1 00:00:10,010 --> 00:00:13,889 {\an8}అమ్మకానికి ఇల్లు 2 00:00:19,561 --> 00:00:22,105 ఇది బయటకి కనిపించినంత బాగా లోపల ఉండకపోవచ్చు. 3 00:00:22,105 --> 00:00:24,274 లేదు. ఈ ఇంటికి ఏదో లోపం ఉన్నట్లుంది, 4 00:00:24,274 --> 00:00:26,818 ఇది చూడటానికి అయితే చాలా చక్కగా ఉంది. 5 00:00:26,818 --> 00:00:27,903 - ఇది చాలా చక్కగా ఉంది. - అవును. 6 00:00:27,903 --> 00:00:29,696 - అవును, అదే తేడా ఉంది. - అవును. 7 00:00:29,696 --> 00:00:32,866 - హాయ్. - హాయ్. 8 00:00:32,866 --> 00:00:36,495 - ఓహ్, దేవుడా. ఇది చాలా అందంగా ఉంది! వావ్! - ఒక బాత్ రూమ్... 9 00:00:36,495 --> 00:00:39,206 - కింద ఒక బాత్ రూమ్ ఉంది. - సరే. ఇది చాలా అందంగా ఉంది. 10 00:00:39,206 --> 00:00:42,626 - కింద ఒక బాత్ రూమ్ ఉంది. - సీలింగ్ చాలా నచ్చింది. పాకెట్ తలుపులు కూడా. 11 00:00:43,544 --> 00:00:46,213 - ఇక్కడ రెండో బాత్ రూమ్ కూడా ఉంది. - సరే! 12 00:00:48,590 --> 00:00:50,717 మూడో బాత్ రూమ్ చాలా పెద్దగా ఉంది! 13 00:00:50,717 --> 00:00:54,304 - అది గొప్ప విషయం! సరే! - అవును! యాయ్! అవును! అదీ! 14 00:00:54,805 --> 00:00:57,182 ఓహ్, దేవుడా. ఈ ఇంటికి ఏం లోపం ఉందో దయచేసి చెప్పు, డయాన్. ప్లీజ్. 15 00:00:57,182 --> 00:01:00,102 - అవును. - ఖచ్చితంగా ఏమీ లేవు. ఇది పక్కాగా ఉంది. 16 00:01:00,102 --> 00:01:01,979 చట్టపరంగా మీకు ఒక విషయం చెప్పవలసిన బాధ్యత మాకు ఉంది 17 00:01:01,979 --> 00:01:06,358 అదేమిటంటే కిందటి ఏడాది ఇక్కడ, అంటే, నా ఉద్దేశం, ఈ ప్రాంతంలో మూడు హత్యలు జరిగాయి. 18 00:01:06,358 --> 00:01:07,526 - అందుకని అమ్మేశారు. - మేము కొంటాము. 19 00:01:07,526 --> 00:01:11,071 మంచిది. మీ ఇద్దరి నిర్ణయం నాకు సంతోషంగా ఉంది. 20 00:01:11,071 --> 00:01:13,156 ఓ కానల్స్ అని మాత్రం గూగుల్ సెర్చ్ చేయకండి. 21 00:01:30,382 --> 00:01:32,843 యో, ఒమర్, నువ్వు రెండో ట్యాంక్ ని స్టెరిలైజ్ చేయాలి. 22 00:01:32,843 --> 00:01:34,469 అది జరగని పని, పెద్ద బాబు. 23 00:01:34,469 --> 00:01:36,430 నవ్వానులే. వెళ్లి రెండో ట్యాంక్ శుభ్రం చేయి. 24 00:01:36,430 --> 00:01:39,349 లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను బ్రూమాస్టర్ ని, మూర్ఖుడా. 25 00:01:40,559 --> 00:01:41,560 నువ్వు ఇప్పుడు ఏం అన్నావు? 26 00:01:41,560 --> 00:01:45,147 "లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు బ్రూమాస్టర్ ని, మూర్ఖుడా," అన్నాను. 27 00:01:46,231 --> 00:01:47,983 చాలా సారీ. వాళ్లు నన్ను బ్రూమాస్టర్ గా నియమించారు. 28 00:01:49,776 --> 00:01:51,695 తను బ్రూమాస్టర్ అయ్యానని ఒమర్ ఎందుకు అనుకుంటున్నాడు? 29 00:01:51,695 --> 00:01:52,779 ఒమర్ బ్రూమాస్టర్ కాబట్టి. 30 00:01:52,779 --> 00:01:54,114 - అవును. - మీరు ఏం మాట్లాడుతున్నారు? 31 00:01:54,114 --> 00:01:57,534 ఈ బార్ లో మాకు సింహభాగం వాటా ఉంది, కాబట్టి ఒమర్ ని బ్రూమాస్టర్ గా నియమించాలని నిర్ణయించుకున్నాం. 32 00:01:58,118 --> 00:02:00,913 నన్ను అవమానించి నా వాటాల్ని నేను అమ్ముకునేలా చేయాలని మీరు చూస్తున్నారా? 33 00:02:01,580 --> 00:02:02,915 - అవును, ఇంచుమించు అదే. - అవును, డూడ్. 34 00:02:03,415 --> 00:02:08,628 మీ ప్రయత్నం ఫలించదు, సరేనా? నేను ఎన్ని అవమానాలు భరించగలనో మీరు కనీసం ఊహించలేరు. 35 00:02:10,923 --> 00:02:14,510 సరే, మనం ఒక పని చేద్దాం. నన్ను ట్రక్ లో సామాన్లు కిందికి దించమంటావా, లేదా... 36 00:02:14,510 --> 00:02:15,886 వోహ్. 37 00:02:15,886 --> 00:02:17,221 - ఆ పని చేయడానికి ముందు... - చెప్పు. 38 00:02:17,221 --> 00:02:19,181 ...నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను. 39 00:02:19,181 --> 00:02:21,266 నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావా? చక్కగా ఉంది. చేద్దాం పద. 40 00:02:22,434 --> 00:02:24,770 - నీకు ఈ హోదా కావాలని ఎందుకు అనుకుంటున్నావు? - నేను అనుకోవడం లేదు. 41 00:02:25,896 --> 00:02:29,399 ఇంకొక ప్రశ్న. నువ్వు బ్రూమాస్టర్ పని ఎలా చేస్తావు? 42 00:02:31,276 --> 00:02:33,403 ఒక వెడ్డింగ్ ప్లానర్ నన్ను అడిగే మొదటి ప్రశ్న, 43 00:02:33,403 --> 00:02:34,613 "ఎంతమంది తోడపెళ్లికూతుళ్లు ఉంటారు?" 44 00:02:34,613 --> 00:02:38,367 నా వయసు నలభైల్లో ఉంది. ఈ వయసులో తోడపెళ్లికూతుర్లు అనవసరం. 45 00:02:38,367 --> 00:02:41,703 నేను, చార్లీ నియమించిన వెడ్డింగ్ ప్లానర్ ని నువ్వు ఏర్పాటు చేసుకో. 46 00:02:42,704 --> 00:02:43,830 ఆమె అద్భుతంగా పని చేస్తుంది. 47 00:02:43,830 --> 00:02:46,708 నువ్వు ప్రశాంతంగా ఉండు. అవును. ఆమె వెబ్ సైట్ నీకు పంపిస్తాను. 48 00:02:47,584 --> 00:02:49,044 ఓహ్, దేవుడా. ఆమె చనిపోయింది. 49 00:02:49,044 --> 00:02:53,131 - వావ్. "సహజమైన సమస్యల కారణంగా." - చాలా ప్రశాంతంగా ఉంది. అంటే, నిజంగా చాలా ప్రశాంతం. 50 00:02:53,632 --> 00:02:57,177 - దేవుడా, మనం పెద్దవాళ్లం అయిపోయాం. బాధగా ఉంది. - దేవుడా. 51 00:02:57,177 --> 00:02:59,137 నువ్వు పింట్రస్ట్ బోర్డుతో ఎందుకు మొదలుపెట్టకూడదు? 52 00:02:59,137 --> 00:03:02,599 - చూడు, నీ ఐడియాలన్నీ దాని మీద ఉంచు. - ఓహ్, దేవుడా. అది చాలా బోరింగ్ పని. 53 00:03:02,599 --> 00:03:05,435 దాన్ని నువ్వు ప్లాన్ చేయచ్చు కదా? అలాంటివి చేయడంలో నీకు మంచి నైపుణ్యం ఉంది. 54 00:03:05,435 --> 00:03:06,728 - నేను చేయలేను. - అవును! 55 00:03:06,728 --> 00:03:08,772 - నేను ఇంటి పనులతోనే చాలా సతమతం అవుతున్నాను. - ఓహ్, దేవుడా. 56 00:03:08,772 --> 00:03:11,191 నీ మర్డర్ల ఇంటిని చూడాలని నాకు ఆత్రుతగా ఉంది. 57 00:03:12,776 --> 00:03:15,320 అవును, అందుకే మేము, అంటే, చూడు, ఆ మచ్చ చెరిపేయాలని చూస్తున్నాము. 58 00:03:15,946 --> 00:03:18,782 మా పిల్లల గురించి. కాబట్టి, ఇంకెప్పుడూ ఆ మాట మాట్లాడద్దు. 59 00:03:18,782 --> 00:03:19,867 తప్పకుండా. 60 00:03:21,493 --> 00:03:24,413 గృహప్రవేశానికి విల్ ని ఆహ్వానిస్తున్నావా? 61 00:03:26,123 --> 00:03:28,250 మేము మా కొత్త పొరుగింటి వాళ్లనీ ఇంకా చార్లీ ఆఫీసు మిత్రుల్ని ఆహ్వానిస్తున్నాం. 62 00:03:28,250 --> 00:03:32,379 వాళ్లందరివీ వేరే ప్రపంచాలు ఇంకా, నీకు తెలుసు, నేను ఇంకా విల్ కలిశామంటే, 63 00:03:32,379 --> 00:03:35,090 మేము ఊరికే, అంటే, అలా అనాలోచితంగా వెర్రిగా ప్రవర్తిస్తాము. 64 00:03:35,841 --> 00:03:37,259 మళ్లీ మీ కొత్త ఇంటి విషయానికి వద్దాం. 65 00:03:37,843 --> 00:03:40,721 నువ్వు ఏమైనా దెయ్యాలని చూశావా లేదా అల్లరి దెయ్యాల్ని చూశావా? 66 00:03:40,721 --> 00:03:42,556 లేదు. లేదు. 67 00:03:43,140 --> 00:03:45,851 ఇంకా లేదు. ఇంకా లేదు. 68 00:03:47,978 --> 00:03:50,898 - ఇక్కడ ఎంతమంది చనిపోయారు? - నాకు తెలియదు. అంటే, ముగ్గురు లేదా నలుగురు. 69 00:03:57,571 --> 00:04:01,366 అంటే, నాకు రెండు వెడ్డింగ్ థీమ్ ఐడియాలు ఉన్నాయి, కానీ వాటిని మనం కలిపి ఒకటిగా చేయచ్చని అనుకుంటున్నాను. 