1 00:00:51,301 --> 00:00:54,346 ప్రపంచ వాతావరణ మార్పు +1.80 డిగ్రీల సెల్సియస్ 2 00:00:55,722 --> 00:00:59,226 ఈ శతాబ్దంలో అంతరించిపోయిన జీవరాశులు +411,227 3 00:01:21,331 --> 00:01:23,333 ముగింపు గురించి చెప్పు. 4 00:01:26,920 --> 00:01:28,297 ముగింపా? 5 00:01:29,339 --> 00:01:31,717 వృత్తం ఎక్కడ ముగుస్తుంది? 6 00:01:33,760 --> 00:01:39,183 అది నిరంతరం అప్పుడే ముగుస్తుంది, ఇంకా అప్పుడే మొదలవుతుంది. 7 00:01:42,352 --> 00:01:47,816 ఈ ప్రపంచం అవకాశం ఇచ్చినంత కాలం మనం జీవిస్తుంటాం ఇంకా మరణిస్తుంటాం. 8 00:01:50,903 --> 00:01:53,405 రోజులు మన మీదికి వస్తుంటాయి, 9 00:01:55,157 --> 00:01:57,534 తరువాత గతించిపోతుంటాయి. 10 00:02:00,078 --> 00:02:04,333 మనం అంతరించిపోయే వరకూ వర్తమానం భవిష్యత్తుగా మారుతూనే ఉంటుంది. 11 00:02:05,250 --> 00:02:07,503 మనం తీసుకున్నదంతా తిరిగి పొందుతుంది. 12 00:02:12,007 --> 00:02:14,468 నువ్వు తెలుసుకోవాలి అనుకున్నది ఇదేనా? 13 00:02:15,594 --> 00:02:18,764 నేను అన్ని విషయాలు తెలుసుకోవాలి. 14 00:02:26,438 --> 00:02:27,731 హేయ్, టైగర్. 15 00:02:33,362 --> 00:02:35,155 టీవీ ఆన్ చేసి నిద్రపోయావు. 16 00:02:36,073 --> 00:02:41,912 అమ్మమ్మ నాకు కథ చెప్పింది. అది ఎగిరే ఏనుగుల కథ. 17 00:02:43,747 --> 00:02:48,001 కానీ... అవి నిజంగా ఎప్పుడూ ఎగరవు. 18 00:02:50,629 --> 00:02:51,672 అవి ఎగరగలవా? 19 00:02:53,423 --> 00:02:56,593 లేదు, స్వీటీ, వాటికి దంతాలు ఉంటాయి, కానీ రెక్కలు ఉండవు. 20 00:02:57,594 --> 00:02:59,638 అది నీకు తెలుసు. నీకు బొమ్మలు చూపించాను కదా. 21 00:03:01,765 --> 00:03:03,100 పద, ఫ్రెండ్. వెళదాం పద. 22 00:03:09,147 --> 00:03:12,359 ఈ రోజు కూడా ఆరెంజ్ డే కాకూడదని కోరుకుంటున్నాను. 23 00:03:16,280 --> 00:03:18,574 ఆగస్టు 17, 2046. 24 00:03:18,574 --> 00:03:21,994 కొలంబియాలో క్యాలి నగరంలో సూర్యాస్తమయం వరకూ ఆరెంజ్ హెచ్చరిక. 25 00:03:22,494 --> 00:03:24,162 బయట వీలైనంత తక్కువగా తిరగండి. 26 00:03:29,585 --> 00:03:31,545 కొలంబియా 27 00:03:31,545 --> 00:03:34,047 ఈ సీజనులో ఒక్క తిమింగలం కూడా ఇక్కడ కనిపించలేదు. 28 00:03:34,798 --> 00:03:36,884 ఏదో పాత, పాడుబడిన ఇంటిలో నడుస్తున్నట్లు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని 29 00:03:36,884 --> 00:03:38,135 అరుస్తున్నట్లు అనిపిస్తోంది. 30 00:03:39,636 --> 00:03:42,139 అవి గనుక జీవించి ఉంటే, అవి మనల్ని కలవడానికి ఇష్టపడటం లేదని అర్థం. 31 00:03:42,806 --> 00:03:45,350 ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తుంటే, నువ్వు నాకు గుర్తుకొచ్చావు. 32 00:03:46,059 --> 00:03:48,562 తిమింగలాలు, చేపలు ఒడ్డుకు వచ్చి చనిపోయిన మరొక ఘటనని నేను చూశాను. 33 00:03:48,562 --> 00:03:52,107 న్యూజిలాండ్ లో ఫేర్వెల్ స్పిట్ తీరంలో మూడు ఒంటరి తిమింగలాలు చనిపోయాయి. అలా ఎందుకు జరిగిందో నీకేమైనా తెలుసా? 34 00:03:52,608 --> 00:03:54,526 ఆరోగ్యంగా, అందంగా ఉండే ఓ జంతువు, 35 00:03:54,526 --> 00:03:58,363 ఈ ప్రపంచం కల్లోలంగా ఉందని ఎందుకు తనువు చాలిస్తుంది? 36 00:03:58,864 --> 00:04:01,742 - నాకు తెలియదు. నువ్వు చెప్పు. - సరే, మార్కో. 37 00:04:01,742 --> 00:04:03,452 నీకు ఫోన్ చేసి పొరపాటు చేసినట్లు ఉన్నాను. 38 00:04:03,452 --> 00:04:06,079 సరే. నువ్వు పోటీ కోసం పని చేస్తావు, బెక్. 39 00:04:06,079 --> 00:04:08,207 వాస్తవంగా, నువ్వు అడుగుతున్నది కార్పొరేట్ గూఢచర్యం చేయాలని, 40 00:04:08,207 --> 00:04:10,125 వృత్తిపరమైన మర్యాద కోసం కాదు. 41 00:04:10,125 --> 00:04:13,420 టుమారోజూ సంస్థ చాలా కంగారుపడుతోంది 42 00:04:13,420 --> 00:04:15,631 ఎందుకంటే హ్యాకర్లు, గూఢచారులు ఇంకా పాత పరిచయస్థులు 43 00:04:15,631 --> 00:04:17,048 దాని సమాచారం తెలుసుకోవాలని చూస్తున్నారు. 44 00:04:18,257 --> 00:04:21,136 నేను చేసినట్లే నువ్వు కూడా అన్ని గోప్యమైన డాక్యుమెంట్ల మీద సంతకాలు చేస్తావనుకుంటున్నా. 45 00:04:21,136 --> 00:04:23,430 ఈ ప్రపంచం నుండి జంతువులు ఇంకా కాలం హరించుకుపోతున్నాయి. 46 00:04:23,430 --> 00:04:25,182 అవి ఎంత తగ్గితే వాటి విలువ అంత పెరుగుతుంది. 47 00:04:25,182 --> 00:04:27,434 అందుకే వాటి గురించిన సమాచారాన్ని అందరికీ పంచాలి. 48 00:04:28,644 --> 00:04:30,896 నేను చేస్తున్న పనిలో ఏదైనా సమాచారం ఉంటే, అది నీకు తెలియజేస్తాను. 49 00:04:31,522 --> 00:04:32,940 నీకున్న సమాచారాన్ని కూడా నాకు అందిస్తావుగా. 50 00:04:35,901 --> 00:04:38,570 నువ్వు ఇస్తావు, ఇస్తావు కదూ? 51 00:04:40,864 --> 00:04:41,907 నా దగ్గర ఒక సమాచారం ఉంది. 52 00:04:44,535 --> 00:04:48,830 కిందటి వారమే. ఆ తరువాత అది మూగబోయింది. 53 00:04:48,830 --> 00:04:52,042 కొద్ది రోజులుగా దాని నుంచి ఏమీ వినిపించలేదు. ఇప్పుడు దాన్ని నేను కోల్పోయాను. 54 00:04:54,253 --> 00:04:56,171 సముద్రపు ఉష్ణోగ్రత కొద్దిరోజులుగా 32 సెల్సియస్ గా ఉంది. 55 00:04:56,171 --> 00:05:00,217 క్రిల్ చనిపోయి ఉంటుంది, దాదాపుగా. 56 00:05:00,217 --> 00:05:03,846 అది ఎందుకంటే, దాని ఆహారపు వనరులు అంతరించిపోతున్నాయి. 57 00:05:05,806 --> 00:05:08,350 అది గనుక తిరిగి రాకపోతే, వాళ్లు మనం చేస్తున్న పనిని బలవంతంగా నిలిపివేస్తారు. 58 00:05:09,226 --> 00:05:11,645 సరే, ఉత్కంఠతో ఎదురుచూడాలి, బెక్. తను తిరిగి వస్తుందని ఆశ పడుతున్నాను. 59 00:05:13,480 --> 00:05:15,941 కనీసం ఒక్కటైనా మిగిలి ఉందని తెలిస్తే అది గొప్ప విషయం అవుతుంది. 60 00:05:17,985 --> 00:05:18,986 నువ్వు టచ్ లో ఉండు. 61 00:05:31,874 --> 00:05:34,001 వేడి ఉష్ణోగ్రత ఇంకా వాయు కాలుష్యంతో పాటు 62 00:05:34,001 --> 00:05:35,836 మానసిక ఒత్తిడి కూడా 63 00:05:35,836 --> 00:05:38,755 సమ్మర్ హార్ట్ వ్యాధి సంబంధిత గుండెపోటు ఘటనలకు కారణం అవుతోంది. 64 00:05:38,755 --> 00:05:39,715 నాకు తెలుసు. 65 00:05:39,715 --> 00:05:42,885 నాలుగు మరణాలకు థర్మల్ కార్డియోమయోపతీ కారణమని భావిస్తున్నారు, 66 00:05:42,885 --> 00:05:46,597 విపరీతమైన వేడి వాతావరణంలో ఏర్పడే ఈ వ్యాధిని సాధారణ పరిభాషలో "సమ్మర్ హార్ట్" అంటున్నారు... 67 00:05:47,306 --> 00:05:49,933 పెంపుడు జంతువుల ఆరోగ్య పర్యవేక్షణ యంత్రం ఆఫ్ అవుతోంది. 68 00:05:59,902 --> 00:06:02,696 సరే, అక్కడ నువ్వు క్షేమంగా ఉండాలి, అందుకు నువ్వు ఏం చేయాలో నీకు తెలుసు. 69 00:06:02,696 --> 00:06:04,364 - అమ్మా... - ఈ పిన్ ని నీలం రంగులోనే ఉంచు... 70 00:06:04,364 --> 00:06:06,450 నాకు తెలుసు. అది నేను చూసుకుంటాను. 71 00:06:06,450 --> 00:06:07,826 మరి ఇది పసుపు రంగులోకి మారితే? 72 00:06:07,826 --> 00:06:10,078 - నేను ప్రశాంతంగా మారాలి. - అది ఎరుపు రంగులోకి మారితే? 73 00:06:10,078 --> 00:06:12,664 - సంతోషకరమైన సంఘటనల గురించి ఆలోచించాలి. - అంతే. 74 00:06:16,752 --> 00:06:17,961 సరే. 75 00:06:51,537 --> 00:06:53,664 రెబెకా షియరర్, ఆర్కివిస్ట్. 76 00:06:53,664 --> 00:06:59,044 సంస్థ, మెనాజరి2100. స్వాగతం. గమ్యాన్ని ఎంచుకోండి. 77 00:06:59,711 --> 00:07:01,672 పని ప్రదేశం, బహియా మాలగా. 78 00:07:15,310 --> 00:07:18,897 ఆర్కైవ్ సెషన్ లో చివరిసారి సంప్రదించిన ఘటన, 005ని మళ్లీ ప్లే చేయి. 79 00:07:20,357 --> 00:07:22,609 నేను ఒక తల్లిని. నువ్వు? 80 00:07:23,902 --> 00:07:25,279 నాలుగు సార్లు. 81 00:07:26,154 --> 00:07:27,656 మరి చివరిసారి ఎప్పుడు? 