1 00:00:21,897 --> 00:00:23,899 "బంగారు చిప్." 2 00:00:30,697 --> 00:00:35,494 సెకండ్ హాఫ్ లో తొమ్మిదవ ఇన్నింగ్స్ నడుస్తోంది. రెండు పాయింట్లు వెనుకంజలో ఉన్నాం, బేసులు నిండుగా ఉన్నాయి. 3 00:00:35,577 --> 00:00:39,665 ష్లబోట్నిక్ బాధ్యతగా, బంతిని కొట్టడానికి బ్యాట్ తో సిద్ధంగా ఉన్నాడు. 4 00:00:41,625 --> 00:00:42,960 బ్యాట్ ఊపాడు! 5 00:00:43,043 --> 00:00:44,253 మొదటి స్ట్రయిక్. 6 00:00:52,845 --> 00:00:54,972 కమాన్, జో. కమాన్. 7 00:00:55,973 --> 00:00:57,599 రెండవ స్ట్రయిక్. 8 00:00:57,683 --> 00:01:00,143 కమాన్, జో! నువ్వు కొట్టగలవు. 9 00:01:08,026 --> 00:01:09,820 మూడవ స్ట్రయిక్. 10 00:01:09,903 --> 00:01:11,989 తర్వాతి ఆట బాగా ఆడుదువులే, జో! 11 00:01:18,954 --> 00:01:22,833 స్నూపీ, నీకు చిప్స్ కావాలంటే నన్ను అడిగితే సరిపోతుంది కదా. 12 00:01:22,916 --> 00:01:25,169 ఇదుగో, ఈ ఆఖరి చిప్ ని తీసుకో. 13 00:01:29,089 --> 00:01:33,510 అయ్య బాబోయ్! ఈ చిప్ అచ్చం జో ష్లబోత్నిక్ లాగానే ఉందే. 14 00:01:36,305 --> 00:01:40,642 మైనర్ లీగులలో బ్యాట్ పట్టిన ఏకైక గొప్ప ఆటగాడు అతడే. 15 00:01:40,726 --> 00:01:45,272 ఒక గొప్ప బేస్ బాల్ ఆటగాడిలాగే ఉండే ఒక పొటాటో చిప్ దొరకడం అనేది 16 00:01:45,355 --> 00:01:47,524 చాలా చాలా అరుదు. 17 00:01:47,608 --> 00:01:49,651 ఈ విషయాన్ని నేను అందరికీ చెప్పాలి. 18 00:01:54,948 --> 00:01:59,203 లైనస్! లూసీ! నేను ఇప్పుడు ఏం కనిపెట్టానో చెప్తే అవాక్కవుతారు! 19 00:02:00,621 --> 00:02:05,876 పొటాటో చిప్. దీనికేనా న్యూటన్ లాగా ఏదో పెద్ద విషయం కనిపెట్టినట్టు బిల్డప్ ఇస్తున్నావు! 20 00:02:07,127 --> 00:02:08,753 కానీ ఇది చూడటానికి ఎలా ఉందో చెప్పండి. 21 00:02:11,548 --> 00:02:13,509 నాకు అయితే ఇటలీలా అనిపిస్తోంది. 22 00:02:13,592 --> 00:02:15,594 నాకు అది ఒక షూలాగా అనిపిస్తోంది. 23 00:02:17,137 --> 00:02:18,430 ఇప్పుడు చెప్పండి. 24 00:02:19,848 --> 00:02:21,433 తలకిందులైన ఇటలీలా ఉంది. 25 00:02:22,017 --> 00:02:23,769 తలకిందులైన షూలా ఉంది. 26 00:02:23,852 --> 00:02:27,814 కాదు! ఇది అచ్చం జో ష్లబోత్నిక్ లా ఉంది. 27 00:02:27,898 --> 00:02:31,818 చూశారా? ఇది అతని బలమైన గడ్డం, ఇది అతని సొగసైన నుదురు. 28 00:02:32,861 --> 00:02:35,572 ఇది "షో అండ్ టెల్" పోటీకి బాగా ఉపయోగపడుతుంది. 29 00:02:42,246 --> 00:02:44,331 అసలు ఈ జో ష్లబోత్నిక్ ఎవరు? 