70 00:04:01,366 --> 00:04:03,202 నేను మీ పెళ్లిని ప్లాన్ చేయడం లేదు, కాబట్టి... 71 00:04:03,202 --> 00:04:05,162 రిలాక్స్. నా పెళ్లి ఏర్పాట్లు నువ్వు చేస్తున్నావని అనడం లేదు. 72 00:04:05,162 --> 00:04:06,663 కానీ అలాంటివి నువ్వు బాగా చేయగలవని నాకు తెలుసు. 73 00:04:06,663 --> 00:04:07,998 - సరే. - కొన్ని థీముల గురించి చర్చించు చాలు. 74 00:04:07,998 --> 00:04:10,209 దీనికి తోడు, నా ప్రియురాలిని నేను ప్రేమిస్తాను. బేబీ, నిన్ను ప్రేమిస్తున్నాను. 75 00:04:10,209 --> 00:04:11,919 - తనకి ఎలాంటి ఆలోచనలు లేవు. - నాకు ఏ ఆలోచనా లేదు. 76 00:04:11,919 --> 00:04:14,379 - తను కేవలం ముద్దుగా ఉండాలని అనుకుంటుంది. - నాకు ముద్దుగా ఉండాలనే ఉంటుంది. 77 00:04:14,379 --> 00:04:17,507 - చూడు, నేను ఈమెని ఎలా భరిస్తున్నానో? - సరే. అలాగే. మరి, చర్చిద్దాం. కానివ్వండి. 78 00:04:17,507 --> 00:04:20,677 సరే, మంచిది. సరే మొదటిది ఏమిటంటే "వన్స్ అపాన్ ఏ వెడ్డింగ్" థీమ్, 79 00:04:21,261 --> 00:04:23,347 ఇంక రెండోదేమో, "టూ మినిట్స్ టు మిడ్ నైట్" థీమ్. 80 00:04:24,431 --> 00:04:27,768 సరే. అంటే, వెస్ట్రన్ పద్ధతిలో ఉంటుందా? 81 00:04:27,768 --> 00:04:28,977 లేదు, ఇవి థీములు మాత్రమే. ఏంటి... 82 00:04:28,977 --> 00:04:30,729 - నీకు ఎందుకు అర్థం కావడం లేదు? - సరే. 83 00:04:30,729 --> 00:04:33,065 - మనం వీటి గురించి ఆలోచిద్దాం. ఇంకా టైమ్ ఉంది కదా. - సరే. 84 00:04:33,065 --> 00:04:34,399 - దాని గురించి ఆలోచిస్తాను. - మనం చర్చిద్దాం. 85 00:04:34,399 --> 00:04:35,943 - సారీ. - నాకు అర్థమైంది. 86 00:04:35,943 --> 00:04:37,986 - హేయ్, హాయ్. - హాయ్. 87 00:04:37,986 --> 00:04:41,323 - ఈ చుట్టుపక్కల వాళ్లు నిజంగా నాతో కలిసిపోయారు. - ఈ వేడుక ఎలా జరుగుతోందని అనిపిస్తోంది? 88 00:04:41,865 --> 00:04:42,991 - బాగుంది, నిజంగా. - బాగుందా? సరే. 89 00:04:42,991 --> 00:04:44,993 చూడు. మనం గెమ్మా ఇంటికి రెండు బ్లాకుల ఇవతల ఉన్నాం. 90 00:04:44,993 --> 00:04:47,246 ఇకపై మనం ఫ్రాన్సిస్ ని దింపాల్సిన పని లేదు. 91 00:04:47,246 --> 00:04:50,832 - వాళ్లు రోజంతా కాలక్షేపం చేయగలరు. - వాళ్లు ఏం చేయాలని అనుకుంటే అది చేయచ్చు. 92 00:04:50,832 --> 00:04:51,917 అవును. 93 00:04:52,793 --> 00:04:55,128 సైమన్ కి గర్ల్ ఫ్రెండ్ దొరికింది. 94 00:04:56,213 --> 00:04:58,173 తను డయాన్ కూతురు. 95 00:04:58,173 --> 00:05:00,092 మనం తేలికగా చెప్పేయవచ్చు ఎందుకంటే తను క్రీమ్ డ్రెస్ వేసుకుంది. 96 00:05:00,092 --> 00:05:03,136 క్రీమ్ లో... వాళ్లు ఎందుకు అలా చేస్తారు? అది విచిత్రంగా అనిపిస్తుంది. 97 00:05:03,136 --> 00:05:05,722 ఇంకా మేవీ. ఇప్పుడు మేవీకి కూడా ఫ్రెండ్ దొరికింది. 98 00:05:05,722 --> 00:05:09,351 - నాకు ఊగాలని ఉంది. - కానీ ఎప్పుడూ నువ్వే ఊగుతున్నావు. 99 00:05:09,351 --> 00:05:12,062 - అవును. అవును. తను అల్లరి పిల్ల. - ఆ పిల్ల రౌడీలా ఉంది. 100 00:05:12,062 --> 00:05:13,355 తను నాకు నిజంగా కోపం తెప్పిస్తోంది. 101 00:05:14,648 --> 00:05:16,233 - హేయ్. - మిత్రమా! 102 00:05:17,025 --> 00:05:19,361 - చూడు. పూల చొక్కాలో ఎంత బాగున్నావు. - హేయ్! 103 00:05:19,361 --> 00:05:20,320 - హలో! - యో. 104 00:05:20,320 --> 00:05:22,239 - హాయ్, మిత్రమా. హలో. - మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. 105 00:05:22,239 --> 00:05:24,908 - హేయ్. ఇలా వచ్చినందుకు థాంక్స్. - హేయ్, ఏం జరుగుతోంది? 106 00:05:24,908 --> 00:05:27,077 - నన్ను పిలిచినందుకు థాంక్స్. ఇదిగో తీసుకో. - ఇది చూడు. 107 00:05:27,077 --> 00:05:28,495 కూలర్ లో బీర్లు ఉన్నాయి. 108 00:05:28,495 --> 00:05:30,080 - మంచిది. - వైన్ ఇంకా చీజ్, ఇంకా... 109 00:05:30,080 --> 00:05:33,584 - చార్లీ, అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. - నువ్వు ఏదైనా చేయలేకపోయావా? 110 00:05:33,584 --> 00:05:35,544 - ఇది నా పార్టీ కాదు. - ఓహ్, ఇలా చూడు. 111 00:05:40,132 --> 00:05:43,677 చార్లీతో గొడవలోకి నిన్ను లాగినందుకు సారీ. 112 00:05:44,678 --> 00:05:45,679 - మరేం ఫర్వాలేదు. - నా క్షమాపణలు. 113 00:05:45,679 --> 00:05:46,763 అలా జరుగుతుంటుంది. ఫర్వాలేదు. 114 00:05:46,763 --> 00:05:50,934 - అంతా ఎలా జరుగుతోంది? - బాగానే ఉంది. నిజం. 115 00:05:51,518 --> 00:05:52,686 మంచిది. 116 00:05:52,686 --> 00:05:53,854 - ఎలా ఉన్నావు? - నేనా? 117 00:05:53,854 --> 00:05:54,980 - అవును. - చాలా బాగున్నాను. 118 00:05:54,980 --> 00:05:57,107 - మంచిది. చక్కగా ఉంది. - ఇల్లు కొన్నాం. 119 00:05:57,107 --> 00:05:58,567 నీకు పాత సామెత తెలుసు కదా, 120 00:05:58,567 --> 00:06:01,904 "ఏదైనా కొంటే, మన సమస్యలన్నీ పోతాయి." 121 00:06:05,616 --> 00:06:08,160 సరే, నేను వెళ్లి ఆండీతో ముచ్చట్లు పెడతాను. 122 00:06:08,160 --> 00:06:09,494 - నిన్ను కలిశాను. - వచ్చినందుకు థాంక్స్. 123 00:06:09,494 --> 00:06:10,787 - సరే. నన్ను పిలిచినందుకు థాంక్స్. - సరే. 124 00:06:11,914 --> 00:06:15,083 అప్పుడు ఆ గన్ మన్ కిచెన్ లో కిటికీ గుండా లోపలికి ప్రవేశించాడు. 125 00:06:15,083 --> 00:06:18,086 నేరుగా డైనింగ్ రూమ్ లోకి వెళ్లాడు, మరణశిక్ష విధించే తరహాలో. 126 00:06:18,086 --> 00:06:21,465 - ఆ తరువాత మెట్లు ఎక్కి బెడ్ రూమ్ లోకి వెళ్లాడు. - అక్కడే అతడిని చంపేశారా? 127 00:06:21,465 --> 00:06:23,550 మరణశిక్ష అంటే ఏంటి? 128 00:06:24,051 --> 00:06:26,803 ఐస్ క్రీమ్. అందరూ అదే చెప్పండి, ఐస్ క్రీమ్ అని. 129 00:06:27,387 --> 00:06:28,388 నీకు తరువాత చెబుతాను. 130 00:06:33,268 --> 00:06:35,062 ఇది మిరియాల పొడి అనుకున్నాను! 131 00:06:41,068 --> 00:06:42,110 ఏం అయింది? 132 00:06:42,778 --> 00:06:43,779 నువ్వు... 133 00:06:46,406 --> 00:06:47,616 నాకు తెలుసు. అందుకే నేను... 134 00:06:47,616 --> 00:06:49,076 సరే, అదే మంచిది. 135 00:06:49,076 --> 00:06:51,203 - హేయ్, పిల్లలూ మీరు బాగానే ఉన్నారా? - ఏం జరిగింది? 136 00:06:51,203 --> 00:06:53,664 - దాన్ని లాగమని వీడు చెప్పాడు. - లేదు. నేను చెప్పలేదు. 137 00:06:54,248 --> 00:06:56,333 అది రేపు చేయాల్సిన పని. 138 00:06:56,959 --> 00:06:58,001 నేను ఇంటి పైకప్పు ఎక్కితే, 139 00:06:58,001 --> 00:07:00,420 నేను దీన్ని మొత్తం సరిచేసి మళ్లీ ప్లగ్ పెట్టగలుగుతాను. 140 00:07:00,420 --> 00:07:02,381 నిజంగా, నువ్వు ఆ పని చేయాల్సిన అవసరం లేదు, విల్. 141 00:07:02,381 --> 00:07:03,340 నేను ఆ పని చేయగలను. 142 00:07:03,340 --> 00:07:05,342 సైమన్, నేను ఆ పైకప్పు ఎక్కడానికి సాయం చేయగలవా? 143 00:07:05,342 --> 00:07:06,593 - లేదు. - సరదాగా ఉంటుంది. 144 00:07:06,593 --> 00:07:08,887 - వద్దు. ఖచ్చితంగా వద్దు. - నువ్వు సాయం చేస్తావా? 