1 00:00:46,421 --> 00:00:48,006 - హాయ్, ఎలా ఉన్నారు? - బానే ఉన్నాను. 2 00:00:48,006 --> 00:00:50,676 చాలా దూరం డ్రైవ్ చేసి వచ్చాననుకోండి... అయినా, మీరెలా ఉన్నారు? 3 00:00:50,676 --> 00:00:52,803 బాగున్నాను. నేను మీకు ఎలా సహాయపడగలను? 4 00:00:52,803 --> 00:00:55,305 అంటే, మీ దగ్గర తాగటానికి ఏమేమి ఉన్నాయి? 5 00:00:55,806 --> 00:01:00,185 ఈ ట్యాప్స్ చూశారా? వీటిమీద బీర్ పేర్లు ఉన్నాయి. 6 00:01:00,185 --> 00:01:01,270 అవే ఉన్నాయి... 7 00:01:01,270 --> 00:01:03,355 - అవి ఉన్నాయన్నమాట. బాగుంది. - ఆ. 8 00:01:03,355 --> 00:01:04,438 అయితే, 9 00:01:04,438 --> 00:01:06,191 మీకేది ఇష్టమో చెప్పరాదూ? 10 00:01:06,191 --> 00:01:07,734 నాకు ఏది ఇష్టమో నేనే చెప్పలేను. 11 00:01:07,734 --> 00:01:10,362 నాకు ఈ బీర్స్ అన్నీ నచ్చుతాయి. 12 00:01:10,988 --> 00:01:12,364 లాగర్ తీసుకుంటారా పోనీ? 13 00:01:12,364 --> 00:01:15,200 - బాగుంటుంది. మంచిది. - సరే, అయితే, ఇప్పుడే ఇస్తాను. 14 00:01:15,200 --> 00:01:17,786 మీ ఐడీ చూపించిన వెంటనే. 15 00:01:18,912 --> 00:01:20,539 - మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తోంది. - కదా? 16 00:01:20,539 --> 00:01:23,584 ఎందుకంటే తాగే వయసుకంటే ఎక్కువ వయసులాగే ఉన్నారులే. 17 00:01:23,584 --> 00:01:26,587 మంచిదే. ఇలా నన్ను ఎవరైనా అడిగితే నాకూ ఇష్టమే. కాలేజీ రోజులు గుర్తొస్తాయి. 18 00:01:26,587 --> 00:01:27,796 అంతేగా మరి? 19 00:01:28,714 --> 00:01:29,548 ఇదిగో. 20 00:01:29,548 --> 00:01:30,757 డ్రైవింగ్ లైసెన్స్ కోవాక్ బ్యూ 21 00:01:31,925 --> 00:01:33,760 కొద్దిగా ఆ బొటనవేలిని తీస్తారా? 22 00:01:36,680 --> 00:01:39,516 మీ వయసేమో 40. వావ్. 23 00:01:39,516 --> 00:01:43,812 ఈ వయసులో కూడా ఇలా ఉన్నారంటే, "బ్యూ కోవాక్." ఏమిటి మీ సౌందర్య రహస్యం? 24 00:01:45,355 --> 00:01:49,318 హెయిర్ ప్లగ్స్ పెట్టించుకున్నాను. బోటాక్స్ చికిత్స కూడా. క్రయోథెరపీ కూడా. 25 00:01:49,318 --> 00:01:50,777 నీ అసలు పేరేంటి? 26 00:01:52,487 --> 00:01:56,283 కోల్టన్. కోవాక్. ఆయన మా నాన్న. 27 00:01:57,618 --> 00:01:59,995 ఇది నువ్వు తెచ్చావని మీ నాన్నకి తెలుసా, కోల్టన్ కోవాక్? 28 00:01:59,995 --> 00:02:01,997 తన ట్రక్ తెచ్చేశానని కూడా తెలియదు. 29 00:02:02,664 --> 00:02:04,541 వాహన దొంగవన్నమాట. బాగుందే. 30 00:02:04,541 --> 00:02:09,338 - తిరిగి తీసుకువెళ్లిపోతాను. బహుశా. - బహుశానా? 31 00:02:12,174 --> 00:02:14,635 ఏమో. నా ఊరంటే నాకు విరక్తిగా ఉంది. 32 00:02:15,219 --> 00:02:18,263 అర్థంలేని పనులు చేసే అర్థంలేని మనుషులతో ఊరంతా నిండిపోయింది. 33 00:02:21,808 --> 00:02:23,435 ఎక్కడైనా అంతే. 34 00:02:24,061 --> 00:02:26,313 నీకు అప్పుడే అది అర్థమవ్వటం విచిత్రం. 35 00:02:26,313 --> 00:02:29,816 కదా? కనుక మీరు కనీసం బీర్ ఇస్తే నాకు సాయం చేసినట్టు. 36 00:02:39,409 --> 00:02:41,078 సరే, ఇది ఏల్. 37 00:02:44,248 --> 00:02:45,791 - చీర్స్. - చీర్స్. 38 00:02:50,295 --> 00:02:51,588 జింజర్ ఏల్. 39 00:02:51,588 --> 00:02:55,008 - జింజర్ ఏల్. అన్ని ఏల్స్ కంటే శ్రేష్ఠమైనది. - అవును. బాగుంది. 40 00:02:55,008 --> 00:02:57,010 ఇది నేను ఉంచుకోవలసివస్తాను. తెలుసుగా? 41 00:02:59,054 --> 00:03:01,014 - మీ బాత్రూమ్ వాడుకోవచ్చా? - తప్పకుండా. 42 00:03:01,014 --> 00:03:02,099 థాంక్స్. 43 00:03:09,439 --> 00:03:13,652 మార్ఫో జీవితంలో మీరు ఏం సాధించగలరో తెలుసుకోండి 44 00:03:21,493 --> 00:03:23,078 - హే, నేనిక వెళ్ళాలి. - కదా మరి? 45 00:03:23,078 --> 00:03:26,498 ఇంట్లో భార్యాబిడ్డలు ఎదురుచూస్తూ ఉంటారు. పెళ్ళానికి కోపం తెప్పిస్తే అంతే ఇంక. 46 00:03:28,792 --> 00:03:30,377 నిన్ను కలవటం సంతోషంగా ఉంది. 47 00:03:32,337 --> 00:03:33,589 జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి. 48 00:04:15,964 --> 00:04:18,550 ఛ. ఇంకో చుక్క. 49 00:04:19,134 --> 00:04:20,344 ఛ. 50 00:04:57,589 --> 00:05:00,509 డీర్ఫీల్డ్ కు స్వాగతం నగర పరిధి 51 00:05:03,178 --> 00:05:04,847 కోల్టన్ 52 00:05:43,468 --> 00:05:46,680 హే. బ్యూ కోవాక్. 53 00:05:46,680 --> 00:05:49,558 అవును. ఆయన మా నాన్న. 54 00:05:49,558 --> 00:05:52,186 తెలుసు. హెయిర్ ప్లగ్స్ ఎలా పనిచేస్తున్నాయి? 55 00:05:57,774 --> 00:06:01,653 సారీ, నాకు కొంచెం... పని ఉంది 56 00:06:08,952 --> 00:06:10,537 - జేకబ్ స్నేహితురాలివా? - ఏంటి? 57 00:06:11,788 --> 00:06:12,915 లేదు, నేను... 58 00:06:15,167 --> 00:06:17,920 అతనికి అన్నో తమ్ముడో ఉన్నాడా? 59 00:06:19,421 --> 00:06:23,509 ఉండేవాడు. మీరు ఈ ఊరికి కొత్తేమో. 60 00:06:24,801 --> 00:06:25,636 అవును. 61 00:06:26,887 --> 00:06:28,805 కొంతకాలం ఉంటారని ఆశిస్తున్నాను. 