82 00:07:28,282 --> 00:07:32,619 ఇంతకుముందే అయిదవ సంతానం ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. 83 00:07:33,662 --> 00:07:37,040 ఏమీ అర్థం చేసుకోలేని వయస్సు కానీ ఏదో కావాలనే ఆరాటం. 84 00:07:39,376 --> 00:07:42,504 వాడు నా శరీరానికి అతుక్కునిపోయాడు. 85 00:07:44,590 --> 00:07:48,385 ప్రతి దిశలోనూ, వాడికి నేనే ఆహారాన్ని అయ్యాను. 86 00:07:49,803 --> 00:07:52,055 నాకు అయితే, వాడే నా పరమార్థం. 87 00:07:53,599 --> 00:07:55,475 ఏం చేయాలో నీకు ఎలా తెలిసింది? 88 00:07:56,268 --> 00:07:58,562 మా అమ్మ నాకు అలాగే చేసింది. 89 00:07:59,313 --> 00:08:02,983 సమస్యనీ, మార్గాన్నీ తనే నాకు నేర్పింది. 90 00:08:05,068 --> 00:08:07,321 - గుడ్ మార్నింగ్, ఏజ్రా. - గుడ్ మార్నింగ్. 91 00:08:07,321 --> 00:08:08,697 ఈ రోజు ఎలా ఉన్నావు? 92 00:08:15,078 --> 00:08:17,331 ఈ రోజు ఎలాంటి రోజో నీకు తెలుసు, కదా? 93 00:08:17,331 --> 00:08:18,665 అవును, ఆరెంజ్ రోజు. 94 00:08:19,249 --> 00:08:21,502 అందుకే, బయట పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఉండకూడదు. 95 00:08:22,085 --> 00:08:24,880 అడవుల్లో మంటలు ఇంకా చెలరేగుతున్నాయి, కాబట్టి వాయు కాలుష్యం బాగా ఉంది. 96 00:08:25,714 --> 00:08:28,467 కానీ నీ గుండెకి సరిపడినంత ఆక్సిజన్ అందాల్సి ఉంది. 97 00:08:29,384 --> 00:08:30,844 ఆ పిన్ ని నీలం రంగులోనే ఉంచుదాం. 98 00:08:31,803 --> 00:08:33,722 నీ బిడ్డ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 99 00:08:35,599 --> 00:08:39,895 వాడు నా మాట వినిపించనంత దూరం వెళ్లిపోయాడు. 100 00:08:41,145 --> 00:08:42,898 తరువాత వాడు మరింత దూరం అయ్యాడు. 101 00:08:45,025 --> 00:08:48,487 వాడు ఎంత దూరంలో ఉన్నా తిరిగి రావాలని అడిగాను. 102 00:08:51,198 --> 00:08:56,119 వాడు దారి తప్పి తరువాత ప్రాణాలు వదిలేశాడు. 103 00:08:59,706 --> 00:09:02,167 - నువ్వు ఒక్కటీ చూడలేదు కదా. - నేను చూశాను. 104 00:09:02,918 --> 00:09:03,919 అవకాశమే లేదు! 105 00:09:03,919 --> 00:09:06,088 అవి, అంటే, దాదాపు వేల సంవత్సరాల కిందటే అంతరించిపోయాయి. 106 00:09:06,088 --> 00:09:07,214 అంటే, డైనోసార్ల కాలం నుంచి. 107 00:09:07,214 --> 00:09:10,175 - ఆమె నీకు డైనోసార్ల గురించి చెప్పిందా? - ఇది మాత్రం నిజమైనది. 108 00:09:10,175 --> 00:09:14,471 మా అమ్మ చూసింది. ఆమె చేసే పనే అది. అంతరించిపోతున్న జీవరాశుల్ని ఆమె అధ్యయనం చేస్తుంది. 109 00:09:14,471 --> 00:09:16,515 పులి గురించి నన్ను చెప్పమంటావా? 110 00:09:17,140 --> 00:09:19,309 - ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? - నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఏజ్రా. 111 00:09:20,143 --> 00:09:22,020 అవును, అబద్దాలకోరు. ఎరుపు రంగు వస్తే చనిపోయినట్లే. 112 00:09:22,020 --> 00:09:24,439 మా అమ్మకి పులి గురించి తెలుసు! తను చూసింది! 113 00:09:30,487 --> 00:09:32,364 రెబెకా! గుడ్ మార్నింగ్! 114 00:09:32,364 --> 00:09:33,824 నువ్వు తిరిగి వచ్చావని నాకు తెలియదు. 115 00:09:33,824 --> 00:09:35,701 కార్పొరేట్ సంస్థ కంగారుపడుతోంది. 116 00:09:35,701 --> 00:09:37,911 ఇక్కడ మనం చాలా సమయం ఇంకా డబ్బు ఖర్చు చేస్తున్నాం. 117 00:09:38,412 --> 00:09:39,746 ఏం జరుగుతోందో నీకు ఏమైనా తెలుస్తోందా? 118 00:09:39,746 --> 00:09:43,292 అంటే, చూడు, ఈ పని గొప్పగా సాగుతోంది. ఆమె చాలా బాగా స్పందిస్తోంది. 119 00:09:43,792 --> 00:09:45,210 కానీ, చూడు, 120 00:09:45,210 --> 00:09:47,838 గత కొద్ది రోజులుగా తనతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అనిపిస్తోంది. 121 00:09:47,838 --> 00:09:50,799 విరుంగాలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ కూడా పోటీ సమస్యలు ఉన్నాయేమో అని అనుమానంగా ఉంది. 122 00:09:51,884 --> 00:09:54,386 లాయర్లని సంప్రదించాలా వద్దా అనేది నువ్వు నాకు చెప్పాలి. 123 00:09:54,386 --> 00:09:57,014 నీ పనిలో టుమారోజూ గనుక జోక్యం చేసుకుంటుంటే... 124 00:09:57,014 --> 00:10:00,809 ఆ పరిసరాల్లో చప్పళ్లే వినిపిస్తున్నాయి, మైనింగ్ పనులు. అక్కడ శబ్దాలు గట్టిగా వినబడుతున్నాయి. 125 00:10:00,809 --> 00:10:03,604 అందుకే, ఈ రోజు నేను ఫ్రీక్వెన్సీలని మార్చి చూస్తాను. 126 00:10:03,604 --> 00:10:04,771 అదేమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం. 127 00:10:04,771 --> 00:10:09,610 మనం ఖచ్చితంగా ఈ పనిని వేగంగా పూర్తి చేయాలి. మనకి సమయం మించిపోతోంది. 128 00:10:12,446 --> 00:10:14,573 సరే, తను గనుక కనిపిస్తే, నేను తనకి చెబుతాను. 129 00:10:25,292 --> 00:10:28,045 చివరిసారి మాట్లాడింది తిరిగి ప్లే చేయి. ఆగస్టు 12. ఉదయం. 130 00:10:28,879 --> 00:10:33,300 మా అమ్మ నాకు నేర్పిన విధానం ఆచరించడం కష్టంగా మారిపోతోంది. 131 00:10:35,052 --> 00:10:37,554 నీకు కూడా అలాగే అనిపించిందా? 132 00:10:37,554 --> 00:10:39,097 ప్లేబ్యాక్ ఆపు. 133 00:10:44,937 --> 00:10:46,188 ఎక్కడ ఉన్నావు? 134 00:10:54,071 --> 00:10:58,325 స్పీచ్ మైక్రోఫోన్ ఓపెన్ చేయి. ప్లేబ్యాక్ ని ప్రారంభించు. 135 00:10:59,076 --> 00:11:01,370 సమయం ఇంకా తేదీలతో సహా ప్రసారం. 136 00:11:03,163 --> 00:11:06,500 మాహ్లర్ సంగీతాన్ని ఎంపిక చేసి, సింఫనీ 10, ఏడాజియోని ప్లే చేయి. 137 00:11:24,393 --> 00:11:27,437 మా అమ్మ గురించి కిందటిసారి నువ్వు అడిగావు. 138 00:11:29,106 --> 00:11:31,567 ఆమె పేరు ఈవ్. 139 00:11:34,820 --> 00:11:37,865 నీతో మాట్లాడినప్పుడల్లా ఆమె గొంతు వింటున్నట్లే ఉంటుంది. 140 00:11:39,825 --> 00:11:41,785 నువ్వు మాట్లాడితే నాకు అలాగే వినిపిస్తుంది. 141 00:11:43,745 --> 00:11:46,582 బెర్క్ షైర్స్ లో ఉన్న సరస్సులో పడవ మీద కూర్చుని 142 00:11:46,582 --> 00:11:51,128 సూర్యాస్తమయం సమయంలో బోర్బన్ ని తాగడాన్ని ఆ వృద్ధురాలు ఇష్టపడేది. 143 00:11:53,922 --> 00:11:56,800 అది ఎంత గొప్ప అనుభూతో నీకు తెలియంది కాదు. 144 00:12:05,893 --> 00:12:09,271 నేను ఎప్పుడు విచారంగా లేదా ఒంటరిగా ఉన్నా ఆమె ఏం చెప్పేది అంటే, 145 00:12:09,271 --> 00:12:13,775 గుస్తావ్ మాహ్లర్ తన సంగీతం ద్వారా మరొక కాలం నుండి 146 00:12:13,775 --> 00:12:16,945 నాకు ఏదో చెబుతున్నాడని ఊహించుకోమని అనేది. 147 00:12:20,157 --> 00:12:23,035 మాహ్లర్ ఇది స్వరపరుస్తున్నప్పుడు అతను తీవ్రమైన ఆవేదనలో ఉన్నాడు. 148 00:12:26,246 --> 00:12:30,584 దానికి ఏడాది ముందే అతని కుమార్తె స్కార్లెట్ జ్వరంతో చనిపోయింది. 149 00:12:34,838 --> 00:12:37,382 ఆ సమయంలో అతని జీవితం ఇలా ధ్వనించేది. 150 00:12:42,554 --> 00:12:45,516 కానీ వాయిద్యాల మీద ఈ సంగీతాన్ని వాయించడానికి ముందే మాహ్లర్ మరణించాడు. 151 00:12:47,392 --> 00:12:48,936 అప్పటికి అది పూర్తి కూడా కాలేదు. 152 00:12:50,604 --> 00:12:53,649 దానిని నా మనసులోనే పూర్తి చేసుకోమని 153 00:12:53,649 --> 00:12:56,860 మా అమ్మ నాకు చెప్పేది. 154 00:13:01,990 --> 00:13:03,867 నువ్వు తిరిగి రావాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. 155 00:13:08,580 --> 00:13:09,706 చెత్త. 156 00:13:23,345 --> 00:13:26,265 2037 సంవత్సరపు వేసవి కాలం, అప్పుడు అంతటా మంటలు ఉండేవి. 157 00:13:28,517 --> 00:13:33,063 నేను గర్భవతిగా ఉన్నప్పుడు నా ఆరో నెల సమయంలో వరుసగా ముప్పై రోజులు తీవ్ర వేడి ఉష్ణోగ్రతలు ఉండేవి. 158 00:13:34,565 --> 00:13:38,402 ఆ వేడి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించాను. కరెంట్ తరచూ పోతుండేది, దానితో... 