1 00:00:36,954 --> 00:00:39,456 "క్లమిఫోరస్ ట్రన్కేటస్." 2 00:00:45,087 --> 00:00:46,505 గ్రేబియర్డ్, ఏమైనా కనిపిస్తుందా? 3 00:00:48,590 --> 00:00:51,426 మనం చాలా సేపటి నుండి ఎదురుచూస్తున్నాం, జేన్, కానీ ఏమీ కనబడలేదు. 4 00:00:53,470 --> 00:00:54,680 ఇప్పుడు కనిపించినట్టు ఉంది. 5 00:00:55,264 --> 00:00:57,599 క్లమిఫోరస్ ట్రన్కైటస్ కి హాయ్ చెప్పు. 6 00:00:57,599 --> 00:01:00,435 హలో, క్లమిఫోరస్ "ట్రన్-కాక్టసస్." 7 00:01:01,228 --> 00:01:03,522 లేదా, పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో వచ్చింది అనొచ్చు. 8 00:01:03,522 --> 00:01:05,649 చూస్తుంటే పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో పోతున్నట్టు ఉంది! 9 00:01:05,649 --> 00:01:07,442 ఒక కారు నేరుగా దాని వైపే వెళ్తోంది! 10 00:01:07,442 --> 00:01:08,694 దారికి అడ్డు లెగు! 11 00:01:14,241 --> 00:01:15,367 తృటిలో తప్పింది. 12 00:01:15,367 --> 00:01:16,451 దాదాపుగా తొక్కేసినంత పని అయింది. 13 00:01:17,286 --> 00:01:20,497 చూడు, పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో ఇప్పుడు నేలలోకి తవ్వడం మొదలెట్టింది. 14 00:01:21,123 --> 00:01:22,833 దాన్ని అడ్డుకోవడానికి దారిని సెట్ చేస్తున్నా. 15 00:01:27,754 --> 00:01:29,965 మన కొత్త అండర్ గ్రౌండ్ తవ్వకం మెషిన్ నాకు చాలా నచ్చింది. 16 00:01:30,549 --> 00:01:31,758 ఈ బటన్స్ ని చూడు. 17 00:01:32,259 --> 00:01:34,052 బీప్, బీప్, బూప్, బూప్, బూప్. 18 00:01:34,052 --> 00:01:35,971 బీప్, బూప్, బీ-బీ... ఒక డయిల్ ఉంది. 19 00:01:36,847 --> 00:01:38,182 డయిల్ ని ముట్టుకోకు, డేవిడ్. 20 00:01:38,182 --> 00:01:40,601 మనం క్లమిఫోరస్ ట్రన్కైటస్ ని ఫాలో అవ్వడానికి మాత్రమే సైజు తగ్గాము. 21 00:01:40,601 --> 00:01:43,187 అనుకోకుండా పని మధ్యలో ఉన్నప్పుడు తిరిగి మామూలు సైజుకు పెరగకూడదు. 22 00:01:43,187 --> 00:01:47,816 సరే, మన కోసం క్లమిఫోరస్ సిద్ధంగా ఉండి ఉంటుందని ఆశిస్తున్నా. 23 00:01:47,816 --> 00:01:49,026 నేను చెప్పింది అర్థమైందా? 24 00:01:49,026 --> 00:01:50,152 అయింది. 25 00:01:55,824 --> 00:01:57,868 పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో చాలా వేగంగా వెళ్తుంది. 26 00:01:57,868 --> 00:02:00,078 అవి నిజమైన ఫెయిరీల్లా కనిపించడం లేదు కదా. 27 00:02:00,078 --> 00:02:03,207 చెప్పాలంటే వెనుక వైపు సూషి ఉన్న హామ్స్టర్స్ లాగ ఉన్నాయి. 28 00:02:03,207 --> 00:02:07,085 ఆ సూషి వాటి గుల్లలో భాగం, కానీ అవి నిజంగానే హామ్స్టర్ల లాగ ఉన్నాయి. 29 00:02:07,085 --> 00:02:10,339 ఆర్మడిల్లోలు అన్నిటికీ గుల్లలు ఉంటాయి, కానీ ఈ పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో అన్నిటికంటే చిన్నది. 30 00:02:10,339 --> 00:02:11,715 మనకు వాటి గురించి పెద్దగా తెలీదు. 31 00:02:11,715 --> 00:02:14,676 వాటిని కనిపెట్టడం చాలా కష్టం, పైగా అవి ఎక్కువగా భూమి కిందే నివసిస్తాయి. 32 00:02:14,676 --> 00:02:16,762 అయితే ఇది మాత్రం రోడ్డు మీదకు ఎందుకు వచ్చినట్టు? 33 00:02:17,596 --> 00:02:18,430 మంచి ప్రశ్న. 34 00:02:18,430 --> 00:02:21,892 బహుశా అది సిమెంటును తవ్వి కిందకు వెళ్లలేకపోయిందేమో, లేదా ఆహారం కోసం వెతుకుతుంది ఏమో? 35 00:02:21,892 --> 00:02:24,937 అలాగే మగ ఆర్మడిల్లోలు ఆడవాటికంటే పెద్దగా ఉంటాయి కాబట్టి ఇది మగది అని చెప్పొచ్చా? 36 00:02:24,937 --> 00:02:26,104 ఇంకొక మంచి ప్రశ్న. 37 00:02:26,104 --> 00:02:28,941 మనకు తెలీదు. మనకు వీటి గురించి చాలా తక్కువ తెలుసు. 38 00:02:28,941 --> 00:02:30,776 స్కానర్ లో అది మగది అని చూపించింది. 39 00:02:30,776 --> 00:02:33,862 ఆఖరి ప్రశ్న, ఇంతకీ ఇవాళ మన మిషన్ ఏంటి? 40 00:02:33,862 --> 00:02:37,658 అవి ఏం తింటాయో కనిపెట్టడమే ఇవాళ మన మిషన్. 41 00:02:37,658 --> 00:02:39,368 వినడానికి సింపుల్ గానే ఉంది. 42 00:02:39,368 --> 00:02:41,495 ఈ చిట్టి జీవుల విషయానికి వస్తే ఏదీ అంత సింపుల్ కాదు. 43 00:02:41,495 --> 00:02:43,497 కానీ మనం అవి ఏం తింటాయో తెలుసుకోగలిగితే... 44 00:02:43,497 --> 00:02:45,666 - మనం వాటికి సాయం చేయగలం కదా? - అవును. 45 00:02:46,875 --> 00:02:49,711 - ఆ చిన్న జీవి ఇంత పొడవాటి సొరంగం తవ్విందా? - నాకు తెలీదు. 46 00:02:49,711 --> 00:02:53,632 చాలా జంతువులు భూమి కింద సొరంగాలు తవ్వుతాయి, పురుగులు, కప్పలు, 47 00:02:53,632 --> 00:02:55,717 కుందేళ్లు, గుడ్లగూబలు, నక్కలు, పెంగ్విన్లు, వాం... 48 00:02:55,717 --> 00:02:59,096 - ఈ జంతువుల లిస్టు చాలా పెద్దది కదా? - వాంబాట్స్. అవును, పెద్దదే. 49 00:02:59,096 --> 00:03:01,056 మన కాళ్ళ క్రింద ఒక కొత్త ప్రపంచమే ఉంది, 50 00:03:01,056 --> 00:03:03,475 కానీ చాలా మంది ఆ విషయాన్ని అసలు ఆలోచించరు కూడా. 