1 00:00:34,159 --> 00:00:35,160 హలో? 2 00:00:37,913 --> 00:00:38,997 ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 3 00:00:40,874 --> 00:00:44,628 నా దగ్గర బ్యాట్ ఉంది... టేసర్ ఉంది, 4 00:00:45,254 --> 00:00:48,090 నాకు కరాటే కూడా తెలుసు, కాబట్టి... 5 00:01:02,729 --> 00:01:04,397 మార్ఫో జీవితంలో మీరు ఏం సాధించగలరో తెలుసుకోండి 6 00:01:11,071 --> 00:01:12,197 ఏంటిది? 7 00:01:14,908 --> 00:01:17,202 మార్ఫోకి స్వాగతం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? 8 00:01:18,537 --> 00:01:19,371 సరే. 9 00:01:20,414 --> 00:01:21,874 మార్ఫోని సిద్ధం చేస్తోంది... 10 00:01:24,877 --> 00:01:26,545 టెస్ట్ 11 00:01:28,964 --> 00:01:30,340 మార్ఫో సీతాకోకచిలుక అనేది మార్పుకు గుర్తు 12 00:01:30,340 --> 00:01:31,466 ప్యూపా దశ తర్వాత 13 00:01:33,760 --> 00:01:34,970 వెంటాడే క్రమంలో భాగంగా వేదనకు గురైతే 14 00:01:34,970 --> 00:01:35,929 అందుకు మార్ఫో బాధ్యత వహించదు 15 00:01:38,056 --> 00:01:39,975 కంటెంట్ ని సీరియస్ గా తీసుకోకూడదు 16 00:01:42,352 --> 00:01:43,478 జీవితంలో మీరు ఏం సాధించగలరో తెలుసుకోవడానికి సిద్దమా? 17 00:01:43,478 --> 00:01:45,022 హమ్మయ్య. 18 00:01:46,356 --> 00:01:47,399 మార్ఫో ప్రారంభించడానికి నాణాలు వేయండి 19 00:01:54,740 --> 00:01:56,366 జీవితంలో మీరు ఏం సాధించగలరో తెలిసిపోయింది! 20 00:01:57,367 --> 00:01:59,077 {\an8}జీవితంలో మీరు సాధించగల విషయం - హీరో 21 00:01:59,077 --> 00:02:00,537 హా, సూపర్. 22 00:02:08,294 --> 00:02:10,464 జేకబ్, ఏంటిది? 23 00:02:10,964 --> 00:02:14,009 నాకు తెలీదు. ఏదో వీడియో గేమ్ లాగుంది. 24 00:02:14,009 --> 00:02:15,636 ఎక్కడి నుండి వచ్చింది? 25 00:02:15,636 --> 00:02:17,221 నాకు తెలీదు. మీకు తెలీదా? 26 00:02:17,221 --> 00:02:19,890 తెలీదంటే? నువ్వు ఇక్కడ స్టాక్ ను సర్దుతూ లేవా? 27 00:02:19,890 --> 00:02:22,976 హా, ఉన్నాను. కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని పని చేస్తూ ఉన్నాను, కానీ... 28 00:02:22,976 --> 00:02:24,728 ఇంత సేపూ నువ్వు ఇక్కడే ఉన్నావు కదా? 29 00:02:24,728 --> 00:02:25,812 ఉన్నాను. 30 00:02:25,812 --> 00:02:27,773 అయితే, ఉన్నట్టుండి అది ప్రత్యక్షమైందా? 31 00:02:27,773 --> 00:02:28,857 అవును. 32 00:02:30,234 --> 00:02:32,444 "జీవితంలో మీరు ఏం సాధించగలరో తెలుసుకోండి." 33 00:02:33,862 --> 00:02:36,156 జనాలు దీన్ని ఉపయోగించే అవకాశం ఉందంటావా? 34 00:02:39,326 --> 00:02:40,327 ఉంది. 35 00:02:58,428 --> 00:03:01,515 హా, ప్రిన్సిపల్ పాట్ అక్కడ ఒక గంట దాకా అలాగే పడి ఉందట. 36 00:03:01,515 --> 00:03:04,226 హా. జేకబే కనుక తనని చూసి ఉండకపోతే తను చనిపోయి ఉండేది. 37 00:03:04,226 --> 00:03:07,354 ఓహో, మన హీరో వచ్చేశాడు! నేను ఉంటా మరి. 38 00:03:08,063 --> 00:03:10,691 -హేయ్. -సరే. 39 00:03:11,608 --> 00:03:12,860 నువ్వు పనికి వెళ్లలేదా? 40 00:03:12,860 --> 00:03:16,363 ఏమో. ఉద్యోగాలు మానేసినవాళ్లు పనులకు వెళ్లాలా ఏంటి? 41 00:03:17,072 --> 00:03:20,242 -ఏంటి? -అవును. నీ నుండే నేను స్ఫూర్తి పొందాను. 42 00:03:20,242 --> 00:03:22,411 నువ్వేమో జనాల జీవితాలను కాపాడుతున్నావు, 43 00:03:22,411 --> 00:03:26,081 మరి నేనేమో చాలీచాలని జీతంతో ఐస్ ని తీసేసే ట్రక్కు తోలుకుంటూ తిరుగుతున్నా. 44 00:03:26,081 --> 00:03:29,084 నేనేమీ జనాల జీవితాలు కాపాడట్లేదు. 911కి కాల్ చేశానంతే. 45 00:03:29,084 --> 00:03:31,545 మహా అయితే, ఫోన్ ని వాడటం తెలిసినందుకు నన్ను మెచ్చుకోవాలి. 46 00:03:31,545 --> 00:03:33,547 హేయ్, జేక్, ఇటు చూడు. 47 00:03:34,131 --> 00:03:39,887 నీకు... ఒక ముఖాన్ని చేశాను. 48 00:03:41,597 --> 00:03:43,056 మీ అమ్మ చేసే లాగానే. 49 00:03:44,224 --> 00:03:46,685 కానీ మన దగ్గర ఉల్లిపాయాలు లేవు కాబట్టి కొత్తిమీర వాడాను. 50 00:03:47,186 --> 00:03:49,479 ఇంకా గుడ్లు కూడా ఎప్పటివో, కానీ వాటి వాసన బాగానే ఉంది. 51 00:03:51,815 --> 00:03:53,442 -నువ్వు దాన్ని ఖచ్చితంగా తినాల్సిన పని లేదు... -సరే. 52 00:03:57,571 --> 00:03:59,281 సరే మరి, ఏంటి సంగతి, నాన్నా? 53 00:03:59,281 --> 00:04:02,743 కొత్తగా నువ్వు టిఫిన్ చేసి, నాతో మాట్లాడుతున్నావేంటి? 54 00:04:02,743 --> 00:04:05,537 -ఇంకా నన్ను "జేక్" అని పిలుస్తున్నావేంటి? -ఎందుకు ఏంటి, జేకబ్! 55 00:04:06,830 --> 00:04:08,248 చూడు, నాకు తెలుసు 56 00:04:09,333 --> 00:04:12,669 మనిద్దరి మధ్య... అంత సాన్నిహిత్యం లేదని. 57 00:04:13,545 --> 00:04:16,214 చాలా కాలం నుండి, ఈ ఇంటి కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావని 58 00:04:16,214 --> 00:04:19,885 నాకు తెలుసు, కానీ ఇప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకోబోతున్నాను. 59 00:04:19,885 --> 00:04:21,928 ఇప్పుడు నాకు అంత ఆఫర్ అక్కర్లేదులే. 60 00:04:23,305 --> 00:04:24,389 నేను స్కూలుకు వెళ్లాలి. 61 00:04:24,389 --> 00:04:26,934 -సరే. కానీ, అబ్బాయి... -వద్దు. 62 00:04:26,934 --> 00:04:29,520 ప్రిన్సిపల్ పాట్ విషయంలో నువ్వు చేసిన దానికి, 63 00:04:30,270 --> 00:04:31,688 నేనేం చెప్పాలనుకుంటున్నానంటే... 64 00:04:34,691 --> 00:04:35,734 సూపర్. 65 00:04:40,697 --> 00:04:41,698 సరే మరి. 66 00:04:48,997 --> 00:04:50,457 హా! 