159 00:13:40,279 --> 00:13:42,364 ఇతని పరిస్థితి ఎంత విషమంగా ఉందో తనకి తెలుసా? 160 00:13:42,948 --> 00:13:44,283 అతనికి నువ్వు చెప్పావా? 161 00:13:44,283 --> 00:13:47,286 ఎండలోకి వెళితే అతను చనిపోతాడని తనకి తెలుసా? 162 00:13:48,745 --> 00:13:50,873 లేదు, అది చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. 163 00:13:54,668 --> 00:13:56,587 తనకి సమ్మర్ హార్ట్ ఉందని తెలుసు. 164 00:13:56,587 --> 00:13:59,506 విపరీత వేడి రోజులు అంటే ఏమిటో వాడికి తెలుసు ఇంకా ఆ వేడిలోకి వెళ్లకూడదని కూడా తెలుసు. 165 00:14:01,091 --> 00:14:04,261 ఆ రోజుల్ని వాడు "విపరీత వేడి" రోజులు అనకుండా "ఖాళీ గుండె రోజులు" అంటుంటాడు, 166 00:14:04,261 --> 00:14:07,723 కాబట్టి, అవును, తను జాగ్రత్తగా ఉండాలని తనకి తెలుసు. 167 00:14:08,891 --> 00:14:12,060 అదేనా జరిగింది? తను బయట చాలా సేపు గడిపాడా? 168 00:14:12,060 --> 00:14:14,062 లేదు, అతను బయటకు వెళ్లలేదు. 169 00:14:14,980 --> 00:14:17,941 నాకు తెలిసి, కొందరు పెద్ద కుర్రాళ్లు అతడిని ఏదో విషయం మీద ఆటపట్టించారు, 170 00:14:17,941 --> 00:14:19,693 దానితో మీ అబ్బాయికి కోపం వచ్చింది. 171 00:14:19,693 --> 00:14:21,069 అది ఈ పరిస్థితికి దారి తీసింది. 172 00:14:24,448 --> 00:14:26,658 నేను అక్కడికి చేరుకునేసరికి తన పక్కన ఒక చిన్న పాప ఉంది. 173 00:14:28,577 --> 00:14:30,245 ఆమె కూడా సమ్మర్ హార్ట్ తో బాధపడుతోంది. 174 00:14:35,334 --> 00:14:38,504 మన భవిష్యత్తు ఎటు వైపు దారి తీసినా, మనం కలిసే ముందుకు సాగుతామని మనకి తెలుసు. 175 00:14:38,504 --> 00:14:43,926 అందుకే ఆల్ఫా ఇంటిగ్రేటెడ్ థెరాపాటిక్స్ మీకు అత్యాధునిక ఔషధాలను అందిస్తుంది... 176 00:14:51,642 --> 00:14:54,228 నాన్నకి సమ్మర్ హార్ట్ ఉండేదా, ఆయనే నాకు ఇది ఇచ్చాడా? 177 00:14:54,811 --> 00:14:55,896 లేదు, బుజ్జీ. 178 00:14:56,396 --> 00:14:59,691 మీ నాన్న 1999లో పుట్టాడు ఇంకా అప్పట్లో ఎవ్వరికీ సమ్మర్ హార్ట్ వ్యాధి ఉండేది కాదు. 179 00:15:00,275 --> 00:15:02,819 మీ నాన్న నీకు చాలా గొప్ప, పెద్ద గుండెని ఇచ్చాడు. 180 00:15:04,446 --> 00:15:05,531 ఆ గొప్ప, పెద్ద గుండె 181 00:15:05,531 --> 00:15:07,824 అందుకే ఆయన ఆ తుఫాను వచ్చినప్పుడు మనీలాలో ఉన్నాడు. 182 00:15:11,703 --> 00:15:15,999 ఈ ప్రపంచాన్ని అతను కలుషితం చేశాడు అందుకే ఈ ప్రపంచం నిన్ను అనారోగ్యం పాలు చేసింది. 183 00:15:17,209 --> 00:15:19,336 కానీ మేము నీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చబోతున్నాం. 184 00:15:25,050 --> 00:15:27,010 మా స్కూలులో ఒక చిన్నపాప ఏం చెప్పిందంటే 185 00:15:27,010 --> 00:15:29,930 సమ్మర్ హార్ట్ వ్యాధితో ఉండే వాళ్లు ముప్పై ఏళ్లకు మించి బతకరు అంది. 186 00:15:30,430 --> 00:15:32,766 మరి, వచ్చే ఏడాది నాకు పది సంవత్సరాలు నిండుతాయి కాబట్టి, 187 00:15:33,517 --> 00:15:37,104 నేను మరో ఇరవై ఏళ్లు మాత్రమే బతుకుతాను. 188 00:15:37,104 --> 00:15:39,356 కానీ, నేను అది నమ్మను. 189 00:15:39,356 --> 00:15:42,276 నీకు ఇంకా చాలా సంవత్సరాల ఆయుష్షు ఉందని నమ్ముతాను. 190 00:15:43,861 --> 00:15:48,365 బహుశా నువ్వు పిల్లి లాంటి వాడివి. నీకు తొమ్మిది ప్రాణాలు ఉంటాయి. 191 00:15:48,365 --> 00:15:50,158 - అంటే తొంభై ఏళ్లు. - అవును. 192 00:15:50,993 --> 00:15:52,536 ఇంకా నీకు ముప్పై ఏళ్లు వచ్చేసరికి, 193 00:15:52,536 --> 00:15:56,123 ఎవరో ఒకరు కేవలం నీ కోసం ఒక సరికొత్త గుండెని కనిపెట్టవచ్చు కూడా. 194 00:16:02,713 --> 00:16:04,464 వింటర్ చిల్ కి స్వాగతం, 195 00:16:04,464 --> 00:16:07,509 ఉష్ణ సంబంధిత పరిస్థితులకు సంబంధించి ఇది చక్కని చికిత్సని అందిస్తుంది. 196 00:16:08,635 --> 00:16:10,262 {\an8}వింటర్ చిల్ స్నోమాన్ ని తయారు చేయండి 197 00:16:10,262 --> 00:16:12,764 చూడు, రిఫరీ. నేను ఎందుకు ఆడలేకపోతున్నాను? 198 00:16:12,764 --> 00:16:14,099 సారీ, మిత్రమా. 199 00:16:14,099 --> 00:16:16,602 ఈ రోజు స్కూలులో నువ్వు ఏదో గందరగోళం చేసినట్లు కనిపిస్తోంది. 200 00:16:17,186 --> 00:16:20,939 కానీ నాకు ఆడాలని ఉంది. వింటర్ చిల్ చెత్తలా ఉంది. 201 00:16:20,939 --> 00:16:24,151 కొన్నిసార్లు మనల్ని కాపాడే విషయాలు మనకి సంతోషాన్ని కలిగించవు. 202 00:16:24,651 --> 00:16:25,986 కానీ నీ ఫ్రెండ్ లోలా ఇక్కడ ఉంది. 203 00:16:25,986 --> 00:16:27,487 నీ ఫ్రెండ్స్ ని చూడటం కోసం బటన్ నొక్కు 204 00:16:32,159 --> 00:16:35,037 నీకు సాయం చేయాలని ఉందా, ఏజ్రా? దీని కళ్లకు పెట్టడానికి బటన్స్ సంపాదించాను. 205 00:16:35,037 --> 00:16:36,330 తప్పు చెప్పావని అమ్మ అంటోంది. 206 00:16:36,330 --> 00:16:39,208 మన ఇద్దరి కోసం ఎవరో ఒకరు కొత్త గుండెలు కనిపెడతారని ఆమె అంటోంది. 207 00:16:39,833 --> 00:16:41,585 ఇంకా నేను తొంభై ఏళ్లు బతకుతానని చెబుతోంది. 208 00:16:46,924 --> 00:16:49,885 ఇది మెనాజరి2100 కోసం భద్రమైన లింక్. 209 00:16:49,885 --> 00:16:54,097 రెబెకా షియరర్, హెచ్.డబ్ల్యు.1998ఎఫ్ కోసం పని చేస్తున్న ఆర్కైవిస్ట్. 210 00:16:55,224 --> 00:16:57,518 ఈ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ లో జరిగే సంభాషణ అంతా 211 00:16:57,518 --> 00:17:00,020 మెనాజరి2100 సొంత ప్రాపర్టీగా పరిగణించాలి. 212 00:17:00,687 --> 00:17:04,650 ఆగస్టు 18, 2046. మూడు, రెండు, ఒకటి. 213 00:17:11,073 --> 00:17:13,492 ఈ సందేశం గనుక నీకు అందుతుంటే, దయచేసి స్పందించు. 214 00:17:22,376 --> 00:17:23,961 స్పందించు. 215 00:17:27,172 --> 00:17:30,050 నీకు నా మాట వినిపిస్తుంటే, దయచేసి స్పందించు. 216 00:17:45,732 --> 00:17:48,402 నిన్న రాత్రి నేను మరొకటి విన్నాను. 217 00:17:49,778 --> 00:17:51,280 అతను ఎక్కడ ఉన్నాడు? 218 00:17:54,825 --> 00:17:58,120 ఎక్కడయినా మగ తిమింగలం ఉంటే, దానిని నువ్వు కలుసుకునేలా సాయం చేస్తాను. 219 00:18:00,038 --> 00:18:02,583 నేను మళ్లీ తల్లిని కావాలని కోరుకుంటున్నాను. 220 00:18:03,792 --> 00:18:07,963 ఈ ప్రదేశంలో, ఈ సమయంలో. 221 00:18:12,926 --> 00:18:14,678 అందుకు తగిన ఆహారం అక్కడ ఉందా? 222 00:18:16,597 --> 00:18:20,893 అతను గనుక దగ్గరలో ఉంటే, తగినంత ఆహారం ఉన్నట్లే. 223 00:18:20,893 --> 00:18:22,811 అక్కడ ఉండే ఉండచ్చు... 224 00:18:22,811 --> 00:18:25,647 భాష ఇంటర్ఫేస్ కి ధ్వని జోడించు. 225 00:18:27,191 --> 00:18:31,695 నా ధ్వనులు ఎందుకు వింటున్నావు? ఇన్ని రోజుల తరువాత. 226 00:18:31,695 --> 00:18:33,989 నీ జీవితం అంతా నిన్ను గమనిస్తూ గడుపుతున్నాను. 227 00:18:35,908 --> 00:18:37,701 నీ గురించి తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. 228 00:18:38,994 --> 00:18:40,704 ఆసక్తి అంటే ఏమిటో నీకు తెలుసా? 229 00:18:41,205 --> 00:18:44,249 ఆకాశం మొదలయ్యే చోట నిన్ను నేను చూశానా? 230 00:18:45,125 --> 00:18:48,170 - మాలో కొందరు చనిపోవడానికి కారణం నువ్వేనా? - కాదు. 231 00:18:49,963 --> 00:18:53,008 లేదు, నేను ఎప్పుడూ నీకు హాని కలిగించను. 232 00:18:54,885 --> 00:18:56,553 నీ నుంచి నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను. 233 00:19:00,265 --> 00:19:03,685 నువ్వు మమ్మల్ని గమనిస్తున్నావు. మేము ఎలాంటి వాళ్లమో నీకు తెలుసు. 234 00:19:05,687 --> 00:19:07,648 నువ్వు దేని కోసం చూస్తున్నావో నాకు చెప్పగలవా? 235 00:19:10,108 --> 00:19:14,029 మేము, ఎవరైతే ఉన్నామో, ఈ ప్రపంచాన్ని పంచుకుంటున్నాము. 