1 00:00:21,772 --> 00:00:24,316 "నా గర్వాన్ని అణచావు." 2 00:00:26,485 --> 00:00:30,572 గెలవడానికి నువ్వు చేయాల్సిందల్లా ఈ బంతిని గోల్ పోస్ట్ గుండా కొట్టడమే. 3 00:00:30,656 --> 00:00:35,327 ప్రతీసారి బంతిని సరిగ్గా కొట్టే సమయానికి తీసేస్తావు కదా, ఇప్పుడు తీయవని గ్యారంటీ ఏంటి? 4 00:00:36,537 --> 00:00:39,665 జట్టు అంతా కలిసి పని చేయాలి, చార్లీ బ్రౌన్! 5 00:00:39,748 --> 00:00:41,375 ఆడాలి! కసి తీరా పోరాడాలి! గెలవాలి! 6 00:00:42,751 --> 00:00:44,002 నిజమే, లూసీ. 7 00:00:50,008 --> 00:00:50,926 ఢమాల్! 8 00:00:51,426 --> 00:00:53,470 కానీ మనిద్దరిదీ ఒకే జట్టు కాదు కదా. 9 00:00:56,473 --> 00:00:59,810 హాయ్, చార్లీ బ్రౌన్, ఇంకో మూడు రోజుల్లో 10 00:00:59,893 --> 00:01:03,522 సంగీత రంగ పితామహుడు అయిన బీథోవెన్ జయంతి రానుందని నీకు గుర్తు చేయడానికి వచ్చాను. 11 00:01:06,567 --> 00:01:07,734 ఆ సమాచారాన్ని తెలిపినందుకు థ్యాంక్స్. 12 00:01:09,027 --> 00:01:11,196 మిస్ ఓత్మర్, దానికి సమాధానం రెండు, 13 00:01:11,280 --> 00:01:15,075 గమ్మత్తైన విషయం ఏంటంటే, బీథోవెన జయంతికి కూడా రెండే రోజులు ఉన్నాయి. 14 00:01:15,617 --> 00:01:19,872 వినండి, వినండి, రేపే బీథోవెన్ పుట్టినరోజు. 15 00:01:21,206 --> 00:01:22,791 కాలం ఏంటి గిర్రున తిరిగిపోతుంది? 16 00:01:30,090 --> 00:01:33,927 హ్యాపీ బర్త్ డే, బీథోవెన్. ఇవాళ నీ జయంతి. 17 00:02:00,537 --> 00:02:01,538 స్నూపీ. 18 00:02:02,581 --> 00:02:05,334 ఇవాళ బీథోవెన్ జయంతి అని నీకు తెలుసా? 19 00:02:11,089 --> 00:02:12,674 ఆ గోల ఆపు! 20 00:02:14,801 --> 00:02:19,348 నాకు కూడా ఈయన జయంతి సందర్భంగా ఒక పార్టీ ఇవ్వాలనే ఐడియా నచ్చింది. 21 00:02:19,932 --> 00:02:23,685 ఎట్టకేలకు, నీ గొప్పతనాన్ని స్మరించుకొనే అవకాశం అందరికీ లభించబోతోంది. 22 00:02:25,062 --> 00:02:26,063 అలా కాదు! 23 00:02:26,146 --> 00:02:28,565 బీథోవేన్ చాలా గొప్ప సంగీతకారుడు. 24 00:02:28,649 --> 00:02:31,360 పార్టీ కూడా అందుకు తగ్గట్టుగా పద్ధతిగా, హూందాగా ఉండాలి. 25 00:02:37,616 --> 00:02:38,617 ఇది పర్వాలేదు. 26 00:02:38,700 --> 00:02:40,953 పార్టీ గురించి అందరికీ నువ్వు చెప్పు, 27 00:02:41,036 --> 00:02:43,497 అలంకరణలు, భోజనాల సంగతి నేను చూసుకుంటాను. 28 00:02:46,500 --> 00:02:47,918 నీకు తలవంపులు తీసుకురాను. 29 00:02:52,798 --> 00:02:54,383 బీథోవెన్ కోసం పార్టీయా? 30 00:02:54,967 --> 00:02:56,677 నాకు అప్పుడు వేరే పని ఉంది. 31 00:02:58,178 --> 00:02:59,513 ష్రోయడర్ ఇంట్లోనా? 32 00:02:59,596 --> 00:03:01,682 ఆ ముక్క ముందే చెప్పవచ్చు కదా? 33 00:03:01,765 --> 00:03:03,058 కేక్ ఉంటుంది కదా? 34 00:03:03,934 --> 00:03:05,310 డాన్స్ చేయవచ్చు కదా? 