1 00:00:14,056 --> 00:00:15,474 మనం అబద్ధంలో బతుకుతున్నాం. 2 00:00:18,435 --> 00:00:20,562 - దీన్ని అందరూ చూడాలి. - అందరూ అంటే? 3 00:00:20,562 --> 00:00:21,480 అందరూ. 4 00:00:21,480 --> 00:00:24,066 దీన్ని... అన్ని కంప్యూటర్లలో ప్రసారం అయ్యేలా చేయడం సాధ్యమేనా? 5 00:00:24,066 --> 00:00:25,025 లేదు. 6 00:00:25,025 --> 00:00:27,694 - ఏంటి? - లేదు అంటే నా ఉద్దేశం, అది అసాధ్యమని కాదు. 7 00:00:27,694 --> 00:00:29,363 కంప్యూటర్ స్క్రీన్ లన్నీ ఐటీ చేతిలో ఉంటాయి. 8 00:00:29,363 --> 00:00:30,531 ఇప్పుడు ఐటీని హ్యాక్ చేయాలంటున్నావు. 9 00:00:30,531 --> 00:00:32,908 ప్రతి 30 అంతస్థులకు ఒక సిగ్నల్ బూస్టర్ ఉంటుంది. 10 00:00:32,908 --> 00:00:34,368 సరే, అదున్న అన్నింటి కన్నా కింది అంతస్థు ఏంటి? 11 00:00:34,368 --> 00:00:36,119 నేను పైనున్న, ఇంకా మధ్యనున్న అంతస్థులలో ఉండకూడదు. 12 00:00:36,119 --> 00:00:37,788 126వ అంతస్థులో ఒకటి ఉంది. 13 00:00:37,788 --> 00:00:39,373 - సూపర్, పదండి అక్కడికి పోదాం. - లేదు. ఆగు. 14 00:00:39,373 --> 00:00:41,542 ప్రతీ అంతస్థులో సెక్యూరిటీ బృందాలు ఉన్నాయి. 15 00:00:41,542 --> 00:00:43,752 నా అంచనా సరైనదే అయితే, అవి నీకోసమే గాలిస్తున్నాయి. 16 00:00:43,752 --> 00:00:45,379 - మనం అస్సలు వెళ్లలేం... - నేను తీసుకెళ్తాగా. 17 00:00:45,379 --> 00:00:46,505 నువ్వు వెళ్లు, ఆ గడియారాన్ని ఇచ్చేయ్. 18 00:00:46,505 --> 00:00:48,298 - లేదు, నువ్వు కూడా మాతో వస్తున్నావు. హా. - నేను రాను. 19 00:00:48,298 --> 00:00:49,508 కంప్యూటరుతో ఆడుకొనేవాడు కావాలన్నావు, 20 00:00:49,508 --> 00:00:51,343 వాడి దగ్గరికి నిన్ను తీసుకొచ్చాను. 21 00:00:51,343 --> 00:00:52,469 వీడు ఎంత పిస్తా అయినా, 22 00:00:52,469 --> 00:00:54,888 బెర్నార్డును మించినోడు మాత్రం కాదు. అతను మనల్ని ఇక్కడికి ట్రేస్ చేస్తాడు. 23 00:00:54,888 --> 00:00:55,806 నీకు ఇక్కడే ఉండాలనుందా? 24 00:00:56,682 --> 00:00:58,433 - అది నిజమేనా? - హా. 25 00:00:58,433 --> 00:01:00,352 ఛ. 26 00:01:00,352 --> 00:01:03,730 డానీ... సూపర్. బంపర్. తొక్కలో సంత. 27 00:01:03,730 --> 00:01:04,815 దొరికింది. 28 00:01:05,983 --> 00:01:08,318 - డ్రైవ్ ఎక్కడ ఉంది? - 22వ అంతస్థులోని ఓ ఇంట్లో. 29 00:01:08,318 --> 00:01:11,321 - ఎవరి ఇంట్లో? - పాట్రిక్ కెన్నడీకి కేటాయించిన ఇంట్లో. 30 00:01:11,321 --> 00:01:13,699 రెయిడర్లందరూ 22వ అంతస్థుకు వెళ్లండి. అందరూ 22వ అంతస్థుకు వెళ్లండి. 31 00:01:13,699 --> 00:01:14,616 ఎవరు అతను? ఆమె మిత్రుడా? 32 00:01:14,616 --> 00:01:16,159 - అన్నీ తనిఖీ చేయలేదా... - అతను మిత్రుడు కాదు. 33 00:01:16,159 --> 00:01:17,703 కానీ ఆమె వాడి ప్రాణాన్ని కాపాడింది. 34 00:01:19,454 --> 00:01:20,873 రెయిడర్లందరూ 22వ అంతస్థుకు వెళ్లండి. 35 00:01:23,500 --> 00:01:24,543 బద్దలు కొట్టండి. 36 00:01:37,556 --> 00:01:38,473 ఎరుపుగా ఉన్నప్పుడు తెరవద్దు. 37 00:01:38,473 --> 00:01:41,727 - అబ్బా. మనం వెంటనే బయలుదేరాలి. - ఆగాలి! ఎర్ర లైట్ ఆన్ లో ఉంది. 38 00:01:41,727 --> 00:01:43,145 - వాళ్లు వస్తున్నారు. - ఛ. 39 00:01:47,649 --> 00:01:48,650 పద, పద! 40 00:01:52,112 --> 00:01:54,448 సరే మరి. అంతే. 41 00:01:55,574 --> 00:01:57,242 రా. ఆ తలుపు వేసేయ్. 42 00:02:06,168 --> 00:02:07,252 ఎలా మనం... 43 00:02:15,511 --> 00:02:16,595 పదండి. 44 00:02:18,472 --> 00:02:20,933 బాసూ, నువ్వు రావాలి. కానివ్వు. 45 00:02:26,396 --> 00:02:28,524 వాళ్లు ఆ అంతస్థును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తను అక్కడ లేదు. 46 00:02:28,524 --> 00:02:32,486 తను మెట్లపైన అయినా కనబడాలి కదా. ఏమైపోయింది తను? 47 00:02:33,153 --> 00:02:34,738 మిస్టర్ సిమ్స్? 48 00:02:34,738 --> 00:02:37,282 మన ఏజెంట్ నుండి ఒక సందేశం వచ్చింది. 49 00:02:37,282 --> 00:02:38,200 కొత్త మెసేజ్ 50 00:02:38,200 --> 00:02:40,285 నికల్స్ ఇంటిని సోదా చేస్తున్నప్పుడు బిల్లింగ్స్ వచ్చాడు 51 00:02:40,285 --> 00:02:41,537 లోపలికి వస్తా అన్నాడు. కుదరదని చెప్పాం. 52 00:02:48,877 --> 00:02:52,548 డెప్యూటీ. ఇదంతా నా తప్పే. 