1 00:00:40,916 --> 00:00:42,751 "పాన్ ట్రోగ్లడైట్స్." 2 00:00:53,929 --> 00:00:56,014 మిస్టర్ జిన్ కి తనకు నచ్చిన కర్ర ఒకటి దొరికింది. 3 00:00:57,432 --> 00:01:00,519 - టైమ్? - 10:22 ఇంకా 34 సెకన్లు. 4 00:01:01,061 --> 00:01:03,604 ఆగు, 35, 36... 5 00:01:03,605 --> 00:01:04,690 10:22 అంటే సరిపోతుంది. 6 00:01:06,275 --> 00:01:08,693 - నువ్వు వాటికి పేర్లు ఎందుకు పెడుతున్నావు? - జేన్ గుడ్ఆల్ అలా చేసింది కాబట్టి. 7 00:01:08,694 --> 00:01:11,529 అరణ్యంలో పాన్ ట్రోగ్లడైట్స్ పై అధ్యయనం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆవిడే. 8 00:01:11,530 --> 00:01:13,573 అది చింపాంజీల శాస్త్రీయ నామమా? 9 00:01:13,574 --> 00:01:15,199 అవును. ఆమె ప్రతీ జంతువుకు 10 00:01:15,200 --> 00:01:18,286 దాని ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది అని నమ్మింది కాబట్టి వాటన్నిటికీ పేర్లు పెట్టింది. 11 00:01:18,287 --> 00:01:20,247 నువ్వు దానికి మిస్టర్ జిన్ అని ఎందుకు పేరు పెట్టావు? 12 00:01:23,750 --> 00:01:24,835 ఇందుకు. 13 00:01:25,586 --> 00:01:26,587 చూడు. 14 00:01:27,171 --> 00:01:28,589 మిస్టర్ జిన్స్ 15 00:01:29,590 --> 00:01:32,383 నువ్వు చేసింది "కోతిగా" ఉంది. 16 00:01:32,384 --> 00:01:34,970 అలాగే మిస్టర్ జిన్ కి కూడా తన చీపురుతో సీలింగ్ మీద తట్టడం అంటే ఇష్టం. 17 00:01:39,600 --> 00:01:41,726 - అది ఇప్పుడు ఏం చేస్తోంది? - ఈటెను చేస్తోంది. 18 00:01:41,727 --> 00:01:43,979 ఏంటి? చింపాంజీలు ఈటెలు చేస్తాయా? 19 00:01:44,563 --> 00:01:46,856 ఈటెలు, స్పాంజ్లు. అన్ని రకాల పనిముట్లను చేస్తాయి. 20 00:01:46,857 --> 00:01:48,107 నేను నమ్మలేకపోతున్నా. 21 00:01:48,108 --> 00:01:51,402 లేదు. అవి పనిముట్లను చేస్తుండగా కనిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి జేన్ గుడ్ఆల్. 22 00:01:51,403 --> 00:01:54,071 మనకు చింపాంజీలు, మనుషుల గురించి తెలుసనుకున్న మొత్తం ఆ ఆవిష్కరణ మూలాన మారిపోయింది. 23 00:01:54,072 --> 00:01:54,989 ఎలా? 24 00:01:54,990 --> 00:01:57,992 ఎందుకంటే చింపాంజీలకు వాటి సొంత పనిముట్లు, ఆయుధాలు చేయడం వస్తే... 25 00:01:57,993 --> 00:01:59,911 వాటికి మన గుణాలు చాలా ఉన్నట్టే కదా? 26 00:01:59,912 --> 00:02:02,164 లేదా మనకే వాటి గుణాలు ఉన్నట్టు అనొచ్చు. 27 00:02:03,207 --> 00:02:05,249 జేన్ గుడ్ఆల్ కలిసిన చింపాంజీలకు ఆమె ఏమని పేర్లు పెట్టింది? 28 00:02:05,250 --> 00:02:06,793 ఆమె పేరు పెట్టిన వాటిలో ఒకదాని పేరు గ్రేబియర్డ్. 29 00:02:08,628 --> 00:02:10,171 మన గ్రేబియర్డ్ పేరా? 30 00:02:10,172 --> 00:02:13,884 ఆహ్-హాహ్, కాకపోతే నిజానికి దాని అసలు పేరు డేవిడ్ గ్రేబియర్డ్. 31 00:02:15,260 --> 00:02:18,096 విన్నావా, గ్రేబియర్డ్? దానికి మనిద్దరి పేర్లు ఉన్నాయి. 32 00:02:20,766 --> 00:02:24,143 ఆమె చూసిన చింపాంజీలలో చెదపురుగులను పట్టడానికి గడ్డిని వాడిన మొదటిది అదే. 33 00:02:24,144 --> 00:02:26,729 అవి చెదపురుగులను తింటాయా? ఛీ. 34 00:02:26,730 --> 00:02:29,274 పురుగులు, పళ్ళు, మాంసం. మనుషులు తినేవి అన్నీ తింటాయి. 35 00:02:29,858 --> 00:02:31,651 - మనుషులు కూడా పురుగులను తింటారా? - కొంతమంది. 36 00:02:31,652 --> 00:02:33,820 అయితే మనం కూడా చాలా విధాలుగా వాటి లాంటి వారిమే. 37 00:02:38,992 --> 00:02:40,952 భలే ముద్దుగా ఉంది. 38 00:02:40,953 --> 00:02:42,788 గుర్తుంచుకో, మనం గమనించాలి అంతే. 39 00:02:48,085 --> 00:02:49,586 నువ్వు ముట్టుకోకూడదు అన్నావు కదా. 40 00:02:50,170 --> 00:02:51,170 నువ్వు అన్నది నిజం. 41 00:02:51,171 --> 00:02:54,257 చింపాంజీల మనుగడ ప్రమాదంలో ఉంది, ఎందుకంటే మనం వాటి అడవులను నరికేసి, 42 00:02:54,258 --> 00:02:57,009 వాటిని వేటాడుతూ, అనుకోకుండా మనుషులకు ఉండే జబ్బులను వాటికి అంటిస్తున్నాం. 43 00:02:57,010 --> 00:02:58,762 వాటికి కూడా మనలాగే అనారోగ్యం చేస్తుందా? 44 00:03:03,934 --> 00:03:07,354 దానికి నీతో ఆడుకోవాలని ఉన్నట్టు ఉంది, గ్రేబియర్డ్. అది నిన్ను తన కుటుంబంలో భాగం అనుకుంటోంది ఏమో. 45 00:03:17,155 --> 00:03:18,739 - జేన్? - ఏం కాదు. 46 00:03:18,740 --> 00:03:20,575 చింపాంజీలకు మగవి నాయకులుగా ఉంటాయి. 47 00:03:20,576 --> 00:03:22,910 మిస్టర్ జిన్ బహుశా మనకు తానే బాస్ ని అని చూపుతున్నట్టు ఉంది. 48 00:03:22,911 --> 00:03:24,288 లేదా ఆయుధాలను సేకరిస్తున్నట్టు ఉంది. 49 00:03:25,789 --> 00:03:28,166 - నువ్వు ఏం చేస్తున్నావు? - ఈటెను చేస్తున్నాను. 50 00:03:32,212 --> 00:03:34,255 నేను అది ఇలా చేస్తుంది అనుకోలేదు. 51 00:03:34,256 --> 00:03:35,340 నేను కూడా. 