35 00:03:05,394 --> 00:03:07,437 చుప్ చాప్ గా ఒక మూలన కూర్చోవచ్చు కదా? 36 00:03:07,521 --> 00:03:10,232 పార్టీలో బీథోవెన్ ఉంటాడా? 37 00:03:10,315 --> 00:03:13,944 శాలీ, బీథోవెన్ 1770లలో పుట్టాడు. 38 00:03:14,695 --> 00:03:17,197 బాబోయ్, ముసలివాళ్ల పార్టీలు సోదిగా ఉంటాయి. 39 00:03:18,407 --> 00:03:21,410 ష్రోయడర్ ఇంట్లో పార్టీ జరగబోతుందని నేను విన్నది నిజమేనా? 40 00:03:34,006 --> 00:03:36,758 హేయ్, స్నూపీ. పార్టీ గురించి అందరికీ చెప్పావా? 41 00:03:38,510 --> 00:03:39,511 మంచిది. 42 00:03:39,595 --> 00:03:43,557 మిగతా అలంకరణల సంగతి నువ్వు చూసుకుంటావా, ఈలోపు నేను భోజనం సంగతి చూసుకుంటాను. 43 00:03:52,566 --> 00:03:55,819 ఆ నోట్స్ షీట్ ని తాకావో, మటాష్ అయిపోతావు! 44 00:03:57,863 --> 00:04:01,575 దీన్ని అరలో ఉంచితేనే మంచిదేమో. 45 00:04:34,775 --> 00:04:36,777 అంతా బాగానే ఉంది కదా? 46 00:04:59,550 --> 00:05:00,634 మేము వచ్చేశాం. 47 00:05:00,717 --> 00:05:02,678 -కేక్, కేక్, కేక్. -పండగ చేసుకుందాం! 48 00:05:02,761 --> 00:05:04,680 డాన్స్ ఫ్లోర్ ఎక్కడ? 49 00:05:05,973 --> 00:05:10,018 మిరపకాయ బజ్జీలు రుచికరంగా ఉండాలంటే ఉల్లిపాయలు వేసి నిమ్మరసాన్ని పిండాలి. 50 00:05:10,102 --> 00:05:12,104 స్నూపీ, అతిథులు వచ్చేశారా? 51 00:05:13,355 --> 00:05:16,358 గుర్తుంచుకో, ఈ పుట్టినరోజు పార్టీ పద్ధతిగా, హూందాగా ఉండటం 52 00:05:16,441 --> 00:05:17,818 చాలా అంటే చాలా ముఖ్యం. 53 00:05:23,365 --> 00:05:25,325 అబ్బా! ఏంటా చెత్త సౌండ్? 54 00:05:35,127 --> 00:05:38,797 దారుణం! ఆ మహా సంగీతకారునికి ఇది అస్సలు నచ్చదు. 55 00:05:38,881 --> 00:05:42,301 పార్టీ అదిరింది, ష్రోయడర్. నాకు స్నూపీ ఏం చేసి ఇచ్చిందో చూడు. 56 00:05:48,599 --> 00:05:50,058 వాటితో పార్టీ టోపీలు చేయకూడదు. 57 00:05:50,601 --> 00:05:53,103 కానీ వాటితో అదిరే పార్టీ డ్రెస్ తయారైంది. 58 00:05:57,691 --> 00:05:58,817 ఇక చాలు! 59 00:06:00,652 --> 00:06:02,738 డాన్స్? సరదా? 60 00:06:02,821 --> 00:06:05,157 పార్టీ టోపీలు! కేక్? 61 00:06:06,325 --> 00:06:07,951 దీన్ని ఇంటి నుండి తెచ్చాను. 62 00:06:08,911 --> 00:06:10,829 బీథోవెన్ కి గౌరవం ఇవ్వాలి. 63 00:06:10,913 --> 00:06:14,416 ఒక సంగీత పితామహుడిని, తన జయంతి సందర్భంగా గౌరవించే పద్దతి ఇది కాదు. 64 00:06:14,499 --> 00:06:18,629 ఆ సంగీత పితామహుడికి ఇది బాగా నచ్చుతుందని అనిపిస్తోంది. 65 00:06:39,107 --> 00:06:41,818 బీథోవెన్ పుట్టినరోజు దరిద్రంగా గడిచింది. 66 00:06:41,902 --> 00:06:43,403 బీథోవెన్ ని నేను ఆరాధించినట్టుగా 67 00:06:43,487 --> 00:06:46,281 ఇంకెవరూ ఆరాధించరు అనే విషయాన్ని నేను గ్రహించి ఉండాల్సింది. 