51 00:03:04,351 --> 00:03:06,019 ఆ ప్రపంచంలో ఒక భాగం అక్కడ ఉంది. 52 00:03:06,603 --> 00:03:07,855 అది వస్తోంది. 53 00:03:09,106 --> 00:03:11,608 - అలాగే వెళ్ళిపోతోంది కూడా. - అది తప్పించుకుంటోంది. 54 00:03:11,608 --> 00:03:13,944 డేవిడ్, మనం మన బోరింగ్ వేగాన్ని పెంచాలి. 55 00:03:13,944 --> 00:03:17,406 జేన్, మన మొహాలు ఇంకా బోరింగ్ గా తయారైతే మాత్రాన దాన్ని అందుకోగలం అని నాకు అనిపించడం లేదు. 56 00:03:17,406 --> 00:03:19,616 "తవ్వడాన్ని" ఫ్యాన్సీగా బోరింగ్ అంటారు. 57 00:03:20,200 --> 00:03:22,119 జంతువుల శాస్త్రీయ నామాన్ని వాడినట్టు... 58 00:03:22,119 --> 00:03:23,871 - ఏంటి? - ఏమీ లేదు. 59 00:03:23,871 --> 00:03:25,455 బోరింగ్ వేగాన్ని పెంచుతున్నా. 60 00:03:31,962 --> 00:03:33,172 రాయి వస్తోంది! 61 00:03:34,464 --> 00:03:36,884 - ఏవేసివ్ ఎత్తుగడలు వెయ్! - ఏంటి? 62 00:03:36,884 --> 00:03:39,219 "తప్పించుకోవడానికి ఏర్పాట్లు చెయ్!" అని ఫ్యాన్సీగా అన్నాను. 63 00:03:40,220 --> 00:03:41,430 అది అక్కడ ఉంది! 64 00:03:42,306 --> 00:03:43,557 ఇంకొక రాయి! 65 00:03:43,557 --> 00:03:45,475 దానిని అడ్డు తప్పిస్తున్నాను, మూడు, రెండు, ఒకటి! 66 00:03:48,020 --> 00:03:51,190 అది చాలా వేగంగా వెళ్తోంది. మనం దాన్ని చూడలేకపోతే అది ఏం తింటుందో తెలుసుకోవడం ఎలా? 67 00:03:54,860 --> 00:03:55,777 డెడ్ ఎండ్ వచ్చేసింది! 68 00:03:56,361 --> 00:03:58,071 కాస్త మంచి పదాలు వాడు, జేన్! 69 00:03:58,071 --> 00:04:01,283 కాస్త మంచి పదాలు వాడు! 70 00:04:11,084 --> 00:04:12,544 కొంచెం ఉంటే దాన్ని పట్టుకునేవారం. 71 00:04:12,544 --> 00:04:15,672 కొంచెం ఉంటే నలిగి పిప్పు అయిపోయేవారం కూడా, లేదా పేస్ట్ అయిపోయేవారం. 72 00:04:15,672 --> 00:04:17,632 లేదా తప్పడగా అయిపోయే కార్టూన్లలాగ మనం కూడా... 73 00:04:17,632 --> 00:04:18,550 నాకు అర్థమైంది. 74 00:04:18,550 --> 00:04:20,636 ఇప్పుడు ఆ చటుక్కున మాయమవుతున్న ఆర్మడిల్లోని ఎలా ఫాలో అవ్వగలం? 75 00:04:20,636 --> 00:04:22,137 లేదా ఆ రాళ్లను ఎలా తప్పించుకోగలం? 76 00:04:22,137 --> 00:04:24,097 మేడపైకి వెళ్లి మళ్ళీ మొదటి నుండి ప్లాన్ చేద్దాం. 77 00:04:24,097 --> 00:04:27,100 బహుశా ఈసారి నొక్కుబడిపోయే ప్రమాదం ఉన్న ఈ పనిని గ్రేబియర్డ్ తో చేయిద్దామా? 78 00:04:29,394 --> 00:04:31,230 ఆగు, ఆ సౌండ్ ఏంటి? 79 00:04:33,815 --> 00:04:34,816 గ్రేబియర్డ్, పైకి ఎక్కు! 80 00:04:40,280 --> 00:04:41,532 ఏం జరుగుతోంది? 81 00:04:41,532 --> 00:04:42,741 అన్నిసా. 82 00:04:43,867 --> 00:04:46,036 హేయ్, జేన్. హేయ్, డేవిడ్. 83 00:04:46,036 --> 00:04:47,996 ఈ వర్కర్స్ అందరూ ఏం చేస్తున్నారు? 84 00:04:47,996 --> 00:04:52,793 నీకు ఈ మాట చెప్పడం నాకు బాధగానే ఉంది, కానీ సొసైటీ వారు ఈ తోటను తీయించేస్తున్నారు, 85 00:04:52,793 --> 00:04:55,087 అంటే మనం ఇన్నాళ్లూ తోట అని పిలిచిన ఈ మొక్కల్ని అనుకో. 86 00:04:55,087 --> 00:04:56,797 - ఏంటి? - అవును. 87 00:04:56,797 --> 00:05:00,259 నాకు కూడా ఇష్టం లేదు, కానీ దీన్ని మెయింటైన్ చేయడానికి ఒక తోటమాలిని పెట్టడానికి బిల్డింగ్ వారి దగ్గర బడ్జెట్ లేదు, 88 00:05:00,259 --> 00:05:02,469 అంటే, దీని స్థితిని మీరే చూడండి. 89 00:05:05,055 --> 00:05:07,140 వాళ్ళు చెట్లతో పాటు అన్నిటినీ తీయించేస్తున్నారా? 90 00:05:07,724 --> 00:05:08,892 మేము నేల మీద ఈ టైల్స్ వేయాలి 91 00:05:08,892 --> 00:05:11,395 కాబట్టి అన్నిటినీ తీసేయక తప్పదు కదా. 92 00:05:11,395 --> 00:05:13,647 నేల మీద టైల్స్ వేస్తారా? చెట్లు కొట్టేస్తారా? 93 00:05:13,647 --> 00:05:16,400 - వాళ్ళు ఇలా చేయకూడదు. - దురదృష్టవశాత్తు, వాళ్ళు చేయగలరు. 94 00:05:16,400 --> 00:05:19,945 కానీ చెట్లలో నివసించే ఉడతలు, పక్షులు అలాగే రాకూన్ల సంగతి ఏంటి? 95 00:05:19,945 --> 00:05:22,865 అలాగే నేల క్రింద ఉండే పురుగులు, జంవుతుల సంగతి? 96 00:05:22,865 --> 00:05:24,575 ఇలా చేస్తే అవి నేల క్రింద ఇరుక్కుపోతాయి. 97 00:05:24,575 --> 00:05:27,870 తోటను నాశనం చేయడానికి బదులు మనం దానికి పునర్జీవాన్ని ఇవ్వాలి. 98 00:05:27,870 --> 00:05:31,290 అందుకు మనకు సమయం, డబ్బు అలాగే ఆ పని చేయడానికి ఇష్టపడే మనుషులు కావాలి. 99 00:05:32,374 --> 00:05:33,917 ఈ పని చేయడం నాకు కూడా బాధగానే ఉంది. 100 00:05:33,917 --> 00:05:37,796 కానీ బిల్డింగ్ సొసైటీలో ఉన్న మెజారిటీ సభ్యులు తోటను తీసేయడానికే ఓటు వేశారు. 101 00:05:37,796 --> 00:05:39,089 ఇక మనం చేయగలది ఏమీ లేదు. 102 00:05:40,174 --> 00:05:41,258 క్షమించండి. 103 00:05:41,925 --> 00:05:44,052 ఎవరూ మన మాట వినరు, జేన్. 