67 00:05:00,425 --> 00:05:02,845 బాసూ, ప్రిన్సిపల్ ని ఎందుకు కాపాడావు? నీకేమైనా పిచ్చా! 68 00:05:04,221 --> 00:05:07,057 జోక్ చేశా, బాసూ. ఊరికే జోక్ చేశా. నువ్వు నాకు హీరో లెక్క. 69 00:05:08,725 --> 00:05:10,269 సరే మరి, అందరూ కాస్త... 70 00:05:10,269 --> 00:05:12,312 జేకబ్ ని అందరూ కాస్త కుదురుకోనివ్వండి. 71 00:05:12,896 --> 00:05:16,441 జేకబ్ కార్డ్ మీద ఏమని రాసుందో ఈపాటికి మనందరికీ అర్థం అయ్యే ఉంటుంది. 72 00:05:16,441 --> 00:05:18,360 మీ అందరికీ చాలా ఉత్సాహంగా ఉండుంటుందని నాకు తెలుసు, 73 00:05:18,360 --> 00:05:21,154 ఎందుకంటే, అతను తను "సాధించగలిగింది" సాధించేశాడు. 74 00:05:22,155 --> 00:05:23,866 కానీ ఇది చరిత్ర క్లాస్. 75 00:05:23,866 --> 00:05:26,869 మనం చరిత్ర నుండి కొన్ని నేర్చుకుంటామన్నది నా అభిప్రాయం. 76 00:05:28,662 --> 00:05:30,038 కాబట్టి, ఈ మార్ఫో యంత్రం 77 00:05:30,038 --> 00:05:34,376 కొన్ని ముఖ్యమైన చారిత్రాత్మక సంఘటనల సమయంలో ఉండుంటే ఏం జరిగి ఉండేదో ఓసారి చర్చించుకుందాం. 78 00:05:34,376 --> 00:05:37,171 సరే మరి, రీటా. నువ్వు ఆబ్రహం లింకన్ వి, 79 00:05:37,171 --> 00:05:41,383 ఇప్పుడు నువ్వు ఇల్లినాయిలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో లాయరు వృత్తిని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టబోతున్నావు. 80 00:05:41,383 --> 00:05:43,343 -సరే. -అసలు మొదలుపెడతావా అనేది చూద్దాం. 81 00:05:43,343 --> 00:05:45,345 ఎందుకంటే, నేనే మార్ఫో యంత్రాన్ని, 82 00:05:45,345 --> 00:05:51,518 నేను నీకు ఒక కార్డును ఇచ్చాను, అందులో నువ్వు సాధించగలది... 83 00:05:53,687 --> 00:05:56,148 -"క్యాండీ మేకర్" అని ఉంది. -మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మిస్టర్ లింకన్, 84 00:05:56,148 --> 00:06:00,694 నువ్వు చాక్లెట్లు, లాలీ పాప్లు చేసుకుంటూ కూర్చుంటావా, 85 00:06:00,694 --> 00:06:05,115 లేకపోతే లాయరు వృత్తినే కొనసాగించి, చక్కని మార్గాన్ని ఏర్పర్చుకొని 86 00:06:05,115 --> 00:06:08,160 అమెరికన్ చరిత్రలో అత్యంత ప్రభావశీల అధ్యక్షుడివి అవుతావా? 87 00:06:08,160 --> 00:06:09,953 లాయరే అవుతా అనుకుంటా. 88 00:06:09,953 --> 00:06:11,622 అంతే కదా. 89 00:06:12,206 --> 00:06:13,665 ఇంకా బతికే ఉండేవాడు కదా. 90 00:06:14,374 --> 00:06:15,709 -ఏంటి? -లింకన్. 91 00:06:15,709 --> 00:06:18,253 క్యాండీ మేకర్ ని ఎవరూ చంపరు కదా. 92 00:06:18,253 --> 00:06:20,797 అప్పుడు అమెరికా ఒక గొప్ప రాష్ట్రపతిని మిస్ అయ్యుండేది కదా? 93 00:06:20,797 --> 00:06:23,300 బానిసలకు స్వేచ్ఛ దక్కాక, ఒకవేళ దక్కితే, వాళ్లని అమెరికా నుండి బలవంతంగానైనా పంపేయాలి 94 00:06:23,300 --> 00:06:26,094 అన్నది తన అభిమతం అని, పియోరియాలో ఇచ్చిన ప్రసంగంలో లింకన్ ప్రకటించాడు కదా. 95 00:06:26,094 --> 00:06:27,346 ఆహా. 96 00:06:27,346 --> 00:06:30,432 నిజానికి, ఈ క్లాసులో మనం యూరప్ చరిత్ర నుండి మాత్రమే చర్చించాలి, రీటా, 97 00:06:30,432 --> 00:06:32,935 కాబట్టి, పాఠం ప్రణాళిక ప్రకారం పోదాం. 98 00:06:32,935 --> 00:06:37,147 సవానా. హెన్రీ I, ఆల్టన్ ట్రీటీపై సంతకం చేసి ఉండేవాడు అంటావా, 99 00:06:37,147 --> 00:06:40,484 ఒకవేళ మార్ఫో యంత్రం అతనికి, తను... 100 00:06:40,484 --> 00:06:41,568 శుభ్రపరిచేవాడు అని చెప్పుంటే? 101 00:06:41,568 --> 00:06:44,947 మనం అసలు ఆల్టన్ ట్రీటీ దాకా వెళ్లనేలేదు. మీరు ఎప్పుడూ మాకు మార్ఫో గురించే చెప్తున్నారు. 102 00:06:44,947 --> 00:06:46,698 నేను దాని గురించే ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలా మంది 103 00:06:46,698 --> 00:06:50,160 ఆ యంత్రం చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటున్నారు, 104 00:06:50,160 --> 00:06:51,995 కానీ పర్యవసానాల గురించి ఆలోచించడం లేదు. 105 00:06:51,995 --> 00:06:53,372 మీకు "టీచర్" అని రాలేదా? 106 00:06:54,039 --> 00:06:56,875 మీరు కూడా... ఇప్పుడు టీచర్ చేసే పనే చేస్తున్నారు కదా? 107 00:06:56,875 --> 00:06:57,793 హా. 108 00:06:57,793 --> 00:06:58,877 ఆ పనే చేయడానికి ప్రయత్నిస్తున్నా. 109 00:06:59,503 --> 00:07:00,504 సరే మరి. 110 00:07:01,129 --> 00:07:04,007 ఒక పని చేద్దాం... మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను ఇప్పుడు. 111 00:07:04,007 --> 00:07:05,133 కొంపదీసి ఇంకో సినిమా చూపిస్తారా? 112 00:07:05,133 --> 00:07:07,302 లేదు, సినిమా కాదు. 113 00:07:08,345 --> 00:07:10,973 నేను ఒకరికి కాల్ చేస్తాను, 114 00:07:11,765 --> 00:07:13,851 వాళ్లు మార్ఫో యంత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తారనుకుంటా, 115 00:07:13,851 --> 00:07:15,185 నాకు అయితే అలానే అనిపిస్తుంది. 116 00:07:16,436 --> 00:07:19,064 సరే. మీకు చెప్పకముందే నేను తనకి కాల్ చేసి ఉండాల్సింది, కానీ... 117 00:07:19,064 --> 00:07:20,190 అయ్య బాబోయ్, ఆగండి. హేయ్... 118 00:07:20,190 --> 00:07:22,985 హలో, ప్రిన్సిపల్ పాట్! ఎలా ఉన్నారు? 119 00:07:22,985 --> 00:07:23,944 కనిపిస్తున్నంత దారుణంగా లేను, 120 00:07:23,944 --> 00:07:25,654 అంటే, దారుణంగా కనిపిస్తున్నాను కదా. 121 00:07:25,654 --> 00:07:28,031 మీరు బాగానే ఉన్నారు. 122 00:07:28,031 --> 00:07:30,534 చూడండి, మీ యాక్సిడెంట్ గురించి విని నేను చాలా బాధపడుతున్నాను, 123 00:07:30,534 --> 00:07:34,162 మీరు సాధించగల విషయాన్ని, ముందూ వెనుక ఆలోచించకుండా సాధించాలని చూసినందుకే ఇలా జరిగింది, 124 00:07:34,162 --> 00:07:35,873 ఏం జరిగిందో చెప్తారా? 