1 00:00:21,813 --> 00:00:24,483 "క్రిస్మస్ ముందు రోజు రాత్రి" 2 00:00:48,298 --> 00:00:50,050 సరే మరి, నీకో ప్లాన్ చెప్తా విను. 3 00:00:50,551 --> 00:00:54,638 ఉదయం అవ్వగానే నువ్వు నన్ను లేపాలి, లేదా నేనైనా నిన్ను లేపుతాను. 4 00:00:54,721 --> 00:00:56,390 ఎవరు ముందు లేస్తే వారన్నమాట. 5 00:00:57,182 --> 00:01:00,769 శాలీ, పొద్దుపోతోంది. పడుకో. 6 00:01:00,853 --> 00:01:04,565 క్రిస్మస్ ముందు రోజు రాత్రి ఎవరికైనా నిద్ర పడుతుందా? అంత సులభంగా పట్టదు. 7 00:01:04,647 --> 00:01:07,734 కానీ నువ్వు నిద్రపోకపోతే, శాంటా రాడు కదా. 8 00:01:07,818 --> 00:01:11,363 నిజమే. అయితే నాకు ఓ కథ చెప్తూ జోజో కోడతావా? 9 00:01:12,823 --> 00:01:15,868 అనగనగా ఒక రోజు... 10 00:01:18,287 --> 00:01:20,706 నాకు కథలేవీ రావే. 11 00:01:24,710 --> 00:01:27,045 "క్రిస్మస్ ముందు రోజు రాత్రి. 12 00:01:27,129 --> 00:01:31,300 రచయిత, స్మూపీ, క్లిమెంట్ క్లార్క్ మూర్ కూడా చాలా సహాయపడ్డారు." 13 00:01:31,383 --> 00:01:32,384 థ్యాంక్స్, స్నూపీ. 14 00:01:38,599 --> 00:01:41,518 "అది క్రిస్మస్ ముందు రోజు రాత్రి, వుడ్ స్టాక్ తప్ప ఆ కాలనీలో అందరూ 15 00:01:41,602 --> 00:01:44,730 నిశ్శబ్దంగా పడుకొని ఉన్నారు. 16 00:01:45,731 --> 00:01:48,984 అతి జాగ్రత్తగా ఒక సాక్ ని అది గూడుకు వేలాడదీసింది, 17 00:01:49,067 --> 00:01:51,987 శాంటా వచ్చి అందులో కానుక ఎప్పుడెప్పుడు వేస్తాడా అని ఎదురు చూడసాగింది. 18 00:01:55,115 --> 00:01:57,534 ఇక ఆ పక్షి నిశ్చింతగా తన బెడ్ పై పడుకుంది, 19 00:01:57,618 --> 00:02:00,871 కలలో తనకి నేతి మిఠాయిలు కనపడసాగాయి." 20 00:02:09,922 --> 00:02:13,842 ఒక్క నిమిషం. ఎక్కడైనా పక్షి నేతి మిఠాయిల గురించి కలలు కంటుందా? 21 00:02:13,926 --> 00:02:17,387 ఇంకో ప్రశ్న. అసలు నేతి మిఠాయి అంటే ఏంటి? 22 00:02:17,471 --> 00:02:19,973 నెయ్యితో చేసిన మిఠాయి అనుకుంటా. 23 00:02:20,557 --> 00:02:23,685 అంతేలే. ఇంతకీ మిఠాయి అంటే ఏంటి? 24 00:02:25,062 --> 00:02:26,980 తీపి పదార్థం అన్నమాట. 25 00:02:27,064 --> 00:02:29,441 అలాగే. కానీ పదార్థం అంటే ఏంటి? 26 00:02:30,234 --> 00:02:32,069 ముందు కథ సంగతి చూద్దాం. 27 00:02:32,152 --> 00:02:35,239 "ఆ మైదానంలో ఉన్నట్టుండి పెద్ద శబ్దం వినబడింది, 28 00:02:35,322 --> 00:02:38,492 వుడ్ స్టాక్ ఒక్క ఉదుటున లేచి ఏంటి ఆ శబ్దం అని చూసింది. 29 00:02:45,207 --> 00:02:47,626 అప్పుడు తనకి ఒక చిన్న బండి, 30 00:02:47,709 --> 00:02:50,629 ఇంకా చిన్నగా ఉన్న ఎనిమిది రెయిన్డీర్లు కనిపించాయి. 