1 00:00:53,303 --> 00:00:54,470 సారీ, బేబీ. 2 00:00:54,471 --> 00:00:56,181 మనం అలా బయటకు వెళ్ళాలి. 3 00:01:34,094 --> 00:01:36,388 జేమ్స్. జేమ్స్. 4 00:01:40,684 --> 00:01:41,685 జేమ్స్! 5 00:01:51,862 --> 00:01:53,237 సోఫీ, పద. 6 00:01:53,238 --> 00:01:56,033 రా, మనం వెళ్ళిపోవాలి. రా. పరుగెత్తు. 7 00:02:35,280 --> 00:02:36,114 ఛ. 8 00:02:41,537 --> 00:02:43,454 ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇద్దరికి గాయాలయ్యాయి. 9 00:02:43,455 --> 00:02:44,997 మీరు పోలీసులకు కాల్ చేయండి. 10 00:02:44,998 --> 00:02:46,333 యాక్సిడెంటా? ఎక్కడ? 11 00:02:46,834 --> 00:02:47,750 తుపాకీ ఉందా? 12 00:02:47,751 --> 00:02:49,002 అక్కడ ఉన్న గిడ్డంగిలో ఉంది. 13 00:03:47,978 --> 00:03:49,938 కాలర్ ఐడీ లేదు 14 00:03:52,774 --> 00:03:53,775 హలో. 15 00:03:55,277 --> 00:03:56,570 అవును, నేనే. 16 00:03:59,573 --> 00:04:01,283 అవును. అతను మా దగ్గరే పని చేస్తాడు. 17 00:04:07,206 --> 00:04:08,039 ఇంటర్వ్యూ: కాలమ్ వాల్ష్ రికార్డింగ్ 18 00:04:08,040 --> 00:04:09,541 నా వెనక యాక్సిడెంట్ జరిగిన శబ్దం వచ్చింది. 19 00:04:10,292 --> 00:04:11,709 కారు వెనక్కి తిప్పి, వెళ్ళా. 20 00:04:11,710 --> 00:04:13,378 అప్పుడే నాకు తుపాకీతో ఒకతను కనిపించాడు. 21 00:04:14,463 --> 00:04:16,379 అతనెవరో మీకు తెలుసా? 22 00:04:16,380 --> 00:04:17,673 అతడిని నేను అదే మొదటిసారి చూడటం. 23 00:04:18,382 --> 00:04:19,676 తర్వాత ఏమైంది? 24 00:04:20,469 --> 00:04:22,846 నా వైపు రావడం మొదలుపెట్టాడు. ఇక నేను కారు వెనక్కి తిప్పా. 25 00:04:23,347 --> 00:04:25,933 కారు గుంటలో ఇరుక్కుంది, ఇక నేను కారు దిగి, పరుగెత్తా. 26 00:04:26,975 --> 00:04:28,727 అయితే, అక్కడి నుండి పారిపోయారా మీరు? 27 00:04:30,646 --> 00:04:31,939 సహాయం కోసం అడగడానికి వెళ్ళా. 28 00:04:32,731 --> 00:04:34,399 మళ్ళీ తిరిగి వచ్చాక, నేను చూసిందే మీకు కూడా కనిపించింది. 29 00:04:35,442 --> 00:04:37,069 ఆ అద్దెకి తీసుకున్న కారు సంగతేంటి? 30 00:04:38,237 --> 00:04:39,988 దాన్ని ఎవరు నడిపారో తెలుసా? 31 00:04:46,245 --> 00:04:47,663 నాకొక లాయర్ కావాలి. 32 00:04:54,753 --> 00:04:56,255 బట్టలు వేసుకో. 33 00:04:58,257 --> 00:05:00,133 - ఏమైంది? - లూకస్ చనిపోయాడు. 34 00:05:01,552 --> 00:05:03,554 ఇంటి నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే పొలంలో అతని శవం దొరికింది. 35 00:05:04,263 --> 00:05:05,096 లూకస్ చనిపోయాడు. 36 00:05:05,097 --> 00:05:06,389 ఏం చేశావు నువ్వు? 37 00:05:06,390 --> 00:05:07,807 నువ్వు చేయలేని పని. 38 00:05:07,808 --> 00:05:09,851 అతడిని నా కూతురిపైకి పంపించావా? 39 00:05:09,852 --> 00:05:11,812 ఎందుకు? సెంటిమెంటల్ అయిపోతున్నావేంటి? 40 00:05:13,230 --> 00:05:14,314 అబ్బా. 41 00:05:15,315 --> 00:05:18,568 లూకస్ అక్కడేం చేస్తున్నాడో నాకు తెలీదు. నాకు, దానికి ఏ సంబంధమూ లేదు. 42 00:05:18,569 --> 00:05:20,821 అబ్బో, బాగా నమ్మేలానే చెప్తున్నావే. 43 00:05:22,698 --> 00:05:23,990 పోలీసులకు చెప్పడానికి ఈ ప్రాక్టీస్ మంచిదే. 44 00:05:23,991 --> 00:05:26,868 వాళ్ళు ఒక గంటలో ఇక్కడికి వస్తారు, నిన్ను విచారిస్తారు. 45 00:05:26,869 --> 00:05:29,538 దాన్ని త్వరగా, అతిథులు రాక ముందే కానిచ్చేయ్. 46 00:05:30,414 --> 00:05:31,415 వాళ్లకి ఏం తెలుసు? 47 00:05:31,999 --> 00:05:33,916 కంగారుపడకు. వాళ్ళు ఒకరిని అనుమానిస్తున్నారు. 48 00:05:33,917 --> 00:05:34,835 ఎవరిని? 49 00:05:35,419 --> 00:05:37,629 నీ జర్నలిస్ట్ మిత్రుడైన, కాలమ్ వాల్ష్ ని. 50 00:05:38,630 --> 00:05:40,215 ఇక ఫ్రెష్ అయి, స్నానం చేసి రా. 51 00:05:57,900 --> 00:05:59,108 నా క్షేమం కోసం ఈ ఇంట్లో ఉంటున్నా. 52 00:05:59,109 --> 00:06:00,276 ఆ జర్నలిస్ట్ ఇచ్చాడు. 53 00:06:00,277 --> 00:06:02,153 ఈ ఇంటి గురించి ఎవరికీ తెలీదా? 54 00:06:02,154 --> 00:06:03,197 అతనికి తప్ప ఇంకెవరికీ తెలీదు. 55 00:06:36,980 --> 00:06:37,981 ఇప్పుడేం చేద్దాం? 56 00:06:42,945 --> 00:06:44,028 స్నానం చేద్దాం. 57 00:06:44,029 --> 00:06:45,279 ఒక లాయరుతో మాట్లాడదాం. 58 00:06:45,280 --> 00:06:46,532 నిజం చెప్పేద్దాం. 59 00:06:47,908 --> 00:06:50,243 అది ఎంత మాత్రం మేలు చేస్తుందంటావు? 60 00:06:50,244 --> 00:06:52,203 నిన్ను డిక్కీలో కుక్కారు, జేమ్స్. 61 00:06:52,204 --> 00:06:53,538 మనల్ని గుద్దారు. 62 00:06:53,539 --> 00:06:56,040 నీ ఆత్మరక్షణలో భాగంగా నువ్వు అతడిని చంపావు. మనం వివరించి చెప్పవచ్చు. 63 00:06:56,041 --> 00:06:58,334 లేదు. మన మాట ఎవరూ నమ్మరు, సోఫీ. 64 00:06:58,335 --> 00:06:59,502 అదంతా కాలమ్ కుడా చూశాడు. 65 00:06:59,503 --> 00:07:01,087 అతను సాక్షి. 66 00:07:01,088 --> 00:07:03,965 పక్షపాతం ఉండని వేరే వ్యక్తి అతను, అతడిని నమ్ముతారు. 67 00:07:03,966 --> 00:07:05,591 మనకి ఇంకో దారి ఉందా? 68 00:07:05,592 --> 00:07:06,677 పారిపోదాం. 69 00:07:08,470 --> 00:07:09,846 మనకి అవకాశమున్నప్పుడే ఆ పని చేస్తే మేలు. 70 00:07:09,847 --> 00:07:12,808 - ఆ తర్వాత? - ఏమో, ఏదోకటి ఆలోచిద్దాం. 71 00:07:15,602 --> 00:07:17,312 సోఫ్, మనం ఇక్కడ ఉండలేం. 72 00:07:20,482 --> 00:07:21,650 నేను కాలమ్ కి కాల్ చేస్తా. 73 00:07:25,654 --> 00:07:27,364 కాలమ్ వాల్ష్ మొబైల్ ఫోన్ 74 00:07:30,701 --> 00:07:34,037 టెస్ 75 00:07:45,591 --> 00:07:46,758 మీ లాయర్ వచ్చేశారు. 