145 00:07:10,347 --> 00:07:13,559 - సరే. - సరే. ఆ బల్బులు చూస్తుండు. 146 00:07:15,853 --> 00:07:16,854 ఇంకా... 147 00:07:17,646 --> 00:07:20,399 హేయ్! 148 00:07:21,984 --> 00:07:23,861 - సరే. - హేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? 149 00:07:23,861 --> 00:07:26,780 ఎవరైనా నన్ను పిలవడానికి రెండు, మూడు నిమిషాల సమయం మాత్రమే ఉంది. 150 00:07:26,780 --> 00:07:29,324 ఓహ్, అవును. ఈ నూట ఎనభై సెకన్లలో నువ్వు మస్తీ చేయాలి అనుకుంటున్నావా? 151 00:07:29,324 --> 00:07:30,826 - అది నాకు ఇష్టమే. - నూట తొంభై సెకన్లు? 152 00:07:31,326 --> 00:07:32,411 చేద్దాం పద. 153 00:07:32,411 --> 00:07:34,997 ఏం జరుగుతోంది? నీ బార్ ఎలా నడుస్తోంది? 154 00:07:34,997 --> 00:07:38,125 ఆ బార్ ప్రస్తుతం ఘోరంగా తయారైంది. 155 00:07:38,125 --> 00:07:42,129 నేను ఒమర్ కింద పని చేస్తున్నాను, అది కూడా చాలా కష్టంగా. 156 00:07:42,713 --> 00:07:44,131 అంతా గందరగోళం అయిపోయింది, నిజం. 157 00:07:44,131 --> 00:07:47,509 అతను, ఎలాంటివి అంటే, చెత్త బీర్లు తయారు చేస్తాడు. వాటి అన్నింటిలోనూ, అంటే, ఏదో కలుపుతాడు. 158 00:07:47,509 --> 00:07:49,261 - ఏదో కలుపుతాడా? నీ ఉద్దేశం ఏంటి? - అవును, అంటే, 159 00:07:49,261 --> 00:07:52,139 - కాల్చిన దాల్చిన చెక్క. - ఓహ్, అయ్యో. 160 00:07:52,139 --> 00:07:57,811 - ఇంకా కౌంట్ చాకులా, ఐపిఎ. అలాంటివి. - అది మంచిదే కదా? 161 00:07:57,811 --> 00:07:59,688 లేదు. అంటే, అది చాలా చౌకబారు పని. 162 00:07:59,688 --> 00:08:02,065 అది బహుశా నీకు నచ్చుతుంది. ఎందుకంటే అది తియ్యగా పంచదార పానకంలా ఉంటుంది. 163 00:08:03,817 --> 00:08:06,486 నాకు ఈ మధ్య ఒక నిజమైన ఉద్యోగం ఆఫర్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో నువ్వు ఊహించలేవు. 164 00:08:06,486 --> 00:08:07,487 ఎవరు? 165 00:08:07,487 --> 00:08:09,573 - జోనథన్ రివల్యూషన్. నిజం. - ఇలా చూడు. 166 00:08:09,573 --> 00:08:12,701 జానీ రెవ్ వాళ్ల బీర్ ఇంకా స్పిరిట్స్ విభాగానికి అధికారిగా రమ్మని నన్ను పిలిచాడు. 167 00:08:12,701 --> 00:08:14,119 - ఏంటి? - అవును. 168 00:08:14,119 --> 00:08:15,996 నువ్వు అతనితో భౌతికంగా పోట్లాడావు. 169 00:08:15,996 --> 00:08:17,623 అతను చాలామంది తన వ్యతిరేకులతో గొడవ పడి ఉండాలి, 170 00:08:17,623 --> 00:08:20,250 ఎందుకంటే ఆ గొడవ వల్ల అతనికి నా మీద ఎలాంటి దురభిప్రాయం కలగలేదు. 171 00:08:20,751 --> 00:08:22,002 అది దారుణం. 172 00:08:22,002 --> 00:08:24,505 కానీ నీకు స్పష్టం చేస్తున్నాను, నేను ఆ ఉద్యోగంలో చేరడం లేదు, కానీ... 173 00:08:25,088 --> 00:08:27,257 - వ్రూమ్, వ్రూమ్. - వ్రూమ్, వ్రూమ్ సరైనది. 174 00:08:38,352 --> 00:08:39,895 వోహ్. నువ్వు ఏదైనా చూశావా? 175 00:08:41,104 --> 00:08:44,441 నిజం చెప్పాలంటే, ఇప్పుడు ఏం చూశానో అది చెప్పాలంటే భయంగా ఉంది. 176 00:08:44,441 --> 00:08:46,193 అది, అంటే, ఏమైనా ఆర్మీ హెలికాప్టరా, 177 00:08:46,193 --> 00:08:47,402 - లేక డ్రోన్ కానీ అలాంటిది కావచ్చా? - లేదు. 178 00:08:47,402 --> 00:08:50,405 ఆర్మీ హెలికాప్టర్లు ఇంకా డ్రోన్లు అలా కదలవు. 179 00:08:50,948 --> 00:08:52,491 అది ఏదైనా కాల్ టెక్ యూనివర్సిటీ ప్రయోగం అంటావా? 180 00:08:52,491 --> 00:08:53,742 అది ఒక గ్రహాంతర నౌక కావచ్చు. 181 00:08:53,742 --> 00:08:55,994 - ఊరుకో. లేదు, అది కాదు. అదేనా? - మనం ఇప్పుడు ఒక గ్రహాంతర నౌకని చూశాం. 182 00:08:55,994 --> 00:08:57,037 అది ఒక గ్రహాంతర నౌక... 183 00:08:57,037 --> 00:08:59,456 - ఏంటి? ఇంక ఆపు! - మనం ఇప్పుడు ఒక గ్రహాంతర నౌకని చూశాం. 184 00:08:59,456 --> 00:09:01,583 మనం నిజంగా అదే చూశాం. ఈ రాత్రికి ఏదైనా ఉల్కాపాతం ఉందా? 185 00:09:01,583 --> 00:09:04,211 ఉల్కాపాతాల గురించి తెలుసుకునేదానిలా నేను ఎప్పుడైనా నీకు కనిపించానా? 186 00:09:04,211 --> 00:09:05,254 - లేదు. - లేదు. 187 00:09:05,754 --> 00:09:07,631 అది నిజంగానే గ్రహాంతర నౌక అనుకుంటున్నాను. 188 00:09:07,631 --> 00:09:10,342 నువ్వు కెమెరా ఎందుకు బయటకి తీశావు? అది ఇప్పటికే అంతరిక్షంలోకి దూసుకుపోయి ఉంటుంది. 189 00:09:10,342 --> 00:09:11,552 ఇది ఎలా ఉందంటే... 190 00:09:11,552 --> 00:09:13,637 ఈ మాటలు నా నోటి నుండి ఎలా బయటకు వస్తున్నాయి? నేను... 191 00:09:13,637 --> 00:09:16,473 - అది నిజంగా గ్రహాంతర నౌక. - ఓహ్, దేవుడా. మనం యు.ఎఫ్.ఓ.ని చూశాం. 192 00:09:16,473 --> 00:09:18,141 - మనం గ్రహాంతర నౌకని చూశాం. - అది ఇంకేం అయి ఉండచ్చు? 193 00:09:18,141 --> 00:09:21,395 అది... మనం ఇప్పుడు ఒక యు.ఎఫ్.ఓ.ని చూశాం. అది పూర్తిగా గ్రహాంతర నౌకే. 194 00:09:23,272 --> 00:09:25,732 - నేను యు.ఎఫ్.ఓని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. - నేను కూడా చూస్తాను అనుకోలేదు. 195 00:09:25,732 --> 00:09:28,735 - నేను ఎప్పుడూ యు.ఎఫ్.ఓ.ల గురించి ఆలోచించను. - అవి నిజం అని నేను ఎప్పుడూ నమ్మలేదు! 196 00:09:33,407 --> 00:09:34,825 మేము ఇప్పుడే ఒక గ్రహాంతర నౌకని చూశాం. 197 00:09:36,535 --> 00:09:38,036 - నేను నమ్మలేకపోతున్నాను. - మేము చూశాం. 198 00:09:38,996 --> 00:09:39,997 మీరు ఏం మాట్లాడుతున్నారు? 199 00:09:39,997 --> 00:09:42,374 - మేము ఒక గ్రహాంతర నౌకని చూశాం! - నేను యు.ఎఫ్.ఓ. గురించి మాట్లాడుతున్నా 200 00:09:42,374 --> 00:09:45,377 సరిగ్గా మన మేడ పైన, రెండు నిమిషాల కిందట అది మన ఇంటి మీదుగా ఎగిరివెళ్లింది. 201 00:09:45,377 --> 00:09:47,254 - ఓహ్, దేవుడా. - మీరు చూశారా? 202 00:09:47,254 --> 00:09:48,672 లేదు, నేను గ్రహాంతర వాసులు ఉన్నారని నమ్మను. 203 00:09:48,672 --> 00:09:50,257 - ఏంటి? - నిజం. యు.ఎఫ్.ఓ.లు అనేవి ఉండవు. 204 00:09:50,257 --> 00:09:51,675 అవి ఉన్నా కూడా, ఎవరు పట్టించుకుంటారు? 205 00:09:51,675 --> 00:09:53,635 - ఎవరు పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకుంటారా? - ఓహ్, దేవుడా. 206 00:09:53,635 --> 00:09:56,054 ఆగండి, మనం విమానాలు వెళ్లే దారిలో ఉన్నామా? 207 00:09:56,054 --> 00:09:58,265 మేము గ్రహాంతర నౌకని చూడలేదని అంటున్నావా? 208 00:09:58,265 --> 00:10:00,309 - లేదు, మీరు చూశారు అనుకోను. - ఏంటి? 209 00:10:00,309 --> 00:10:02,895 మీ ఉత్సాహం మీద నీళ్లు జల్లాలని కాదు, కానీ గ్రహాంతర వాసులు 210 00:10:02,895 --> 00:10:06,773 ఈ విశ్వంలో ఉండే అవకాశాలు, ఇంకా వాళ్లకి భూమి మీదకి వచ్చి వెళ్లే సామర్థ్యం ఉండటం, దాదాపు అసాధ్యం. 211 00:10:06,773 --> 00:10:10,235 దీని గురించి అంత అవగాహన లేని వారికి, అంటే, కాంతి వేగం కన్నా వేగంగా ప్రయాణించడం అసలు అసాధ్యం. 212 00:10:10,235 --> 00:10:11,445 - ఎవరు చెప్పారు? - సైన్స్ చెబుతోంది. 213 00:10:11,445 --> 00:10:12,946 - చెత్త సైన్సు. - "సైన్స్." 214 00:10:12,946 --> 00:10:14,198 సైన్స్ కి ఏమీ తెలియదు. 