1 00:00:58,016 --> 00:01:01,103 {\an8}పోలరాయిడ్ డానీ సల్లివన్ 2 00:01:20,831 --> 00:01:22,875 హాయ్. గుడ్ మార్నింగ్, డానీ. నిద్ర ఎలా పట్టింది? 3 00:01:24,543 --> 00:01:26,879 ఏమో. అంత బాగా పట్టలేదు. పర్లేదు. 4 00:01:27,713 --> 00:01:28,714 ఎందుకని? 5 00:01:31,175 --> 00:01:32,718 నువ్వు ఎప్పుడైనా జైలులో పడుకోవడానికి ప్రయత్నించావా? 6 00:01:37,014 --> 00:01:38,098 నువ్వు గ్రహణాన్ని చూశావా? 7 00:01:38,682 --> 00:01:40,726 లేదు, లైట్ ని చూసాను అంతే. చాలా వింతగా అనిపించింది. 8 00:01:41,393 --> 00:01:45,230 కార్ల్ యుంగ్ గ్రహణాలు పునర్జన్మను సూచిస్తాయి అనుకున్నాడు. 9 00:01:45,230 --> 00:01:46,440 ఎవరు? 10 00:01:46,440 --> 00:01:49,026 ఒక సైకియాట్రిస్ట్. అతని గురించి ముందెప్పుడూ వినలేదా? అతను చాలా ఫేమస్. 11 00:01:49,776 --> 00:01:50,777 లేదు. 12 00:01:53,030 --> 00:01:54,239 నువ్వు బానే ఉన్నావా? 13 00:01:55,115 --> 00:01:58,827 - నువ్వు కొంచెం భయపడుతున్నట్టు ఉన్నావు. - అవును. అయ్యుండొచ్చు. 14 00:02:00,537 --> 00:02:03,040 బహుశా ఇవాళ నేను కొంచెం భయపడుతున్నానేమో. 15 00:02:03,040 --> 00:02:06,960 అందుకేనా తడబడుతున్నావు? ఎందుకంటే సాధారణంగా నువ్వు ఇలా ఉండవు. 16 00:02:08,586 --> 00:02:10,297 నువ్వు భలే గమనించావు. 17 00:02:12,549 --> 00:02:14,134 ఎందుకు బెదురుగా ఉన్నావు? 18 00:02:15,427 --> 00:02:16,637 నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. 19 00:02:18,597 --> 00:02:20,057 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 20 00:02:22,017 --> 00:02:23,018 నీ ఉద్దేశం ఏంటి? 21 00:02:23,018 --> 00:02:24,186 నాతో ఎందుకు కూర్చున్నావు? 22 00:02:26,313 --> 00:02:28,941 రాకఫెల్లర్ సెంటర్ దగ్గర జరిగిన సంఘటన కారణంగా. 23 00:02:29,900 --> 00:02:31,401 కానీ మనం ఆ విషయం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? 24 00:02:31,985 --> 00:02:34,071 కోర్టు విచారణ విషయంలో నేను సిద్ధపడడానికి నువ్వు సాయం చేస్తున్నావు. 25 00:02:34,613 --> 00:02:40,160 ఎందుకంటే తుపాకీ కాల్చింది నేను కాకపోయినా, జరిగిన సంఘటనలో నా పాత్ర కూడా ఉంది కాబట్టి. 26 00:02:43,038 --> 00:02:46,583 సరే, గత వారం మనం జాక్ గురించి అలాగే నువ్వు లండన్ వెళ్లడం గురించి మాట్లాడుకున్నాం. 27 00:02:47,918 --> 00:02:49,837 జాక్ నన్ను కలవడానికి వచ్చాడని నీకు తెలుసా? 28 00:02:53,006 --> 00:02:55,133 లేదు, అది అసాధ్యం. అతను లండన్ లో ఉన్నాడు. 29 00:02:56,093 --> 00:02:57,094 ఇవి జాక్ కళ్ళద్దాలే కదా? 30 00:03:09,231 --> 00:03:10,315 అది నా గైడ్ బుక్ లో ఉంది. 31 00:03:11,817 --> 00:03:14,111 నీకు అతని నంబర్ ఆ గైడ్ బుక్ లో దొరికింది. అతన్ని నువ్వు అలాగే కనిపెట్టావా? 32 00:03:14,611 --> 00:03:15,737 లేదు, నేను ఆ గైడ్ బుక్ ని చింపేసాను. 33 00:03:16,238 --> 00:03:19,032 ఆగు, పోలీసులు ఆ పుస్తకాన్ని తిరిగి బాగు చేశారా? ఇవి నీకు ఎక్కడ దొరికాయి? 34 00:03:19,032 --> 00:03:24,538 డానీ. విషయాలను తర్కించి అర్థం చేసుకోవడంలో నీ మనసుకు సాటి లేదు. 35 00:03:24,538 --> 00:03:27,040 నీ మనసు ఎప్పటికప్పుడు కథనాలను భలే అల్లగలదు. 36 00:03:28,000 --> 00:03:31,670 అసంభవమైన విషయాలను సాధ్యం చేయడంలో. నీ జీవితాంతం నువ్వు అదే చేస్తూ వచ్చావు. 37 00:03:32,421 --> 00:03:35,132 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో నీకు బాగా అర్థం కావడం అవసరం అని 38 00:03:35,132 --> 00:03:36,300 నేను జాక్ తో చెప్పాను. 39 00:03:36,800 --> 00:03:40,721 ముందు అతను ఒప్పుకోలేదు, కానీ నీకు మంచి జరగడమే అతని ఉద్దేశం కాబట్టి ఒప్పించగలిగాను. 40 00:03:41,221 --> 00:03:43,891 నాకు కూడా అదే కావాలి. నువ్వు అది నమ్ముతావా? 41 00:03:46,560 --> 00:03:48,937 - నువ్వు నన్ను నమ్ముతున్నావా? - నీ ఉద్దేశం ఏంటి? 42 00:03:48,937 --> 00:03:50,272 అది ఒక సింపుల్ ప్రశ్న. 43 00:03:51,064 --> 00:03:52,065 కాదు, సింపుల్ కాదు. 44 00:03:53,650 --> 00:03:54,818 సరే. నిజమే. 45 00:03:59,364 --> 00:04:02,576 నేను బెదురుగా ఉండడం నువ్వు గమనించావు. 46 00:04:03,869 --> 00:04:08,123 అందుకు కారణం రాకఫెల్లర్ సెంటర్ దగ్గర జరిగిన కొన్ని సంఘటనల గురించి 47 00:04:08,123 --> 00:04:09,541 మనం ఇంకా మాట్లాడుకోలేదు, 48 00:04:09,541 --> 00:04:13,879 కానీ ఇప్పుడు వాటి గురించి మాట్లాడితే నీకు నచ్చదేమో అని భయంగా ఉంది. 49 00:04:15,964 --> 00:04:18,257 నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. 50 00:04:20,928 --> 00:04:21,928 నాకు తెలుసు. 51 00:04:24,515 --> 00:04:25,682 నీకు ఒకటి చూపించాలి అనుకుంటున్నాను. 52 00:04:30,896 --> 00:04:32,606 {\an8}టి-120 విహెచ్ఎస్ 53 00:04:33,232 --> 00:04:34,233 ఆ టేప్ లో ఏముంది? 54 00:04:34,900 --> 00:04:39,446 సాధారణంగా నేను ఇలాంటి పనిని ఇంత త్వరగా చేయను, కానీ విచారణ తేదీ గడువు దగ్గర పడుతోంది. 55 00:04:42,533 --> 00:04:43,534 ఆ టేప్ లో ఏముంది? 56 00:04:43,534 --> 00:04:45,661 మనం దీనిని కలిసి చూస్తే మంచిదని నా ఉద్దేశం. సరేనా? 57 00:04:45,661 --> 00:04:47,371 ఇది ఏంటో నాకు తెలీదు. నేను ఇక వెళ్ళిపోతాను. 58 00:04:47,371 --> 00:04:49,581 నన్ను క్షమించు, కానీ మనకు ఇక సమయం లేదు, డానీ. 59 00:04:57,631 --> 00:05:00,259 వీధికి అవతల ఉన్న నగల దుకాణంలో ఒక కొత్త సిసిటివి కెమెరా ఉంది. 60 00:05:00,259 --> 00:05:02,302 ఈ వీడియో ఫుటేజ్ పోలీసులకు ఈ మధ్యనే దొరికింది. 61 00:05:03,011 --> 00:05:04,012 ఇది దాని కాపీ. 62 00:05:05,514 --> 00:05:06,890 అసలు కాపీని ఆధారంగా తీసుకున్నారు. 63 00:05:13,522 --> 00:05:14,982 మీరు ఆ టేప్ లో మార్పులు చేశారు. 64 00:05:16,316 --> 00:05:17,609 లేదు. 65 00:05:20,195 --> 00:05:21,196 ఇది ఒక ట్రిక్. 66 00:05:22,698 --> 00:05:23,699 ఇది ట్రిక్ కాదు. 67 00:05:24,408 --> 00:05:27,995 నాకు తెలిసి, నీ లోలోపల ఆ విషయం నీకు కూడా తెలుసు. 68 00:05:36,837 --> 00:05:39,548 రాకఫెల్లర్ సెంటర్ లో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. 69 00:05:41,258 --> 00:05:42,593 నువ్వు మాత్రమే. 70 00:05:43,719 --> 00:05:45,345 కాల్పలు జరిపింది నువ్వే, డానీ. 