53 00:02:53,882 --> 00:02:54,883 నిన్ను ఇంటికి పంపించినప్పుడు, 54 00:02:54,883 --> 00:02:59,221 ఇంటి నుండి బయటకు రావద్దని నీకు చాలా స్పష్టంగా చెప్పా. 55 00:03:00,848 --> 00:03:04,476 - నీకు అది అర్థం కాలేదా? - లేదు. అర్థమైంది. 56 00:03:06,603 --> 00:03:08,981 అయినా కానీ నికల్స్ ఇంటికి వెళ్లావు. 57 00:03:10,148 --> 00:03:13,068 నువ్వు రెయిడర్ కి ఒప్పందం గురించి పాఠాలు బోధించినంత మాత్రాన 58 00:03:13,068 --> 00:03:14,695 తను నాకు చెప్పదు అనుకున్నావా? 59 00:03:16,613 --> 00:03:17,614 లేదు. 60 00:03:19,992 --> 00:03:21,869 అసలు నికల్స్ ఇంటికి ఎందుకు వెళ్లావు? 61 00:03:22,452 --> 00:03:25,581 తను బయటకు వెళ్లాలని ఎందుకు అందో నేను తెలుసుకోగలిగితే, 62 00:03:26,957 --> 00:03:28,375 తనని కనిపెట్టవచ్చని నాకు అనిపించింది. 63 00:03:29,001 --> 00:03:31,837 మరి అది నీకు తెలిసేలా ఏమైనా కనిపించిందా? 64 00:03:32,713 --> 00:03:33,714 లేదు. 65 00:03:35,424 --> 00:03:38,886 మరి మొన్న తను నన్ను ఎందుకు అరెస్ట్ చేసిందో, 66 00:03:38,886 --> 00:03:42,264 లేదా దానికి నువ్వు ఎందుకు తల ఆడించావో తెలిసేలా... 67 00:03:44,808 --> 00:03:46,602 ఏమైనా కనిపించిందా? 68 00:03:50,147 --> 00:03:54,610 నా ఇంటికి వెళ్లి నా భార్యని, కొడుకుని చంపేస్తానని ఎందుకు బెదిరించిందో 69 00:03:54,610 --> 00:03:57,654 తెలిసేలా ఏమైనా కనిపించిందా? 70 00:04:05,996 --> 00:04:11,043 డెప్యూటీ, నీ చేతులని గమనించాను. 71 00:04:11,043 --> 00:04:13,045 నీ కుడి చేతిని, ఎడమ చేత్తో పట్టుకుని ఉన్నావు. 72 00:04:16,173 --> 00:04:17,007 ఎందుకు? 73 00:04:21,220 --> 00:04:23,013 డానీ, లోపలికి వెళ్లాలి. పద. 74 00:04:23,013 --> 00:04:24,223 - సరే. - రండి. 75 00:04:24,223 --> 00:04:25,307 పద, పద. 76 00:04:26,892 --> 00:04:27,893 నీకేమీ కాలేదు కదా? 77 00:04:27,893 --> 00:04:29,394 ఇంకాస్త ఉంటే అది నాకు తగిలి ఉండేది. 78 00:04:29,394 --> 00:04:31,480 - సరే మరి. అది ఎక్కడ ఉంది? - ఇటు వెళ్లాలి. 79 00:04:31,480 --> 00:04:32,564 సరే. 80 00:04:35,526 --> 00:04:36,527 ఇక్కడ. 81 00:04:41,406 --> 00:04:42,241 సరే మరి. 82 00:04:48,580 --> 00:04:50,832 - అబ్బా. - పక్కకి జరుగు, నేను చేస్తా. 83 00:04:54,586 --> 00:04:55,712 సిగ్నల్ బూస్టర్, 126వ అంతస్థు 84 00:04:55,712 --> 00:04:56,880 డ్రైవ్ ఇవ్వు. 85 00:04:57,673 --> 00:04:59,132 హేయ్, హేయ్. అది కెమెరానా? 86 00:04:59,716 --> 00:05:00,592 - హా. - హా. 87 00:05:00,592 --> 00:05:02,761 - అయ్యుండవచ్చు. - నీ సుత్తి ఇవ్వు. 88 00:05:02,761 --> 00:05:05,848 వద్దు. కెమెరా పని చేయడం ఆగితే, రెయిడర్లను పంపించే అవకాశం ఇంకా ఎక్కువ అవుతుంది. 89 00:05:05,848 --> 00:05:07,057 నువ్వు అది పెట్టగానే, వాళ్లు వస్తారు. 90 00:05:07,057 --> 00:05:09,017 ఒక్క క్షణం. ఇక మొదలుపెడతా. 91 00:05:10,102 --> 00:05:11,478 గుర్తించబడింది 126వ అంతస్థు 92 00:05:11,478 --> 00:05:13,564 డ్రైవ్ 126వ అంతస్థులో గుర్తించబడింది. 93 00:05:13,564 --> 00:05:15,899 - ఎక్కడ? - మన హబ్ దగ్గర. 94 00:05:15,899 --> 00:05:17,025 సిమ్స్ ని తీసుకురా. 95 00:05:20,028 --> 00:05:20,863 అక్కడ ఉన్నారు. 96 00:05:26,869 --> 00:05:28,078 సిగ్నల్ బూస్టర్ 97 00:05:28,871 --> 00:05:30,080 వాళ్లకి మనం ఎక్కడ ఉన్నామో తెలిసిపోయింది. 98 00:05:30,080 --> 00:05:31,373 సరే మరి. 99 00:05:33,959 --> 00:05:36,461 కరీన్స్ కి రేడియో ద్వారా సందేశం పంపా. అయిదు నిమిషాల్లో తను అక్కడ ఉంటుంది. 100 00:05:37,504 --> 00:05:38,797 - అబ్బా. - ఏమైంది? 101 00:05:38,797 --> 00:05:40,090 వాళ్లు స్క్రీన్స్ కి లింక్ చేస్తున్నారు. 102 00:05:45,971 --> 00:05:46,972 కానివ్వు. 103 00:05:52,853 --> 00:05:54,021 హా. 104 00:06:02,487 --> 00:06:03,906 అందరూ కళ్లు మూసుకోండి. 105 00:06:03,906 --> 00:06:08,035 కళ్లు మూసుకోండి! మూసుకోండి! వెనక్కి తిరగండి. ముఖాలకు చేతులు అడ్డుపెట్టుకోండి. 106 00:06:08,952 --> 00:06:10,871 - అతను చెప్పింది చేయ్! - జరుగు. 107 00:06:10,871 --> 00:06:12,247 - సరే. - నువ్వు కూడా, రాబర్ట్. 108 00:06:23,800 --> 00:06:24,718 మూసివేత ప్రారంభమవుతోంది 109 00:06:30,807 --> 00:06:32,893 ఏంటి? ఏమైంది? ఆగిపోయిందా? హా? 