104 00:05:44,052 --> 00:05:45,888 అయితే మనమే వాళ్ళు మన మాట వినేలా చేయాలి. 105 00:05:55,189 --> 00:05:56,565 నేను ఇది నమ్మలేకపోతున్నాను. 106 00:05:57,149 --> 00:05:58,400 మీకు కూడా హలో. 107 00:05:58,984 --> 00:06:00,986 అమ్మా, నేను నీకు ఒక దారుణమైన విషయం చెప్పాలి. 108 00:06:01,612 --> 00:06:02,905 నువ్వు ఏమైనా చేసావా? 109 00:06:03,530 --> 00:06:04,448 ఇంకా లేదు. 110 00:06:04,448 --> 00:06:07,034 కానీ ఇందాకే మన బిల్డింగ్ వారు తోటను తీసేస్తున్నారు అని తెలుసుకున్నాం. 111 00:06:07,034 --> 00:06:10,037 అలాగే మేము ఇంకా పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో ఏం తింటుందో తెలుసుకోలేకపోయాం. 112 00:06:10,621 --> 00:06:12,039 ఆ రెండిటికీ ఏమైనా కనెక్షన్ ఉందా? 113 00:06:12,039 --> 00:06:13,790 ప్రకృతిలో ప్రతిదానికి ఇంకొకదానితో కనెక్షన్ ఉంటుంది. 114 00:06:14,291 --> 00:06:16,877 పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో బొరియలు తవ్వి నేల క్రింద నివసిస్తుంది. 115 00:06:16,877 --> 00:06:19,004 అలాంటప్పుడు పేవ్మెంట్ నిర్మిస్తే నేల క్రింద ఉండే 116 00:06:19,004 --> 00:06:20,756 పురుగులు ఇంకా జంతువులు కిందే ఇరుక్కుపోతాయి. 117 00:06:20,756 --> 00:06:24,176 - అర్థమైంది. కొంచెం. - నాకు అర్థం కాలేదు. 118 00:06:24,176 --> 00:06:26,094 ఇలాంటి పని చేయడానికి ఎవరికైనా ఎలా మనసు వస్తుంది? 119 00:06:28,472 --> 00:06:29,306 జేన్. 120 00:06:29,306 --> 00:06:31,016 ప్రకృతిని నాశనం చేయాలని అనుకునే వ్యక్తి అసలు మనిషేనా? 121 00:06:31,016 --> 00:06:32,309 జేన్. 122 00:06:32,309 --> 00:06:34,937 చెట్లను కొట్టేసి మొక్కల్ని చంపడానికి ఒకరికి మనస్కరిస్తుంది అంటే 123 00:06:34,937 --> 00:06:36,104 నమ్మలేకపోతున్నాను. 124 00:06:36,104 --> 00:06:37,439 వాటికి కూడా ప్రాణం ఉంటుంది కదా. 125 00:06:37,439 --> 00:06:38,774 జేన్. 126 00:06:40,317 --> 00:06:42,569 అమ్మా, నువ్వు చెప్పాలనుకుంటున్నది ఏమైనా ఉందా? 127 00:06:45,781 --> 00:06:48,909 ఆ పాత తోటను బాగు చేసి మెయింటైన్ చేయడానికి డబ్బు కావాలి, 128 00:06:48,909 --> 00:06:51,453 కానీ బిల్డింగ్ దగ్గర అంత బడ్జెట్ లేదు. 129 00:06:51,453 --> 00:06:53,539 ఆ డబ్బును ఇతర విషయాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. 130 00:06:53,539 --> 00:06:55,999 ప్రకృతిని సంరక్షించడం మన బాధ్యత. 131 00:06:55,999 --> 00:07:00,045 అలాగే ఈ బిల్డింగ్ లో ఉంటున్న వారి సంరక్షణను చూసుకోవడం కూడా మన బాధ్యతే. 132 00:07:00,045 --> 00:07:03,048 పైన రూఫ్ లీక్ అవుతోంది. టాయిలెట్లు ఫ్లష్ అవ్వడం లేదు, 133 00:07:03,048 --> 00:07:05,884 పైగా బిల్డింగ్ లో సగం భాగంలో హీటర్ పనిచేయడం మానేస్తోంది. 134 00:07:05,884 --> 00:07:07,845 నువ్వు కూడా తోటను తీసేయడానికే ఓటు వేసావా? 135 00:07:07,845 --> 00:07:10,889 చలికాలం వచ్చేసరికి మనకు హీటింగ్ సదుపాయం కావాలని ఓటు వేశాను. 136 00:07:10,889 --> 00:07:13,517 అమ్మా, తోటలు వాటినవే సంరక్షించుకోలేవు. 137 00:07:13,517 --> 00:07:17,104 పురుగులను తినే వీనస్ ఫ్లైట్రాప్ మొక్కలు ఉంటే తప్ప. 138 00:07:18,313 --> 00:07:21,733 కానీ ఆ మొక్కలు మన ప్రదేశంలో పెరగకపోవచ్చు, కాబట్టి... 139 00:07:22,901 --> 00:07:23,902 థాంక్స్, డేవిడ్. 140 00:07:26,071 --> 00:07:28,407 నేను బాత్ రూమ్ కి వెళ్తున్నాను. 141 00:07:32,536 --> 00:07:34,621 తోటను తీసేయాలని ఓటు వేసిన వారు ప్రకృతి అంటే 142 00:07:34,621 --> 00:07:36,748 ఇష్టం లేకపోవడం వల్ల అలా చేయలేదు. 143 00:07:36,748 --> 00:07:39,334 కష్టమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు కాబట్టి అలా చేశారు. 144 00:07:40,127 --> 00:07:43,380 మేము అన్ని ఇతర విషయాల కోసం కొంచెం డబ్బు ఖర్చు చేయడమో లేక 145 00:07:43,380 --> 00:07:45,549 ఒకదాని మీదే అంతా ఖర్చు చేయడమో చేయాల్సి వచ్చింది. 146 00:07:47,384 --> 00:07:49,469 నేను చెప్పేది నువ్వు ఇక వినడం లేదు అని నాకు ఎందుకు అనిపిస్తోంది? 147 00:07:49,469 --> 00:07:50,554 చిన్నగా. 148 00:08:00,147 --> 00:08:03,150 డేవిడ్, పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో నేల కింద రాళ్ళ మధ్య చకచకా వెళ్లిపోవడానికి కారణం 149 00:08:03,150 --> 00:08:05,402 అది మన డిగ్గింగ్ మెషిన్ కన్నా చిన్నది కావడమే కదా? 150 00:08:05,402 --> 00:08:06,320 అయితే? 151 00:08:06,904 --> 00:08:10,449 అయితే మనం కూడా ఆ రాళ్ళ మధ్య పింక్ ఫెయిరీలా వేగంగా కదలాలి అంటే 152 00:08:10,449 --> 00:08:12,659 మనం వాటికన్నా ఇంకా చిన్నగా మారితే చాలు. 153 00:08:12,659 --> 00:08:14,703 మరి తోటను కాపాడటం సంగతి? 154 00:08:16,079 --> 00:08:18,874 ఆ పని చేయడం ఎలాగో నాకు ఇంకా తెలీదు. 