125 00:07:35,873 --> 00:07:38,083 జరిగింది ఏంటో మీకు అందరికీ తెలిసిందే కదా, డస్టీ. 126 00:07:38,083 --> 00:07:40,169 జేకబ్ కోవాక్ నా ప్రాణాన్ని కాపాడాడు. 127 00:07:40,169 --> 00:07:42,963 హా, అవును, కానీ కాపాడక ముందు జరిగింది ఏంటో చెప్పండి. 128 00:07:42,963 --> 00:07:44,798 నేను నా సాధించగల విషయాని సాధించే ప్రయత్నం చేస్తూ 129 00:07:44,798 --> 00:07:46,133 బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. 130 00:07:46,675 --> 00:07:48,427 మళ్లీ బైక్ ఎక్కేసి తోలేయాలని చాలా ఆత్రంగా ఉంది. 131 00:07:49,595 --> 00:07:51,180 కానీ అది కుదరదు, ఈ లోపు, 132 00:07:51,180 --> 00:07:54,141 మిస్టర్ మలీక్ ని నాకు తోడుగా ఉంచుకున్నాను. 133 00:07:55,100 --> 00:07:57,436 -హలో, పిల్లలూ! -హలో. 134 00:07:57,436 --> 00:07:59,771 ఈరాత్రికి జరగనున్న హోమ్ కమింగ్ బాస్కెట్ బాల్ ఆటను 135 00:07:59,771 --> 00:08:01,940 నేను చూడలేను, నాకు అదే బాధగా ఉంది. 136 00:08:01,940 --> 00:08:05,277 ట్రాంపోలీన్ నుండి బంతిని బాస్కెట్ లోకి వేసే స్థితిలో నేను లేనని డాక్టర్ అన్నాడు. 137 00:08:05,277 --> 00:08:06,904 అయ్యయ్యో, అది దారుణం. 138 00:08:06,904 --> 00:08:09,489 ఆట ముందు జరిగే సంబరాల్లో నాకు అన్నింటికన్నా అదంటేనే ఎక్కువ ఇష్టం, 139 00:08:09,489 --> 00:08:12,075 ఇప్పుడు మీరు దాన్ని మిస్ అవ్వబోతున్నారు, ఎందుకంటే మీరు ముందూ వెనుక ఆలోచించకుండా... 140 00:08:12,075 --> 00:08:14,620 ఒక్క నిమిషం. నాకొక ఆలోచన వచ్చింది. 141 00:08:14,620 --> 00:08:17,247 నా బదులుగా, నా హీరో జేకబ్ బంతిని వేస్తే? 142 00:08:17,247 --> 00:08:20,626 సూపర్! జేకబ్ అయితే సూపర్! అతని సోదరునికి నివాళి అర్పించినట్టు కూడా ఉంటుంది. 143 00:08:20,626 --> 00:08:23,795 కాకపోతే బంతి వేయడానికి అతనికి ట్రాంపోలీన్ అవసరం ఉండదు, కానీ నీకు అది కావాలి. 144 00:08:24,379 --> 00:08:27,049 స్కూల్ లో అందరి ముందు నేను తలవంచుకోవాలా ఏంటి? 145 00:08:28,091 --> 00:08:29,510 కోల్టన్ కూడా అదే కోరుకొని ఉండేవాడు. 146 00:08:33,263 --> 00:08:34,932 సవాలు కోసం చూస్తున్నారా? చెస్ క్లబ్ 147 00:08:39,977 --> 00:08:40,979 హేయ్, జేకబ్. 148 00:08:42,063 --> 00:08:45,943 నువ్వు ప్రిన్సిపల్ పాట్ ని రక్షించావు చూడు, అది ఆషామాషీ విషయం కాదు. 149 00:08:45,943 --> 00:08:48,946 -దాన్ని విధి అని అనవచ్చు. -అంత సీన్ లేదులే. 150 00:08:49,446 --> 00:08:51,532 నీ తర్వాతి క్లాస్ ఎక్కడ జరుగుతోంది? అక్కడి దాకా నేను కూడా నీతో వస్తా. 151 00:08:52,199 --> 00:08:54,493 నువ్వు క్లాసుకు వెళ్లకుండా ఉంటే తప్ప. 152 00:08:54,993 --> 00:08:56,537 నిజానికి నేను... 153 00:09:00,999 --> 00:09:02,000 నేను క్లాసుకు వెళ్లట్లేదు. 154 00:09:04,127 --> 00:09:05,504 అవును, నేను... 155 00:09:06,338 --> 00:09:08,632 నేను చెస్ క్లబ్ కోసం సాధన చేయాలి. 156 00:09:09,550 --> 00:09:10,968 -నువ్వు చెస్ క్లబ్ లో ఉన్నావా? -లేను. 157 00:09:10,968 --> 00:09:12,761 అందుకే సాధన చేయాలి. 158 00:09:15,222 --> 00:09:18,183 భలే అందంగా ఉన్నాడు కదా? 159 00:09:20,269 --> 00:09:23,105 చనిపోయిన నా బాయ్ ఫ్రెండ్ కవల సోదరుడు అందంగా ఉన్నాడని నన్ను అడుగుతున్నావా? 160 00:09:24,481 --> 00:09:25,482 క్షమించు. 161 00:09:26,108 --> 00:09:28,026 అది అడగకూడనిది అనుకుంటా. 162 00:09:29,695 --> 00:09:31,238 ఈరాత్రి జరగబోయే ఆటకి నువ్వు వెళ్తున్నావా? 163 00:09:32,573 --> 00:09:33,740 తప్పకుండా వెళ్తాగా. 164 00:09:33,740 --> 00:09:35,784 నేను బ్యాండ్ లో ఉన్నాను. కోల్టన్ కి నివాళి మేము ప్లే చేయబోతున్నాం. 165 00:09:37,160 --> 00:09:37,995 క్షమించు. 166 00:09:39,037 --> 00:09:40,914 నేను నీతో మాట్లాడకూడనివే మాట్లాడుతూ ఉన్నానని అనిపిస్తోంది. 167 00:09:42,249 --> 00:09:44,293 లేదు, నన్ను క్షమించు. 168 00:09:44,293 --> 00:09:45,627 ఇవాళ అంతా చిత్రవిచిత్రంగా ఉంది. 169 00:09:45,627 --> 00:09:47,212 నువ్వు ఏం కావాలంటే అది చెప్పవచ్చు. 170 00:09:47,921 --> 00:09:49,047 సరే. 171 00:09:51,758 --> 00:09:53,468 నేను వెళ్లి చెస్ ఆడుతాలే. 172 00:10:05,397 --> 00:10:06,440 మరి... 173 00:10:09,359 --> 00:10:11,361 నీకు ఏం కావాలి, జేకబ్? 174 00:10:11,987 --> 00:10:16,533 నాకు అప్పుడప్పుడూ ఊపిరి సరిగ్గా ఆడట్లేదు. 175 00:10:17,034 --> 00:10:18,035 ఆహా. 176 00:10:18,035 --> 00:10:20,412 ఆ క్షణాలలో బాగా ఒత్తిడిగా అనిపిస్తూ ఉంటుందా? 177 00:10:22,915 --> 00:10:24,166 అనిపిస్తుందనే అనుకుంటున్నా. 178 00:10:24,166 --> 00:10:26,960 సమస్య ఏంటో చెప్పు, దాన్ని బట్టి మనం పరిష్కారం ఆలోచిద్దాం, ఏమంటావు? 179 00:10:29,379 --> 00:10:31,173 -సరే. -సరే. 180 00:10:31,673 --> 00:10:35,677 కొన్నేళ్ల, క్రిందట మా అమ్మ చనిపోయింది. 181 00:10:35,677 --> 00:10:37,971 దాన్నే, ఇప్పటిదాకా నేను పూర్తిగా మర్చిపోలేదు, 182 00:10:37,971 --> 00:10:40,974 ఎందుకంటే, మా నాన్న బాగా కృంగిపోయాడు, కాబట్టి నేనే కుటుంబాన్ని చూసుకోవలసి వచ్చింది. 183 00:10:40,974 --> 00:10:43,769 అతను తిరస్కారంలో ఉన్నాడు కాబట్టి, అదేమీ లేదు అంటాడు, కానీ... 