62 00:06:35,145 --> 00:06:36,897 విను, నేను బ్యాంక్ కి వెళ్లితీరాలి. 63 00:06:36,897 --> 00:06:37,814 బెడ్ఫోర్డ్ బార్ 64 00:06:37,814 --> 00:06:39,900 నాకు జాకెట్ కావాలి, హెల్మెట్ కావాలి, గ్లవ్స్ కావాలి. 65 00:06:39,900 --> 00:06:43,111 వేళ్ళులేని గ్లవ్స్ అయితే బాగుంటుంది. కానీ ఉన్నా పర్లేదులే. 66 00:06:43,111 --> 00:06:46,198 కానీ ముందు ఏది వస్తుంది? జాకెట్టా, హార్లీనా? 67 00:06:47,074 --> 00:06:49,368 హే, నువ్వేం అనుకుంటున్నావు, బార్ అమ్మాయి? 68 00:06:49,910 --> 00:06:50,911 సారీ, ఏ విషయం? 69 00:06:53,580 --> 00:06:55,457 నా బలాన్ని అనుసరిస్తున్నాను. 70 00:06:57,668 --> 00:06:58,794 బైకర్ 71 00:07:00,295 --> 00:07:01,922 మీకు అది ఎక్కడిది? 72 00:07:13,475 --> 00:07:17,145 ఏం ఆలోచిస్తున్నావు? ఒక పట్టు పట్టేసేయ్. 73 00:07:38,584 --> 00:07:40,794 మిస్టర్ జాన్సన్. 74 00:07:40,794 --> 00:07:42,004 ఏమని ఉంది? 75 00:07:42,004 --> 00:07:43,797 "తరువాయి దశకి సిద్ధంగా ఉన్నావా?" 76 00:07:48,051 --> 00:07:49,386 అలా ఇదివరకు ఎప్పుడూ జరగలేదు. 77 00:07:52,306 --> 00:07:53,390 ఏంటి? 78 00:08:09,489 --> 00:08:11,950 "అలా ఎప్పుడూ జరగలేదు" అంటే ఏమిటి అర్థం? 79 00:08:11,950 --> 00:08:15,746 - ఇప్పుడు జరిగినదే. మీరేం చేశారు? - మేమేం చేయలేదు. 80 00:08:15,746 --> 00:08:17,206 అందులోంచి ఒక నీలం కాంతి వచ్చింది. 81 00:08:17,206 --> 00:08:20,667 మేము ఆ కాంతిని అనుసరించాము. అంతే. ఇప్పుడు తరువాయి దశకు సిద్ధమేనా అని అడుగుతోంది. 82 00:08:20,667 --> 00:08:23,086 "తరువాయి దశకి సిద్ధంగా ఉన్నావా?" అంటోంది. 83 00:08:23,086 --> 00:08:25,047 - అదేగా అన్నాను? - జియార్జియో, నువ్వు సాధించావు. 84 00:08:25,047 --> 00:08:27,174 నేను పచ్చ బటన్ నొక్కాను కానీ ఏం అవ్వలేదు. 85 00:08:27,174 --> 00:08:30,010 నువ్వు బటన్స్ ఎందుకు నొక్కుతున్నావు? దీనికి మనం వోట్ చేయాలి. 86 00:08:30,010 --> 00:08:31,845 ఇదిగో, ఇక్కడ నీ పెత్తనం ఏం లేదు. 87 00:08:31,845 --> 00:08:34,932 ఊరందరినీ మెషిన్ కి విరుద్ధంగా మార్చబోయినదానివి నువ్వే. 88 00:08:34,932 --> 00:08:37,476 నేను సంభాషణని మొదలుపెట్టాను. దానివల్ల తిరిగి ఆసక్తి పెరిగింది. 89 00:08:38,644 --> 00:08:40,895 మార్ఫో విషయంలో ఏమైనా జరిగిందా? 90 00:08:40,895 --> 00:08:42,523 మీరు ఇది ఆపాల్సివస్తారు. 91 00:08:42,523 --> 00:08:47,152 సారీ, జనులారా. ఇక్కడ అంతా సాధారణ పరిస్థితే ఉంది. 92 00:08:47,152 --> 00:08:49,488 - ఓరి దేవుడా, హానా, నీ వీపు మీద చూడు. - ఏమిటది? 93 00:08:49,488 --> 00:08:50,864 సరే. 94 00:08:51,990 --> 00:08:56,161 ఇక్కడ అసాధారణంగా, విడ్డూరంగా ఉన్నది ఏం లేదు. 95 00:08:56,161 --> 00:08:59,623 కనుక, దయచేసి మీమీ ఇళ్ళకి వెళ్ళండి. 96 00:08:59,623 --> 00:09:02,084 నేను అన్ని బటన్స్ ని నొక్కేశాను. ఏం కాలేదు. 97 00:09:02,084 --> 00:09:04,670 మనం దాని ప్లగ్ ని తీసి మళ్లీ పెడితే పోతుందేమో. 98 00:09:04,670 --> 00:09:06,463 - వద్దు, ప్లగ్ తీయద్దు. - దాని సంగతి చూడండి. 99 00:09:06,463 --> 00:09:08,507 - కెచ్చప్ సీసాని కొట్టినట్టు కొట్టండి. - ఇదేదో బాగుంది. 100 00:09:08,507 --> 00:09:12,970 అవును. హే! మార్ఫో, మేము తర్వాతి దశకి సిద్ధం! 101 00:09:12,970 --> 00:09:15,848 లేకపోతే హానాని అడుగుదాం. 102 00:09:20,352 --> 00:09:22,229 తరువాతి దశకి వెళ్ళటం ఎలా? 103 00:09:23,814 --> 00:09:28,068 నాకది తెలియదు. నాకు తెలిసింది చెప్తాను. 104 00:09:30,654 --> 00:09:31,655 సరే. 105 00:09:33,282 --> 00:09:35,993 నేను ఇక్కడ పనిచేయటానికి వచ్చేసరికే మార్ఫో ఇక్కడ ఉంది. 106 00:09:35,993 --> 00:09:37,244 కానీ అప్పటికి అంత ప్రత్యేకత ఏంలేదు. 107 00:09:37,244 --> 00:09:40,122 అప్పుడప్పుడూ ఎవరైనా దాన్ని వాడేవారు. వాళ్ళ బలం ఏమిటో తెలుసుకొని వెళ్లిపోయేవాళ్ళు. 108 00:09:40,122 --> 00:09:42,165 తర్వాత వాళ్ళకి ఏమయ్యిందో నాకెప్పుడూ తెలియలేదు. 109 00:09:45,544 --> 00:09:48,422 సారీ, హానా. నాకు విస్కీ తాగే అలవాటు లేదు. 110 00:09:48,422 --> 00:09:51,175 - మీ దగ్గర డ్రై షార్డొనీ ఉందా? - నాకు డర్టీ మార్టినీ కావాలి. 111 00:09:51,175 --> 00:09:52,676 నేనిప్పుడు పనిచేయట్లేదు. 112 00:09:52,676 --> 00:09:54,178 నీకు అక్కరలేకపోతే నీ విస్కీ నేను తాగుతాను. 113 00:09:54,178 --> 00:09:56,221 - కుదరదు. - ఉండండి. 114 00:09:56,221 --> 00:09:57,806 ఆ వేరే టౌన్ లోని జనం, 115 00:09:57,806 --> 00:10:01,476 మెషిన్ నుంచి వచ్చిన కార్డ్ ఆధారంగా వాళ్ళ జీవితాలను మార్చుకోలేదా? 116 00:10:01,476 --> 00:10:03,854 వాళ్ళేం చేశారో నాకు తెలియదు. అది అసలు టౌన్ కూడా కాదు. 117 00:10:03,854 --> 00:10:05,981 అక్కడ ఆ బార్ ఒక్కటే ఉండేది. 