1 00:00:35,807 --> 00:00:40,228 కోవిడ్-19 ఒక మహమ్మారి అని ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 2 00:00:40,311 --> 00:00:44,148 "ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి" అనే ఆదేశాన్ని నేను జారీచేస్తున్నాను. 3 00:00:44,232 --> 00:00:46,693 …దాదాపు నగరవాసులందరినీ పూర్తిగా 4 00:00:46,776 --> 00:00:49,445 ఇంట్లోనే ఉండమని ఆదేశిస్తున్నాను. 5 00:00:49,529 --> 00:00:53,283 ఈరోజు సాయంత్రం, నేను ఒక సూచన ఇవ్వాలి. 6 00:00:53,366 --> 00:00:55,285 మీరు ఇంట్లోనే ఉండాలి. 7 00:00:57,579 --> 00:01:02,375 మార్చి 2020. ప్రాణాంతక వైరస్ ప్రపంచం మొత్తం పాకింది. 8 00:01:02,458 --> 00:01:05,003 ఉండగలిగితే ఇంట్లోనే ఉండండి 9 00:01:05,086 --> 00:01:08,840 రాత్రికి రాత్రే, మన జీవితాలకు అంతరాయం కలిగింది. 10 00:01:14,554 --> 00:01:16,222 కానీ మనం ఆగగానే... 11 00:01:17,557 --> 00:01:22,604 ప్రకృతి ప్రపంచంలో చెప్పుకోదగ్గ మార్పులు మొదలయ్యాయి. 12 00:01:25,940 --> 00:01:27,567 స్వచ్ఛమైన గాలి. 13 00:01:29,944 --> 00:01:31,571 శుభ్రమైన నీరు. 14 00:01:33,156 --> 00:01:38,995 దశాబ్దాలుగా చూడని పద్ధతుల్లో జంతువులు వృద్ధి చెందడం ప్రారంభించాయి. 15 00:01:41,915 --> 00:01:46,628 ఐదు ఖండాల్లో లాక్ డౌన్ ప్రారంభం నుండీ చిత్రీకరణ చేపట్టి... 16 00:01:48,713 --> 00:01:52,175 ప్రకృతి అసాధారణ స్పందనను మేము రికార్డు చేశాం. 17 00:02:01,142 --> 00:02:04,854 తమ పిల్లలతో సముద్రంలో భారీ జీవులు నూతన మార్గాల్లో సంప్రదించడం దగ్గర నుండి... 18 00:02:08,941 --> 00:02:13,696 తమ కూనలు మనుగడ సాగించే అవకాశాలను చిరుతలు రూపాంతరం చేసుకోవడం… 19 00:02:14,364 --> 00:02:17,450 తల్లి కావడానికి ఇంతకు మించిన సమయం లేదు. 20 00:02:18,451 --> 00:02:24,040 రికార్డు బ్రేకింగ్ స్థాయిలో పెంగ్విన్ ల బ్రీడింగ్ సీజన్ వరకూ. 21 00:02:26,960 --> 00:02:32,173 వన్యప్రాణుల జీవితాల్లో, వాటి ప్రపంచంలో మనిషి ప్రమేయం తగ్గితే 22 00:02:32,799 --> 00:02:37,220 ఎలాంటి మార్పులు జరుగుతాయో తొంగి చూడడానికి ఇదొక ప్రత్యేక అవకాశం. 23 00:02:37,971 --> 00:02:41,599 భారీ పరిమాణాల్లో జరిగిన ప్రపంచవ్యాప్త ప్రయోగం ఇది. 24 00:02:43,184 --> 00:02:47,480 ఇది భూమి మారిన సంవత్సరం. 25 00:03:00,243 --> 00:03:04,372 వ్యాఖ్యాత డేవిడ్ అటెన్బరో 26 00:03:05,915 --> 00:03:11,504 లాక్ డౌన్ మొదలైన గంటలలోగా, ఎక్కువమంది నిశ్శబ్దాన్ని గమనించే ఉంటారు. 27 00:03:11,588 --> 00:03:12,839 రేడియో సిటీ మ్యూజిక్ హాల్ 28 00:03:14,257 --> 00:03:19,220 ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ శబ్ద కాలుష్యం 70% వరకూ తగ్గిపోగా, 29 00:03:19,304 --> 00:03:22,473 కొత్త శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి... 30 00:03:25,602 --> 00:03:27,020 ...పక్షి పాట. 31 00:03:31,524 --> 00:03:33,568 శాన్ ఫ్రాన్సిస్కో యు.ఎస్.ఎ 32 00:03:33,651 --> 00:03:35,278 మెట్రో జనాభా 47 లక్షలు 33 00:03:35,361 --> 00:03:37,447 ఈ వైట్ క్రౌన్డ్ పిచుకలు 34 00:03:37,530 --> 00:03:41,367 ఆశ్చర్యకరమైన పనిచేస్తూ నిశ్శబ్దానికి అలవాటు పడుతున్నాయి. 35 00:03:43,661 --> 00:03:46,497 గోల్డెన్ గేట్ బ్రిడ్జి సమీపంలో నివసించే 36 00:03:46,581 --> 00:03:50,501 వీటి పాట కార్ల హోరులో వినిపించకుండా పోయింది. 37 00:03:52,503 --> 00:03:57,383 కానీ ప్రస్తుతం ఇక్కడి ట్రాఫిక్ 1950లలో ఉన్నంత తక్కువ స్థాయికి చేరడంతో, 38 00:03:58,635 --> 00:04:04,265 ఈ పిచ్చుకలు జతకోసం చేసే శబ్దాలలో కొత్త రాగాలు కనిపెట్టి పరిశోధకులు అబ్బురపడ్డారు. 39 00:04:06,809 --> 00:04:11,898 కాబట్టి, కొన్నేళ్ళపాటు ఈ పక్షులకు మంచి బ్రీడింగ్ సీజన్ ఉంటుందనే ఆశించవచ్చు. 40 00:04:17,569 --> 00:04:20,573 తగ్గింది కేవలం శబ్ద కాలుష్యం మాత్రమే కాదు. 41 00:04:22,325 --> 00:04:28,331 ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం తగ్గిన వేగం ఊహించనిది. 42 00:04:30,250 --> 00:04:31,459 కొద్ది రోజులలోనే, 43 00:04:31,543 --> 00:04:36,965 40 ఏళ్ళలో ఎన్నడూ లేని ఉత్తమమైన గాలి నాణ్యతని లాస్ ఏంజిల్స్ చవిచూసింది. 44 00:04:39,133 --> 00:04:44,264 చైనా అంతటా, వాతావరణంలో విష వాయువుల స్థాయులు సగానికి పడిపోయాయి. 45 00:04:46,266 --> 00:04:52,146 ప్రపంచంలోనే ప్రమాదకరస్థాయిలో కాలుష్యం బారినపడిన కొన్ని ప్రాంతాలున్న ఇండియాలో... 46 00:04:53,606 --> 00:04:56,234 లాక్ డౌన్ విధించిన కేవలం 12 రోజుల్లోనే... 47 00:04:56,734 --> 00:04:59,237 జలంధర్ - ఇండియా జనాభా 10 లక్షలు 48 00:04:59,320 --> 00:05:01,531 ...ఒక ఉత్కంఠభరితమైన దృశ్యం ప్రత్యక్షమైంది. 49 00:05:01,614 --> 00:05:04,492 మేము ఉదయం టిఫిన్ చేయడానికి టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాం, 50 00:05:04,576 --> 00:05:06,035 అప్పుడు మా నాన్న హడావుడిగా అక్కడికి వచ్చారు. 51 00:05:06,119 --> 00:05:07,412 అన్షుల్ చోప్రా 52 00:05:07,495 --> 00:05:10,081 అప్పుడాయన, "డాబా మీదికి రండి. పర్వతాలు కనిపిస్తున్నాయి" అన్నారు. 53 00:05:10,164 --> 00:05:12,542 ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ అన్షుల్ 54 00:05:12,625 --> 00:05:15,879 ఈ హడావుడి దేనిగురించో చూద్దామని డాబా పైకి వెళ్ళాడు. 55 00:05:16,838 --> 00:05:19,257 జనం తమ ఇళ్ళ పైకప్పుల మీద నుంచుని, 56 00:05:19,340 --> 00:05:21,843 "వావ్. వావ్. పర్వతాలు. పర్వతాలు" అని అరుస్తున్నారు. 57 00:05:21,926 --> 00:05:24,554 నేను ఊపిరి బిగపట్టి, అటు చూశాను. 58 00:05:27,348 --> 00:05:30,476 ఆకాశం స్వచ్చంగా ఉండడంతో, జీవితంలో మొట్టమొదటిసారిగా, 59 00:05:30,560 --> 00:05:32,145 మేము హిమాలయాలను చూడగలిగాం. 60 00:05:33,062 --> 00:05:35,231 200ల కిలోమీటర్ల దూరంలో, 61 00:05:35,315 --> 00:05:38,067 30 ఏళ్ళనుండీ వాయు కాలుష్యం 62 00:05:38,151 --> 00:05:41,863 వెనుక దాగున్న భూమ్మీది ఎత్తైన పర్వతాలు, 63 00:05:41,946 --> 00:05:43,489 ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. 