155 00:08:19,917 --> 00:08:22,211 కానీ మనం పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోతో సమానంగా వెళ్లగలిగితే 156 00:08:22,211 --> 00:08:23,337 అది ఏం తింటుందో కనిపెట్టగలం. 157 00:08:23,337 --> 00:08:25,422 అప్పుడు నేల కింద బ్రతికే జంతువులకు సాయం చేయడానికి 158 00:08:25,422 --> 00:08:26,924 ఆ సమాచారం మనకు పనికొస్తుందేమో. 159 00:08:28,550 --> 00:08:29,676 ఆ శబ్దం ఏంటి? 160 00:08:32,386 --> 00:08:33,889 మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. 161 00:08:45,400 --> 00:08:47,236 మనం ఆ పెద్ద రాయిని దాటుకుని వెళ్ళాలి. 162 00:08:47,236 --> 00:08:48,612 అలాగే. సిద్ధంగా ఉండు. 163 00:08:48,612 --> 00:08:51,281 మనం పింక్ ఫెయిరీకన్నా చిన్నగా మారబోతున్నాం. 164 00:08:57,829 --> 00:09:00,040 ఈ సైజులో నేల కింద ప్రయాణించడం సులభం. 165 00:09:00,040 --> 00:09:02,584 మనం ఆ పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోని త్వరలో కనిపెట్టాలని నా ఆశ. 166 00:09:10,968 --> 00:09:12,678 మన మెయిన్ ఇంజిన్ కి ఉన్న శక్తి మొత్తాన్ని కోల్పోయాం. 167 00:09:12,678 --> 00:09:15,097 "మనం ఇరుక్కుపోయాం" అని ఫ్యాన్సీగా చెప్తున్నావా? 168 00:09:15,973 --> 00:09:17,015 మనం ఇరుక్కుపోయాం. 169 00:09:18,308 --> 00:09:19,309 ఆ శబ్దం విన్నావా? 170 00:09:19,309 --> 00:09:21,728 ఆ భయంకరమైన గీస్తున్న శబ్దమా? 171 00:09:21,728 --> 00:09:23,438 అవును, వినిపించింది. 172 00:09:23,438 --> 00:09:25,482 అది పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో చేస్తున్న శబ్దం అనుకుంటున్నావా? 173 00:09:26,233 --> 00:09:27,985 కొన్ని బటన్లు నొక్కే సమయమైంది. 174 00:09:27,985 --> 00:09:30,153 బీప్, బూప్, బీప్, బూప్, బీప్... 175 00:09:31,488 --> 00:09:32,447 డేవిడ్, చూడు. 176 00:09:34,533 --> 00:09:36,076 అది ఒక చీమ. 177 00:09:36,076 --> 00:09:38,370 ఒక చాలా పెద్ద చీమ. 178 00:09:38,370 --> 00:09:42,374 కానీ ఒక్క చీమను మనం హ్యాండిల్ చేయగలం. అవును కదా, జేన్? 179 00:09:44,334 --> 00:09:46,295 ఎక్కడైనా ఒక చీమ ఉందంటే అక్కడ ఇంకా చాలా ఉంటాయి. 180 00:09:51,008 --> 00:09:53,135 బహుశా మనం మరీ చిన్నగా మారినట్టు ఉన్నాం ఏమో కదా? 181 00:10:01,977 --> 00:10:03,937 - నువ్వు బాగానే ఉన్నావా? - చీమలు అంత బలంగా ఉంటాయని నాకు తెలీదు. 182 00:10:03,937 --> 00:10:05,814 చీమలు చిన్నగానే ఉండొచ్చు, కానీ అవి చాలా బలమైనవి. 183 00:10:05,814 --> 00:10:08,483 అవి వాటి శరీర బరువుకు పది రెట్లు ఎక్కువ మోయగలవు. 184 00:10:08,483 --> 00:10:11,111 అలాగే అవి కలిసి పనిచేసినప్పుడు ఇంకా బలంగా ఉంటాయి. 185 00:10:11,111 --> 00:10:12,571 అది నిజమే. 186 00:10:12,571 --> 00:10:14,740 మనం ఇంకా పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోని కనిపెట్టలేకపోయాం కాబట్టి, 187 00:10:14,740 --> 00:10:17,618 చీమలు చేసే పని చేయడం ద్వారా మనం తోటను రక్షించగలం ఏమో చూడాలి. 188 00:10:18,202 --> 00:10:19,328 వర్కర్లను కొరుకుదామా? 189 00:10:19,328 --> 00:10:22,164 అలా కాదు. పదా. మనం బయటకు వెళ్ళాలి. 190 00:10:27,294 --> 00:10:32,216 హేయ్, వీటిలో కొన్నిటిని నేను నా అపార్ట్మెంట్ లో నాటుదాం అనుకుంటున్నాను. 191 00:10:32,216 --> 00:10:35,928 థాంక్స్. అలాగే చాలా మంది ఈ తోట వద్దు అని ఓటు వేశారని నువ్వు చెప్పావు నిజమే, 192 00:10:35,928 --> 00:10:37,930 కానీ దీన్ని తీయించడం ఇష్టం లేని వారు కూడా చాలా మంది ఉండి ఉంటారు. 193 00:10:37,930 --> 00:10:39,139 అవును, నాకు ఇష్టం లేదు. 194 00:10:39,139 --> 00:10:41,099 జేన్ కి ఇష్టం లేదు. గ్రేబియర్డ్ కి ఇష్టం లేదు. 195 00:10:41,975 --> 00:10:43,393 ఇది సరిపోయి ఉంటే బాగుండు అని నాకు కూడా ఉంది. 196 00:10:43,393 --> 00:10:45,604 అలాగే బొమ్మల ఓట్లు కూడా లెక్కించినా బాగుండు. 197 00:10:45,604 --> 00:10:48,190 ఈ తోటను తీసేయమన్న వారికి ఇక్కడ బ్రతికే జంతువుల పరిస్థితి 198 00:10:48,190 --> 00:10:51,276 ఏమవుతుందో తెలిస్తే, వాళ్ళు ఖచ్చితంగా వారి మనసులు మార్చుకుంటారు. 199 00:10:51,902 --> 00:10:52,903 చూడు. 200 00:10:53,862 --> 00:10:57,699 "మనం ఒక అవకాశం ఇస్తే ప్రకృతి తప్పక గెలుస్తుంది." 201 00:10:57,699 --> 00:10:59,034 అలా అని జేన్ గుడ్ఆల్ చెప్పారు. 202 00:10:59,701 --> 00:11:02,454 అన్నిసా, ఈ తోటకు మనం ఒక అవకాశం ఎలా ఇవ్వగలం? 203 00:11:02,454 --> 00:11:04,540 అవును. మనం చేయగలది ఏదైనా ఉండి ఉంటుంది. 204 00:11:05,582 --> 00:11:07,417 మీరు ఒక పిటీషన్ సమర్పించవచ్చు. 205 00:11:07,417 --> 00:11:10,087 నాకు తెలుసు. ఒక పిటీషన్. అవును. 206 00:11:10,754 --> 00:11:11,755 పిటీషన్ అంటే ఏంటి? 207 00:11:12,714 --> 00:11:14,758 దేన్నైనా మార్చమని ఒక అభ్యర్థనను పెట్టడమే పిటీషన్. 