71 00:05:46,847 --> 00:05:50,350 అరియాన కాదు. నువ్వే. 72 00:05:53,270 --> 00:05:56,231 ఇదంతా చేసింది నువ్వే. 73 00:06:05,657 --> 00:06:06,658 పడుకో. 74 00:06:09,077 --> 00:06:10,078 పెద్ద తప్పు చేశావు, పిల్లా. 75 00:06:12,789 --> 00:06:14,208 నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. 76 00:06:16,001 --> 00:06:17,002 ఇట్జక్? 77 00:07:39,126 --> 00:07:41,128 {\an8}ది మైండ్స్ ఆఫ్ బిల్లీ మిల్లిగన్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 78 00:07:41,128 --> 00:07:42,212 {\an8}డానియల్ కీస్ సమర్పణ 79 00:11:02,496 --> 00:11:03,956 సరే, చెప్పేది వినండి. 80 00:11:19,346 --> 00:11:20,681 నేను, "శాంతించండి" అన్నాను. 81 00:11:21,181 --> 00:11:22,224 నేను అడగడం లేదు. 82 00:11:22,224 --> 00:11:25,602 ఇది చాలా అన్యాయం. మీరు నన్ను వెళ్లనివ్వాలి. 83 00:11:25,602 --> 00:11:27,271 నాకు గార్డు అంటే భయం లేదు. 84 00:11:28,814 --> 00:11:31,149 ఆ కుర్రాడిని వదిలేయమని అందరూ నీతో చెప్పారు. 85 00:11:33,569 --> 00:11:35,445 నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. 86 00:11:35,445 --> 00:11:39,575 ఎందుకు దీనిని పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు, ఆహ్? నేను నీ మాట వినను! 87 00:11:39,575 --> 00:11:43,912 దేవుడా, నేను పెద్ద వెధవని. నేను ఆమె మాట విని ఉండకూడదు. 88 00:11:43,912 --> 00:11:45,622 నన్ను వెళ్లనివ్వండి. ఆమెను నేను హ్యాండిల్ చేయగలను. 89 00:11:45,622 --> 00:11:48,500 - అయ్యయ్యో. ఆమె గార్డులను పిలిస్తుంది. - అలా జరిగితే అస్సలు మంచిది కాదు. 90 00:11:48,500 --> 00:11:50,210 మైక్, నువ్వు కొంచెం... 91 00:11:52,421 --> 00:11:56,842 వినిపిస్తుందా? ఆ కుర్రాడికి ఏం కాలేదు. ఆ కుర్రాడు సురక్షితంగానే ఉన్నాడు. 92 00:11:56,842 --> 00:11:59,469 - నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు, బాబు. - ఓహ్, డానీ. 93 00:12:01,138 --> 00:12:04,057 వాడు అన్నది నిజం, బాబు. 94 00:12:04,057 --> 00:12:06,310 నువ్వు వచ్చి ఉండకూడదు. 95 00:12:06,894 --> 00:12:08,729 కనీసం ఈ సందర్భంలో ఇది జరిగి ఉండకూడదు. 96 00:12:10,898 --> 00:12:12,441 ఇక్కడ ఏం జరుగుతోంది, జాక్? 97 00:12:12,441 --> 00:12:14,902 వాడిని బయటకు వదలకు. వాడు బ్రతకలేడు. 98 00:12:41,720 --> 00:12:44,765 - అసలు ఇదంతా ఏంటి? - ఇది ఎలా సాధ్యం? 99 00:12:44,765 --> 00:12:46,058 నిజం చెప్పాలంటే, ఇది వీలు కాకూడదు. 100 00:12:46,058 --> 00:12:47,851 నువ్వు నాకు కోపం తెప్పించావు! తెలుస్తుందా? 101 00:12:50,020 --> 00:12:51,813 ఇట్జక్, నువ్వు ఏం చేస్తున్నావు? 102 00:12:51,813 --> 00:12:52,898 ...కోపం తెప్పించావు! 103 00:12:52,898 --> 00:12:55,150 - నేను ఇది చేయగలను. - ఓహ్, అవును, అది భలే ఐడియా. 104 00:12:55,150 --> 00:12:57,361 మన బ్రతుకులు ఒక డ్రగ్స్ బానిస చేతుల్లో పెడదాం, ఇంతకు ముందు చాలా 105 00:12:57,361 --> 00:12:58,278 ఉద్దరించావు కదా అందుకని. 106 00:12:58,278 --> 00:12:59,905 - చావు, జాక్. నేను డ్రగ్స్ వాడడం లేదు. - లేదు. 107 00:12:59,905 --> 00:13:03,408 - మైక్. - లేదు. నేను ఇప్పుడు వెళ్ళలేను. 108 00:13:04,117 --> 00:13:05,118 ఇట్జక్. 109 00:13:05,118 --> 00:13:06,495 ఆగు. 110 00:13:06,495 --> 00:13:08,580 వాడు ఆమెను గాయపరిస్తే, మన పని అయిపోయినట్టే. 111 00:13:08,580 --> 00:13:10,541 ఆమెను ముట్టుకోడు. మహిళలు, పిల్లలతో ఎలా ఉంటాడో తెలుసు కదా. 112 00:13:10,541 --> 00:13:12,417 - గార్డుల సంగతి ఏంటి? - నీకు అంత కచ్చితంగా తెలిస్తే 113 00:13:12,417 --> 00:13:14,419 - నువ్వే వెళ్లొచ్చు కదా? - ఎందుకంటే నేను ఆలోచించాలి! 114 00:13:14,419 --> 00:13:16,839 నేను నీతో ఆటలు ఆడడం లేదు. నువ్వు చాలా అబద్ధాలు చెప్తున్నావు. 115 00:13:16,839 --> 00:13:18,298 మీరు నన్ను వెళ్లనివ్వాలి. 116 00:13:18,298 --> 00:13:20,592 వాడు ఎవరినైనా గాయపరిస్తే మనల్ని సాలిటరీలో వేసేస్తారు. 117 00:13:20,592 --> 00:13:23,387 నువ్వు డీల్ చేయడం మొదలెడితే ఏమవుతుందో నేను ముందే చెప్పాను. 118 00:13:23,387 --> 00:13:24,847 అంటే ఇది నా పొరపాటా? 119 00:13:24,847 --> 00:13:27,474 అయితే నువ్వు డబ్బు ఎలా సంపాదిస్తున్నావో చెప్తావా, మంచోడిలా నటించే చేతకాని వెధవా? 120 00:13:27,474 --> 00:13:30,561 నేను మనం జైలుకు వెళతాం అన్నాను, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చూడు! 121 00:13:30,561 --> 00:13:32,646 గార్డులు బయటే ఉన్నారు, డానీ. 122 00:13:33,480 --> 00:13:36,233 - పదండి, కుర్రాళ్లు. నడవండి. - నాకు వాళ్లంటే భయం లేదు. 123 00:13:36,859 --> 00:13:38,110 నేను లెక్క చేయను! 124 00:13:39,027 --> 00:13:40,445 ఓహ్, వెళ్లి చావరా, మైక్! 125 00:13:43,240 --> 00:13:48,370 - వద్దు. మీరు కల్పించుకుంటే పరిస్థితి దిగజారుతుంది. - డానీ గురించి ఆలోచించు. వెళ్ళు, మైక్. 126 00:13:56,587 --> 00:13:57,713 ఎలాంటి సమస్యా లేదు, కదా? 127 00:13:57,713 --> 00:14:00,340 డానీ, అది నువ్వేనా? 128 00:14:02,050 --> 00:14:03,760 అవును, ఏం పర్లేదు, అక్కా. అంతా బాగానే ఉంది. 129 00:14:08,098 --> 00:14:11,852 - అంతా బానే ఉంది. పర్లేదు. - నేను నీకు సాయం చేయడానికి చూస్తున్నా. 130 00:14:11,852 --> 00:14:13,562 - మెల్లిగా నడువు, బాబు. - పదా. 131 00:14:13,562 --> 00:14:15,063 - అది నాకు తెలుసు. - తిరుగు. 132 00:14:15,564 --> 00:14:17,399 - క్షమించు. - వెనక్కి పదా. 133 00:14:26,783 --> 00:14:28,869 వద్దు. ఫ్యాన్సీగా ఏం చేయకు, మిత్రమా. షాట్ వెయ్. 134 00:14:29,745 --> 00:14:30,746 ముక్క వెయ్యి. 135 00:14:30,746 --> 00:14:33,498 అంతే. నువ్వు దృష్టి పెట్టాలి. ఇంకొక షాట్ వెయ్. 136 00:14:33,498 --> 00:14:36,376 - మళ్ళీ. - షాట్ వెయ్! 137 00:14:37,211 --> 00:14:38,545 నాకు అస్సలు కలిసి రాదు. 138 00:14:38,545 --> 00:14:41,256 నాకు ఏ విషయంలోనూ అస్సలు కలిసి రాదు. 139 00:14:41,256 --> 00:14:43,133 - మళ్ళీ అదే, కదా? - అదే. 140 00:14:49,056 --> 00:14:50,766 బాల్ కోసం అవకాశం ఏర్పరుచు. షూట్ చేయనివ్వకు! 141 00:14:56,146 --> 00:14:57,523 ఆ జరిగిన విషయం అసలు ఎలా జరిగింది? 142 00:14:58,398 --> 00:15:00,025 వాడు ముందెప్పుడూ మెలకువగా ఉన్నప్పుడు ఇక్కడికి రాలేదు. 