236 00:19:15,364 --> 00:19:17,032 ఇందులో ఉన్నదంతా. 237 00:19:18,700 --> 00:19:22,663 మేము పంచుకునేది తగ్గిపోతే, మేము కూడా తగ్గిపోతాము. 238 00:19:26,083 --> 00:19:27,584 మీ విషయంలో కూడా అదే జరుగుతుందా? 239 00:19:32,422 --> 00:19:38,428 మాకు పుట్టే పిల్లలు కొంత సమయం కూడా మాతో ఉండరు. 240 00:19:40,681 --> 00:19:44,893 వాళ్లు మమ్మల్ని విడిచి వెళ్లిపోతారు. 241 00:19:48,897 --> 00:19:52,943 వాళ్లు అలా కనుమరుగు అయిపోతుంటే మేము చూస్తుంటాము. 242 00:19:55,654 --> 00:19:58,866 నా పిల్లలు అందరూ అలా వెళ్లిపోయిన వారే. 243 00:19:58,866 --> 00:20:00,742 నీకు ఆహారం కోసం నేను ఏర్పాట్లు చేస్తాను. 244 00:20:04,997 --> 00:20:08,458 నేను అతడిని వెతకాలి. అతనికి తెలుస్తుంది... 245 00:20:12,963 --> 00:20:14,631 భాష ఇంటర్ఫేస్ కి జోడించు. 246 00:20:22,598 --> 00:20:26,185 తనకి ఆహారం దొరకకపోతే, తనని మనం మళ్లీ కోల్పోతాము. ఇంక మగ తిమింగలం కూడా దొరకదు. 247 00:20:26,185 --> 00:20:28,270 అది మనుగడ కొనసాగించడానికి మనం ఆహారాన్ని అందించగలమా? 248 00:20:28,270 --> 00:20:31,481 పెద్ద తిమింగలాలకి రోజుకి సుమారు 1361 కిలోల ఆహారం కావాలి. 249 00:20:31,481 --> 00:20:34,109 - ప్రధానంగా ఎండ్రకాయలు, కానీ... - అది నాకు తెలియదు. 250 00:20:34,109 --> 00:20:38,697 అవును, ఈ నిర్ణయం వల్ల కొన్ని తీవ్రమైన పరిణామాలు జరగచ్చు, వాటి గురించి మనం సంస్థాగతంగా మాట్లాడుకోవాలి. 251 00:20:38,697 --> 00:20:40,407 సరే, మంచి వార్త ఏమిటంటే అది సంభోగానికి సిద్ధంగా ఉంది, 252 00:20:40,407 --> 00:20:42,367 అది తన వలస ప్రక్రియలో ఒక భాగం, 253 00:20:42,367 --> 00:20:45,162 కాబట్టి ఆ మగ తిమింగలం గనుక బలమైనది అయితే వాటి జీవన విధానం గురించి మనం 254 00:20:45,913 --> 00:20:46,914 మరింత తెలుసుకోగలుగుతాం. 255 00:20:46,914 --> 00:20:50,459 మనం భవిష్యత్తులో తయారుచేయబోయే ప్రతి ఒక్క తిమింగలానికి తను ఒక నమూనా అవుతుంది. 256 00:20:50,459 --> 00:20:52,377 - ఈ రోజు గొప్ప పనిని పూర్తి చేశావు, బెకా. - థాంక్యూ. 257 00:20:58,467 --> 00:20:59,635 ఆహారం? 258 00:21:00,135 --> 00:21:01,637 - అది కాస్త ఆలోచించాల్సిన విషయం. - అవునా? 259 00:21:01,637 --> 00:21:04,681 నా ఉద్దేశం, నాణ్యమైన ప్రొటీన్ ఆహారాన్ని జంతువులకు అందిస్తే 260 00:21:04,681 --> 00:21:06,308 ప్రజలు మన సంస్థని చెడుగా చూడచ్చు. 261 00:21:07,267 --> 00:21:08,602 ఆసియాలో కరువు తీవ్రంగా ఉంది. 262 00:21:08,602 --> 00:21:10,020 అక్కడ జనం చనిపోతున్నారు, 263 00:21:10,854 --> 00:21:14,107 కానీ మనం మాత్రం తిమింగలాలతో మాట్లాడటానికి వాటి సంభోగం గురించి తెలుసుకోవడానికి 264 00:21:14,107 --> 00:21:16,860 నాణ్యమైన పోషక విలువలు ఉన్న ఆహారాన్ని వాటికి పెట్టాలని చూస్తున్నాం. 265 00:21:17,903 --> 00:21:18,987 ఇది పౌరసంబంధాలకు సంబంధించిన పీడకల. 266 00:21:18,987 --> 00:21:20,739 సరే, సరే. ఇంక చాలు. 267 00:21:21,740 --> 00:21:23,867 ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆమ్లీకరణం పెరిగిపోతోంది. 268 00:21:23,867 --> 00:21:25,869 సముద్ర తీరాలు మృత్యుప్రదేశాలుగా మారిపోతున్నాయి. 269 00:21:26,745 --> 00:21:29,081 ఇదే చివరి సీజన్ కావచ్చు అనిపిస్తోంది. 270 00:21:29,957 --> 00:21:32,459 మనం ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలి. 271 00:21:32,960 --> 00:21:35,128 ఈ విషయం బయటకి తెలిసే లోగా ఈ వారం చివరికల్లా ఈ పనిని పూర్తి చేయాలి. 272 00:21:35,128 --> 00:21:36,672 ఒప్పుకుంటాను. 273 00:21:36,672 --> 00:21:40,592 తిమింగలం మనకి మాత్రమే ప్రత్యేకం కావడం వల్ల టుమారోజూని మనం పోటీలో ఓడిస్తాము. 274 00:21:40,592 --> 00:21:42,427 నాకు ఆలోచించడానికి కొద్ది రోజులు గడువు ఇవ్వు. 275 00:21:50,102 --> 00:21:52,771 "మేము గులాబీ పువ్వులం," అని గులాబీలు అన్నాయి. 276 00:21:52,771 --> 00:21:57,526 కానీ అది అతనిలో బాధని పెంచింది ఎందుకంటే ఆ పువ్వు అతనికి ఒక మాట చెప్పింది 277 00:21:58,026 --> 00:22:01,697 ఈ విశ్వంలో తనలాంటి పువ్వు మరొకటి లేదని అంది. 278 00:22:02,406 --> 00:22:05,701 కానీ ఇక్కడ అటువంటివి ఐదు వేల పువ్వులు ఉన్నాయి, 279 00:22:06,201 --> 00:22:09,162 అన్నీ ఒకేలా ఉన్నాయి, ఒకే ఒక్క తోటలో. 280 00:22:09,913 --> 00:22:13,500 ఆ పువ్వు గనుక ఈ తోటని చూస్తే 'తను చాలా ఆందోళన పడుతుంది' అని 281 00:22:13,500 --> 00:22:15,711 అతను తనలో తాను అనుకున్నాడు, 282 00:22:15,711 --> 00:22:18,046 ఆ పువ్వు విపరీతంగా దగ్గుతుంది, 283 00:22:18,046 --> 00:22:22,426 తనని చూసి ఎవ్వరూ నవ్వకుండా ఉండటానికి అది చనిపోతున్నట్లుగా నటిస్తుంది. 284 00:22:23,177 --> 00:22:24,469 కానీ నేను మాత్రం... 285 00:22:24,469 --> 00:22:26,680 కానీ తనని తిరిగి ఆరోగ్యంగా చేస్తున్నట్లు 286 00:22:26,680 --> 00:22:29,349 నేను నటించడానికి సిద్ధపడ్డాను. 287 00:22:30,058 --> 00:22:33,729 నేను ఆ పని చేయకపోతే 288 00:22:35,147 --> 00:22:37,482 అది నాకు మనశ్శాంతిని ఇవ్వకపోవడమే కాదు, 289 00:22:38,442 --> 00:22:41,945 ఆ పువ్వు నిజంగానే తనకు తానుగా మరణించడానికి సిద్ధపడుతుంది." 290 00:22:45,490 --> 00:22:47,784 - కాసేపు నన్ను చదవమంటావా, అమ్మా? - వద్దు, వద్దు, వద్దు. 291 00:22:47,784 --> 00:22:52,664 నేను... నువ్వు ఇక్కడే ఉంటావు. 292 00:22:53,165 --> 00:22:58,086 నేను ఉండను. కాబట్టి, ఇది అమ్మమ్మ సమయం. 293 00:23:01,632 --> 00:23:05,677 "ఆ తరువాత, అతను ఆలోచనల్లో పడ్డాడు. 294 00:23:06,678 --> 00:23:09,932 - ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ఒకే ఒక్క పువ్వు... - ఇది నీకు నచ్చింది, కదా? 295 00:23:09,932 --> 00:23:11,975 ...నా దగ్గర ఉందని నేను చాలా గర్వపడ్డాను"... 296 00:23:11,975 --> 00:23:15,604 నీతో మాట్లాడుతున్న తిమింగలం గొంతు ఆరంగ్టన్ మాదిరిగా వినిపిస్తోంది కదా? 297 00:23:16,522 --> 00:23:19,233 లేదు, నేను ఆ ఆరంగ్టన్ ని మీ నాన్న గొంతుతో మాట్లాడేలా చేశాను 298 00:23:19,233 --> 00:23:21,026 ఎందుకంటే మీ నాన్నని నేను మిస్ అవుతున్నాను. 299 00:23:21,026 --> 00:23:23,320 మరి అయితే ఆ తిమింగలం ఎవరి గొంతులా ఉంది? 300 00:23:23,946 --> 00:23:25,197 అమ్మమ్మ ఈవ్ గొంతులా ఉంటుంది. 301 00:23:26,031 --> 00:23:28,742 లేదు, కానీ నిజ జీవితంలో దాని గొంతు వినడానికి ఎలా ఉంటుంది? 302 00:23:29,826 --> 00:23:30,953 నీకు వినాలని ఉందా? 303 00:23:32,538 --> 00:23:36,834 హెచ్.డబ్ల్యు.1998 వినిపించు. మామూలు భాషలో. 304 00:23:47,135 --> 00:23:48,554 తను ఏం అంటోంది? 305 00:23:49,096 --> 00:23:54,309 తను ఏం అంటోంది అంటే, "ఈ చిన్న మనిషి, ఏజ్రా ఎవరు, 306 00:23:54,309 --> 00:23:57,771 నేను ఇంతగా ప్రేమిస్తున్నాను?" అంటోంది. 307 00:24:04,236 --> 00:24:08,323 నేను చనిపోతే, ఏదైనా జంతువు గొంతుని నా గొంతులా మారుస్తావా? 308 00:24:09,533 --> 00:24:12,995 లేదు, బేబీ. ఎందుకంటే నువ్వు నాకు దూరం కావు. 309 00:24:17,958 --> 00:24:20,752 "కానీ నా దగ్గర ఉన్నదల్లా ఒక మామూలు చిన్న గులాబీ మాత్రమే.' 310 00:24:20,752 --> 00:24:24,882 నువ్వు చూస్తావా, ఏజ్రా? గులాబీలని చూస్తావా? 311 00:24:26,884 --> 00:24:29,052 'ఒక మామూలు గులాబీ,' అన్నాడు అతను." 