110 00:06:34,436 --> 00:06:35,812 సిగ్నల్ పోయింది 111 00:06:35,812 --> 00:06:38,857 - వాళ్లు అన్నిటినీ ఆపేశారు. - ఏంటి? అబ్బా! 112 00:06:38,857 --> 00:06:41,276 - అయిపోయింది. నువ్వు ఇక వెళ్లు. వెంటనే వెళ్లు. - సరే. 113 00:06:41,276 --> 00:06:43,278 - నువ్వు అతనితో వెళ్లు. - లేదు, ఓయ్! ఓయ్! 114 00:06:43,278 --> 00:06:45,906 - గడియారం ఇవ్వు. - జోక్ చేస్తున్నావా? 115 00:06:47,282 --> 00:06:48,116 ఛ. 116 00:06:52,788 --> 00:06:54,039 మీరు ఇప్పుడు చూసినదాన్ని... 117 00:06:56,375 --> 00:06:57,960 మర్చిపోండి. 118 00:07:11,849 --> 00:07:14,643 నేను 126వ అంతస్థు నుండి కరీన్స్ మాట్లాడుతున్నా. తనకి సహకరించిన ఇద్దరూ దొరికారు. 119 00:07:14,643 --> 00:07:15,602 మరి నికల్స్ సంగతేంటి? 120 00:07:15,602 --> 00:07:19,022 అంతస్థును లాక్ డౌన్ చేశాం. తను ఎక్కడ ఉన్నా కనిపెడతాం. 121 00:07:19,982 --> 00:07:24,820 - హా, ఆ ముక్క ఇంతకు ముందు కూడా చెప్పావు. - తను తెలివైనది. తెగువ ఉన్నది. 122 00:07:24,820 --> 00:07:27,322 తను ఇప్పుడు 126వ అంతస్థులో లేదు. 123 00:07:27,322 --> 00:07:29,908 - మరి? - తను చెత్తను పడేసే మార్గం గుండా ప్రయాణిస్తోంది. 124 00:07:30,868 --> 00:07:32,286 అలానే సైలో అంతా తిరగగలుగుతోంది. 125 00:07:44,840 --> 00:07:46,717 - అబ్బ. - తనని చూశా. 126 00:07:46,717 --> 00:07:48,427 - తను చెత్త పడేసే మార్గంలోనే ఉందా? - హా, సర్. 127 00:07:48,427 --> 00:07:50,012 రీసైక్లింగ్ కి వెళ్లండి. బాగా బరువైనదాన్ని పడేయండి. 128 00:07:56,643 --> 00:07:59,188 నికల్స్. తర్వాతి తలుపును తెరుచుకొని లోపలికి వెళ్లిపో! 129 00:07:59,188 --> 00:08:01,148 నీ మీదకి బరువైన వస్తువును తోయమని నాకు చెప్పారు. 130 00:08:31,512 --> 00:08:33,347 - తనకి తగిలిందా? - ఖచ్చితంగా తెలీట్లేదు. 131 00:08:35,097 --> 00:08:36,099 ఈసారి తగిలేలా వేయండి. 132 00:09:03,961 --> 00:09:06,463 తనని పక్కకు జరపండి! దేవుడా. తనని పక్కకు జరపండి... 133 00:10:25,918 --> 00:10:28,420 {\an8}హ్యూ హొవీ రచించిన సైలో అనే బుక్ సిరీస్ ఆధారంగా తెరకెక్కించబడింది 134 00:10:45,521 --> 00:10:47,272 - నా వద్దకి వచ్చుండాల్సింది. - ఏం చేసుండేవాడివి? 135 00:10:47,272 --> 00:10:49,608 - నేను తనని ఇక్కడికి తీసుకొచ్చి ఉండేవాడిని కాదు. - మరి ఇంకెక్కడికి తీసుకెళ్లగలను? 136 00:10:49,608 --> 00:10:50,567 నాకు తెలీదు, కానీ... 137 00:10:53,070 --> 00:10:53,987 జ్యుడిషియల్ వాళ్లు వచ్చారు. 138 00:10:53,987 --> 00:10:56,198 ఏంటి? తను ఇక్కడ ఉందని వాళ్లకెలా తెలిసింది? 139 00:10:56,198 --> 00:10:57,741 నేనే చెప్పా. 140 00:10:57,741 --> 00:11:01,036 మనం ఎక్కడ దాచినా కానీ, వాళ్లు తనని కనిపెట్టేస్తారు. 141 00:11:01,036 --> 00:11:02,788 మెకానికల్ అంతటినీ గుల్లగుల్ల చేసేస్తారు. 142 00:11:02,788 --> 00:11:06,208 కింది అంతస్థుల్లో ఉండేవాళ్లందరూ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. 143 00:11:06,834 --> 00:11:07,709 చెత్త నా కొడకా. 144 00:11:07,709 --> 00:11:10,212 లేదు. అతను అన్నది నిజమే. 145 00:11:14,842 --> 00:11:15,676 నాకు బాగానే ఉందిలే. 146 00:11:17,386 --> 00:11:20,514 నువ్వు వాళ్లని లోపలికి రానిచ్చే ముందు, నేను వాక్ తో ఒక నిమిషం మాట్లాడాలి, ఆ అవకాశం నాకు ఇవ్వు. 147 00:11:21,014 --> 00:11:22,015 ప్రయత్నించి చూస్తా. 148 00:11:36,780 --> 00:11:37,823 అన్నిటినీ గమనించాక ఏమనిపిస్తోందంటే, 149 00:11:37,823 --> 00:11:40,367 నీకు 13 ఏళ్లు ఉన్నప్పుడు నువ్వు మీ నాన్నతో మధ్య అంతస్థులలో ఉంటేనే 150 00:11:40,367 --> 00:11:41,785 బాగుండేది అనిపిస్తోంది, 151 00:11:41,785 --> 00:11:45,205 వాక్, నేను చెప్పేది విను. నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి, సరేనా? 152 00:11:46,915 --> 00:11:47,958 ఒక్క నిమిషం ఆగండి. 153 00:11:49,251 --> 00:11:50,377 - తనని మీతో పంపించం. - షర్లీ. 154 00:11:50,377 --> 00:11:52,462 వద్దు... హేయ్! 155 00:11:52,462 --> 00:11:54,006 వద్దు. 156 00:11:59,011 --> 00:12:00,512 నువ్వు బయటకు వెళ్లు. 157 00:12:00,512 --> 00:12:03,473 - ఆగు. తను... బయటకు వెళ్లలేదు. - నోర్మూయ్. నోరు మూసేయ్. 