143 00:15:00,692 --> 00:15:04,029 - నాకైతే వ్యవస్థ విచ్చిన్నం అవుతుందేమో అని భయంగా ఉంది. - ఏం వ్యవస్థ? 144 00:15:04,530 --> 00:15:06,782 - మన వ్యవస్థ. - కానివ్వండి. ఇక్కడే. 145 00:15:06,782 --> 00:15:10,911 అధికారం బలహీనపడుతోంది. దుష్ట మృగం బెత్లహేము వైపు నడుస్తోంది. 146 00:15:12,579 --> 00:15:13,580 ఏట్స్ పద్యం. 147 00:15:16,542 --> 00:15:18,669 నా కోపం అదుపు తప్పుతున్నందుకు క్షమించు. 148 00:15:18,669 --> 00:15:21,129 నువ్వు ఇక్కడ ఉన్నది ముచ్చట్లు పెట్టడానికి కాదులే. 149 00:15:21,672 --> 00:15:23,757 అదుపు తప్పి ప్రవర్తించడమే ఇక్కడ నీ పని. 150 00:15:24,550 --> 00:15:27,511 దురదృష్టవశాత్తు, మన ముందు ఉన్న సమస్యను మనం కొట్లాటతో పరిష్కరించుకోలేం. 151 00:15:28,887 --> 00:15:29,888 ఇందుకు బాధ్యత నాదే. 152 00:15:30,722 --> 00:15:34,434 ఆమె చాలా చాకచక్యంగా నన్ను ఒప్పించింది. ఉత్తమమైన వారు అంతే. 153 00:15:34,434 --> 00:15:35,519 దేంట్లో ఉత్తమమైనవారు? 154 00:15:35,519 --> 00:15:36,603 అబద్ధాలు చెప్పడంలో. 155 00:15:38,105 --> 00:15:39,356 తప్పు నాదే అని ఒప్పుకోక తప్పదు. 156 00:15:40,315 --> 00:15:44,069 అయితే, మనం ఇక నుండి వాడిని ఆ డాక్టర్ మహిళతో మాట్లాడనిచ్చేది లేదా? 157 00:15:44,069 --> 00:15:46,321 వారిద్దరి మధ్య ఏర్పాటైన బంధం మనకు ఇక ప్రయోజనకరం 158 00:15:46,321 --> 00:15:50,200 కాదు అని మనం స్వయంగా చూశాం కదా. ఏమంటావు? 159 00:15:51,994 --> 00:15:53,161 ఆమె ప్రమాదకరంగా మారుతోంది. 160 00:15:54,413 --> 00:15:56,748 నాకైతే అలా జరుగుతుందని అనిపించడం లేదు, జాక్. 161 00:15:56,748 --> 00:15:59,001 అలాగా? ఇప్పుడు నువ్వు నిపుణుడివి అయిపోయావా? 162 00:15:59,001 --> 00:16:01,587 ప్రమాదం విషయంలో అంటావా? అవును. 163 00:16:07,301 --> 00:16:08,552 అయితే మనం వాడిని ఎప్పుడు నిద్రలేపుతాం? 164 00:16:09,511 --> 00:16:11,513 మనం ఒక ప్లాన్ వేసే వరకు వాడిని నిద్రలేపేది లేదు. 165 00:16:15,684 --> 00:16:17,853 - జాక్. - ఇరవై ఒకటి. 166 00:16:19,104 --> 00:16:20,898 ఈ దేశంలో ఒక మానసిక రోగం ఉందని నిర్ధారణ 167 00:16:20,898 --> 00:16:22,774 జరిగితే ఏం చేస్తారో నీకు తెలుసా? 168 00:16:24,484 --> 00:16:25,611 నయం చేయడానికి ప్రయత్నిస్తారు. 169 00:16:26,320 --> 00:16:28,238 ఆమె విషయానికి వస్తే, మనల్ని కేవలం జబ్బుగా పరిగణిస్తుంది. 170 00:16:28,238 --> 00:16:31,825 డానీకి నయం చేయడం అంటే మనల్ని వదిలించుకోవడమే. 171 00:16:31,825 --> 00:16:32,910 అది పిచ్చితనం. 172 00:16:34,745 --> 00:16:36,580 డానీని ప్రాణాలతో కాపాడుతున్నది మనం మాత్రమే. 173 00:16:37,748 --> 00:16:40,542 నేను చెప్పాను కదా, మనకు ఒక ప్లాన్ కావాలి. 174 00:17:37,766 --> 00:17:40,185 పదా. సి విభాగంలోని వారు మెస్ కి వెళ్ళాలి. 175 00:17:45,065 --> 00:17:49,278 పదండి! నీతో రోజూ ఇదే సమస్య, జాక్సన్. 176 00:17:56,618 --> 00:17:58,203 హేయ్, నాకు కొంచెం డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలవా? 177 00:17:58,203 --> 00:18:00,706 మెల్లిగా మాట్లాడు. చెత్త వెధవా. 178 00:18:04,042 --> 00:18:06,170 - ఇది మనుషులు తినే తిండేనా? - ముందుకు కదులు, సల్లివన్. 179 00:18:06,170 --> 00:18:08,130 - ఆగు. అసలు దీనిని తిండి అంటారా? - కదులు! 180 00:18:08,130 --> 00:18:09,298 - సరే. - వెంటనే పో. 181 00:18:09,298 --> 00:18:12,634 నేను వెళ్తున్నాను. దేవుడా. 182 00:18:24,521 --> 00:18:25,522 నువ్వు అడిగింది తీసుకొచ్చాను. 183 00:18:28,066 --> 00:18:29,985 - ఏమన్నావు? - నువ్వు అడుగుతున్నది నా దగ్గర ఉంది. 184 00:18:32,196 --> 00:18:35,532 నీకు ఇంకా కావాలి అన్నావు. చెప్పాను కదా, నేను పని చేయగలను. 185 00:18:35,532 --> 00:18:36,992 అమ్మ బాబోయ్. 186 00:18:38,452 --> 00:18:39,745 చాలా వేగంగా తెచ్చావు. 187 00:18:46,919 --> 00:18:47,836 రంగు పెన్నులా? 188 00:18:47,836 --> 00:18:49,963 నువ్వు అడిగిన రకం కాదు, కానీ అలాంటివే, సరేనా? 189 00:18:50,547 --> 00:18:53,050 ఈ రంగు పెన్సిళ్ళు నన్నేం చేసుకోమంటావు? 190 00:18:53,634 --> 00:18:55,761 అదంతా నాకు అనవసరం. కావాలంటే మడిచి కింద పెట్టుకో. 191 00:18:55,761 --> 00:18:57,930 చూడు, నాకు ఇవి వద్దు, సరేనా? వీటికి బదులు ఇంకేమైనా ఇవ్వు. 192 00:18:57,930 --> 00:18:59,848 - వీటిని వెనక్కి తీసుకో. - అవి ఎవరికీ అవసరం ఉండదు, బాబు. 193 00:18:59,848 --> 00:19:00,933 ఇక డబ్బులు కట్టు, వెధవా. 194 00:19:00,933 --> 00:19:02,976 రంగు పెన్సిళ్ళ కోసమా? నీకు పిచ్చా? 195 00:19:02,976 --> 00:19:05,771 అరేయ్, ఇలా చూడు. నాకు కొకైన్ కావాలి. దయచేసి సాయం చెయ్. ప్లీజ్. 196 00:19:05,771 --> 00:19:06,855 నాతో ఆటలు ఆడుతున్నావా? 197 00:19:22,746 --> 00:19:23,830 ఏంటి సంగతి? 198 00:19:27,835 --> 00:19:29,002 ఓయ్. ఏంటి సంగతి? 199 00:19:43,684 --> 00:19:44,685 ఓయ్, ఏంటి సంగతి? 200 00:19:45,435 --> 00:19:47,437 ఇక్కడ ఉన్న మీ వెధవల్లో ఎవడు నాకు డ్రగ్స్ ఇవ్వగలడు, ఆహ్? 201 00:19:47,938 --> 00:19:50,858 - దొబ్బెయ్. - అంటే నువ్వే ఏర్పాటు చేయగలవు అన్నమాట. ఏంటి సంగతి? 202 00:19:50,858 --> 00:19:52,693 ఓయ్, ఈ చెత్తగాడు నిజంగానే అంటున్నాడా? 203 00:19:52,693 --> 00:19:55,070 మీ దగ్గర ఏది ఉన్నా తీసుకుంటా. మెత్ కూడా. నాకు మత్తు ఎక్కడానికి ఏమైనా కావాలి అంతే. 204 00:19:55,070 --> 00:19:56,864 - సరేనా? - నీకు ఇంగ్లీషు అర్థం కావడం లేదా? 205 00:19:57,656 --> 00:20:00,409 - దొబ్బెయ్. - నీ సమస్య ఏంటిరా, సోదరా? 206 00:20:00,409 --> 00:20:02,619 - నువ్వే నా సమస్య, సన్నాసి. - హేయ్! 207 00:20:03,579 --> 00:20:05,998 ఈ చెత్త వెధవ మార్సెల్లోకి డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. 208 00:20:05,998 --> 00:20:07,791 అది చిన్న అపార్థం మాత్రమే అని నేను అంటాను. 209 00:20:10,043 --> 00:20:12,754 ఊరుకో, నేను డబ్బులు ఇద్దాం అనుకున్నా. జోక్ చేశాను అంతే. 210 00:20:12,754 --> 00:20:14,590 నీకు జోక్ అర్థం కాదా, బాబు? 211 00:20:15,424 --> 00:20:16,675 అమ్మ బాబోయ్. 212 00:20:35,527 --> 00:20:37,321 నేను నిన్ను నాశనం చేస్తాను, చెత్త వెధవా. 