1 00:01:01,144 --> 00:01:03,105 లారా డేవ్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 2 00:01:19,705 --> 00:01:22,791 {\an8}ఆస్టిన్, టెక్సస్ 3 00:01:23,500 --> 00:01:24,585 సరే మరి. బై బై. 4 00:01:35,053 --> 00:01:37,890 - నీకు ఆకలిగా ఉందా? - నేను పని చేసేది రెస్టారెంట్లోనే కదా? 5 00:01:38,473 --> 00:01:40,434 హా, అవును. వెళ్లి పార్సెల్ తీసుకురా. 6 00:01:40,434 --> 00:01:44,062 నేను పాడైపోయిన ఆహారం తిని చాలా కాలమైంది, అది తినాల్సిన సమయం వచ్చిందనుకుంటా. 7 00:01:44,563 --> 00:01:46,899 కస్టమర్లకు ఆహారం తప్ప అన్నీ నచ్చుతాయి. 8 00:01:47,733 --> 00:01:50,277 అవునులే. నచ్చకపోవడానికి కారణం లేదుగా! 9 00:02:02,456 --> 00:02:03,290 చాలా బాగుంది. 10 00:02:05,042 --> 00:02:06,126 వచ్చి నాతో చూస్తావా? 11 00:02:06,627 --> 00:02:08,377 లాయర్ పరీక్షలు ఎలా ఉంటాయో నీకు తెలుసో లేదో కానీ, 12 00:02:08,377 --> 00:02:10,339 అవి చాలా కష్టంగా ఉంటాయి. 13 00:02:10,339 --> 00:02:14,343 గత రెండు మాక్ పరీక్షల్లో అదరగొట్టేశావు కదా. ఒక 15 నిమిషాలు విశ్రాంతి తీసుకో, ఏమీ కాదు. 14 00:02:14,343 --> 00:02:17,596 - ఆఖరి అయిదు నిమిషాలు చూస్తా. - హా. ఆ మాత్రమైనా చాల్లే. 15 00:02:19,181 --> 00:02:20,057 బాబోయ్! 16 00:02:25,938 --> 00:02:27,272 దేవుడా. 17 00:02:28,690 --> 00:02:29,775 టైరు పంక్చర్ అయ్యుంటుంది. 18 00:02:32,778 --> 00:02:34,696 జాక్ లేదే. 19 00:02:34,696 --> 00:02:36,782 మనం మెకానిక్ కి కాల్ చేయాలి. 20 00:02:36,782 --> 00:02:38,116 నీ సెల్ ఫోన్ ఓసారి ఇస్తావా? 21 00:02:38,742 --> 00:02:40,661 మా నాన్నకి మెసేజ్ పంపిస్తున్నాలే. 22 00:02:42,079 --> 00:02:44,081 మీ నాన్నని ఇలా కలుసుకోవాలంటావా? 23 00:02:44,081 --> 00:02:45,249 ఏం కాదులే. 24 00:02:46,250 --> 00:02:47,668 నా దగ్గర మసాలా కంపు కొడుతోంది. 25 00:02:47,668 --> 00:02:48,877 నాకు మసాలా అంటే ఇష్టం. 26 00:02:51,004 --> 00:02:52,673 కంగారుపడిపోకు. 27 00:02:52,673 --> 00:02:53,924 నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరిగదు. 28 00:02:57,928 --> 00:03:00,556 నికొలస్ బెల్ ఎంత ప్రమాదకరమైన వ్యక్తో నీకు కొంచెమైనా తెలుసా? 29 00:03:00,556 --> 00:03:02,641 దేశంలో ఉండే అతి భయంకరమైన మాఫియా లాయర్లలో అతను కూడా ఒకడు. 30 00:03:02,641 --> 00:03:04,601 కంపానో మాఫియాకి ఆయనే ముఖ్యమైన సలహాదారుడు. 31 00:03:04,601 --> 00:03:07,437 సలహాదారుడా? ఇదేమైనా "గాడ్ ఫాదర్" సినిమానా? 32 00:03:07,437 --> 00:03:10,023 కాదు, ఉత్తర అమెరికాలోనే అత్యంత శక్తివంతమైన మాఫియా వీళ్లది. 33 00:03:10,023 --> 00:03:11,984 వీళ్ల దగ్గర ఉన్నంత డబ్బు కుబేరుడి దగ్గర కూడా ఉండదు, 34 00:03:11,984 --> 00:03:13,694 విటో కోర్లీన్ పాత్రలా వీళ్లలో రవ్వంత దయ కూడా ఉండదు. 35 00:03:13,694 --> 00:03:15,153 అర్థమైంది. వీళ్లు చాలా ప్రమాదకరమైన వాళ్లు. 36 00:03:15,863 --> 00:03:17,239 నీకు అర్థం కావట్లేదు. 37 00:03:17,906 --> 00:03:20,951 ఊరూ పేరూ ఉండని రాక్షసులు వాళ్లు. 38 00:03:22,160 --> 00:03:25,080 నీ భర్త అందించిన ఆధారాల పుణ్యమా అని ఆ మాఫియాలో, అత్యున్నత స్థాయికి చెందిన 39 00:03:25,080 --> 00:03:28,000 ఎనిమిది మంది జైలు పాలయ్యారు, నికొలస్ బెల్ కూడా జైలు పాలయ్యాడు. 40 00:03:28,709 --> 00:03:30,127 అందుకే అతను పారిపోవలసి వచ్చింది. 41 00:03:30,669 --> 00:03:33,714 అతను విజయవంతంగానే పారిపోయాడని చెప్పాలి, కానీ షాప్ లో జరిగినది, జాతీయ స్థాయిలో సంచలనాత్మకమైంది. 42 00:03:34,298 --> 00:03:36,508 షాప్ సంస్థ నుండి ఓవెన్ బయటకు వచ్చేయవచ్చు కదా? 43 00:03:37,551 --> 00:03:40,137 అవెట్ చేసేది తప్పు అని తెలియగానే అతను మానేయవచ్చు కదా? 44 00:03:41,305 --> 00:03:43,974 అప్పటికే ఆలస్యం అయిపోయి ఉండవచ్చు, లేదా అవెట్ కి అతని గురించి ఏమైనా రహస్యం తెలిసి ఉండవచ్చు. 45 00:03:45,767 --> 00:03:47,644 - అతను నన్ను బెదిరించాడు... - అవెట్? 46 00:03:47,644 --> 00:03:48,729 ఫోనులో. 47 00:03:49,396 --> 00:03:52,774 ఓవెన్ గతంలో చీకటి కోణాలు ఉన్నాయన్నట్టు మాట్లాడాడు. 48 00:03:52,774 --> 00:03:57,070 హా, ఓవెన్ లోపలి నుండి పరిస్థితులని చక్కదిద్దాలని చూసి ఉంటాడు, 49 00:03:58,113 --> 00:03:59,239 అది సాధ్యం కానప్పుడు... 50 00:03:59,907 --> 00:04:01,200 అది ఓవెన్ దా? 51 00:04:03,535 --> 00:04:04,411 అతనే నాకు పంపాడు. 52 00:04:04,411 --> 00:04:07,122 షాప్ సంస్థలో జరిగిన ప్రతీదాన్ని, అతను అందులో పూసగుచ్చినట్టు వివరించాడు. 53 00:04:07,122 --> 00:04:10,125 అధికారిక మెమోలు, ఈమెయిళ్లు. అవెట్ చేసే పనులను నోట్ చేసుకున్నాడు. 54 00:04:11,001 --> 00:04:12,127 ఓవెన్ ఎలా సరిదిద్దాలని ప్రయత్నించాడో కూడా. 55 00:04:13,504 --> 00:04:16,214 మరి, ఓవెన్ ఎఫి.బీ.ఐ వాళ్ల దగ్గరికి వెళ్లి ఇదంతా వివరించవచ్చు కదా? 56 00:04:16,214 --> 00:04:18,841 ఎఫ్.బీ.ఐ వాళ్లు అతని వేలిముద్రలు తీసుకున్న మరుక్షణం నుండి అతను ప్రమాదంలో ఉన్నట్టే. 57 00:04:18,841 --> 00:04:22,346 కంపానో వాళ్ల మనుషులు అన్నిచోట్లా ఉన్నారు. అతను రిస్క్ తీసుకోలేక, పారిపోయాడు. 58 00:04:26,975 --> 00:04:28,310 వీళ్లకి బెయిలీ కంటపడితే... 59 00:04:28,310 --> 00:04:29,394 అది జరగదు. 60 00:04:30,312 --> 00:04:32,689 అలా అని నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు కదా. తను ఎక్కడుందో నీకు తెలీను కూడా తెలీదు. 61 00:04:32,689 --> 00:04:34,650 డజను మంది పోలీసోళ్లు వీధులంతా గాలిస్తున్నారు. 62 00:04:34,650 --> 00:04:36,944 - వాళ్లు తన ఆచూకీని కనిపెడతారు. - ఒకవేళ కనిపెట్టలేకపోతే? 63 00:04:37,694 --> 00:04:41,448 - నేను ఇక్కడ ఊరికే కూర్చోలేను కదా... - బెయిలీకి ఎంత ప్రమాదం ఉందో, నీకు కూడా అంతే ప్రమాదముంది. 64 00:04:41,448 --> 00:04:44,159 నిన్ను బయటకు పంపలేను. అందుకని నువ్వు ఇక్కడే ఉండాలి. 65 00:04:44,743 --> 00:04:47,538 బెయిలీని మేము ఇక్కడికి తెచ్చిన తర్వాత మనం ఎలా ముందుకు సాగాలి అనేది 66 00:04:47,538 --> 00:04:48,956 ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకోవాలి. 