76 00:07:51,513 --> 00:07:52,514 ఇక్కడికి ఎందుకు వచ్చావు? 77 00:07:53,682 --> 00:07:55,100 నీకు సాయం కావాలేమో అని వచ్చా. 78 00:07:55,767 --> 00:07:56,685 నీ సాయం అక్కర్లేదు. 79 00:07:59,897 --> 00:08:00,731 కానీ... 80 00:08:04,109 --> 00:08:07,196 పరిస్థితిని బట్టి చూస్తుంటే, ఎవరు కావాలో, ఎవరు వద్దో ఎంచుకునే అవకాశం నీకున్నట్టు లేదు. 81 00:08:08,363 --> 00:08:09,363 ఇక పోలీసోడిని పిలువు. 82 00:08:09,364 --> 00:08:11,366 నన్ను బయటకు గెంటించేయ్. ఆ హక్కు నీకు ఉంది. 83 00:08:12,409 --> 00:08:14,036 అదంత తెలివైన ఆలోచన కాదు, కానీ, 84 00:08:14,661 --> 00:08:17,539 మగాళ్ల చేత పిచ్చి పనులు చేయించడం తనకి కొత్తేమీ కాదని విన్నాను. 85 00:08:18,749 --> 00:08:21,835 నీ ఇంఫార్మర్, టెస్ కాల్డ్వెల్. ఇప్పుడు తను ఆ పేరుతోనే తిరుగుతోంది కదా? 86 00:08:22,794 --> 00:08:24,421 మరి సోఫీ ఎల్లిస్? 87 00:08:30,260 --> 00:08:31,345 ఆ పేరు ఎప్పుడైనా విన్నావా? 88 00:08:34,472 --> 00:08:37,518 శాన్ ఫ్రాన్సిస్కోలో ఇంచుమించుగా పదేళ్లు తను ఆ పేరుతోనే తిరిగింది. 89 00:08:38,644 --> 00:08:39,685 తన భర్త పేరు తీసుకుంది. 90 00:08:39,686 --> 00:08:41,355 మీ ఇద్దరూ కలిశారు కూడా కదా. 91 00:08:42,898 --> 00:08:46,568 నిన్ను కలవడానికి ముందు, అక్కడ చాలా కాలం అదే పేరుతో మోసం చేసింది. 92 00:08:47,486 --> 00:08:51,197 తన భర్త వెంచర్ క్యాపిటల్ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారి నుండి 1.1 కోట్లను కొట్టేసింది. 93 00:08:51,198 --> 00:08:54,243 సరిగ్గా పోలీసులు ఆ కేసుపై విచారణ మొదలెట్టగానే, 94 00:08:55,160 --> 00:08:57,287 గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నుండి దూకేసింది. 95 00:09:02,334 --> 00:09:05,587 అంటే, నీకెప్పుడూ అనిపించలేదా? 96 00:09:06,171 --> 00:09:09,091 అంత ఖరీదైన ఫ్లాట్ కి తనకి డబ్బులు ఎక్కడివని? 97 00:09:09,967 --> 00:09:11,885 తన డబ్బుల గురించి నాకు అనవసరం. 98 00:09:12,427 --> 00:09:13,929 నువ్వు పట్టించుకుని ఉండాల్సిందేమో. 99 00:09:14,888 --> 00:09:18,141 నా క్లయింట్ ని ఎలా వాడుకుంటోందో, నిన్ను కూడా అలానే వాడుకుంటోంది. 100 00:09:18,934 --> 00:09:20,143 తన స్వలాభం కోసం. 101 00:09:21,645 --> 00:09:24,857 నువ్వు ఇరుక్కున్నావు, కానీ నువ్వు సులభంగా తప్పించుకోవచ్చు. 102 00:09:25,649 --> 00:09:26,899 ఆ డిటెక్టివ్స్ తో మాట్లాడు. 103 00:09:26,900 --> 00:09:28,068 నిజం చెప్పేయ్. 104 00:09:29,987 --> 00:09:32,990 ఎందుకంటే, వాళ్ళు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసని నాకు చాలా బలంగా అనిపిస్తోంది. 105 00:09:37,494 --> 00:09:38,745 నీ సలహాకు థ్యాంక్స్. 106 00:09:39,663 --> 00:09:42,165 నా తాహతుకు తగ్గ లాయరును చూసుకుంటాలే. 107 00:09:52,342 --> 00:09:55,179 ఇంకో సలహా ఇస్తాను. ఉచితంగానేలే. 108 00:09:57,347 --> 00:09:59,474 జాగ్రత్తగా ఆలోచించి ఎవరి కథనాలను నమ్మాలో నిర్ణయించుకో. 109 00:10:00,684 --> 00:10:02,644 నీ ఇంఫార్మర్లు సమస్యల్లో చిక్కుకుంటూ ఉన్నారు, 110 00:10:03,770 --> 00:10:06,356 పోలీసులకి నీపై అనుమానం మొదలయ్యే అవకాశం ఉంది. 111 00:10:31,215 --> 00:10:32,299 - థ్యాంక్యూ. - పర్వాలేదు, మేడమ్. 112 00:10:32,883 --> 00:10:36,261 వచ్చేశావా! స్వాగతం, డార్లింగ్. 113 00:10:37,012 --> 00:10:38,221 ఎంత మంచి రోజో ఇవాళ! 114 00:10:38,222 --> 00:10:39,515 క్విన్ ఎలా ఉన్నాడు? 115 00:10:40,474 --> 00:10:42,475 ఇవాళ ఉదయాన్నే లేచాడు అని విన్నా. 116 00:10:42,476 --> 00:10:44,227 అతడిని చూడకుండా ఉండటం వింతగా ఉంది. 117 00:10:44,228 --> 00:10:47,980 అది సంప్రదాయమని నాకు తెలుసు, కానీ అతనితో మాట్లాడాలని నాకు చాలా ఉంది. 118 00:10:47,981 --> 00:10:51,360 నువ్వు పెళ్లి బట్టల్లో ముస్తాబై వస్తున్నప్పుడు, అతను చూస్తాడు కదా, అప్పుడుంటుంది అసలైన కిక్కు. 119 00:10:52,236 --> 00:10:54,238 ఇదేనా డ్రెస్? నేను చూడవచ్చా? 120 00:10:56,907 --> 00:10:59,159 దేవుడా. చాలా బాగుంది. 121 00:11:00,035 --> 00:11:01,203 థ్యాంక్స్. 122 00:11:05,582 --> 00:11:07,626 ఒక దుర్వార్త చెప్పాలి. 123 00:11:08,210 --> 00:11:09,211 అవునా? 124 00:11:10,003 --> 00:11:12,547 నిన్న రాత్రి ఒక కారు యాక్సిడెంట్ జరిగింది. 125 00:11:12,548 --> 00:11:14,883 మన ఎస్టేటుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో. 126 00:11:16,718 --> 00:11:17,928 ఎవరికీ ఏమీ కాలేదు కదా? 127 00:11:18,929 --> 00:11:20,264 ఏమీ కాలేదని చెప్పలేను. 128 00:11:21,139 --> 00:11:23,266 మన ఉద్యోగి ఒకరు చనిపోయారు. 129 00:11:23,267 --> 00:11:24,893 సెక్యూరిటీలో పని చేసే వ్యక్తి. 130 00:11:27,396 --> 00:11:29,063 - అయ్యయ్యో. - ఏం పర్వాలేదు. 131 00:11:29,064 --> 00:11:32,441 పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, కానీ కొన్ని ప్రశ్నలు అడగడానికి 132 00:11:32,442 --> 00:11:35,570 వారు ఇక్కడికి రావచ్చు, నువ్వు కంగారు పడకు. 133 00:11:35,571 --> 00:11:37,029 హెన్రీతో మాట్లాడతారా? 134 00:11:37,030 --> 00:11:38,824 కాదు, క్విన్ తో మాట్లాడతారు. 135 00:11:40,075 --> 00:11:40,909 క్విన్ తో ఎందుకు? 136 00:11:41,493 --> 00:11:47,124 క్విన్ నిన్న ఉదయం అతడిని కలిసి, బ్యాచిలర్ పార్టీకి సెక్యూరిటీని ఏర్పాటు చేయమని చెప్పాడు. 137 00:11:51,086 --> 00:11:53,671 ఈ ఉదయం దాని సంగతి మనోళ్లు చూసేసుకుంటారులే, 138 00:11:53,672 --> 00:11:56,967 మన సంబరాలకు ఏదీ అడ్డు రాదు. 