30 00:03:06,395 --> 00:03:10,065 హమ్మయ్య! నా ఆశలన్నీ అడియాశలు అయిపోయుండేవి. నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది. 31 00:03:13,402 --> 00:03:15,571 దీన్ని అందరికీ చూపించాలని తెగ ఆత్రంగా ఉంది. అయ్యో, అయ్యయ్యో! 32 00:03:19,658 --> 00:03:21,827 బాబోయ్! నా దగ్గర ఉంటే ఇది నాశనమైపోతుంది. 33 00:03:21,910 --> 00:03:25,372 రేపు నాకు "షో అండ్ టెల్" పోటీ ఉంది కదా, అందాకా దీన్ని నీ దగ్గర భద్రంగా ఉంచుతావా? 34 00:03:48,645 --> 00:03:52,274 థ్యాంక్స్. ఈ అమూల్యమైన చిప్ నీ దగ్గర భద్రంగా ఉంటుందని ఇప్పుడు నాకు నమ్మకంగా ఉంది. 35 00:05:19,736 --> 00:05:22,447 నా చిప్ ని భద్రంగా ఉంచినందుకు థ్యాంక్స్, మిత్రమా. 36 00:05:24,116 --> 00:05:26,326 ఇక దీన్ని బాధ్యత నేను చూసుకుంటానులే. 37 00:05:26,827 --> 00:05:29,496 స్కూల్ లో దీన్ని అందరికీ చూపించాలని చాలా ఆత్రంగా ఉంది. 38 00:05:35,169 --> 00:05:39,339 పక్కకు జరగండి. తప్పుకోండి. అరుదైన పొటాటో చిప్ ని తీసుకువస్తున్నా. 39 00:05:39,840 --> 00:05:42,217 హేయ్, చక్. ఏంటది? 40 00:05:42,301 --> 00:05:44,011 ఇది ఎలా ఉందో చెప్పండి. 41 00:05:46,889 --> 00:05:49,641 ఇటలీ లా ఉందే? 42 00:05:49,725 --> 00:05:51,727 నాకు అయితే షూలా అనిపిస్తోంది. 43 00:05:51,810 --> 00:05:57,608 కాదు! మైనర్ లీగుల్లో ఆడిన ఏకైక గొప్ప బ్యాట్స్ మెన్ అయిన జో ష్లబోత్నిక్ లాగే ఉన్న 44 00:05:57,691 --> 00:06:00,986 ఏకైక పోటాటో చిప్ ఇది. 45 00:06:02,821 --> 00:06:05,032 స్నూపీ! వద్దు! 46 00:06:07,451 --> 00:06:09,411 ఆ చిప్ దొంగని ఎవరైనా పట్టుకోండి! 47 00:06:22,382 --> 00:06:23,383 హమ్మయ్య. థ్యాంక్స్. 48 00:06:25,010 --> 00:06:27,513 స్నూపీ, నీకేమైనా మతిపోయిందా? 49 00:06:27,596 --> 00:06:31,642 ఇది తినే చిప్ కాదు. ఇది మ్యూజియమ్ లో ఉండాల్సిన అరుదైన చిప్. 50 00:06:32,142 --> 00:06:33,852 నువ్వు ఇక నాకు దక్కవేమో అనుకున్నా. 51 00:06:39,483 --> 00:06:41,026 దేవుడా. 52 00:06:52,871 --> 00:06:55,999 అవును, మిస్ ఓత్మర్. ఇది పొటాటో చిప్. 53 00:06:56,083 --> 00:06:59,878 నిజం చెప్పాలంటే, ఇది జో ష్లబోత్నిక్ ని పోలి ఉన్నప్పుడు చాలా బాగుండేది. 54 00:06:59,962 --> 00:07:03,882 కానీ ఇప్పుడు ఒక సాధారణ పొటాటో చిప్ లాగా అయిపోయింది. 55 00:07:03,966 --> 00:07:07,761 చార్లీ బ్రౌన్, నాకు మాత్రం ఒక వైపు నుండి చూస్తుంటే, 56 00:07:07,845 --> 00:07:12,808 అది అచ్చం అబ్రహం లింకన్ ని పోలి ఉన్నట్టు అనిపిస్తోంది. 57 00:07:12,891 --> 00:07:17,354 అవును! నాకు కూడా అది అబ్రహం లింకన్ లానే అనిపిస్తోంది. 