1 00:00:22,773 --> 00:00:25,609 మిస్ లీజియర్, మిస్టర్ టొమినె. 2 00:00:25,609 --> 00:00:29,321 మిస్టర్ అలెగ్జాండర్ లీజియర్ ఏర్పాటు చేసిన రెండవ పరీక్షని మీకు పెట్టబోతున్నాను. 3 00:00:29,321 --> 00:00:33,116 ఆయన ఒక పెయింటింగ్ ని ఎంపిక చేశాడు, దానికి క్లూ కింద ఇచ్చిన ఒకే ఒక్క మాట "సంబంధం." 4 00:00:33,992 --> 00:00:35,994 ఈ పెయింటింగ్ ని దగ్గరగా గమనించండి. 5 00:00:36,495 --> 00:00:38,830 దీనికి సరిపోయే వైన్ ని కనిపెట్టడానికి మీకు రెండు వారాల సమయం ఉంటుంది. 6 00:00:51,051 --> 00:00:54,680 {\an8}మిస్టర్ నొబొరు టొమినె ప్రెస్ కాన్ఫరెన్స్ త్వరలో మొదలవుతుంది. 7 00:00:54,680 --> 00:01:00,310 {\an8}ఆయన చాలా అరుదుగా జనం ముందుకు వస్తాడు ఎందుకంటే ఆయనకు మీడియా అంటే ద్వేషం. 8 00:01:00,811 --> 00:01:02,813 {\an8}అయితే, అతని మనవడు, ఇసెయ్, 9 00:01:02,813 --> 00:01:05,440 {\an8}వైన్ ప్రపంచంలో ఎంతో శక్తిమంతుడైన అలెగ్జాండర్ లీజియర్ వారసత్వ సంపదని గెలుచుకోవడానికి 10 00:01:05,440 --> 00:01:07,985 {\an8}తను పోటీలో పాల్గొంటున్నట్లు ప్రకటించాడు. 11 00:01:07,985 --> 00:01:10,404 అనధికార వర్గాల సమాచారం ప్రకారం, అతను... 12 00:01:11,029 --> 00:01:13,073 ఇదిగో అతను వచ్చాడు. మిస్టర్ నొబొరు టొమినె. 13 00:01:25,169 --> 00:01:28,505 ప్రపంచం మారిపోయింది. 14 00:01:29,548 --> 00:01:31,758 {\an8}నేను ముందే చెప్పినట్లు, జపాన్ మారిపోయింది. 15 00:01:32,718 --> 00:01:39,224 {\an8}జపాన్ మారిపోయినప్పుడు, 16 00:01:39,975 --> 00:01:44,855 {\an8}నాలాంటి ఒక వృద్ధుడు కూడా మారచ్చు. 17 00:01:46,940 --> 00:01:53,405 నా మనవడు, ఇసెయ్ టొమినె కూడా మారిపోయాడు. 18 00:01:54,907 --> 00:02:00,829 అతను వైన్ ప్రపంచంలో మునిగితేలాడు, 19 00:02:00,829 --> 00:02:04,499 అయితే ఆ రంగం ప్రధానంగా పాశ్చ్యాత్తులకు మాత్రమే పరిమితమై ఉండేది. 20 00:02:04,499 --> 00:02:08,961 అతను అనతికాలంలోనే తన ప్రతిభని ఈ ప్రపంచానికి నిరూపించి చూపించాడు. 21 00:02:11,507 --> 00:02:16,970 {\an8}నేను ఇసెయ్ కి మద్దతు ఇస్తున్నాను. 22 00:02:17,554 --> 00:02:20,891 {\an8}అతను ఈ పోటీలో గెలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 23 00:02:25,896 --> 00:02:27,064 ఇసెయ్, 24 00:02:28,106 --> 00:02:34,696 టొమినె డైమండ్స్ నీకు హర్షాతిరేకాలు అందిస్తున్నాయి. 25 00:02:36,615 --> 00:02:39,243 {\an8}నువ్వు విజయం సాధించు! 26 00:02:39,826 --> 00:02:40,911 {\an8}మా కోసం. 27 00:02:42,162 --> 00:02:45,541 {\an8}ముఖ్యంగా జపాన్ కోసం. 28 00:02:48,252 --> 00:02:52,631 {\an8}చాలా ధన్యవాదాలు. 29 00:03:03,225 --> 00:03:04,434 అదిగో. 30 00:03:05,352 --> 00:03:06,478 నిశ్చలిత వస్తువుల పెయింటింగ్, 31 00:03:06,478 --> 00:03:09,523 'పీచ్ పండ్లు, క్విన్స్ పండ్లు, మల్లెపూలు', ఫిడి గలీజియా చిత్రకళ. 32 00:03:10,315 --> 00:03:12,818 ఆమె బరోక్ కాలం నాటి మిలాన్ కళాకారిణి, 33 00:03:13,610 --> 00:03:14,736 ఇది పదిహేడవ శతాబ్దానికి చెందినది. 34 00:03:14,736 --> 00:03:15,863 సరే. 35 00:03:16,613 --> 00:03:20,075 నిశ్చలిత చిత్రం. నిశ్చలిత చిత్రాలు అందాన్ని, 36 00:03:20,075 --> 00:03:21,660 స్వల్పకాలిక జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. 37 00:03:21,660 --> 00:03:23,203 ప్రతి దానికి ఒక ముగింపు ఉంటుంది. 38 00:03:23,203 --> 00:03:27,124 పండ్లు పాత్రలలో కుళ్లిపోయినట్లుగా మనుషులు కూడా మట్టిలో కలిసిపోతారు. 39 00:03:28,083 --> 00:03:29,251 ఇది అందంగా ఉంది. 40 00:03:29,835 --> 00:03:31,003 థాంక్యూ. 41 00:03:32,254 --> 00:03:33,839 జీవితం ఇంకా వస్తువుల స్వల్ప ఆయుష్షు. 42 00:03:34,798 --> 00:03:36,592 నీ పుస్తకంలో నువ్వు దీని గురించి రాశావు, కదా? 43 00:03:37,843 --> 00:03:38,969 నువ్వు ఆ పుస్తకం చదివావా? 44 00:03:39,720 --> 00:03:42,723 చదివాను. అది నిజంగా బాగుంది. నాకు నచ్చింది. 45 00:03:46,143 --> 00:03:51,857 అయితే, మనం వెతుకుతున్న ఆ సంబంధం బహుశా బతుకు, చావు మధ్య ఉండే సంబంధం అయి ఉండచ్చు. 46 00:03:52,524 --> 00:03:55,944 అవును, కానీ దానికీ వైన్ కీ ఏం సంబంధం ఉంటుంది? 47 00:03:57,946 --> 00:03:59,072 లేదా వైన్ తో దానికి ఏంటి సంబంధం? 48 00:04:00,157 --> 00:04:01,241 అంటే... 49 00:04:02,618 --> 00:04:04,036 ఆ "సంబంధం"? 50 00:04:04,036 --> 00:04:07,539 నాకు ఆ సంబంధం ఏమిటో తెలియదు కానీ, వైట్ వైన్ లేదా రెడ్ వైన్ ఏదైనా, 51 00:04:07,539 --> 00:04:09,208 అది ఇటాలియన్ వైన్ అయి ఉంటుంది. 52 00:04:09,875 --> 00:04:12,044 మిలాన్ లేదా లాంబోర్డీ ప్రాంతానికి సంబంధించినది కావచ్చు. 53 00:04:12,044 --> 00:04:15,214 అటువంటి ద్రాక్ష వెరైటీల గురించి చూడండి. 54 00:04:15,214 --> 00:04:18,966 అవి బహుశా 17వ శతాబ్దానికి సంబంధించినవి కూడా కావచ్చు, మనకి తెలియదు. 55 00:04:21,470 --> 00:04:25,390 సువాసనలు - మల్లెపూలు, పీచ్, క్విన్స్ పండ్లు. 56 00:04:25,390 --> 00:04:29,728 ఈ మూడు చాలా చక్కగా ఉంటాయి, కానీ రెండు ఉన్నా కూడా గొప్పగా ఉంటుంది. 57 00:04:34,191 --> 00:04:35,400 నేను ముగించాను. 58 00:04:35,400 --> 00:04:38,820 సరే. ఇంక, పదండి. పదండి, కుర్రాళ్లూ! 59 00:04:39,655 --> 00:04:40,656 థాంక్యూ. 60 00:04:45,494 --> 00:04:47,162 నన్ను కలవాలి అన్నావు? 61 00:05:07,391 --> 00:05:08,433 అది ఏంటి? 62 00:05:25,200 --> 00:05:26,827 నాన్నకి ఏం అయింది? 63 00:05:35,544 --> 00:05:38,088 "నా కోసం వెతకద్దు." 64 00:05:38,088 --> 00:05:39,631 ఆయన కనిపించడం లేదా? 65 00:05:39,631 --> 00:05:41,675 - ఎప్పటి నుండి? - అది విషయం కాదు. 66 00:05:42,426 --> 00:05:45,053 ఆయనని కలిసిన చివరి వ్యక్తివి నువ్వే. 67 00:05:46,638 --> 00:05:48,140 ఆయనతో ఏం మాట్లాడావు? 68 00:05:57,524 --> 00:05:58,650 ఇసెయ్? 69 00:06:02,196 --> 00:06:04,489 నన్ను పోటీ నుండి తప్పుకోమని చెప్పాడు. 70 00:06:05,991 --> 00:06:07,826 నువ్వు ఆయనతో అడిగిస్తున్నావు అనుకున్నాను. 71 00:06:07,826 --> 00:06:08,994 నేను ఎందుకు అడగమంటాను? 72 00:06:09,578 --> 00:06:10,871 నేను అలాంటి పని ఎప్పుడూ చేయను. 73 00:06:11,663 --> 00:06:15,167 మనం వేరే వ్యక్తుల వారసత్వ సంపద కోసం పోటీ పడితే, 74 00:06:15,167 --> 00:06:19,254 అది ఆయన పరువుతో పాటు టొమినె గ్రూప్ ప్రతిష్ఠకి కూడా భంగం కలిగిస్తుందని ఆయన అనుకున్నాడు. 75 00:06:19,254 --> 00:06:20,506 నేను ఆయనని వదిలి వెళ్లడానికి ముందు... 76 00:06:22,382 --> 00:06:24,468 ఆయన ఒక పిరికిపంద అని అన్నాను. 77 00:06:27,721 --> 00:06:29,056 నీకు ఎంత ధైర్యం? 78 00:06:29,640 --> 00:06:31,433 ఆయన చాలా సున్నిత మనస్కుడు. 79 00:06:31,433 --> 00:06:33,519 అలాంటి మనిషిని నువ్వు ఎలా అవమానిస్తావు? 80 00:06:33,519 --> 00:06:35,395 ఆయనని ఎప్పుడూ అవమానించిన మనిషివి నువ్వే. 81 00:06:36,146 --> 00:06:37,147 ఏం అన్నావు? 82 00:06:37,856 --> 00:06:39,441 నేను అన్నది నువ్వు స్పష్టంగా విన్నావు. 