139 00:12:00,512 --> 00:12:01,430 చనిపోయిన వ్యక్తి పేరేంటి? 140 00:12:04,641 --> 00:12:05,851 అతని పేరేంటో మీకు తెలుసా? 141 00:12:06,685 --> 00:12:08,687 తెలీదు. 142 00:12:13,650 --> 00:12:17,321 నీ పెళ్లి రోజు ఇలా జరిగి ఉండకూడదు, కానీ పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించు. 143 00:12:17,946 --> 00:12:19,406 ఇదంతా సమసిపోతుందిలే. 144 00:12:19,907 --> 00:12:23,452 ఇవన్నీ వాటికవే పరిష్కరించుకుపోతాయి. 145 00:12:35,839 --> 00:12:36,673 కాల్ చేశాడా? 146 00:12:39,009 --> 00:12:40,010 లేదు. 147 00:12:43,388 --> 00:12:44,389 సోఫీ. 148 00:12:46,350 --> 00:12:47,725 నువ్వు... 149 00:12:47,726 --> 00:12:49,770 నువ్వు నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందా? 150 00:12:54,900 --> 00:12:55,901 సోఫ్. 151 00:13:00,364 --> 00:13:02,032 ఎక్కడి నుండి చెప్పాలో కూడా తెలీట్లేదు. 152 00:13:03,116 --> 00:13:04,326 చెప్పు, పర్లేదు. 153 00:13:11,041 --> 00:13:15,379 మా అమ్మ చనిపోయినప్పుడు, నేను అక్కడే ఉన్నాను. 154 00:13:17,548 --> 00:13:18,757 తను భయపడుతూ ఉండింది. 155 00:13:21,677 --> 00:13:22,678 ఏదో విషయంలో కలత చెందింది. 156 00:13:24,930 --> 00:13:28,350 అర్ధరాత్రి వేళ నన్ను కారులో అక్కడికి తీసుకెళ్లింది. 157 00:13:30,602 --> 00:13:33,772 ఆ సంఘటన జరిగిన చోటే నిన్న రాత్రి మనం ఉన్నాం కదా... 158 00:13:36,775 --> 00:13:38,443 కాబట్టి నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. 159 00:13:47,244 --> 00:13:48,579 నా దగ్గర రుజువు ఉంది. 160 00:13:50,914 --> 00:13:52,332 నేను కాలమ్ కి మొట్టమొదటిసారి కాల్ చేసినప్పుడు, 161 00:13:53,917 --> 00:13:56,170 అతనికి చెప్పాను. 162 00:13:56,962 --> 00:13:57,880 దేనికి రుజువు? 163 00:14:00,340 --> 00:14:01,592 మా అమ్మని చంపాక... 164 00:14:03,927 --> 00:14:05,762 కారును అడవిలో దాచారు. 165 00:14:07,639 --> 00:14:08,807 దాన్ని నాశనం అవ్వనిచ్చారు. 166 00:14:12,978 --> 00:14:15,439 నేను ఆ చోటుకు సంబంధించిన కో-ఆర్డినేట్లను రాసి పెట్టుకున్నా. 167 00:14:19,067 --> 00:14:21,445 ఆ సంఘటనకి ఏకైక సాక్ష్యం, కారు. 168 00:14:23,864 --> 00:14:25,407 అది నీకెలా తెలుసు? 169 00:14:27,701 --> 00:14:28,702 నేను అక్కడికి వెళ్లాను. 170 00:14:29,703 --> 00:14:30,996 దాన్ని కనుగొన్నా. 171 00:14:33,415 --> 00:14:36,752 కానీ ఈసారి, అదేంటో నాకు తెలీలేదు. 172 00:14:38,420 --> 00:14:40,005 నాకు గుర్తురాలేదు. 173 00:14:41,715 --> 00:14:43,008 నేను పారిపోయింది అందుకే. 174 00:14:45,052 --> 00:14:48,721 ఎలైజా, తన వల్లే నేను పారిపోయానని అనుకుంది, కానీ తనకి ఏ సంబంధమూ లేదు. 175 00:14:48,722 --> 00:14:50,432 నేను అమ్మ గుర్తొచ్చి పారిపోయా. 176 00:14:55,771 --> 00:14:57,271 దీన్ని నేను సరి చేయగలనని అనుకున్నా. 177 00:14:57,272 --> 00:15:00,191 కానీ, నేను ఏమీ చేయలేను. 178 00:15:00,192 --> 00:15:01,734 అసలు ఆ అవకాశమే లేదు. 179 00:15:01,735 --> 00:15:03,028 అది నిజం కాదు. 180 00:15:06,156 --> 00:15:07,366 ఒకసారి మనల్ని చూడు. 181 00:15:08,700 --> 00:15:13,455 వాళ్ళేం దాస్తున్నారో నాకు అంతా తెలుసు, కానీ దాని వల్ల ఒరిగిందేంటి? 182 00:15:25,092 --> 00:15:27,135 ఇక్కడికి వచ్చేటప్పుడు దార్లో ఒక యాక్సిడెంట్ ని చూశా. 183 00:15:28,011 --> 00:15:29,387 దానికి, మనకి సంబంధం ఉందా? 184 00:15:29,388 --> 00:15:32,099 నిన్న రాత్రి ఒక యాక్సిడెంట్ జరిగింది. 185 00:15:33,475 --> 00:15:38,689 మన ఆవరణ నుండి వెళ్తోన్న సెక్యూరిటీ సిబ్బందిలోని ఒకరి కారు, ఇంకో కారు గుద్దుకున్నాయి. 186 00:15:39,356 --> 00:15:40,398 అయితే, అలా చెప్తున్నారన్నమాట. 187 00:15:40,399 --> 00:15:41,567 కారు యాక్సిడెంట్ అని. 188 00:15:42,651 --> 00:15:44,151 ఎవరిదీ తప్పు లేదు కదా. 189 00:15:44,152 --> 00:15:47,656 మన ఆవరణలో అనుకోకుండా ఇంకో యాక్సిడెంట్ జరిగింది, అంతే కదా. 190 00:15:49,283 --> 00:15:50,534 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 191 00:15:51,451 --> 00:15:52,911 నువ్వు తనకి ఏం చెప్పావో విన్నాను. 192 00:15:53,871 --> 00:15:56,164 తన అమ్మ కారు యాక్సిడెంటులో చనిపోయిందని చెప్పావు కదా. 193 00:16:00,419 --> 00:16:03,337 అయితే, నువ్వు సోఫీతో మాట్లాడావా? 194 00:16:03,338 --> 00:16:05,090 హా, మాట్లాడా. 195 00:16:12,556 --> 00:16:14,099 ఎప్పుడు మాట్లాడావు తనతో? 196 00:16:15,184 --> 00:16:16,393 నిన్న రాత్రి కలిశాం, 197 00:16:17,644 --> 00:16:21,148 నేనే కలవమన్నాను, నిజం చెప్పేశా. 198 00:16:25,027 --> 00:16:27,070 తను ఈ ఊరును విడిచి పోతే మంచిదని చెప్పా. 199 00:16:29,990 --> 00:16:33,994 మన కుటుంబం తను ఊహకందని దారుణాలు చేయగలదని చెప్పా. 200 00:16:37,080 --> 00:16:38,916 జరిగిందేంటో ఆన్ నాకు చెప్పింది. 201 00:16:40,083 --> 00:16:41,543 వాళ్ళ అమ్మ ఎలా చనిపోయిందో చెప్పింది. 202 00:16:42,711 --> 00:16:44,588 మా అమ్మే తనని చంపిందని చెప్పింది. 203 00:16:47,841 --> 00:16:50,676 ఇంత కాలం తనని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నావు? 204 00:16:50,677 --> 00:16:51,886 ఆమె నీ తల్లి కాబట్టి. 205 00:16:51,887 --> 00:16:54,515 ఆమె కూడా ఒకరికి తల్లే కదా. 206 00:16:55,098 --> 00:16:57,935 నేను నిన్ను ఎంచుకున్నా, ఎలైజా. మీ అందరినీ ఎంచుకున్నా. 