58 00:07:17,437 --> 00:07:19,648 గొప్ప చిప్ నే పట్టేశావు, చార్ల్స్. 59 00:07:21,108 --> 00:07:23,819 లింకన్ బేస్ బాల్ ని ఎలా ఆడేవాడో! 60 00:07:30,951 --> 00:07:32,619 "ఏ గూడు బాగుంటుంది?" 61 00:07:51,555 --> 00:07:52,973 నాకు దొరికింది! దొరికింది! 62 00:07:56,643 --> 00:07:59,521 కమాన్, చార్లీ బ్రౌన్. ఈ ఆట మనం గెలవగలం. 63 00:08:00,898 --> 00:08:02,983 సరే. మనం రెండు పాయింట్లతో వెనుకంజలో ఉన్నాం. 64 00:08:03,066 --> 00:08:06,278 ఫలితం మనిద్దరి చేతుల్లోనే ఉంది, గ్లవ్. మనం అదరగొట్టేయగలం. 65 00:08:16,580 --> 00:08:20,334 వావ్. బంతిపై ఓ పురుగు ఉంది. 66 00:08:20,417 --> 00:08:23,462 హేయ్, లైనస్! బంతిని ఇటు విసురు! 67 00:08:23,545 --> 00:08:24,546 -సూపర్! -వావ్! 68 00:08:24,630 --> 00:08:25,631 భలే భలే! 69 00:08:25,714 --> 00:08:27,382 -చాలా బాగుంది! -సూపర్! 70 00:08:28,133 --> 00:08:29,510 దేవుడా. 71 00:08:30,052 --> 00:08:31,053 సందర్శించిన జట్టు 02 స్థానిక జట్టు 00 72 00:08:31,136 --> 00:08:32,721 సందర్శించిన జట్టు 18 స్థానిక జట్టు 00 73 00:08:39,352 --> 00:08:42,272 చేతిలోకి వచ్చే బంతిని కూడా పట్టుకోలేకపోతే ఎలా? 74 00:08:42,356 --> 00:08:45,317 నేనేం చేయలేకపోయాను. కళ్లలోకి ఎండ పడింది. 75 00:08:45,400 --> 00:08:49,029 అసలు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు! మబ్బుగా ఉంది కదా. 76 00:08:49,738 --> 00:08:51,406 అదే, నా కళ్లోలోకి మబ్బులు పడ్డాయి. 77 00:08:52,699 --> 00:08:56,203 సరే, బంతి ఇంకా ఇక్కడే ఉంది కదా. దాన్ని కాస్త మూడవ బేస్ కి విసురు! 78 00:08:59,039 --> 00:09:00,207 నీకు చెప్పా చూడు! 79 00:09:03,627 --> 00:09:04,962 ఆఖరి ఇన్నింగ్స్. 80 00:09:05,045 --> 00:09:08,423 మనం గెలవలేకపోవచ్చు, కానీ గట్టి పోటీ అయినా ఇద్దాం. 81 00:09:14,429 --> 00:09:16,765 స్నూపీ, బంతి నీ దగ్గరికే వస్తోంది! 82 00:09:20,143 --> 00:09:22,020 క్యాచ్ పట్టుకొని ఉండవచ్చు కదా! 83 00:09:28,068 --> 00:09:31,238 మరో ఆట కూడా ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాను! 84 00:09:31,321 --> 00:09:34,074 నేను ఇక జీవితంలో బేస్ బాల్ ఆడను! 85 00:09:39,955 --> 00:09:41,456 అయ్యో, చార్లీ బ్రౌన్. 86 00:09:41,540 --> 00:09:45,919 నువ్వు బేస్ బాల్ ని ఆడకుండా ఉండలేవని నీకు తెలుసు. నీకు ఆ ఆట అంటే ప్రాణం. 87 00:09:48,005 --> 00:09:49,506 నిజమే, లైనస్. 