213 00:20:44,244 --> 00:20:47,164 పిల్ల చేష్టలు, వెర్రితనం, పూర్తిగా బాధ్యతారాహిత్యం. 214 00:20:47,164 --> 00:20:48,957 అయ్య బాబోయ్, జానీ. అసలు నీ సమస్య ఏంటి? 215 00:20:49,917 --> 00:20:54,421 - కిందకి ఉండండి! అందరూ కిందకి ఉండండి! - అందరూ నేల మీద పడుకోండి! 216 00:20:56,465 --> 00:20:58,133 ఈ పోరంబోకును నేను చూసుకోవడం ఇక... 217 00:20:58,133 --> 00:21:00,719 మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. నీకు చెప్పినట్టు చెయ్. 218 00:21:00,719 --> 00:21:02,930 - ఏం చేస్తున్నావు, సల్లివన్? - పడుకో! 219 00:21:02,930 --> 00:21:05,265 - కింద... దానిని కింద పెట్టు! - వెంటనే పాడేయ్! 220 00:21:05,265 --> 00:21:08,018 ఇట్జక్, ఇక నేను చూసుకుంటాను, మిత్రమా. 221 00:21:14,733 --> 00:21:18,320 జెంటిల్మెన్, దయచేసి వివరించే అవకాశం... 222 00:21:28,413 --> 00:21:30,415 రేపు నీ విచారణ సమయంలో నిన్ను చాలా ఛండాలంగా చూస్తారు. 223 00:21:48,016 --> 00:21:49,434 భయపడకు, పాపా, ఇది నేనే. 224 00:21:49,935 --> 00:21:53,272 - నువ్వు నన్ను చాలా భయపెట్టావు. - దేవుడా. మత్తులో ఏమైనా ఉన్నావా ఏంటి? 225 00:21:53,772 --> 00:21:55,190 నేను అస్సలు పడుకోలేదు. 226 00:21:55,691 --> 00:21:58,110 - అవును, చూస్తుంటే అలసిపోయినట్టు ఉన్నావు. - థాంక్స్, స్టాన్. నువ్వు మంచోడివి. 227 00:21:58,610 --> 00:22:00,404 సరే, ఏదైనా అద్భుతం జరగాలని ప్రార్ధించి ఉంటావు అని ఆశిస్తున్నా, 228 00:22:00,404 --> 00:22:01,989 మనకు అనుకూలంగా జరగాలంటే కచ్చితంగా అద్భుతం కావాలి. 229 00:22:01,989 --> 00:22:03,991 జడ్జి మనల్ని కలవడానికి ఒప్పుకోవడం మంచి విషయం 230 00:22:03,991 --> 00:22:05,534 అని నువ్వే అన్నావు కదా. 231 00:22:05,534 --> 00:22:09,246 కాదు, అంత చెడ్డ విషయం కాదు అన్నాను. ఈ కేసులో మంచి విషయం అంటూ ఏదీ లేదు. 232 00:22:09,246 --> 00:22:11,540 ఇలా అన్నిటిలో నిరాశగా చూపే వైఖరి నీ క్లయింట్స్ కి కలిసి వస్తుందంటావా? 233 00:22:11,540 --> 00:22:13,125 ఇది వైఖరి కాదు, వాస్తవాన్ని గుర్తించడం. 234 00:22:14,459 --> 00:22:18,130 వాళ్ళు రోగ నిర్ధారణను అంగీకరించాలి. విచారణకు వెళ్లే మానసిక ఆరోగ్యం వాడికి లేదు. 235 00:22:18,130 --> 00:22:20,340 వాడు హాస్పిటల్ లో ఉండాల్సిన వాడు. వాళ్లకు అది అర్థం కావాలి. 236 00:22:20,340 --> 00:22:21,758 వాళ్ళు ఏమీ చేయాల్సిన పనిలేదు. 237 00:22:22,384 --> 00:22:25,345 చూడు, ఇది నీ వృత్తికి చాలా బాగా కలిసొస్తుందని నాకు తెలుసు, సరేనా. 238 00:22:25,345 --> 00:22:27,055 నేను వాడికి సాయం చేయాలనుకుంటున్నాను, స్టాన్. 239 00:22:27,055 --> 00:22:31,226 అలాగే, ఇందులో గెలవడం నీకు ఎంత ముఖ్యమో మనిద్దరికీ బాగా తెలుసు, సరేనా? 240 00:22:31,226 --> 00:22:33,312 అలాగే ఈ కేసు విషయానికి వస్తే, నీకు కలిసి వస్తే నాకు కూడా మంచిదే. 241 00:22:34,354 --> 00:22:36,648 అవును, హాస్పిటల్ కి వెళ్లడం ఆ కుర్రాడికి కూడా మంచిదే అనుకో. 242 00:22:36,648 --> 00:22:37,733 జైలుకు పోవాలని ఎవరు అనుకుంటారు? 243 00:22:39,484 --> 00:22:42,404 సాధారణంగా, డిఏ వారు నేరాన్ని అంగీకరిస్తే శిక్షను తగ్గిస్తుంటారు. 244 00:22:44,239 --> 00:22:47,284 అప్పుడే సంతోషపడిపోకు. "సాధారణంగా" అన్న పదం ముఖ్యం. 245 00:22:48,660 --> 00:22:50,454 ఈ కేసు విషయంలో మాత్రం, ఇది విచారణకు వెళ్లడమే 246 00:22:50,454 --> 00:22:51,830 మిగతా అందరికీ కలిసి వస్తుంది. 247 00:22:51,830 --> 00:22:53,874 వాడికి మానసిక రోగం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. 248 00:22:54,499 --> 00:22:57,085 వాడికి మానసిక రోగం ఉన్నంత మాత్రాన లెక్క చేస్తారు అనుకుంటున్నావా? వాళ్ళు కూడా మనలాంటి వారే, 249 00:22:57,085 --> 00:22:59,087 వాళ్ళ గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచించుకుంటారు. 250 00:22:59,671 --> 00:23:02,716 అలాగే రాకఫెల్లర్ షూటర్ ని శిక్షించకుండా వదిలేసారు అని ప్రెస్ వారికి తెలిస్తే 251 00:23:02,716 --> 00:23:04,593 ఎదురయ్యే తలనొప్పి గురించి కూడా. 252 00:23:05,093 --> 00:23:06,553 మనం శిక్షించకుండా వదిలేయమనడం లేదు. 253 00:23:06,553 --> 00:23:08,597 నేను సురక్షితమైన ప్రదేశంలో చికిత్స ఇవ్వాలి అంటున్నా. 254 00:23:09,097 --> 00:23:10,098 అదంతా అనవసరం. 255 00:23:10,682 --> 00:23:14,311 ఇలాంటి నేరాల మీదే వార్తా పత్రికలు నడుస్తాయి. ఈ కేసు గనుక విచారణకు వెళ్లకపోతే 256 00:23:14,311 --> 00:23:15,687 అందరూ దీనిని నేరంగానే చూస్తారు. 257 00:23:16,313 --> 00:23:19,399 కాబట్టి ప్రపంచంలో ఏ మానసిక వైద్యుడూ అంగీకరించని జబ్బు వీడికి ఉంది అంటే 258 00:23:19,399 --> 00:23:21,068 ఆ విషయం ఎవరికీ నచ్చదు. 259 00:23:21,068 --> 00:23:22,444 అయితే ఇక నువ్వు మాత్రం ఎందుకు వచ్చావు? 260 00:23:23,237 --> 00:23:28,367 ఎందుకంటే అవకాశం తక్కువే ఉన్నా, అవకాశం ఉన్నట్టే. అలాగే నాకు కోర్టుకు వెళ్లడం అస్సలు నచ్చదు. 261 00:23:30,786 --> 00:23:33,455 మీరు మాట్లాడుకున్నప్పుడు నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకేమైనా బయటపడ్డాయా? 262 00:23:33,455 --> 00:23:37,334 వాడు ఆ వీడియోని చూసినప్పటి నుండి, చాలా దూరంగా ఉంటున్నాడు. 263 00:23:37,960 --> 00:23:38,961 నువ్వు వాడికి ఎందుకు చూపించావు? 264 00:23:40,170 --> 00:23:43,382 విచారణ మొదలైన తర్వాత వాడికి తన రోగం గురించి మొదటిసారి తెలుసుకునే స్థితి రావడం 265 00:23:43,382 --> 00:23:44,466 నాకు ఇష్టం లేదు. 266 00:23:45,217 --> 00:23:47,052 అలా జరిగితే ఎలా స్పందిస్తాడో చెప్పలేము. 267 00:23:47,052 --> 00:23:48,554 వాడు స్తంభించిపోవచ్చు. 268 00:23:48,554 --> 00:23:52,057 వాడి చేతుల్లో గాయపడకుండా నేను తృటిలో తప్పించుకున్నాను, స్టాన్, నేనంటే వాడికి ఇష్టం ఉన్నా అలా జరిగింది. 269 00:23:52,057 --> 00:23:56,186 వాడు జడ్జినో లేక ప్రతిపక్ష లాయరునో గాయపరిచే అవకాశాలు ఉన్నాయి. 270 00:23:56,186 --> 00:23:58,480 - అదే గనుక జరిగితే ఏమయ్యేది? - సరే. అంటే వాడికి... 271 00:23:58,480 --> 00:24:00,691 వాడికి తాను కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే కాదని తెలుసు కదా? 272 00:24:01,191 --> 00:24:03,151 బహుశా అనేక మంది వాడిలో ఉండొచ్చు. 273 00:24:03,151 --> 00:24:04,528 ఓహ్, ఊరుకో. 