83 00:06:41,568 --> 00:06:43,612 - నువ్వు పోలీసులకి ఫిర్యాదు చేయాలి. - ఖచ్చితంగా చేయను. 84 00:06:44,488 --> 00:06:46,907 ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. 85 00:06:46,907 --> 00:06:49,201 నాన్న కనిపించడం లేదు కానీ నువ్వు ఏమీ చేయవా? 86 00:06:49,201 --> 00:06:52,913 ఆయన వెళ్లిపోవాలి అని నిర్ణయించుకున్నాక మనతో ఉండమని మనం బలవంతం చేయలేము. 87 00:06:52,913 --> 00:06:55,624 - కానీ ఆయనకు ఏదైనా జరిగితే ఏంటి? - దయచేసి నువ్వు ఏమీ చేయకు! 88 00:06:57,918 --> 00:07:01,630 నువ్వు ఇప్పటివరకూ తెచ్చిన ఇబ్బందులు చాలు. 89 00:08:21,502 --> 00:08:23,921 తాతయ్య, థాంక్యూ. 90 00:08:25,839 --> 00:08:27,007 నేను ఏం చేశాను? 91 00:08:28,133 --> 00:08:32,929 నేను గెలవాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అందరికీ చెప్పావు. 92 00:08:32,929 --> 00:08:35,557 అవును. నేను అదే చెప్పాను. 93 00:08:38,352 --> 00:08:41,313 అది నిజం, ఇసెయ్. 94 00:08:46,276 --> 00:08:47,402 చాలా ధన్యవాదాలు. 95 00:08:48,362 --> 00:08:52,115 అది నిజం. నువ్వు గెలవాలి. 96 00:08:53,242 --> 00:08:57,246 ఎందుకంటే నీకు మరో దారి లేదు. 97 00:08:59,957 --> 00:09:05,754 నువ్వు మాతో సంప్రదించకుండానే నీ వరకూ నువ్వు నిర్ణయించుకున్నావు, 98 00:09:06,713 --> 00:09:11,134 నిన్ను మేము హెచ్చరించినా కూడా నువ్వు పట్టించుకోలేదు. 99 00:09:12,886 --> 00:09:14,346 దాని ఫలితంగా, 100 00:09:15,389 --> 00:09:19,518 నీకు ఈ కుటుంబంతో ఇంక ఎలాంటి సంబంధాలు ఉండవు. 101 00:09:21,478 --> 00:09:23,272 నీకు అర్థమైందా, ఇసెయ్? 102 00:09:24,690 --> 00:09:27,276 నీకు గెలవడం తప్ప మరో మార్గం లేదు. 103 00:09:28,026 --> 00:09:31,989 నువ్వు గెలవని పక్షంలో, నువ్వు సర్వం కోల్పోతావు. 104 00:09:32,948 --> 00:09:35,325 ప్రతిష్ఠ, గౌరవం... 105 00:09:36,994 --> 00:09:40,747 కుటుంబం, డబ్బు, భవిష్యత్తు. 106 00:09:42,499 --> 00:09:45,669 నీకు ఇంకేమీ మిగలదు. 107 00:09:47,171 --> 00:09:52,676 నువ్వు ఏడవడానికి నీ కళ్లు తప్ప. 108 00:09:54,678 --> 00:09:57,097 అందువల్ల, నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. 109 00:10:36,845 --> 00:10:37,846 ఇది కాదు. 110 00:10:57,824 --> 00:10:59,159 ఇలా చూడు, 111 00:11:00,494 --> 00:11:04,831 తనకి ఒంట్లో బాగాలేదు అనుకుంటున్నావు, కానీ ఈ ఫ్రెంచ్ వాళ్లు... 112 00:11:09,545 --> 00:11:11,880 కానీ మీ జపనీస్ ప్రజలు, 113 00:11:11,880 --> 00:11:17,094 మీరు మాత్రం మర్యాద, గౌరవం, సంప్రదాయం, ముట్టుకోవద్దు అంటుంటారు. 114 00:11:18,554 --> 00:11:20,180 మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా జాలి వేస్తుంది. 115 00:11:35,612 --> 00:11:38,156 నీకు అన్ని విషయాల గురించి స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి కదా? 116 00:11:52,296 --> 00:11:53,547 అతని పేరు? 117 00:11:54,590 --> 00:11:55,966 హిరోకజు టొమినె 118 00:11:56,592 --> 00:11:58,927 ఆయన ఎలా కనిపించకుండా పోయాడో చెప్పగలరా? 119 00:12:02,848 --> 00:12:05,893 నా కోసం వెతకవద్దు. 120 00:12:07,853 --> 00:12:09,855 ఇది ఆయనే రాశారా? 121 00:12:10,814 --> 00:12:11,857 అవును. 122 00:12:14,985 --> 00:12:16,486 మీ నాన్నగారి వయస్సు 56 సంవత్సరాలు. 123 00:12:17,738 --> 00:12:20,073 తను ఎలా జీవించాలో నిర్ణయించుకునేంత పెద్ద వాడు ఆయన. 124 00:12:21,783 --> 00:12:23,243 నాకు ఆయన గురించి ఆందోళనగా ఉంది. 125 00:12:23,243 --> 00:12:26,413 ఆయన దగ్గర డబ్బు కానీ గుర్తింపు కార్డులు కానీ లేవు. 126 00:12:26,413 --> 00:12:30,125 ఆయన వీధులలో మరణించకూడదని లేదా ఏదైనా జరగరానిది జరగకూడదని కోరుకుంటున్నాను. 127 00:12:30,751 --> 00:12:36,173 జపాన్ లో ప్రతి సంవత్సరం ఎంతమంది పెద్ద వయస్సు వాళ్లు కనిపించకుండా పోతున్నారో మీకు తెలుసా? 128 00:12:36,840 --> 00:12:41,136 ఎవరైనా కావాలని ఇల్లు వదిలి వెళ్లిపోతే మేము ఏం చేస్తామో చెప్పమంటారా? 129 00:12:42,554 --> 00:12:43,722 ఏమీ చేయము. 130 00:12:45,307 --> 00:12:46,934 వాళ్లని మేము కనిపెట్టినా కూడా, 131 00:12:47,768 --> 00:12:50,812 వాళ్లు కాదు అంటే మేము తిరిగి ఇళ్లకు వెళ్లమని బలవంతం చేయలేము. 132 00:12:54,942 --> 00:12:58,529 నేను మిమ్మల్ని టీవీలో చూశానా? 133 00:12:59,571 --> 00:13:00,572 లేదు. 134 00:13:02,032 --> 00:13:03,075 సరే. 135 00:13:04,159 --> 00:13:05,494 సరే, 136 00:13:06,245 --> 00:13:07,788 మేము చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు. 137 00:13:08,664 --> 00:13:10,832 కొన్నిసార్లు వాళ్లంతకు వాళ్లే తిరిగి వస్తారు. 138 00:13:11,333 --> 00:13:13,794 ఆయన కోసం మీరు కనీసం వెతకకుండా అలా ఎలా చెప్పగలరు? 139 00:13:15,087 --> 00:13:16,713 దయచేసి నిరాశపడకండి. 140 00:13:31,228 --> 00:13:32,354 మనం కలుసుకోగలమా? 141 00:13:34,064 --> 00:13:35,357 ఏ సమయానికి? 142 00:13:50,622 --> 00:13:51,832 దయచేసి నాకు చెప్పకండి. 143 00:13:52,332 --> 00:13:53,959 ఇప్పుడు నేను మీకు నచ్చాను కాబట్టి, 144 00:13:53,959 --> 00:13:56,962 ప్రతి పోటీకి మీరు నాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తారు, కదా? 145 00:13:57,713 --> 00:13:58,714 ఖచ్చితంగా. 146 00:14:00,757 --> 00:14:02,009 మీరు నిజంగానే అంటున్నారా? 147 00:14:03,677 --> 00:14:05,095 మీకు అసలు ఏం అయింది? 148 00:14:05,095 --> 00:14:06,763 మీరు సాధారణంగా చాలా గోప్యంగా ఉంటారు కదా. 149 00:14:08,557 --> 00:14:12,060 మిమ్మల్ని నేను నమ్మచ్చా, మిస్ కటసె? 150 00:14:13,520 --> 00:14:15,397 అంటే, నేను జర్నలిస్టుని. 151 00:14:23,280 --> 00:14:24,823 సారీ. అర్థమైంది. 152 00:14:26,074 --> 00:14:28,452 సరే, మీరు చెప్పేది ఏదీ ఇక్కడి నుండి బయటకు వెళ్లదు. నా ప్రామిస్. 153 00:14:34,124 --> 00:14:35,792 మా నాన్న కనిపించడం లేదు. 154 00:14:36,293 --> 00:14:38,962 ఆయన దగ్గర తన ఫోన్, గుర్తింపు కార్డులు, లేదా ఆయన క్రెడిట్ కార్డు, ఏవీ లేవు. 155 00:14:41,340 --> 00:14:42,591 మీరు ఆయనని కనిపెట్టాలని నా కోరిక. 156 00:14:45,093 --> 00:14:48,805 నేను జర్నలిస్టుని, ప్రైవేట్ డిటెక్టివ్ ని కాను. 157 00:14:48,805 --> 00:14:51,350 మీరు ఏం చేస్తారో నేను చూశాను ఇంకా చదివాను. 158 00:14:52,518 --> 00:14:55,270 మీరు చాలా రిస్కు తీసుకుంటున్నారు. 159 00:14:56,271 --> 00:14:59,816 నేను ఒక పొగరుబోతు దొరని అనుకుంటున్నారని నాకు తెలుసు. 160 00:14:59,816 --> 00:15:01,026 బహుశా నేను అలాగే ఉంటానేమో. 161 00:15:01,652 --> 00:15:04,363 నేను ఎక్కువగా బయట తిరగను, నాకు ఎక్కువమంది స్నేహితులు కూడా లేరు. 162 00:15:05,072 --> 00:15:06,073 నిజానికి, 163 00:15:07,074 --> 00:15:09,993 నేను మరొక మనిషి దగ్గర ఇలా ఈ మాత్రమైనా మనసు విప్పి మాట్లాడి చాలా ఏళ్లు అయింది. 164 00:15:17,376 --> 00:15:18,502 మా నాన్న, ఆయన... 165 00:15:22,798 --> 00:15:26,510 ఒక టీవీ టాక్ షోలో నాకు ఒక న్యూస్ స్లాట్ ఉంది. 