207 00:16:59,061 --> 00:17:01,438 అంత పెద్ద దారుణాన్ని జీవితాంతం భరిస్తూ జీవించాలా నేను? 208 00:17:14,992 --> 00:17:16,328 పోలీసులు వచ్చారు. 209 00:17:26,922 --> 00:17:29,966 మీకు జేమ్స్ ఎల్లిస్ ఎలా తెలుసో మాకు చెప్పగలరా? 210 00:17:29,967 --> 00:17:31,634 నాకు... బిజినెస్ అసోసియేట్ గా తెలుసు. 211 00:17:31,635 --> 00:17:33,095 మేము ఇంతకుముందు కలుసుకున్నాం. 212 00:17:33,595 --> 00:17:35,597 అతని భార్య ఎవరో మీకు తెలుసా? 213 00:17:36,598 --> 00:17:37,891 ఆ సమయంలో తెలీదు. 214 00:17:38,559 --> 00:17:40,351 వాళ్ళ గతం గురించి మీ లాయర్ మాకు చెప్పారు. 215 00:17:40,352 --> 00:17:43,145 అమెరికాలో ఆర్థిక మోసాలు, నేరాలు చేశారని చెప్పారు. 216 00:17:43,146 --> 00:17:44,480 నేను కూడా అదే విన్నాను. హా. 217 00:17:44,481 --> 00:17:46,692 వాళ్ళు మమ్మల్ని కూడా మోసం చేయాలని ప్లాన్ వేసినట్టుగా అర్థమవుతోంది. 218 00:17:48,151 --> 00:17:50,945 మీ ఆవరణలోకి నిన్న మిస్టర్ ఎల్లిస్ వచ్చినప్పుడు, ఏం జరిగింది? 219 00:17:50,946 --> 00:17:52,030 అతను నాపై దాడి చేశాడు. 220 00:17:54,449 --> 00:17:55,534 మేము వేట పని మీద ఉన్నాం. 221 00:17:56,159 --> 00:17:57,243 అడవిలో ఉన్నాం. 222 00:17:57,244 --> 00:18:00,830 మా కుటుంబం నుండి మరింత డబ్బు పొందాలని నన్ను బెదిరించాడు. 223 00:18:00,831 --> 00:18:02,081 ఏమైనా గొడవ జరిగిందా? 224 00:18:02,082 --> 00:18:03,708 హా, ఆ గోల అంతా నా మిత్రులు విని, 225 00:18:03,709 --> 00:18:05,376 అతడిని త్వరగానే పట్టుకోగలిగారు. 226 00:18:05,377 --> 00:18:06,920 నేను అదృష్టవంతుడిననే చెప్పాలి. 227 00:18:07,588 --> 00:18:08,964 వారి పేర్లేంటో చెప్పగలరా? 228 00:18:11,175 --> 00:18:12,008 సరే. 229 00:18:12,009 --> 00:18:15,219 అంటే, కాసేపయ్యాక పెళ్ళికి వాళ్ళు ఎలాగూ వస్తారు. 230 00:18:15,220 --> 00:18:16,762 వాళ్ళతో మీరు మాట్లాడాలనుకుంటే, 231 00:18:16,763 --> 00:18:18,806 వారు మనస్ఫూర్తిగా మీకు సహాయపడతారు. 232 00:18:18,807 --> 00:18:20,184 ఆ తర్వాత ఏమైంది? 233 00:18:20,934 --> 00:18:23,686 దగ్గర ఉండి అతడిని ఆవరణ నుండి బయటకు తీసుకెళ్లమని మా సెక్యూరిటీ వాళ్లకి చెప్పా, 234 00:18:23,687 --> 00:18:27,399 వాళ్ళు ఆ కారు వెనకే వెళ్లి, అతను ఏ హడావిడీ చేయకుండా వెళ్లిపోయేలా చూసుకున్నారు. 235 00:18:29,735 --> 00:18:32,820 అదే సమస్య, అదే నేను చేసిన పొరపాటు అనుకుంటా. 236 00:18:32,821 --> 00:18:35,865 మీకు అప్పుడే కాల్ చేసి, 237 00:18:35,866 --> 00:18:38,493 నేను హ్యాండిల్ చేయడం కన్నా, మీకే ఆ పని అప్పగించి ఉండాల్సింది. 238 00:18:43,707 --> 00:18:45,042 థ్యాంక్యూ, మిస్టర్ హంట్లీ. 239 00:18:45,626 --> 00:18:47,376 - మీ పెళ్లి రోజు ఇబ్బంది పెట్టినందుకు సారీ. - పర్లేదు. 240 00:18:47,377 --> 00:18:48,879 మీరు సమయాన్ని కేటాయించి మాట్లాడినందుకు థ్యాంక్స్. 241 00:18:49,671 --> 00:18:50,589 ఏం పర్వాలేదు. 242 00:19:12,736 --> 00:19:14,321 బాబోయ్, కాలమ్. 243 00:19:15,113 --> 00:19:16,113 అంతా ఓకేనా? 244 00:19:16,114 --> 00:19:17,990 ఒకే కాదు, అడిగినందుకు థ్యాంక్స్. 245 00:19:17,991 --> 00:19:19,575 - నిన్ను విడిపిస్తున్నా. - ఎలా? 246 00:19:19,576 --> 00:19:22,371 మన మ్యాగజైన్ కి లాయర్లు ఉన్నారు కదా, అదృష్టవశాత్తూ, నీ ఉద్యోగం ఇంకా ఊడలేదు. 247 00:19:23,872 --> 00:19:24,748 థ్యాంక్యూ. 248 00:19:27,209 --> 00:19:29,877 - కానీ ఇదంతా ముగిసిపోయిందని అనుకోవద్దు. - హా, నేనూ అదే అనుకున్నాలే. 249 00:19:29,878 --> 00:19:33,257 కాలమ్, ఇదేమీ పిల్లలాట కాదు. 250 00:19:34,132 --> 00:19:36,385 నిన్న రాత్రి జరిగిన దాని వల్ల నీ ప్రాణాలు పోయి ఉండవచ్చు. 251 00:19:36,969 --> 00:19:37,970 తెలుసు. 252 00:19:40,180 --> 00:19:41,849 తను ఎవరు అయి ఉండవచ్చో నీకు ఏమైనా తెలుసా? 253 00:19:44,017 --> 00:19:45,519 ఆ ముక్క నన్ను అడగమని వారు చెప్పారా? 254 00:19:46,603 --> 00:19:48,646 డిటెక్టివ్ తో మాట్లాడా. 255 00:19:48,647 --> 00:19:51,023 వామ్మోయ్, జూలియా. థ్యాంక్యూ. 256 00:19:51,024 --> 00:19:52,942 నా పక్షాన నిలిచినందుకు థ్యాంక్స్. తొక్కలో... 257 00:19:52,943 --> 00:19:55,946 మాట్లాడినప్పుడు బయట పడిన భయంకరమైన సంగతి ఏంటో చెప్పనా? 258 00:19:56,446 --> 00:19:57,906 వాళ్ళు మరో కేసు గురించి అడిగారు. 259 00:19:58,949 --> 00:20:01,118 నీ పాత ఇంఫార్మర్ అయిన ఫీబీ గురించి. 260 00:20:01,743 --> 00:20:03,912 అదే, నైస్ లో బాల్కనీ నుండి పడి చనిపోయిన అమ్మాయి. 261 00:20:05,163 --> 00:20:06,498 ఏం అడిగారు? 262 00:20:08,125 --> 00:20:09,376 వాళ్ళ దగ్గర ఫోన్ రికార్డులు ఉన్నాయి. 263 00:20:10,377 --> 00:20:13,004 ఆమె చనిపోయే దాకా నువ్వు ఆమెకి మెసేజెస్ చేస్తూనే ఉన్నావట. 264 00:20:13,005 --> 00:20:15,465 ఆమె జాడ తెలుసుకోవడానికి, నువ్వు తెగ ఆరాటపడిపోయావని చెప్పారు. 265 00:20:16,216 --> 00:20:17,467 ఇంకా... 266 00:20:18,802 --> 00:20:20,888 మీ ఇద్దరి మధ్య సంబంధం ఎలాంటిదని అడిగారు. 267 00:20:22,055 --> 00:20:23,973 - ఇవన్నీ వాళ్లకి ఎక్కడివి? - అది ముఖ్యమా? 268 00:20:23,974 --> 00:20:26,392 జూలియా, వాళ్ళు నన్ను ఇరికిస్తున్నారు. 269 00:20:26,393 --> 00:20:28,687 కాలమ్, నువ్వు సోఫీని కాపాడటం ఆపాలి. 270 00:20:29,646 --> 00:20:31,690 కథ అంటూ ఏమీ లేదు. తను నీతో ఆడుకుందంతే. 271 00:20:32,983 --> 00:20:34,651 తను ఎక్కడుందో వాళ్లకి చెప్పేయ్. 272 00:20:55,172 --> 00:20:56,215 ఇంకా ఇక్కడే ఉన్నావా? 