215 00:10:14,198 --> 00:10:15,574 - ఇది సైన్స్ కి అందని విషయం. - "సైన్స్." 216 00:10:15,574 --> 00:10:18,744 సరే. మనం అన్ని విషయాల్ని సమానంగా పరిగణించి, ఇంకా, చూడండి, ఏదీ నిర్ధారణకు రాకుండా ఉందాం. 217 00:10:18,744 --> 00:10:22,331 నిర్ధారణ అంటూ ఏమీ లేదు. ఇది నిజం. ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చాలని చూస్తోంది. 218 00:10:22,331 --> 00:10:25,709 - ఇది ఒక కుట్ర. నా ఉద్దేశం నీకు అర్థమైందా? - నేను ఆల్టడీనా సిటీలో పని చేస్తాను 219 00:10:25,709 --> 00:10:29,046 ఇంకా ఎప్పుడూ ఇలాంటి కుట్రలు జరగడాన్ని నేను చూడలేదు. 220 00:10:29,046 --> 00:10:32,299 ఆ ఆల్టడీనా సిటీలో అందరికీ ప్రభుత్వం వాళ్లు ఈ విషయాలు చెబుతారు అనుకుంటున్నారా? 221 00:10:32,299 --> 00:10:33,800 - సరే, మంచిది... - అలా జరగనే జరగదు. 222 00:10:33,800 --> 00:10:36,637 - అతని ఉద్దేశం అది కాదు. అవును. - ఇది ఆల్టడీనా స్థాయికి మించిన విషయం. 223 00:10:36,637 --> 00:10:39,264 బీమన్ పార్కులో చాలామంది గాలిపటాలు ఎగురవేయడానికి ఇష్టపడతారు. 224 00:10:39,264 --> 00:10:41,183 బహుశా అది ఏదైనా గాలిపటం అలా వెళ్లి ఉంటుంది. 225 00:10:41,183 --> 00:10:44,186 మీకు ఎంతో మర్యాద ఇచ్చి చెబుతున్నా, డయాన్, నేను అంత బుద్ధిహీనుడిని కాను 226 00:10:44,186 --> 00:10:46,605 గాలిపటానికీ, అంతరిక్ష నౌకకీ తేడా తెలియకుండా ఏమీ లేను. 227 00:10:46,605 --> 00:10:48,732 మనం ఇప్పుడు ఒక పని చేయాలి. మనం ఇద్దరు మనుషుల్ని నియమించి 228 00:10:48,732 --> 00:10:50,317 తిరిగి ఇంటి పైకప్పు మీదకి వెళ్లి గమనించాలి, 229 00:10:50,317 --> 00:10:51,860 - అది బహుశా ఇటుగా మళ్లీ రావచ్చేమో. - సరే. 230 00:10:51,860 --> 00:10:54,863 నేను మొదటగా వెళ్తాను. నాతో ఎవరు వస్తారు? పదండి వెళ్దాం. పోలో, పింక్ పోలో? వెళ్దాం పద. 231 00:10:54,863 --> 00:10:56,698 సరే. అంటే, చూడు, అదీ... 232 00:10:56,698 --> 00:10:59,159 నాకు గ్రహాంతర వాసులు అంటే భయం. 233 00:10:59,159 --> 00:11:01,328 నువ్వు రావాలి. అది మనకి తెలిసినవన్నీ తప్పు అని రుజువు చేస్తుంది... 234 00:11:01,328 --> 00:11:02,746 - సరే. - ...అది మనల్ని భయపెడుతుంది. 235 00:11:02,746 --> 00:11:05,165 - సరే. - మంచిది, స్వీటీ. దాని గురించి భయపడకు. 236 00:11:05,165 --> 00:11:07,292 అవును. తను చిన్నపిల్ల. ఈ వయసులోనే ఈ విషయాలు తెలుసుకోవాలి. 237 00:11:07,292 --> 00:11:10,128 మేము ఇంక బయలుదేరాలి, నిద్రపోయే సమయం దగ్గరపడింది. 238 00:11:10,128 --> 00:11:13,006 లేదు. దయచేసి, వెళ్లద్దు. బహుశా అది గాలిపటమే కావచ్చు. 239 00:11:13,006 --> 00:11:14,383 - ఏంటి? లేదు. - అంటే, అదే కావచ్చు. 240 00:11:14,383 --> 00:11:17,553 మాకు తెలియదు. నాకన్నా ముందు నువ్వు చూశావు. నేను ఊరికే నీతో పాటు దాని వంక చూశానంతే. 241 00:11:17,553 --> 00:11:20,514 నా ఉద్దేశం, మేము చూడలేదు... యు.ఎఫ్.ఓ. ఐడియా బాగుంది. ఇది ఎలాగంటే... 242 00:11:20,514 --> 00:11:24,685 "యు.ఏ.పి, గుర్తు తెలియని అంతరిక్ష అసాధారణ ఘటన." ఇలాంటివి టిక్ టాక్ నిండా ఉన్నాయి. 243 00:11:24,685 --> 00:11:26,103 - అవును, ఉన్నాయి. - చూశావా? 244 00:11:26,103 --> 00:11:29,439 సరే. అలాగే. ఫ్రాన్సిస్, ఇంక చాలు. మనం... ఇంక ఇది వదిలేద్దాం. 245 00:11:29,439 --> 00:11:31,900 - అవును. - హేయ్, బంగారం, నువ్వు ఏమైనా డెసర్ట్ తిన్నావా? 246 00:11:31,900 --> 00:11:34,778 ఎందుకంటే నా దగ్గర కొన్ని చక్కని ఫ్రూట్ ఐస్ పాప్స్ ఉన్నాయి, అవి నీకు నచ్చుతాయి. 247 00:11:34,778 --> 00:11:36,154 ఇవ్వనా? సరే. 248 00:11:39,491 --> 00:11:41,243 నువ్వు కూడా అది చూశావు కదా. 249 00:11:41,743 --> 00:11:42,619 దయచేసి విను, విల్. 250 00:11:42,619 --> 00:11:44,955 ఇక్కడ కొన్ని కుటుంబాలు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్లు మా కొత్త పొరుగువారు. 251 00:11:44,955 --> 00:11:46,915 - సారీ. ఇది సరైన సమయం కాదు. - అందుకని నన్ను ఇరికించి 252 00:11:46,915 --> 00:11:48,125 ఒక పిచ్చివాడిలా కనిపించేలా చేస్తావా? 253 00:11:48,125 --> 00:11:51,044 - అదే నువ్వు చేసే పరిష్కారమా? - లేదు, అందరినీ గమనించమని మాత్రమే నిన్ను అడిగాను. 254 00:11:51,044 --> 00:11:53,255 ఇది పెరటిలో పెట్టుకున్న బార్బిక్యూ పార్టీ, ఎక్స్-ఫైల్స్ సదస్సు కాదు. 255 00:11:53,255 --> 00:11:56,175 - మనం ఒక గ్రహాంతర నౌకని చూశాం! - దయచేసి ఇక్కడ రాద్ధాంతం చేయకు. 256 00:11:56,175 --> 00:11:58,510 నేను ఏమీ రాద్ధాంతం చేయడం లేదు! ఆ యు.ఎఫ్.ఓ. అనేది రాద్ధాంతం అవుతోంది! 257 00:11:58,510 --> 00:11:59,887 నువ్వు ఏం మాట్లాడుతున్నావు... ఇంక ఆపేయ్! 258 00:11:59,887 --> 00:12:01,930 నేను ఆపను. నువ్వు ఎలా ఆపేస్తావు? 259 00:12:01,930 --> 00:12:04,391 నాకు తెలిసి, మనం వాదించుకుంటూ ఉండగా ముగ్గురు చిన్నారులు వింటున్నారు, 260 00:12:04,391 --> 00:12:06,476 ఆ ఘటన గురించి లేదా అణువిద్యుత్, లేదా మరొక విషయం గురించి 261 00:12:06,476 --> 00:12:07,853 కొంత జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. 262 00:12:07,853 --> 00:12:10,647 కానీ నువ్వు మాత్రం ఈ చెత్త శివారు ప్రాంతంలో పార్టీ గురించి ఆలోచిస్తున్నావు! 263 00:12:10,647 --> 00:12:12,191 ఇంక ఆపు. నువ్వు ఎదగాలి. 264 00:12:12,191 --> 00:12:15,444 ఈ చెత్త కుకీల ప్లేట్లు ఉన్నందుకు నువ్వు నాకన్నా గొప్పదానివి అనుకుంటున్నావా? 265 00:12:15,444 --> 00:12:17,863 - మన ఇద్దరం ఒక్కటే. కనీసం నేనేయినా అది అంగీకరిస్తాను. - లేదు. అది నిజం కాదు. 266 00:12:17,863 --> 00:12:20,574 నువ్వు ఘోరమైన వాడివి, ఎదుగుదల ఆగిపోయిన వాడివి, కానీ నన్ను కూడా కిందికి లాగాలని చూస్తుంటావు. 267 00:12:20,574 --> 00:12:25,495 కొన్ని వేల చదరపు గజాల స్థలం నీ సమస్యల్ని పరిష్కరిస్తుందని అనుకుంటున్నావా? నువ్వు మూర్ఖురాలివి. 268 00:12:25,495 --> 00:12:27,706 - ఇంక ఆపేయ్! నా గురించి నీకు తెలియదు. - నాకు నీ గురించి తెలుసు. 269 00:12:27,706 --> 00:12:31,210 నువ్వు ఇంటికే పరిమితమైన ఒక పనికిమాలిన తల్లివి ఇంకా నీ బోరింగ్ జీవితం నుండి తప్పించుకోవడానికి 270 00:12:31,210 --> 00:12:33,545 నాతో కలిసి తిరుగుతుంటావు. 271 00:12:33,545 --> 00:12:36,798 నువ్వు కొత్త ఫ్యాషన్ల మీద మోజుపడే ముసలివాడివి అది దాచిపెట్టుకోవడానికి జుట్టుకు రంగు వేసుకునేవాడివి. 272 00:12:36,798 --> 00:12:39,259 - అది నీకు నచ్చింది అని చెప్పావు! - ఎందుకంటే నిన్ను చూసి నేను జాలిపడ్డాను! 273 00:12:42,221 --> 00:12:44,473 - నేను ఎప్పటికీ ఇంక నిన్ను కలవను. - ఆ ఏర్పాటు నేను చేయగలను. 274 00:12:47,768 --> 00:12:49,728 అందరికీ, సెలవు. మిమ్మల్ని కలవడం సంతోషం. 275 00:12:49,728 --> 00:12:53,982 ఆ మనిషి ఒప్పుకోవడానికి ఇష్టపడకపోయినా కూడా మేము యు.ఎఫ్.ఓ.ని చూశాము. 276 00:12:53,982 --> 00:12:55,192 మన మానవాళి ఒంటరివాళ్లం కాము! 277 00:12:58,070 --> 00:12:59,696 ఇంకా పైన చాలా గ్రహాంతర నౌకలు తిరుగుతున్నాయి! 