67 00:04:49,998 --> 00:04:52,209 మేము ఆస్టిన్ నుండి వెళ్లిపోతే ఏమవుతుంది? 68 00:04:53,001 --> 00:04:55,629 - మేము ఇంటికి వెళ్లిపోతాం. - హానా, నీకు పూర్తిగా అర్థం కాలేదు. 69 00:04:55,629 --> 00:04:59,174 ఇక ఇంటికి వెళ్లడమనేదే లేదు. ఇప్పుడు ఆ అవకాశమే లేదు. 70 00:05:09,810 --> 00:05:11,019 ఇది మామూలు పిచ్చి పని కాదు. 71 00:05:16,525 --> 00:05:17,359 అబ్బా. 72 00:05:24,074 --> 00:05:25,075 హాయ్. 73 00:05:25,701 --> 00:05:26,785 ఎవరు నువ్వు? 74 00:05:29,246 --> 00:05:30,581 ఓరి దేవుడా. 75 00:05:32,082 --> 00:05:33,083 నిజానికి నేను వెళ్లిపోతున్నా. 76 00:05:33,083 --> 00:05:36,962 హేయ్, ఆగు, ఆగాగు. పిల్లలూ, మీ గదికి వెళ్లండి. ఇప్పుడే వెళ్లండి. 77 00:05:44,511 --> 00:05:46,805 నువ్వు లోపలికి రావాలి. ప్లీజ్. 78 00:05:55,063 --> 00:05:57,566 ఇంట్లోకి ఇప్పుడే ఓ అమ్మాయి వెళ్లింది. తనే అయ్యుండవచ్చు. 79 00:05:57,566 --> 00:05:58,817 వస్తున్నా. 80 00:06:19,379 --> 00:06:20,380 బెల్ గారా? 81 00:06:22,007 --> 00:06:23,258 గారూ, గీరూ వద్దు. 82 00:06:24,426 --> 00:06:25,886 నికొలస్ అని పిలువు, చాలు. 83 00:06:26,803 --> 00:06:28,639 నిన్ను కలవడం బాగుంది, ఈథన్. 84 00:06:28,639 --> 00:06:31,350 ఇప్పటికి కలుసుకున్నాం మనం. కేట్ ఎప్పుడూ నీ గురించే చెప్తూ ఉంటుంది. 85 00:06:32,351 --> 00:06:33,727 ఎక్కువగా మంచి మాటలే చెప్తోందిలే. 86 00:06:33,727 --> 00:06:36,146 మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో కలవాలనుకోలేదు, సర్. 87 00:06:36,146 --> 00:06:38,273 దానిదేముందిలే. ఇంత కన్నా దారుణమైన పరిస్థితులు ఉంటాయిలే. 88 00:06:39,441 --> 00:06:41,652 నేను నీ పేరు మర్చిపోతానేమో అని కంగారుపడకు, అలాంటిదేమీ జరగదు. 89 00:06:46,615 --> 00:06:48,450 నువ్వు మరీ ఎక్కువ చదివేస్తున్నావేమో. 90 00:06:48,450 --> 00:06:50,786 మంచి లా కాలేజీలో చేరాలంటే తప్పదు. 91 00:06:50,786 --> 00:06:52,037 సరే, తెలివి గల పిల్లా. 92 00:06:52,037 --> 00:06:55,249 కాస్త నువ్వు కారు దిగితే, మేము పని మొదలుపెడతాం. 93 00:06:56,583 --> 00:06:57,751 వచ్చినందుకు థ్యాంక్స్, నాన్నా. 94 00:07:01,547 --> 00:07:03,549 అతడిని బెదరగొట్టకు, సరేనా? 95 00:07:03,549 --> 00:07:05,259 - ఎవరు, నేనా? - నాన్నా. 96 00:07:07,803 --> 00:07:09,429 {\an8}బెల్ నికొలస్ 23/101 97 00:07:14,852 --> 00:07:16,353 సాక్షుల రక్షణ ప్రోగ్రామ్ గురించి నీకేమైనా తెలుసా? 98 00:07:16,353 --> 00:07:19,439 సాక్షుల రక్షణ ప్రోగ్రామా? అది మరీ ఎక్కువ అని అనిపించట్లేదా? 99 00:07:21,483 --> 00:07:22,484 ఇవి చూడు, నీకే తెలుస్తుంది. 100 00:07:25,904 --> 00:07:27,406 కంపానోలకు డాక్టర్ అని అనుకొనే వ్యక్తి 51 ఏళ్లకు హతుడై కనిపించాడు 101 00:07:27,406 --> 00:07:29,074 కంపానోలకు మద్దతుగా జడ్జి తీర్పు రిటైర్ అవుతున్నట్టుగా ప్రకటన 102 00:07:29,074 --> 00:07:30,868 వీళ్ళు రేమండ్ సూట్స్ వేసుకుంటారు, కంట్రీ క్లబ్బులో 103 00:07:30,868 --> 00:07:32,286 చేరుతారు. సెక్యూరిటీస్ లో పని చేస్తామని చెప్తారు. 104 00:07:32,286 --> 00:07:33,996 ఆ కొత్త తరం వాళ్లు అలాగే పని చేస్తున్నారు... 105 00:07:34,496 --> 00:07:35,831 కంపానో సాక్షి అదృశ్యం ఆగిన విచారణ 106 00:07:35,831 --> 00:07:39,668 ...నిశ్శబ్దంగా, సమర్థవంతంగా, జాలి లేకుండా. 107 00:07:42,629 --> 00:07:43,463 బాబోయ్. 108 00:07:43,463 --> 00:07:44,715 ఇన్ ఫార్మర్ హత్య గొంతు కోసి చంపిన వైనం 109 00:07:44,715 --> 00:07:45,674 హా. 110 00:07:46,466 --> 00:07:49,219 వాళ్లు ఇలా చంపే అందరికీ సందేశం పంపుతారు. 111 00:07:50,888 --> 00:07:53,473 101 బాక్సుల్లో ఇది 23వ బాక్సు. 112 00:07:53,473 --> 00:07:55,184 ఇంకా నమ్మకం కుదరకపోతే, మిగతా బాక్సులని కూడా చూడు. 113 00:07:55,184 --> 00:07:58,687 అక్కర్లేదు. పర్వాలేదులే. నాకు అర్థమైంది. 114 00:08:00,439 --> 00:08:01,440 కానీ నాకు... 115 00:08:02,900 --> 00:08:07,613 ఓవెన్ కి ఏమైనా... ఈథన్ కి ఇందులో ఏమైనా పాత్ర ఉందా? 116 00:08:10,199 --> 00:08:12,284 నికొలస్ బెల్ దగ్గర ఉన్నామంటే, 117 00:08:12,284 --> 00:08:14,203 ఆ పెంట మనకి కూడా అంటుకుంటుంది. 118 00:08:19,082 --> 00:08:20,626 - సాయపడమంటారా? - వద్దులే. 119 00:08:24,922 --> 00:08:26,548 సరే మరి. సెట్ అయిపోయింది. 120 00:08:31,720 --> 00:08:34,640 నీ బాల్యం మిడ్ వేలో గడిచిందా? 121 00:08:35,182 --> 00:08:37,058 అవును. కాకపోతే శివారు ప్రాంతంలో. 122 00:08:39,144 --> 00:08:41,813 అక్కడికి కాస్త దూరంలోనే మా అన్నయ్య కొంత కాలం గడిపాడు. 123 00:08:41,813 --> 00:08:43,732 అవునా? ఎక్కడ? 124 00:08:44,358 --> 00:08:45,776 టెక్సస్ రాష్ట్ర జైలులో. 125 00:08:47,277 --> 00:08:49,446 అతని కారులోని గ్లవ్ కంపార్టుమెంటులో పోలీసులకు గంజాయి దొరికింది. 126 00:08:50,572 --> 00:08:54,159 అది చిన్న నేరమే, కానీ అది అతని మొదటిది కాదు, కాబట్టి... 127 00:08:56,161 --> 00:08:58,121 శిక్ష ఎక్కువ కాలమే పడింది. 128 00:09:00,332 --> 00:09:03,252 కానీ నన్ను బాగా కలవరపెట్టిన విషయం ఏంటంటే, కాస్తంత మంచి లాయరును పెట్టుకున్నా, 129 00:09:03,252 --> 00:09:04,628 అతను శిక్షను తప్పించుకొని ఉండేవాడు, 130 00:09:05,838 --> 00:09:07,256 కానీ మేము చాలా పేదవాళ్లం, 131 00:09:08,257 --> 00:09:11,343 కోర్టు నియమించిన పిచ్చి లాయర్ విచారణ మొదలవ్వగానే నిద్రలోకి జారుకున్నాడు. 132 00:09:13,637 --> 00:09:15,597 మీరు డిఫెన్స్ లాయరు అయింది అందుకేనా? 133 00:09:16,890 --> 00:09:19,017 అది కూడా ఒక కారణం. 134 00:09:22,896 --> 00:09:24,022 నీకు ఆ కారు నచ్చిందా? 135 00:09:24,606 --> 00:09:25,649 నడిపి చూడు, ఇంకా బాగా నచ్చుతుంది. 136 00:09:26,316 --> 00:09:29,278 నాకు గేర్స్ వేయడం అంతగా రాదు. నేను నడపడం అంత మంచి ఆలోచన కాదేమో. 137 00:09:30,946 --> 00:09:32,865 నా కూతురుని నువ్వు నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? 138 00:09:36,618 --> 00:09:37,619 అవును, సర్. 