273 00:20:59,092 --> 00:21:03,138 నన్ను చర్చికి తీసుకెళ్లడానికి కారు వచ్చింది, కానీ నిన్ను చూడాలనిపించి వచ్చా. 274 00:21:03,972 --> 00:21:05,974 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 275 00:21:09,937 --> 00:21:12,189 కంటిపై ఆ గాటు ఏంటి? 276 00:21:13,357 --> 00:21:14,607 - వేట సమయంలో జరిగిందా అది? - అవును. 277 00:21:14,608 --> 00:21:18,612 నా స్నేహితులు కొందరు, కొంచెం సీరియస్ గా తీసుకున్నారులే. 278 00:21:21,114 --> 00:21:22,199 అంతా ఓకేనా? 279 00:21:42,761 --> 00:21:44,680 ఇదంతా నా వల్ల కాదనిపిస్తోంది. 280 00:21:48,183 --> 00:21:49,351 కారణం నువ్వేం కాదు. 281 00:21:50,269 --> 00:21:52,187 తప్పు నీదేం కాదు. 282 00:21:56,859 --> 00:22:00,612 నీతో పాటు నేను మీ కుటుంబాన్ని కూడా ప్రేమించా. 283 00:22:01,530 --> 00:22:04,950 మీ అమ్మ నన్ను అర్థం చేసుకున్నారేమో అనుకున్నా. 284 00:22:06,159 --> 00:22:08,287 అంటే, కనీసం నాలా తను కూడా ఒకప్పుడు ఉండింది అనే విషయాన్ని. 285 00:22:10,914 --> 00:22:11,790 అంటే... 286 00:22:12,499 --> 00:22:15,168 నీ గురించి, మీ కుటుంబం గురించి ప్రపంచమంతా అనుకునేది నిజం కాదని, 287 00:22:15,169 --> 00:22:18,005 ఆ నిజం నాకు తెలుసని అనుకున్నా. కాబట్టి అప్పుడు నాకు పర్వాలేదనే అనిపించింది. 288 00:22:22,926 --> 00:22:24,261 బహుశా అప్పుడు నేను పొరబడ్డానేమో. 289 00:22:27,055 --> 00:22:30,017 మీ అక్కకి మీ కుటుంబం చేసిన అన్యాయం విషయంలో. 290 00:22:31,101 --> 00:22:34,021 ఆమెని ఒంటరి దాన్ని చేసేస్తున్నారు. 291 00:22:35,606 --> 00:22:38,442 దాన్ని పట్టించుకోకుండా జీవితాంతం నేను ఉండలేను, అలా ఉంటే నేను మనిషినే కాదు. 292 00:22:40,277 --> 00:22:42,612 ఒక విషయం. ఈ విషయంలో బాధితురాలు తను కాదు. 293 00:22:42,613 --> 00:22:44,197 నీకెలా తెలుసు? 294 00:22:44,198 --> 00:22:46,699 ఎందుకంటే, తను ఒక జర్నలిస్టుతో టచ్ లో ఉంది. 295 00:22:46,700 --> 00:22:49,036 ఈ విషయాన్నంతా బయట పెట్టాలని చూస్తోంది. 296 00:22:49,912 --> 00:22:51,038 అది కూడా తన స్వలాభం కోసం. 297 00:22:56,543 --> 00:22:58,753 - నీకు క్లబ్బులో పరిచయమైన వ్యక్తి... - క్విన్. 298 00:22:58,754 --> 00:23:00,380 ...ఆమె భర్తే. 299 00:23:01,006 --> 00:23:06,261 మనిద్దరి నుండి సమాచారాన్ని రాబట్టడానికి వారిద్దరూ కలిసి పని చేస్తున్నారు. 300 00:23:06,762 --> 00:23:09,806 తను ముందు ఎలైజాని బుట్టలో వేసుకోవాలని చూసింది, ఆ తర్వాత మన వెంట పడుతోంది. 301 00:23:10,724 --> 00:23:13,017 - అలాంటి మనుషులు వాళ్ళు. - వావ్. 302 00:23:13,018 --> 00:23:14,561 అది బాగా గుర్తు పెట్టుకో. 303 00:23:17,397 --> 00:23:18,398 హేయ్. 304 00:23:19,650 --> 00:23:21,401 నీకు ఈ బంధం నుండి తప్పుకోవాలనుంటే... 305 00:23:23,779 --> 00:23:24,988 నేను అర్థం చేసుకోగలను. 306 00:23:26,448 --> 00:23:27,783 నిజంగానే చెప్తున్నా. 307 00:23:31,286 --> 00:23:32,538 కానీ, వాళ్ళ కోసమని విడిపోకు. 308 00:23:43,590 --> 00:23:45,968 నేను ఇప్పుడు చర్చ్ కి వెళ్తున్నా. 309 00:23:49,429 --> 00:23:52,224 నువ్వు వస్తావో, రావో నీ ఇష్టం. 310 00:24:11,410 --> 00:24:12,494 తీసుకో. 311 00:24:13,161 --> 00:24:14,204 థ్యాంక్స్. 312 00:24:17,916 --> 00:24:19,376 నువ్వేమైనా... 313 00:24:21,587 --> 00:24:23,338 నువ్వు దాని గురించి ఏమైనా ఆలోచించావా? 314 00:24:26,216 --> 00:24:27,217 వెళ్లిపోవడం గురించి. 315 00:24:29,553 --> 00:24:31,471 వెళ్ళిపోయి ఏం చేయాలి, జేమ్స్? 316 00:24:32,848 --> 00:24:34,474 అసలు ఎక్కడికని వెళదాం? 317 00:24:38,854 --> 00:24:40,063 నాకు తెలీదు. 318 00:24:42,983 --> 00:24:43,984 నాకు తెలీదు. 319 00:24:48,322 --> 00:24:52,117 బహుశా ఊహించుకోవడం నీకన్నా నాకే సులభమేమో. 320 00:24:54,077 --> 00:24:55,162 ఎందుకు? 321 00:24:55,829 --> 00:24:57,331 ఎందుకంటే, మనం ఇలా ఇదివరకు కూడా చేశాం. 322 00:25:00,584 --> 00:25:02,126 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 323 00:25:02,127 --> 00:25:04,421 సోఫీ, మన దగ్గరున్నదంతా... 324 00:25:06,924 --> 00:25:10,636 మనం ఏమీ లేని స్థితి నుండి సంపాదించిందే. 325 00:25:12,012 --> 00:25:15,641 జనాలు వేటినైతే మిస్ కారో, వారి నుండి అవే తీసుకున్నాం. 326 00:25:18,560 --> 00:25:21,104 కలిసి ఒక జీవితం ప్రారంభించాం. 327 00:25:24,233 --> 00:25:26,485 మళ్ళీ ఆ జీవితం కావాలని మాత్రమే కోరుకుంటున్నా. 328 00:25:29,988 --> 00:25:31,198 కానీ ఈ పరిస్థితి వేరు. 329 00:25:32,491 --> 00:25:33,825 మనం ఎప్పుడూ దాక్కొనే బతకాలి. 330 00:25:36,328 --> 00:25:38,747 మొదట్నుంచీ నువ్వు చేసేది అదే అయితే? 331 00:25:47,673 --> 00:25:48,714 అంతా ఓకేనా? 332 00:25:48,715 --> 00:25:50,383 - ఓకే. - ఎక్కడ ఉన్నావు? 333 00:25:50,384 --> 00:25:52,886 పోలీసులు నన్ను అదుపులోకి తీసుకొని విచారించారు, కానీ ఇప్పుడు ఇంటికొచ్చేశా. 334 00:25:53,512 --> 00:25:54,513 నువ్వు ఎక్కడ ఉన్నావు? 335 00:25:55,931 --> 00:25:58,559 మొన్న నన్ను తీసుకొచ్చావు కదా, ఆ ఇంట్లోనే. 336 00:25:59,977 --> 00:26:01,227 అతను కూడా ఉన్నాడా? 337 00:26:01,228 --> 00:26:03,772 - స్పీకరులో పెట్టు. - హా, మాకు సాయం కావాలి. 338 00:26:05,816 --> 00:26:08,485 ఏదోకటి ఆలోచిద్దాంలే. లాయర్లతో మాట్లాడి ఒక ప్లాన్ వేసుకుందాం. 339 00:26:09,194 --> 00:26:10,195 సరే. 