే. ఒక జట్టు అన్నప్పుడు అన్ని కంట్రోల్ చేయలేను అని నాకు తెలుసు. 241 00:14:44,510 --> 00:14:46,261 ఈసారికి నిన్ను వదిలేస్తున్నాలే. 242 00:14:46,845 --> 00:14:48,096 థాంక్స్. 243 00:14:48,180 --> 00:14:52,100 సరే. వాళ్ళు వచ్చేలోగా గోల్డీకి శిక్షణ ఇవ్వడానికి మనకి మూడు రోజులే ఉంది. 244 00:14:52,184 --> 00:14:54,811 అమ్మానాన్న నువ్వు ఎంత బాగా చేస్తున్నావో చూశాక, 245 00:14:54,895 --> 00:14:56,897 నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావు. 246 00:14:59,775 --> 00:15:00,776 పద. 247 00:15:00,859 --> 00:15:02,653 పద. పద. 248 00:15:04,363 --> 00:15:05,614 వాళ్ళు వచ్చేశారు. 249 00:15:05,697 --> 00:15:07,324 గోల్డీ ఇదేనా. 250 00:15:07,407 --> 00:15:09,409 నువ్వు చాలా ముద్దొస్తున్నావు. 251 00:15:09,493 --> 00:15:10,577 పిల్లలూ, లూ దంపతులను కలవండి. 252 00:15:10,661 --> 00:15:14,957 వాళ్ళు శనివారం వరకూ రారని అనుకున్నామే. 253 00:15:15,040 --> 00:15:18,418 మేము రోజూ గోల్డీ ఫోటో చూస్తున్నాం. ఉండలేకపోయాం. 254 00:15:18,502 --> 00:15:20,504 -మేము దాన్ని ముద్దు చేయొచ్చా? -అవును. 255 00:15:21,421 --> 00:15:25,509 ఇప్పుడే దానికి బాగా... దాహంగా ఉంది. 256 00:15:25,592 --> 00:15:28,679 -అవును, దాహం. -అవును. అది... అది నీళ్ళు తాగాలి. 257 00:15:31,431 --> 00:15:33,433 సరే. అయితే, మీకు కొన్ని ప్రశ్నలు. 258 00:15:33,934 --> 00:15:35,352 మీ పెరటికి ఫెన్సింగ్ ఉందా? 259 00:15:35,853 --> 00:15:38,814 ఉంది. మూడు ఎకరాలు, పరిగెత్తడానికి బోలెడంత చోటు ఉంటుంది. 260 00:15:39,481 --> 00:15:43,193 నా ఉద్దేశం, మంచిదే. కానీ రోజంతా పరిగెత్తుతూ ఉండలేదు కదా. 261 00:15:43,277 --> 00:15:46,154 ఇంట్లో ఎక్కువసేపు ఎవరో ఒకరు ఉండడం ముఖ్యమైన విషయం. 262 00:15:46,238 --> 00:15:49,241 -లిజ్జీ. -నేను ఇంటి దగ్గరి నుండే పనిచేస్తాను. 263 00:15:49,324 --> 00:15:52,327 నేనొక ఆర్గానిక్ చెఫ్ ని, గోల్డీకి ఆహారాన్ని నేను సొంతగా తయారు చేస్తానని 264 00:15:52,411 --> 00:15:53,704 చెబితే మీరు సంతోషిస్తారు. 265 00:15:53,787 --> 00:15:57,249 ఎదిగిన వాటికంటే కుక్కపిల్లలకి మరిన్ని పోషకాలు అవసరం అవుతాయి. 266 00:15:57,332 --> 00:15:59,209 కాబట్టి మేము తేలిగ్గా చేయగలం. 267 00:16:00,711 --> 00:16:02,880 డాన్ తన సొంత కళ్ళజోళ్ళ కంపెనీ మొదలుపెట్టక ముందు 268 00:16:02,963 --> 00:16:05,465 వెటర్నరి కోర్సు మూడేండ్లు చదివాడు. 269 00:16:05,549 --> 00:16:07,301 మేము అమ్మే ప్రతి ఒక కళ్ళజోడుకీ, 270 00:16:07,384 --> 00:16:10,220 పేద దేశాలలో అవసరమైన పిల్లలకు ఒక దాని విలువను దానం చేస్తూ ఉంటాం. 