312 00:24:30,179 --> 00:24:32,598 నా పేరు నిక్ బిల్టన్, మీరందరూ వినే ఉంటారు 313 00:24:32,598 --> 00:24:34,183 ఈ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన 314 00:24:34,183 --> 00:24:38,896 డిఎన్ఎ ఆధారిత ఐపి కంపెనీ 315 00:24:38,896 --> 00:24:41,690 మెనాజరి2100తో భాగస్వామ్యం కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 316 00:24:41,690 --> 00:24:44,902 ఇప్పుడు, మీరు అడగచ్చు 317 00:24:44,902 --> 00:24:46,904 ఆల్ఫా లాంటి సంస్థ ఈ రంగంలోకి ఎందుకు రావాలి అనుకుంటోందని, 318 00:24:46,904 --> 00:24:49,239 కానీ దీనికి సమాధానం చెప్పడం తేలిక. 319 00:24:49,239 --> 00:24:52,409 {\an8}ఆల్ఫా కేవలం ఒకే ఒక్క విషయం గురించి ఆసక్తి చూపుతుంది: 320 00:24:52,409 --> 00:24:56,747 {\an8}భవిష్యత్తులో ఉపయోగపడే వర్తమానపు అంశాలను గుర్తించడం. 321 00:24:57,414 --> 00:24:58,624 {\an8}మెరుగైన భవిష్యత్తు కోసం. 322 00:24:59,124 --> 00:25:02,920 {\an8}ఏనుగులు, ఒరాంగుటాన్లు ఇంకా నేను విన్నట్లుగా, బహుశా తిమింగలాలు, 323 00:25:04,046 --> 00:25:07,341 {\an8}వీటి జన్యువులు సమృద్ధిగా సంరక్షించే భవిష్యత్తు కోసం. 324 00:25:07,841 --> 00:25:11,053 ఆల్ఫా ఇచ్చే ప్రయోజనాల ప్యాకేజీ అద్భుతం. 325 00:25:11,053 --> 00:25:13,138 నేను మీ నుంచి చాలా నేర్చుకోవాలి. 326 00:25:13,138 --> 00:25:16,475 మా షేర్ హోల్డర్ల అనుమతితో, మీరు కూడా నాతో కలిసి 327 00:25:17,309 --> 00:25:19,144 ఈ ప్రయాణంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. 328 00:25:51,635 --> 00:25:52,636 ఇలా రా. 329 00:26:00,227 --> 00:26:02,646 ఆర్కైవ్ సెషన్ 008 వినిపించు. 330 00:26:05,899 --> 00:26:08,193 ఒక మగ తిమింగలం నుంచి నువ్వు చివరిగా ఎప్పుడు విన్నావు? 331 00:26:08,193 --> 00:26:10,237 అతను ఇక్కడికి పెద్ద దూరంలో లేడు. 332 00:26:12,698 --> 00:26:15,868 మేము సముద్ర గర్భంలో కలుసుకున్నాము. 333 00:26:16,910 --> 00:26:19,788 అతను గతం కంటే భిన్నంగా ఉన్నాడు. 334 00:26:22,207 --> 00:26:23,458 అతనికి ఏం అయింది? 335 00:26:25,294 --> 00:26:27,379 అది పగటి వేళ. 336 00:26:28,964 --> 00:26:31,049 ఆకాశం దగ్గరగా ఉంది. 337 00:26:34,761 --> 00:26:39,725 ఒకప్పుడు మేము తినే ఆహారం కనిపించకుండా పోయింది. 338 00:26:39,725 --> 00:26:42,644 అందుకే, మేము కొత్త ప్రదేశాల కోసం వెతికాము. 339 00:26:43,687 --> 00:26:47,232 పై నుండి అతడిని ఏం ఢీ కొట్టిందో తెలియదు. 340 00:26:47,733 --> 00:26:49,151 అది అతనిని తూట్లు పొడిచింది, 341 00:26:49,902 --> 00:26:52,821 దానితో అతను నీటిలోకి మునిగిపోయాడు. 342 00:26:54,323 --> 00:26:56,074 అగాథంలోకి వెళ్లిపోయాడు. 343 00:26:57,534 --> 00:26:59,328 అతను ఇంకా అక్కడే ఉన్నాడు. 344 00:27:00,120 --> 00:27:02,581 అతనిలో మార్పుల్ని నేను గమనిస్తున్నాను. 345 00:27:05,209 --> 00:27:07,544 ఈ కొత్త మగ తిమింగలం ఎక్కడ ఉంది? 346 00:27:09,505 --> 00:27:11,215 నాకు కనిపించలేదు. 347 00:27:15,969 --> 00:27:20,432 మీ పేరు రెబెకా కదా. నేను ఆపరేషన్స్ లో ఉన్నాను. నా పేరు హెన్డ్రిక్స్. 348 00:27:20,432 --> 00:27:22,726 సదరన్ హెమిస్పియర్ ప్రాజెక్ట్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ 349 00:27:23,227 --> 00:27:24,728 ప్లేబ్యాక్, ఆపేయ్. 350 00:27:25,395 --> 00:27:27,481 సారీ, ఈ అంశం మీద మరొకరు పని చేస్తున్నారని క్రిస్టీనా 351 00:27:27,481 --> 00:27:29,316 - నాకు చెప్పలేదే. - లేదు, నేను రాత్రి వేళల్లో వచ్చి 352 00:27:29,316 --> 00:27:30,817 పనులు వేగంగా చేయడానికి ప్రయత్నిస్తున్నా, తెలుసా? 353 00:27:32,444 --> 00:27:33,445 సమయం కీలకమైనది. 354 00:27:33,445 --> 00:27:38,659 ఈ భూమి మీద చిట్టచివరి తిమింగలం అక్కడ బతికి ఉండే ఉవకాశం ఉంది. 355 00:27:38,659 --> 00:27:40,327 చివరి రెండు. 356 00:27:40,327 --> 00:27:43,914 హెచ్.డబ్ల్యు.1998 ఇంకా అది మాట్లాడుతున్న ఒక మగ తిమింగలం. 357 00:27:44,414 --> 00:27:46,041 నిన్న రాత్రి జరిగిన సంభాషణల కాపీ నీ దగ్గర ఉందా? 358 00:27:46,041 --> 00:27:47,417 ఏదో కారణం వల్ల, అది బ్లాక్ అయిపోయింది. 359 00:27:49,795 --> 00:27:53,048 మనం ప్రస్తుతం ఆడ తిమింగలం మీదనే దృష్టి పెట్టాలి అని నా అభిప్రాయం. 360 00:27:54,049 --> 00:27:57,010 నేను నీ రికార్డింగ్స్ కొన్ని విన్నాను. 361 00:27:57,010 --> 00:28:00,597 మాకు పుట్టే పిల్లలు కొంత సమయం కూడా మాతో ఉండరు. 362 00:28:00,597 --> 00:28:02,766 నువ్వు ఉపయోగిస్తున్న గొంతు గురించి నిన్ను అడగాలి అనుకున్నా. 363 00:28:02,766 --> 00:28:04,810 - గొంతా? - ఆ తిమింగలం కోసం. 364 00:28:05,435 --> 00:28:09,898 నువ్వు మనిషి గొంతు అవతార్ ని ఉపయోగిస్తున్నావు, అది మెనాజరి నిబంధనలకి విరుద్ధం. 365 00:28:09,898 --> 00:28:12,776 నా ఉద్దేశం, మనం దేన్ని అయితే వ్యతిరేకిస్తామో 366 00:28:12,776 --> 00:28:15,404 సరిగ్గా ఆ భావోద్వేగాలతో కూడిన అనుబంధానికి అది దారి తీస్తుంది. 367 00:28:15,404 --> 00:28:16,822 నా మీద ఫిర్యాదు చేస్తావా? 368 00:28:17,781 --> 00:28:19,283 లేదు, లేదు. 369 00:28:19,825 --> 00:28:21,285 లేదు. నీ ఇష్ట ప్రకారమే చేయి. 370 00:28:21,285 --> 00:28:23,620 అంటే, ఏదైనా నిర్ణయించడానికి నేను ఎవర్ని? 371 00:28:23,620 --> 00:28:26,623 నాకు తెలిసిన ఒకడు గబ్బిలాల మీద అధ్యయనం చేశాడు. వాటి గొంతుని మార్లిన్ మాన్రో లా మార్చేశాడు. 372 00:28:27,958 --> 00:28:29,376 నేను ఊరికే... నీ ఫైల్ ని మళ్లీ చదివాను. 373 00:28:29,376 --> 00:28:32,045 నువ్వు ఏనుగులకు కూడా వాయిస్ అవతార్ ఇచ్చావు. 374 00:28:34,256 --> 00:28:37,009 నేను వాటితో సంభాషించడానికి, మెరుగైన ప్రశ్నలు అడగడానికి అది ఉపయోగపడుతుంది. 375 00:28:37,009 --> 00:28:40,137 నువ్వు ఇక్కడ ఉపయోగిస్తున్న మనిషి గొంతు, 376 00:28:41,597 --> 00:28:43,056 ఈవ్ షియరర్, 377 00:28:44,057 --> 00:28:45,934 మీ అమ్మగారు అనుకుంట, కదా. 378 00:28:46,810 --> 00:28:49,563 ఇంకా సుమత్రా దీవుల్లోని ఆ ఆరంగుటాన్ గొంతు, 379 00:28:49,563 --> 00:28:51,982 అది ఒమర్ హడాద్ అనే పురుషుడిది కదా. 380 00:28:51,982 --> 00:28:53,650 - మరణించిన నా భర్తది. - అవును. 381 00:28:53,650 --> 00:28:57,237 సరే, నేను ముందే చెప్పినట్లు, నీ ఇష్టం వచ్చినట్లు చేయచ్చు. 382 00:28:58,697 --> 00:29:01,074 డైవింగ్ టీమ్ ని నేను ఏం అడిగానంటే 383 00:29:01,074 --> 00:29:04,244 సముద్రగర్భం లోనికి వెళ్లి ఆ మగ తిమింగలం విజువల్ ని, వీలయితే డిఎన్ఎ శాంపిల్ ని తీసుకురమ్మన్నాను. 384 00:29:04,745 --> 00:29:06,371 నువ్వు అతడిని చూశావా? అతను ఎలా ఉన్నాడు? 385 00:29:06,955 --> 00:29:08,081 చూశాను, 386 00:29:08,081 --> 00:29:10,209 కానీ ఈ రోజు ఆ మగ తిమింగలం మీద మనం అధ్యయనం చేయలేము, 387 00:29:10,209 --> 00:29:15,047 ఇంకా, విచారకరంగా, డైవ్ టీమ్ అతడిని కనుక్కోలేదు. 388 00:29:20,511 --> 00:29:21,595 నువ్వు ఇప్పుడు వింటున్నది... 389 00:29:24,014 --> 00:29:29,102 ఏడు సంవత్సరాల కిందట గ్లేసియర్ బే దగ్గర చేసిన పాత రికార్డు. 390 00:29:29,102 --> 00:29:31,313 అది మగ తిమింగలం. ఇప్పుడు చనిపోయింది. 391 00:29:31,313 --> 00:29:32,481 చనిపోయిందా? 392 00:29:33,815 --> 00:29:35,317 ఓడని ఢీ కొట్టింది, అనుకుంటా. 393 00:29:40,322 --> 00:29:43,200 ఒక చనిపోయిన తిమింగలం గొంతుని సంభోగం కోసం ఆడ తిమింగలానికి వినిపించావా? 394 00:29:43,992 --> 00:29:45,911 నీకు పిచ్చి పట్టిందా? 395 00:29:46,912 --> 00:29:47,913 నాకా? 396 00:29:49,414 --> 00:29:51,458 ఇప్పుడు, నువ్వు మిషన్ ప్రకటన చదివావా? 397 00:29:51,458 --> 00:29:53,877 మనం ఇక్కడ ఒంటరి జంతువుల్ని రక్షించడానికి లేము. 