184 00:10:44,269 --> 00:10:46,563 నన్నూ, నా కవల సోదరుడిని నేనే చూసుకోవలసి వచ్చింది, 185 00:10:46,563 --> 00:10:50,651 ఆ తర్వాత కొన్ని నెలల క్రితం, అతను కూడా కారు ప్రమాదంలో చనిపోయాడు, 186 00:10:50,651 --> 00:10:52,694 ఆ విషయం గురించి కూడా నేను నాన్నతో మాట్లాడలేను, 187 00:10:52,694 --> 00:10:56,573 ఎందుకంటే, ఆయన వాస్తవాల గురించి మాట్లాడలేకపోతున్నాడు. 188 00:10:56,573 --> 00:10:59,701 కాబట్టి, నా సొంత ఇంట్లో నాకు ఊపిరాడని పరిస్థితి అయిపోయింది. 189 00:10:59,701 --> 00:11:01,620 అందుకే నేను డ్రగ్స్ బాగా తీసుకుంటున్నాను, 190 00:11:01,620 --> 00:11:03,455 ఆ తర్వాత మార్ఫో కార్డుపై నాకు హీరో అని వచ్చింది, 191 00:11:03,455 --> 00:11:05,082 కానీ నేను హీరో అని నాకు అస్సలు అనిపించట్లేదు, 192 00:11:05,082 --> 00:11:07,209 ఎందుకంటే, ప్రిన్సిపల్ పాట్ విషయంలో నేను పొడిచేసింది ఏమీ లేదు. 193 00:11:07,209 --> 00:11:09,002 ఇంకా నా సోదరునిలా నేను హీరో కాలేను, 194 00:11:09,002 --> 00:11:11,964 అందువల్ల నేను నాలా కాకుండా వేరేవాళ్లలా నటించాల్సి వస్తోంది అనిపిస్తోంది. 195 00:11:12,673 --> 00:11:13,757 మీకు అర్థమవుతోంది కదా? 196 00:11:16,885 --> 00:11:17,928 వావ్. 197 00:11:18,720 --> 00:11:24,142 నాకు కూడా అచ్చం అలాగే అనిపిస్తోంది. 198 00:11:25,060 --> 00:11:26,103 ఏంటి? 199 00:11:27,229 --> 00:11:30,148 నేను ఈమధ్యే మెడికల్ కాలేజీ నుండి బయటకొచ్చాను, ఇప్పుడు ఒక మెడికల్ ఆఫీసును నడిపిస్తున్నా. 200 00:11:30,148 --> 00:11:31,859 కానీ నేను దీనికి సిద్ధంగా లేను. 201 00:11:31,859 --> 00:11:34,945 నువ్వు అన్నట్టుగానే, నేను కూడా, నాలా ఉండకుండా, వేరేవాళ్లలా నటిస్తున్నానని అనిపిస్తోంది. 202 00:11:35,779 --> 00:11:38,448 అంటే, నేను అదొక్కటే చెప్పలేదు కదా. 203 00:11:38,448 --> 00:11:43,036 కానీ... కానీ మీరు ఏం చేసినా అది బాగా చేస్తారనే అనుకుంటున్నా. 204 00:11:43,662 --> 00:11:48,250 ఈ కార్డ్ రాక ముందు, నేను కూడా అలాగే అనుకున్నాను. 205 00:11:51,128 --> 00:11:53,213 అంత్యక్రియల ఏర్పాట్లు చూసే వ్యక్తి 206 00:11:54,089 --> 00:11:56,341 హా, అది అంత గొప్పదేమీ కాదు, కానీ... 207 00:11:56,842 --> 00:11:58,051 అది నాకు పిచ్చెక్కిస్తోంది 208 00:11:58,552 --> 00:12:00,762 ఎవరైనా రోగులు వస్తే, నా బుర్ర పని చేయడం ఆగిపోతుంది. 209 00:12:00,762 --> 00:12:03,348 నాకు ఉన్న వైద్య జ్ఞానమంతా హుష్ కాకి అయిపోతుంది. 210 00:12:03,348 --> 00:12:08,478 నేను గుర్తించలేనిది ఏదైనా కనిపిస్తే, "ఏమీ లేదులే" అని చెప్పేస్తానంతే. 211 00:12:09,605 --> 00:12:13,275 అది చాలా దారుణం. 212 00:12:20,199 --> 00:12:22,618 మరి, నాకు ఈ వచ్చే భయాందోళనల విషయంలో నేనేం చేయాలి అంటారు? 213 00:12:24,536 --> 00:12:26,538 నేను చెప్పినట్టుగా, నా బుర్ర పని చేయట్లేదు, 214 00:12:26,538 --> 00:12:28,957 నీకేమైనా తెలిస్తే, నాకు కూడా చెప్పు. 215 00:12:30,584 --> 00:12:31,627 సరేనా? 216 00:12:32,503 --> 00:12:33,545 సరే. 217 00:12:34,713 --> 00:12:36,590 అంతే, అంతే, అంతే. 218 00:12:36,590 --> 00:12:39,134 నువ్వు మర్చిపోవాలి. నీకు ఒక కొత్త తోడును వెతికిపెడతాం. 219 00:12:39,134 --> 00:12:41,803 ఇంకొకటి, ఇంకొకటి. అంతే! సూపర్! 220 00:12:41,803 --> 00:12:45,390 -హేయ్... -జేక్. జేకబ్. ఎవరు వచ్చారో చూడు. 221 00:12:45,390 --> 00:12:48,060 హా. మీ నాన్న ఎలా ఉన్నాడా అని చూసిపోదామని వచ్చా. 222 00:12:48,060 --> 00:12:49,645 ఎందుకంటే, ఇవాళ కోల్టన్ కి నివాళి ఇవ్వబోతున్నాం. 223 00:12:49,645 --> 00:12:51,146 చాలా చక్కని ఆలోచన కదా? 224 00:12:51,146 --> 00:12:53,190 తను ఎప్పుడు కావాలంటే, అప్పుడు రావచ్చని చెప్పాను. 225 00:12:53,190 --> 00:12:56,652 నువ్వు ఇవాళ బంతిని బాస్కెట్ లోకి వేయబోతున్నావని తను చెప్పింది. 226 00:12:56,652 --> 00:12:57,778 సూపర్ విషయం కదా. 227 00:12:57,778 --> 00:12:59,696 నా హీరో బంతిని బాస్కెట్ లోకి వేయడం. 228 00:12:59,696 --> 00:13:01,907 హా. నాకు కూడా యమ ఆత్రంగా ఉంది. 229 00:13:03,325 --> 00:13:04,493 ఏం జరుగుతోంది ఇక్కడ? 230 00:13:04,493 --> 00:13:07,329 నేను ఉద్యోగం మానేశాను కాబట్టి... నేను ఉద్యోగం మానేశా. 231 00:13:08,080 --> 00:13:09,498 కొన్ని పనులు పూర్తి చేద్దామని అనుకున్నా. 232 00:13:09,498 --> 00:13:11,375 నేను ఎంత గొప్ప గొప్ప వస్తువులను కనుగొంటున్నానో చూడు. 233 00:13:11,959 --> 00:13:13,335 దీన్ని చూడు. 234 00:13:13,961 --> 00:13:16,463 హా, నువ్వు ఉద్యోగం మానేస్తే, ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని నేను కలలో కూడా అనుకోలేదు. 235 00:13:16,463 --> 00:13:18,549 చూడు, నేను కోల్టన్ పాత వస్తువులు కొన్నింటిని కనుగొన్నాను. 236 00:13:21,468 --> 00:13:22,302 కోల్టన్ జెర్సీ. 237 00:13:22,302 --> 00:13:25,472 బంతి విసిరేటప్పుడు దీన్ని వేసుకుంటావా? కోల్టన్ కి నివాళిగా. 238 00:13:25,472 --> 00:13:27,182 అది మంచి ఆలోచన కాదేమో. 239 00:13:27,891 --> 00:13:29,518 నాకు అసలు బంతిని వేయాలని కూడా లేదు. 240 00:13:29,518 --> 00:13:31,770 నువ్వు సూపర్ గా వేయగలవులే. ఏమంటావు? 241 00:13:32,271 --> 00:13:34,231 కానివ్వు. నేను నేర్పిస్తానులే. 242 00:13:38,110 --> 00:13:41,154 నా దగ్గర ట్రాంపోలీన్ లేదు, కానీ నేను ర్యాంపును తయారు చేయగలను. 243 00:13:42,197 --> 00:13:43,740 నేను వెళ్లి కట్టెలు కొడతాను. 244 00:13:46,910 --> 00:13:49,371 నీకు ఊరట కలిగిస్తుందంటే ఓ విషయం చెప్తాను, నువ్వు బంతిని బాస్కెట్ లోకి వేయగలవని 245 00:13:49,371 --> 00:13:51,039 ఎవరూ అనుకోవట్లేదులే. 