31 00:02:51,880 --> 00:02:54,675 శాంటా, ఇంకా అతని సిబ్బంది నిజంగానే వచ్చారు. 32 00:02:55,300 --> 00:02:58,470 అతను ఈల వేసి, ఒక్కో రెయిన్డీర్ ని పేరుపేరునా పిలిచాడు: 33 00:02:58,554 --> 00:03:04,101 'ఓయ్, కోన్రాడ్! ఓయ్, బిల్! ఓయ్, రాయ్! ఓయ్, హ్యారియెట్! ఓయ్, ఒలివీయెర్! ఓయ్, ఫ్రెడ్!'" 34 00:03:04,184 --> 00:03:05,769 కాస్త ఆగు. 35 00:03:05,853 --> 00:03:08,897 రెయిన్డీర్ కి ఎవరైనా ఫ్రెడ్ అనే పేరు పెడతారా? 36 00:03:08,981 --> 00:03:13,068 డాషర్, డాన్సర్, ప్రెట్జెల్, లేదా ష్నిట్జెల్ పేర్లు ఏమయ్యాయి? 37 00:03:13,902 --> 00:03:15,529 నేను ఇక్కడ ఏదుందో, అదే చదువుతున్నా. 38 00:03:16,238 --> 00:03:19,116 ఆ రచయితకి గట్టిగా ఒక ఉత్తరం రాయాలి, తర్వాత ఆ విషయం నాకు గుర్తు చేయ్. 39 00:03:20,909 --> 00:03:22,160 ఇక కథ కొనసాగిస్తాను... 40 00:03:22,244 --> 00:03:25,706 "'ఈ కానుకలను ఇద్దాం. నేను ఎగరలేను కాబట్టి 41 00:03:25,789 --> 00:03:28,500 మీరు నాకు లిఫ్ట్ ఇస్తారా?' అని శాంటా గట్టిగా అరిచాడు 42 00:03:34,965 --> 00:03:38,051 ఆ రెయిన్డీర్లు, బండి నిండా బొమ్మలతో, ఇంకా సాంటాతో 43 00:03:38,135 --> 00:03:41,555 ఇళ్ళపై నుండి ఎగరసాగాయి. 44 00:03:44,558 --> 00:03:47,477 ఆ తర్వాత మంచుతో నిండిన ఒక ఇంటిపైన 45 00:03:48,187 --> 00:03:51,565 తమ సొగసైన పాదాలతో వయ్యారంగా అవి ఆగాయి." 46 00:03:56,820 --> 00:04:02,075 అయితే ఒకే ఇంటి పైకప్పు మీద ఎనిమిది రెయిన్డీర్లు, శాంటా, ఇంకా ఒక బండి ఉందా? 47 00:04:02,159 --> 00:04:04,870 ఆ ఇంటి పైకప్పు కూలకుండా ఉండాలని కోరుకుంటున్నాను. 48 00:04:06,705 --> 00:04:09,458 నీకు ఇంకా నిద్ర రావట్లేదా? 49 00:04:09,541 --> 00:04:11,668 రవ్వంత కూడా రావట్లేదు. 50 00:04:13,962 --> 00:04:16,923 "వుడ్ స్టాక్ ఆశ్చర్యంతో చడీచప్పుడు కాకుండా ఇదంతా చూస్తూ ఉండింది, 51 00:04:17,007 --> 00:04:20,511 అప్పుడే శాంటా ఒక గెంతు గెంతి చిమ్నీ గుండా ఇంటి లోపలికి వెళ్లాలని చూస్తాడు. 52 00:05:13,021 --> 00:05:15,566 అతని కళ్లు... మిలమిలా మెరవసాగాయి! 53 00:05:15,649 --> 00:05:17,359 బుగ్గల్లో అతనికి ఉన్న సొట్టల సోయగాలను చూడతరమా! 54 00:05:17,943 --> 00:05:21,446 అతని బుగ్గలు గులాబీల వలె ఎరుపెక్కాయి, అతని ముక్కు ఎర్రని ద్రాక్ష వలె అందంగా ఉంది! 55 00:05:40,549 --> 00:05:44,178 అతనికి పెద్ద ముక్కు, గుండ్రటి బొజ్జ ఉన్నాయి, 56 00:05:44,261 --> 00:05:47,389 నవ్వినప్పుడు ఆ బొజ్జ అటూఇటూ ఊగసాగింది. 57 00:05:55,814 --> 00:05:59,193 ఒక్క మాట కూడా మాట్లాడకుండా పని మొదలుపెట్టింది. 58 00:06:00,611 --> 00:06:04,823 సాక్సులన్నింటినీ కానుకలతో నింపి చటుక్కున తిరిగింది. 