88 00:09:51,466 --> 00:09:53,427 వెళ్లి నా గ్లోవ్ ని తెచ్చుకుంటా. 89 00:09:59,183 --> 00:10:00,601 హేయ్, అక్కడ ఉంది! 90 00:10:05,147 --> 00:10:07,774 నాకున్న ఒక్కగానొక్క గ్లోవ్ పోయింది అనుకున్నా. 91 00:10:07,858 --> 00:10:09,526 ఆగు, చార్లీ బ్రౌన్! 92 00:10:09,610 --> 00:10:13,780 గూడులో ఉన్న పక్షిని కదిలించవద్దని మిస్ ఓత్మర్ అంది. 93 00:10:17,034 --> 00:10:19,703 కానీ అది గూడు కాదు, నా గ్లవ్. 94 00:10:19,786 --> 00:10:21,914 అది లేకుండా నేను బేస్ బాల్ ఎలా ఆడగలను! 95 00:10:22,623 --> 00:10:24,625 ఇప్పుడు నేనేం చేయాలి? 96 00:10:27,544 --> 00:10:29,838 స్నూపీ, నాకు నీ సాయం కావాలి! 97 00:10:34,551 --> 00:10:36,136 స్నూపీ! 98 00:10:36,720 --> 00:10:39,890 వుడ్ స్టాక్, చార్లీ బ్రౌన్ గ్లవ్ ని గూడుగా వాడుకుంటోంది. 99 00:10:39,973 --> 00:10:41,683 నువ్వు దాన్ని తీసుకువచ్చి చార్లీ బ్రౌన్ కి అప్పగించాలి. 100 00:10:41,767 --> 00:10:45,354 మన జట్టు కోసం ఆ పని చేసి పెట్టు. మన బేస్ బాల్ మేనేజర్ కోసం చేసి పెట్టు. 101 00:10:49,441 --> 00:10:51,360 బేస్ బాల్ మేనేజర్ అంటే మన చార్లీ బ్రౌన్ యే. 102 00:10:54,696 --> 00:10:56,156 తల గుండ్రంగా ఉంటుంది కదా. 103 00:11:04,581 --> 00:11:06,917 ఆ పని చేస్తే, నీ తల నిమురుతాను. 104 00:11:09,837 --> 00:11:11,004 అబ్బే, ముందు గ్లవ్ తీసుకురా. 105 00:11:15,217 --> 00:11:18,428 ఏం చేసైనా కానీ పని చేయించుకోవడం ముఖ్యం. 106 00:11:24,935 --> 00:11:28,272 కష్టాల్లో కూడా తల ఎత్తుకొని ఉంటే పరిస్థితులు చక్కబడతాయని అంటుంటారు. 107 00:11:28,939 --> 00:11:31,108 నేను తల ఎత్తుకొనే ఉన్నాను, కానీ ఇప్పటిదాకా ఏ ప్రయోజనమూ లేదు. 108 00:11:34,695 --> 00:11:35,863 థ్యాంక్యూ, స్నూపీ! 109 00:11:35,946 --> 00:11:39,074 నా బేస్ బాల్ గ్లవ్ లేకపోతే నేను ఏం చేయగలిగేవాడినో ఏమో. 110 00:11:42,160 --> 00:11:43,745 అదరగొట్టేశావు, స్నూపీ. 111 00:11:45,539 --> 00:11:46,915 తప్పకుండా. 112 00:11:50,127 --> 00:11:53,338 ఇంతకీ, చార్లీ బ్రౌన్ గ్లవ్ ని ఎలా తేగలిగావు? 113 00:11:56,425 --> 00:11:59,428 హేయ్! అది నా దుప్పటి! 114 00:12:01,096 --> 00:12:04,600 గూడులో ఉన్న పక్షిని కదిలించవద్దని మా అమ్మ అంది. 115 00:12:05,434 --> 00:12:07,186 స్నూపీ! 116 00:12:12,274 --> 00:12:15,068 నువ్వు నా దుప్పటిని తెచ్చివ్వాలి! 117 00:12:18,864 --> 00:12:23,160 తల నిమరాలా ముందు నువ్వు నా దుప్పటిని తీసుకురా, నిమిరే సంగతి తర్వాత చూద్దాం. 