246 00:13:51,623 --> 00:13:53,542 ప్రిన్సిపల్ పాట్ ఒక్కసారి కూడా మిస్ కాకుండా వేసింది. 247 00:13:54,168 --> 00:13:55,210 సరే మరి. 248 00:13:55,210 --> 00:13:57,880 నేను తను బంతిని విసిరే వీడియోలను చూశాను, తను... 249 00:14:01,633 --> 00:14:02,509 సరే. 250 00:14:02,509 --> 00:14:04,803 తను నెమ్మదిగానే ఆరంభించింది, కానీ... 251 00:14:07,347 --> 00:14:10,267 -వావ్! తను భలేగా ఎగిరింది. -మామూలుగా కాదు. 252 00:14:12,603 --> 00:14:14,771 ఆటకు ఆ జెర్సీ వేసుకొని వస్తున్నావా ఏంటి? 253 00:14:17,274 --> 00:14:18,609 అంటే, 254 00:14:18,609 --> 00:14:22,821 కోల్టన్ చనిపోయాక, నాన్న వాడి పేరును ప్రస్తావించడం ఇదే తొలిసారి, కాబట్టి... 255 00:14:23,488 --> 00:14:25,449 ఈ సమయంలో నాన్నని నిరుత్సాహపరచాలని నాకు లేదు. 256 00:14:25,949 --> 00:14:26,992 సరే. 257 00:14:28,243 --> 00:14:30,704 కోల్టన్ జాక్ స్ట్రాప్ ని వేసుకోమని నాన్న అడగలేదులే, అందుకు సంతోషం. 258 00:14:30,704 --> 00:14:33,624 హా, కానీ బాస్కెట్ బాల్ ఆటకి దాని అవసరం లేదులే, కానీ... 259 00:14:33,624 --> 00:14:35,542 సరే. నీకు ఇన్ని విషయాలు తెలుసని నాకు తెలీదే. 260 00:14:35,542 --> 00:14:36,668 నువ్వే బంతిని వేస్తే బాగుంటుందేమో. 261 00:14:36,668 --> 00:14:39,087 కోల్టన్ జాక్ స్ట్రాప్ ని వేసుకోవాలంటావా? ఆనందంగా వేసుకుంటా. 262 00:14:48,472 --> 00:14:50,349 బెడ్ఫర్డ్ బార్ 263 00:14:50,349 --> 00:14:53,060 సరే మరి. అమ్మాయికి రెడ్ వైన్. 264 00:14:53,060 --> 00:14:54,144 సూపర్. 265 00:14:55,020 --> 00:14:57,773 -ఫాదర్ కి జింజర్ ఏల్. -థ్యాంక్యూ. 266 00:14:57,773 --> 00:14:59,358 -హా. -ఒక్క నిమిషం, హానా. ఆగు. 267 00:14:59,358 --> 00:15:01,485 హానా ఈ ఊరుకు కొత్తగా వచ్చిన అమ్మాయి. ఇక్కడ ఏం జరుగుతోందో తనకి తెలీదు. 268 00:15:01,485 --> 00:15:02,736 లేదు, నాకు అర్థమైందనే అనుకుంటున్నా. 269 00:15:02,736 --> 00:15:05,155 మీరందరూ తాగేసి, మీ పిల్లల బాస్కెట్ బాల్ ఆటలకు వెళ్తున్నారు. 270 00:15:05,155 --> 00:15:06,114 అవును. 271 00:15:06,114 --> 00:15:09,034 నిజానికి, ఈ సాయంత్రం నేను పూర్వ విద్యార్థిగా వెళ్తున్నాను, 272 00:15:09,034 --> 00:15:12,538 ఆ రోజుల్లో నేను బాస్కెట్ బాల్ ఆడేవాడిని, అదిగాక హాకీ, రన్నింగ్... 273 00:15:12,538 --> 00:15:13,455 నేను కూడా ఆడాను. 274 00:15:13,455 --> 00:15:15,332 కాస్ ఉండి, నా కోసం చీర్ చేసేది. 275 00:15:15,332 --> 00:15:17,918 నేను చీర్ లీడర్ ని, కాబట్టి అందరి కోసమూ చీర్ చేసేదాన్ని. 276 00:15:17,918 --> 00:15:19,837 నేను జేసన్ రొడ్రీగెజ్ కోసమే చీర్ చేశాను. 277 00:15:19,837 --> 00:15:20,754 కథ వ్యాఖ్యాత 278 00:15:20,754 --> 00:15:24,049 గుర్తుందా? అతని కటి ప్రాంతంపై ఒక గద్ద టాటూ ఉండేది. 279 00:15:24,049 --> 00:15:25,843 -ఓరి దేవుడా. -కటి ప్రాంతం పైన? 280 00:15:25,843 --> 00:15:27,594 నిజం చెప్తున్నా కదా, నాకు టాటూల మగవాడు అంటే భలే ఇష్టం. 281 00:15:29,680 --> 00:15:31,139 నీకు టాటూ ఉన్న మగవాళ్లంటే ఇష్టమా? 282 00:15:31,139 --> 00:15:34,518 సరే, కేసీ. ఆ విషయాన్ని నోట్ చేసుకున్నా. హేయ్, గుర్తుందా, కాలేజీలో ఆఖరి సంవత్సరం... 283 00:15:34,518 --> 00:15:35,727 ఫాదర్ రూబెన్, మీరు అప్పుడు లేరు. 284 00:15:35,727 --> 00:15:39,189 కాబట్టి, మీకు ఓ గొప విషయం చెప్పాలనుకుంటున్నాను, అది నిజంగా జరిగిందే, 285 00:15:39,189 --> 00:15:41,400 నేను కోర్టులో ఒక పక్క నుండి మరో పక్కనున్న బాస్కెట్ లోకి బంతి వేశా. 286 00:15:41,984 --> 00:15:42,901 సరిగ్గా నెట్ లో పడింది. 287 00:15:43,527 --> 00:15:46,029 ఇంకొన్ని యుగాలకైనా అది అట్లే మిగిలిపోతుందేమో. 288 00:15:46,029 --> 00:15:48,365 -ఆ ఆట మనం ఓడిపోయాం కదా? -అవును, చాలా దారుణంగా ఓడిపోయాం. 289 00:15:48,365 --> 00:15:51,702 హా. డస్టీ బెంచ్ మీద కూర్చోని స్కోర్ బోర్డును బాగానే చూస్తూ ఉన్నాడు. 290 00:15:51,702 --> 00:15:54,204 -నేను కాసేపు విరామం... -కానీ స్కోర్ ఎవరికీ గుర్తు లేదు, డీ బాసూ. 291 00:15:54,204 --> 00:15:56,164 వాళ్లకి కేవలం ఆ బంతి, దాన్ని విసిరిన వ్యక్తి మాత్రమే గుర్తున్నారు. 292 00:15:57,708 --> 00:15:59,835 ఏదేమైనా, ఇక నా విజయాల గురించి ఇక చాలు. 293 00:15:59,835 --> 00:16:01,378 నేను అందరి మార్ఫో కార్డులపై ఏం వచ్చిందో ఊహిస్తా. 294 00:16:01,378 --> 00:16:03,172 వద్దులే. ఆ అవసరం లేదు. 295 00:16:03,172 --> 00:16:05,841 -సరే, నేను ఈ గ్లాసులని తీసేస్తా. -నీది అయితే "పార్టీ చెడగొట్టేవాడు" అనే వచ్చుంటుంది. 296 00:16:05,841 --> 00:16:08,093 లేదు, నిజంగానే ఊహించి చెప్తాను ఆగు, బాసూ. నీకు... 297 00:16:09,219 --> 00:16:11,680 నువ్వు సాధించగల విషయం, "పురుషుడు" లేదా "సగటు పురుషుడు" అని వచ్చుంటుంది. 298 00:16:11,680 --> 00:16:13,307 నాకు "టీచర్ ఈల వేసే వ్యక్తి" అని వచ్చింది. 299 00:16:13,307 --> 00:16:15,350 అవును. నన్ను అడిగితే, 300 00:16:15,350 --> 00:16:17,603 ఈ ఊరిలో ఇతనే ఉత్తమ టీచర్, ఇంకా ఈల వేయగల వ్యక్తి. 301 00:16:17,603 --> 00:16:19,813 పరమ బోరింగ్ గా ఉంది. నాట్, ఇప్పుడు నీది చెప్తా. 302 00:16:19,813 --> 00:16:21,398 నీకు ఖచ్చితంగా "కథ వ్యాఖ్యాత" అనే వచ్చుంటుంది. 303 00:16:21,398 --> 00:16:22,900 నీకెవరు చెప్పారు? 