118 00:10:05,981 --> 00:10:10,319 బాధగా ఉన్న జనం వచ్చే బాధాతప్త ప్రదేశంలా ఉండేది. ఫాదర్ రూబెన్ అక్కడకి వచ్చారు. 119 00:10:11,904 --> 00:10:13,447 అంటే ఇంతకుముందే మార్ఫోని మీరు చూశారా? 120 00:10:13,447 --> 00:10:18,452 లేదు. అక్కడకి ఒక్కసారే వెళ్ళాను. ఆ మెషిన్ ని చూడనేలేదు. 121 00:10:18,452 --> 00:10:22,247 కానీ ఇక్కడ, మీరంతా ఒకరితో ఒకరు కార్డులు పంచుకోవటం మొదలుపెట్టారు. 122 00:10:22,247 --> 00:10:24,625 విచిత్రమైన కలలకు, ఆశలకు ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకున్నారు. 123 00:10:24,625 --> 00:10:26,293 అలా ఎవరూ చేయటం నేను గతంలో చూడలేదు. 124 00:10:26,293 --> 00:10:29,546 మెషిన్ తరువాతి దశకి చేరటం అనేది కూడా గతంలో ఎప్పుడూ చూడలేదు. 125 00:10:29,546 --> 00:10:32,341 - నాకు చాలా సందేహాలున్నాయి. - నాకు కూడా. 126 00:10:32,341 --> 00:10:34,510 - డైజెస్ట్ కోసం కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను. - ఒక మాట. 127 00:10:34,510 --> 00:10:37,554 ఒకొక్కరూ ఒకొక్క ప్రశ్న అడగచ్చు. అంతకంటే నావల్ల కాదు. 128 00:10:37,554 --> 00:10:38,555 అడగండి, జియార్జియో. 129 00:10:38,555 --> 00:10:41,892 మార్ఫో చెప్పిన బలాలు అన్నిటికంటే గొప్పది "సూపర్ స్టార్" అనేనా? 130 00:10:41,892 --> 00:10:43,143 కాదు. 131 00:10:45,229 --> 00:10:47,481 ఆ, హాయ్, హానా. 132 00:10:47,481 --> 00:10:50,400 "సూపర్ స్టార్" అనేది మూడు అతిగొప్ప బలాల్లో ఉందా? 133 00:10:51,109 --> 00:10:53,987 నాకొక సందేహం ఉంది. అసలిక్కడ ఏం జరుగుతోంది? 134 00:10:53,987 --> 00:10:56,448 - అంటే? - ఇది అందరినీ అడుగుతున్న ప్రశ్న. 135 00:10:56,448 --> 00:10:59,993 నేను ఇజ్జీ ప్రాణం కాపాడానని మీకు తెలుసా? 136 00:10:59,993 --> 00:11:01,912 మనం ప్రస్తుతం జరుగుతున్న అంశం మీద ధ్యాస పెడదామా? 137 00:11:01,912 --> 00:11:05,415 హానా అసలు ఈ ఊరికే ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఉంది. 138 00:11:09,044 --> 00:11:11,421 ఏదో ఒక ఊరు అనుకొని వచ్చేశాను. 139 00:11:11,421 --> 00:11:13,966 కానీ ఇక్కడ మార్ఫో కనిపించేసరికి, ఎలా అనిపించిందంటే... 140 00:11:13,966 --> 00:11:15,259 ఏదో శకునం లాగానా? 141 00:11:16,343 --> 00:11:18,011 అన్నిటికీ ఏదో సంబంధం ఉన్నట్టు అనిపించింది. 142 00:11:20,013 --> 00:11:24,685 ఆ మార్ఫో చుక్కల్లాగానా? 143 00:11:24,685 --> 00:11:28,814 నీ వీపు మీద ఉన్నాయి, నామీద కూడా ఉన్నాయి. 144 00:11:29,481 --> 00:11:30,607 ఏమిటి దాని అర్థం? 145 00:11:31,108 --> 00:11:33,986 నీకు చుక్కలున్నాయా? నీలం చుక్కలా? 146 00:11:34,486 --> 00:11:36,405 అవును, మార్ఫో నీలం చుక్కలు. 147 00:11:37,239 --> 00:11:39,950 హానాకి, నాకు మాత్రమే ఉన్నాయి. 148 00:11:39,950 --> 00:11:42,286 అంటే మాకేదో ప్రత్యేకత ఉందన్నమాట. 149 00:11:42,286 --> 00:11:43,871 - నాకూ ఉన్నాయి. - ఏంటి? 150 00:11:43,871 --> 00:11:45,122 ఏంటి? 151 00:11:45,122 --> 00:11:46,582 నా అరికాలి మీద ఉన్నాయి. 152 00:11:46,582 --> 00:11:50,252 నాకు ఏదోలా అనిపించింది. అందుకే ఏం చెప్పలేదు. 153 00:11:50,252 --> 00:11:51,461 మీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోరా? 154 00:11:51,461 --> 00:11:54,423 ముందు భాగాలు చూసుకుంటూనే ఉంటాం. 155 00:11:54,423 --> 00:11:55,591 బాగుంది. 156 00:11:55,591 --> 00:11:58,051 నా ఛాతీమీద ఒక పెద్ద చుక్క ఉంది. 157 00:11:58,802 --> 00:12:00,137 అది పుట్టుమచ్చ. 158 00:12:00,137 --> 00:12:03,724 సరే, కానీ ఇంకెవరికైనా ఛాతీమీద పుట్టుమచ్చ ఉందా? 159 00:12:03,724 --> 00:12:05,851 - లేదు. అది వేరు, ఇది వేరు. - సరే, వినండి. 160 00:12:05,851 --> 00:12:07,186 నాకు చుక్కల గురించి తెలియదు. 161 00:12:07,186 --> 00:12:09,938 నాకు ఇవి కొన్నేళ్ళ క్రితమే మొదలయ్యాయి. ఎందుకు వస్తున్నాయో తెలియదు. 162 00:12:09,938 --> 00:12:12,482 - తరువాతి దశకి ఎలా వెళ్ళటం? - ఏమో. నేను చెప్తున్నది అదే. 163 00:12:12,482 --> 00:12:14,651 మార్ఫో ఉన్న చోటే నేను ఉన్నంతమాత్రాన, 164 00:12:14,651 --> 00:12:16,069 దాని అర్థం... 165 00:12:17,571 --> 00:12:20,490 నాకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. 166 00:12:23,035 --> 00:12:24,828 - లైట్స్ మళ్లీ వెలిగాయి. - బాగా కనిపెట్టావు. 167 00:12:24,828 --> 00:12:26,872 బార్ మూసి ఉంది. 168 00:12:26,872 --> 00:12:29,917 నాకు సమాధానాలు తెలియని ప్రశ్నలు ఇంకా ఎన్నో మీరు అడగచ్చు రేపు. 169 00:12:29,917 --> 00:12:31,752 కానీ ప్రస్తుతానికి ఇక మీరంతా బయటకి నడవాలి. 170 00:12:32,252 --> 00:12:34,338 నేను సాయం చేస్తాను, ఇజ్జీ. 171 00:12:34,338 --> 00:12:36,632 ఇప్పుడు నా మోకాలు బానే ఉంది. నీ సాయం నాకు అక్కరలేదు. 172 00:12:36,632 --> 00:12:38,884 ఈరోజు మొదటి డేట్ బానే జరిగినట్టుంది. 