278 00:13:00,405 --> 00:13:02,074 అతను ఎఫ్ పదాన్ని పలికాడు. 279 00:13:02,574 --> 00:13:03,700 అతను అదే అంటుంటాడు. 280 00:13:04,618 --> 00:13:08,205 నేను మన పార్టీని పాడుచేసినందుకు చాలా సారీ. అది చాలా నిరుత్సాహపరిచింది. 281 00:13:08,205 --> 00:13:11,291 విల్ ఇంకా నేను ఒకరితో ఒకరం గొడవ పడ్డాం. 282 00:13:11,291 --> 00:13:13,710 ఎందుకు? ఏమైనా జరిగిందా? నేను గమనించలేదు. 283 00:13:13,710 --> 00:13:14,795 నువ్వు బాగానే ఉన్నావా? 284 00:13:14,795 --> 00:13:16,588 అవును. బాగానే ఉన్నాను. 285 00:13:16,588 --> 00:13:20,509 అతని కోపం తగ్గిపోతుంది. నీ కోపం తగ్గిపోతుంది. అంతా బాగానే ఉంటుంది. 286 00:13:21,093 --> 00:13:22,094 నాకు తెలియదు. 287 00:13:24,012 --> 00:13:25,013 హేయ్, నేను... 288 00:13:28,267 --> 00:13:29,268 ఏంటి? 289 00:13:29,810 --> 00:13:32,604 అంటే, ఇలా చూడు, లెక్క ప్రకారం చూస్తే, నాకు ఎప్పుడూ అనిపిస్తుంది, 290 00:13:32,604 --> 00:13:37,067 ఈ విశ్వంలో మనుషులు మాత్రమే జీవిస్తున్నారని 291 00:13:37,067 --> 00:13:39,862 వాళ్లు మాత్రమే తెలివైన వాళ్లని అనుకోవడానికి లేదు. 292 00:13:39,862 --> 00:13:41,405 నీకు తెలుసా, ఈ రాత్రి నీకు జరిగిన అనుభవం వల్ల, 293 00:13:41,405 --> 00:13:45,033 అటువంటి విషయాల గురించి మనం కలిసి పరిశోధన చేయగలమేమో అని ఆలోచించాను. 294 00:13:45,033 --> 00:13:47,911 మనం ఎడారి ప్రాంతానికి రోడ్ ట్రిప్ లో వెళ్లచ్చు. 295 00:13:47,911 --> 00:13:49,454 మనకి ఇది కొత్త ఆసక్తికరమైన అంశం అవుతుంది. 296 00:13:49,454 --> 00:13:52,499 నీకు గోల్ఫ్ ఆట ఇష్టం ఉండదు. ఇంకా పికిల్ బాల్ మీద కూడా, నీకు ఆసక్తి పోయింది, 297 00:13:52,499 --> 00:13:55,210 కాబట్టి మన ఇద్దరం కలిసి ఏదైనా చేయగలిగింది ఇదే కావచ్చు. 298 00:13:55,836 --> 00:13:56,837 గుడ్ నైట్, బేబీ. 299 00:13:57,838 --> 00:14:02,134 మనం కలిసి చేయతగ్గ పని ఇది, ఆలోచించు. ప్లాన్ చేయి. 300 00:14:03,552 --> 00:14:04,761 గుడ్ నైట్. 301 00:14:09,016 --> 00:14:12,811 బాల్కనీలో కొంత ఖాళీ ప్రదేశం ఉంది, అంటే, ఒక వక్రీభవన టెలిస్కోప్ పెట్టుకోవచ్చు. కొంత విద్యుత్... 302 00:14:14,229 --> 00:14:15,564 ప్రస్తుతానికి నిశ్శబ్దం. 303 00:14:16,648 --> 00:14:19,401 అది ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే నువ్వు ఈ రాత్రి యు.ఎఫ్.ఓ.ని చూశావు, 304 00:14:19,401 --> 00:14:21,320 కానీ ఇప్పుడు నువ్వు ఏమీ పట్టనట్లు ఉన్నావు. 305 00:14:39,463 --> 00:14:43,133 స్వయంగా అలంకరించుకునే పది వివాహ వేదికలు 306 00:14:47,262 --> 00:14:50,182 మీ ఆర్బర్ ఫ్రేములు చక్కని నేపథ్యం అవుతాయి 307 00:14:50,182 --> 00:14:51,433 లక్కీ పెన్నీ బ్రూయింగ్ కంపెనీ 308 00:14:51,433 --> 00:14:53,185 అయితే నన్ను ఇక్కడ ఏం చేయమంటావు? 309 00:14:53,185 --> 00:14:55,604 నువ్వు ఉడికించడానికి రెండు బ్యాగులు కలపాలి. 310 00:14:55,604 --> 00:14:58,273 రెండు సంచీల నీలపు రాస్బెరీ పాప్ రాక్స్ క్యాండీలా? 311 00:14:58,273 --> 00:14:59,608 ఓహ్, లేదు. 312 00:15:05,489 --> 00:15:06,657 రెండు బకెట్లు. 313 00:15:06,657 --> 00:15:08,408 బాబు, నాకు పాప్ రాక్స్ అంటే ఇష్టం. 314 00:15:08,951 --> 00:15:10,869 - ఎందుకంటే అవి తిరిగి పోరాడతాయి. - మంచిది. 315 00:15:16,041 --> 00:15:17,543 ఇంకా ఇవి బహుశా నెర్డ్స్ చాక్లెట్లు అయి ఉంటాయి. 316 00:15:18,627 --> 00:15:21,046 ఎన్ని బకెట్ల నెర్డ్స్ చాక్లెట్లని నేను అందులో వేయాలి? 317 00:15:23,298 --> 00:15:25,801 నాకు తెలియదు. ముందు ఆరు బకెట్లతో మొదలుపెడదాం. అది బాగుంటుంది కదా? 318 00:15:25,801 --> 00:15:28,554 లేదు. ఇది ఏదీ బాగా అనిపించడం లేదు. 319 00:15:28,554 --> 00:15:31,849 సరే, కానీ, నేను ఇన్ఛార్జ్ ని, కాబట్టి ఆరు బకెట్లు కలుపు. 320 00:15:31,849 --> 00:15:34,309 అప్పుడు నేను ఒకసారి రుచి చూసి తుది నిర్ణయం తీసుకుంటాను, 321 00:15:34,309 --> 00:15:36,061 అది ఎలా ఉండాలో నిర్ణయిస్తాను. 322 00:15:36,061 --> 00:15:38,814 ఆ తరువాత, అప్పుడు నువ్వు ట్రక్ లో సామాన్లు దింపచ్చు. 323 00:15:44,194 --> 00:15:46,321 హేయ్! యో, పిచ్చోడా! 324 00:15:53,203 --> 00:15:54,413 నిజంగా, ఇదేంటి బాబు? 325 00:15:56,999 --> 00:15:58,876 సరే. సారీ. 326 00:15:58,876 --> 00:16:00,919 - చూడు... సారీ. - నీకు అసలు ఏం అయింది? 327 00:16:00,919 --> 00:16:02,087 చూడు, నీకు నష్టపరిహారం ఇస్తాను. 328 00:16:02,087 --> 00:16:03,964 - అది ఎక్కువేం ఉండదు, కదా? - ఏం మాట్లాడుతున్నావ్! 329 00:16:03,964 --> 00:16:06,049 నీ జీవితంలో నువ్వు దేని గురించి కోపంగా ఉన్నావో నాకు తెలియదు, 330 00:16:06,049 --> 00:16:07,885 కానీ దాన్ని వేరే దాని మీద చూపించు. 331 00:16:07,885 --> 00:16:11,054 ఈ ఉద్యోగం ఇప్పటికే సరిపోవడం లేదు, ఇంకా నాకు వేరే పారితోషికాలు కూడా ఇవ్వడం లేదు 332 00:16:11,054 --> 00:16:14,808 ఎందుకంటే ఏదో బ్యాలెట్ ప్రక్రియ వల్ల సాంకేతికంగా నేను కాంట్రాక్టర్ ని అయ్యాను. 333 00:16:15,684 --> 00:16:17,311 ఈ రాజకీయ నాయకులు, బాబు. 334 00:16:17,311 --> 00:16:19,938 - ఎప్పుడూ, ఇలా చేస్తుంటారు... - నాతో స్నేహం పెంచుకోవాలని చూడకు, బాబు. 335 00:16:19,938 --> 00:16:21,106 నేను అందుకోసం మాట్లాడటం లేదు. 336 00:16:21,106 --> 00:16:22,774 సరే, నేను సారీ. నువ్వు సరిగ్గా చెప్పావు. 337 00:16:22,774 --> 00:16:25,194 మీరు, సర్, మీరు స్కూటర్ నడిపే అర్హత కోల్పోయారు. 338 00:16:26,278 --> 00:16:28,238 సారీ. 339 00:16:34,995 --> 00:16:37,998 చూడు, సిల్వియా, నువ్వు మా పెళ్లి ఏర్పాట్లు చూస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. 340 00:16:37,998 --> 00:16:40,250 సంతోషం. కానీ నీకు నిజం చెప్పాలి. నేను డ్రగ్స్ కి అలవాటు పడ్డాను. 341 00:16:40,250 --> 00:16:42,461 - అదే చేస్తున్నాడు. నిజంగా డ్రగ్స్ తీసుకుంటున్నాడు. - అవును, నిజం. 342 00:16:43,045 --> 00:16:46,715 - నేను చెబుతున్నట్లుగా ఈ పెళ్లికి నా ప్లాన్ ఏమిటంటే... - నువ్వు వేరే ఫోన్ లో మాట్లాడుతున్నావా? 343 00:16:46,715 --> 00:16:49,092 - సిల్వియా, నీ ఉద్దేశం ఏంటి? - నేను మీకు మళ్లీ ఫోన్ చేస్తాను. బై. 344 00:16:50,260 --> 00:16:52,804 - హలో. - నేను సిల్వియా గ్రీవ్స్ తో మాట్లాడవచ్చా? 345 00:16:52,804 --> 00:16:54,890 - చెప్పండి, నేనే మాట్లాడుతున్నాను. - నా పేరు సిడ్నీ ప్లెమింగ్స్ 346 00:16:54,890 --> 00:16:57,434 కాలిఫోర్నియాలో శాన్ డియాగోలో ఉన్న గరౌఫ్ అండ్ అసోసియేట్స్ కంపెనీ నుండి ఫోన్ చేస్తున్నాను. 347 00:16:57,434 --> 00:17:00,771 జెరీ రెవాన్ స్కీ మీద వచ్చిన ఫిర్యాదుల్ని మేము పరిశీలిస్తున్నాం. 348 00:17:00,771 --> 00:17:03,273 మీరు ఒక బాధితురాలిగా గుర్తించబడ్డారు. 349 00:17:04,398 --> 00:17:06,527 సారీ, కానీ జెరీ రెవాన్ స్కీ ఎవరో నాకు తెలియదు. 350 00:17:06,527 --> 00:17:08,862 బహుశా అతని మారు పేరు వింటే మీకు గుర్తు రావచ్చు. 