64 00:05:44,490 --> 00:05:45,909 నేను నా కళ్ళని నమ్మలేకపోయాను. 65 00:05:45,992 --> 00:05:49,746 ఇన్నాళ్ళ నుండీ కాలుష్యం వెనక హిమాలయాలు అక్కడే ఉన్నాయి. 66 00:05:51,956 --> 00:05:56,544 అన్షుల్ ఈ సందర్భాన్ని తీసిన ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. 67 00:05:57,629 --> 00:05:59,297 మనం ఆగిన మరుక్షణం, 68 00:05:59,380 --> 00:06:04,886 భూమి తిరిగి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించిందనడానికి ఇదో స్పష్టమైన ఉదాహరణ. 69 00:06:10,516 --> 00:06:13,853 లాక్ డౌన్ వారాల తరబడి కొనసాగింది. 70 00:06:13,937 --> 00:06:16,064 4 వారాలు 71 00:06:16,147 --> 00:06:20,193 ప్రయాణ ఆంక్షలు మన కదలికల్ని మరింత కట్టడి చేశాయి. 72 00:06:21,152 --> 00:06:24,489 మీరు తీసుకోవాలని ప్లాన్ చేసిన సెలవుల్ని కాన్సిల్ చేసుకోండి. 73 00:06:24,572 --> 00:06:27,367 పాసెంజర్ల సంఖ్య, పాసెంజర్ల బుకింగ్స్ తగ్గిపోయాయి. 74 00:06:27,450 --> 00:06:29,577 విమాన ప్రయాణాలు దారుణంగా పడిపోయాయి. 75 00:06:29,661 --> 00:06:32,747 ప్రపంచవ్యాప్తంగా సుమారు 90% తగ్గిపోయాయి. 76 00:06:33,540 --> 00:06:35,208 2020 ఏప్రిల్ నెలలో 77 00:06:35,291 --> 00:06:40,547 గత ఏడాదితో అదే నెలతో పోల్చితే, అంతర్జాతీయ పర్యాటకులు 78 00:06:40,630 --> 00:06:42,799 11కోట్ల 40 లక్షలు తక్కువగా ఉన్నారు. 79 00:06:44,592 --> 00:06:50,848 స్పెయిన్ లో, పర్యాటకుల సంఖ్య 70 లక్షల నుండి సున్నాకు పడిపోయింది. 80 00:06:53,685 --> 00:06:55,687 ఫ్లోరిడా - యు.ఎస్.ఎ జనాభా రెండు కోట్ల 20 లక్షలు 81 00:06:55,770 --> 00:07:00,567 ఫ్లోరిడాలో వసంతకాల సెలవుల్లో జనంతో కిక్కిరిసిపోయి ఉండే బీచులు... 82 00:07:01,526 --> 00:07:03,152 వెలవెలబోయాయి. 83 00:07:06,406 --> 00:07:11,077 అంతరించే దశలో ఉన్న ఒక సముద్ర జీవి తన జనాభాను పెంచుకోవడానికి 84 00:07:11,160 --> 00:07:12,954 ఇది సరైన అవకాశమా? 85 00:07:21,087 --> 00:07:24,632 ప్రతి రెండు లేదా మూడేళ్ళకొకసారి ఆడ సముద్ర తాబేళ్లు 86 00:07:24,716 --> 00:07:27,760 గుడ్లు పెట్టేందుకు తాము పొదగబడిన 87 00:07:27,844 --> 00:07:29,679 తీరాలకు చేరుకుంటాయి. 88 00:07:32,098 --> 00:07:36,519 విశ్వవ్యాప్తంగా, తాబేళ్ల సంఖ్య వేగంగా తరిగిపోతూనే ఉంది, 89 00:07:36,603 --> 00:07:41,149 నిరంతరం బిజీగా ఉండే బీచుల్లో అవి గుడ్లు పెట్టడానికి ఇష్టపడకపోవడం అందుకు ఒక కారణం. 90 00:07:46,112 --> 00:07:47,322 కానీ ఈ ఏడాది... 91 00:07:48,781 --> 00:07:49,991 పరిస్థితి వేరుగా ఉంది. 92 00:07:53,161 --> 00:07:56,539 స్థానిక పరిశోధకులతో కలిసి పనిచేస్తున్న మా కెమెరామెన్ కు, 93 00:07:56,623 --> 00:07:59,959 జూనో బీచిలో చిత్రించే అదృష్టం దొరికింది... 94 00:08:01,211 --> 00:08:05,840 ప్రపంచంలోనే అత్యంత దట్టంగా లాగర్ హెడ్ తాబేళ్లు గుడ్లు పొదిగే ప్రాంతాల్లో ఇదొకటి. 95 00:08:10,887 --> 00:08:12,847 బ్రీడింగ్ సీజన్ ప్రారంభం కాగానే, 96 00:08:14,599 --> 00:08:18,102 తన జీవితంలో మొదటిసారిగా ఈ ఆడ తాబేలు 97 00:08:18,937 --> 00:08:21,773 ప్రశాంతంగా గుడ్లను పెట్టగలిగింది. 98 00:08:38,039 --> 00:08:40,041 రాబోయే మరికొద్ది వారాల్లో, 99 00:08:40,123 --> 00:08:42,418 మరిన్ని వందలాది తాబేళ్లు అదేపని చేస్తాయి. 100 00:08:47,715 --> 00:08:50,593 మనుషులు కల్పిస్తున్న విఘతాలే తాబేళ్ల పునరుత్పత్తికి 101 00:08:50,677 --> 00:08:53,680 పెద్ద సమస్యగా ఉన్నాయని ఎంతోకాలంగా భావించడం తెలిసిందే. 102 00:08:56,307 --> 00:09:00,395 కానీ ఈసారి మాత్రమే మొదటిసారిగా ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో 103 00:09:00,478 --> 00:09:02,480 పరిశోధించడం సాధ్యపడింది. 104 00:09:08,027 --> 00:09:11,281 ప్రతి ఉదయం, ఈ పరిశోధకుల బృందం 105 00:09:11,364 --> 00:09:14,993 గూళ్ళకు దారి తీసిన తాబేళ్ల అడుగుజాడలను లెక్కించారు. 106 00:09:18,371 --> 00:09:20,206 గత పదేళ్లుగా, 107 00:09:20,290 --> 00:09:23,459 లాగర్ హెడ్ తాబేళ్ళు పెట్టే గూళ్ళ సగటు 108 00:09:23,543 --> 00:09:26,671 సక్సెస్ రేటు కేవలం 40 శాతానికి పడిపోయింది. 109 00:09:27,422 --> 00:09:31,885 అవి బీచ్ పై విజయం సాధించగలిగాయా? 110 00:09:32,635 --> 00:09:34,804 మనుషులకు బీచుల్లో ప్రవేశం నిషేధించబడినపుడు, 111 00:09:34,888 --> 00:09:38,433 గతంలో ఎన్నడూ చూడని విధంగా వాటి సంఖ్య ఒక్కసారిగా 61 శాతానికి పెరిగింది. 112 00:09:38,516 --> 00:09:39,976 డాక్టర్ జస్టిన్ పెర్రల్ట్ తాబేళ్ల పరిశోధకుడు 113 00:09:41,728 --> 00:09:44,397 ఇదొక అసాధారణ పెరుగుదల. 114 00:09:51,446 --> 00:09:56,159 అదనంగా ఒక గూడు అంటే అర్థం మరో వంద లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు అని, 115 00:09:56,242 --> 00:10:00,788 అవి పెరిగి సొంతగా పునరుత్పత్తి చేయగల సామర్ధ్యం సంతరించుకుంటాయి. 116 00:10:03,166 --> 00:10:06,586 మనిషి అస్తిత్వంలోకి రాకముందు లక్షలాది ఏళ్ళుగా చేస్తూ వచ్చిన పనిని, 117 00:10:06,669 --> 00:10:09,130 బీచులు మూసేసేసరికి, 118 00:10:09,964 --> 00:10:13,635 ఈ జంతువులు మరింత విజయవంతంగా నిర్వర్తించగలిగాయి. 119 00:10:42,247 --> 00:10:44,499 ఆరు వేల కిలోమీటర్ల అవతల, 120 00:10:44,582 --> 00:10:46,376 అమెరికా పశ్చిమ తీరం వెంట... 121 00:10:49,921 --> 00:10:54,801 అలల అడుగున ప్రశాంతత భారీ సముద్రజీవులకు 122 00:10:55,718 --> 00:10:57,845 అవకాశాన్ని తెరిచింది. 123 00:11:00,014 --> 00:11:02,016 సౌత్ ఈస్ట్ అలాస్కా యు.ఎస్.ఎ 124 00:11:02,100 --> 00:11:03,601 వార్షిక సందర్శకులు 13 లక్షలు 125 00:11:03,685 --> 00:11:07,355 ఆహారం కోసం ప్రతి ఏడాదీ, 10,000లకు పైగా 126 00:11:07,438 --> 00:11:08,731 హంప్ బ్యాక్ తిమింగలాలు హవాయి నుండి 127 00:11:10,817 --> 00:11:14,654 ఈ అలాస్కా తీరాలకు వలస వస్తాయి. 128 00:11:23,204 --> 00:11:25,790 సాధారణంగా, ఈ జలాల్ని ఇవి ఏడాదికి పది లక్షలమంది 129 00:11:25,874 --> 00:11:29,711 సందర్శకుల్ని మోసుకెళ్ళే ఓడలతో పంచుకోవాల్సి ఉంటుంది. 