173 00:12:38,884 --> 00:12:41,762 - ఇంకా ఎన్నో డేట్స్ ఉంటాయిలే. - ఇంతకీ ఎన్ని చుక్కలు? 174 00:12:41,762 --> 00:12:42,846 కొన్ని. 175 00:12:43,347 --> 00:12:45,432 నీవి నాకు చూపిస్తే నావి నీకు చూపిస్తాను. 176 00:12:46,850 --> 00:12:49,102 నీకు దండం పెట్టకుండా ఉండలేకపోతున్నాను. 177 00:12:51,647 --> 00:12:55,275 ప్రస్తుతం నామీద మీకు చాలా కోపం ఉండచ్చు. 178 00:12:55,275 --> 00:12:56,443 అలా ఎందుకు అనిపిస్తోంది? 179 00:12:57,277 --> 00:13:01,657 మీ దగ్గర పూర్తిగా నిజాయితీగా లేను. 180 00:13:02,241 --> 00:13:05,160 లేదు, నువ్వన్నది నిజమే అనిపిస్తోంది. 181 00:13:07,496 --> 00:13:09,414 మనకి ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు. 182 00:13:14,336 --> 00:13:16,046 మీకేం సందేహాలూ లేవా? 183 00:13:16,046 --> 00:13:18,257 నన్ను అడగటం కూడా ఇష్టం లేదా? 184 00:13:19,591 --> 00:13:23,011 ఇక ఈరోజుకి ఈ విచారణలు ఆపేస్తే నయం అనుకుంటున్నాను. 185 00:13:35,023 --> 00:13:36,191 అయ్యో. 186 00:13:40,904 --> 00:13:41,738 భలే రాత్రి. 187 00:13:42,906 --> 00:13:44,575 చాలా బాగుంది. 188 00:13:47,703 --> 00:13:51,874 చాలా వర్షం పడిందనుకో, కానీ నాకు వర్షం అంటే ఇష్టం. 189 00:13:55,377 --> 00:13:58,881 వర్షం ఆగిపోతే కూడా నాకు చాలా ఇష్టం. 190 00:14:00,591 --> 00:14:01,884 నాకు కూడా. 191 00:14:04,636 --> 00:14:05,804 మంచిది. 192 00:14:11,727 --> 00:14:13,270 నీ కార్ ఎక్కడ పెట్టావు? 193 00:14:13,937 --> 00:14:17,816 నేను కార్లో రాలేదు. నీ వెనుక వచ్చేశాను, అంతే. 194 00:14:18,901 --> 00:14:22,571 ఇంక చాలు! చాలా నవ్వొస్తోంది ఆ మాటకి. 195 00:14:22,571 --> 00:14:25,699 - నేను నీ వెనుక వచ్చాను! - అవునా? నిజమా? 196 00:14:25,699 --> 00:14:27,284 అవును. నేను... 197 00:14:27,284 --> 00:14:30,037 అందుకే అంత నెమ్మదిగా నడుస్తున్నాం అన్నమాట. 198 00:14:30,037 --> 00:14:31,246 నేనూ కార్లో రాలేదు. 199 00:14:31,246 --> 00:14:34,541 - డీర్ ఫెస్ట్ దగ్గర పార్కింగ్ ఎప్పుడూ అయోమయమే. - చాలా అయోమయం. 200 00:14:36,752 --> 00:14:39,796 - డీర్ ఫెస్ట్ అయోమయమే. - అవును. 201 00:14:40,881 --> 00:14:43,634 గుర్తుందా? మనం ఊరిని కాపాడాము, నువ్వు నా కూతురికి స్టెప్-జియార్జియో అవుతా అన్నావు. 202 00:14:43,634 --> 00:14:45,886 మనం ముద్దుపెట్టుకున్నాము. ఊరంతా మనల్ని చూసి ముచ్చటపడింది? 203 00:14:45,886 --> 00:14:47,429 గుర్తుంది. 204 00:14:48,472 --> 00:14:49,973 - నాకది గుర్తుంది. - అవును. 205 00:14:52,142 --> 00:14:53,602 నిన్ను మా ఇంటికి రమ్మని పిలవచ్చు. 206 00:14:53,602 --> 00:14:56,104 కానీ సవానా కోసం ఇంటికి వెళ్ళాలని నువ్వు అనుకోవచ్చు. 207 00:14:56,104 --> 00:14:58,649 ఓరి దేవుడా. సవానా. 208 00:14:58,649 --> 00:15:00,359 అయ్యో, నేను ఏమైపోయానో అనుకుంటూ ఉంటుంది. 209 00:15:00,359 --> 00:15:01,777 తనకి కాల్ చేయాలి. 210 00:15:03,904 --> 00:15:05,364 ఒకవేళ తను నిద్రపోయి కూడా ఉండచ్చు. 211 00:15:05,364 --> 00:15:08,784 అలా అయితే తనని నిద్రలేపితేనే బాగుండదు కదా? 212 00:15:08,784 --> 00:15:12,287 హలో? దుష్టమాతల సంఘం అధ్యక్షురాలేనా మాట్లాడేది? 213 00:15:12,913 --> 00:15:14,915 అవునవును, మీ సంఘంలో కొత్త సభ్యురాలిని. 214 00:15:23,340 --> 00:15:24,174 ఏమో. 215 00:15:24,174 --> 00:15:29,721 సరిగ్గా ఆలోచించలేనంతగా ఆకలివేస్తోంది. ఇంకా నా రాత్రి భోజనం అవ్వలేదు. 216 00:15:30,973 --> 00:15:32,850 నా భోజనం కూడా అవ్వలేదు. 217 00:15:32,850 --> 00:15:35,519 మనం ఏదైనా తిన్నాక, సవానా కి కాల్ చెయ్యి పోనీ. 218 00:15:35,519 --> 00:15:38,564 అవును. అదే తెలివైన పని. 219 00:15:38,564 --> 00:15:43,110 ఆ. కానీ చాలా ఆలస్యమయ్యింది. 220 00:15:43,610 --> 00:15:47,739 నేను పడుకోవటానికి మీ ఇంట్లో అదనంగా బెడ్రూమ్ ఉందా? 221 00:15:47,739 --> 00:15:50,868 ఒకవేళ ఇంటికి వెళ్ళలేనంత నిద్రమత్తు వచ్చేస్తే? 222 00:15:52,119 --> 00:15:56,498 అదే కదా? మా ఇంట్లో చాలా బెడ్రూమ్స్ ఉన్నాయి. నీపై ఒత్తిడి తేవటం నాకిష్టం లేదు. అంతే. 223 00:15:56,498 --> 00:16:00,878 జియార్జియో. నాకు ఈ రాత్రి ముగిసిపోకూడదు అని ఉంది. 224 00:16:03,547 --> 00:16:07,134 అయితే ముగిసిపోదు. 225 00:16:13,140 --> 00:16:15,184 - అయినా మాకు చెప్పేదానివి కదా? - అవును. 226 00:16:15,184 --> 00:16:17,311 కానీ నాకు చుక్కలు లేవని ఖచ్చితంగా మాట ఇస్తున్నాను. 227 00:16:17,811 --> 00:16:19,521 నీ శరీరాన్ని సోదా చేయాల్సిన అవసరం తీసుకురాకు, ట్రీనా. 228 00:16:19,521 --> 00:16:20,647 డస్టీ, వద్దు. 229 00:16:20,647 --> 00:16:22,941 అది జోక్. నేనలా ఎందుకు చేస్తాను? 230 00:16:22,941 --> 00:16:24,026 కానీ నా ఉద్దేశం అర్థమయ్యిందిగా? 