271 00:16:10,304 --> 00:16:15,017 -మీరు చదువు పూర్తి చేయలేదా? నాకు తెలీదే. -లిజ్జీ, ఇక ఆపు. 272 00:16:15,726 --> 00:16:19,396 క్షమించండి. వాళ్ళు కుక్కపిల్లకి బాగా దగ్గరయ్యారు. 273 00:16:19,479 --> 00:16:21,899 ఆ విషయం మేము అర్థం చేసుకోగలం. 274 00:16:21,982 --> 00:16:23,650 సారీ, ఇదిగో గోల్డీ. 275 00:16:26,820 --> 00:16:29,781 -ఆల్ ది బెస్ట్ చెప్పు. -పీనట్ బటర్? 276 00:16:31,116 --> 00:16:32,409 ఎంతో ముద్దుగా ఉంది. 277 00:16:32,492 --> 00:16:35,037 హేయ్, అమ్మా, గోల్డీ లీష్ వదిలేస్తే పరవాలేదా? 278 00:16:35,120 --> 00:16:39,249 అది ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో లూ దంపతులు చూస్తే మంచిది. 279 00:16:39,333 --> 00:16:41,960 -నీకు కుక్కల గురించి చాలా తెలుసే. -తెలుసు. 280 00:16:42,044 --> 00:16:43,128 సరే. 281 00:16:46,673 --> 00:16:47,591 బాగుంది. 282 00:16:53,764 --> 00:16:54,723 నా పర్స్. 283 00:16:57,267 --> 00:16:59,770 ఎంతైనా కుక్కపిల్ల కదా. సరే, గోల్డీ. దాన్ని కిందపెట్టు. 284 00:17:01,146 --> 00:17:02,105 -గోల్డీ. -సరే. 285 00:17:03,815 --> 00:17:04,858 నేను... గోల్డీ. 286 00:17:07,611 --> 00:17:08,612 ఓహ్, దేవుడా. 287 00:17:08,694 --> 00:17:11,573 గోల్డీ, నీ పద్ధతి ఎంత మాత్రం బాలేదు. 288 00:17:16,744 --> 00:17:18,539 ఆ సంఘటన చరిత్రలో నిలిచిపోతుంది. 289 00:17:18,622 --> 00:17:21,750 ఇరవై ఒకటవ శతాబ్దపు అతిగొప్ప పప్పీ పీనట్ బటర్ ప్రాంక్. 290 00:17:21,834 --> 00:17:25,127 కొన్నాళ్ళ పాటు లూ దంపతులు కుక్కపిల్ల గురించి ఆలోచించరు. 291 00:17:27,798 --> 00:17:29,591 నీ అభిప్రాయం తప్పని నా ఉద్దేశం. 292 00:17:29,675 --> 00:17:33,011 సరైన కుక్కకు వాళ్ళు గొప్ప కుటుంబంగా ఉండగలరు. 293 00:17:33,095 --> 00:17:36,765 గోల్డీ కానంతవరకూ నాకే సమస్యా లేదు. అది మనది. 294 00:17:36,849 --> 00:17:40,227 -ఊహించని విషయం అది. -నాకు తెలుసు. 295 00:17:40,310 --> 00:17:44,439 నచ్చని వాళ్ళ ముందు కుక్కలు ప్రవర్తించే తీరు ఆసక్తిగా ఉంది. 296 00:17:44,523 --> 00:17:49,111 తనకి నచ్చిన వాళ్ళతో ఎలా ఉంటోందో చూడండి. 297 00:17:49,194 --> 00:17:50,946 నీకు దీని మీద కోపం లేదుగా? 298 00:17:51,029 --> 00:17:53,907 అస్సలు లేదు. ఎందుకంటే అది గోల్డీ తప్పు కాదు. 299 00:17:53,991 --> 00:17:56,410 దీన్ని నియంత్రించడం ఎంత కష్టమో మాకు తెలీలేదు. 300 00:17:56,493 --> 00:17:59,788 మీ ఉద్దేశం ఏంటి? మీరు గోల్డీ లీష్ ఎందుకు తీసుకొచ్చారు? 301 00:18:00,706 --> 00:18:04,334 మిడిల్టన్ లో మీ నాన్న, నేను ఒక మంచి జంతువుల షెల్టర్ ని చూశాం. 302 00:18:04,418 --> 00:18:08,255 గోల్డీ లాంటి ఎనర్జీ ఉన్న పప్పీని ఎలా చూసుకోవాలో వాళ్ళకు బాగా తెలుసు. 