52 00:03:37,801 --> 00:03:39,802 అది ఇంకా తానే బాస్ ని అని మనకు చూపడానికి ప్రయత్నిస్తోందా? 53 00:03:39,803 --> 00:03:42,431 ఏమో తెలీదు. నేను ఇలాంటిది ముందెప్పుడూ చూడలేదు. 54 00:03:51,857 --> 00:03:54,902 - ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తోంది? - తెలుసుకోవడానికి ఒక్కటే మార్గం. 55 00:04:14,796 --> 00:04:16,005 ఇక్కడ ఏమైంది? 56 00:04:16,923 --> 00:04:18,884 - అది మన పనే. - మనం ఏం చేశాం? 57 00:04:19,676 --> 00:04:22,637 చింపాంజీలు ఇంకా అనేక ఇతర జంవుతులు ఉండే అడవిని కొట్టేసాం. 58 00:04:22,638 --> 00:04:25,848 - దాన్ని మళ్ళీ పెంచడం కుదరదా? - మనం నరుకుతున్నంత వేగంగా అవ్వదు. 59 00:04:25,849 --> 00:04:27,850 - చాలా దారుణం. - నిజమే. 60 00:04:27,851 --> 00:04:29,852 బట్టలు ఉతకడం పూర్తి అయింది. దాన్ని పైకి తీసుకురావడానికి సాయం చెయ్. 61 00:04:29,853 --> 00:04:33,648 కానీ అమ్మా, మేము చింపాంజీల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. 62 00:04:33,649 --> 00:04:35,858 మేము మిస్టర్ జిన్ చెట్టు మీదకు రాయిని విసరడం చూశాం. 63 00:04:35,859 --> 00:04:37,360 మన కింద పోర్షన్ లో ఉండే మిస్టర్ జిన్? 64 00:04:37,361 --> 00:04:39,196 కాదు. మిస్టర్ జిన్ చింపాంజీ. 65 00:04:39,780 --> 00:04:42,866 - అది రాళ్లు ఎందుకు విసురుతోంది? - అదే కదా, మేము కూడా అదే కనిపెట్టడానికి చూస్తున్నాం. 66 00:04:43,951 --> 00:04:46,702 మనం శుభ్రం చేయడం పూర్తి అయ్యేవరకు మీ మిషన్ ఆగాల్సి ఉంటుంది. 67 00:04:46,703 --> 00:04:48,872 - కానీ, అమ్మా... - నీ గది ఎలా ఉందో చూశావా? 68 00:04:49,581 --> 00:04:51,375 నీ పని పూర్తి అయ్యాకా డేవిడ్ కి వాకీలో చెప్పు. 69 00:04:54,795 --> 00:04:57,923 హాయ్, మిస్టర్ జిన్. మేము మీ గురించే మాట్లాడుతున్నాం. 70 00:04:58,715 --> 00:05:01,634 - నేను కిందకు వెళ్తున్నాను. - మీరు మాతో పైకి వచ్చి, ఆ తర్వాత కిందకి వెళ్లొచ్చు. 71 00:05:01,635 --> 00:05:05,096 ఒకటి చెప్పనా, నేను మెట్లు దిగుతాను. కాస్త వ్యాయామం చేసినట్టు ఉంటుంది. 72 00:05:05,097 --> 00:05:07,015 నేను కూడా. మీతో పాటు వస్తాను. 73 00:05:07,724 --> 00:05:10,227 ఆ తర్వాత నేరుగా నా గదికి వచ్చి నా రూమ్ శుభ్రం చేసుకుంటాను. 74 00:05:11,687 --> 00:05:12,688 మంచిది. 75 00:05:13,981 --> 00:05:16,108 ఇది తీసుకెళ్లడానికి సాయం చేస్తారా? చాలా బరువుగా ఉంది. 76 00:05:18,402 --> 00:05:20,319 మేము మీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామో వినాలని ఉందా? 77 00:05:20,320 --> 00:05:22,196 - పెద్దగా లేదు. - మీరు భలే జోకులు వేస్తారు. 78 00:05:22,197 --> 00:05:25,324 నేను మీరు ఎలాగైతే మాతో సైలెంట్ గా ఉండమని చెప్పడానికి చీపురుతో సీలింగ్ మీద కొడతారో 79 00:05:25,325 --> 00:05:28,703 అచ్చం అలాగే ఒక కర్రను పైకి ఎత్తే ఒక చింపాంజీ కనిపించడంతో దానికి మీ పేరు పెట్టాను. 80 00:05:28,704 --> 00:05:30,288 నేను అలా ఈ మధ్య ఎక్కువగా చేయడం లేదు. 81 00:05:30,289 --> 00:05:33,291 కానీ ఆ తర్వాత మేము చింపాంజీ మిస్టర్ జిన్ ఒక చెట్టు మీదకి రాయి విసరడం చూసాం. 82 00:05:33,292 --> 00:05:35,334 అలా ఎందుకు చేసి ఉంటుంది అనుకుంటున్నారు? 83 00:05:35,335 --> 00:05:37,212 బహుశా దానికి ఆ శబ్దం నచ్చిందేమో. 84 00:05:37,713 --> 00:05:40,215 ఆసక్తికరమైన థియరీ. వేరే ఐడియాలు ఏమైనా ఉన్నాయా? 85 00:05:41,175 --> 00:05:44,260 బహుశా ఆట కోసం ఏమో. అంటే వాలీబాల్ లేదా టెన్నిస్ ఆడినట్టు ఏమో? 86 00:05:44,261 --> 00:05:46,429 చింపాంజీలకు కలిసి ఆడటం అంటే ఇష్టమే. 87 00:05:46,430 --> 00:05:48,890 లేదా బహుశా ఒక ప్రాంతాన్ని తనకు చెందింది అని చెప్పడానికి ఏమో. 88 00:05:48,891 --> 00:05:51,226 ఇంకొక మంచి ఐడియా. మీకు ఇది బాగానే అబ్బుతోంది. 89 00:05:52,019 --> 00:05:54,688 హేయ్, చింపాంజీ అంటే గుర్తుకొచ్చింది, నీది ఎక్కడ? 90 00:05:55,647 --> 00:05:57,482 - గ్రేబియర్డ్. - ఏం... 91 00:06:06,992 --> 00:06:08,243 గ్రేబియర్డ్! 92 00:06:09,912 --> 00:06:11,455 గ్రేబియర్డ్, ఎక్కడ ఉన్నావు? 93 00:06:14,875 --> 00:06:16,418 జేన్ నుండి డేవిడ్ కి. అత్యవసరం. 94 00:06:19,671 --> 00:06:22,508 - నేను డేవిడ్ ని. ఏమైంది? - గ్రేబియర్డ్ కనిపించడం లేదు. 95 00:06:29,306 --> 00:06:32,808 - హేయ్, నోవా. లేట్ అయినందుకు సారి. - ఏం పర్లేదు, నాన్నా. వెళదామా? 96 00:06:32,809 --> 00:06:34,269 మిస్టర్ జిన్! 97 00:06:34,811 --> 00:06:35,811 అప్పుడే కాదు. 98 00:06:35,812 --> 00:06:37,980 నాకు అది ఎక్కడా కనిపించడం లేదు. అది దారి తప్పినట్టు ఉంది. 99 00:06:37,981 --> 00:06:39,399 కొంత సేపటికి అదే వెనక్కి వస్తుందిలే. 100 00:06:39,900 --> 00:06:41,359 - ఎవరు? - గ్రేబియర్డ్. 