351 00:17:10,113 --> 00:17:11,156 జానీ రెవ్. 352 00:17:13,200 --> 00:17:14,867 అది అతని అసలు పేరు కాదని నాకు తెలుసు. 353 00:17:17,663 --> 00:17:20,457 - చాలా బాగుంది, కదా? - ఖచ్చితంగా బాగాలేదు. ఇది చాలా అసహ్యంగా ఉంది. 354 00:17:20,457 --> 00:17:22,416 బీరులో గుప్పెడు పాప్ రాక్స్ చాక్లెట్లు కలిసిన రుచిలా ఉంది. 355 00:17:22,416 --> 00:17:24,252 అవును, ఎందుకంటే జరిగింది అదే కదా. 356 00:17:25,753 --> 00:17:26,964 - ఓహ్, లేదు. - ఓహ్, అవును. 357 00:17:26,964 --> 00:17:29,007 నా జీవితంలో నేను ఎంచుకున్న వాటిని అవమానించాలని 358 00:17:29,007 --> 00:17:31,426 నా మొత్తం జీవితంలో నేను చూసిన ఒక అత్యద్భుతమైన దృశ్యాన్ని 359 00:17:31,426 --> 00:17:32,970 నేను చూడలేదు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? 360 00:17:32,970 --> 00:17:34,763 లేదు, అందుకు రాలేదు. నీకు ఇది చూపించాలని వచ్చాను. 361 00:17:35,514 --> 00:17:38,976 - నోర్డ్ స్టార్మ్ లో ఐదు డాలర్లు తగ్గింపా? - ఏంటి? లేదు, అది కాదు. ఇది. 362 00:17:38,976 --> 00:17:41,353 జానీ 66 కి సమయం వచ్చింది రెవ్ నిష్క్రమణ, విపి కి పదవి 363 00:17:42,229 --> 00:17:44,857 సరేనా? జానీ రెవ్ గతం మొత్తానికి అతని మెడకి చుట్టుకుంది. 364 00:17:44,857 --> 00:17:47,067 లైంగిక వేధింపుల విషయంలో అతనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. 365 00:17:47,067 --> 00:17:49,486 ఆశ్చర్యంగా ఉంది. అతనికి జరగాల్సింది జరగడం సంతోషం. 366 00:17:49,486 --> 00:17:53,031 కాబట్టి, మనం అక్కడికి వెళ్లి నీకు ఇస్తానన్న ఉద్యోగం సంపాదిద్దాం. 367 00:17:53,031 --> 00:17:55,158 - నేను డ్రైవ్ చేస్తాను. - వద్దు. సరేనా? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? 368 00:17:55,158 --> 00:17:57,619 నేను ఆ జెనాకి ఇప్పటికే ఫోన్ చేశాను. తను ఇప్పుడు సి.ఇ.ఓ. అయింది. 369 00:17:57,619 --> 00:17:59,621 - ఆమెకి ఫోన్ చేశావా? - అవును. ఆ ఉద్యోగం ఇంకా ఉందట. 370 00:17:59,621 --> 00:18:01,832 ఆ ఉద్యోగంలో చేరడం కోసం నువ్వు శాన్ డియాగోకి వస్తే చాలు అని ఆమె అంటోంది. 371 00:18:01,832 --> 00:18:04,668 చూడు, మనం ఆమెతో మాట్లాడవలసింది ఏమీ లేదు, తెలుసా? 372 00:18:04,668 --> 00:18:06,587 నేను ఆ కార్పొరేట్ వాతావరణంలో బతకలేను, సరేనా? 373 00:18:06,587 --> 00:18:10,257 బీర్ అనేది ఎక్కడయినా బీరే. ఆ ప్రదేశం నీకు బాగా నచ్చింది. నువ్వు దాన్ని ఇష్టపడ్డావు. 374 00:18:10,257 --> 00:18:12,801 నువ్వు ఇక్కడ అధ్వాన్నంగా ఉన్నావు. ఇక్కడ అధ్వాన్నంగా ఉన్నావు. 375 00:18:12,801 --> 00:18:15,554 అక్కడ ఏం ఘోరం జరిగిపోతుంది? నీకు ఉద్యోగం ఇస్తారు అంతేనా? 376 00:18:15,554 --> 00:18:19,224 - అవును. - చూడు, బాబు. నువ్వు దేని గురించి భయపడుతున్నావు? 377 00:18:19,224 --> 00:18:21,185 ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నించు. రిస్కు తీసుకో. 378 00:18:21,185 --> 00:18:22,436 ఎందుకు అంతగా ఆరాటపడుతున్నావు? 379 00:18:23,187 --> 00:18:25,105 నేను కొంతకాలం ఆ స్థితిలో ఉన్నాను, అప్పుడు నన్ను హెచ్చరించావు. 380 00:18:25,105 --> 00:18:28,567 నేను నీ మాట వినదల్చుకోలేదు. కానీ నువ్వు చాలా నిజాయితీగా చెప్పావు, అది నాకు మేలు చేసింది. 381 00:18:28,567 --> 00:18:31,361 నేను కేటీ ఇంకా ఆండీ పెళ్లి పనులు చేయడం మొదలుపెట్టాను. 382 00:18:31,361 --> 00:18:33,780 అది చాలా పెద్ద విషయం ఏమీ కాదని నాకు తెలుసు, కానీ, చూడు, 383 00:18:33,780 --> 00:18:35,490 బహుశా దాని ద్వారా నేను పెద్ద పనులు సంపాదించగలనేమో. 384 00:18:36,450 --> 00:18:38,410 కాబట్టి, నీతో నిజాయితీగా ఉండటం ఇప్పుడు నా వంతు. నువ్వు... 385 00:18:39,036 --> 00:18:40,829 బాబు, నువ్వు ఈ చోటు నుండి బయటపడాలి. 386 00:18:43,040 --> 00:18:45,876 కానీ నువ్వు వెళితే, ఇందాకే డెలివరీ అయిన ఐదు వందల పౌండ్ల సోర్ ప్యాచ్ కిడ్స్ చాక్లెట్లని 387 00:18:45,876 --> 00:18:47,002 ట్రక్కు నుండి ఎవరు దింపుతారు? 388 00:19:10,734 --> 00:19:11,985 నేను ఇప్పుడే వచ్చేస్తాను. 389 00:19:12,569 --> 00:19:13,445 విల్? 390 00:19:15,447 --> 00:19:18,158 యో, నేను మానేస్తున్నాను. 391 00:19:19,076 --> 00:19:20,077 శాంతించు. 392 00:19:27,793 --> 00:19:30,170 "మానేస్తున్నాను" అంటే, నా ఉద్దేశం, ఈ బార్ లో నాకు ఉన్న షేర్లని అమ్మేస్తాను 393 00:19:30,170 --> 00:19:32,506 దాని బేరసారాల్ని మనం లాయర్ సమక్షంలో చేసుకుందాం. 394 00:19:33,131 --> 00:19:34,132 ప్రశాంతం. 395 00:19:38,846 --> 00:19:41,932 హాయ్, నేను సి.ఇ.ఓ. జెనా లూయిస్ ని కలవడానికి వచ్చాను. 396 00:19:41,932 --> 00:19:43,058 కానీ మీరు ఎవరు? 397 00:19:43,058 --> 00:19:45,435 నా పేరు విల్ జిస్మన్, లక్కీ పెన్నీ బ్రూవరీ నుండి వచ్చాను. 398 00:19:45,435 --> 00:19:47,855 ఉద్యోగం గురించి వచ్చాను. ఆమె నా కోసం ఎదురుచూస్తోంది అనుకుంటా. 399 00:19:47,855 --> 00:19:49,356 సరే, నాకు ఒక క్షణం టైమ్ ఇవ్వండి. 400 00:19:49,356 --> 00:19:50,649 జానీ రెవ్ రెస్టారెంట్ గ్రూప్ 401 00:19:52,609 --> 00:19:53,861 మీరు ఈ సైన్ బోర్డులన్నీ మార్చేస్తున్నారా? 402 00:19:54,570 --> 00:19:55,571 మేము ఆ పనిలోనే ఉన్నాం. 403 00:19:55,571 --> 00:19:59,074 మీకు కొత్త చొక్కాలు ఇంకా సామాగ్రి కూడా కావాలి. ఇవన్నీ ఆర్.కెలీ దుస్తులు మాదిరిగా ఉంటాయి. 404 00:20:01,785 --> 00:20:05,038 సరే, మీరు వచ్చారని ఆమెకి సమాచారం ఇచ్చాను. మీరు కాసేపు కూర్చుంటారా? 405 00:20:05,038 --> 00:20:06,123 మంచిది. థాంక్యూ. 406 00:20:12,546 --> 00:20:13,964 ఓహ్, దేవుడా. అదిగో ఆమె వస్తోంది. 407 00:20:15,007 --> 00:20:16,925 సరే, పూర్తిగా నిజం చెప్పాలి, నేను జెనాతో నిజానికి మాట్లాడనే లేదు. 408 00:20:16,925 --> 00:20:19,386 కానీ, నేను ఆమెకి ఒక మెసేజ్ పంపించాను, ఆమె ఇప్పటివరకూ దానికి స్పందించలేదు. 409 00:20:19,386 --> 00:20:22,723 ఎందుకంటే ఆమె మనల్ని గుర్తుపట్టచ్చు లేదా మర్చిపోయి ఉండచ్చు. కానీ మనం ఇక్కడ ఉన్నాం, కాబట్టి... 410 00:20:22,723 --> 00:20:25,058 - ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఏంటి? - అవును. 411 00:20:25,058 --> 00:20:27,311 - అలా ఎందుకు చేశావు? - అలా చేయకపోతే నువ్వు ఇక్కడికి రావు కాబట్టి. 412 00:20:27,311 --> 00:20:28,854 ఏ కారణం లేకుండా రెండు గంటలు ఇక్కడికి డ్రైవ్ చేశావా? 413 00:20:28,854 --> 00:20:30,898 - ఓహ్, లేదు. మరేం ఫర్వాలేదు. - ఓహ్, దేవుడా. మనం వెళిపోదాం పద. 414 00:20:30,898 --> 00:20:32,399 - ఊరికే ఆమె ముందు నిలబడు చాలు. - వెళదాం పద. 415 00:20:32,399 --> 00:20:33,734 - హాయ్. - ఓహ్, దేవుడా. హాయ్. 416 00:20:33,734 --> 00:20:35,444 - మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? - మేము ఊరికే 417 00:20:35,444 --> 00:20:37,237 - అలా బీచ్ వైపు వెళ్తున్నాం. - మేము... జూ పార్క్ కి వెళ్లాం. 