139 00:09:40,747 --> 00:09:44,084 మంచిది. అయితే నువ్వు నా క్లచ్చును నాశనం చేసినా పర్లేదులే. 140 00:09:50,674 --> 00:09:52,759 వీళ్ళ గురించి మీ నాన్న నీకు ఎంత చెప్పాడు? 141 00:09:53,760 --> 00:09:54,845 పెద్దగా ఏం చెప్పలేదు. 142 00:09:59,099 --> 00:10:00,100 నీకేం గుర్తుంది? 143 00:10:02,394 --> 00:10:05,731 నాకు మీరు గుర్తున్నారు... కొద్దిగే అనుకోండి. 144 00:10:09,443 --> 00:10:11,445 హా, నీకు మా పెరడంటే చాలా ఇష్టం. 145 00:10:12,988 --> 00:10:14,948 నువ్వు ఇక్కడ చాల సేపు ఉండేదానివి. 146 00:10:21,413 --> 00:10:23,081 నాకేం అర్థం కావట్లేదు. 147 00:10:29,213 --> 00:10:33,842 మీ తాతయ్యకి, మీ నాన్నకి మధ్య చాలా కాలం క్రితం ఒక విషయం జరిగింది. 148 00:10:35,093 --> 00:10:38,096 మీ నాన్నకి వెళ్లిపోక తప్పలేదు. 149 00:10:38,096 --> 00:10:41,058 నిన్ను తీసుకొని వెళ్లిపోక తప్పలేదు. 150 00:10:42,351 --> 00:10:43,352 ఎందుకు? 151 00:10:44,311 --> 00:10:47,856 అది కాస్త సంక్లిష్టమైన విషయం. 152 00:10:50,192 --> 00:10:52,236 మూడు రోజుల క్రితం, మా నాన్న ఎటో వెళ్లిపోయాడు, 153 00:10:54,029 --> 00:10:56,490 అ తర్వాతే నాకు తెలిసింది, ఆయన నాతో అబద్ధమాడాడు అని, 154 00:10:56,490 --> 00:10:58,242 నా జీవితం గురించే పెద్ద అబద్ధమాడాడని, 155 00:10:58,242 --> 00:11:00,410 నా పేరు, నా పుట్టిన రోజు. అన్నీ అబద్ధాలే. 156 00:11:02,496 --> 00:11:06,124 కాబట్టి... మీరు నాకు అబద్ధం చెప్పట్లేదు కనుక నాకు చాలా ఆనందంగా ఉంది. 157 00:11:07,709 --> 00:11:10,128 కానీ అసలేం జరుగుతోందో చెప్పగలరా? 158 00:11:14,591 --> 00:11:16,677 ప్రపంచాన్ని కాపాడతామని చాలా మంది చెప్తుంటారు. 159 00:11:17,261 --> 00:11:18,846 ముందు నీ చుట్టూ ఉన్న వాళ్ల సంగతి చూడమని నేనంటాను. 160 00:11:21,056 --> 00:11:22,057 ఏమైంది? 161 00:11:23,475 --> 00:11:26,144 కొంపదీసి లాయర్లంటే మంచివాళ్లని అనుకొనే అమాయకుడివా నువ్వు? 162 00:11:26,770 --> 00:11:28,730 ఆ విషయంలో నాకంత ఎక్కువ తెలీదులెండి. 163 00:11:28,730 --> 00:11:31,441 నాకు తెలుసు. నీకు ఒక విషయం చెప్తా విను. 164 00:11:32,442 --> 00:11:37,322 ప్రభుత్వ లాయర్ల ఆఫీసలకు ఇచ్చే నిధులు తక్కువ, అక్కడ పని చేసే సిబ్బంది కూడా చాలరు, 165 00:11:37,322 --> 00:11:40,367 దానితో జనాలకు కావలసినట్టుగా వాళ్లు వాదించలేరు. 166 00:11:40,868 --> 00:11:45,372 వాళ్ల వల్ల ఏమీ లేని జనాలకు, మనిద్దరిలా పెరిగిన జనాలకు న్యాయం జరగదు. 167 00:11:46,331 --> 00:11:48,458 నా క్లయింట్లలో 60% మందికి నేను ఉచితంగా వాదిస్తాను, తెలుసా? 168 00:11:49,251 --> 00:11:50,544 నేనేమీ దేవుడిని అని చెప్పట్లేదు. 169 00:11:51,753 --> 00:11:54,131 ఇంకా, 170 00:11:54,131 --> 00:11:56,466 నాకు డబ్బులిచ్చే బలిసిన క్లయింట్స్ కూడా ఉన్నారు, 171 00:11:57,009 --> 00:11:58,969 వాళ్లకి కూడా నేను న్యాయం చేయాలి కదా. 172 00:11:59,887 --> 00:12:02,472 వాళ్లలో కూడా చాలా మంది అమాయకులు ఉంటారు అంటే నువ్వు ఆశ్చర్యపోతావు. 173 00:12:03,891 --> 00:12:05,809 వాళ్లపై చేసే ఆరోపణలు చూస్తే అలానే అనిపిస్తుంది మరి. 174 00:12:08,729 --> 00:12:10,689 నికొలస్ మీ భర్తను గుప్పెట్లో పెట్టేసుకున్నాడు. 175 00:12:10,689 --> 00:12:12,191 ఓవెన్ కి కేట్ అంటే ప్రాణం. 176 00:12:13,275 --> 00:12:15,402 నికొలస్ ఏమో ఎవరినైనా ఇట్టే ఆకట్టేసుకుంటాడు. 177 00:12:15,402 --> 00:12:17,154 అతను కూడా ఓవెన్ లానే ఒక పేద కుటుంబంలో పుట్టాడు. 178 00:12:17,154 --> 00:12:19,114 కష్టపడి పైకి వచ్చాడు. ఓవెన్ కి కావలసినవన్నీ అతని దగ్గర ఉన్నాయి. 179 00:12:19,114 --> 00:12:21,033 మంచి కుటుంబం, మంచి జీవితం. 180 00:12:22,451 --> 00:12:24,870 - ఓవెన్ అతని దగ్గర పని చేశాడా? - లేదు. 181 00:12:26,330 --> 00:12:29,249 కానీ సాయపడమని ఓవెన్ ని నికొలస్ అడిగినప్పుడు, అందుకు అతను అంగీకరించాడు. 182 00:12:30,292 --> 00:12:32,419 - "సాయమా?" - ఇలంటి మాఫియాకి లాయరుగా ఉన్నప్పుడు, 183 00:12:32,419 --> 00:12:35,047 జైలు జీవితం వద్దు అనుకున్నప్పుడు, కొన్ని హద్దులను దాటకుండా ఉండాలి కదా. 184 00:12:35,047 --> 00:12:37,090 చట్టం నుండి ఎలా తప్పించుకోవాలో వాళ్లకి చెప్పకూడదు. 185 00:12:37,090 --> 00:12:38,759 నేరం చేయడంలో వారికి సాయపడకూడదు. 186 00:12:38,759 --> 00:12:41,720 మరీ ముఖ్యంగా జైలు జీవితం గడిపే నాయకుల నుండి ఆదేశాలను 187 00:12:41,720 --> 00:12:43,347 బయట ఉండే వాళ్లకి చేరవేయకూడదు. 188 00:12:43,931 --> 00:12:46,183 - నికొలస్ ఆ హద్దులని దాటాడు. - హా. 189 00:12:46,183 --> 00:12:48,560 ఆ సందేశాలను తన క్లయింట్ల కోసం చేరవేస్తున్నాడు కాబట్టి, 190 00:12:48,560 --> 00:12:50,896 వాటికి రక్షణ జోడించాలని అనుకున్నాడు. 191 00:12:51,939 --> 00:12:54,066 ఓవెన్, ఆ ఎన్ క్రిప్షన్ వ్యవస్థను నికొలస్ కోసం తయారు చేసి ఇచ్చాడు. 192 00:12:55,400 --> 00:12:57,194 ఆ సందేశాలలో ఏముందో ఓవెన్ కి తెలుసా? 193 00:12:57,194 --> 00:13:01,323 తెలీదు. ఓవెన్ కూడా ప్రమాదంలో పడటం నికొలస్ కి ఇష్టం లేదు, అవేంటో తెలుసుకోవాలని ఓవెన్ కి కూడా లేదులే. 194 00:13:02,908 --> 00:13:04,535 కేట్ చనిపోయేదాకా ఓవెన్ కి వాటిని తెలుసుకోవాలనే ఆలోచనే లేదు. 195 00:13:07,037 --> 00:13:09,623 ఓవెన్, కారు ప్రమాదం అని చెప్పాడు. 196 00:13:09,623 --> 00:13:11,124 ఏదో గుద్దేసి వెళ్లిపోయిందని అన్నాడు. 197 00:13:13,502 --> 00:13:14,711 అది కావాలని చేసిన యాక్సిడెంట్ అంటావా? 198 00:13:15,629 --> 00:13:16,797 అది ఒక ఖాళీగా ఉన్న వీధిపై జరిగింది, 199 00:13:17,756 --> 00:13:20,884 అది కూడా, బెయిలీని నికొలస్ ప్రతీ శుక్రవారం తీసుకెళ్లే పార్కుకు పక్క సంధులోనే జరిగింది. 200 00:13:21,760 --> 00:13:22,594 అయ్యయ్యో. 201 00:13:22,594 --> 00:13:25,472 ఆ మాఫీయా వాళ్లకి చెందిన ఒక పెద్ద కేసును నికొలస్ వాదించను అన్న కొన్నాళ్లకే అది జరిగింది. 202 00:13:25,472 --> 00:13:26,974 వాళ్లకి నికొలస్ చేసిన పని నచ్చలేదు. 203 00:13:26,974 --> 00:13:28,225 కొన్ని బెదిరింపులకి కూడా పాల్పడ్డారు. 