304 00:16:24,067 --> 00:16:26,612 ఫాదర్ రూబెన్. మీకు "ఫాదర్" అనే వచ్చుంటుంది. 305 00:16:27,112 --> 00:16:29,615 నిజానికి, నేను ఆ యంత్రం జోలికి వెళ్లలేదు, ఇకపై వెళ్ళను కూడా. 306 00:16:29,615 --> 00:16:30,949 అది తెలివైన నిర్ణయం అనుకుంటా. 307 00:16:30,949 --> 00:16:34,119 ఎందుకంటే, మీకు "ఫాదర్" అని రాకపోతే, జనాలు మిమ్మల్ని నమ్మరు. 308 00:16:34,119 --> 00:16:36,496 ఎందుకంటే, ఆ యంత్రానికి తెలీనిది అంటూ ఏది ఉన్నట్టు లేదు. 309 00:16:37,581 --> 00:16:39,333 మీకు "ఫాదర్" అనే వస్తుందిలే, ఫాదర్. 310 00:16:39,333 --> 00:16:41,543 ఆ రెండు డాలర్లను దానికి వాడకుండా, ఇంకేదాని కోసమైనా వాడుకోండి. 311 00:16:41,543 --> 00:16:42,503 ఇప్పుడు కాస్ ది చెప్తాను. 312 00:16:43,086 --> 00:16:45,547 కాస్, కాస్, కేసీ. నా బంగారు కాస్. 313 00:16:45,547 --> 00:16:48,467 సరే మరి. నేను ముందుగా నీకు "మోడల్" కానీ, "సినిమా స్టార్" కానీ వచ్చుంటుంది అనుకున్నా. 314 00:16:48,467 --> 00:16:51,512 "దేవత" అని కూడా వచ్చుండవచ్చు అనిపించింది. కానీ నీది మరీ నిర్దిష్టంగా వచ్చుంటుంది అనిపించింది. 315 00:16:51,512 --> 00:16:54,014 నువ్వు ఊహించి త్వరగా చెప్పేయవా, ఆటకు వెళ్లిపోదాం. 316 00:16:54,014 --> 00:16:55,807 ఒక్క నిమిషం. ఈ ఊరిలోని అత్యంత తెలివైన, అందమైన అమ్మాయికి 317 00:16:55,807 --> 00:16:57,893 ఏం వచ్చి ఉంటుందో తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది మరి. 318 00:16:58,393 --> 00:17:00,938 కానీ నాకు తెలియట్లేదు. "అత్యద్భుతం" అనేది సాధించగల విషయం కిందకే వస్తుందా? 319 00:17:00,938 --> 00:17:02,564 లేదు, కానీ నేనే చెప్పి నీకు సాయపడతాలే. 320 00:17:02,564 --> 00:17:05,317 ఎందుకంటే నాకు "రాచరికత్వం" వచ్చింది. 321 00:17:05,317 --> 00:17:08,403 అవునులే. అది పూర్తిగా అర్థవంతంగా ఉంది. 322 00:17:08,403 --> 00:17:09,988 ఇంకా, నాకు కూడా అలాంటిది ఒకటి కావాలి. 323 00:17:09,988 --> 00:17:13,157 -నేను చేసి ఇవ్వగలను. దాన్ని చేసింది కూడా నేనే. -అవును, కానీ నాది "సూపర్ స్టార్" అని ఉండాలి, 324 00:17:13,157 --> 00:17:16,244 నువ్వు ఆలోచిస్తే, "రాచరికత్వం"కు అది సరిగ్గా సరిపోతుంది. 325 00:17:16,244 --> 00:17:18,829 కానీ... నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 326 00:17:18,829 --> 00:17:21,333 "టీచర్"కి, "రాచరికత్వం"కి ఎలా పొత్తు కుదిరిందా అని? 327 00:17:21,333 --> 00:17:22,960 "టీచర్/ఈల వేసే వ్యక్తి." 328 00:17:22,960 --> 00:17:25,587 మా ఇద్దరికి చక్కని పొత్తు కుదిరింది కాబట్టే, వాటికి కూడా పొత్తు కుదురుతుంది, అందుకే కదా 329 00:17:25,587 --> 00:17:29,550 -మేము 23 ఏళ్లు కలిసి ఉన్నాం. -మూడు... అవును. 330 00:17:29,550 --> 00:17:32,511 అదీగాక, ఆ కార్డులు ద్వారానే అంతా తెలిసిపోతుందా ఏంటి! 331 00:17:32,511 --> 00:17:36,807 ఎందుకంటే, డస్టీ కేవలం "టీచర్, ఈల వేసే వ్యక్తి" మాత్రమే కాదు, అదే అవుతాడని కూడా అనుకోలేం. 332 00:17:37,724 --> 00:17:39,101 -కాబట్టి, అదన్నమాట. -అవునా? 333 00:17:39,101 --> 00:17:40,894 అయితే, ఇంకేదైనా అవ్వు, డీ బాసూ. 334 00:17:41,728 --> 00:17:43,105 -మాకు చికెన్ వింగ్స్ ఇస్తారా? -అవును. 335 00:17:43,689 --> 00:17:45,357 అవును, వింగ్స్. అది చాలా మంచి ఆలోచన. 336 00:17:49,653 --> 00:17:54,825 గుడ్ ఈవినింగ్, హూవ్స్ అభిమానులారా, లేదా "సుస్వాగతం, హూవర్స్! అని అనమంటారా? 337 00:17:58,370 --> 00:18:01,874 మరో అద్భుతమైన సీజన్ కి మీకు స్వాగతం పలుకుతూనే, 338 00:18:02,583 --> 00:18:04,960 ఇవాళ్టి ఆట కోల్టన్ కోవాక్ కి అంకితం అని 339 00:18:04,960 --> 00:18:09,214 సగర్వంగా ప్రకటిస్తున్నాను. 340 00:18:10,132 --> 00:18:12,384 కోల్టన్ కేవలం మన జట్టుకు మాత్రమే కెప్టెన్ కాదు, 341 00:18:13,051 --> 00:18:15,095 మన హృదయాలను దోచుకొన్న కెప్టెన్ కూడా. 342 00:18:16,013 --> 00:18:18,098 అతడిని దైవదూత అని అనవచ్చు. 343 00:18:19,433 --> 00:18:22,728 అందుకే ఈ రాత్రి వేళ, డీర్ఫీల్డ్ హై స్కూల్ మార్చింగ్ బ్యాండ్ 344 00:18:22,728 --> 00:18:27,608 షాగీ, రేవాన్ కలిసి పాడిన "ఏంజెల్" సంగీతాన్ని మనకి వినిపించబోతున్నారు. 345 00:18:27,608 --> 00:18:28,775 అయ్య బాబోయ్. 346 00:18:56,220 --> 00:18:58,680 సరే మరి. ఇక మనం బయలుదేరాలి. ఈ వేడి వేడి చికెన్ వింగ్స్ ని ఎవరు లాగిస్తారు? 347 00:18:58,680 --> 00:19:00,098 వాటి సంగతి నేను చూసుకుంటాలే. 348 00:19:00,098 --> 00:19:01,934 జాగ్రత్త, కేసీ. అవి వేడి వేడి వింగ్స్. 349 00:19:02,768 --> 00:19:05,020 -అయితే? -వేడి వేడి వింగ్స్ అంటే నీకు ఇష్టం లేదు కదా? 350 00:19:05,020 --> 00:19:06,522 నాకు మొదట్నుంచీ ఇష్టమే. 351 00:19:06,522 --> 00:19:09,024 ఏంటి? మనం ఎప్పుడూ హనీ గార్లిక్ వింగ్సే తెచ్చుకుంటాం కదా. 352 00:19:09,024 --> 00:19:10,400 ఎందుకంటే, నీకు అదే ఇష్టం కాబట్టి. 353 00:19:10,400 --> 00:19:13,779 అయ్యయ్యో. మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం నా ఉద్దేశం కాదు. కొట్టుకోకండి, మిత్రులారా. 354 00:19:13,779 --> 00:19:17,074 చూడు, నాకు మొదట్నుంచీ స్పైసీగా ఉండే ఆహారమంటే ఇష్టం. కానీ నీకు... 355 00:19:17,074 --> 00:19:19,952 మనం పొరపాటున మీడియమ్ సాల్సా ని ఆర్డర్ చేసినప్పుడు, నువ్వు కారం తట్టుకోలేక అల్లాడిపోయావు. 356 00:19:19,952 --> 00:19:23,789 -అవును, నా నాలుక కాలిపోయింది మరి, కాబట్టి... -అందుకే మనం ఎప్పుడూ హనీ గార్లిక్ తెప్పించుకొనేది. 