101 00:06:41,360 --> 00:06:43,236 నువ్వు ఇక్కడ ఒక చింపాంజీ తిరగడం ఏమైనా చూశావా? 102 00:06:43,237 --> 00:06:46,030 అది ఇంత ఎత్తు ఉంటుంది, గెడ్డం దగ్గర మెరిసిన జట్టు ఉంటుంది. 103 00:06:46,031 --> 00:06:48,324 - దానికి ఆ పేరు పెట్టడానికి అదే కారణం. - ఏంటి? 104 00:06:48,325 --> 00:06:51,410 - గ్రే బియర్డ్. - నువ్వు దాన్ని ఆఖరిగా ఎక్కడ చూశావు, జేన్? 105 00:06:51,411 --> 00:06:54,997 - ఇంటి వెనుక, కానీ అది అక్కడ లేదు. - వెతుకుతూ ఉండు. ఖచ్చితంగా కనిపిస్తుంది. 106 00:06:54,998 --> 00:06:56,165 కానీ ఒకవేళ కనిపించకపోతే? 107 00:06:56,166 --> 00:06:57,626 అది నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకటి. 108 00:06:58,210 --> 00:07:00,212 ఆమె ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ని నేను. 109 00:07:00,963 --> 00:07:02,672 నేను వీడి చెల్లిని. 110 00:07:02,673 --> 00:07:04,090 నేను ఈయన కొడుకును. 111 00:07:04,091 --> 00:07:05,466 హాయ్. 112 00:07:05,467 --> 00:07:07,386 మేము ఈ పై నుండి గమనిస్తుంటాం, జేన్. 113 00:07:08,637 --> 00:07:10,639 ఏం కంగారు పడకు, జేన్. మేము దాన్ని కనుగొంటాం. 114 00:07:12,182 --> 00:07:14,142 నువ్వు ఇంకొకసారి ఇంటి వెనుక వెతకొచ్చు కదా? 115 00:07:18,230 --> 00:07:19,439 భలే సరదా పిల్లలు. 116 00:07:32,578 --> 00:07:34,121 గ్రేబియర్డ్, అది నువ్వేనా? 117 00:07:37,457 --> 00:07:38,792 నేను వస్తున్నాను, గ్రేబియర్డ్. 118 00:07:44,965 --> 00:07:46,091 మిస్టర్ జిన్? 119 00:07:46,884 --> 00:07:47,968 గ్రేబియర్డ్. 120 00:07:49,094 --> 00:07:51,596 ఆగు, మా పొరుగింటి వ్యక్తి మిస్టర్ జిన్ చెప్పింది కరెక్టా? 121 00:07:51,597 --> 00:07:54,515 చింపాంజీలు నిజంగానే వాటి ప్రాంతాన్ని గుర్తించడానికి రాళ్లు విసురుతాయా, 122 00:07:54,516 --> 00:07:57,936 లేక మార్గాన్ని ఏర్పరుస్తాయా లేక వాటికి ఆ శబ్దం మాత్రమే నచ్చుతుందా? 123 00:08:01,982 --> 00:08:05,527 ఓహ్, లేదు, నువ్వు ఒక ఉచ్చులో ఇరుక్కున్నావు. నేను నీకు సాయం చేస్తా. 124 00:08:09,156 --> 00:08:11,491 చింతించకు, గ్రేబియర్డ్. దాన్ని నేను విడిపిస్తాను. 125 00:08:12,117 --> 00:08:13,118 దాదాపుగా వచ్చేసింది. 126 00:08:16,455 --> 00:08:17,789 అంతే, వచ్చేసింది! 127 00:08:26,632 --> 00:08:27,633 గ్రేబియర్డ్? 128 00:08:36,225 --> 00:08:37,558 గ్రేబియర్డ్. 129 00:08:38,894 --> 00:08:40,145 దొరికింది. 130 00:08:45,025 --> 00:08:48,861 హేయ్. ఆకుల్లో పడింది, కానీ అంతకు మించి దీని మీద ఎలాంటి మరకలు లేవు. 131 00:08:48,862 --> 00:08:50,197 థాంక్స్, మిస్టర్ జిన్. 132 00:08:50,948 --> 00:08:51,949 డేవిడ్ నుండి జేన్ కి. 133 00:08:52,866 --> 00:08:53,699 నేను జేన్ ని. 134 00:08:53,700 --> 00:08:56,202 నాకు గ్రేబియర్డ్ కనిపించలేదు, కానీ మీ అమ్మ కనిపించింది. 135 00:08:56,203 --> 00:08:58,121 ఆమెకు చాలా చాలా కోపంగా ఉంది. 136 00:08:58,872 --> 00:09:00,624 చాలా కోపంగా ఉంది. 137 00:09:02,709 --> 00:09:06,337 - నువ్వు వెంటనే వెనక్కి వెళ్తే మంచిది. - దీన్ని కనిపెట్టినందుకు మళ్ళీ థాంక్స్. 138 00:09:06,338 --> 00:09:07,506 సాయం చేసినందుకు సంతోషంగా ఉంది. 139 00:09:15,597 --> 00:09:16,890 గ్రేబియర్డ్? 140 00:09:19,268 --> 00:09:20,269 గ్రేబియర్డ్. 141 00:09:22,354 --> 00:09:23,564 నువ్వు నిజమైన దానివి ఎందుకు కాదు? 142 00:09:24,606 --> 00:09:29,194 సరే, ఇది సాధ్యం అని నాకు అనిపించలేదు, కానీ మీ అమ్మ ఇప్పుడు ఇంకా కోపంగా కనిపిస్తోంది. 143 00:09:29,695 --> 00:09:33,115 డేవిడ్, వెంటనే జేన్ కి ఇంటికి రమ్మని చెప్పు. 144 00:09:34,658 --> 00:09:36,326 మీ అమ్మ నిన్ను వెంటనే ఇంటికి రమ్మంటోంది. 145 00:09:36,869 --> 00:09:38,078 వెంటనే. 146 00:09:46,837 --> 00:09:48,212 ఎక్కడికి పోయావు? 147 00:09:48,213 --> 00:09:51,717 అలాగే నువ్వు తీసుకురావాల్సిన బట్టలు మిస్టర్ జిన్ ఎందుకు తీసుకొచ్చి ఇచ్చారు? 148 00:09:52,634 --> 00:09:54,595 జేన్, సమాధానం చెప్పు. 149 00:09:55,804 --> 00:09:56,805 క్షమించు, అమ్మా. 150 00:09:58,015 --> 00:10:01,475 బుజ్జి. ఇలా రా. 151 00:10:01,476 --> 00:10:03,061 ఏమైంది? 152 00:10:04,688 --> 00:10:06,814 గ్రేబియర్డ్ ఇంకొక చింపాంజీని కలిసింది, 153 00:10:06,815 --> 00:10:08,941 అలాగే అక్కడ ఇంకొక చిట్టి చింపాంజీ కూడా ఉంది, 154 00:10:08,942 --> 00:10:11,486 అప్పుడు మిస్టర్ జిన్ ఒక ఉచ్చులో చిక్కుకుంది... 155 00:10:12,321 --> 00:10:15,199 గ్రేబియర్డ్ కి ఇక నుండి నా ఫ్రెండ్ గా ఉండటం ఇష్టం లేదు అనుకుంట. 156 00:10:15,699 --> 00:10:17,034 మిస్టర్ జిన్ సమస్యలో ఉన్నారా? 157 00:10:17,951 --> 00:10:19,161 చింపాంజీ జిన్. 