231 00:16:24,026 --> 00:16:27,070 ఈ కుటుంబంలో ఎవరెవరికి నీలం చుక్కలు ఉన్నాయో తెలిస్తే మంచిదని. 232 00:16:27,070 --> 00:16:28,572 నేను అబద్ధం చెప్పట్లేదు. 233 00:16:28,572 --> 00:16:30,908 ఇప్పుడు అంతా బహిరంగమే. మంచిదేగా? 234 00:16:30,908 --> 00:16:33,368 ఈ కుటుంబంలో ఇక రహస్యాలే లేవు. 235 00:16:33,368 --> 00:16:37,122 అవును. కాకపోతే ఒక మెషిన్ లేవనెత్తిన 236 00:16:37,122 --> 00:16:38,916 అంతుచిక్కని రహస్యాలు మనకి మిగిలాయి. 237 00:16:38,916 --> 00:16:41,335 అదీ ఇప్పుడు ఉన్నట్టుంది పనిచేయటం మానేసింది. 238 00:16:41,335 --> 00:16:43,086 ఎవరో ఒకరికి ఇది అంతుచిక్కాలి కదా? 239 00:16:43,086 --> 00:16:47,883 మనల్ని అది అడిగింది కదా, "తరువాతి దశకి సిద్ధమేనా?" అని. 240 00:16:47,883 --> 00:16:50,219 అది మామూలు ప్రశ్నే అయ్యుండచ్చు కూడా. 241 00:16:50,219 --> 00:16:52,221 మెషిన్ పని అయిపోయి ఉండచ్చు. 242 00:16:52,221 --> 00:16:54,973 అందరూ వాళ్ళువాళ్ళు నేర్చుకున్న పాఠాలను నెమరువేసుకుంటూ 243 00:16:54,973 --> 00:16:58,352 బాధ్యతనెరిగి ముందుకి సాగటమే తరువాతి దశ అయ్యుండచ్చు. 244 00:16:59,728 --> 00:17:02,814 - అవును, అదే అయ్యుండచ్చు. - ఎంత ముచ్చటైన మాట అన్నావో. 245 00:17:02,814 --> 00:17:05,358 సరే, ఇక నేను నిద్రపోతాను. ఐ లవ్ యూ. 246 00:17:05,358 --> 00:17:07,653 మీతో కలసి డీర్ ఫెస్ట్ కి వెళ్ళటం చాలా బాగుంది. 247 00:17:08,904 --> 00:17:10,948 - ఆహా. ఐ లవ్ యూ టూ, కన్నా. - ఈ రాత్రి బాగా గడిచింది. 248 00:17:10,948 --> 00:17:12,156 - శుభరాత్రి. - శుభరాత్రి. 249 00:17:17,579 --> 00:17:19,330 నువ్వు ఆ మాటల్ని అస్సలు నమ్మలేదు కదా? 250 00:17:19,330 --> 00:17:22,041 లేదు. మనం తరువాతి దశకి వెళ్తున్నాం. 251 00:17:30,384 --> 00:17:32,719 మీరు వచ్చినందుకు మిస్టర్ జాన్సన్ చాలా సంతోషిస్తారు. 252 00:17:33,929 --> 00:17:36,807 ఇంకా ముందే వచ్చేదాన్ని, కానీ ఈరోజు రాత్రి నేనే దాదాపు చావబోయాను. 253 00:17:36,807 --> 00:17:38,725 అయ్యో, సారీ, ఏం జరిగింది? 254 00:17:38,725 --> 00:17:41,019 - హే మేజ్ లో తప్పిపోయింది. - చిక్కుబడిపోయాను. 255 00:17:41,645 --> 00:17:43,689 చిక్కటి చీకటిలో చిక్కుబడిపోయాను. 256 00:17:43,689 --> 00:17:47,442 నేనే కాపాడాను. తనకి నేనెవరో తెలియనప్పటికీ. 257 00:17:47,442 --> 00:17:50,487 నాకు నువ్వెవరో తెలుసు. పేరు గుర్తురాలేదు అంతే. 258 00:17:51,071 --> 00:17:53,907 మా ఆఫీసు చుట్టూ తెగ తిరిగావు కదా నన్ను షెరిఫ్ ని అవ్వమని అడుగుతూ? 259 00:17:53,907 --> 00:17:55,492 ఎలా కాపాడారు? 260 00:17:56,243 --> 00:17:57,744 ముందుగా ఏమనుకున్నానంటే, 261 00:17:57,744 --> 00:18:01,623 "నా రంపాన్ని అనవసరంగా డీర్ ఫెస్ట్ కి తెచ్చాను" అనుకున్నాను 262 00:18:01,623 --> 00:18:04,001 కానీ అదే ఇప్పుడు పనికివచ్చింది. 263 00:18:05,085 --> 00:18:09,047 పవర్ టూల్స్ వాడేవాళ్ళంటే నాకు భలే ఇష్టం. 264 00:18:09,590 --> 00:18:13,886 నేను మెడికల్ స్కూల్లో చూసిన కేస్ స్టడీస్ లో చాలామందికి బొటనవేలు కోసేసి ఉండేది. 265 00:18:13,886 --> 00:18:19,349 నేను చెక్క సామాను పునరుద్ధరణ రంగంలో చేస్తుంటాను. కనుక... 266 00:18:19,349 --> 00:18:20,517 సరే. 267 00:18:20,517 --> 00:18:23,520 రాత్రంతా ఇలా నుంచొని మీ ఇద్దరి ప్రణయ సల్లాపాలు చూడచ్చు, కానీ 268 00:18:23,520 --> 00:18:26,982 ఇక్కడ ఒక మనిషి చావుబ్రతుకుల్లో ఉన్నాడని గుర్తుచేస్తున్నాను. 269 00:18:26,982 --> 00:18:28,692 లేదు, లేదు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతే. 270 00:18:29,359 --> 00:18:32,196 కానీ ఆయన నిద్రలేచేసరికి మీరు ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది. 271 00:18:32,196 --> 00:18:33,989 ఖచ్చితంగా ఆయన చాలా సంతోషిస్తారు. 272 00:18:34,948 --> 00:18:36,116 ఒక మాట చెప్పనా? 273 00:18:36,617 --> 00:18:39,036 ఉండాలని ఉంది, కానీ నావల్ల ఎవరికీ ఉపయోగం లేదు 274 00:18:39,036 --> 00:18:41,788 నా తొమ్మిదిన్నర గంటల నిద్ర నాకు లేకపోతే. 275 00:18:41,788 --> 00:18:45,083 అందుకే నాకు ఏమనిపిస్తోంది అంటే, మిస్టర్ జాన్సన్ కూడా అదే కోరుకుంటారని. 276 00:18:45,083 --> 00:18:47,252 నేను ఇప్పుడు ఇంటికి వెళ్లిపోయి, రేపు ఉదయం ఆయన్ని కలవాలని. 277 00:18:47,252 --> 00:18:50,214 అప్పటికి ఆయనకి కూడా కాస్త రూపు-రేఖ చక్కబడతాయి. 278 00:18:51,048 --> 00:18:53,884 మీరు ఉంటేనే ఆయన సంతోషిస్తారని నా ఉద్దేశం. ఇప్పుడో ఇకనో లేచేస్తారు. 279 00:19:00,641 --> 00:19:04,937 ఒక మాట చెప్పనా, బ్యూ? కఠినంగా అనిపించినా కూడా, 280 00:19:04,937 --> 00:19:07,689 ఇలాంటి పరిస్థితిలో వ్యాపారం నడుపుతూ ఉండటంవల్ల 281 00:19:09,608 --> 00:19:12,152 నువ్వన్న షెరిఫ్ ప్రతిపాదన గురించి ఆలోచించాను. 