357 00:19:23,789 --> 00:19:25,457 మీరు గేమ్ ప్రారంభాన్ని మిస్ అవుతారు. 358 00:19:25,457 --> 00:19:27,501 బిల్ నేను కడతాను. మీరు బయలుదేరండి. 359 00:19:27,501 --> 00:19:28,919 మీరు రావట్లేదా, ఫాదర్? 360 00:19:28,919 --> 00:19:30,629 నేను క్రీడలు పెద్దగా చూడనులే, కానీ... 361 00:19:30,629 --> 00:19:32,047 -థ్యాంక్యూ. -చల్లగా ఉండండి. 362 00:19:32,047 --> 00:19:33,715 ఇక బార్ అంతా మీదే, ఫాదర్. 363 00:19:33,715 --> 00:19:35,843 పట్టణంలో కూడా మీరు ఒక్కరే ఉంటారు. 364 00:19:36,635 --> 00:19:38,095 మంచి పిల్లాడిలా ఉండండి, ఫాదర్. 365 00:19:38,679 --> 00:19:40,722 పదండి, హూవర్స్! ఆట మొదలయ్యే సమయం అయింది! 366 00:19:40,722 --> 00:19:43,100 ఈ ఆట గెలుద్దాం! అదరగొట్టేయండి, హూవ్స్! 367 00:19:44,059 --> 00:19:46,228 -అదరగొట్టేయండి, హూవ్స్! అదరగొట్టేయండి, హూవ్స్! -వావ్. 368 00:19:46,812 --> 00:19:48,438 -థ్యాంక్యూ. -మీకు ఇది అవసరమని తెచ్చా. 369 00:19:48,438 --> 00:19:50,399 జియార్జియోతో అయిదు నిమిషాలు గడిపితే, ఎవరి పరిస్థితి అయినా ఇంతే. 370 00:19:50,399 --> 00:19:53,360 నిజానికి నాకు అతనంటే భలే ఇష్టం. అస్సలు గొప్పలే చెప్పుకోడబ్బా. 371 00:19:53,360 --> 00:19:55,112 ఎంత స్వరంలో మాట్లాడాలో, అంతే స్వరంలో మాట్లాడతాడు. 372 00:19:55,863 --> 00:19:57,197 ఒక వర్గానికి స్ఫూర్తి అతను. 373 00:19:57,197 --> 00:19:58,490 మామూలుగా కాదు. 374 00:20:07,541 --> 00:20:08,542 హేయ్. 375 00:20:09,042 --> 00:20:10,669 మీ నాన్నతో సాధన ఎలా సాగింది? 376 00:20:13,630 --> 00:20:16,049 అస్సలు బాగా సాగలేదు, అందుకే ఆయన రాకూడదని అనుకున్నాడు అనుకుంటా. 377 00:20:17,176 --> 00:20:18,760 మేము ఇక్కడ కలుసుకోవాలి, కానీ... 378 00:20:20,262 --> 00:20:21,305 అది చాలా దారుణం. 379 00:20:21,972 --> 00:20:23,473 నీకు ఊరట కలిగిస్తుందేమో అని చెప్తున్నాను, 380 00:20:23,473 --> 00:20:26,018 నా అదిరిపోయే సూసాఫోన్ ని నేను వాయిస్తున్నప్పుడు మా అమ్మానాన్నలు లేరు అనుకుంటా. 381 00:20:26,018 --> 00:20:28,270 కానీ మీరు చాలా అద్భుతంగా వాయించారు. 382 00:20:28,896 --> 00:20:33,233 అదిరిపోయే సూసాఫోన్ ని వాయించిన భాగం మాత్రం అదిరిపోయింది. 383 00:20:33,817 --> 00:20:34,860 థ్యాంక్స్. 384 00:20:35,569 --> 00:20:38,155 ఇదేమీ "అదిరిపోయే" సూసాఫోన్ కాదు. 385 00:20:38,989 --> 00:20:42,784 అర్థమైంది. ఇది మామూలు సూసాఫోనే. "అదిరిపోయింది" మా బ్యాండ్ షో. 386 00:20:43,285 --> 00:20:46,121 నిజానికి కోచ్ ఈగల్సన్ మా చేత "ఇట్ వాసన్ట్ మీ"ని ప్లే చేయించాలనుకున్నాడు... 387 00:20:46,622 --> 00:20:48,290 ఆ తర్వాత, "ఏంజెల్"ని వాయిస్తామని ఎలాగోలా ఆయన్ని ఒప్పించాను, 388 00:20:48,290 --> 00:20:50,042 కానీ అదే అస్సలు అర్థం కావట్లేదు. 389 00:20:50,042 --> 00:20:52,127 ఒకరితో సరిపెట్టుకోలేని మనిషి ఎలా ఒప్పుకున్నాడో అర్థం కావట్లేదు. 390 00:20:52,127 --> 00:20:56,423 అందులో కోచ్ ఈగల్సన్ ని కూడా ఏమనలేము. కోల్టన్, షాగీకి చాలా పెద్ద ఫ్యాన్ మరి. 391 00:20:56,423 --> 00:20:59,176 అవును. షాగీ అంటే పిచ్చి. 392 00:21:01,762 --> 00:21:02,971 నువ్వు ఇప్పుడు అది ఊదాలి కదా? 393 00:21:02,971 --> 00:21:04,640 ఇది ఎంత బరువో తెలుసా? 394 00:21:05,140 --> 00:21:07,351 ఎవరూ గమనించరు సరి కదా, పట్టించుకోరు కూడా. 395 00:21:11,313 --> 00:21:14,691 ట్రీనా చాలా కోపంగా ఉండుంటుంది. తను కనబడిందా? కనిపించిందా? 396 00:21:14,691 --> 00:21:16,860 తనకి కోపం రాదు. తను వాయించేటప్పుడు మనం వస్తే తనకి నచ్చదు కదా. 397 00:21:16,860 --> 00:21:19,112 ఆట ఎనిమిది గంటలకు మొదలయిందని నువ్వు అన్నావు. 398 00:21:19,112 --> 00:21:22,032 అహా, మరి నువ్వు నీకు హనీ, గార్లిక్ వింగ్స్ అంటే ఇష్టమని చెప్పావు కదా, కాబట్టి... 399 00:21:22,658 --> 00:21:23,784 అయ్య బాబోయ్. డస్టీ. 400 00:21:23,784 --> 00:21:25,953 నాకు వేరే రకమైన వింగ్స్ అంటే ఇష్టం. అదేమైనా పెద్ద విషయమా ఏంటి? 401 00:21:25,953 --> 00:21:27,746 ఇన్నేళ్ల మన బంధంలో, ఆ ముక్క ఎప్పుడైనా తమరు చెప్పి ఉంటే, 402 00:21:27,746 --> 00:21:29,248 పెద్ద విషయం అనిపించేది కాదు. 403 00:21:29,248 --> 00:21:31,500 ఇంకా నీకు హనీ, గార్లిక్ వింగ్స్ అంటే ఇష్టమేమో అని నేను అనుకుంటూ ఉన్నా. 404 00:21:31,500 --> 00:21:34,628 కానీ అది నిజం కాదు. నీకు స్పైసీగా ఉండే ఆహారం, ఇంకా టాటూలు ఉండే మగాళ్లంటే ఇష్టం. 405 00:21:34,628 --> 00:21:36,255 నీ గురించి తర్వాత నాకు ఇంకేం తెలుస్తాయో? 406 00:21:36,255 --> 00:21:37,756 బహుశా నీకు డ్రగ్స్ తీసుకొనే అలవాటు కూడా ఉందేమో? 407 00:21:38,507 --> 00:21:40,008 అయ్యయ్యో. నా డ్రగ్స్ గురించి కూడా నీకు తెలిసిపోయిందా? 408 00:21:40,008 --> 00:21:42,928 పెళ్లి కూతురులా కాకుండా త్వరగా రండి. ఆట మొదలవ్వబోతోంది. 409 00:21:42,928 --> 00:21:44,721 పక్కకు జరగండి. ఆటగాళ్లను గౌరవించండి. 410 00:21:44,721 --> 00:21:47,224 రండి, "పూర్వ విద్యార్థులారా," ఇక్కడికి రండి! 411 00:21:48,267 --> 00:21:51,687 కాస్. మన ఈ గమ్మత్తైన స్వెటర్లను జనాలు గమనించకూడదని ఆశిస్తున్నా. 412 00:21:51,687 --> 00:21:53,605 యాహూ! వాళ్లు గమనించాలనే కోరుకుంటున్నా. 413 00:21:54,189 --> 00:21:56,400 అంటే, నాకే తెలిసి ఉంటే వేడి వేడి వింగ్స్ ని ఆర్డర్ ఇచ్చుండేవాడిని. 414 00:21:56,400 --> 00:21:57,609 లేదా అది సగం, ఇది సగం ఇచ్చుండేవాడిని. 