158 00:10:21,038 --> 00:10:23,373 సరే. ఇలా రా, వచ్చి కూర్చో. 159 00:10:28,670 --> 00:10:30,464 దీర్ఘంగా శ్వాస తీసుకో. 160 00:10:34,092 --> 00:10:35,344 మళ్ళీ చెప్పు. 161 00:10:37,387 --> 00:10:39,722 గ్రేబియర్డ్ కొన్ని ఇతర చింపాంజీలను కలిసింది, 162 00:10:39,723 --> 00:10:42,767 అలాగే వాటి ప్రాంతాలను ఎలా నాశనం చేస్తున్నారో కూడా చూసింది. 163 00:10:42,768 --> 00:10:45,937 అప్పుడు వాటిలో ఒకటి ఒక ఉచ్చులో చిక్కుకుంది, నేను దాన్ని విడిపించాను, 164 00:10:45,938 --> 00:10:48,440 కానీ అప్పుడు గ్రేబియర్డ్ నా నుండి దూరంగా వెళ్ళిపోయింది. 165 00:10:49,525 --> 00:10:51,734 అది బహుశా దానికి మనలాంటి మనుషులు చింపాంజీలకు 166 00:10:51,735 --> 00:10:55,656 హాని తలపెడుతున్నారు అని తెలియడం వల్లే అని నాకు అనిపిస్తోంది. 167 00:10:58,200 --> 00:11:01,370 - కానీ ఇది నీ దగ్గరే ఉంది కదా. - కానీ ఇది ప్రాణాలతో లేదు. 168 00:11:03,580 --> 00:11:07,750 సరే, జేన్, నువ్వు తన కోసం ఎంత చేస్తున్నావు అనే విషయం గ్రేబియర్డ్ కి ఖచ్చితంగా తెలుసు... 169 00:11:07,751 --> 00:11:10,211 కానీ చింపాంజీలకు ఎక్కువ సమయం లేదు, అమ్మా. 170 00:11:10,212 --> 00:11:12,213 ఇంకొన్ని ఏళ్లలో అసలు అవి లేకుండా పోతాయి, 171 00:11:12,214 --> 00:11:15,132 కానీ మనం వాటి గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. 172 00:11:15,133 --> 00:11:16,634 ఎలాంటి విషయాలు? 173 00:11:16,635 --> 00:11:19,888 అవి చెట్ల మీదకు రాళ్లు ఎందుకు విసురుతాయి, లేదా పనిముట్లు ఎందుకు వాడతాయి అనే విషయాలు. 174 00:11:20,973 --> 00:11:24,226 మనం తప్ప ప్రపంచంలో వేరే ఏ జంతువు అలాంటి పనులు చేయవు. 175 00:11:24,810 --> 00:11:27,646 చింపాంజీలకు, మనుషులకు చాలా పోలికలు ఉన్నాయి, 176 00:11:28,605 --> 00:11:30,607 మరి మనం వాటిని ఎందుకు బాధపెడుతున్నాం, అమ్మా? 177 00:11:36,613 --> 00:11:37,906 జేన్... 178 00:11:38,907 --> 00:11:40,242 నాకు తెలీదు. 179 00:11:41,910 --> 00:11:43,286 కానీ నాకు ఒకటి తెలుసు, 180 00:11:43,287 --> 00:11:47,916 నువ్వు మార్పు తీసుకురావడానికి నీకు వీలైనది అంతా చేస్తున్నావు. 181 00:11:50,836 --> 00:11:53,880 జేన్ గుడ్ఆల్ అయితే ఏమంటుంది? "మనం అర్థం చేసుకుంటేనే, మనం"... 182 00:11:53,881 --> 00:11:57,217 కానీ చింపాంజీలు అనేవి లేకపోతే మనం అర్థం చేసుకోవడానికి ఏమీ ఉండదు. 183 00:12:30,209 --> 00:12:31,418 నేను శుభ్రం చేస్తున్నాను. 184 00:12:32,961 --> 00:12:34,171 నేను బాగానే ఉన్నా, అమ్మా. 185 00:12:40,093 --> 00:12:41,261 డేవిడ్? 186 00:12:45,265 --> 00:12:47,850 మన చింపాంజీ రీసెర్చ్ కు సంబంధించిన వాటితో నువ్వు ఏం చేస్తున్నావు? 187 00:12:47,851 --> 00:12:49,061 నేను వీటిని లోపల పెడుతున్నా. 188 00:12:49,686 --> 00:12:51,979 - ఎందుకు? - ఎందుకంటే ఇదంతా చేసి లాభం లేదు, డేవిడ్. 189 00:12:51,980 --> 00:12:54,106 ప్రతీ ఏడాది మరిన్ని జంతువులు నశించిపోతున్నాయి, 190 00:12:54,107 --> 00:12:56,485 కానీ ఆ విషయమై చర్యలు తీసుకునేవారు ఎక్కువమంది లేరు. 191 00:12:57,277 --> 00:13:00,197 మరి జేన్ గుడ్ఆల్ అలాగే మనం కలిసిన మిగతా వాళ్ళందరి సంగతి ఏంటి? 192 00:13:00,781 --> 00:13:02,282 వాళ్ళందరూ ఏదోకటి చేస్తున్నారు. 193 00:13:03,033 --> 00:13:04,826 అది చాలదు. 194 00:13:07,120 --> 00:13:08,705 ఇక్కడ ఒక వాక్యం ఏదైనా ఉండి ఉంటుంది. 195 00:13:10,290 --> 00:13:11,500 దాని వల్ల ఏం ప్రయోజనం ఉండదు. 196 00:13:13,168 --> 00:13:14,169 గ్రేబియర్డ్ వెళ్ళిపోయింది. 197 00:13:19,967 --> 00:13:21,176 అది అంత పని చేయదు. 198 00:13:21,927 --> 00:13:22,927 అదే నిజం. 199 00:13:22,928 --> 00:13:25,430 దానికి ఇక నాతో స్నేహం చేయడం ఇష్టం ఉన్నట్టు లేదు. 200 00:13:28,725 --> 00:13:31,979 బహుశా మనకు సాయం చేయగల ఇంకొకరిని నువ్వు ఊహించుకుంటే మంచిదేమో? 201 00:13:32,479 --> 00:13:34,106 నాకు గ్రేబియర్డ్ వెనక్కి వస్తే చాలు. 202 00:13:34,773 --> 00:13:37,568 బహుశా చింపాంజీల గురించి బాగా తెలిసిన వారైతే బాగుంటుందేమో? 203 00:13:38,151 --> 00:13:39,361 అంటే ఎవరు? 204 00:13:48,829 --> 00:13:51,831 - నీ కళ్ళు మూసుకుని... - ఏం చేయాలో నాకు తెలుసు. 205 00:13:51,832 --> 00:13:53,458 అయితే కళ్ళు మూసుకో. 206 00:13:57,087 --> 00:13:58,130 ఆ తర్వాత ఊహించడం మొదలెట్టు. 207 00:14:07,639 --> 00:14:10,100 చింపాంజీలు ఇలాగే హలో చెప్తాయి. 208 00:14:15,397 --> 00:14:17,065 చాలా బాగా చేశావు, డేవిడ్. 209 00:14:18,358 --> 00:14:19,818 ఆమెకు నా పేరు తెలుసు. 210 00:14:21,028 --> 00:14:22,905 అలాగే హెలో, జేన్. 211 00:14:24,156 --> 00:14:25,741 అరువు, జేన్. అరువు. 