204 00:13:28,725 --> 00:13:30,894 కానీ కేట్ చనిపోయాక, ఊహించినట్టుగానే 205 00:13:30,894 --> 00:13:32,938 కేట్ మరణానికి, వాళ్లకీ ఏ సంబంధమూ లేదని కంపానో వర్గం చెప్పింది, 206 00:13:32,938 --> 00:13:35,941 నికొలస్ విధేయతకు భంగం కలిగించాలని గిట్టని వాళ్లు చేసిన పని అయ్యుండవచ్చని చెప్పింది. 207 00:13:35,941 --> 00:13:38,443 కానీ ఓవెన్ కి అవేమీ ఎక్కలేదు. 208 00:13:39,403 --> 00:13:42,281 మాఫీయా వాళ్లు నికొలస్ ని బెదిరించాలని కేట్ ని చంపేశారని 209 00:13:42,281 --> 00:13:43,824 ఓవెన్ అర్థం చేసుకున్నాడు. 210 00:13:44,324 --> 00:13:45,659 అంతటికీ నికొలసే కారణమని అనుకున్నాడు. 211 00:13:46,451 --> 00:13:49,371 అయితే అది మా తాతయ్య తప్పా? 212 00:13:51,957 --> 00:13:55,127 - మా అమ్మ చనిపోవడానికి కారణం అతనేనా? - అది చెప్పడం కష్టం. 213 00:13:56,336 --> 00:13:58,338 అలా అని అనుకోవద్దనే చెప్తాను, కానీ... 214 00:14:00,465 --> 00:14:04,553 మీ నాన్నకి మీ తాతయ్య మీద, ఇంకా తన మీద కూడా చాలా కోపం వచ్చేసింది. 215 00:14:06,013 --> 00:14:07,806 అతను లెక్క సరిచేయాలనుకున్నాడు. 216 00:14:08,432 --> 00:14:09,433 అంటే? 217 00:14:11,101 --> 00:14:13,478 మీ తాతయ్య క్లయింట్లు చేసినదానికి అనుభవించాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. 218 00:14:15,689 --> 00:14:16,690 ఎలా? 219 00:14:17,232 --> 00:14:19,193 ఓవెన్ కి అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. 220 00:14:19,776 --> 00:14:22,279 అది అతను దూపొందించిన ఎన్ క్రిప్షన్ వ్యవస్థే కదా. 221 00:14:22,279 --> 00:14:27,159 హా. అందులోని సందేశాలన్నింటినీ తీసుకొని, వాటిని ఎఫ్.బి.ఐ వాళ్లకి అప్పగించేశాడు. 222 00:14:29,411 --> 00:14:32,748 ఆ ఆధారలతో కొందరు ముఖ్యమైన సభ్యులను జైల్లో వేయగలిగారు, 223 00:14:32,748 --> 00:14:35,834 అలాగే వాళ్ల దేశీయ డ్రగ్స్ వ్యాపారానికి బాగానే గండి కూడా పడింది. 224 00:14:36,543 --> 00:14:38,086 నికొలస్ కి ఇంకా చాలా తెలుసు అనుకో. 225 00:14:38,086 --> 00:14:39,630 ఎఫ్.బి.ఐ వాళ్లు అతడిని ప్రలోభపెట్టాలని చాలా చూశారు... 226 00:14:40,839 --> 00:14:42,382 కానీ అతను అస్సలు సహకరించలేదు. 227 00:14:43,467 --> 00:14:46,303 ఆరేళ్లు జైల్లో గడిపాడు కానీ, ఆ మాఫియా వాళ్లకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనే లేదు. 228 00:14:48,972 --> 00:14:50,682 దానికి ఆ మాఫియా వాళ్లు కూడా ముగ్ధులైపోయారు. 229 00:14:52,142 --> 00:14:54,144 కానీ అతని కుటుంబానికి మాత్రం అది తీరని నష్టాన్ని కలిగించింది. 230 00:14:54,937 --> 00:14:58,023 నికొలస్ దృష్టిలో, దాన్నంతటికీ కారణం ఓవెన్. 231 00:14:58,815 --> 00:15:01,193 అలాంటి గాయం, సమయం గడిచేకొద్దీ పెద్దదే అవుతుంది కానీ, తగ్గదు. 232 00:15:02,694 --> 00:15:05,531 అయితే మీకు మా నాన్న అంటే ఇష్టమేనా? 233 00:15:06,907 --> 00:15:10,035 నేను అబద్ధం చెప్పను కానీ, అప్పుడు మేము చాలా అనుభవించాము. 234 00:15:11,245 --> 00:15:13,080 మీ తాతయ్య జైలుకెళ్లాడు. 235 00:15:13,872 --> 00:15:16,792 మీ అమ్మమ్మకి అనారోగ్యం పట్టుకుంది. 236 00:15:17,709 --> 00:15:19,419 కొన్నేళ్ళ క్రిందటే ఆమె చనిపోయింది కూడా. 237 00:15:20,712 --> 00:15:22,339 ఆ తర్వాతే నేనూ, చార్లీ విడిపోయాం. 238 00:15:26,301 --> 00:15:30,389 కానీ, చూడు, మొత్తం కథ ఇంకా చాలా ఉంది. 239 00:15:31,598 --> 00:15:36,937 మీ నాన్నన్నా, నువ్వన్నా, ఈ కుటుంబమన్నా మాకు చాలా ఇష్టం. 240 00:15:38,272 --> 00:15:39,773 ఇక్కడ ఉన్నప్పుడు అందరం ఆనందంగా ఉండేవాళ్లం. 241 00:15:40,941 --> 00:15:42,401 కానీ ఒక్కసారిగా ఆ ఆనందానికి తెరపడింది. 242 00:15:46,280 --> 00:15:51,076 పరిస్థితులు మారిపోయాయి, పూర్తిగా దిగజారిపోయాయి. 243 00:15:52,578 --> 00:15:54,830 అందుకైనా ఆ మధుర జ్ఞాపకాలను తలచుకోవాల్సిందే. 244 00:15:58,125 --> 00:15:59,334 ఏ జ్ఞాపకాలు? 245 00:16:28,071 --> 00:16:30,449 ఏదోక ఫోటోను ఎంచుకో. ఆ ఫోటో తీసేటప్పుడు ఏం జరిగిందో చెప్తా. 246 00:16:40,375 --> 00:16:43,003 - ఇంకా ఎంత సేపు పడుతుంది మీకు? - ఒక అరగంట. 247 00:16:43,003 --> 00:16:44,630 మన డ్రైవర్ వీలైనంత వేగంగా నడుపుతున్నాడు. 248 00:16:45,214 --> 00:16:46,548 తను ఎక్కడికైనా వెళ్తే, చెప్పు. 249 00:16:46,548 --> 00:16:47,799 తప్పకుండా. 250 00:16:55,432 --> 00:16:56,433 హానా. 251 00:16:57,935 --> 00:17:02,064 భయంగానే అనిపించినా, మనం సాక్షి రక్షణ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకోవాల్సిందే. 252 00:17:04,273 --> 00:17:06,193 - ఎందుకు? - ఏమన్నావు? 253 00:17:08,278 --> 00:17:10,405 దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? 254 00:17:13,951 --> 00:17:17,079 ఎందుకంటే, నికొలస్ బెల్ చాలా ప్రమాదకరమైనవాడు కాబట్టి. ఇక్కడుంటే అతను ఏం చెస్తాడో మనం ఊహించలేం కూడా. 255 00:17:17,079 --> 00:17:19,080 ఇక కంపానో మాఫియాకి నువ్వు కానీ, బెయిలీ కానీ కంటపడితే... 256 00:17:19,080 --> 00:17:20,624 సరే. అర్థమైంది. 257 00:17:22,041 --> 00:17:23,669 కానీ మనం దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? 258 00:17:24,877 --> 00:17:28,131 బెయిలీకి, ఓవెన్ కి ముందే ఆ రక్షణ కల్పించి ఉండవచ్చు కదా? 259 00:17:29,716 --> 00:17:32,469 నువ్వు చెప్పినదాన్ని బట్టి చూస్తే, ఇదంతా జరగకముందే, 260 00:17:32,469 --> 00:17:36,598 వాళ్లకి సాక్షి రక్షణ ప్రోగ్రామ్ కింద రక్షణ ఇచ్చుండాల్సింది కదా? 261 00:17:37,558 --> 00:17:38,934 వాళ్లకి ఇద్దామనే అనుకున్నాం, కానీ... 262 00:17:41,019 --> 00:17:42,938 ఓవెన్ ఎలా అయితే అనుకున్నాడో, పరిస్థితులు అలా సాగలేదు. 263 00:17:42,938 --> 00:17:45,232 అర్థమయ్యేలా చెప్పు, గ్రేడీ 264 00:17:47,943 --> 00:17:49,194 వాళ్ల రహస్య సమాచారాన్ని ఎవరో లీక్ చేశారు. 265 00:17:49,194 --> 00:17:51,280 మాఫియా వాళ్లకి ఓవెన్, బెయిలీల కొత్త గుర్తింపులు తెలిసిపోయాయి. 266 00:17:51,280 --> 00:17:54,157 వాళ్లకి పునరావాసం కల్పించక ముందే, ఆ విషయం మాకు తెలిసిపోయింది, కానీ ఓవెన్ మాకు దండం పెట్టేశాడు. 267 00:17:55,367 --> 00:17:56,451 తన పాటికి తను ఎటో వెళ్లిపోయాడు. 