418 00:20:37,237 --> 00:20:38,572 - నేను ఈత కొట్టాను. - తరువాత జూకి వెళ్లాం. 419 00:20:39,823 --> 00:20:40,908 అవును. 420 00:20:44,077 --> 00:20:45,913 కిందటి సారి మిమ్మల్ని కలిసినప్పుడు, 421 00:20:45,913 --> 00:20:50,292 నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే నాకు ఉద్యోగం ఇస్తానని మీరు అన్నారు. 422 00:20:50,292 --> 00:20:54,171 నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. 423 00:20:54,171 --> 00:20:56,590 కానీ ఆ ఉద్యోగం ఇంకా ఉందో లేదో నాకు తెలియదు. 424 00:20:57,090 --> 00:20:58,800 మీకు కావాలంటే నా బయోడేటా మీకు ఇవ్వగలను. 425 00:20:58,800 --> 00:21:01,762 నాకు కేవలం ఒక ప్రింటర్ ఇంకా రెస్యూమె రాయడానికి 45 నిమిషాల సమయం ఇస్తే చాలు. 426 00:21:03,180 --> 00:21:05,891 చూడండి, ఇది పిచ్చితనంగా కనిపించవచ్చు. మీరు ఇక్కడ బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. 427 00:21:06,391 --> 00:21:07,935 మీ సమయం వృథా చేస్తున్నందుకు సారీ. 428 00:21:08,519 --> 00:21:10,145 ఆగండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? 429 00:21:12,147 --> 00:21:15,400 - కంగ్రాచ్యులేషన్స్. ఇది ఎలా ఉంది? - థాంక్యూ. 430 00:21:15,400 --> 00:21:18,862 - ఉద్వేగంగా ఉందా? - నాకు కొద్దిగా భయంగా ఉంది. 431 00:21:18,862 --> 00:21:21,365 ఇది అంటే... ఇది నేను ఇంతకుముందు చేసిన అన్ని పనుల కంటే చాలా భిన్నంగా ఉంది. 432 00:21:21,365 --> 00:21:24,201 నాకు నచ్చని చాలా డ్రింకుల్ని నువ్వు సృష్టించబోతున్నావు. 433 00:21:24,201 --> 00:21:26,662 నీ కోసం ఒకటి మాత్రం తయారు చేస్తాను. దానికి సిల్వియా అని పేరు పెడతాను. 434 00:21:26,662 --> 00:21:29,831 అది రీజిలింగ్ ద్రాక్ష రసంతో పాటు ఆపిల్ జ్యూస్, నవధాన్యాలతో తయారు చేస్తాను, 435 00:21:29,831 --> 00:21:31,834 అది చిన్నపిల్లల కారు సీటు సైజులో అందిస్తాను. 436 00:21:31,834 --> 00:21:34,503 - నేను దాన్ని పూర్తిగా తాగి పడేస్తాను. - నువ్వు అదే చేస్తావు. 437 00:21:36,255 --> 00:21:39,591 నేను ఉద్యోగం కోసం ప్రతి రోజూ శాన్ డియాగోకి రాకపోకలు సాగించాలంటే నమ్మలేకపోతున్నాను. 438 00:21:40,384 --> 00:21:44,054 అవును, కానీ ఈ ఉద్యోగంలో నువ్వు చేరితే, నువ్వు శాన్ డియాగోకి మారిపోవాలి. 439 00:21:46,849 --> 00:21:50,102 నేను నిజంగా దాని గురించి ఆలోచించనే లేదు. వావ్. 440 00:21:54,064 --> 00:21:58,694 ఆ ఉద్యోగంలో నువ్వు బాగా రాణిస్తావు. ఇంకా మార్పు ఎప్పుడైనా నిజంగా మంచిదే. 441 00:22:00,195 --> 00:22:01,864 లాస్ ఏంజెలెస్ లో నీకు ఏం పని ఉంది? 442 00:22:09,621 --> 00:22:10,747 మీకు పువ్వులు కావాలా? 443 00:22:10,747 --> 00:22:12,791 లేదు. మేము జంట కాదు. 444 00:22:12,791 --> 00:22:15,919 నాకు వేరే వ్యక్తితో పెళ్లయింది. అతను ఇక్కడికి రాలేదు. 445 00:22:15,919 --> 00:22:17,713 నాకంటే చాలా అందంగా ఉంటాడు. 446 00:22:18,297 --> 00:22:19,214 మీకు పువ్వులు కావాలా? 447 00:22:20,048 --> 00:22:22,467 నీకు ఒక విషయం చెప్పనా? నాకు ఒక పువ్వు కావాలి. 448 00:22:22,467 --> 00:22:24,803 చాలా ధన్యవాదాలు. నీ ప్రయత్నం ఫలించింది. 449 00:22:26,680 --> 00:22:29,766 - థాంక్యూ, సర్. థాంక్యూ. - చాలా ధన్యవాదాలు. 450 00:22:31,059 --> 00:22:33,312 - నీ కోసం, మై లేడీ. - సరే, థాంక్యూ. 451 00:22:33,854 --> 00:22:36,023 ఇది నకిలీది. ప్లాస్టిక్ తో చేసింది. 452 00:22:37,232 --> 00:22:38,734 దాని అర్థం ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది. 453 00:23:06,011 --> 00:23:08,764 {\an8}ఏడాది తరువాత 454 00:23:08,764 --> 00:23:10,891 {\an8}శనివారంనాడు సైమన్ ని సాకర్ నుండి తీసుకురాగలవా? 455 00:23:10,891 --> 00:23:13,769 సారీ, బేబీ. నేను షేఫర్ కవలల బాట్ మిట్జ్వా వేడుకకి వెళ్లాలి, 456 00:23:13,769 --> 00:23:16,063 ఇంకా ఆ తరువాత వారాంతంలో పామ్ స్ప్రింగ్స్ లో బేబీ షవర్ వేడుక ఉంది. 457 00:23:16,063 --> 00:23:18,273 కానీ వచ్చే వారాంతంలో నేను ఆ పని చేయగలను. 458 00:23:18,273 --> 00:23:19,233 - ఏంటి? సాకర్ పోటీనా? - అవును. 459 00:23:19,858 --> 00:23:20,692 సరే. నేను వెళ్లాలి. 460 00:23:20,692 --> 00:23:22,569 - ఆ క్యాటరర్ల కంటే ముందుగా నేను వెళ్లాలి. - ఒక టై ఎంపిక చేయి. 461 00:23:22,569 --> 00:23:24,321 - ఇది వేసుకో. - మంచిది, సరే. బై. 462 00:23:24,321 --> 00:23:25,989 - ఉంటాను. - మనం ఎవరి తరపున కూర్చుంటున్నాం? 463 00:23:25,989 --> 00:23:28,534 కేటీ కుటుంబం తరపున, ఇంకా శాన్ డియాగో నుండి విల్ వస్తున్నాడు. 464 00:23:28,534 --> 00:23:30,702 - విల్. వావ్. చాలా కాలం అయింది. - అవును. నాకు తెలుసు. 465 00:23:30,702 --> 00:23:32,412 నాకు తెలుసు. అతడిని కలవడం సంతోషంగా ఉంటుంది. 466 00:23:33,038 --> 00:23:34,623 - సరే. నిన్ను అక్కడ కలుస్తాను. - ఉంటాను. 467 00:23:42,422 --> 00:23:44,591 ఈవెంట్ ప్లానింగ్ బై సిల్వియా 468 00:23:56,228 --> 00:23:57,271 సిల్వియా. 469 00:23:58,188 --> 00:24:01,066 ఎంత అందమైన రోజు కదా, హా? ఇది ఒక వరంలా ఉంది. 470 00:24:01,066 --> 00:24:04,236 - చెప్పు? - మ్యూజిక్ విషయంలో ఆండీకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. 471 00:24:04,236 --> 00:24:05,988 అతను నాకు ప్రత్యేకంగా పాటల జాబితా ఇచ్చాడు, 472 00:24:05,988 --> 00:24:09,241 - దాన్ని ఇప్పుడు ప్లే చేయాలని కోరుకుంటున్నాడు. - సరే, దాని సంగతి నేను చూసుకుంటాను. 473 00:24:09,241 --> 00:24:12,411 - కానీ, నాకు ఆ మ్యూజిక్ వినిపించడం లేదు. - దాని సంగతి నేను చూసుకుంటాను. 474 00:24:12,411 --> 00:24:14,329 - సరే, నాకు వినిపించలేదేమో... సరే. - అవును. నువ్వు బాగున్నావు. 475 00:24:14,329 --> 00:24:16,999 - కూర్చో. అవును. అంతా సవ్యంగానే ఉంది. - దయచేసి, వీలైనంత త్వరగా ప్లే చేయించు. 476 00:24:33,098 --> 00:24:35,767 సరే. అలాగే. ఇంక మొదలుపెట్టచ్చు. థాంక్యూ. 477 00:24:36,643 --> 00:24:39,104 సరే, మీరు తరువాతది వాయించండి. థాంక్స్. 478 00:25:46,421 --> 00:25:47,923 అవును, శాన్ డియాగో చక్కగా ఉంది. 479 00:25:47,923 --> 00:25:49,758 - ఉద్యోగం ఎలా ఉంది? - ఆ ఉద్యోగం గొప్పగా ఉంది. 480 00:25:49,758 --> 00:25:53,846 అది కాస్త కార్పొరేట్ వాతావరణంతో ఉన్నా, నా సృజనాత్మకతకు చాలా స్వేచ్ఛ దొరుకుతుంది. 481 00:25:53,846 --> 00:25:56,431 - అవును. నువ్వు సి.ఇ.ఓ. తో కలిసి ఉంటున్నావు... - అవును ఉంటున్నాను. 482 00:25:56,431 --> 00:25:59,685 - ...కాబట్టి కొద్దిగా ఉద్యోగ భద్రత ఉంటుంది. - నాకు ఉద్యోగ భద్రత చాలా ఎక్కువగా ఉంది. 483 00:26:00,310 --> 00:26:02,563 ఆ తరువాత మీరు ఆహార రసాయనాల రంగంలోకి ఎలా వెళ్లారు, జెనా? 484 00:26:02,563 --> 00:26:04,273 అంటే, నేను కెమిస్ట్రీ చదివాను. 485 00:26:06,191 --> 00:26:07,442 - ఇంకేం మాట్లాడలేను. - అవును. 486 00:26:07,442 --> 00:26:08,861 ఇదీ విషయం. 