130 00:11:36,301 --> 00:11:39,387 కానీ ఇప్పుడు ప్రతి ఓడ రద్దు కావడంతో... 131 00:11:40,305 --> 00:11:45,184 నీటి అడుగున 25 రెట్లు ప్రశాంతంగా మారింది. 132 00:11:46,853 --> 00:11:51,858 ఈ ప్రశాంతతలో, నీటి అడుగున మైక్రోఫోన్లు వాడే శాస్త్రజ్ఞులు 133 00:11:51,941 --> 00:11:54,402 గొప్ప మార్పును రికార్డు చేశారు. 134 00:11:55,153 --> 00:11:58,448 హంప్ బ్యాక్ తిమింగలాలు ఒకదానితో ఒకటి మరింత తరచుగా... 135 00:12:00,658 --> 00:12:02,827 కొత్త పద్ధతుల్లో మాట్లాడుకుంటున్నాయి. 136 00:12:04,746 --> 00:12:07,165 అదీ, ఈ తిమింగలాలు ఇంతసేపు ఒకదానితో ఒకటి సంభాషించుకోవడం... 137 00:12:07,248 --> 00:12:08,833 క్రిస్టీన్ గాబ్రియేల్ తిమింగలాల పరిశోధకురాలు 138 00:12:08,917 --> 00:12:11,336 ...నిజానికి చాలా ఉత్సాహభరితంగా, చెప్పాలంటే కదిలించేలా ఉంది. 139 00:12:12,003 --> 00:12:14,672 ఒకటి అరవగానే, ఆ తర్వాత ఒక తల్లి, పిల్ల. 140 00:12:14,756 --> 00:12:16,591 నా ఉద్దేశం, నేను ఇంతవరకూ అలాంటిది వినలేదు. 141 00:12:18,134 --> 00:12:21,095 ఒక రద్దీగా ఉన్న బార్లో మీ స్నేహితులతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే 142 00:12:21,179 --> 00:12:22,513 ఎలా ఉంటుందో ఊహించుకోండి. 143 00:12:22,597 --> 00:12:25,183 కష్టంగా ఉంటుంది, ఎక్కువగా మాట్లాడరు, మాట్లాడాలని అనుకున్నా, అరవాల్సి వస్తుంది. 144 00:12:25,266 --> 00:12:26,267 డాక్టర్ సుజీ టీర్లింక్ తిమింగలాల పరిశోధకురాలు 145 00:12:26,351 --> 00:12:29,020 కానీ ఒకవేళ మీరు నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్న 146 00:12:29,103 --> 00:12:30,772 కాఫీ షాపులో కూర్చుని ఉంటే, 147 00:12:30,855 --> 00:12:34,901 మీరు మరింత విస్తృతమైన, మంచి సంభాషణ చేయగలుగుతారు. 148 00:12:38,863 --> 00:12:41,741 కానీ మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఒకటి ఉంది. 149 00:12:45,203 --> 00:12:50,291 ఇప్పుడు తిమింగలాలు, మరింత దూరప్రాంతాలకు ఎలాంటి అంతరాయాలు లేకుండా సంభాషించగలవు. 150 00:12:50,875 --> 00:12:55,088 ఇలాంటి కొన్ని తల్లులు, తమ పిల్లలను ఒంటరిగా వదిలివెళతాయి. 151 00:12:55,922 --> 00:12:58,424 ఎంతో అరుదైన దృశ్యం. 152 00:13:01,844 --> 00:13:03,846 తల్లి ఇపుడు ఆహార వేటకోసం వెళ్ళగలదు, 153 00:13:03,930 --> 00:13:09,185 అవసరమైనపుడు తన పిల్ల పిలిచే పిలుపు తనకు వినబడుతుందనే నమ్మకం ఇప్పుడు దానికి ఉంది. 154 00:13:15,567 --> 00:13:18,862 పాలిచ్చే తల్లి వీలైనంత ఎక్కువగా తినాల్సి ఉంటుంది, 155 00:13:20,113 --> 00:13:24,117 అందుకు ఉత్తమ మార్గం మిగిలిన పెద్ద తిమింగలాలతో కలిసి వేటాడటం. 156 00:13:30,164 --> 00:13:32,292 తిమింగలాలు నీటి అడుగుకు డైవ్ చేసి... 157 00:13:34,460 --> 00:13:37,005 వృత్తాకారంలో నీటి బుడగలను ఊదుతాయి... 158 00:13:39,173 --> 00:13:42,051 భారీ మొత్తంలో చేపలు ఒకచోట పోగయ్యేలా చేసి... 159 00:13:44,846 --> 00:13:47,807 వేలాదిగా నోట్లో కుక్కేసుకుంటాయి. 160 00:13:53,354 --> 00:13:56,566 ప్రకృతిలోని రమణీయ దృశ్యాలలో ఇదీ ఒకటి. 161 00:14:10,038 --> 00:14:12,207 ప్రశాంతత తోడురాగా, 162 00:14:12,290 --> 00:14:17,045 హంప్ బ్యాక్ తల్లులు ఈ విధంగా మరింత తరచుగా జట్టు కట్టి సహకరించుకోగలుగుతున్నాయి. 163 00:14:18,046 --> 00:14:20,423 ఈ ఏడాది, అవి యదేచ్ఛగా తిరగగలుగుతున్నాయి. 164 00:14:20,506 --> 00:14:24,135 కోరుకున్నది, కోరుకున్న చోట, కోరుకున్నప్పుడల్లా చేస్తున్నాయి. 165 00:14:24,802 --> 00:14:26,304 గత సంవత్సరాల్లో, 166 00:14:26,387 --> 00:14:30,391 అతికొద్దిగా ఏడు శాతం పిల్లలు మాత్రమే పెద్దవి కాగలుగుతున్నాయి. 167 00:14:31,559 --> 00:14:35,730 కానీ ఈ సీజన్ లో, మరెన్నో మనగలగడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. 168 00:14:37,857 --> 00:14:40,985 గత కొద్ది ఏళ్ళుగా తిమింగలాల మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న... 169 00:14:41,069 --> 00:14:42,320 జానెట్ నీల్సన్ తిమింగలాల పరిశోధకురాలు 170 00:14:42,403 --> 00:14:45,782 ...ఈ అత్యవసర తరుణంలో, ఈ మహమ్మారి వాటికి కొంత సాంత్వన చేకూర్చింది. 171 00:14:49,369 --> 00:14:54,582 నీటి అడుగున శబ్ద స్థాయుల్లో కలిగిన మార్పులు అలాస్కాను దాటిపోయాయి. 172 00:14:57,085 --> 00:15:02,924 లాక్ డౌన్ మొదలైన మూడునెలల్లో ప్రపంచవ్యాప్త షిప్పింగ్ ట్రాఫిక్ 17 శాతం పడిపోయింది, 173 00:15:03,716 --> 00:15:07,136 అన్ని మహా సముద్రాలలో జీవుల జీవితాలు మెరుగుపడ్డాయి. 174 00:15:07,220 --> 00:15:10,181 హర్రాకి గల్ఫ్ న్యూజిలాండ్ 175 00:15:11,474 --> 00:15:13,560 న్యూజిలాండ్ తీరాల్లో ఉన్న డాల్ఫిన్స్ 176 00:15:13,643 --> 00:15:16,271 అవి కమ్యూనికేషన్ చేసే దూరాన్ని మూడురెట్లు పెంచుకున్నాయి. 177 00:15:20,024 --> 00:15:21,359 శాలిష్ సముద్రం కెనడా 178 00:15:21,442 --> 00:15:26,573 వ్యాంకోవర్లో ఓడల రొద నాలుగు రెట్లు తగ్గిందనీ, తద్వారా కిల్లర్ వేల్స్ 179 00:15:27,240 --> 00:15:30,285 సోనార్ సాయంతో మరింత సమర్థవంతంగా 180 00:15:30,368 --> 00:15:33,037 వేటాడగలుగుతున్నాయని పరిశోధకులు రికార్డు చేశారు. 181 00:15:48,428 --> 00:15:51,222 మహమ్మారి బారినపడి మూడు నెలలైంది. 182 00:15:51,306 --> 00:15:52,473 3 నెలలు 183 00:15:52,557 --> 00:15:57,353 యునైటెడ్ స్టేట్స్ లో, దాదాపు సగం మంది ఉద్యోగులు ఇంటి దగ్గరనుండి పనిచేస్తున్నారు. 184 00:15:57,437 --> 00:16:01,065 ప్రపంచవ్యాప్తంగా, పావు భాగం వ్యాపారాలు మూతపడ్డాయి. 185 00:16:03,026 --> 00:16:06,946 బార్లు, రెస్టారెంట్లు, కెఫెలు తాత్కాలికంగా మూతబడ్డాయి. 186 00:16:07,906 --> 00:16:12,535 అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే, రిటైల్ వ్యాపారం మూతపడింది. 187 00:16:13,620 --> 00:16:17,332 అంతా వదిలివేసినట్లుగా, చుట్టూ ఎవ్వరూ లేనట్లుగా అనిపిస్తోంది. 188 00:16:18,416 --> 00:16:20,752 ప్రపంచంలో ప్రముఖ నగరాలన్నింటిలో, 189 00:16:20,835 --> 00:16:25,006 ప్రజలు నడవడం 90 శాతానికి పైగా తగ్గిపోయింది. 