118 00:12:24,953 --> 00:12:29,499 ఈ తుచ్చమైన వస్తువులంటే ఈ మనుషులకు ఎందుకంత మమకారమో నాకు అర్థమే కాదు. 119 00:12:32,503 --> 00:12:35,297 బహుశా నాకు అస్సలు దుప్పటి అవసరమే లేదేమో. 120 00:12:35,380 --> 00:12:37,674 బహుశా తేనెటీగలకి కూడా తేనె అంటే ఇష్టం లేదేమో. 121 00:12:38,550 --> 00:12:41,512 ఏదోకరోజు చంద్రుడు ఆకాశం నుండి జారి నేల మీద పడిపోతాడేమో. 122 00:12:47,643 --> 00:12:49,353 థ్యాంక్యూ, స్నూపీ! 123 00:12:50,646 --> 00:12:52,397 నిన్ను నేను చాలా మిస్ అయ్యాను. 124 00:12:55,275 --> 00:12:56,985 తల నిమరాలి కదా! 125 00:12:57,778 --> 00:13:00,030 ఇంతకీ, నా దుప్పటిని ఎలా తేగలిగావు? 126 00:13:00,113 --> 00:13:01,740 హేయ్! అది నాది! 127 00:13:03,200 --> 00:13:07,162 ఈ పక్షి నా మూడు పడక గదుల బొమ్మ ఇంటిని వాడుకోవచ్చని నీకు ఎవరు చెప్పారు, 128 00:13:07,246 --> 00:13:10,123 అదీగాక ఇందులో బట్టలకే ప్రత్యేకమైన గది, ఇంకా ఆప్షనల్ హాట్ టబ్ లో కూడా ఉంది. 129 00:13:14,837 --> 00:13:16,630 స్నూపీ! 130 00:13:17,840 --> 00:13:19,633 ఇదంతా నీ వల్లే జరిగింది! 131 00:13:19,716 --> 00:13:22,386 నన్ను అడగకుండా నా బొమ్మ ఇంటిని తీసుకున్నావు. 132 00:13:22,469 --> 00:13:25,639 అంతగా ఇవ్వాలనుకుంటే, నీ వస్తువే ఇచ్చుకోవచ్చు కదా? 133 00:14:04,761 --> 00:14:06,513 చాలా మంచి పని చేశావు, స్నూపీ. 134 00:14:06,597 --> 00:14:08,849 ఇక దీన్ని శాలీకి ఇద్దాం పద. 135 00:14:15,606 --> 00:14:18,692 ఇదుగో. నీకోసం వేరేది తెచ్చాను. 136 00:14:28,076 --> 00:14:29,953 కాస్త త్వరగా తినాలి. 137 00:14:30,037 --> 00:14:33,749 ఈ గిన్నె పక్కింటి పిల్లిది. 138 00:14:45,344 --> 00:14:47,179 "అయోమయం జగన్నాథం." 139 00:14:55,896 --> 00:14:57,856 బంతి ఎక్కడికి వెళ్లిపోయింది? 140 00:15:06,657 --> 00:15:10,911 లోపల అంతా అస్తవ్యస్తంగా ఉంది. అసలు నా బేస్ బాల్ ఎక్కడ ఉందో కనిపించనే లేదు. 141 00:15:10,994 --> 00:15:14,039 స్నూపీ, నువ్వు అంతా చక్కగా సర్దుకోవాలి, వసంత కాలపు చిగురులా నీ ఇల్లు కళకళలాడాలి. 142 00:15:15,582 --> 00:15:19,920 ఇది వేసవి అని నాకు తెలుసు. పోలిక కోసం అలా చెప్పానంతే. 143 00:15:20,003 --> 00:15:22,005 కంగారు పడకు. సర్దడంలో నేను నీకు సహాయపడతాను. 144 00:15:25,592 --> 00:15:26,635 పోయ్ పోయ్! 145 00:15:30,639 --> 00:15:31,640 ఇదుగో. 146 00:15:34,309 --> 00:15:37,187 ఇదొక పెట్టె. ఇందులో చెత్త సామాను పెట్టు. 147 00:15:39,857 --> 00:15:43,318 సర్దడానికి ఎవరి కోసమైనా చూస్తున్నావా? 