340 00:26:11,363 --> 00:26:12,823 ఇంటి ముందు కిటికీ దగ్గరికి వెళ్ళు. 341 00:26:16,577 --> 00:26:18,119 పెరడు కనిపిస్తోందా? 342 00:26:18,120 --> 00:26:19,413 హా. 343 00:26:19,997 --> 00:26:21,748 వచ్చి సరిగ్గా మధ్యలో నిలబడతా, అంటే అది నేనే అని అర్థం. 344 00:26:22,749 --> 00:26:24,292 అప్పటి దాకా, అక్కడే ఉండండి. 345 00:26:24,293 --> 00:26:26,794 బయటకు వెళ్ళవద్దు. లోపలికి ఎవరినీ రానివ్వద్దు. 346 00:26:26,795 --> 00:26:28,046 అర్థమైందా? 347 00:26:31,842 --> 00:26:33,343 హా. అర్థమైంది. 348 00:26:33,886 --> 00:26:34,886 ఇంకాసేపట్లో వచ్చి కలుస్తా. 349 00:26:34,887 --> 00:26:36,138 దార్లో ఉన్నా. 350 00:27:05,751 --> 00:27:07,961 - విలియమ్. నిన్ను చూడటం బాగుంది. - మిమ్మల్ని చూడటం కూడా. 351 00:29:04,286 --> 00:29:05,787 - సిద్ధంగా ఉన్నావా? - హా. 352 00:29:07,206 --> 00:29:09,291 పోలిస్ 353 00:29:57,089 --> 00:29:58,215 నేను కనిపిస్తున్నానా? 354 00:30:00,217 --> 00:30:01,343 కనిపిస్తున్నావు. 355 00:30:02,469 --> 00:30:03,554 నేను పైకి వచ్చాక, సిద్ధంగా ఉండండి. 356 00:30:05,013 --> 00:30:06,265 మేము సిద్ధంగానే ఉన్నాం. 357 00:30:27,578 --> 00:30:28,745 ఏం జరుగుతోంది? 358 00:30:30,956 --> 00:30:32,874 - మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. - ఏంటి? 359 00:30:32,875 --> 00:30:34,334 - ఎక్కడ చూసినా పోలీసులున్నారు. - ఎక్కడ? 360 00:30:37,337 --> 00:30:40,424 సాయుధ పోలీసులం! సాయుధ పోలీసులం! 361 00:30:49,600 --> 00:30:50,517 ఆయుధాలు దించండి. 362 00:31:15,501 --> 00:31:17,293 - నువ్వు ఇంటి నంబరు తప్పు చెప్పావు. - ఏమంటున్నావు? 363 00:31:17,294 --> 00:31:18,461 ఎక్కడున్నారు వాళ్ళు? 364 00:31:18,462 --> 00:31:19,670 చెప్పా కదా, 13Bలో ఉన్నారని. 365 00:31:19,671 --> 00:31:21,507 - నువ్వు 13D అని అన్నావు. - కాదు. 366 00:31:22,007 --> 00:31:24,217 రికార్డ్ చేసుకున్నారు కదా, ఒకసారి విని చూడు. 367 00:31:24,218 --> 00:31:25,343 తమాషా చేస్తున్నావా? 368 00:31:25,344 --> 00:31:26,594 నేను సరిగ్గానే చెప్పా. 369 00:31:26,595 --> 00:31:29,556 నా యాస అర్థం కాకపొతే, అది నీ సమస్య. 370 00:31:31,183 --> 00:31:33,852 నేరస్థులకు సహకరించావు. నువ్వు బుక్ అయిపోయావులే. 371 00:31:34,853 --> 00:31:36,355 మా ఊరిలో ఏం పీక్కుంటావో పీక్కో అని అంటారు. 372 00:31:44,029 --> 00:31:45,488 కారును దొంగిలించాలని చూస్తున్నావా? 373 00:31:45,489 --> 00:31:46,573 ఏమో. 374 00:31:58,585 --> 00:31:59,877 అంతా ఓకేనా? 375 00:31:59,878 --> 00:32:02,047 హా. సారీ. 376 00:32:10,889 --> 00:32:11,974 ఎక్కడికి వెళ్తున్నాం మనం? 377 00:32:12,474 --> 00:32:13,683 నీ పాస్ పోర్ట్ నా దగ్గర ఉంది. 378 00:32:13,684 --> 00:32:15,268 - ఏంటి? - నాది కూడా ఉంది. 379 00:32:15,269 --> 00:32:16,520 మనం ఈ దేశం నుండి వెళ్లిపోవచ్చు. 380 00:32:17,646 --> 00:32:18,564 పద. 381 00:32:36,456 --> 00:32:39,209 అభినందనలు. పార్టీ అదిరింది. 382 00:32:40,294 --> 00:32:42,546 నిన్న ఏం జరిగిందో ఎవరూ ఊహించలేరు కూడా. 383 00:32:43,797 --> 00:32:45,464 పద, డ్రింక్ తాగుతూ పండగ చేసుకుందాం. 384 00:32:45,465 --> 00:32:47,009 ఇలా ఎలా ఉండగలుగుతున్నావు? 385 00:32:47,593 --> 00:32:48,635 ఇంకేమైనా దారి ఉందా? 386 00:32:49,136 --> 00:32:52,264 ఇదంతా నాశనం చేసి, మనం ప్రేమించే వారిని బాధపెడదామంటావా? 387 00:32:53,015 --> 00:32:54,348 చూడు, మనం దీన్ని ఏరి కోరి ఎంచుకోలేదు. 388 00:32:54,349 --> 00:32:57,269 అన్నింటితో పాటు దీన్ని కూడా వారసత్వంగా పొందాం. 389 00:32:58,061 --> 00:33:00,355 నాన్నలానే మాట్లాడుతున్నావు. 390 00:33:01,773 --> 00:33:03,692 తనకి తెలిసినప్పుడు ఏం చేస్తావు? 391 00:33:04,276 --> 00:33:07,279 తనకి ఎప్పటికైనా తెలిసిపోతుంది. ఎల్లకాలం ఏదీ రహస్యంగానే మిగిలిపోదు. 392 00:33:08,572 --> 00:33:10,489 దీన్నంతటిలో అమాయకురాలు ఎవరైనా ఉన్నారంటే, అది తనే. 393 00:33:10,490 --> 00:33:12,826 మరి నేను? అపరాధినా? 394 00:33:13,535 --> 00:33:16,829 భలేదానివే, ఎలైజా, ఈ పార్టీలో నువ్వు కూడా అతిథివే. 395 00:33:16,830 --> 00:33:18,749 పిలిచినప్పుడు ఎప్పుడైనా రానన్నావా? 396 00:33:19,333 --> 00:33:21,543 హేయ్, ఇలా రా. ఎక్కడికి వెళ్తున్నావు? బార్ అక్కడ ఉంది. 397 00:33:22,127 --> 00:33:23,253 అలా బయటకు వెళ్తా. 398 00:33:42,397 --> 00:33:43,649 ఎలా ఉన్నావు? 399 00:33:44,149 --> 00:33:46,150 కాస్త అలసటగా ఉంది. ఈరోజు ఖాళీ లేదు. 400 00:33:46,151 --> 00:33:47,693 నీ ఇంటికి వెళ్ళిపోతున్నావా? 401 00:33:47,694 --> 00:33:49,403 - లేదు, ఆయన్ని నేను తీసుకెళ్తాలే. - వద్దు, వద్దు. 402 00:33:49,404 --> 00:33:50,989 నువ్వు వద్దులే... పార్టీని ఎంజాయ్ చేయి. 403 00:33:51,490 --> 00:33:53,909 ఓకేనా, నాన్నా? అలా నడుచుకుంటూ వెళ్దామా? 404 00:33:54,535 --> 00:33:55,536 తప్పకుండా. 405 00:33:56,703 --> 00:33:58,038 థ్యాంక్స్. 406 00:33:59,164 --> 00:34:00,958 - బై. - బై. 407 00:34:34,574 --> 00:34:37,452 పడుకుందాం అనుకుంటున్నావా? 408 00:34:38,328 --> 00:34:39,746 కాసేపు నడుము వాలుద్దాం అనుకున్నా. 409 00:34:40,664 --> 00:34:41,873 ఆ తర్వాత మళ్ళీ వద్దామనుకున్నా. 410 00:34:43,792 --> 00:34:45,127 ఇవాళ బాగా సరదాగా గడిపావా? 411 00:34:46,043 --> 00:34:47,337 చాలా సరదాగా గడిపా. బాగుంది పార్టీ. 412 00:34:49,630 --> 00:34:52,176 మంచిది. హా. 