190 00:16:27,217 --> 00:16:29,552 పట్టణ కేంద్రాలు ఎడారుల్లా మారిపోగానే... 191 00:16:29,636 --> 00:16:31,471 నగర జీవనాన్ని 192 00:16:31,554 --> 00:16:35,391 తమకు అనుగుణంగా మార్చుకున్న జంతువుల అరుదైన చిత్రాలు బయటపడ్డాయి. 193 00:16:37,060 --> 00:16:39,062 సెయింట్ లూసియా సౌత్ ఆఫ్రికా 194 00:16:39,145 --> 00:16:42,190 గ్యాస్ స్టేషన్ కి విచ్చేసిన ఒక హిప్పో. 195 00:16:46,194 --> 00:16:47,445 టెల్ అవివ్ ఇస్రాయిల్ 196 00:16:47,529 --> 00:16:50,240 స్థానిక పార్కులో ఎంజాయ్ చేస్తున్న నక్కలు. 197 00:16:53,868 --> 00:16:55,078 శాన్ టియాగో చిలీ 198 00:16:55,161 --> 00:16:58,122 పేవ్మెంట్ మీద చక్కర్లు కొడుతున్న చిరుతపులి. 199 00:17:06,089 --> 00:17:10,217 అయితే ఒక జంతువు మాత్రం తనదైన చాతుర్యంతో, ఈ నిర్మానుష్యమైన 200 00:17:10,301 --> 00:17:12,678 నగర ప్రాంతాలకు అనుగుణంగా మారిపోయింది. 201 00:17:16,890 --> 00:17:19,226 నారా జపాన్ 202 00:17:19,310 --> 00:17:22,105 వార్షిక సందర్శకులు కోటీ 30 లక్షలు 203 00:17:25,274 --> 00:17:29,612 సుమారు 1300 సంవత్సరాలుగా, 204 00:17:29,696 --> 00:17:32,866 నారా నగరం సికా జింకలకు నిలయం. 205 00:17:36,244 --> 00:17:39,080 ఆహారం కోసం అవి ఆధారపడిన పచ్చిక బయళ్ళలో అధికభాగాన్ని 206 00:17:39,163 --> 00:17:41,833 బిల్డింగులు ఆక్రమించాయి. 207 00:17:41,916 --> 00:17:45,461 సాధారణంగా సిగ్గరులైన ఈ జంతువులు ఒక పరిష్కారాన్ని కనిపెట్టాయి. 208 00:17:48,756 --> 00:17:55,388 నారా దేవాలయాల్ని సందర్శించే కోటీ 30 లక్షల మందిని ఈ జింకలు లక్ష్యంగా చేసుకున్నాయి... 209 00:17:56,973 --> 00:17:59,976 కాస్తంత గౌరవాన్ని ప్రదర్శిస్తే చాలు, బోలెడు రుచికరమైన... 210 00:18:02,103 --> 00:18:03,938 తినుబండారాలు దొరుకుతాయని గ్రహించాయి. 211 00:18:08,484 --> 00:18:13,031 బియ్యపు పొట్టుతో చేసే బిస్కెట్లు వాటి ఆహారంలో కీలక భాగం అయ్యాయి. 212 00:18:22,999 --> 00:18:25,543 కానీ ఈ పరిస్థితిని మహమ్మారి మార్చివేసింది. 213 00:18:32,175 --> 00:18:35,720 రాత్రికి రాత్రే వాటికిష్టమైన తినుబండారాలు అదృశ్యం అయ్యాయి. 214 00:18:41,017 --> 00:18:44,229 జనం లేకపోతే బిస్కెట్లు ఎక్కడినుండి వస్తాయి. 215 00:18:53,154 --> 00:18:56,699 జింకలు తిండిలేక అల్లాడే పరిస్థితి రావొచ్చు. 216 00:18:56,783 --> 00:19:00,995 కానీ పాతతరంలో ఉన్న కొన్నిటికి ఒక ప్లాన్ సిద్ధంగా ఉంది. 217 00:19:06,125 --> 00:19:10,046 దేవాలయం ప్రాంగణం నుండి ఒక గుంపుకి బయటికి దారి చూపించాయి. 218 00:19:10,547 --> 00:19:12,966 కానీ ఎక్కడికి వెళుతున్నాయో వాటికి తెలిసినట్లే కనబడుతోంది. 219 00:19:21,182 --> 00:19:23,810 అవి ఒక పెద్ద రోడ్డు దిగువకు... 220 00:19:26,145 --> 00:19:29,357 నగరంలోని నిర్మాణాల లోతుల్లోకి చొచ్చుకుపోయాయి. 221 00:19:40,910 --> 00:19:44,664 కానీ విస్తరించిన ఈ పట్టణంలో వాటికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? 222 00:19:52,755 --> 00:19:55,174 రెండున్నర కిలోమీటర్లు నడిచిన తర్వాత... 223 00:19:57,010 --> 00:19:59,012 ఆ గుంపు ఒక చోట ఆగింది. 224 00:20:04,475 --> 00:20:09,480 ప్రశాంతమైన ఈ ప్రాంతం ఒకప్పుడు అవి పచ్చిక మేసిన మైదానాల్లో ఒక భాగం. 225 00:20:10,607 --> 00:20:12,734 ఆశ్చర్యకరంగా, ఒకప్పుడు అది తాము గడ్డిమేసిన 226 00:20:12,817 --> 00:20:16,613 ప్రాంతమని ఈ ముసలి జింకకి గుర్తుంది. 227 00:20:23,828 --> 00:20:26,289 వాటికి కావలసినవన్నీ అది అందించింది: 228 00:20:26,873 --> 00:20:30,460 స్వచ్ఛమైన గడ్డి, ఆకులు, మూలికలు. 229 00:20:35,173 --> 00:20:36,591 తరువాతి వారాలలో, 230 00:20:36,674 --> 00:20:42,013 అవి ఇప్పటికీ మిగిలిఉన్న ఈ భూభాగంపై ఆధారపడతాయి. 231 00:20:44,307 --> 00:20:48,228 జనం లేకపోవడం వల్ల మరో ఉపయోగం జరిగింది. 232 00:20:50,271 --> 00:20:55,610 ఈ కొత్త డైట్ వాటిని ఆరోగ్యకరంగా మార్చిందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు... 233 00:20:57,695 --> 00:21:01,699 తక్కువ సందర్శకులుంటే తక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలుంటాయి, 234 00:21:02,367 --> 00:21:04,077 అవి జింకల్ని చంపగలవు. 235 00:21:09,749 --> 00:21:13,294 మన ఉనికి కారణంగా జంతువులు ప్రయోజనం పొందుతున్నట్లు కనిపించినప్పటికీ... 236 00:21:16,130 --> 00:21:19,759 ఎక్కువ సందర్భాల్లో, మనం లేకుంటేనే అవి సంతోషంగా జీవిస్తాయి. 237 00:21:30,979 --> 00:21:33,106 లాక్ డౌన్ మొదలై నాలుగు నెలలు పూర్తయ్యాయి, మనం లేని ప్రతిచోటా... 238 00:21:33,189 --> 00:21:35,149 బోనోస్ ఐరిస్ - అర్జెంటినా జనాభా కోటీ 52 లక్షలు 239 00:21:35,233 --> 00:21:39,654 ...మనం వదిలివేసిన చోటు జంతుజాలానికి సరికొత్త అవకాశాలను తెరుస్తోంది. 240 00:21:46,786 --> 00:21:48,246 అర్జెంటినాలో... 241 00:21:49,289 --> 00:21:51,583 సాధారణంగా సిగ్గరులైన కేపిబారా 242 00:21:51,666 --> 00:21:55,545 ధనికుల అందమైన తోటల మీద దాడి చేశాయి... 243 00:21:57,338 --> 00:22:00,842 ఒకప్పుడు తమ ఇల్లైన చిత్తడి నేలపై దాన్ని నిర్మించారు. 244 00:22:04,053 --> 00:22:08,850 వాస్తవానికి తమ సొంతమైన దాన్ని ఎంజాయ్ చేయనివ్వకుండా ఏదీ ఆపగలదని అనిపించడం లేదు. 245 00:22:27,493 --> 00:22:28,703 అదీ... 246 00:22:30,413 --> 00:22:31,748 దాదాపు ఏదీ ఆపలేదు. 247 00:22:39,255 --> 00:22:44,802 మన ఉనికి లేకుండా ఎంతకాలం ఉంటే, అంత సాహసోపేతంగా జంతువులు తయారవుతాయి. 248 00:22:46,387 --> 00:22:50,016 ఆఫ్రికాలో సఫారీ సీజన్ రద్దయినప్పుడు... 249 00:22:50,975 --> 00:22:52,518 ఉమ్పుమలాంగా - సౌత్ ఆఫ్రికా వార్షిక సందర్శకులు 42 లక్షలు 250 00:22:52,602 --> 00:22:55,438 …ఒక ప్రాణాంతక వేటగాడు నియమాలను తిరగరాస్తుంది. 251 00:22:58,107 --> 00:23:01,027 ఈ లగ్జరీ లాడ్జి ఖాళీగా ఉంది. 252 00:23:02,862 --> 00:23:07,575 అయితే కొత్త అతిధులు రావడానికి ఎంతో కాలం పట్టదు. 253 00:23:14,832 --> 00:23:18,086 వెర్వెట్ కోతులు స్విమ్మింగ్ పూల్ పక్కన తిష్ట వేశాయి. 