166 00:15:28,554 --> 00:15:29,972 నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి. 167 00:15:29,972 --> 00:15:31,431 అది మాకు మాత్రమే ఇవ్వాలి. 168 00:15:35,894 --> 00:15:37,688 ఆయన ఎందుకు కనిపించడం లేదని నేను అడగను. 169 00:15:39,565 --> 00:15:41,817 కానీ మీరు దాని గురించి ఆలోచించాలి. 170 00:15:42,568 --> 00:15:44,695 ఈ సమయంలో ఆయన ప్రత్యేకంగా ఎందుకు వెళ్లిపోయారు? 171 00:15:47,114 --> 00:15:48,699 నేను ఆయనతో పరుషంగా కొన్ని మాటలు అన్నాను. 172 00:15:51,243 --> 00:15:54,705 కొన్ని పరుషమైన మాటల వల్ల ఎవ్వరూ కనిపించకుండా వెళ్లిపోరు. 173 00:15:56,665 --> 00:15:58,584 ఆయనకు ఏమైనా రహస్యాలు ఉండచ్చు. 174 00:15:59,793 --> 00:16:02,880 ఎవరికి మాత్రం రహస్యాలు ఉండవు? 175 00:16:05,048 --> 00:16:07,509 - ఆయన ఫోటో మీ దగ్గర ఉందా? - ఏంటి? 176 00:16:07,509 --> 00:16:09,511 మీ నాన్నగారి ఫోటో. 177 00:16:22,191 --> 00:16:23,233 మంచి ఫోటో. 178 00:16:25,819 --> 00:16:27,487 మీరు ఆయనలాగే ఉన్నారు. 179 00:16:47,174 --> 00:16:48,425 స్వాగతం. 180 00:16:52,554 --> 00:16:54,139 నువ్వు ఏం తాగుతావు? 181 00:16:55,641 --> 00:16:56,850 ఏమీ వద్దు. ఏమీ వద్దు. 182 00:17:03,357 --> 00:17:06,026 అయితే, ఏం జరుగుతోంది? 183 00:17:06,527 --> 00:17:07,736 నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? 184 00:17:07,736 --> 00:17:09,445 నేను నీతో మాట్లాడాలి, సరేనా? 185 00:17:11,406 --> 00:17:12,574 సరే. 186 00:17:12,574 --> 00:17:15,368 ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీన ఏం జరుగుతుందో నీకు తెలుసా? 187 00:17:16,494 --> 00:17:17,496 తెలియదు. 188 00:17:17,996 --> 00:17:19,830 కొత్త లీజియర్ గైడ్ విడుదల అవుతుంది. 189 00:17:21,375 --> 00:17:25,337 ఈ గైడ్ ని దాదాపు డెబ్బై దేశాలలో, మొత్తం సుమారు ఇరవై లక్షల కాపీలు ప్రచురించి విడుదల చేస్తారు. 190 00:17:26,630 --> 00:17:31,385 వెయ్యి వైన్స్ ని రుచి చూస్తారు, వాటిని ఒక క్రమంలో పెట్టి, రేటింగ్స్ ఇస్తారు. 191 00:17:31,385 --> 00:17:34,221 లూకా, నాకు ఇదంతా ఎందుకు చెబుతున్నారు? 192 00:17:36,890 --> 00:17:39,601 లీజియర్ కుటుంబీకులు గనుక దాన్ని తయారు చేయకపోతే ఎందుకంటే లీజియర్ గైడ్ 193 00:17:40,102 --> 00:17:42,062 ఎప్పటికీ లీజియర్ గైడ్ కాదు. 194 00:17:42,646 --> 00:17:43,689 అయితే? 195 00:17:48,110 --> 00:17:50,153 ఈ చుట్టుపక్కల నీకు వేరే ఎవరైనా లీజియర్ కనిపిస్తున్నారా? 196 00:17:50,737 --> 00:17:53,782 నేను నీ గురించి మాట్లాడుతున్నాను. అది నువ్వే. నీ గురించే మాట్లాడుతున్నాను. 197 00:17:53,782 --> 00:17:56,118 - లూకా, ఇలా చూడండి. - చూడు, నాకు తెలుసు. 198 00:17:56,118 --> 00:17:57,911 ఇప్పుడు నీ ప్రధాన లక్ష్యం ఆ పోటీని గెలవడం. 199 00:17:58,745 --> 00:18:02,291 కానీ ఆ గైడ్ బాధ్యతల్ని నువ్వు తీసుకోవాలని మీ నాన్న కల. 200 00:18:04,877 --> 00:18:07,588 ఆయన నాకు ఈ విషయం చెప్పాడు. నేను కేవలం ఒక దూతని మాత్రమే. 201 00:18:16,513 --> 00:18:20,392 రేపు ఉదయం, మీ నాన్న ఇంట్లో మనకి ఒక మీటింగ్ ఉంటుంది. 202 00:18:20,976 --> 00:18:24,062 థోమాస్ ఆ మీటింగ్ లో ఉండడు. మనకి లొరెంజో అందుబాటులో ఉంటాడు. 203 00:18:24,855 --> 00:18:26,273 నీకు ఒక సర్ ప్రైజ్ ఉంది. 204 00:18:33,906 --> 00:18:40,454 ఇక్కడ పాఠాలు బోధించే ఒక ప్రొఫెసర్ గారి రికార్డుల గురించి మిమ్మల్ని అడగవచ్చా? 205 00:18:42,289 --> 00:18:46,335 అది 1990 నుండి 1994 మధ్య కాలంలో? 206 00:18:50,339 --> 00:18:52,299 అది దేని కోసం? 207 00:18:53,967 --> 00:18:59,139 నా తల్లిదండ్రులు ఆయన క్లాసులో కలుసుకున్నారు అనుకుంటా, కానీ నాకు ఖచ్చితంగా తెలియదు. 208 00:18:59,139 --> 00:19:01,391 నా తల్లిదండ్రులకు పెళ్లయి ఈ సంవత్సరానికి ముప్పై ఏళ్లు అవుతుంది. 209 00:19:01,391 --> 00:19:05,187 ఆ ప్రొఫెసర్ గారిని ఆహ్వానించి వాళ్లని సర్ ప్రైజ్ చేయాలని అనుకుంటున్నాను. 210 00:19:06,480 --> 00:19:07,689 ఆ ప్రొఫెసర్ పేరు ఏంటి? 211 00:19:08,982 --> 00:19:10,567 లీజియర్, అలెగ్జాండర్. 212 00:19:11,944 --> 00:19:13,987 ఎల్ ఇ జి ఇ ఆర్. 213 00:19:24,248 --> 00:19:25,499 నాకు దొరికింది. 214 00:19:27,292 --> 00:19:29,169 ఆయన ఇక్కడ ఎంతకాలం బోధించారు? 215 00:19:30,754 --> 00:19:34,049 అది 1991 ఏప్రిల్ నుండి జూన్ వరకు. 216 00:19:35,259 --> 00:19:39,179 ఆయన సంవత్సరం అంతా పని చేయలేదా? ఎందుకు? 217 00:19:39,930 --> 00:19:42,182 అది మీకు చెప్పడానికి నాకు అనుమతి లేదు. 218 00:19:43,684 --> 00:19:49,857 మా పేరెంట్స్ గనుక ఆయన విద్యార్థులు అయితే, వాళ్లు ఆయన దగ్గర ఎంతకాలం చదివారు? 219 00:19:50,482 --> 00:19:53,068 హొనోకా టొమినె ఇంకా హిరోకజు ఒనొయమ. 220 00:20:04,288 --> 00:20:08,041 ఏప్రిల్ నుండి జూన్ వరకు. వాళ్ల ప్రొఫెసర్ ఉన్నంతకాలం. 221 00:20:13,797 --> 00:20:15,799 వాళ్ల మార్కులు మీ దగ్గర ఉన్నాయా? అంటే, మా తల్లిదండ్రులవి? 222 00:20:16,300 --> 00:20:17,301 ఉన్నాయి. 223 00:20:18,260 --> 00:20:19,261 మరి చెబుతారా? 224 00:20:19,887 --> 00:20:21,847 మీకు చెప్పడానికి నాకు అనుమతి లేదు. 225 00:20:24,683 --> 00:20:28,353 పార్టీకి ఆహ్వానించడానికి వాళ్ల క్లాస్ మేట్స్ పేర్లు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? 226 00:20:31,356 --> 00:20:32,983 నాకు చెప్పడానికి మీకు అనుమతి లేదు, కదా? 227 00:20:35,402 --> 00:20:39,781 దయచేసి నాకు సాయం చేస్తారా? ఇది చాలా ముఖ్యం. 228 00:20:42,201 --> 00:20:43,202 దయచేసి సాయం చేయండి. 229 00:20:56,673 --> 00:20:59,426 ఆ సమయంలో ఒక అనువాదకర్త పేరు 230 00:20:59,927 --> 00:21:01,553 ఇంకా ఆమె చిరునామా ఇక్కడ ఉంది. 231 00:21:02,304 --> 00:21:03,931 ఆమె ఇంకా అక్కడే జీవించి ఉండచ్చు. 232 00:21:04,890 --> 00:21:06,600 అది గొప్ప విషయం. 233 00:21:29,498 --> 00:21:31,458 - ఈ విషయంలో సారీ. - లేదు, ఏమీ అనుకోనులే. 234 00:21:33,418 --> 00:21:34,545 ఇంక అయిపోయింది. 235 00:21:37,965 --> 00:21:39,007 తను జూలియెట్ కదా? 236 00:21:40,425 --> 00:21:42,970 - అవును. - మీరు ఎంతకాలంగా కలిసి ఉంటున్నారు? 237 00:21:43,971 --> 00:21:45,472 ఏడు సంవత్సరాలు. 238 00:21:48,600 --> 00:21:49,977 దేనికి "హమ్... హమ్"? 239 00:21:50,936 --> 00:21:53,355 లేదు, లేదు, అది చిన్న విషయం కాదు. చాలా పెద్ద విషయం. 240 00:21:53,355 --> 00:21:54,815 నా ఉద్దేశం అది చాలా గొప్ప విషయం. 241 00:21:55,941 --> 00:21:57,025 కానీ ఏడు సంవత్సరాలు. 242 00:21:58,944 --> 00:22:01,071 ఒక అనుబంధంలో ఇది చాలా కీలకమైన సమయం, కదా? 243 00:22:02,114 --> 00:22:04,449 ఇది చౌకబారు వైన్ కీ, ఖరీదైన గొప్ప వైన్ కీ సరిహద్దు లాంటిది. 244 00:22:05,409 --> 00:22:07,953 సరదాకి అంటున్నాను, మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఉంటారు. అది గొప్ప విషయం. 245 00:22:08,787 --> 00:22:09,997 నీ రికార్డు ఎంత? 246 00:22:13,208 --> 00:22:14,293 ఆరు నెలలా? 247 00:22:15,419 --> 00:22:16,753 ఆరు నెలలా? 