303 00:18:08,338 --> 00:18:10,382 దీనికి అదే సరైన చోటు. 304 00:18:10,465 --> 00:18:13,552 -నేను రేపు దీన్ని అక్కడ దింపుతాను. -నాన్న, అలా కుదరదు! 305 00:18:13,635 --> 00:18:17,306 బంగారు, ఈ విషయంలో నీ మాట నెగ్గదు. 306 00:18:17,389 --> 00:18:19,641 రేపు ఉదయం మీరు దీనికి గుడ్ బై చెప్పొచ్చు, సరేనా? 307 00:18:20,559 --> 00:18:21,768 పద, బంగారం. 308 00:18:26,648 --> 00:18:27,649 పద. 309 00:18:29,151 --> 00:18:32,821 నేను మళ్ళీ... అంతా నాశనం చేశాను. 310 00:18:41,330 --> 00:18:42,331 హేయ్. 311 00:18:45,042 --> 00:18:46,877 నువ్వు కూడా రేపు ఉదయం వరకూ ఆగలేకపోయావా? 312 00:18:46,960 --> 00:18:49,922 నాన్న మంటలు ఆర్పడానికి వెళ్లినప్పుడల్లా నాకు ఎందుకు నిద్ర పట్టదో నీకు తెలుసా? 313 00:18:50,005 --> 00:18:50,923 ఎందుకు? 314 00:18:51,006 --> 00:18:53,634 అదీ, గోల్డీకి కూడా అమ్మానాన్న ఉన్నారు. 315 00:18:54,676 --> 00:18:56,553 బహుశా అన్నో అక్కో కూడా కావొచ్చు. 316 00:18:56,637 --> 00:18:59,515 వాళ్ళు తిరిగి రారని తెలిస్తే అది ఎలా స్పందిస్తుందో తెలుసా? 317 00:19:01,141 --> 00:19:02,267 నాకు తెలీదు. 318 00:19:02,351 --> 00:19:06,605 ఇప్పుడు తనకి ఉన్నది మనం మాత్రమే. మనం దాన్ని ఇచ్చేస్తున్నాం. 319 00:19:06,688 --> 00:19:07,940 ఇదేం బాలేదు. 320 00:19:08,023 --> 00:19:12,402 తెలుసా, చార్లెస్, షెల్టర్ దగ్గర గోల్డీని ఎంతోమంది చూస్తారు. 321 00:19:12,486 --> 00:19:15,322 దాంతో ప్రేమలో పడి, దాన్ని తమ ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటారు 322 00:19:15,405 --> 00:19:17,074 కుటుంబంలో భాగం చేసుకోవాలనుకుంటారు. 323 00:19:18,534 --> 00:19:20,494 ఖచ్చితంగా అలా జరుగుతుందని అనుకుంటున్నావా? 324 00:19:21,745 --> 00:19:24,081 -అవును. -నువ్వు చెప్పింది నిజమైతే బాగుండు. 325 00:19:24,748 --> 00:19:28,961 కొన్నిసార్లు మంచి జరగాలని కోరుకుంటే, ఖచ్చితంగా మంచే జరుగుతుంది. 326 00:19:29,044 --> 00:19:33,465 అందుకే నాన్న వెళ్లినా నేను నిద్ర పోగలుగుతా. తను ఇంటికి క్షేమంగా వస్తాడని నాకు తెలుసు. 327 00:19:41,223 --> 00:19:42,224 హేయ్. 328 00:19:42,307 --> 00:19:45,727 మార్నింగ్. నాకు డాన్ లూ దగ్గరి నుండి ఒక వింత వాయిస్ మెయిల్ వచ్చింది. 329 00:19:45,811 --> 00:19:49,147 అతని ప్యాంటుతో సాండ్ విచ్ తయారు చేయడం గురించి. 330 00:19:49,231 --> 00:19:50,816 ఆపై ఇది కనిపించింది. 331 00:19:52,860 --> 00:19:54,152 అయ్యో. 332 00:19:54,236 --> 00:19:58,115 అదీ మా ప్లాన్: రూఫస్ సాయంతో గోల్డీకి ఈ వారం శిక్షణ ఇచ్చి 333 00:19:58,198 --> 00:20:01,702 అది ఎంత మంచిదో మీకు చూపించి, మాతో ఉండడానికి మిమ్మల్ని ఒప్పించాలని. 