59 00:06:09,786 --> 00:06:12,623 ఆ తర్వాత తన పాదాన్ని ముక్కుపై ఉంచి, 60 00:06:17,336 --> 00:06:20,255 సునాయాసంగా ఇంటి పైకి ఎగిరి దూసుకుపోయింది. 61 00:06:27,846 --> 00:06:29,890 వుడ్ స్టాక్ అతని అరుపును విన్నది, 62 00:06:29,973 --> 00:06:32,643 అతను ఎగురుతూ అలా అదృశ్యమైపోవడాన్ని చూస్తూ ఉండిపోయింది..." 63 00:06:34,937 --> 00:06:37,314 "'అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, 64 00:06:38,148 --> 00:06:40,484 ఇంకా శుభరాత్రి!'" 65 00:06:46,698 --> 00:06:50,202 నీ వంతు ప్రయత్నం నువ్వు చేశావు, అన్నయ్య. 66 00:06:51,453 --> 00:06:53,830 ఇప్పుడు నాకు ఎలా నిద్ర పడుతుంది? 67 00:06:55,290 --> 00:06:57,459 పాలు తాగితే నిద్రపడుతుందేమో. 68 00:06:57,543 --> 00:06:58,919 పాలు 69 00:07:06,051 --> 00:07:08,971 వచ్చాడు! శాంటా వచ్చాడు! 70 00:07:17,980 --> 00:07:20,357 ఇక మనకు అస్సలు నిద్ర పట్టదు! 71 00:07:32,160 --> 00:07:34,830 "ఇవ్వడంలోనే ఆనందం ఉంది." 72 00:07:39,084 --> 00:07:41,253 హాయ్, శాలీ. ఏం చేస్తున్నావు? 73 00:07:41,753 --> 00:07:43,547 శాంటాకి ఉత్తరం రాస్తున్నా. 74 00:07:44,047 --> 00:07:45,257 ఎందుకైనా మంచిదని, 75 00:07:45,340 --> 00:07:51,597 నేను దీన్ని బొమ్మలు, ఆట వస్తువులు, నన్ను ఆశ్చర్యపరిచేవి అంటూ విభజించాను. 76 00:07:54,183 --> 00:07:55,934 ఈ జాబితా చాలా పెద్దగా ఉందే. 77 00:07:56,018 --> 00:07:57,561 నేను చాలా మంచిగా ఉన్నాను. 78 00:07:59,646 --> 00:08:02,232 నేను మంచిగా ఉండనట్టు ఆధారమేదీ లేదు కూడా. 79 00:08:10,616 --> 00:08:12,451 అంతే. అయిపోయింది. 80 00:08:12,534 --> 00:08:16,246 ఒక మంచి అన్నయ్యలాగా నా కోసం దీన్ని పోస్ట్ చేస్తావా? 81 00:08:34,097 --> 00:08:35,390 బాగున్నావు, శాంటా. 82 00:08:35,474 --> 00:08:38,393 నేను అడిగిన బండిని తప్పకుండా ఇవ్వాలి. 83 00:08:38,477 --> 00:08:41,813 నాకు బేస్ బాల్ బ్యాట్ కావాలి. చెక్కదైనా, అల్యుమీనియమ్ దైనా పర్లేదు. 84 00:08:43,565 --> 00:08:45,192 నాకొక బొమ్మ రాకెట్ కావాలి. 85 00:08:45,275 --> 00:08:46,985 నాకు చేపలను పట్టే వల కావాలి. 86 00:08:47,069 --> 00:08:48,237 నాకు ఒక కొత్త పుస్తకం కావాలి. 87 00:08:48,320 --> 00:08:50,572 -నాకు మంచి ఎరువు కావాలి. -నాకు ఒక పెద్ద పియానో కావాలి. 88 00:08:50,656 --> 00:08:52,032 నాకు ఒక కొత్త పుస్తకాల అర కూడా కావాలి. 89 00:08:52,115 --> 00:08:54,243 నాకు ప్రపంచ శాంతి కావాలి, లేదంటే కొత్త స్వెటర్ అయినా పర్లేదు. 90 00:08:55,035 --> 00:08:59,039 ఎక్కడ చూసినా రెండు పదాలు మాత్రమే వినిపిస్తున్నాయి. 