248 00:22:16,753 --> 00:22:17,921 ఓహ్, నిజంగానా? 249 00:22:18,881 --> 00:22:20,757 అవును, నన్ను చాలామంది వదిలేశారు. 250 00:22:22,551 --> 00:22:25,304 మా ప్రేమ ఎటువైపు పోతోందో వాళ్లకి అర్థమయ్యేది కాదు. అదే సమయంలో, వాళ్లని నేను అర్థం చేసుకునేదాన్ని. 251 00:22:25,888 --> 00:22:27,681 నా జీవితంతో ఏం చేయాలో నాకు తెలియదు. 252 00:22:28,432 --> 00:22:30,434 అందుకే ఏడు సంవత్సరాలు అంటే నాకు చాలా ఎక్కువ కాలంగా కనిపిస్తుంది. 253 00:22:34,229 --> 00:22:35,480 ఆమె తన ప్రేమని అంగీకరించమని అడిగింది. 254 00:22:36,064 --> 00:22:38,859 వావ్. మోడర్న్ అమ్మాయి. 255 00:22:40,652 --> 00:22:42,738 - మంచిది, అభినందనలు. - థాంక్యూ. 256 00:22:43,238 --> 00:22:45,490 కానీ, నాకు పెళ్లి మీద అంత నమ్మకం లేదు. 257 00:22:46,533 --> 00:22:48,118 డైవోర్స్ రేటు ఎంత ఉందో తెలుసా? 258 00:22:48,702 --> 00:22:50,204 - యాభై శాతమా? - అవును. 259 00:22:50,996 --> 00:22:52,122 మరి రెండో పెళ్లికి? 260 00:22:52,998 --> 00:22:55,083 - ముప్పై శాతమా? - ఆరవై ఆరు శాతం. 261 00:22:55,584 --> 00:22:58,462 - అవకాశమే లేదు. - మూడో పెళ్లికి, 75 శాతం. 262 00:22:58,462 --> 00:23:01,423 అవునా. ఇది పిచ్చితనం. 263 00:23:02,758 --> 00:23:04,718 నిన్ను అంతమంది ఎందుకు వదిలేశారో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. 264 00:23:04,718 --> 00:23:06,220 ఎందుకంటే నువ్వు పెద్ద హింసవి. 265 00:23:07,513 --> 00:23:09,848 నీకు కావాలంటే, నేను కూడా ఒక థియరీ చెప్పగలను. ఆగు, విను, విను. 266 00:23:09,848 --> 00:23:12,142 - ప్రేమలో ఆనందం-బాధ నిష్పత్తి గురించి. - ఆగు, కానీ... సరే, చెప్పు. 267 00:23:12,142 --> 00:23:13,644 ఒక సూచన, అది పూర్తిగా బ్యాలెన్స్ తప్పి ఉంటుంది. 268 00:23:13,644 --> 00:23:16,396 నాకు దాని గురించి సందేహమే లేదు, కానీ దాని గురించి నాకు వినాలనే లేదు. 269 00:23:16,396 --> 00:23:18,357 కాబట్టి, నీ థియరీ నీ దగ్గరే పెట్టుకో, థాంక్స్. 270 00:23:19,483 --> 00:23:21,401 నాకు కావలసిందల్లా ఒక అందమైన పెళ్లి 271 00:23:22,194 --> 00:23:24,321 నేను ప్రేమించే మనుషుల మధ్య, మంచి సంగీతం, చక్కని వైన్ లతో జరగాలి. 272 00:23:24,321 --> 00:23:26,365 ఆ తరువాత రెండేళ్లకి నేను డైవోర్స్ తీసుకుంటానో లేదో నాకు అనవసరం. 273 00:23:28,951 --> 00:23:32,037 మనల్ని ఇష్టపడే మనుషులతో మనం కలిసే అవకాశాలు మనకి ఎక్కువగా ఉండవు. 274 00:23:33,956 --> 00:23:35,332 అంత్యక్రియలు మినహాయిస్తే, 275 00:23:36,834 --> 00:23:38,293 కానీ దాన్ని నేను ఆస్వాదించలేను. 276 00:23:42,381 --> 00:23:45,008 ఎందుకో తెలియదు కానీ, మా అమ్మ అంత్యక్రియలకి నువ్వు వస్తావని అనుకున్నాను. 277 00:23:47,886 --> 00:23:49,221 నేను వచ్చి ఉండేదాన్నే. 278 00:23:49,972 --> 00:23:52,266 కానీ మా అమ్మ నాకు ఆ విషయం చెప్పడం "మర్చిపోయింది." 279 00:23:56,186 --> 00:23:57,729 మరియానా చాలా బాధలు పడింది. 280 00:24:00,858 --> 00:24:04,194 మీ నాన్నకి చాలా కోపం ఉండేది, ఆయన వయసు పెరిగినా కూడా అది తగ్గలేదు. 281 00:24:04,194 --> 00:24:05,779 ఆయన కఠినంగా ఉండేవాడు. 282 00:24:06,321 --> 00:24:08,323 ఆయనతో ఉంటే అనుక్షణం అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చేది. 283 00:24:08,323 --> 00:24:09,825 ప్రతీ విషయం ఎప్పుడూ చాలా సంక్లిష్టంగా ఉండేది. 284 00:24:09,825 --> 00:24:11,451 అందరికీ అది ఒత్తిడిని పెంచేది. 285 00:24:13,537 --> 00:24:17,040 అయినా కూడా నువ్వు ఈ ప్రపంచంలో చాలా చక్కని మంచి అమ్మాయివి. 286 00:24:17,916 --> 00:24:19,626 - గొప్ప విషయం. - లేదు. 287 00:24:20,794 --> 00:24:22,171 లేదు, నేను నిజం చెబుతున్నాను. 288 00:24:22,838 --> 00:24:25,048 నేను దయాగుణాన్ని ఇష్టపడతాను. దాన్ని మించిన అందం మరేదీ ఉండదు. 289 00:24:26,216 --> 00:24:29,136 అందువల్ల నీ మంచితనంతో పాటు నీ తెలివి కూడా కలిసి, 290 00:24:30,012 --> 00:24:31,263 అదెలా ఉంటుందో నీకు అర్థం కాదు. 291 00:24:39,438 --> 00:24:42,316 - ఆగు, మనం ఇటు నుండి వచ్చాం. - లేదు, థోమాస్! థోమాస్, ఇలా చూడు! 292 00:24:42,816 --> 00:24:45,319 - ఈ వైపు వెళ్లాలి. ఇలా కానే కాదు! ఇలా చూడు. - మనం ఈ మార్గంలోనే వచ్చాం. 293 00:24:45,319 --> 00:24:47,029 - నువ్వు ఖచ్చితంగానే చెప్పగలవా? - అవును, ఖచ్చితంగా. 294 00:24:48,322 --> 00:24:49,615 ఇది తప్పుగానే అనిపిస్తోంది. 295 00:24:51,533 --> 00:24:54,203 - ఈ వైపు అని ఖచ్చితంగా చెప్పగలవా? - లేదు, రా. నిన్ను తీసుకువెళతా, నేను తీసుకువెళతాను. 296 00:24:54,745 --> 00:24:57,331 "నేను తాగి ఉన్నాను" అని జపనీస్ భాషలో ఎలా చెప్పాలి? 297 00:24:58,207 --> 00:25:00,667 యోప్పరట్ట. 298 00:25:01,210 --> 00:25:02,753 - అవును. - యోప్పరట్ట. 299 00:25:03,253 --> 00:25:04,379 యోప్పరట్ట. 300 00:25:05,964 --> 00:25:07,049 ఏంటి? 301 00:25:07,966 --> 00:25:10,052 - ఇంక ఆపు. - యుసుకె ఇక్కడ ఉన్నాడా? 302 00:25:10,052 --> 00:25:12,054 - అవును, కానీ నిద్రపోతున్నాడు. - ఓహ్, సరే. 303 00:25:12,054 --> 00:25:13,222 ఏం చేస్తున్నావు? 304 00:25:13,889 --> 00:25:16,350 - ఈ చెప్పులు. - ఈ చెప్పుల్ని ఎవరు పట్టించుకుంటారు? 305 00:25:16,350 --> 00:25:17,893 ఏది ఏమైనా, యుసుకె పడుకున్నాడుగా. 306 00:25:20,604 --> 00:25:21,605 నిజంగా. 307 00:25:22,523 --> 00:25:24,942 చెప్పులతో ఇంట్లోకి రావద్దని అతను మనకి చెప్పాడు. 308 00:25:32,616 --> 00:25:33,659 ఏం అయింది? 309 00:25:35,494 --> 00:25:36,537 ఇలా రా. 310 00:25:37,579 --> 00:25:38,872 కమీల్, రా. 311 00:25:39,665 --> 00:25:42,125 కమీల్, ఇలా రా. 312 00:25:47,297 --> 00:25:48,465 వద్దు. 313 00:25:48,465 --> 00:25:50,843 - వద్దు, కమీల్. కమీల్. - ఏంటి? ఏంటి? 314 00:25:50,843 --> 00:25:52,845 - కమీల్, మనం తాగి ఉన్నాం. - నేను కాదు. 315 00:25:53,887 --> 00:25:55,764 - కమీల్, మనం... - విను, విను, విను! 316 00:25:57,516 --> 00:25:59,560 నేను సాధారణంగా ఇలా చేయను. 317 00:26:00,686 --> 00:26:01,687 కానీ... 318 00:26:02,646 --> 00:26:03,939 నువ్వు, నేను, ఇది... 319 00:26:06,608 --> 00:26:07,651 కాదంటావా? 320 00:26:20,080 --> 00:26:21,540 లేదు. లేదు, నేను ఇది చేయలేను. 321 00:26:22,499 --> 00:26:23,542 నా వల్ల కాదు. 322 00:26:23,542 --> 00:26:24,626 - ఆగు. - వద్దు. 323 00:26:56,491 --> 00:26:57,784 హాయ్. 324 00:26:57,784 --> 00:26:59,870 గుడ్ ఈవెనింగ్. మీతో మాట్లాడటానికి వీలు ఉందా? 325 00:26:59,870 --> 00:27:01,496 మీకు ఏదైనా సమాచారం తెలిసిందా? 326 00:27:01,496 --> 00:27:08,045 అంటే, ఇల్లు వదిలి వెళ్లిపోయిన చాలామంది వాళ్ల ఊరు వదిలి దూర ప్రదేశాలకు వెళ్లిపోతారు. 327 00:27:08,045 --> 00:27:09,713 వాళ్లు బస్సులో లేదా ట్రయిన్ లో వెళతారు. 328 00:27:10,672 --> 00:27:11,965 నీ ఈమెయిల్ చూడు. 