282 00:19:12,819 --> 00:19:15,989 ఈ ఊరికి ఇంకా అదనపు భద్రత అవసరం. 283 00:19:16,615 --> 00:19:18,825 ముఖ్యంగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో. 284 00:19:18,825 --> 00:19:21,203 అవునా? నా షరతులన్నిటికీ కూడా ఒప్పుకుంటున్నారా? 285 00:19:21,203 --> 00:19:25,249 జీతం, బెనెఫిట్స్, బ్యాడ్జ్, సంపూర్ణ అధికార పరిధి? 286 00:19:25,249 --> 00:19:27,251 ఆ వివరాలన్నీ ఉదయం చర్చించుకోవచ్చు. 287 00:19:27,251 --> 00:19:31,672 కానీ ప్రస్తుతం, మిస్టర్ జాన్సన్ నీ అధికార పరిధి. 288 00:19:32,923 --> 00:19:37,427 నువ్వు ఇక్కడే ఉండి ఆయన్ని పరిరక్షించాలి. 289 00:19:45,519 --> 00:19:46,520 థాంక్యూ, ఇజ్జీ. 290 00:19:49,147 --> 00:19:50,899 మిమ్మల్ని నిరాశపరచను. 291 00:20:24,016 --> 00:20:28,478 అవును. నేను తరువాతి దశకు సిద్ధంగా ఉన్నాను. 292 00:20:30,189 --> 00:20:31,523 అవును, నేను సిద్ధం. 293 00:20:43,744 --> 00:20:44,828 కాయా పండా? 294 00:20:47,122 --> 00:20:48,916 ఆ, దీన్ని అన్లాక్ చేసి గంటయ్యింది. 295 00:20:48,916 --> 00:20:50,626 ఇప్పుడు ఊరికే దీనితో ఆడుకుంటున్నాను. 296 00:20:50,626 --> 00:20:52,836 - ఇక వెటకారం చాలు. - సారీ. 297 00:20:52,836 --> 00:20:54,379 చాలా విసుగుగా ఉంది. 298 00:20:54,379 --> 00:20:56,173 నీకేమైనా దీని పనిపట్టే మార్గం తెలిస్తే, 299 00:20:56,173 --> 00:20:58,800 మెషిన్ గురించి నాకు తెలిసినదంతా చెప్పేశానని అన్నాను కదా? 300 00:20:58,800 --> 00:21:01,303 సరే, సరే. నీకు... 301 00:21:01,303 --> 00:21:03,138 - నాకు అలవాటు లేదు. - సరే. మంచిది. 302 00:21:06,350 --> 00:21:08,435 మనం మొదటిసారి కలవటం నీకు గుర్తుందా? 303 00:21:09,061 --> 00:21:11,396 - లేదు. - ఇక్కడే నుంచొని ఉన్నాం. 304 00:21:11,396 --> 00:21:14,691 నీతో హెయిర్ ప్లగ్స్ గురించి ఏదో అన్నాను. 305 00:21:14,691 --> 00:21:15,817 ఓహో, అవును. 306 00:21:15,817 --> 00:21:17,694 కొద్దిగా మబ్బులా ఏదో గుర్తొస్తోంది. 307 00:21:17,694 --> 00:21:19,738 నువ్వు ఎంత దారుణంగా మాట్లాడావు అన్న సంగతి. 308 00:21:19,738 --> 00:21:21,698 నువ్వు మీ అన్నయ్యవి అనుకున్నాను. 309 00:21:22,741 --> 00:21:25,244 కోల్టన్ నా బార్ కి వచ్చాడు. నా పాత బార్ కి. 310 00:21:26,161 --> 00:21:29,122 మీ నాన్న ట్రక్ తీసుకొని వచ్చి, నన్ను బీర్ ఇమ్మని అడిగాడు. 311 00:21:29,122 --> 00:21:32,042 మామూలుగా ఎవరో వెర్రి కుర్రాడు అనుకున్నాను. 312 00:21:32,543 --> 00:21:34,086 చక్కని కుర్రాడు, కానీ మామూలు కుర్రాడు అని. 313 00:21:35,170 --> 00:21:37,840 కానీ అతను వెళ్లిపోతూ... 314 00:21:38,632 --> 00:21:39,925 నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. 315 00:21:42,427 --> 00:21:43,637 జాగ్రత్తగా వెళ్ళు. 316 00:21:54,064 --> 00:21:56,066 ఇంకెవరి మీదా అటువంటి చుక్కలు నేను చూడలేదు. 317 00:21:56,066 --> 00:21:57,734 ఎందుకో చెప్పలేను గానీ, 318 00:21:57,734 --> 00:21:59,862 అతని వెనుక వెళ్ళాలి అనిపించింది. 319 00:22:00,696 --> 00:22:04,741 కానీ మొదట అలా వెళ్ళలేదు. కానీ వెళ్ళేసరికి, 320 00:22:04,741 --> 00:22:06,034 అతను అక్కడనుండి వెళ్లిపోయాడు. 321 00:22:08,328 --> 00:22:09,663 కోల్టన్ కి ఎందుకు నీలం చుక్కలు ఉంటాయి? 322 00:22:09,663 --> 00:22:12,499 నాకు తెలియదు. అందుకే అతన్ని అనుసరించాను. 323 00:22:13,083 --> 00:22:14,668 అలాగే ఇక్కడకి రావటం జరిగింది. 324 00:22:14,668 --> 00:22:17,504 తర్వాత ఈ మెషిన్ నా వెనుక వచ్చింది. 325 00:22:18,005 --> 00:22:20,966 ఇప్పుడు మత్తుగా ఉండకపోతే బాగుండేది. లేకపోతే ఇంకా ఎక్కువ మత్తుగా ఉండాల్సింది. 326 00:22:22,092 --> 00:22:23,844 కానీ నువ్వు నాకెందుకు చెప్పలేదు? 327 00:22:23,844 --> 00:22:25,262 - ఏమిటి చెప్పేది? - అదే, కోల్టన్ గురించి. 328 00:22:25,262 --> 00:22:28,098 నా బార్ కి వచ్చాడని, బీర్ అడిగాడని, నీలం చుక్కలు ఉన్నాయనా? 329 00:22:28,098 --> 00:22:29,808 - దానివల్ల ఉపయోగం ఏముంది? - లేకపోయినా పర్వాలేదు. 330 00:22:30,434 --> 00:22:31,810 నాకు తెలుసుకోవాలనుంది. 331 00:22:33,312 --> 00:22:37,482 మనం ఎవరినైనా కోల్పోతే, వాళ్ళగురించి మరింత తెలుసుకోవాలి అనిపిస్తుంది. 332 00:22:38,400 --> 00:22:41,069 నీకది అంత ముఖ్యం కాదనిపించినా నాకు చెప్పాల్సింది. 333 00:22:42,112 --> 00:22:43,238 సారీ. 334 00:22:44,448 --> 00:22:48,327 నాకు సాధారణంగా ఎవరి జీవితాల్లోనూ కలగజేసుకొనే అలవాటు లేదు. 335 00:22:48,327 --> 00:22:52,539 - సరే, సరే. - కానీ, మన్నించు. 336 00:22:54,541 --> 00:22:56,293 నీకు ఈ విషయంలో సాయం చేయగలనేమో. 337 00:22:56,293 --> 00:22:59,254 ఎలా చేస్తావు? ఏం తెలియదని చెప్తూనే ఉన్నావు కదా? 338 00:23:07,387 --> 00:23:08,847 మార్ఫో, పోవే. 