398 00:29:53,877 --> 00:29:56,797 మనం తిమింగలం జాతి మొత్తానికి బ్లూప్రింట్ ని తయారు చేసే పనిలో ఉన్నాము. 399 00:29:56,797 --> 00:29:59,383 ఆ ఆడ తిమింగలం ఇప్పుడు మగ తోడు కోసం అన్వేషిస్తూ, తిరుగుతోంది. 400 00:29:59,383 --> 00:30:03,554 సంభోగం కోసం ఆడ తిమింగలం చేసే ప్రవర్తన, అదే తన నుంచి మనకి అదే కావాలి. 401 00:30:03,554 --> 00:30:06,682 ఇది అర్థం చేసుకోవడానికి నువ్వు ఎందుకు అంత కష్టపడుతున్నావో నాకు తెలియడం లేదు. 402 00:30:06,682 --> 00:30:08,392 నా ఉద్దేశం, నువ్వు... 403 00:30:08,392 --> 00:30:11,478 మనకి ఏం కావాలో అది పొందడానికి మనం వాటికి ఆహారం, షెల్టర్ లాంటి లంచం ఇవ్వలేదు అనుకుంటున్నావా? 404 00:30:11,478 --> 00:30:14,064 నా ఉద్దేశం, నువ్వు పని చేస్తున్న ఏనుగుల విషయంలో 405 00:30:14,064 --> 00:30:15,732 అదే జరుగుతోందని బహుశా నీకు తెలియకపోవచ్చు. 406 00:30:15,732 --> 00:30:16,733 నేను... 407 00:30:17,234 --> 00:30:21,071 ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి 408 00:30:21,071 --> 00:30:23,949 అది మనుషుల కోసం చూస్తోంది అనుకుని ఉంటావు. 409 00:30:23,949 --> 00:30:26,159 - నా ఉద్దేశం... - నేను ఇందులో పని చేయలేను. 410 00:30:27,411 --> 00:30:29,830 నిజంగానా? నువ్వు ఇప్పటికే ఇందులో భాగం అయ్యావు. 411 00:30:34,126 --> 00:30:35,127 హేయ్, షియరర్! 412 00:30:35,794 --> 00:30:37,337 మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనుకుంటున్నావు? 413 00:30:37,337 --> 00:30:40,132 ఇవి చాలా తెలివైన జీవాలు! 414 00:30:40,132 --> 00:30:42,384 అవును, అవి తెలివైనవే, కానీ మనం కూడా తెలివైన వాళ్లమే. 415 00:30:42,384 --> 00:30:44,261 ఈ ప్రపంచంలో తనే చివరి తిమింగలం అనే విషయం 416 00:30:44,261 --> 00:30:47,472 తనకి తెలిసే లోగా మనం తన మెదడులో ఉన్నదంతా లాగేయకపోతే, 417 00:30:47,472 --> 00:30:50,225 మనకి ఇంక దానితో పనే ఉండదు, అవునా? 418 00:30:52,769 --> 00:30:54,688 నువ్వు అమ్మేయకుండా కనీసం ఒక్కటైనా మిగిలి ఉంది. 419 00:31:06,074 --> 00:31:07,242 ఈ మీటింగ్ కి సిద్ధమేనా? 420 00:31:07,242 --> 00:31:09,328 - ఖచ్చితంగా. - సరే. 421 00:31:09,328 --> 00:31:11,246 - మంచిది. - ఇది చాలా గొప్ప ఐడియా అనుకుంటాను... 422 00:31:11,246 --> 00:31:14,333 - నేను మీతో మాట్లాడాలి. - రెబెకా. 423 00:31:14,333 --> 00:31:16,543 - నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను. - ఇది ముఖ్యమైన విషయం. 424 00:31:17,836 --> 00:31:18,837 నేను మళ్లీ వస్తానులెండి. 425 00:31:23,717 --> 00:31:25,010 నువ్వు నాకు అబద్ధం చెప్పలేదు. 426 00:31:25,677 --> 00:31:27,221 ఆ తిమింగలానికి అబద్ధం చెప్పావు. 427 00:31:30,849 --> 00:31:32,768 ఎలాగైనా అది అంతరించిపోతోంది. 428 00:31:33,435 --> 00:31:36,605 కనీసం ఈ విధంగా అయినా, మనం అన్నీ పరిష్కారాలు కనుగొన్నాక దాన్ని తిరిగి పుట్టించవచ్చు. 429 00:31:38,690 --> 00:31:42,861 మొదటగా మనం వాటిని కొవ్వొత్తులుగానూ, వాటి ఎముకలతో కోర్సెట్ లనూ తయారు చేస్తాము 430 00:31:42,861 --> 00:31:46,782 ఆ తరువాత వాటిని ఓడలతో ఢీ కొడతాము ఇంకా వాటి కడుపుల్ని ప్లాస్టిక్ బ్యాగులతో నింపేస్తాము. 431 00:31:46,782 --> 00:31:50,160 అయినా కూడా, అప్పటికీ, ఎలాగో అలా, కొన్ని బతికి బయటపడతాయి. 432 00:31:51,620 --> 00:31:54,998 ఆ తరువాత కార్బన్ డైయాక్సైడ్ ఆ సముద్రాన్ని యాసిడ్ గా మార్చేస్తుంది, 433 00:31:55,499 --> 00:31:57,793 ఫలితంగా ఆ తిమింగలం తినే ఆహారం ఎముకలు కూడా పెరగకుండానే చనిపోతుంది. 434 00:31:57,793 --> 00:31:59,044 ఇంకా ఇప్పుడు... 435 00:32:00,003 --> 00:32:02,881 ఒకే ఒక్కటి మిగిలి ఉన్నప్పుడు, 436 00:32:04,216 --> 00:32:05,551 నువ్వు దానికి అబద్ధం చెబుతున్నావు. 437 00:32:09,513 --> 00:32:12,266 ఈ విషయాన్ని మొదటే ఆ ఆడ తిమింగలానికి చెప్పి ఉంటే, 438 00:32:13,100 --> 00:32:15,727 అది తన జీవిత కథని నీకు చెప్పడానికి ఇంత ఉత్సాహం చూపించి ఉండేదా? 439 00:32:17,145 --> 00:32:20,357 లేదంటే అసలు సముద్ర గర్భంలో పిల్ల తిమింగలాలే లేనప్పుడు మనం చేస్తున్న ఆ రికార్డింగుల్ని 440 00:32:20,357 --> 00:32:24,653 సహజంగా తల్లి తిమింగలం తన పిల్లలకు నేర్పించే పాఠాలను తల్లికి బదులుగా పిల్లలకు అందిస్తామని 441 00:32:24,653 --> 00:32:25,904 తనకి ముందే చెబితే ఏం అవుతుంది? 442 00:32:25,904 --> 00:32:27,739 అది నీ దృష్టిలో నిజాయితీ అయిన పని అవుతుందా? 443 00:32:30,576 --> 00:32:33,078 బిల్టన్ మనకి ఎక్కువ డబ్బు ఎందుకు ఇస్తున్నాడంటే ఆ పెద్ద తిమింగలం అంతరించిపోయే ముందు 444 00:32:33,078 --> 00:32:34,621 చివరి ఇంటర్వ్యూ మనం చేస్తున్నాం. 445 00:32:34,621 --> 00:32:35,831 ఇది మన విజయం. 446 00:32:35,831 --> 00:32:38,667 జనానికి మనం ఏం చేస్తున్నామో తెలిసిపోతే, ఈ విషయం మీడియాకి తెలిస్తే... 447 00:32:38,667 --> 00:32:39,877 అది ఎలా జరుగుతుంది? 448 00:32:45,340 --> 00:32:47,217 మిగతా పనిని హెన్డ్రిక్స్ పూర్తి చేస్తాడు. 449 00:32:48,552 --> 00:32:50,053 నిన్ను అలాస్కా పంపించాలని అనుకుంటున్నాం. 450 00:32:50,554 --> 00:32:52,848 - అక్కడ తోడేళ్ల జాతులు ఉన్నాయి... - "ముగిస్తాడు" అంటే దాని ఉద్దేశం ఏంటి? 451 00:32:52,848 --> 00:32:55,058 - ...వాటిని అలెగ్జాండర్ ఆర్కిపెలాజో తోడేలు అంటారు. - అతను దానితో ఏం మాట్లాడతాడు? 452 00:32:55,559 --> 00:32:59,271 టుమారోజూ సంస్థకి ఆ తిమింగలం దొరకకూడదని దానంతట అది తీరానికి వచ్చేలా అతను చేస్తున్నాడా? 453 00:32:59,271 --> 00:33:00,480 అతను చేస్తున్నది అదేనా? 454 00:33:02,024 --> 00:33:04,693 నువ్వు దయచేసి వెళితే, నేను ఒక మీటింగ్ కి వెళ్లాలి. 455 00:33:17,247 --> 00:33:20,209 ప్లేబ్యాక్. మగ తిమింగలం పాటని ప్రసారం చేయి. 456 00:33:21,168 --> 00:33:22,878 నిరంతరం ప్లే అయ్యేలా లూప్ లో ఉంచు. 457 00:33:36,767 --> 00:33:42,606 "గిడ్డంగి పగుళ్ల గుండా మధ్యాహ్నపు ఎండ ప్రసరించనీ, 458 00:33:43,524 --> 00:33:47,236 ఒక వైపు సూర్యుడు అస్తమిస్తుంటే, మరో వైపు మూటలు పెరుగుతుండనీ. 459 00:33:48,987 --> 00:33:50,531 సాయంకాలం రానీ. 460 00:33:52,032 --> 00:33:54,284 కీచురాళ్లు చప్పుళ్లు చేయనీ 461 00:33:55,077 --> 00:33:58,330 ఒక మహిళ సూదులతో నూలు అల్లనీ. 462 00:33:59,957 --> 00:34:01,291 సాయంకాలం రానీ. 463 00:34:03,126 --> 00:34:08,757 పొడవాటి గడ్డిలో వదిలివేసిన గడ్డ పార మీద మంచు బిందువులు పడనీ. 464 00:34:10,384 --> 00:34:12,844 నక్షత్రాలు ప్రత్యక్షం కానీ. 465 00:34:13,344 --> 00:34:19,768 చందమామ తన వెండి కొమ్ముని ప్రదర్శించనీ." 466 00:34:19,768 --> 00:34:21,395 - అమ్మా. - "ఇది ముగించ"... 467 00:34:21,395 --> 00:34:22,688 దీనిని ముగించనీ... 468 00:34:23,480 --> 00:34:27,734 నన్ను ముగించనివ్వు. నేను ఈ పెద్ద పద్యం మొత్తాన్ని కంఠస్థ పట్టాను. 469 00:34:27,734 --> 00:34:28,694 కేవలం నన్ను ముగించనీ... 470 00:34:28,694 --> 00:34:34,241 నేను మర్చిపోక ముందే ఇదంతా చెప్పేయాలి లేదంటే నా జ్ఞాపకశక్తి... 471 00:34:35,324 --> 00:34:38,536 - "ఆ నక్కని"... "ఆ నక్కని"... - ఆపు. ఆపు. 472 00:34:38,536 --> 00:34:42,291 "ఏదైనా జరగనీ. నువ్వు ఏమీ భయపడనక్కర లేదు." 473 00:34:42,291 --> 00:34:46,378 నీ మీద నాకు చాలా కోపంగా ఉంది, అమ్మా. 474 00:34:47,004 --> 00:34:48,880 - నాకు తెలుసు. నాకు తెలుసు. - చాలా చెడ్డ కోపంగా ఉంది. 