334 00:20:01,785 --> 00:20:04,663 కానీ లూ దంపతులు ముందే వచ్చి అంతా నాశనం చేశారు. 335 00:20:04,746 --> 00:20:08,000 ఆలోచిస్తే తప్పంతా వాళ్ళదేనని అర్థం అవుతుంది. 336 00:20:08,083 --> 00:20:09,835 -అవును. -అది విషయం. 337 00:20:09,918 --> 00:20:12,796 -అయిపోయిందా? -ఇంకో విషయం. 338 00:20:12,880 --> 00:20:16,216 మిసెస్ లూ పర్స్ పాడు చేసినందుకుగాను ఆ నష్టం తీరే వరకూ 339 00:20:16,300 --> 00:20:21,054 ఎంతకాలమైనా చార్లెస్, నేను మా పాకెట్ మనీలో 50% తగ్గించుకుంటాం. 340 00:20:21,138 --> 00:20:22,347 ఆయన ప్యాంటు కూడా. 341 00:20:22,431 --> 00:20:23,515 అవును. 342 00:20:23,599 --> 00:20:25,934 -ఇక పూర్తయింది. -సరే. 343 00:20:26,018 --> 00:20:28,604 మంచి పెంపకం గురించి మీ ఇద్దరికీ కొన్ని విషయాలు చెప్పనివ్వండి. 344 00:20:29,938 --> 00:20:31,273 సరే. సరే అయితే. 345 00:20:31,356 --> 00:20:36,862 వినండి. మీరు ఎంతగా ప్రయత్నించినప్పటికీ తప్పులు చేస్తారు, బోలెడన్ని తప్పులు. 346 00:20:37,988 --> 00:20:40,532 కానీ చివరికి ముఖ్యమైన విషయం అదికాదు. 347 00:20:40,616 --> 00:20:44,244 మంచి తల్లిదండ్రులుగా ఉండడంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, 348 00:20:44,328 --> 00:20:46,496 మీ పిల్లలకు మంచి అనిపించేది చేయడం. 349 00:20:47,247 --> 00:20:50,918 అంటే మాకు ఏది మంచిదో మీకు బాగా తెలుసు అంటున్నారు, 350 00:20:51,001 --> 00:20:53,003 అది గోల్డీని ఇచ్చేయడమా? 351 00:20:53,086 --> 00:20:56,465 అది మాకు ఏమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ, 352 00:20:56,548 --> 00:20:59,760 మీరు మంచి తల్లిదండ్రులు అనిపించుకుంటే చాలు, మిగతావి పట్టవు, అవునా? 353 00:20:59,843 --> 00:21:01,762 మీరిద్దరూ తప్పు చేశారు. సరేనా? 354 00:21:01,845 --> 00:21:05,641 మీ నాన్న చెప్పినట్లు, అందరు మంచి తల్లిదండ్రులు తప్పులు చేస్తారు. 355 00:21:06,850 --> 00:21:09,811 ఆగు, మేము మంచి తల్లిదండ్రులమా? 356 00:21:09,895 --> 00:21:11,063 నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, 357 00:21:11,146 --> 00:21:14,816 ఒక పెద్ద తుఫాను వచ్చింది, నువ్వు నిద్రపోలేకపోయావు. 358 00:21:14,900 --> 00:21:16,735 మీ నాన్న, నేను ఏం చేశామో తెలుసా? 359 00:21:16,818 --> 00:21:19,905 దుప్పట్లతో ఒక గూడు కట్టి రాత్రంతా నీతో అక్కడే ఉన్నాం. 360 00:21:19,988 --> 00:21:22,950 అచ్చం గోల్డీ కోసం మీరు కట్టిన గూడు లాంటిదే. 361 00:21:23,033 --> 00:21:24,618 మేము కూడా అవే దుప్పట్లు వాడినట్లున్నాం. 