329 00:27:14,051 --> 00:27:15,552 పోలీసులలో నా ఫ్రెండ్స్ కొందరికి 330 00:27:15,552 --> 00:27:18,347 రైల్వే స్టేషన్స్ లో సిసిటీవీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 331 00:27:19,264 --> 00:27:21,725 మీరు ఇచ్చిన తేదీ, సమయం ప్రకారం... 332 00:27:24,728 --> 00:27:26,230 ఈయన మీ నాన్నగారు అయి ఉండచ్చా? 333 00:27:34,154 --> 00:27:37,032 ఆయనే అనుకుంటా, అవును. 334 00:27:40,494 --> 00:27:43,288 ఆయన ఏ ట్రయిన్ ఎక్కారో మాకు ఇంకా తెలియదు. 335 00:27:43,288 --> 00:27:46,291 కానీ ఆయన ఏ టికెట్ మెషీన్ ఉపయోగించారో తెలిసింది. 336 00:27:47,626 --> 00:27:51,213 ఆ లావాదేవీ వివరాలు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. 337 00:27:54,174 --> 00:27:55,467 మిస్ కటసె, 338 00:27:56,343 --> 00:27:57,636 మీకు నిజంగా థాంక్స్. 339 00:27:58,220 --> 00:27:59,513 సంతోషం. 340 00:28:00,556 --> 00:28:02,516 నేను మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తాను. 341 00:28:03,559 --> 00:28:05,769 అన్నట్లు, రేపు సాయంత్రం మీరు ఖాళీగానే ఉంటారా? 342 00:28:05,769 --> 00:28:06,937 దేని కోసం? 343 00:28:07,938 --> 00:28:10,357 సినిమాకో? విందుకో? 344 00:28:14,069 --> 00:28:15,362 నేను జోక్ చేయడం లేదు. 345 00:28:15,362 --> 00:28:17,364 అది ఇంటర్వ్యూ కోసం. 346 00:28:17,364 --> 00:28:20,117 నాకు మాత్రమే ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. 347 00:28:20,742 --> 00:28:22,160 నీ కదలికలు వేగంగా ఉంటాయి. 348 00:28:23,036 --> 00:28:24,204 అయితే, సాయంత్రం ఏడు గంటలకి? 349 00:28:25,330 --> 00:28:26,415 సరే. 350 00:28:26,415 --> 00:28:27,583 మంచిది. 351 00:28:28,333 --> 00:28:29,751 మీకు వివరాలు పంపిస్తాను. 352 00:28:30,544 --> 00:28:33,338 కంగారు పడద్దు. నేను మీతో మంచిగానే ఉంటాను. 353 00:28:34,131 --> 00:28:35,299 నన్ను కాస్త జాగ్రత్తగా చూసుకోండి. 354 00:28:37,217 --> 00:28:39,428 జాగ్రత్త. గుడ్ నైట్. 355 00:28:40,053 --> 00:28:41,096 గుడ్ నైట్. 356 00:29:08,332 --> 00:29:11,502 ఇసెయ్. ఈ టీవీ ఇంటర్వ్యూ దేని గురించి? 357 00:29:13,295 --> 00:29:14,796 హలో, ఎలా ఉన్నావు? 358 00:29:15,756 --> 00:29:18,717 నీ వెటకారం ఆపి అడిగిన దానికి సమాధానం చెప్పు. 359 00:29:19,343 --> 00:29:20,427 ఒక మాట చెప్పనివ్వు 360 00:29:21,261 --> 00:29:26,099 తాతయ్య ఇచ్చిన మద్దతుకి నేను కరిగిపోయానని ఈ మొత్తం ప్రపంచం అంతా చాటాలి అనుకుంటున్నాను. 361 00:29:26,099 --> 00:29:27,434 నువ్వు నాతో పరాచికాలు ఆడుతున్నావా? 362 00:29:27,434 --> 00:29:29,394 ఆ పని చేస్తున్నది నువ్వు. 363 00:29:30,020 --> 00:29:33,482 నీ భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు, కానీ ఆయన బతికి ఉన్నాడో లేదో మనకి తెలియదు. 364 00:29:33,482 --> 00:29:35,108 నీకు అది కనీసం పట్టదు. 365 00:29:36,235 --> 00:29:39,404 ఆయన ఎప్పటికీ మన దగ్గరకి రాడు. 366 00:29:40,072 --> 00:29:42,074 ఇది నీకు జరగాల్సిందే. 367 00:29:42,074 --> 00:29:44,117 ఆయన మనకి ఎంతో సహాయంగా ఉండేవాడు. 368 00:29:44,117 --> 00:29:46,703 కానీ ఆయన కోసం మనం ఏమీ చేయలేదు. అది చేయడానికి బదులు, మనం ఆయనని పట్టించుకోలేదు. 369 00:29:46,703 --> 00:29:50,123 ఆయన మనందరికీ ఎంత ముఖ్యుడో 370 00:29:50,832 --> 00:29:54,253 మనం ఆయనకి ఎప్పుడూ చెప్పాలని ప్రయత్నించలేదు. అందుకే ఆయన వెళ్లిపోయాడు. 371 00:29:54,753 --> 00:29:58,841 దానికీ ఈ ఇంటర్వ్యూకీ సంబంధం ఏంటి? 372 00:29:58,841 --> 00:30:00,425 నువ్వే చూస్తావు. 373 00:30:01,260 --> 00:30:02,302 గుడ్ బై. 374 00:30:39,047 --> 00:30:40,048 హలో. 375 00:30:40,048 --> 00:30:41,300 ఇసెయ్ టొమినె? 376 00:30:42,426 --> 00:30:43,844 నిన్ను టీవీలో చూశాను. 377 00:30:43,844 --> 00:30:45,679 నువ్వు వైన్ సూపర్ స్టార్ కదా! 378 00:30:46,263 --> 00:30:48,515 ఇక్కడికి ఎందుకు వచ్చావు? 379 00:30:50,017 --> 00:30:54,396 నేను మిస్ యోకో సవగుచి కోసం చూస్తున్నాను. ఆమె అనువాదకురాలిగా పనిచేసేవారు. 380 00:30:54,980 --> 00:30:57,024 ఆమె మా నాయనమ్మ. 381 00:30:57,524 --> 00:31:01,403 ఇది ఆమె ఇల్లే. కానీ ఆమె హకొనెలో ఒక స్పా కి వెళ్లారు. 382 00:31:01,987 --> 00:31:03,614 ఆమె రేపు తిరిగి వస్తుంది. 383 00:31:04,156 --> 00:31:05,991 అయితే నేను రేపు మళ్లీ వస్తాను. 384 00:31:05,991 --> 00:31:07,784 నీ కోసం నేను ఎదురుచూస్తుంటాను. 385 00:31:09,161 --> 00:31:11,663 నా పేరు అయామె. 386 00:31:11,663 --> 00:31:12,915 అయామె. 387 00:31:14,041 --> 00:31:15,459 - త్వరలో కలుస్తాను. - ఉంటాను. 388 00:31:21,006 --> 00:31:22,382 గుడ్ మార్నింగ్, కమీల్. 389 00:31:22,382 --> 00:31:24,676 - ఎలా ఉన్నావు? బాగా నిద్రపోయావా? - అవును. 390 00:31:24,676 --> 00:31:25,802 థోమాస్ ఎక్కడ? 391 00:31:25,802 --> 00:31:29,223 ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసు. "బాటిల్స్ ఎంపిక" కోసం లొరెంజో తీసుకువెళ్లాడు. 392 00:31:31,767 --> 00:31:33,185 ఇతను నా స్నేహితుడు, జాక్స్. 393 00:31:34,853 --> 00:31:35,938 కమీల్! 394 00:31:36,897 --> 00:31:39,650 నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు జాక్స్ ఫ్యూజియర్. 395 00:31:40,192 --> 00:31:43,529 ఎంతోకాలంగా మీ నాన్న ప్రచురణకర్తని. 396 00:31:44,279 --> 00:31:46,156 నీ చిన్నతనం నుండి నువ్వు నాకు తెలుసు. 397 00:31:47,032 --> 00:31:48,742 నీ గురించి లూకా చాలా విషయాలు చెప్పాడు. 398 00:31:49,576 --> 00:31:52,788 అతను ఎవరి గురించి అయినా ఇంత ఉత్సాహంగా చెప్పడం నేను ఎప్పుడూ చూడలేదు. 399 00:31:53,455 --> 00:31:56,291 - నువ్వు వైన్ రంగంలో మొజార్ట్ లాంటి దానివి అంటాడు. - లేదు, ఆయన అతిగా పొగుడుతున్నాడు. 400 00:31:57,668 --> 00:32:01,630 లీజియర్ కుటుంబంలో ఈ వినమ్రత నాకు అలవాటే. 401 00:32:01,630 --> 00:32:03,423 ఇది చూశావా? 402 00:32:03,423 --> 00:32:06,593 ఇది 2001లో నేను ఇంకా అలెగ్జాండర్, 403 00:32:06,593 --> 00:32:09,847 అప్పుడు మేము లీజియర్ గైడ్ ఎనిమిదో ప్రచురణ సందర్భంగా వేడుక చేసుకున్నాం. 404 00:32:10,347 --> 00:32:11,890 అది ఒక చిరస్మరణీయమైన సాయంత్రం. 405 00:32:11,890 --> 00:32:16,979 ఒక ప్రచురణకర్తగా, నేను దాచలేని నిజం ఏమిటంటే మీ నాన్న గైడ్ నాకు అత్యంత గర్వకారణం. 406 00:32:18,105 --> 00:32:19,773 నేను అందుకు మీ అమ్మకి రుణపడి ఉంటాను. 407 00:32:21,108 --> 00:32:22,401 చాలా తెలివైన మహిళ. 408 00:32:23,402 --> 00:32:25,487 చాలా హుషారుగా ఉండేది. అసాధారణమైన మహిళ. 409 00:32:25,487 --> 00:32:28,657 మీ నాన్నకి తొలి రోజుల్లో మీ అమ్మ సాయం లేకపోయి ఉంటే, 410 00:32:28,657 --> 00:32:30,868 ఆయన ఎప్పటికీ తను ఉన్న స్థానానికి వచ్చి ఉండేవాడే కాదు. 411 00:32:30,868 --> 00:32:32,619 నేను నీకు ఏదీ కొత్తగా ఏమీ చెప్పడం లేదు. 412 00:32:32,619 --> 00:32:34,705 ఆమె నీకు ఇవన్నీ ఒక వెయ్యిసార్లయినా చెప్పి ఉంటుంది. 413 00:32:34,705 --> 00:32:35,789 అవును. 414 00:32:35,789 --> 00:32:37,916 కమీల్! నువ్వు లోపలికి వస్తావా? 