212 00:14:31,079 --> 00:14:33,080 నీ అరుపులో నాకు సంతోషం ఏం కనిపించలేదు. 213 00:14:33,081 --> 00:14:37,668 అంటే, చింపాంజీలు కూడా మనుషుల్లాగే అస్తమాను సంతోషంగా ఉండవు. 214 00:14:37,669 --> 00:14:39,587 వాటికి కోపం వస్తుంది, 215 00:14:39,588 --> 00:14:41,422 వాటికి భయం వేస్తుంది, 216 00:14:41,423 --> 00:14:43,759 అలాగే వాటికి బాధ కూడా వేస్తుంది. 217 00:14:44,593 --> 00:14:45,802 అచ్చం నీలాగే, జేన్. 218 00:14:46,428 --> 00:14:49,263 మా గ్రేబియర్డ్ కి ఇక తనతో స్నేహం చేయడం ఇష్టం లేదని జేన్ కి బాధగా ఉంది. 219 00:14:49,264 --> 00:14:51,682 అంటే, తెలుసా, నాకు కూడా ఒక గ్రేబియర్డ్ అనే కోతి తెలుసు. 220 00:14:51,683 --> 00:14:54,852 డేవిడ్ గ్రేబియర్డ్, నా ఫేవరెట్ చింపాంజీ. 221 00:14:54,853 --> 00:14:58,190 నాకు తెలుసు. పనిముట్లను వాడుతుండగా మీరు చూసిన మొట్టమొదటి చింపాంజీ అది. 222 00:15:02,486 --> 00:15:07,448 నన్ను నమ్మిన మొట్టమొదటి చింపాంజీ డేవిడ్ గ్రేబియర్డ్. 223 00:15:07,449 --> 00:15:09,242 ఒకసారి అది నన్ను నమ్మడం మొదలెట్టాకా, 224 00:15:09,243 --> 00:15:12,412 అంతకు ముందు వరకు నన్ను చూసి భయపడిన చింపాంజీలు అన్నీ, 225 00:15:12,913 --> 00:15:16,457 బహుశా, "సరే, చూస్తుంటే ఆమె అంత భయంకరమైంది కాదేమో" అనుకున్నాయి అనిపిస్తుంది. 226 00:15:16,458 --> 00:15:19,669 ఆ తర్వాత నేను వాటన్నిటినీ ఒక్కొక్కటిగా తెలుసుకున్నాను కూడా. 227 00:15:19,670 --> 00:15:21,462 నా గ్రేబియర్డ్ కూడా నన్ను నమ్మేది, 228 00:15:21,463 --> 00:15:25,050 కానీ తర్వాత జనం చేస్తున్న చెడ్డ పనులన్నిటినీ చూసి, నేను ఏమీ చేయలేకపోయానని తెలుసుకుంది. 229 00:15:26,552 --> 00:15:28,804 ఒక్కోసారి చాలా నిరాశగా ఉంటుంది, కదా? 230 00:15:30,055 --> 00:15:32,391 అవును. మీకు ఎప్పుడైనా నిరాశగా అనిపించిందా? 231 00:15:33,851 --> 00:15:37,770 నాకు తెలిసి మనం ప్రపంచానికి చేస్తున్న చెడు గురించి ఆలోచించే అందరూ ఒక్కోసారి 232 00:15:37,771 --> 00:15:39,272 నిరాశగా ఫీల్ అవుతారు అనుకుంటున్నా. 233 00:15:39,273 --> 00:15:42,942 కానీ మనకు నిరాశ కలిగినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా, 234 00:15:42,943 --> 00:15:45,612 ఆశాజనకంగా ఉండే వాటిని ఆలోచించాలి. 235 00:15:46,947 --> 00:15:47,947 అంటే ఎలాంటివి? 236 00:15:47,948 --> 00:15:51,868 అంటే, ఇప్పుడు మరింత మంది మనం సృష్టించిన సమస్యల గురించి తెలుసుకుంటున్నారు, 237 00:15:51,869 --> 00:15:54,871 అంటే వాతావరణ మార్పు, జీవవైవిధ్యాన్ని కోల్పవడం లాంటివి. 238 00:15:54,872 --> 00:15:58,499 మనం చేసిన నష్టాన్ని కొంతమట్టుకు నయం చేయడానికి శాస్త్రవేత్తలు 239 00:15:58,500 --> 00:16:01,252 వినూత్నమైన పరిష్కారాలను కనిపెడుతున్నా, 240 00:16:01,253 --> 00:16:06,299 మీలాంటి చిన్న వాళ్ళు ప్రపంచానికి మేలు చేయడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. 241 00:16:06,300 --> 00:16:08,302 అది తెలిసి నాకు ఆశాజనకంగా ఉంది. 242 00:16:11,221 --> 00:16:14,850 మనం వేసే ప్రతీ అడుగుతో, ప్రపంచాన్ని కాపాడటానికి ఒక అడుగు దగ్గరవుతున్నాం. 243 00:16:15,767 --> 00:16:18,186 అది వినడానికి ఒక మంచి జేన్ గుడ్ఆల్ వాక్యంలా ఉంది. 244 00:16:18,187 --> 00:16:21,106 కాదు, నిజానికి అది జేన్ గార్సియా అన్న మాట. 245 00:16:25,903 --> 00:16:28,070 కాబట్టి, మీరు చేయాలనుకునే వాటిని ఆలోచించుకుని, 246 00:16:28,071 --> 00:16:31,782 నడుము కట్టుకుని, బయటకు వెళ్లి మీ పని మీరు చేయండి. 247 00:16:31,783 --> 00:16:36,162 {\an8}అలాగే, మీరు ఎన్నో చేసారు కాబట్టి, ఈ హీరో బోర్డు మీద మీరు కూడా 248 00:16:36,163 --> 00:16:38,290 {\an8}ఉండాలని నా ఉద్దేశం. 249 00:16:43,462 --> 00:16:45,422 చింపాంజీలు థాంక్స్ అని ఎలా చెప్తాయి? 250 00:16:45,923 --> 00:16:48,466 అంటే, అవి ఒక్కోసారి ఒకదాన్ని ఒకటి దువ్వుకుంటాయి. 251 00:16:48,467 --> 00:16:50,176 మేము మీ జుట్టు దువ్వవచ్చా? 252 00:16:50,177 --> 00:16:52,345 అందుకు అవసరం లేదు. 253 00:16:52,346 --> 00:16:54,096 థాంక్స్, డాక్టర్ గుడ్ఆల్. 254 00:16:54,097 --> 00:16:57,309 నువ్వు కావాలనుకుంటే నన్ను డాక్టర్ జేన్ అని పిలవవచ్చు. ఇద్దరూ. 255 00:16:58,227 --> 00:17:02,605 అలాగే సమయం మించిపోక ముందే ఈ ప్రపంచాన్ని ఒక మంచి చోటుగా మలచడానికి 256 00:17:02,606 --> 00:17:03,981 మీరు చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. 257 00:17:03,982 --> 00:17:07,569 కాబట్టి ఇక వెళ్లి మన ప్రపంచాన్ని కాపాడండి. 258 00:17:16,244 --> 00:17:17,663 థాంక్స్, డాక్టర్ జేన్. 259 00:17:19,998 --> 00:17:21,499 నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? 