254 00:23:24,133 --> 00:23:26,636 మరోవైపు ఇంపాలా, ఇంకా న్యాలా యాంటలోప్ 255 00:23:27,428 --> 00:23:30,014 సలాడ్ బార్ ని ఆక్రమించాయి. 256 00:23:34,060 --> 00:23:36,145 అయితే పూర్తిగా ఎదిగిన... 257 00:23:38,189 --> 00:23:42,610 ఒక మగ చిరుతపులి ఎంతోదూరంలో లేదు. 258 00:23:49,784 --> 00:23:54,706 సాధారణంగా ఈ నిశాచర వేటగాడు పగలు కనిపించడం 259 00:23:54,789 --> 00:23:57,083 చాలా ఆశ్చర్యకరమైన విషయం. 260 00:23:57,166 --> 00:23:59,919 మా చిత్ర బృందానికి మాత్రం కాదు. 261 00:24:00,545 --> 00:24:02,213 కదలకుండా నిలబడండి, గైస్. 262 00:24:41,377 --> 00:24:42,962 రస్సెల్ మెక్లాగ్లిన్ వైల్డ్ లైఫ్ కెమెరామెన్ 263 00:24:43,046 --> 00:24:46,216 నా జీవితంలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి, కానీ ఇది అన్నిటినీ మించిపోయింది. 264 00:24:50,720 --> 00:24:52,138 ఆఫ్రికా అంతటా, 265 00:24:52,222 --> 00:24:56,559 60% పైగా భూభాగాన్ని చిరుతపులులు మనుషులవల్ల కోల్పోయాయి, 266 00:24:57,143 --> 00:24:59,896 వేటాడడం మరింత సవాలుగా మారిపోయింది. 267 00:25:02,524 --> 00:25:05,109 కానీ ఇక్కడ అతిధులు ఎవరూ లేకపోవడంతో, 268 00:25:05,693 --> 00:25:08,446 ఈ చిరుతపులికి అవకాశం కనిపించింది, 269 00:25:09,155 --> 00:25:13,201 దాని ప్రవర్తనలో అసాధారణమైన మార్పు కనిపించింది. 270 00:25:17,080 --> 00:25:19,916 అది పగటిపూట వేటాడడం మొదలుపెట్టింది. 271 00:25:29,842 --> 00:25:32,178 కొన్నిసార్లు ప్రయత్నించాల్సి వచ్చినప్పటికీ... 272 00:25:35,265 --> 00:25:36,933 ఎంతోసేపు కష్టపడాల్సిన అవసరం లేకుండానే... 273 00:25:38,476 --> 00:25:40,478 దాని కొత్త పథకం... 274 00:25:41,062 --> 00:25:42,272 ఫలించింది. 275 00:25:49,821 --> 00:25:51,614 గత 25 ఏళ్ళలో 276 00:25:51,698 --> 00:25:55,618 చిరుతపులుల సంఖ్య 30 శాతానికి పైగా పడిపోయింది. 277 00:25:56,578 --> 00:26:02,292 కానీ దేన్నైనా తినగల ఈ సరికొత్త లాక్ డౌన్ బఫేని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటూ, 278 00:26:02,375 --> 00:26:04,377 ఈ చిరుతపులి అభివృద్ధి చెందుతోంది. 279 00:26:05,044 --> 00:26:08,715 ఈ చోటు దాదాపు పూర్తిగా దాని ఇల్లులా మారిపోయింది. దాని ప్రైవేటు రాజ్యం. 280 00:26:24,856 --> 00:26:27,942 మహమ్మారి మొదలై ఆరు నెలలు అయింది. 281 00:26:28,026 --> 00:26:29,986 6 నెలలు 282 00:26:30,069 --> 00:26:35,283 సెప్టెంబర్ నాటికి, 40 దేశాలకు పైగా ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నాయి. 283 00:26:37,243 --> 00:26:41,414 దాదాపు 300ల కోట్లకు పైగా ప్రజల దైనందిన కార్యకలాపాలు ఆగిపోయాయి. 284 00:26:42,332 --> 00:26:43,666 లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్స్, 285 00:26:43,750 --> 00:26:49,505 కాన్సర్ట్స్, పండుగలు వంటి భారీగా జనం గుమిగూడే ప్రదేశాలు, 286 00:26:49,589 --> 00:26:54,594 వాక్సిన్ వంటి నమ్మదగ్గ చికిత్స దొరికేవరకూ తిరిగి తెరుచుకోవు. 287 00:26:56,429 --> 00:26:59,182 మనం మన కొత్త జీవితానికి అలవాటు పడే సమయంలో, 288 00:27:00,016 --> 00:27:03,228 ప్రకృతి పునరుద్ధరణ కొనసాగుతుంది. 289 00:27:04,938 --> 00:27:06,189 గంగ ఇండియా 290 00:27:06,272 --> 00:27:08,483 ఇండియాలో, గంగానదిలో 291 00:27:08,566 --> 00:27:12,695 80 శాతానికి పైగా ఆక్సిజన్ స్థాయులు పెరిగాయి. 292 00:27:15,198 --> 00:27:16,407 అట్లాంటిక్ తీరం మొరాకో 293 00:27:16,491 --> 00:27:18,868 ఆఫ్రికా అట్లాంటిక్ తీరంలో, 294 00:27:19,369 --> 00:27:25,291 నీటి స్వచ్ఛత దారుణమైన స్థితి నుండి అద్భుతమైన స్థితికి శరవేగంగా మారింది. 295 00:27:29,921 --> 00:27:34,384 మనం ఇళ్ళలోంచి బయటికి రావడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి, 296 00:27:34,467 --> 00:27:37,387 ఈలోగా జీవజాతుల కొత్త తరం ప్రయోజనం పొందబోతోంది. 297 00:27:37,470 --> 00:27:39,013 కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికా 298 00:27:39,097 --> 00:27:40,098 జనాభా 47 లక్షలు 299 00:27:40,181 --> 00:27:42,600 ఇక్కడి సౌత్ ఆఫ్రికన్ తీరంలో, 300 00:27:42,684 --> 00:27:47,021 కొందరు కొత్త తల్లిదండ్రులు ఉదయం ప్రయాణానికి సిద్ధమయ్యారు. 301 00:27:53,570 --> 00:27:56,406 ఆఫ్రికన్ జాకాస్ పెంగ్విన్స్. 302 00:28:05,582 --> 00:28:09,043 అవి మనుషుల పక్కనే తమ ఇంటిని ఏర్పాటు చేసుకున్నాయి. 303 00:28:26,561 --> 00:28:28,521 బ్రీడింగ్ సీజన్లో, 304 00:28:28,605 --> 00:28:32,442 ప్రతి ఉదయం అవి సముద్రంలో చేపలు పట్టడానికి బయలుదేరతాయి. 305 00:28:39,991 --> 00:28:42,410 వాటి కూనలకు ఆకలి మహా ఎక్కువ. 306 00:28:43,786 --> 00:28:48,708 ప్రతిరోజూ అవి తమ శరీర బరువులో 15 శాతం బరువున్న ఆహారం తినాలి. 307 00:28:51,544 --> 00:28:55,340 అదృష్టవశాత్తూ, జాకాస్ పెంగ్విన్స్ సమర్థవంతమైన వేటగాళ్ళు... 308 00:28:56,174 --> 00:28:58,593 80 మీటర్ల లోతుకు డైవ్ చేయగలవు 309 00:28:59,427 --> 00:29:03,097 బోలెడన్ని చేపలు, ఎండ్రకాయలతో విందు చేసుకోవచ్చు. 310 00:29:09,354 --> 00:29:13,399 అయితే ఆహారాన్ని తమ కూనల వరకూ చేర్చడం ఒక సమస్య. 311 00:29:18,696 --> 00:29:22,534 గత సంవత్సరాల్లో, ఈ బీచులు జనంతో నిండిపోయి ఉండేవి. 312 00:29:23,660 --> 00:29:26,538 చేపలు పట్టి పెంగ్విన్లు తిరిగి వచ్చేసరికి... 313 00:29:27,247 --> 00:29:29,499 అవి ఇంటికి వెళ్ళాల్సిన దారి మూసుకుపోయి ఉండేది. 314 00:29:30,833 --> 00:29:34,420 సూర్యాస్తమయం అయ్యి, జనం ఇళ్ళకు చేరే వరకూ అవి తీరంలోనే 315 00:29:36,548 --> 00:29:38,508 వేచి ఉండాల్సి వచ్చేది. 316 00:29:47,809 --> 00:29:51,855 కానీ ఈ ఏడాది, బీచి ఎడారిలా మారింది. 317 00:29:59,779 --> 00:30:02,448 పెంగ్విన్లు పాత రొటీన్ ని వదిలేసి, 318 00:30:02,532 --> 00:30:06,411 తమ కూనల కోసం కడుపునిండా చేపలతో, సముద్రంలో కొద్ది గంటలు 319 00:30:07,370 --> 00:30:10,164 గడిపిన వెంటనే ఇంటికి తిరిగి రావడం మొదలుపెట్టాయి. 320 00:30:16,921 --> 00:30:22,552 చీకటి పడేందుకు ఎంతో సమయం ఉండడంతో, అవి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళగలవు. 