158 00:12:03,473 --> 00:12:06,852 - తను పాతికేళ్లుగా బయట అడుగుపెట్టలేదు. - నోర్మూసుకో అన్నానా! 159 00:12:06,852 --> 00:12:07,936 రాబ్. 160 00:12:09,104 --> 00:12:10,814 నువ్వు ఆ మూలకి వెళ్లి నిలుచో. 161 00:12:12,900 --> 00:12:13,775 మనిద్దరమే ఉండుంటే, 162 00:12:13,775 --> 00:12:16,153 నీకు నరకం చూపించి ఉండేవాడిని. 163 00:12:16,153 --> 00:12:17,863 నీ కుటుంబాన్ని నేను ఏం చేసి ఉండేదాన్ని కాదు. 164 00:12:17,863 --> 00:12:20,866 మళ్లీ ఆ భయంకరమైన ఆవిడ వస్తుందా అని నా కొడుకు భయపడుతూ అడుగుతున్నాడు. 165 00:12:20,866 --> 00:12:23,285 నీ గురించి కూడా అలా చాలా కుటుంబాల్లో అనుకొని ఉంటారు కదా? 166 00:12:23,285 --> 00:12:26,163 - నా పనేంటో అసలు నీకు తెలుసా? తెలుసా? - రాబ్. రాబ్! 167 00:12:27,164 --> 00:12:28,790 నీ బృందంతో నువ్వు కూడా బయటే ఉండు. 168 00:12:36,131 --> 00:12:38,383 నువ్వు చేయాలనుకున్న పనిలో నువ్వు సఫలం అయ్యుంటే, 169 00:12:39,176 --> 00:12:42,387 - నీ వల్ల సైలోని వాళ్లందరూ చనిపోయి ఉండేవారు. - జనాలు నిజాన్ని తీసుకోగలరు. 170 00:12:42,387 --> 00:12:44,306 నీకున్న ఆశావాద దృక్పథం నాకూ ఉంటే బాగుండు. 171 00:12:53,273 --> 00:12:54,650 ఇప్పుడు నీకు సంకెళ్లు వేయక తప్పని పరిస్థితి. 172 00:12:55,859 --> 00:12:56,985 మళ్లీ నేను తప్పించుకోకుండా ఉండటానికా? 173 00:12:56,985 --> 00:12:58,320 ఊరికే బిల్డప్ కోసం. 174 00:13:00,572 --> 00:13:02,866 నేను నీకు ఒకటి ప్రతిపాదిస్తున్నా. ఒక ఒప్పందాన్ని. 175 00:13:03,617 --> 00:13:06,995 తిరుగుబాటును, ఇంకా కింది అంతస్థుల్లో ఉండే నీ స్నేహితులు జ్యుడిషియల్ శాఖ నుండి తీవ్రమైన పరిణామాలను 176 00:13:06,995 --> 00:13:08,580 ఎదుర్కోకుండా నివారించడానికి, 177 00:13:08,580 --> 00:13:12,459 నేను బయటకు వెళ్తాను అని అనలేదు అని నువ్వు అనడం ఆపేయాలి, 178 00:13:12,459 --> 00:13:14,753 జ్యుడిషియల్ శాఖలో విచారణని కోరగల నీ హక్కును నువ్వు వదులుకోవాలి. 179 00:13:27,683 --> 00:13:29,643 జార్జ్ కి ఏమైందో నాకు చెప్పండి, చాలు. 180 00:13:30,310 --> 00:13:33,272 నువ్వు సహకరిస్తే, చెప్పడం కాదు, చూపిస్తాను. 181 00:14:08,849 --> 00:14:10,058 తనని అది చేయకుండా ఆపుండాల్సింది. 182 00:14:11,351 --> 00:14:12,186 ఏది చేయకుండా? 183 00:14:12,186 --> 00:14:14,396 వేడిని తగ్గించే టేపు మన దగ్గర అయిపోయినప్పుడు, ఐటీ నుండి దొంగిలించే పని. 184 00:14:14,396 --> 00:14:16,648 పైనున్న అంతస్థుల్లో వాళ్లకి అందుకే మండింది. 185 00:14:16,648 --> 00:14:20,444 వాళ్లకి మండించే పనులు తను చాలానే చేసిందిలే. 186 00:14:20,444 --> 00:14:23,614 నేను ఇక కంట్రోల్ రూముకు వెళ్లాలి. 187 00:14:23,614 --> 00:14:25,908 నాక్స్ తో అస్సలు మాట్లాడను. 188 00:14:25,908 --> 00:14:26,867 షర్లీ. 189 00:14:26,867 --> 00:14:28,493 అతను జూల్స్ ని పట్టించేశాడు. 190 00:14:29,077 --> 00:14:31,872 కనీసం చెప్పకుండా ఉండాల్సింది, వాళ్లనే వెతుక్కోనివ్వాల్సింది. 191 00:14:31,872 --> 00:14:33,916 నేనేమైనా పెద్ద తోపునా. 192 00:14:33,916 --> 00:14:36,126 ఆ తలుపు బయట అడుగుపెట్టాలంటేనే నాకు భయం. 193 00:14:41,256 --> 00:14:42,883 నాక్స్ కి మరో దారి లేదు. 194 00:14:42,883 --> 00:14:46,678 అతనికి దారి ఉంది. మనందరికీ ఉంది. 195 00:16:27,613 --> 00:16:28,614 ధైర్యం కూడదీసుకో. 196 00:16:29,448 --> 00:16:35,120 కానివ్వవే ముసలిదానా. తనకి ఇప్పుడు నువ్వే దిక్కు. 197 00:16:45,547 --> 00:16:50,385 నువ్వేమీ చావవులే. అలా అనిపిస్తుందంతే. 198 00:17:17,246 --> 00:17:20,582 వాకర్, ఏం చేస్తున్నావు? 199 00:17:22,667 --> 00:17:23,669 లోపల గాలి ఆడక, బయటకు వచ్చాలే. 200 00:17:40,644 --> 00:17:42,771 సరే. ఒక్క నిమిషం ఆగండి. 201 00:17:43,939 --> 00:17:45,190 ఒక్క నిమిషం ఆగండి, కాస్త... 202 00:17:45,899 --> 00:17:48,110 మంచి నీళ్లు కావాలి. ఎవరైనా ఇస్తారా? 203 00:18:07,713 --> 00:18:08,714 సరే, సరే. 204 00:18:21,935 --> 00:18:23,812 కుక్కలూ! నిశ్శబ్దం! 205 00:18:29,401 --> 00:18:30,402 కార్లా. 206 00:18:32,196 --> 00:18:33,030 మార్తా. 207 00:18:35,407 --> 00:18:36,408 నువ్వు బాగానే ఉన్నావే. 208 00:18:37,492 --> 00:18:38,994 నీ నోటి నుండి అన్నీ నిజాలే వస్తాయిలే. 