413 00:34:53,760 --> 00:34:55,762 హా. ఆ చర్చ్ 414 00:34:57,472 --> 00:34:59,516 చాలా జ్ఞాపకాలు మన కళ్ళ ముందు కదిలేలా చేస్తుంది, కదా? 415 00:35:05,898 --> 00:35:08,025 ఇవాళ ఒక విషయం గ్రహించాను తెలుసా? 416 00:35:10,319 --> 00:35:14,614 ఆ రోజు రాత్రి, సోఫీ కూడా అక్కడ ఉండింది. 417 00:35:14,615 --> 00:35:16,408 ఎమ్మా చనిపోయిన రాత్రి. 418 00:35:18,243 --> 00:35:20,745 ఆరోజు నువ్వు ఫాదర్ ని ఎందుకు పిలిచావో అర్థం కాలేదు, 419 00:35:20,746 --> 00:35:24,666 కానీ ఆయనే కదా తనని తీసుకెళ్ళిపోయింది. 420 00:35:26,293 --> 00:35:28,544 హా, దాన్ని నువ్వు హ్యాండిల్ చేశావని చెప్పావు, 421 00:35:28,545 --> 00:35:32,758 ఇక తన ఆచూకీ నాకు ఎప్పటికీ దొరకదని నేను కూడా వదిలేశా. 422 00:35:34,343 --> 00:35:38,471 కానీ ఇంత కాలం తను దగ్గర్లోనే ఉంది. 423 00:35:38,472 --> 00:35:40,097 అందుకు నీకు థ్యాంక్స్, హెన్రీ. 424 00:35:40,098 --> 00:35:42,935 ఇక నువ్వు బయలుదేరవచ్చు. నాకేం పర్వాలేదు. 425 00:35:46,063 --> 00:35:47,356 తనకి కొత్త పేరు ఇప్పించావు. 426 00:35:49,983 --> 00:35:51,610 నా నుండి తనని దాచావు, ఎందుకంటే, 427 00:35:52,694 --> 00:35:57,282 నీకు తెలుసు అప్పుడే తనని నేను మర్చిపోగలనని. 428 00:36:00,786 --> 00:36:05,791 నేను మర్చిపోకుంటే, ఇప్పుడు నీ దగ్గర ఉండేదంతా, ఉండేది కాదని కూడా నీకు తెలుసు. 429 00:36:07,459 --> 00:36:10,212 ఈపాటికి నువ్వు అర్థం చేసుకుంటావనే అనుకున్నా. 430 00:36:12,756 --> 00:36:13,714 నువ్వు తనని బెదిరించావా? 431 00:36:13,715 --> 00:36:16,634 అందుకేనా తను అర్ధరాత్రి వేళ ఇక్కడికి వచ్చింది? 432 00:36:16,635 --> 00:36:17,969 ఇప్పుడు అదంత ముఖ్యమా? 433 00:36:17,970 --> 00:36:21,014 ముఖ్యమే మరి. ఆ రోజు రాత్రి వల్ల మొత్తం మారిపోయింది. 434 00:36:21,515 --> 00:36:23,433 ఆ గీతని దాటాక... 435 00:36:25,185 --> 00:36:26,018 హెన్రీ! 436 00:36:26,019 --> 00:36:28,772 చాలా గీతలని దాటాల్సి వచ్చింది. 437 00:36:29,731 --> 00:36:34,278 ఇప్పుడు నాకు నిద్రపోవాలని చాలా ఉంది, హెన్రీ. 438 00:36:35,195 --> 00:36:36,697 నువ్వు బయలుదేరితే. 439 00:36:54,631 --> 00:36:56,091 బాగా నిద్రపో. 440 00:36:59,887 --> 00:37:01,638 ఎట్టకేలకు నీకు కావాల్సింది నీకు దక్కింది. 441 00:37:03,557 --> 00:37:06,101 నీ పుణ్యమా అని నా కూతురు నాకు శత్రువు అయిపోయింది. 442 00:37:09,354 --> 00:37:11,398 తను నీ కూతురు కాదు. 443 00:37:12,608 --> 00:37:14,318 కానే కాదు. 444 00:37:17,821 --> 00:37:19,364 ఏమన్నావు? 445 00:37:21,116 --> 00:37:22,784 తను నీకు అక్రమంగా పుట్టింది. 446 00:37:24,244 --> 00:37:27,581 ఈ కుటుంబానికి పెద్దగా నేను ఉన్నంత కాలం, తను ఎప్పటికీ హంట్లీ కాలేదు. 447 00:37:59,821 --> 00:38:00,656 హెన్రీ! 448 00:38:02,199 --> 00:38:03,450 తలుపు తెరువు! 449 00:38:04,243 --> 00:38:05,452 తలుపు తెరువు. 450 00:38:06,453 --> 00:38:07,704 హెన్రీ! 451 00:38:08,455 --> 00:38:09,790 తలుపు తెరువు! 452 00:39:24,489 --> 00:39:26,325 దయచేసి నన్ను క్షమించు, ఎమ్మా. 453 00:40:50,909 --> 00:40:52,035 ఇలా రా. 454 00:40:58,792 --> 00:40:59,710 ఏమైంది? 455 00:41:00,502 --> 00:41:03,172 సోఫీ, ఏమైంది? వెళ్దాం పద. 456 00:41:04,131 --> 00:41:06,007 నువ్వు బాగానే ఉన్నావని నిర్ధారించుకోవాలనుకున్నా. 457 00:41:06,008 --> 00:41:07,885 నేను జీవితాంతం పారిపోతూ బతకలేను. 458 00:41:08,677 --> 00:41:10,012 నేను దీన్ని సరి చేయాలి, 459 00:41:11,430 --> 00:41:14,140 అలా చేయకుంటే, తనని అందరూ మర్చిపోతారు. 460 00:41:14,141 --> 00:41:17,186 లేదు. మరి నీ సంగతేంటి, సోఫీ? 461 00:41:18,312 --> 00:41:19,520 నాకేం కాదు. 462 00:41:19,521 --> 00:41:21,689 నువ్వు తప్పు చేస్తున్నావు. 463 00:41:21,690 --> 00:41:22,774 కావచ్చు. 464 00:41:24,109 --> 00:41:29,156 నేను చేసిన ఇతర తప్పులన్నీ పండి, వాటిని కూడా నేను ఎదుర్కోవాల్సి రావచ్చు. 465 00:41:35,078 --> 00:41:36,079 ఇదుగో. 466 00:41:40,375 --> 00:41:41,543 ఇది నీదే. 467 00:41:44,004 --> 00:41:45,506 మీ నాన్న ఇచ్చాడు నాకు. 468 00:41:48,258 --> 00:41:49,968 ఇది నా సేఫ్ లోనిది కదా. 469 00:41:50,469 --> 00:41:51,470 హా. 470 00:41:51,970 --> 00:41:53,889 నీ పాస్ పోర్టుతో పాటు అన్నీ ఉన్నాయి. 471 00:42:00,646 --> 00:42:01,605 ఇది తీసుకో. 472 00:42:02,814 --> 00:42:03,690 తీసుకో. 473 00:42:07,402 --> 00:42:09,655 అసలు ఇందులో ఉండే డబ్బంతా నీదే, కదా? 474 00:42:18,413 --> 00:42:23,627 మనం అప్పుడు యూరప్ కి విహారయాత్రకని వెళ్లాం కదా, అప్పుడు జరిగిన విషయం నాకొకటి గుర్తొచ్చింది. 475 00:42:26,880 --> 00:42:30,801 ప్యారిస్ లో ఉండే సేన్ నది పక్కన మనం నడుస్తూ ఉన్నాం అప్పుడు. 476 00:42:32,052 --> 00:42:34,847 ఒక అందమైన చిన్న వంతెనని దాటాం. 477 00:42:35,556 --> 00:42:37,432 కొన్ని సందుల అవతల ఒక కెఫే ఉంది. 478 00:42:38,892 --> 00:42:40,227 నీలి రంగు తలుపు ఉంది దానికి. 479 00:42:42,938 --> 00:42:44,439 తలుపు దాటి వచ్చాక ముద్దు పెట్టుకున్నాం. 480 00:42:47,526 --> 00:42:49,111 ఆ ముద్దు నాకు గుర్తు వచ్చింది. 481 00:42:51,613 --> 00:42:52,656 నాకు కూడా. 482 00:44:04,394 --> 00:44:05,395 అవును. 483 00:44:13,820 --> 00:44:15,322 బంగారం? 484 00:44:15,822 --> 00:44:17,991 ఇక్కడ ఏం చేస్తున్నావు? 485 00:44:18,492 --> 00:44:21,119 లోపలికి రా. పార్టీ చాలా బాగుంది. 