68 00:07:05,634 --> 00:07:07,344 ఎలా ఉంది, ష్రోయడర్? 69 00:07:08,637 --> 00:07:11,181 శృతి అయితే తప్పింది. 70 00:07:11,265 --> 00:07:13,058 బీథోవెన్ దీన్ని మెచ్చుకుంటాడా? 71 00:07:13,892 --> 00:07:17,312 ఆయన సంగతి తెలీదు కానీ, నేను అయితే తప్పకుండా మెచ్చుకుంటాను. 72 00:07:31,952 --> 00:07:34,079 "దోబూచులాట." 73 00:09:01,333 --> 00:09:03,961 హలో, చిట్టి పిట్టా. ఎలా ఉన్నావు? 74 00:09:04,044 --> 00:09:04,878 ష్. 75 00:09:04,962 --> 00:09:06,839 ఎవరితో మాట్లాడుతున్నావు? 76 00:09:08,298 --> 00:09:11,218 అబ్బా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మనం జంతువులతో మాట్లాడకూడదు! 77 00:09:14,847 --> 00:09:15,889 ఇక లోపలికి రా. 78 00:09:15,973 --> 00:09:18,058 ఇంటిని శుభ్రపరచడంలో నువ్వు కూడా చేయి వేయాలని అమ్మ అంది. 79 00:09:18,141 --> 00:09:20,227 ఇళ్ళంతా రిరన్ బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. 80 00:09:21,937 --> 00:09:23,814 ఈరోజును కులాసాగా గడువు, చిట్టి పిట్టా. 81 00:10:05,939 --> 00:10:08,108 లైనస్, ఆ గోల ఆపు! 82 00:10:08,192 --> 00:10:09,651 నేనేమీ చేయట్లేదు! 83 00:10:09,735 --> 00:10:11,570 అయితే డ్రమ్ములను ఇంకెవరు వాయిస్తున్నారు? 84 00:10:13,780 --> 00:10:15,490 అదంతా నా భ్రమ అయ్యుంటుంది. 85 00:10:43,143 --> 00:10:44,228 వస్తున్నా. 86 00:10:46,438 --> 00:10:47,856 ఏం కావాలి నీకు? 87 00:10:58,700 --> 00:11:00,994 లేదు, నాకు డమ్ చరాడ్స్ ఆడాలని లేదు. 88 00:11:01,078 --> 00:11:03,080 నాకు ఆడాలని ఉంది. కానివ్వు. 89 00:11:05,499 --> 00:11:06,625 విమానమా? 90 00:11:08,961 --> 00:11:10,212 హార్మనీ! 91 00:11:10,295 --> 00:11:11,797 ఇక దొబ్బేయ్! 92 00:11:48,709 --> 00:11:49,710 మేకపోతా? 93 00:11:50,752 --> 00:11:51,753 గొర్రెనా? 94 00:11:52,504 --> 00:11:53,505 లైనస్! 95 00:11:53,589 --> 00:11:57,593 ఆ పిచ్చి కుక్కతో ఆటలు ఆడటం మానేయ్. వెళ్లి నీ పక్క సర్దుకో. 96 00:12:14,234 --> 00:12:16,695 లైనస్! నువ్వు శుభ్రపరచకుండా ఏం చేస్తున్నావు? 97 00:12:16,778 --> 00:12:18,280 నేను శుభ్రపరుస్తున్నాను. 98 00:12:20,115 --> 00:12:22,075 అయితే టీవీ ఎవరు చూస్తున్నారు? 99 00:12:24,328 --> 00:12:26,330 ప్రకృతి డాక్యుమెంటరీలంటే నాకు చాలా ఇష్టం. 100 00:12:29,041 --> 00:12:32,461 ఇప్పుడు ఎవరబ్బా? ఆ పిచ్చి కుక్క కాకపోతే బాగుండు! 101 00:12:40,385 --> 00:12:42,846 డమ్ చరాడ్స్ ని అలా ఆడకూడదు. 102 00:12:42,930 --> 00:12:45,265 ఫోటోలు వాడకూడదు. అది మోసం! 103 00:13:28,976 --> 00:13:31,103 ఏంటి ఈ గోల అంతా? 104 00:13:32,271 --> 00:13:33,272 అడవి పక్షి! 105 00:13:33,355 --> 00:13:35,774 అగ్నిమాపక శాఖకు కాల్ చేయండి! మీడియాని పిలవండి! 