209 00:18:41,371 --> 00:18:44,583 నువ్వు ఇక్కడికి వస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. 210 00:18:44,583 --> 00:18:45,918 నేను కూడా అనుకోలేదు. 211 00:18:48,378 --> 00:18:52,591 పంపిణీ శాఖలో అంతా బాగానే జరుగుతున్నాయా? 212 00:18:54,426 --> 00:18:58,889 ఏంటి? నికల్స్ కోసం ఇక్కడికి వచ్చావా? 213 00:19:00,474 --> 00:19:02,935 వేడిని తగ్గించే ఆ తొక్కలో టేపు గురించి వచ్చావా? 214 00:19:03,727 --> 00:19:04,853 అవును. 215 00:19:04,853 --> 00:19:08,023 తను చేసిన ఆ పిచ్చి పని వల్ల జ్యుడిషియల్ వాళ్లు కిందికి వచ్చారు, 216 00:19:08,023 --> 00:19:09,816 ఆ పనికిమాలిన ఐటీ హెడ్ కూడా. 217 00:19:09,816 --> 00:19:12,069 ఇప్పుడు వాడే మేయర్ అయి కూర్చున్నాడు. 218 00:19:12,069 --> 00:19:16,281 ఎందుకంత పట్టించుకుంటున్నారు అసలు? మీ టేపు వాళ్ల టేపు కన్నా వంద రెట్లు మేలు కదా. 219 00:19:16,281 --> 00:19:22,204 హా, అవును. అదే విచిత్రంగా అనిపించింది. కానీ ఆ టేపు వాళ్లకి చాలా ముఖ్యమైనదని అర్థమైంది. 220 00:19:29,545 --> 00:19:32,589 ఆగండి. తనకి సంకెళ్లు తీసేయండి. 221 00:19:33,757 --> 00:19:34,967 మమ్మల్ని వదిలేసి వెళ్లిపోండి. 222 00:19:47,646 --> 00:19:50,357 తను ఏం చూసిందో ఒక్కరికి చెప్పినా, మనం వాళ్లందరినీ అరెస్ట్ చేయాల్సిందే. 223 00:19:52,317 --> 00:19:54,695 తను చెప్పదు. మేము ఒక మాట అనుకున్నాం. 224 00:20:16,675 --> 00:20:19,178 ఏంటి ఈ చోటు? ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? 225 00:20:19,178 --> 00:20:20,846 రోటా 226 00:20:20,846 --> 00:20:22,347 మిస్టర్ సిమ్స్. 227 00:20:51,835 --> 00:20:53,837 ఇది మన ప్రోటోకాల్స్ కి విరుద్ధమని నాకు తెలుసు, 228 00:20:53,837 --> 00:20:57,758 కానీ, శుభ్రం చేయడానికి షెరిఫ్ బయటకు వెళ్లే ముందు, తనకి నేను ఒకటి చూపాలనుకుంటున్నా. 229 00:21:02,429 --> 00:21:05,265 జార్జ్ విల్కిన్స్ మెట్ల మీద ఉన్నప్పుడు జరిగిన దానికి సంబంధించిన వీడియోను చూపండి. 230 00:21:10,854 --> 00:21:12,314 మాకు అస్సలు అవకాశమే లేదు కదా. 231 00:21:13,232 --> 00:21:14,066 హా. 232 00:21:15,859 --> 00:21:18,362 - ఎంత చూపించాలి? - వాళ్లు ఆగిన చోట నుండి చూపించు. 233 00:21:20,906 --> 00:21:21,740 సౌండ్ పెంచు. 234 00:21:21,740 --> 00:21:23,742 - ఆపకుండా నడువు. - నాకు నీళ్లు కావాలి. 235 00:21:23,742 --> 00:21:26,745 అతను కావాలని కెమెరా ముందు ఆగాడని అనుకుంటున్నాం. 236 00:21:27,663 --> 00:21:29,748 అప్పటికి, కెమెరాలు ఎలా ఉంటాయో అతనికి తెలిసిపోయింది. 237 00:21:34,545 --> 00:21:35,379 పిచ్చిపని చేయకు. 238 00:21:35,379 --> 00:21:37,714 - ఒక్క అడుగు ముందుకు వేసినా... - జూమ్ చేయ్. 239 00:21:38,423 --> 00:21:40,634 ...నేను పిచ్చి పని చేసేస్తాను. 240 00:21:40,634 --> 00:21:43,387 - నీకేం కావాలి? - నన్ను ప్రాణాలతో తీసుకురమన్ని నీకు చెప్పారు కదా? 241 00:21:43,387 --> 00:21:46,056 - అవును. - నన్ను చిత్రహింసలకు గురిచేసి 242 00:21:46,056 --> 00:21:48,809 ఆ హార్డ్ డ్రైవ్ ని సంపాదించడానికి, నాకు సహకరించినవారి వివరాలు పొందడానికే కదా? 243 00:21:48,809 --> 00:21:52,271 - లేదు. వాళ్లు నీతో మాట్లాడాలనుకుంటున్నారు, అంతే. - నీకు అబద్ధాలు చెప్పడం రావట్లేదులే. 244 00:21:52,271 --> 00:21:53,188 ఇక సెలవు. 245 00:21:57,568 --> 00:21:58,569 అయ్యయ్యో! 246 00:22:53,540 --> 00:22:54,875 ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? 247 00:22:55,876 --> 00:22:57,377 అంతా ప్రశాంతంగా ఉంది. 248 00:22:58,337 --> 00:23:00,631 హాల్స్టన్ బయటకు వెళ్లిన తర్వాత, ఇంత ప్రశాంతంగా ఉండటం ఇదే మొదటిసారి. 249 00:23:04,635 --> 00:23:05,636 రాబ్, 250 00:23:06,929 --> 00:23:10,724 నా తర్వాత మేయరుగా నువ్వు ఉండాలనుకుంటున్నావని నువ్వు అన్నప్పుడు నేనేదో తొందరలో ఏదో అనేశాను. 251 00:23:12,392 --> 00:23:17,314 రేపు నికల్స్ బయటకు వెళ్లాక, ఇంకోసారి దాని గురించి మాట్లాడుకుందాం, సరేనా? 252 00:23:34,957 --> 00:23:38,168 నువ్వు తింటూ ఉండవని ఊహించి, నీకోసం ఒకటి చేసి తీసుకొచ్చా. 253 00:23:38,168 --> 00:23:40,671 పర్వాలేదులే. నాకేం పెద్దగా ఆకలి వేయట్లేదు, కాబట్టి... 254 00:23:41,797 --> 00:23:43,924 నీ చిన్నప్పుడు మేము ఏం అనేవాళ్లమో నీకు గుర్తుందా? 