274 00:24:04,528 --> 00:24:07,573 నేను డాక్టర్ విట్మ్యాన్ గారిని పరిచయం చేస్తూ మొదలెడదాం అనుకుంటున్నాను. 275 00:24:08,073 --> 00:24:10,492 ఈయన ప్రపంచఖ్యాతి సాధించిన మానసిక వైద్యుడు, 276 00:24:10,492 --> 00:24:14,872 అలాగే ప్రత్యేకంగా మానసిక రుగ్మతులపై ఆయన అయిదు మెడికల్ జర్నల్స్ రాశారు. 277 00:24:15,455 --> 00:24:17,332 ఆయన ప్రతిష్టాత్మక అమెరికన్ సైకోలాజికల్ అసోసియేషన్ వారి 278 00:24:17,332 --> 00:24:21,044 గౌరవ ఈ. ఎల్. థోర్న్ డైక్ అవార్డును పొందారు కూడా. 279 00:24:21,545 --> 00:24:23,297 డిఫెన్సు వారు ఇచ్చిన రోగ నిర్ధారణ ఆధారంగా 280 00:24:23,297 --> 00:24:25,841 మీరు ప్రతివాది స్థితిని పరీక్షించి చూశారా? 281 00:24:26,341 --> 00:24:27,759 లేదు, యువర్ హానర్. 282 00:24:27,759 --> 00:24:31,221 డాక్టర్ గుడ్విన్ రిపోర్టును చదివిన తర్వాత, నాకు ఆ అవసరం రాలేదు. 283 00:24:32,181 --> 00:24:36,393 నేను అసలు ప్రపంచంలో లేని ఒక రుగ్మతి ఒకరికి ఉందని నిర్ధారించలేను. 284 00:24:36,393 --> 00:24:37,477 మీరు సీరియస్ గా అంటున్నారా? 285 00:24:37,978 --> 00:24:39,730 అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వారు 286 00:24:39,730 --> 00:24:44,067 బహుళ వ్యక్తిత్వం అనబడే మానసిక రుగ్మతి ఉందని గుర్తించలేదు. 287 00:24:44,067 --> 00:24:46,737 - ఐసిడిలో దాని గురించి ఉంది. - హిస్టీరియా రోగంగా మాత్రమే సూచించారు. 288 00:24:46,737 --> 00:24:48,113 ఒక జబ్బు లేదు అని మీరే నిర్ణయించేయలేరు. 289 00:24:48,113 --> 00:24:49,907 అది భావోద్వేగ కల్లోలం మాత్రమే, మానసిక రుగ్మతి కాదు. అది... 290 00:24:49,907 --> 00:24:50,991 ఇక చాలు. 291 00:24:51,825 --> 00:24:53,076 ఇది చేపల మార్కెట్ కాదు. 292 00:24:53,660 --> 00:24:56,079 మీ సమయం వచ్చేవరకు మీ అభిప్రాయాన్ని మీతోనే ఉంచుకోలేకపోతే 293 00:24:56,079 --> 00:24:57,664 మిమ్మల్ని వెళ్ళిపోమనాల్సి ఉంటుంది, డాక్టర్. 294 00:24:58,874 --> 00:24:59,875 కానివ్వండి. 295 00:25:00,584 --> 00:25:06,340 వైద్య రంగంలో ఉన్న అత్యధిక నిపుణులు నిజం అని అంగీకరించని 296 00:25:06,340 --> 00:25:09,468 ఒక రుగ్మతి కారణంగా ఒక హింసాత్మక నేరానికి పాల్పడిన వ్యక్తికి 297 00:25:09,468 --> 00:25:14,139 శిక్ష పడకూడదు అంటే, నా ఉద్దేశంలో హాస్యాస్పదం. 298 00:25:14,806 --> 00:25:17,309 క్షమించాలి. కానీ నా వృత్తిపరమైన అభిప్రాయం ఇదే. 299 00:25:18,268 --> 00:25:21,021 థాంక్స్, డాక్టర్. ప్రతివాదిని ఇక లోనికి పిలుద్దామా? 300 00:25:21,021 --> 00:25:23,190 యువర్ హానర్, మేము తెలుసుకున్న కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాం. 301 00:25:23,190 --> 00:25:26,360 మనం అందరం డాక్టర్ గుడ్విన్ రిపోర్టును చదివాము. ఇక స్వయంగా వాడిని కలిస్తే మంచిది, సరేనా? 302 00:25:27,277 --> 00:25:28,278 సరే. 303 00:25:35,035 --> 00:25:36,161 దయచేసి కూర్చో. 304 00:25:38,330 --> 00:25:39,331 బాగానే ఉన్నావా? 305 00:25:39,915 --> 00:25:40,958 అవును. 306 00:25:41,959 --> 00:25:42,960 నీ మొహానికి ఏమైంది? 307 00:25:45,212 --> 00:25:49,800 డానీ, చెప్పేది విని, ఇది కొంచెం భయం కలిగించవచ్చు, 308 00:25:49,800 --> 00:25:53,095 కానీ నీకు మొదట్లో నిజం అనిపించకపోయినా 309 00:25:53,095 --> 00:25:55,514 వీళ్ళందరూ నీకు సాయం చేయడానికే వచ్చారు. 310 00:25:56,014 --> 00:25:58,475 నువ్వు నిజం చెప్తే చాలు, అప్పుడు నీకు అవసరమైన చికిత్స 311 00:25:58,475 --> 00:26:01,103 నీకు అందించగలుగుతాం. సరేనా? 312 00:26:01,103 --> 00:26:04,314 సరే, డానీ, విచారణకు ముందు చోటుచేసుకుంటున్న ఈ చర్చ నీ విషయంలో అన్నీ 313 00:26:04,314 --> 00:26:05,858 న్యాయబద్ధంగానే జరుగుతున్నాయని ధృవీకరించడానికే. సరేనా? 314 00:26:07,943 --> 00:26:08,777 కౌన్సిలర్. 315 00:26:09,611 --> 00:26:13,448 హలో, డానీ. నా పేరు పట్రిషియ రిచర్డ్స్. 316 00:26:13,448 --> 00:26:15,784 నీ కేసులో నేను ఈ జిల్లా న్యాయవాదిని. 317 00:26:16,702 --> 00:26:18,620 నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? 318 00:26:20,664 --> 00:26:22,165 డానీ, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలుసా? 319 00:26:22,833 --> 00:26:24,835 ఒక మీటింగ్ రూమ్ లో. రైకర్స్ దీవిలో. 320 00:26:24,835 --> 00:26:27,588 నువ్వు రైకర్స్ దీవికి ఎందుకు వచ్చావో తెలుసా? 321 00:26:28,172 --> 00:26:31,675 రాకఫెల్లర్ సెంటర్ లో జరిగిన తుపాకీ కాల్పుల సంఘటన కారణంగా. 322 00:26:32,259 --> 00:26:34,761 ఆ సంఘటన కారణంగా నిన్ను న్యాయబద్ధంగా విచారించబోతున్నారు అని 323 00:26:34,761 --> 00:26:36,930 - నీకు తెలుసా? - అవును. 324 00:26:36,930 --> 00:26:38,307 దాని అర్థం ఏంటో నీకు తెలుసా? 325 00:26:39,016 --> 00:26:41,560 నేను దోషినో కాదో అనే విషయాన్ని జ్యురీ వారి నిర్ణయిస్తారు. 326 00:26:42,144 --> 00:26:46,106 థాంక్స్, డానీ. చాలా బాగా చెప్పావు. నాకు కావాల్సింది అదే. 327 00:26:47,524 --> 00:26:49,693 - ఇప్పుడు మీ వంతు. - స్టాన్, ఆగు. 328 00:26:49,693 --> 00:26:51,278 - ఏమైనా సమస్య ఉందా? - అవును. 329 00:26:51,278 --> 00:26:53,363 - అవును. ఉంది. - లేదు. లేదు, యువర్ హానర్. 330 00:26:53,947 --> 00:26:55,532 అయితే ఇక కొనసాగించండి, కౌన్సిలర్. 331 00:26:58,452 --> 00:27:01,413 హాయ్, డానీ. నువ్వు డానీవే కదా? 332 00:27:03,415 --> 00:27:04,499 కామెంటరీ చేయొద్దు, ప్లీజ్. 333 00:27:07,169 --> 00:27:09,338 అవును, సర్. నేను డానీనే. 334 00:27:09,338 --> 00:27:12,716 చూడు, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా, ఆ తర్వాత ఈ సంభాషణ ముగుస్తుంది. సరేనా? 335 00:27:13,717 --> 00:27:16,470 సంఘటన జరిగిన రోజున నువ్వు రాకఫెల్లర్ సెంటర్ కి 336 00:27:16,470 --> 00:27:18,639 - ఎవరితో వెళ్ళావో చెప్తావా? - ఎవరితోనా? 337 00:27:20,974 --> 00:27:22,893 అంటే, అక్కడ చాలా మంది జనం ఉన్నారు. 338 00:27:23,810 --> 00:27:26,188 షాపుల్లోకి వెళ్తూ, బయటకు వస్తూ చాలా మంది తిరుగుతున్నారు. 339 00:27:26,188 --> 00:27:29,024 అవును, కానీ నీతో ఎవరు ఉన్నారు, డానీ? 340 00:27:31,026 --> 00:27:32,778 క్షమించాలి, నాకు మీ ప్రశ్న అర్థం కావడం లేదు. 