487 00:26:08,861 --> 00:26:12,698 కెమిస్ట్రీ ప్రస్తావన వచ్చింది కాబట్టి, మాకు నిశ్చితార్థం అయింది. 488 00:26:13,282 --> 00:26:14,408 అవును. 489 00:26:16,326 --> 00:26:17,286 నిజంగా. 490 00:26:17,286 --> 00:26:18,453 వావ్. 491 00:26:18,453 --> 00:26:19,454 ఓహ్, దేవుడా. 492 00:26:19,454 --> 00:26:21,039 - అది గొప్ప విషయం. - అది అద్భుతం. 493 00:26:21,039 --> 00:26:22,666 థాంక్యూ. చాలా ధన్యవాదాలు. 494 00:26:23,166 --> 00:26:25,210 - అభినందనలు, మిత్రమా. - నేను మెచ్చుకుంటాను. థాంక్యూ. 495 00:26:25,210 --> 00:26:28,297 - కంగ్రాచ్యులేషన్స్. అది పెద్ద విషయం. వావ్. - థాంక్యూ. అవును. ఇది గొప్ప విషయం. 496 00:26:28,297 --> 00:26:31,717 - ఓహ్, దేవుడా. అది గొప్పగా ఉంది. అవును. - అయితే, 497 00:26:32,593 --> 00:26:35,512 పెళ్లి ఏర్పాట్లు చేయడంలో మీకు అన్ని విషయాలు తెలుసు అని విల్ నాకు చెప్పాడు. 498 00:26:35,512 --> 00:26:36,680 అవును, ఆస్టిన్ లో అనుకుంటున్నాం. 499 00:26:36,680 --> 00:26:39,183 నేను కలుసుకున్న ప్రతి ఒక్కరినీ ఆహ్వానించకపోతే 500 00:26:39,183 --> 00:26:41,768 మా తల్లిదండ్రులు ఇంకెప్పుడూ నాతో మాట్లాడరు. 501 00:26:41,768 --> 00:26:43,228 - సరే. అలాగే. - కాబట్టి నేను... 502 00:26:45,272 --> 00:26:48,859 - అద్భుతమైన పెళ్లి వేడుక. బాగా చేశావు. - హాయ్. థాంక్స్, మిత్రమా. 503 00:26:48,859 --> 00:26:50,444 అవును, ఫర్వాలేదు. ఇది అద్భుతంగా ఉంది. 504 00:26:50,444 --> 00:26:52,863 - థాంక్యూ. థాంక్యూ. - ఇది నిజంగానే చేశావా? బాగుంది. 505 00:26:53,655 --> 00:26:57,409 - నిన్ను కలవడం సంతోషం. నిజం. - నిన్ను కలవడం కూడా సంతోషంగా ఉంది. అవును. 506 00:26:57,409 --> 00:27:02,164 నేను ఒక విషయం గురించి నీకు ఒక నిజం చెప్పాలి. 507 00:27:02,164 --> 00:27:04,875 - నాకు ఈ రోజు చెప్పకు. ఫర్వాలేదా? - నాకు అర్థమైంది. మనం మాట్లాడుకోవాలి. 508 00:27:04,875 --> 00:27:07,920 - అది నాకు వద్దు. - నేను నీకు వివరించగలను. సారీ. 509 00:27:09,838 --> 00:27:11,465 కానీ నువ్వు ఇంకా నేను, మనం... 510 00:27:12,883 --> 00:27:13,884 మనం ఒక యు.ఎఫ్.ఓ.ని చూశాం. 511 00:27:13,884 --> 00:27:17,179 - మనం నిజంగా చూశాం. మనం దాన్ని చూశాము! - మనం కలిసి యు.ఎఫ్.ఓ.ని చూశాం. కేవలం... 512 00:27:17,179 --> 00:27:19,973 - కేవలం నువ్వు ఇంకా నేను. మనం దాన్ని చూశాం. - మనం చూశాం. మనం దాన్ని చూశాము. 513 00:27:19,973 --> 00:27:22,684 - అది భలే దృశ్యం. అది భలే రోజు. - ఆ మొత్తం సంఘటన అంతా భలేగా జరిగింది. 514 00:27:22,684 --> 00:27:24,770 - మనం కలిసి కాలక్షేపం చేసిన ఆ సమయం అంతా... - అది... 515 00:27:24,770 --> 00:27:26,730 - ...చాలా సరదా సమయం. - అది భలే క్రేజీ కాలం. అవును. 516 00:27:26,730 --> 00:27:29,525 - అది అరాచకంగా ఉండేది. - అది గొప్పగా ఉండేది. 517 00:27:29,525 --> 00:27:30,484 చాలా సరదాగా ఉండేది. 518 00:27:30,484 --> 00:27:33,779 నా జీవితంలో ఒక పక్క ఉత్సాహంగా ఉంటూ అదే సమయంలో నిరుత్సాహంతో ఉండటం 519 00:27:33,779 --> 00:27:35,280 - ఒక రకంగా థ్రిల్లింగ్ గా ఉండేది. - అవును. 520 00:27:35,280 --> 00:27:36,198 - నాకు తెలుసు. - కదా? 521 00:27:36,198 --> 00:27:41,161 కానీ ఇప్పుడు నిత్యం సంతోషంగా స్థిరంగా ఉండటం చాలా విసుగు పుట్టిస్తోంది. 522 00:27:41,161 --> 00:27:44,248 ఇంకా నీ ప్రియురాలు చాలా అందంగా ఉంది 523 00:27:44,248 --> 00:27:47,251 - ఇంకా, అంటే, నీకు సరైన జోడీ తను. - నాకు తెలుసు. నేను ఎలా ఉండబోతున్నానంటే, 524 00:27:47,251 --> 00:27:49,294 నా మిగతా జీవితం అంతా ఆమెతో సంతోషంగా గడపబోతున్నాను. 525 00:27:49,294 --> 00:27:50,712 నేను నమ్మలేకపోతున్నాను. 526 00:27:50,712 --> 00:27:54,258 ఇంకా నేను కూడా, నాకు ముగ్గురు పిల్లల్ని ఇచ్చాడని తన మీద చిరాకు పడటం మానేస్తాను. 527 00:27:54,258 --> 00:27:55,968 నీ వ్యాపారం బాగా నడుస్తోంది 528 00:27:55,968 --> 00:27:58,095 - ఇంకా ఒక అందమైన కుటుంబం ఉంది. - నిజం, సంతృప్తికరంగా అనిపిస్తుంది. 529 00:28:00,764 --> 00:28:03,225 - ఇది చిరాకుగా ఉంది, సారీ. - ఇది చిరాకే. 530 00:28:03,225 --> 00:28:06,353 - అది చిరాకుగా ఉంది! ఈ ప్రదేశం చిరాగ్గా ఉంది. చిరాకేస్తోంది. - ఇది చెత్తలా ఉంది, ఇక్కడ ఘోరంగా ఉంది. 531 00:28:06,353 --> 00:28:08,146 - ఇది అసహ్యంగా ఉంది, కదా? - చాలా అసహ్యకరమైన చోటు. 532 00:28:08,146 --> 00:28:11,191 - నువ్వు ఇంకా మంచి ప్రదేశం ఎంపిక చేయాల్సింది. - నాకు తెలుసు. 533 00:28:12,359 --> 00:28:14,361 - అవును. - కానీ, నీకు తెలుసు, పరిస్థితులు... 534 00:28:14,361 --> 00:28:17,114 పరిస్థితులు మళ్లీ ఘోరంగా మారితే, చూడు... 535 00:28:17,739 --> 00:28:19,783 - మళ్లీ మేము గొడవలు పడి విడిపోతేనా? - అవును. నన్ను సంప్రదించు. 536 00:28:20,284 --> 00:28:23,745 చూడు, ఇది నవ్వులాటగా ఉండచ్చు, కానీ నువ్వు ఇక్కడ చేసిన ఏర్పాట్లు జెనాకి నిజంగా నచ్చాయి, 537 00:28:23,745 --> 00:28:28,000 అవకాశం ఉంటే శాన్ డియాగోలో ఒక పెళ్లికి ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? 538 00:28:28,000 --> 00:28:30,919 నిజంగానే అంటున్నావా? మేవరిక్ సినిమా సొంత ఊరిలోనా? 539 00:28:31,795 --> 00:28:33,422 - చేయాలి. అవును. - ఇలా చూడు. 540 00:28:33,422 --> 00:28:36,550 - మనం సైన్యాన్ని కూడా రంగంలోకి దింపాలి... - అవును. టామ్ క్రూయిస్ మన పైన ఎగురుతాడు. 541 00:28:36,550 --> 00:28:39,553 - అతను కూడా రావచ్చు, కదా? - అతను కూడా రావచ్చు, అందరినీ చూసి నవ్వచ్చు. 542 00:28:39,553 --> 00:28:41,972 - పరిగెత్తచ్చు? - అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, పారిపోవచ్చు. 543 00:28:42,806 --> 00:28:46,476 తనని అధికారికంగా పర్యవేక్షించడానికి మనం హాలోగ్రామ్ ని తెప్పించచ్చు. 544 00:28:46,476 --> 00:28:49,646 - హాలోగ్రామ్ నాకు ఇష్టం. - అవును. ప్రస్తుతం 2ప్యాక్ సింగర్ గురించి ఆలోచిస్తున్నా. 545 00:28:49,646 --> 00:28:52,065 అది నచ్చింది... నా పెళ్లిని ఒక 2ప్యాక్ హాలోగ్రామ్ పర్యవేక్షిస్తుందా? 546 00:28:52,065 --> 00:28:53,233 - చూడు, బాగుందా? - బాగుంది. 547 00:28:53,233 --> 00:28:55,444 మేము డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నాం. 548 00:28:55,444 --> 00:28:57,404 - ఎక్కడ? - మార్-ఎ-లాగో, దాని గురించి విన్నావా? 549 00:28:57,404 --> 00:28:58,697 - నీకు నచ్చుతుంది. - నాకు ఒకరు తెలుసు. 550 00:28:58,697 --> 00:29:00,490 - అవును, నీకు తెలుసు. - ఆ యజమాని మనసు పడ్డాడు. 551 00:29:00,490 --> 00:29:02,117 నీకు, వందేళ్ల వృద్ధుడికీ మధ్య ఏంటి సంబంధం? 552 00:29:02,117 --> 00:29:03,911 వాళ్లకు ఏది కనిపిస్తే అదే మంచిది అనుకుంటారు... 553 00:29:03,911 --> 00:29:05,996 - వాళ్లు దాన్ని ఇష్టపడతారు. - ...ఇంకా వాళ్లు... 554 00:30:12,229 --> 00:30:14,231 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్