260 00:17:21,500 --> 00:17:24,085 నేను తర్వాత వచ్చి నా గది శుభ్రం చేస్తానని ప్రమాణం చేస్తున్న, అమ్మా, కానీ ఇప్పుడు... 261 00:17:24,086 --> 00:17:25,877 కాదు, నువ్వు నన్ను పూర్తిగా మాట్లాడనివ్వలేదు. 262 00:17:25,878 --> 00:17:30,717 గ్రేబియర్డ్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు? 263 00:17:31,844 --> 00:17:33,428 నేను దీని మీద ఉన్న మురికిని శుభ్రం చేశా. 264 00:17:36,974 --> 00:17:37,932 డేవిడ్? 265 00:17:37,933 --> 00:17:39,935 ఇది చింపాంజీలు థాంక్స్ చెప్పే విధానం. 266 00:17:40,686 --> 00:17:42,311 సరే, కానీ ఈసారి నువ్వు అడిగి ఇలా చేస్తే బాగుంటుంది. 267 00:17:42,312 --> 00:17:45,607 గ్రేబియర్డ్ ని శుభ్రం చేసినందుకు మీకు థాంక్స్ చెప్పడానికి మేము మీ జుట్టు దువ్వొచ్చా? 268 00:17:47,609 --> 00:17:48,819 సరేలే. 269 00:17:52,573 --> 00:17:55,325 సరే, ఇది చాలా వింతగా ఉంది. ఇక మీరు వెళ్ళండి. 270 00:18:09,923 --> 00:18:11,424 - ఇటువైపు. - నీకెలా తెలుసు? 271 00:18:11,425 --> 00:18:14,177 నాకు తెలీదు, కానీ వాటికి ఎటు వెళ్లాలో తెలియడం కోసం అవి ఒక మ్యాప్ లాగ 272 00:18:14,178 --> 00:18:17,305 - ఈ గుర్తులు చేస్తాయి అనుకుంటున్నా. - ఇది గ్రేబియర్డ్ చేసిన గుర్తు ఏమో. 273 00:18:17,306 --> 00:18:18,640 అది నిజం కావాలని కోరుకుందాం. 274 00:18:21,268 --> 00:18:23,187 మిస్టర్ జిన్, మా ఇంటి నుండి శబ్దం ఏమైనా వచ్చిందా? 275 00:18:23,729 --> 00:18:25,688 అందరూ ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? 276 00:18:25,689 --> 00:18:28,191 కాదు. నేను జేన్ ఎలా ఉందో చూసి పోదామని వచ్చాను. 277 00:18:28,192 --> 00:18:30,359 ఇందాక ఆమె బాగా నిరాశలో ఉన్నట్టు కనిపించింది. 278 00:18:30,360 --> 00:18:31,903 చాలా సంతోషం. 279 00:18:31,904 --> 00:18:33,154 అది నిజంగానే బాధపడింది. 280 00:18:33,155 --> 00:18:36,074 నేను దాన్ని ఇంత నిరాశగా చూడటం అదే మొదటిసారి. 281 00:18:36,867 --> 00:18:38,994 అవును. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 282 00:18:40,204 --> 00:18:41,455 నేను తనతో మాట్లాడొచ్చా? 283 00:18:42,080 --> 00:18:45,082 తను ఇప్పుడు డేవిడ్ తో బయటకు వెళ్ళింది, కానీ తిరిగి రాగానే నేను మీకు మెసేజ్ చేస్తా. 284 00:18:45,083 --> 00:18:46,334 వద్దు, అదేం పర్లేదు. 285 00:18:46,335 --> 00:18:48,462 బయటే కనిపిస్తుందేమో చూస్తా. బై. 286 00:18:49,171 --> 00:18:50,172 బై. 287 00:18:57,930 --> 00:19:01,974 చూడు, నాకు ఆ చిన్న చింపాంజీ గ్రేబియర్డ్ దగ్గర చెట్టు మీదకు రాయి విసరడం ఎలాగో నేర్చుకుంటుంది అనిపిస్తోంది. 288 00:19:01,975 --> 00:19:03,060 కానీ ఎందుకు? 289 00:19:03,894 --> 00:19:05,144 నాకు ఇంకా తెలీదు. 290 00:19:05,145 --> 00:19:08,272 బహుశా ఏదైనా మార్గాన్ని మార్క్ చేయడం కోసమేమో, లేదా వాటికి ఆ శబ్దం నచ్చుతుందేమో, 291 00:19:08,273 --> 00:19:10,983 లేదా మనకు ఇంకా తెలీని ఏదైనా కారణంగా అయ్యుండొచ్చు. 292 00:19:10,984 --> 00:19:13,319 ఇందుకే మనం జంవుతులను కాపాడటం ముఖ్యం. 293 00:19:13,320 --> 00:19:15,572 మనం వాటి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. 294 00:19:28,961 --> 00:19:32,129 చింపాంజీలకు మనుషులు చాలా హాని తలపెడుతున్నారు అని నాకు తెలుసు, గ్రేబియర్డ్. 295 00:19:32,130 --> 00:19:34,674 కానీ నీ నుండి ఆ చిన్న చింపాంజీ ఎలా అయితే కొత్త విషయాలు నేర్చుకుంటుందో, 296 00:19:34,675 --> 00:19:36,385 జనం కూడా మన నుండి కొత్త విషయాలు నేర్చుకోగలరు. 297 00:19:37,970 --> 00:19:41,264 మనకు ఒక్కటే ప్రపంచం, ఒక్కటే ఇల్లు ఉందని మనం వాళ్లకు నేర్పగలం. 298 00:19:41,265 --> 00:19:43,517 దాన్ని కాపాడటానికి మనం కలిసి పని చేయాలి అని. 299 00:19:47,855 --> 00:19:51,023 కొన్నిసార్లు బాగా నిరాశగా ఉంటుందని నాకు తెలుసు, కానీ మనం ట్రై చేయాలి. 300 00:19:51,024 --> 00:19:52,776 నేను ఎప్పటికీ ట్రై చేయడం మానను. 301 00:19:55,404 --> 00:19:56,405 నేను కూడా. 302 00:20:06,123 --> 00:20:07,082 నీకు కూడా థాంక్స్. 303 00:20:16,800 --> 00:20:17,801 మిస్టర్ జిన్? 304 00:20:18,385 --> 00:20:19,552 డేవిడ్ ఎక్కడ? 305 00:20:19,553 --> 00:20:22,973 మేము మా మిషన్ ని పూర్తి చేసాం, కానీ నేను ఇంకా నా గది శుభ్రం చేసుకోవాలి. 306 00:20:24,057 --> 00:20:26,101 - ఇప్పుడు బాగానే ఉందా? - అవును. 307 00:20:28,061 --> 00:20:31,898 బాగానే ఉన్నాను అనుకుంటున్నా. కొన్నిసార్లు నేను చేయాల్సినంత చేయడం లేదు అని బాధ వేస్తుంటుంది. 308 00:20:31,899 --> 00:20:33,192 నువ్వు జోక్ చేస్తున్నావు, కదా? 309 00:20:35,694 --> 00:20:36,820 లెగు. 310 00:20:38,238 --> 00:20:39,239 నాతో రా. 