362 00:21:26,411 --> 00:21:32,417 మేము అది చూసినపుడు, మీరిద్దరూ కుక్కపిల్లని పెంచగలరని మాకు అర్థమయింది. 363 00:21:32,501 --> 00:21:33,585 -నిజంగా? -ఏంటి? 364 00:21:33,669 --> 00:21:35,754 మేమిద్దరం ఒకరినొకరం చూసుకోవాల్సిన అవసరం కూడా కలగలేదు. 365 00:21:35,838 --> 00:21:37,047 -అవును! -ఓహ్, ఓరి... 366 00:21:37,130 --> 00:21:39,716 కానీ ముందు మీరు లూ దంపతులకు కాల్ చేసి, క్షమాపణ అడగాలి. 367 00:21:39,800 --> 00:21:43,053 కుక్క డోర్ పెట్టే వరకూ అది కార్పెట్ మీదికి రాకుండా చూసుకుంటామని మాటివ్వాలి. 368 00:21:43,136 --> 00:21:44,263 -సరే. తప్పకుండా. -అవును! సరే. 369 00:21:44,346 --> 00:21:45,472 పద. 370 00:21:45,556 --> 00:21:49,309 -గోల్డీ! గోల్డీ! గోల్డీ! -గోల్డీ! గోల్డీ, ఏమైందో తెలుసా? గోల్డీ. 371 00:21:50,602 --> 00:21:52,479 గోల్డీ? ఎటు పోయింది? 372 00:21:54,523 --> 00:21:56,942 -గోల్డీ? -గోల్డీ? 373 00:21:57,025 --> 00:21:58,652 పర్లేదు. భయపడకు పిల్లా. 374 00:22:00,529 --> 00:22:02,573 -చార్లెస్? -ఏంటి? 375 00:22:04,575 --> 00:22:07,494 గోల్డీ సొంత కుక్క డోర్ తయారు చేసుకుందనుకుంటా. 376 00:22:09,204 --> 00:22:11,498 -గోల్డీ! -గోల్డీ! 377 00:22:11,582 --> 00:22:14,251 -గోల్డీ! -గోల్డీ! ఎక్కడుంది? 378 00:22:14,334 --> 00:22:16,879 తనని షెల్టర్ కి తీసుకెళ్తున్నారని దానికి తెలిసిపోయిందా? 379 00:22:16,962 --> 00:22:20,549 అది తెలివైందే కానీ మరీ అంత కాదు. బహుశా ఆడుకోవాలని అనుకుందేమో? 380 00:22:20,632 --> 00:22:22,885 అందుకు అవకాశం లేదు. అది ఎందుకు పారిపోతుంది? 381 00:22:22,968 --> 00:22:25,554 -తను మనతో ఆడుకోవచ్చు కదా. -నాకు తెలీదు, చార్లెస్. 382 00:22:27,014 --> 00:22:29,224 అది ఎక్కడుందో నాకు తెలుసు. నన్ను అనుసరించు. 383 00:22:46,200 --> 00:22:49,786 ఎలా ఆడుకుంటున్నాయో చూడు. బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. 384 00:22:50,704 --> 00:22:53,916 -అది హెన్రీతో కూడా అలాగే ఆడుకునేది. -నాకు తెలుసు. 385 00:22:56,376 --> 00:22:59,171 గోల్డీని ఉంచుకోవటానికి మీ వాళ్ళు ఒప్పుకున్నందుకు మీకు హ్యాపీగా ఉంది కదా. 386 00:22:59,254 --> 00:23:02,633 -అవును. అవును. -ఏం జరిగింది? 387 00:23:02,716 --> 00:23:06,720 ఏమీ లేదు. అది రూఫస్ తో ఎంతో సంతోషంగా ఆడుకుంటోంది. 388 00:23:07,221 --> 00:23:10,015 అవును. చాలా సంతోషంగా. 389 00:23:18,315 --> 00:23:20,609 నేను, మా అక్క ఇప్పుడే మాట్లాడుకున్నాం, 390 00:23:20,692 --> 00:23:24,571 గోల్డీని పెంచుకోమంటే మీరు ఏమంటారా అని ఆలోచిస్తున్నాం. 391 00:23:24,655 --> 00:23:25,697 ఏంటి? 392 00:23:26,990 --> 00:23:28,575 చూడండి, మాకు గోల్డీ అంటే ఇష్టం. 