208 00:11:15,509 --> 00:11:18,262 దాని మీద మీరు జనాన్ని సంతకం చేయమని అడగాలి, ఎంత ఎక్కువ మంది సంతకాలు సేకరించగలిగితే 209 00:11:18,262 --> 00:11:19,888 ఆ పిటిషన్ కి అంత బలం ఉంటుంది. 210 00:11:20,472 --> 00:11:22,683 మనకు గనుక తోటను కాపాడమని సొసైటీ సభ్యలలో 211 00:11:22,683 --> 00:11:24,434 సగం మంది సంతకాలు అందినా, 212 00:11:24,434 --> 00:11:26,395 - అప్పుడు నేను... - ఇదంతా ఆపుతావా? 213 00:11:27,312 --> 00:11:30,232 అవును, కానీ జనాల మనసులు మార్చడం... 214 00:11:30,232 --> 00:11:31,650 మేము అందరి సంతకాలు సేకరిస్తాం. 215 00:11:31,650 --> 00:11:33,193 ...సులభం కాదు. 216 00:11:33,193 --> 00:11:36,113 అంతేగాక, తోటను సంరక్షించడానికి ముందుకువచ్చే వారు మనకు కావాలి. 217 00:11:36,113 --> 00:11:39,074 - ఆ పని చేయడానికి మన దగ్గర ఇంకా డబ్బు లేదు కూడా. - మేము ఏదొక పరిష్కారం కనిపెడతాం. 218 00:11:40,909 --> 00:11:41,910 త్వరగా. 219 00:11:51,044 --> 00:11:52,254 హాయ్, మిస్టర్ జిన్. 220 00:11:52,254 --> 00:11:54,423 మా తోట పిటిషన్ గురించి మీతో కొంచెం మాట్లాడొచ్చా? 221 00:11:54,423 --> 00:11:55,841 {\an8}తోటను కాపాడండి 222 00:11:56,633 --> 00:12:00,053 మనం కొంచెం కష్టపడితే మన తోటను కాపాడొచ్చు. 223 00:12:02,514 --> 00:12:04,349 తోటలో మూత్రం పోయకూడదు, పగ్స్లీ. 224 00:12:07,144 --> 00:12:10,439 అయితే పాపం ఆ జంతువులన్నీ కింద ఇరుక్కుపోతాయా? 225 00:12:10,439 --> 00:12:11,356 పురుగులు కూడా. 226 00:12:11,356 --> 00:12:13,317 ఓహ్, నేను పురుగుల గురించి పెద్దగా లెక్క చేయను. 227 00:12:13,317 --> 00:12:14,860 ఎక్కువగా జంతువులే నష్టపోతాయి. 228 00:12:14,860 --> 00:12:18,030 సరే, జంతువుల కోసం అంటే, తప్పకుండా చేస్తా. సందేహమే లేదు. 229 00:12:23,368 --> 00:12:25,037 చింతించకండి. మీరు పాడాల్సిన పనిలేదు. 230 00:12:25,037 --> 00:12:28,373 మాకు మీ సంతకం కావాలి అంతే, అప్పుడు మేము తోటను కాపాడగలం. 231 00:12:28,373 --> 00:12:30,000 అలాగే పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోలను కూడా. 232 00:12:30,918 --> 00:12:32,794 ఒకసారి ఆలోచించండి. మీరే గనుక నేల కింద 233 00:12:32,794 --> 00:12:35,255 హాయిగా గడుపుతుండగా ఉన్నట్టుండి అకస్మాత్తుగా, 234 00:12:35,255 --> 00:12:39,259 ఒక నిర్మాణ బృందం మీ ప్రదేశంలో గోతులు తవ్వి అంతా నాశనం చేసింది అనుకోండి. 235 00:12:40,010 --> 00:12:41,970 "వద్దు! కాపాడండి!" 236 00:12:42,471 --> 00:12:44,473 మనం ఒక అవకాశం ఇస్తే ప్రకృతి ఖచ్చితంగా గెలుస్తుంది. 237 00:12:44,473 --> 00:12:46,892 వావ్. ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే బాగుండేది. 238 00:12:46,892 --> 00:12:49,311 ఖచ్చితంగా. తోటను కాపాడటం మాకు ఇష్టమే. 239 00:12:51,188 --> 00:12:53,524 - మీకు తోట పని చేయడం నచ్చుతుందా? - అలాగే వాలంటీర్ పని? 240 00:12:55,984 --> 00:12:57,569 - సరే. అలాగే. - నాకు ఇష్టం. అవును. 241 00:13:00,531 --> 00:13:01,865 హలో, మిస్... 242 00:13:02,574 --> 00:13:04,576 - గార్సియా. - మిస్ గార్సియా. 243 00:13:04,576 --> 00:13:06,495 నా పేరు జేన్, నేను మన తోట 244 00:13:06,495 --> 00:13:08,580 నాశనం కాకుండా ఉండటానికి సంతకాలు సేకరిస్తున్నాను. 245 00:13:08,580 --> 00:13:12,125 అవునా? కొత్త దాన్ని నాటి దాన్ని మెయింటైన్ చేయడానికి మీ దగ్గర డబ్బు ఉందా? 246 00:13:12,125 --> 00:13:14,419 ఆ ప్రశ్న అడిగినందుకు సంతోషం. మేము పెద్దగా సంరక్షణ అవసరం 247 00:13:14,419 --> 00:13:16,338 లేని నేచురల్ తోటను నాటబోతున్నాం. 248 00:13:16,338 --> 00:13:19,550 మనం అక్కడ గడ్డిని పెరగడానికి వదిలేయొచ్చు, పైగా కలుపు మొక్కల తలనొప్పి ఉండదు. 249 00:13:19,550 --> 00:13:22,302 పైగా దాన్ని చూసుకోవడానికి ముందుకొచ్చిన వాలంటీర్ల లిస్టు కూడా మా దగ్గర ఉంది. 250 00:13:23,220 --> 00:13:25,430 అయితే, మీరు మా పిటీషన్ మీద సంతకం చేస్తారా, ప్లీజ్? 251 00:13:27,015 --> 00:13:28,225 తప్పకుండా. 252 00:13:30,102 --> 00:13:31,228 అలాగే వాలంటీర్ కూడా చేస్తారా? 253 00:13:31,228 --> 00:13:32,646 లేదు, చేయను. 254 00:13:34,022 --> 00:13:36,483 కానీ సాయం చేయటానికి ఇష్టపడే మంచి కూతురు నాకు ఉంది. 255 00:13:38,902 --> 00:13:40,487 ఆగండి! ఆపండి! 256 00:13:41,280 --> 00:13:42,739 అన్నిసా, మేము సేకరించాం! 257 00:13:42,739 --> 00:13:44,157 ఏం సేకరించారు? 258 00:13:44,157 --> 00:13:47,160 - పిటిషన్ కోసం సంతకాలు. - మా అందరికీ తోటను ఉంచాలనే ఉంది, 259 00:13:47,160 --> 00:13:48,996 అలాగే గార్డెన్ వాలంటీర్లు దాన్ని చూసుకుంటారు. 260 00:13:51,456 --> 00:13:53,500 మీకు ఇంకొక్క సంతకం కావాలి. 