415 00:32:38,584 --> 00:32:39,668 సరే. 416 00:32:40,669 --> 00:32:41,670 ఏంటి? 417 00:32:44,923 --> 00:32:46,008 వచ్చి కూర్చో. 418 00:32:52,848 --> 00:32:54,933 మా కోసం ఈ వైన్ ని ఒకసారి రుచి చూస్తావా, ప్లీజ్? 419 00:32:56,226 --> 00:32:58,520 లూకా, నేను ప్రదర్శనలు చేసేదాన్ని కాదు. 420 00:32:58,520 --> 00:33:00,564 ఖచ్చితంగా కాదు. సారీ. 421 00:33:01,106 --> 00:33:02,608 నువ్వు ఏదీ అంచనా వేయనక్కరలేదు. 422 00:33:02,608 --> 00:33:05,152 మేము కేవలం నీ అభిప్రాయం గురించి ఆసక్తిగా ఉన్నాం. 423 00:33:08,906 --> 00:33:09,948 ప్లీజ్. 424 00:33:13,160 --> 00:33:14,203 సరే. 425 00:33:34,932 --> 00:33:37,518 వావ్. ఇది గొప్పగా ఉంది. 426 00:33:38,435 --> 00:33:41,980 సూర్యుడు ఉన్నాడు, కానీ అదే సమయంలో చల్లగా కూడా ఉంది. విచిత్రంగా. 427 00:33:43,815 --> 00:33:47,653 బ్లాక్ బెరీ, మొరెల్లో చెర్రీ, కాంబోడియన్ మిరియాలు, ఇంకా... 428 00:33:48,612 --> 00:33:49,947 థాయ్ మిరపకాయి. 429 00:33:50,822 --> 00:33:52,574 మాల్బెక్ ద్రాక్ష వెరైటీ, 430 00:33:53,450 --> 00:33:54,785 కానీ ఇది నాకు తెలిసిన వెరైటీ కాదు. 431 00:33:57,371 --> 00:33:59,831 బహుశా మరింత ఎత్తయిన ప్రదేశంలో పండించిన ద్రాక్ష వెరైటీ కావచ్చు. 432 00:34:01,208 --> 00:34:04,336 ఆండియన్ పర్వతాలలో, కావచ్చు. 433 00:34:18,433 --> 00:34:21,103 - ఓహ్, చెత్త. ఇది ఏంటి? - ఏం అయింది? 434 00:34:31,237 --> 00:34:33,907 ఇది ఎంత బాగుంది అంటే నాకు సంగీతం వినిపిస్తోంది. 435 00:34:42,791 --> 00:34:45,043 ఇది భలే రుచిగా ఉంది. 436 00:34:45,918 --> 00:34:48,672 పూర్తిగా క్రేజీగా ఉంది. 437 00:34:54,094 --> 00:34:55,888 నేను ఏదైనా పిచ్చిగా మాట్లాడానా? 438 00:34:57,973 --> 00:34:59,016 లేదు. 439 00:35:00,267 --> 00:35:01,810 కమీల్, ఈ వైన్... 440 00:35:03,520 --> 00:35:05,230 మీ నాన్న కనిపెట్టాడు. 441 00:35:06,148 --> 00:35:09,151 ఇది నిజానికి అర్జెంటీనాలో, మెండోజా ప్రాంతంలో, 442 00:35:09,651 --> 00:35:12,279 ఆండిస్ లో కొన్ని వేల మీటర్ల ఎత్తులో పండించిన ద్రాక్ష వెరైటీ. 443 00:35:12,279 --> 00:35:14,907 నువ్వు చెప్పినట్లే, ఈ ద్రాక్ష వెరైటీ పేరు మాల్బెక్. 444 00:35:16,909 --> 00:35:18,660 మీ నాన్నకి ఈ వైన్ అంటే ఇష్టం. 445 00:35:19,369 --> 00:35:21,914 ఆయన ఇది పూర్తిగా "క్రేజీ"గా ఉందని కనిపెట్టాడు. 446 00:35:22,581 --> 00:35:24,917 - అతను అదే మాట అన్నాడు, "క్రేజీ" అని. - "క్రేజీ," అవును. 447 00:35:24,917 --> 00:35:26,460 - కదా, జాక్స్? - అవును. 448 00:35:26,460 --> 00:35:29,796 చూడు, లీజియర్ గైడ్ ఇలాగే ఉంటుంది. 449 00:35:31,215 --> 00:35:34,801 నువ్వు రుచి చూసే వైన్ రకాల గురించి నిజాయితీగా నీ అభిప్రాయాన్ని చెప్పడమే. 450 00:35:36,136 --> 00:35:37,179 ఇంకేమీ లేదు. 451 00:35:38,680 --> 00:35:40,307 మరి, నువ్వు ఏం అంటావు? 452 00:35:45,687 --> 00:35:47,314 నేను దాని గురించి ఆలోచిస్తాను. 453 00:35:51,443 --> 00:35:52,486 జాక్స్. 454 00:35:52,986 --> 00:35:55,239 మేము నీ కోసం ఒక చిన్న సర్ ప్రైజ్ ని సిద్ధం చేశాం. 455 00:35:55,239 --> 00:35:58,325 ఇది కేవలం ఒక నమూనా, అనుకో, అది... 456 00:35:58,951 --> 00:36:00,244 మనం దీన్ని ఏం అనచ్చు? 457 00:36:00,744 --> 00:36:02,871 ఇది ఈ ఐడియాని ముందుకు తీసుకువెళ్లడానికి. 458 00:36:03,372 --> 00:36:05,499 అవును, అది ఒక ఐడియా. 459 00:36:05,499 --> 00:36:07,668 ఈ ఐడియాని ముందుకు తీసుకువెళ్లడం కోసం. 460 00:36:30,107 --> 00:36:32,860 - హేయ్. - నిద్రించే అందమా, నువ్వు ఆలస్యం అయ్యావు. 461 00:36:32,860 --> 00:36:34,945 - సారీ. - రాత్రి నిద్రపోలేదా, హా? 462 00:36:34,945 --> 00:36:37,406 లేదు, అంతగా మేలుకొని లేను, అదేమీ కాదు. 463 00:36:37,906 --> 00:36:41,201 నేను ఒక మీటింగ్ కి వెళ్లాను. లాయర్ల గొడవ. నీకు చెప్పి ఉండాల్సింది, సారీ. 464 00:36:43,954 --> 00:36:45,414 మనకి ఇవి ఎన్ని వచ్చాయి? 465 00:36:46,206 --> 00:36:48,208 లాంబోర్డీలో మాకు దొరికిన ప్రతీ వైన్ రకాన్ని మేము ఆర్డర్ చేశాము. 466 00:36:48,208 --> 00:36:50,669 ఇంకా అన్నట్లు, మియబీ ఇంకా నేను పెళ్లి చేసుకోబోతున్నాం. 467 00:36:51,170 --> 00:36:53,255 సరే, కానీ నేను అలా అనుకోవడం లేదు. 468 00:36:54,298 --> 00:36:55,382 మేము ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటాం. 469 00:36:55,382 --> 00:36:56,508 ఒక విషయం మాట్లాడచ్చా? 470 00:36:56,508 --> 00:36:59,386 - అది నాకు తెలుసు. నీకు తెలుసు. - ఓహ్, నీకు తెలుసా? నిజంగానా? 471 00:36:59,386 --> 00:37:01,930 అవును. 472 00:37:02,639 --> 00:37:06,268 మీ పేరెంట్స్ ని కలవడానికి నన్ను ఎప్పుడు తీసుకువెళ్తున్నావు, హా? 473 00:37:19,156 --> 00:37:20,199 మనం బాగానే ఉన్నామా? 474 00:37:21,783 --> 00:37:23,619 అవును, బాగానే ఉన్నాం. అలా ఎందుకు అడుగుతున్నావు? 475 00:37:24,203 --> 00:37:25,412 అంటే, 476 00:37:26,413 --> 00:37:27,456 అది మంచి విషయం. 477 00:37:32,836 --> 00:37:35,881 కొంతమంది అమ్మాయిలు తప్పుగా అర్థం చేసుకుని నా మీద కోపం తెచ్చుకునేవారు 478 00:37:36,882 --> 00:37:37,883 అది కూడా అకారణంగా, 479 00:37:37,883 --> 00:37:40,135 ఎందుకంటే మొదటి నుండి నేను మరొకరితో సంబంధంలో ఉన్నాననేది స్పష్టం కదా. 480 00:37:40,135 --> 00:37:41,678 అవును, అది చాలా స్పష్టం. 481 00:37:42,930 --> 00:37:44,848 నేను నీకు ఫోన్ చేయడం గురించి మర్చిపోతాను ఇంకా నాకు సాయం చేయడానికి 482 00:37:44,848 --> 00:37:46,558 నువ్వు వెంటనే విమానంలో వచ్చేశావని కూడా మర్చిపోతాను. 483 00:37:48,227 --> 00:37:50,896 ఇంకా నువ్వు అప్పుడప్పుడు నా వైపు చూసే చూపుల్ని కూడా మర్చిపోతాను 484 00:37:50,896 --> 00:37:52,731 అవి అస్సలు అమాయకంగా లేకపోయినా సరే. 485 00:37:53,440 --> 00:37:55,484 నేను నిన్ను గమనిస్తాను, తెలుసుకో. 486 00:37:57,486 --> 00:37:59,613 కాబట్టి, లేదు, నువ్వు నన్ను దూరంగా తోసేసినా కూడా వ్యక్తిగతంగా తీసుకోను 487 00:37:59,613 --> 00:38:01,532 ఎందుకంటే మన మధ్య స్పష్టంగా ఏదో అనుబంధం ఉంది. 488 00:38:01,532 --> 00:38:03,951 - నేను దానికి చాలా అతీతంగా ఉంటాను. - కమీల్, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. 489 00:38:03,951 --> 00:38:06,036 అవును, నాకు అర్థమైంది. అది నీకు మంచిది. 490 00:38:07,621 --> 00:38:09,039 మనం ఇంక ఏదైనా విషయం మాట్లాడుకుందామా? 491 00:38:12,960 --> 00:38:14,920 నీ కార్యనిర్వాహక సమావేశం దేని గురించి? 492 00:38:18,006 --> 00:38:19,716 అది నీకు చెప్పవచ్చో లేదో నాకు తెలియదు. 493 00:38:20,884 --> 00:38:21,927 ఇలా చూడు. 494 00:38:25,556 --> 00:38:26,598 నువ్వు ఎవ్వరికీ చెప్పవు కదా? 495 00:38:31,311 --> 00:38:33,522 లీజియర్ గైడ్ బాధ్యతని తీసుకోమని నాకు అవకాశం ఇచ్చారు. 496 00:38:40,988 --> 00:38:42,406 నిజంగానే చెబుతున్నావా? 497 00:38:42,406 --> 00:38:44,032 అవును, నిజంగానే. అందులో అంత నవ్వొచ్చేది ఏం ఉంది? 