415 00:21:57,609 --> 00:22:00,487 ఏంటంటే... నువ్వు నాకు చెప్పకపోతే, నీకు వేరేది ఇంకేదైనా కావాలని 416 00:22:00,487 --> 00:22:01,572 నాకు ఎలా తెలుస్తుంది? 417 00:22:01,572 --> 00:22:03,448 ఇప్పుడు చెప్తున్నా కదా. 418 00:22:03,949 --> 00:22:06,201 అది మంచి విషయమే కదా? 419 00:22:06,201 --> 00:22:08,745 అంటే, ఇప్పటికీ మనం ఒకరినొకరం ఆశ్చర్యపరుచుకోవచ్చు. 420 00:22:11,957 --> 00:22:13,417 అదరగొట్టేయండి, హూవ్స్! 421 00:22:13,417 --> 00:22:17,004 -గేమ్ కొట్టండి, హూవ్స్! -గెలవండి, హూవ్స్! కప్ పట్టండి, హూవ్చ్! 422 00:22:17,004 --> 00:22:19,298 జాన్సన్స్ జనరల్ స్టోర్ కిరాణా సామాగ్రి, కాఫీ, హార్డ్ వేర్ 423 00:22:51,371 --> 00:22:52,456 మంచిదే వచ్చి ఉంటుంది అనుకుంటా. 424 00:22:56,877 --> 00:22:57,920 అయ్య బాబోయ్! 425 00:22:59,129 --> 00:23:01,924 ఈ యంత్రం పని చేస్తుందని ఇంత కన్నా ఏం రుజువు కావాలి. 426 00:23:01,924 --> 00:23:03,467 నేను వెళ్లి నా కెమెరా తెస్తా. 427 00:23:16,438 --> 00:23:20,776 ఇక ఇవాళ్టి రాత్రికి ప్రిన్సిపల్ పాట్ ఇక్కడికి రాలేదు కాబట్టి, 428 00:23:21,944 --> 00:23:27,574 సంప్రదాయబద్ధంగా, బంతిని బాస్కెట్ లో వేసే పనిని, డీర్ఫీల్డ్ హై స్కూల్ విద్యార్థి, 429 00:23:28,200 --> 00:23:33,163 ఇంకా కోల్టన్ కోవాక్ కి ఆత్మీయ సోదరుడైన జేకబ్ కోవాక్ తీసుకుంటున్నాడు! 430 00:23:36,875 --> 00:23:40,170 -హా, ఇరగదీసేయ్, జేకబ్! -అదరగొట్టేయ్, జేకబ్! 431 00:23:40,170 --> 00:23:44,508 కానివ్వు! అదరగొట్టేసేయ్, జేకబ్! 432 00:23:49,221 --> 00:23:50,931 బంతిని వేసే పనిని జేకబ్ కి అప్పగిస్తున్నారా? 433 00:23:51,515 --> 00:23:52,933 అలా అసలు ఎలా చేయగలుగుతున్నారు? 434 00:23:52,933 --> 00:23:54,768 అది నిజానికి చారిటీ కోసం చేస్తారు. 435 00:23:54,768 --> 00:23:58,188 ప్రిన్సిపల్ పాట్, తను బంతిని బాస్కెట్ లో వేయలేకపోతే స్కూల్ లైబ్రరీ కోసం 1,000 డాలర్లు ఇస్తానంది, 436 00:23:58,188 --> 00:23:59,857 కానీ తన గురి ఎప్పుడూ తప్పలేదు. 437 00:23:59,857 --> 00:24:01,984 అందుకే మా లైబ్రరీ చండాలంగా ఉంటుంది. 438 00:24:01,984 --> 00:24:04,486 అయ్యయ్యో. పాపం వాడు కంగారు పడిపోతుంటాడు. 439 00:24:05,070 --> 00:24:07,030 -అతని పట్ల మనకి ప్రేమ ఉందని మనం చూపాలి. -అవును. 440 00:24:08,824 --> 00:24:10,617 -కాస్, ఏం చేస్తున్నావు? -అంతే, కేసీ. 441 00:24:10,617 --> 00:24:12,286 నువ్వేం చేసినా సూపర్ గా ఉంటుంది. 442 00:24:13,704 --> 00:24:15,247 హాయ్. క్షమించాలి, కోచ్. హేయ్. 443 00:24:16,623 --> 00:24:19,668 హేయ్! హేయ్! డీర్ఫీల్డ్! 444 00:24:20,961 --> 00:24:24,965 సరే మరి, మిత్రులారా. మన వాడికి ప్రేమని, మద్దతును చూపుదాం, ఏమంటారు? 445 00:24:24,965 --> 00:24:26,508 సరే మరి, కానివ్వండి! కానివ్వండి! 446 00:24:26,508 --> 00:24:30,137 -కోవాక్! కోవాక్! కోవాక్! కోవాక్! -కోవాక్! కోవాక్! 447 00:24:32,055 --> 00:24:33,807 -కోవాక్! కోవాక్! -కోవాక్! 448 00:24:33,807 --> 00:24:34,850 కోవాక్! 449 00:25:10,761 --> 00:25:12,137 అదరగొట్టేయ్, జేకబ్! యాహూ! 450 00:25:13,430 --> 00:25:14,932 ఇక బంతిని విసరాలి! 451 00:25:14,932 --> 00:25:17,392 నువ్వు ట్రాంపోలీన్ నుండి ఎగిరేటప్పుడు దీన్ని నీకు విసరమంటావా? 452 00:25:17,392 --> 00:25:18,977 ఇంకా సంక్లిష్టం చేసుకోవడం ఎందుకులెండి! 453 00:25:18,977 --> 00:25:21,188 సరే. కానీ ఒక్క మాట. 454 00:25:21,980 --> 00:25:24,191 నువ్వు ఈ పని చేయలేవని జనాలు అనుకుంటారు... 455 00:25:24,191 --> 00:25:27,110 -నేను చేయలేనని నాకు తెలుసు. -నువ్వు చేయగలవు. 456 00:25:28,654 --> 00:25:29,488 సరే. 457 00:25:32,449 --> 00:25:33,450 నువ్వు వేయగలవు. 458 00:25:36,620 --> 00:25:37,955 అలా మాట్లాడేశావు ఏంటి? 459 00:25:37,955 --> 00:25:41,208 ఏమో మరి. చాలా ఆత్మవిశ్వాసం వచ్చేసింది, చేసేశా. 460 00:25:43,794 --> 00:25:44,878 అదరగొట్టేయ్, జేకబ్! 461 00:25:52,719 --> 00:25:54,638 నువ్వు చేయగలవు. 462 00:26:14,992 --> 00:26:15,993 అయ్యయ్యో! 463 00:26:24,877 --> 00:26:26,628 -పెద్ద దెబ్బే తగిలినట్టుంది. -కదులుతున్నాడు. కదులుతున్నాడు. 464 00:26:27,588 --> 00:26:31,925 లైబ్రరీకి మనం 1,000 డాలర్లు సంపాదించేశాం, కాబట్టి... హేయ్! 465 00:26:33,468 --> 00:26:35,179 పుస్తకాలు! పుస్తకాలు! 466 00:26:35,179 --> 00:26:39,600 -పుస్తకాలు! పుస్తకాలు! పుస్తకాలు! -పుస్తకాలు! పుస్తకాలు! 467 00:26:39,600 --> 00:26:41,852 -పుస్తకాలు! -లేదు. పుస్తకాల గురించి ఎవరూ పట్టించుకోరు. 468 00:26:41,852 --> 00:26:44,521 -సరే. -కోవాక్! 469 00:26:44,521 --> 00:26:47,107 -కోవాక్! కోవాక్! -కోవాక్! కోవాక్! కోవాక్! 470 00:26:47,107 --> 00:26:51,486 -కోవాక్! కోవాక్! కోవాక్! -కోవాక్! కోవాక్! 471 00:27:25,354 --> 00:27:27,189 "స్కూలులో ఇలాంటివి అస్సలు చేయకూడదు," అనుకున్నాం కదా. 472 00:27:27,814 --> 00:27:28,857 నాకు తెలుసు. 473 00:27:29,441 --> 00:27:34,321 కానీ నువ్వు... అదిరిపోయేలా బంతిని విసిరినప్పుడు, 474 00:27:35,531 --> 00:27:36,782 నన్ను నేను ఎలా ఆపుకోగలను? 475 00:27:37,783 --> 00:27:38,867 సూపర్. 476 00:28:24,872 --> 00:28:27,624 ఫాదర్ 477 00:28:44,892 --> 00:28:47,019 ఎమ్.ఓ వాల్ష్ రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 478 00:30:00,467 --> 00:30:02,469 సబ్ టైటిళ్ళను అనువదించినది: రాంప్రసాద్