91 00:08:59,706 --> 00:09:02,876 అవి "క్రిస్మస్ శుభాకాంక్షలు" కాదు, "హ్యాపీ హాలిడేస్" కాదు, 92 00:09:02,960 --> 00:09:06,046 "నాకు కావాలి. నాకు కావాలి," ఇవే. 93 00:09:09,967 --> 00:09:12,803 నువ్వు కూడా శాంటాకి ఉత్తరం రాస్తున్నావు కదా! 94 00:09:13,929 --> 00:09:19,893 "బంగారు కంచం, మోటర్ సైకిల్, ఒలింపిక్స్ లో ఉండేంత పెద్ద స్విమ్మింగ్ పూల్." 95 00:09:19,977 --> 00:09:22,145 ఇవన్నీ దక్కుతాయని నిజంగానే అనుకుంటున్నావా? 96 00:09:24,940 --> 00:09:28,610 అవును, నువ్వు మంచి కుక్కవే, కానీ నువ్వు పుచ్చుకోవడం కన్నా 97 00:09:28,694 --> 00:09:31,572 ఇవ్వడం గురించి ఆలోచిస్తే మంచిదేమో? 98 00:09:35,492 --> 00:09:37,911 అది నాకు అనిపించిన విషయం అనుకో. 99 00:09:38,829 --> 00:09:41,748 నిజానికి, నేను అదే చేస్తాను. 100 00:09:42,416 --> 00:09:44,960 నేను ఏం ఇవ్వాలి అనే దాని గురించి ఆలోచించాలంతే. 101 00:09:45,043 --> 00:09:48,422 అది పెద్ద కానుక అవ్వనక్కర్లేదు, చిన్నదైనా మనస్ఫూర్తిగా ఇస్తే సరిపోతుంది. 102 00:09:49,173 --> 00:09:51,925 ఇది అత్యద్భుతమైన క్రిస్మస్ కాబోతోంది. 103 00:09:57,723 --> 00:09:58,932 ఏం ఇవ్వాలబ్బా? 104 00:09:59,725 --> 00:10:01,852 గ్రీటింగ్ కార్డులు? వద్దులే. 105 00:10:02,477 --> 00:10:04,688 కవిత? వద్దులే. 106 00:10:05,272 --> 00:10:06,773 ఫ్రూట్ కేక్? వద్దు. 107 00:10:08,317 --> 00:10:09,985 ఇది అనుకున్నంత సులువైన విషయం కాదు. 108 00:10:17,034 --> 00:10:19,828 బొమ్మలు చేయడానికి వాడే కాగితం? బంక? 109 00:10:20,996 --> 00:10:21,997 అర్థమైంది. 110 00:10:22,080 --> 00:10:25,751 మన మిత్రులందరికీ తలా ఒక కళాకృతిని చేసిద్దాం. 111 00:10:25,834 --> 00:10:27,294 సూపర్ ఐడియా, స్నూపీ. 112 00:10:40,766 --> 00:10:41,934 బంకతో చాలా జాగ్రత్తగా చేయాలి. 113 00:10:42,601 --> 00:10:47,022 కానీ కాస్తంత కష్టపడితే, మనం ఒక ప్రత్యేకమైన దాన్ని చేయవచ్చు. 114 00:10:48,649 --> 00:10:49,691 ఇది మగ్. 115 00:10:52,194 --> 00:10:54,571 దీనికి హ్యాండిల్ లేకపోయినా పర్వాలేదులే. 116 00:10:54,655 --> 00:10:57,449 ఇది చాలా మంచి ఐడియా. ఇక పని మొదలుపెడదాం. 117 00:11:18,971 --> 00:11:20,639 ఆఖరిది కూడా పెట్టేశా. 118 00:11:20,722 --> 00:11:23,934 నేను దీన్ని "హృదయం నుండి ఉదయించిన కళ" అంటాను. 119 00:11:27,104 --> 00:11:28,105 అదీ, అలా ఉండాలి. 120 00:11:30,107 --> 00:11:33,569 ఇదుగో. మేము అడిగిన వాటిని తప్పకుండా తెచ్చివ్వాలి, శాంటా. 121 00:11:34,778 --> 00:11:36,196 వచ్చేస్తున్నామొహో! 