261 00:13:58,505 --> 00:14:00,924 అంతే. ఇప్పుడు అందరి సంతకాలు అందినట్టే. 262 00:14:02,092 --> 00:14:03,969 మేము తోటను ఉంచుకుంటున్నాం. 263 00:14:05,304 --> 00:14:06,513 నమ్మలేకపోతున్నా. 264 00:14:07,014 --> 00:14:08,390 మిస్టర్ జిన్ సంతకం కూడా సంపాదించారా? 265 00:14:08,390 --> 00:14:10,642 ఆయన గార్డెన్ కమిటీకి సాయం చేస్తానని కూడా చెప్పారు. 266 00:14:11,143 --> 00:14:13,729 దాని సంరక్షణ మేము చూసుకుంటాం, అందరం. 267 00:14:15,105 --> 00:14:16,106 ఒట్టు. 268 00:14:16,690 --> 00:14:17,816 భలే పని చేశారు, పిల్లలూ. 269 00:14:19,276 --> 00:14:22,738 తెలుసా, నేను ఇంత వరకు నేల క్రింద బ్రతికే వాటి గురించి ఆలోచించలేదు. 270 00:14:23,405 --> 00:14:25,365 వాటికి కూడా మనలాగే ఇల్లు కావాలేమో కదా? 271 00:14:27,784 --> 00:14:30,370 పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోకి కూడా అదే కావాలి. ఒక ఇల్లు. 272 00:14:30,370 --> 00:14:32,873 రోడ్లు అలాగే కట్టడాలకు దూరంగా ఉండే ఒక ఇల్లు. 273 00:14:32,873 --> 00:14:35,542 దాన్ని గనుక మనం కనిపెడితే, బహుశా అది ఏం తింటుందో తెలుసుకోగలం ఏమో. 274 00:14:35,542 --> 00:14:37,669 - ఇక మన మిషన్ ని తిరిగి మొదలెట్టే టైమ్ అయింది. - పదా. 275 00:14:47,137 --> 00:14:50,390 మనం ఈ చీమలను వదిలించుకుని, పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోని కనిపెట్టాలి అంటే, 276 00:14:50,390 --> 00:14:52,434 మనం శక్తిని మెయిన్ ఇంజిన్లకు పంపాలి. 277 00:14:52,434 --> 00:14:53,727 అలాగే, కెప్టెన్. 278 00:14:53,727 --> 00:14:56,438 ఇంజిన్లకు 75% శక్తి అందుతుంది. 279 00:14:57,439 --> 00:15:00,609 ఎనభై. వంద శాతం. సరే. 280 00:15:00,609 --> 00:15:02,319 ఇక వెళ్లొచ్చు. కానివ్వు. 281 00:15:08,158 --> 00:15:09,743 మన ముందు ఏదో వస్తోంది, జేన్. 282 00:15:09,743 --> 00:15:11,161 పూర్తి వేగంతో ముందుకు వెళదాం. 283 00:15:21,797 --> 00:15:23,632 వెనక్కి! పూర్తి వేగంతో వెనక్కి పదా. 284 00:15:23,632 --> 00:15:27,803 - మరిన్ని చీమలు. చాలా చీమలు వచ్చాయి. - మనం ఒక చీమల పుట్ట మధ్యలో ఉన్నాం. 285 00:15:29,972 --> 00:15:31,139 వెనక్కి, వెనక్కి పదా! 286 00:15:34,434 --> 00:15:35,936 మన వెనుక ఇంకొక రాయి ఉంది. 287 00:15:35,936 --> 00:15:37,354 అలాగే ముందేమో కోపంగా ఉన్న చీమలు ఉన్నాయి. 288 00:15:40,148 --> 00:15:41,441 మనం ఇరుక్కుపోయాం. 289 00:15:44,194 --> 00:15:46,029 అది పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో. 290 00:15:50,450 --> 00:15:52,953 అది మనల్ని కాపాడింది, పైగా అది చీమల్ని తింటుంది. 291 00:15:53,954 --> 00:15:55,497 మన పని పూర్తి అయినట్టే. 292 00:15:55,497 --> 00:15:58,166 ఇలాంటి విషయాన్ని చూడటం ఎంత అరుదో తెలుసా? 293 00:15:58,166 --> 00:16:00,043 నిజమైన ఫెయిరీని చూసినంత అరుదా? 294 00:16:01,044 --> 00:16:02,838 బహుశా అంత అరుదు కాకపోవచ్చు. 295 00:16:04,423 --> 00:16:05,841 అది ఎందుకు ఆగింది? 296 00:16:05,841 --> 00:16:07,593 ఎందుకంటే అది ఇంటికి వచ్చింది కాబట్టి. 297 00:16:08,343 --> 00:16:09,511 చెప్పేది విను, డేవిడ్. 298 00:16:09,511 --> 00:16:12,681 కార్లు లేవు. రోడ్ లేదు. నిర్మాణాలు లేవు. 299 00:16:12,681 --> 00:16:13,849 ఏమీ లేదు. 300 00:16:13,849 --> 00:16:17,227 కానీ అది దాని ఆహారానికి దగ్గరగా ఉంది, చీమలు. 301 00:16:17,227 --> 00:16:19,479 ఇప్పుడు మనకు పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోలు ఆహార ప్రదేశానికి దగ్గర 302 00:16:19,479 --> 00:16:21,815 నివసిస్తాయని తెలిసింది కాబట్టి, మనం వాటి గురించి ఇంకా తెలుసుకోగలం. 303 00:16:21,815 --> 00:16:24,151 - అలాగే కాపాడగలం. - అవును. 304 00:16:29,323 --> 00:16:30,407 మనం దాన్ని నిద్రపోనివ్వాలి. 305 00:16:33,327 --> 00:16:34,536 గుడ్ నైట్. 306 00:16:43,462 --> 00:16:49,384 తెలుసా, మనం ప్రకృతికి ఇంకొక అవకాశం ఇవ్వడం వల్ల నా మనసు పులకరిస్తోంది. 307 00:16:49,384 --> 00:16:51,470 నీ మాటల చమత్కారం నాకు అర్థమైంది. 308 00:16:52,888 --> 00:16:54,014 ఏమైంది, జేన్? 309 00:16:54,723 --> 00:16:56,058 తోటను కాపాడటానికి సాయం చేసినందుకు సంతోషంగా ఉంది 310 00:16:56,058 --> 00:16:58,227 కానీ పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోని తలచుకుంటే నాకు భయంగా ఉంది. 311 00:16:58,227 --> 00:17:02,064 ఏం... పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో అంటే ఏంటి? ముందెప్పుడూ ఆ పేరు వినలేదు. 312 00:17:02,064 --> 00:17:03,565 చాలా మందికి దాని గురించి తెలీదు. 313 00:17:03,565 --> 00:17:06,609 అది వెనుక భాగంలో ఒక పింక్ సూషి ఉండి, ఒక హామ్స్టర్ లాగ కనిపించే అందమైన ఆర్మడిల్లో. 