498 00:38:44,032 --> 00:38:46,493 సారీ, కానీ... 499 00:38:48,245 --> 00:38:50,706 కానీ, కమీల్, నువ్వు లీజియర్ గైడ్ బాధ్యత తీసుకోలేవు. 500 00:38:50,706 --> 00:38:51,832 అవునా, ఎందుకని? 501 00:38:52,833 --> 00:38:53,917 నా మాటల్ని తప్పుగా అనుకుంటున్నావు. 502 00:38:53,917 --> 00:38:56,837 లేదు, లేదు, ఆగు. నేను తప్పుగా అనుకోవడం లేదు. నేను దాన్ని వివరించమని అడుగుతున్నాను. 503 00:38:57,754 --> 00:39:00,924 అటువంటి గైడ్ కి బాధ్యత వహించడం అంటే అది ఎంత పెద్ద విషయమో నీకు తెలుసా? 504 00:39:01,508 --> 00:39:03,427 నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నావా? 505 00:39:03,427 --> 00:39:04,511 ఎందుకు కాదు? 506 00:39:05,804 --> 00:39:08,056 మేలుకో, కమీల్. 507 00:39:08,765 --> 00:39:11,602 నెల రోజుల కింద వైట్ వైన్ కీ, రెడ్ వైన్ కీ తేడా కూడా నీకు తెలియదు. 508 00:39:11,602 --> 00:39:14,271 - అలాగే. - ఇప్పుడు లీజియర్ గైడ్ బాధ్యత తీసుకుంటావా? 509 00:39:14,271 --> 00:39:16,190 నీకు ఒక చక్కని, ఓడిపోయే కమీల్ నచ్చుతుంది, కదా? 510 00:39:16,190 --> 00:39:18,400 లేదు, లేదు, లేదు. పిచ్చిగా మాట్లాడకు. 511 00:39:18,942 --> 00:39:22,154 కమీల్, నీకు చక్కని ప్రతిభ ఉంది. నేను చూసిన అందరిలో చాలా ప్రతిభావంతురాలివి నువ్వే. 512 00:39:22,154 --> 00:39:25,824 కానీ నువ్వు నేర్చుకోవలసింది ఇంకా ఉంది. నీకు అన్నీ తెలుసు అని మాత్రం నాకు చెప్పకు. 513 00:39:25,824 --> 00:39:28,744 నేను ఇది నమ్మలేకపోతున్నాను. నా కోసం కనీసం రెండు నిమిషాలైనా నువ్వు సంతోషపడలేవా? 514 00:39:29,244 --> 00:39:31,997 నేను ఆ గైడ్ బాధ్యత తీసుకోవాలన్నది మా నాన్న కోరిక. 515 00:39:31,997 --> 00:39:33,123 నువ్వు అలా అనుకుంటున్నావా? 516 00:39:35,334 --> 00:39:36,793 అలెగ్జాండర్ కోరిక గనుక అదే అయితే, 517 00:39:36,793 --> 00:39:39,421 తన వారసత్వం కోసం ఒక అపరిచితుడితో నువ్వు పోటీ పడేలా ఆయన ఎందుకు చేస్తున్నాడు? 518 00:39:40,672 --> 00:39:42,257 నీకు నేరుగా ఆయన అదంతా ఎందుకు ఇచ్చేయలేదు? 519 00:39:42,257 --> 00:39:44,593 నీకు ఒక మాట చెప్పనా? నా మీద నీకు నమ్మకం లేకపోతే, నువ్వు ఇంక వెళ్లిపోవచ్చు. 520 00:39:45,260 --> 00:39:46,386 నిజంగానే అంటున్నావా? 521 00:39:49,139 --> 00:39:51,517 - నిజంగానే అన్నావా? - అవును. నిజంగానే అంటున్నా. దయచేసి వెళ్లిపో. వెళ్లు. 522 00:39:51,517 --> 00:39:54,144 నీ కోసం నేను ఇంత చేశాక కూడా నువ్వు ఇలా మాట్లాడతున్నావా? 523 00:39:54,144 --> 00:39:56,104 - అవును. - సరే, బై. 524 00:40:11,662 --> 00:40:13,080 నువ్వు అంతా గందరగోళం చేసేశావు. 525 00:40:16,333 --> 00:40:18,293 ప్రేమలో ఉన్నవాళ్లు మూర్ఖంగా ప్రవర్తిస్తారేమో. 526 00:40:21,672 --> 00:40:22,881 ఏం అయింది? 527 00:40:31,723 --> 00:40:33,934 మిస్టర్ టొమినె, మీ గురించి మేము సిద్ధం. 528 00:40:39,356 --> 00:40:43,569 ఈ రోజు మన అతిథి జపాన్ లోనూ, అమెరికాలోనూ ఇంజినీరింగ్ పట్టా పొందిన వాడు. 529 00:40:43,569 --> 00:40:45,445 కానీ ఆ తరువాత తనకి వైన్ అంటే మక్కువ అని గ్రహించాడు. 530 00:40:45,445 --> 00:40:50,784 ప్రముఖ వైన్ గైడ్ రూపకర్త ఇంకా వైన్ శాస్త్ర పితామహుడు, 531 00:40:50,784 --> 00:40:52,870 అలెగ్జాండర్ లీజియర్, స్వయంగా ఈయన ప్రతిభని గుర్తించాడు. 532 00:40:52,870 --> 00:40:55,330 తన వారసులలో ఒకరిగా ఈయనని లీజియర్ ఎంపిక చేసుకున్నారు. 533 00:40:55,914 --> 00:40:58,542 {\an8}ఈయనని తన "మానస పుత్రుడు" అని మిస్టర్ లీజియర్ పిలిచేవారు. 534 00:40:58,542 --> 00:41:01,003 {\an8}ఈ మధ్యకాలంలో ఆయన ప్రధాన వార్తలలో వ్యక్తిగా నిలుస్తున్నాడు. 535 00:41:01,962 --> 00:41:04,631 {\an8}ఇసెయ్ టొమినెకి స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. 536 00:41:06,550 --> 00:41:07,718 {\an8}ఈ సంతోషం అంతా నాది. 537 00:41:07,718 --> 00:41:09,428 {\an8}మా షోకి వచ్చినందుకు ధన్యవాదాలు. 538 00:41:09,928 --> 00:41:13,724 {\an8}మొదటగా, మీ రెండో పరీక్ష గురించి మాకు ఏం చెబుతారు? 539 00:41:13,724 --> 00:41:18,103 {\an8}నేను ఎక్కువ వివరాలు వెల్లడించలేను, కానీ అది ఒక కళాఖండానికి సంబంధించిన పరీక్ష. 540 00:41:18,645 --> 00:41:19,855 {\an8}ఖచ్చితంగా చెప్పాలంటే, అది ఒక పెయింటింగ్. 541 00:41:19,855 --> 00:41:21,315 {\an8}పెయింటింగా? 542 00:41:21,315 --> 00:41:22,482 {\an8}అవును. 543 00:41:22,482 --> 00:41:26,278 {\an8}మిస్టర్ లీజియర్ కి కళల గురించి విశేషమైన అవగాహన ఉంది. 544 00:41:27,779 --> 00:41:31,825 {\an8}సంగీతం, చిత్రకళ ఇంకా సాహిత్యం ఆయనకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి. 545 00:41:32,367 --> 00:41:36,205 {\an8}ఏది అందంగా ఉంటుంది లేదా ఏది మంచిది, ఏది కాదు అనే విషయాలలో ఆయనకు చాలా స్పష్టమైన ఆలోచనలు ఉండేవి. 546 00:41:36,997 --> 00:41:38,916 {\an8}మీరు ఆయనతో సన్నిహితంగా ఉండేవారా? 547 00:41:40,334 --> 00:41:41,376 {\an8}నేను చెప్పగలిగింది ఏమిటంటే, 548 00:41:41,877 --> 00:41:45,881 {\an8}మాది కేవలం గురువు-విద్యార్థి అనుబంధం మాత్రమే. అంతకు మించి ఏమీ లేదు. 549 00:41:45,881 --> 00:41:49,384 {\an8}ఆయనతో వ్యవహారం చాలా కష్టం అని అంటారు. 550 00:41:49,384 --> 00:41:52,846 {\an8}ఆయన గురించి మీరు ఏం అనుకుంటారు? 551 00:41:52,846 --> 00:41:55,432 {\an8}ప్రతి ప్రతిభావంతుడికి ఒక లోపం ఉంటుంది. 552 00:41:56,016 --> 00:41:59,102 {\an8}ఆయన చాలా కఠినంగా ఉండేవాడు ఇంకా తప్పుల్ని సహించేవాడు కాదు. 553 00:42:00,062 --> 00:42:03,315 {\an8}ఒక ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలో ఆయన నాకు నేర్పించాడు. 554 00:42:03,315 --> 00:42:09,154 {\an8}నిన్న, మీ తాతగారు మీకు మద్దతు ప్రకటించారు. 555 00:42:09,821 --> 00:42:11,031 {\an8}అది విని మీరు సంతోషించారా? 556 00:42:11,949 --> 00:42:16,119 మా తాతగారు హృదయం లేని వాడని, క్రూరుడని కొందరు అంటారు, 557 00:42:16,119 --> 00:42:17,412 కానీ అది నిజం కాదు. 558 00:42:17,913 --> 00:42:20,332 రక్తసంబంధాలు చాలా విలువైనవి. 559 00:42:20,916 --> 00:42:24,503 మనం ప్రేమించే మనుషుల్ని వాళ్లని వాళ్లగానే మనం ఇష్టపడతాం, 560 00:42:24,503 --> 00:42:27,172 కానీ మనకి నచ్చినట్లు వాళ్లు ఉండాలని కోరుకోము. 561 00:42:27,673 --> 00:42:31,176 బుర్రలేని వాళ్లు, మూర్ఖులు అది అర్థం చేసుకోలేరు, 562 00:42:31,844 --> 00:42:34,763 కానీ అతను ఖచ్చితంగా అందరికీ భిన్నమైన వాడు. 563 00:42:35,722 --> 00:42:40,060 ఒక కుటుంబం ఇంకా ప్రేమించే మనుషుల సహకారం ఖచ్చితంగా చాలా అవసరం. 564 00:42:40,936 --> 00:42:44,398 మా తాతగారికి అందరికంటే ఎక్కువగా ఈ విషయం తెలుసు. 565 00:42:45,983 --> 00:42:51,238 మీరు ఈ పోటీని ఓడిపోతే, టొమినె డైమండ్స్ వ్యాపార బాధ్యతలు తీసుకుంటారా? 566 00:42:52,614 --> 00:42:55,409 వజ్రాలు, వైన్ రెండూ విరుద్ధమైనవి. 567 00:42:56,326 --> 00:42:57,911 ఖనిజాలు ఇంకా ఆర్గానిక్ ఉత్పత్తుల మధ్య తేడా అది. 