106 00:13:35,858 --> 00:13:37,150 ఇంటి తలుపులన్నీ మూసివేయండి! 107 00:13:41,947 --> 00:13:43,365 బై బై, చిట్టి పిట్టా. 108 00:13:46,952 --> 00:13:48,620 ఎంత అందమైన పక్షి! 109 00:13:51,039 --> 00:13:54,376 అడవి జంతువుల క్రిములు. షూ, షూ! 110 00:14:22,404 --> 00:14:25,157 లైనస్, ఛానెల్స్ మార్చకు! 111 00:14:25,240 --> 00:14:26,783 నేను మార్చట్లేదు! 112 00:14:29,912 --> 00:14:31,121 రిమోట్ ఏది? 113 00:14:42,716 --> 00:14:44,760 "మహారాజా స్నూపీ." 114 00:14:47,429 --> 00:14:51,767 లైనస్, ఇవాళ జాతీయ శునక స్మారక దినోత్సవం అని నీకు తెలుసా? 115 00:14:51,850 --> 00:14:55,270 ఇవాళేనా? ఇలాంటివన్నీ నాకు ఎప్పుడూ గుర్తే ఉండవు. 116 00:14:55,896 --> 00:14:57,898 ఈ విషయం స్నూపీకి తెలుసో లేదో. 117 00:15:08,033 --> 00:15:09,993 దానికి తెలిసే ఉంటుంది అని నాకు అనిపిస్తోంది. 118 00:15:18,794 --> 00:15:21,797 శునక స్మారక దినోత్సవం శుభాకాంక్షలు, మిత్రమా. 119 00:15:21,880 --> 00:15:25,175 ఈ సందర్భంగా నీ గిన్నెలో ఆహారం కాస్త ఎక్కువగా వేశాను. 120 00:15:25,259 --> 00:15:26,510 నీకు నచ్చుతుందనే ఆశిస్తున్నాను. 121 00:15:35,853 --> 00:15:39,064 నీ కోరిక సమంజసమైనదే. ఇవాళ నీకు మహారాజులకి ఇచ్చే ఆహారం ఇవ్వాలి. 122 00:15:40,148 --> 00:15:41,525 దీనికి కాస్త సమయం పట్టవచ్చు. 123 00:15:56,915 --> 00:16:00,502 అప్పుడే శునక స్మారక దినోత్సవం వచ్చేసిందా? 124 00:16:00,586 --> 00:16:04,381 మీ కిరీటంతో మీలో రాచరికపు తేజస్సు ఉట్టిపడుతోంది. 125 00:16:04,464 --> 00:16:08,385 మీ రాజదండంగా నా పారని స్వీకరించండి. 126 00:16:15,601 --> 00:16:18,061 మహారాజా స్నూపీకి జయహో. 127 00:16:22,691 --> 00:16:25,110 రాచరికపు శునకమంటే అలా ఉండాలి. 128 00:16:36,455 --> 00:16:37,748 ఏంటి ఇది? 129 00:16:37,831 --> 00:16:41,335 ఇది మహారాజా స్నూపీ గారి ఆదేశం. 130 00:16:41,418 --> 00:16:47,382 నీ దుప్పటిని అది రాజవేషంగా ఉపయోగించాలని భావిస్తోంది. 131 00:16:47,466 --> 00:16:50,969 తొక్కేం కాదు. నా దుప్పటిని నేను ఇవ్వను. 132 00:16:58,310 --> 00:17:00,270 మీ మహారాజు మీకు ధన్యవాదాలు చెప్తున్నారు. 133 00:17:01,396 --> 00:17:05,150 రాచరికపు వ్యవస్థలతో, నియంతలతో సమస్య ఇదే. 134 00:17:07,444 --> 00:17:08,654 మానసిక సమస్యలకు సహాయం అయిదు సెంట్లు 135 00:17:08,737 --> 00:17:11,156 ఆగండి, ఆగండి! ఏంటి ఈ హడావిడి? 136 00:17:11,240 --> 00:17:13,700 ఇది మహారాజు గారి ఊరేగింపు. 137 00:17:13,784 --> 00:17:17,663 మేము మహారాజా స్నూపీతో ఈ శివారు ప్రాంతంలో పర్యటిస్తున్నాం. 138 00:17:17,746 --> 00:17:21,875 నువ్వు గోల చేస్తూ, నా వ్యాపారానికి ఆటంకం కలిగిస్తున్నావు. 139 00:17:21,959 --> 00:17:23,877 కవాతుకు అనుమతి తీసుకున్నావా అసలు? 