314 00:17:06,609 --> 00:17:08,529 అది చీమలను తిని నేల కింద సొరంగాలు చేస్తుంది. 315 00:17:09,029 --> 00:17:10,364 వాటి జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. 316 00:17:10,364 --> 00:17:12,366 అంటే, మార్పు కోసం మీరు పిటిషన్లను వాడొచ్చు, 317 00:17:12,366 --> 00:17:14,451 కానీ జనంతో ఈ విషయం గురించి మాట్లాడటం కూడా సాయం చేయొచ్చు. 318 00:17:15,243 --> 00:17:17,954 ఇది కూడా ఈ తోట కింద ఉండే పురుగులు అలాగే జంతువుల విషయం లాంటిదే, 319 00:17:17,954 --> 00:17:21,040 జనం వాటి గురించి మాట్లాడకపోతే, వాటికి మన సాయం అవసరం అని జనానికి తెలీదు. 320 00:17:21,541 --> 00:17:22,835 నువ్వు అన్నది నిజం, అన్నిసా. 321 00:17:23,417 --> 00:17:25,838 డేవిడ్, మన పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో మిషన్ ఇంకా పూర్తి కాలేదు. 322 00:17:25,838 --> 00:17:27,256 అవ్వలేదా? 323 00:17:27,256 --> 00:17:29,299 మేము కాసేపటిలో వచ్చి తోట పనిలో సాయం చేస్తాం, అన్నిసా. 324 00:17:29,299 --> 00:17:30,592 పదా. 325 00:17:31,426 --> 00:17:32,427 బై. 326 00:17:32,427 --> 00:17:33,512 బై! 327 00:17:38,934 --> 00:17:39,977 వస్తున్నాను. 328 00:17:43,105 --> 00:17:45,440 మనం ప్రకృతికి ఒక అవకాశం ఇస్తే అది గెలుస్తుందని మీరు ఎప్పుడైనా విన్నారా? 329 00:17:46,400 --> 00:17:48,068 {\an8}పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో కూడా అలాగే గెలవగలదు. 330 00:17:48,068 --> 00:17:49,194 {\an8}క్లమిఫోరస్ ట్రన్కైటస్ 331 00:17:49,194 --> 00:17:51,405 ఇది మన సహాయం కావాల్సిన అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఒక జంతుజాతి. 332 00:17:51,989 --> 00:17:53,532 సరే, మీకు నేను ఏ విధంగా సాయం చేయగలను? 333 00:17:58,745 --> 00:18:00,664 ఆర్మడిల్లోలను కాపాడటానికి సాయం చేయండి. 334 00:18:04,001 --> 00:18:06,962 అమ్మా, డేవిడ్ కి తలుపు తీస్తావా? వాడు రావడం లేట్ అయింది. 335 00:18:06,962 --> 00:18:08,046 దేనికి? 336 00:18:08,046 --> 00:18:11,049 - మారియెల్ల సూపరీనతో మా కాల్ కి. - అది ఎవరు? 337 00:18:11,049 --> 00:18:12,801 పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో ఎక్స్పర్ట్. 338 00:18:12,801 --> 00:18:15,220 ఆమె అర్జెంటీనాలో ఉంటుంది, ఆమె మాకు ఇప్పుడు కాల్ చేస్తుంది. 339 00:18:15,220 --> 00:18:17,472 సరే, వెంటనే వెళ్తున్నా. 340 00:18:18,223 --> 00:18:19,308 హాయ్, మారియెల్ల. 341 00:18:19,308 --> 00:18:20,392 హాయ్, జేన్. 342 00:18:21,310 --> 00:18:22,436 డేవిడ్ ఎక్కడ? 343 00:18:22,436 --> 00:18:24,938 మేము ఇప్పుడే మా పొరుగింటి వారికి పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో గురించి చెప్పడం ముగించాం. 344 00:18:26,940 --> 00:18:29,735 క్షమించు, లేట్ అయింది. మాకు చాలా మంది పొరుగింటి వారు ఉన్నారు. 345 00:18:30,235 --> 00:18:33,113 మేము ఒక దాన్ని భూమి కింద ట్రాక్ చేసే మిషన్ చేసినప్పుడు చాలా మంది 346 00:18:33,113 --> 00:18:35,115 పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోల గురించి ఎప్పుడూ వినలేదని తెలిసింది. 347 00:18:35,115 --> 00:18:37,993 వినడానికి పెద్ద సాహసం చేసినట్టు ఉన్నారు. మీరు పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోని కనుగొన్నారా? 348 00:18:37,993 --> 00:18:39,870 కనుగొన్నాం. అది చాలా అందంగా ఉంది. 349 00:18:39,870 --> 00:18:43,498 అంటే, అది తింటున్న చీమలకు అలా అనిపించలేదు, కానీ నాకు, డేవిడ్ కి అది చాలా నచ్చింది. 350 00:18:43,498 --> 00:18:45,792 - భలే ముద్దుగా ఉంది. - అది ఇలా కనిపించిందా? 351 00:18:45,792 --> 00:18:47,294 అచ్చం అలాగే కనిపించింది. 352 00:18:47,294 --> 00:18:50,005 కానీ పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోల గురించి చాలా మందికి ఎందుకు తెలీదు? 353 00:18:50,005 --> 00:18:51,381 సరే, నేను మీకు ఒక మ్యాప్ చూపిస్తాను. 354 00:18:51,381 --> 00:18:54,468 అవి అర్జెంటీనాలో మాత్రమే బ్రతుకుతాయి, పైగా నేల కింద ఉంటాయి, 355 00:18:54,468 --> 00:18:57,513 కాబట్టి వాటిని కనుగొని అధ్యాయనం చేయడం చాలా కష్టం. 356 00:18:57,513 --> 00:18:59,890 అలాగే పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోలకు ఆ పేరు ఎలా వచ్చింది? 357 00:18:59,890 --> 00:19:02,851 ఎందుకంటే, నిజం చెప్పడానికి అవి ఫెయిరీల్లా లేవు కదా. 358 00:19:03,393 --> 00:19:04,603 రెక్కలు లేవు. 359 00:19:04,603 --> 00:19:08,815 పింక్ ఫెయిరీ అనే పేరు "ఫెయిర్" అనే పదం నుండి వచ్చింది, దానికి అర్థం చిన్నది లేదా బుల్లిది అని, 360 00:19:08,815 --> 00:19:11,193 అలాగే దాని గుల్ల రంగు వల్ల "పింక్" అంటారు. 361 00:19:11,193 --> 00:19:12,402 అవి పింక్ రంగులో ఎందుకు ఉంటాయి? 