475 00:34:49,755 --> 00:34:53,802 కానీ నేను ఏదైనా విరుద్ధంగా చేసి ఉంటే, నా మీద నేనే కోపం తెచ్చుకునే దాన్ని... 476 00:34:56,138 --> 00:35:00,767 ఇంకా నాతో నువ్వు వాదిస్తుండగా మధ్యలో చనిపోవడం నాకు ఇష్టం లేదు. 477 00:35:01,643 --> 00:35:06,481 నీ ఆరోగ్యం నయం అవుతోందని డాక్టర్ కేరగర్ అన్నారని నువ్వు నాతో చెప్పావు. 478 00:35:07,107 --> 00:35:08,609 నేను ఇంటికి వచ్చేయాలి అనుకున్నాను. 479 00:35:08,609 --> 00:35:11,862 నాకు ఇంటికి వచ్చేయాలి అనిపించింది. కానీ నువ్వు నన్ను ఇంకాస్త సమయం తీసుకో అన్నావు. 480 00:35:11,862 --> 00:35:16,575 అవును, మనుషులు అంతరించిపోవడం లేదు, కానీ ఏనుగులు అంతరించిపోతున్నాయి. 481 00:35:17,576 --> 00:35:20,454 ఆ నిర్ణయం తీసుకోవలసింది నువ్వు కాదు, అమ్మా. 482 00:35:20,454 --> 00:35:22,080 నీ పని చాలా ముఖ్యమైనది. 483 00:35:22,956 --> 00:35:25,417 బెకా, ఆమె నువ్వు బాధపెట్టకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. 484 00:35:25,417 --> 00:35:28,086 - నీ పనిని నువ్వు పూర్తి చేయాలని తను కోరుకుంది. - నీకు తెలుసు. నీకు తెలుసు. 485 00:35:28,086 --> 00:35:30,964 నువ్వు ఎందుకు... అసలు మీ అందరికీ ఏం అయింది? 486 00:35:30,964 --> 00:35:35,677 నాకు లివర్ లో క్యాన్సర్ ఉంది ఇంకా ఆరోగ్యం అంతా దెబ్బతినింది. 487 00:35:35,677 --> 00:35:37,429 అమ్మా, వద్దు. జోకులు వేయకు. 488 00:35:40,307 --> 00:35:41,892 నువ్వు నాకు అబద్ధం చెప్పావు, అమ్మా. 489 00:35:42,809 --> 00:35:44,061 నువ్వు నాకు అబద్ధం చెప్పావు. 490 00:35:59,535 --> 00:36:05,457 ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిని నీ జీవితంలో నీకు ఎదురైనప్పుడు, 491 00:36:05,457 --> 00:36:10,045 నువ్వు... నీకు గతం గురించి కోపం రాదు. 492 00:36:10,045 --> 00:36:15,634 ఇంక భవిష్యత్తు, భవిష్యత్తు చేసే ప్రణాళికలలో నువ్వు ఉండవు, కాబట్టి అది మనల్ని వదిలి వెళ్లిపోతుంది. 493 00:36:15,634 --> 00:36:18,387 మనకి ఉన్నదల్లా, ఈ వర్తమానమే. 494 00:36:21,932 --> 00:36:23,976 - ఇది చాలదు. - లేదు. 495 00:36:23,976 --> 00:36:27,354 కానీ... మన దగ్గర ఉన్నది ఇదే. 496 00:36:28,355 --> 00:36:30,232 ఇప్పుడు మన దగ్గర ఈ వర్తమానం కొద్దిగా ఎక్కువే ఉంది. 497 00:36:39,366 --> 00:36:41,451 మన దగ్గర ఎప్పటికీ ఉన్నది ఇదే. 498 00:37:57,194 --> 00:37:58,445 ప్రసారం నిలిపివేయి. 499 00:37:59,530 --> 00:38:01,865 కంటెంట్ ని సాధారణ ఇంగ్లీష్ వాక్యంగా మార్చు. 500 00:38:02,950 --> 00:38:06,703 ఎలాంటి దారి లేదు. ఎలాంటి దారి లేదు. 501 00:38:06,703 --> 00:38:09,623 - ఎలాంటి దారి లేదు. ఎలాంటి దారి... - ఓహ్, దేవుడా. 502 00:38:09,623 --> 00:38:13,377 స్పీచ్ మైక్రోఫోన్ ఓపెన్ చేయి. సెషన్ ని రికార్డు చేయద్దు. 503 00:38:14,837 --> 00:38:15,838 నా మాట నీకు వినిపిస్తోందా? 504 00:38:17,005 --> 00:38:18,882 నువ్వు ఇప్పుడు ఏం విన్నావో, అది వినిపించుకోకు. 505 00:38:18,882 --> 00:38:20,926 మగ తిమింగలం మాటల్ని వినకు. నా మాట నీకు వినిపిస్తోందా? 506 00:38:22,261 --> 00:38:23,470 చెత్త. 507 00:38:24,388 --> 00:38:26,640 నువ్వు ఇంకా అక్కడ ఉంటే, దయచేసి కేవలం... 508 00:38:29,059 --> 00:38:32,521 మగ తిమింగలం నీ దగ్గరకి రాకపోవడానికి ఒక కారణం ఉంది, 509 00:38:32,521 --> 00:38:34,815 నీకు బదులు చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. 510 00:38:36,859 --> 00:38:38,110 మగ తిమింగలం అనేది జీవించి లేదు. 511 00:38:39,736 --> 00:38:40,737 మగ తిమింగలం అనేది లేనే లేదు. 512 00:38:41,822 --> 00:38:46,994 నువ్వు ఇప్పుడు వింటున్న మగ తిమింగలం గొంతు చాలా ఏళ్ల కిందటిది, చాలా దూర ప్రాంతానిది. 513 00:38:46,994 --> 00:38:48,745 అది కేవలం ఒక రికార్డింగ్. 514 00:38:49,830 --> 00:38:50,831 సరే, చెత్త. 515 00:38:51,582 --> 00:38:54,585 చెత్త. లేదు, నీకు తెలియదు... రికార్డింగ్ అంటే ఏమిటో నీకు తెలియదు కదా. 516 00:38:56,879 --> 00:38:59,006 సరే, ఇది నీకు ఎలా వివరించను? 517 00:39:08,724 --> 00:39:11,935 మేము నీ అంతరంగాన్ని తెలుసుకోవాలి అనుకున్నాం, 518 00:39:12,436 --> 00:39:13,812 నీ జీవితం ఎలా సాగుతుందో తెలుసుకోవాలని ఆశించాం. 519 00:39:15,397 --> 00:39:17,107 అది మా స్వార్థం కోసం నీ సమాచారాన్ని కోరుకున్నాం, 520 00:39:18,734 --> 00:39:20,485 అంతే తప్ప అది నీకు మేలు చేయడం కోసం కాదు. 521 00:39:22,821 --> 00:39:25,365 నువ్వు చనిపోయే అవకాశం ఉన్న చోటుకి నిన్ను ఈదుకుంటూ రమ్మని మేము చెబుతున్నాం. 522 00:39:25,991 --> 00:39:29,036 అలా చెబుతున్నది మేమే, మగ తిమింగలం కాదు. 523 00:39:30,537 --> 00:39:31,538 అది మగ తిమింగలం కాదు. 524 00:39:37,127 --> 00:39:39,463 ఆ మగ తిమింగలం కొన్ని సంవత్సరాల కిందటే చనిపోయింది. 525 00:39:40,297 --> 00:39:41,548 అది ఇక్కడ లేదు. 526 00:39:42,174 --> 00:39:45,302 దాని గొంతు నిజమైనది కాదు. 527 00:39:49,056 --> 00:39:50,307 దూరంగా ఈదుకుంటూ వెళ్లిపో. 528 00:39:53,018 --> 00:39:54,186 నీకు ఆహారం దొరికే చోటుకి వెళ్లు. 529 00:39:58,690 --> 00:40:00,359 మేము నీకు అబద్ధం చెబుతున్నాము. 530 00:40:01,902 --> 00:40:04,488 కష్టాల్లో ఉన్నప్పుడు మా మనుషులం ఇలాగే ప్రవర్తిస్తాము. 531 00:40:10,494 --> 00:40:11,495 మేము అబద్ధాలు ఆడతాము. 532 00:40:36,645 --> 00:40:38,730 అతను ఇక్కడ లేడా? 533 00:40:42,609 --> 00:40:43,610 లేడు. 534 00:40:45,487 --> 00:40:49,908 ఇక్కడ లేని జీవి గొంతు మీ దగ్గర ఉంటుందా? 535 00:40:50,409 --> 00:40:52,494 అది నిజమైనది కాదా? 536 00:40:54,371 --> 00:40:55,497 దానినే అబద్ధం అంటారు. 537 00:40:58,792 --> 00:41:01,086 ఆ పదానికి మా దగ్గర శబ్దం లేదు. 538 00:41:02,129 --> 00:41:07,301 నిజం కాని మాటని ఎందుకు చెప్పాలి? 539 00:41:12,514 --> 00:41:15,517 మీ జాతిలో నువ్వు మాత్రమే చివరి జీవివి కావచ్చు. 540 00:41:17,853 --> 00:41:21,773 మేము మరొక తిమింగలాన్ని కనుగొనలేకపోయాం. నిన్ను తప్ప. 541 00:41:24,109 --> 00:41:26,695 అయితే నేను కూడా మరణించే సమయం వచ్చిందన్న మాట. 542 00:41:31,825 --> 00:41:35,704 మనం మరణిస్తే, మళ్లీ జీవం మొదలవుతుందని నువ్వు చెప్పావు కదా. 543 00:41:38,165 --> 00:41:40,083 ఆ తరువాత జరిగేది నిన్ను నిన్నుగా మలుస్తుందని చెప్పావు. 544 00:41:41,210 --> 00:41:42,753 నువ్వు ఏం తీసుకుంటావో అది తిరిగి ఇస్తావు. 545 00:41:44,880 --> 00:41:45,881 అవును. 546 00:41:48,550 --> 00:41:51,303 ఏదో ఒక రోజు నువ్వు మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. 547 00:41:53,388 --> 00:41:54,389 ఎప్పుడు? 548 00:41:56,225 --> 00:41:57,351 అందుకు సమయం పడుతుంది. 549 00:41:58,936 --> 00:42:00,979 నీకు లేదా నాకు ఉన్న సమయం కన్నా ఎక్కువ. 550 00:42:04,483 --> 00:42:07,903 కానీ నువ్వు నాకు ఏం చెప్పావో, మన ఇద్దరం పరస్పరం ఏం మాట్లాడుకున్నామో... 551 00:42:09,905 --> 00:42:11,782 అదంతా కొత్త తిమింగలాలను వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. 552 00:42:16,745 --> 00:42:19,790 కానీ తరువాత కాలంలో ఇదంతా ఎలా భిన్నంగా ఉంటుంది? 553 00:42:31,510 --> 00:42:34,847 స్పీచ్ మైక్రోఫోన్ ని ఓపెన్ చేయి. ఈ సంభాషణని రికార్డు చేయద్దు. 554 00:42:36,390 --> 00:42:40,269 మేము అనుమతించని సెషన్ నుండి అదనపు డేటా ఏదీ లేదని మేము గమనించాము. 555 00:42:41,103 --> 00:42:43,522 నేను తనని సంప్రదించలేకపోయాను. 556 00:42:43,522 --> 00:42:44,606 ఏమీ లేదా? 