321 00:30:28,474 --> 00:30:33,605 కూనలు ఇప్పుడు రోజుకు రెండు మూడుసార్లు తినగలుగుతున్నాయి. 322 00:30:36,441 --> 00:30:39,360 అవి ఆరోగ్యంగా, చాలా వేగంగా పెరగడం మాత్రమే కాదు, 323 00:30:39,444 --> 00:30:44,991 ఇలాంటి ఎన్నో కుటుంబాలు విజయవంతంగా కవలలను పెంచుతున్నాయి. 324 00:30:46,951 --> 00:30:49,120 మరో శుభవార్త కూడా ఉంది. 325 00:30:49,204 --> 00:30:50,705 రాబోయే కొద్ది వారాల్లో, 326 00:30:50,788 --> 00:30:56,169 కొన్ని తల్లిదండ్రులు విజయవంతంగా మరో రౌండ్ పిల్లల్ని కంటాయి, 327 00:30:56,711 --> 00:31:00,215 దశాబ్దకాలంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. 328 00:31:03,593 --> 00:31:06,930 ఎన్నో ఏళ్ళుగా పెంగ్విన్లు, ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నట్లు 329 00:31:07,013 --> 00:31:08,932 భావించడం జరిగింది. 330 00:31:12,727 --> 00:31:17,190 కానీ వాస్తవానికి, మనం వారి జీవితాల్ని కష్టతరం చేస్తున్నాం. 331 00:31:21,569 --> 00:31:24,447 గత 30 ఏళ్ళలో, సౌత్ ఆఫ్రికాలో 332 00:31:24,531 --> 00:31:28,618 పెంగ్విన్ల సంఖ్య దాదాపు 70 శాతానికి పైగా పడిపోవడంతో... 333 00:31:30,620 --> 00:31:33,039 మనం వాటికి ఎంత సాయం చేయగలిగితే అంత అవసరం. 334 00:31:42,090 --> 00:31:46,427 నగరాల్లో నివసిస్తున్న జంతువుల పిల్లలు మాత్రమే అభివృద్ధి చెందడం లేదు. 335 00:31:48,096 --> 00:31:51,516 ఇప్పటికే, ఈ ఏడాది విధించిన ఆంక్షల ప్రభావం 336 00:31:51,599 --> 00:31:55,144 ప్రపంచంలోని క్రూరమైన ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. 337 00:31:55,228 --> 00:31:57,438 మాసాయి మారా - కెన్యా వార్షిక సందర్శకులు 3,00,000లకు పైగా 338 00:31:57,522 --> 00:32:01,317 తన కూనల్ని కాపాడుకోవడం కోసం ఒక పులి తన సామర్థ్యాన్ని రూపాంతరం చెందించుకుంది. 339 00:32:04,529 --> 00:32:05,780 చిరుత. 340 00:32:11,035 --> 00:32:13,872 భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తగల ప్రాణి. 341 00:32:30,221 --> 00:32:31,681 కానీ వాటికి ఒక బలహీనత ఉంది. 342 00:32:31,764 --> 00:32:37,020 సన్నని శరీరం కారణంగా శత్రువులకు ఉండేంత బలం వాటికి ఉండదు, 343 00:32:38,980 --> 00:32:41,441 సింహాలు, హైనాల లాగా. 344 00:32:46,154 --> 00:32:48,656 అవి చిరుత సంపాదించిన ఆహారాన్ని దొంగిలించి, 345 00:32:49,407 --> 00:32:51,743 ఏ మాత్రం సంకోచించకుండా దాని కూనను చంపేస్తాయి. 346 00:33:02,754 --> 00:33:05,465 చిరుతలు వాటి కంట్లో పడకుండా కొంచెం తగ్గి ఉంటాయి. 347 00:33:08,176 --> 00:33:10,178 అయితే తిండి పెట్టాల్సిన రెండు కూనలు ఉండడంతో, 348 00:33:10,970 --> 00:33:15,016 వీటి తల్లి ప్రతి రెండు లేదా మూడు రోజులకొకసారి వేటాడాల్సి ఉంటుంది. 349 00:33:31,741 --> 00:33:33,034 అది వేటకు వెళ్ళినపుడు, 350 00:33:33,117 --> 00:33:37,080 దాని ఆరు నెలల వయసున్న కూనలు పొడవాటి గడ్డిలో దాక్కుని ఉంటాయి. 351 00:33:40,166 --> 00:33:45,880 కానీ వేట పూర్తయిన వెంటనే, అది సందిగ్ధంలో పడుతుంది. 352 00:33:50,802 --> 00:33:53,179 అది వాటికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉంది, 353 00:33:53,638 --> 00:33:56,349 చంపిన ప్రాణి శరీరం లాక్కెళ్ళలేనంత పెద్దదిగా ఉంది. 354 00:33:58,268 --> 00:34:02,480 దాన్ని వదిలేసి వెళితే, దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంది. 355 00:34:05,984 --> 00:34:09,487 అందుకు పరిష్కారంగా అది మృదువుగా కీచుగొంతుతో ఒక శబ్దం చేస్తుంది... 356 00:34:10,655 --> 00:34:12,407 ...తన కూనల్ని అక్కడికి రమ్మనే పిలుపు అది. 357 00:34:15,200 --> 00:34:16,410 అది జాగ్రత్తగా ఉండాలి. 358 00:34:17,120 --> 00:34:19,497 పెద్ద గొంతుతో పిలిచినా, ఎక్కువసార్లు పిలిచినా, 359 00:34:19,581 --> 00:34:23,167 రక్షణలేని తన కూనలు శత్రువుల కంట్లో పడే ప్రమాదం ఉంది. 360 00:34:26,504 --> 00:34:28,590 ఇలాంటి సందర్భంలోనే 361 00:34:28,673 --> 00:34:32,135 కూనలు చిరుత అరుపును వినడం కష్టమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. 362 00:34:36,305 --> 00:34:38,725 లాక్ డౌన్ ముందు సంవత్సరాల్లో, 363 00:34:38,807 --> 00:34:42,687 మాసాయి మారాకు వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా చూడాలని కోరుకునే 364 00:34:42,769 --> 00:34:44,772 విషయాల్లో ఒకటి చిరుత వేట. 365 00:34:45,606 --> 00:34:49,986 కానీ వేటాడడం పూర్తి చేసిన తల్లి చిరుత చుట్టూ ఉన్న జనం ఒక సమస్యగా మారారు. 366 00:34:51,863 --> 00:34:54,115 ఎంతో గందరగోళంగా ఉండేది. వాహనాలు వెళ్ళడం, రావడం. 367 00:34:54,199 --> 00:34:55,408 సాలిమ్ మండేలా చిరుత పరిశోధకుడు 368 00:34:55,992 --> 00:34:59,370 రేడియోలో గైడ్లు మాట్లాడుతూ ఉంటారు, జనం ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. 369 00:35:00,914 --> 00:35:02,957 ఆ గొడవలో తల్లి చిరుత కూనల కోసం 370 00:35:03,041 --> 00:35:05,418 పిలిచే అరుపులు వాటికి వినిపించకుండా పోతాయి. 371 00:35:06,085 --> 00:35:07,837 మనుగడ కోసం చిరుత ఆధారపడే 372 00:35:07,921 --> 00:35:12,342 ప్రాకృతిక సంకేతాల్ని ఆ గందరగోళం వినబడకుండా చేస్తుంది. 373 00:35:15,720 --> 00:35:20,683 పదేపదే పిలవాల్సి రావడం అంటే శత్రువుల్ని ఆకర్షించడమే. 374 00:35:30,610 --> 00:35:32,195 కానీ ఈ ఏడాది... 375 00:35:32,278 --> 00:35:36,241 ఈ చిరుత తల్లికి మనుషుల వల్ల ఎలాంటి అంతరాయం కలగడం లేదు. 376 00:35:41,538 --> 00:35:45,041 ఖాళీ సవానాలో కొన్నిసార్లు పిలవగానే... 377 00:35:49,087 --> 00:35:50,964 ...దాని కూనలు తల్లి పిలుపును విన్నాయి... 378 00:35:57,303 --> 00:35:59,222 తల్లి దగ్గరికి చేరుకున్నాయి. 379 00:36:03,685 --> 00:36:06,354 తల్లులు కొద్దిసార్లు మాత్రమే పిలవడాన్ని మేము గుర్తించాం. 380 00:36:06,437 --> 00:36:09,774 ఒకటి రెండు సార్లు పిలవగానే, కూనలు వెంటనే స్పందించాయి. 