255 00:23:43,924 --> 00:23:46,426 - హా. "కనీసం ఒక ముద్ద అయినా తిను." - "కనీసం ఒక ముద్ద అయినా తిను." 256 00:23:53,851 --> 00:23:54,977 దీన్ని అమ్మ చేసేది. 257 00:23:57,521 --> 00:23:59,189 నాన్నా, నేను... 258 00:24:00,774 --> 00:24:02,651 అన్నింటికీ నిన్నే నిందించాను, నన్ను క్షమించు. 259 00:24:02,651 --> 00:24:07,030 లేదు. మనం దాని గురించి చాలా కాలం క్రితమే మాట్లాడుకుని ఉండాల్సింది. 260 00:24:10,033 --> 00:24:16,665 జూల్స్, బంగారం, బయటకు వెళ్లాలని ఉందని ఎందుకు చెప్పావు? 261 00:24:16,665 --> 00:24:20,002 - నేను ఏదైనా చేయలేకపోవడం వల్లనేనా? - లేదు, అదేం లేదు... నేను... 262 00:24:32,681 --> 00:24:35,184 నువ్వు ఇంత బాగా వంట చేయగలవని నాకు తెలీదు. చాలా బాగుంది. 263 00:24:38,145 --> 00:24:39,938 ముసలోడినైనా వంటలో మహానుభావుడినే కదా? 264 00:24:52,409 --> 00:24:53,243 లోనికి తీసుకురండి. 265 00:25:01,293 --> 00:25:02,127 నువ్వు వెళ్లవచ్చు. 266 00:25:10,511 --> 00:25:16,517 లూకస్, నువ్వు సహకరించావు కాబట్టి 267 00:25:17,601 --> 00:25:20,646 జూలియా నికల్స్ ని మేము అరెస్ట్ చేయగలిగాం. 268 00:25:21,688 --> 00:25:23,106 ఇప్పుడు తననేం చేస్తారు? 269 00:25:23,815 --> 00:25:26,235 ముందు నీకేం జరుగుతుందో ఆలోచించుకో. 270 00:25:27,945 --> 00:25:28,946 నేను మీకు సాయపడ్డాను. 271 00:25:29,738 --> 00:25:34,368 అవును. అందుకే నిన్ను శుభ్రం చేయడానికి బయటకు పంపట్లేదు. 272 00:25:37,204 --> 00:25:40,207 నిన్ను గనులకు పంపిస్తున్నాం. 273 00:25:40,999 --> 00:25:42,918 పదేళ్లు. 274 00:25:43,544 --> 00:25:44,586 అది దారుణమనే చెప్పాలి, 275 00:25:45,587 --> 00:25:47,840 ఎందుకంటే, నువ్వు సహజంగానే మంచి ప్రతిభావంతుడివి. 276 00:25:49,007 --> 00:25:50,884 అన్నీ తెలుసుకోవాలనే కుతూహలం ఉంది. 277 00:25:51,844 --> 00:25:56,265 రోజూ రాత్రి అయ్యేసరికి ఒంటరిగా క్యాంటీనులో కూర్చొని, 278 00:25:56,265 --> 00:25:58,433 ఆకాశంలోని లైట్లను చూస్తూ ఉంటావు. 279 00:26:01,520 --> 00:26:03,689 గనులలో నీకు లైట్లు కనిపించవు. 280 00:26:05,566 --> 00:26:10,487 కానీ పదేళ్లు ఇనుము గనులలో పని చేస్తే అయినా నీకు బుద్ధి వస్తుందేమో. 281 00:26:22,749 --> 00:26:26,670 {\an8}సెన్సర్ వూల్ 282 00:26:43,812 --> 00:26:44,855 ఘుమఘుమలాడిపోతున్నాయి. 283 00:26:45,856 --> 00:26:50,777 షర్ల్, అందరూ నాకు ఆహారం తెచ్చిస్తున్నారు, కాబట్టి... నాకు అస్సలు ఆకలిగానే లేదు. 284 00:26:51,862 --> 00:26:55,532 నువ్వు ఇవన్నీ తింటే, ఆ సూట్ నీకు పట్టకపోవచ్చు అని వాక్ అంది. 285 00:26:56,575 --> 00:26:57,951 కనీసం ఒక్కటైనా తిను. 286 00:26:59,411 --> 00:27:02,039 - వద్దులే... - నువ్వు ఈ డబ్బానంతా తీసుకోవాలని అంది... 287 00:27:03,874 --> 00:27:04,875 అదృష్టం కలిసి వస్తుందట. 288 00:27:08,212 --> 00:27:10,756 హా. సరే. 289 00:27:16,011 --> 00:27:16,845 సరేనా? 290 00:27:19,681 --> 00:27:24,478 హేయ్. నేను బాగానే ఉన్నా. నాకేమీ కాదు. 291 00:27:30,609 --> 00:27:31,693 మూడవ సెల్ 292 00:27:54,633 --> 00:27:58,011 {\an8}"నీకు నిజం కావాలి. నిజం ఏంటంటే నాకు నువ్వంటే ప్రాణం. 293 00:28:00,264 --> 00:28:03,183 భయపడకు, పంపిణీ శాఖలోనివి బాగుంటాయి." 294 00:28:09,147 --> 00:28:12,401 హేయ్. పాపని ఇప్పుడే పడుకోబెట్టా. 295 00:28:14,528 --> 00:28:18,031 క్యాట్, నేను నీకొకటి చెప్పాలి. 296 00:28:18,031 --> 00:28:18,949 ఏంటి? 297 00:28:19,616 --> 00:28:22,411 నాకు సిండ్రోమ్ ఉందని సిమ్స్ కి తెలిసిపోయింది. 298 00:28:25,873 --> 00:28:27,249 మరి ఇప్పుడు ఏమవుతుంది అంటావు? 299 00:28:27,249 --> 00:28:30,294 నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తున్నారా? మనల్ని ఎక్కడికైకా పంపేస్తున్నారా? మనకు... 300 00:28:30,294 --> 00:28:33,839 మనల్ని ఎక్కడికీ పంపించడం లేదు. నన్ను తీసేయడం కూడా లేదు. 301 00:28:40,262 --> 00:28:43,432 మేయర్, ఇంకా జ్యుడిషియల్ శాఖ నాకు మినహాయింపును ఇస్తారు. 302 00:29:07,122 --> 00:29:08,123 థ్యాంక్యూ, షెరిఫ్. 303 00:29:09,416 --> 00:29:11,001 మాకు కొంత సేపు ఏకాంతం ఇవ్వవా? 