341 00:27:33,695 --> 00:27:35,781 నువ్వు రాకఫెల్లర్ సెంటర్ కి ఎవరితో వెళ్ళావు? 342 00:27:35,781 --> 00:27:36,698 అది డానీ కాదు. 343 00:27:36,698 --> 00:27:37,783 ఆగు. 344 00:27:38,367 --> 00:27:40,827 ఎవరూ లేరు. నేను ఒంటరిగా ఉన్నాను. 345 00:27:41,537 --> 00:27:45,207 కానీ నువ్వు ఇంతకు ముందు రాకఫెల్లర్ సెంటర్ కి ఇంకొకరితో వెళ్లాను 346 00:27:45,207 --> 00:27:48,335 అని చెప్పావు. తుపాకీతో ఒకరు వచ్చారు అని. నువ్వు... 347 00:27:48,335 --> 00:27:50,379 - తప్పుదోవ పట్టించకండి, మిస్టర్ కమీస. - సరే. 348 00:27:50,379 --> 00:27:52,714 నిజం చెప్పాలంటే, సర్, నేను ఒంటరిగానే ఉన్నాను, మీకు నమ్మకం కుదరకపోతే 349 00:27:52,714 --> 00:27:54,216 ఒకసారి వీడియో చూస్తే మంచిది. 350 00:27:54,216 --> 00:27:56,802 - అది డానీ కాదు. - దయచేసి మాట్లాడకండి. 351 00:27:58,929 --> 00:28:00,097 సరే. 352 00:28:00,097 --> 00:28:04,184 డాక్టర్ గుడ్విన్ తో జరిగిన సంభాషణల్లో నువ్వు నీతో పాటు ఆ ఇంట్లో ఉన్న వారి గురించి బాగా మాట్లాడావు. 353 00:28:04,184 --> 00:28:09,356 అరియాన అలాగే య... ఇట్జక్. వాళ్ళ గురించి మాకు చెప్పగలవా? 354 00:28:09,356 --> 00:28:13,819 అంటే, తనను చూసిన వెంటనే నాకు అరియానతో ఒక బంధం ఏర్పడినట్టు అయింది, 355 00:28:13,819 --> 00:28:15,612 ఆ తర్వాత ఆమెతో ఇట్జక్ వచ్చాడు. 356 00:28:15,612 --> 00:28:17,489 ఆ తర్వాత త్వరలోనే మేము కలిసి ఉండడం ప్రారంభించాం. 357 00:28:17,489 --> 00:28:19,867 అయితే నువ్వు వారిని ఎలాంటి వారిగా వివరిస్తావు? 358 00:28:20,450 --> 00:28:21,952 అరియాన ఇంకా ఇట్జక్? 359 00:28:23,620 --> 00:28:27,457 అరియాన చాలా ప్రశాంతంగా, ఒక టాబి లాగ ఉండేది. 360 00:28:28,584 --> 00:28:30,586 కాకపోతే ఇంకాస్త నిమ్మళంగా ఉండేది, ఒక బర్మీస్ జాతి దానిలాగ. 361 00:28:30,586 --> 00:28:32,421 కాకపోతే ఇట్జక్ చాలా గోల చేసేది. 362 00:28:32,421 --> 00:28:34,464 దానికి కోపం తెప్పిస్తే మాత్రం అస్సలు కంట్రోల్ చేయలేము. 363 00:28:34,464 --> 00:28:36,341 డానీ, నువ్వు తికమకపడినట్టు ఉన్నావు. 364 00:28:37,050 --> 00:28:39,636 అంటే, మీరే కదా అరియాన ఇంకా ఇట్జక్ గురించి అడిగారు. 365 00:28:41,138 --> 00:28:42,139 నా పిల్లులు. 366 00:28:44,474 --> 00:28:46,226 ఇది వాడు... ఇది డానీ కాదు. 367 00:28:46,226 --> 00:28:49,730 యువర్ హానర్, ఇది జాక్. డానీలో ఉన్న మరొక వ్యక్తిత్వం. 368 00:28:49,730 --> 00:28:53,525 మాట్లాడవద్దు అన్నాను. ఇంకొక్క మాట మాట్లాడినా నిన్ను ఇక్కడి నుండి పంపేయాల్సి ఉంటుంది. 369 00:28:53,525 --> 00:28:55,903 ఇక కూర్చో, డాక్టర్, ప్లీజ్. 370 00:28:59,114 --> 00:29:01,283 మీరు మీ క్లయింట్ ని ఏమైనా అడగాలి అనుకుంటున్నారా? 371 00:29:08,624 --> 00:29:09,791 లేదు, యువర్ హానర్. అంతే. 372 00:29:10,709 --> 00:29:13,420 - నువ్వు కాస్త బయట ఎదురుచూస్తావా, ప్లీజ్? - డాక్టర్. 373 00:29:14,505 --> 00:29:15,672 థాంక్స్. 374 00:29:17,716 --> 00:29:20,385 యువర్ హానర్, నేను ముందు అన్నట్టే అది డానీ కాదు. 375 00:29:22,095 --> 00:29:25,933 పూర్తి మానసిక విచక్షణ ఉన్న నీ క్లయింట్ తన పిల్లుల గురించి చెప్తే వినడానికి మమ్మల్ని 376 00:29:26,892 --> 00:29:28,310 బలవంతంగా పిలిపించారు. 377 00:29:28,310 --> 00:29:31,063 - యువర్ హానర్, నేను ముందు అన్నట్టుగా, నాకు... - నిన్ను మాట్లాడమని అడిగానా? 378 00:29:31,563 --> 00:29:34,358 కౌన్సిలర్, విచారణకు అన్నీ సిద్ధం చేయండి. వెంటనే. 379 00:29:34,358 --> 00:29:36,109 యువర్ హానర్, ప్లీజ్. మాకు ఒక్క నిమిషం... 380 00:29:36,109 --> 00:29:38,028 స్టాన్, నువ్వు నీ క్లయింట్ కి మంచి చేయాలి అనుకుంటే, 381 00:29:38,028 --> 00:29:39,655 నాకు ఇక కోపం తెప్పించకు. 382 00:29:40,239 --> 00:29:42,491 నువ్వు నోరు తెరిచిన ప్రతీసారి, నాకు కోపం వస్తుంది. 383 00:29:44,743 --> 00:29:46,078 సరే. 384 00:29:52,417 --> 00:29:54,711 సరే, చూడు, వాడు నేరం ఒప్పుకుంటే 385 00:29:54,711 --> 00:29:57,005 వాడి మీద ఉన్న నేరారోపణను దుష్ప్రవర్తనగా పరిగణించు, 386 00:29:57,005 --> 00:29:59,550 అప్పుడు వాడిని కావాల్సినన్ని రోజులు మెంటల్ హాస్పిటల్ లో వేయొచ్చు. 387 00:30:00,050 --> 00:30:00,968 జోక్ చేస్తున్నావు, కదా? 388 00:30:00,968 --> 00:30:02,719 ఊరుకో, ఫ్యాటీ. ఇది మంచి డీల్. 389 00:30:02,719 --> 00:30:05,472 నీ క్లయింట్ కి. కానీ నా పైఅధికారులు నన్ను వేయించి చంపుతారు. 390 00:30:05,472 --> 00:30:09,184 వాడు జైలుకు వెళ్లాల్సిన వాడు కాదు. సరేనా? వాడికి చికిత్స కావాలి. 391 00:30:09,184 --> 00:30:12,980 వాడు నిరాయుధులైన జనం మధ్యలోకి వెళ్లి తుపాకీ కాల్చి అక్కడి నుండి పారిపోయాడు. 392 00:30:12,980 --> 00:30:16,066 కానీ వాడికి ఒక జబ్బు ఉంది, ప్యాటీ. నీకు అది అర్థం కావడం లేదా? 393 00:30:16,066 --> 00:30:17,526 అయితే వాడిని వదిలేయాలా? 394 00:30:17,526 --> 00:30:20,362 అంటే, మెంటల్ హాస్పిటల్ కి వెళితే చాలు అని నా ఉద్దేశం. 395 00:30:20,362 --> 00:30:23,365 కనీసం ఈ ఒక్కసారి వాడి పరిస్థితిని నమ్మొచ్చు కదా? ఇంకొక అవకాశం ఇవ్వు. 396 00:30:24,616 --> 00:30:26,118 నేను నీతో ఒక పందెం కడతాను, స్టాన్. 397 00:30:27,160 --> 00:30:30,289 నేను వాడిని పరీక్షించి చూసినప్పుడు, కచ్చితంగా వాడి గతాన్ని తవ్వి చూసినప్పుడు... 398 00:30:30,831 --> 00:30:32,666 కచ్చితంగా నేరపూరిత చరిత్ర నాకు దొరుకుతుంది. 399 00:30:32,666 --> 00:30:36,253 ఇన్నాళ్లూ వాడు తప్పించుకుంటూ తిరిగిన నేరాలు అన్నిటినీ నేను కనిపెడతాను. 400 00:30:36,837 --> 00:30:41,884 వాడు పట్టపగలు, ఊరు నడిబొడ్డున జనం మీద కాల్పులు జరిపాడు, అలాంటి వాడిని వదిలేయాలా? 401 00:30:42,593 --> 00:30:45,721 రైకర్స్ జైలు నిండా అంతకంటే తక్కువ నేరాలు చేసిన అనేకమంది నల్లని, చామనఛాయ 402 00:30:45,721 --> 00:30:47,514 కుర్రాళ్ళు ఉన్నారు. వారి రెండవ అవకాశం ఎక్కడ? 403 00:30:47,514 --> 00:30:50,559 వాళ్లకు అవకాశం అవసరమైనప్పుడు ఒప్పుకోలు ఒప్పందం ఏమైంది? 404 00:30:50,559 --> 00:30:52,394 నీ క్లయింట్ ని మాత్రం నమ్మి చూడాలి 405 00:30:52,394 --> 00:30:54,980 ఎందుకంటే ఈ న్యాయ వ్యవస్థే తనలా కనిపించే వారికి 406 00:30:54,980 --> 00:30:56,982 లాభం కలిగేలా ఏర్పరచబడి ఉంది కాబట్టి, 407 00:30:57,900 --> 00:30:59,860 కానీ నేను వాడిని అంత సులభంగా వదలను. 