311 00:20:40,824 --> 00:20:44,411 నువ్వు లేకపోతే, మనం బ్యాటరీలు రీసైకిల్ చేస్తుండే వాళ్ళం కాదు. 312 00:20:46,622 --> 00:20:49,625 మిస్టర్ పటేల్ గారి ఇంటి ముందు సీతాకోకచిలుకలు ఉండేవి కాదు. 313 00:20:52,211 --> 00:20:53,085 సింహాన్ని కాపాడండి 314 00:20:53,086 --> 00:20:55,923 ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువులను కాపాడటానికి మేము ట్రై చేస్తూండేవాళ్ళం కాదు. 315 00:20:59,343 --> 00:21:01,970 అలాగే మన దగ్గర గబ్బిలాల ఇళ్ళు ఉండేవి కాదు. 316 00:21:02,804 --> 00:21:05,182 - ఇవి ఎందుకు పెట్టామో ఒకసారి... - అవి పురుగులను తింటాయి. 317 00:21:05,682 --> 00:21:06,683 అవును. 318 00:21:07,643 --> 00:21:09,686 అలాగే ప్రతీ బిన్ లోకి ఏది వెళ్లాలో కూడా మాకు తెలిసేది కాదు. 319 00:21:10,479 --> 00:21:11,855 పదా. 320 00:21:16,777 --> 00:21:19,153 నువ్వు లేకపోతే వీటిలో ఏదీ జరిగేదే కాదు. 321 00:21:19,154 --> 00:21:23,742 - కానీ డేవిడ్ ఇంకా చాలా మంది సాయం చేశారు. - అవును, కానీ మాకు స్ఫూర్తిని ఇచ్చింది నువ్వు. 322 00:21:26,328 --> 00:21:28,955 ప్రమాదంలో ఉన్న చింపాంజీలను కాపాడటానికి మీరు పిటిషన్ మీద సంతకం చేస్తారా? 323 00:21:28,956 --> 00:21:30,832 - తప్పకుండా. - అలాగే కొంత డబ్బు డొనేట్ చేస్తారా? 324 00:21:31,959 --> 00:21:33,752 - ఎంత? - జేన్? 325 00:21:34,711 --> 00:21:37,798 ముందు గది శుభ్రం చెయ్, తర్వాత ప్రపంచాన్ని కాపాడొచ్చు. 326 00:21:38,924 --> 00:21:39,925 నేను ఇక వెళ్ళాలి. 327 00:21:54,064 --> 00:21:56,984 పదా, గ్రేబియర్డ్. మనం ప్రపంచాన్ని కాపాడాలి. 328 00:22:01,905 --> 00:22:03,991 "చింపాంజీలను కాపాడటానికి సాయం చేయండి." 329 00:22:06,159 --> 00:22:08,369 - జేన్? - నేను శుభ్రం చేస్తున్నా, శుభ్రం చేస్తున్నా. 330 00:22:08,370 --> 00:22:11,039 నేను నీకు అది చూపించడానికి కాదు నేను వచ్చింది. ఇలా రా. 331 00:22:17,337 --> 00:22:18,671 ఈ వీడియో ఎక్కడ తీశారు? 332 00:22:18,672 --> 00:22:20,840 - చింప్ ఈడెన్. - అసలైన చింప్ ఈడెన్? 333 00:22:20,841 --> 00:22:22,800 డాక్టర్ జేన్ కి ఉన్న చింపాంజీ అభయారణ్యాలలో ఒకటి, 334 00:22:22,801 --> 00:22:25,052 అక్కడ వాళ్ళు కాపాడిన చింపాంజీలను జాగ్రత్తగా చూసుకుంటారు, అదా? 335 00:22:25,053 --> 00:22:26,972 అవును, అలాగే ఇంకొకటి చెప్పనా? 336 00:22:29,600 --> 00:22:32,185 నీకు కొంచెం ప్రోత్సాహం అవసరం అనిపించింది, అందుకని నీ కోసం నేను 337 00:22:32,186 --> 00:22:34,228 యాన స్వర్ట్ తో ఒక కాల్ ఏర్పాటు చేశాను. 338 00:22:34,229 --> 00:22:36,731 - ఆమె చింప్ ఈడెన్ లో పనిచేస్తుంది. - ఆవిడ ఎవరో నాకు తెలుసు. 339 00:22:36,732 --> 00:22:38,733 వావ్, ఇది చాలా బాగుంది. థాంక్స్, అమ్మా. 340 00:22:38,734 --> 00:22:39,943 ఎంజాయ్ చెయ్. 341 00:22:41,987 --> 00:22:45,323 - హాయ్. మీరు జేన్ ఇంకా డేవిడ్లు అయ్యుంటారు. - హాయ్, యాన. 342 00:22:45,324 --> 00:22:47,408 నేను మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడగాలి. 343 00:22:47,409 --> 00:22:50,328 చింప్ ఈడెన్ లో ఉండే చింపాంజీలను మీరు ఎప్పటికైనా అడవిలో వదులుతారా? 344 00:22:50,329 --> 00:22:53,497 లేదు, ఎందుకంటే సాధారణంగా అడవుల్లో ఎలా బ్రతకాలనే విషయాన్ని 345 00:22:53,498 --> 00:22:55,249 వాటి తల్లుల నుండి నేర్చుకుంటాయి. 346 00:22:55,250 --> 00:22:59,462 కానీ వేటాడటం, అడవులు నశించిపోవడం వల్ల చాలా పిల్లలు తల్లులను కోల్పోయాయి, 347 00:22:59,463 --> 00:23:01,964 కారణంగా సర్కస్లలోకి వెళ్లడమో, లేదా పెంపుడు జంతువులుగా మారడమో జరుగుతుంది. 348 00:23:01,965 --> 00:23:03,341 అది వాటికి చాలా హానికరం. 349 00:23:03,342 --> 00:23:04,550 ఇది చాలా దారుణం. 350 00:23:04,551 --> 00:23:07,094 అందుకే ఇలాంటి ఒక అభయారణ్యం ఉండటం చాలా ముఖ్యం, 351 00:23:07,095 --> 00:23:10,224 ఇక్కడైతే కాపాడబడిన ఈ చింపాంజీలకు ఒక మంచి జీవితం దక్కే అవకాశం ఉంటుంది. 352 00:23:13,143 --> 00:23:14,143 అదేంటి? 353 00:23:14,144 --> 00:23:16,187 చింపాంజీలు స్టానీని చూసి ఉంటాయి. 354 00:23:16,188 --> 00:23:18,440 ఆగండి. స్టానీ అంటే చింపాంజీ విస్పరర్ అని పిలవబడే ఆయనే కదా? 355 00:23:19,816 --> 00:23:22,527 ఆయన చింప్ ఈడెన్ లో పనిచేస్తున్నాడు, ఆయన చింపాంజీల నిపుణుడు. 356 00:23:22,528 --> 00:23:24,446 జేన్ మాత్రం నిపుణుల విషయంలో నిపుణురాలు. 357 00:23:25,614 --> 00:23:27,657 నా దగ్గర మీ ఇద్దరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. 358 00:23:27,658 --> 00:23:29,076 మీరు ఇది చూడాలి. 359 00:23:32,871 --> 00:23:34,581 ఆయన చింపాంజీలకు తిండి పెడుతున్నాడు. 360 00:23:36,291 --> 00:23:37,250 హాయ్, పిల్లలు. 361 00:23:37,251 --> 00:23:38,584 అవి చాలా సంతోషంగా ఉన్నాయి. 