122 00:11:41,535 --> 00:11:45,664 క్రిస్మస్ శుభాకాంక్షలు, పెప్పెర్మింట్ ప్యాటీ. దీన్ని నీ కోసమే ప్రత్యేకంగా చేశాను. 123 00:11:51,545 --> 00:11:52,629 థ్యాంక్స్, చక్. 124 00:11:52,713 --> 00:11:54,131 మరేం పర్వాలేదు. 125 00:11:57,467 --> 00:11:59,553 హ్యాపీ హాలిడేస్, ఫ్రాంక్లిన్. 126 00:12:00,220 --> 00:12:02,347 వావ్. థ్యాంక్స్, చార్లీ బ్రౌన్. 127 00:12:06,185 --> 00:12:08,604 ఇదేంటి? పేపర్ వెయిట్ ఆ? 128 00:12:08,687 --> 00:12:12,232 ఏమో మరి. నాది బేస్ బాల్ హోల్డర్ యే, కదా? 129 00:12:15,319 --> 00:12:18,113 థ్యాంక్స్, చార్ల్స్. నాకు ఉపయోగపడేదే ఇచ్చావు. 130 00:12:18,197 --> 00:12:20,824 అవును, థ్యాంక్స్, చార్లీ బ్రౌన్. 131 00:12:20,908 --> 00:12:25,162 ఇది నా సేకరణకి సరిగ్గా సరిపోతుంది. 132 00:12:25,245 --> 00:12:27,497 అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు! 133 00:12:30,459 --> 00:12:32,544 బహుశా ఇది వాన నీటిని పట్టుకోవడానికేమో? 134 00:12:32,628 --> 00:12:35,130 నాది తలుపులకు పెట్టే డోర్ స్టాప్ ఏమో. 135 00:12:35,881 --> 00:12:38,509 ఇది "హృదయం నుండి ఉదయించిన కళ". 136 00:12:40,427 --> 00:12:41,678 నా కానుకకి రంధ్రం ఉంది. 137 00:12:42,262 --> 00:12:43,263 అవును. 138 00:12:43,847 --> 00:12:47,643 థ్యాంక్యూ, చార్లీ బ్రౌన్. ఇది బుర్రకు పదును పెడుతోంది. 139 00:12:47,726 --> 00:12:50,479 పర్లేదు, లైనస్. క్రిస్మస్ శుభాకాంక్షలు! 140 00:12:52,814 --> 00:12:56,443 నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఇస్తుంటే చాలా సంతృప్తిగా అనిపిస్తోంది. 141 00:12:56,944 --> 00:13:00,906 "హృదయం నుండి ఉదయించిన కళ" అట. బుర్రకు బరువు అని పెట్టుంటే సరిగ్గా ఉండేది. 142 00:13:00,989 --> 00:13:06,954 నాకు అర్థం కావట్లేదు. ఏంటిది? ఇది ఆట వస్తువు కాదు. దీనితో ఎలా ఆడాలి! 143 00:13:07,037 --> 00:13:08,580 నీ కానుకకి రంధ్రం కూడా ఉంది. 144 00:13:09,081 --> 00:13:12,042 చార్లీ బ్రౌన్ ఈ పనికిమాలిన వాటిని మనకి ఇవ్వడం దేనికి? 145 00:13:21,927 --> 00:13:23,512 ఏమైంది నీకు? 146 00:13:27,516 --> 00:13:28,642 అతనికి నా మాటలు వినిపించాయా? 147 00:13:30,477 --> 00:13:32,104 అసలు ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. 148 00:13:35,440 --> 00:13:36,775 ఒక్క నిమిషం. 149 00:13:42,531 --> 00:13:44,157 నాకు ఓ ఐడియా తట్టింది. 150 00:13:46,159 --> 00:13:48,954 నా ప్లాన్ చండాలంగా ఉందేమో. 151 00:13:52,791 --> 00:13:53,792 అబ్బా. 152 00:14:07,139 --> 00:14:11,226 నీ హృదయం నుండి ఉదయించిన కళ మాకు చాలా బాగా నచ్చింది. చాలా క్రియేటివ్ గా ఉంది. 