268 00:17:57,619 --> 00:17:59,037 మరి అతను ఎక్కడ ఉంటాడో నీకెలా తెలుసు? 269 00:17:59,872 --> 00:18:01,498 ఇన్నేళ్లూ అతనికి ఎవరోకరి సాయం కావాలి కదా. 270 00:18:01,498 --> 00:18:03,000 నన్ను నమ్మాడు అనుకుంటా. 271 00:18:04,084 --> 00:18:05,085 ఎందుకు? 272 00:18:05,085 --> 00:18:06,837 ఎమో మరి. నువ్వు అతడినే అడగాలి అది. 273 00:18:08,213 --> 00:18:10,048 బెయిలీ ఫోన్ ఆఫ్ అయి ఒక గంట పైనే అయింది. 274 00:18:10,674 --> 00:18:12,342 చివరిగా అందిన సిగ్నల్ ప్రకారం తను హోటల్ లో ఉండింది. 275 00:18:12,342 --> 00:18:14,094 వెతుకుతున్న మన వాళ్ల నుండి ఏ సమాచారం అందలేదా? 276 00:18:14,094 --> 00:18:16,221 - ఇంకా ఏం అందలేదు. - సరే. 277 00:18:19,224 --> 00:18:22,186 - బయటి ఫోనుకు కాల్ చేసుకోవచ్చా? - తొమ్మిది నొక్కి, డయల్ చేయ్. ఎవరూ వినకూడదంటా వద్దు. 278 00:18:22,686 --> 00:18:23,770 నువ్వేమంటావు? 279 00:18:27,649 --> 00:18:28,483 ఎవరికి కాల్ చేస్తున్నావు? 280 00:18:31,778 --> 00:18:33,488 - జూల్స్ నికల్స్ ని మాట్లాడుతున్నా. - హేయ్, నేనే. 281 00:18:33,488 --> 00:18:34,698 ఎక్కడ ఉన్నావు? 282 00:18:34,698 --> 00:18:36,575 ఇంకా ఆస్టిన్ లోనే ఉన్నా. బెయిలీ కనబడట్లేదు. 283 00:18:37,075 --> 00:18:38,076 అబ్బా. 284 00:18:38,076 --> 00:18:40,120 జూల్స్, నువ్వు బాబీ దగ్గరికి వెళ్లాలి. 285 00:18:40,662 --> 00:18:42,706 బెయిలీ ఎక్కడికి వెళ్లిందో అతనికి తప్పకుండా తెలిసి ఉంటుంది. 286 00:18:42,706 --> 00:18:43,874 నీ దగ్గర అతని ఫోన్ నంబర్ లేదా? 287 00:18:43,874 --> 00:18:47,377 లేదు. కానీ, మిల్ వ్యాలీలో ఉండే అతని ఇంటి దగ్గర నేను బెయిలీని ఒకట్రెండు సార్లు కారులో దింపాను. 288 00:18:47,377 --> 00:18:48,754 సరే. చిరునామా చెప్పు. 289 00:18:48,754 --> 00:18:50,464 822 క్రీసెంట్ అవెన్యూ. 290 00:18:51,173 --> 00:18:52,257 అక్కడికే వెళ్తా ఇక. 291 00:19:00,557 --> 00:19:02,142 ఇతడిని చూస్తుంటే... 292 00:19:03,727 --> 00:19:04,728 ప్రమాదకరమైన వ్యక్తిలా అనిపించట్లేదా? 293 00:19:05,771 --> 00:19:06,772 అవును. 294 00:19:06,772 --> 00:19:08,357 ప్రమాదకరమైన వ్యక్తి అంటే ఎలా ఉంటాడేంటి? 295 00:19:12,402 --> 00:19:14,863 మీ తాతయ్య విషయంలో, ఏదీ కూడా మనకి చూడగానే స్పష్టంగా తెలీదు. 296 00:19:17,533 --> 00:19:18,992 మీ నాన్న విషయంలోనూ అంతే. 297 00:19:25,624 --> 00:19:28,043 నీకు అతని మీద ద్వేషం లేదా? 298 00:19:29,711 --> 00:19:30,712 మా నాన్న మీద? 299 00:19:33,382 --> 00:19:35,968 అలా గొడవలు జరగడం ఎవరికీ ఇష్టం లేదు. 300 00:19:37,427 --> 00:19:40,806 మీ నాన్న కూడా ఆ మార్గాన్ని ఎంచుకోకుండా 301 00:19:40,806 --> 00:19:42,558 వేరే మార్గాన్ని ఎంచుకొని ఉండవచ్చు. కానీ... 302 00:19:44,226 --> 00:19:47,521 అతని కోపాన్ని అర్థం చేసుకున్నాం, అలాగే నికొలస్ కి దూరంగా ఉంటేనే 303 00:19:47,521 --> 00:19:50,899 నువ్వు క్షేమంగా ఉంటావని అతనికి ఎందుకు అనిపించిందో కూడా మేము అర్థం చేసుకున్నాం. 304 00:19:52,317 --> 00:19:57,948 కానీ, మేము చెప్పాపెట్టకుండా వెళ్లిపోయినప్పుడు మీకు కోపం వచ్చి ఉంటుంది కదా? 305 00:20:04,079 --> 00:20:05,747 అతనేమీ చెప్పాపెట్టకుండా వెళ్లిపోలేదు. 306 00:20:07,499 --> 00:20:08,500 అంటే? 307 00:20:12,045 --> 00:20:13,589 అప్పుడే మీ అమ్మ నీకు దూరమైంది. 308 00:20:14,173 --> 00:20:15,716 మీ నాన్నని కూడా నీకు దూరం చేయలేకపోయాం. 309 00:20:17,926 --> 00:20:21,805 అతని నిర్ణయంతో మేము ఏకీభవించకపోయినా, మా నిర్ణయం మాత్రం పక్కాగా ఉంది. 310 00:20:24,474 --> 00:20:25,475 నాన్నకి మీరు సాయపడ్డారు. 311 00:20:28,020 --> 00:20:29,021 నీకు సాయపడ్డాం. 312 00:20:39,406 --> 00:20:41,366 కస్టడీలో ఉండగా అనుమానాస్పద మృతా? 313 00:20:42,659 --> 00:20:45,579 సూపర్. ఈ రాత్రి వేళ చల్లని వార్త చెప్పావు. 314 00:20:49,374 --> 00:20:50,626 ఒక కేసు విషయంలో మంచి విషయం తెలిసింది. 315 00:20:51,168 --> 00:20:53,295 అనుమానాస్పద మృతి మంచి విషయమంటారా? 316 00:20:54,213 --> 00:20:55,672 నా వృత్తిలో అది మంచిదే కావచ్చు. 317 00:20:58,217 --> 00:21:02,137 నేనేదో మీ గురించి వేరే విధంగా అనుకుంటున్నాను అనుకోకండి. 318 00:21:02,846 --> 00:21:04,723 - నేను కేవలం... - వేరే విధంగా అనుకుంటున్నావా? 319 00:21:07,643 --> 00:21:08,644 హా. 320 00:21:10,395 --> 00:21:11,438 నీకు పాఠాలు చెప్పడమంటే ఇష్టమటగా. 321 00:21:12,856 --> 00:21:15,108 అవును. ప్రొఫెసర్ కావాలనుకుంటున్నా. 322 00:21:15,108 --> 00:21:18,779 కానీ అప్లైడ్ మ్యాథమేటిక్స్ లో ప్రొఫెసర్ కావడం చాలా కష్టం. 323 00:21:19,488 --> 00:21:21,323 టెక్సస్ యూనివర్సిటీలో నిన్ను కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు. 324 00:21:22,533 --> 00:21:24,535 పట్నమ్ కాంపిటీషన్ లో చోటు సంపాదించావని కేట్ చెప్పింది. 325 00:21:25,244 --> 00:21:26,578 అంతా నాకు బోధించిన ప్రొఫెసర్స్ చలవే. 326 00:21:26,578 --> 00:21:30,374 కేట్ వాళ్ల అమ్మకి, ఇంకా నాకు కూడా ఆ యూనివర్సిటీలో తెలిసిన వాళ్లున్నారు. 327 00:21:30,999 --> 00:21:32,835 నీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పగలం. 328 00:21:32,835 --> 00:21:35,838 అది మీ మంచితనం, కానీ... 329 00:21:36,338 --> 00:21:39,424 నేను నా అదృష్టాన్ని చాలా చోట్ల పరీక్షించుకోవాలనుకుంటున్నా. 330 00:21:39,424 --> 00:21:41,552 - నీకు టెక్సస్ యూనివర్సిటీ అంటే ఇష్టం లేదా? - ఇష్టమే. 331 00:21:41,552 --> 00:21:43,679 ఈ అద్భుతమైన రాష్ట్రంలో టాప్ కాలేజీ అది. 332 00:21:44,429 --> 00:21:45,931 మరి దాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోవాలనుకుంటున్నావే? 333 00:21:48,308 --> 00:21:49,685 ఈ లోకం చాలా పెద్దది. 334 00:21:50,978 --> 00:21:52,437 నువ్వు అనుకున్నదాని కన్నా లోకం చాలా చిన్నది. 335 00:21:54,857 --> 00:21:57,860 టెక్సస్ ని విడిచిపోదాం అని నువ్వు తనకి నచ్చజెప్పితే, వాళ్ల అమ్మ తట్టుకోలేదు. 336 00:22:01,280 --> 00:22:05,033 మీ అమ్మాయికి ఇష్టం లేని విషయాన్ని నేనెప్పుడూ ప్రస్తావించలేదు. 