304 00:29:11,627 --> 00:29:13,212 మిస్టర్ మేయర్, మీరు ఏమీ అనుకోనంటే, 305 00:29:13,212 --> 00:29:15,714 - అధికారికంగా నేను ప్రమాణ స్వీకారం చేసేదాకా... - తెలుసు, నాకు తెలుసు. 306 00:29:19,801 --> 00:29:24,681 నియమాలంటే ప్రాణమబ్బా మనోడికి. కానీ నేను అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించలేను నువ్వు... 307 00:29:24,681 --> 00:29:25,599 నేను చనిపోయేదాకా, అంతే కదా? 308 00:29:29,561 --> 00:29:30,812 మంచి షెరిఫ్ అవుతాడు అతను. 309 00:29:31,438 --> 00:29:33,398 అసలు నేను కాకుండా అతనే షెరిఫ్ అయితే బాగుండేది. 310 00:29:35,484 --> 00:29:37,069 ఉద్యోగం తీసుకున్నందుకు బాధపడ్డావా? 311 00:29:38,195 --> 00:29:39,029 అస్సలు బాధపడలేదు. 312 00:29:39,029 --> 00:29:42,407 నువ్వు ఇంకా మెకానికల్ లో ఉండి జనరేటర్ పని చూసుకుంటూ ఉండేదానివి. 313 00:29:43,450 --> 00:29:44,576 నువ్వు ఒకటి తెలుసుకోవాలి, 314 00:29:46,370 --> 00:29:49,540 నిన్ను బయటకు పంపే విషయంలో, ఆ మాటకొస్తే ఇప్పటిదాక జరిగినవాటి విషయంలో నాకు బాధగానే ఉంది. 315 00:29:50,290 --> 00:29:51,208 అయితే ఉద్యోగం మానేయ్. 316 00:29:51,792 --> 00:29:57,005 మానేయాలని రోజుకు కనీసం ఒక్కసారైనా అనిపిస్తూ ఉంటుంది. 317 00:29:57,005 --> 00:29:59,800 నా సమస్యలన్నీ చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవడంలేదులే. 318 00:30:00,968 --> 00:30:05,138 నీకు సమస్యలు ఎప్పుడు మొదలయ్యాయి అని ఒకసారి నువ్వు నన్ను అడిగావు. 319 00:30:06,682 --> 00:30:08,350 ఆ తొక్కలో టేపుని నేను దొంగిలించినప్పుడు. 320 00:30:08,350 --> 00:30:11,478 కాదు, నువ్వు మీ అమ్మ కడుపులో పడినప్పటి నుండే మొదలయ్యాయి. 321 00:30:11,478 --> 00:30:14,189 లెక్క ప్రకారం, మీ అమ్మానాన్నలకు సంతానం కలగకూడదు. 322 00:30:14,773 --> 00:30:15,983 కానీ పొరపాట్లు జరుగుతుంటాయి. 323 00:30:17,442 --> 00:30:19,611 కాబట్టి నన్ను బయటకు పంపించేసి, ఆ లెక్కని సరిచేద్దామనుకుంటున్నావా? 324 00:30:20,320 --> 00:30:21,446 అలా అని కాదు. 325 00:30:22,114 --> 00:30:23,740 ప్రతి మనిషికి ఎంతోకొంత విలువ ఉంటుంది. 326 00:30:24,575 --> 00:30:27,286 నువ్వు సైలోకి చాలా సేవ చేశావు. 327 00:30:27,286 --> 00:30:29,246 కానీ షెరిఫ్ అయ్యాక, 328 00:30:29,246 --> 00:30:31,290 విల్కిన్స్ మరణానికి కారణం కోసం నువ్వు వెతకడం మొదలుపెట్టాక... 329 00:30:31,290 --> 00:30:32,958 నేను చేసిన సేవలన్నీ బూడిదపాలైపోయాయి. 330 00:30:32,958 --> 00:30:36,670 నువ్వు మన మనుగడకు పెద్ద ప్రమాదం అయ్యావు. 331 00:30:37,713 --> 00:30:38,881 మన మనుగడకా? 332 00:30:40,924 --> 00:30:44,386 సైలో మనుగడకి జార్జ్ మరణం, 333 00:30:44,386 --> 00:30:47,472 జాన్స్, మార్న్స్, షెరిఫ్, ఇంకా అతని భార్య మరణాలు అవసరమైతే, 334 00:30:47,472 --> 00:30:49,224 ఈ సైలో అంత మంచిది కాదనట్టే కదా అర్థం. 335 00:30:49,224 --> 00:30:50,893 ఇంకోటి చెప్పనా? 336 00:30:50,893 --> 00:30:53,187 నాకు ఇక సేవలు అందించాలని అస్సలు లేదు. 337 00:30:56,815 --> 00:30:57,774 ఒకప్పుడు నువ్వు ఇంజినీరువి. 338 00:30:59,818 --> 00:31:01,820 రాత్రింబవళ్ళు గేజులని గమనిస్తూ ఉండేదానివి. 339 00:31:01,820 --> 00:31:04,573 పీడనం మరీ ఎక్కువైనా, మరీ తక్కువైనా, 340 00:31:04,573 --> 00:31:06,158 నువ్వు సరిచేసేదానివి, 341 00:31:06,158 --> 00:31:08,952 నువ్వు సరిచేయకపోతే, ఇక అంతే. 342 00:31:10,746 --> 00:31:12,372 నేను కూడా ఇంజినీరునే. 343 00:31:13,457 --> 00:31:17,336 కానీ నేను జనరేటరుని కాకుండా, సైలో అంతా బాగా నడిచేలా చూసుకుంటా. 344 00:31:17,336 --> 00:31:20,923 ఆలిసన్ బెకర్, ఇంకా జార్జ్ విల్కిన్స్ ఆ హార్డ్ డ్రైవును తెరిచి చూసినప్పుడు, 345 00:31:20,923 --> 00:31:23,717 సర్దుబాట్లు కనుక చేసి ఉండకపోతే, 346 00:31:23,717 --> 00:31:27,804 సైలో పరిస్థితి ప్రశ్నార్థకం అవ్వడానికి పెద్ద సమయం పట్టుండేది కాదు. 347 00:31:27,804 --> 00:31:30,641 మా అమ్మ కూడా నువ్వు చేసిన చిన్న చిన్న సర్దుబాట్లలో భాగంగానే చనిపోయిందా? 348 00:31:31,266 --> 00:31:33,894 తనే ఆ నిర్ణయం తీసుకుంది. 349 00:31:36,522 --> 00:31:39,942 కానీ నీకు తెలుసు ఆ డిస్ ప్లేలో చూపేదంతా నిజం కాదని. 350 00:31:41,109 --> 00:31:44,947 దానికి బదులు, బయటకు వెళ్తే ఏమీ కాదు అని జనాలకు చెప్పేస్తే సరిపోతుంది కదా? 