148 00:15:44,903 --> 00:15:49,616 స్నూపీ, ఇది నీ ఇల్లు, దీన్ని శుభ్రపరుచుకోవలసిన బాధ్యత నీదే. 149 00:17:40,185 --> 00:17:41,228 స్నూపీ? 150 00:17:42,813 --> 00:17:44,565 నువ్వు శుభ్రం చేసుకుంటావు అని అనుకున్నానే. 151 00:17:49,194 --> 00:17:53,198 నీకోసం ఇంకో పెట్టె తెచ్చాను. ఇందులో రీసైకిల్ చేయాల్సినవి వేయి. 152 00:17:54,741 --> 00:17:58,078 ఉదాహరణకు, నువ్వు ఈ పేపర్ ప్లేట్స్ ని రీసైకిల్ పెట్టెలో వేయవచ్చు. 153 00:17:59,413 --> 00:18:00,956 చక్కగా చూసుకొని రీసైకిల్ పెట్టెలో వేయండి. 154 00:18:48,378 --> 00:18:49,379 స్నూపీ జట్టు 155 00:19:04,061 --> 00:19:06,897 మీరు పెద్దగా పని చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. 156 00:19:10,901 --> 00:19:14,154 ఈ పెట్టెలో నువ్వు దానం ఇవ్వాలనుకున్నవి వేయ్. 157 00:19:14,238 --> 00:19:15,906 ఈ హారన్ ని వేరేవాళ్లకి ఇచ్చేదామనుకుంటున్నావా? 158 00:19:24,289 --> 00:19:25,290 నాకొక ఆలోచన తట్టింది. 159 00:19:25,374 --> 00:19:28,710 మీకు శుభ్రం చేసుకోవాలని లేదు, ఆడుకోవాలనే ఉంది. 160 00:19:28,794 --> 00:19:30,796 అయితే, ఆడుకుంటూ శుభ్రం చేసుకుందాం. 161 00:19:34,258 --> 00:19:35,592 ఇది సూపర్ ఐడియా. 162 00:19:38,303 --> 00:19:41,932 యాత్రికులందరూ, దయచేసి గమనించండి! మీ టికెట్లను సిద్ధంగా ఉంచుకోండి. 163 00:19:47,938 --> 00:19:48,939 సూపర్. 164 00:19:50,023 --> 00:19:52,025 ఈ కాగితాన్ని రీసైకిల్ చేయవచ్చు. 165 00:19:52,109 --> 00:19:54,778 అందరూ ఈ చెత్త ఎక్స్ ప్రెస్ ఎక్కండి! 166 00:21:13,440 --> 00:21:15,901 అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని చక్కగా శుభ్రం చేసుకున్నావు, స్నూపీ. 167 00:21:15,984 --> 00:21:18,278 నీకు చల్లని రూట్ బీర్ ఇచ్చి తీరాల్సిందే. 168 00:21:22,908 --> 00:21:24,993 నా బేస్ బాల్ ని కూడా కనిపెట్టేశావు! 169 00:21:25,494 --> 00:21:26,828 థ్యాంక్స్, మిత్రమా. 170 00:21:36,046 --> 00:21:39,174 ఇప్పుడు మీరు ఈ పెట్టెలన్నింటినీ బయట ఉండే డస్ట్ బిన్ లో పడేయాలి. 171 00:21:42,052 --> 00:21:43,136 స్నూపీ? 172 00:21:46,098 --> 00:21:47,099 మామూలే కదా. 173 00:21:47,182 --> 00:21:49,476 పనిని ఎప్పుడూ నేనే పూర్తి చేయాలి. 174 00:21:56,984 --> 00:21:57,985 చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా రూపొందించబడింది 175 00:22:21,925 --> 00:22:23,927 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య