337 00:22:19,923 --> 00:22:21,341 మనం వీధుల గుండా ఎందుకు వెళ్తున్నాం? 338 00:22:21,341 --> 00:22:24,678 360 లూప్ మార్గంలో ట్రాఫిక్ ఉంది. ఇలా వెళ్తే వేగంగా వెళ్లవచ్చని అనుకున్నా. 339 00:22:24,678 --> 00:22:27,347 కానీ ఈ మార్గంలోనే ఆలస్యమవుతోంది. వేగంగా నడుపు. 340 00:22:27,931 --> 00:22:29,183 హా, నాకు అర్థం కావట్లేదు. 341 00:22:30,309 --> 00:22:33,687 ఇంతకు ముందు సమాచారం లీక్ అయితే, ఇప్పుడు కూడా లీక్ జరగవచ్చు కదా? 342 00:22:34,188 --> 00:22:36,690 - ఎందుకంటే ఇప్పుడు మీకు అండగా నేనున్నా. - అప్పుడు ఓవెన్ విషయంలో కూడా ఉన్నావు కదా. 343 00:22:36,690 --> 00:22:38,817 అప్పుడు నేను జూనియర్ ని, అతడిని కాపాడలేకపోయా. 344 00:22:38,817 --> 00:22:40,527 కానీ ఇప్పుడు నా స్థానం మారింది. 345 00:22:42,362 --> 00:22:45,240 ఒకవేళ దాన్ని నేను నమ్మానే అనుకో, ఇంకా పూర్తిగా నమ్మకం కలగలేదనుకో... 346 00:22:47,034 --> 00:22:48,202 మమ్మల్ని ఎలా రక్షించబోతున్నావు? 347 00:22:49,912 --> 00:22:52,372 మీకు కొత్త సోషల్ సెక్యూరిటీ కార్డులు ఇస్తాం, 348 00:22:52,372 --> 00:22:55,083 ఇల్లు, స్టైపెండ్ ఇస్తాం, 349 00:22:55,083 --> 00:22:58,337 బెయిలీకి నకిలీ కాలేజీ సర్టిఫికెట్స్ ఇప్పిస్తాం, కొత్త వృత్తి సంపాదించడంలో నీకు సాయపడతాం. 350 00:22:59,129 --> 00:23:00,214 కొత్త వృత్తా? 351 00:23:01,298 --> 00:23:03,592 అవును, నువ్వు ఉద్యోగాలను, ఇష్టాయిష్టాలను పక్కకు పెట్టేయాలి, 352 00:23:03,592 --> 00:23:05,344 వాటి ద్వారా మాఫియా వాళ్లు మీ ఆచూకీని కనిపెట్టే అవకాశముంది. 353 00:23:05,344 --> 00:23:07,054 - ఇంకా చెక్క పని... - అది ఒక కళ. 354 00:23:07,054 --> 00:23:09,014 చాలా ప్రత్యేకమైనది. కాబట్టి దాన్ని వదిలేయాల్సిందే. 355 00:23:09,014 --> 00:23:10,599 అలాగే, బెయిలీ తన నాటకరంగాన్ని కూడా. ఇంకా... 356 00:23:10,599 --> 00:23:12,684 బెయిలీ నాటకరంగాన్ని వదులుకోవాలా? అదే తన ప్రపంచం. 357 00:23:12,684 --> 00:23:14,728 ఇంకా ఎవరితోనూ సంప్రదింపులు జరపకూడదు. 358 00:23:15,729 --> 00:23:18,815 మీకు ఇప్పుడు తెలిసిన వాటన్నింటినీ వాళ్లు గమనిస్తూ ఉంటారనే మనం భావించాలి. 359 00:23:18,815 --> 00:23:21,527 ఒక్క ఫోన్ చేసినా, ఈమెయిల్ పంపినా, అది మీరే అని వాళ్లు కనిపెట్టేస్తారు. 360 00:23:22,236 --> 00:23:23,237 సరే. 361 00:23:26,448 --> 00:23:27,449 నన్ను పక్కను పెట్టేయండి... 362 00:23:31,578 --> 00:23:36,500 కానీ ఒక 16 ఏళ్ళ అమ్మాయికి, తనకు తెలిసిన వాటన్నింటినీ వదిలేసుకోవాల్సిందే అని మీరు అంటున్నారు. 363 00:23:37,084 --> 00:23:38,502 తనకు ఇష్టమైన వాటన్నింటినీ. 364 00:23:40,212 --> 00:23:42,089 ఓవెన్ కి అది అస్సలు ఇష్టం ఉండదు. 365 00:23:44,883 --> 00:23:47,845 ఒకవేళ నువ్వు చెప్పేదంతా నిజమే అయితే, ఒకవేళ అతను ఏదో ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తుంటే, 366 00:23:50,180 --> 00:23:55,018 బెయిలీ జీవితం యథాతథంగా కొనసాగలన్నదే అతని ఉద్దేశం అయ్యుంటుందని నేను బలంగా చెప్పగలను. 367 00:23:55,936 --> 00:23:56,937 కావచ్చు. 368 00:23:58,397 --> 00:23:59,731 నువ్వన్నది నిజమే కావచ్చు. 369 00:24:01,483 --> 00:24:02,901 అదే అతని ప్లాన్ కావచ్చు. 370 00:24:03,861 --> 00:24:05,737 ఇలా జరగాలని అతను కోరుకుని ఉండకపోవచ్చు. 371 00:24:07,531 --> 00:24:09,533 కానీ, నువ్వు ఆస్టిన్ కి వచ్చి, మొత్తం చెడగొట్టేశావు. 372 00:24:14,454 --> 00:24:15,455 నేనేమీ... 373 00:24:17,416 --> 00:24:18,750 మేమెవరమో ఎవరికీ తెలీదు. 374 00:24:18,750 --> 00:24:20,794 - మేమేమీ... - మీరు నెవర్ డ్రైకి వెళ్లారు. 375 00:24:20,794 --> 00:24:22,880 ఆ బారులో ఎన్ని కెమెరాలున్నాయో తెలుసా? 376 00:24:22,880 --> 00:24:26,800 నువ్వెవరో నికొలస్ కి ఈపాటికే తెలిసి ఉంటుంది, ఒకవేళ తెలీకపోయినా, త్వరలోనే తెలిసిపోతుంది. 377 00:24:26,800 --> 00:24:28,844 నికొలస్ బెల్, తన సొంత మనవరాలికి హాని తలపెట్టడు కదా. 378 00:24:28,844 --> 00:24:30,929 అది నిజమే కావచ్చు. కానీ అతను లాయరుగా ఉండినవాళ్లు క్రూరులు. 379 00:24:30,929 --> 00:24:34,308 ఓవెన్ ని తమకి లొంగిపోయేలా చేయడానికి వాళ్లు ఎంత నీచానికైనా దిగజారుతారు. 380 00:24:38,896 --> 00:24:40,439 ఇదే ఉత్తమ మార్గం అయ్యుండదు. 381 00:24:46,945 --> 00:24:50,490 ఓవెన్, తన తరఫున ఎఫ్.బి.ఐ వాళ్లతో చర్చలు జరపడానికి నాకు చక్కని ఆధారాలిచ్చాడు. 382 00:24:51,283 --> 00:24:53,744 కాబట్టి, నువ్వూ, బెయిలీ చక్కగా కుదురుకున్నాక అతను మీ దగ్గరికి వస్తాడు. 383 00:24:55,704 --> 00:24:56,830 అంతా సురక్షితమని అనిపించాక. 384 00:24:59,625 --> 00:25:01,126 కానీ ఈ విషయంలో నువ్వు నన్ను నమ్మాలి. 385 00:25:02,711 --> 00:25:04,505 మీకున్న ఏకైక దారి ఇదే. 386 00:25:08,759 --> 00:25:10,093 నేనెవరినీ నమ్మను. 387 00:25:11,929 --> 00:25:13,096 అయిదు ముద్దలు తిను. 388 00:25:13,096 --> 00:25:14,973 ఒక ముద్ద తింటా! 389 00:25:16,350 --> 00:25:18,435 మన కుటుంబంలో ఇంకో లాయర్ తయారవుతున్నట్టుందే. 390 00:25:18,435 --> 00:25:21,688 తను అరటిపళ్లు తినను అంటుంటే వదిలేద్దాంలే. నేనున్నానుగా లాగించేస్తాను వాటిని. 391 00:25:22,189 --> 00:25:24,316 - నేనే తింటా. - ఏంటి? నిజంగా? 392 00:25:25,192 --> 00:25:27,319 అటు చూడండి, లాయర్, ఇంకా మాటలకారి. 393 00:25:30,364 --> 00:25:32,407 ఇది మా పెళ్లి వీడియో. 394 00:25:32,407 --> 00:25:34,535 - నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తా. - వద్దు. ఉంచండి. 395 00:25:37,496 --> 00:25:38,497 అలాగే. 396 00:25:44,753 --> 00:25:50,133 మరి మనం ఈ పని చేస్తే, బెయిలీ తన జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించాల్సి వస్తుంది. 397 00:25:50,133 --> 00:25:51,468 అలా ఏం అక్కర్లేదు. 398 00:25:52,719 --> 00:25:54,221 ల్యారీ, దాన్ని తీసుకురా. 399 00:25:54,221 --> 00:25:56,932 ఇప్పటికన్నా తనకి తెలిసి ఉంటుంది. తనేమీ కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన పని లేదు. 400 00:25:56,932 --> 00:25:57,850 అయ్య బాబోయ్... 