486 00:44:23,789 --> 00:44:25,207 అదెలా చేయగలిగావు? 487 00:44:29,002 --> 00:44:30,838 ఆన్ నాకంతా చెప్పేసింది. 488 00:44:35,551 --> 00:44:38,387 దాని గురించి మాట్లాడాలని నీకు నిజంగా ఉందా? 489 00:44:41,765 --> 00:44:44,643 ఆ పాపంలో ఇప్పుడు నేను కూడా భాగస్థురాలయ్యాను. నీకు అర్థం కావట్లేదా? 490 00:44:45,853 --> 00:44:47,563 ఈ దారుణాన్ని నేను కప్పిపుచ్చాలి. 491 00:44:49,648 --> 00:44:53,025 తను తప్పిపోయి వచ్చిందని అనుకున్నా. 492 00:44:53,026 --> 00:44:56,655 వర్షం పడుతూ ఉండింది, అప్పుడు ఒంటరి మహిళ వస్తే అలానే అనుకుంటాం కదా. 493 00:44:58,156 --> 00:45:00,117 తను తలుపును బాదుతూ ఉంది. 494 00:45:00,951 --> 00:45:03,078 తనని అప్పుడే నేను మొదటిసారి చూడటం. 495 00:45:04,663 --> 00:45:06,998 మీ ఇద్దరూ, పైన పడుకొని ఉన్నారు. 496 00:45:06,999 --> 00:45:08,292 అప్పుడు నువ్వు నెలల పిల్లవి. 497 00:45:10,669 --> 00:45:15,883 తన కూతురిని మనం గుంజుకోవాలని చూస్తున్నామంటూ ఏవేవో వాగుతూ ఉండింది. 498 00:45:17,217 --> 00:45:18,802 తనెవరో కూడా నాకు తెలీదు. 499 00:45:21,221 --> 00:45:24,391 తనని భయపెడదామనే అనుకున్నా. 500 00:45:26,226 --> 00:45:28,312 తుపాకీలో బుల్లెట్లు ఉన్నాయని నాకు తెలీదు. 501 00:45:31,023 --> 00:45:32,733 బంగారం. 502 00:45:35,027 --> 00:45:38,238 దీని గురించి నీకెప్పటికీ తెలీకుండా ఉండాల్సింది. 503 00:45:40,574 --> 00:45:43,619 అది ప్రమాదమే, కానీ చాలా దారుణమైనది. 504 00:45:44,995 --> 00:45:48,916 కానీ దాన్ని తలుచుకుంటూ, ఇవాళ ఉన్న సంబరాల వాతావరణాన్ని చెడగొట్టుకోనక్కర్లేదు. 505 00:46:08,018 --> 00:46:09,019 హలో? 506 00:46:10,312 --> 00:46:11,271 ఎలైజా? 507 00:46:11,772 --> 00:46:12,981 ఏంటి సంగతి? 508 00:46:14,775 --> 00:46:15,859 నన్ను క్షమించు. 509 00:46:16,610 --> 00:46:17,694 నేను పొరబడ్డాను. 510 00:46:18,737 --> 00:46:23,075 నీకు ఇదివరకే సాయపడాల్సి ఉండాల్సింది, కానీ ఇప్పుడు సాయపడదాం అనుకుంటున్నా. 511 00:46:24,993 --> 00:46:28,120 తన ఫోటో ఒకటుంది కదా, అది చూశావా? 512 00:46:28,121 --> 00:46:29,289 చూశా. 513 00:46:29,957 --> 00:46:32,292 అదే, చెట్టు పక్కన తను నిలబడి ఉండే ఫోటో. 514 00:46:33,627 --> 00:46:38,965 మా నాన్న ఎప్పుడూ గీస్తూ ఉండే, దాలియాలు, 515 00:46:38,966 --> 00:46:42,886 అవి అక్కడ పెరుగుతూ ఉన్నాయి, ఎవరో వాటిని అక్కడ పెట్టినట్టు. 516 00:46:45,055 --> 00:46:47,057 ఎవరో అక్కడ ఆ గింజలను నాటినట్టు. 517 00:46:48,517 --> 00:46:52,312 ఇవాళ రాత్రి ఆయన ఆ చెట్టు దగ్గర ఉండగా చూశా. 518 00:46:53,522 --> 00:46:54,898 ఆయన మోకాళ్ళ మీద కూలబడిపోయి ఉన్నాడు. 519 00:46:56,900 --> 00:46:58,443 తన అవశేషాలు ఇంకా అక్కడే ఉంటే? 520 00:47:22,050 --> 00:47:23,719 మెట్రోపాలిటన్ పోలిస్ 521 00:47:43,530 --> 00:47:44,823 ఇక్కడేం పని నీకు? 522 00:47:46,909 --> 00:47:48,075 సర్లే. పద ఇక్కడి నుండి. 523 00:47:48,076 --> 00:47:50,412 లేదు. మరేం పర్వాలేదులే. 524 00:47:54,791 --> 00:47:57,336 ఈ సమస్య ముగిసిపోయినప్పుడు, నాకు కాల్ చేయి. 525 00:47:59,046 --> 00:48:00,547 నా గాథను చెప్పాలనుకుంటున్నా. 526 00:48:01,548 --> 00:48:02,466 మొత్తమా? 527 00:48:04,510 --> 00:48:05,427 హా. 528 00:48:52,474 --> 00:48:55,561 హత్య కేసులో మిమ్మల్ని విచారించాలనుకుంటున్నామని మీకు అర్థమైంది కదా? 529 00:48:56,603 --> 00:48:59,565 అర్థమైంది. నేను వివరించగలను కూడా. 530 00:49:00,691 --> 00:49:04,611 శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆర్ధిక నేరాల శాఖతో కూడా మేము టచ్ లో ఉన్నాం. 531 00:49:06,071 --> 00:49:08,115 మీరు బతికే ఉన్నారని తెలిసి, వాళ్ళు షాక్ అయ్యారు. 532 00:49:08,824 --> 00:49:10,826 వాళ్లకి కావాల్సిందంతా నేను వాళ్లకి చెప్పగలను, 533 00:49:11,869 --> 00:49:13,954 కానీ మీరు కూడా నేను చెప్పేది వినాలి. 534 00:49:14,705 --> 00:49:15,873 చెప్పండి. 535 00:49:17,541 --> 00:49:18,959 నా దగ్గర సమాచారం ఉంది. 536 00:49:19,918 --> 00:49:20,961 రుజువు ఉంది. 537 00:49:21,795 --> 00:49:22,963 ఒక హత్యకు సంబంధించి. 538 00:49:25,007 --> 00:49:29,887 హంట్లీ ఎస్టేటులో పూడ్చి ఉన్న ఒక శవానికి సంబంధించి. 539 00:49:33,348 --> 00:49:36,059 మీరు ఇక్కడికి నడుచుకుంటూ రావడం చూసి ఆశ్చర్యపోయాను. 540 00:49:37,811 --> 00:49:39,104 నేను అర్థం చేసుకోగలను. 541 00:49:40,147 --> 00:49:41,523 మీకు అర్థమైందని నాకు అనిపించట్లేదు. 542 00:49:42,900 --> 00:49:45,610 మీరు ఇప్పుడు టెస్ కాల్డ్వెల్ అనే పేరుతో చలామణీ అవుతున్నారు. అంతే కదా? 543 00:49:45,611 --> 00:49:46,778 అవును. 544 00:49:47,279 --> 00:49:49,198 మీకున్న అనేక నకిలీ పేరుల్లో అదొకటి. 545 00:49:49,698 --> 00:49:52,117 మీ కోసం మేమొక్కరమే గాలిస్తున్నామని అనుకోవద్దు, టెస్. 546 00:49:52,784 --> 00:49:55,787 మిమ్మల్ని అరెస్ట్ చేయడం కోసం చాలా వారెంట్లు జారీ అయి ఉన్నాయని మీకు తెలుసా? 547 00:49:59,666 --> 00:50:00,667 వారెంట్లా? 548 00:50:02,044 --> 00:50:03,045 ఎందుకు? 549 00:50:03,587 --> 00:50:06,089 మీ కోసం చాలా మంది గాలిస్తున్నారు. 550 00:50:07,341 --> 00:50:09,676 మీరు చాలా కాలం నుండి పరారీలోనే ఉన్నారు. 551 00:50:12,429 --> 00:50:14,223 నిజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? 552 00:51:37,139 --> 00:51:39,141 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్