362 00:19:12,402 --> 00:19:15,405 వాటి గుల్ల పల్చని పింక్ రంగులో ఉండటానికి కారణం 363 00:19:15,405 --> 00:19:18,867 వేడిగా ఉన్నప్పుడు వాటి రక్తం చల్లబడటానికి గుల్ల దగ్గరకు వెళ్తుంది, 364 00:19:18,867 --> 00:19:22,663 అక్కడి నుండి ఆ రక్తం గుల్లలోకి వెళ్తుంది కాబట్టి పింక్ రంగులో ఉంటుంది. 365 00:19:22,663 --> 00:19:24,039 అది భలే విషయం. 366 00:19:24,039 --> 00:19:25,332 అలాగే గొప్ప విషయం కూడా. 367 00:19:26,083 --> 00:19:27,501 అర్థమైందా? 368 00:19:28,794 --> 00:19:30,128 వాటి శరీరం ఎలా వేడెక్కుతుంది? 369 00:19:30,128 --> 00:19:32,923 అవి సొరంగాలు తవ్వేటప్పుడు, వెనుక కాళ్ళ మీద నిలబడి 370 00:19:32,923 --> 00:19:35,801 వాటి తోకల చివరి భాగాన్ని అయిదవ కాలులాగ వాడతాయి, 371 00:19:35,801 --> 00:19:39,304 అలా అయితే ఏటవాలుగా నిలబడి మరింత బలంగా తవ్వగలుగుతాయి. 372 00:19:39,304 --> 00:19:42,140 అంత చిన్న జీవి అలాంటి పని చేయగలదు అంటే గొప్ప విషయం. 373 00:19:42,140 --> 00:19:46,061 అంటే, దాని వెనుక భాగంలో ఉండే ప్లేట్ కూడా తవ్వుతున్నప్పుడు ఒక పనికి ఉపయోగపడుతుంది. 374 00:19:46,687 --> 00:19:47,813 మీకు చూపిస్తాను ఆగండి. 375 00:19:47,813 --> 00:19:49,273 అది ఎలా తవ్వుతుందో చూస్తున్నారా? 376 00:19:49,273 --> 00:19:53,026 దాని వెనుక ప్లేట్ ని వాడి ఇసుకను వెనక్కి తోస్తుంది. 377 00:19:53,026 --> 00:19:55,279 కారణంగా దాని ముందు స్థలం ఏర్పడుతుంది. 378 00:19:55,279 --> 00:19:57,531 వావ్. నా వెనుక భాగంతో నేను అలా ఏం చేయలేను. 379 00:19:58,740 --> 00:19:59,992 మీకు ఆర్మడిల్లోలు అంటే మొదటి నుండీ ఇష్టమా? 380 00:19:59,992 --> 00:20:02,369 నాకు 18 ఏళ్ల వయసులో మొదటిసారి ఆర్మడిల్లోని చూసా, 381 00:20:02,369 --> 00:20:04,496 అప్పటికి అలాంటి జంతువులు ఉంటాయని కూడా నాకు తెలీదు. 382 00:20:04,496 --> 00:20:08,375 ముప్పై ఏళ్ల తర్వాత, నేను ఇంకా ఆర్మడిల్లోల మీద రీసెర్చ్ చేస్తున్నాను, 383 00:20:08,375 --> 00:20:10,377 ఇప్పుడు నా జీవితాన్ని వాటికి అంకితం చేశా. 384 00:20:10,377 --> 00:20:12,504 అది చాలా పెద్దగా ఉంది. 385 00:20:12,504 --> 00:20:13,881 ఆర్మడిల్లోలు భలే ఉన్నాయి. 386 00:20:13,881 --> 00:20:16,383 చివరికి అన్నిటికంటే చిన్నగా, వింతగా ఉండే జంతువును కూడా 387 00:20:16,383 --> 00:20:17,926 మనం అధ్యాయనం చేయడం ముఖ్యం. 388 00:20:17,926 --> 00:20:20,137 అవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి, కాబట్టి వాటిని బాధిస్తున్న విషయాలలో 389 00:20:20,137 --> 00:20:21,763 వాటికి మన సాయం కావాలి. 390 00:20:21,763 --> 00:20:23,974 పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోలకు నష్టం కలిగిస్తున్నది ఏంటి? 391 00:20:23,974 --> 00:20:27,060 ముందుగా, జనం వాటిని పెంచుకోవడం కోసం పట్టుకుంటుంటారు. 392 00:20:27,060 --> 00:20:32,065 కానీ వాతావరణ మార్పు కూడా ఇంకొక సమస్య, ఆ కారణంగా వాటి నివాస ప్రాంతాలు కనుమరుగవుతున్నాయి. 393 00:20:32,065 --> 00:20:35,319 వర్షం ఎక్కువగా పడితే, వాటి సొరంగాలు నీళ్లతో నిండిపోతాయి. 394 00:20:35,319 --> 00:20:36,904 వాటికి మనం ఎలా సాయపడగలం? 395 00:20:36,904 --> 00:20:39,281 ప్రపంచ వ్యాప్తంగా జరిగే వాటిని అలోచించి స్థానికంగా మీ అలవాట్లను మార్చుకోవాలి. 396 00:20:39,281 --> 00:20:42,868 మన చుట్టూ మనకు ఏమాత్రం తెలీని చిన్ని 397 00:20:42,868 --> 00:20:48,081 జీవులు చాలా బ్రతుకుతూ ఉండొచ్చు, కాబట్టి బయటకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి, 398 00:20:48,081 --> 00:20:53,545 చిన్ని జీవులను వెతికి, వాటిని గమనిస్తూ ఎంజాయ్ చేయండి. 399 00:20:53,545 --> 00:20:54,880 వాటిని ఇంటికి తీసుకెళ్లొద్దు. 400 00:20:54,880 --> 00:20:57,341 అడవి జంతువులను పెంపుడు జంతువులుగా అస్సలు ఉంచకూడదు. 401 00:20:57,341 --> 00:20:59,468 మేము ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేస్తాం. 402 00:20:59,468 --> 00:21:02,137 తప్పకుండ. అవి ఎప్పటికీ బ్రతికే ఉండాలని నా కోరిక. 403 00:21:02,137 --> 00:21:05,516 మాతో పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోల గురించి మాట్లాడినందుకు థాంక్స్, మారియెల్ల. 404 00:21:05,516 --> 00:21:06,683 థాంక్స్. 405 00:21:06,683 --> 00:21:11,146 అలాగే గుర్తుంచుకోండి, వాటిని మీ మనసులో పెట్టుకుని, అడవిలో వదిలేయండి. 406 00:21:11,730 --> 00:21:14,691 - బై-బై! - బై, మారియెల్ల! 407 00:21:29,498 --> 00:21:31,500 ఆగు, అది చీమా? 408 00:21:31,500 --> 00:21:32,960 అవి మనల్ని కనిపెట్టేశాయి! 409 00:21:32,960 --> 00:21:34,336 త్వరగా. డిగ్గింగ్ మెషిన్ లోకి ఎక్కు. 410 00:22:15,460 --> 00:22:17,462 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్