401 00:25:58,809 --> 00:26:01,436 థ్యాంక్స్, గ్రేడీ. ఎక్కడికీ తీసుకెళ్లడానికి వీలుపడని ఈ డబ్బు సంచిని నువ్వు తీసుకొచ్చావు. 402 00:26:01,436 --> 00:26:02,688 చాలా మంచి పని చేశావు. 403 00:26:02,688 --> 00:26:04,648 - నువ్వు నా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించావు. - సారీ. 404 00:26:04,648 --> 00:26:06,733 నీ భర్త పని చేసే సంస్థ మోసానికి పాల్పడిందని దానిపై దర్యాప్తు 405 00:26:06,733 --> 00:26:09,278 జరుగుతున్నప్పుడు, ఇది మీ ఇంట్లోని పడక కింద ఉండటం మంచిదంటావా? 406 00:26:10,529 --> 00:26:11,655 ఈ డబ్బు సక్రమంగా సంపాదించిన డబ్బే. 407 00:26:12,155 --> 00:26:14,032 ఓవెన్ ఈ డబ్బునంతా చాలా ఏళ్లు దాచి కూడబెట్టి ఉంటాడు. 408 00:26:14,032 --> 00:26:16,285 నిజం చెప్పాలంటే, నువ్వు అదృష్టవంతురాలివి. 409 00:26:17,494 --> 00:26:18,871 ఇలా జరుగుతుందని ఊహించి, జాగ్రత్తపడ్డాడు. 410 00:26:22,291 --> 00:26:23,458 కానీ నన్ను జాగ్రత్తపరచడం మర్చిపోయాడు. 411 00:26:24,459 --> 00:26:25,711 అతను నాకేమీ చెప్పలేదు. 412 00:26:26,295 --> 00:26:27,337 మీ ఇద్దరిలో ఎవరూ చెప్పలేదు. 413 00:26:27,337 --> 00:26:29,381 అది నీ క్షేమం, ఇంకా బెయిలీ క్షేమం కోసమే. 414 00:26:30,424 --> 00:26:31,425 అదెలా? 415 00:26:35,637 --> 00:26:37,723 అతను నాకు చెప్పి ఉండవచ్చు. నన్ను నమ్మి ఉండవచ్చు కదా. 416 00:26:42,019 --> 00:26:44,062 నీకు ప్రపోజ్ చేసే ముందే, ఓవెన్ నాకు కాల్ చేశాడు. 417 00:26:46,148 --> 00:26:47,608 అదే మేము చివరిసారి మాట్లాడుకోవడం. 418 00:26:48,442 --> 00:26:50,527 నిన్ను ప్రేమించినంతంగా ఎవరినీ ప్రేమించలేదు అన్నాడు. 419 00:26:52,112 --> 00:26:53,655 అతని జీవితంలోకి వెలుగులు తీసుకోచ్చావు అన్నాడు. 420 00:26:54,990 --> 00:26:56,200 అతను కొత్త జీవితం ప్రారంభించి పదేళ్లయింది. 421 00:26:56,825 --> 00:26:59,536 పదేళ్ల తర్వాత, మనం క్షేమంగా ఉన్నామని అనిపించవచ్చు. 422 00:27:01,121 --> 00:27:03,832 అతను నా అభిప్రాయం అడిగినప్పుడు, నీకేమీ చెప్పవద్దని అన్నాను. 423 00:27:04,833 --> 00:27:06,418 నిజం చెప్పాలంటే, నిన్ను అసలు పెళ్ళే చేసుకోవద్దని చెప్పా. 424 00:27:06,418 --> 00:27:07,628 అబ్బో. 425 00:27:07,628 --> 00:27:09,338 కానీ, అతను వినలేదు. ఎందుకంటే, ఓవెన్ స్వభావమే అది. 426 00:27:09,338 --> 00:27:11,590 అతని మనుషుల విషయంలో భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో చూపుతాడు. 427 00:27:11,590 --> 00:27:12,674 నీతో ప్రేమలో పడ్డాడు. 428 00:27:13,884 --> 00:27:16,094 కానీ, దీన్నంతటి నుండి నిన్ను రక్షించాలనే అతను అనుకున్నాడు. 429 00:27:16,845 --> 00:27:20,140 అలా చేయాలంటే, నీకు ఏమీ చెప్పకూడదని, అదొక్కటే మార్గం అని నేను చెప్పాను. 430 00:27:21,308 --> 00:27:22,726 అందుకే, అతను నీకేమీ చెప్పలేదు. 431 00:27:24,645 --> 00:27:26,522 ఆ భారాన్ని మోయవలసింది అతనే అని గ్రహించాడు. 432 00:27:28,232 --> 00:27:31,610 మీరిద్దరూ నన్ను తక్కువ అంచనా వేశారు. నేను ఎక్కడా తొణకకుండా, బెణకకుండా వ్యవహరించేదాన్ని. 433 00:27:32,402 --> 00:27:34,655 హా, ఆ విషయం ఇప్పుడు అర్థమైంది. 434 00:27:36,782 --> 00:27:39,117 ఈ పరిస్థితుల్లో ఇక్కడ నువ్వేం చేయాలో, అదే చేస్తావనే నమ్మకం కూడా నాకు ఏర్పడింది. 435 00:27:39,117 --> 00:27:40,661 బెయిలీని జాగ్రత్తగా చూసుకొనే విషయంలో. 436 00:27:42,955 --> 00:27:46,041 గ్రేడీ, నువ్వు చెయమని చెప్పేది, సరైన పనిలా అనిపించట్లేదు. 437 00:27:49,294 --> 00:27:50,337 అది సరైన పని కానే కాదు కాబట్టి. 438 00:27:57,511 --> 00:27:58,512 నీ స్నేహితురాలు కాల్ చేస్తోంది. 439 00:27:59,888 --> 00:28:00,973 హేయ్, జూల్స్. 440 00:28:00,973 --> 00:28:04,726 హేయ్. చూడు, బాబ్ కి ఏమీ తెలీదట. అతను మాట్లాడలేదట, కేవలం మెసేజ్ మాత్రమే చేశాడట. 441 00:28:04,726 --> 00:28:07,604 - అతను చెప్పేది నమ్ముతున్నావా? - లేదు. కానీ అతనేమీ చెప్పట్లేదు. 442 00:28:07,604 --> 00:28:09,773 నువ్వు ఇంకా వాళ్ల ఇంటి దగ్గరే ఉన్నావా? ఫోన్ అతనికి ఇవ్వగలవా? 443 00:28:09,773 --> 00:28:12,317 - చూడు, హాన్, అది మంచి ఆలోచనని నాకు అనిపించట్లేదు... - జూల్స్, నా మాట విను. 444 00:28:15,571 --> 00:28:16,947 సరే. ఒక్క నిమిషం ఆగు. 445 00:28:24,037 --> 00:28:25,080 నేను చూస్తాలే. 446 00:28:27,958 --> 00:28:29,001 ఏంటి? 447 00:28:33,422 --> 00:28:37,467 బాబీ. బాబీ, లైనులో ఉన్నావా? ఇది చాలా ముఖ్యమైనది. దయచేసి విను. 448 00:28:38,969 --> 00:28:40,554 హేయ్, హానా. 449 00:28:40,554 --> 00:28:41,889 బెయిలీ ఎక్కడ ఉందో నాకు తెలియాలి. 450 00:28:41,889 --> 00:28:44,308 చూడండి, నేను ఇప్పుడే జూల్స్ తో కూడా మాట్లాడాను. 451 00:28:44,308 --> 00:28:46,810 నాకు తెలుసు, బాబీ. కానీ బెయిలీ ప్రమాదంలో ఉంది. 452 00:28:48,478 --> 00:28:49,605 ప్రమాదమా? 453 00:28:49,605 --> 00:28:50,772 అది చాలా సంక్లిష్టమైన విషయం. 454 00:28:52,274 --> 00:28:53,525 కానీ నువ్వు నన్ను నమ్మాలి. 455 00:28:53,525 --> 00:28:56,069 తన క్షేమం కోసం నేనేమైనా చేస్తాను. నువ్వు కూడా అదే చేస్తావని నాకు తెలుసు. 456 00:28:56,570 --> 00:28:58,864 దయచేసి, సహకరించు బాబీ. మాకు ఎక్కువ సమయం లేదు. 457 00:28:58,864 --> 00:29:04,119 సరే. చూడండి, ఒక మహిళ తనకి ఆంటీ కావచ్చని అనుకుంది. 458 00:29:04,119 --> 00:29:05,370 తను చాలా ఎమోషనల్ అయినట్టుగా అనిపించింది. 459 00:29:05,370 --> 00:29:08,040 మేము గూగుల్ లో చూస్తే, ఒక చిరునామా కనిపించింది. 460 00:29:08,040 --> 00:29:10,042 - ఆండ్రియా ఇంటిదా? - హా, అవును. 461 00:29:10,042 --> 00:29:11,168 థ్యాంక్యూ, బాబీ. 462 00:29:11,168 --> 00:29:13,545 - ఆండ్రియా రేయస్ ఇంట్లో ఉంది. - హా, నేను వెళ్తున్నా. ఇక్కడే ఉండు. 463 00:29:18,717 --> 00:29:21,345 నేను మార్షల్ ఆఫీసు నుండి మాట్లాడుతున్నా. హైడ్ పార్కులో స్థానిక స్టేషన్ పోలీసుల బ్యాకప్ కావాలి, 464 00:29:21,345 --> 00:29:24,723 చిరునామా వచ్చేసి, ఆండ్రియా రేయస్, 4872, వెస్ట్ 41వ వీధి. 465 00:29:25,307 --> 00:29:26,183 ఇంకా ఎంత సేపు? 