339 00:23:22,945 --> 00:23:25,155 - నడుస్తుంటే నొప్పి ఉంటోందా? - లేదు. 340 00:23:25,155 --> 00:23:27,324 ఎప్పుడు వచ్చాయో కూడా నాకు తెలియదు. 341 00:23:27,324 --> 00:23:30,202 ఎందుకో కాలు ఎత్తి గట్టుమీద పెడితే, 342 00:23:30,202 --> 00:23:31,453 అప్పుడు అద్దంలో కనిపించాయి. 343 00:23:31,453 --> 00:23:33,997 అవును, నా కాలి గోళ్ళు తీసుకోవటానికి ఆ గట్టుని వాడతాను. 344 00:23:34,873 --> 00:23:36,583 ఆ మాట చెప్పకుండా ఉండాల్సింది. 345 00:23:42,047 --> 00:23:44,842 ఫెర్రిస్ వీల్ ఎక్కి పైకి వెళ్లినప్పుడు అన్నావు కదా, 346 00:23:44,842 --> 00:23:46,677 మనిద్దరం కొంచెం దూరంగా ఉంటే బాగుంటుందని? 347 00:23:48,011 --> 00:23:49,304 ఆ మాట అనటానికి కారణం, 348 00:23:49,304 --> 00:23:52,307 మనకి మెరుపు తగులుతుందని అన్నావా, లేదా... 349 00:23:52,307 --> 00:23:54,601 మెరుపు వల్ల మన సంభాషణకి బలం కలిగిందనుకో. 350 00:23:54,601 --> 00:23:56,019 కానీ అదేం లేదు. నేను... 351 00:23:56,603 --> 00:23:59,022 ఆ విషయం కూడా తీసిపడేయక్కరలేదు అనిపిస్తోంది. 352 00:23:59,022 --> 00:24:01,692 నా "టీచర్/విజిలర్" బలానికి, 353 00:24:01,692 --> 00:24:05,487 అప్పుడు మనం దూరంగా ఉన్నప్పుడు నేను విజిలర్ లో స్కీయింగ్ చేయటానికి సంబంధం ఉంటే, 354 00:24:06,530 --> 00:24:10,325 "రాయల్టీ" అన్న మాటవల్ల నీకు జీవితంలో 355 00:24:10,325 --> 00:24:12,452 ఇంకా ఏదో కావాలని అనిపించటం... 356 00:24:12,953 --> 00:24:15,414 బహుశా మనకి వ్యక్తిగతంగా ఏకాంత సమయం అవసరమేమో. 357 00:24:17,374 --> 00:24:19,835 బహుశా. శాశ్వతంగా కాదు. 358 00:24:19,835 --> 00:24:22,588 - కొంతకాలం. - అదెలా సాధ్యం? 359 00:24:23,922 --> 00:24:26,466 మనలో ఒకరం ఇంట్లోంచి వెళ్లిపోవాలా? 360 00:24:27,050 --> 00:24:29,094 - నువ్వు వెళ్ళక్కరలేదు అనుకుంటున్నాను. - మనలో ఒకరం అన్నా. 361 00:24:31,096 --> 00:24:32,181 ఏమో. 362 00:24:33,682 --> 00:24:35,642 ట్రీనాకి ఏం చెప్తాము? 363 00:24:36,226 --> 00:24:38,187 వేరేవాళ్ళతో గడుపుతామా? 364 00:24:41,815 --> 00:24:44,443 బాగా ఆలోచిద్దాం. 365 00:24:44,443 --> 00:24:45,861 అవును. 366 00:24:46,403 --> 00:24:48,906 - ఈ రాత్రి చాలా భారంగా గడిచింది. - అవును. 367 00:24:48,906 --> 00:24:52,576 లైట్స్ ఆగిపోవటం, మనం కాలిపోయినంత పని అవ్వటం. 368 00:24:53,076 --> 00:24:56,580 మార్ఫో విషయం, హానా విషయం. 369 00:24:56,580 --> 00:24:59,458 నీకు అరికాళ్ళలో ఈ చుక్కలు ఉండటం, అది నువ్వు నాకెప్పుడూ చెప్పకపోవటం. 370 00:24:59,458 --> 00:25:01,752 నీకు చుక్కలు ఉన్నట్టు నువ్వు నాకెప్పుడూ చెప్పకపోవటం. 371 00:25:01,752 --> 00:25:03,545 అవును, చాలా గందరగోళం అయ్యింది. 372 00:25:03,545 --> 00:25:08,759 కాబట్టి, చక్కగా నిద్రపోదాం. ఉదయం లేచాక చర్చించుకోవచ్చు. 373 00:25:10,010 --> 00:25:11,136 మంచి ఆలోచన. 374 00:25:25,192 --> 00:25:27,569 నిదురలేవండి బంగారుతండ్రీ. 375 00:25:32,908 --> 00:25:35,827 - నువ్వెవరు? - నా పేరు బ్యూ. బ్యూ కోవాక్. 376 00:25:36,411 --> 00:25:38,622 మీరు హాస్పిటల్లో ఉన్నారు, మిస్టర్ జాన్సన్. 377 00:25:38,622 --> 00:25:40,874 మార్ఫో మెషిన్ వల్ల మీకు షాక్ తగిలింది. 378 00:25:40,874 --> 00:25:43,710 చిన్నగా గుండెపోటు వచ్చింది. కానీ ఇప్పుడు బానే ఉన్నారు. 379 00:25:43,710 --> 00:25:48,048 కోవాక్. అవును కొట్లో మీ పేరు విన్నాను. 380 00:25:51,176 --> 00:25:53,929 మీరు అనేది మా అబ్బాయి జేకబ్ గురించి కావచ్చు. 381 00:25:53,929 --> 00:25:56,807 లేదు, లేదు. 382 00:25:58,350 --> 00:26:01,019 నువ్వు మీ నాన్నతో కలసి వచ్చేవాడివి. 383 00:26:01,019 --> 00:26:03,397 బర్లీ బాయ్ బాక్సింగ్ గేమ్ ఆడేవాడివి. 384 00:26:04,022 --> 00:26:06,483 ఆ ఉద్యానవనంలో వాంతి చేసుకున్న కుర్రాడు నువ్వే కదా? 385 00:26:06,483 --> 00:26:07,776 అవును. 386 00:26:09,528 --> 00:26:13,365 మరి ఈలోపే పెరిగి పెద్దవాడినై షెరిఫ్ ని అయ్యాను. నమ్మగలరా? 387 00:26:15,200 --> 00:26:18,328 ప్రస్తుతం పెద్దపెద్ద విషయాలు విని తట్టుకునే అంత ఓపిక మీ గుండెకి లేదు. 388 00:26:18,328 --> 00:26:22,124 నేను ఈ విషయం చెప్పిన మొదటి వ్యక్తి మీరే. 389 00:26:24,543 --> 00:26:25,794 అద్భుతం. 390 00:26:29,173 --> 00:26:33,051 - అయితే ఆరు వారాలా? - అవును, ఆరు వారాలు. 391 00:26:33,051 --> 00:26:34,720 - దూరంగా ఉన్నా కలసి ఉన్నట్టే. - అలాగే. 392 00:26:34,720 --> 00:26:36,305 మనం ఇంకా కలిసి ఉన్నట్టే. 393 00:26:36,305 --> 00:26:39,057 ఎందుకు దూరంగా ఉంటున్నామో, ఆ విషయంలో ఒకరికొకరం మద్దతుగా ఉంటాం. 394 00:26:39,057 --> 00:26:40,726 - కానీ కలిసే. - అవును. 395 00:26:40,726 --> 00:26:42,436 - అంతే అని ఖచ్చితంగా చెప్పగలను. - సరే. 396 00:26:42,436 --> 00:26:44,938 కానీ ఆరు వారాలు అయ్యాక, ఏది ఏమైనా మనం కలసే ఉంటాం. 