153 00:14:11,894 --> 00:14:12,978 నిజంగానా? 154 00:14:21,778 --> 00:14:24,948 క్రిస్మస్ శుభాకాంక్షలు, చార్లీ బ్రౌన్! 155 00:14:39,129 --> 00:14:42,716 ఆనందం అనేది... ఇవ్వడంలోనే ఉంది 156 00:14:47,221 --> 00:14:49,264 "అప్పుడే తెరవవద్దు." 157 00:14:59,107 --> 00:15:02,361 శాంటా నీ ఇంటిని చాలా తేలిగ్గా కనిపెట్టేలా అలంకరించావుగా. 158 00:15:08,867 --> 00:15:11,078 ఇదుగో, ఇది నీకు ఇప్పుడే వచ్చింది. 159 00:15:11,161 --> 00:15:14,414 కానీ "క్రిస్మస్ వచ్చేదాకా తెరవవద్దు," అని దీనిపై రాసుంది. 160 00:15:14,498 --> 00:15:16,750 కాబట్టి నువ్వు ఈ రాత్రికి ఆగి... 161 00:15:20,170 --> 00:15:21,880 ఇప్పుడే తెరిచేశావా! 162 00:15:26,969 --> 00:15:30,472 దీని మీద కూడా క్రిస్మస్ వచ్చేదాకా తెరవవద్దు అని... 163 00:15:40,649 --> 00:15:44,319 స్నూపీ, రేపే క్రిస్మస్ అని నీకు చాలా ఉత్సాహంగా ఉందని నాకు తెలుసు. 164 00:15:45,445 --> 00:15:47,906 కానీ నీ కానుకలన్నింటినీ ఇప్పుడే తెరిచేస్తే, 165 00:15:47,990 --> 00:15:50,826 క్రిస్మస్ పండుగ రోజు ఉదయాన నువ్వు తెరవడానికి ఏ కానుకలూ ఉండవు. 166 00:15:52,619 --> 00:15:55,831 కానీ మంచి విషయం ఏంటంటే, నీ కోసం ఇంకో కానుక ఉంది. 167 00:15:55,914 --> 00:15:57,875 ఇది నేను నీకు ఇచ్చే కానుక. 168 00:15:58,500 --> 00:16:01,795 ఆగు. దీన్ని ఇంట్లో పెడతాను. 169 00:16:01,879 --> 00:16:04,464 రేపు తెరవడానికి నీకు కనీసం ఒక్క కానుక అయినా ఉండాలి. 170 00:16:12,431 --> 00:16:15,934 స్నూపీ కానుకని, దానికి కనబడకుండా ఎక్కడ దాచాలి? 171 00:16:22,524 --> 00:16:23,525 లేదు. 172 00:16:27,196 --> 00:16:28,488 లేదు. 173 00:16:31,617 --> 00:16:32,868 సూపర్. 174 00:16:35,078 --> 00:16:37,623 ఆ కానుక నాదేనా, అన్నయ్యా? 175 00:16:37,706 --> 00:16:41,084 అది స్నూపీ కానుక. అది అన్ని కానుకలను ఇప్పుడే తెరిచేస్తోంది. 176 00:16:41,168 --> 00:16:45,339 కొన్ని కానుకలను సరైన సమయంలో తెరిస్తేనే బాగుంటుందని దానికి అర్థమయ్యేలా చేద్దామనుకుంటున్నా. 177 00:16:47,799 --> 00:16:52,346 అయితే బట్టల అరలో దాచవద్దు. నేనైతే ముందు అక్కడే వెతుకుతాను. 178 00:16:55,933 --> 00:16:57,100 ఇదెలా ఉంది? 179 00:16:57,184 --> 00:16:58,644 నేను యిట్టె కనిపెట్టేస్తాను. 180 00:17:07,277 --> 00:17:12,156 ఇదేంటో చూద్దాం. సూజీ స్నూజీ స్లీప్ మాస్క్. 181 00:17:13,867 --> 00:17:19,248 సూజీ స్నూజీ ఫ్లానెల్ బాత్ రోబ్... నీలం రంగుది, అంచులేమో వంగపండు రంగులో ఉంటాయి. 182 00:17:19,748 --> 00:17:21,541 కానీ నా... 183 00:17:21,625 --> 00:17:25,295 -అమ్మా. -సూజీ స్నూజీ! 