393 00:23:28,659 --> 00:23:32,287 కానీ తనకి ఏది మంచిది అన్నదే అన్నిటికంటే ముఖ్యమైన విషయం. 394 00:23:32,371 --> 00:23:33,872 రూఫస్ కి కూడా. 395 00:23:34,498 --> 00:23:37,125 మీకు, అలాగే శామీ నీక్కూడా. 396 00:23:37,209 --> 00:23:38,919 నిజంగా? ఖచ్చితంగా అంటున్నావా? 397 00:23:39,503 --> 00:23:40,504 అవును. 398 00:23:42,130 --> 00:23:43,131 ఖచ్చితంగా అంటున్నాం. 399 00:23:43,215 --> 00:23:45,884 అమ్మమ్మా, పెంచుకుందామా? ప్లీజ్? 400 00:23:49,429 --> 00:23:50,806 ఒకే ఒక షరతు. 401 00:23:50,889 --> 00:23:55,519 గోల్డీకి దేవుడిచ్చిన తల్లిదండ్రులుగా ఉంటామని మీరిద్దరూ ఒప్పుకోవాలి. 402 00:23:55,602 --> 00:23:57,980 -తప్పకుండా. -తప్పకుండా. 403 00:23:58,063 --> 00:23:59,648 అయితే మన ఒప్పందం కుదిరినట్లే. 404 00:24:00,274 --> 00:24:03,110 హేయ్, రూఫస్, ఇటురా. ఒక అద్భుతమైన వార్త. 405 00:24:04,528 --> 00:24:05,779 గోల్డీ, ఇటురా. 406 00:24:07,447 --> 00:24:08,448 గోల్డీ. 407 00:24:09,783 --> 00:24:13,495 కంగారు పడకండి. నా ఫ్రెండ్ శామీ ఒక గొప్ప డాగ్ ట్రైనర్. 408 00:24:15,080 --> 00:24:18,125 నేను కొంచెం కూడా కంగారు పడట్లేదు. అవి ఖచ్చితంగా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాయి. 409 00:24:22,045 --> 00:24:25,299 నేను మధ్యలో ఆపకముందు చార్లెస్ ఏం చెబుతున్నాడు అని 410 00:24:25,382 --> 00:24:27,050 మీరు అనుకుంటే, ఇదిగో చూడండి. 411 00:24:27,134 --> 00:24:30,345 నిజానికి వాడు మూడో క్లాసులో ఉండాల్సిన వాడు కాదు. 412 00:24:30,429 --> 00:24:32,139 అంటే, ఎంతైనా నా తమ్ముడు కదా. 413 00:24:33,390 --> 00:24:36,518 నా దృష్టిలో బోలెడుమంది రకరకాల హీరోలు ఉన్నారు, 414 00:24:36,602 --> 00:24:40,022 కానీ అందరిలో ఒకేలా ఉండే విషయం ఏంటంటే ఇతరులకు సాయం చేయడం. 415 00:24:40,105 --> 00:24:44,359 ఆ ఇతరులు మనుషులే అవ్వాల్సిన పనిలేదు. కుక్కలు కూడా కావొచ్చు. 416 00:24:44,443 --> 00:24:48,280 కుక్కలు చాలా అద్భుతమైనవి. అవి మనకి తోడును, ప్రేమను ఇస్తాయి. 417 00:24:48,363 --> 00:24:51,617 కొన్నిసార్లు మనకి కొత్త స్నేహితులను అందించడంలో సాయం చేస్తాయి. 418 00:24:51,700 --> 00:24:55,204 కానీ వాటిని పట్టించుకోవడానికి, వాటి హీరోలుగా ఉండడానికి మనం వాటికి కావాలి. 419 00:24:58,457 --> 00:24:59,499 అయిపోయింది. 420 00:25:08,133 --> 00:25:12,429 "గోల్డీ" 421 00:25:20,646 --> 00:25:21,647 స్కొలాస్టిక్ బుక్ సిరీస్ పై ఆధారపడింది 422 00:25:21,730 --> 00:25:22,564 ఎల్లెన్ మైల్స్ రచన THE PUPPY PLACE 423 00:26:38,640 --> 00:26:40,642 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