557 00:42:46,775 --> 00:42:47,776 తను వెళ్లిపోయింది. 558 00:42:48,360 --> 00:42:53,282 ఇప్పుడు, నీకు నేను గుర్తు చేయవలసిన అవసరం లేదు 559 00:42:53,282 --> 00:42:57,119 మెనాజరి2100 ఉద్యోగికీ ఇంకా టార్గెట్ జీవికి మధ్య జరిగే సంభాషణపై హక్కులన్నీ మాకే ఉంటాయని నీకు తెలుసు. 560 00:42:58,912 --> 00:43:00,664 చూడండి, నేను నిబంధనల్ని ఉల్లంఘించాను. 561 00:43:01,623 --> 00:43:04,710 నేను చనిపోయిన మా అమ్మ గొంతుని ఉపయోగించాను. సారీ. 562 00:43:05,502 --> 00:43:06,503 ఆ పొరపాటు మళ్లీ జరగదు. 563 00:43:10,632 --> 00:43:14,136 ఈ మధ్య మనం చాలా వాటికి గుడ్ బై చెప్పేస్తున్నాం. 564 00:43:15,971 --> 00:43:18,557 జంతువులకీ, ఒకరికొకరం, మొత్తం నగరాలకీ. 565 00:43:20,475 --> 00:43:21,685 కానీ దానికి మూల్యం చెల్లించాలి. 566 00:43:23,353 --> 00:43:25,856 సముద్ర తీరంలో ఆల్ఫా సంస్థ మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించడం గమనించాను. 567 00:43:27,816 --> 00:43:29,735 వాళ్ల కంటే మేము ముందే ఉన్నందుకు సంతోషంగా ఉంది. 568 00:43:29,735 --> 00:43:33,071 అవును, ఇప్పటి వరకూ మనం, ఇప్పుడు వాళ్లు అయినట్లున్నారు. 569 00:43:37,034 --> 00:43:39,119 నువ్వు అలాస్కా క్షేత్రం పని చేయబోతున్నావు, 570 00:43:39,620 --> 00:43:41,580 కాబట్టి నువ్వు మోసుకెళ్లే వీలున్న యూనిట్ ని తీసుకెళ్లాలి. 571 00:43:41,580 --> 00:43:43,373 అది డేటాబేస్ తో అనుసంధానం అయి ఉంటుంది. 572 00:43:45,709 --> 00:43:48,212 అక్కడి చల్లని వాతావరణం ఏజ్రాకి అనుకూలంగా ఉండచ్చు. 573 00:43:50,214 --> 00:43:51,465 అవును. అవును. 574 00:43:53,759 --> 00:43:55,219 నేను ఇంక స్కూలుకి వెళ్లబోవడం లేదు. 575 00:43:55,219 --> 00:43:57,471 - ఎందుకు నీకు ఆరోగ్యం బాగా లేదా? - మేము వేరే వెళ్లిపోతున్నాం. 576 00:43:58,263 --> 00:43:59,515 - ఎక్కడికి? - అలాస్కా. 577 00:44:00,599 --> 00:44:02,893 మా అమ్మ తోడేళ్లతో మాట్లాడటానికి వెళుతోంది. 578 00:44:10,609 --> 00:44:13,237 నువ్వు నన్ను ఇక్కడ తిరిగి కలుసుకుని దాని అర్థం ఏమిటో నాకు చెబుతావా? 579 00:44:13,237 --> 00:44:16,114 అలాగే. అలాస్కాలో ఇంకా శీతాకాలం ఉంది అనుకుంటా. 580 00:44:18,325 --> 00:44:21,161 బహుశా నేను మీ ఊరు వచ్చి అక్కడ మనం నిజమైన స్నోమాన్ ని తయారు చేయచ్చేమో. 581 00:44:22,204 --> 00:44:23,580 కానివ్వు. దాన్ని తెరిచి చూడు. 582 00:44:35,259 --> 00:44:38,428 మూపురం ఉన్న తిమింగలం 2046లో అంతరించిపోయింది. 583 00:44:39,054 --> 00:44:43,308 ఒక దశలో, ఈ భూమి మీద లక్షా ఇరవై ఐదు వేల తిమింగలాలు ఉండేవి. 584 00:44:44,476 --> 00:44:47,271 అవి ధ్రువ ప్రదేశాలలో వేసవి కాలంలో ఆహార క్షేత్రాలని వదిలి 585 00:44:47,271 --> 00:44:49,648 భూమధ్యరేఖకు దగ్గరగా మరింత వెచ్చని నీటి వాతావరణంలో సంభోగం కోసం వలస వెళ్లాయి. 586 00:44:50,941 --> 00:44:52,651 అవి పాటలు పాడటం ద్వారా ప్రసిద్ధి పొందాయి, 587 00:44:53,151 --> 00:44:56,697 ఇంకా సంభాషించుకోవడానికి అవి క్లిష్టమైన ధ్వనులను సృష్టించడం వాటి ప్రత్యేకత. 588 00:45:18,760 --> 00:45:22,389 భారతదేశపు రాబందు 2039లోనే అంతరించిపోయింది. 589 00:45:22,389 --> 00:45:23,807 ఒకప్పుడు వాటి సంఖ్య ఎనిమిది కోట్లు... 590 00:45:23,807 --> 00:45:27,352 ఆఫ్రికన్ ఏనుగు 2040లో అంతరించిపోయింది. 591 00:45:27,936 --> 00:45:29,229 అవి అంతరించిపోవడానికి ముందు... 592 00:45:29,229 --> 00:45:34,109 తాపనూలి ఒరాంగుటాన్ 2045లో అంతరించిపోయింది. అప్పుడు అది... 593 00:45:34,109 --> 00:45:36,862 పోలార్ బేర్ 2043లో అంతరించిపోయింది 594 00:45:36,862 --> 00:45:40,407 అందుకు కారణం వాతావరణ మార్పు కారణంగా సముద్రపు మంచు ప్రదేశం నివాసయోగ్యంగా లేకపోవడమే. 595 00:45:40,407 --> 00:45:42,492 - నువ్వు తయారుగా ఉన్నావా? - రెడీ. 596 00:45:51,543 --> 00:45:53,295 - మూడు గంటలా? - అవును. 597 00:45:53,879 --> 00:45:56,006 నువ్వు ఈ పని చేసినట్లు ఎవ్వరికీ చెప్పకు. 598 00:45:56,006 --> 00:45:57,466 ఎవరికీ, ఎవరికీ చెప్పను. 599 00:45:57,466 --> 00:45:58,383 ఎప్పటికీ. 600 00:46:18,820 --> 00:46:21,698 భవిష్యత్తులో ఇదంతా ఎలా భిన్నంగా ఉంటుంది? 601 00:46:23,575 --> 00:46:26,286 మనం మార్చితేనే అది మారుతుంది. 602 00:46:27,996 --> 00:46:30,290 మనం ఈ ప్రపంచం గురించి అబద్ధాలు చెప్పడం మానేయాలి. 603 00:46:32,626 --> 00:46:38,048 మనం చేయలేని పనిని భావితరాల వారు వచ్చి ఈ ప్రపంచాన్ని బాగు చేస్తారని ఆశించడం మానేయాలి. 604 00:46:49,643 --> 00:46:50,644 ఇక్కడ బాగుంది. 605 00:46:51,270 --> 00:46:53,647 ఇక్కడ బాగుంది. 606 00:46:59,152 --> 00:47:01,446 ఇక్కడ ఇంక చేపలు లేవు. 607 00:47:01,446 --> 00:47:04,032 అవి ఉండి ఉంటే, మనకి తెలిసేది. 608 00:47:04,032 --> 00:47:06,994 నేను ఇప్పుడు ఆల్ఫా సంస్థ కోసం పని చేస్తున్నాను. 609 00:47:06,994 --> 00:47:08,370 సరే. 610 00:47:11,999 --> 00:47:13,834 ఆ ఆడ తిమింగలం ఇక్కడే ఉందని నీకు ఎలా తెలుసు? 611 00:47:15,627 --> 00:47:16,628 నాకు తెలియదు. 612 00:47:17,880 --> 00:47:19,590 ఆల్ఫా 613 00:47:39,651 --> 00:47:40,485 ఇలా రా. 614 00:47:46,700 --> 00:47:48,202 - నువ్వు సిద్ధమేనా? - అవును. 615 00:47:49,369 --> 00:47:52,581 - మూడు, రెండు, ఒకటి, దూకు. - మూడు, రెండు, ఒకటి. 616 00:48:05,302 --> 00:48:06,428 నేను ఇక్కడ ఎంత సేపు ఉండాలి? 617 00:48:06,428 --> 00:48:07,804 ఎక్కువ సేపు కాదు. 618 00:48:14,019 --> 00:48:15,479 అది మనల్ని తినదు, అవునా? 619 00:48:17,105 --> 00:48:21,360 దాని కన్నా మనకే ఎక్కువ పళ్లు ఉంటాయి, కానీ అది కొరికిందంటే దాన్ని తప్పు పట్టలేము. 620 00:48:32,704 --> 00:48:35,666 ఈ శబ్దానికి అర్థం ఏమిటో నాకు తెలియదు. 621 00:48:37,292 --> 00:48:40,838 మ్యూజిక్? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక భిన్నమైన లక్షణం ఉంటుంది అని అర్థం. 622 00:48:42,464 --> 00:48:46,385 మీలో ఒకరు దీనిని తయారు చేసి ఉంటారు, అతను నీకు తెలుసా? 623 00:48:47,094 --> 00:48:51,014 నేను అతడిని ఎప్పుడూ కలవలేదు, అతను చేసిన మ్యూజిక్ మాత్రమే తెలుసు. 624 00:48:53,725 --> 00:48:58,021 కానీ ఇప్పటికీ అతడిని నువ్వు వినగలుగుతున్నావా? 625 00:48:59,356 --> 00:49:00,357 అవును. 626 00:49:01,692 --> 00:49:02,693 ఇలా చూడు. 627 00:49:04,444 --> 00:49:09,449 అయితే నీకు అతని ప్రపంచం తెలుసు కానీ అతను తెలియదా? 628 00:49:10,617 --> 00:49:11,618 అవును. 629 00:49:12,744 --> 00:49:15,372 ఇంకా పుట్టని వారి గురించి కూడా తెలియదా? 630 00:49:16,164 --> 00:49:19,042 మనం ఈ రోజు చేసే ధ్వనులని వాళ్లు భవిష్యత్తులో వినగలరా? 631 00:49:19,751 --> 00:49:20,752 అవును. 632 00:49:22,045 --> 00:49:23,046 అది ఎక్కడికి వెళ్లింది? 633 00:49:24,506 --> 00:49:25,799 అది వెళ్లిపోయిందేమో, అమ్మా. 634 00:49:31,597 --> 00:49:32,598 అదిగో అక్కడ ఉంది. 635 00:49:38,854 --> 00:49:41,440 ఈ ప్రపంచంలో ఎలా ఉండాలో నువ్వు వాళ్లకి మార్గాన్ని చూపించాలి. 636 00:49:43,692 --> 00:49:44,902 మా మనుషుల గురించి హెచ్చరించాలి. 637 00:49:46,445 --> 00:49:50,449 మేము ఎంత నష్టం చేయగలమో నువ్వు చూశావు, మేము ఇప్పటివరకూ ఏం చేశామో నీకు తెలుసు. 638 00:49:58,332 --> 00:50:00,250 మేము ఎలాంటి వాళ్లమో మీ పిల్లలకు చెప్పు. 639 00:50:05,380 --> 00:50:06,673 నేను ఇప్పటికే చెప్పాను. 640 00:51:34,761 --> 00:51:36,763 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్