184 00:17:26,421 --> 00:17:29,591 కొన్ని కానుకలను సరైన సమయంలో తెరిస్తేనే బాగుంటుంది. 185 00:17:30,467 --> 00:17:31,718 నేను ఇప్పుడే తెరవకూడదు. 186 00:17:31,802 --> 00:17:34,555 రేపు ఉదయం కలుద్దాం, సూజీ స్నూజీ. 187 00:17:34,638 --> 00:17:36,139 అమ్మా. 188 00:18:53,342 --> 00:18:54,676 అమ్మా. 189 00:18:56,386 --> 00:18:59,848 అమ్మా. అమ్మా. అమ్మా. 190 00:19:01,099 --> 00:19:02,518 అమ్మా. 191 00:20:01,201 --> 00:20:04,746 మనం గెలిచాం. ఇది మహాద్భుతమైన విషయం. 192 00:20:39,072 --> 00:20:42,034 ఆ కానుకని తెరవడానికి నీకు ఎంత ఆరాటంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. 193 00:20:42,117 --> 00:20:46,038 నేను కూడా నీలాగే ఉండేదాన్ని. కానీ మా అన్నయ్య ఏమన్నాడంటే... 194 00:20:46,121 --> 00:20:48,332 నీ కానుకలన్నింటినీ ఇప్పుడే తెరిచేస్తే, 195 00:20:48,415 --> 00:20:51,001 క్రిస్మస్ పండుగ రోజు ఉదయాన నువ్వు తెరవడానికి ఏ కానుకలూ ఉండవు. 196 00:20:52,085 --> 00:20:55,631 కూర్చో. తెల్లవారే దాకా ఇద్దరం కలిసి ఇక్కడ వేచి చూద్దాం. 197 00:21:01,136 --> 00:21:02,721 క్రిస్మస్ శుభాకాంక్షలు! 198 00:21:02,804 --> 00:21:05,307 నువ్వు నీ కానుకను కనిపెట్టేశావని అర్థమైంది, స్నూపీ. 199 00:21:05,390 --> 00:21:06,808 కానీ తెరవకుండా ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది. 200 00:21:06,892 --> 00:21:09,520 నువ్వు ఇప్పుడు తెరుచుకోవచ్చు. నీకు నచ్చుతుందనే ఆశిస్తున్నాను. 201 00:21:20,072 --> 00:21:22,950 అసలు ఏంటి ఆ కానుక? 202 00:21:23,033 --> 00:21:27,788 అది ఒక పెట్టె, అందులో ఇంకో పెట్టె ఉంటుంది, అందులో ఇంకో పెట్టె ఉంటుంది, అందులో మరో పెట్టె... 203 00:21:27,871 --> 00:21:29,915 సరే. నాకు అర్థమైందిలే. 204 00:21:29,998 --> 00:21:33,168 స్నూపీకి అన్నిటికన్నా కానుకలను తెరవడమంటేనే ఇష్టం. 205 00:21:33,252 --> 00:21:35,170 లోపల ఏముందనేది ముఖ్యం కాదు. 206 00:21:37,381 --> 00:21:39,299 క్రిస్మస్ శుభాకాంక్షలు, మిత్రమా. 207 00:21:41,260 --> 00:21:43,303 -నాకు తెలుసు. -అమ్మా. 208 00:21:43,387 --> 00:21:45,472 ఇప్పటి దాకా ఆగడం మంచి పనే అయినట్టుగా అనిపిస్తోంది. 209 00:21:45,556 --> 00:21:47,933 ఇంతకీ నాకు ఏ కానుక వచ్చిందో ఏమో. 210 00:21:52,062 --> 00:21:53,063 ఆగు! 211 00:21:55,524 --> 00:21:56,942 ఆగు! 212 00:21:59,361 --> 00:22:00,362 చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా రూపొందించబడింది 213 00:22:24,303 --> 00:22:26,305 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య