408 00:31:00,694 --> 00:31:05,073 కాబట్టి లేదు. నేను వాడి నేర అంగీకారాన్ని ఒప్పుకునేది లేదు. విచారణ జరిగి తీరాల్సిందే. 409 00:31:20,339 --> 00:31:21,423 నువ్వు గెలిచాను అనుకుంటున్నావా? 410 00:31:22,132 --> 00:31:24,176 ఫెడరల్ జైలు ఎలా ఉంటుందో తెలుసా? 411 00:31:24,176 --> 00:31:26,512 ఆ ప్రదేశంతో పోల్చితే ఈ జైలు పిక్నిక్ లాగ ఉంటుంది. 412 00:31:26,512 --> 00:31:28,514 ఇట్జక్ వాడిని కాపాడగలడు అనుకుంటున్నావా? 413 00:31:29,723 --> 00:31:32,351 ఇట్జక్ ఎలాంటోడైనా డానీకి ఉన్న శరీరంతోనే పోరాడాలి. 414 00:31:32,351 --> 00:31:34,353 మీరంతా ఇప్పటికీ ఒకే వ్యక్తి. 415 00:31:34,937 --> 00:31:37,022 వాళ్ళు అక్కడ నిన్ను నమిలి ఊసేస్తారు. 416 00:31:37,022 --> 00:31:39,483 ఈ చిన్ని నాటకం నీకు సంతృప్తిని ఇచ్చి ఉంటుందని ఆశిస్తున్నా, జాక్. 417 00:32:04,341 --> 00:32:06,260 సరే, మనం ఇప్పుడు ఏం చేయాలి? 418 00:32:07,553 --> 00:32:10,472 విచారణకు వెళ్ళాలి, ఒక మగాడిలా మన శిక్షను అంగీకరించాలి. 419 00:32:10,472 --> 00:32:12,432 మనం ఎప్పుడూ చేసే పనే చేయాలి. ప్రాణాలతో నిలబడాలి. 420 00:32:12,432 --> 00:32:14,309 నేను మొత్తం విచారణని హ్యాండిల్ చేయలేను, బాబోయ్. 421 00:32:14,309 --> 00:32:16,854 - నేను హ్యాండిల్ చేయగలను. - లేదా చేయలేకపోవచ్చు. 422 00:32:16,854 --> 00:32:20,232 ఆమె ఆ జైలు గురించి చెప్పిన సంగతి ఏంటి? 423 00:32:20,232 --> 00:32:22,651 మనం ఏం చేయగలమో ఆమెకు అస్సలు తెలీదు. 424 00:32:24,236 --> 00:32:26,530 - ఆ మహిళ అన్నదే నిజం అయితే? - దేని గురించి? 425 00:32:27,739 --> 00:32:28,866 బహుశా మనమే సమస్య ఏమో. 426 00:32:29,992 --> 00:32:32,119 బహుశా ఆ కుర్రాడు తన కాళ్ళ మీద తాను నిలబడాలేమో. 427 00:32:32,119 --> 00:32:33,745 నువ్వు ఏం చెప్తున్నావు, బాబు? 428 00:32:34,705 --> 00:32:38,417 ఇన్నాళ్లూ బ్రతకడానికి వాడికి మనం కావాలి, నిజమే, కానీ ఇక అవసరం లేదేమో. 429 00:32:40,127 --> 00:32:41,837 ఏంటి? అంటే వాడికి ఇక మన అవసరం లేదంటావా? 430 00:32:43,505 --> 00:32:45,716 జాక్, నువ్వు అంటుంటావు కదా, "వాస్తవాన్ని ఎదుర్కోవాలి" అని? 431 00:32:47,176 --> 00:32:50,554 - అవును. - కాబట్టి, బహుశా ఇక డానీ ఆ పని చేసే సమయమైందేమో. 432 00:32:53,932 --> 00:32:56,476 ఇది వెర్రితనం. డానీకి మనం కావాలి. 433 00:32:56,476 --> 00:32:57,728 బహుశా తను అన్నది నిజమేమో. 434 00:33:01,565 --> 00:33:04,610 నువ్వు ఏం సూచిస్తున్నావో నీకు అర్థం అవుతుంది కదా, మిత్రమా, ఏమంటావు? 435 00:33:05,986 --> 00:33:06,987 అవును. 436 00:33:07,863 --> 00:33:11,658 మనం చచ్చిపోవాలి అంటావా? 437 00:33:13,452 --> 00:33:15,579 త్యాగం చేయడం అంత దారుణమైన విషయమా? 438 00:33:16,079 --> 00:33:17,748 నువ్వు నాతో పరిహాసాలు ఆడుతున్నావా? 439 00:33:17,748 --> 00:33:19,833 నోరు మూసుకో, జానీ, జీవితంలో ఒక్కసారి నోరు మూసుకో. 440 00:33:25,923 --> 00:33:27,007 ఇది భలే విషయం, కదా? 441 00:33:27,758 --> 00:33:29,259 ఒకరిని అంతగా ప్రేమించడం. 442 00:33:30,469 --> 00:33:33,263 ఎంత గాఢంగా అంటే, ఏమైనా చేసి వాళ్ళ మనుగడను కాపాడాలి అనుకోవడం. 443 00:33:35,891 --> 00:33:36,892 వాళ్ళ కోసం చావుకు సిద్ధం కావడం. 444 00:33:44,816 --> 00:33:45,817 లేదా వాళ్ళ కోసం చంపడం. 445 00:33:48,654 --> 00:33:52,074 క్షమించు, మిత్రమా. మనం లేకపోతే వాడు బ్రతకలేడు. 446 00:34:23,522 --> 00:34:24,648 హాయ్, డానీ. 447 00:34:25,315 --> 00:34:28,860 ఆరి. నీ గురించి చాలా కంగారు పడ్డాను. 448 00:34:29,862 --> 00:34:31,362 నిన్ను చూడడం సంతోషంగా ఉంది, డానీ. 449 00:34:31,362 --> 00:34:32,822 అందరూ నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావని నన్ను 450 00:34:32,822 --> 00:34:34,491 అడుగుతున్నారు, నీకు ఏదో చేశా అనుకుంటున్నారు. 451 00:34:36,159 --> 00:34:37,995 నేను బానే ఉన్నాను. ఏం పర్లేదు. 452 00:34:37,995 --> 00:34:41,415 కాదు. ఏం పర్లేదు కాదు. నేను ఇప్పుడు చాలా పెద్ద సమస్యలో ఉన్నా, ఆరి. 453 00:34:42,833 --> 00:34:45,168 భయపడకు, మనం ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం. 454 00:34:49,797 --> 00:34:50,882 సరే, అలాగే. 455 00:35:00,267 --> 00:35:01,727 అసలు మనం ఎక్కడ ఉన్నాం? 456 00:35:04,813 --> 00:35:07,566 నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తివి నువ్వే. ఆ విషయం నీకు తెలుసు కదా? 457 00:35:08,775 --> 00:35:09,818 నీ మాటలు వింటుంటే భయంగా ఉంది. 458 00:35:10,819 --> 00:35:14,114 మన మధ్య ఒక కనెక్షన్ ఉంది, అవునా? 459 00:35:16,200 --> 00:35:17,201 అవును. నిజమే. 460 00:35:17,743 --> 00:35:22,497 ఆ కనెక్షన్ ఉండడానికి కారణం, నేను బ్రతికేదే నీ మనసులోనే, డానీ. 461 00:35:23,874 --> 00:35:27,419 ఎందుకంటే నేనే నువ్వు, డానీ. మేమందరం నువ్వే. 462 00:35:41,141 --> 00:35:44,978 రాకఫెల్లర్ సెంటర్ లో ఉన్నది నువ్వు ఒక్కడివే. నువ్వు నాతో లేవు. 463 00:35:45,729 --> 00:35:50,734 నేను నీతో ఉన్నా, ఇక్కడ అలాగే ఇక్కడ కూడా. 464 00:35:52,319 --> 00:35:53,570 కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. 465 00:35:53,570 --> 00:35:56,281 నేను నిన్ను ఎప్పుడూ వదలలేదు. ఎప్పటికీ వదలను. 466 00:35:56,823 --> 00:35:58,867 మాలో ఎవరికీ నిన్ను వదిలేయాలని లేదు, బాబు. 467 00:35:59,535 --> 00:36:01,203 మేము నీకు సాయం చేయడానికే ఉన్నాం. 468 00:36:02,246 --> 00:36:03,330 మా పనే అది. 469 00:36:10,254 --> 00:36:12,214 ఈ సారి నువ్వు నిద్రపోవడానికి వీలు లేదు, డానీ. 470 00:36:12,214 --> 00:36:13,423 మనం ఒకరికి ఒకరం కావాలి. 471 00:36:14,842 --> 00:36:16,927 - దేని కోసం? - బ్రతకడం కోసం. 472 00:36:19,346 --> 00:36:21,515 నువ్వు బయట నిద్రపోతున్నప్పుడు ఇక్కడ ఖాళీగా ఉంటుంది. 473 00:36:24,226 --> 00:36:27,396 కానీ ఎవరూ చూడనప్పుడు ఒక్కోసారి నేను వస్తుంటా, నీతో కలిసి కలలు కనడానికి. 474 00:36:32,025 --> 00:36:35,821 నీకు సాయం అవసరమైనప్పుడు లేదా ఒంటరిగా ఉన్నా లేదా భయపడుతున్నప్పుడు మేము వస్తుంటాం. 475 00:36:38,991 --> 00:36:40,742 నేను నీ ఒంటరితనాన్ని తీసేయడానికి వస్తాను. 