397 00:26:44,938 --> 00:26:47,608 ఖచ్చితంగా. ఆరు వారాలు మాత్రమే. 398 00:26:47,608 --> 00:26:49,276 స్నానం చేయకుండా అంతకంటే ఎక్కువకాలమే ఉన్నా. 399 00:26:49,276 --> 00:26:51,236 నేనేమైనా మీ అమ్మలాగానా, 400 00:26:51,236 --> 00:26:53,113 చెప్పాపెట్టకుండా యూరప్ వెళ్లి ఉండిపోవటానికి? 401 00:26:54,114 --> 00:26:55,449 ఆహా, సరైన సమయంలో సరైన మాట. 402 00:26:55,449 --> 00:26:58,243 కానీ, మనం ఆరు వారాల్లో కలవబోతున్నాము, 403 00:26:58,243 --> 00:27:00,662 మనం నేర్చుకున్న పాఠాలు ఒకరితో ఒకరం పంచుకోబోతున్నాము. 404 00:27:00,662 --> 00:27:02,873 ఈలోగా, మనం... 405 00:27:02,873 --> 00:27:04,958 - మనకి స్కెడ్యూల్స్ ఉంటాయి. - స్కెడ్యూల్స్ అంటే నాకిష్టం. 406 00:27:04,958 --> 00:27:08,754 టీవీకి, ఫ్రిజ్ కి, 407 00:27:08,754 --> 00:27:12,341 కూతురు ట్రీనాకి మొదటి అవకాశం. 408 00:27:12,341 --> 00:27:14,760 నా సొంత ఫ్రిజ్ నేను తెచ్చుకుంటే బాగుంటుందేమో. 409 00:27:14,760 --> 00:27:16,553 బేస్మెంట్ లో ఒక బుల్లి ఫ్రిజ్ ఏర్పాటు చేసుకుంటాను. 410 00:27:16,553 --> 00:27:18,680 బేస్మెంట్ లో ఉండటం విషయంలో నీకు నిజంగా పర్లేదా? 411 00:27:18,680 --> 00:27:20,015 మాట్లాడుకున్నాంగా? నువ్వన్నది నిజం. 412 00:27:20,015 --> 00:27:21,808 ఇంకో కాపురం పెట్టాలంటే బోలెడంత ఖర్చు అవుతుంది. 413 00:27:22,518 --> 00:27:24,603 - నీకు బేస్మెంట్ విషయంలో అభ్యంతరం లేదు కూడా. - బేస్మెంట్ నాకిష్టం. 414 00:27:24,603 --> 00:27:26,230 - నువ్వంటే నాకిష్టం. - నువ్వంటే నాకిష్టం. 415 00:27:27,856 --> 00:27:33,529 అందుకే కదా ఇలా కొంతకాలం దూరంగా ఉంటున్నాం? 416 00:27:36,240 --> 00:27:38,700 ఇంతకంటే ఆ చెత్త మెషిన్ మనకి 417 00:27:38,700 --> 00:27:40,285 ఏం చేయాలో చెప్పేస్తే పోయేది కదా? 418 00:27:40,285 --> 00:27:42,621 భావప్రకటనలో అంత గొప్ప మాయాయంత్రం ఏం కాదది. 419 00:27:42,621 --> 00:27:45,082 కనీసం చెప్పీచెప్పనట్టు చెప్పచ్చుగా? 420 00:27:45,082 --> 00:27:46,583 కానీ అది... 421 00:27:51,004 --> 00:27:52,714 కొంచెం వేగం పెంచి పాడానులే. కానీ అర్థమయ్యిందిగా? 422 00:27:52,714 --> 00:27:54,925 కాస్, మార్ఫోని అచ్చుగుద్దినట్టు అనుకరించావు తెలుసా? 423 00:27:54,925 --> 00:27:56,760 థరెమిన్ ని నీకు ఇచ్చేముందు నేను కాసేపు దానితో 424 00:27:56,760 --> 00:27:58,095 ఆడుకున్నానులే. 425 00:27:58,095 --> 00:28:01,265 మార్ఫో శబ్దం కూడా అలాగే ఉంది. 426 00:28:03,976 --> 00:28:05,477 దాని శబ్దం థరెమిన్ ధ్వని లాగే ఉంది. 427 00:28:10,190 --> 00:28:13,861 ఇంకొంచెం పైకి. తర్వాతి స్వరం కొంచెం కిందకి. 428 00:28:18,574 --> 00:28:20,993 సరే. అయితే... 429 00:28:27,791 --> 00:28:30,335 - ఛ. - దాదాపుగా వచ్చేసింది. శభాష్. 430 00:28:31,003 --> 00:28:33,755 ఆగండి, ఆగండి! థెరెమిన్! థెరెమిన్! 431 00:28:33,755 --> 00:28:35,632 థెరెమిన్ ని మార్ఫో లోపల పెట్టాలి! 432 00:28:35,632 --> 00:28:37,426 మూసుకోండి! సారీ, మిస్టర్ హొబ్బర్డ్. 433 00:28:37,426 --> 00:28:39,553 మేము ఏదో ప్రయత్నం చేస్తున్నాము. కనుక దయచేసి మాట్లాడకండి. 434 00:28:48,228 --> 00:28:49,605 అది! సాధించారు! 435 00:28:49,605 --> 00:28:51,899 సాధించాం! సాధించాం! 436 00:28:52,399 --> 00:28:54,067 సరే, సరే. నెమ్మదించు. 437 00:28:54,776 --> 00:28:56,195 ఇది అద్భుతం. 438 00:28:56,195 --> 00:28:57,571 వావ్. అద్భుతం. 439 00:28:57,571 --> 00:29:00,657 మనం దాదాపుగా... ఎందుకంటే మనకి కూడా ఈ ఉపాయమే తట్టింది కదా? 440 00:29:00,657 --> 00:29:04,119 కాకపోతే, మీ ఉపాయం తిన్నగా ఉంది, నాది కొంచెం చుట్టుతిప్పినట్టుంది. 441 00:29:04,119 --> 00:29:06,496 మెషిన్ లోపల థెరమిన్ ని పెట్టాలేమో అనుకున్నాను. 442 00:29:06,496 --> 00:29:08,874 కానీ రెండిటిలోను థెరమిన్ ఉందిగా? కనుక మనందరం కలసికట్టుగా సాధించినట్టే. 443 00:29:08,874 --> 00:29:10,542 - కలసికట్టుగా. - సిద్ధమయ్యిందనుకుంటా. 444 00:29:11,168 --> 00:29:12,794 కొత్త స్టార్ట్ స్క్రీన్ వచ్చింది. 445 00:29:12,794 --> 00:29:14,838 - ఎవరి దగ్గరైనా క్వార్టర్స్ ఉన్నాయా? - అవసరం లేవనుకుంటా. 446 00:29:15,464 --> 00:29:16,965 "మొదలుపెట్టటానికి కార్డ్ ను ఉంచండి" అంటోంది. 447 00:29:21,929 --> 00:29:22,971 అబ్బా. 448 00:29:36,735 --> 00:29:38,779 {\an8}మార్ఫో మొదలుపెట్టటానికి కార్డ్ ను ఉంచండి 449 00:29:41,031 --> 00:29:42,699 టీచర్/విజిలర్ 450 00:29:53,293 --> 00:29:55,212 ఎమ్.ఓ వాల్ష్ రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 451 00:29:57,297 --> 00:29:59,216 రిచర్డ్ జే. అనోబిల్ జ్ఞాపకంతో 452 00:31:08,076 --> 00:31:10,078 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్