351 00:31:45,489 --> 00:31:46,907 మరి ఆ తలుపు సంగతేంటి? 352 00:31:46,907 --> 00:31:48,617 జార్జ్ కనిపెట్టిన, సైలో దిగువున ఉన్న 353 00:31:48,617 --> 00:31:50,285 ఆ భారీ ఉక్కు తలుపు సంగతేంటి? 354 00:31:50,285 --> 00:31:52,162 దాని గురించి కూడా అందరికీ చెప్పేయవచ్చు కదా? 355 00:31:56,583 --> 00:32:00,712 మన పితామహులు మనకి చాలా విషయాలను మిస్టరీలుగా ఉంచారు. 356 00:32:04,675 --> 00:32:07,094 ఇక మనిద్దరం జరగాల్సిన తంతుకు తగ్గట్టుగా రెడీ అవుదాం. 357 00:32:08,053 --> 00:32:09,388 ఏమైనా నీకు అభినందనలు. 358 00:32:09,388 --> 00:32:12,558 శుభ్రం చేయడానికి బయటకు పంపేటప్పుడు, నీకు వచ్చేంత మంది జనం ఇదివరకు ఎన్నడూ రాలేదు. 359 00:32:14,184 --> 00:32:15,644 హాల్స్టన్ కి వచ్చినవాళ్ల సంఖ్య కంటే ఎక్కువ. 360 00:32:19,857 --> 00:32:20,858 నేను శుభ్రం చేయను. 361 00:32:22,484 --> 00:32:24,945 చేయాలని ఎవరికీ ఉండదు, కానీ అందరూ చేస్తారు. 362 00:32:26,280 --> 00:32:28,907 మన పితామహులకి ఆ జ్ఞానం ఉంది కాబట్టే, అందరూ శుభ్రంచేస్తారని వాళ్లు గ్రహించారు. 363 00:32:31,827 --> 00:32:32,828 మాటల్లో గుర్తొచ్చింది... 364 00:32:34,955 --> 00:32:37,165 నీ చివరి అభ్యర్థనను మన్నించా. 365 00:32:40,627 --> 00:32:43,255 షెరిఫ్ డిపార్టుమెంట్ 366 00:32:43,964 --> 00:32:47,593 నిజం 367 00:32:51,221 --> 00:32:52,222 డెప్యూటీ! 368 00:34:46,879 --> 00:34:50,047 "జూలియా నికల్స్. మన సమాజంలోని అతి ముఖ్యమైన సూత్రాన్ని ఉల్లంఘించినట్టు 369 00:34:50,047 --> 00:34:54,761 మీపై జరిగిన నేరారోపణలో మీరు దోషి అని తేలింది. 370 00:34:56,263 --> 00:34:59,600 సైలోని వదిలి వెళ్లాలని నోటితో అభ్యర్థించినట్లయితే, దానికి అనుమతి తప్పక లభిస్తుంది, 371 00:34:59,600 --> 00:35:00,851 కానీ దాన్ని ఉపసంహరించుకొనే వీలు ఉండదు. 372 00:35:01,768 --> 00:35:03,812 మిమ్మల్ని శుభ్రం చేయమని కోరడం జరిగింది, 373 00:35:03,812 --> 00:35:06,190 అందుకు కావలసిన వస్తువులని మీకు అందించడం జరిగింది. 374 00:35:07,482 --> 00:35:09,651 కానీ శుభ్రపరచమని మిమ్మల్ని బలవంతపెట్టడం అనేది జరగదు. 375 00:35:10,319 --> 00:35:15,157 ద్వారం దాటి బయటకు అడుగుపెట్టాక, చట్టం మీకు వర్తించదు. 376 00:35:19,077 --> 00:35:20,787 మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో మనకు తెలీదు. 377 00:35:22,748 --> 00:35:24,791 సైలోని ఎవరు నిర్మించారో మనకు తెలీదు. 378 00:35:26,293 --> 00:35:30,380 సైలో బయట ఉండేదంతా, ఏ మార్పూ లేకుండా అలాగే ఎందుకు ఉంటుందో మనకు తెలీదు. 379 00:35:31,632 --> 00:35:34,927 బయటకు వెళ్లడం ఎప్పుడు సురక్షితమో కూడా మనకు తెలీదు. 380 00:35:36,094 --> 00:35:40,807 ఆ బయటకు వెళ్లే రోజు ఈ రోజు కాదని మాత్రమే మనకు తెలుసు. 381 00:35:42,434 --> 00:35:43,769 జూలియా నికల్స్, 382 00:35:43,769 --> 00:35:46,605 సైలో ప్రజల తరఫున, 383 00:35:47,439 --> 00:35:48,857 మీరు శుభ్రం చేస్తారని ఆశిస్తున్నాను, 384 00:35:48,857 --> 00:35:53,195 తద్వారా మా సురక్షిత ఆవాసం బయట ఉన్న ప్రపంచాన్ని, కళ్లకు కట్టినట్టుగా మాకు చూపించి, 385 00:35:53,987 --> 00:35:58,242 ఇక్కడే క్షేమం అని, బయట క్షేమం కాదని 386 00:35:59,743 --> 00:36:02,079 గుర్తుచేయగలరని నేను ఆశిస్తున్నాను." 387 00:36:04,331 --> 00:36:08,293 జూలియా నికల్స్. చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 388 00:36:10,838 --> 00:36:11,839 నేనేమీ భయపడటం లేదు. 389 00:38:18,465 --> 00:38:20,634 డిస్ ప్లేలో చూపేదంతా నిజం కాదు. 390 00:39:07,806 --> 00:39:08,807 ఇప్పుడు మనమేం చేద్దాం? 391 00:39:10,392 --> 00:39:11,935 ఇంకాసేపుంటే తను చనిపోతుంది. 392 00:39:13,520 --> 00:39:15,898 చెట్టు దాకా వెళ్లకముందే చనిపోతుంది. 393 00:39:33,415 --> 00:39:34,416 షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది. 394 00:40:09,284 --> 00:40:10,285 తనకి తెలుసు. 395 00:40:11,662 --> 00:40:12,663 ఏం తెలుసు? 396 00:40:16,834 --> 00:40:18,252 షెరిఫ్ బెకర్ 397 00:40:56,707 --> 00:40:58,125 పంపిణీ శాఖలో మంచివి ఉంటాయి. 398 00:41:33,118 --> 00:41:37,080 సర్వర్ గది 399 00:44:12,402 --> 00:44:14,404 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్