381 00:36:12,235 --> 00:36:13,945 చుట్టూ జనం లేకపోవడంతో, 382 00:36:14,028 --> 00:36:17,407 చిరుత పిల్లలు ఆరోగ్యంగా పెరగడాన్ని ఇప్పటికే పరిశోధకులు కనిపెట్టారు. 383 00:36:19,868 --> 00:36:23,746 కోవిడ్ ముందు, మూడింటిలో ఒక కూన మాత్రమే బతికేది. 384 00:36:23,830 --> 00:36:25,832 కానీ ప్రస్తుతం మూడు నెలలు పైబడిన 385 00:36:25,915 --> 00:36:28,042 కూనలు ఎన్నో కనిపిస్తున్నాయి, 386 00:36:28,126 --> 00:36:29,836 అది ఏ విషయాన్ని స్పష్టం చేస్తోందంటే 387 00:36:29,919 --> 00:36:33,047 ఈసారి ఎక్కువ కూనలు బతికి బట్టకడతాయి, 388 00:36:33,131 --> 00:36:34,799 అంటే ఎక్కువ చిరుతలు. 389 00:36:37,760 --> 00:36:41,973 ఆఫ్రికాలో కేవలం సుమారు 7,000ల చిరుతలు మాత్రమే మిగిలి ఉండడంతో... 390 00:36:43,975 --> 00:36:45,852 ప్రతి కూన విలువైనదే. 391 00:37:05,330 --> 00:37:08,416 మనుషులకు ఈ ఏడాది ఎన్నో సవాళ్ళు విసురుతూనే ఉంది... 392 00:37:08,499 --> 00:37:09,834 బ్విండి నేషనల్ పార్క్ ఉగాండా 393 00:37:09,918 --> 00:37:11,586 …అంతరించే దశలో ఉన్న ఎన్నో, ఎన్నెన్నో జంతువులు 394 00:37:11,669 --> 00:37:15,506 మనగలగడానికి గల అవకాశాలు పెరిగాయి. 395 00:37:20,553 --> 00:37:23,556 2020 సంవత్సరంలో తక్కువ అంతరాయం ఉండడంతో, 396 00:37:23,640 --> 00:37:24,933 ఇక్కడి మౌంటైన్ గొరిల్లాలు 397 00:37:25,016 --> 00:37:28,686 పిల్లలకంటే రెట్టింపు పిల్లలకు జన్మనిచ్చాయి. 398 00:37:34,609 --> 00:37:36,110 ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో... 399 00:37:36,194 --> 00:37:37,195 డోర్సెట్ ఇంగ్లాండ్ 400 00:37:37,278 --> 00:37:42,700 ...గత పదేళ్ళలో చూడని విధంగా అరుదైన స్పైనీ సీ హార్సెస్ సంఖ్య బాగా పెరిగింది 401 00:37:43,201 --> 00:37:48,623 పడవల వల్ల వాటి సీ గ్రాస్ ఇంటికి కలిగిన నష్టం నుండి కోలుకుంది. 402 00:37:54,045 --> 00:37:55,380 లైకిపియా కెన్యా 403 00:37:55,463 --> 00:37:58,716 కెన్యాలో, కొమ్ముల కోసం ఈ ఏడాది ఒక్క రైనో కూడా చంపబడలేదు. 404 00:37:59,384 --> 00:38:02,720 1999 తర్వాత ఇదే మొదటిసారి. 405 00:38:11,437 --> 00:38:14,107 లాక్ డౌన్ మొదలయ్యి పూర్తిగా ఒక ఏడాది పూర్తయింది. 406 00:38:14,190 --> 00:38:15,358 12 నెలలు 407 00:38:15,441 --> 00:38:20,238 మనలో ఎక్కువమంది సహజ ప్రపంచంలో సౌకర్యాన్ని పొందిన సంవత్సరం. 408 00:38:20,947 --> 00:38:25,869 ప్రపంచం ఎన్నో అసాధారణ మార్పులకు గురైన సంవత్సరం. 409 00:38:29,080 --> 00:38:32,208 ప్రపంచవ్యాప్తంగా కార్బన్ డయాక్సైడ్ వార్షిక ఉద్గారాలు 410 00:38:32,292 --> 00:38:35,044 ఆరు శాతానికి పైగా పడిపోయాయి, 411 00:38:35,128 --> 00:38:37,589 ఆ స్థాయిలో తగ్గుదల ఇంతవరకూ జరగలేదు. 412 00:38:39,507 --> 00:38:43,845 అలాగే భూమి ఉపరితలం అడుగున కూడా ఎన్నో గుర్తించదగ్గ మార్పులు చోటుచేసుకున్నాయి. 413 00:38:44,846 --> 00:38:48,641 ప్రయాణాల వల్ల, పరిశ్రమల వల్ల కలిగే ప్రకంపనలు సగానికి తగ్గడంతో, 414 00:38:48,725 --> 00:38:53,479 నమోదైన చరిత్రలో ఈ కాలం భూగర్భం అత్యంత ప్రశాంతంగా ఉన్నకాలం. 415 00:38:57,817 --> 00:39:00,737 అయితే ఈ లాక్ డౌన్ ప్రభావం ఎంతోకాలం నిలవదు. 416 00:39:02,238 --> 00:39:05,658 ప్రకృతితో మెరుగైన సహజీవనం చేసే మార్గాలు కనిపెట్టేందుకు 417 00:39:05,742 --> 00:39:09,495 ఈ మార్పుల నుండి ఎలాంటి ప్రేరణ తీసుకోవచ్చు? 418 00:39:14,417 --> 00:39:17,921 ఇండియాలో, ఇప్పటికే కొందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, 419 00:39:18,004 --> 00:39:19,714 కొన్ని శక్తివంతమైన, 420 00:39:19,797 --> 00:39:24,177 అంతరించే దశలో ఉన్న జంతువులతో మరింత సామరస్యంతో జీవించే ప్రయత్నం చేస్తున్నారు. 421 00:39:27,680 --> 00:39:32,185 అస్సాం - ఇండియా జనాభా మూడుకోట్ల 60 లక్షలు 422 00:39:33,603 --> 00:39:35,647 పూర్తిగా ఎదిగిన ఆసియా ఏనుగు 423 00:39:35,730 --> 00:39:40,401 ప్రతిరోజూ 150 కిలోల ఆహారం తినాల్సి ఉంటుంది. 424 00:39:41,611 --> 00:39:45,031 కానీ వాటి సహజ ఆవాసాల్లో కేవలం ఐదు శాతం మాత్రమే మిగిలి ఉండడంతో, 425 00:39:45,615 --> 00:39:48,993 వాటి అరణ్య భూమి వ్యవసాయ భూములుగా మార్చబడడంతో... 426 00:39:49,077 --> 00:39:53,706 మనుగడ కోసం ఏనుగులు ఇక్కడి పంటలపై దాడి చేస్తాయి. 427 00:40:06,010 --> 00:40:10,056 బదులుగా, రైతులు వాటిని పొలాల నుండి తరిమేస్తారు. 428 00:40:11,474 --> 00:40:17,397 కానీ ఇప్పటికీ వారు తమ వరి పంటలలో సగభాగాన్ని కోల్పోవాల్సి వస్తోంది. 429 00:40:30,159 --> 00:40:32,078 మేము రాత్రి మొత్తం వాటిని 430 00:40:32,161 --> 00:40:33,913 అడవిలోకి తరిమేస్తూ గడుపుతూ ఉంటాం. 431 00:40:33,997 --> 00:40:35,415 కానీ అవి తిరిగి వస్తాయి... 432 00:40:35,498 --> 00:40:36,499 భాష్కర్ బారా 433 00:40:36,583 --> 00:40:39,627 ...మేము మళ్ళీ అదే పని చేయాల్సి ఉంటుంది. 434 00:40:53,766 --> 00:40:57,061 ప్రమాదంలో ఉన్నది కేవలం పొలాలు మాత్రమే కాదు. 435 00:41:00,064 --> 00:41:03,651 ఏనుగులు ఆహారం కోసం వెతుకుతూ గ్రామాల్లోకి కూడా వచ్చేస్తాయి 436 00:41:03,735 --> 00:41:06,362 ఆ క్రమంలో జనాన్ని తొక్కేస్తాయి. 437 00:41:11,075 --> 00:41:12,076 దేశవ్యాప్తంగా, 438 00:41:12,160 --> 00:41:15,830 సుమారు 400 మంది మనుషులు, వంద వరకూ ఏనుగులు 439 00:41:15,914 --> 00:41:18,917 ప్రతి ఏడాది, ఈ గొడవల్లో చనిపోతూ ఉంటాయి. 440 00:41:25,840 --> 00:41:28,885 కానీ ఒక కమ్యూనిటీ కొత్త పద్దతిని అమలుచేయడం ద్వారా 441 00:41:28,968 --> 00:41:30,678 సమస్యను పరిష్కరించాలని అనుకుంటోంది. 442 00:41:31,262 --> 00:41:34,432 లాక్ డౌన్ వల్ల సిటీల నుండి ఇళ్ళకు తిరిగి వచ్చిన వర్కర్లు 443 00:41:35,016 --> 00:41:37,310 స్థానిక పరిరక్షణ ట్రస్ట్ నేతృత్వంలో 444 00:41:37,393 --> 00:41:41,648 చేపట్టిన ప్రాజెక్ట్ కోసం అవసరమైన అదనపు సాయం చేయగలరు. 445 00:41:43,274 --> 00:41:45,151 లాక్ డౌన్లో మాకో గొప్ప అవకాశం దొరికింది... 446 00:41:45,235 --> 00:41:46,236 మేఘన హజారికా పరిరక్షకురాలు 447 00:41:46,319 --> 00:41:50,031 ...అడవి ఏనుగుల కోసం మొక్కలు నాటడం. 