568 00:42:59,204 --> 00:43:01,999 వజ్రాలు మార్పునకు లోను కానివి ఇంకా అనంత కాలానికి సూచికలు. 569 00:43:01,999 --> 00:43:03,125 వైన్ దానికి భిన్నమైనది. 570 00:43:03,625 --> 00:43:05,669 నా ప్రశ్నకు మీరు ఇంకా సమాధానం చెప్పలేదు. 571 00:43:06,962 --> 00:43:08,046 నా జవాబు లేదు అని. 572 00:43:09,923 --> 00:43:14,887 దీని ఫలితం ఎలా ఉన్నా కూడా, మా సంస్థ బాధ్యతల్ని నేను తీసుకోను. 573 00:43:16,680 --> 00:43:18,432 మన కార్యక్రమం దాదాపు ముగిసిపోవచ్చింది. 574 00:43:18,432 --> 00:43:20,184 మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? 575 00:43:25,022 --> 00:43:30,360 నేను మా నాన్నగారు, హిరోకజు టొమినెకి థాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. 576 00:43:31,737 --> 00:43:33,947 అందరి కన్నా ఎక్కువగా, ఆయన, 577 00:43:34,531 --> 00:43:36,742 నేను ఏమిటో అర్థం చేసుకున్నారు ఇంకా నాకు ఏం కావాలో తెలుసుకున్నారు. 578 00:43:39,620 --> 00:43:41,455 {\an8}ఆయన నాకు చాలా ముఖ్యం. 579 00:43:43,582 --> 00:43:47,878 {\an8}ఆయన కొడుకు కావడం నాకు గర్వకారణం. 580 00:43:55,010 --> 00:43:56,178 చాలా ధన్యవాదాలు. 581 00:44:23,580 --> 00:44:24,998 థోమాస్? 582 00:44:27,543 --> 00:44:28,585 లోపల ఉన్నావా? 583 00:44:34,842 --> 00:44:35,884 థోమాస్? 584 00:44:38,971 --> 00:44:40,180 సారీ. 585 00:44:45,727 --> 00:44:47,479 అతను వెళ్లిపోయాడు. 586 00:45:34,818 --> 00:45:36,069 వస్తున్నాను. 587 00:45:40,449 --> 00:45:42,451 మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. నా పేరు ఇసెయ్ టొమినె. 588 00:45:42,451 --> 00:45:44,411 హలో, మిస్టర్ ఇసెయ్. 589 00:45:45,204 --> 00:45:47,956 మా మనవరాలు మీ గురించి చెప్పింది. లోపలికి రండి. 590 00:45:49,291 --> 00:45:54,379 లీజియర్ క్లాస్ గురించి అన్ని విషయాలు అక్కడే రాశారు. 591 00:45:56,173 --> 00:45:59,218 మీ తల్లిదండ్రులు అన్ని క్లాసులకి వచ్చేవారు. 592 00:46:04,181 --> 00:46:06,808 మా తల్లిదండ్రులు మీకు గుర్తున్నారు. 593 00:46:10,771 --> 00:46:15,400 మీరు దానిని మీతో తీసుకువెళ్లి ఇంటి వద్ద నిదానంగా చదువుకోవచ్చు. 594 00:46:16,985 --> 00:46:20,572 లేదా మీరు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడవచ్చు. 595 00:46:22,032 --> 00:46:26,411 కానీ మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే, 596 00:46:27,037 --> 00:46:30,165 ఒక నిజాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. 597 00:46:32,751 --> 00:46:36,296 ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం. 598 00:46:45,681 --> 00:46:48,934 మిమ్మల్ని వేచి ఉంచినందుకు సారీ. 599 00:46:54,356 --> 00:46:55,399 ఇదిగో తీసుకోండి. 600 00:46:55,899 --> 00:46:56,942 థాంక్యూ. 601 00:46:59,903 --> 00:47:02,948 మీకు నా తల్లిదండ్రులు తెలుసా? 602 00:47:05,826 --> 00:47:08,829 "తెలుసు" అనేది పెద్ద పదం. 603 00:47:09,705 --> 00:47:13,750 మేము కొద్దినెలలు కలిసి ఉన్నాం అనడం మేలు. 604 00:47:13,750 --> 00:47:18,338 మిస్టర్ లీజియర్ క్లాసులలో ఆయన పాఠాల్ని నేను అనువదిస్తుండే దాన్ని. 605 00:47:20,007 --> 00:47:21,675 ఒక అనువాదకురాలిగా. 606 00:47:22,426 --> 00:47:25,387 నేను గోప్యంగా దాదాపుగా అదృశ్యంగా ఉండేదాన్ని. 607 00:47:32,644 --> 00:47:33,729 కానీ, 608 00:47:34,855 --> 00:47:40,360 మనం అదృశ్యంగా ఉన్నప్పుడు చాలా విషయాలు చూడగలుగుతాము. 609 00:47:42,279 --> 00:47:45,282 మీరు ఏం చూశారు? దయచేసి నాకు చెప్పండి. 610 00:47:47,075 --> 00:47:50,954 మీరు చాలా తీవ్రమైన ఆకాంక్షలు ఉన్న వ్యక్తిగా నేను చూడగలుగుతున్నాను. 611 00:47:51,872 --> 00:47:53,832 హొనోకా మాదిరిగా. 612 00:47:56,752 --> 00:47:59,296 మా అమ్మ ఎలాంటి విద్యార్థినిగా ఉండేది? 613 00:48:01,673 --> 00:48:03,800 మిగతా విద్యార్థులందరిలో ఆమె వెలిగిపోయేది. 614 00:48:05,010 --> 00:48:09,598 ఆమె తెలివైనది ఇంకా సొంత అభిప్రాయాలు కలిగి ఉండేది. 615 00:48:10,516 --> 00:48:15,187 ఆమె ఎప్పుడూ రాజీ పడేది కాదు ఇంకా తెలివితో వ్యవహరించేది. 616 00:48:17,898 --> 00:48:20,067 మరి మా నాన్న సంగతి ఏంటి? 617 00:48:20,859 --> 00:48:26,448 అతను కూడా మీ అమ్మ మాదిరిగానే, చాలా తీవ్రమైన పట్టుదల ఉన్న వ్యక్తి. 618 00:48:27,407 --> 00:48:28,742 పట్టుదలా? 619 00:48:30,869 --> 00:48:33,247 వాళ్లిద్దరిలో ఏదైనా చేయాలన్న తపన బలంగా ఉండేది. 620 00:48:34,122 --> 00:48:37,876 వాళ్లు అందరి దృష్టిని ఆకర్షించేవారు. 621 00:48:38,877 --> 00:48:42,798 కానీ వాళ్లు ఒకరినొకరు ఇష్టపడేవారు. 622 00:48:43,757 --> 00:48:49,805 వాళ్ల ప్రేమ ఇలా మీ రూపం దాల్చడం నేను చూస్తున్నాను. 623 00:48:51,682 --> 00:48:55,269 కానీ మా తల్లిదండ్రులు ఎప్పుడూ ఒకరినొకరు ప్రేమించుకోరని నాకు అనిపించేది. 624 00:48:56,854 --> 00:49:02,943 కానీ అతను నిజానికి తన క్లాస్ కేవలం ఆమె కోసమే ఇచ్చేవాడు అనిపించేది. 625 00:49:04,903 --> 00:49:08,615 మీ ఉద్దేశం ఏమిటి? మా నాన్న కూడా విద్యార్థే కదా, కాదంటారా? 626 00:49:19,793 --> 00:49:21,962 మిస్టర్ హిరోకజు ఒనొయమ, 627 00:49:23,213 --> 00:49:27,259 అతను, మీ అమ్మ ఎప్పుడూ కలిసే ఉండేవారు. 628 00:49:27,259 --> 00:49:29,136 అతను మీ అమ్మని కంటికి రెప్పలా చూసుకునేవాడు. 629 00:49:30,971 --> 00:49:37,186 వాళ్లు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని తెలిసి మిస్టర్ ఒనోయమ కుమిలిపోయాడు. 630 00:49:38,770 --> 00:49:40,147 ఒక ఉదయం, 631 00:49:41,815 --> 00:49:47,821 యూనివర్సిటీ ఆవరణలో అతను తప్పతాగి పడి ఉన్నాడు. 632 00:49:49,990 --> 00:49:51,617 అతని కారణంగానే... 633 00:49:53,660 --> 00:49:58,415 మిస్టర్ లీజియర్ ఉద్యోగం పోయింది. 634 00:50:00,417 --> 00:50:02,419 కొద్ది నెలల తరువాత, 635 00:50:03,837 --> 00:50:08,717 హొనోకా ఇంకా హిరోకజు పెళ్లి చేసుకుంటున్నారని తెలిసింది. 636 00:50:10,844 --> 00:50:12,804 నేను చాలా ఆశ్చర్యపోయాను. 637 00:50:15,224 --> 00:50:16,934 ఇది వినడానికి మీకు కష్టంగానే ఉంటుంది. 638 00:50:19,061 --> 00:50:20,062 కానీ... 639 00:50:21,939 --> 00:50:25,651 మీ అమ్మ గాఢంగా ప్రేమించిన వ్యక్తి మిస్టర్ లీజియర్ అని నేను గ్రహించాను. 640 00:50:27,694 --> 00:50:32,366 అందుకే ఆయన వారసత్వ సంపదని గెలుచుకునే అవకాశం... 641 00:50:35,369 --> 00:50:37,454 మీకు ఇవ్వాలని ఆయన అనుకుని ఉండచ్చు. 642 00:50:44,670 --> 00:50:45,921 మేలుకో! 643 00:50:50,801 --> 00:50:53,679 నీ కోసం ఏదో వండాను. 644 00:50:53,679 --> 00:50:55,806 నువ్వు ఖాళీ కడుపుతో ప్రయాణం చేయలేవు. 645 00:50:58,058 --> 00:50:59,351 అవునా? 646 00:51:13,657 --> 00:51:15,284 ఆరోగ్యం జాగ్రత్త. 647 00:52:10,964 --> 00:52:12,591 కమీల్ లీజియర్ 648 00:52:31,193 --> 00:52:32,611 తడాషి ఆగి/షు ఒకిమోటో రాసిన కమి నో షిజుకు ఆధారంగా 649 00:52:50,128 --> 00:52:52,130 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్