362 00:23:38,585 --> 00:23:40,169 హాయ్, జేన్. హాయ్, డేవిడ్. 363 00:23:40,170 --> 00:23:42,339 - హాయ్, స్టానీ. - హాయ్, స్టానీ. 364 00:23:42,965 --> 00:23:45,049 హేయ్, చింపాంజీలు అన్నీ ఎక్కడికి పోతున్నాయి? 365 00:23:45,050 --> 00:23:47,802 బహుశా అవి మరింత తిండిని వెతుక్కుంటూ పోతున్నాయి ఏమో. 366 00:23:47,803 --> 00:23:50,972 అవి ఏం ఆలోచిస్తున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నాయనే విషయం మాకు చెప్పడానికి మాకు స్టానీ సాయం చేస్తారు, 367 00:23:50,973 --> 00:23:52,765 అలా అయితే మేము వాటిని ఇంకా బాగా చూసుకోగలం కదా. 368 00:23:52,766 --> 00:23:55,184 అందుకే మిమ్మల్ని చింపాంజీ విస్పరర్ అన్నారు. 369 00:23:55,185 --> 00:23:56,644 అవును. 370 00:23:56,645 --> 00:23:58,104 మీకు ఆ ముద్దు పేరు ఎలా వచ్చింది? 371 00:23:58,105 --> 00:24:01,107 డాక్టర్ జేన్ గుడ్ఆల్ నాకు ఆ పేరు పెట్టింది. 372 00:24:01,108 --> 00:24:03,776 డాక్టర్ జేన్ మీకు ఆ పేరు పెట్టారా? అది భలే విషయం. 373 00:24:03,777 --> 00:24:06,153 మీరు చింపాంజీలతో కలిసి ఎన్నాళ్లుగా పని చేస్తున్నారు, స్టానీ? 374 00:24:06,154 --> 00:24:08,197 దాదాపు నా జీవితంలో సగం కాలంగా. 375 00:24:08,198 --> 00:24:11,450 ఇది నేను పిల్ల చింపాంజీలను సాకుతున్నప్పటి ఫోటో. 376 00:24:11,451 --> 00:24:12,535 ఇది పోకో. 377 00:24:12,536 --> 00:24:16,330 ఇక్కడ నేను చింపాంజీలతో కలిసి ఎలా బ్రతకాలి అనే విషయాన్ని స్థానికులకు చెప్తున్నప్పటి ఫోటో. 378 00:24:16,331 --> 00:24:18,499 మీరు చాలా చింపాంజీలకు సాయం చేసి ఉంటారు. 379 00:24:18,500 --> 00:24:21,627 అవి నాకు కుటుంబం లాంటివి, అవి నాకు చాలా నేర్పించాయి. 380 00:24:21,628 --> 00:24:22,753 అంటే ఎలాంటి విషయాలు? 381 00:24:22,754 --> 00:24:24,839 క్షమించడం, అలాగే ఆశతో ఉండటం. 382 00:24:24,840 --> 00:24:26,549 మీకు అవి ఆశతో ఉండటం ఎలా నేర్పించాయి? 383 00:24:26,550 --> 00:24:29,468 ఒక చింపాంజీ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు, 384 00:24:29,469 --> 00:24:32,597 అవి సాధారణంగా అనారోగ్యంగా, చాలా భయపడుతూ ఉంటాయి. 385 00:24:32,598 --> 00:24:35,391 కానీ మంచి సంరక్షణ పొందిన తర్వాత, 386 00:24:35,392 --> 00:24:37,935 అవి ఆరోగ్యంగా తయారై, జీవితం మీద ఆశను వదులుకోవు. 387 00:24:37,936 --> 00:24:40,062 అది చూస్తే నాకు కూడా జీవితం మీద ఆశ పుడుతుంది. 388 00:24:40,063 --> 00:24:41,397 సహాయం చేయడానికి మేము ఏం చేయగలం? 389 00:24:41,398 --> 00:24:46,319 మీరు మనకు దగ్గరి బంధువైన చింపాంజీల గురించి నేర్చుకున్న విషయాలను 390 00:24:46,320 --> 00:24:50,948 మీ ఫ్రెండ్స్, ఇంకా కుటుంబ సభ్యులకు చెప్పడం చాలా ముఖ్యం. 391 00:24:50,949 --> 00:24:53,951 అవును. మీరు ఎక్కడ ఉంటున్నా, వీటి అడవులను నాశనం చేయకుండా తయారుచేయబడిన 392 00:24:53,952 --> 00:24:58,372 వాతావరణ అనుకూల మార్గాలలో సేకరించబడిన ఉత్పత్తులను వాడి అడవి జంతువులకు సాయపడగలరు. 393 00:24:58,373 --> 00:25:01,375 వాటి తయారీ క్రమంలో మన గ్రహానికి తక్కువ హాని కలుగుతుంది. 394 00:25:01,376 --> 00:25:04,670 చింపాంజీలు ఇంకా మిగతా జీవులు బ్రతకాలంటే వాటికి అడవులు కావాలి. 395 00:25:04,671 --> 00:25:07,673 అలాగే జంవుతులు ఈ భూమి మీద ఉన్నది మన వినోదం కోసం కాదు 396 00:25:07,674 --> 00:25:08,966 అని అస్సలు మర్చిపోకూడదు. 397 00:25:08,967 --> 00:25:11,010 ప్రపంచమంతా ఆ విషయం తెలియాలి. 398 00:25:11,011 --> 00:25:13,055 - నేను అందరితో చెప్తాను. - నేను కూడా. 399 00:25:13,931 --> 00:25:15,598 చింపాంజీలు గుడ్ బై ఎలా చెప్తాయి? 400 00:25:15,599 --> 00:25:19,895 చింపాంజీలు గుడ్ బై చెప్పడానికి ఇలా చేస్తాయి. 401 00:25:31,657 --> 00:25:34,450 బై, యాన. బై, స్టానీ. 402 00:25:34,451 --> 00:25:36,620 బై, చింపాంజీలు. 403 00:25:37,412 --> 00:25:40,332 - అమ్మా, నువ్వు చేసిన దానికి చాలా థాంక్స్. - అవును, థాంక్స్, జేన్ వాళ్ళ అమ్మా. 404 00:25:40,916 --> 00:25:42,458 ఇది గ్రేబియర్డ్ కి కూడా నచ్చితే బాగుండు. 405 00:25:42,459 --> 00:25:43,961 దానికి కూడా నచ్చింది. 406 00:25:45,254 --> 00:25:47,588 సరే, ఇక నువ్వు గది శుభ్రం చేసే టైమ్ అయింది. 407 00:25:47,589 --> 00:25:48,548 బై, డేవిడ్. 408 00:25:48,549 --> 00:25:50,384 - బై. - బై, డేవిడ్. 409 00:25:52,928 --> 00:25:54,888 నీకు ఇవి అవసరం అవుతాయి అనుకున్నాను. 410 00:25:56,056 --> 00:25:57,057 థాంక్స్, అమ్మా. 411 00:26:00,394 --> 00:26:03,146 ఇదుగో. నువ్వు స్టానీ ఫోటో పెట్టు, నేను యానది పెట్టనా? 412 00:26:59,161 --> 00:27:01,163 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్