448 00:41:51,824 --> 00:41:54,911 అడవి వెంట, వాళ్ళు కొంత భూభాగంలో వేగంగా పెరిగే 449 00:41:54,994 --> 00:42:00,041 బియ్యం, గడ్డి మొక్కలను ఏనుగులు తినడం కోసం నాటారు. 450 00:42:02,835 --> 00:42:07,423 500 మందికి పైగా కమ్యూనిటీ మొత్తం వచ్చి సహాయం చేశారు. 451 00:42:07,507 --> 00:42:08,550 డులు బోరా పరిరక్షకుడు 452 00:42:09,300 --> 00:42:11,052 కొద్ది నెలల్లోనే, 453 00:42:11,135 --> 00:42:17,350 తమ భూమిలో దాదాపు 400 ఎకరాలను మార్చి, 1.6 చదరపు కిలోమీటర్ల మేర కేటాయించారు. 454 00:42:19,394 --> 00:42:22,480 ఇప్పుడు ఏనుగులను తరిమివేయడానికి బదులుగా 455 00:42:22,564 --> 00:42:25,400 వాటిని స్వాగతిస్తూ వేడుక నిర్వహిస్తున్నారు. 456 00:42:34,367 --> 00:42:36,619 పంటలు కోతకు వచ్చాయి. 457 00:42:38,246 --> 00:42:41,875 అయితే ఏనుగులు వాటి కోసం నాటిన గడ్డిని తింటాయా... 458 00:42:43,918 --> 00:42:46,671 ...లేక రైతుల పొలాలపై దాడి చేస్తాయా? 459 00:42:51,551 --> 00:42:53,553 జనం ఇంటికి వచ్చిన అనంతరం... 460 00:42:54,971 --> 00:42:58,558 అడవి అంచున ఏదో అలజడి మొదలయింది. 461 00:43:06,733 --> 00:43:11,946 ఒకదాని తర్వాత ఒకటిగా, చెట్ల చాటు నుండి ఏనుగులు బయటికి వచ్చాయి. 462 00:43:14,949 --> 00:43:16,284 తల్లులు. 463 00:43:17,785 --> 00:43:19,287 కూనలు. 464 00:43:19,370 --> 00:43:24,375 26 ఆకలిగొన్న ఏనుగుల విస్తారమైన కుటుంబం. 465 00:43:26,711 --> 00:43:28,379 కానీ అవి ఎంతదూరం వస్తాయి? 466 00:43:33,760 --> 00:43:36,596 అడవి అంచు వెంబడే నిలబడి... 467 00:43:38,097 --> 00:43:42,936 వాటికోసం నాటిన మొక్కలను మాత్రమే అవి తినడం మొదలుపెట్టాయి. 468 00:43:46,147 --> 00:43:48,816 గతంలో మేము వాటిని తరిమేసే వాళ్ళం. 469 00:43:48,900 --> 00:43:50,902 కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 470 00:43:50,985 --> 00:43:54,280 ఇది బాగుంది... సంతోషంగా అనిపిస్తోంది. 471 00:43:59,202 --> 00:44:01,788 కోతల కాలం గడుస్తున్న కొద్దీ... 472 00:44:01,871 --> 00:44:06,459 ఏనుగులు రైతుల పొలాల మీదకు రాలేదు 473 00:44:07,085 --> 00:44:09,003 గ్రామంలోకి కూడా రాలేదు. 474 00:44:12,507 --> 00:44:14,634 మనం ఏనుగులను ప్రేమిస్తే 475 00:44:14,717 --> 00:44:17,595 అవి తిరిగి మనల్ని ప్రేమిస్తాయి. 476 00:44:21,224 --> 00:44:22,976 అదనపు భూభాగంలో నాటిన పంట 477 00:44:23,059 --> 00:44:25,186 ఎంతో కాలంగా ఉన్న సమస్యకు దీర్ఘకాల 478 00:44:25,270 --> 00:44:27,480 పరిష్కారం చూపింది. 479 00:44:29,941 --> 00:44:32,026 ఈ పద్ధతిని ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలు 480 00:44:32,110 --> 00:44:36,865 కూడా అవలంబించడం కోసం స్థానిక పరిరక్షణ ట్రస్ట్ ని సంప్రదిస్తున్నాయి. 481 00:44:50,295 --> 00:44:53,047 గత ఏడాదిలోకి వెనుదిరిగి చూస్తే... 482 00:44:53,131 --> 00:44:56,551 మనుషులకు ఎంతో కష్టంగా గడిచినప్పటికీ... 483 00:44:56,634 --> 00:45:01,222 ప్రకృతి ప్రపంచాన్ని, మన భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం... 484 00:45:01,306 --> 00:45:02,932 మనం ఏం నేర్చుకోగలం? 485 00:45:05,643 --> 00:45:09,022 మనం కలిసిమెలిసి ఎలా జీవించాలో ఆలోచించాలి. 486 00:45:10,106 --> 00:45:14,235 వన్యప్రాణులతో మనచోటును పంచుకోవచ్చనే స్పృహ అందరిలో కలిగించాలి. 487 00:45:14,903 --> 00:45:16,529 మనం తిరిగి అవే తప్పుల్ని 488 00:45:16,613 --> 00:45:19,365 చేయకూడదనే జ్ఞానం మనలో కలగాలి. 489 00:45:21,284 --> 00:45:25,205 ప్రకృతి స్పందించిన తీరు, వేగం చూస్తే... 490 00:45:25,288 --> 00:45:29,042 మన జీవితాల్లో చేసే చిన్న చిన్న మార్పులు కూడా... 491 00:45:29,125 --> 00:45:33,671 ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులలో గొప్ప మార్పును తీసుకొస్తాయని తెలుస్తోంది. 492 00:45:37,508 --> 00:45:41,179 ప్రతి వేసవిలో కొంతకాలం నిషేధం విధించవచ్చు. 493 00:45:41,262 --> 00:45:44,098 రాత్రిళ్ళు బీచుల్ని మూసేయచ్చు. పగలు మూయాల్సిన పనిలేదు. 494 00:45:44,182 --> 00:45:47,060 మనుషులు, జంతువులు కలిసి విజయవంతంగా 495 00:45:47,143 --> 00:45:50,438 బతకడానికి మనుషులు చేసే చిన్న మార్పులు చాలు. 496 00:45:51,648 --> 00:45:54,567 ఓడల్ని నెమ్మదిగా వెళ్ళమని చెప్పొచ్చు, 497 00:45:54,651 --> 00:45:58,363 ఒకే గుంపుగా వెళ్ళడం ద్వారా వాటి ప్రభావం తగ్గించవచ్చు 498 00:45:58,446 --> 00:46:01,449 నీటి అడుగున అవిచేసే శబ్దాలను, తిమింగలాలను రక్షించవచ్చు. 499 00:46:02,325 --> 00:46:05,078 సందర్శకులు, టూర్ గైడ్లు మంచి ప్రవర్తన కలిగి ఉండేలా 500 00:46:05,161 --> 00:46:10,458 వారికి సూచనలు చేయాలని మేము పార్క్ అధికారులను కోరుతున్నాం 501 00:46:10,542 --> 00:46:13,002 అప్పుడే ఈ జంతువుల మనుగడ నిశ్చయమవుతుంది. 502 00:46:14,087 --> 00:46:18,424 ఈ అసాధారణమైన సంవత్సరం, 'భూమి మారిన సంవత్సరం', 503 00:46:19,008 --> 00:46:22,762 వన్యప్రాణులు అభివృద్ధి చెందేందుకు మనం సాయం చేయగలమని మాత్రమే కాక, 504 00:46:23,555 --> 00:46:25,682 మనం తలచుకుంటే, 505 00:46:26,266 --> 00:46:30,186 ఈ గ్రహాన్ని ఆరోగ్యకరంగా కూడా మార్చగలమని తెలియజేస్తోంది. 506 00:46:31,396 --> 00:46:33,565 ఇప్పటికీ సమయం మించిపోలేదు 507 00:46:33,648 --> 00:46:37,986 కాలుష్యం తగ్గించడానికి మనం ఎంత వీలైతే అంత తోడ్పాటు అందించాలి. 508 00:46:38,736 --> 00:46:42,323 సహజ ప్రపంచానికి దూరంగా కాకుండా... 509 00:46:44,117 --> 00:46:48,746 మన జీవితాలు లోతుగా, ఆశ్చర్యకరమైన రీతుల్లో ఒకదానితో ఒకటి 510 00:46:48,830 --> 00:46:51,332 ముడిపడి ఉన్నాయని తెలుసుకున్నాం. 511 00:46:53,376 --> 00:46:55,837 మనం భవిష్యత్తులో మనగలగాలంటే, 512 00:46:55,920 --> 00:46:58,923 మన గ్రహాన్ని మనతో పాటు భూమ్మీది ప్రాణులన్నింటితో 513 00:46:59,757 --> 00:47:02,594 పంచుకునే పద్ధతులను కనిపెట్టేందుకు... 514 00:47:04,512 --> 00:47:06,890 ఇదే సరైన సమయం. 515 00:48:11,538 --> 00:48:13,540 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