140 00:17:24,377 --> 00:17:27,673 అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని నాకు తెలీదు. 141 00:17:27,756 --> 00:17:28,799 అనుమతి తప్పనిసరి. 142 00:17:31,760 --> 00:17:33,220 ఈ పార సంగతేంటి? 143 00:17:37,266 --> 00:17:39,434 ఆపు! నువ్వేమీ రాజువి కాదు! 144 00:17:39,518 --> 00:17:40,978 ఇంతకీ నీ సింహాసనం ఏది? 145 00:17:41,061 --> 00:17:43,355 రాజువి అయితే, సింహాసనం ఉండాలి కదా. 146 00:17:51,613 --> 00:17:52,823 రాజు ఊరేగింపు అంట. 147 00:17:52,906 --> 00:17:54,908 తలనొప్పి తప్ప ఇంకేమీ లేదు. 148 00:17:57,160 --> 00:17:59,663 దీనికి ఫలితం అనుభవిస్తావు. 149 00:18:29,818 --> 00:18:32,654 మహారాజా స్నూపీకి, 150 00:18:32,738 --> 00:18:35,574 మీ భోజనం తయార్. 151 00:18:38,785 --> 00:18:41,246 కరివేపాకులతో అలంకరించాను. 152 00:18:48,629 --> 00:18:51,882 చార్లీ బ్రౌన్, నీ కుక్క చాలా అతి చేస్తోంది. 153 00:18:51,965 --> 00:18:53,217 ఒకసారి దాన్ని చూడు. 154 00:19:03,101 --> 00:19:07,147 అది కాస్త అతి చేస్తోందని నాకు తెలుసు, కానీ ఇవాళ శునక స్మారక దినోత్సవం. 155 00:19:07,856 --> 00:19:09,441 లూసీ అన్నది నిజమే, చార్లీ బ్రౌన్. 156 00:19:09,525 --> 00:19:12,152 ఇదంతా స్నూపీ బాగా తలకి ఎక్కించుకుంది అనుకుంటా. 157 00:19:27,209 --> 00:19:29,753 ఈ పిచ్ అయ్యాక నేను దానితో మాట్లాడతాను. 158 00:19:47,563 --> 00:19:50,065 మహారాజా స్నూపీ జయహో! 159 00:19:54,152 --> 00:19:54,987 ఢమాల్! 160 00:20:01,952 --> 00:20:04,079 అక్కడ ఏం జరుగుతోంది అంటారు? 161 00:20:11,753 --> 00:20:16,967 నాకు అర్థమైనంత వరకు, ఎడమ ఫీల్డ్ లో తిరుగుబాటు మొదలైనట్టు ఉంది, సర్. 162 00:20:17,968 --> 00:20:23,182 స్నూపీ, శునక స్మారక దినోత్సవం అని నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నట్టున్నావు. 163 00:20:34,985 --> 00:20:36,612 నాకు పదోన్నతి లభించింది! 164 00:21:24,701 --> 00:21:29,289 అందరూ రాజాది రాజ, మహారాజ రిరన్ కి జేజేలు పలకండి. 165 00:21:30,874 --> 00:21:34,962 భోజనం తినడానికి అమ్మ నిన్ను రమ్మంటోంది, మహారాజు గారు. 166 00:21:37,130 --> 00:21:38,131 దుప్పటిని నేను తీసుకుంటా. 167 00:21:39,758 --> 00:21:43,762 ఎప్పుడు నెగ్గాలో కాదు, భోజనం చేయడానికి ఎప్పుడు ఇంటికి వెళ్లాలో తెలిసినవాడే మహారాజు. 168 00:21:46,890 --> 00:21:48,183 వస్తున్నా, అమ్మా! 169 00:21:50,519 --> 00:21:51,562 చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా రూపొందించబడింది 170 00:22:14,459 --> 00:22:16,461 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య 171 00:22:19,548 --> 00:22:20,549 థ్యాంక్యూ, స్పార్కీ. ఎల్లప్పుడూ మా హృదయాల్లోనే ఉంటావు.