466 00:29:26,183 --> 00:29:28,477 జీపీయస్ ప్రకారం హైడ్ పార్కుకు మనం పది నిమిషాలలోపు వెళ్లిపోగలం. 467 00:29:29,228 --> 00:29:30,521 నేను ఏడు నిమిషాల్లో తీసుకెళ్లగలను. 468 00:29:32,731 --> 00:29:33,941 లవ్ యూ, నాన్నా. 469 00:29:34,775 --> 00:29:38,362 ఆదివారం రాత్రి నువ్వు మా ఇంటికి భోజనానికి వచ్చి, నా భార్య మెరెడిత్ ని కలువు. 470 00:29:40,697 --> 00:29:42,991 తప్పకుండా. మిమ్మల్ని కలవడం బాగుంది, సర్. 471 00:29:43,617 --> 00:29:46,203 సర్ అని పిలవవద్దు. నేనేదో పెద్దాయనలా అనిపిస్తోంది. 472 00:29:48,497 --> 00:29:49,665 త్వరలోనే మళ్లీ కలుద్దాం, ఈథన్. 473 00:30:09,893 --> 00:30:11,520 ఆర్టురో వాళ్ల తమ్ముడిని చూశావా? 474 00:30:11,520 --> 00:30:13,355 లైన్ బేకరుగా అదరగొట్టేస్తున్నాడు. 475 00:30:13,981 --> 00:30:15,107 ఈ సీజనులో మన జట్టే గెలవవచ్చు. 476 00:30:16,650 --> 00:30:17,818 హా. వాళ్లిద్దరూ బాగా కలిసిపోయారు. 477 00:30:17,818 --> 00:30:20,696 హా. వాళ్లు మొదటిసారిగా కలిసిన రోజు నుండి జాన్ జిగిరీలు అయిపోయారు. 478 00:30:20,696 --> 00:30:22,322 - హేయ్, బంగారం. - హాయ్, బంగారం. 479 00:30:22,823 --> 00:30:24,783 - మీ రిసెప్షన్ నెవర్ డ్రైలోనా జరిగేది? - నా బంగారు పాప ఏది? 480 00:30:26,243 --> 00:30:27,244 అది నా ఆలోచనే. 481 00:30:28,704 --> 00:30:30,747 చార్లీ బామ్మా తాతయ్యల పెళ్లి అక్కడే జరిగింది. 482 00:30:30,747 --> 00:30:32,249 - అతని తల్లిదండ్రుల పెళ్లి కూడా. - వావ్. 483 00:30:32,249 --> 00:30:33,792 నాకు ఆ సంప్రదాయం నచ్చింది. 484 00:30:36,962 --> 00:30:39,131 వావ్. సూపర్. 485 00:30:56,064 --> 00:30:57,065 నేను... 486 00:30:58,817 --> 00:31:02,779 నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇప్పటిదాకా నేను... 487 00:31:05,616 --> 00:31:07,659 నాకూ కుటుంబం ఉందంటే నమ్మలేకున్నా. కానీ... 488 00:31:11,330 --> 00:31:12,915 ఇప్పటికీ ఈ కుటుంబానికి నువ్వు దూరమైపోలేదు. 489 00:31:34,436 --> 00:31:35,646 సాక్షుల రక్షణ ప్రోగ్రామ్ 490 00:31:35,646 --> 00:31:37,105 268 ఇస్సాక్వా డాక్ సాసలీటో 491 00:31:39,316 --> 00:31:40,400 "దగ్గరి బంధువులు." 492 00:31:54,289 --> 00:31:55,249 జూల్స్ నికొల్స్ ని మాట్లాడుతున్నా. 493 00:31:55,249 --> 00:31:57,251 - హేయ్, నేనే. - వాళ్లకి తన ఆచూకీ తెలిసిందా? 494 00:31:57,751 --> 00:31:59,837 ఇంకా లేదు. నా వల్ల కాట్లేదు. 495 00:31:59,837 --> 00:32:03,131 ఓవెన్ వీలునామా ఇప్పుడు నీ దగ్గరే ఉందా? 496 00:32:03,131 --> 00:32:04,216 ఉంది, ఎందుకు? 497 00:32:06,009 --> 00:32:10,722 బెయిలీకి గార్డియన్ గా ఎవరిని పేర్కొన్నాడో తెలుసుకుందామని. 498 00:32:10,722 --> 00:32:13,767 సరే, ఒక్క నిమిషం ఆగు. బండిని పక్కకు ఆపి చూస్తా. 499 00:32:19,982 --> 00:32:22,359 సరే మరి. వీలునామా తీసుకున్నా. చూస్తా ఆగు. 500 00:32:24,778 --> 00:32:26,446 హానా, నీ పేరే ఉంది. 501 00:32:26,446 --> 00:32:29,074 ఓవెన్ మరణాంతరం, లేదా తండ్రిగా ఆయన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోయినా, 502 00:32:29,074 --> 00:32:32,619 నువ్వు గార్డియన్ గా ఉండాలని ఇక్కడ పేర్కొని ఉంది. 503 00:32:34,121 --> 00:32:36,081 నేను కాక ఇంకెవరి పేరైనా రాశాడా? 504 00:32:38,834 --> 00:32:45,257 హా, రాశాడు. నువ్వు సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తించలేకపోతే చార్లెస్ స్మిత్ అని రాశాడు. 505 00:32:45,799 --> 00:32:48,177 చార్లెస్ స్మిత్, ఇంకా ఆండ్రియా రేయస్. 506 00:32:50,721 --> 00:32:52,639 హానా, ఏం జరుగుతోంది? 507 00:32:53,140 --> 00:32:54,725 నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? 508 00:32:55,350 --> 00:32:57,394 మిస్ హాల్, గ్రేడీ ఫోన్ చేశాడు. అర్జంట్ అంటున్నాడు. 509 00:32:58,437 --> 00:32:59,354 జూల్స్, నేను మళ్లీ చేస్తా. 510 00:33:00,397 --> 00:33:01,648 - గ్రేడీ. - తను మా దగ్గరే ఉంది. 511 00:33:01,648 --> 00:33:04,651 మేము ఇప్పుడు కారు ఎక్కుతున్నాం. నేరుగా స్టేషనుకు వచ్చేస్తాం. 512 00:33:07,696 --> 00:33:10,324 హమ్మయ్య. నేను తనతో మాట్లాడవచ్చా? 513 00:33:10,324 --> 00:33:11,491 హా, త్వరగా కానిచ్చేయ్. 514 00:33:13,243 --> 00:33:14,077 హాయ్. 515 00:33:14,661 --> 00:33:17,164 బెయిలీ, నువ్వు బాగానే ఉన్నావుగా? 516 00:33:17,164 --> 00:33:19,082 బాగానే ఉన్నా. సారీ. 517 00:33:19,082 --> 00:33:21,502 నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. నీకు ముందే చెప్పి ఉండాల్సింది. 518 00:33:22,044 --> 00:33:23,045 పర్వాలేదులే. 519 00:33:24,046 --> 00:33:25,506 హానా, తను నాకు అత్తమ్మ అవుతుంది. 520 00:33:26,006 --> 00:33:27,591 ఆండ్రియా నాకు అత్తమ్మ. 521 00:33:27,591 --> 00:33:31,011 నాకు తెలుసు. అర్థం చేసుకున్నాను. నాకు కోపమేమీ లేదు. 522 00:33:37,100 --> 00:33:42,940 కానీ... నేనొక పని చేయాలి, బెయిలీ. 523 00:33:43,524 --> 00:33:44,775 ఏమీ మాట్లాడకు. 524 00:33:46,026 --> 00:33:51,240 నువ్వు... నువ్వు నా మీద నమ్మకం ఉంచు, అంతే. సరేనా? 525 00:33:51,823 --> 00:33:53,450 నన్ను నమ్ముతున్నావు కదా, బెయిలీ 526 00:33:54,243 --> 00:33:55,869 హా, నమ్ముతున్నా. 527 00:34:02,251 --> 00:34:03,377 సరే, మంచిది. 528 00:34:06,672 --> 00:34:09,257 ఇక్కడికి క్షేమంగా వచ్చేయ్. గ్రేడీతో మంచిగా ఉండు. 529 00:34:30,987 --> 00:34:32,114 హా. 530 00:34:32,114 --> 00:34:34,574 మార్షల్ ఆఫీసులో ఉండే మన నేస్తానికి కాల్ చేయ్. 531 00:35:05,939 --> 00:35:07,608 మిస్ హాల్, మీకు ఏమైనా కావాలా? 532 00:35:07,608 --> 00:35:08,901 బాత్రూమ్ కి వెళ్తున్నా. 533 00:35:29,004 --> 00:35:30,088 హేయ్. 534 00:36:05,707 --> 00:36:07,501 హానా తనని కాపాడు 535 00:36:56,258 --> 00:36:57,676 ఓరి నాయనోయ్! 536 00:36:58,594 --> 00:37:00,012 నువ్వు నన్ను అతని దగ్గరికి తీసుకెళ్లాలి. 537 00:37:00,762 --> 00:37:01,763 ఏంటి? 538 00:37:02,973 --> 00:37:04,641 నేను మీ నాన్నతో మాట్లాడాలి. 539 00:38:05,786 --> 00:38:07,788 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్