476 00:36:49,042 --> 00:36:51,879 ఇతరులకి దగ్గరగా ఉండడం నీ మనసు తట్టుకోలేదు. 477 00:36:52,629 --> 00:36:55,257 చాలా బాధగా ఉంటుంది. అప్పుడే నేను వస్తుంటాను. 478 00:36:56,842 --> 00:36:58,760 - నీకు ఇది మొదటి నుంచే తెలుసా? - ఏమని? 479 00:37:00,262 --> 00:37:01,305 అంటే, నువ్వు నిజం కాదని. 480 00:37:02,389 --> 00:37:04,933 కాదు, సాధారణంగా తెలీదు. 481 00:37:06,268 --> 00:37:09,771 మేము ఇక్కడ ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నట్టు. 482 00:37:15,360 --> 00:37:16,612 నాలాగా ఇంకెవరైనా ఉన్నారా? 483 00:37:17,821 --> 00:37:19,781 లేదు, డాన్, నువ్వు స్పెషల్. 484 00:37:29,041 --> 00:37:31,710 మమ్మల్ని చేసింది నువ్వే, మా అందరినీ. 485 00:37:34,463 --> 00:37:35,631 వీళ్ళందరూ ఎవరు? 486 00:37:37,132 --> 00:37:38,133 వాళ్లంతా నువ్వే. 487 00:37:38,675 --> 00:37:42,012 ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరికి ఒక ఉద్దేశం ఉండేది. ఇప్పుడు వారి అవసరం లేదు. 488 00:37:43,972 --> 00:37:45,682 జాక్ వాళ్ళని అవసరంలేని వారు అంటాడు. 489 00:37:49,895 --> 00:37:50,896 ఇట్జక్. 490 00:37:52,314 --> 00:37:54,274 జాక్ ఎక్కువగా తెరవెనుక ఉండి నడిపిస్తాడు, 491 00:37:54,274 --> 00:37:59,154 కానీ పరిస్థితి ఎప్పుడైనా అదుపు తప్పేలా ఉంటే, అతను మమ్మల్ని లైన్ లో పెడతాడు. 492 00:38:01,365 --> 00:38:02,366 నిజం. 493 00:38:03,200 --> 00:38:06,119 చూడు, ఈ కొట్టాంలో మార్లిన్ ఇంకా ఆడమ్ ల మధ్య జరిగిన సంఘటన 494 00:38:07,788 --> 00:38:11,250 నీకు చావాలి అనిపించేలా చేసింది, డానీ. నీకు అది గుర్తుందా? 495 00:38:12,543 --> 00:38:13,544 కానీ నువ్వు చావలేదు. 496 00:38:15,379 --> 00:38:20,300 నువ్వు ఒక అద్దంలాగ పగిలిపోయావు. ఎన్నో ముక్కలుగా విరిగిపోయావు. 497 00:38:20,300 --> 00:38:22,344 అన్నీ నువ్వే, కానీ వేర్వేరుగా. 498 00:38:24,763 --> 00:38:29,101 నువ్వు బ్రతకడానికి సాయం చేసే రక్షకుల్లాగా మారావు. 499 00:38:31,144 --> 00:38:32,813 ఇదంతా మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? 500 00:38:33,438 --> 00:38:34,940 ఒక విషయం మారింది. 501 00:38:34,940 --> 00:38:37,901 నువ్వు ఇక్కడికి వచ్చావు, డానీ, మెలకువగా. 502 00:38:39,027 --> 00:38:40,904 అలా ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. అలా కాకూడదు. 503 00:38:41,822 --> 00:38:46,243 ఆ మహిళ మమ్మల్ని నీ నుండి తీసేయాలని చూస్తోంది. మమ్మల్ని నాశనం చేయాలని చూస్తోంది. 504 00:38:47,160 --> 00:38:51,164 - రాయ. - ఆమె దృష్టిలో మేము ఒక జబ్బు. 505 00:38:52,040 --> 00:38:54,209 ఆమె నీకు మందులు ఇచ్చే ఒక ప్రదేశానికి పంపించాలని చూస్తోంది, 506 00:38:54,209 --> 00:38:56,128 మమ్మల్ని చంపేసే చికిత్స ఇప్పించాలని. 507 00:38:56,128 --> 00:38:57,671 అది జరిగితే మేము నీకు సాయం చేయలేము. 508 00:38:58,422 --> 00:39:00,465 నీకు ఏం కావాలో వాళ్ళు అర్థం చేసుకోలేరు, కానీ మేము అర్థం చేసుకోగలం. 509 00:39:01,216 --> 00:39:02,551 మాకు నీ సాయం కావాలి, మిత్రమా. 510 00:39:02,551 --> 00:39:06,430 మేము గనుక చనిపోతే నువ్వు కూడా చచ్చిపోతావేమో... 511 00:39:08,891 --> 00:39:09,892 అని భయంగా ఉంది. 512 00:39:12,519 --> 00:39:13,854 నన్ను మీరు ఏం చేయమంటారు? 513 00:39:13,854 --> 00:39:17,608 అంటే, ముందు నువ్వు ఆమెను వదిలించుకోవాలి. 514 00:39:18,734 --> 00:39:22,154 అది నువ్వే చేయాలి, మేము గనుక మాట్లాడితే ఇప్పుడు ఇక ఆమెకు నువ్వు కాదని తెలిసిపోతుంది. 515 00:39:23,739 --> 00:39:26,283 నీ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉండడం నీకు ఇష్టం లేదు అని ఆమెకు చెప్పు. 516 00:39:26,283 --> 00:39:30,120 అలాగే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీకు మతిస్థిమితం లేదని ఒప్పుకోను అని చెప్పు. 517 00:39:30,120 --> 00:39:31,622 కానీ అప్పుడు నేను జైలుకు పోతాను. 518 00:39:31,622 --> 00:39:33,290 శిక్ష ఎక్కువ కాలం పడకపోవచ్చు. 519 00:39:33,290 --> 00:39:35,542 ఎంతైనా ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు, అవునా? 520 00:39:36,335 --> 00:39:40,255 అలాగే నాకు నిజంగానే నీ సాయం కావాలి, డానీ. మా అందరికీ కావాలి. 521 00:39:43,342 --> 00:39:47,012 ఏం చేయాలో నీకు తెలుసు, బాబు. ఆ పని నువ్వు చేయాలని ఈపాటికి నీకు తెలిసి ఉండాలి. 522 00:39:59,525 --> 00:40:00,526 మంచి కుర్రాడివి. 523 00:40:39,857 --> 00:40:43,902 నీ దృష్టిలో నేను విలువ లేనిదానిని అని నాకు తెలుసు, జాక్. 524 00:40:44,653 --> 00:40:48,407 నిజమే, ఈ విషయంలో నేను కూడా కొంతమేరకు నా స్వలాభం కోసమే పనిచేసాను. 525 00:40:48,407 --> 00:40:53,996 నిజమే. కానీ నేను కేవలం నీకు సాయం చేయాలనే చూస్తున్నా కూడా 526 00:40:53,996 --> 00:40:57,791 అందరి ముందు నేను చులకన అయ్యేలా చేయడం చాలా చెత్త పని. 527 00:41:01,211 --> 00:41:04,673 లోపల నా మాటలు నువ్వు వినగలవు అని నాకు తెలుసు, డానీ. 528 00:41:04,673 --> 00:41:08,510 నీకు గనుక పోరాడాలి అని ఉంటే, నువ్వు పోరాడగలవు. 529 00:41:10,596 --> 00:41:12,931 కానీ నీకు జైలుకు వెళ్లాలనే ఉంది, 530 00:41:13,599 --> 00:41:17,060 లేదంటే నిన్న అంత గొప్ప నాటకం ఆడి ఉండేవాడివే కాదు. 531 00:41:18,228 --> 00:41:19,229 నీకు నచ్చినట్టు చేసుకో. 532 00:41:20,230 --> 00:41:23,483 ఈ దరిద్రం కోసం నేను నా వృత్తినే పణంగా పెట్టి పనిచేసాను. 533 00:41:28,405 --> 00:41:30,115 అసలు నేను ఎందుకు వచ్చానో కూడా తెలీడం లేదు. 534 00:41:30,616 --> 00:41:31,450 ప్లీజ్. 535 00:41:39,166 --> 00:41:41,293 నా తలలో స్వరాలు వినిపిస్తున్నాయి. 536 00:41:45,756 --> 00:41:47,633 లోపల వేరే మనుషులు ఉన్నారు. 537 00:41:55,599 --> 00:41:57,392 నిన్ను వేడుకుంటున్నాను. 538 00:42:02,439 --> 00:42:05,442 నాకు సహాయం చెయ్. ప్లీజ్. 539 00:42:10,614 --> 00:42:11,615 నీకు నేను ఉన్నాను. 540 00:42:19,039 --> 00:42:22,000 మీకు గాని, మీకు తెలిసిన వారికి గాని సహాయం అవసరం అయితే, 541 00:42:22,000 --> 00:42:24,002 APPLE.COM/HERETOHELP కు వెళ్ళండి 542 00:43:13,719 --> 00:43:15,721 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్